Datasets:

Modalities:
Image
Text
Formats:
text
Languages:
Telugu
DOI:
Libraries:
Datasets
License:
AlbertoChestnut commited on
Commit
31399e3
·
verified ·
1 Parent(s): 4511122

Add files using upload-large-folder tool

Browse files
This view is limited to 50 files because it contains too many changes.   See raw diff
Files changed (50) hide show
  1. 2015.328360.Andhra-Mahaniyulu/meta.json +188 -0
  2. 2015.328360.Andhra-Mahaniyulu/page_0002.txt +1 -0
  3. 2015.328360.Andhra-Mahaniyulu/page_0004.txt +3 -0
  4. 2015.328360.Andhra-Mahaniyulu/page_0005.txt +1 -0
  5. 2015.328360.Andhra-Mahaniyulu/page_0006.txt +3 -0
  6. 2015.328360.Andhra-Mahaniyulu/page_0007.txt +1 -0
  7. 2015.328360.Andhra-Mahaniyulu/page_0008.txt +1 -0
  8. 2015.328360.Andhra-Mahaniyulu/page_0009.txt +7 -0
  9. 2015.328360.Andhra-Mahaniyulu/page_0010.txt +1 -0
  10. 2015.328360.Andhra-Mahaniyulu/page_0011.txt +3 -0
  11. 2015.328360.Andhra-Mahaniyulu/page_0012.txt +3 -0
  12. 2015.328360.Andhra-Mahaniyulu/page_0013.txt +7 -0
  13. 2015.328360.Andhra-Mahaniyulu/page_0014.txt +3 -0
  14. 2015.328360.Andhra-Mahaniyulu/page_0015.txt +5 -0
  15. 2015.328360.Andhra-Mahaniyulu/page_0016.txt +3 -0
  16. 2015.328360.Andhra-Mahaniyulu/page_0020.txt +5 -0
  17. 2015.328360.Andhra-Mahaniyulu/page_0021.txt +5 -0
  18. 2015.328360.Andhra-Mahaniyulu/page_0022.txt +5 -0
  19. 2015.328360.Andhra-Mahaniyulu/page_0024.txt +1 -0
  20. 2015.328360.Andhra-Mahaniyulu/page_0025.txt +3 -0
  21. 2015.328360.Andhra-Mahaniyulu/page_0026.txt +1 -0
  22. 2015.328360.Andhra-Mahaniyulu/page_0029.txt +3 -0
  23. 2015.328360.Andhra-Mahaniyulu/page_0032.txt +5 -0
  24. 2015.328360.Andhra-Mahaniyulu/page_0033.txt +3 -0
  25. 2015.328360.Andhra-Mahaniyulu/page_0034.txt +5 -0
  26. 2015.328360.Andhra-Mahaniyulu/page_0035.txt +5 -0
  27. 2015.328360.Andhra-Mahaniyulu/page_0037.txt +3 -0
  28. 2015.328360.Andhra-Mahaniyulu/page_0038.txt +1 -0
  29. 2015.328360.Andhra-Mahaniyulu/page_0040.txt +1 -0
  30. 2015.328360.Andhra-Mahaniyulu/page_0043.txt +1 -0
  31. 2015.328360.Andhra-Mahaniyulu/page_0044.txt +18 -0
  32. 2015.328360.Andhra-Mahaniyulu/page_0046.txt +10 -0
  33. 2015.328360.Andhra-Mahaniyulu/page_0050.txt +3 -0
  34. 2015.328360.Andhra-Mahaniyulu/page_0051.txt +3 -0
  35. 2015.328360.Andhra-Mahaniyulu/page_0052.txt +7 -0
  36. 2015.328360.Andhra-Mahaniyulu/page_0053.txt +5 -0
  37. 2015.328360.Andhra-Mahaniyulu/page_0054.txt +7 -0
  38. 2015.328360.Andhra-Mahaniyulu/page_0055.txt +5 -0
  39. 2015.328360.Andhra-Mahaniyulu/page_0056.txt +7 -0
  40. 2015.328360.Andhra-Mahaniyulu/page_0058.txt +5 -0
  41. 2015.328360.Andhra-Mahaniyulu/page_0060.txt +5 -0
  42. 2015.328360.Andhra-Mahaniyulu/page_0062.txt +5 -0
  43. 2015.328360.Andhra-Mahaniyulu/page_0063.txt +5 -0
  44. 2015.328360.Andhra-Mahaniyulu/page_0065.txt +3 -0
  45. 2015.328360.Andhra-Mahaniyulu/page_0066.txt +1 -0
  46. 2015.328360.Andhra-Mahaniyulu/page_0067.txt +3 -0
  47. 2015.328360.Andhra-Mahaniyulu/page_0069.txt +9 -0
  48. 2015.328360.Andhra-Mahaniyulu/page_0070.txt +5 -0
  49. 2015.328360.Andhra-Mahaniyulu/page_0073.txt +1 -0
  50. 2015.328360.Andhra-Mahaniyulu/page_0074.txt +1 -0
2015.328360.Andhra-Mahaniyulu/meta.json ADDED
@@ -0,0 +1,188 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ {
2
+ "status": "done",
3
+ "saved": 60,
4
+ "total_pages": 90,
5
+ "filename": "2015.328360.Andhra-Mahaniyulu.pdf",
6
+ "pages": {
7
+ "2": {
8
+ "quality": 4
9
+ },
10
+ "4": {
11
+ "quality": 4
12
+ },
13
+ "5": {
14
+ "quality": 4
15
+ },
16
+ "6": {
17
+ "quality": 4
18
+ },
19
+ "7": {
20
+ "quality": 4
21
+ },
22
+ "8": {
23
+ "quality": 4
24
+ },
25
+ "9": {
26
+ "quality": 4
27
+ },
28
+ "10": {
29
+ "quality": 4
30
+ },
31
+ "11": {
32
+ "quality": 4
33
+ },
34
+ "12": {
35
+ "quality": 4
36
+ },
37
+ "13": {
38
+ "quality": 4
39
+ },
40
+ "14": {
41
+ "quality": 4
42
+ },
43
+ "15": {
44
+ "quality": 4
45
+ },
46
+ "16": {
47
+ "quality": 4
48
+ },
49
+ "20": {
50
+ "quality": 4
51
+ },
52
+ "21": {
53
+ "quality": 4
54
+ },
55
+ "22": {
56
+ "quality": 4
57
+ },
58
+ "24": {
59
+ "quality": 4
60
+ },
61
+ "25": {
62
+ "quality": 4
63
+ },
64
+ "26": {
65
+ "quality": 4
66
+ },
67
+ "29": {
68
+ "quality": 3
69
+ },
70
+ "32": {
71
+ "quality": 3
72
+ },
73
+ "33": {
74
+ "quality": 3
75
+ },
76
+ "34": {
77
+ "quality": 3
78
+ },
79
+ "35": {
80
+ "quality": 3
81
+ },
82
+ "37": {
83
+ "quality": 3
84
+ },
85
+ "38": {
86
+ "quality": 3
87
+ },
88
+ "40": {
89
+ "quality": 3
90
+ },
91
+ "43": {
92
+ "quality": 3
93
+ },
94
+ "44": {
95
+ "quality": 3
96
+ },
97
+ "46": {
98
+ "quality": 3
99
+ },
100
+ "50": {
101
+ "quality": 3
102
+ },
103
+ "51": {
104
+ "quality": 3
105
+ },
106
+ "52": {
107
+ "quality": 3
108
+ },
109
+ "53": {
110
+ "quality": 3
111
+ },
112
+ "54": {
113
+ "quality": 3
114
+ },
115
+ "55": {
116
+ "quality": 3
117
+ },
118
+ "56": {
119
+ "quality": 3
120
+ },
121
+ "58": {
122
+ "quality": 3
123
+ },
124
+ "60": {
125
+ "quality": 3
126
+ },
127
+ "62": {
128
+ "quality": 3
129
+ },
130
+ "63": {
131
+ "quality": 3
132
+ },
133
+ "65": {
134
+ "quality": 3
135
+ },
136
+ "66": {
137
+ "quality": 3
138
+ },
139
+ "67": {
140
+ "quality": 3
141
+ },
142
+ "69": {
143
+ "quality": 3
144
+ },
145
+ "70": {
146
+ "quality": 3
147
+ },
148
+ "73": {
149
+ "quality": 3
150
+ },
151
+ "74": {
152
+ "quality": 3
153
+ },
154
+ "75": {
155
+ "quality": 3
156
+ },
157
+ "76": {
158
+ "quality": 3
159
+ },
160
+ "77": {
161
+ "quality": 3
162
+ },
163
+ "78": {
164
+ "quality": 3
165
+ },
166
+ "81": {
167
+ "quality": 3
168
+ },
169
+ "82": {
170
+ "quality": 4
171
+ },
172
+ "83": {
173
+ "quality": 4
174
+ },
175
+ "84": {
176
+ "quality": 4
177
+ },
178
+ "85": {
179
+ "quality": 4
180
+ },
181
+ "86": {
182
+ "quality": 4
183
+ },
184
+ "87": {
185
+ "quality": 4
186
+ }
187
+ }
188
+ }
2015.328360.Andhra-Mahaniyulu/page_0002.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ RIGHTS RESERVED] - [PRICE Rs, 0 - 12 - 0
2015.328360.Andhra-Mahaniyulu/page_0004.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ విశ్వనాథనాయకుఁడు. </p>
2
+
3
+ పదునేనవశతాబ్దాంతమున దక్షిణహిందూదేశమునఁ బ్రవర్థమానమై వెలుంగుచుండిన విజయనగరసామ్రాజ్యమును సాళువ నరసింహరాయలవా రప్రతిమాన ప్రతాపాధ్యులై పరిపాలనము సేయుచుండ నాచక్రవర్తికార్యకర్తలలో నొక్కండుగానుండి పే రెన్నికగాంచినవాఁడు కోట్యము నాగమనాయకుఁడు. పవిత్రపుణ్యక్షేత్ర మగుకాంచీపుర మీతని జన్మస్థానము. ఇతనిది కాశ్యపగోత్రము; బలిజ కులము. ఈ తెలుఁగునాయఁడు చక్రవర్తిసైన్యమున కధ్యక్షుడును, కార్యకర్తలలోఁ బ్రముఖుండును, తుళువవంశదీపకుండును నగునరసనాయనికిఁ జేదోడు వాదోడుగా నుండి సామ్రాజ్యముపట్ల వైరవభావముతోఁ బ్రవర్తించెడు చోళ పాండ్య రాజులపై నతఁడు దండయాత్ర వెడలినప్పు డాతనితోఁగూడ నుండి సామ్రాజ్యమునకు విజయవైభవముల సమకూర్చి మన్ననకుఁబాత్రుఁడైన నేస్తగాఁడు. ఇంతియ గాక సాళువ నరసింహరాయల మరణానంతరము సామ్రాజ్యము తుళువ వంశమువా రాక్రమించుకొనుటకుఁ బ్రయత్నించినపుడు సర్వవిధములఁ దోడ్పడిన దండనాథుఁడు. తన వంశ
2015.328360.Andhra-Mahaniyulu/page_0005.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ మున కీతఁడు గాంచినది యుపకృతిని మఱువక కృష్ణదేవరాయలు విశ్వాసపాత్రుఁ డయిననీతనియెడ నధికప్రేమను జూపుచుఁ దన 'తోషేఖానా' (ధనాగారము) కధికారిగ నియమించెను. కృష్ణదేవరాయలు విజనగరసామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తుఁడు గాకపూర్వమె నాగమనాయఁడు తనకు సంతానము గలుగ లేదని పరితపింపుచు నూఱుదేవుళ్లకు మ్రొక్కుచు, పుణ్యయాత్రలు సేవింపసంకల్పించి, కాశీ క్షేత్రమున వెలసియున్న విశ్వేశ్వర దేవుని సందర్శింపవలె ననుమనోనిశ్చయముతో నొకనాడు తన మనోవాంఛితమును ప్రభువునకు విన్నవించి యాతనియనుజ్ఞఁ బడసి తనయుద్యోగ భారము నంతయు దన మిత్రుఁడైన రామభద్రనాయనిపైఁబెట్టి కాశీయాత్రకుబయలుదేఱి వెళ్లెను. అట్లు బయలుదేఱి సురక్షితముగా గొంతకాలమునకుఁ గాశీనగరముఁ బ్రవేశించి గంగను సేవించి గంగాస్నానమువలనఁ బునీతుఁడై విశ్వేశ్వరదేవునికి నమస్కరించి విధ్యుక్తవిధానములఁ బూజించి మరలి వచ్చినతరువాత గొంతకాలమునకు నీతనికొక్క కుమారుఁడు గలిగెను. ఈ కుమారుఁడు విశ్వేశ్వరుని వరప్రసాదమునఁ బుట్టినవాఁడను విశ్వాసముతో నీతనికి విశ్వనాథుఁ డని నామకరణముఁ జేసెను. ఈతనికి వయస్సు పెఱిఁగిన కొలఁది సుందరాకృతియుం దీనితోఁబాటు దేహబలధీబలమనోబలంబులు క్రమముగా వర్థిల్లుచున్నందునఁ దండ్రి సంతోషముతోఁ దగు విద్యనుగూడఁ జెప్పించెను. ఇతని కిరువదియేండ్లు రాకపూర్వమె
2015.328360.Andhra-Mahaniyulu/page_0006.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ యొకనాఁడు చక్రవర్తి కొల్వుకూటమునకుఁ గొనిపోయి యాయన సందర్శనభాగ్యమును లభింపఁజేసి యాయనకుఁ గృతప్రణాముఁ డగు నట్లుద్భోధించెను. ఆ సుందరబాలవిగ్రహమునుఁ జూచినతోడనే యతఁ డొకబలాఢ్యుఁడైన శూరశిఖామణియనియు, బుద్ధిమంతుఁడనియుఁ జక్రవర్తికిఁ దోఁచుటయె గాక రాజకీయపరిజ్ఞాతయై మున్ముం దింకను నభివృద్ధికి రాఁగలఁడను నూహతట్టి యాతని స్వకీయభృత్యునిగ గ్రహించి తమలపాకులు, వక్కలు నందించు సేవకావృత్తియందు నియోగించెను. ఇట్లు వినయనయభయభక్తులతోడ సార్వభౌముని సేవింపుచుఁ దనపుణ్యవిశేషమున నాతనిచిత్త మెపుడును తనయందే లీనమగునటుల ప్రవర్తింపుచుండెను. కృష్ణదేవరాయలు పూర్వ దిగ్విజయయాత్రకు బయలు వెడలినపుడు విశ్వనాథనాయఁ డాతనితోఁగూడ నుండి తనకు నియమించిన నెట్టిదుస్సాధ్యకార్యమునైన నవలీల శూరశిఖామణులు మెచ్చునట్లుగాఁ జేసి విజయమును గొనుచు సర్వజనసంశ్లాఘనకుఁ బాత్రుఁడగుచు వచ్చెను. ఈ దండయాత్రలో నీతఁడు సూపిన పౌరుషపరాక్రమములే 1520 వ సంవత్సరమున రాయల రాయచూరుదండయాత్రలో నొక సేనానిగఁ బాల్కొనుట సంభవింపఁజేసెను.
2
+
3
+ కృష్ణదేవరాయలవారు కటకము మొదలుకొని కన్యాకుమారిదాఁక దేశము లోపఱుచుకొని విజయనగరసామ్రాజ్యము నవక్రపరాక్రమముతో నేలుచు సుఖసత్కధావినోదములతో విజయనగరమునఁ బ్రొద్దుపుచ్చుచున్న కడపటి
2015.328360.Andhra-Mahaniyulu/page_0007.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ కాలమున నొక వింతసమాచారముఁ దెలియవచ్చెను. చిరకాలమునుండి దక్షిణహిందూదేశమున సుప్రసిద్ధములైన చోళ పాండ్యరాజ్యములవారు తమలోఁ దా మైకమత్యములేక నిరంతరము పోరాడుకొనుచున్నను దమస్వాతంత్ర్యమునుఁ గోల్పోవక పదునాలుగవశతాబ్దివఱకు నెట్టెటో నెట్టుకొనుచు వచ్చిరి గాని యా శతాబ్దిమొదట తురకలదాడికి నిలువఁజాలక తమ స్వాతంత్ర్యమును గోల్పోయిరి. వాటితోఁ దొల్లింటి వైభవలక్ష్మియుఁ దొలఁగిపోయినది. కాని యాశతాబ్దిమధ్యమున విజయనగరసామ్రాజ్యమునుఁ బరిపాలించు సంగవంశీయులైనరాజు లాతురకలను జయించి యారాజ్యముల రెంటిని తమ సామ్రాజ్యమునఁ గలుపుకొన్నవా రయినను, ఆరాజ్యములకు హక్కుదారు లయినపూర్వరాజవంశీయులనే రాజులనుగా నియమించి వారివలనఁ గప్పములఁ గొనుచుండిరి. అట్లే కృష్ణదేవరాయలకాలమునాఁటివఱకు జరుగుచు వచ్చెను. వీని కడపటికాలమున మధురాపురము రాజధానిగఁ బాండ్య దేశము నేలుచున్న చంద్రశేఖరపాండ్యుని పైదండెత్తి తంజాపురము రాజధానిగఁ జోళరాజ్యము నేలు వీరశేఖరచోళుఁడు పాండ్యుని జయించి వానిరాజ్య మాక్రమించి వానిని రాజ్యమునుండి వెడలుగొట్టి తానే రెండు రాజ్యములను బరిపాలనముసేయ సమకట్టెను. అట్లు రాజ్యమునుఁ బోగొట్టుకొన్నవాఁడై చంద్రశేఖరపాండ్యుఁడు విజయనగరమునకుఁ బాఱివచ్చి రాయలపాదములను దన కన్నీటిధార
2015.328360.Andhra-Mahaniyulu/page_0008.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ తోఁ దడుపుచుఁ దన దౌర్భాగ్యదశనంతయు నేకరువుపెట్టి "ఓమహాప్రభూ! సార్వభౌమా! 'దుర్బలస్యబలంరాజా' యను న్యాయము మీ రెఱుంగనిది కాదు; మాకు దిక్కు మీరు గాని యన్యులు గారు; ఏమియాజ్ఞ? యని మొఱలెత్తెను. వీని మెఱల నాలించి రాయలు జాలిగొని కోపోద్దీపితమానసుండై తన 'తోషేఖానా' కధికారి యైన నాగమనాయని రప్పించి వింటివా వీరశేఖరుని దుండగము? వీఁడు మనలఁ గాదని యలక్ష్యభావముతోఁ దిరస్కరించి బలాత్కారముగా పాండ్యరాజ్యము నొడిసిపెట్టి చంద్రశేఖరపాండ్యుని సాగనంపి రాజ్యము నేలుచున్నవాఁడఁట! నీవు తత్క్షణము మాయాజ్ఞ శిరసావహించి తగుసైన్యముతోఁ బోయి యా దుండగీని శిక్షించి వీనిరాజ్యమును వీని కిప్పించి చోళరాజ్యమును మాకుఁ బ్రతినిధిపాలకునిగా మఱియొకరిని నియమించి సామ్రాజ్యమునకుఁ జెల్లింపవలసిన కప్పములను, దారిబత్తెముల మీకగుఁ వ్రయమునంతయు రాఁబట్టి రాజ్యమున శాంతినెలకొల్పి రావలయునని యాజ్ఞచేసెను. అపుడు సార్వభౌమునియాజ్ఞ శిరసావహించి నాగమనాయఁడు చంద్రశేఖరపాండ్యుని వెంటఁగొని రెండువేలయాశ్వికులను, ఆఱువేలపదాతులను దోడుచేసికొని పాండ్యరాజ్యముపై దండయాత్ర వెడలెను. తొలుత నాగమనాయఁడు తంజూవూరికిఁ బోయి వీరశేఖర చోడుని నోడించి వానిని శిక్షించి వాని రాజ్యమును దాను వశపఱుచుకొని మధురాపురముపైకి పోయి
2015.328360.Andhra-Mahaniyulu/page_0009.txt ADDED
@@ -0,0 +1,7 @@
 
 
 
 
 
 
 
 
1
+ చోడునిఠాణాలనుఁ దఱుమఁగొట్టి యారాజ్యమునుఁ గూడ వశపఱుచుకొని రాయలయాజ్ఞ నుల్లఘించి చంద్రశేఖర పాండ్యునికి రాజ్యము నొసంగక రెండురాజ్యములనుగూడఁ దానే పరిపాలనము సేయుచుండెను. అంత నాగమనాయని చర్య కచ్చెరువందుచు చేయునదిలేక నిరుత్సాహుఁడై పాండ్యుఁడు మరల విజయనగరమున కేతెంచి రాయలకు యావద్వృత్తాంతము నివేదించెను.
2
+
3
+ అంతట రాయ లాశ్చర్యమునుజెంది "ఇది యేమి చిత్రముగా నున్నది! నీవు మా యాజ్ఞాను నెఱవేర్పక పాండ్యునిరాజ్యము పాండ్యునికీక నీవే యపహరించి పరిపాలించుచున్నావు. ఇట్లు చేయుమని నీకాజ్ఞ నొసంగి యుండ లేదే! ఈ యాజ్ఞాపత్రమునుఁ జూచికొన్న వెంటనే పాండ్యరాజ్యమును పాండ్యుని కిచ్చివేసి మాసన్నిధానమునకు రావలసినది." అని యొక యాజ్ఞాపత్రమును వ్రాయించి పంపించెను.
4
+
5
+ ఇట్లు పంపించిన యాజ్ఞాపత్రమును జదివించుకొని విని మరల తా నీక్రింది విజ్ఞప్తిని బంపుకొనియెనఁట.
6
+
7
+ "దేవరవారియాజ్ఞ నుల్లంఘించుటకు నే నెంతవాఁడను; నావిషయమై దేవరవారికి విన్నవింపఁబడిన విషయము లన్నియు సత్యములు గావు; నేను పాండ్యరాజ్యముఁ జేరునప్పటికి రాజ్య మంతయు నరాజకమై యుండెను. ఇంతకుఁబూర్వము చంద్రశేఖరపాండ్యుఁడు రాజ్యముచేయునపుడుకూడ నరాజకముగనే
2015.328360.Andhra-Mahaniyulu/page_0010.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ యుండెనఁట! రాజ్య మరాజకముగ నుండుటచేతనే వీర శేఖరచోడుఁ డీ రాజ్యము నాక్రమించెను. ఇందుకుఁ గారణము పూర్వపురాజున కీతఁ డౌరసపుత్రుఁడుగాక యుంపుడుగత్తె పుత్రుఁ డగుటవలన నీరాజ్యమునందలి ప్రభువులును, ప్రజలును నీతని పాలన మంగీకరింపక నలుప్రక్కల స్వతంత్రసీమల నేర్పాటుచేసికొని పాలన సేయుచుండిరి. ఈ కారణమున వీరశేఖర చోడుఁడు మంచిసమయము దొరికినని వీనిపై దండెత్తి వచ్చి యీ రాజ్యము నాక్రమించి వీని నావలకుఁ బాఱఁదోలినవాఁడు. నేను వచ్చి దేశములోని యరాజకము నడచి నా స్వంతద్రవ్యము నెంతో వెచ్చించి రాజ్యమునంతయు స్వాధీన పఱచుకొని దేశమున శాంతిని నెలకొల్పి కొంతకాలమయిన దేశము నెమ్మదిగానుండఁగోరియు, ఇందుకై నేను వెచ్చించిన ద్రవ్యమును మరల రాబట్టుకొనువఱకు రెండురాజ్యములను నేనే పరిపాలింపఁ గోరియు నీ దేశమున నిలిచియున్నాను గాని మఱియొక కారణముచేతఁ గాదు. వీనికి రాజ్యము నొప్పగించినను సామర్థ్యముతో బరిపాలించుశక్తి యీతనికి లేదు. మరల దేశము నరాజకము పాల్పఱచుటయెగాక కప్పము రూమునఁ చెల్లింపబడుచున్న ద్రవ్యమును గోల్పోవలసివచ్చును. ఏతన్మూలమున సామ్రాజ్యమునకు ద్రవ్యనష్టము గూడ సంభవించును. ఈ పాండ్యరాజ్య మరాజకముగ నుండినఁ దక్కిన రాజ్యములుగూడ నరాజకములై చెడిపోఁగలవు. అపుడు సామ్రాజ్యభారము దుర్భరమై గోటితోఁ దునిమినఁ బోగలి
2015.328360.Andhra-Mahaniyulu/page_0011.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ గినదానిని గొడ్డళ్ళతోఁ దునుమవలసివచ్చును. మహాప్రభూ! నేను చేసినద్రోహ మేమియును లేదు. నే నింతవఱకు నాజీవితము సామ్రాజ్యసేవయందే గడిపి కష్టపడి యున్నవాఁడను గావునఁ గొంతలాలమయిన సుఖపడ నభిలషించుట తగదా? ఈరాజ్యాభివృద్ధికై నా ద్రవ్యమంతయు వెచ్చఁ బెట్టియున్నాను గనుక నాద్రవ్యమును రాఁబట్టుకొనునంతవఱకు నిచటనేయుండి సామ్రాజ్యమున కేవిధమయిన నప్రఖ్యాతియుఁ ద్రవ్యనష్టము గలుగుకుండఁ బరిపాలనముచేసి నేను జేయవలసినకార్యముల నన్నిటిని నెఱవేర్చుకొని దేవరసాన్నిధ్యమునకు దేవరవారి యాజ్ఞాప్రకారము వచ్చుచున్నాను. ఇప్పుడే దేశమును విడిచి వత్తునేని నా ద్రవ్యమునంతయు నేను గోల్పోవుటమాత్రమె గాదు. ఈ దేశమంతయు నరాజకమై యల్లకల్లోలము గాఁ గలదు. తరువాత దేవర చిత్తమువచ్చినట్లు గావింపుఁడు."
2
+
3
+ ఈవిజ్ఞాపనముఁజదువుకొన్నమీఁదట గృష్ణదేవరాయలు తోకఁ ద్రొక్కఁబడిన త్రాఁచువలె లేఁచి "ఔరా! నాగమనాయఁ డెంతపనిచేసెను. నమ్మించి స్వామిద్రోహమునకుఁ గడంగెను; ఇంకనేల వీని మన్నింపవలయును; ఈద్రోహి తలఁబట్టి యీడ్చుకొని రాఁ గలిగినవీరపురుషుఁ డెవ్వఁడయిన నీ దర్బారులో నుండెనా యని ప్రశ్నింపుచుఁ గొల్వుకూటము నంతయుఁ దేఱిపాఱఁజూచెను. అందఱు నివ్వెఱపడి చూచు చుండ నాగమనాయనికుమారుఁడే విశ్వనాథనాయఁడు నువ్వెత్తు
2015.328360.Andhra-Mahaniyulu/page_0012.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ గలేచి 'అహో! మన ప్రభూ! దేవరవారియుత్తరు వైనయెడల నిదెపోయి నాగనాయనిఁ గొనివచ్చుచున్నా' నని తడువుకొనక ప్రత్యుత్తర మిచ్చెను. సభ్యులెల్లరు విశ్వనాథనాయని ధైర్యసాహసముల కబ్బురపడసాగిరి. "ఓహో! నాగమనాయని కుమారుఁడవా? ఇదే సందుగాఁ జేసికొని నీతండ్రిని నీవు గలియఁగోరి మాయాజ్ఞనడుగుచున్నావా?' అని యధిక్షేపించెను. అంత విశ్వనాథనాయఁడు "దేవరవారిసొమ్ము తినుచున్న నాకు దేవరవారికార్యము ప్రధానముగాని నాకు తండ్రియెక్కువకాదు." అని ప్రత్యుత్తరము పలికెను. రాయలచ్చెరునందుచు మాఱుపల్కక మౌనము వహించెను. అంత నాతని మౌనమే యంగీకారసూచనగా గ్రహించి రాయల రాణువ తోడ్పాటుగొనక తనస్వాధీనమున నున్నసైన్యమునేగొని తనప్రతిజ్ఞ తీర్చుకొనుటకై పాండ్యరాజ్యమీదికిఁ బోయెను. అట్లు విశ్వనాథనాయఁడు మధురాపురము సమీపమునకుఁ బోయి యొక విశాలమైనప్రదేశమున దండు విడిసి తన తండ్రి కిట్లు జాబు వ్రాసి పంపెను.
2
+
3
+ "మీరు రాయలవారి యుత్తరువును దిరస్కరించి స్వతంత్రముగాఁ బ్రవర్తించుచున్నారు. మిమ్మును తలకొట్టి తెమ్మని యుత్తరు వైనది. అయిన నేమాయను. ఇంతటనైన నుపేక్ష వహింపక పాండ్యుని పాండ్యరాజ్యమునకుఁ బట్టముగట్టి మీరు రాయలవారి సాన్నిధ్యమునకు వచ్చిన యెడల వారితోఁ జెప్పవలసినవిధముగాఁ జెప్పి వారి యాగ్రహము ముడివ రక్షించునటుల ప్రయత్నింతును రండు."
2015.328360.Andhra-Mahaniyulu/page_0013.txt ADDED
@@ -0,0 +1,7 @@
 
 
 
 
 
 
 
 
1
+ ఈ జాబు అందినవెంటనే నాగమనాయఁ డాశ్చర్యమును జెంది కుమారునికి రాయలయెడఁగల భక్తివిశ్వాసములుఁ దలపోసి తనలోఁ దాను మెచ్చుకొనుచు నిట్లు ప్రత్యుత్తర మంపెను.
2
+
3
+ "కుమారా! నావలె నీవును సామ్రాజ్యమునకు శత్రువులయినవారిని సాధించి సామ్రాజ్యమును విస్తరింపఁ జేసినావు. రెండుతడవులు సామ్రాజ్యము చిక్కులపాలఁ బడినపుడు నిలువఁబెట్టినాము. నీ వెట్టియుపకారము చేసినను దానివలనఁ గలిగిన ఘనత నన్నుఁగూడఁ జెందవలయును గదా! రాయలు మనపట్ల విశ్వాసముగలవాఁ డయినపుడు పాండ్యరాజ్యమును నొక దాసీపుత్రుఁ డనుభవించిన నాయనకు గలిగెడు లాభమేమి? మన మనుభవించినఁ గలిగెడు నష్టమేమి? నేను విశ్వేశ్వరుని గూర్చి తపస్సుచేసి నిన్నుఁ గని యా దేవదేవుని పేరే నీకు పెట్టి యున్నాను. నీ వొక్కండవే నా కుమారుఁడవు. నాతో నెందుకు యుద్ధమొనర్తువు? ఈ రాజ్యనిర్మాణమంతయు నీ కొఱకేగాని నానిమిత్త మెంతమాత్రమును గాదు. నీవు రాయలను విడిచి నాతో నుండుము.
4
+
5
+ ఈ ప్రత్యుత్తరమును జదువుకొని విశ్వనాథనాయఁడు మరల యిట్లు సమాచార మంపెను.
6
+
7
+ "మీరుచేయునదిస్వామిద్రోహము. మిమ్మునమ్మిసమస్త భారము మీ పైని పెట్టిన ప్రభువును మోసపుచ్చి రాజ్యముఁ గట్టుకొని ద్రోహి నాకు తండ్రియని సహించి యపకీర్తి భరిం
2015.328360.Andhra-Mahaniyulu/page_0014.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ పఁజాలను. మీరు నాకు తండ్రిగాదు. నేను మీకుమారుండను గాను. మీరు సంపాదించిన రాజ్యముతో నాకుఁ బనిలేదు. నా మాట విని మీరు నాతోడ వచ్చెదరా మీకును నాకును శ్రేయస్సు కలుగును. మీ ప్రాణములకు భయములేకుండఁ జేసికొన వచ్చును. ఒకవేళ మీరు యుద్ధమునకే సంసిద్ధులయిన యెడల మీకు దైవము జయము సమకూర్పఁడు. ఏవిధమున నైన నా ప్రతిజ్ఞను నేను నెఱవేర్చుకొని పోదునుగాని మీరు తండ్రు లని మన్నించి విడిచిపెట్టువాఁడను గా నని తెలిసికొని మఱి ముందుకు సాగుడు. మిమ్మును సజీవముగ రాయలవారి సాన్నిధ్యమునకుఁ గొనిపోవుటయే నేను సకలసామ్రాజ్య మేలుటగా భావించుకొనువాఁడను."
2
+
3
+ ఇట్టి పల్కులు చెవి సోకఁగా నాగమనాయఁడు కటకటం బడుచు 'ఆహా! నాదురదృష్టము! పుత్రబిక్ష పెట్టుమని విశ్వనాథునిఁగూర్చి తపస్సు చేసినందుకు నా మహాదేవుఁడు తనపై కత్తిచేపట్టు కుమారునిఁ బ్రసాదించెగదా' యని దుఃఖపడి తుదకు ధైర్యము తెచ్చుకొని 'ఇట్టికొడుకు బ్రదికియుండియుఁ జచ్చినవానితో సమానుఁడే యని తలపోసి యెట్టకేలకు నర్జునుఁడు బబ్రువాహనునితోఁ బోరాడినవిధమును స్మరించి వానితో యుద్ధముచేయుటకే నిశ్చయించుకొని రాణువకూర్చుకొని యుద్ధసన్నద్ధుఁ డయ్యెను. ఈ రీతిగాఁ దండ్రికిఁ గొడుకునకు మహాభయంకరమైన యుద్ధము జరిగెను. ఇట్లు మహాఘోరముగా జరుగు సంకులసంగ్రామమున వృద్ధసేనాని నాగమనాయఁడు పట్టువడి విశ్వనాథనాయని కడకుఁ గొనిపోఁబడియెను.
2015.328360.Andhra-Mahaniyulu/page_0015.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ అప్పుడు కుమారుఁడు తన తండ్రి సజీవుఁడై యుండఁ బట్టువడుట తన యదృష్టముగా భావించి సంతోషముతో నతని నొక యంబారీమీఁద నెక్కించి వానిచుట్టును తనపారాకడాయించి విజయనగరమునకుఁ గొనిపోవుచు యావద్వృత్తాంతమునుఁ బూసగ్రుచ్చినటుల యొక జాబులో లిఖించి ముందుగా నాలేఖను రాయలవారికిఁ బంపించెను. కృష్ణదేవరాయలవా రాలేఖను గాంచి యపరిమితానందమునుఁ జెంది యానాఁడు సేనానాయకుల నెల్లరను రప్పించి వారలతో నిట్లు పలికెను.
2
+
3
+ "విశ్వనాథనాయఁడు స్వామికార్యము నెట్లు నిర్వహించుకొని తనప్రతిజ్ఞను మఱువక తనతండ్రిని సజ్జివునిగాఁ జెఱపట్టి దర్బారునకుఁ గొనివచ్చు చున్నాఁడో విన్నారు గదా? నాఁడు మీ రెల్లరును నాగమనాయనికి వెఱచి యీ మహాకార్యము నిర్వహింప శక్తి చాలనివార మని చెప్పఁగా యువకుఁ డగువిశ్వనాథనాయఁడు తాను నిర్వహింతునని లేచినపు డాతఁ డెందఱపరిహాసములకుఁ బాత్రుఁడు కాలేదు? ఇతరులప్రశంస యెందుకు? మాకే సంశయము కలిగినది. ఇదిగో నేఁ డతఁడు మాపేరవ్రాసి పంపించినజాబు".
4
+
5
+ అని యాజాబును దనకొల్వుకూటమున నున్న వారి కెల్లరకుఁ దెలియునట్లుగాఁ జదివింపఁ జేసెను. ఎల్లవా రాశ్చర్య నిమగ్నులైరి. ఇతఁడు మనుష్యమాత్రుఁడుగాఁ గన్పట్టఁడు. కేవలము విశ్వనాథుఁ డీరూపమున నవతరించి
2015.328360.Andhra-Mahaniyulu/page_0016.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ యుండఁబోలు" నని బహువిధముల నాతని శ్లాఘించిరి. కృష్ణదేవరాయలవారు తనసంతోషమును బట్టజాలక యిరుబుజములు పొంగిపోవుచుండ "ఓహో! ఇటువంటి బంటునకు నేలికనై యుంట నేను ధన్యాత్ముఁడ నగుటచేతనేగదా సంభవించెను! మీవాక్కులు నిక్కువములు. ఆతఁడు మనుష్యులలోఁ బరిగణింపఁ దగినవాఁడు గాఁడు. ఇతఁ డొకనాడు అడవి దున్నపోతును నఱకి నాప్రాణమును రక్షించినవాఁడు. ఇటువంటి మహాపురుషునిచేత నింకఁ గొలువు చేయించుకొనుట మహాదోషముగాఁ గన్పట్టుచున్నది. ఈతని కెదియైన రాజ్యము నొసంగి నాతో సమముగాఁ గూర్చుండబెట్టికోఁ దగినవాఁ డని మనంబునకు దృఢముగాఁదట్టుచున్నది." అని స్పష్టముగా నిండుకొల్వున బలికెను. అంత సభవా రిట్లేకగ్రీవముగాఁ బలికిరి.
2
+
3
+ "స్వామీ! విశ్వనాథనాయనికి రాజ్యపేక్ష లేదు. ఉన్నచో నాతఁడు తండ్రితో నేకమై మన మీఁదికి దాడిచేసియే యుండును. అపుడు వారిని మనము జయించుటయు సుసాధ్యము గాకుయుండును. అతఁడు విశ్వేశ్వరాంశ సంభూతుఁడు గనుకనే విద్వౌసపాత్రుఁడై స్వామికార్యమును నిర్వహించుకొని వచ్చు చున్నాఁడు. ఈ కలికాలమున నిట్టి వీరకృత్యములను వినఁజాలము, కనఁజాలము. తలపోసినకొలఁది మా కెంతయు నచ్చెరువు గలుగుచున్నది. దేవరవారు సర్వజ్ఞమూర్తులు. తమకుఁ దెలియనియంశ మేమి గలదు. దేవరచిత్తము వచ్చినట్లు గావింపుఁడు."
2015.328360.Andhra-Mahaniyulu/page_0020.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ నారము. ఇఁక మీరింటికి పొం" డని రాయలు విశ్వనాథనాయని కుత్తరువు చేసెను. అంత విశ్వనాథనాయఁడు తన తండ్రిని చెఱనుండి విడిపించి యింటికిఁ దీసికొనిపోయి 'ఇఁక నేను మీ కుమారుఁడను; మీరు నాకు తండ్రులు; ఇంత పర్యంతము నేను మీకు శత్రువునుగాఁ బ్రవర్తించితిని; నన్ను క్షమింపు'మని శతవిధముల వేడికొని తండ్రిగారిని స్నానముచేయించి నూతనవస్త్రములనుఁ గట్టిపెట్టి బ్రాహ్మణ సమారాధనములను, దానధర్మములను గావించి సుఖముగా నుండునటుల చేసెను.
2
+
3
+ ఇటులు సుఖసంతుష్టుఁడైయుండి యొకనాఁడు నాగమనాయఁడు కుమారుని రప్పించి "నీవు రాజ్యము చేయవలయునను తలంపుతో నింతయెత్తు యెత్తినాను గాని మఱియొకటి గాదు. నాకు రాజ్యకాంక్ష లేదు. ఇంక నేను పరలోక సాధనమును జూచికొనియెదను. ఇంతవఱకు నేను సంపాదించిన ద్రవ్యమంతయు నున్నది. దీనిని తీసికొమ్ము. నీకు రాయలవారు రాజ్యము నిచ్చెదరు. చక్కఁగా నేలుకొమ్ము" అని పలికెను.
4
+
5
+ అంత నతఁడు "నాయనా! మీరార్జించిన ధనమును మీరే దానధర్మములు చేసికొని మీరే యనుభవింపుఁడు. నా కక్కఱలేఁదని ప్రత్యుత్తరము పలికెను. అందుకు సమ్మతింపక నాగమనాయఁడు తనపెద్దలు కూడబెట్టిన ధనమును, తా నార్జించినధనమునుఁ గూడఁ జూపించి దానినంతయు గైకొని సద్వినియోగమునకుఁ దెమ్మని కుమారునికి బోధిం
2015.328360.Andhra-Mahaniyulu/page_0021.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ చెను. విశ్వనాధనాయఁ డాధనము నంతయుఁ గాంచి యెట్లీతఁడింత ధనమార్జింపఁగలిగెనా యనియాశ్చర్యముఁ జెందెను.
2
+
3
+ ఇ ట్లచ్చెరువందుచున్న కుమారుని జూచి 'పుత్రా! ఈ మధురానగరము నాకిష్టదైవములగు మీనాక్షీసుందరేశ్వరులకు నిలయమై దివ్యస్థలముగాఁ బేరుగాంచి యున్నది. ఒకనాఁడా మీనాక్షీదేవి నాకు స్వప్నములోఁ గానుపించి నీకుమారుఁడు విశ్వనాథనాయఁడు నా సన్నిధానముననుండి యీపాండ్యరాజ్యమునంతయు నేలుటకు సమర్థుఁ డయి యుండు నని చెప్పియున్నది. ఈ యర్థమునంతయుఁ దీసికొనిపోయి పాండ్యదేశములోని దేవస్థానమునకును, తీర్థప్రదేశములలోని యేళ్ళుకుఁ గట్టు ఱాతిమెట్లకును ఇంక ననేకధర్మకార్యములకొఱకును వినియోగ పఱచినయెడల నాకు పరలోకసౌఖ్యము గలుగఁగలదని బహువిధముల బోధించెను. అటుతరువాత రాయలవారొకనాఁడు విశ్వనాథనాయనివారిని, పాండ్యుని రప్పించి పాండ్యునితో నిట్లు ప్రశంసించెను. "ఓయీ! నీకు సంతానము లేదనియు నుంపుడుకత్తెకును నొక్క కొడుకుమాత్రము గలడనియు, విశ్వనాధనాయనికి రాజ్యమొసంగుట సమ్మతమేయని చెప్పి యాయనకు పత్రము వ్రాసియిచ్చియున్నావనియుఁ దెలిపితి నైన నింకొకమా ఱడుగుచున్నాను. నీ యభిప్రాయమేమో స్పష్టముగా విప్పి చెప్పుము."
4
+
5
+ ఇట్లు రాయలు ప్రశంసించిన వెనువెంటనే చంద్రశేఖరపాండ్యుఁడు వినమ్రుఁడై లేఁచి సభాసదులెల్లరు విను
2015.328360.Andhra-Mahaniyulu/page_0022.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ చుండఁ దన యభిప్రాయమంతయు విస్పష్ట మగునట్లుగా 'మహా ప్రభూ! ఈ రాజ్యపరిపాలనము నావలన నగునది కాదని నే నెఱుంగుదును; ఒకవేళ నే నీరాజ్యమును కోరినా చోళరాజు నన్నుఁ బ్రాణముతో విడిచిపెట్టువాఁడు కాఁడు; ఇదియుఁగాక మాతండ్రితాతలకు నుంపుడుసంబంధాలవలనఁ బుట్టినవారు శ్రీవిల్లిపుత్తూరు, తెంగాశి, రాచపాళియము మొదలగుస్థలములలో నున్నవారు; వారు నన్ను తలయెత్తుకొననీయరు; నాగమనాయనివారు సయిత మన్నిస్థలములను సాధింపగలిగినారు. కాని యైదుస్థానములను సాధించలేకపోయినారు. ఇంతకు నా పగవాండ్రయిన చోళునకుగాని వీరలకుఁగాని రాజ్యము నొసంగక నాబదులుగా విశ్వనాథనాయనివారే యేలుకొనుట నాకు పరమసంతోషముగా నుండును. ఇపుడు విశ్వనాథనాయనివారు నాతండ్రివంటివాఁడు గావున నన్ను శత్రువుల బాఱిపడకుండ సంరక్షింపఁగలఁడు. నాస్థితినిబట్టి గౌరవమర్యాదలకు భంగములేకుండ నన్ను బోషించినఁజాలు' నని విన్నవించుకొనియెను.
2
+
3
+ కృష్ణదేవరాయలవా రందులకు సమ్మతించి విశ్వనాథనాయనివారిని గాంచి యిట్లు పలికిరి.
4
+
5
+ ఇదివరకు నీవు మాకును, మా సామ్రాజ్యమునకును పెక్కులుపకృతులు గావించి యున్నావు. ఇంతియగాక మీ తండ్రిగారు మమ్మును లక్ష్యముసేయక మాయాజ్ఞను నిరాకరించినపుడు స్వామికార్యమే పరమ ధర్మమని యెంచి
2015.328360.Andhra-Mahaniyulu/page_0024.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ ణలేక వ్యధలం బడియుండుటయుఁ గన్నులారఁ గాంచి మిక్కిలి విచారించెను. వీని నన్నిటిని జక్కపఱచి రాజ్యమును సౌభాగ్యస్థితికిఁ గొనివచ్చుటకు రాణువలోనిబొక్కసము చాలదని తలపోసి తనతండ్రి యొసంగిన ద్రవ్యమునంతయు నాతనియిష్టానుసారముగా వ్రయపఱచి సఫలీకృతమనోరథుఁ డగుటకు సంకల్పించి మిక్కిలి సమర్థుఁడయిన 'అరియనాధ మొదలారిని ముఖ్యమంత్రిగను, దళవాయిగ నేర్పఱచి కార్యసాధనకుఁ గడంగెను. ఇతఁడు విజయనగరసామ్రాజ్యపక్షమునఁ బ్రతినిధి పాలకుఁడుగ మాత్రమె నియమింపఁబడినవాఁడు గనుక చోళపాండ్యరాజ్యముల రెంటిని పాండ్యరాజ్యము పేరిటనే స్వతంత్రుఁడై పరిపాలనముచేసినను విజయనగరసామ్రాజ్యమునకు లోఁబడియె పరిపాలనము చేసినని మనము గ్రహింపవలయును. విశ్వనాథనాయఁడు రాజ్యపరిపాలనకు వచ్చినకొలదికాలమునకే చంద్రశేఖరపాండ్యుఁడు మృతిఁబొందెను. విశ్వనాథనాయని వారియాజ్ఞను శిరసావహించి దళవాయి అరియనాథ మొదలారియు, దళవాయి బిసపాకము కేశవప్పనాయఁడు ననువా రిరువురును చుట్టునుబురుజులు గలిగి యష్టద్వారములతో నొప్పెడు మధురాపురదుర్గమును బునర్నిర్మాణముఁ గావించుటయెగాక మీనాక్షిసుందరేశ్వరుల కోవిలలను సొగసుగా గట్టించిరి. మధురాపురమునంతయుఁ గలకలలాడుస్థితికిఁ దీసికొనివచ్చిరి. ఇట్టికాలమునఁ గృష్ణదేవరాయలవారు 1530 వ సంవత్సరమున విజయనగరములో స్వర్గస్థుడుకాఁగా నాయని
2015.328360.Andhra-Mahaniyulu/page_0025.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ తమ్ముఁ డచ్యుతదేవరాయలవారు విజయనగరసామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తులయిరి. అప్పుడాయన తన మఱదలి పెనిమిటి యైన చెన్వప్పనాయనివారిని చోళ రాజ్యప్రతినిధిగా నియమించిరి గావున నప్పటినుండియు నారాజ్యము విశ్వనాథనాయని వారి పరిపాలనమునుండి తొలఁగిపోయెను. రాయలవారి యుత్తరువు ననుసరించి తిరుచునాపల్లె మధురరాజ్యమునకును వల్లము తంజాపురరాజ్యమునకును జేరిపోయినవి. ఆకాలమున తిరుచునాపల్లెకు సమీపమునఁ గావేరినది కిరుపార్శ్వముల నడవులు బలిసి దొంగల కునికిపట్టులై శ్రీరంగ మనుపుణ్యక్షేత్రమునకు వచ్చుచుబోవుచుండెడు యాత్రికుల కపాయకరములై యుండుటచేత విశ్వనాధనాయనివారియాజ్ఞ ననుసరించి దళవాయి కేశవప్పనాయఁ డా యడవులన్నిటిని భేదింపఁజేసి దొంగల నిలువరమునెల్ల నాశనము గావించి రక్షకభటుల నందందు నెలకొల్పి యాత్రికులకు మానప్రాణరక్షణముల నొసంగెను. ఇంతియెగాక తిరుచునాపల్లెదుర్గముచుట్టును రెండు ప్రాకారములను నిర్మించి వానిప్రక్కను నొక పెద్దకందకమును ద్రవ్వించి పురమునకు మంచిరక్షణ కలుగఁజేసెను.
2
+
3
+ మఱియు విశ్వనాథనాయనివారు శ్రీరంగము, తిరుచునాపల్లె దేవాలయముల విషయమై మిగుల శ్రద్ధవహించి యనేకరీతులుగా వానినభివృద్ధికిఁ దీసికొనివచ్చెను. ఈయనకాలముననే సుందరమైన తెప్పాకుళమనెడు కోనేరు నిర్మింపఁబడి తిరుచునాపల్లె కొకవినూతన మైనసౌందర్యమును గలుగఁజే
2015.328360.Andhra-Mahaniyulu/page_0026.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ సెను. శ్రీరంగదేవాలయము ననేకనూతనభవనములతో నలంకరింపఁజేసి కన్నులపండు వౌనట్లుగా దిద్ది తీర్పరింపఁజేసెను. ఈదేవాలయ రక్షణకొఱకు మూఁడులక్షలపొన్నుల ద్రవ్యమును వెచ్చించెను. ఈప్రాకారములలోపల జనులు నివసించుటకై యనేకగృహములను గట్టించెను. ఇట్లు ప్రధాన దుర్గములను ముఖ్యములయిన దివ్యక్షేత్రములను చక్కపఱచుకొనుటకై విశేషద్రవ్యమును వెచ్చబెట్టి కృతకృత్యుఁడై ప్రజానురాగమును బడయుటయెగాక రాజ్యములోఁ దిరస్కార భావముతో నొప్పెడు ప్రభువతంసుల నెల్లర జయించి సరయిన మార్గమునకుఁ గొనివచ్చి రాజ్యము నలుప్రక్కల శాంతి నెలకొల్పఁ బూనుకొనియెను. ఇతఁడు రాజ్యభారమును వహించి పరిపాలనము చేయుటకుఁ బ్రారంభించిన కొలదిదినములలోనే చోళరాజ్యమునఁ జోళవంశీయుఁడ నని చెప్పుకొను నొక చోళ సామంతుఁడు కంబము, గూడలూరుసీమ నాక్రమించుకొని విశ్వనాథనాయని పరిపాలనమును దిరస్కరించి కప్పమును జెల్లించక చిక్కులు పెట్టుటకుఁ బ్రారంభించెను. అంతట విశ్వనాథనాయకుఁ డాతని శిక్షించి రాజ్యమును వశపఱచుకొని కప్పము గైకొని రావలసినదిగాఁ దనతండ్రి ప్రియమిత్రుఁడును, భృత్యుఁడుగ నున్న రామభద్రనాయకుని నియమించెను. అతఁ డట్లు తన కార్యమును జయప్రదమగునట్లుగా నిర్వహించుకొని వచ్చినందుకు సంతోషించి విశ్వనాథనాయఁ డాతనికి 'వడగరై' యను పాళియము నొసంగి సన్మానించెను. దక్షిణపాండ్య
2015.328360.Andhra-Mahaniyulu/page_0029.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ ఇట్లు తెంగాశి పాండ్యులను జయించినవెనుక విశ్వనాథనాయని వారు తన ప్రధానమంత్రితోఁగలసి రాజ్యాభివృద్ధి మార్గముల నాలోచించి యందుకుఁ దగినకృషి ప్రారంభించెను. తిన్నెవెల్లి పట్టణమును విస్తరింపఁజేసి యభివృద్ధి పఱచెను. దేవాలయములను నిర్మించెను. ఎట్లు గ్రామపరిస్థితులఁ జక్కచేసి పరిపాలనము నడుపవలసియుండునో యారీతి నడుపునట్లు గావించెను.
2
+
3
+ చెఱువులను, కాలువలను ద్రవ్వించి తనరాజ్యము నందలి గ్రామాదులలోని వ్యవసాయకులను భూములనిచ్చియు, ధనము నొసంగియుఁ గృషివ్యాపారము లభివృద్ధి నొందునటులు మనఃపూర్వక మైనప్రేమను జూపుచుఁ బ్రవర్తించెను. అందువలన వ్యవసాయ మభివృద్ధిని గాంచెను. దేశమునందంటట క్రమమైనశాంతి నెలకొనియెను. ఇతనిపరిపాలనమునఁ బ్రజలు సంతృప్తిఁ గాంచిరి. ఈతనిరాజ్యమున కుత్తరమున ఉఱ్ఱాత్తూరు, వలికొండపురములును, దక్షిణమునఁ గన్యాకుమారియు, పశ్చిమభాగమున కోయంబత్తూరు, ఈరోడు, ధారాపురము, మేలమలై, తూర్పున సముద్రమును రామేశ్వరమును సరిహద్దులుగా నేర్పడి రాజ్యము వ్యాప్తిఁ జెంది యుండెను. అనఁగా నిప్పటిమండలము లగు మధుర, రామనాథము, తిన్నెవెల్లి, తిరుచునాపల్లి, కోయంబత్తూరు, సేలము, నా కాలమున విశ్వనాథనాయని పాండ్యరాజ్యముగా నుండె నని చెప్పఁదగును. విజయనగరసామ్రాజ్యమువారి పదునాఱవశతాబ్దిలోని శాసనములన్నియు నీమండలములలోఁ
2015.328360.Andhra-Mahaniyulu/page_0032.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ వంతు కప్పముక్రింద రాజ్యాంగమునకుఁ జెల్లించుచుండిరి. యుద్ధకాలములందుఁ దమ ప్రభువాజ్ఞయైనయెడల మఱియొక మూఁడవ వంతు రాఁబడి సైన్యముల క్రిందను వినియోగించి వారికిఁ దోడ్పడుచుండిరి. తక్కిన రాఁబడిని వారు స్వేచ్ఛగా ననుభవింపుచుండిరి. రాజ్యాంగమునం దిట్టిపద్ధతు లవలంబించుటవలన పాళెగాం డ్రందఱును విశ్వనాథనాయనివారిపట్ల భక్తివిశ్వాసములతోఁ బ్రవర్తింపఁ గలిగిరి. ఒక్కొక్కప్పుడు రాజ్యాంగమునకు నెక్కువ సేవచేయఁగలిగిన పాళెగాండ్రకు విశ్వనాథనాయనివారు వారి కప్పములను గొనకయె వారలకు బహుమానములుగా విడిచిపెట్టుచుండెను. ఇతఁడు తనపాళయగాండ్రతోసహా విజయనగరసామ్రాజ్యమునకుఁ దోడ్పడుచు భక్తివిశ్వాసములతో సేవించుటచే నచ్యుతదేవరాయలవారి కాలమునఁగాని సదాశివదేవరాయలవారి కాలమునఁగాని వారి యాగ్రహమునకుఁ బాత్రుఁడు గాక యర్హ మర్యాదలకు భంగము లేకుండఁ దన పదవిని జక్కఁగాఁ గాపాడుకొనఁ గలిగియుండెను.
2
+
3
+ ఇత డత్యంత బాహుబలాఢ్యుఁ డని తెలుపుటకుఁ గాఁబోలు స్థానిక చరిత్రములయం దతిచిత్రము లగు కథలు కొన్ని వక్కాణింపఁబడి యున్నవి. అట్టివానిలో నొక్కిఅకథను మాత్రము చదువరుల వినోదార్థ మిందుఁ దెలుపుచున్నారము.
4
+
5
+ పాండ్యరాజ్యమునకుఁ దామే హక్కు దారులమని తొలుదొల్త విశ్వనాథనాయనివారి నెదుర్కొని పోరాడినవారు
2015.328360.Andhra-Mahaniyulu/page_0033.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ తెంగాశి పాండ్యులని యింతకుఁ బూర్వము తెలిసికొనియున్న వారము. తెంగాశి పాండ్యు లైదుగురు వీరు పంచపాండ్యులని పరఁగినవారు. పంచపాండ్యులనునది ప్రాచీనకాలమునుండి వ్యవహరింపబడుచున్న సమాసపదముకాని నేడు క్రొత్తగ సృజింపఁబడినది కాదు. వీరిలోఁ బరాగ్రమపాండ్య దేవపెరుమాళ్లనునతఁడు ప్రముఖుఁడుగా నుండెను. వీరికి కులశేఖరదేవుఁ డను నామాంతరము గలదు. ఇతఁడు 1543 వ సంవత్సరమున తెంగాశిలోఁ బట్టము గట్టుకొనియెను. ఇతఁడే విశ్వనాథనాయనివారిని ప్రతిఘటించి నిలిచినవాఁడు. తక్కినవారు వీనికిఁ దోడ్పడిరి. వీరి ప్రతిఘటన వృత్తాంతమును దెలిసికొని విశ్వనాథనాయనివారు వీరినిజయించుటకై తమ దళవాయియగు 'అరియనాథ మొదలారి' నిఁ గొంతసైన్యముతోఁ బంపించెను. అప్పుడు తెంగాశి పాండ్యులకును, విశ్వనాథనాయనివారి సైన్యములకును బెనుపోరాటము జరిగి యా యుద్ధములో దళవాయి యరియనాథమొదలారి వారిని జయింపలేక యవమానముతో మధురాపురమునకుఁ బాఱివచ్చి తనప్రభువునకు తలవంపులు గొనితెచ్చెను.
2
+
3
+ అట్టితలవంపులను విశ్వనాథనాయనివారు భరింప జాలక రెండవమాఱు తానే మహాసైన్యముతో దండెత్తిపోయి వారల దుర్గమును ముట్టడించి యాఱుమాసములవఱకు ఘన ప్రయత్నములు గావించినను దుర్గము స్వాధీనమురాకపోవుటయెగాక యుభయసైన్యములును నాశనమునొందుచుండుటఁ గన్నులారగాంచెను.
2015.328360.Andhra-Mahaniyulu/page_0034.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ 'అయ్యో! నాయొక్కనిలాభమునిమిత్త మెన్నోకుటుంబములు దిక్కులేక దుఃఖభాజనము లగుచున్నవి. ఒక్కనిసంతృప్తికై పెక్కుకుటుంబములను దుఃఖపరంపరలలో ముంచెత్తివిడుచుట ధర్మముగాఁ గన్పట్టుచుండలేదు' అని తలపోసి పశ్చాత్తాపమును దెలుపుచు నీ క్రింది జాబును వ్రాసి యొక దూతచేఁ దనప్రతిపక్షులకుఁ బంపెను.
2
+
3
+ "మీరైదుగురు, నేనొక్కఁడను. మననిమిత్తమై ప్రజలు దుఃఖపరంపరల పాలగుచున్నారు. అట్లు జరుగరాదు. మనము యుద్ధములను జాలించి మనసైన్యములను దూరముగా నిలిపి పోరాటముడిగించి యుభయసైన్యములనడుమ నొక శిలాస్తంభమునాటి మీరైదుగురును నాయొక్కనితో ద్వంద్వ యుద్ధమునకుఁ గడంగవలసినది. మీరు జయించిరా యీరాజ్యమును గైకొనుఁడు. నేను జయింతునా మీ రాజ్యమును విడిచి కట్టు పుట్టములతో మాత్ర మావలకుఁ బొండు. ఈ ప్రకారము మనము దైవసాక్షిగ ప్రతిజ్ఞలనుఁజేసి తామ్ర శాసనము వ్రాయించి యాశాసనము మీశిలాస్తంభమునకుఁ గట్టి బాహుయుద్ధమునకుఁ గడంగుదము. ఈ సమస్య యీ విధముగా మనయుభయుల నడుమ పరిష్కారమగుట నా కోరిక."
4
+
5
+ ఈ పయిజాబును వారు చూచుకొని 'మీ రొక్కరును మా యైదుగురుతోఁ దలపడుటధర్మము కాదు; మాలో నొక్కఁడు మాత్రము వచ్చును. మీరు వచ్చి వానితోఁ దల
2015.328360.Andhra-Mahaniyulu/page_0035.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ పడుదురా! అట్లయినపక్షమున మీకోరికప్రకారము నడువంగలవార' మని ప్రత్యుత్తరము వ్రాసి విశ్వనాథనాయనివారికిఁ బంపిరఁట. విశ్వనాథనాయనివారి పౌరుషపరాక్రమములుపాండ్య వీరులైదుగురు దలపడినను వెనుదీయ నట్టివికావు. కనుక మరల యతఁడు 'మీరైదుగురు నైదుసీమలకు ప్రభువులుగ నున్నారు. నే నొక్కఁడనైయుండియు మిమ్ములను జయించి మీసీమల నొడిచికొనవలయు నని వచ్చియున్నాను. కనుక మీర లైదుగురును గలిసి నాయొక్కనితోనే పోరాడుట న్యాయము.
2
+
3
+ వా రంగీకరింపక తమలో బాహుబలపరాక్రమ వంతుడైనవాని నేరుకొని యంగరక్షకై కవచమును దొడిగి యశ్వారూఢుని గావించి వాని కొక ఖడ్గము నొసంగి యుద్ధముచేయుటకై నిర్ణీతరంగస్థలమునకుఁ గొనివచ్చిరఁట!
4
+
5
+ ఈద్వంద్వయుద్ధము ముగియుట కెంతోకాలము పట్టలేదు. విశ్వనాథుఁడు తుదకంగీకరించి తానును యుద్ధసన్నద్ధుఁడై రంగస్థలమున కుఱికి 'మొట్టమొదట నీవే కొట్టుమని పాండ్యవీరుని నాహ్వానించెనట! ఆతఁ డట్లే యొక్కవ్రేటువేసెను. విశ్వనాథుఁడు తనఖడ్గముతో నావ్రేటు తప్పించుకొనియెనట. అంత పాండ్యుఁడు విశ్వనాథనాయని వ్రేటువేయమని పలికెనఁట! అతఁడు నిరాకారించి పాండ్యునే వ్రేటు వేయమని ముమ్మాఱు పలికెనట! పాండ్యుఁ డట్లుగావించెనఁట! అంత విశ్వనాథనాయఁ డెప్పటియట్ల తప్పించుకొని
2015.328360.Andhra-Mahaniyulu/page_0037.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ పాండ్య దేవుఁడే' యనియుఁ దక్కినవారు విశ్వనాథనాయని వారికి సామంతులై మైత్రితితోఁ బ్రవర్తించి రని మనము నిశ్చయింపవచ్చును.
2
+
3
+ ఈవిశ్వనాథనాయనివా రెంతసమర్థుఁడైనను, ఎట్టిరాజ్య తంతజ్ఞుఁడైనను, ఒకటి రెండుమాఱులు సామ్రాజ్యము వారి సహాయమును గోరక తప్పినది కాదు. ఇతఁడు తెంగాశి పాండ్యులతోఁ బోరాడుచున్న కాలమున పోర్సుగీసువారు సముద్రతీరమునందు నివసింపుచు ముత్తెపు చిప్పలను సముద్రమునుండి దేవి తెచ్చి వ్యాపారము చేసెడి పరవజాతివారిని పెక్కండ్ర క్రైస్తవమత ప్రవిష్టులనుగాఁ జేసి వారిసహాయముతో సముద్రతీరము నాక్రమించుకొని సముద్రవ్యాపార మంతయుఁ దమహస్తగతమగునటుల వ్యవహరింపుచు పరవజాతి వారిని పాండ్యరాజ్యపరిపాలనమునుండి వేఱిపఱచినను నేమియుఁజేయ శక్తిచాలక యుండెను. ఇంతియగాక తిరువడి రాజ్యాధిపతి యైనభూతల వీరరామవర్మ పోర్చుగీసువారి సహాయముచే గర్విష్టుఁడై కప్పముగట్టుట మానుకొనుటయెగాక పాండ్యరాజ్యములోని కొంతభాగ మాక్రమించు కొనుటకుఁగూడ సాహసించెను. ఈ దుస్థితినంతయుఁ దెలిసికొని విజయనగరసామ్రాజ్యసంరక్షణ కర్తయగు అళియరామరాయలవారు విశ్వనాథనాయనివారికిఁ దోడ్పాటుగానుండి పోర్ఛుగీసువారియొక్కయు, తిరువడిరాజ్యాధిపతియొక్కయు,
2015.328360.Andhra-Mahaniyulu/page_0038.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ విజృంభణము నడగించి వారినుండి కప్పములు గైకొని యాభాగములందు శాంతి నెలకొనునటుల పాండ్యరాజ్యమును బలపఱచి విశ్వనాథనాయనివారి పరిపాలనమును దృఢపఱచి రావలయునని పెనుగొండరాజ్యాధిపతియైన విఠ్ఠలరాయని, వీని తమ్ముఁడును, చంద్రగిరిరాజ్యాధిపతియైన యౌకు చినతిమ్మరాజును దక్షిణదేశమునకుఁ బంపించెను. విఠ్ఠలదేవరాయలు రాజప్రతినిధిగా నియమింపఁబడియెను. విశ్వనాథనాయనివారు పాండ్యరాజ్యములోపలి వ్యవహారములను జక్కఁబెట్టుకొనుచు, వెలుపలివ్యవహారములయందు సామ్రాజ్యప్రతినిధి యగువిఠ్ఠలదేవరాయనికిఁ దాను గాని తనకుమారుఁడు కృష్ణప్పనాయనివారు గాని యప్పటప్పట తోడుసూపు చుండెను. విఠ్ఠలదేవరాయలు 1558 వ సంవత్సరమువఱకు రాజప్రతినిధిగా దక్షిణదేశమున వ్యవహరించెను. విఠ్ఠలదేవరాయలు తనతమ్ముఁ డయిన చినతిమ్మరాజుతోఁగూడి తిరువడి రాజ్యమును జయించి వానితో సంధికార్యమున కొడంబడి సామ్రాజ్యమునకు రావలసిన కప్పముల నన్నిటిని రాఁబట్టఁ గలిగెను. పోర్చుగీసువారిని, పరవజాతివారిని జయించి పోర్చుగీసురాజ్యమునకుఁగాక పాండ్యరాజ్యమునకు లోబడి కప్పములు చెల్లింప నియమబద్ధులను గావించెను. ఈసందర్భములయందు విశ్వనాథనాయనివారు తా నొక స్వతంత్రరాజువలె, బ్రవర్తింపక సామ్రాజ్యమునకు సామంతుఁడ నను
2015.328360.Andhra-Mahaniyulu/page_0040.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ తిరువడి రాజ్యాధిపతి యగు భూతల శ్రీవీరరామవర్మయును పోర్చుగీసువారును క్రైస్తవమత మవలంబించిన పరవజాతివారును దక్షిణదేశమున సామ్రాజ్యాధికారమును దొలఁగించి యాస్థానమున పోర్చుగీసువారి రాజ్యాధికారమును స్థాపించుటకై ప్రయత్నించిన విధానమును భగ్నపఱచుటకును, ఈ ప్రాంతదేశమున విజయనగర సామ్రాజ్యప్రతిష్ఠను స్థిరముగా నెలకొల్పుటకును విఠ్ఠలరాయలు నియోగింపఁబడి పదిసంవత్సరములకాల మిచట నుండి తనప్రయత్నము లన్నిటిని విజయము గాంచెను. ఈకార్యములయందు పాండ్యరాజ్యమును బరిపాలించు విశ్వనాథనాయనివారును, వానికుమారుఁడు కృష్ణప్పనాయనివారును తోడ్పడినమాట వాస్తవమెకాని విశ్వనాథనాయనివారు పాండ్యరాజ్యమును స్వతంత్రముగాఁ బరిపాలనము చేయలేదని కొందఱు చరిత్రకారులు వ్రాసినది సత్యచరిత్రము కాదు. ఇప్పటినుండియు నీతఁడును నీతనివంశము వారును పాండ్యరాజ్యమునకు వంశపారంపర్యపు హక్కు గలిగి యిన్నూఱు సంవత్సరముల వఱకుఁ బరిపాలింపఁ గలిగిరి. విశ్వనాథనాయనివారు 1496 వ సంవత్సర ప్రాంతమున జనించి 1529 మొదలుకొని 1564 వఱకు పాండ్యరాజ్యమును బరిపాలించి 1564 వ సంవత్సరమున మరణముఁ జెందెను. ఇతనికి 'పాండ్యకుల స్థాపనాచార్య' యను బిరుదము గలదు. ఇయ్యది బహుశః తెంగాశి పాండ్యులను మరల వారివారి
2015.328360.Andhra-Mahaniyulu/page_0043.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ మాకరాజును, వెంకప్పనాయఁడు ననువారు. వీరినిఁ బ్రతిఘటించి వీరి దుష్ప్రయత్నములను భగ్నపఱచి శాశ్వతమైన విజయకీర్తిని గాంచినవాఁడు యాచమనాయఁడు. ఇతఁడు పద్మనాయకకులాభరణము,వేంకటగిరిపురాధీశ్వరుఁ డయిన వెలుగోటి యాచమనాయనిమనుమఁడు. కాళహస్తిపురాధీశ్వరుఁ డయిన దామర్ల వెంగళనాయని దహోత్రుఁడు. ఇతనితండ్రి కస్తూరి రంగప్పనాయఁడు. తల్లి వేంకటాంబ. వీ రెల్లరును 1586 మొదలుకొని 1614 వ సంవత్సరము వఱకు విజయనగరసామ్రాజ్యమును బరిపాలించిన శ్రీమద్రాజాధిరాజ పరమేశ్వర శ్రీవీరప్రతాప శ్రీవీర వేంకటపతి దేవమహారాజ సేనాపతులును నాతని సేవించెడుమండలాధీశ్వరులు నై యుండిరి. సత్యము, నీతి, న్యాయముఁ దప్పకుండ ధర్మపరిపాలనముఁ జేసి విజయనగరసామ్రాజ్యసింహాసన మధిష్టించి వాసిఁ గాంచినవారిలో నీతఁ డొక్కఁడు. ఈతఁ డెంతటిసామ్రాజ్యసంపదలతో దులతూఁగు చున్నను సంతానాపేక్షతో నాఱుపర్యాయము లార్గురుపడతులను వివాహముచేసికొన్నను సంతానసౌభాగ్యమునుఁ గన్నులారఁ జూచుకొనుభాగ్యము మాత్ర మబ్బినది కాదు. ఇతనికి వేంకటాంబ, రాఘవాంబ, పెదఓబమాంబ, పినఓబమాంబ, కృష్ణాంబ, కొండాంబ అను భార్య లున్నట్టు లీయార్వురనామములు శాసనములవలన నైన నేమి గ్రంథముల వలన నైన నేమి, తదితరలేఖలవలన నైన నేమి దెలిసికొన
2015.328360.Andhra-Mahaniyulu/page_0044.txt ADDED
@@ -0,0 +1,18 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ సాధ్య మగుచున్నవి. అందుగుల వెంకయవిరచిత మగు నరపతివిజయమునందు :-
2
+
3
+ "సీ. పరమపాతివ్రత్యగరిమచే మిక్కిలి
4
+ యతిశయిల్లినవెంకటమ్మగారిఁ
5
+ జిరయశోనిధి యైనజిల్లేళ్ల రంగనృ
6
+ పాధిపు పుత్రి నోబమ్మగారి
7
+ జిల్లేళ్లకృష్ణరాట్చీతమయాఖు ప్రి
8
+ యాత్మజ యైనకృష్ణమ్మగారి
9
+ భూరి శౌర్యోగ్ర గొబ్బూరి యోబక్షమా
10
+ ధ్యక్షు తనూజఁ గొండమ్మగారి
11
+ గీ. నెమ్మివరుసఁ బాణిగ్రహణమ్ముఁ జేసి
12
+ వీర వేంకటపతిరాయవిభుఁడు వేడ్క
13
+ నలరు నప్పద్మముఖులతో ననుదినంబు
14
+ నధికసౌఖ్యాంబునిధి నోలలాడె మిగుల."
15
+
16
+ అని యభివర్ణించి యున్నాఁడు. ఇందుఁ బేర్కొనఁబడిన కొండమ్మతండ్రి యగుగొబ్బూరి యోబక్షమాధ్యక్షునకుఁ బై చాటువునందుఁ బేర్కొనఁబడిన గొబ్బూరి జగ్గరాజు కుమారుఁ డై యుండును.
17
+
18
+ వేంకటపతిరాయలునకు సంతానము లేదు గావున నతని వెనుక సింహాసనము నధిష్ఠింపఁదగిన హక్కు గలవా రాతనియన్న యైనరామరాయని కుమారులగు తిరుమల
2015.328360.Andhra-Mahaniyulu/page_0046.txt ADDED
@@ -0,0 +1,10 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ "సామ్రాజ్యమునందలి మహామండలేశ్వరులలో రాయలకుఁ దరువాత నధికారమును, పలుకుఁబడియు చలాయింపఁ గలవారిలో ఓబలరాయఁ డొక్కడు. ఈతని సంతకముతో రాధారిపత్రము గలవా రెట్టిభయమును, నాటంకమును లేక యేబాటపై నైనను, ఏనదిమీఁద నైనను నిశ్చింతతోఁ బ్రయాణము చేయవచ్చును. ఈతనియాజ్ఞను నుల్లంఘించుట యన నేయుద్యోగస్థుని కైనను మరణశిక్షను బొందుట యగును."
2
+
3
+ ఇందుఁ బేర్కొనఁబడిన ఓబలరాయలు, వేంకటపతి రాయలమామగారు. రంగరాజు రాయలకుఁ బ్రేమ పాత్రుఁడును, అన్న కుమారుఁడును, దత్తపుత్రుఁడును, యువరాజును నగు చిక్కరాయలు. ఈతని యువరాజుగఁ జేసినట్లు నరపతివిజయమను రామరాజీయములోని :-
4
+
5
+ క. అతనికి శ్రీరంగమహీ
6
+ పతి గలిగెను నా మహానుభావుఁడు శౌర్యో
7
+ న్నతి వెంకటపతిరాయనృ
8
+ పతిచే యువరాజుపట్టబంధము నొందెన్.
9
+
10
+ అను పద్యమువలన విదిత మగుచున్నది. రాయలు తరువాత రాజ్యమునకు రావలసిన యువరాజును చిక్కరాయలనుట దేశీయసంప్రదాయము. కనుకనే రామరాజీయమున శ్రీరంగ చిక్కరాయమనుజవిభుడే చిక్కరాయ లనియు, యువ
2015.328360.Andhra-Mahaniyulu/page_0050.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ దయను, ప్రేమను జూపియుండుటను, 1611 వ సంవత్సరము నుండి కొండమ్మకుఁ గొడుకుఁ బుట్టినట్టు కల్పనచేసి రాజ్య మపహరింపవలె నని ప్రయత్నము చేసినారు. కాని వీరవేంకటపతిరాయల మొదట తా నెట్లు ప్రతిజ్ఞపట్టి యాచరించుచు వచ్చెనో దానిని చనిపోవునపుడు సైతము మఱువలేదు.
2
+
3
+ అయినను సామ్రాజ్యాధీశ్వరుం డగు వీరవేంకటపతిరాయలవారు 1614 వ సంవత్సరములో అక్టోబరునెల నడిమికాలమున దాను మరణించుటకు మూన్నాళ్లకుముందే యొకనాఁడు మంత్రి పురోహిత సామంత దండనాయక దౌపారిక బంధుజన విద్వజ్జన సమక్షంబునఁ దనసోదరపుత్రుఁడు, యువరాజు నగు శ్రీరంగరాజునుఁ దనదగ్గఱకుఁ దీసికొని "నాయనా! శ్రీరంగా! నేనిఁకజీవింపను. నిన్నీ సామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తునిఁజేయుచున్నాను. ఇదిగో! నా చేతియుంగరమును దీసికొని ధరింపుము." అని పలికి తన కుడిచేయి చాచి యాతని కం దిచ్చెనఁట! అట్లు పలికి చేయిచాచినతోడనే శ్రీరంగరాజు గన్నుల వెంట బొటబొటబాష్పజలంబు లొలుక గద్గదకంఠముతో 'మహాప్రభూ! దేవరా! ఈసామ్రాజ్యము నేలుట కెవ్వరుర్హులో నీ యుంగరము వారి కలంకరింపుము. ఈప్రభుత్వము నా యంతట నేను కోరినవాఁడను గాను" అని పలికి సాష్టాంగ పడి బావురు మని యేడ్చుచు నాతని పాదములం బట్టికొనియెనఁట! అపుడు రాయలు తనచుట్టు నున్నవారిని నారాకుమారు లేవనెత్తు డని యాజ్ఞాపింపగా నట్లుగావించి వార
2015.328360.Andhra-Mahaniyulu/page_0051.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ లాతని రాయలకుడిచేయితోఁ బట్టుకొనుట కను వగునట్టు నిలిపి రఁట! తనచేయి చాచి యిదిగో! యీ యుంగరమును గైకొను మని మరల పలికెనఁట! అతఁడు యుంగరము తనకు ముప్పు వాటిల్లఁజేయునని విధివశమున ముందుగాఁ దెలిసి కొన్నవానివలె 'ఓరాజా ! నీయాజ్ఞ నుల్లఘించి నేనీ యుంగరము దీసికొనకున్నందునకు నన్ను క్షమింపము'మని చేతులు శిరస్సునకుఁ జేర్చుకొనియెనఁట! అంత తనచేతి యుంగరమునుదీసి పై కెత్తి తీసికొమ్మని రెండవమాఱు మరల కోరగాఁ జుట్టునున్న దండనాయకులు ప్రోత్సహింపఁ గన్నీ రోడ్చుచు దానిని తీసికొని ముందుగా శిరమునఁ బెట్టుకొని తీసి తరువాత వ్రేలికిఁ బెట్టుకొనియెనఁట! పిమ్మట రాయలు రెండు లక్షల క్రుజడావుల విలువగలిగిన పట్టాభిషేక కాలములందును, ప్రత్యేక పర్వదినములందును సామ్రాజ్యసార్వభౌములు ధరింపఁ దగినదుస్తుల నిప్పించుటయెగాక యాఱు లక్షల క్రుజడావుల విలువఁగలిగిన తన చెవి వజ్రములను, మఱి రెండు లక్షల క్రుజడావుల విలువఁగలిగిన తనచెవికమ్మలను, ఇంకను విలువఁగలిగిన పెద్దపెద్ద ముత్తేములనుఁ దెప్పించి యిప్పించె నఁట! ఇట్టి యాభరణముల నన్నిఁటి నొసంగి తన తరువాత శ్రీరంగరాజు పట్టాభిషిక్తుఁడు గాఁదగిన రాజకుమారుఁ డని ప్రకటించి యుండె నఁట!
2
+
3
+ తరువాత నాఱుదినములు బ్రదికె ననియు జనిపోవు నప్పటికి నఱువదియేడేండ్లవయ స్సుండె ననియు బర్రాదాసు
2015.328360.Andhra-Mahaniyulu/page_0052.txt ADDED
@@ -0,0 +1,7 @@
 
 
 
 
 
 
 
 
1
+ తెలుపుచున్నాఁడు. వాని యారామములోనే మంచిగంధపుఁ గట్టెలతోడను, సుగంధద్రవ్యములతోఁడను రాయలప్రేతమునకు దహనసంస్కారకర్మ జరుపఁబడెనఁట! వీనితో వీని రాణులు మూవురుమాత్రము సహగమనము గావించిరఁట?
2
+
3
+ శ్రీరంగరాజును పట్టాభిషిక్తునిఁ జేయుటకు వేంకటపతిరాయలు సూచించిన యీమార్గము కొందఱకు సంతోషకరముగ నున్నను, మఱికొందఱకు దుఃఖకరముగ నుండెను. రాజబంధువులలోనేగాక సామ్రాజ్యమండలాధిపతులలోను, దండనాయకులలోను బెద్దకలవరము జనించె నఁట! పులికాట్టు నందున్న ఒలందులకు నీకలహమేరీతిగఁ బరిణమించునో, తమవర్తకమునకుఁ, దమవర్తకపుశాలాస్థానమునకు నెట్టివిపత్తు గలుగునో యని భయకంపితు లయిపోయిరఁట !
4
+
5
+ శ్రీరంగరాజు యధాశాస్త్రీయముగఁ బట్టాభిషిక్తుఁ డయ్యెను. జగ్గరాజు, మాకరాజు, రావెల వెంకటపతినాయఁడు తక్క తక్కిన సామంతమండలాధిపతులెల్లరును విననితు లై కానుక లర్పించి నమస్కరించి సార్వభౌమునిగ నంగీకరించిరి.
6
+
7
+ కొంతకాలము గడచినపిమ్మట శ్రీరంగరాయలు తనకొల్వున నున్న యుద్యోగస్థులలోఁ గొందఱపై ధనాపహరణము మున్నగు నభియోగములు రాఁగా విచారించి వారిని వారివారి పదవులనుండి తొలఁగించుట తటస్థించెను. వీరందఱు నదివఱకె శత్రువులుగా నేర్పడి కుట్ర చేయుచున్న
2015.328360.Andhra-Mahaniyulu/page_0053.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ జగ్గరాజు, మాకరాజు, వెంకులతోఁ గలిసి రాయలను సింహాసనభ్రష్ఠునిఁ జేయుటకై ప్రయత్నించు చుండిరి. ఇ దంతయు నెఱింగి శ్రీరంగరాయలు జాగరూకతతో వ్యవహరించుచు దుర్గమును, నంతఃపురమును సురక్షితముగ నుంచుకొనియెను. ఈ కుట్రల కన్నిఁటికిని మూలకారకుఁడగు గొబ్బూరి జగ్గరాజు. శ్రీరంగరాజును రాజ్యభ్రష్ఠుని గావించి తనమేనల్లుఁడైన శిశువునకుఁ బట్టము కట్టి తాను సామ్రాజ్యము నేలుటకు మంచితరుణము సంభవింవిన దని సంతోషించుచుఁ దన కాప్తు లయినవారితో యోజించి ఘనమైన పన్నాగమును బన్ని వంచనచేఁ గార్యము నెఱవేర్పఁ దలఁచి విప్లవమునకు సంసిద్ధుఁ డయ్యెను.
2
+
3
+ సామ్రాజ్య వ్యవహారనిర్వాహకదృష్టియం దుండి శ్రీరంగరాయలు వీరిపట్ల నలక్ష్యభావముతోఁ గొంతకాల మేమరియుండి వీరివంకఁ జూడక పోయెను. అందువలన వీరి పన్నాగము లాతనికిఁ దెలియ రాలేదు. ఒకనాఁ డాకస్మికముగాఁ దనకు ముఖ్యశత్రువుగా నేర్పడియున్న మహామండలేశ్వర గొబ్బూరి జగ్గరాజ దేవమహారాజుకడనుండి యొక దూత రాయలకడకు వచ్చి యొక లేఖను సమర్పించెను.
4
+
5
+ "ఇదివఱకు మీకు ప్రతిపక్షినైయున్న నేనును, నాతోడి మిత్రులును, మా ప్రయత్నములను మేము విడిచి మిమ్మె సార్వభౌములుగ భావించి సేవింప నిశ్చయించుకొన్నారము.మీరు తొంటిభావములను విడిచి మా కనుజ్ఞ దయ
2015.328360.Andhra-Mahaniyulu/page_0054.txt ADDED
@@ -0,0 +1,7 @@
 
 
 
 
 
 
 
 
1
+ చేసినయెడల దేవరసాన్నిధ్యమునకు విచ్చేసి మాకానుక లర్పించి కృతప్రణాము లగుదుము." అని యందు వ్రాసి యుండెను. పరాక్రమవంతులయిన యీశత్రుపక్షమువారి నెల్లరఁ దనవంకకుఁ జేరఁదీసికొని సామ్రాజ్యమును బలపఱచి కొనుట యత్యావశ్యక మైనదిగా భావించి యందుల కంగీకరించినట్లు తెలుపుచు జగ్గరాజున కా దూఁతచేతనే ప్రత్యుత్తరము పంపి తన దుర్గాధ్యక్షున కీవర్తమానముఁ దెలియఁజేసి వారు వచ్చినయెడల నెట్టిమాటంకమును గలిగింపకుండ నుండవలయు నని యాజ్ఞ చేసెను.
2
+
3
+ మఱియు వారిని సామ్రాజ్యసామంతులుగ భావించి యధామర్యాదలు దప్పకుండ గౌరవభావముతో వారికి స్వాగతము నొసంగవలసిన దని కూడ నుత్తరువు గావించెను.
4
+
5
+ అమాయకుఁ డయినయారాయలు జగ్గరాజు పన్నిన యీమాయావ్యూహమునం దగుల్కొని యట్టియుత్తరువు లిచ్చియుండుటచేత జగ్గరాజునకును, వానిమిత్రులకును దుర్గములోఁ బ్రవేశించుట యత్యంతసులభసాధ్య మై పోయెడు. పాప మాదురదృష్టవంతుఁ డగురాయ లొకరీతిగఁ దలంప దైవ మింకొకరీతిగఁ దలంచెను.
6
+
7
+ అతఁడు తనమిత్రవర్గముతోఁ బ్రవేశించి రాయల పరివారమున కిఱుకపడకుండునట్లు తన రక్షకభటుల నాయా ద్వారములకడకుఁ బంపి వారివారిస్థానముల నిలువ నేర్పాటు గావించెను. ఇంతలో వీరు తలపెట్టిన ద్రోహకార్యము
2015.328360.Andhra-Mahaniyulu/page_0055.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ రాయలవర్గమువారికిఁ బొడకట్టెను. అంత రాయల సైనిక వర్గమువారు దుర్గద్వారములను మూసివేయఁ జూఁచిరి. అప్పటికే కార్యము మించిపోయినది. అంతయు నిష్ప్రయోజనముగాఁ బరిణమించెను. జగ్గరాజు సైనికభటులు రాయల దుర్గరక్షకులను సంహరించుచు నంతఃపురభాగములకుఁ బఱు విడు చుండిరి. ఇంతలో నొక శత్రునాయకుఁ డొకఁడు రాయలనుఁబట్టికొని జగ్గరాజుకడకుఁ దీసికొనివచ్చి 'ఇదిగో! రాయలను నీకర్పించు చున్నా' నని పలికెను.
2
+
3
+ అతఁడు రంగరాయలను జూఁచి "రంగరాజా! నీవు నాకు ఖైదీవయినావు. నీ విఁక నిశ్శబ్దముగ నావలికి పోతివా నీ ప్రాణములను నీవు సంరంక్షించుకొనఁగలవు. ఈదినము మొదలుకొని రాజ్యకాంక్ష విడిచి సామ్రాజ్యముపైఁ గల హక్కునంతయు వదలుకొని మరల యెన్నఁడును జేపట్టుటకుఁ బ్రయత్నింపకుండుము" పొమ్ము అని పలికెను.
4
+
5
+ అతఁడు మోసపోయెను. దుర్గ మంతయు శత్రుసైన్యములతో నిండిపోయెను. ఇంక చేయున దేమి గలదు? అట్టి కఠిన మైన యాజ్ఞకుఁ దలయొగ్గక తప్ప దయ్యెను. ఆ దురదృష్టవంతుఁడు తనభార్యను, బిడ్డలను దీసికొని క్లేశముచే వాడిపోయిన మోమును, వాల్చిన కన్నులును గలిగి మాఱు మాటలేక తల వంచికొని పోవుచుండెను. ఒక్క మనుష్యుఁ డయినను నమస్కరించువాఁడు లేఁ డయ్యెను. ఇది ద్రోహమని పలికినవాఁడు లేకపోయెను. ఆక్షణమువఱకు రాజుగ
2015.328360.Andhra-Mahaniyulu/page_0056.txt ADDED
@@ -0,0 +1,7 @@
 
 
 
 
 
 
 
 
1
+ నున్నవాఁ డంతలో దిక్కుమాలినవాఁడు గావలసివచ్చెను. ఆహా! మానవుని బ్రతు కింతేగదా! రాయలపక్షమున నున్న మహావీరు లందఱునుఁ బిఱికిపంద లైపోయిరి. రాయల కంతయు నంధకారబంధురముగాఁ గన్పట్టెను. పాప మాదురదృష్టవంతుఁ డైన రంగరాజు వెల్తురు నెప్పటి కయినను జూడఁ గలుగుదునా యని తలపోయు చుండెను. రాయవేలూరునగరమున నుద్భవించి దట్టముగా నలముకొన్న యీ మబ్బులు సామ్రాజ్యము నంతయు వ్యాపించిపోయినవి.
2
+
3
+ కాని విజయనగరసామ్రాజ్యము శూరుల కెన్నడను బేదవడి యుండలేదు. ఈ విప్లవసమయమున నొక మహావ్యక్తి బాలభాస్కరునివలె విజృంభించుట కవకాశము చిక్కెను. ఆవ్యక్తియె మన కథానాయకుఁ డైన శూరవరాగ్రణి.
4
+
5
+ ఆదినమున వేలూరునగరమున వెలుగోటి యాచమనాయఁడు లే కుండెను. ఆనగరమునకుఁ గొన్నిమైళ్లదూరమున నున్నవాఁడు. ఇచట నేమి జరిగియుండునో యాతఁ డెఱుంగ కుండెను. ఈ దుర్వార్త చెవిని బడినతోడనే తాను తన దుర్గమునకుఁబోయి తనసైన్యమునంతయు నొక చోటికిఁ జేర్చికొని తనకు మిత్రుఁ డయిన రాయలపక్షముఁ బూని యెప్పుడు శత్రువులను మర్దించి రాయలను రక్షించి సామ్రాజ్యమును రాయలకు నిలుపుట కవకాశము గలుగునా యని నిరీక్షించు చుండెను.
6
+
7
+ అట్లు జగ్గరాయలు రాయవేలూరు నాక్రమించుకొని రంగరాయలను, వానికుటుంబమును చెఱశాల యందుంచెను. తన
2015.328360.Andhra-Mahaniyulu/page_0058.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ అవశ్యము రావచ్చును. తా నెప్పుడు సిద్ధముగా నున్న నప్పుడే రావచ్చును. ఎప్పుడు వచ్చినను యాచమనాయఁడ నైన నేను నావంటి మనుష్యులతో నిరీక్షించి యుందును. పో; పొమ్ము; పోయి నాయీపలుకులు జగ్గరాయల దర్బారులో పలుకుము. ఈపలుకులు విన్నమాత్రమున జగ్గరాయలకు మిన్నువిఱిఁగి మీఁదబడినట్లు తోఁచెను.
2
+
3
+ అప్పు డతఁ డిట్లు తలపోసికొనియెను. "ఇతఁడు నిక్కముగా శూరుఁడే. తాను తనబొందెలోఁ బ్రాణము లున్నంత దనుక రంగరాయల పక్షమునఁ బోరాడుటకు నిశ్చయించి కొని యున్నవాఁడు. ఇట్టివానిపట్ల సామదానభేదదండోపాయములను, జతుర్విధసాధనములనుఁ బ్రయోగింపవలయును. ముందుగా దండోపాయమువలన నపాయము వాటిల్లఁ గలదు. ఇప్పు డితనితో యుద్ధము దలపెట్టినయెడల దామర్ల వెంగళనాయఁడు, దామర్ల చెన్నప్పనాయఁడు మొదలుగా నీతని బంధువర్గమువా రందఱును నీతనిపక్షమునఁ జేరుదురు. అప్పుడు రంగరాయల బంధువర్గము వీరినిఁ జేరుదురు. తక్కిన మండలాధిపతులను నాపక్షమున నిలుపుకొనుట దుస్సాధ్యమగును. ఈతని సామముచేతను, దానములచేతను జక్కపఱుపజూతును."
4
+
5
+ ఇట్లు తలపోసి యాచమనాయని ననేకవిధములుగాఁ గొనియాడుచు 'నీవు నామేనల్లునిపక్షమున నుందు వేని విశేషముగా వరుంబడి వచ్చెడి భూములను నొసంగుచు నిన్ను
2015.328360.Andhra-Mahaniyulu/page_0060.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ చేయుచున్న యుద్ధసన్నాహమునకును భయపడి ప్రత్యుత్తర మిచ్చుటకు నేమియుఁ దోఁపక జగ్గరాయలు తదితరసామంత మండలాధిపతులను స్తోత్రపాఠములుఁ జేయుచుఁ, గౌరవించుచు వారల నందఱ నేకీభవింపఁ జేసి యేకాకి యై యెదిరించుచున్న యాశత్రువీరునిఁ దలపడి నాశనము జేయవచ్చు నన్నయాశతో నుండెను.
2
+
3
+ ఇంతలో యాచమనాయఁడు చెఱలో నున్న తన ప్రభువును విడిపించు టెట్లని యాలోచించు చుండెను. ఒక దుర్మార్గుని చేతిలోఁ బూర్తిగాఁ జిక్కిపోయి యితరుల కెవ్వరికిఁ జొఱరాని కారాగృహంబున నున్నవాని విడిపించుటకుఁ బ్రయత్నించునపుడు వాని కెట్టివిధమైన హానియుఁ గలుగకుండఁ జూడ వలయునుగదా! ఎన్నివిధములఁ బ్రయత్నించినను కార్యము కొనసాఁగ దయ్యెను.
4
+
5
+ ఇట్లుండ నాతనిమనంబున కొక యోచన తట్టెను. ఏదైన నుపాయముచేత రంగరాయలపుత్రులలో నొకనినైన నీవలకు వచ్చునట్లు చేసి యాతనినే రాయలుగాఁ బ్రకటించి పట్టాభిషిక్తునిఁ జేయుట యుక్తమని భావించెను. అందు కొక యుపాయమును జింతించెను. పదభ్రష్టుఁ డైనరాయలకును, వాని కుటుంబమునకును బట్ట లుతుకుటకై నియమింపఁబడిన చాకలివానివలన యీ కార్యమును నిర్వహింప సాహసించెను. ఒకనాఁడు రహస్యముగా చాకలివానిని రప్పించి ఓయీ! నీవు రంగరాయని పుత్రులలో మొదటికుమారుఁడు, పెద్దవాఁడు
2015.328360.Andhra-Mahaniyulu/page_0062.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ మిక్కిలిగమాసి యంటువడి యున్న గుడ్డలను గప్పి యతిసాహసముతో నాగంప నెత్తికొని వచ్చినదారిని పోయెను. కావలి వారతని నెఱింగినవా రగుటచేతను ప్రతిదిన మట్లు చాకలి వాండ్రు పోవుచుండుట చేతను వారి కెట్టి యనుమానమును గలుగకుండుటచే యధాప్రకారము ద్వారములగుండఁ బోనిచ్చిరి. అతఁ డంటుగుడ్డలు మోసికొని పోవుచున్నాఁ డని యితరు లందఱును వానికి దూరముగాఁ దొలఁగుచు వచ్చిరి గాని యెవ్వరికి నెట్టివిధ మైనయనుమానమును గలుగలేదు.
2
+
3
+ అట్లు చాకలివాఁడు నిరాటంకముగా నిర్భయుఁ డై కోటనుదాటి యొక రహస్య ప్రదేశమునకుఁ గొనిపోయి వానిని బయటకుఁ దీసి యాబాలుఁడు తనకు నాతనికి నెట్టి విధమైన విపత్తు గలుగకుండ నట్టికష్టమున కోర్చియుండినందు కాతఁ డదృష్టవంతుఁ డని భావించి శ్లాఘించుచు నాప్రదేశముననే మూఁడుదినము లుండునట్లునియమించి నాల్గవనాఁ డెవ్వరికిఁ దెలియకుండ నాతని యాచమనాయని చెంతకుఁ జేర్చెను. అంతటి మహోపకారమును గావించినందుకు వానిని మెచ్చికొని తాను చెప్పిన ప్రకారము కొంతధన మొసంగి రామదేవుని పట్టాభిషిక్తుని గావించిన వెనుక తనవాగ్దత్తము సంపూర్ణముగా నెఱవేర్తునని చెప్పి వానిప్రాణమును గాపాడుట కభయప్రదానముగూడఁ జేసెను.
4
+
5
+ అటుపిమ్మట నెద్దియో కపటోపాయమున రంగరాయల రెండవకుమారుని యాచమనాయఁడు తనచెంతకుఁ
2015.328360.Andhra-Mahaniyulu/page_0063.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ జేర్చికొని యున్నాఁడని జగ్గరాయనికిఁ దెలియవచ్చెను. అట్లు తన్ను మోసపుచ్చినందుకు నతఁడు క్రోధోద్దత్తుఁడై రంగరాయని కారాగృహమునకు మునుపటికంటె నిబ్బడిగాఁ గాపువెట్టి యాతని వెచ్చమునకుఁగా నిచ్చుభృతిని తగ్గించుటయెగాక సన్నని బియ్యమునకు బదులుగా ముతుక బియ్యమును, చచ్చుపుచ్చు కూరగాయలను మాత్ర మిప్పించుటకుఁ గట్టడిచేసెను.
2
+
3
+ వెలుగోటి యాచమనాయఁడు రంగరాయని రెండవ కుమారుడు రామదేవరాయని మాయోపాయముచేతఁ జెఱనుండి విడిపించుకొని చెంతకుఁ జేర్చికొని వానికిఁ బట్టము గట్ట నున్నాఁడనువార్త యగ్నిహోత్రమువలె సర్వత్ర వ్యాపించెను. అంత రంగరాయని పక్షమువారు, జగ్గరాయల భయముచే నణఁగిమణఁగి పడియున్న మండలాధిపతులు, దండనాయకులు, తదితరులు నిట్లు తలపోసిరి. "ఈరాజ్యమునకు వాస్తవమైన హక్కుదారుఁడు రంగరాజుగాని జగ్గరాజు మేనల్లుఁడు కాఁడు. వాఁడు కృతిమపు ప్రభువు. వీనికి సామ్రాజ్యము కట్టఁబెట్టుట మనకు ధర్మము కాదు. కనుక మనమెల్లరము మనసైన్యములతో జగ్గరాయల బంధము నుండి తప్పించుకొని యాచమనాయని సైన్యములలోఁ జేరి రామదేవరాయనికిఁ బట్టము గట్టుట పరమధర్మము."
4
+
5
+ ఇట్లు చింతించి వా రెల్లరును ధైర్యసాహసములఁ జూపి తమతమ పరివారములతోను సైన్యములతోను యాచ
2015.328360.Andhra-Mahaniyulu/page_0065.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ బ్రవేశించినపుడు రంగరాయలు వారినిగాంచి వారలను జగ్గరాయలబటులుగాఁ దలంచి తన్నుఁ జంపుటకు వచ్చినవా రని భావించి భయపడియు వీరపురుషోచిత మైనధైర్యముతో నుండి నిశ్చేష్ఠితుఁ డయ్యెను. అంత వార లాతనికి సాష్టాంగ నమస్కృతులు గావించిరి. వారి నాయకుఁ డగు నొకయువకుఁడు యాచమనాయకుఁ డిచ్చిన ------కుజాబునుఁ దీసి యాతని కిచ్చెను.
2
+
3
+ అంతట తత్తరముతోఁ రంగరాయ లాజాబునుఁ జదువుకొని యాచమనాయకుని భక్తివిశ్వాసముల కబ్బురపడుచుఁ దన దురవస్థను దలపోసికొనునప్పుడు లోపలినుండి యుబుకుకొని వచ్చెడు దుఃఖప్రవాహము నాపుకొని 'ఇటువంటి భక్తివిశ్వాసములతోఁ గూడికొని ధైర్యసాహసములఁ జూఁపుచు నన్నుఁ జెఱనుండి తప్పించుటకుఁ జూపిన యీ మార్గము నుల్లంఘించుట తనవంటివానికి యుక్తము గా' దని పలికి భార్యకును, బిడ్డలకును జెప్పి తాను కట్టుకొనియున్న దుస్తులను విసర్జించి యొక చిన్న యంగవస్త్రమును జుట్టఁ బెట్టుకొని వారల వెనుక సొరంగములోనికి దిగి సొరంగము మార్గమున బయలు వెడలెను. దుమ్మును, ఱాళ్లును పైఁ బడుచుండ చేతులు, మోకాళ్లును క్రిందనాన్చుకొని యొక్కపలుకైన బలుకకుండ నూపిరి విడుచుట కష్టముగా నున్నను సహించి చాలదూరము ప్రాకుచు వచ్చిరిగాని దురదృష్టవశమునఁ గస్తీ తిరుగుచున్న కావలివాఁ డాసమయమున నాసొ
2015.328360.Andhra-Mahaniyulu/page_0066.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ రంగముపై నడుచుట సంభవించి భూమిపై పట్టతిమాత్రముగా నుండుటచేత నాసొరంగములో వారిపై బడుట సంభవించెను. అయ్యది కత్తులు దూయుట కనువగు ప్రదేశము కాదు. రాయలను సురక్షితస్థానమునకు త్వరలోఁ గొనిపోవుటకు సాధ్యము గాదు. ఈ కావలివాని మొఱ్ఱల నాలకించి తక్కిన కావలివాండ్రందఱు నొక్కపెట్టునఁ బఱువెత్తుకొని వచ్చి అంగవస్త్రము మాత్రము గలిగి దేహమంతయు దుమ్ముతోఁ గప్పఁబడి మోకాళ్ళుకొట్టుకొనిపోయి రక్తము గారు చుండ రంగరాయలను జగ్గరాయలకడకు నీడ్చికొని పోయిరి. అతఁడు కోపము పట్టఁ బగ్గములులేక యువ్వెత్తువ లేఁచి మండిపడుచు నాతనికి ప్రత్యేకముగాఁ జీకటికొట్టుకైదు విధించి చంద్రగిరిదుర్గమునకుఁ బంపించెను. అటుపిమ్మట వాని భార్యను, బిడ్డలను నచటికే పంపెను. వీరిప్రయత్నము విఫలమై రంగరాయనిబ్రతుకు మఱింత దుర్భరమైపోయినందుకు ఖేదపడుచు యాచమనాయఁడు ధైర్యసాహసముల ప్రసిద్ధిగాంచి విశ్వాసపాత్రుఁడుగా నున్న మఱియొక యువకుని రప్పించి ఓయీ! రంగరాయలు చంద్రగిరిదుర్గమున నున్నవాఁడని వినుచున్నాను. ఇపు డాదుర్గమును సంరంక్షించుచున్న భటుల సంఖ్య తక్కువగా నున్నట్లు తెలియుచున్నది. మఱియు జగ్గరాయలు తనపక్షమును బలపఱచుకొనుట కై మండలాధిపతులకడకుఁ బోయియున్నాఁ డని వినుచున్నాను. ఇచటి నుండి నాసైన్యములతో నేను కదలితినా జగ్గ
2015.328360.Andhra-Mahaniyulu/page_0067.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ రాయనికిఁ దెలిసి తన యరువదివేలమంది సైనికులతో వచ్చి మనపైఁబడి మనల నఱకి వేయును. నీకు తోడుగా నీవంటి వీరభటులనే యైదునూర్ల మందిని నీకు స్వాధీనపఱచు చున్నాను. నీవు నాయకత్వమును వహించి చంద్రగిరిదుర్గమును భేదించి రంగరాయనిఁ జెఱనుండి విడిపించికొని రాఁ గలవా' యని ప్రశ్నించెను. ఇది యెంతకార్య మట్లే కార్యము నిర్వహించుకొని వత్తును. ప్రాణములనైన గోల్పోవుదును కాని రాయలను తీసికొని రాకుండ రిక్తహస్తములతో రా నని ప్రతిజ్ఞావాక్యములను ధైర్యముతోఁ బలికెను.
2
+
3
+ అ ట్లయిదువందలసైనికులతను సనద్ధము చేసి యాతనికి నాయకత్వము నొసంగి పంపెను. అంతట నావీరయువక నాయకుఁడు ధైర్యముతోఁ బోయి యాకస్మికముగా దుర్గముపైఁ బడి కావలివానిని సంహరించి ద్వారములను వెల్వరించి కొనిపోయి రక్షకసైన్యముపైఁ బడి నురుమాడఁగా వారి యెదుట నిల్వజాలక హతశేషు లయినవారు పఱువిడి పోయిరి. ఈ విజయవార్తను యాచమనాయకునికిఁ బంపుచు జగ్గరాయలును, వానిసైన్యములును వచ్చి మమ్ము ముట్టడించకమునుపే మాకు సహాయార్థము గొంత సైన్యమునుఁ బంప వలసిన దని యావీరయువకుఁడు ప్రార్థింపుచు వ్రాసెను గాని యీ సైన్యము వచ్చి వారిని గలిసికొనుటకుబూర్వమే జగ్గరాయలసైన్యములు వచ్చి దుర్గములోఁ జొఱఁబడి యాభటుల నొక్కని విడిచిపెట్టక సంహరించివైచిరి.
2015.328360.Andhra-Mahaniyulu/page_0069.txt ADDED
@@ -0,0 +1,9 @@
 
 
 
 
 
 
 
 
 
 
1
+ నిర్వహించి వత్తు" నని బయలువెడలిపోయెను.
2
+
3
+ ఇట్లాతఁడు తన్ను తా నెఱుంగని చిత్తముతో మానుషస్వభావమును సంపూర్ణముగా విడిచిపెట్టి రాక్షసాకృతి వహించి రంగరాయ లున్నప్రదేశమును వెదకికొనుచుఁ బోయి యాతని వీక్షించి "ఓయీ! రంగా! నేటితో నీకు కాలము పరిసమాప్తిఁ జెందినది. ఆ పని నీకత్తితో నీవు తీర్చుకొందువా? ఆ కార్యము మఱియొకఁడు తీర్పవలయునా? వెంటనే ప్రత్యుత్తర మిమ్ము. ఇంక జాగుసేయఁ దగదు." అని గట్టిగా నొత్తి పలికెను.
4
+
5
+ వీని యాకృతిని వీక్షించియు, వీని క్రూరము లయిన వాక్కుల నాలించియు క్షాత్రవంతునికుండు ధైర్యమును వీడక యాతనితో 'ఓయీ నేను మరణముతో నాకన్నులను మూయులోపల నాభార్యను, బిడ్డలను జూడవలయు నని యున్నది. నా కావర మొసంగవా? యని పలికెను.
6
+
7
+ అంత భార్యయు, బిడ్డలును నాతనికడకు వచ్చిరి. వారలనుఁ జూచి విచారింపక తెగువతో శాంతవచనముల నిట్లు పలికెను. 'నే నిపుడు చావవలయును. నే నెవ్వరికి నెట్టి యపకృతియుఁ జేసి యుండలేదు. అన్యాయముగా నొకరి సొత్తు నేను దీసికొన లేదు. చా వన్న భయము నాకు లేశమాత్రములేదు.' అని పలికెను.
8
+
9
+ "ప్రభూ! అట్లనే కానిమ్ము. నన్ను నీ శత్రువులబాఱి పడకుండ ముందుగ ద్రుంచివేయుము. అదియె నా కోరిక;
2015.328360.Andhra-Mahaniyulu/page_0070.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ నీకు పాపము లేదు. ఇంతకన్న నా కేమియుఁ గోరిక లేదు. నా కోరిక దీర్పుము" అని ధైర్యముతో నామె వేఁడికొనెను.
2
+
3
+ అంత రంగరాయలు మాఱుమాట పలుక లేదు. తన చద్రాయుధముతో నామె వక్షఃస్థలమును బొడిచివైచెను. వానికుమాళ్ళ నిరువురను, ఒక కుమార్తెను, నట్లే గావించెను. ఇం కొకయాడుబిడ్డ గలదు. ఆబిడ్డ యేడువ లేదు. రాయల కాబిడ్డయందెక్కువ మక్కువ యుండెను. ఆబిడ్డ విచారముతో తండ్రినిఁ జూఁచుచు నిలువంబడి యుండుటను జూచి రంగరాయలు గిఱ్ఱున వెనుకకుఁ దిరిగి కత్తితోఁ తన వక్షఃస్థలమును పూర్ణమైన సత్తువతోఁ బొడుచుకొని క్రిందికొఱఁగి ప్రాణములను విడిచెనఁట! ఆపాపాత్ముఁ డగు జగ్గరాయనితమ్ముఁడు మరణముఁ జెందిన రాయనిబిడ్డ బ్రతికియుండరా దని మానుషత్వమును విడిచి తనఖడ్గముతో నాచిన్ని యాడుబిడ్డనుగూడఁ ద్రుంచివైచెనట! ఈ విధానము పోర్చుగీసువారి లేఖలు సారాంశమునుబట్టి వ్రాయఁబడినది.
4
+
5
+ కాని యొకనాటిరాత్రి ద్రోహి యైనజగ్గరాయలే వారి కారాగృహమును బ్రవేశించి నిద్రపోవుచున్న రంగరాయని, వానిభార్యను, బిడ్డలను సంహరించిరని యాకాలమున రచింపఁబడిన సాహిత్యరత్నాకరము, రఘునాథాభ్యుదయ మను గ్రంథములనుఁబట్టి తెలియు చున్నది. ఎట్లయినను యాచమనాయనిచే సరంక్షింపఁబడిన రాకుమారుఁడు తక్క రంగరాయని కుటుంబమంతయు నాతనితో నీవిధముగా
2015.328360.Andhra-Mahaniyulu/page_0073.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ జగ్గరాయలును నట్టిప్రయత్నమునం దేమరక యనేక మండలాధిపతులను మాయోపాయవిధానములఁ దనప్రక్కకు నాకర్షించు చుండెను. సామ్రాజ్యమున నిరుపక్షములేర్పడినవి. అఱువదివేల సైనికులను జగ్గరాయలును, ముప్పదివేల సైనికులను యాచమనాయఁడును ప్రోగుచేసిరి. ఇందెవ్వరును దక్కనుసుల్తానుల నాహ్వానింప లేదు. వారుగూడ నిందు జోక్యమును గలిగించుకొనలేదు. జగ్గరాయలకు సైన్యమెక్కువగలదని యాచమనాయఁ డెన్నడును భయపడియుండలేదు. సత్యము, ధర్మము, తన ప్రక్కఁ గలదను దృఢవిశ్వాసముతో, నున్నవాఁడు యాచమనాయఁడు. తనకే జయము కలుగునన్న విశ్వాసముతో రామదేవరాయని వేయికన్నులతోఁ గాపాడుచుఁ బదివేలసైన్యములనడుమ నుంచుచు వచ్చెను. వేంకటపతిరాయలు మరణముఁ జెందినవెనుక మూఁడు సంవత్సరములకాల మీతగవులలోఁ గడిచిపోయినది. అనేకపర్యాయములు రామదేవరాయనిఁ బట్టుకొన వలయు నని జగ్గరాయలు యాచమనాయని సైన్యములను దలపడుచు వచ్చెను గాని యాతనికి విజయము సమకూర లేదు. యాచమనాయఁడు తనసైన్యములను మూఁడునాలుగు భాగములుగా విడఁదీసి దగ్గఱగా నుంచుకొనుచు రామదేవరాయ లేభాగమున నున్నదియుఁ దెలియకుండఁ జేయుచు వచ్చెను. రాజబంధువులనేకులు రామదేవరాయలపక్షమును వహించి యాచమనాయనితోఁ జేరిరి. కాని యధిక సైన్య
2015.328360.Andhra-Mahaniyulu/page_0074.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ ములు గలవారును బలాఢ్యులు నైనతుండీరమండలాధిపతి యగు కృష్ణప్పనాయకుఁడును పాండ్యమండలాధిపతి యగు ముద్దువీరప్పనాయఁడును వేంకటపతిరాయలయెడఁ గల పూర్వ ద్వేషమును బురస్కరించికొని జగ్గరాయలపక్షమునఁ జేరినందున నతనిబల మెక్కువగా నుండెను. అందుచేత యాచమనాయఁడు తనపక్షమున నింకను సైన్యము నధికముగ సమకూర్చు కొనవలసియుండుటచేత మనస్ఫూర్తితో జగ్గరాయల సైన్యముల నెదుర్కొనక తప్పనిపట్టుదల సర్వరక్షణార్థము పోరాడుచు గాలయాపనము సేయుచుండవలసి వచ్చెను గాని పౌరుషము కొఱవడి గాదు. జగ్గరాయల సైన్యములు తుండీరమండలాధిపతి యగు కృష్ణప్పనాయకుని సైన్యములతోఁ గలిసికొని రామదేవరాయనిఁబట్టుకొనుటకై రామదేవరాయని పక్షమునుబూనిన సైన్యములను, అనఁగా యాచమనాయనిఁ జేరిన సైన్యముల నెదుర్కొనుచు నచట రామదేవరాయలు లేకుండుట దెలిసినేని వారిని వీడి మరి యొకసైన్యమును దలఁపడు చుండెను. వేంకటపతిరాయల యెడఁగల పూర్వవైరమును పురస్కరించుకొని తుండీర మండలాధిపతి యగు కృష్ణప్పనాయకుఁ డిదివఱకె జగ్గరాజు సైన్యములనుఁ గలిసికొని చిక్కుకలిగించుచున్నాడు. మధుర నాయకుఁడును వీరవేంకటపతిరాయలయెడఁ గలపూర్వవైరములను బాటించియె జగ్గరాయనికి బాసట యయ్యెను. జగ్గరాజు, తుండీరమండలాధిపతియు గలిసి మధురనాయకుఁడగు