Buckets:
| # బహుళ సీక్వెన్స్‌ల నిర్వహణ[[handling-multiple-sequences]] | |
| మునుపటి విభాగంలో, చిన్న పొడవు ఉన్న ఒకే సీక్వెన్స్‌పై inference చేయడం లాంటి అత్యంత సరళమైన ఉపయోగం చూశాం. కానీ అక్కడే కొన్ని ప్రశ్నలు వస్తాయి: | |
| - బహుళ సీక్వెన్స్‌లను ఎలా హ్యాండిల్ చేస్తాం? | |
| - *భిన్నమైన పొడవు* ఉన్న బహుళ సీక్వెన్స్‌లను ఎలా హ్యాండిల్ చేస్తాం? | |
| - vocabulary indices (input IDs) మాత్రమే మోడల్ బాగా పని చేయడానికి సరిపోతాయా? | |
| - సీక్వెన్స్ చాలా ఎక్కువగా ఉండటం కూడా సమస్యగా మారుతుందా? | |
| ఇప్పుడు ఈ ప్రశ్నలు ఏరకమైన సమస్యలను కలిగిస్తాయో, వాటిని 🤗 Transformers API తో ఎలా పరిష్కరించాలో చూద్దాం. | |
| ## మోడళ్లు batch రూపంలో ఇన్‌పుట్‌లను ఆశిస్తాయి[[models-expect-a-batch-of-inputs]] | |
| మునుపటి exercise లో, సీక్వెన్స్‌లు సంఖ్యల జాబితాగా ఎలా మారతాయో చూశారు. | |
| ఇప్పుడు ఆ సంఖ్యల జాబితాను టెన్సర్‌గా మార్చి మోడల్‌కి పంపుదాం: | |
| ```py | |
| import torch | |
| from transformers import AutoTokenizer, AutoModelForSequenceClassification | |
| checkpoint = "distilbert-base-uncased-finetuned-sst-2-english" | |
| tokenizer = AutoTokenizer.from_pretrained(checkpoint) | |
| model = AutoModelForSequenceClassification.from_pretrained(checkpoint) | |
| sequence = "I've been waiting for a HuggingFace course my whole life." | |
| tokens = tokenizer.tokenize(sequence) | |
| ids = tokenizer.convert_tokens_to_ids(tokens) | |
| input_ids = torch.tensor(ids) | |
| # This line will fail. | |
| model(input_ids) | |
| ``` | |
| ```python out | |
| IndexError: Dimension out of range (expected to be in range of [-1, 0], but got 1) | |
| ``` | |
| అయ్యో! ఇది ఎందుకు fail అయింది? సెక్షన్ 2 లో pipeline ఉపయోగించిన స్టెప్పులనే ఇక్కడ కూడా పాటించాం కదా. | |
| సమస్య ఏమిటంటే, మనం మోడల్‌కి ఒక్క సీక్వెన్స్ మాత్రమే పంపాం, కానీ 🤗 Transformers మోడళ్లు default గా బహుళ వాక్యాలను (multiple sentences) ఆశిస్తాయి. | |
| ఇక్కడ మనం tokenizer `sequence` మీద వెనుకపట్లో చేసే పని మనమే చేతితో చేయడానికి ప్రయత్నించాం. కానీ బాగా గమనిస్తే, tokenizer input IDs లిస్ట్‌ను టెన్సర్‌గా మార్చడమే కాకుండా, దానిపై అదనంగా ఒక dimension కూడా వేసింది: | |
| ```py | |
| tokenized_inputs = tokenizer(sequence, return_tensors="pt") | |
| print(tokenized_inputs["input_ids"]) | |
| ``` | |
| ```python out | |
| tensor([[ 101, 1045, 1005, 2310, 2042, 3403, 2005, 1037, 17662, 12172, | |
| 2607, 2026, 2878, 2166, 1012, 102]]) | |
| ``` | |
| ఇప్పుడు మనమే ఆ కొత్త dimension ను జోడించి మళ్లీ ప్రయత్నిద్దాం: | |
| ```py | |
| import torch | |
| from transformers import AutoTokenizer, AutoModelForSequenceClassification | |
| checkpoint = "distilbert-base-uncased-finetuned-sst-2-english" | |
| tokenizer = AutoTokenizer.from_pretrained(checkpoint) | |
| model = AutoModelForSequenceClassification.from_pretrained(checkpoint) | |
| sequence = "I've been waiting for a HuggingFace course my whole life." | |
| tokens = tokenizer.tokenize(sequence) | |
| ids = tokenizer.convert_tokens_to_ids(tokens) | |
| input_ids = torch.tensor([ids]) | |
| print("Input IDs:", input_ids) | |
| output = model(input_ids) | |
| print("Logits:", output.logits) | |
| ``` | |
| ఇప్పుడు input IDs ని, అలాగే లభించిన logits ని ప్రింట్ చేస్తాం — అవి ఈ విధంగా ఉంటాయి: | |
| ```python out | |
| Input IDs: [[ 1045, 1005, 2310, 2042, 3403, 2005, 1037, 17662, 12172, 2607, 2026, 2878, 2166, 1012]] | |
| Logits: [[-2.7276, 2.8789]] | |
| ``` | |
| *Batching* అంటే, ఒకేసారి బహుళ వాక్యాలను (multiple sentences) మోడల్‌కి పంపడం. | |
| మీ దగ్గర ఒక్క sentence మాత్రమే ఉన్నా, ఆ ఒక్క సీక్వెన్స్‌తోనే ఒక batch నిర్మించవచ్చు: | |
| ``` | |
| batched_ids = [ids, ids] | |
| ``` | |
| ఇది ఇప్పుడు రెండు ఒకే సీక్వెన్స్‌లను కలిగిన ఒక batch! | |
| ✏️ **ప్రయత్నించండి!** ఈ `batched_ids` లిస్ట్‌ను టెన్సర్‌గా మార్చి మీ మోడల్‌లోకి పంపండి. | |
| ముందు వచ్చిన logits మాదిరిగానే (కానీ రెండుసార్లు) వస్తున్నాయో చూడండి! | |
| Batching ద్వారా, మీరు బహుళ వాక్యాలను మోడల్‌కి పంపినప్పుడు అది సరిగ్గా పని చేస్తుంది. | |
| ఒక సీక్వెన్స్‌తో batch తయారుచేసినట్లే, బహుళ సీక్వెన్స్‌లతో కూడా batch తయారుచేయడం అంతే సులభం. | |
| కానీ ఇక్కడ రెండో సమస్య వస్తుంది: మీరు రెండు (లేదా అంతకంటే ఎక్కువ) వాక్యాలను batch లో కలపాలనుకుంటే, అవి ఒక్కోటి ఒక్కో పొడవు (length) లో ఉండవచ్చు. | |
| టెన్సర్‌లతో ముందే పని చేసి ఉంటే, అవి rectangular shape లో ఉండాల్సిందేనని మీకు తెలుసు; కాబట్టి input IDs జాబితాను నేరుగా టెన్సర్‌గా మార్చలేం. | |
| ఈ సమస్యను పరిష్కరించడానికి, సాధారణంగా మనం ఇన్‌పుట్‌లను *pad* చేస్తాం. | |
| ## ఇన్‌పుట్‌లను padding చేయడం[[padding-the-inputs]] | |
| క్రింద ఉన్న list of lists ను నేరుగా టెన్సర్‌గా మార్చలేం: | |
| ```py no-format | |
| batched_ids = [ | |
| [200, 200, 200], | |
| [200, 200] | |
| ] | |
| ``` | |
| దీనిని పరిష్కరించడానికి, మనం *padding* ఉపయోగిస్తాం, తద్వారా టెన్సర్‌లు rectangular shape లో ఉంటాయి. | |
| Padding ద్వారా, అన్ని వాక్యాలూ ఒకే పొడవు కలిగేలా, తక్కువ పదాలు ఉన్న వాక్యాలకు ప్రత్యేక పదమైన *padding token* ను చివరలో జోడిస్తాం. | |
| ఉదాహరణకు, 10 వాక్యాలు ఒక్కోటి 10 పదాలతో ఉండి, మరో ఒక వాక్యం 20 పదాలతో ఉందనుకోండి; padding చేసిన తర్వాత, అన్ని వాక్యాలూ 20 పదాలు కలిగి ఉంటాయి. | |
| మన ఉదాహరణలో, చివరికి వచ్చిన టెన్సర్ ఇలా కనిపిస్తుంది: | |
| ```py no-format | |
| padding_id = 100 | |
| batched_ids = [ | |
| [200, 200, 200], | |
| [200, 200, padding_id], | |
| ] | |
| ``` | |
| Padding token యొక్క ID ని `tokenizer.pad_token_id` లో చూడవచ్చు. | |
| ఇప్పుడిదాన్ని ఉపయోగించి, మన రెండు వాక్యాలను ఒక్కోసారి విడివిడిగా, అలాగే batch గా కలిపి మోడల్‌లోకి పంపుదాం: | |
| ```py no-format | |
| model = AutoModelForSequenceClassification.from_pretrained(checkpoint) | |
| sequence1_ids = [[200, 200, 200]] | |
| sequence2_ids = [[200, 200]] | |
| batched_ids = [ | |
| [200, 200, 200], | |
| [200, 200, tokenizer.pad_token_id], | |
| ] | |
| print(model(torch.tensor(sequence1_ids)).logits) | |
| print(model(torch.tensor(sequence2_ids)).logits) | |
| print(model(torch.tensor(batched_ids)).logits) | |
| ``` | |
| ```python out | |
| tensor([[ 1.5694, -1.3895]], grad_fn=) | |
| tensor([[ 0.5803, -0.4125]], grad_fn=) | |
| tensor([[ 1.5694, -1.3895], | |
| [ 1.3373, -1.2163]], grad_fn=) | |
| ``` | |
| ఇక్కడ batched predictions లో logits లో ఏదో తేడా ఉంది: రెండో row, రెండో వాక్యాన్ని విడిగా పంపినప్పుడు వచ్చిన logits మాదిరిగానే ఉండాలి, కానీ పూర్తిగా వేరు values వచ్చాయి! | |
| దీనికి కారణం, Transformer మోడళ్లలో ప్రధాన పాత్ర పోషించే attention layers — ఇవి ప్రతి token ను దాని *context* తో కలిపి చూడడానికి ప్రయత్నిస్తాయి. | |
| ఇవి padding tokens ను కూడా గమనిస్తాయి, ఎందుకంటే అవి సీక్వెన్స్‌లోని అన్ని tokens పై దృష్టి పెడతాయి. | |
| కాబట్టి, వేర్వేరు పొడవు ఉన్న వాక్యాలను విడిగా మోడల్‌కి పంపినా, అదే వాక్యాలను padding తో కూడిన batch గా పంపినా, ఒకే ఫలితాలు రావాలంటే, attention layersకు padding tokens ను *పట్టించుకోవద్దు* అని చెప్పాలి. ఇది *attention mask* ద్వారా చేస్తాం. | |
| ## Attention masks[[attention-masks]] | |
| *Attention mask* అనేది input IDs టెన్సర్‌కి అచ్చం అదే రూపంలో ఉండే టెన్సర్, కానీ 0లూ 1లతో నిండినది: | |
| 1 ఉన్న స్థానాల్లోని tokens పై మోడల్ దృష్టి పెట్టాలి, 0 ఉన్న స్థానాల్లోని tokens ను దృష్టి పెట్టకూడదు (అంటే, ఆ tokens ను attention layers పూర్తిగా *ignore* చేయాలి). | |
| ఇప్పుడు ముందున్న ఉదాహరణకే ఒక attention mask జోడిద్దాం: | |
| ```py no-format | |
| batched_ids = [ | |
| [200, 200, 200], | |
| [200, 200, tokenizer.pad_token_id], | |
| ] | |
| attention_mask = [ | |
| [1, 1, 1], | |
| [1, 1, 0], | |
| ] | |
| outputs = model(torch.tensor(batched_ids), attention_mask=torch.tensor(attention_mask)) | |
| print(outputs.logits) | |
| ``` | |
| ```python out | |
| tensor([[ 1.5694, -1.3895], | |
| [ 0.5803, -0.4125]], grad_fn=) | |
| ``` | |
| ఇప్పుడు batch లో రెండో వాక్యానికి వచ్చిన logits, ఆ వాక్యాన్ని విడిగా పంపినప్పుడు వచ్చిన logitsల మాదిరిగానే ఉన్నాయి. | |
| గమనించండి: రెండో సీక్వెన్స్ లో చివరి విలువ padding ID కి సంబంధించినది; దానికి attention mask లో 0 ఉంది. | |
| ✏️ **ప్రయత్నించండి!** సెక్షన్ 2 లో ఉపయోగించిన రెండు వాక్యాల (`"I've been waiting for a HuggingFace course my whole life."` మరియు `"I hate this so much!"`) మీద టోకనైజేషన్‌ను చేతితో చేయండి. | |
| వాటిని మోడల్‌కి విడివిడిగా పంపి, సెక్షన్ 2 లో వచ్చిన logits మాదిరిగానే వస్తున్నాయో చూసుకోండి. | |
| తర్వాత వాటిని padding token తో కలిపి ఒక batch చేయండి, సరైన attention mask నిర్మించండి, మళ్లీ మోడల్‌లోకి పంపి ఫలితాలు ఒకటేనా చూడండి! | |
| ## పొడవైన సీక్వెన్స్‌లు[[longer-sequences]] | |
| Transformer మోడళ్లతో పని చేసేప్పుడు, మోడల్ అంగీకరించే సీక్వెన్స్‌ల పొడవుకు ఒక పరిమితి ఉంటుంది. | |
| చాలా మోడళ్లు గరిష్టంగా 512 లేదా 1024 tokens వరకు మాత్రమే సీక్వెన్స్‌లను హ్యాండిల్ చేయగలవు; అంతకంటే పొడవైన సీక్వెన్స్‌లను పంపితే, అవి క్రాష్ కావచ్చు. | |
| ఈ సమస్యకు రెండు పరిష్కారాలు ఉన్నాయి: | |
| - పొడవైన సీక్వెన్స్‌లను సపోర్ట్ చేసే మోడల్ ఉపయోగించడం. | |
| - మీ సీక్వెన్స్‌లను truncation ద్వారా చిన్నవిగా కత్తిరించడం. | |
| వివిధ మోడళ్లకు వివిధ గరిష్ట సీక్వెన్స్ పొడవులు ఉంటాయి; కొన్ని మోడళ్లు చాలా పొడవైన సీక్వెన్స్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. | |
| ఉదాహరణకు, [Longformer](https://huggingface.co/docs/transformers/model_doc/longformer), [LED](https://huggingface.co/docs/transformers/model_doc/led) లాంటి మోడళ్లు. | |
| మీ పని చాలా పొడవైన సీక్వెన్స్‌లను అవసరం చేసుకుంటే, ఇటువంటి మోడళ్లపై ఒకసారి పరిశీలించమని సూచిస్తాము. | |
| లేదంటే, మీ సీక్వెన్స్‌లను truncate చేయడం మంచిది; దానికి `max_sequence_length` పరామీటర్‌ను ఇవ్వవచ్చు: | |
| ```py | |
| sequence = sequence[:max_sequence_length] | |
| ``` | |
Xet Storage Details
- Size:
- 15.5 kB
- Xet hash:
- 2bfa5060af186c33c3146060136a4679dd4fd32467a5f00b4eb7874ae98a2375
·
Xet efficiently stores files, intelligently splitting them into unique chunks and accelerating uploads and downloads. More info.