chapter
int64
1
18
verse
int64
1
78
sloka
stringlengths
77
449
w2w_meaning
stringlengths
213
1.29k
te_translation
stringlengths
127
741
commentry
stringlengths
0
11.1k
audio
stringlengths
59
63
1
1
ధృతరాష్ట్ర ఉవాచ । ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః । మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ।। 1 ।।
ధృతరాష్ట్ర ఉవాచ — ధృతరాష్ట్రుడు పలికెను; ధర్మ-క్షేత్రే — ధర్మ భూమి; కురు-క్షేత్రే — కురుక్షేత్రం వద్ద; సమవేతాః — చేరియున్న; యుయుత్సవః — యుద్ధ కాంక్షతో; మామకాః — నా పుత్రులు; పాండవా — పాండు పుత్రులు; చ — మరియు; ఏవ — నిజముగా; కిం — ఏమి; అకుర్వత — చేసినారు; సంజయ — ఓ సంజయా.
BG 1.1: ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి, మరియు యుద్ధ కాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండు పుత్రులు ఏమి చేసిరి?
ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతోనే గుడ్డి వాడే కాక ఆధ్యాత్మిక జ్ఞానం కూడా లోపించిన వాడు. తన పుత్ర వ్యామోహమే అతడిని ధర్మపథం నుండి తప్పించి, న్యాయపరంగా పాండవులకు చెందిన రాజ్యాన్ని లాక్కునేటట్లు చేసింది. ఆయనకు తన తమ్ముని కుమారులే అయిన పాండు పుత్రులకు తను చేసిన అన్యాయం తెలుసు. తన అంతఃకరణలో తప్పు చేసిన భావన, అతడు యుద్ధం యొక్క ఫ...
https://www.holy-bhagava…udio/001_001.mp3
1
2
సంజయ ఉవాచ । దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా । ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ।। 2 ।।
సంజయ ఉవాచ — సంజయుడు పలికెను; దృష్ట్వా — గమనించిన పిదప; తు — కానీ; పాండవ-అనీకం — పాండవ సైన్యమును; వ్యూఢం — సైనిక వ్యూహ రచనతో నిలిచి యున్న; దుర్యోధనః — రాజైన దుర్యోధనుడు; తదా — అప్పుడు; ఆచార్యం — గురువు గారు; ఉపసంగమ్య — సమీపించి; రాజా — రాజు; వచనం — మాటలను; అబ్రవీత్ — పలికెను.
BG 1.2: సంజయుడు పలికెను: సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి, ఈ విధంగా పలికెను.
తన పుత్రులు ఎలాగైనా యుద్ధం మొదలు పెడతారనే ధ్రువీకరణ కోసం ధృతరాష్ట్రుడు ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రశ్న వెనకున్న ధృతరాష్ట్రుని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న సంజయుడు, ఖచ్చితంగా యుద్ధం జరగబోతోందని, పాండవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా సైనిక నిర్మాణంతో ఉందని చెప్పాడు. అంతేకాక దుర్యోధనుడు ఏమి చేస్తున్నాడనే దిశగా, సంభాషణ విషయాన్ని మర...
https://www.holy-bhagava…udio/001_002.mp3
1
3
పశ్యైతాం పాండుపుత్రాణామ్ ఆచార్య మహతీం చమూమ్ । వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ।। 3 ।।
పశ్య — చూడుము; ఏతాం — ఈ యొక్క; పాండు-పుత్రాణామ్ — పాండురాజు పుత్రులు; ఆచార్య — గురువర్య; మహతీం — గొప్పదైన; చమూమ్ — సైన్యము; వ్యూఢాం — సైనిక వ్యూహాత్మకంగా నిలుపబడిన; ద్రుపద-పుత్రేణ — ద్రుపదుని పుత్రుడు ధృష్టద్యుమ్నుడు; తవ శిష్యేణ — మీ శిష్యుని చేత; ధీ-మతా — తెలివైనవాడు.
BG 1.3: దుర్యోధనుడు అన్నాడు: గౌరవనీయులైన గురువర్యా! ద్రుపదుని పుత్రుడైన, ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహా సైన్యాన్ని చూడుము.
తన అస్త్రవిద్యా గురువు ద్రోణాచార్యుడికి గతంలో ఆయన చేసిన తప్పుని, యుక్తితో ఎత్తి చూపాడు దుర్యోధనుడు. ద్రోణాచార్యుడికి గతంలో ద్రుపద మహారాజుతో రాజకీయ వైరం ఉండేది. వైరంతో ఆగ్రహం చెందిన ద్రుపదుడు, ఒక యజ్ఞం చేసి, ద్రోణాచార్యుడిని సంహరించగలిగే పుత్రుడు కలగాలనే వరం పొందాడు. ఆ వరం ఫలితంగా ద్రుపదునికి ధృష్టద్యుమ్నుడు పుట్టాడు. ...
https://www.holy-bhagava…udio/001_003.mp3
1
4
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి । యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ।। 4 ।। ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ । పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ।। 5 ।। యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ । సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ।। 6 ।।
అత్ర — ఇక్కడ; శూరాః — శక్తివంతమైన యోధులు; మహా-ఇశు-ఆసాః — గొప్ప ధనుర్ధారులు; భీమ-అర్జున-సమాః — భీముడు-అర్జునుడులతో సమానమైన; యుధి — యుద్ధ విద్యలో; యుయుధానః — యుయుధానుడు; విరాటః — విరాటుడు; చ — మరియు; ద్రుపదః — ద్రుపదుడు; చ — మరియు; మహా-రథః — పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు; ధృష్టకేతు — ధృష్టకేతుడు...
BG 1.4-6: వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి - యుయుధానుడు, విరాటుడు, మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన ధృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు...
రాబోయే పెను విపత్తు భయానికి, దుర్యోధనుడికి, పాండవులు సమీకరించిన సైన్యం, ఉన్న దాని కన్నా చాలా ఎక్కువగా అనిపిస్తోంది. తన ఆందోళనని వ్యక్తం చేస్తూ, పాండవుల పక్షంలోనున్న మహారథులను (పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న ఒక్కో యోధులు) చూపాడు. పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వీరందరూ భీమ...
https://www.holy-bhagava…/001_004-006.mp3
1
5

6

7
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ । నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ।। 7 ।।
అస్మాకం — మన; తు — కానీ; విశిష్టాః — శ్రేష్ఠమైన వారు; యే — ఎవరు; తాన్ — వారిని; నిబోధ — తెలుసుకొనుము; ద్విజ-ఉత్తమ — బ్రాహ్మణ శ్రేష్ఠుడా; నాయకాః — నాయకులు; మమ — మన; సైన్యస్య — సైన్యానికి; సంజ్ఞా-అర్థం — ఎఱుక కొరకు; తాన్ — వారిని; బ్రవీమి — తెలుపుతున్నాను; తే — మీకు.
BG 1.7: ఓ బ్రాహ్మణోత్తమా, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము, వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎఱుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను.
దుర్యోధనుడు, కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడిని ద్విజోత్తమ (ద్విజులలో అంటే బ్రాహ్మణులలో ఉత్తముడైన వాడు) అని సంబోధించాడు. అతను ఉద్దేశపూర్వకంగా ఆ పదాన్ని వాడాడు. నిజానికి ద్రోణాచార్యుడు వృత్తి రీత్యా యోధుడు కాడు; సైనిక విద్యని నేర్పించే గురువు మాత్రమే. ఒక కపట నాయకుడి లాగా దుర్యోధనుడు, తన గురువుగారి విధేయతపట్లనే సిగ్గ...
https://www.holy-bhagava…udio/001_007.mp3
1
8
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః । అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ।। 8 ।।
భవాన్ — స్వయంగా మీరు; భీష్మః — భీష్ముడు; చ — మరియు; కర్ణః — కర్ణుడు; చ — మరియు; కృపః — కృపాచార్యుడు; చ — మరియు; సమితింజయః — యుద్ధంలో విజయుడు; అశ్వత్థామా — అశ్వత్థామ; వికర్ణ — వికర్ణుడు; చ — మరియు; సౌమదత్తిః — భూరిశ్రవుడు (సోమదత్తుని కుమారుడు); తథా — ఈ విధంగా; ఏవ — కూడా; చ — మరియు.
BG 1.8: మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు - వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే.
https://www.holy-bhagava…udio/001_008.mp3
1
9
అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః । నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ।। 9 ।।
అన్యే — ఇతరులు; చ — కూడా; బహవః — చాలామంది; శూరాః — వీర యోధులు; మత్-అర్థే — నా కోసం; త్యక్త-జీవితాః — ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు; నానా-శస్త్ర-ప్రహరణాః — అనేక ఆయుధములు కలిగినవారు; సర్వే — అందరూ; యుద్ధ-విశారదాః — యుద్దరంగంలో నిపుణులు.
BG 1.9: ఇంకా చాలా మంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్దంగా వున్నారు. వీరందరూ యుద్ధవిద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగిఉన్నారు.
https://www.holy-bhagava…udio/001_009.mp3
1
10
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్। పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం ।। 10 ।।
అపర్యాప్తం — అపరిమితమైన; తత్ — అది; అస్మాకం — మన యొక్క; బలం — బలము; భీష్మ — భీష్మ పితామహుడిచే; అభిరక్షితాం — సురక్షితంగా ఏర్పాటుచేయబడ్డ; పర్యాప్తం — పరిమితమైన; తు — కానీ; ఇదం — ఈ; ఏతేషాం — వారియొక్క; బలం — బలము; భీమ — భీముడు; అభిరక్షితాం — సావధానంగా రక్షింపబడుచున్న.
BG 1.10: మన సైనిక బలం అపరిమితమైనది, మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము, కానీ, భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటుచేయబడి రక్షింపబడుచున్న పాండవ సైన్యం, పరిమితమైనది.
దుర్యోధనుడి ప్రగల్భాలు సొంత గొప్పలు చెప్పుకునేవాడికి సాధారణమే. గొప్పలకు పోయేవారు, అంత్యకాలం సమీపించినప్పుడు, పరిస్థితిని నిజాయితీతో అంచనావేయకుండా అహంకారంతో ప్రగల్భాలు పలుకుతారు. భీష్ముడిచే రక్షింపబడుచున్న తనసైన్యం అపరిమితమైనది అన్నప్పుడే దుర్యోధనుడి దౌర్భాగ్యం తెలిసిపోతోంది. భీష్మపితామహుడు కౌరవ పక్షానికి సర్వసైన్యాధ...
https://www.holy-bhagava…udio/001_010.mp3
1
11
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః । భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి ।। 11 ।।
అయనేషు — వ్యూహాత్మక స్థానాల యందు; చ — మరియు; సర్వేషు — అన్నీ; యథా-భాగం — మీ మీ స్థానంలో; అవస్థితాః — నిలిచివుండి; భీష్మం — భీష్మ పితామహుడిని; ఏవ — మాత్రమే; అభిరక్షంతు — రక్షించండి; భవంతః — మీరు; సర్వే — అందరు; ఏవ హి — కూడా.
BG 1.11: కావున, కౌరవ సేనానాయకులందరికీ, మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను.
శత్రువులకు అసాధ్యుడైన భీష్ముడిని, తన సైన్యానికి స్ఫూర్తిగా, శక్తిగా పరిగణించాడు దుర్యోధనుడు. కాబట్టి, సేనావ్యూహంలో తమ తమ కీలక స్థానాలని కాపాడుకుంటూనే, భీష్ముడిని పరిరక్షించమని తన సేనా నాయకులని కోరాడు.
https://www.holy-bhagava…udio/001_011.mp3
1
12
తస్య సంజనయన్హర్షం కురువృద్ధః పితామహః । సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ।। 12 ।।
తస్య — అతనికి; సంజనయన్ — కలిగించుచు; హర్షం — సంతోషమును; కురు-వృద్ధః — కురు వంశములో వృద్ధుడు (భీష్ముడు); పితామహః — తాత గారు; సింహ-నాదం — సింహ గర్జన; వినద్య — శబ్దం చేసి; ఉచ్చైః — పెద్ద స్వరంతో; శంఖం — శంఖమును; దధ్మౌ — మ్రోగించెను; ప్రతాప-వాన్ — తేజోవంతమైన.
BG 1.12: అప్పుడు, కురువృద్ధుడు, మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు, సింహంలా గర్జించాడు, మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ, దుర్యోధనుడికి హర్షమును కలుగచేసెను.
భీష్మ పితామహుడు తన మనవడి హృదయంలో ఉన్న భయాన్ని అర్థం చేసుకున్నాడు, మరియు సహజంగా అతని మీద వున్న వాత్సల్యంతో, అతన్ని సంతోషపరచటానికి పెద్ద శబ్దంతో తన శంఖాన్ని పూరించాడు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే అవతలి పక్షంలో ఉండటంచే, దుర్యోధనుడి విజయానికి ఏమాత్రం అవకాశం లేదని తెలిసినా, తన ధర్మాన్ని నిర్వర్తిస్తానని మనవడికి తెలియచేసా...
https://www.holy-bhagava…udio/001_012.mp3
1
13
తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః । సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోఽభవత్ ।। 13 ।।
తతః — ఆ తరువాత; శంఖాః — శంఖములు; చ — మరియు; భేర్యః — భేరీలు; చ — మరియు; పణవ-ఆనక — డోళ్ళు మరియు ఢంకాలు; గో-ముఖాః — కొమ్ము వాద్యములు; సహసా — అకస్మాత్తుగా ఒక్కపెట్టున; ఏవ — నిజంగా; అభ్యహన్యంత — పెద్దగా మ్రోగినవి; సః — ఆ యొక్క; శబ్దః — శబ్దము; తుములః — భయానకముగా; అభవత్ — ఉండెను.
BG 1.13: ఆ తరువాత, శంఖములు, డోళ్ళు, ఢంకాలు, భేరీలు, మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి, మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెను.
యుద్ధానికి భీష్ముడి యొక్క గొప్ప ఉత్సాహాన్ని గమనించిన కౌరవ సైన్యం కూడా ఉత్సాహవంతులై రణగొణ ధ్వని చేసారు. పణవ అంటే ఢంకాలు, ఆనక అంటే డోళ్ళు/ఢంకాలు, మరియు గో-ముఖ అంటే కొమ్ము వాద్యములు. ఇవన్నీ వాద్య పరికరములే, మరియు వీటన్నిటీ ఒక్కుమ్మడి శబ్దం మిక్కిలి కోలాహలాన్ని కలుగచేసింది.
https://www.holy-bhagava…udio/001_013.mp3
1
14
తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ । మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ।। 14 ।।
తతః — ఆ తరువాత; శ్వేతైః — తెల్లని; హయైః — గుఱ్ఱములు; యుక్తే — కట్టబడిన; మహతి — శ్రేష్ఠమైన; స్యందనే — రథము; స్థితౌ — కూర్చొనిఉన్న; మాధవః — శ్రీ కృష్ణుడు, సౌభాగ్యదేవత అయిన లక్ష్మీదేవి భర్త; పాండవః — అర్జునుడు; చ — మరియు; ఏవ — కూడా; దివ్యౌ — దివ్యమయిన; శంఖౌ — శంఖములను; ప్రదధ్మతుః — పూరించారు.
BG 1.14: ఆ తరువాత, పాండవ సైన్యం మధ్యలోనుండి, తెల్లని గుఱ్ఱములు పూన్చి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న, మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు.
కౌరవ సైన్య పక్షం నుండి వచ్చిన ధ్వని సద్దుమణిగిన పిదప, శ్రీ కృష్ణ పరమాత్మ మరియు అర్జునుడు, అద్భుతమైన రథంలో కూర్చొని వుండి, భయరహితులై, తమ తమ శంఖములను శక్తివంతంగా పూరించారు. దీనితో పాండవ పక్షంలో కూడా యుద్ధానికి ఉత్సాహం రగిలింది. సంజయుడు శ్రీ కృష్ణుడికి 'మాధవ' అన్న పేరు వాడాడు. 'మా' అంటే, లక్ష్మీదేవిని సూచిస్తుంది; 'ధవ'...
https://www.holy-bhagava…udio/001_014.mp3
1
15
పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః । పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ।। 15 ।।
పాంచజన్యం — పాంచజన్యం అని పేరు గల శంఖము; హృషీక-ఈశః — శ్రీ కృష్ణుడు, మనస్సు, ఇంద్రియముల అధిపతి; దేవదత్తం — దేవదత్తం అని పేరు గల శంఖము; ధనంజయః — అర్జునుడు, ఐశ్వర్యమును జయించేవాడు; పౌండ్రం — పౌండ్రం అని పేరుగల శంఖము; దధ్మౌ — పూరించెను; మహా-శంఖం — ఒక బ్రహ్మాండమైన శంఖమును; భీమ-కర్మా — అత్యంత కష్టసాధ్యకార్యములను చేయునట్టి; వ...
BG 1.15: హృషీకేశుడు, పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు, మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించే వాడు, అత్యంత కష్టసాధ్యకార్యములను చేయునట్టి భీముడు, పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను.
శ్రీ కృష్ణుడికి వాడబడిన 'హృషీకేశః' అన్న పదం, ఆయన మనస్సు మరియు ఇంద్రియములకు అధిపతి అని సూచిస్తుంది. శ్రీ కృష్ణుడు తన యొక్క, మరియు అందరి యొక్క మనసు, ఇంద్రియములకు సర్వోన్నత అధిపతి. తన అద్భుతమైన లీలలను ఈ భూలోకంలో ప్రదర్శించేటప్పుడు కూడా తన మనస్సు, ఇంద్రియముల పై కృష్ణుడు, పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు.
https://www.holy-bhagava…udio/001_015.mp3
1
16
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః । నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ।। 16 ।। కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః । ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ।। 17 ।। ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే । సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ।। 18 ।।
అనంత-విజయం — అనంతవిజయం అని పేరు గల శంఖము; రాజా — రాజు; కుంతీ-పుత్రః — కుంతీ దేవి పుత్రుడు; యుధిష్ఠిరః — యుధిష్ఠిరుడు; నకులః — నకులుడు; సహదేవః — సహదేవుడు; చ — మరియు; సుఘోష-మణిపుష్పకౌ — సుఘోషము, మణిపుష్పకము అను పేర్లుగల శంఖములు; కాశ్యః — కాశీ రాజు; చ — మరియు; పరమ-ఇషు-ఆసః — శ్రేష్ఠమైన విలుకాడు; శిఖండీ — శిఖండి; చ — మరియు;...
BG 1.16-18: ఓ భూమండలాన్ని పాలించేవాడా! యుధిష్ఠిర మహారాజు అనంతవిజయాన్ని పూరించాడు, నకుల సహదేవులు, సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీ రాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, మరియు అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు, మరియు భుజబలము కలవాడు, స...
పాండవ అన్నదమ్ముల్లో యుధిష్ఠిరుడు పెద్దవాడు. ఇక్కడ ఆయన ‘రాజా’ అని సంబోధించబడుతున్నాడు; 'రాజసూయ యజ్ఞం' చేసి, ఇతర రాజులందరి ప్రశంసలు అందుకుని అతను ఆ బిరుదుని సంపాదించుకున్నాడు. రాజ మందిరంలో వున్నా, అరణ్యవాసంలో ఉన్నా అతనిలో రాజసం, విశాల-హృదయ స్వభావం ఉట్టిపడేవి. సంజయుడు ధృతరాష్ట్రుడిని 'పృథివీపతే' (భూగోళాన్ని పరిపాలించేవ...
https://www.holy-bhagava…/001_016-018.mp3
1
17

19
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ । నభశ్చ పృథివీం చైవ తుములోఽభ్యనునాదయన్ ।। 19 ।।
సః — అట్టి; ఘోషః — శబ్దము; ధార్తరాష్ట్రాణాం — ధృతరాష్ట్రుని పుత్రుల యొక్క; హృదయాని — గుండెలను; వ్యదారయత్ — బ్రద్దలు చేసెను; నభః — ఆకాశము; చ — మరియు; పృథివీం — భూమి; చ — మరియు; ఏవ — నిజముగా; తుములః — భీకరమైన శబ్దం; అభ్యనునాదయన్ — ప్రతిధ్వనింపచేయుచు.
BG 1.19: ఓ ధృతరాష్ట్రా, ఆ భీకరమైన శబ్దానికి భూమ్యాకాశములు దద్దరిల్లెను; అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను.
పాండవ సైన్యం పూరించిన శంఖనాద శబ్దం కౌరవ సైన్య గుండెలను బ్రద్దలుచేసింది. అయితే, కౌరవ సైన్యం తమ శంఖాలను పూరించినప్పుడు పాండవ సైన్యంపై అలాంటి ప్రభావం ఏమీ పడినట్లు చెప్పబడలేదు. పాండవులు భగవంతుని ఆశ్రయించి ఉండటం వలన వారికి తాము సంరక్షిపబడుతాము అన్న విశ్వాసం ఉంది. అటుపక్క, కౌరవులు, తమ స్వీయ బలం మీదనే ఆధారపడి మరియు మనఃసాక్షిల...
https://www.holy-bhagava…udio/001_019.mp3
1
20
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః । ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ।। 20 ।। హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే ।
అథ — అనంతరము; వ్యవస్థితాన్ — క్రమంగా నిలిచివున్న; దృష్ట్వా — చూసి; ధార్తరాష్ట్రాన్ — ధృతరాష్ట్రుని తనయులు; కపి-ధ్వజః — వానరమును (కోతి) జండాపై కలవాడు; ప్రవృత్తే — ప్రారంభించటానికి సిద్దంగా వున్న; శస్త్ర సంపాతే — ఆయుధములు వాడటానికి; ధనుః — ధనుస్సు (విల్లు) ను; ఉద్యమ్య — పైకెత్తి; పాండవః — అర్జునుడు, పాండు పుత్రుడు; హృషీక...
BG 1.20: ఆ సమయంలో, తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగివున్న పాండుపుత్రుడు అర్జునుడు, తన ధనుస్సుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచిఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు.
శక్తిశాలి అయిన హనుమంతుడు తన రథం (జెండా) మీద ఉన్నాడు కాబట్టి, అర్జునుడికి కపి ధ్వజుడు అన్న పేరు ఉంది. దీనికి ఒక పూర్వ వృత్తాంతం ఉంది. ఒకసారి అర్జునుడు విలు విద్యలో తనకున్న ప్రావీణ్యానికి గర్వపడి, శ్రీ రామచంద్రుని సమయంలో వానరములు భారతదేశం నుండి లంకకు సేతువు (బ్రిడ్జి)ని నిర్మించటానికి ఎందుకు అంత కష్టపడ్డారో తనకు అర్థ...
https://www.holy-bhagava…udio/001_020.mp3
1
21
అర్జున ఉవాచ । సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ।। 21 ।। యావదేతాన్ నిరీక్షేఽహం యోద్ధుకామానవస్థితాన్ । కైర్మయా సహ యోద్ధవ్యమ్ అస్మిన్ రణసముద్యమే ।। 22 ।।
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; సేనయోః — సైన్యములు; ఉభయోః — రెండు; మధ్యే — మధ్యలో; రథం — రథము; స్థాపయ — నిలిపిఉంచు; మే — నా యొక్క; అచ్యుత — శ్రీ కృష్ణా, సంపూర్ణ దోషరహితుడా; యావత్ — ఎంతవరకు అయితే; ఏతాన్ — ఈ యొక్క; నిరీక్షే — చూసి; అహం — నేను; యోద్ధు-కామాన్ — యుద్ధం కొరకు; అవస్థితాన్ — నిలిపిఉన్న; కైః — ఎవరితో; మయా — నా...
BG 1.21-22: అర్జునుడు ఇలా అన్నాడు: ఓ అచ్యుతా (శ్రీకృష్ణా), దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము. ఈ మహా పోరాటంలో, రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి.
సమస్త సృష్టికి పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడి భక్తుడు అర్జునుడు. అయినప్పటికీ, ఈ శ్లోకంలో, అర్జునుడు భగవంతుడిని తన రథాన్ని తాను కోరుకున్న చోటికి తీసుకెళ్లమన్నాడు. ఇది భగవంతునికి తన భక్తులతో ఉండే సంబంధం యొక్క మాధుర్యాన్ని తెలియచేస్తోంది. తన పట్ల భక్తుల ప్రేమకు ఋణపడి, భగవంతుడు వారికి దాసుడు అయిపోతాడు. అహం భక్త పరాధీనో హ్యస్వ...
https://www.holy-bhagava…/001_021-022.mp3
1
22

23
యోత్స్యమానానవేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః । ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః ।। 23 ।।
యోత్స్యమానాన్ — యుద్ధానికి వచ్చినవారు; అవేక్షే అహం — నాకు చూడాలని వుంది; యే — ఎవరు; ఏతే — వారు; అత్ర — ఇక్కడ; సమాగతాః — కూడిఉన్న; ధార్తరాష్ట్రస్య — ధృతరాష్ట్రుని పుత్రునికి; దుర్బుద్ధేః — దుర్భుద్ధి కలవాడు; యుద్ధే — యుద్ధంలో; ప్రియ-చికీర్షవ — సంతోషపెట్టడం కొరకు.
BG 1.23: దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రున్ని సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చియున్న అందరిని ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది.
పాపిష్టి-బుద్ధి వారైన ధృతరాష్ట్రుని తనయులు పాండవులకు చెందిన రాజ్యాన్ని అన్యాయంగా లాక్కున్నారు, కాబట్టి వారి పక్షంలో పోరాడే వారు కూడా సహజంగా దురుద్దేశంతో ఉన్నవారే. అర్జునుడు తను ఎవరితో యుద్ధం చేయాల్సి వుందో వారిని ఒకసారి చూడదలచాడు. ప్రారంభంలో అర్జునుడు పరాక్రమంతో యుద్ధానికి ఆతురతతో ఉన్నాడు. దుర్యోధనుడు ఎన్నోసార్లు పాండవ...
https://www.holy-bhagava…udio/001_023.mp3
1
24
సంజయ ఉవాచ । ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత । సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ।। 24 ।।
సంజయ ఉవాచ — సంజయుడు చెప్పెను; ఏవం — ఈ విధంగా; ఉక్తః — చెప్పబడిన; హృషీకేశః — శ్రీ కృష్ణుడు, ఇంద్రియములకు అధిపతి; గుడాకేశేన — అర్జునుడి చేత, నిద్రని జయించినవాడు; భారత — భరత వంశీయుడా; సేనయోః — సైన్యములు; ఉభయోః — రెండు; మధ్యే — మధ్యలో; స్థాపయిత్వా — నిలిపి; రథ-ఉత్తమమ్ — ఉత్తమమైన రథమును.
BG 1.24: సంజయుడు ఇలా అన్నాడు: ఓ ధృతరాష్ట్రా, ఈ విధంగా, నిద్రని జయించినవాడైన, అర్జునుడు కోరిన విధంగా, శ్రీ కృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను.
https://www.holy-bhagava…udio/001_024.mp3
1
25
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ । ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి ।। 25 ।।
భీష్మ — పితామహుడు భీష్ముడు; ద్రోణ — ద్రోణాచార్యుడు; ప్రముఖతః — సమక్షంలో; సర్వేషాం — అందరు; చ — మరియు; మహీ-క్షితాం — ఇతర రాజులు; ఉవాచ — పలికెను; పార్థ — అర్జునుడు, ప్రిథ తనయుడు; పశ్య — చూడుము; ఏతాన్ — ఈ యొక్క; సమవేతాన్ — చేరియున్న; కురూన్ — కురు వంశస్థులు; ఇతి — ఈ విధంగా.
BG 1.25: భీష్ముడు, ద్రోణాచార్యుడు, మరియు ఇతర రాజుల సమక్షంలో, శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు: ఓ పార్థా, ఇక్కడ కూడి ఉన్న కురు వంశస్థులను చూడుము.
కురు అన్న పదం కౌరవులకు, పాండవులకు ఇద్దరికీ వర్తిస్తుంది, వారు ఇరువురు కురు వంశానికి చెందిన వారే. శ్రీ కృష్ణుడు, ఉద్దేశపూర్వకంగా కావాలనే ఈ పదాన్ని వాడి, అర్జునుడిలో బంధుత్వ భావన తెప్పించి, వారందరూ ఒకటే అన్న భావన కలిగిస్తున్నాడు. బంధుత్వ భావన మమకారానికి దారి తీసి, అది అర్జునుడిని గందరగోళానికి గురిచేస్తే, రాబోయే కలికాలంలో...
https://www.holy-bhagava…udio/001_025.mp3
1
26
తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ । ఆచార్యాన్మాతులాన్భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా ।। 26 ।। శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి ।
తత్ర — అక్కడ; అపశ్యాత్ — చూసి; స్థితాన్ — నిలిచిఉన్న; పార్థః — అర్జునుడు; పితౄన్ — తండ్రులు (పినతండ్రులు, పెదతండ్రులు); అథ — తరువాత; పితామహాన్ — తాతలు; ఆచార్యాన్ — గురువులు; మాతులాన్ — మేనమామలు; భ్రాతౄన్ — సోదరులు; పుత్రాన్ — పుత్రులు; పౌత్రాన్ — మనుమలు; సఖీన్ — మిత్రులు; తథా — ఇంకా ; శ్వశురాన్ — మామలు; సుహృదః — శ్రేయో...
BG 1.26: అక్కడ, రెండు సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయాదులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మేనల్లుళ్లను, మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచెను.
https://www.holy-bhagava…udio/001_026.mp3
1
27
తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ ।। 27 ।। కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ ।
తాన్ — ఇవి; సమీక్ష్య — చూసిన పిదప; సః — వారు; కౌంతేయః — అర్జునుడు; కుంతీ పుత్రుడు; సర్వాన్ — అందరూ; బంధూన్ — బంధువులు; అవస్థితాన్ — ఉన్నటువంటి; కృపయా — కరుణతో; పరయా — మిక్కిలి; ఆవిష్టః — కూడినవాడై; విషీదన్ — మిక్కిలి విచారం; ఇదం — ఈ విధంగా; అబ్రవీత్ — పలికెను.
BG 1.27: అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతీ పుత్రుడు అర్జునుడు, కారుణ్య భావం ఉప్పొంగినవాడై, తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను.
తన బంధువులందరినీ కలిపి యుద్ధభూమిలో చూడటం వలన, ఈ యొక్క భ్రాతృహత్యాపూరిత యుద్ధ పరిణామాలు, అర్జునుడి మనస్సుకి మొదటిసారి స్పష్టమైనాయి. శత్రువులను మృత్యు ద్వారాలకు పంపించేయటానికి మానసికంగా సిద్ధమై మరియు పాండవులపై జరిగిన ఎన్నో అన్యాయాలకు ప్రతీకారేచ్ఛతో సమరానికి వచ్చిన పరాక్రమవంతుడైన అర్జునుడికి అకస్మాత్తుగా మనస్సు మారిపోయింద...
https://www.holy-bhagava…udio/001_027.mp3
1
28
అర్జున ఉవాచ । దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ।। 28 ।। సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ।
అర్జున ఉవాచ — అర్జునుడు అన్నాడు; దృష్ట్వా — చూసాక; ఇమమ్ — ఈ యొక్క; స్వ-జనం — బంధువులు (సొంతవారు); కృష్ణ — కృష్ణ; యుయుత్సుం — యుద్ధానికి ఉత్సాహంతో; సముపస్థితమ్ — చేరిఉన్న; సీదంతి — వణుకుతున్న; మమ — నా యొక్క; గాత్రాణి — అంగములు; ముఖం — నోరు; చ — మరియు; పరిశుష్యతి — ఎండిపోవుచున్నది.
BG 1.28: అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కృష్ణా, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి, నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోవుచున్నది.
వాత్సల్యం అనేది ప్రాకృతికమైనది అయివుండవచ్చు లేదా ఆధ్యాత్మికమైనది అయివుండవచ్చు. బంధువుల పట్ల అనురాగం అనేది మనము ఈ శరీరమే అన్న భావన వల్ల వచ్చే భౌతిక ఉద్వేగము. ఈ ప్రకారంగా, మనము ఈ శరీరమే అనుకున్నప్పుడు మన శారీరక బంధువుల పట్ల అనురాగం పెంచుకుంటాము. ఇలాంటి అనురాగము అజ్ఞానం వల్ల కలుగుతుంది మరియు ఇది మనిషిని మరింత భౌతికవాద స్ప...
https://www.holy-bhagava…udio/001_028.mp3
1
29
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ।। 29 ।। గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే । న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ।। 30 ।। నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ । న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ।। 31 ।।
వేపథుః — వణుకుచున్న; చ — మరియు; శరీరే — శరీరమునందు; మే — నా యొక్క; రోమ-హర్షః — వెంట్రుకలు నిక్కబోడుచుకొనుట; చ — మరియు; జాయతే — కలుగుచున్నది; గాండీవం — అర్జునుడి విల్లు; స్రంసతే — జారిపోవుతున్నది; హస్తాత్ — (నా) చేతి నుండి; త్వక్ — చర్మము; చ — మరియు; ఏవ — నిజముగా; పరిదహ్యతే — అంతటా మంటపుడుతున్నది; న చ శక్నోమి — సాధ్యము ...
BG 1.29-31: నా శరీరమంతా వణుకుచున్నది; నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. నా విల్లు, గాండీవం, చేజారిపోతున్నది, మరియు నా చర్మమంతా మండిపోవుచున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది; ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణా, కేశి రాక్షసుడను సంహరించినవాడా, అంతటా...
యుద్ధ పరిణామాల గురించి ఆలోచించేసరికి, అర్జునుడు కలతచెంది శోకానికి గురి అయ్యాడు. ఏ వింటి శబ్దానికి బలమైన శత్రువులే భీతి చెందారో, అదే గాండీవం అతని చేజారి పోతున్నది. యుద్ధం చేయటం పాపము అన్న ఆలోచనతో అతని తల తిరుగుతున్నది. ఈ యొక్క అస్థిరమైన మానసికస్థితిలో, చివరికి, ఘోరమైన వైఫల్యాలను మరియు రాబోయే పరిణామాలను సూచించే మూఢ నమ్...
https://www.holy-bhagava…/001_029-031.mp3
1
30

31

32
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ । కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ।। 32 ।। యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ । త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ।। 33 ।।
న కాంక్షే — నేను కోరుకోవటంలేదు; విజయం — గెలుపు; కృష్ణ — కృష్ణా; న చ రాజ్యం — రాజ్యము కూడా వద్దు; సుఖాని చ — సంతోషములు కూడా; కిం — ఏమిటి; నః — మనకు; రాజ్యేన — రాజ్యముతో; గోవింద — కృష్ణ, ఇంద్రియములకు సుఖము నిచ్చేవాడా, ఆవులంటే ఇష్టమైన వాడా; కిం — ఏమిటి; భోగైః — విలాసములు; జీవితేన — జీవితము; వా — లేదా; యేషామ్ అర్థే — ఎవరి ...
BG 1.32-33: ఓ కృష్ణా, నాకు విజయం కానీ, రాజ్యం కానీ, వాటివల్ల వచ్చే సుఖం కానీ అక్కరలేదు. మనం ఎవరికోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు, రాజ్యంతో కానీ, సుఖాల వలన కానీ, ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది?
చంపటం ఒక పాపపు పని అయితే, సొంత బంధువులనే హతమార్చటం మరింత పాపిష్టి పని అనే భావన వలన అర్జునుడు అయోమయానికి లోనయ్యాడు. రాజ్యం కోసం ఇంత క్రూరమైన పని చేసినా, ఆ గెలుపు అంతిమంగా సంతోషాన్ని ఇవ్వలేదు, అని అర్జునుడు అభిప్రాయపడ్డాడు. స్నేహితులతో బంధువులతో రాజ్య వైభవాన్ని పంచుకోలేడు, ఎందుకంటే ఆ గెలుపు కోసం వారినే సంహరించాలి. ఈ స...
https://www.holy-bhagava…/001_032-033.mp3
1
33

34
ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః । మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ।। 34 ।। ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోఽపి మధుసూదన । అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ।। 35 ।।
ఆచార్యాః — గురువులు; పితరః — తండ్రులు (పిన తండ్రులు, పెద తండ్రులు); పుత్రాః — కుమారులు; తథా — ఇంకా; ఏవ — వాస్తవంగా; చ — మరియు; పితామహాః — తాతలు; మాతులాః — మేనమామలు; శ్వశురాః — మామలు; పౌత్రాః — మనుమలు; శ్యాలాః — బావ-బావమరుదులు; సంబంధినాః — బంధువులు; తథా — కూడా; ఏతాన్ — వీరు; న హంతుమ్ ఇచ్ఛామి — చంపుటకు నాకు ఇష్టంలేదు; ఘ్...
BG 1.34-35: గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావ మరుదులు, ఇంకా ఇతర బంధువులు, వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ, ఇక్కడ చేరి వున్నారు. ఓ మధుసూదనా, నా మీద వారు దాడి చేసిననూ నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించిననూ, ఈ భూ-మండలమే కాదు, మ...
ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుడు అర్జునుని గురువులు; భీష్ముడు మరియు సోమదత్తుడు అతని పితామహులు; భూరిశ్రవుడు (సోమదత్తుని తనయుడు) వంటి వారు అతనికి తండ్రి వరుస; పురుజిత్తు, కుంతిభోజుడు, శల్యుడు, మరియు శకుని అతని మేనమామలు; ధృతరాష్ట్రుని వంద మంది కొడుకులు తన సోదరులు; లక్ష్మణుడు (దుర్యోధనుని తనయుడు) తన బిడ్డ వంటి వాడు. యుద్ధ...
https://www.holy-bhagava…/001_034-035.mp3
1
35

36
నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన । పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః ।। 36 ।। తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ । స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ।। 37 ।।
నిహత్య — చంపటంవలన; ధార్తరాష్ట్రాన్ — ధృతరాష్ట్ర తనయులను; నః – మన; కా — ఏమిటి? ప్రీతిః — సంతోషము; స్యాత్ — కలుగును; జనార్దన — శ్రీ కృష్ణా, అందరి జనులను పోషించేవాడా; పాపమ్ — పాపము; ఏవ — తప్పక; ఆశ్రయేత్ — ప్రాప్తిస్తుంది; అస్మాన్ — మనకు; హత్వా — చంపుట వలన; ఏతాన్ — వీరందరూ; ఆతతాయినః — దూకుడు గల దుష్టులను; తస్మాత్ — కాబట్టి...
BG 1.36-37: ఓ జనార్దనా, (సర్వ భూతముల సంరక్షకుడు, పోషకుడు అయినవాడా), ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము? వారు దుర్మార్గపు దురాక్రమణదారులయినా, వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు...
తన స్వజనులను సంహరించకూడదు అన్న అభిప్రాయాన్ని సమర్థించుకోవటానికి 'అయినా సరే' అని రెండు సార్లు ఇంతకు పూర్వ శ్లోకం లోనే అన్నా, అర్జునుడు మళ్ళీ ‘నేను వారిని సంహరించినా సరే, అలాంటి విజయం నుండి ఏమి సుఖం పొందుతాను?’ అని అంటున్నాడు. పోట్లాడటం, చంపటం చాలా మటుకు సందర్భాలలో పాపిష్టి పనే, అవి పశ్చాత్తాపాన్ని, అపరాధం చేసిన భావనన...
https://www.holy-bhagava…/001_036-037.mp3
1
37

38
యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః । కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ।। 38 ।। కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ । కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ।। 39 ।।
యది అపి — అయినా సరే; ఏతే — వారు; న పశ్యంతి — చూడలేకున్నా; లోభ — దురాశ; ఉపహత — కమ్ముకున్న; చేతసః — ఆలోచనలతో; కుల-క్షయ-కృతం — బంధువులను నాశనం చేయటంలో; దోషం — తప్పు; మిత్ర-ద్రోహే — స్నేహితులపై ద్రోహం చేయటం వలన; చ — మరియు; పాతకం — పాపము; కథం — ఎందుకు; న జ్ఞేయం — తెలుసుకోరాదు; అస్మాభిః — మనము; పాపాత్ — పాపము నుండి; అస్మాత్ ...
BG 1.38-39: వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి, బంధువులను సర్వనాశనం చేయటంలో గాని లేదా మిత్రులపై విశ్వాసఘాతుకత్వం చేయటంలో గానీ, వారు దోషం చూడటం లేదు. కానీ, ఓ జనార్దనా (కృష్ణా), మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము, ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు?
వృత్తి రీత్యా యోధుడే అయినా, అర్జునుడు అనవసరపు హింసని అసహ్యించుకొన్నాడు. మహాభారత యుద్ధం చివరిలో జరిగిన ఒక ఘట్టం అతని యొక్క ఈ గుణాన్ని వెల్లడిస్తుంది. వంద మంది కౌరవులు చంపబడ్డారు, కానీ దానికి ప్రతీకారంగా, ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ, రాత్రి వేళ పాండవ శిబిరం లోనికి చొరబడి ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను, వారు ని...
https://www.holy-bhagava…/001_038-039.mp3
1
39

40
కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః । ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోఽభిభవత్యుత ।। 40 ।।
కుల-క్షయే — వంశ నాశనము వలన; ప్రణశ్యంతి — నశించిపోవును; కుల-ధర్మాః — వంశాచారములు; సనాతనాః — సనాతనమైన; (ఎంతో కాలం నుండి వున్న); ధర్మే — ధర్మము; నష్టే — అంతరించిపోవును; కులం — కుటుంబం; కృత్స్నం — సమస్తమైన; అధర్మః — అధర్మము; అభిభవతి — జయించును; ఉత — నిజముగా.
BG 1.40: వంశ నాశనం జరిగినప్పుడు, ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును, మరియు మిగిలిన కుటుంబసభ్యులు అధర్మపరులగుదురు.
కుటుంబ పెద్దలు తమ వంశము యొక్క పురాతన సాంప్రదాయాలు, ఏంతో కాలంగా ఉన్న ఆచారముల ఆధారంగా విలువలను, ఆదర్శాలను తమ ముందు తరాలవారికి అందచేస్తారు. ఈ సాంప్రదాయాలు, మానవీయ విలువలను మరియు ధార్మిక పద్ధతులను పాటించటానికి కుటుంబ సభ్యులకి దోహదపడుతాయి. కుటుంబ పెద్దలందరూ అకాలమరణం పాలయితే, వారి వచ్చే తరాల వారికి పెద్దల మార్గదర్శకత్వం, శిక...
https://www.holy-bhagava…udio/001_040.mp3
1
41
అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః । స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః ।। 41 ।।
అధర్మా — అధర్మము; ఆభిభవాత్ — ప్రబలిపోవుట; కృష్ణ — శ్రీ కృష్ణా; ప్రదుష్యంతి — నీతి తప్పిన వారై; కుల-స్త్రియః — కుటుంబంలోని స్త్రీలు; స్త్రీషు — స్త్రీలు; దుష్టాసు — దుర్నీతి పరులై; వార్ష్ణేయ — వృష్ణి వంశస్థుడా; జాయతే — పుడతారు; వర్ణ-సంకరః — అవాంఛిత సంతానం.
BG 1.41: దుర్గుణాలు ప్రబలిపోవటం వలన, ఓ కృష్ణా, కులస్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు; మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన, ఓ వృష్ణి వంశస్థుడా, అవాంఛిత సంతానం జన్మిస్తారు.
వైదిక నాగరికత, స్త్రీలకు చాలా ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించింది మరియు స్త్రీలు పవిత్రంగా ఉండటానికి ఎంతో ప్రాముఖ్యత నిచ్చింది. అందుకే మను-స్మృతిలో ‘యత్ర నార్యస్ తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః (3.56) ‘ఎక్కడెక్కడైతే స్త్రీలు పవిత్రమైన, పరిశుద్ధమైన నడవడికతో ఉంటారో, మరియు ఆ యొక్క పవిత్రతకు వారు మిగతా సమాజంచే పూజింపబడుతారో, అ...
https://www.holy-bhagava…udio/001_041.mp3
1
42
సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ । పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః ।। 42 ।।
సంకరః — అవాంఛిత సంతానం; నరకాయ — నరకప్రాయమైన; ఏవ — నిజముగా; కుల-ఘ్నానాం — కులనాశనము చేసిన వారిని; కులస్య — కులమును; చ — మరియు; పతంతి — పతనము; పితరః — పూర్వీకులు; హి — యథార్థముగా; ఏషామ్ — వారి యొక్క; లుప్త — లేకుండా అవును; పిండోదక-క్రియాః — శ్రాద్ధ తర్పణములు.
BG 1.42: అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు, కుల నాశనము చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును. శ్రాద్ధ తర్పణములు లుప్తమయిన కారణముగా ఆ భ్రష్టుపట్టిన వంశ పూర్వీకులు కూడా పతనమౌదురు.
https://www.holy-bhagava…udio/001_042.mp3
1
43
దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః । ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ।। 43 ।।
దోషైః — పాపిష్ఠిపనులచే; ఏతైః — ఈ విధమైన; కుల-ఘ్నానాం — కుల నాశనం చేసే వారి యొక్క; వర్ణ-సంకర — అవాంఛిత సంతానం; కారకైః — కారకులైన; ఉత్సాద్యంతే — చెడిపోతాయి; జాతి-ధర్మాః — సామాజిక, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు; కుల-ధర్మాః — కుటుంబ సాంప్రదాయములు; చ — మరియు; శాశ్వతాః — సనాతములైన.
BG 1.43: కుటుంబ ఆచారము నాశనము చేసి, అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్ట చేష్టల వలన అనేకానేక సామాజిక, కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును.
https://www.holy-bhagava…udio/001_043.mp3
1
44
ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన । నరకేఽనియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ।। 44 ।।
ఉత్సన్న— నాశనమైపోయిన; కుల-ధర్మాణామ్ — ఎవరి కుటుంబ సాంప్రదాయములైతే; మనుష్యాణాం — అలాంటి మనుషులు; జనార్దన — జనుల బాగోగులు చూసుకునే వాడా, శ్రీ కృష్ణా; నరకే — నరకములో; అనియతం — నిరవధికముగా; వాసః — నివాసము; భవతి — ఉండును; ఇతి — ఈ విధంగా; అనుశుశ్రుమ — పండితుల నుండి వినియున్నాను.
BG 1.44: ఓ జనార్దనా (కృష్ణా), కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని, నేను పండితుల నుండి వినియున్నాను.
https://www.holy-bhagava…udio/001_044.mp3
1
45
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ । యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః ।। 45 ।। యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః । ధార్తరాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ ।। 46 ।।
అహో — అయ్యో; బత — దారుణ ఫలితాలు; మహత్ — పెద్ద; పాపం — పాపాలు; కర్తుం — చేయుటకు; వ్యవసితాః — సిద్ధ పడితిమి; వయం — మనము; యత్ — ఎందుకంటే; రాజ్య-సుఖ-లోభేన — రాజ్య సుఖములపై కాంక్షతో; హంతుం — చంపుటకు; స్వ-జనమ్ — సొంత బంధువులను; ఉద్యతాః — అభిలాషించి; యది — ఒకవేళ; మామ్ — నన్ను; అప్రతీకారమ్ — ప్రతిఘటించకుండా; అశస్త్రం — ఆయుధాలు...
BG 1.45-46: అయ్యో! ఎంత ఆశ్చర్యం, దారుణమైన పరిణామాలు కలుగచేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము. రాజ్య సుఖములపై కాంక్షతో, మన బంధువులనే చంపటానికి సిద్ధ పడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు, ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే, అది దీనికంటే మ...
జరుగబోయే యుద్ధం వలన వచ్చే ఎన్నో చెడు విశేషాలని అర్జునుడు ప్రస్తావించాడు కానీ, ఈ దుష్టులను సమాజంలో వర్ధిల్లనిస్తే, దుర్మార్గమే వ్యాపిస్తుందని, అర్జునుడు చూడలేకున్నాడు. 'అహో' అన్న పదంతో తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు. 'బత' అంటే 'ఘోరమైన ఫలితాలు'. అర్జునుడు అంటున్నాడు, ‘ఎంత ఆశ్చర్యం, ఘోరమైన పరిణామాలు ఉంటాయి అని తెలిసి కూ...
https://www.holy-bhagava…/001_045-046.mp3
1
46

47
సంజయ ఉవాచ । ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ । విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ।। 47 ।।
సంజయ ఉవాచ — సంజయుడు పలికెను; ఏవం ఉక్త్వా — ఈ విధంగా పలికిన; అర్జునః — అర్జునుడు; సంఖ్యే — యుద్ధరంగంలో; రథ ఉపస్థే — రథములో; ఉపావిశత్ — కూర్చుండి పోయెను; విసృజ్య — వదిలివేసి; స-శరం — బాణములతో సహా; చాపం — ధనుస్సును; శోక — దుఃఖముతో; సంవిగ్న — దీనస్థితిలో; మానసః — మనస్సు.
BG 1.47: సంజయుడు పలికెను: ఈ విధంగా పలికిన అర్జునుడు, దీనస్థితిలో, తీవ్ర శోకసంతప్తుడై తన బాణాలను, ధనుస్సును పక్కన జారవిడిచి, రథంలో కూలబడ్డాడు.
మాట్లాడేటప్పుడు వ్యక్తి తరచుగా భావోద్వేగాల ప్రభావానికి లోనవుతాడు. 1.28వ శ్లోకం నుండి అర్జునుడు మొదలు పెట్టిన నిర్వేదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. తను ధర్మబద్ధంగా నిర్వర్తించవలసిన విధిని నైరాశ్యంతో వదిలివేసాడు, ఇది జ్ఞానంతో, భక్తితో భగవంతునికి శరణాగతి చేయటానికి పూర్తి విరుద్ధం. అర్జునుడు ఆధ్యాత్మిక జ్ఞానం లోపించిన అమా...
https://www.holy-bhagava…udio/001_047.mp3
2
1
సంజయ ఉవాచ । తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్ । విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః ।। 1 ।।
సంజయ ఉవాచ — సంజయుడు పలికెను; తం — అతనితో (అర్జునుడి తో); తథా — ఈ విధంగా; కృపయా — జాలితో; ఆవిష్టం — నిండినవాడై; అశ్రు-పూర్ణ — కన్నీరు-నిండి; ఆకుల — వ్యాకులతతో; ఈక్షణం — కళ్ళు; విషీదంతం — శోకంతో; ఇదం — ఈ యొక్క; వాక్యం — మాటలు; ఉవాచ — పలికెను; మధుసూదనః — శ్రీ కృష్ణ, మధు అనే రాక్షసుడను సంహరించిన వాడు.
BG 2.1: సంజయుడు పలికెను: జాలి నిండినవాడై, శోకతప్త హృదయంతో, కంటినిండా నీరు నిండిపోయున్న అర్జునుడిని చూసిన, శ్రీ కృష్ణుడు, ఈ విధంగా పలికెను.
అర్జునుడి మనో భావాలని వర్ణించడానికి సంజయుడు, 'కృపయా', అంటే జాలి లేదా కరుణ, అన్న పదం వాడాడు. కారుణ్యం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి - ఈశ్వర వియోగము వల్ల భౌతిక జగత్తులో వేదనని అనుభవిస్తున్న జీవాత్మలపై భగవంతుడికి, సత్పురుషులకు కలిగే దివ్యమైన కరుణ. మరియొకటి - ఎదుటివారిలో భౌతిక శారీరక కష్టాలని చూసినప్పుడు మనకు కలిగే భౌత...
https://www.holy-bhagava…udio/002_001.mp3
2
2
శ్రీ భగవానువాచ । కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితమ్ । అనార్యజుష్టమస్వర్గ్యమ్ అకీర్తికరమర్జున ।। 2 ।।
శ్రీ భగవానువాచ — పరమేశ్వరుడైన భగవానుడు పలికెను; కుతః — ఎక్కడినుండి; త్వా — నీకు; కశ్మలం — భ్రాంతి; ఇదం — ఈ యొక్క; విషమే — ఈ సంకట సమయంలో; సముపస్థితమ్ — దాపురించింది; అనార్య — అనాగరికమైన వ్యక్తి; జుష్టమ్ — ఆచరింపబడునది; అస్వర్గ్యమ్ — ఉత్తమ లోకాలకు దారి తీసేది కాదు; అకీర్తి-కరమ్ — అపకీర్తిని కలిగించేది; అర్జున — అర్జునా.
BG 2.2: శ్రీ భగవానుడు ఇట్లనెను: ప్రియమైన అర్జునా, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్త భ్రాంతి ఎట్లా దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాకపోగా, అపకీర్తి పాలుజేస్తుంది.
మన పవిత్ర గ్రంథాలలో ఆర్య అన్న పదం ఒక జాతిని లేదా తెగని సూచించేది కాదు. మను స్మృతి, ఆర్యన్ అన్న పదాన్ని, 'అత్యంత సంస్కారవంతుడైన వ్యక్తి' అని నిర్వచించింది. ‘ఆర్యన్’ మంచితనాన్ని సూచిస్తుంది, ఆంగ్లంలో ‘పర్ఫెక్ట్ జెంటిల్‌మాన్' (perfect gentleman) అన్నట్టుగా. వైదిక గ్రంథాల ప్రధాన లక్ష్యము మానవులను అన్ని కోణాల్లో ఆర్యన్లుగా ...
https://www.holy-bhagava…udio/002_002.mp3
2
3
క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే । క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ।। 3 ।।
క్లైబ్యం — పౌరుషహీనత్వం; మా స్మ — వద్దు; గమః — లొంగిపోవద్దు; పార్థ — అర్జున, ప్రిథ తనయుడా; న — కాదు; ఏతత్ — ఇది; త్వయి — నీకు; ఉపపద్యతే — తగదు; క్షుద్రం — నీచమైన; హృదయ — హృదయ; దౌర్బల్యం — బలహీనత; త్యక్త్వా — వదిలిపెట్టి; ఉత్తిష్ట — లెమ్ము; పరంతప — శత్రువులను జయించేవాడా.
BG 2.3: ఓ పార్థా, ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోనుకావటం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి, యుద్ధానికి లెమ్ము.
జ్ఞానోదయ మార్గంలో విజయవంతంగా ముందుకు వెళ్ళటానికి ఎంతో స్ఫూర్తి, ఉత్సాహం అవసరం. ఆశావహంతో, ఉత్సాహంతో, మరియు సామర్థ్యముతో ఉండి; బద్ధకం, దురలవాట్లు, అజ్ఞానం, మరియు మోహం వంటి ప్రాపంచిక మనస్సు యొక్క ప్రతికూలతలను అధిగమించాలి. శ్రీ కృష్ణుడు నేర్పు గల గురువు, మరియు ఈ విధంగా అర్జునుడిని మందలించిన తరువాత అతనిని ప్రోత్సహిస్తూ, ప్ర...
https://www.holy-bhagava…udio/002_003.mp3
2
4
అర్జున ఉవాచ । కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన । ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ।। 4 ।।
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; కథం — ఎట్లా; భీష్మమ్ — భీష్ముడు; అహం — నేను; సంఖ్యే — యుద్ధములో; ద్రోణం — ద్రోణాచార్యుడు; చ — మరియు; మధు-సూదన — శ్రీ కృష్ణ, మధు అనే రాక్షసుడను సంహరించినవాడా; ఇషుభిః — బాణాలతో; ప్రతియోత్స్యామి — పోరాడగలను; పూజా-అర్హౌ — పూజింపదగిన; అరి-సూదన — శత్రువులను నాశనం చేసేవాడా.
BG 2.4: అర్జునుడు ఇట్లనెను: ఓ మధుసూదనా, పూజ్యులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడువగలను? ఓ, శత్రువులను నాశనం చేసేవాడా.
కార్యాచరణకి పిలుపునిచ్చిన శ్రీ కృష్ణుడికి, తన మనస్సులో ఉన్న సందిగ్ధతను వ్యక్తం చేస్తున్నాడు, అర్జునుడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు తనకు గౌరవనీయులు, ఆరాధ్యులు. భీష్ముడంటే మూర్తీభవించిన సచ్ఛీలత; తండ్రి కోసం చేసిన ప్రతిజ్ఞ కోసం, అతను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయాడు. అర్జునుడి సైనిక (అస్త్ర విద్య) గురువు అయిన ద్రోణాచార్యుడ...
https://www.holy-bhagava…udio/002_004.mp3
2
5
గురూనహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే । హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ।। 5 ।।
గురూన్ — గురువులు; అహత్వా — చంపకుండా; హి — నిజముగా; మహానుభావాన్ — మహనీయులైన పెద్దలు; శ్రేయః — మేలు; భోక్తుం — భోగాలని అనుభవించటం; భైక్ష్యమ్ — బిచ్చమెత్తుకుని; అపి — అయినాసరే; ఇహ లోకే — ఈ లోకంలో; హత్వా — సంహరించుట; అర్థ — సంపాదించు; కామాన్ — కోరికతో; తు — కానీ; గురూన్ — గురువులను (పెద్దవారిని); ఇహ — ఈ లోకంలో; ఏవ — తప్పక...
BG 2.5: నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే, మనము అనుభవించే ఈ సంపద, భోగాలు, రక్తంతో కళంకితమై ఉంటాయి.
అర్జునుడు తన జీవనోపాధి కొనసాగించటం కోసం యుద్ధం చేసి రాజ్యాన్ని జయించాలని ఎవరైనా వాదించవచ్చు. కానీ ఇక్కడ అర్జునుడు ఆ వాదనని తిప్పికొడుతున్నాడు. భిక్షాటన చేసైనా జీవిస్తాను కానీ ఈ నీచమైన నేరాన్ని మాత్రం చేయను అని అంటున్నాడు. ఒకవేళ, యుద్దం చేసి పెద్దలను మరియు బంధువులను చంపటం అనే ఈ హీనమైన పని చేసినా తన అంతరాత్మ తనను, ఈ పని ...
https://www.holy-bhagava…udio/002_005.mp3
2
6
న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః । యానేవ హత్వా న జిజీవిషామః తేఽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః ।। 6 ।।
న — కాదు; చ — కూడా; ఎతత్ — ఇది; విద్మః — మనకు తెలుసు; కతరత్ — ఏది; నః — మనకు; గరీయః — మంచిది; యత్ వా — ఒకవేళ లేదా; జయేమ — మనము విజేయులమైతామో; యది — ఒకవేళ; వా — లేదా; నః — మనలను; జయేయుః — వారు జయిస్తారో; యాన్ — ఎవరినైతే; ఎవ — నిజముగా; హత్వా — సంహరించిన తరువాత; న జిజీవిశామః — జీవించి ఉండబుద్ధి కాదు; తే — వారు; అవస్థితాః ...
BG 2.6: ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా మనకు తెలియదు - వాళ్ళను జయించడమా లేదా వారిచే జయింపబడటమా. వారిని సంహరించిన తరువాత కూడా, మనకు జీవించాలని అనిపించదు. అయినా, వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి, మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు.
పరిస్థితులలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలలో, ప్రత్యామ్నాయాలను వాటి పరిణామాలను బేరీజు వేసుకోవటం పరిపాటి. కౌరవులను ఓడించటం మేలా లేక వారి చేతిలో ఓడిపోవటం మంచిదా అని అర్జునుడు మధన పడుతున్నాడు. రెండు పరిణామాలు ఓటమి గానే తోచాయి, ఎందుకంటే, కౌరవులని సంహరించి యుద్ధంలో గెలిచినా తనకు జీవించాలనే ఆశ ఇక ఉండదు. కానీ, భీష్...
https://www.holy-bhagava…udio/002_006.mp3
2
7
కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః । యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ।। 7 ।।
కార్పణ్య-దోషా — పిరికితనము అనెడు దోషము; ఉపహత — ముట్టడి చేయబడి; స్వ-భావః — స్వభావము; పృచ్ఛామి — అడుగుతున్నాను; త్వాం — మిమ్ములను; ధర్మ — ధర్మమును; సమ్మూఢ — కలవరపడ్డ; చేతాః — చిత్తముతో; యత్ — ఏది; శ్రేయః — శ్రేయస్కరము; స్యాత్ — అగునో; నిశ్చితం — నిశ్చయముగా; బ్రూహి — తెలుపుము; తత్ — అది; మే — నాకు; శిష్యః — శిష్యుడను; తే ...
BG 2.7: నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటంలేదు మరియు ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము.
భగవద్గీతలో ఇదొక అద్భుతమైన ఘట్టం. శ్రీ కృష్ణుడి సఖుడు, బావ అయిన అర్జునుడు మొదటిసారి కృష్ణుడిని తన గురువుగా ఉండమని ప్రార్థిస్తున్నాడు. కార్పణ్య దోషం, అంటే, పిరికితనం వలన ప్రవర్తనలో ఉండే తప్పటడుగు, తనను లొంగదీసుకుందని, అందుచేత, భగవంతుడిని తన గురువుగా ఉండమని, తనకు మంగళప్రదమైన దారి ఏదో ఉపదేశించమని, బ్రతిమాలుతున్నాడు.ఆధ్యాత్...
https://www.holy-bhagava…udio/002_007.mp3
2
8
న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్ యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణామ్ । అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ।। 8 ।।
న — కాదు; హి — నిజముగా; ప్రపశ్యామి — నేను చూచుట; మమ — నా యొక్క; అపనుద్యాత్ — పోగొట్టే; యత్ — ఏదైతే; శోకం — శోకమును; ఉచ్ఛోషణమ్ — శుష్కింప చేయునట్టి; ఇంద్రియాణామ్ — ఇంద్రియముల యొక్క; అవాప్య — పొందిన తరువాత; భూమౌ — ఈ భూమిపై; అసపత్నమ్ — ఎదురులేని; ఋద్దం — సుసంపన్నమైన; రాజ్యం — రాజ్యము; సురాణామ్ — దేవతల యొక్క; అపి — అయినా; ...
BG 2.8: నా ఇంద్రియములను శుష్కింప చేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయమేదీ తోచటం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన, ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా, లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందినా, ఈ శోకమును తొలగించుకోలేను.
ఎప్పుడైనా మనము దుఃఖంలో మునిగిపోయినప్పుడు, మన బుద్ధి ఆ దుఃఖానికి మూల కారణాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది, మరియు ఎప్పుడైతే ఇక ఎక్కువ ఆలోచించలేదో, అప్పుడు మానసికంగా కుంగిపోవటం మొదలౌతుంది. అర్జునుడి సమస్యలు అతని అల్పమైన బుద్ధికన్నా పెద్దవిగా పరిణమించటంతో, తనను శోక సముద్రం నుండి కాపాడుకోవటానికి తనకున్న భౌతిక జ్ఞానం సరిపోదు. శ్రీ...
https://www.holy-bhagava…udio/002_008.mp3
2
9
సంజయ ఉవాచ । ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప । న యోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవ హ ।। 9 ।।
సంజయ ఉవాచ — సంజయుడు పలికెను; ఏవం — ఈ విధముగా; ఉక్త్వా — పలికిన; హృషీకేశం — మనోఇంద్రియములకు అధిపతి, శ్రీ కృష్ణుడితో; గుడాకేశః — అర్జునుడు, నిద్రని జయించినవాడు; పరంతపః — అర్జునుడు, శత్రువులను శిక్షించేవాడు; న యోత్స్యే — నేను యుద్ధం చేయను; ఇతి — అంటూ; గోవిందం — కృష్ణ, ఇంద్రియములకు ఆనందమునిచ్చే వాడా; ఉక్త్వా — పలికి; తూష్ణ...
BG 2.9: సంజయుడు ఇట్లనెను: ఈ విధంగా పలికిన గుడాకేశుడు, శత్రువులను శిక్షించేవాడు, హృషీకేశునితో, ‘గోవిందా, నేను యుద్ధం చేయను’ అంటూ మౌనముగా ఉండిపోయాడు.
సూక్ష్మబుద్ధి గల సంజయుడు, ధృతరాష్ట్రునికి చెప్పే ఆఖ్యాన వివరణలో తను ప్రస్తావించు వ్యక్తులకు సరిగ్గా తగిన పేర్లు వాడతాడు. ఇక్కడ అర్జునుడిని 'గుడాకేశ' అంటే 'నిద్రని జయించిన వాడా' అని సంబోధించాడు. నిద్రకున్న శక్తి ఎలాంటిదంటే ఎప్పుడోఅప్పుడు అన్ని ప్రాణులు దానికి వశం కావాల్సిందే. కానీ తన దృఢ సంకల్పంతో అర్జునుడు తనకు తానే ఎ...
https://www.holy-bhagava…udio/002_009.mp3
2
10
తమువాచ హృషికేశః ప్రహసన్నివ భారత । సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః ।। 10 ।।
తమ్ — అతనితో; ఉవాచ — పలికెను; హృషికేశః — శ్రీ కృష్ణుడు, మనోఇంద్రియములకు అధిపతి; ప్రహసన్ — మందహాసముతో; ఇవ — అలాగ; భారత — ధృతరాష్ట్రా, భరత వంశీయుడా; సేనయోః — సైన్యముల; ఉభయోః — రెంటిలో; మధ్యే — మధ్యలో; విశీదంతం — శోకంలో ఉన్న వానితో; ఇదం — ఈ యొక్క; వచః — వాక్యములు.
BG 2.10: ఓ ధృతరాష్ట్రా! ఆ తరువాత, ఇరుసేనల మధ్యలో, శోకసంతుప్తుడైన అర్జునుడితో శ్రీ కృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను.
అర్జునుడి వేదనతో నిండిన మాటలకు విరుద్ధంగా, పరిస్థితి తనను ఏమీ నిరాశాజనకంగా చేయటం లేదని, పైగా తను నిశ్చింతగా సంతోషంగా ఉన్నానని సూచిస్తూ శ్రీ కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. జ్ఞానులు అన్నీ సందర్భాలలో ఇలాంటి సమభావ దృక్పథం ప్రదర్శిస్తారు. మనకున్న అసంపూర్ణ అవగాహనతో, మనం, ఉన్న పరిస్థితులలో లోపాలు వెదుకుతాము - వాటిపై సణుగుతూ, ...
https://www.holy-bhagava…udio/002_010.mp3
2
11
శ్రీ భగవానువాచ । అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే । గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ।। 11 ।।
శ్రీ-భగవాన్-ఉవాచ — శ్రీ భగవానుడు పలికెను; అశోచ్యాన్ — శోకింపతగని; అన్వశోచః — శోకిస్తున్నావు; త్వం — నీవు; ప్రజ్ఞా-వాదాన్ — ప్రాజ్ఞతతో కూడిన మాటలు; చ — మరియు; భాషసే — పలుకుతున్నావు; గత-ఆసూన్ — చనిపోయినవారు; అగత అసూన్ — బ్రతికున్నవారు; చ — మరియు; న అనుశోచంతి — ఎప్పుడూ శోకించరు; పండితాః — పండితులు/వివేకవంతులు.
BG 2.11: భగవంతుడు ఇలా అన్నాడు: నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ శోకింపకూడని దాని కోసం శోకిస్తున్నావు. ప్రాణములు పోయిన వారి గురించి గానీ బ్రతికున్న వారి గురించి గానీ, పండితులైనవారు శోకింపరు.
ఈ శ్లోకంతో మొదలిడి, శ్రీ కృష్ణుడు తన ప్రసంగమును ఒక మహోత్కృష్టమైన ప్రారంభ ప్రతిపాదనతో ఆరంభిస్తున్నాడు. అర్జునుడు, తనకు మాత్రం ఒప్పు అనిపించే కారణాల వలన శోకిస్తున్నాడు. కానీ, కృష్ణుడు అతనిపై జాలి పడలేదు, సరికదా, అతని వాదనని నీరుగార్చాడు. కృష్ణుడు అంటున్నాడు, ‘అర్జునా, నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడావనుకుంటున్నావు, క...
https://www.holy-bhagava…udio/002_011.mp3
2
12
న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః । న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ ।। 12 ।।
న — ఎప్పటికీ కాదు; తు — కానీ; ఏవ — తప్పకుండా; అహం — నేను; జాతు — ఏ కాలంలో నైనా; న — కాదు; ఆసం — ఉండుట; న — కాదు; త్వం — నీవు; న — కాదు; ఇమే — ఈ యొక్క; జన-అధిపాః — రాజులు; న — కాదు; చ — మరియు; ఏవ — ఖచ్చితంగా; న భవిష్యామః — ఉండకుండా జరుగుట; సర్వే వయం — మనమందరమూ; అతః — ఇప్పటినుండి; పరం — తరువాత.
BG 2.12: నేను కానీ, నీవు కానీ, ఈ రాజులందరూ కానీ లేని సమయము లేదు; ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము.
డెల్ఫిలో వున్న టెంపుల్ అఫ్ అపోలో ద్వారం పై ‘జ్ఞోతి సూఎటోన్’ (Gnothi Seuton) అంటే ‘నిన్ను నీవు తెలుసుకో' అని అక్షరాలు చెక్కి ఉన్నాయి. ఏథెన్స్‌కి చెందిన పెద్దమనిషి, పండితుడు సోక్రటీస్ కూడా జనులను తమ ఆత్మ తత్త్వం గురించి విచారించమని ప్రోత్సహించేవాడు. ఒక స్థానిక కథ ఇలా చెప్పబడేది:ఒకనాడు సోక్రటీస్ గాఢమైన తత్త్వ విచారణ ధ్యాస...
https://www.holy-bhagava…udio/002_012.mp3
2
13
దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా । తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ।। 13 ।।
దేహినః — దేహములోనున్న వాడు; అస్మిన్ — దీనిలో; యథా — ఎట్లయితే; దేహే — శరీరంలో; కౌమారం — బాల్యము; యౌవనం — యుక్తవయస్సు; జరా — వార్ధక్యము (ముసలితనము); తథా — ఆ విధముగానే; దేహ-అంతర — ఇంకొక దేహము; ప్రాప్తిః — పొందును; ధీరః — వివేకులు; తత్ర — ఆ విషయములో; న ముహ్యతి — భ్రమకు లోనవ్వరు;
BG 2.13: ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యౌవనం, ముసలితనముల గుండా సాగిపోతుందో, అదేవిధముగా మరణ సమయంలో, జీవాత్మ మరియొక దేహము లోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు.
శ్రేష్ఠమైన తర్కముతో శ్రీ కృష్ణుడు, ఒక జన్మ నుండి ఇంకొక జన్మకు, ఆత్మ ఒక శరీరం నుంచి మరొక శరీరంలోకి ప్రవేశించే సిద్ధాంతాన్ని నిరూపిస్తున్నాడు. ఒక జన్మలోనే మనము బాల్యము, యౌవనము, యుక్తవయసు, తదుపరి వృద్ధాప్య దశలలో శరీరాలు మారుస్తూ ఉంటాము అని వివరిస్తున్నాడు. వాస్తవానికి, ఆధునిక శాస్త్రము ప్రకారం శరీరంలోని జీవ కణాలు నిరంతరంగ...
https://www.holy-bhagava…udio/002_013.mp3
2
14
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః । ఆగమాపాయినోఽనిత్యాః తాంస్తితిక్షస్వ భారత ।। 14 ।।
మాత్రా-స్పర్శాః — ఇంద్రియముల యొక్క ఇంద్రియ-విషయ సంయోగము చే; తు — నిజముగా; కౌంతేయ — అర్జునా; కుంతీ పుత్రుడా; శీత — చలికాలం; ఉష్ణ — ఎండాకాలం; సుఖ — సంతోషము; దుఃఖ — దుఃఖము; దాః — ఇచ్చును; ఆగమ — వచ్చును; అపాయినః — పోవును; అనిత్యాః — అనిత్యములు; తాన్ — వాటిని; తితిక్షస్వ — ఓర్చుకొనుము; భారత — భరత వంశీయుడా.
BG 2.14: ఓ కుంతీపుత్రా, ఇంద్రియ-విషయములతో సంయోగము వలన ఇంద్రియములకు క్షణభంగురమైన, అనిత్యమైన సుఖ-దుఃఖాలు కలిగినట్లు అనిపిస్తుంది. ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి, చలికాలములలా వచ్చిపోతుంటాయి. ఓ భరత వంశీయుడా, కలత చెందకుండా వీటిని ఓర్చుకోవటం నేర్చుకోవాలి.
మానవ శరీరానికి దృష్టి, వాసన, రుచి, స్పర్శ, మరియు వినికిడి అనే ఐదు ఇంద్రియ అనుభవములు కలవు. ఇవి, వాటి యొక్క విషయముల సంపర్కం చేత ఆనందం మరియు దుఃఖముల అనుభూతిని కలుగచేస్తాయి. ఈ అనుభవాలు ఏవీ కూడా శాశ్వతమైనవి కావు; మారే ఋతువుల్లా అవి వచ్చిపోతుంటాయి. చల్లని నీరు వేసవిలో ఆనందం కలుగచేసినప్పటికీ, అదే నీరు శీతాకాలంలో ఇబ్బంది కలిగి...
https://www.holy-bhagava…udio/002_014.mp3
2
15
యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ । సమదుఃఖసుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే ।। 15 ।।
యం — ఎవరైతే; హి — వాస్తవముగా; న వ్యథయంతి — వ్యాకుల పడరో; ఏతే — వీటి చే; పురుషం — వ్యక్తి; పురుష-ఋషభ — శ్రేష్ఠమైన పురుషుడా, అర్జునా; సమ — సమానముగా (సమత్వబుద్ధితో); దుఃఖ — బాధ; సుఖం — సంతోషము; ధీరం — స్థిరముగా; సః — ఆ వ్యక్తి; అమృతత్వాయ — మోక్షమునకు; కల్పతే — అర్హుడు అవుతాడు.
BG 2.15: ఓ అర్జునా, పురుష శ్రేష్ఠుడా, సుఖదుఃఖములచే ప్రభావితం కాకుండా, రెండింటిలోనూ చలించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు.
ఇంతకు క్రితం శ్లోకంలో, శ్రీ కృష్ణుడు సుఖదుఃఖ అనుభూతులు అనిత్యములు అని వివరించాడు. ఇప్పుడు అర్జునుడిని జ్ఞాన-వివక్ష ద్వారా ఈ ద్వంద్వములకు అతీతంగా ఎదగమని ప్రోత్సహిస్తున్నాడు. ఈ వివక్షని పెంపొందించుకోవటానికి, మనం మొదట రెండు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు అర్థం చేసుకోవాలి: 1) ఎందుకు మనం ఆనందం కోసం ఆకాంక్షిస్తాము? 2) ఎందుకు ...
https://www.holy-bhagava…udio/002_015.mp3
2
16
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః । ఉభయోరపి దృష్టోఽన్తః త్వనయోస్తత్త్వదర్శిభిః ।। 16 ।।
న — కాదు; అసతః — తాత్కాలికమైనదానికి; విద్యతే — ఉన్నది; భావః — ఉనికి; న — లేదు; అభావః — అంతం; విద్యతే — ఉన్నది; సతః — శాశ్వతమైనదానికి; ఉభయో — రెంటిలో; అపి — మరియు; దృష్టః — చూడబడినది; అంతః — సారాంశం; తు — నిజముగా; అనయోః — వీటిలో; తత్త్వ — వాస్తవమును; దర్శిభిః — జ్ఞానదృష్టికలవారిచే.
BG 2.16: అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్త్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు.
శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రకారం, ఒక మూడు అస్తిత్వములు ఉన్నవి.భోక్తా భోగ్యం ప్రేరితారం చ మత్వాసర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతత్ (1.12)క్షరం ప్రధానమమృతాక్షరం హరఃక్షరాత్మానా వీశతే దేవ ఏకః (1.10)సంయుక్తమేతత్ క్షరమక్షరం చవ్యక్తావ్యక్తం భరతే విశ్వమీశః (1.8) ఈ వేద మంత్రములు అన్నీ ప్రతిపాదించేది ఏమిటంటే - భగవంతుడు, జీవాత్మ, మర...
https://www.holy-bhagava…udio/002_016.mp3
2
17
అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ । వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి ।। 17 ।।
అవినాశి — నాశముచేయరాని; తు — నిజముగా; తత్ — అది; విద్ధి — తెలుసుకొనుము; యేన — ఎవరిచేతనైతే; సర్వం — అంతయు; ఇదం — ఇది; తతమ్ — వ్యాప్తి నొంది ఉన్నదో; వినాశమ్ — వినాశము; అవ్యయస్య — అనశ్వరమైన, నిత్యమైన దాని; అస్య — యొక్క; న కశ్చిత్ — ఎవ్వడూ కాడు; కర్తుమ్ — చేయటానికి; అర్హతి — సమర్థుడు.
BG 2.17: శరీరమంతయు వ్యాపించి ఉన్న అది నాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము. ఎవ్వరూ కూడా అనశ్వరమైన ఆత్మను నాశనంచేయలేరు.
ఆత్మ అనేది శరీరమంతా వ్యాపించి ఉంటుందని చెప్పటం ద్వారా, శరీరానికి జీవాత్మకి ఉన్న సంబంధాన్ని నెలకొల్పుతున్నాడు శ్రీ కృష్ణుడు. అంటే పరమాత్మ ఇక్కడ చెప్పదలుచుకున్నదేమిటి? ఆత్మ సచేతనమైనది, అంటే చైతన్యము కలిగినది. శరీరము జడ పదార్థంచే తయారుచేయబడినది, చైతన్య రహితమైనది. కానీ, ఆత్మ శరీరంలో ఉంటూ తన చైతన్య గుణమును శరీరానికి కూడా ఇస...
https://www.holy-bhagava…udio/002_017.mp3
2
18
అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః । అనాశినోఽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ।। 18 ।।
అంత-వంతః — అంతము కలిగిఉన్న (నశించిపోయేవి); ఇమే — ఇవి; దేహాః — భౌతిక శరీరాలు; నిత్యస్య — ఎప్పటికీ ఉండే; ఉక్తాః — చెప్పబడినవి; శరీరిణః — దేహమునందున్న జీవాత్మ; అనాశినః — నాశరహితమైనది; అప్రమేయస్య — అపరిమితమైన, కొలవశక్యము కాని; తస్మాత్ — కాబట్టి; యుధ్యస్వ — యుద్ధం చేయుము; భారత — భరత వంశీయుడా, అర్జునా.
BG 2.18: ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది; అందున్న జీవాత్మ నాశరహితమైనది, కొలవశక్యముకానిది, మరియు నిత్యశాశ్వతమైనది. కావున, ఓ భరత వంశీయుడా, యుద్ధం చేయుము.
స్థూల శరీరము యథార్థముగా మట్టితో తయారయినదే. మట్టియే కూరగాయలుగా, ఫలములుగా, ధాన్యముగా, పప్పుదినుసులుగా, మరియు గడ్డిగా మారుతుంది. ఆవులు గడ్డి మేసి పాలను ఉత్పత్తి చేస్తాయి. మనము మనుష్యులము ఈ ఖాద్య పదార్థములన్నీ భుజించగా, అవి మన శరీరముగా మారుతాయి. కాబట్టి, శరీరము మట్టితో తయారయ్యిందని అనటంలో అతిశయోక్తి లేదు. మరణ సమయంలో, ఆత...
https://www.holy-bhagava…udio/002_018.mp3
2
19
య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్। ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే ।। 19 ।।
యః — ఎవరైతే; ఏనం — ఇది; వేత్తి — తెలుసుకుంటారో; హంతారం — చంపేది; యః — ఎవరైతే; చ — మరియు; ఏనం — ఇది; మన్యతే — అనుకుంటాడో; హతం — చంపబడేది; ఉభౌ — రెండూ; తౌ — వారు; న — కాదు; విజానీతః — జ్ఞానం కలిగిఉన్న; న — కాదు; అయం — ఇది; హంతి — చంపును; న — కాదు; హన్యతే — చంపబడును.
BG 2.19: ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడు - ఇద్దరూ అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరిచేతనూ చంపబడదు.
మనలను మనం ఈ భౌతిక శరీరమే అని అనుకోవటం వలన మరణము అనే భ్రాంతి కలుగుతుంది. రామాయణం దీన్ని ఈ విధంగా వివరిస్తున్నది:జౌఁ సపనేఁ సిర కాటఇ కోఈ, బిను జాగేఁ న దూరి దుఖ హోఈ‘మన తల తెగిపోతున్నట్టుగా కల వస్తే, ఆ నొప్పి అనుభూతి మనం నిద్రలేచే వరకూ ఉంటుంది.’ కలలో జరిగిన సంఘటన ఒక భ్రాంతి, కానీ దాని వలన కలిగిన నొప్పి అనుభవము మనము నిద్ర లే...
https://www.holy-bhagava…udio/002_019.mp3
2
20
న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ।। 20 ।।
న జాయతే – జన్మించదు; మ్రియతే — మరణించదు; వా — లేదా; కదాచిత్ — ఎప్పుడైనా; న — కాదు; అయం — ఇది; భూత్వా — ఒకప్పుడు ఉండి; భవితా — భవిష్యత్తులో ఉండేది; వా — లేదా; న — కాదు; భూయః — ఇంకా; అజః — జన్మలేనిది; నిత్యః — నిత్యమైనది; శాశ్వతః — శాశ్వతమైనది; అయం — ఇది; పురాణః — సనాతనమైనది; న హన్యతే — నాశనం కానిది; హన్యమానే — నశించును;...
BG 2.20: ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి, ఇకముందు ఎప్పుడైనా అంతమైపోదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు.
పుట్టుకకి మరణానికి అతీతమై ఎల్లప్పుడూ ఉండే ఆత్మ యొక్క శాశ్వత నిత్యమైన తత్త్వం ఈ శ్లోకంలో చక్కగా వివరించబడింది. ఆ ప్రకారంగా, ఆరు రకముల మార్పులు దానికి లేవు - అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, మరియు వినశ్యతి - ‘గర్భవాసం, పుట్టుక, పెరుగుదల, పునరుత్పత్తి, తరుగుదల, మరియు మరణించుట.’ ఇవి శరీరం యొక్క పరిణామాలు, ఆత్మకు...
https://www.holy-bhagava…udio/002_020.mp3
2
21
వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ । కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ ।। 21 ।।
వేద — తెలుసుకున్న; అవినాశినం — నాశము కానిది; నిత్యం — నిత్యమైనది; యః — ఎవరైతే; ఏనమ్ — ఇది; అజమ్ — జన్మ లేనిది; అవ్యయమ్ — మార్పుచెందనిది; కథం — ఎట్లా; సః — అది; పురుషః — వ్యక్తి; పార్థః — పార్థా; కం — ఎవరిని; ఘాతయతి — చంపే కారణం; హంతి — చంపును; కమ్ — ఎవరిని.
BG 2.21: ఓ పార్థ, ఆత్మ అనేది నాశనం చేయబడలేదు, నిత్యమైనది, పుట్టుక లేనిది, ఎన్నటికీ మార్పుచెందనిది అని తెలిసిన వ్యక్తి, ఎవరినైనా ఎట్లా చంపును? ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు?
ఆధ్యాత్మికంగా ఎదిగిన జీవాత్మ, మనచే చేయబడే కర్మలను చేసేది మనమే అన్న అహంకారాన్ని అణచి వేస్తుంది. ఆ స్థితిలో, మనలో ఉన్న జీవాత్మ నిజానికి ఏమీ చెయ్యదు అని గమనించవచ్చు. అలాంటి ఉన్నత స్థాయికి ఎదిగిన జీవులు, అన్నీ పనులు చేస్తూనే వున్నా, వాటి వల్ల కళంకితులు కారు. అటువంటి ఉన్నతమైన జ్ఞానోదయ స్థితికి తనను తాను ఉద్ధరించుకుని, తనను ...
https://www.holy-bhagava…udio/002_021.mp3
2
22
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి । తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ ।। 22 ।।
వాసాంసి — వస్త్రములు; జీర్ణాని — జీర్ణమైపోయిన (పాతబడ్డ); యథా — ఆ విధముగా; విహాయ — విడిచిపెట్టి; నవాని — కొత్త; గృహ్ణాతి — స్వీకరించును; నరః — మానవుడు; అపరాణి — వేరైన; తథా — అదే విధముగా; శరీరాణి — శరీరములు; విహాయ — విడిచిపెట్టి; జీర్ణాని — పాతబడ్డ; అన్యాని — వేరే; సంయాతి — ప్రవేశించును; నవాని — కొత్త; దేహీ — జీవాత్మ.
BG 2.22: ఎలాగైతే మానవుడు, జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో, అదే విధముగా, మరణ సమయములో, జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును.
ఆత్మ స్వభావాన్ని వివరించటం కొనసాగిస్తూ, శ్రీ కృష్ణుడు, పునర్జన్మ సిద్ధాంతాన్ని, మనం చేసే రోజువారీ పనితో పోల్చుతూ పునరుద్ఘాటిస్తున్నాడు. వస్త్రములు చిరిగిపోయి పనికిరాకుండా పోయినప్పుడు మనం వాటిని వదిలివేసి కొత్త వాటిని ధరిస్తాము, కానీ ఈ ప్రక్రియలో మనం మారిపోము. ఇదే విధంగా, ఒక దేహమును వదిలి మరోచోట ఇంకొక దేహములో పుట్టే ప్ర...
https://www.holy-bhagava…udio/002_022.mp3
2
23
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః । న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ।। 23 ।।
న — కాదు; ఏనం — ఈ ఆత్మ; ఛిందంతి — ముక్కలుచేయబడుట; శస్త్రాణి — ఆయుధములు; న — కాదు; ఏనం — ఈ ఆత్మ; దహతి — కాల్చుట; పావకః — అగ్ని; న — కాదు; చ — మరియు; ఏనం — ఈ ఆత్మ; క్లేదయంతి — తడుపుట; ఆపః — నీరు; న — కాదు; శోషయతి — ఎండగొట్టుట; మారుతః — గాలి.
BG 2.23: ఈ ఆత్మను, ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు. నీరు తడపలేదు, గాలి ఎండిపోవునట్లు చేయలేదు.
ఆత్మ యొక్క లక్షణం అయిన చైతన్యమును భౌతిక పరికరముల ద్వారా గ్రహించవచ్చు, కానీ ఆత్మను మాత్రము ఏ భౌతిక వస్తువు ద్వారా కూడా స్పృశించలేము. ఇది ఎందుకంటే ఆత్మ దివ్యమైనది, కావున ప్రాకృతిక వస్తువులకు అతీతమైనది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్నే స్పష్టంగా, ఆత్మను, గాలి ఎండబెట్టలేదు, నీరు తడపలేదు, మరియు అగ్ని కాల్చలేదు అని వ్యక్తపరుస్తున్న...
https://www.holy-bhagava…udio/002_023.mp3
2
24
అచ్ఛేద్యోఽయమదాహ్యోఽయమ్ అక్లేద్యోఽశోష్య ఏవ చ । నిత్యః సర్వగతః స్థాణురచలోఽయం సనాతనః ।। 24 ।।
అచ్ఛేద్యః — ఛేదింపబడనిది; అయం — ఈ ఆత్మ; అదాహ్యః — దహింప బడనిది; అయం — ఈ ఆత్మ; అక్లేద్యః — తడుపుటకు సాధ్యం కానిది; అశోష్యః — ఎండిపోనిది; ఏవ — నిజముగా; చ — మరియు; నిత్యః — ఎప్పుడూ ఉండేది; సర్వ-గతః — అంతటా వ్యాపించి ఉండేది; స్థాణుః — మార్చలేనిది; అచలః — పరివర్తనలేనిది; అయం — ఈ ఆత్మ; సనాతనః — సనాతనమైనది.
BG 2.24: ఆత్మ, విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది; దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు. అది నిత్యము, అంతటా ఉండేది, మార్పులేనిది, పరివర్తనలేనిది, మరియు సనాతనమైనది.
ఆత్మ యొక్క అమరత్వం ఇక్కడ మళ్లీ చెప్పబడింది. గురువు గారు పరిపూర్ణ జ్ఞానం కేవలం చెపితే సరిపోదు; ఆ జ్ఞానం ఉపయోగపడాలంటే, విద్యార్థి హృదయంలోనికి అది లోతుగా చేరాలి. కాబట్టి నైపుణ్యం గల గురువు తరచుగా ఇంతకూ ముందే చెప్పిన విషయాన్ని పునరావృత్తం చేస్తాడు. సంస్కృత సాహిత్యంలో దీనిని పునరుక్తి అంటే 'మళ్లీ చెప్పటం' అంటారు. తన విద్యా...
https://www.holy-bhagava…udio/002_024.mp3
2
25
అవ్యక్తోఽయమచింత్యోఽయమవికార్యోఽయముచ్యతే । తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ।। 25 ।।
అవ్యక్తః — అవ్యక్తమైన (కనిపించని); అయం — ఈ ఆత్మ; అచింత్యః — మనస్సుకు అందనిది; అయం — ఈ ఆత్మ; అవికార్యః — మార్పుకు లోనుకానిది; (వికారములు లేనిది); అయం — ఈ ఆత్మ; ఉచ్యతే — చెప్పబడును; తస్మాత్ — కాబట్టి; ఏవం — ఈ విధంగా; విదిత్వా — తెలుసుకొని; ఏనం — ఈ ఆత్మ; న — కాదు; అనుశోచితుం — శోకించుట; అర్హసి — తగును.
BG 2.25: ఆత్మ అనేది అవ్యక్తమైనది (కనిపించనిది), ఊహాతీతమైనది, మరియు మార్పులేనిది. ఇది తెలుసుకొని నీవు శరీరం కోసము శోకించవలదు.
భౌతిక శక్తి నుంచి తయారైన మన నేత్రములు, కేవలం భౌతిక వస్తువులను మాత్రమే చూడగలవు. ఆత్మ దివ్యమైనది, భౌతిక శక్తికి అతీతమైనది కాబట్టి మన కంటికి కనిపించదు. శాస్త్రవేత్తలు దాని ఉనికిని అవగతం చేసుకోడానికి ప్రయోగాలు జరిపారు. చనిపోతున్న వ్యక్తిని ఒక గాజు పేటికలో ఉంచి దానిని గట్టిగా మూసి వేసారు. ఆత్మనిష్క్రమణ సమయంలో గాజు పగుళ్ళు స...
https://www.holy-bhagava…udio/002_025.mp3
2
26
అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ । తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి ।। 26 ।।
అథ — అయినా ఒకవేళ; చ — మరియు; ఏనం — ఈ ఆత్మ; నిత్య జాతం — ఎప్పుడూ పుడుతూ ఉంటూ; నిత్యం — ఎప్పుడూ; వా — లేదా; మన్యసే — అని నీవు భావిస్తే; మృతం — చనిపోవుట; తథా అపి — అయినా సరే; త్వం — నీవు; మహా-బాహో — గొప్ప బలముగల చేతులున్నవాడా, అర్జునా; న — కాదు; ఏవం — ఈ విధంగా; శోచితుం — శోకించుట; అర్హసి — తగును.
BG 2.26: కానీ ఒకవేళ నీవు, ఆత్మ పదే పదే జనన మరణములకు లోనగుతుంది అని అనుకున్నా సరే, ఓ మహా బాహువులు కలవాడా, ఇలా శోకించుట తగదు.
ఆత్మ తత్త్వం గురించి వున్న వేరే సిద్ధాంతాలను అర్జునుడు నమ్మదలచాడేమో అని, శ్రీ కృష్ణుడు 'అథ' అన్న పదం వాడాడు. భారతదేశంలో ఉన్న వివిధ తాత్త్విక సిద్ధాంతాలు మరియు ఆత్మ తత్త్వంపై వాటి భిన్నమైన అవగాహనల నేపథ్యంలో ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి. భారతీయ తత్త్వజ్ఞానం చారిత్రాత్మకంగా పన్నెండు శాస్త్రాలను కలిగి ఉంది. వీటిలో ఒక ఆరు,...
https://www.holy-bhagava…udio/002_026.mp3
2
27
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ । తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ।। 27 ।।
జాతస్య — పుట్టినవానికి; హి — యేలనంటే; ధ్రువః — నిస్సందేహముగా; మృత్యుః — మరణము; ధ్రువం — తప్పదు; జన్మ — పుట్టుక; మృతస్య — మరణించినవానికి; చ — మరియు; తస్మాత్ — కాబట్టి; అపరిహార్యే అర్థే — ఈ తప్పని పరిస్థితిలో; న — కాదు; త్వం — నీవు; శోచితుం — శోకించుట; అర్హసి — తగును.
BG 2.27: పుట్టిన వానికి మరణం తప్పదు, మరియు మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నీవు శోకించ వద్దు.
ఆంగ్ల భాషలో ఒక ప్రసిద్ధ నానుడి ఉంది, ‘యాజ్ ష్యూర్ యాజ్ డెత్’ (as sure as death) అని. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నాడు: ‘జీవితంలో తప్పకుండా ఉండేవి, మరణం మరియు పన్నులు మాత్రమే’. (The only things certain in life are death and taxes.) జీవితంలో అత్యంత ఖచ్చితమైన విషయం ఏమిటంటే మనము ఏదో ఒకరోజు మృత్యువుతో కలవాలి. జీవితంలో అతిపెద్ద ...
https://www.holy-bhagava…udio/002_027.mp3
2
28
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత । అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ।। 28 ।।
అవ్యక్త-ఆదీని — పుట్టుక ముందు అవ్యక్తములు (అప్రకటితములు); భూతాని — సృష్టింపబడిన ప్రాణులు; వ్యక్త — వ్యక్తములు (ప్రకటితములు); మధ్యాని — మధ్యలో; భారత — అర్జున, భరత వంశీయుడా; అవ్యక్త — అవ్యక్తములు (అప్రకటితములు); నిధనాని — మరణించిన పిమ్మట; ఏవ — నిజముగా; తత్ర — కాబట్టి; కా — ఎందులకు; పరిదేవనా — శోకించుట.
BG 2.28: ఓ భరత వంశీయుడా, సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తములు, జీవిత కాలంలో వ్యక్తములు, మరల మరణించిన పిదప అవ్యక్తములు. కావున శోకించుట ఎందులకు?
ఆత్మకి సంబంధించి ఉన్న శోక కారణాన్ని 2.20వ శ్లోకంలో, శరీరానికి సంబంధించి ఉన్న శోక కారణాన్ని 2.27వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు పోగొట్టాడు. ఇప్పుడు రెంటినీ ఈ శ్లోకంలో పొందుపరిచాడు. శ్రీమద్భాగవతంలో నారద మహర్షి, యుధిష్ఠిరుడికి ఈ విధంగానే ఉపదేశించాడు.యన్ మన్యసే ధృవం లోకం అధృవం వా న చోభయమ్సర్వథా న హి శోచ్యాస్తే స్నేహదన్యత్ర మొహజాత...
https://www.holy-bhagava…udio/002_028.mp3
2
29
ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేన మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః । ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ।। 29 ।।
ఆశ్చర్య-వత్ — ఆశ్చర్యమైనదిగా; పశ్యతి — చూచెదరు; కశ్చిత్ — కొందరు; ఏనమ్ — ఈ ఆత్మ; ఆశ్చర్య-వత్ — ఆశ్చర్యమైనదిగా; వదతి — చెప్పెదరు; తథా — ఈ విధముగా; ఏవ — నిజముగా చ — మరియు; అన్యః — వేరొకరు; ఆశ్చర్య-వత్ — అంతే ఆశ్చర్య మైనదిగా; చ — మరియు; ఏనం — ఈ ఆత్మ; అన్యః — మరికొందరు; శృణోతి — వినుట; శ్రుత్వా — విన్న పిదప; అపి — అయినాసరే...
BG 2.29: కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు, కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు, మరియు కొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు, మరికొందరు, విన్న తరువాత కూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు.
సూక్ష్మమైన పరమాణువుల నుండి విస్తారమైన నక్షత్రాలు/పాలపుంతల వరకు సంపూర్ణ జగత్తు ఆశ్చర్యకరమైనది, అవన్నీ భగవంతుని అద్భుతమైన సృష్టియే కదా. ఒక చిన్న గులాబీ పువ్వు కూడా అద్భుతమైనదే, దాని నిర్మాణం, వాసన, మరియు సౌందర్యం. అన్నిటి కన్నా పరమాద్భుతమైనది స్వయంగా ఆ భగవంతుడే. అనంత శేషుడు, అంటే విష్ణుమూర్తి వసించే దివ్యమైన పదివేల తలల స...
https://www.holy-bhagava…udio/002_029.mp3
2
30
దేహీ నిత్యమవధ్యోఽయం దేహే సర్వస్య భారత । తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి ।। 30 ।।
దేహీ — దేహములో వసించే ఆత్మ; నిత్యం — ఎల్లప్పుడూ; అవధ్యః — వధింపబడనిది/నిత్యశాశ్వతమైనది; అయం — ఈ ఆత్మ; దేహే — శరీరములో; సర్వస్య — అందరి; భారత — భరత వంశీయుడా, అర్జునా; తస్మాత్ — కాబట్టి; సర్వాణి — అందరి; భూతాని — ప్రాణులు; న — కాదు; త్వం — నీవు ; శోచితుం — శోకించుట; అర్హసి — తగును.
BG 2.30: ఓ అర్జునా, దేహమునందు ఉండెడి ఆత్మ చావులేనిది; కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించుట తగదు.
తరచుగా, తన ఉపదేశ క్రమంలో, శ్రీ కృష్ణుడు కొన్ని శ్లోకాలలో ఒక విషయాన్ని వివరించిన తరువాత చివరికి ఒక శ్లోకంలో దాని సారాంశాన్ని చెప్తాడు. ఆత్మ యొక్క అమరత్వాన్ని మరియు శరీరానికి దానికి ఉన్న భేదాన్ని చెప్పిన ఉపదేశ సారాంశము, ఈ శ్లోకం.
https://www.holy-bhagava…udio/002_030.mp3
2
31
స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి । ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోఽన్యత్ క్షత్రియస్య న విద్యతే ।। 31 ।।
స్వ-ధర్మము — వేదానుసారము ఉన్న తన కర్తవ్యము; అపి — కూడా; చ — మరియు; అవేక్ష్య — పరిగణలో; న — కాదు; వికంపితుమ్ — చలించుట; అర్హసి — తగును; ధర్మ్యాత్ — ధర్మ పరిరక్షణకు; హి — నిజముగా; యుద్ధాత్ — యుద్ధము కంటే; శ్రేయః — శ్రేయస్సు; అన్యత్ — వేరే ఏది; క్షత్రియస్య — క్షత్రియుడికి; న — లేదు; విద్యతే — ఉండును.
BG 2.31: అంతేకాక, నీ యొక్క క్షత్రియ స్వ-ధర్మమును అనుసరించి నీవు చలింపరాదు. నిజానికి, ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయటమనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు.
స్వ-ధర్మం అనేది వేదాల అనుగుణంగా ఒక వ్యక్తి చేయవలసిన విధి. రెండు రకముల స్వ-ధర్మములు, వేదనిర్దేశిత విధులు ఉన్నాయి - 'పర ధర్మ' అంటే ఆధ్యాత్మిక విధులు మరియు 'అపర ధర్మ' అంటే ప్రాపంచిక విధులు. తనను తాను ఆత్మగా భావించినప్పుడు భగవంతుడిని ప్రేమించి, భక్తితో సేవించడమే చేయవలసిన విధి. దీనిని 'పర ధర్మ' అంటారు. కానీ, మానవాళిలో ఎక్కు...
https://www.holy-bhagava…udio/002_031.mp3
2
32
యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ । సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశమ్ ।। 32 ।।
యదృచ్ఛయా — కోరుకోకుండానే; చ — మరియు; ఉపపన్నం — వచ్చిన; స్వర్గ — స్వర్గ లోకములు; ద్వారం — తలుపు; అపావృతం — తెరిచి ఉన్న; సుఖినః — సంతోషము; క్షత్రియాః — క్షత్రియ వీరులు; పార్థ — అర్జునా, ప్రిథ తనయుడా; లభంతే — లభించును; యుద్ధం — యుద్ధము; ఈదృశం — ఇటువంటి.
BG 2.32: ఓ పార్థ, ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు, కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు. ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి.
సమాజాన్ని రక్షించటానికి క్షత్రియ జాతి అవసరం ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ ఉంది. వారి వృత్తి ధర్మం అనుసరించి, సమాజాన్ని రక్షించటానికి, వీరులు ధైర్య సహాసాలతో ఉండి అవసరమైతే తమ జీవితాలనే అర్పించాల్సి ఉంటుంది. వైదిక కాలంలో, జంతువులను చంపడం సమాజంలోని మిగిలిన వారికి నిషేధించబడినా, అరణ్యాలలోకి వెళ్ళి, యుద్ధ విద్య అభ్యసించటానికి జంతువ...
https://www.holy-bhagava…udio/002_032.mp3
2
33
అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి । తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి ।। 33 ।।
అథ చేత్ — కానీ ఒకవేళ; త్వం — నీవు; ఇమం — ఈ; ధర్మ్యం సంగ్రామం — ధర్మ యుద్ధం; న కరిష్యసి — చేయక పొతే; తతః — ఆ తరువాత; స్వ-ధర్మం — వేద విహిత కర్తవ్యము; కీర్తిం — పేరు ప్రఖ్యాతులు; చ — మరియు; హిత్వా — వదిలివేసి; పాపం — పాపము; అవాప్స్యసి — పొందుదువు.
BG 2.33: కానీ, ఒకవేళ నీవు స్వధర్మాన్ని, కీర్తిని విడిచి, ఈ ధర్మ యుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే, తప్పకుండా పాపాన్ని చేసినవాడివవుతావు.
యుద్ధభూమిలో ఒక యోధుడు అహింసా వాదుడు అయితే, అది కర్తవ్య ఉపేక్ష అవుతుంది, అంచేత ఒక పాపపు పనిగా పరిగణించబడుతుంది. సమస్యాత్మకమైనదిగా, చికాకుగా భావించి తన కర్తవ్యాన్ని విడిచిపెడితే, అర్జునుడు పాపానికి పాల్పడినట్టే అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. పరాశర స్మృతి ఇలా పేర్కొంటున్నది:క్షత్రియోః హి ప్రజా రక్షాంశస్త్రపాణిః ప్రదండవాన్...
https://www.holy-bhagava…udio/002_033.mp3
2
34
అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేఽవ్యయామ్ సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే ।। 34 ।।
అకీర్తిం — అపకీర్తి; చ — మరియు; అపి — కూడా; భూతాని — జనులు; కథయిష్యంతి — అంటారు; తే — నీ యొక్క; అవ్యయామ్ — ఎప్పటికీ ఉండిపోయే; సంభావితస్య — గౌరవప్రదమైనవానికి; చ — మరియు; అకీర్తిః — అపకీర్తి; మరణాత్ — మరణము కన్నా; అతిరిచ్యతే — అధికమైనది.
BG 2.34: జనులు నిన్ను పిరికివాడు, పారిపోయిన సైనికుడు అని అంటారు. గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణము కన్నా ఘోరమైనది.
గౌరవప్రదమైన వ్యక్తులకు సామాజిక ప్రతిష్ఠ చాలా ముఖ్యమైనది. క్షత్రియులకు సహజముగా ఉన్న గుణములు (ప్రకృతి త్రిగుణములు) వారికి కీర్తి, గౌరవం చాలా ముఖ్యమైన వాటిగా భావింపచేస్తాయి. వారికి అగౌరవం, అపకీర్తి అనేవి మరణం కన్నా నీచమైనవి. ఉత్తమ స్థాయి జ్ఞానాన్ని అందుకోకపోయినా కనీసం ఈ నిమ్న స్థాయి జ్ఞానము వల్ల నైనా ప్రేరణను పొందవచ్చు అన...
https://www.holy-bhagava…udio/002_034.mp3
2
35
భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః । యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ।। 35 ।।
భయాత్ — భయముతో; రణాత్ — యుద్ధ భూమి నుండి; ఉపరతం — పారిపోయి; మంస్యంతే — అనుకుంటారు; త్వాం — నీవు; మహా-రథాః — పదివేల మంది సాధారణ యోధుల బలంతో సరితూగగల యోధులు; యేషాం — ఎవరికైతే; చ — మరియు; త్వం — నీవు; బహు-మతః — గొప్ప గౌరవనీయుడు; భూత్వా — అయి ఉంటివో; యాస్యసి — నీవు పోగొట్టుకుంటావు; లాఘవమ్ — చులకన.
BG 2.35: ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో, వారు, నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు, అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు.
అర్జునుడు ఒక మహా యోధుడు అంతేకాక కౌరవ పక్షాన ఉన్న భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు వంటి అత్యంత సాహసవంతులకి కూడా గట్టి పోటీ ఇచ్చే ప్ర్యతర్థి. ఎంతో మంది దేవతలతో యుద్ధం చేసి కీర్తి సంపాదించుకున్నాడు. వేటగాడిలా మారు వేషంలో వచ్చిన శివుడిని కూడా పోరాడి మెప్పించాడు. అతని సాహసానికి, నైపుణ్యానికి మెచ్చి పాశుపతాస్త్రం అనే దివ్యా...
https://www.holy-bhagava…udio/002_035.mp3
2
36
అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః । నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ ।। 36 ।।
అవాచ్య-వాదాన్ — అనరాని మాటలతో (కఠిన మాటలు); చ — మరియు; బహూన్ — చాలా; వదిష్యంతి — అంటారు; తవ — నీ యొక్క; అహితాః — శత్రువులు; నిందంతః — నిందించుచు; తవ — నీ యొక్క; సామర్థ్యం — సామర్థ్యమును; తతః — అంత కంటే; దుఃఖ-తరం — ఎక్కువ బాధ; ను — నిజముగా; కిమ్ — ఏమిటి.
BG 2.36: నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు, దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది. అయ్యో, ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా?
ఒకవేళ అర్జునుడు యుద్ధ భూమి నుండి పారిపోతే తోటి వీరుల మధ్య అతని గొప్పతనం తగ్గిపోవడమే కాక, తను చులకనైపోతాడు. శ్రీ కృష్ణుడు నిందంతః అంటున్నాడు, అంటే 'నిందించుట, దూషించుట' అని. 'అవాచ్య వాదాన్' అంటే, 'నపుంసకుడు' వంటి కఠినమైన మాటలు. అర్జునుడి శత్రువులైన దుర్యోధనుడు వంటి వారు ‘చూడండి, ఈ చేతకాని అర్జునుడు యుద్ధ భూమి నుండి, కాళ...
https://www.holy-bhagava…udio/002_036.mp3
2
37
హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీమ్ । తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ।। 37 ।।
హతః — సంహరింపబడినచో; వా — లేదా; ప్రాప్స్యసి — పొందుతావు; స్వర్గం — స్వర్గమును; జిత్వా — గెలిచినచో; వా — లేదా; భోక్ష్యసే — అనుభవించెదవు; మహీమ్ — ఈ భూమండల రాజ్యమును; తస్మాత్ — కాబట్టి; ఉత్తిష్ఠ — లెమ్ము; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; యుద్ధాయ — యుద్ధమునకు; కృత-నిశ్చయ — దృఢ సంకల్పంతో.
BG 2.37: యుద్ధం చేస్తే నీవు, యుద్ధ రంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయెదవు, లేదా విజయుడవై ఈ భూమండలముపై రాజ్యమును అనుభవించెదవు. కావున, కృత నిశ్చయుడవై లెమ్ము, ఓ కుంతీ పుత్రుడా, యుద్ధానికి సిద్ధముకమ్ము.
2.31వ శ్లోకం నుండి శ్రీ కృష్ణుడు ఇంకా వృత్తికి సంబంధించిన విధుల స్థాయిలోనే బోధిస్తున్నాడు. తన కర్తవ్య నిర్వహణ వలన రెండు పరిణామాలు తలెత్తే అవకాశం ఉంది అని అర్జునుడికి వివరిస్తున్నాడు. అర్జునుడు విజయుడైతే, భూలోకంలో సామ్రాజ్యం అతనికోసం ఉంటుంది, ఒకవేళ కర్తవ్య నిర్వహణ లో ప్రాణాలు విడిచి పెట్టవలసి వస్తే, అతను స్వర్గ లోకాలకు ...
https://www.holy-bhagava…udio/002_037.mp3
2
38
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ । తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ।। 38 ।।
సుఖ — సుఖము; దుఃఖే — దుఃఖములో; సమే కృత్వా — సమానముగా భావించి; లాభ-అలాభౌ — లాభ నష్టములు; జయ-అజయౌ — గెలుపు ఓటములు; తతః — అ తరువాత; యుద్ధాయ — యుద్ధమునకు; యుజ్యస్వ — సిద్దుడవు అవుము; న — కాదు; ఏవం — ఈ విధముగా; పాపం — పాపము; అవాప్స్యసి — పొందెదవు.
BG 2.38: సుఖ-దుఃఖాలని, లాభ-నష్టాలని మరియు జయాపజయములను సమానంగా తీసుకుంటూ, కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము. నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు.
లౌకిక స్థాయి నుండి అర్జునుడిని ఉత్సాహపరిచిన పిదప, శ్రీ కృష్ణుడు, ఇప్పుడు కర్మశాస్త్ర విషయంలో మరింత లోనికి వెళుతున్నాడు. శత్రువులను సంహరించటం వలన పాపం తగులుతుందని అర్జునుడు భయాన్ని వ్యక్తం చేశాడు. శ్రీ కృష్ణుడు ఈ భయాన్ని పోగొడుతున్నాడు. కర్మ ఫలాలపై ఆసక్తి లేకుండా తన కర్తవ్యాన్నినిర్వర్తించమని అర్జునుడికి ఉపదేశము చేస్తున...
https://www.holy-bhagava…udio/002_038.mp3
2
39
ఏషా తేఽభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు । బుధ్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి ।। 39 ।।
ఏషా — ఇప్పటివరకు; తే — నీకు; అభిహితా — తెలుపబడినది; సాంఖ్యే — విశ్లేషణాత్మక జ్ఞానం ద్వారా; బుద్ధిః యోగే — బుద్ధి యోగం ద్వారా; తు — నిజముగా; ఇమాం — ఇది; శృణు — వినుము; బుధ్ధ్యా — అర్థం చేసుకోవటం ద్వారా; యుక్తః — కలిసి; యయా — దేని వలన అయితే; పార్థ — అర్జున, ఫ్రిథ పుత్రుడా; కర్మ-బంధం — కర్మ బంధము; ప్రహాస్యసి — నుండి నీవు ...
BG 2.39: ఇప్పటివరకు, నేను నీకు సాంఖ్య యోగం, అంటే, ఆత్మ తత్త్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానమును, వివరించాను. ఇప్పుడు వినుము, ఓ పార్థ, నేను బుద్ధి యోగాన్ని విశదీకరిస్తాను. ఇలాంటి అవగాహనతో పని చేసినప్పుడు, నీవు కర్మ బంధములనుండి విముక్తి పొందెదవు.
సాంఖ్య అన్న పదం, సాన్, అంటే ‘సంపూర్ణముగా’ మరియు ‘ఖ్యా' ,అంటే ‘తెలుసుకొనుట’ అన్న మూల ధాతువుల నుండి వచ్చింది. కాబట్టి 'సాంఖ్య' అంటే ‘ఒకదాని గురించి పూర్తి విశ్లేషణాత్మక జ్ఞానం’ అని అర్థం. భారతీయ తత్త్వశాస్త్రంలోని ఆరు తాత్త్విక గ్రంథాలలో ఒకటైన 'సాంఖ్య దర్శనం', బ్రహ్మాండములోని పదార్థములకు ఒక విశ్లేషణాత్మక వివరణ తెలుపుతుం...
https://www.holy-bhagava…udio/002_039.mp3
2
40
నేహాభిక్రమనాశోఽస్తి ప్రత్యవాయో న విద్యతే । స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ।। 40 ।।
న — కాదు; ఇహ — దీనిలో; అభిక్రమ — ప్రయత్నములు; నాశః — నష్టము; అస్తి — ఉండును; ప్రత్యవాయః — ప్రతికూల ఫలితములు; న — కాదు; విద్యతే — ఉండును; సు-అల్పం — ఏ కొంచెము; ఆపి — కూడా; అస్య — దీని; ధర్మస్య — ధర్మము యొక్క; త్రాయతే — కాపాడును; మహతః — గొప్ప; భయాత్ — ప్రమాదం నుండి.
BG 2.40: ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు, ఎలాంటి నష్టము కానీ వ్యతిరేక ఫలితములు కానీ కలుగవు. కొద్దిగా సాధన చేసినా అది మనలని పెద్ద ప్రమాదం నుండి కాపాడును.
మనం ఎదుర్కునే గొప్ప ప్రమాదం ఏమిటంటే మనకు వచ్చే జన్మలో మానవ శరీరం లభించక పోవచ్చు; బదులుగా, నిమ్న స్థాయి జీవ జాతులలోకి అంటే పశువులు, పక్షులు వంటివి, లేదా అధోలోక జీవజాతుల్లోకి వెళ్ళవచ్చు. మానవ జీవితం మనకు ఎలాగూ వచ్చేదేలే అని భావించలేము, ఎందుకంటే తదుపరి ఎలాంటి జన్మ ఉండాలో, మన కర్మలను బట్టి మరియు మన జ్ఞానం యొక్క స్థాయిని బట...
https://www.holy-bhagava…udio/002_040.mp3
2
41
వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన । బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్ ।। 41 ।।
వ్యవసాయ-ఆత్మికా — దృఢమైన; బుద్ధిః — బుద్ధి; ఏకా — ఒకటి; ఇహ — ఈ పథములో; కురు-నందన — కురు వంశీయుడా; బహు-శాఖాః — అనేక-శాఖలుగా; హి — నిజముగా; అనంతాః — అంతులేని; చ — మరియు; బుద్ధయః — బుద్ధి; అవ్యవసాయినామ్ — దృఢ సంకల్పం లేని.
BG 2.41: ఓ కురు వంశజుడా, ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా/స్థిరంగా ఉంటుంది, మరియు వారి లక్ష్యము ఒక్కటే. కానీ, దృఢసంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది.
మమకారాసక్తి అనేది మనస్సు యొక్క లక్షణం. ఇదెలా వ్యక్తమవుతుందంటే, మనస్సు పదేపదే మమకార వస్తు/విషయం వైపు పరుగులు తీస్తుంది, అవి వ్యక్తులు, ఇంద్రియ విషయములు, ప్రతిష్ఠ, శారీరక సుఖాలు, పరిస్థితులు మొదలగునవి కావచ్చు. కాబట్టి ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క తలంపులు పదేపదే మనస్సుకు వస్తుంటే అది, దాని పట్ల మన మనస్సుకి అనుబంధం ఏర్పడి...
https://www.holy-bhagava…udio/002_041.mp3
2
42
యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః । వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ।। 42 ।। కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ । క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ।। 43 ।।
యామ్ ఇమాం — ఇవన్నీ; పుష్పితాం — ఆకర్షణీయమైన; వాచం — మాటలు; ప్రవదంతి — అంటారు; అవిపశ్చితః — పరిమితమైన అవగాహన కలవారు; వేద-వాద-రతాః — వేదములోని ఫలశృతి మీద ఆసక్తి కలవారు; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; న అన్యత్ అస్తి — వేరేది ఏదీ లేదు; ఇతి — ఈ విధంగా; వాదినః — వాదిస్తారు; కామ-ఆత్మానః — ఇంద్రియ సుఖములపై ఆసక్తితో; స్వర్గ-ప...
BG 2.42-43: పరిమితమైన అవగాహన కలవారు, స్వర్గలోక ప్రాప్తి కోసం, డాంభికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరచే మాటలకు ఆకర్షితులౌతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు. తమకు ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపచేసే వేదాల్లోని ఆయా భాగాలని ప్రశంసిస్తారు మరియు ఉన్నత జ...
వేదాలు మూడు భాగాలుగా విభజించబడ్డాయి. అవి: కర్మ-కాండ, జ్ఞాన-కాండ, మరియు ఉపాసన-కాండ. భౌతిక ప్రతిఫలాల కోసం మరియు స్వర్గాది ఉత్తమ లోక ప్రాప్తి కోసం ఆచరించే వైదిక కర్మలు, కర్మ-కాండలో సూచించబడ్డాయి. ఇంద్రియ భోగాలు కోరుకునే వారు వేదాలలోని ఈ భాగాన్ని స్తుతిస్తారు.దేవతాలోకాల్లో ఉన్నతమైన భౌతిక విలాసములు ఉంటాయి మరియు అవి మరింత ఎక...
https://www.holy-bhagava…/002_042-043.mp3

భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్ । వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ।। 44 ।।
భోగ — భోగములు; ఐశ్వర్య — విలాసము; ప్రసక్తానాం — మిక్కిలి మమకారాసక్తి ఉన్నవారికి; తయా — దాని వలన; అపహృత-చేతసామ్ — బుద్ధి భ్రమించిన; వ్యవసాయ-ఆత్మికా — నిశ్చయమైన; బుద్ధిః — బుద్ధి; సమాధౌ — సాఫల్యం; న — కాదు; విధీయతే — సాధ్యము.
BG 2.44: ప్రాపంచిక భోగాలు, సుఖాల పట్ల మనస్సు మిక్కిలి మమకారాసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు ఇటువంటి వాటిచే చిత్తభ్రాంతికి లోనయ్యి, వారు, భగవత్-ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు.
మనస్సులో ఇంద్రియసుఖాల పట్ల ఆసక్తి ఉన్నవారు భోగాలు, ఐశ్వర్యముల కోసం ప్రాకులాడుతుంటారు. సంపాదనను పెంపొందించుకోవటానికి తమ బుద్ధి వాడుతూ, ఎలా ఇంకా ఎక్కువ భౌతిక సంపత్తి సమకూర్చుకుని, శారీరక సుఖానుభవములు మరింత పొందుదామా అని విచారిస్తుంటారు. ఈ విధంగా భ్రమకి లోనయ్యి, భగవత్ ప్రాప్తి పథంలో పయనించటానికి కావలిసిన దృఢ సంకల్పాన్ని అ...
https://www.holy-bhagava…udio/002_044.mp3
2
45
త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున । నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ।। 45 ।।
త్రై-గుణ్య — భౌతికప్రకృతి యొక్క త్రి-గుణాత్మకమైన; విషయాః — విషయములు; వేదాః — వేద శాస్త్రములు; నిస్త్రై-గుణ్యః — త్రిగుణములకు అతీతంగా; భవ — ఉండుము; అర్జున — అర్జున; నిర్ద్వంద్వః — ద్వంద్వములకు అతీతంగా; నిత్య-సత్వ-స్థః — నిత్యము సత్యములో స్థితుడై ఉండి; నిర్యోగ-క్షేమ — యోగ క్షేమములు గురించి పట్టించుకోని; ఆత్మ-వాన్ — ఆత్మ ...
BG 2.45: ఓ అర్జునా, వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రి-గుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును. నీవు ఈ త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము. ద్వంద్వముల నుండి విడివడి, నిత్యమూ పరమ-సత్యంలో స్థితమై ఉండి, మరియు భౌతిక లాభాలు, భద్రతల గురించి పట్టించుకోకుండా, ఆత్మ భావన యందే స్థిత...
భౌతిక శక్తి తన మూడు గుణములచే దివ్యమైన జీవాత్మను శారీరక భావనలో బంధించివేస్తుంది. ఈ మూడు ప్రకృతి గుణములు ఏమిటంటే, సత్త్వ గుణము, రజో గుణము, మరియు తమో గుణము. లెక్కలేనన్ని గత జీవితాల నుండి వస్తున్న తమతమ పూర్వ జన్మ సంస్కారాల వలన ప్రతి వ్యక్తిలో ఈ గుణాలు వేరువేరు పాళ్ళలో ఉంటాయి, తదనుగుణంగా ప్రతి ఒక్కరూ వేరువేరు స్వభావాలు, ధోర...
https://www.holy-bhagava…udio/002_045.mp3
2
46
యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే । తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ।। 46 ।।
యావాన్ — ఏదేని; అర్థః — ప్రయోజనం ; ఉద-పానే — నీటి బావి; సర్వతః — అన్ని విధములుగా; సంప్లుత-ఉదకే — ఒక పెద్ద సరస్సు; తావాన్ — అంత; సర్వేషు — అన్నీ విధములుగా; వేదేషు — వేదములు; బ్రాహ్మణస్య — పరమ సత్యం తెలిసినవానికి (బ్రహ్మ జ్ఞాని); విజానతః — సంపూర్ణ జ్ఞానికి.
BG 2.46: ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి. అదే ప్రకారంగా, పరమ సత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే.
వేదములు, ఎన్నో రకాల కర్మకాండలు, ఆచారాలు, పద్ధతులు, పూజలు, వైదిక కార్యక్రమాలు, మరియు జ్ఞాన రత్నాలను వివరించే ఒక లక్ష మంత్రములను కలిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే ఒక ప్రయోజనం కోసం ఇవ్వబడ్డాయి – జీవాత్మని పరమాత్మ దగ్గరికి చేర్చటమే.వాసుదేవ-పరా వేదా వాసుదేవ-పరా మఖాఃవాసుదేవ-పరా యోగా వాసుదేవ-పరాః క్రియాఃవాసుదేవ-పరం జ్ఞానం వాసుదే...
https://www.holy-bhagava…udio/002_046.mp3
2
47
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన । మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి ।। 47 ।।
కర్మణి — విధింపబడిన (వేదవిహిత) కర్మాచరణమునందు; ఏవ — మాత్రమే; అధికారః — హక్కు; తే — నీకు; మా — లేదు; ఫలేషు — దాని ఫలముల యందు; కదాచన — ఎప్పుడూ కూడా; మా — కాదు; కర్మ-ఫల — కర్మఫలములు; హేతుః — కారణము; భూః — అవును; మా — కూడదు; తే — నీ యొక్క; సంగః — ఆసక్తి (మమకారము); అస్తు — ఉండుట; అకర్మణి — కర్మను మానుటయందు.
BG 2.47: శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మ ఫలముల పైన నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు.
ఇది భగవద్గీతలో ఒక అత్యంత ప్రసిద్ధ శ్లోకము, ఇది ఎంతగా ప్రజాదరణ పొందిందంటే భారతదేశంలో చాల మంది స్కూలు పిల్లలకి కూడా ఇది తెలుసు. ఇది కర్మ సిద్ధాంతం గురించి లోతైన అవగాహన కల్పిస్తుంది మరియు కర్మ-యోగ విషయం ఎప్పుడు చర్చించబడినా ఈ శ్లోకం ప్రస్తావించబడుతుంది. ఈ శ్లోకం కర్మ సిద్ధాంతం గురించి నాలుగు సూచనలను చెప్తున్నది. 1) నీ కర్...
https://www.holy-bhagava…udio/002_047.mp3
2
48
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ । సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ।। 48 ।।
యోగ-స్థః — యోగములో స్థిరముగా ఉండి; కురు — చేయుము; కర్మాణి — కర్మలు (విధులు) సంగం — మమకారం (ఆసక్తి); త్యక్త్వా — విడిచిపెట్టి (త్యజించి); ధనంజయ — అర్జునా; సిద్ధి-అసిద్ధ్యోః — గెలుపు-ఓటమిలలో; సమః — సమముగా ఉండి; భూత్వా — కలిగి ఉండి; సమత్వం — సమదృష్టి; యోగః — యోగము; ఉచ్యతే — చెప్పబడును.
BG 2.48: జయాపజయముల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి, ఓ అర్జునా, నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము. ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పబడును.
అన్ని పరిస్థితులనీ ప్రశాంత చిత్తంతో సమానంగా స్వీకరించటం అనేది ఎంత మెచ్చదగినదంటే శ్రీ కృష్ణుడు దానిని 'యోగం' అంటాడు అంటే పరమాత్మతో ఐక్యత. ఈ సమత్వ బుద్ధి అనేది పూర్వ శ్లోకం యొక్క విజ్ఞానాన్ని అమలుపరచటం ద్వారా వస్తుంది. మన కృషి మాత్రమే మన చేతుల్లో ఉంది ఫలితము కాదు అని అర్థం చేసుకున్నప్పుడు మన కర్తవ్య నిర్వహణ మీద మాత్రమే మ...
https://www.holy-bhagava…udio/002_048.mp3
2
49
దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ । బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ।। 49 ।।
దూరేణ — (త్యజించు) దూరము నుండే; హి — నిజముగా; అవరం — నిమ్న స్థాయి లోనున్న; కర్మ — ఫలాపేక్షతో చేసే పనులు; బుద్ధి-యోగాత్ — దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము నందే బుద్ధి స్థిరముగా ఉంచి; ధనంజయ — అర్జునా; బుద్ధౌ — ఆధ్యాత్మిక జ్ఞానము, ఆంతర-దృష్టి; శరణం — ఆశ్రయం(శరణము); అన్విచ్ఛ — వెదుకుము; కృపణాః — లోభి/పిసినారి; ఫల-హేతవః — కర్మ ఫలము...
BG 2.49: దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము, ఓ అర్జునా, ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము; బుద్ధిని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా, అవి నిమ్న స్థాయికి చెందినవి. తమ కర్మ ఫలములను తామే భోగించగోరే వారు లోభులు/పిసినారులు.
పనికి రెండు దృష్టికోణాలున్నాయి: 1) మనం బాహ్యంగా చేసే క్రియ 2) దాని పట్ల మన అంతర్గతంగా ఉన్న దృక్పథం. ఉదాహరణకి బృందావన పుణ్యక్షేత్రంలో ఒక దేవాలయం కడుతున్నారనుకోండి. అక్కడి పనివారు ఒక పుణ్య కార్యంలో పాలుపంచుకున్నట్టే, కానీ వారి దృక్పథం ప్రాపంచికమైనది. వారికి వారి జీతం గురించే ఆలోచన. మరొక కాంట్రాక్టర్ ఎక్కువ జీతం ఇస్తానంటే...
https://www.holy-bhagava…udio/002_049.mp3
2
50
బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే । తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ।। 50 ।।
బుద్ధి-యుక్తః — జ్ఞాన సంపన్నుడవై; జహాతి — త్యజించుము; ఇహ — ఈ జన్మలో; ఉభే — రెంటినీ; సుకృత-దుష్కృతే — మంచి, చెడు కార్యములు; తస్మాత్ — కాబట్టి; యోగాయ — యోగము కొరకు; యుజ్యస్వ — గట్టిగా ప్రయత్నింపుము; యోగః — యోగ అంటే; కర్మసు కౌశలమ్ — నేర్పుతో పని చేసే కళ.
BG 2.50: వివేకముతో ఈ ఫలాసక్తిరహిత కర్మ శాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మ లోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించును. కాబట్టి, నైపుణ్యంతో (సరియైన దృక్పథంతో) పని చేయటం అనే, యోగ అభ్యాసము చేయుము.
తరచుగా, కర్మయోగ శాస్త్రం విన్న పిదప, జనులు ఒక సందేహం వ్యక్తం చేస్తారు; ఫలితాలపై ఆసక్తి/మమకారం వదిలేస్తే, వారి కార్యనిర్వహణ శక్తి తరిగిపొదా? అని. స్వార్థ ప్రయోజనాలను విడిచి పనిచేస్తే మనపని లోని నాణ్యత ఏ మాత్రం తగ్గదని; పైగా, మన నైపుణ్యత ఇంకా మెరుగవుతుందని, శ్రీ కృష్ణుడు అంటున్నాడు. తన చికిత్సా ప్రక్రియలో రోగులను కత్త...
https://www.holy-bhagava…udio/002_050.mp3
2
51
కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః । జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ ।। 51 ।।
కర్మ-జం — కర్మల వలన జనించే; బుద్ధి-యుక్తాః — సమత్వ బుద్ధి కలవారై; హి — ఎట్లయితే ; ఫలం — ఫలములు; త్వక్త్వా — విడిచిపెట్టి; మనీషిణః — జ్ఞానులు; జన్మ-బంధ-వినిర్ముక్తాః — జీవన్మరణ బంధముల నుండి విముక్తులై; పదం — స్థితి; గచ్ఛంతి — పొందుదురు; అనామయమ్ — దుఃఖరహితమైన.
BG 2.51: జ్ఞానులు, సమత్వ బుద్ధి కలిగి ఉండి, జననమరణ చక్రంలో బంధించే కర్మ ఫలములపై మమకార-ఆసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి దృక్పథంతో పని చేయటం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందెదరు.
ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరించమని చెప్పటం కొనసాగిస్తూ, అది వ్యక్తిని బాధా-రహిత స్థితికి చేరుస్తుందని శ్రీ కృష్ణుడు మరింత పేర్కొంటున్నాడు. జీవితంలో వైరుద్ధ్యము ఎలా ఉంటుందంటే, మనం సంతోషం కోసం ప్రయత్నిస్తాము కానీ దుఃఖమే అందుతుంది, ప్రేమ కోసం తపిస్తాము కానీ నిరాశే ఎదురవుతుంది, జీవించాలని కోరుకుంటాము కానీ మరణం వైపుగా ప్రతి...
https://www.holy-bhagava…udio/002_051.mp3
2
52
యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి । తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ।। 52 ।।
యదా — ఎప్పుడైతే; తే — నీ యొక్క; మోహ — మోహము ; కలిలం — క్లిష్టపరిస్థితి (ఊబి); బుద్ధిః — బుద్ధి; వ్యతితరిష్యతి — దాటిపోవును; తదా — అప్పుడు; గంతాసి — నీవు పొందెదవు; నిర్వేదం — వైరాగ్యమును; శ్రోతవ్యస్య — ఇంకా వినబోయే దానికి; శ్రుతస్య — ఇప్పటి దాక విన్న దానికి; చ — మరియు.
BG 2.52: మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి, ఇక వినబోయేదాని గురించి వైరాగ్యం కలుగుతుంది. (ఇహపర లోక భోగముల విషయంలో).
ప్రాపంచిక భోగాలపై ఆసక్తి ఉన్నవారు, భౌతిక ఐశ్వర్యములు మరియు స్వర్గాది లోకములను పొందించే, వేదాలలోని ఆడంబరమైన కర్మ కాండలు చెప్పే భాగాల పట్ల ఆకర్షితులౌతారు, అని శ్రీకృష్ణుడు ఇంతకు క్రితం చెప్పిఉన్నాడు (2.42-2.43వ శ్లోకాలు). కానీ, ఎవని బుద్ధి అయితే ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రకాశిస్తుందో వాడు, భౌతిక ఇంద్రియ సుఖాలు దుఃఖహేతువులే అ...
https://www.holy-bhagava…udio/002_052.mp3
2
53
శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా । సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి ।। 53 ।।
శృతి-విప్రతిపన్నా — కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా; తే — నీ యొక్క; యదా — ఎప్పుడైతే; స్థాస్యతి — ఉండునో; నిశ్చలా — నిశ్చలంగా; సమాధౌ — భగవంతుని యందు; అచలా — స్థిరముగా; బుద్ధిః — బుద్ధి; తదా — అప్పుడు; యోగం — యోగము; అవాప్స్యసి — నీవు పొందెదవు.
BG 2.53: కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందెదవు.
సాధకులు ఆధ్యాత్మిక పథంలో పురోగమించేటప్పుడు తమ మనస్సులో వారికి భగవంతునితో సంబంధం బలపడుతూ ఉంటుంది. ఆ సమయంలో, తాము పూర్వం చేసే వైదిక కర్మలు ప్రతిబంధకంగా, సమయం తీసుకునేవిగా అనిపిస్తాయి. తమ భక్తితో పాటుగా ఇంకా పూజలు మొదలగునవి చేయాలా అని అనుకుంటారు మరియు పూజాది కార్యాలను వదిలి పూర్తిగా సాధనలో నిమగ్నమైతే ఏదైనా తప్పు చేసినట్టవ...
https://www.holy-bhagava…udio/002_053.mp3