doc_id stringlengths 5 10 | title stringlengths 2 70 | text stringlengths 5 15.6k |
|---|---|---|
786#0 | గుంటూరు జిల్లా | గుంటూరు జిల్లా 11,391 చ.కి.మీ. ల విస్తీర్ణములో వ్యాపించి, 48,89,230 (2011 గణన) జనాభా కలిగిఉన్నది. ఆగ్నేయాన బంగాళాఖాతము, దక్షిణాన ప్రకాశం జిల్లా, పశ్చిమాన మహబూబ్ నగర్ జిల్లా, మరియు వాయువ్యాన నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. దీని ముఖ్యపట్టణం గుంటూరు |
786#2 | గుంటూరు జిల్లా | విద్యా కేంద్రంగా అనాది నుండి పేరు పొందింది.నాగార్జున విశ్వవిద్యాలయం, బాపట్ల వ్యవసాయ కళాశాల, పలు ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలు, పలు ప్రైవేట్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వరి, పొగాకు, ప్రత్తి మరియు మిర్చి జిల్లా యొక్క ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు. కృష్ణ ముఖ్య నది. చంద్రవంక, నాగులేరు, గుండ్లకమ్మ జిల్లాలో ముఖ్య వాగులు. జిల్లా లోని ముఖ్య చారిత్రక స్థలాలలో పేరుపొందినవి అమరావతి, భట్టిప్రోలు, ఉండవల్లి గుహలు మరియు గుంటూరు లోని మ్యూజియం, |
786#3 | గుంటూరు జిల్లా | గుంటూరు ప్రాంతంలో పాత రాతి యుగము నాటినుండి మానవుడు నివసించినాడనుటకు ఆధారములు ఉన్నాయి. పాత రాతియుగము|పాత రాతియుగపు (పేలియోలిథిక్) పనిముట్లు గుంటూరు జిల్లాలో దొరికాయి. వేంగీ చాళుక్య రాజు అయిన అమ్మరాజ (922-929) యొక్క శాసనాలలో గుంటూరు గురించిన ప్రథమ ప్రస్తావన ఉంది. 1147 మరియు 1158]టి రెండు శాసనాలలో కూడా గుంటూరు ప్రసక్తి ఉంది. |
786#7 | గుంటూరు జిల్లా | భారత స్వాతంత్ర్య సంగ్రామం లోను, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు లోను జిల్లా ప్రముఖ పాత్ర వహించింది. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంలో భాగం అయింది. మద్రాసు రాష్ట్రం లోని తెలుగు మాట్లాడే జిల్లాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని వాదించాయి. ఫలితంగా 1953లో 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1970 ఫిబ్రవరి 2 న ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసినపుడు జిల్లా రూపురేఖలలో మళ్ళీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఒంగోలు తాలూకా మొత్తం, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ తాలూకాలలోని కొన్ని ప్రాంతాలను విడదీసి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేసారు. దీనితో జిల్లా వైశాల్యం 15032 చ. కి. మీ నుండి 11,347 చ. కి. మీకి తగ్గిపోయింది. |
786#8 | గుంటూరు జిల్లా | గుంటూరు జిల్లా సగటున 33 మీటర్లు ఎత్తులో ఉంది. చాలవరకు సమతల ప్రదేశం. కొన్ని కొండలు కూడా ఉన్నాయి. కృష్ణా డెల్టా కొంతభాగం దీనిలో ఉంది.
నల్లమలై, వెంకటాయపాలెం శ్రేణులు మరియు కొండవీడు కొండలు
పల్నాడు చుట్టూ కర్నూలు జిల్లాలోని నల్లమలై కొండలున్నాయి. మాచర్ల యర్రగొండపాలెం శ్రేణిలో స్వామికొండ లేక వామికొండ (605 మి) ఎత్తులో గలదు. కైరాలకొండ (590 మీ) తరువాత ఎత్తైన కొండ. వాయవ్య అంచున గల కొండలు మల్లవరం దగ్గర కృష్ణానదిలో కలిసేవరకు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా పలకరాయి మరియు క్వార్ట్జైట్ రాయి లభిస్తుంది. మాచర్లకు పదికిమీ దూరంలో ఎత్తిపోతల అనబడే జలపాతం నల్లమలై కొండలపై చంద్రవంక నదిపై ఉంది. దీనిలో 21మీ ఎత్తునుండి నీరు పారుతుంది. |
786#9 | గుంటూరు జిల్లా | సత్తెనపల్లి దగ్గరలోని వెంకటాయపాలెం పేరుకలగిన పలకరాయి మరియు క్వార్ట్జైట్లు గల కొండలే ఇవి. 40 కిమీ పొడవుతో ఈశాన్య -నైరుతీ దిక్కున వుంటాయి. వీటిలో వజ్రాలు కనుగొన్నారట. దీనిలో ఎత్తైనది మైదర్సాల్ (447 మి). నరసరావుపేట దగ్గర పల్నాడు, వినుకొండ మరియు సత్తెనపల్లి సరిహద్దులు కలిసేచోట కృష్ణానదివైపుకు ఎత్తుతగ్గుతూ వుండే కొండలు ఉన్నాయి. |
786#10 | గుంటూరు జిల్లా | నరసరావుపేట దగ్గర గ్రానైట్ రాయి గల 19 కిమీ విస్తరించి, 523మీ ఎత్తువరకు కలకొండలు. దీనికి పశ్చిమంగా వేరుగా వున్న యల్లమంద లేక కోటప్పకొండ అని పిలవబడే489మీ ఎత్తులో ఉంది. దానికి దక్షిణంగా అద్దంకి వైపు కొన్ని కొండలున్నాయి. మంగళగిరి మరియు విజయవాడ మధ్య కొన్ని కొండలు కనిపిస్తాయి. చారిత్రకంగా మరియు మతసంబంధపరమైనవి గుత్తికొండ, మంగళగిరి మరియు వుండవల్లి. |
786#13 | గుంటూరు జిల్లా | కృష్ణానది మాచెర్ల పర్వతశ్రేణిలో గనికొండ దగ్గర 182 మీటర్ల(సముద్రమట్టంనుండి) లో గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తుంది. పెద్ద లోయలోకి పారుతూ మాచెర్లను అచ్చంపేట(మహబూబ్ నగర్) ను వేరుచేస్తుంది. కుడవైపు జర్రివాగు మరియు ఎడమవైపున దిండి వాగుని కలుపుకొని పారుతుంది. చంద్రవంక కృష్ణాకి వుపనది. తూర్పు నల్లమల కొండలలో పుట్టి ముతుకూరు గ్రామ ప్రక్కగా పారి, దాని వుపనదియైన ఏడిబోగుల వాగుతో కలసి(ఆత్మకూరు ప్రాజెక్టు దగ్గర). ఈశాన్య దిశగా పయనించి మాచర్లును తాకి ఉత్తరంగా పారుతుంది. తుమ్రుకోట రక్షిత అడవిలోకి పారేముందు, 21మీటర్ల ఎత్తునుండి క్రిందకు పారుతుంది.దీనినే ఎత్తిపోతల జలపాతం అంటారు. ఉత్తరదిశగా కొంత ప్రవహించి కృష్ణాలో కలుస్తుంది. వినుకొండ శ్రేణిలో నాయకురాలి పాస్ దగ్గర నల్లమల కొండలలో పుట్టి, కారెంపూడి ప్రక్కగా ప్రవహించి ఉత్తరదిశగా మాచర్ల పర్వతశ్రేణులలో 32 కిమీ పారి రామపురం దగ్గర కృష్ణాలో కలుస్తుంది. తూర్పు తీరంలో సాధారణంగా వుండే తీరులో కృష్ణా నది చాలా వరకు సమతలప్రాంతంలో ప్రవహించటంతో, వర్షాకాలంలో చాలా మట్టి మేట వేస్తుంది . |
786#15 | గుంటూరు జిల్లా | బంగాళ ఖాతంలో ఏర్పడే తుఫాన్లు మరియు అల్పపీడనాలు, తూర్పుతీరం దాటితే అధిక వర్షం మరియు బలమైన గాలులకు కారణమవుతాయి.
1) డిసెంబరు నుండి ఫిభ్రవరి దాక: పొడి మరియు చల్లని చలి కాలం.
2) మార్చి నుండి మే : ఎండాకాలం
3) జూన్ నుండి సెప్టెంబరు : నైరుతీ రుతుపవనాల వలన వానా కాలం.
4) అక్టోబరు నుండి నవంబరు: తుపాన్ల వలన వానలు.
జిల్లా సగటు వర్షపాతం 830 మిమి. తూర్పు నుండి పడమరకు ఇది తగ్గుతుంది. నైరుతీ రుతుపవనాల వలన అవి తగ్గిపోయేటప్పుడు వర్షపాతం కలుగుతుంది. అక్టోబరులో వర్షాలు ఎక్కువ. సగటున 47 వర్షపు రోజులు. అత్యధికంగా 1879 నవంబరు 9 లో సత్తెనపల్లిలో 386 మిమి వర్షపాతం నమోదైంది.
వార్షిక అత్యల్ప మరియు అత్యధిక ఉప్ణోగ్రతలు 15 °C మరియు 47 °C గా నమోదయ్యాయి. రెంటచింతల అత్యంత ఉప్ణోగ్రతకలప్రదేశం. 1948 మే 18 లో 49 °C నమోదయ్యింది. |
786#17 | గుంటూరు జిల్లా | భారీ నీటి పారుదల ప్రాజెక్టులలో ప్రకాశం బేరేజి( పాత కృష్ణా ఆయకట్) క్రింద 2,02,032 హెక్టేర్లు నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రింద
2,54,583 హెక్టేర్లు మరియు గుంటూరు బ్రాంచి కాలువ క్రింద 10,823 హెక్టేర్లు సాగవుతున్నది. |
786#20 | గుంటూరు జిల్లా | 729 గ్రామాలు( 27 నిర్వాసిత గ్రామాలు), 57 మండలాలు నాలుగు రెవిన్యూ విభాగాల పరిధిలో ఉన్నాయి.
జిల్లాలో నాలుగు రెవెన్యూ విభాగాలు ఉన్నాయి, అవి:తెనాలి, గుంటూరు, నరసరావుపేట, గురజాల
1985లో రెవెన్యూ వ్యవస్థను సంస్కరించి మండల వ్యవస్థను ఏర్పరిచిన తరువాత జిల్లాలో 57 మండలాలు, 21 పంచాయితీ సమితులు ఏర్పడ్డాయి. పంచాయితీ సమితుల సంఖ్యలో జిల్లా, రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. |
787#0 | ఆంధ్ర ప్రదేశ్ | ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. తెలంగాణాతో పాటు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రధాన భాష. తదుపరి స్థానంలో ఉర్దూ ఉంది.ఈ రాష్ట్రానికి వాయవ్య దిశలో తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పడమరన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో ఎనిమిదవ అతి పెద్ద రాష్ట్రము ఆంధ్ర ప్రదేశ్. ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ, తుంగభద్ర మరియు పెన్నా. ఆంధ్ర ప్రదేశ్ 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది. |
787#1 | ఆంధ్ర ప్రదేశ్ | 1953 అక్టోబరు 1న మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు భాషీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందాక భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ జిల్లాలు మహారాష్ట్రకూ, కన్నడ భాషీయ జిల్లాలు కర్ణాటకకూ పోగా, మిగిలిన హైదరాబాదుతో కూడుకుని ఉన్న తెలుగు మాట్లాడే నిజాం రాజ్యాధీన ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో కలిసింది. అలా 1956, నవంబరు 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని మరియు మద్రాస్ నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. అడపా దడపా సాగిన వేర్పాటు ఉద్యమాల ఫలితంగా దాదాపు 58 సంవత్సరాల తరువాత 2014 జూన్ 2 న పునర్విభజింపబడింది . నవ్యాంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలు 2 తెలుగు రాష్ట్రాలుగా 2014 జూన్ 2 నుంచి అమలులోకి వచ్చాయి.
హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాల ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా పది సంవత్సరాల వరకు కొనసాగే అవకాశముంది. అమరావతిలో కొత్త రాజధానికి 2015 అక్టోబరు 23 న శంకు స్థాపన జరిగింది.. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభించబడి పరిపాలన మొదలైంది. దేశంలోనే 2వ అతి పెద్ద కోస్తా తీరం ఈ రాష్ట్రంలో ఉంది. |
787#4 | ఆంధ్ర ప్రదేశ్ | మద్రాసు రాజధానిగా ఉండే ఆంధ్ర రాష్ట్రం కోసం "అమరజీవి"' పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష చేసి మరణించారు, కానీ కర్నూలును రాజధానిగా చేసి 1953 అక్టోబరు 1న మద్రాసు రాష్ట్రంలో ఉత్తరాన ఉన్న 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం చేశారు. గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేసారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి. |
787#5 | ఆంధ్ర ప్రదేశ్ | తెలుగు ప్రజల కోరికపై 1956, నవంబరు 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్ర ప్రదేశ్ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది. ఈ విధంగా భాష ఆధారముగా ఏర్పడిన రాష్ట్రములలో ఆంధ్ర ప్రదేశ్ మొదటి రాష్ట్రము అయినది. నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి. |
787#6 | ఆంధ్ర ప్రదేశ్ | 1960 వ సంవత్సరంలో పటాస్కర్ కమిషన్ తీర్పుమూలంగా చిత్తూరు జిల్లా తిరుత్తణి తాలూకాలోని ఎక్కువ భాగాన్ని తమిళనాడుకు ఇచ్చి, తమిళనాడుకు చెందిన తిరువళ్లూర్ తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్ లో చేర్చారు. ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భవించినప్పుడు 20 జిల్లాలే ఉన్నాయి. తరువాత, 1970, ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా, 1978 ఆగష్టు 12న రంగారెడ్డి జిల్లా, 1979 జూన్ 1న విజయనగరం జిల్లాలు ఏర్పడడంతో మొత్తం 23 జిల్లాలయ్యాయి. |
787#7 | ఆంధ్ర ప్రదేశ్ | రాష్ట్రం ఏర్పడినతరువాత అడపా దడపా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు దానికి పోటీగాసమైక్య ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి.2009 లో కే.సి.ఆర్ నిరాహరదీక్ష విరమింపచేయడానికి కేంద్రప్రభుత్వం తెలంగాణాఏర్పాటు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ఉద్యమాలు మరింత బలం పుంజుకున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అందరికీ అమోదమైన లక్ష్యంకొరకు ప్రయత్నించినప్పటికి సత్ఫలితాలివ్వలేదు.
2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.తదుపరి సమైక్యాంధ్ర ఉద్యమము వూపందుకుంది. ప్రభుత్వ ఉద్యోగసంఘాల నాయకత్వంలో రెండు నెలలపై బడి సమైక్యాంధ్ర ఉద్యమము నడిచింది. 2013 అక్టోబరు 3న జరిగిన కేంద్రప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణా ఏర్పాటుని ఆమోదించారు. తదుపరి చర్యగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించి వాటి పరిష్కార వివరాలతో కేబినెట్ నోట్ మరియు బిల్లు తయారీ జరిగింది. ఆ తరువాత రాష్ట్రపతి పంపిన ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును . శాసనసభ,శాసనమండలిలో సుదీర్ఘ చర్చల పూర్తికాకముందే ఒకవారం పొడిగించిన గడువు ముగిసే సందర్భంలో ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తిరస్కరించే తీర్మానం పై మూజువాణీ వోటుతో సభలు అమోదముద్ర వేశాయి..2014, ఫిబ్రవరి 18న ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది.20 పిభ్రవరి న రాజ్యసభ ఆమోదం తెలిపింది. సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్యనాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంత వరకు తృప్తిపరచే విధంగా ప్రధాని ఆరుసూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పిదప, బిల్లుకు యథాతథంగా మూజువాణీ వోటుతో అమోదముద్ర పడింది . 2014 జూన్ 2 న తెలంగాణ మరియు సీమాంధ్ర ప్రాంతాలను 2 క్రొత్త రాష్ట్రాలుగా ఏర్పడినవి. |
787#10 | ఆంధ్ర ప్రదేశ్ | 2004 అసెంబ్లీ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెసు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉధృతంగా పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి పోటీ చేసింది. కాంగ్రెసు, తెరాస కూటమి పదవిలోకి రావడంతో, కాంగ్రెసుకు చెందిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్ళ అనతరం 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ, తెరాస, ఉభయ కమ్యూనిష్టు పార్టీలు కలిసి మహాకూటమి తరఫున పోటీచేశాయి. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, భారతీయ జనతా పార్టీలు కూడా పోటీచేయడంతో బహుముఖ పోటీలు జరిగాయి.సెప్టెంబరు 2, 2009న రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 నెలలు పాలించిన తరువాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా మార్చడం జరిగింది . నల్లారి కిరణకుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం రాజీనామా చేయటంతో ఎన్నికలు దగ్గరబడుతున్నందున, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచటానికి ఆసక్తి చూపనందున రాష్ట్రపతిపాలన విధించబడింది |
787#11 | ఆంధ్ర ప్రదేశ్ | ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ముఖ్య ప్రాంతములు ఉన్నాయి. కోస్తా ఆంధ్ర, మరియు రాయలసీమ. రాష్ట్రములో 13 జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో ఎర్రటి నేలలు ఉండే మెట్ట భూములు, నల్లరేగడి నేలలు ఉండే డెల్టా భూములు ఉన్నాయి. రాయలసీమలో ఎర్రటి నేలలు ఉన్నాయి. ముఖ్య నగరాలు విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, ఏలూరు, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, గుంటూరు,ఒంగోలు, మరియు మచిలీపట్నం. గోదావరి, కృష్ణ వంటి మహానదులు రాష్టంలో ప్రవహించటంవలన కొన్ని లక్షల హెక్టేరుల భూమి సాగు చేయబడుతున్నది. |
787#14 | ఆంధ్ర ప్రదేశ్ | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అధినేత ముఖ్యమంత్రి కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ (దిగువ సభ) లో 175 స్థానాలు, విధాన మండలి (ఎగువ సభ)లో 56 స్థానాలు ఉన్నాయి.దీనికి తోడు, ఆంగ్లో-ఇండియన్ వర్గం నుంచి ఒకరిని శాసన సభకు నామినేటు చేస్తారు.ఆ రకంగా శాసన సభలో సభ్యుల సంఖ్య 175. ఆంధ్ర ప్రదేశ్ కు పార్లమెంటులో 36 స్థానాలు ఉన్నాయి. (లోక్ సభలో 25 మరియు రాజ్య సభలో 11). ఎలెక్ట్రానిక్ సాంకేతివ్యవస్థ ఉపయోగించి ఈ-ప్రభుత్వపాలన ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించటానికి అంతర్జాలంలో ఏపీ ఆన్ లైన్ అనే జాలస్థలి కలిగివుంది. విభజన తర్వాత నారా చంద్రబాబునాయుడు 2014, జూన్ 8 న నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర 1వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. |
787#17 | ఆంధ్ర ప్రదేశ్ | భారతదేశంలో ప్రముఖ నృత్యాల్లో ఒకటైన కూచిపూడి నాట్యానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాకు చెందిన కూచిపూడి గ్రామం పుట్టినిల్లు. కూచిపూడి గ్రామంలో ప్రారంభమైన ఈ నృత్యరీతి ఆంధ్ర ప్రదేశ్ మొత్తానికే కాక దేశవిదేశాల్లో ఎందరెందరో నేర్చుకుని ప్రదర్శించే స్థాయికి ఎదిగింది. కూచిపూడి వారు ప్రదర్శించే నృత్యనాటికలు భామా కలాపం, గొల్ల కలాపం వంటివి తెలుగు వారి సంస్కృతిలో భాగంగా నిలుస్తున్నాయి. దేవదాసీలు మాత్రమే ప్రదర్శిస్తూ ఆచారవంతులైనవారు నృత్యకారులను పంక్తిబాహ్యులని భావించే స్థితిలో కేవలం బ్రాహ్మణ పురుషులే అన్ని వేషాలు వేస్తూ, విద్యావంతులైన వారితో కూచిపూడి నృత్యరీతిని సిద్దేంద్ర యోగి వ్యవస్థాపించారు. కాలక్రమేణా నృత్యరీతి తెలుగువారి సంస్కృతిలో ముఖ్యభాగమైంది. 1950 నాటికి స్థానికంగా ఉండిపోయిన దీనికి జాతీయ స్థాయిలో మెప్పును, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపునూ తీసుకురావడానికి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి స్త్రీలను ప్రవేశపెట్టడం వంటి ప్రయత్నాలు చేసి యావజ్జీవితాన్ని కళకు అంకితం చేశారు. వంటివాటిని పునరుద్ధరించడంలో ప్రముఖ నృత్యకళాకారులు నటరాజ రామకృష్ణ ఎనలేని కృషి చేశారు. దేవదాసీల ప్రదర్శనల్లో విలసిల్లి క్రమంగా దేవదాసీ వ్యవస్థతో పాటుగా అంతరించిపోతున్న నృత్యరీతులను, లక్షణ గ్రంథాల్లో సైద్ధాంతికంగా ఉండి ప్రయోగంలో తరతరాల నుంచి లేని నృత్యరీతులను దేవాలయల్లోని ప్రతిమల నాట్యభంగిమలను లక్షణ గ్రంథాలతో కలిపి అధ్యయనం చేసి అపూర్వరీతిలో ఆంధ్ర నాట్యం పేరిట పున:సృజించారు. |
790#1 | ఖమ్మం | తెలంగాణలో ఖమ్మం జిల్లా తూర్పు ప్రాంతంగా ఉంటుంది. ఖమ్మం తూర్పు రేఖాంశం 79.47 కు 80.47 మధ్య గాను ఉత్తర అక్షాంశం 16.45’కు 18.35’ మధ్యగాను ఉండి 15, 921 చ. కిలోమీటర్ల విస్టీర్ణంలో వ్యాపించి ఉంది. జిల్లాకు ఉత్తరమున చత్తీస్ ఘఢ్, ఒడిశా రాష్ట్రాలు, తూర్పున తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, పడమర నల్గొండ, వరంగల్ జిల్లాలు, దక్షిణాన కృష్ణా జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.
ఖమ్మం జిల్లా 1953లో పరిపాలనా సౌలభ్యము కొరకు ఏర్పరచబడింది. అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. 1959 లో అప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్ర్రాచలం, వెంకటాపురం రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం జిల్లాలో కలిపారు. తొలి రోజులలో ఖమ్మం మొత్తం ఒకటిగా లేదు ఈ జిల్లా భుభాగం అంతా వేరువేరు రాజ వంశాల (శాతవాహనులు, తూర్పు చాళిక్యులు, రాష్ట్ర కూటులు, పశ్చిమ కల్యాణి చాళుక్యులు, కాకతీయులు, రాచర్ల దొరలూ, బహామనీయులు, కుతుబషాహీలు, మొగల్, అసఫ్జాహీ ) కాలాల్లో వేరుగా ఉన్నది 1905 దాకా వంరంగల్ జిల్లలో భాగంగా ఉండేది, ఖమ్మం ఊరి మధ్యలో స్తంభాద్రి నుంచే మండపాలకు, స్థంబాలకు కావలసిన రాళ్ళు తరలిస్తూ ఉండేవారు, అందుకే దీనికి స్తంభాద్రి అనే ప్రాచీన నామం ఉన్నది . చరిత్రకారుల కథన౦ ప్రకార౦ ఖమ్మ౦ అనే పేరు అదే పట్టణమ౦దు కల నృసి౦హాద్రి అని పిలువబడే నారసి౦హాలయమును౦డి వచ్చినట్టుగా, కాలక్రమేనా అది స్థ౦భ శిఖరిగాను ఆపై స్థ౦బాధ్రిగా పిలువబడినట్టు చెప్పబడుతున్నది. ఉర్దూ భాషలో క౦బ అనగా రాతి స్థ౦భము కావున ఖమ్మ౦ అను పేరు ఆ ఫట్టణము న౦దు కల రాతి శిఖరము ను౦డి వచ్చినట్టుగా మరొక వాదన.
నిజాం స్టేటు 1870 రైల్వే మ్యాపు ప్రకారం ఈ పట్టణం ఖమ్మంమెట్ట్ Khammamett గా పేర్కొనబడినది . |
790#3 | ఖమ్మం | చివరి నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో వీరోచితంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన యోధులను, నాయకులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. సింగరేణి బొగ్గు గనులతో, పచ్చని అడవులతో, పారే జీవనది గోదావరితో మరియు అధిక సంఖ్యలో గిరిజనులను కలిగియున్న ఈ జిల్లా విప్లవ పోరాటాలకు, ఉద్యమాలకు, రాజకీయ చైతన్యానికి ప్రతీక.
ఖమ్మం భౌగౌళికముగా 17.25° ఉ 80.15° తూలో ఉంది.దీనికి ఉత్తరంగా ఛత్తీస్ ఘఢ్, ఒడిశా ఈశాన్యం గా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు తూర్పు గా, వరంగల్ జిల్లా దక్షిణంగా ఉంది. దీని వైశాల్యం 16, 029 చదరపు కిలోమీటర్లు. ఈ పట్టణము కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరు నది ఒడ్డున విస్తరించి యున్నది. ఈ జిల్లాలో అధిక విస్తీర్ణము అడవులు వ్యాపించి యున్నవి. ఈ జిల్లాకు 1982 వరకు సాగు నీటి వసతి లేదు. జలగం వెంగళ రావు ముఖ్యమంత్రిగా ఉండగ సాగర్ నీరు లభించింది.
ఈ క్రింది ప్రాంతాలు ఖమ్మం పురపాలక సంస్థచే అధికారికంగా గుర్తించబడిన నివాస మరియు వాణిజ్య ప్రాంతాలు. |
792#10 | గణనయంత్రం | మనం కంప్యూటర్‌కి ఇచ్చే ఆదేశాలు సాధారణంగా మనం మాట్లాడుకునే భాషని పోలిన భాషలో ఉంటే బాగుంటుంది – అంటే ఇంగ్లీషులోనో, తెలుగులోనో, రష్యన్ లోనో అనుకోవచ్చు. కాని మనం కంప్యూటర్ ఎదురుగా నిలబడి, “పులుసు వండు” అని ఎంతలా అరిచినా కంప్యూటర్‌కి అర్థం కాదు. (ఆ రోజులు కూడా వస్తున్నాయి, కాని ప్రస్తుతానికి సినిమాలలో తప్ప నిజ ప్రపంచంలో కంప్యూటర్లు ఆ రకం పనులు చెయ్యడం లేదు.) “నీళ్లు మరిగించు, ఉప్పు వెయ్యి, చింతపండు వెయ్యి…” అని విడమర్చి చెప్పినా కంప్యూటర్‌కి అర్థం కాదు. మన మనస్సులో ఉన్న కోరికని కంప్యూటర్‌కి చెప్పడం అనేది చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే మనం ఏ మానవ భాషలో మాట్లాడినా అపార్ధాలకి అవకాశాలు ఎక్కువ. |
792#13 | గణనయంత్రం | కంప్యూటర్ల గురించి మాట్లాడేటప్పుడు “కఠినాంగం” (hardware), “మృదులాంగం” లేదా “కోమలాంగం” (software) అని స్థూలంగా రెండు భాగాలుగా విడగొట్టి మాట్లాడడం సంప్రదాయికంగా వస్తూన్న ఆచారం. బ్రహ్మ మనని పుట్టించినప్పుడు ఒక భౌతిక శరీరం ఇచ్చేడు, నుదిటి మీద ఒక రాత రాసేడు. మన భౌతిక శరీరం కఠినాంగం (గట్టి సరుకు), నుదిటి మీద రాసిన రాత మృదులాంగం (మెత్త సరుకు). రాయడానికి వీలైన నుదురు అనే గట్టి ఫలకం లేకపోతే బ్రహ్మ మాత్రం ఎక్కడ రాస్తాడు? అలాగని రాయడానికి పలక ఒక్కటీ ఉండి, దానిమీద రాయడానికి ఏమీ లేకపోతే ఆ ఖాళీ పలక ప్రాణం లేని కట్టెతో సమానం. కంప్యూటర్ రంగంలో “కఠినాంగం” అన్న మాటని ఇంకా విస్తృత భావంతో వాడవచ్చు. కంప్యూటర్ లోని భౌతిక విభాగాలన్నీ (అంటే మనం చేత్తో పట్టుకో దలుచుకుంటే మన పట్టుకి దొరికేవి) – అంటే తెర (screen), కుంచికపలక (keyboard), మూషికం (mouse), మొదలైనవన్నీ కఠినాంగాలే. పోతే, కఠినాంగం లేకుండా మృదులాంగానికి అస్తిత్వం లేదు. కాలు మోపడానికి కఠినాంగం ఆసరా లేకుండా కేవలం మృదులాంగం గాలిలో ఉందంటే అది దయ్యంతో సమానం అన్నమాట. ఈ రకం దయ్యాలని మనం “కంప్యూటర్ వైరస్‌లు” (computer viruses) అనవచ్చు. |
792#22 | గణనయంత్రం | ముందు “ప్రోసెస్” (process) అనే ఇంగ్లీషు మాటనే తీసుకుందాం. కాలగమనంతో ఒక పద్ధతిలో మార్పు చెందుతూ నడిచే ప్రక్రియని ఇంగ్లీషులో “ప్రోసెస్” అంటారు. దీనిని ప్రక్రియ లేక పరికర్మ అని తెలుగులో అనొచ్చు. ఈ ప్రక్రియ లేదా పరికర్మ ఎవరో ఒకరో, ఏదో ఒకటో చెయ్యాలి కద. “డ్రైవు" చేసే దానిని డ్రైవర్ అన్నట్లే "ప్రోసెస్" చేసేదానిని ప్రోసెసర్ అంటారు. దీనిని మనం తెలుగులో ప్రక్రియకారి అనో పరికర్మరి అనో అనాలి. (మనకి తెలుగులో ఈ రకం ప్రయోగాలు లేకపోలేదు. అల్లేవాడు అల్లుడు, జాలంతో పని చేసే వ్యక్తి జాలరి, కుండలు చేసేవాడు కుమ్మరి, మొదలైనవి.) ఈ రోజుల్లో చూపుడు వేలు గోరంత పరిమాణం ఉన్న చిన్న సిలికాన్ చితుకు (silicon chip) మీద ఈ పరికర్మరి అంతా పట్టెస్తుంది కనుక దీనిని “సూక్ష్మపరికర్మరి” అని కూడా అనొచ్చు. దీనినే మైక్రోప్రోసెసర్ (microprocessor) అని ఇంగ్లీషులో అంటారు. “మైక్రో” అంటే సూక్ష్మమైన అని అర్థం. “నయా పైస” కాలక్రమేణా పైస అయినట్లు ఈ రోజుల్లో “మైక్రో” అన్నా అనకపోయినా పరవాలేదు. ఈ కర్మరి లోనే లెక్కలు అన్నీ జరుగుతాయి. |
792#23 | గణనయంత్రం | పోతే, రెండవ భాగం పేరు కొట్టు లేదా కోఠీ (store) లేదా ధారణి (memory). ఈ కొట్టు రూపురేఖలు కూడా సాంకేతిక రంగంలో జరుగుతూన్న విప్లవాలతో మారుతున్నాయి. పూర్వం అయస్కాంతపు ఉంగరాలు, టేపులు, పళ్లేలు, చిల్లుల కాగితపు టేపులు వాడేవారు. ఇప్పుడు సిలికాన్ చితుకులు, లేసర్‌తో చదవగలిగే పళ్లేలు వాడుకలోకి వచ్చేయి. ఇక్కడ సాంకేతికమైన వివరాలు చాలా చెప్పుకోవచ్చు. సాంకేతికమైన మార్పులకి అతీతంగా కోఠీలని తార్కికమైన దృష్టితో సందర్శించడం మంచిది. తార్కికంగా కొట్టు అమరికని పోస్టాఫీసుల్లో ఉత్తరాలు బట్వాడా చెయ్యడానికి వాడే గదుల బీరువాలా ఉహించుకోవచ్చు. ప్రతి గదికి ఒక చిరునామా లేదా విలాసం (address) ఉంటుంది. ప్రతి గదిలోను ఒక అష్టా (అంటే, ఎనిమిది ద్వింకముల మాల) పడుతుందని అనుకుందాం. |
792#29 | గణనయంత్రం | ఈ రోజుల్లో బాగా ప్రచారంలో ఉన్న నిరవాకులు చాల ఉన్నాయి. వాటిల్లో కొన్ని పేర్లు: విండోస్-ఎన్‌టి (Windows NT), ఒ-ఎస్/2 (OS/2), యూనిక్స్ (Unix), డాస్/విండోస్ (DOS/Windows), విండోస్ 2000 (Windows 2000), మొదలైనవి. “విండోస్ 2000” వంటి నిరవాకి ఉండడం వల్లనే మనం కీబోర్డు (కుంచికపలక) మీద టైపు కొట్టిన అక్షరాలు వెనువెంటనే తెర మీద కనిపిస్తున్నాయి. ఈ నిరవాకి ఆధ్వర్యం లోనే మూషికాన్ని ఒక్క సారి “క్లిక్” చెయ్యగానే ముద్రాపకి కాగితం మీద అచ్చుకొట్టడం మొదలు పెడుతుంది. ఈ నిరవాకి ప్రమేయం లేకుండా విద్యుల్లేఖలు (E-mails) పంపలేము. నిరవాకి చేసే ఈ చాకిరీ అంతా మన అనుభవ పరిధిలో ఉన్న పనులు. మనకి తెలియకుండా మరెన్నో సాంకేతికమైన ఇంటి పనులు (housekeeping operations) నిరవాకి నేపథ్యంలో చేసుకు పోతూ ఉంటుంది. ఇవన్నీ అవసరం వెంబడి తెలుసుకుందాం. |
804#7 | ఖగోళ శాస్త్రము | రెనసాన్స్ కాలములో, నికోలస్ కోపర్నికస్ సౌరకుటుంబానికి సౌరకేంద్ర/హీలియోసెంట్రిక్ నమూనాను ప్రతిపాదించెను. కోపర్నికస్ పరిశోధనలను గెలీలియో గెలీలి, యోహాన్స్ కెప్లర్లు పరిరక్షించి, సవరించి, విస్తరించారు. గెలీలియో మొదటి సారి పరిశోధనల కోసము టెలిస్కోపులు తయారుచేసి వాడెను. కెప్లర్ గ్రహ గతులను వాటి కక్ష్య లను మొదటిసారి కచ్చితముగా కనుగొనెను. కెప్లర్ న్యాయము లను ఋజువు చేసే సిద్ధాంతాలను కనుగొనడానికి మటుకు ఐజాక్ న్యూటన్ చేత కనుగొనబడిన మరియు గురుత్వాకర్షణ శక్తి ఉపయోగపడ్డవి. న్యూటన్ రిఫ్లెక్టింగ్ టెలిస్కోపును కనుగొనెను. ఆ తరువాత జరిగిన ఎన్నోపరిశోధనలు టెలిస్కోపు పరిమాణమును, నాణ్యతను పెంచాయి. నికోలాస్ లూయీ డి లాకాయె విపులమైన నక్షత్ర సూచీ పట్టీ (కేటలాగు) లను తయారు చేసెను. విలియమ్ హెర్షెల్ విస్తారమైన నెబ్యులా మరియు క్లస్టర్ కేటలాగులను తయారు చేసెను. ఆయన 1781 లో యూరెనస్ గ్రహమును కనుగొనెను. 1838 లో ఫ్రెడరిక్ బెస్సెల్ మొదటిసారి ఒక నక్షత్రము నకు దూరమును కనుగొనెను. |
804#9 | ఖగోళ శాస్త్రము | భూమి, సౌరకుటుంబము ఉన్న పాలపుంత నక్షత్రకూటమి (మిల్కీవే గేలెక్సీ)వలే అంతరిక్షము (space)లో ఇతర నక్షత్రకూటములు ఉన్నవని 20వ శతాబ్దములో కనుగొనడము జరిగింది. విశ్వము విస్తరిస్తున్నదని మిగతా గేలెక్సీలు మన గేలక్సీకు దూరంగా జరుగుతున్నాయని కనుగొన్నారు. నూతన ఖగోళ శాస్త్రములో క్వాజార్లు, పల్సార్లు, బ్లాజర్లు, రేడియో గేలెక్సీలు వంటి విశేష వస్తువులు కనుగొనబడ్డాయి. ఈ పరిశోధనల నుండి విడుదలైన సిద్ధాంతాల వల్ల కాలబిలము(బ్లాక్ హోల్) లు, న్యూట్రాన్ స్టార్ లను వివరించడము జరిగింది. Physical cosmology 20వ శతాబ్దములో సాధించిన అభివృద్ధితో మహావిస్ఫోట(బిగ్ బ్యాంగ్) వాదము నకు భౌతిక,ఖగోళ శాస్త్రముల నుండి cosmic microwave background radiation, హబుల్ నియమము, మరియు cosmological abundances of elements మద్దతు వచ్చెను. |
804#10 | ఖగోళ శాస్త్రము | బాబిలోనియా, ప్ర్రాచీన గ్రీసుదేశము లలో ఖగోళశాస్త్రము లో చాలా మటుకు ఆస్ట్రోమెట్రీ ( ఆకాశంలోనక్ష త్రాలు,గ్రహాల ఉనికిని కనుక్కోవడము) మాత్రమే ఉండేది. ఆ తరువాత జోహాన్స్ కెప్లర్, ఐజాక్ న్యూటన్ లవల్ల రోదసి గతి శాస్త్రము (celestial mechanics) అభివృద్ధి చెందింది. ఖగోళ శాస్త్రము లో గణితాన్ని ఉపయోగించి రోదసి వస్తువవులకు గురుత్వాకర్షణ బలాలతో గలిగిన గమనాలను అంచనా వేయడము జరిగేది. సౌరమండలము లో గల గ్రహములు, ఉపగ్రహములు, ఆస్టరాయడ్స్ వగైరా మీద దృష్టి కేంద్రీకరించడము జరిగేది. ఈ రోజుల్లో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము వల్ల రోదసి వస్తువుల స్థితి గతులు కనుక్కోవడము తేలికైంది కనుక, నూతన ఖగోళ శాస్త్రము రోదసి వస్తువుల భౌతిక ధర్మములను అర్థము చేసుకోవడము లో నిమగ్నమై ఉంది. |
805#0 | శాస్త్రము | ఇంగ్లీషులో ఉన్న రకరకాల మాటలకి సమానార్ధకంగా మనం తెలుగులో శాస్త్రం అన్న ఒక్క మాట వాడతాము.
ఉదాహరణకి mathematics కి బదులు గణితం, గణిత శాస్త్రం అన్న మాటలు వాడుకలో ఉన్నాయి. Physics అన్న మాటని భౌతికం అని అనం; భౌతిక శాస్త్రం అంటాం. అలాగే chemistry ని రసాయనం అనేసి ఊరుకోకుండా రసాయన శాస్త్రం అంటాం.
పొతే, biology, zoology, .. వంటి మాటలలోని -logy ని కూడా మనం శాస్త్రం అనే అనువదిస్తాం. logos అన్న ధాతువు అర్థం భాష.
ఇక genetics, statistics, economics అని -ics తో అంతం అయేవి ఉన్నాయి. వీటినీ మనం శాస్త్రం అనే అంటాం.
Astronomy, economy మొదలైన మాటలలోని -nomy అంటే లెక్క పెట్టుకోవడం కనుక, astronomy అంటే నక్షత్రాలని లెక్క పెట్టడం, economy అంటే డబ్బుని లెక్క పెట్టడం వగైరా అర్ధాలు వస్తాయి. వీటినీ మనం ఖగోళశాస్త్రం, ఆర్థిక శాస్త్రం అనే అనువదిస్తాము. |
829#0 | తెలుగు | ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. భారత దేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల (2001) జనాభాతో ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో 15 స్థానములోనూ, భారత దేశములో హిందీ, తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది. మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము తమిళముతో బాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వము గుర్తించింది. |
829#3 | తెలుగు | తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రావిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషాచరిత్రకారుల నమ్మకం. సింధులోయ నాగరికతలోని భాష గురించి కచ్చితంగా ఋజువులు లేకపోయినప్పటికీ, అది ద్రావిడ భాషే అవటానికి అవకాశాలు ఎక్కువని కూడా వీరి అభిప్రాయం. |
829#11 | తెలుగు | శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం – అనే మూడు శివలింగక్షేత్రాల మధ్య భాగము త్రిలింగదేశమనీ, "త్రిలింగ" పదము "తెలుగు"గా పరిణామము పొందినదనీ ఒక సమర్థన. ఇది గంభీరత కొరకు సంస్కృతీకరింపబడిన పదమేననీ, తెలుగు అనేదే ప్రాచీన రూపమనీ చరిత్రకారుల అభిప్రాయము. చాలామంది భాషావేత్తలు, చరిత్రకారులు ఈ వాదనలు పరిశీలించి దీనిలో నిజంలేదని అభిప్రాయపడ్డారు. అందుకు నన్నయ మహాభారతంలో త్రిలింగ శబ్దం ప్రయోగం కాకపోవడం కూడా కారణమన్నారు. 12వ శతాబ్దిలో పాల్కురికి సోమనాధుడు "నవలక్ష తెలుంగు" – అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము – అని వర్ణించాడు. మొత్తానికి ఇలా తెలుగు, తెనుగు, ఆంధ్ర – అనే పదాలు భాషకూ, జాతికీ పర్యాయ పదాలుగా రూపు దిద్దుకొన్నాయి. |
829#12 | తెలుగు | తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు. అచ్చుల శబ్దాలను చూడండి.
తెలుగును సాధారణంగా ఒకపదముతో మరొకటి కలిసి చేరిపోయే భాషగా గుర్తిస్తారు. ఇందులో ఒక నామవాచకానికి దాని ఉపయోగాన్ని బట్టి ప్రత్యేకమైన అక్షరాలు చేర్చబడతాయి. వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి. |
829#13 | తెలుగు | తెలుగుకు నాలుగు ప్రధానమైన మాండలిక భాషలున్నాయి.
తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది. అశోకుని కాలములో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. అశోకుడి కాలానికి చెందిన బ్రాహ్మి లిపి రూపాంతరమైన భట్టిప్రోలు లిపి నుండియు, ప్రాచీన కన్నడ లిపియైన 'హలెగన్నడ 'లిపినుండియూ తెలుగు లిపి ఉద్భవించింది. |
829#15 | తెలుగు | తెలుగు లిపి చాలవరకు ఉచ్చరించగల ఏకాక్షరాలతో ఉండి, ఎడమనుండి కుడికి, సరళమైన, సంక్లిష్టమైన అక్షరాల సరళితో కూడి ఉంటుంది. ఈ విధమైన ఉచ్చరించగల ఏకాక్షరాలు అనేకంగా ఉండడానికి ఆస్కారం ఉన్నందువల్ల, అక్షరాలు "అచ్చులు" (వొవెల్స్ లేదా స్వర్) మరియు "హల్లులు" (కాన్సొనెంట్స్ లేదా వ్యంజన్) అన్న ప్రధానమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హల్లుల రూపు వాటి వాడుకను బట్టి, సందర్భానుసారము మార్పు చెందుతూ ఉంటుంది. అచ్చుల ధ్వని వాటిలో లేనప్పుడు హల్లులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. అయితే, హల్లులను వ్రాయడానికీ, చదవడానికీ, అచ్చు "అ"ను చేర్చడం సాంప్రదాయకం. హల్లులు వేర్వేరు అచ్చులతో చేరినప్పుడు, అచ్చుఅంశం వర్ణ పరిచ్ఛేదముతో "మాత్రలు" అన్నసంకేతాలను ఉపయోగించడంతో గుర్తింపబడుతుంది. ఈ "మాత్రల" ఆకారాలు తమ తమ హల్లుల ఆకారాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి. తెలుగులో ఒక వాక్యం "పూర్ణవిరామం"తో కానీ, "దీర్ఘవిరామం"తో కానీ ముగించబడుతుంది. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా, అరబిక్ అంకెలే విస్తృతంగానూ, సర్వసాధారణంగానూ ఉపయోగింపబడుతున్నాయి. ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేషఅచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు ఉన్నాయి. |
829#26 | తెలుగు | 1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో, షెల్లీ, కీట్స్, వర్డుస్ వర్త్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు "భావకవిత్వం" అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.నన్నయకు పూర్వమునుండి గ్రాంథిక భాష మరియు వ్యావహారిక భాష స్వతంత్రముగా పరిణామము చెందుతూ వచ్చాయి. కానీ 20 వ శతాబ్దము తొలి నాళ్లలో వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు తీవ్ర వాదోపవాదాలకు దారితీసాయి. గ్రాంథికము ప్రమాణ భాష అని, స్థిరమైన భాష అని, దాన్ని మార్చగూడదని గ్రాంథిక భాషా వర్గము, ప్రజల భాషనే గ్రంథ రచనలో ఉపయోగించాలని వ్యావహారిక భాషా వర్గము వాదించడముతో తెలుగు పండితలోకము రెండుగా చీలినది. |
829#27 | తెలుగు | మొట్టమొదటి నవలగా పరిగణించబడుతున్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రముతో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గ్రాంథిక భాష వాడకాన్ని తీవ్రంగా నిరసిస్తూ గిడుగు రామ్మూర్తి ప్రకటించిన ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం ప్రభావంతో గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం) మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యావహారిక భాషను వాడడం వ్యావహారిక భాషా వాదా నికి దారితీసింది. |
829#30 | తెలుగు | తెలుగు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లోనే కాకుండా తమిళనాడు, కర్నాటక, ఒడిశా లలో కూడా మాట్లాడబడుతుంది. తమిళనాడులో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాతం తెలుగువారే. బెంగళూరులో 30 % మంది తెలుగు భాష మాట్లాడువారు నివసించుచున్నారు. తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూరులలో, ఒడిశా లోని రాయగడ, జయపురం, నవరంగపురం, బరంపురంం పర్లాకేముండి లలో తెలుగు భాష ఎక్కువ. విజయనగర సామ్రాజ్య కాలములో తెలుగు వారు వేల మంది తమిళప్రాంతములకు వెళ్ళి స్థిరపడ్డారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది తెలుగువారు కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుండి వలస వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు. కాని వారి రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రాంతీయ భాష అయిన అరవము లోనే మాట్లాడుతుంటారు. అలాగే కర్నాటకలో కూడా చాలామంది తెలుగు మాట్లాడగలరు. ఇంకా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర లోని కొన్ని సరిహద్ధు ప్రాంతాలలోని ప్రజలు అధికంగా తెలుగే మాట్లాడుతారు. దక్షిణాదిలో ప్రముఖ నగరాలైన చెన్నై, బెంగళూరు లలో కూడా తెలుగు తెలిసినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇక ఇతర రాష్ట్రాలలో మరియు ఇతర దేశాలలో స్థిరపడిన తెలుగు వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.ఈ క్రింది ప్రాంతాలలో తెలుగు భాష ఎక్కువగా మాట్లాడువారు నివసించుచున్నారుమధ్య భారతదేశం 777 రాజపుత్రస్థానము 61 క్రమముగా... 17,96,860 ... 2,16,974 మందిగా ఉంది. |
832#3 | గోడకుర్చీ | రక్తనాళాల్లో ప్లాకు పేరుకుంటే వాటిలో రక్తప్రసారం అడ్డగించబడుతుంది. హై బ్లడ్‌ప్రెజర్‌కీ, గుండెజబ్బుకీ ఇదే ముఖ్య కారణం. ప్రతిరోజూ షుమారు ఒక గంటసేపు ఈ వ్యాయామాలు చేశ్తే శరీరంలో రక్తప్రసరణ బాగా పెరిగి రక్తనాళాల్లో ప్లాకు పేరుకోవడానికి అవకాశం తగ్గుతుంది. ముసలితనంలో చాలామందికి సెనిలిటీ, ఆల్‌జైమర్సు వ్యాధి వచ్చి, వాళ్ళు క్రమేపీ జ్ఞాపకశక్తిని పోల్గోటం జరుగుతోంది. ఇవి పేషంట్లకూ, వారికుటుంబాలఖూ ఎన్నో ఇక్కట్లు కల్గించే ఘోరమైన వ్యాధులు. ఈ వ్యాధులకు ముఖ్యకారణం మెదడులోని రక్తనాళాల్లో ప్లాకు పేరుకోవడమే అని ఈ మధ్య తెలిసింది. దొర్లింగు, వణుకుల్లో తల తిప్పడంవల్ల, మెడ, మెదడుల్లో రక్తప్రసారం బాగా పెరిగి, మెదడులోని రక్తనాళాల్లో ప్లాకు పేరుకోవడానికి అవకాశం తగ్గుతుంది. కొంతమంది దిప్రెషన్ తో బాధ పడుతుంటారు. మెదడుని శరీరంక్రిందిభాగంతో కలిపే వేగాస్ నర్వుని (ఇది మెడ ఎడమభాగం గుండా దిగుతుంది) ఉత్తేజ పరిస్తే వారి పరిస్థితి మెరుగవుతుందని ఈ మధ్య కనిపెట్టారు. దొర్లిగు, వణుకుల్లో తలతిప్పడం మూలాన వేగాస్ నర్వుకి ఈ ఉత్తేజం రోజూ కల్గి దిప్రెషన్ రాకుండా చేస్తుంది. ఈ మధ్య ఇండియన్స్‌లో డయాబెటీసు చాలా ఎక్కువగా కన్పిస్తోంది. ఈ వ్యాధికి తెలుగులో చాలా పేర్లు ఉన్నాయి: ప్రమేహం, అతిమూత్రం, మధు మూత్రం, మధుమేహం, అని. కానీ ఇప్పుడు డయాబెటీసు అనే పదం బాగా వాడుకలోకి వచ్చేశింది. ప్రతిరోజూ శరీరంలో అవయవాలనన్నిటినీ బలంగా కదిలించే వ్యాయామాలు చేస్తే డయాబెటీసు వచ్చే అవకాశం బాగా తగ్గుతుందని పరిశోధనలవల్ల తెలిసింది. ప్రతిరోజూ గోడకుర్చీ వెయ్యడంవల్ల మోకాటికీ, మోకాటిచిప్పకూ, కాళ్ళలోని, తుంటిలోని ఎముకలకూ; బలం చేకూరి, ఎముకలబలహీనతకు చెందిన వ్యాధులు రాకుండా చేస్తుంది. సరిపోయినంత కాల్షియం తమ భోజనంలో తీసుకుంటూ, రోజూ గోడకుర్చీ వేశేవారి కాలి ఎముకలకు ఆస్టియోపొరోసిస్ రాదు. |
845#13 | ఆటలు | ఆడే విధానంముందు పావులు పేర్చే విధానం.బోర్డు మన ఎదురుగా పెట్టుకున్నప్పుడు మన ఎడమ పక్క చివర నల్ల గడి ఉండాలి. ఆ చివరి గడిలో, ఈ చివరి గడిలో 2 ఏనుగులూ పెట్టాలి. వాటికి లోపలి పక్కన రెండు వైపులా 2 గుర్రాలూ పెట్టాలి. తరువాత శకటాలు, ఇప్పుడు 2 గళ్ళు మిగులుతాయి. 1 నల్లది, 1 తెల్లది. నల్ల పావులు ఐతే నల్ల రాజు తెల్ల గడిలో, తెల్లవైతే తెల్ల రాజు నల్ల గడిలో ఉంచాలి. మిగిలిందాంట్లో మంత్రి లేదా రాణిని ఉంచాలి. |
847#5 | తెలుగు సాహిత్యము | దీనిని "పురాణ యుగము" లేదా "భాషాంతరీకరణ యుగము" అని అంటారు.
నన్నయ్య ఆది కవి. ఈయన మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంబించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని (అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని, ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించారు; తెలుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి,పండితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ,నారాయణులు యుగపురుషులు. వీరు తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య అడుగు జాడలను అనుసరించిన వారే.నన్నయ్య ఆది కవి. |
852#0 | తిక్కన | తిక్కన జీవిత కాలం 1205 - 1288. విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిధ్దికి మంత్రిత్వం వహించారు.కవిత్రయములో నన్నయది కథాకథన శైలి. ఆఖ్యాయిక శైలి. తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి |
852#9 | తిక్కన | తిక్కన కావ్యములు రెండు.1. నిర్వచనోత్తర రామాయణం. దీనినంతటిని పద్యములుగానే రచించెను. ఇది బాల్యమునందు రచించబడింది. ఇందలికథ సంస్కృతంలో ఉన్నంత లేక మిక్కిలి సంగ్రహపరచబడింది. పలుచోట్ల శైలి నారికేళపాకం అని చెప్పవచ్చును. అందుచేత ఈ గ్రంథం భారతమువలె సర్వత్ర వ్యాపింపకున్నది. యితడు 10 ఆశ్వాసములు ఈ గ్రంథమున రచించినను పుస్తకమును మాత్రము ముగింపలేదు. రామనిర్యాణకథను చెప్పుటకు భీతిల్లి దానిని వదిలిపెట్టినయెడల తిక్కన భారతమునందు స్త్రీపర్వకథయు కృష్ణనిర్యాణ మును చెప్పుటకేల భయపడలేదని ఒకరు ప్రశ్న వేయుచున్నారు. ప్రతీమరణకథకును భయపడి దానిని విడుచుచూ వచ్చినచో భారతమును రచింపకయే యుండవలెను. తిక్కన భారతము ను మనుమసిద్దికి ఇచ్చినచో నరాంకితం అవుతుందని మనుమసిద్దికి ఇవ్వక శ్రీ భద్రాద్రిరామునికి అంకితం చేసెను. |
852#15 | తిక్కన | మహాకవి తిక్కన 12వ శతాబ్దంలో ఉపయోగించిన రుద్రాక్షమాల బయటపడింది. నెల్లూరులో నివసిస్తున్న ఆయన వంశస్థురాలు లక్ష్మీప్రసన్నకు ఆ మాల వంశపారంపర్యంగా సంక్రమించింది. నెల్లూరులోని పెన్నానది ఒడ్డున తిక్కన పార్కులో రుద్రాక్షమాల, పగడాన్ని
మహాభారతములో నన్నయ్య రచించిన పర్వాలు కాకుండా మిగిలిన 15 పర్వాలను తిక్కన రచించాడు. ఆదికవి నన్నయ ఆది పర్వము, సభాపర్వము, అరణ్యపర్వములో కొంతభాగము రచించి గతించెను. అరణ్యపర్వములో మిగిలిన భాగమును ఎఱ్ఱన రచించాడు. అరణ్యపర్వము వరకును నన్నయ వ్రాసి మరణించగా, తరువాత ఈ మహాకవి, తిక్కన అరణ్యపర్వశేషమును మాత్రము విడిచిపెట్టి, విరాటపర్వము మొదలుకొని 15 పర్వములను వ్రాసాడు.అరణ్యపర్వమును ఆంధ్రీకరించుటచేతనే నన్నయ మృతిచెందాడని, అందుకే నేనుకూడా మృతిచెందుతాననే భయంతో అరణ్యపర్వమును తిక్కన విడిచిపెట్టినాడు అని కొందరు అంటారు. గ్రంథరచనకు పూర్వము మనుమసిద్ది తిక్కనచే యజ్ఞము చేయించి భారతమును సంపూర్ణముగా తిక్కనచే రచింపజేసినట్లు చెప్పుదురు. కాని ఈ మనుమసిద్దిరాజు తనని రాజరాజ నరేంద్రుని ఆస్థానమునకి పొమ్మనగా తిక్కన పోనని మారాం చేయడంతో, ఈ విషయాన్ని ఎరిగిన రాజరాజనరేంద్రుడు తిక్కనకి నీవు ఎక్కడనుండైనా రచనచేయవచ్చని సమాచారం పంపగా, అప్పుడు తిక్కనచే మనుమసిద్ది నెల్లూరులో యజ్ఞము చేయించెను. అయిననూ తిక్కన మనుమసిద్ధిపై కోపంతో, భారతముని మనుమసిద్దికి అంకితం ఇవ్వక, హరిహరనాథునికి అంకితం చేసెను అని కొందరి వాదన. |
852#24 | తిక్కన | తిక్కన (1205 - 1288) మహాభారతములో నన్నయ్య రచించిన పర్వాలు కాకుండా మిగిలిన 15 పర్వాలను రచించాడు. ఆది కవి నన్నయ ఆది పర్వము, సభాపర్వము, అరణ్యపర్వములో కొంతభాగము రచించి గతించిరి. అరణ్యపర్వములో మిగిలిన భాగమును ఎఱ్ఱన రచించాడు. తిక్కన అరణ్యపర్వమును వదలి, మిగిలిన పర్వములు రచించిరి. ముందుగా యజ్ఞము చేసి, సోమయాజియై, పిదప ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈయనకు "కవి బ్రహ్మ", "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదులు ఉన్నాయి. |
853#2 | ఎఱ్రాప్రగడ | ఎర్రన తన నృసింహపురాణంలో చేసిన వంశవర్ణననుబట్టి అతని వివరాలు తెలుస్తున్నాయి. ఎఱ్ఱాప్రగడ పాకనాడు సీమ (ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని కందుకూరు సమీపంలోని గుడ్లూరు గ్రామములో జన్మించాడు. ఈయన ప్రస్తుత గుంటూరు జిల్లా వేమూరు మండలములోని చదలవాడ గ్రామములో నివసించాడు. వీరు "శ్రీవత్స" గోత్రము "అపస్తంబు" శాఖకు చెందిన బాహ్మణుడు. అతని తండ్రి సూరన, తల్లి పొత్తమ్మ (పోతమాంబ). ఎఱ్రన్నకు అతని తాత గారి నామధేయమయిన ఎఱపోతన నామకరణం చేశారు అతని తల్లిదండ్రులు. ఎఱ్ఱాప్రగడ మామ్మ పేరు పేర్రమ్మ (పేరమాంబ, ప్రేంకమాంబ). ఎఱ్ఱాప్రగడ ముత్తాత బొల్లన (ఆతని భార్య పోలమ్మ లేదా ప్రోలమాంబ). ఎఱ్ఱాప్రగడ కుటుంబ ఆరాధ్య దైవం శివుడు. గురువు గారి పేరు శ్రీశంకర స్వామి. ఎఱ్రన్న కుటుంబ ఆరాధ్య దైవం శివుడైనా విష్ణువుని కూడా పూజించేవాడు. |
853#3 | ఎఱ్రాప్రగడ | ఎర్రన బహుశా క్రీ.శ. 1280లో జన్మించి, 1364వరకు జీవించి ఉంటాడని సాహితీచరిత్రకారులు అంచనా వేస్తున్నారు. (కాకతీయ సామ్రాజ్యం 1323లో పతనమయ్యింది. అప్పుడు, అనగా 1324-25 కాలంలో, కాకతీయ సేనానులలో ఒకడైన ప్రోలయవేమారెడ్డి కందుకూరు మొదలు గోదావరీతీరంవరకు తన రాజ్యాన్ని అద్దంకి రాజధానిగా స్థాపించాడు). ఆ సమయంలోనే ఎర్రన 45ఏండ్ల వయసుగల ప్రౌఢకవి ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవి అయ్యాడు. ఆ రాజు ఆస్థానంలోనే తన సాహితీజీవితాన్ని కొనసాగించాడు. |
853#4 | ఎఱ్రాప్రగడ | 1353లో ప్రోలయ వేముడు మరణించాడు. ఎర్రన శేషజీవితం గురించి వివరాలు స్పష్టంగాలేవు. అయితే 1364లో అనపోతవేమారెడ్డి వేయించిన దానశాసనం (కొల్లూరు శాసనం) ప్రకారం కనీసం 1364వరకూ, బహుశా ఆ తరువాత మరికొంతకాలం కూడా ఎర్రాప్రగడ జీవించి ఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు. (ఈ విషయమై ఏకాభిప్రాయం లేదు.) |
853#8 | ఎఱ్రాప్రగడ | ప్రోలయ వేముని కోరికపై ఎర్రన ముందుగా రామాయణాన్ని రచించాడు. కాని అది ఇప్పుడు దొరకడంలేదు. ఎర్రన వంశంవాడైన చదలవాడ మల్లన, ఎర్రన రచనల గురించి వ్రాస్తూ "వల్మీకభవు వచోవైఖరి రామాయణంబు నాంధ్ర ప్రబంధంబు జేసె" అని చెప్పాడు. అనగా ఇది వాల్మీకి రామయణానికి ఆంధ్రీకరణమేననీ, అదీ ఒక ఉద్గ్రంధమైన ప్రబంధమనీ తెలుస్తుంది. అయితే హుళక్కి భాస్కరాదులు వ్రాసి, సాహిణి సూరనకంకితమిచ్చిన భాస్కర రామాయణములోని కొన్ని ఘట్టాలు పాఠాంతరాలుగా చాలాపద్యాలు కనిపిస్తున్నాయి.ఈ పద్యాలు ఎర్రాప్రగడవే కావచ్చునని పండితుల ఊహ. అలాంటి 46 పద్యాలను ఎంతో శ్రమతో సేకరించి వేటూరి ప్రభాకరశాస్త్రి భారతి పత్రికలో "ఎర్రాప్రగడ రామాయణం" అనే శీర్షికతో ప్రకటించాడు. yes |
853#11 | ఎఱ్రాప్రగడ | ఎఱ్ఱాప్రగడ కవిత్రయంలో మూడవ కవి, కాని ఆయన అనువదించినది మధ్య భాగము. నన్నయ మహాభారత అనువాదం అరణ్య పర్వం మధ్యలో ఆగిపోయింది. ఈ శేషభాగాన్ని మహాకవి తిక్కన ఏ కారణం చేతనో అనువదించలేదు. అలా మిగిలిపోయిన అరణ్య పర్వాన్ని తెలుగు లోకి ఎఱ్ఱన అనువదించాడు. అరణ్యపర్వములోని మొదటి మూడు ఆశ్వాసాలనూ, నాలుగవ ఆశ్వాసంలో 142 పద్యాలనూ నన్నయ వ్రాశాడు. తరువాత బహుశా నన్నయ మరణం కారణంగా ఆ కార్యం అక్కడితో ఆగిపోయింది. 143వ పద్యంనుండి ఎఱ్ఱన వ్రాశాడు. ఈ రచన బహుశా ప్రోలయ వేమునికాలంలోనే, హరివంశం రచన తరువాత, జరిగినట్లు అనిపిస్తుంది. ఈ విధంగా అరణ్యపర్వ శేషాన్ని కూడా ఆంధ్రీకరించడంతో తెలుగులో మహాభారత సమగ్రతను సాధించిన గౌరవం ఎర్రనకు దక్కింది. ఎర్రనకున్న సౌజన్యమూ, వినయమూ కారణంగా ఈ అరణ్యపర్వశేషాన్ని నన్నయ రచనతో కలిపే వ్రాసి, దానిని రాజరాజనరేంద్రునికే అంకితమిచ్చాడు. "ప్రయత్నించి తత్కవితా రీతియు గొంత దోప దద్రచనయకా నారణ్యపర్వశేషం" పూరించినట్లు చెప్పుకొన్నాడు."నన్నయభట్ట మహాకవీంద్రు సరస సారస్వతాంశ ప్రశస్తి తన్ను జెందుటయే" అందుకు కారణమని కూడా ఎర్రన చెప్పుకొన్నాడు. |
855#34 | శ్రీనాథుడు | గరళము మింగితి నంచు
బురహర! గర్వింపబోకు పో!పో!పో! నీ
బిరుదింక గానవచ్చెడి
మెరసెడి రేనాటి జొన్న మెదుకులు తినుమీ!మాతృభూమిని వదలిపోయిన తరువాత ఏభూమియు శ్రీనాధునకు నచ్చలేదు. ఈవంటకములకు ఆభోజనములకు హస్తిమశకాంతరము కదా! "కూడు తలప చోళ్ళు!" "కూర కారామళ్ళు" పోనీ ముప్పూటను అవేతినుదమన్న "కలవు మాపటివేళ గంజినీళ్ళు". ఇట్లు దక్షిణదేశపు భీజనములను పెక్కుపద్యములందు స్మరించినాడు. భోజన పరాక్రమము మాత్రమే కలవారి నిట్లు హేళన చేసినాడు. |
859#0 | అన్నమయ్య | అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి. |
859#1 | అన్నమయ్య | కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉంది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. |
859#8 | అన్నమయ్య | నారాయాణయ్యను అయ్యవార్లు ఇంతటి కఠిన పరీక్షలకు గురిచెసినప్పటికి నారాయణయ్య లేత మనస్సు గాయపడింది. నలుగురూ అవహేళన చేస్తున్నారు. సిగ్గుతో, అవమానంతో క్రుంగిపోయాడు. ఇంతకంటె చావు మేలను కున్నాడు. నారాయాణయ్య ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతలమ్మగుడి సమీపాన పుట్టలో పాముందని ఎవరో చెబుతుండగా విన్నాడు. నారాయాణుడు ఒంటరిగ గుడి చేరి పుట్టలో చేయి పెట్టాడు.నేడు ఊటుకూరునందు చింతలమ్మ ఆలయం కనిపించదు. కాని ఊటుకూరు శివాలయంలో ఒకగదిలో వున్న స్త్రీమూర్తి విగ్రహం "చింతలమ్మ" అని స్ధానికుల అభిప్రాయం. పాము కరవలేదు సరికదా ! నారాయాణయ్యకు త్రికాల వేదినియైన చింతలమ్మ ప్రత్యక్షమైంది. నారాయాణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది."ఎందుకు బాబు ఈ అఘ్హాయిత్యం. నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి వెళ్ళు,తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు" అని నారాయాణయ్యను అనుగ్రహించి అంతర్ధానమైనది. అమ్మవారి ఆదేశం ప్రకారం నారాయాణయ్య తాళ్ళపాకచేరి ఆశ్రితక్లేశనాశకుడైన చెన్నకేశవస్వామిని సేవించి స్వామి అనుగ్రహించే వేదవేదాంగ పారంగతుడై సకలవిద్యలు పొందగలుగుతాడు. సర్వజ్ఞుడని కీర్తి పొందుతాడు. ఈ నారాయాణయ్య కుమారుడే నారాయణసూరి.
అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాధురంధరుడుగా ప్రసిద్ధికెక్కినవాడు. అన్నమయ్య తండ్రి పేరు ’నారాయణసూరి’గా చిన్నన్న పేర్కొనడాన్నిబట్టి తాళ్ళపాకవారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్ధులుగా కీర్తించబడేవారని భావించవచ్చును. నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ, మహా భక్తురాలు. మధురంగా పాడుతుంది. ఈమె స్వగ్రామం మాడువూరు, కడప జిల్లా సిద్దపట్నం తాలూకాలో వున్నది. అక్కడ చెన్నకేశవస్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడట. |
859#9 | అన్నమయ్య | భాగవతసేవా పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబ లకు సంతానం లేకపోవడం తీవ్రవ్యధకు గురిఅయినారు. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు. "మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామీ" అని ఏడుకొండలస్వామికి మ్రొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు. ఒక మంచిరోజు చూసి ఇద్దరూ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు.లక్కమాంబ, నారాయణసూరి తిరుమల చేరారు. స్వామి మందిరం ప్రవేశించారు. గరుడగంభం వద్ద సాగిలి మ్రొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లైంది. కళ్లు మిరుమిట్లు గొలిపే తేజస్సు కనిపించి ధగధగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి అద్రుశ్యమైంది. వేంకటేశ్వరస్వామి తన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వేంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు.
ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాథ. కొండలయ్య తాను ధరించే "బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని" వారికందజేశాడట. అలా పుట్టిన శిశువే అన్నమయ్య. |
859#10 | అన్నమయ్య | లక్కమాంబ గర్భవతి అయింది. వైశాఖమాసం విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో మూడు గ్రహాలు ఉన్నత దశలో వుండగా నారాయణసూరి, లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైనది, మగశిశువు ఉదయించాడు.
సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడింది. నారాయణసూరి ఆ శిశువునకు ఆగమోక్తంగా జాతకర్మ చేశాడు. |
859#16 | అన్నమయ్య | అన్నమయ్య ఆడిన మాటల్లా అమృతకావ్యంగ, పాడినదల్లా పరమగానంగా భాసించేది. చిన్ననాటనే వేంకటపతి మీద వింత వింతలుగా సంకీర్తనలు ఆలపించేవాడు. కాని అన్నమయ్య సంకీర్తన రచనకు స్వామి ఆదేశం పొదినది తన పదహారవ సంవత్సరంలోనే ! వేంకటేశ్వరస్వామి ఆదేశం ప్రకారం అన్నమయ్య తన పదహారో ఏటనుండి రోజుకొక్క సంకీర్తనకు తక్కువ కాకుండా వ్రాయడం ప్రారంభించాడు. ఈ విషయం రాగిరేకులమీద తొలి వ్యాక్యాలవల్ల కూడా స్పస్టమవుతున్నది. అన్నమయ్య ఏక సంతాగ్రహి. గురువులు చెప్పిన పాఠాలు చెప్పినట్లు వెంటనే అప్పచెప్పేవాడు. వాళ్లు ఆశ్చర్యపడెవాళ్లు. ఇంక అన్నమయ్యకు నేర్పిన్చవలసింది ఏమీ లేదని త్వరలోనే తెలుసుకున్నారు. అన్నమయ్య చెన్నకేశవుని గుడిచేరి "బుజ్జి కేశవా" అని పిలిచేవాడు. |
859#18 | అన్నమయ్య | నారాయణసూరిది పెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబాలలో చిన్న చిన్న కలతలు తప్పవు. వాళ్ల కోపతాపాలు అర్ధం లేనివి కావు ఇంతలో తగువులాడతారు. అంతలో కలిసిపోతారు.అన్నమయ్య బాల్యంలో తల్లిదండ్రులు, వదిన చెప్పిన పనులు అన్నీ విసుగు చెందగ చేసేవాడు. ఉమ్మడి కుటుంబాలల్లో పనులు తప్పవు. అందుకనె ఎప్పుడూ దండె భుజాన తగిలించుకొని పాటలు పాడడం ఇంటివారలకు అంతగా నచ్చేది కాదు. ఒకనాడు అందరు కలిసికట్టుగ అన్నమయ్య మీద విరుచుకు పడ్డారు. అన్నమయ్యకు దిక్కు తెలియలేదు. "అప్పుడు ఆ దండె భుజాన తగిలించుకొని పిచ్చి పాటలు పాడుకొవడమేనా? ఇంట్లో పనీ పాట ఎవరు చూస్తారు? "అని ఇంటివాళ్లు దెప్పి పొడిచారు. "గాలి పాటలు కట్టిపెట్టి అడవికెళ్ళి పశువులకింత గడ్డి తెచ్చిపడేయ్." ఏ విసుగులో వున్నాడో నారాయణసూరి కొడుకును కసిరినంత పనీచేశాడు. లక్కమాంబ మాత్రం కొడుకువైపు జాలిగ చూసింది. అన్నమయ్య ఏమీ బదులు పలకలేదు. కొడవలి భుజాన తగిలించుకొని అడవికి బయలుదేరాడు. |
859#33 | అన్నమయ్య | అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొందిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏక సంధాగ్రాహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు.
తన పదహారవ యేట అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటినుండి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలను రచింపసాగాడు.
ఒకనాడు (8వ ఏట)ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుచుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయెను. అప్పుడు ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది. అప్పుడు పరవశించి అలమేలుమంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీవేంకటేశ్వర శతకము రచించాడు.
తిరుమల శిఖరాలు చేరుకొన్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, వరాహ స్వామి దేవాలయంలో ఆదివరాహ స్వామిని దర్శించుకొన్నాడు. పిదప వేంకటపతి కోవెల పెద్దగోపురము ప్రవేశించి "నీడ తిరుగని చింతచెట్టు"కు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, గరుడ స్తంభానికి సాగిలి మ్రొక్కాడు. సంపెంగ మ్రాకులతో తీర్చిన ప్రాకారము చుట్టి "విరజానది"కి నమస్కరించాడు. భాష్యకారులైన రామానుజాచార్యులను స్తుతించి, యోగ నరసింహుని దర్శించి, జనార్దనుని (వరదరాజస్వామిని) సేవించి, "వంట యింటిలో వకుళా దేవి"కు నమస్కరించి, "యాగశాల"ను కీర్తించి, ఆనంద నిలయం విమానమును చూచి మ్రొక్కాడు. కళ్యాణమంటపమునకు ప్రణతులిడి, బంగారు గరుడ శేష వాహనములను దర్శించాడు. శ్రీభండారమును చూచి, బంగారు గాదెలను (హుండీని) సమర్పించి తన పంచె కొంగున ముడివేసుకొన్న కాసును అర్పించాడు. బంగారు వాకిలి చెంతకు చేరి, దివ్యపాదాలతో, కటివరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమంగళ శ్రీమూర్తిని దర్శించుకొన్నాడు. తీర్ధ ప్రసాదాలను స్వీకరించి, శఠకోపముతో ఆశీర్వచనము పొంది, ఆ రాత్రి ఒక మండపములో విశ్రమించాడు. |
859#36 | అన్నమయ్య | అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు. ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. కాని నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు. |
859#39 | అన్నమయ్య | రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. వేంకటాచలానికి సమీపంలో ఉన్న "మరులుంకు" అనే అగ్రహారంలో నివసించేవాడు. ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి. అంతఃకలహాలలో రాజవంశాలు మారాయి. అన్నమయ్య జీవితంపట్ల విరక్తుడై నిత్యసంకీర్తనలతో పొద్దుపుచ్చేవాడు. అతని కీర్తనలలోని ఆశీర్వచన మహాత్మ్యం కథలు కథలుగా వినిన ప్రజలు అతని సంకీర్తనా సేవకు జనం తండోపతండాలుగా రాసాగారు. |
859#55 | అన్నమయ్య | అన్నమయ్య ఆరు వందల జయంతి సందర్భంగా తాళ్ళపాకలో 19-5-2008 నుండి 22-05-2008 వరకు వుత్సవాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా 108 ఆడుగుల విగ్రహాన్ని 108 రోజులలో నిర్మించారు. తి.తి.దే వారు నిర్వహిస్తున్నారు. అన్నమయ్య 12 వ తరము వారు అగర్బ దరిద్రములో కొట్టుమిట్టాడు తున్నారని (చూడుడు ఆంధ్రజ్యోతి తేది 23-05-08), ప్రభుత్వము వారు పించన్లు ఏర్పాటు చెయ్యడానికి వొప్పుకొన్నారు.అన్నమయ్య సాహితీ సంపదను తరతరాల వారికి అందించ డానికి, వారి వంశస్థులను వినియోగించ వచ్చును.అన్నమయ్య పాటల ద్వారా ప్రసిద్ధులైన కొందరు గాయకులు
త్యముతాళ్ళపాక కవులకు సంబంధించిన కొన్ని రచనలు, పరిశోధనా గ్రంథాలు ఇంటర్నెట్ ఆర్చీవులలో లభిస్తున్నాయి. |
860#0 | తాళ్ళపాక తిమ్మక్క | తాళ్ళపాక తిమ్మక్క లేదా తాళ్ళపాక తిరుమలమ్మ తొలి తెలుగు కవయిత్రి. వీరు తాళ్ళపాక అన్నమాచార్యుల వారి ఇల్లాలు, మొదటి భార్య. ఈమె నన్నయ భారతము ఆధారముగా 1163 పాదాలతో సుభద్రా కల్యాణము అనే ద్విపద కావ్యము రాసినది. |
861#3 | మధుబాబు | మధుబాబు జులై 6, 1948 న కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు గ్రామంలో జన్మించాడు. సూర్యనారాయణ రావు, భారతి ఈయన తల్లిదండ్రులు. తండ్రి కరణంగా పనిచేసేవాడు. వీరిది మధ్యతరగతి కుటుంబం. మధుబాబుకు నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు. ఏడో తరగతి వరకు తోట్లవల్లూరు లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. చదువు అనుకున్నట్టుగా సాగకపోవడంతో తండ్రి ఈయనను ఎ. కొండూరు మండలం కంభంపాడు గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాబాయి దగ్గరకు పంపించాడు. అక్కడ చదువుతున్నప్పుడే నాటకాలమీద, సాహిత్యం మీద ఆసక్తి ఏర్పడ్డాయి. ఎస్. ఎస్. ఎల్. సి కోసం మళ్ళీ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తండ్రి స్వతహాగా సాహిత్యాభిమాని. ఆయన ఎక్కువగా శరత్ సాహిత్యం చదివేవాడు. వీరి ఇంట్లో సుమారు 2000 దాకా పుస్తకాలు ఉండేవి. మధుబాబు వీటిలో చాలా పుస్తకాలు చదివాడు. మచిలీపట్నంలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశాడు. కానీ ఆ వృత్తిలో ఎదుగుదల ఉండదని మొదట్లో అందులో చేరలేదు. |
861#5 | మధుబాబు | జీవితంలో ఏదో సాధించాలనే తపనతో అనేక ప్రాంతాల్లో పర్యటించడం మొదలుపెట్టాడు. 1972 నాటికి మద్రాసు చేరుకున్నాడు. అక్కడే రచనలు మొదలు పెట్టాడు. తన మొదటి రచన ప్రారంభించక మునుపే ఎం. వి. ఎస్. పబ్లిషర్స్ అనే సంస్థకు వెళ్ళి తన దగ్గర ఒక నవల ఉన్నదనీ ప్రచురిస్తారా అని అడిగాడు. విషయం బాగుంటే ప్రచురిస్తామన్నారు వాళ్ళు. దాని తర్వాత ఆయన కేవలం మూడు రోజుల్లో "వాంటెడ్ డెడ్ ఆర్ అలైవ్" అనే నవలను రాసి వారికి ఇచ్చాడు. ఇది 15 సార్లు పునర్ముద్రితమైంది. ఆయన అందుకున్న తొలి పారితోషికం 50 రూపాయలు. ఈయన రచయిత కావడం వెనుక స్నేహితుడు బొర్రా సుబ్బారావు ప్రోత్సాహం ఉంది. ఈయన మధుబాబును మరిన్ని రచనలు చేసేలా ప్రోత్సహించాడు. |
862#0 | యండమూరి వీరేంద్రనాథ్ | యండమూరి వీరేంధ్రనాథ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 1948లో జన్మించాడు. ఇతడు తెలుగులో సుప్రసిద్ధ నవలా రచయిత. యండమూరి వ్రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలుగా కూడా వచ్చినాయి.
యందమూరి వీరేంద్రనాథ్ తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 1948లో జన్మించాడు. తండ్రి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేస్తుండటం వల్ల ఉద్యోగ రీత్యా అనేక ప్రదేశాలు తిరిగాడు. అందువల్ల ఆయన బాల్యం అనేక ప్రాంతాల్లో గడిచింది.
ప్రాథమిక విద్య కాకినాడ, రాజమండ్రి ల లోనూ, ఆరవ తరగతి జమ్మలమడుగు లోనూ, ఏడవ తరగతి అనంతపురం లోనూ, ఎనిమిది, తొమ్మిది తరగతులు ఖమ్మం లోనూ, పదో తరగతి, ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోనూ, బి.కాం కాకినాడ లోనూ చదివాడు. 1972లో సీ.ఏ. పట్టా పుచ్చుకున్నాడు. |
863#1 | వేమన | వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు. కానీ ఇది నిజం కాదని పరిశోధకులు తెలియజేస్తున్నారు. కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కాపు కులస్థులకు జన్మించారని అంటున్నారు. ఆయన నందననామ సంవత్సరము, ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించారు. ఆయన తన జన్మస్తలాన్ని తనే ఒక పద్యంలో వివరించారు.
"విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి.. వేమన చరిత్ర చాలా మంది పరిశోధకులు కృషి చేసినా అస్పష్టంగా ఉంది. |
863#3 | వేమన | 1820 లో మద్రాసు గవర్నర్ గా నియమితులైన 'సర్ థోమస్ మన్రో' గారు పన్నులు వసూలు చేసే నిమిత్తం కడపలో నున్న గండికి ప్రవేశించారు.
అక్కడ ఆయనకు బంగారు తోరణాలు కనిపించాయి. వారు తన సైనికులతో ఆ విషయం చెప్పగా, వారెవ్వరకు ఆ తోరణాలు కనిపించలేదు.
ఆయన అక్కడున్న వాళ్ళతో "ఇక్కడో రాజాధి రాజు ఉన్నాడు, ఎక్కడున్నాడో వెతకండి" అన్నారు.
వాళ్ళు గండి మొత్తం గాలించి ఎవరు లేరని తేల్చారు కానీ, ధామస్ మన్రో గారు మాత్రం అక్కడే విడిది చేసి చాల రోజులు ఉన్నారు.
గండిలో నున్న శ్రీ ఆంజనేయస్వామి బొమ్మ ఈ బంగారు తోరానికి కారణం అని భావించి అక్కడ ఆలయ నిర్మాణానికి సంకల్పించారు.
కానీ అక్కడకు కొన్ని గజాల దూరంలో నున్న వీరన్న గట్టు పల్లి నుండి ప్రసరించిన దివ్య కిరణాలే ఆ బంగారపు తోరణాలు.
అవి యోగి వేమన పూజించి వదిలిన యంత్రం నుండి వచ్చినవి కావచ్చు, ఆయన ఆత్మ స్వరూపం నుండి వచ్చినవి కావచ్చు. విచిత్రం ఏమిటంటే, ఈ బంగారు తోరణాలు కనిపించిన ఆరు నెలల్లో మన్రో గారు చనిపోయారు.
పాములకు, సిద్దులకు తెలిసి కానీ తెలియకకాని కష్టం కలిగితే ఫలితం వేరుగా ఉంటుంది అని లోకంలో నానుడి. తన జన్మస్థలాన్ని మంది మార్బలంతో ఆణువణువూ పరిశీలించడం ఆ మహా యోగికి బహుశ నచ్చివుండలేదేమో. |
864#0 | మహాభాగవతం | ఇది భాగవత పురాణాన్ని గురించిన సాధారణ వ్యాసం
భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం ("Bhagavata Purana" or "Bhāgavatam") హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణము. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి.
ఋషుల కోరికపై సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న ఈ భాగవత కథను వారికి చెప్పినట్లుగాను, దానిని వేద వ్యాసుడు గ్రంధస్తం చేసినట్లుగాను ఈ కథ చెప్పబడింది. భాగవతంలో వివిధ భాగాలను "స్కంధాలు" అంటారు. వివిధ స్కంధాలలో భగవంతుని అవతార కార్యాల వర్ణనలు, భక్తుల గాథలు, పెక్కు తత్వ బోధలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మికమైన సంవాదాలు పొందుపరచబడినాయి. భగవంతుని లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి. అతని ౨౧ (21) అవతారాలు వర్ణింపబడ్డాయి. వైష్ణవులందరికీ ఇది పరమ పవిత్రమైన గ్రంథము. ఇది మొత్తము ద్వాదశ (12) స్కంధములుగా విభజించబడింది. |
864#11 | మహాభాగవతం | భాగవతంలోని వివిధ స్కంధాలలో ఉన్న ముఖ్య విషయాలు సంక్షిప్తంగా క్రింద తెలుపబడ్డాయి. (మరింత విపులమైన వివరాలకోసం ఆయా స్కంధాల గురించిన ప్రత్యేక వ్యాసాలు చూడండి)ఆధునిక కాలంలో శాస్త్రీయ విజ్ఞాన పరిశోధనల ద్వారా తరచి చూస్తున్న కొన్ని విషయాలు భాగవతంలో అప్పటి సిద్ధాంతాల ప్రకారం ప్రస్తావించబడ్డాయి. మూడవ స్కంధం (11వ అధ్యాయం) లో సమయ విభాగం గురించి చెప్పబడింది. అందులో సూక్ష్మకాలం పరమాణు ప్రక్రియలకు పట్టే కాల పరిమాణం రేంజిలో ఉంది. స్థూల కాలం విశ్వం వయస్సుగా చెప్పబడే కాలం రేంజిలో ఉంది. |
865#3 | భాగవతం - ఒకటవ స్కంధము | కురుక్షేత్రం అయిపోయిన రోజు రాత్రి పాండవ సిబిరంలో అందరూ నిద్రిస్తుండగా, అశ్వత్థామ వీరావేశంతో వచ్చినిద్రిస్తున్న ఊప పాండవులను హాతమార్చెను. ఉప పాందవులు చంపబడ్డారన్న వార్త తెలుసుకున్న అర్జునుడు వీరావేశంతో వీరిని చంపిన వాడిని తీసుకువచ్చి నీ పాదాల వద్ద పడివేస్తానని ద్రౌపదితో శపథం చేసి, కురుక్షేత్రంకి వచ్చి అక్కడ ఉన్న భటుల ద్వారా చంపినవాడు అశ్వత్థామ అని తెలుసుకొని, వాడితో యుద్ధము చేసి చేసి, సవ్యసాచి ప్రతిభ ముందు తాడలేక అశ్వత్థామ బ్రహ్మశిరోనామాస్త్రం ప్రయోగించగా, ఆ అస్త్రం లోకాలన్నిటిని క్రమ్మేస్తుండగా అది చూసిన కృష్ణుడు అర్జునుడిని కూడా బ్రహ్మశిరోనామాస్త్రాన్ని ప్రయోగించమనగా, అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించి పిమ్మట రెండు బ్రహ్మశిరోనామాస్త్రలను కూడా ఉపసంహరించి, అశ్వత్థామను కట్టి ద్రౌపది ఎదుట నిలబెట్టగా. |
869#5 | భాగవతం - పన్నెండవ స్కంధము | ఆ పిమ్మట మహానందికి శూద్రవనిత కడుపున మహాపద్ముడు పుడతాడు. అతడు మహాబలవంతు డవుతాడు. అయినప్పటికీ, అతనితో క్షత్రియ వంశం అంతరించిపోతుంది. ఆ సమయంలో రాజులు శూద్రప్రాయులైపోతారు;ధర్మహీనులైపోతారు. మహాపద్మునికి సుమాల్యుడు మొదలైన తనయులు ఎనమండుగురు కలుగుతారు. వంద సంవత్సరాల పాటు వారి పరిపలన సాగుతుంది. ఆ పిమ్మట కార్ముకుడు మొదలయిన రాజులు తొమ్మండుగురు పుడతారు. వారికి నవనందు లని వ్యవహారము. ఆ నవనందులకు ఒక అవనీసుర శ్రేష్టుడు అంతరింపజేస్తాడు. నందులు లేకపోవడంచేత కొంతకాలంపాటు మౌర్యులు పరిపాలన చేస్తారు. |
869#12 | భాగవతం - పన్నెండవ స్కంధము | ఆ పిమ్మట గురుండులు పదముగ్గురు, మౌనులు పదకొండుమంది గర్వంతో కన్నూ మిన్నూ కానకుండా పందొమ్మిదివందల తొమ్మిది సంవత్సరాలు పరిపాలన సాగిస్తారు. ఆ పిమ్మట మౌనవంశంలో పుట్టిన పదకొండుమంది మూడు వందల సంవత్సరాల పాటు మత్సరగ్రస్తులై పరిపాలన సాగిస్తారు. అదే సమయంలో కైలికిలులు అనే యవనులు అవనీపాలకులవుతారు. ఆ తరువాత భూతనందుడు, నవభంగిరుడు, శిశునందుడు, అతని తమ్ముడయిన యశోనందుడు, ప్రవీరకుడు అనేవారు వీరులై నూటారు సంవత్సరాలు పాలకు లవుతారు. ఆ రాజులకు పదముగ్గురు కొడుకులు పుడతారు. వారిలో ఆరుగురు బాహ్లికదేశానికి అధిపతులవుతారు. మిగిలిన యేడుగురు కోసలదేశానికి అధిపతులవుతారు. |
871#0 | నరసింహావతారము | శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు (Nrisimha, Narasimha, Narahari incarnation)- ఇవన్నీ శ్రీమహావిష్ణువు నాల్గవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. |
875#2 | శ్రీ కృష్ణుడు | శ్రీమహా విష్ణువు తన సృష్టి లోని జీవులకు బాధలు హెచ్చినప్పుడు, లోకంలో పాపం హద్దు మీరినప్పుడు, దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. ఈవిధంగా అవతరించడాన్నిలీలావతారం అంటారు. ఇలాంటి లీలావతారాలు, భాగవతం ప్రకారం, భగవంతునికి ఇరువయ్ి రెండు (22) ఉన్నాయి. శ్రీమహావిష్ణువు లీలావతారాలలో ఇరువదవ అవతారం శ్రీకృష్ణావతారం. ఈ లీలావతారాలు ఇరవైరెండింటి లోనూ ముఖ్యమైనవి పది ఉన్నాయి. ఈ పదింటిని దశావతారాలు అంటారు. దశావతారాలలో శ్రీకృష్ణావతారం కొన్నిచోట్ల చెప్పబడుతుంది. కొన్నిచోట్ల చెప్పారు. ("రామోరామశ్చరామశ్చ"). యుగాలలో రెండవదయిన త్రేతాయుగంలో శ్రీరాముని లోక కళ్యాణ కారకునిగ రావణాది రాక్షస శిక్షకుడిగ కీర్తించబడుతున్నాడు. నారాయణుడు ఆ తర్వాతదయిన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణావతారంగ కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి, కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు. |
875#4 | శ్రీ కృష్ణుడు | విష్ణు సహస్రనామ స్తోత్రంలో "కృష్ణ" అనే నామం రెండు సార్లు వస్తుంది (1) అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః (2) వేధాః స్వాంగో జితః కృష్ణో దృఢః సంకర్షణోచ్యుతః - ఈ రెండు సందర్భాలలోను వివిధ వ్యాఖ్యానకర్తలు వివిధ భావాలను తెలిపారు. అవి క్లుప్తంగా క్రింద ఇవ్వబడినాయి* |
875#8 | శ్రీ కృష్ణుడు | వివిధ గ్రంథాలలో శ్రీకృష్ణుని జీవిత వృత్తాంతం ఉంది. వాటిలో భాగవతంలో ఉన్న కథాక్రమం ప్రజలకు సుపరిచితమైనది. ఇందులో నవమ స్కంధములో వసుదేవుని వంశక్రమం ఉంది. తరువాతదశమ స్కంధము, ఏకాదశ స్కంధములలో కృష్ణుని జీవిత వృత్తాంతము ఉంది. సంభాషణలో శ్రీకృష్ణుని లాక్షాగృహదహనానంతరం కృష పరవేశం అవుతుంది. అక్కడినుండి కురుక్షేత్ర సంగ్రామం చివరి వరకు కృష్ణుని కథ పాండవుల కథకు సమాంతరంగా నడుస్తుంది. మహాభారతం చివరిలో కృష్ణుని నిర్యాణం ఉంది. భాగవతం కథారంభంలోనే కృష్ణుని నిర్యాణం చెప్పబడింది. వీటిలోనుండి సంగ్రహింపబడిన కృష్ణుని కథ క్రింద ఇవ్వబడింది. |
875#10 | శ్రీ కృష్ణుడు | మధురా నగరాన్ని యాదవ క్షత్రియ వంశంకి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. కంసుడు దేవకిని, వసుదేవుడిని, ఆడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు. దేవకీ దేవి ఏడవ మారు గర్భం ధరించి నప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశ పెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భ స్రావం అయిందని అనుకొంటారు. కొన్ని రోజులకు దేవకీ దేవి ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది. లక్ష్మీనాథుడు దేవకి గర్భములో ఉండడం చూసి దేవతలు, యక్ష, కిన్నర,కింపురుషులు దేవకీ దేవి ఉన్న చెరసాలకు వచ్చి స్తుతిస్తారు. |
875#11 | శ్రీ కృష్ణుడు | దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణీ నక్షత్ర యుక్తమైనప్పుడు జన్మిస్తాడు. కృష్ణుడు జన్మించాక వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్ళలో పెట్టుకొని, చెరసాల బయట నిద్ర పోతూ ఉన్న కావలి వాళ్ళను తప్పించుకొని, యమునా నది వైపు బయలు దేరుతాడు. యమునానది రెండుగా చీలి పోతుంది. నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుడిని విడిచి ఆ శిశువును తీసుకొని తిరిగి చెరసాలకు వస్తాడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. కంసుడు ఆ శిశువును తీసుకొని చంపడానికి పైకి విసరగా ఆ శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర గదా శారంగాలతో ఆకాశం లోకి లేచి పోయి తాను యోగ మాయ నని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయం అవుతుంది. దేవకీవసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు వ్రేపల్లె లోని యశోదాదేవి ఒడిని చేరి, అక్కడే పెరిగాడు. |
875#12 | శ్రీ కృష్ణుడు | మధురానగరంలో కంసుని చెరసాలలో జన్మించిన కృష్ణుడు పుట్టగానే తన తండ్రి వసుదేవునిచే వ్రేపల్లె లోని నందుని ఇంట చేరి యశోదాదేవి ముద్దు బిడ్డగా బాల్య జీవితము గడిపాడు. పాలుత్రాగే ప్రాయంలో తనను చంపటానికి కంసునిచే పంపబడిన పూతనను, బుడిబుడి నడకల ప్రాయంలో శకటాసురాదులను సంహరించాడు. చిరు ప్రాయంలో యశోదకు తననోటిలో అండ పిండ బ్రహ్మాండాదులను చూపి యశోదను ఆనందాశ్చర్యచకితురాలిని చేశాడు. దోగాడే వయసులో యశోదచే నడుముకి కట్టబడిన రోలుతో రెండు మద్ది చెట్లను కూల్చి మద్దిచెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాపవిమోచనం గావించాడు. |
875#16 | శ్రీ కృష్ణుడు | దేవకీ వసుదేవులు కృష్ణుని తల్లిదండ్రులు. అన్న బలరాముడు. చెల్లి సుభద్ర. కాని బాల్యంలో కృష్ణబలరాములు యశోదా నందులవద్ద వ్రేపల్లెలో పెరిగారు. కృష్ణుని తమ్ముడు సాత్యకి.
శ్రీకృష్ణుడు అష్టభార్యలను వివాహమాడాడు. విదర్భ రాజైన భీష్మకుని పుత్రిక రుక్మిణి కృష్ణుని ప్రేమించింది. కానీ ఆమె సోదరుడు రుక్మి అతడిని ద్వేషించి ఆమెను శిశుపాలునికిచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయించాడు. రుక్మిణి పంపిన రహస్య సందేశం గ్రహించి కృష్ణుడు ఆమె అభీష్టం మేరకు రాక్షస పద్ధతిలో అపహరించి వివాహం చేసుకుంటాడు. సత్రాజిత్తు కుమార్తె సత్యభామ. కృష్ణుడు శమంతకమణిని తనకిమ్మని కోరగా అతడు అంగీకరించలేదు. ఒకసారి సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహము అతనిని చంపి, మణిని హరించింది. జాంబవంతుడు ఆ సింహమును చంపి మణిని తన కుమార్తె జాంబవతి కిచ్చాడు. మణి కొరకై ప్రసేనుడిని కృష్ణుడే హతమార్చెనన్న అపవాదు వ్యాపించింది. కృష్ణుడు మణిని అన్వేషిస్తు పోయి పోయి జాంబవంతుని గుహలో ఉన్న మణిని తీసుకున్నాడు. జాంబవంతునికీ, కృష్ణునికీ జరిగిన యుద్ధంలో జాంబవంతుడు పరాజితుడైనాడు. శ్రీకృష్ణుని శ్రీరాముని అవతారంగా గుర్తించిన జాంబవంతుడు మణితో సహా కూతురు జాంబవతిని అతనికి సమర్పించాడు. మణిని తెచ్చి సత్రాజిత్తునకిచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు మణితోపాటు తన కుమార్తె సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం చేసెను. |
875#17 | శ్రీ కృష్ణుడు | కాళింది, భధ్ర, నాగ్నజితి, మిత్రవింద మరియు లక్షణ అతని ఇతర భార్యలు. భద్ర శ్రీకృష్ణుని తండ్రియగు వసుదేవుని చెల్లెలైన శ్రుతకీర్తి పుత్రిక. మిత్రవింద కూడా అవంతీ రాజు పుత్రిక, మేనత్త కూతురు. ఆమెను స్వయంవరంలో వరించి కృష్ణుడు చేపట్టాడు. కోసల దేశాధిపతి నగ్నజిత్తుకు ఏనుగుల వంటి బలం కలిగిన ఏడు వృషభాలు ఉండేవి. వాటిని నిగ్రహించిన వానికి తన కుమార్తె నాగ్నజితిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. కృష్ణుడు ఏడు రూపాలు దాల్చి ఏడు ఎద్దులను బంధించాడు. రాజు పుత్రికనిచ్చి పరిణయం చేశాడు. లక్షణ మద్ర దేశాధిపతి కూతురు. స్వయంవరంలో శ్రీకృష్ణుని వరించింది. ఈ విధంగా కృష్ణుని ఎనమండుగురు భార్యలు అష్టమహిషులుగా విలసిల్లారు. |
875#19 | శ్రీ కృష్ణుడు | శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు. రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు. సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు. జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.నాగ్నజితి, కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు. కృష్ణుడికి కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు. లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది. మిత్రవింద, కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు. కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు. చాలామంది అపోహపడుతున్నట్టుగా శ్రీకృష్ణుడికి 16వేలమంది (కొన్ని గ్రంథాలలో 16100 అని ఉన్నది) భార్యలతో శారీరక బంధము కలిగియుండలేదు. 16వేల గోపికా స్త్రీలను నరకాసురుని బారినుండి కాపాడి సంఘములో సముచిత స్థానము కల్పించాడు. "భర్త అనగా భరించువాడు" అను నానుడి ప్రకారము, మరియు ఒక పురుషుని పంచన చేరి, అతని నివాసమునందు నివసించు స్త్రీలకు అతడే భర్తగా నిర్ణయించే అప్పటి కాలమానస్థితిగతులనుబట్టి శ్రీకృష్ణునికి భార్యలుగా చెప్పబడ్డారు. కానీ పైన చెప్పబడిన అష్ఠ అష్టమహిషులతోనే శ్రీకృష్ణునికి సంతానము కలిగినది అని గ్రంథాలు ఉద్ఘాటిస్తున్నాయి. |
875#20 | శ్రీ కృష్ణుడు | లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకీ వసుదేవులకు జన్మింపదలిచాడు.
ఒకమారు పారిజాత పుష్పం కారణంగా కృష్ణుడు ఇంద్రునితో పోరి స్వర్గలోకంనుండి పారిజాతతరువును తెచ్చి సత్యభామకు ప్రీతికూర్చాడు. లోకాళను బాధిస్తున్న నరకాసురుని వధించి అతని కొడుకు భగదత్తునికి పట్టం కట్టాడు. నరకునిచే బంధింపబడిన రాజకన్యలను కృష్ణుడు పెండ్లాడి అందరిపట్ల తనమాయాప్రభావంతో సంసారం నెరపాడు. |
875#22 | శ్రీ కృష్ణుడు | మేనత్త కుమారులైన పాండుసుతులతో శ్రీ కృష్ణుని అనుబంధం మరువరానిది. పాండవ మద్యముడైన అర్జునునితో చెలిమి విడదీయరానిది. పాండవుల జీవితములో జరిగిన ప్రతి సంఘటనలో శ్రీకృష్ణుని పాత్ర ఉంది. శ్రీకృష్ణుని సంప్రదించకుండా ధర్మరాజు శకునితో ఆడిన జూదము తప్పమిగిలినవన్నీ శ్రీకృష్ణుని సలహా సంప్రదింపులతో జరిగినవే. కీలకమైన సమస్యలన్నీ కృష్ణుని సహాయంతో తీరినవే. ద్రౌపదిని శ్రీకృష్ణుడు స్వంత చెల్లెలికన్నామిన్నగా చూసుకున్నాడు. వస్ర్తాపహరణ అవమానమునుండి ఆమె శ్రీకృష్ణుని సహాయంతోనే బయటపడింది. పాండవవనవాస సమయంలో వారికి వచ్చిన అనేక సమస్యలకు శ్రీకృష్ణుని సలహాతో పరిష్కారం చేసుకున్నారు. వారి రాజ్యం మీదకు అనేకమార్లు దండెత్తిన జరాసంధుని భీముని సాయంతో తుదముట్టించి తన రాజ్యానికి శత్రు భయాన్ని తొలగించాడు. ద్వారక సముద్రగర్భంలో మునిగిపోతుందని ముందుగానే ఊహించి ద్వారక వాసులను అప్రమత్తంచేసి వారిని ఆపదనుండి రక్షించాడు. ఇంద్రప్రస్థంలో ధర్మరాజు చేసిన అశ్వమేధయాగ సమయంలో మేనత్తకి ఇచ్చిన మాటను పాలించి శిశుపాలుని నూరు తప్పులను సహించిన తరువాత అతనిని చక్రాయుధంతో వధించాడు.
పాండవుల వనవాసం తరువాత వారి తరఫున కురుసభలో రాయబారము చేశాడు. కురుక్షేత్రంలో యుద్ధసమయంలో అర్జునునికి గీతాభోధ చేసి అతనిని యుద్ధోన్ముఖుని చేశాడు. అర్జునునికి సారథియై యుద్ధం ముగిసేవరకూ పాండవులకు రక్షణగా ఉన్నాడు. అశ్వత్థామ అస్త్రంవల్ల ఉత్తర గర్భంలో పిండం కూడా మృత్యవును ఎదుర్కోగా కృష్ణుడు తన చక్రంతో ఆ గర్భస్థ శిశువును రక్షించాడు. ఆ శిశువే పరీక్షిత్తుగా జన్మించి పాండవుల అనంతరం రాజ్యానికి అధిపతి అయ్యాడు. |
881#14 | నిఘంటువు | ఆంధ్ర నిఘంటు రచనమున ఆధునికముగా అగ్రగణ్యస్థానమంద దగిన సూర్యరాయనిఘంటు రచనము 1920 సం.ప్రాంతమున చెన్నపురిలో ఆరంభమైనది. దీనికి శ్రీ పీఠికాపురాధీశులు అగు శ్రీ జయంతి రామయ్య పంతులు ఆశ్రయము. ఈ బృహన్నిఘంటువున అనేక తత్సమ శాబ్దములు పరిశీలనా పూర్వకముగా సంస్కృత నిఘంటువుల నుండి గైకొనబడినవి. వానికి సంస్కృత కావ్య నాటకాదుల నుండియు, ఆంధ్ర ప్రబంధములనుండియు నటనటనావశ్యకములని తోచిన చోటులను, అర్ధ విశేషములు గల చోటులను ప్రయోగములీయబడినవి. ప్రతిపదమునకును ప్రతి అర్ధమునకును ప్రామాణిక ప్రయోగములనో, నిఘంటువులనో, లేక శిష్టవ్యవహారమునో ఈనిఘంటువు చూపుచుండుటచే దీని కొక ప్రామాణికత ఇచ్చినట్లయినది. ఒక్కొక్క పదమునకు అర్ధమునకు ఒక్కొక్క పయోగమునేకాక పూర్వ పూర్వతర పూర్వతమ ప్రయోగములను ప్రధాన పదములక్రింద ఇచ్చి వాని అర్ధాంతరములను ప్రయోగ సహితముగా ఇందు వివరించిరి. శబ్దముల జన్య జనక సంబంధము కూడనిందు వివరింపబడింది.లోకవ్యవహారము నుండియు ప్రాచీన శిలాశాసనములనుండియు కొన్ని కొన్ని శబ్దములిందు గైకొనబడినవి. వానివానికి సముచితార్ధములు, అర్ధాంతరములు ఇందు పొందు పరచబడినవి.
లకంసాని చక్రధరరావు,ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ సంపాదకత్వంలో "తెలుగు వ్యుత్పత్తి కోశం " పేరుతో తెలుగు నుండి తెలుగు నిఘంటువు 1,08,330 పదాలతో 8 సంపుటాలుగా వెలువడినది. |
1119#0 | గోదావరి | గోదావరి నది భారత దేశములో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజామాబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి బంగాళా ఖాతములో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీర్లు . ఈ నది ఒడ్డున చాలా ప్రఖ్యాత పుణ్యక్షేత్రములు మరియు పట్టణములు ఉన్నాయి. భద్రాచలము, రాజమండ్రి వంటివి కొన్ని. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి (గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అది గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ మరియు కశ్యప. ఇందులో, గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహిని లు. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి. |
1119#1 | గోదావరి | పూర్వము బలి చక్రవర్తిని శిక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి మూడడుగుల స్థలం కావాలని అడుగగా బలి చక్రవర్తి మూడడుగులు ధారపోసాడు. మహావిష్ణువు ఒక అడుగు భూమి పైన, రెండో అడుగు ఆకాశం పైన, మూడో అడుగు బలి తలపై పెట్టి పాతాళం లోకి త్రొక్కి వేస్తాడు. భూమండలం కనిపించకుండా ఒక పాదం మాత్రమే కనిపించడంతో చతుర్ముఖ బ్రహ్మ కమండలం లోని నీటిలో సమస్త తీర్థాలను ఆవాహన చేసి ఆ ఉదకంతో శ్రీ మహావిష్ణువు పాదాలను అభిషేకించి, మహావిష్ణువును శాంతింపజేస్తాడు. అందువల్లనే గంగను విష్ణుపాదోద్భవి గంగా అని పిలుస్తారు. అలా పడిన గంగ పరవళ్ళు త్రొక్కుతుంటే శివుడు తన జటాజూటంలో బంధిస్తాడు. పరమశివుడిని మెప్పించి భగీరథుడు తన పితామహులకు సద్గతులను కలగజేయడానికి గంగను, గోహత్యాపాతకనివృత్తి కోసం గౌతమ మహర్షి గోదావరిని భూమికి తీసుకొని వస్తారు.
ఒకానొకప్పుడు దేశంలో క్షామం ఏర్పడి కరువుతో తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు, వారి శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆ ఋషులు తమకు లేని తపోశక్తులు గౌతమునికి ఉన్నాయని ఈర్ష్యతో ఒక మాయ గోవును పంపి గౌతముడి పాడిపంటలు నాశనం చేయించారు. గౌతముడు ఒక దర్భతో ఆ గోవును అదలించగా అది మరణించింది. గౌతముడు తాను చేసిన గోహత్యాపాతకం నివృత్తి కోసం శివుడిని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడు ఆ గంగయే గోదావరి లేదా గౌతమీ నది. ఈ నదిని ఆ చనిపోయిన గోవు మీద నుండి ప్రవహింపజేసి తన గోహత్యాపాతకాన్ని విముక్తి చేసుకొన్నాడు. ఆ గోవుకి స్వర్గప్రాప్తి కలిగింది. ఆ స్థలమే గోష్పాద క్షేత్రం. ఈ క్షేత్రమే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణం. |
1119#4 | గోదావరి | గోదావరి నది యొక్క పరీవాహక ప్రాంతము 3,13,000 చదరపు కిలోమీటర్ల మేర మహారాష్ట్ర, తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ మరియు ఒడిషా రాష్ట్రాలలో వ్యాపించి ఉంది. ఈ నది యొక్క ప్రధాన ఉపనదులు:తెలుగులో తొలి కావ్యరచన కాలం నుండి గోదావరి ప్రాంతంలో అనేకమంది కవులు చాలా కావ్యాలను రచించారు. వీరిలో ఎక్కువమంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు. ప్రాచీనకాలం నుండి 1980 ప్రాంతం వరకు గోదావరి ప్రాంతంలో వెలసిన కవులీ వ్యాసంలో పేర్కొన్నారు: |
1120#0 | త్రేతాయుగము | వేదాల ననుసరించి యుగాలు నాలుగు,
నాలుగు యుగాలలో రెండవది త్రేతా యుగము. ఈ యుగములో భగవంతుడు శ్రీ రామ చంద్రుడుగా అవతరించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగము పరిమితి 4,32,000 * 3 = 12,96,000 అనగా పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరములు. ఇందు ధర్మము మూడు పాదములపై నడుస్తుంది.
వైశాఖ శుద్ధ తదియ రోజునుండి త్రేతాయుగము ప్రారంభమైనది. |
1123#0 | సత్యయుగము | వేదాల ననుసరించి యుగాలు నాలుగు :
అందు సత్య యుగము మొదటిది. సత్యయుగానికే కృతయుగమని పేరు. ఇందు భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. అకాలమరణాలుండవు. |
1125#0 | ద్వాపరయుగము | వేదలననుసరించి యుగాలు నాలుగు,
అందు ద్వాపర యుగము మూడవది, ఇందు భగవంతుడు శ్రీ కృష్ణుడుగా అవతరించారు. దీని కాల పరిమాణము 432000 * 2 = 864000అనగా ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు. చివరి ద్వాపర యుగము ముగిసి సుమారుగా ఐదు వేల సంవత్సరములు అయినది. ఇందు ధర్మము రెండు పాదముల పై నడుస్తుంది. |
1126#0 | కలియుగము | కలి యుగము (దేవనాగరి: कली युग) హిందూ పురాణాలననుసరించి మహాయుగములోని చివరి మరియు నాలుగవ యుగము. ఇది ప్రస్తుతము నడుస్తున్న యుగము. వేదాల ననుసరించి యుగాలు నాలుగు,
కలి యుగము యొక్క కాల పరిమాణము 4,32,000 సంవత్సరములు, అందు సుమారుగా ఐదు వేల సంవత్సరములు గడిచిపోయినాయి. హిందూ మరియు బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంధమైన సూర్య సిద్ధాంత ప్రకారము క్రీ.పూ 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి (00:00) కలియుగము ప్రారంభమైనది. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారమును చాలించాడని హిందువులు భావిస్తారు. కలియుగాంతము నందు కల్కి రూపమున భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గము సుగమము చేస్తారు .
కలియుగంలో అంతా అధర్మమే. అంతా అన్యాయమే. మంచి వాళ్ళకు చెడు ఎదురవుతూ ఉంటుంది. అసలు భగవంతుడిని తలచుకొనే వారే కనిపించరు. సంసారంలో భార్యాపుత్రులు, ధనధాన్యాలు లాంటి వన్నీ సులభంగా సమకూరతాయి. |
1133#6 | సినిమా | ఎడిసన్ లాబొరేటరీస్‌లో పనిచేసే లారీ డిక్సన్ అనే వ్యక్తి ప్రప్రథమంగా వరుసక్రమంలో చిత్రాలుండే "సెల్యులాయిడ్ ఫిలిమ్"ను తయారు చేశాడు. తరువాత 1894లో థామస్ ఎడిసన్ "కైనెటో గ్రాఫ్" (కెమెరా), "కైనెటోస్కోప్" (ప్రొజెక్టర్) అనే రెండు పరికరాలను ఆవిష్కరించాడు. ప్రేక్షకులు ఒక చూపుడు గొట్టం (eye piece) ద్వారా అద్దంపై ప్రతిబింబించబడిన "కదిలే బొమ్మ"ను చూడడం సాధ్యమయ్యింది. "కైనెటోస్కోప్ పార్లర్లు" అమెరికాలోను, యూరోప్‌లోను విస్తరించాయి.
అదే సమయంలో యూరోప్‌లో క్రొత్త కెమేరాలు, మరొకొన్ని పరికరాలు కనుగొన్నారు. బ్రిట్‌పాల్ అనే పరిశోధకుడు 1895లో యూరోప్‌లో ఒక "ఫిల్మ్ ప్రొజెక్టరు" పరికరాన్ని తయారు చేశాడు. ఫ్రాన్స్‌లో లూమిరె సోదరులు (ఆగస్టు లూమిరె, లూయిస్ లూమిరె) 1895లో ఒక సూట్‌కేసు సైజులో ఉన్న సినిమాటోగ్రాఫ్ పరికరాన్ని తయారు చేశారు. ఇందులో కెమెరా, ఫిల్మ్ డెవెలప్‌మెంట్, ప్రొజెక్టర్ పనులన్నీ కలిపి చేయడం సాధ్యమయ్యింది. వారు తిరణాలవంటి జనసందోహాలలో ప్రజలవద్ద డబ్బులు తీసుకొని తమ కదిలే చిత్రాలను ప్రదర్శించడం ప్రారంభించారు. ఆధునిక సినిమాకు ఇదే నాంది అనవచ్చును. ఇతరులు కూడా ఇదే విధానాన్ని కొద్దిమార్పులతో (సాంకేతికంగానూ, వ్యాపారపరంగానూ) అనుకరించారు. |
1133#8 | సినిమా | మొదట 1900 సంవత్సరంలో పారిస్‌లో చిత్రాలతో ధ్వని ప్రక్రియ కనుగొన్నారు. 1906లో లండన్‌లో యూజీన్ లాస్టే ఫిలిమ్‌తో ధ్వని విధానానికి పేటెంట్ పొందాడు. 1910లో ఇది ప్రయోగాత్మకంగా "J'entends très bien maintenant" అనే మాటలతో ధ్వనించింది. 1922లో బెర్లిన్‌లో ప్రేక్షకులముందు ధ్వనితో కూడిన చిత్రాన్ని ప్రదర్శించారు. 1923 నుండి న్యూయార్క్‌లో ప్రేక్షకులు డబ్బులిచ్చి "టాకీ" (శబ్ద చిత్రం)ను చూడడం ప్రారంభించారు. 1926లో వార్నర్ బ్రదర్స్ వారు "వైటాఫోన్" అనే సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. 1927లో వారి "The Jazz Singer" చిత్రం కొంత మూగ గానూ, కొంత మాటలు, పాటలు కలిపి విజయవంతంగా ప్రదర్శింపబడింది. 1928లో "The Lights of New York" అనే పూర్తి ధ్వనితో కూడిన చిత్రం వచ్చింది. ఆ తరువాత అంతా టాకీల యుగమే. |
1142#0 | శ్రీశైలం | శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి. |
1142#2 | శ్రీశైలం | శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది,అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది, మరియు దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది.
శ్రీశైలం చరిత్రకు ఆధారాలుగా ఉన్న శాసనాల్లో మొదటిది క్రీ.శ.6వ శతాబ్ది నాటిది. ఆరవ శతాబ్ది నాటి మైసూరులోని కదంబరాజుల తాల్గుండి శాసనంలో మొదటిసారి శ్రీశైలం పేరు కనిపిస్తోంది.
తెలుగు, తమిళ, కన్నడ గ్రంథాల్లో దీని ప్రశంస విస్తారంగా కనిపిస్తోంది. క్రీ.శ.6, 7 శాతాబ్దాల నాటి తమిళ శైవ గ్రంతం తేవరంలో అస్పర్, సుందర్, నమ్మందర్ అనే పేర్లున్న భక్తకవులు శ్రీశైలాన్ని గురించి గానం చేశారు. తిరుప్పాపురం (శ్రీపర్వతం) అని పేర్కొన్నారు. క్రీ.శ.14వ శతాబ్దం నాటి శైవకవియైన పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రములో "కరమొప్పు దక్షిణ కైలాసము" అంటూ శ్రీశైలాన్ని కీర్తించారు. తెలుగు సాహిత్యంలో తొలి యాత్రాచరిత్రగా పేరొందిన కాశీయాత్ర చరిత్రలో శ్రీశైలం 1830ల నాడు ఎలా ఉందన్న వివరాలు దొరుకుతున్నాయి. 1830లో చెన్నపట్టణం నుంచి కాశీకి యాత్రగా వెళ్ళిన గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య ఆ ఏడాది జూన్ 16 నాటికి శ్రీశైలం చేరుకున్నారు. ఆయన వ్రాసిన దాని ప్రకారం 1830ల్లో ఈ ప్రాంతం కందనూరు నవాబు అధీనంలో ఉండేది. శ్రీశైలం కొండమీద వాసయోగ్యమైన పరిస్థితులు లేకపోవడమూ, క్రూరమృగాల భీతి ఉండడంతో ఈ ఆలయాల అర్చకులు, కందనూరు నవాబు తరఫున యాత్రికుల నుంచి హాశ్శీలు తీసుకునే ముసద్దీలు ఆత్మకూరు పట్టణంలో కాపురం ఉండేవారు. ఉత్సవాలకు వచ్చే సాధారణ భక్తులకు ఒక్కొక్కరికీ రూ.7, గుర్రానికి రూ.5, అభిషేకానికి రూ.3, వాహనోత్సవం చేయిస్తే ఉత్సవపు సెలవులు కాక రూ.43, దర్పణసేవోత్సవానికి రూ.3 ప్రకారం నవాబుకు చెల్లించాల్సివచ్చేది. శ్రీశైలానికి వెళ్ళే నాలుగు బాటల్లో ఆత్మకూరు బాట తప్ప మిగిలిన దారులు ఉత్సవాలు కాని సామాన్యమైన రోజుల్లో వెళ్లేందుకు వీలే లేని స్థితిలో ఉండేవి. చెంచువాళ్ళ భయం, అడవి జంతువుల భయం విస్తరించివుండేది. చెంచువాళ్ళు ఆటవికులైనా అప్పట్లో చాలామంది దారినపోయే యాత్రికులను యాచించి తినే అలవాటు పడ్డారని వ్రాసుకున్నారు. ప్రతిరోజూ పల్లకీసేవ జరిగేది. చైత్రమాసంలో భ్రమరాంబ అమ్మవారికి తామసపూజలు జరిగేవి. అర్చకులు ఒకరొకరు మార్చి మార్చి డ్యూటీలు చేసుకునేవారని ఉంది. |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.