Datasets:
Add files using upload-large-folder tool
Browse filesThis view is limited to 50 files because it contains too many changes. See raw diff
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0006.txt +31 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0011.txt +24 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0016.txt +4 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0017.txt +14 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0018.txt +28 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0019.txt +21 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0022.txt +31 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0023.txt +32 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0024.txt +32 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0025.txt +18 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0032.txt +34 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0033.txt +36 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0034.txt +35 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0035.txt +38 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0040.txt +35 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0041.txt +31 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0046.txt +31 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0047.txt +28 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0048.txt +30 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0049.txt +36 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0050.txt +33 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0051.txt +34 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0056.txt +33 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0057.txt +33 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0058.txt +27 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0059.txt +33 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0062.txt +33 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0063.txt +32 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0064.txt +33 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0065.txt +33 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0072.txt +33 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0073.txt +13 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0074.txt +33 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0075.txt +32 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0099.txt +48 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0106.txt +30 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0109.txt +26 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0116.txt +16 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0117.txt +19 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0118.txt +13 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0122.txt +12 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0123.txt +33 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0124.txt +32 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0125.txt +32 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0132.txt +32 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0140.txt +32 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0146.txt +19 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0148.txt +31 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0149.txt +30 -0
- Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0157.txt +31 -0
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0006.txt
ADDED
|
@@ -0,0 +1,31 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
సాహిత్య విద్యార్థులకోసం ఆయనెన్నో వ్యాసాలు రాశారు. ఒక
|
| 2 |
+
కావ్యఘట్టాన్ని పరిచయం చేసేటప్పుడు కూడ మూలగ్రంథం,
|
| 3 |
+
మూలరచయిత, అనువాదకుడు, కావ్యతత్వం, కథ, పాత్రచిత్రణ,
|
| 4 |
+
విశేషాలు వంటి విషయాలతో వ్యాసం సమగ్రంగా ఉంటుంది. పాఠకుడు
|
| 5 |
+
సమాచారం కోసం మరొక చోటికి పోవలసిన అవసరముండదు. ఒక
|
| 6 |
+
నాటకం గురించి రాస్తే సంపూర్ణంగా నాటక లక్షణంతో అన్వయించి
|
| 7 |
+
చెప్తారు.
|
| 8 |
+
|
| 9 |
+
ఆయన కవి, నాటకకర్త, సహజంగా భావుకుడు కాబట్టే ఆయన
|
| 10 |
+
హృదయం ఒక రచనను చూడగానే రసార్ద్రం అవుతుంది. దానిపై
|
| 11 |
+
అపారమైన ఆదరం కలుగుతుంది. ఆ కవి లేదా రచయితపై స్నేహభావం
|
| 12 |
+
జనిస్తుంది. ఆ రచన లేదా రచయిత గురించి ఆయన రాయడం
|
| 13 |
+
ప్రారంభించగానే ఈ లక్షణాలన్నీ ఒక్కసారిగా ఆయనను ఆవరిస్తాయి.
|
| 14 |
+
|
| 15 |
+
వావిలాల సోమయాజులుగారు పుంఖానుపుంఖంగా వ్యాసాలు
|
| 16 |
+
రచించినా, వారి వ్యాసాల సంపుటి 'మణి ప్రవాళము' ఒక్కటే గ్రంథరూపం
|
| 17 |
+
ధరించింది. దీనిలోని ఎనిమిది వ్యాసాలూ సృజనాత్మక వ్యాసాలే.
|
| 18 |
+
|
| 19 |
+
ఈ సంపుటిలోని పది వ్యాసాలు వివాహం గురించేనంటే ఆయన
|
| 20 |
+
ఏ విషయాన్నయినా ఎంత విపులంగా పరిశీలిస్తారో మనం అర్థం
|
| 21 |
+
చేసుకోవచ్చు.
|
| 22 |
+
|
| 23 |
+
వావిలాల సోమయాజులుగారు తమ సాహిత్యవ్యాసాలలో
|
| 24 |
+
ప్రాచీనాధునిక తెలుగు సాహిత్యాలు రెండింటినీ సమదృష్టితో చూశారు.
|
| 25 |
+
|
| 26 |
+
సాహిత్యాన్ని, సంస్కృతిని, లోకం తీరును అర్థం చేసుకోవడానికి
|
| 27 |
+
ఉపయోగపడడమే కాక వాటిని చూడవలసిన దృష్టిని కూడా మనకు
|
| 28 |
+
సోమయాజులు గారు అందించారు.
|
| 29 |
+
|
| 30 |
+
ఈ వ్యాసాలను చదవడం ద్వారా ఆ దృష్టిని అందుకోవడమే
|
| 31 |
+
పాఠకునికి కలిగే మహోపకారం.
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0011.txt
ADDED
|
@@ -0,0 +1,24 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
తే. ఏడుపే నీకు నేనాఁడు తోడు కాఁగఁ
|
| 2 |
+
బదియు నార్నెల లేనియుఁ బైనఁబడని
|
| 3 |
+
నన్ను నీ చేత నిడి చనినాఁడు నాన్న
|
| 4 |
+
సాకినావు శిక్షించి ప్రశస్తగతిని.
|
| 5 |
+
|
| 6 |
+
తే. అకట! దారిద్య్ర మొక్కట, వ్యాధి యొకట
|
| 7 |
+
బాధ వెట్టఁగ నెట్టులో పడుచు నన్నుఁ
|
| 8 |
+
గనుచు జీవించినావు రాక్షసపుఁదమిని
|
| 9 |
+
ననుభవించిన దణుమాత్రమేని లేక.
|
| 10 |
+
|
| 11 |
+
తే. నేనె యన్నను, దమ్ముఁడ నేనె, చెల్లి
|
| 12 |
+
యలును నక్కయు నైన నా కైతి వమ్మ
|
| 13 |
+
విందరను జూచుకొన్నాఁడ యేను నీలో;
|
| 14 |
+
ఈవు లేకున్న నాకు వీ రేరు లేరు.
|
| 15 |
+
|
| 16 |
+
తే.శబ్దములయర్థ మొక్కింత, చదువనేర్తు
|
| 17 |
+
నైన నప్పుడు తల్లిప్రేమనిన నేమొ
|
| 18 |
+
యెఱుకపడనిది నేఁటి యా రేండ్లలోన
|
| 19 |
+
నెన్ని రూపాలతోఁ దోఁచి నన్నుఁ గలఁచె.
|
| 20 |
+
|
| 21 |
+
తే.లోకమున కేమి కాకులమూఁక కాదె?
|
| 22 |
+
ప్రథలఁ గల్పించే మఱచె నిన్ పరమచరిత !
|
| 23 |
+
యెఱుఁగు దేగతి భక్తి సేవించినామొ
|
| 24 |
+
యీవు లేని లోపాన మా కెంత దిగులొ!
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0016.txt
ADDED
|
@@ -0,0 +1,4 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
మిశ్రరచనామార్గనూత్నతలకు వేడుక పడినది. ఇందుఁబురాత నాధునాతన భావుకుల రచనా స్వీకారమునఁ బ్రకరణానుకూలముగ నేనొనర్చిన చేర్పు కూర్పులకు, మార్పులకు విజ్ఞులు మన్నించెదరుగాక!
|
| 2 |
+
|
| 3 |
+
నిద్రాళువునై యున్న నన్ను మేల్కొల్పి యిట్టి రచనలకుఁ బురికొల్పి నాచే నీ మణిప్రవాళమును బ్రకటింపఁజేయుటకు
|
| 4 |
+
బహురీతుల దోహద మొసఁగిన గురువర్యులకు, నాప్తమిత్రులకు నా ప్రణామములు, నమోవాకములు!!
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0017.txt
ADDED
|
@@ -0,0 +1,14 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
ఆదిత్యవర్ణే తప సో౽ధి జాతో
|
| 2 |
+
వనస్పతి స్తవ వృక్షో౽ థబిల్వః |
|
| 3 |
+
తస్య ఫలాని తపసానుదన్తు
|
| 4 |
+
మాయా న్తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ॥ (శ్రీ సూక్తము)
|
| 5 |
+
|
| 6 |
+
(సూర్యుని వంటి వన్నెగల్గిన లక్ష్మీ! మొదట నీ యనుగ్రహమువలన నీ హస్తమునుండి పువ్వులు లేకుండఁగ నే ఫలించునట్టి బిల్వవృక్షము జన్మించినది. ఆ పాదపము బాహ్యాంతరింద్రియ సంబంధమగు దారిద్య్రమును బోఁగొట్టుఁగాక!)
|
| 7 |
+
|
| 8 |
+
ప్రతిభాభియోగ్యతచే స్వర్గమునందలి సౌవర్ణ రూపముల ద్రష్టయై దర్శించువాఁడు కవి. దర్శితములైన యేతచ్చాంపేయ రూపములకుఁ ద్వష్టయై బాహ్యాకృతులఁ గల్పించి రసమయ జగత్సృష్టిఁ గావించువాఁడు కవి! కవి సౌందర్య రసమునం దావిర్భూతుఁ డగును. అతని సరసహస్తమునుండి మధువు స్రవించును.
|
| 9 |
+
|
| 10 |
+
జగద్రష్టయుఁ ద్వష్టయు నగు హిరణ్యగర్భుఁ డాదికవి కాదికవి. అతని హస్తద్వారమున వెల్లివిరిసి లోకమును మధుమంతముగ నొనర్చిన కృతులలోఁ బుష్పలోకము రమ్యాతి రమ్యమైనది. సమాధినిష్ఠుఁడై సృష్టికావ్య 'కృత్యాది'ని దానె కోమలకుసుమమై స్రష్ట నారాయణ నాభీసరోజ ద్వితీయమన నొప్పి యుండును. ఆదిత్య ప్రథముఁడైన యా విష్ణుని యమృతావలోకనము నర్థించి యుండును.
|
| 11 |
+
|
| 12 |
+
పరమేష్ఠి ప్రకటించిన యపూర్వభావభంగిమలే ప్రసూనములు. ఈ జగచ్ఛిల్పి కవి! 'కవి సత్యరథమునకుఁ గట్టఁబడిన యశ్వము!!' ఇది సూనృతమార్గమునఁ బరుగిడి యానందధామమును జేర్చును. ఈ కారణముననే స్రష్ట మానవ నయన
|
| 13 |
+
మనోనయనాహ్లాదనమే సుమసృష్టికి పరమప్రయోజనముగ భావించి యుండునని భావుకలోక మూహించినది. శాబ్దికు లీ రసవద్రహస్యమును గుర్తించి తొలి యుషస్సులు తోఁచిననాఁడే పుష్పమునకు సుమన మనియు, నాకాధిపతి వనమునకు
|
| 14 |
+
నందనమనియు నామకరణమొనర్చిరి.
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0018.txt
ADDED
|
@@ -0,0 +1,28 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
పూలు లేని దేశము సకల సద్గుణశోభిత యగు నాలు లేని సంసారము
|
| 2 |
+
ముగ్ధహాసము లేని ముఖము. సిత శార వర్ణములతో నవరసోల్లాసములతో ననంత
|
| 3 |
+
భావనల కాధారభూతములైన సుమసంతానములపై నే దేశమం దెవ్వరి కెక్కాలమునఁ
|
| 4 |
+
గోర్కె వొడుమదు? కాలోచిత సమస్తైశ్వర్యముల నయ్యవి విలసిల్లుట వెంగలులు కాని
|
| 5 |
+
యే దేశీయు లర్థింపరు? మంగళ ప్రదములు మహిమాఢ్యములు నైన వాని
|
| 6 |
+
సౌభాగ్యగరిమఁ గని యే దేశీయులు ప్రహర్షహృదయులు కారు?
|
| 7 |
+
|
| 8 |
+
పుష్పములు పరమేశ్వరహాసస్వరూపములు. మాతృశ్రీ ప్రకృతి రుచిరాభరణాంగ
|
| 9 |
+
రాగములు. ఇట్టి వీనితోఁ బరిచయము లేక "బుద్ధత్వ'మబ్బదు. పురుషోత్తమప్రాప్తి
|
| 10 |
+
కలుగదు. ఇంతయేల? ఆ హిరణ్యగర్భుఁడే జగత్కారణనాభీసరోజ సంభవుఁడు కదా!
|
| 11 |
+
ఊహింప సర్వసృష్టి యొక సుమనమగుటయు గోచరింపకపోదు.
|
| 12 |
+
|
| 13 |
+
రసలుబ్ధమైన లోకమున ననురాగాభిమానములు సాత్మ్యములు. సామాన్య వ్యక్తి
|
| 14 |
+
మొదలుగ సర్వసంగపరిత్యాగులై మునివృత్తిఁ జేకొనిన మహర్షులవఱ కియ్యది తరతమ
|
| 15 |
+
భేదములతో నొప్పుచున్నది. కాలదేవతాదుహితలగు ఋతుకన్యలకు నిట్టి
|
| 16 |
+
యనురాగాభిమానములున్నవి. ఒక ఋతుకన్యకు నచ్చిన కుసుమవిభేదము మఱియొక
|
| 17 |
+
ఋతుకన్యకమానసమును మఱల్పఁలేదు. ఒక ఋతుకన్య పెంచి పాలించిన
|
| 18 |
+
పూదోటను మఱియొక ఋతుకన్య చీకాకు పఱచి చిత్తమున నానందానుభూతి
|
| 19 |
+
నొందును.
|
| 20 |
+
శతపత్రములపై శరత్తునకు మక్కువ మిక్కుటము. బాలకుందములపై
|
| 21 |
+
హేమంతమున కనురాగ మధికము. లోధ్రములఁ గని శిశిరము రోమాంచకంచుక
|
| 22 |
+
యగుచున్నది. శిరీషములన గ్రీష్మము పడిచచ్చును. కదంబములపై వర్షమునకు
|
| 23 |
+
గాఢవాంఛ. ఆయా ఋతుకన్యల యభిమానానురాగములఁ జూఱఁగొనిన పుష్పము
|
| 24 |
+
లాయా కాలముల నవనవోన్మేషశాలినులై నిత్యనవ్యావతారములఁ బ్రవర్తిల్లుచుఁ గొన్ని
|
| 25 |
+
ప్రయోజనముల సాధించి నిర్యాణము నొందును.
|
| 26 |
+
|
| 27 |
+
అల్పముగ నైననేమి, యనల్పముగ నైననేమి సకలర్తువులును బుష్పసమయములే. అయ్యు నీ కమనీయకీర్తి వసంతకాలమున కబ్బినది. వసంతము మల్లియలది. ఇది మల్లికామాసమగుట మహాకవులెఱింగి యుండుటచే వసంత పుష్పావిర్భూతిని
|
| 28 |
+
వర్ణించుపట్ల 'స్థాలీపులాకము'గ మల్లికావిలాసముల నిరూపించుటయందు మనసుగొందురు. 'నిఋతి దిగ్వాయుపతి వసంత ఋతుశోభ లీను చూలాం' డ్రగు మల్లియల మనోహరవిన్యాసములు దర్శించిన మహాకవి కందు సారవదాంధ్ర సాహిత్య సౌమనస్యము లిట్లు గోచరించినవి.
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0019.txt
ADDED
|
@@ -0,0 +1,21 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
సీ. 'దీప్తిమాధుర్యావధిశిరస్సుధాంశుభా
|
| 2 |
+
స్వన్మనోహర విలాసమ్ములగుచు
|
| 3 |
+
క్లిష్టబంధవిచిత్ర కేళీప్రశస్తిర
|
| 4 |
+
హఃకళాపూర్ణోదయము లగుచు
|
| 5 |
+
కృష్ణపదాగ్రభక్తి సుగృహితాముక్త
|
| 6 |
+
మాల్యదాచ్ఛ ప్రౌఢమధువు లగుచు
|
| 7 |
+
ననితరలభ్యవర్ణాత్తశయ్యాహేతు
|
| 8 |
+
వై పాండురంగమహత్తు లగుచుఁ
|
| 9 |
+
|
| 10 |
+
తే. దీయఁదనములు మెఱుఁగులుఁ దెచ్చుకొన్న
|
| 11 |
+
ప్రియలు ప్రియులు కూడి మనుచరిత్ర లగుచుఁ
|
| 12 |
+
దెలుఁగు రసికలోకముల కందిచ్చె నసువు
|
| 13 |
+
లత్తుకొని మల్లెపూల్ క్రొత్త క్రొత్తరుచులు.'
|
| 14 |
+
|
| 15 |
+
సాధకుని శక్తిసామర్థ్యముల ననుసరించి వసంతమల్లికామతల్లికల లీలావిలాసములు ద్యోతకములగుట నిస్సంశయము.
|
| 16 |
+
|
| 17 |
+
‘బ్రహ్మ విష్ణు మహేశ్వరులఁ దమ హరిణేక్షణలకు గృహకుంభదాసులఁ గావించి వర్ణనాసీమ నతకరించు చరిత్రచే విచిత్రితుఁడైన కుసుమాయుధునకు నమస్కరింతు' నని మహానుభావుఁడగు నొక కవివతంసుఁడు కావ్యారంభ మొనర్చి యున్నాఁడు. ఇట్టి మహత్తరశక్తి యా మదనునకుఁ బుష్పసాయకుఁ డగుటచే నబ్బిన దనుట యతిశయోక్తి కాదు.
|
| 18 |
+
|
| 19 |
+
పుష్పముల కింతటి ప్రౌఢప్రభావము కలదని యంగీకరించుటకు బుద్ధివోనిశంకర పూజ్యపాదులవంటి శివోపాసకులు "తల్లీ! పుష్పధన్వియు, మధుకర మౌర్వియు, మలయమరుదా యోధనరథియు, వసంత సామంతుఁడునైన యనంగుఁడు త్వదీయాపాంగావలోకనశ్రీ వహించి యెక్కటివీరుఁడై జైత్రయాత్ర సాగించుచున్నాఁ' డని సమస్తకీర్తి నా సౌందర్యలహరీ కటాక్ష వీక్షణములకుఁ గట్టిపెట్టిరి.
|
| 20 |
+
|
| 21 |
+
కవికుల గురువు కాళిదాసు పరమేశ్వర సాన్నిధ్యమున కా యగధర రాజపుత్రికనునిర్భర్త్సిత పద్మరాగాశోక పుష్పగను నాకృష్ణ హేమద్యుతి కర్ణికారగను, ముక్తాకలాపీకృత సింధువారగను నలంకరించి లేఁబ్రొద్దు వన్నెగల వలిపమును ధరింపఁజేసి పూగుత్తులచే వంగిన జంగమలతవలెఁ గొనివచ్చి యుచితజ్ఞుఁడై పుష్ప ప్రాభవమును గాపాడినాఁడు.
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0022.txt
ADDED
|
@@ -0,0 +1,31 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
రాజమార్గ ప్రతోళికా సౌధాగ్రములు ధరించిన కలువడములతోఁగాని కమనీయ
|
| 2 |
+
సుస్వాగత మొసఁగ లేదు. శ్వేతవసనాంగరాగములతో శుభ్రనవ మల్లికాకుసుమ
|
| 3 |
+
కుట్మలాలంకృతయైగాని శుక్లాభిసారిక కాంతునభిసరింపలేదు. సహగమనసమయము
|
| 4 |
+
లందుఁ బితృవనవిహారమున కేఁగుచున్న పుణ్యవనితలఁ బుష్పలోకము
|
| 5 |
+
ప్రణయాభిభూతయై యనుసరించినది. 'శ్మశానకుసుమన్యాయ' మబ్బినను గణుతింపక
|
| 6 |
+
ప్రసవకులము స్నేహస్వరూపనిరూపణ మొనర్చి కీర్తిగడించి లోకమునకు గుణపాఠము
|
| 7 |
+
నేర్పినది.
|
| 8 |
+
|
| 9 |
+
చతుర్విధాలంకరణములలోఁ గుసుమాలంకరణ మమలినమైనది. ఇయ్యదియే
|
| 10 |
+
యాద్యమైనది. నేఁటి భూషాలంకరణముల చరిత్ర నన్వేషింప నవి యన్నియు
|
| 11 |
+
నొకనాఁటి పౌష్పాలంకరణములని వెల్లడి యగుచున్నది. ఈ సహజ సుమాలంకరణ
|
| 12 |
+
సౌభాగ్యగరిమను గూర్చి సకలర్తుసంపదలు గల యలకాపుర మందలి పురంధ్రీమణుల
|
| 13 |
+
నడిగిన వీనుల విందుగ వినిపింతురు. వారు లీలాకమలహస్తలు, బాలకుందాను
|
| 14 |
+
విద్దలు, లోధ్రప్రసవ పరాగముచేఁ బిశంగిమశ్రీ వహించిన మనోహరాబ్జముఖలు,
|
| 15 |
+
నవకురవక కేశపాశలు, చారుశిరీషకర్ణలు, ఆషాఢప్రథమ దివసమేఘదర్శనాయత
|
| 16 |
+
నీపసుమాలంకృత సీమంతినులు”.
|
| 17 |
+
|
| 18 |
+
'స్త్రీల చిత్తము కుసుమసుకుమార' మని "మహాకవి భవభూతి ప్రవచనము.
|
| 19 |
+
వారికి నుద్యానపుష్పములకును సన్నిహిత స్నేహము, పుష్పవనవిహారసమయములఁ
|
| 20 |
+
బ్రబంధనాయికలును బూఁదీవలు నన్యోన్యము మార్పునొందుట కవిలోక సిద్ధము.
|
| 21 |
+
లతావనితలకు దోహద సేవ యొనర్చుట వా రెఱిఁగినట్లు వన్నె కెక్కిన వనపాలకు
|
| 22 |
+
లైన నెఱుఁగ రనుటలో నతిశయోక్తి యిసుమంతయైన లేదు. లేకున్న కమలహస్తల
|
| 23 |
+
కరస్పర్శతోఁగాని మాకందము పల్లవింపకుండుట, కోమలాంగుల యాలింగనకళా
|
| 24 |
+
ప్రక్రియలతోఁ గాని కురవకము కుట్మలింప కుండుట లెట్లు పొసఁగును? అలివేణుల
|
| 25 |
+
వీక్షణములో నే యమృత మున్నదో, తిలకము కులికి పుష్పించుచున్నది. అశోక
|
| 26 |
+
మంత కంటెను జాణ; చరణాహతి కలుగు వఱకును జలింపదు. కంబుకంఠి
|
| 27 |
+
గీతామృతమునఁగాని కిసలయింపని ప్రియాళువు కళాప్రియ యనుటలో నౌచిత్య
|
| 28 |
+
మున్నది కదా! ముగ్ధహాసల ముఖరాగమున జంపకము, నర్మభాషిణుల సరసహాసమున
|
| 29 |
+
మేరువు, సీమంతినుల సీధురసముచే వకుళ, పద్మనేత్రల ప్రౌఢముఖవిలాసశ్రీల
|
| 30 |
+
సింధువారము, కామినీమణుల కమనీయసల్లాపములఁ గర్ణికారము కుసుమించుటలు
|
| 31 |
+
చూడ, నా లతాతరువుల రసికత యన్యప్రాణిలోకమున కతీతమైన దని తోఁచకమానదు.
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0023.txt
ADDED
|
@@ -0,0 +1,32 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
పుష్పాలంకరణపట్టభద్రలైన పుష్పలావికలు పూర్వ పట్టణములకుఁ బెట్టని
|
| 2 |
+
యలంకారములు. నర్మ సరసోక్తులకు వా రేడుగడలు. వారి నిశితసంభాషణలకుఁ
|
| 3 |
+
గుసుమములు సంకేతములు. పొన్న పూవొడి నేల పొదివితివే చెలి' యని పుష్పముల
|
| 4 |
+
విలిచికొనవచ్చిన పల్లవశిఖామణి యొకఁడు ప్రశ్నింపఁ బుష్పలావిక కర్తుక 'పొడమె
|
| 5 |
+
బల్దీవిపై పొదువవలదె’ యని సరసమగు సమాధాన మొసఁగి యతని హృదయమును
|
| 6 |
+
ముప్పిరిఁగొనఁ జేయుచున్నది. మధురానగరి యందు -
|
| 7 |
+
|
| 8 |
+
చ. "సరసులనర్మ మింపుల నొసంగఁ గదంబఁపు దండఁగట్టుచోఁ
|
| 9 |
+
గరగుటఁదెల్పుదృక్తరళ కాంతులు నుత్తరమిచ్చు నంతరాం
|
| 10 |
+
తరములనవ్వులు న్గలువతండము మొల్లలు నుంచు మిన్నుగ్రు
|
| 11 |
+
చ్చి రహిని రిత్తనూలొసఁగి సిగ్గువహింతురు పుష్పలావికల్.”
|
| 12 |
+
|
| 13 |
+
ప్రియులు సంకేతస్థానములఁ జెప్పికొనుటకును బుష్పములు చిహ్నములై
|
| 14 |
+
యెప్పుచున్నవి. నీలోత్పలముపైఁ దుమ్మిపూవును నిల్పిచూపిన 'నర్ధనిశా సమయమున
|
| 15 |
+
శివాయతనమునందు మన యిరువుర సమాగమ' మని వారి పరిభాష.
|
| 16 |
+
|
| 17 |
+
క.కలపములు గూర్ప బహువిధ
|
| 18 |
+
తిలకంబులు వెట్ట వింత తెరువునఁ బలు పు
|
| 19 |
+
వ్వులు గట్టి కట్టి ముద్దుగ
|
| 20 |
+
దల ముడువఁగ సరులుగ్రువ్వఁ దద్దయునేర్తున్'
|
| 21 |
+
|
| 22 |
+
సైరంధ్రులు రాజప్రాసాదములు వావాతలకుఁ బ్రణయపాత్రలై వారి
|
| 23 |
+
శీలసౌభాగ్యములఁ గాపాడుటయందుఁ 'గర్కటిగర్భము ధరించినట్లు' జాగరూకత
|
| 24 |
+
వహింప నెంతయు విలసిల్లుట ప్రసవకులకీర్తి నుగ్గడించుచున్నది.
|
| 25 |
+
|
| 26 |
+
'పరమేష్ఠి రమ్యాతిరమ్యముగఁ బుష్పసృష్టి యొనర్చినాఁడు; కాని వాని కాత్మను
|
| 27 |
+
బ్రసాదింప మఱచె' నని యొక తాత్వికుఁ డనినాఁడు. ఇతఁడు దేవత అగ్నిముఖు
|
| 28 |
+
లైనట్లు పుష్పములు కవిముఖములని మఱచెనేమో! కవిముఖముల నే నాఁటి కా
|
| 29 |
+
నాఁ డవి తమ భావపరంపరల వెల్లడించుచునే యున్నవి. 'ఏ కోవ పూవునే నీవు, నీ
|
| 30 |
+
తావి పూవులకు రా' దని స్తుతిపాఠకుఁడై భ్రమరయువకుఁడు ముగ్ధకన్యకల
|
| 31 |
+
మిథ్యాప్రణయమున మోసగింపఁ బూనుకొనిన వేళలఁ గనిపెట్టి 'నెమ్మదికి రావె
|
| 32 |
+
యీ తుమ్మెదకు నో పూవ! అమ్ముకోఁబోకె నీ నెమ్మనము నో పూవ!!' యని
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0024.txt
ADDED
|
@@ -0,0 +1,32 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
పుష్పలోకము హితవాక్యములఁ బలికినది. నీచపు దాస్యవృత్తి మనలేక దేశము
|
| 2 |
+
స్వాతంత్య్రజైత్రయాత్రల సాగించు సమయమున -
|
| 3 |
+
|
| 4 |
+
ఉ. ఈ సుమజన్మ మెట్లు ఘటియిల్లెనొ నా కొకనాఁటి పాటిదై
|
| 5 |
+
వాసనలీను సోయగము వాయని తీయని పోడుముల్ క్షణం
|
| 6 |
+
బో సగమో విచారపడఁబో నయినన్ విడివడ్డ నా యెద
|
| 7 |
+
న్మోసులువారు నూతనమనోరథ మామని వేడిపొంగులన్.’
|
| 8 |
+
|
| 9 |
+
అని పుష్పలోకప్రతీకయైన యొక సుమము నిజకాంక్ష నిట్లు వెల్లడించినది.
|
| 10 |
+
"ఓ వనమాలీ! పేదల రక్తమాంసములఁ బెంపు వహించి దయారసామృతాస్వాద
|
| 11 |
+
దరిద్రులైన ధనవంతుల పెద్దఱికమ్ము కై మతోన్మాదము పెంచు దేవునికి మాఱుగ
|
| 12 |
+
నిల్పిన రాతిబొమ్మలం దూదరవోవు జన్మ మిఁక యొక్క నిమేషముసైప నాయెదన్.
|
| 13 |
+
లలనాజనతా కబరీభరైకభూషాకలనలందుఁ దల్పోపగూహబిబ్బోకములందును నాకుఁ
|
| 14 |
+
దలంపు లేదు. చక్రవర్తుల శవపేటికలఁ జీరనిద్రనొందుఁ చిత్తము లేదు. నన్నుఁ ద్రుంచి
|
| 15 |
+
మాతృసేవాచరణమ్ములం దసువు లర్పణఁ జేసెడివారి పార్థివశ్రీ చెలువారుచోటఁ
|
| 16 |
+
బడవేయుము. వారి యుదాత్త సమాధి మృత్తికలో వాసనలీనుచు రాలిపోయెదను.”
|
| 17 |
+
|
| 18 |
+
పుష్పలోకమునఁ బ్రవేశించిన మహాకవులకు మహనీయ దర్శనభాగ్యములు
|
| 19 |
+
లభించినవి. ఆదికవి వాల్మీకి పుష్పతరువుల నొక మాఱుష్ణీషధారుల వలెను,
|
| 20 |
+
మఱియొకమాఱు పీతాంబరధారులవలెను దర్శించినాఁడు. శివతపోభంగ
|
| 21 |
+
కార్యనిర్వహణార్థమై సుమసాయకదేవుఁడు త్రిలోకాధిపతియగు నింద్రుని కడ తాంబూల
|
| 22 |
+
మందుకొని రతీద్వితీయుఁడై వాసంత విలాసశ్రీ వహించిన తపోవనమునఁ
|
| 23 |
+
బ్రవేశించునేళ మహాకవి కాళిదాసునకుఁ బుష్పలోకము ప్రియదర్శన మొసఁగినది.
|
| 24 |
+
|
| 25 |
+
లగ్నద్విరేఫాంజన భక్తికిమ్మీరిత తిలకముఖియై మధుశ్రీ బాలారుణకోమల
|
| 26 |
+
లాక్షారసముచేఁ జూతప్రవాళోష్ఠము నలంకరించుచున్నది. ప్రియాళుద్రుమమంజరీరజః
|
| 27 |
+
కణములు విశాలనేత్రములఁ బడుటచే దృష్టిపాతమునకు విఘ్న మాపాదింప
|
| 28 |
+
మృగములు మదోద్ధతిచే మర్మరపత్రమోక్షములైన వనస్థలములఁ బర్వు లెత్తుచున్నవి.
|
| 29 |
+
చూతాంకురాస్వాద కషాయకంఠమగు పుంస్కోకిలాకూజితము మనస్వినీమాన
|
| 30 |
+
విఘాతదక్షమై యొప్పుచున్నది. వర్ణప్రకర్షనే కాని బ్రహ్మ తనకుఁ దావి నీయలేదని
|
| 31 |
+
కర్ణికారము నొచ్చుకొనుచున్నది. మధుద్విరేఫరాజు కుసుమైక పాత్రలోఁ బ్రియాను
|
| 32 |
+
వర్తమానుఁడై యాస్వాదించుచున్నాఁడు. గీతాంతర వేళఁ గిన్నరుఁ డొకఁడు
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0025.txt
ADDED
|
@@ -0,0 +1,18 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
శ్రమవారిలేశముల నించుక సముచ్ఛ్వాసిత పత్రలేఖలు గలిగి పుష్పాసవాఘూర్ణిత నేత్రశోభియగు ప్రియాముఖమును జుంబించుచున్నాఁడు. నిండు పూగుత్తులే పాలిండ్లుగఁ జిత్తమును హరించుచున్న తీఁగబోటులవలన తరువరులు వినమ్రశాఖా
|
| 2 |
+
భుజబంధనముల నొందినవారగుచున్నారు.
|
| 3 |
+
|
| 4 |
+
"మురారి మహాకవి యస్తమించు సూర్యకిరణములనే యొకటి, రెండు, మూఁడు, నాలుఁగని లెక్కించుచుఁ దన కమలదళముల ముడిచెనో మఱల నుదయించు నట్టి
|
| 5 |
+
యా కిరణములనే యుదయవేళ కమలలత సంతోషముతోఁ దిరిగి లెక్కించుచుఁ గ్రమముగాఁ దనదళములను విప్పు మనోజ్ఞ దృశ్యమును దర్శించినాడు.
|
| 6 |
+
|
| 7 |
+
మ. "తనకుం గౌఁగిలి యీ వొకప్పుడును నాథా! నీ కరస్పర్శనం
|
| 8 |
+
బున గిల్గింతలె యంచుఁ బద్మిని కరాంభోజంబునన్ మందమం
|
| 9 |
+
దనటద్వాయుచలద్దళాంగుళులు గన్పట్టంగ నవ్వెల్గురా
|
| 10 |
+
యని రారా యనిపిల్చె నాఁదగు ద్విరే పాద్యంతదీర్ఘధ్వనుల్.”
|
| 11 |
+
|
| 12 |
+
చేమకూర కవిరాజు వీనులొగ్గి విని యానందించినాఁడు. 'నానాసూనవితాన వాసనల నానందించు సారంగ మేలా నన్నొల్లదటంచుఁ దీవ్రతపమొనర్చి గిరికాదేవి నాసికయై ప్రేక్షణ మాలికా మధుకరీపుంజముల నిర్వంకలం బూనిన' గంధఫలిని భట్టుమూర్తి కన్నులారఁ గాంచి తనివినొందినాఁడు. కవయిత్రి విజ్జికాదేవి యుదయ సంధ్యాదేవి నర్చించుటకై ప్రాక్సముద్రమున స్నానమాడి నభోద్రుమ శాఖికలం దున్న నక్షత్రపుష్పములఁ గోయ నంశుమాలి యసంఖ్యాకము లైన కరములఁ జూచు
|
| 13 |
+
రమణీయదృశ్యమును జూచినది.
|
| 14 |
+
|
| 15 |
+
చక్షుర్గోచర మగు పుష్పము సాధకుని దృష్టియందు హృదయపుష్పమునకు
|
| 16 |
+
బాహ్యచిహ్నము. అది శుద్ధపుష్పము కాదు. విశ్వేశ్వరుని ప్రాణకళిక! అనంతుని లీలారూపము!! ఇట్టి పుష్పరూపమున మునిఁగి తన్మయత్వముతోఁ జూచి సాధకుఁడు దానిని ధ్యానధారణలకు లక్ష్యముగ నొనర్చుకొనుచున్నాఁడు. అట్టి స్థితి యందుఁ
|
| 17 |
+
బుష్పము వలనఁ గలిగిన రసానుభవము సాధన కాలంబమగుటయే కాక మూర్తిమంతమగును. అందుఁ బ్రాణసాక్షాత్కారమగును. పుష్పము చిద్రూపమున ననంతమై యనంతమగు ప్రాణవాహినియందు దివ్యసౌరభముతో వికసించు చున్నది.
|
| 18 |
+
సాధకుని ప్రాణమునకు నా పుష్పమునకు జరుగు నాదానప్రదానమే రాసలీల! రూపాంతరము!!'
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0032.txt
ADDED
|
@@ -0,0 +1,34 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
తే. మారుపట్టాభిషేకాఖ్య వారికుంభి
|
| 2 |
+
చిత్తజుని కోట లగ్గ దంచనపు గుండు”
|
| 3 |
+
|
| 4 |
+
అనఁగ కాంతి నిస్తంద్రుఁ డగుచు నానాఁటి కభివృద్ధి నారుకొనుచుఁ
|
| 5 |
+
గన్పట్టినాఁడు. 'విరహుల కెల్ల సంధ్యవతి వేడుక జోతము సెప్పవచ్చుచో నిరతము
|
| 6 |
+
తోడ నక్షతలు నించి తగన్ గరపంకజంబునన్ మురియుచుఁ బట్టు నా మెఱుఁగు
|
| 7 |
+
ముత్తెఁపుఁ జిప్పన' నొప్పు విదియచంద్రు నొక కవిరాజు గమనించినాఁడు. జాబిల్లి
|
| 8 |
+
యొకానొక యద్యతనాంధ్ర కవి కుమారున 'కాకాశపు టెడారిలోఁ గాళ్లు తెగిన
|
| 9 |
+
యొంటరి యొంటె' వలెఁ గన్పించినాఁడు. మిన్నువ్రాకు శీతరోచినిఁ జూచియొక
|
| 10 |
+
భావుకుఁ డమృతసముద్రములోని పీయూషమును జేదుకొనుచున్న దివ్యాంగన
|
| 11 |
+
లుపయోగించు వెండి చేరులకుఁ (కిరణములు) గట్టఁబడిన స్పటికకుంభముగఁ
|
| 12 |
+
గనుఁగొనినాఁడు.
|
| 13 |
+
|
| 14 |
+
ఒక మహాకవి చూచుచుండ :
|
| 15 |
+
|
| 16 |
+
చ. దిన పరిణామ లక్ష్మికిఁ బ్రతీచి తగం గయి సేయు వేడుక
|
| 17 |
+
స్వనరుహమిత్రబింబ మను వర్తులలాక్షికపట్టికం బయో
|
| 18 |
+
ధి నడుమఁదోఁచి సాంధ్యనవ దీప్తిరసంబు హరించి పాఱవై
|
| 19 |
+
చిన వెలిదూదియో యనఁగ శీతకరుం డుదయించె నత్తఱిన్.”
|
| 20 |
+
|
| 21 |
+
కాలమనియెడు విలాసి కెంపులతోను ముత్యములతోను నొక సరమును
|
| 22 |
+
గ్రుచ్చుచుండ సాంధ్యకిరణవిశిష్టుఁడైన సూర్యుఁడు సూత్రమునఁ గ్రుచ్చఁబడిన కెంపు
|
| 23 |
+
వలె నుండ వరుస తప్పుటచేఁ ద్రోచి పిఱుందఁ జేర్చు ముత్తెము క్రియ లాంఛన
|
| 24 |
+
రంధ్రసంగతిచే నయ్యమృతదీధితి యా మహనీయునకు మఱల నొకమాఱు దర్శన
|
| 25 |
+
మొసఁగెను.
|
| 26 |
+
|
| 27 |
+
భక్తశిఖామణి యగు నొక మహాకవిప్రౌఢునకు -
|
| 28 |
+
|
| 29 |
+
మ. ఉదయ గ్రావము పానవట్ట మభిషే కోదప్రవాహంబు వా
|
| 30 |
+
ర్ధి దరద్ధ్వాంతము ధూపధూమముజ్వ లద్దీపప్రభారాశి కౌ
|
| 31 |
+
ముది తారానివహంబు లర్చిత సుమంబుల్గాఁ దమోదూరసౌ
|
| 32 |
+
ఖ్యదమై శీతగభస్తి బింబ శివలింగం బొప్పెఁ బ్రాచీదిశన్.”
|
| 33 |
+
|
| 34 |
+
ఇది ఇట్లుండ నొక మహాకవి జాబిల్లిని ముక్కంటియా యను భ్రాంతి వహించి దర్శించి, తెప్పరిల్లి,
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0033.txt
ADDED
|
@@ -0,0 +1,36 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
మ. "కడఁక న్రేచలిగట్టుపట్టిఁ దను వేడ్కం గూర్ప నే తెంచి పై
|
| 2 |
+
జడిగాఁ జుక్కలతూపు లేయ గినుక న్జాబిల్లిముక్కంటి దాఁ
|
| 3 |
+
బొడుపుం గెంపను వేఁడికంట నిరులు న్పూవిల్తు మే నేర్చి చొ
|
| 4 |
+
ప్పడఁ దద్భూతి యలందెనా నపుడు బింబం బొప్పెఁ బాండు ద్యుతిన్.”
|
| 5 |
+
|
| 6 |
+
అని ప్రహర్షహృదయముతోఁ బలికినాఁడు.
|
| 7 |
+
|
| 8 |
+
శశికిని, శివునకు సన్నిహిత సంబంధము. అది యతఁ “డనలాక్షు ఘనజటా
|
| 9 |
+
వనవాటికి వన్నె వెట్టు ననార్తవంపుఁ బూ" వగుటయే యనుట నిస్సంశయము!
|
| 10 |
+
|
| 11 |
+
పరిపూర్ణ చంద్రబింబమును గని ప్రౌఢభావుకులు పరిపరివిధముల నూహించిరి.
|
| 12 |
+
అందు శకునజ్ఞుఁడు దేశసుభిక్షార్థియు నగు నొక మహాకవి :
|
| 13 |
+
|
| 14 |
+
ఉ. "పొందుగఁ పశ్చిమాబ్ధి తటభూస్థలి నంశుమదంశుమత్ఫలా
|
| 15 |
+
కందము వాసరాంతహలికప్రవరుం డిడ సాంధ్యవారిభృ
|
| 16 |
+
త్కందళము ల్తమోదళ యుతంబులునై గెల పండి వ్రాలెఁ బూ
|
| 17 |
+
ర్ణేందుని పేరఁ బ్రాచి నది హేతువు వెన్నెల కల్మి కల్మికిన్.”
|
| 18 |
+
|
| 19 |
+
అని సప్రమాణముగఁ బల్కినాఁడు.
|
| 20 |
+
|
| 21 |
+
చ. "పనుపడ వేణునాళములఁ బగ్గములం బలెఁ గ్రిందఁ బర్వు శో
|
| 22 |
+
భన కిరణ ప్రకాండములు భాసిలఁ జందురుఁ (డొప్పి యెం) తయు
|
| 23 |
+
న్మనసిజుఁ డెల్ల ప్రాణుల మనంబులు చేలుగ రాగబీజముల్
|
| 24 |
+
పెను జతనంబుతోడ వెదఁ బెట్టెడు రౌప్యపు జడ్డిగం బనన్.'
|
| 25 |
+
|
| 26 |
+
గనుపట్టిన నొక మహాకవి చూచి సంతోషభరితాంతఃకరణుఁ డైనాఁడు.
|
| 27 |
+
|
| 28 |
+
తుహినకరమండలంబునం గురియు నప్పండు వెన్నెలలు సాయంతననటన
|
| 29 |
+
చటుల మహానట వికటాట్టహాసంబుల కను ప్రాసంబులు. పూర్వపారావార పులినతల
|
| 30 |
+
విహర ణైరావణ కరపుష్కరోద్ధూత వాలుకాధూళికలకుం బ్రత్యా దేశంబులు. అంధకార
|
| 31 |
+
బలీంద్ర నిర్బంధన ధురంధర సమయ మధుమథన చరణాంగుష్ఠ నిష్ఠ్యూత గగనసరి
|
| 32 |
+
దంబుపూర్వంబులు కనుబింబంబులు.’
|
| 33 |
+
|
| 34 |
+
'శరత్తు చంద్రికలది' 'ఋణ మపరిహార్యమైన పాపము గనుక నట్టి పాపము
|
| 35 |
+
చేత విముక్తుఁడైన మనుజునిమాడ్కిఁ జంద్ర గర్భితములైన మేఘము లీ శరత్తున
|
| 36 |
+
నొప్పారును.'
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0034.txt
ADDED
|
@@ -0,0 +1,35 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
సీ. పొల పొల విరిసి పోవుచు నల్పు విఱుఁగుచు
|
| 2 |
+
మొల్లమ్ము చెడిన మొగిళ్ల వలన
|
| 3 |
+
పసి పసరేదు మవ్వఁపు సన్నజాజి మొ
|
| 4 |
+
గ్గల తొలివిప్పు నా వెలఁదు లగుచు
|
| 5 |
+
నెడ పడ్డ వానల జడులచేఁ జెమ్మ లా
|
| 6 |
+
రిన లేఁత పొరగాలి పనల వలన
|
| 7 |
+
మరు సెలకట్టె మాదిరి దూసి చను కమ్మ
|
| 8 |
+
గేదఁగి తావులై స్వాదులగుచు
|
| 9 |
+
|
| 10 |
+
తే. చివర తెలిదారముల నూఁగు జిలుఁగులొలయ
|
| 11 |
+
పొట్లపూవలెఁ బెరఁటిలోఁ బొలుపు లగుచు
|
| 12 |
+
నలరు నేడాకులనఁటి మొవ్వాకు జిగికి
|
| 13 |
+
నెలవులు శరత్తు తలిరు వెన్నెలలు ...'
|
| 14 |
+
|
| 15 |
+
సాంద్రచంద్రికలు 'నెలయను వెండికుండఁ గడు నించి నిశాచకోరనేత్ర
|
| 16 |
+
యంబరాహ్వయ మహానటమూర్తి మహాభిషేక మొనర్పఁగ నెల్లదిక్కులఁ బ్రవహించెడు
|
| 17 |
+
పాలవెల్లి' యననొప్పును. అంతియ కాదు. కొన్ని సమయముల :
|
| 18 |
+
|
| 19 |
+
మ. "అమృతం బాసవ మంగ రాగ ముదయో ద్యత్కాంతిచేలంబు చి
|
| 20 |
+
హ్నమునుంగా శశిరేవతీరమణుఁ డున్మాదంబు మీఱం దమో
|
| 21 |
+
యమున నృంగము నొంది పాఱఁ గరసీరాలోడితం జేయ వ
|
| 22 |
+
చ్చె మరుద్వాహిని దాని దేర్పనన మించెం జంద్రికాపూరముల్.'
|
| 23 |
+
|
| 24 |
+
చంద్రికావిశిష్టములైన రాత్రులందు చకోరలీలలు చిత్రాతిచిత్రములైనవి.
|
| 25 |
+
ఈ పులుఁగుల చేష్టలఁగని మహాకవులు మనోహరవర్ణన లొనర్చినారు. వాని భోజన
|
| 26 |
+
ప్రియత్వమును గన్నులారఁ గాంచిన యొక కవిచంద్రుఁడు:
|
| 27 |
+
|
| 28 |
+
సీ. నునులేఁత వెన్నెల కొనలు మెల్లనఁ ద్రుంచి
|
| 29 |
+
పిల్లతండులకుఁ బెట్టు నవియుఁ
|
| 30 |
+
జవియైన వెన్నెల చంచులఁ గబళించి
|
| 31 |
+
యింపారఁ బ్రియుల కందిచ్చు నవియుఁ
|
| 32 |
+
గడఁగి యింతటఁగాని వడఁదేర దనుభంగిఁ
|
| 33 |
+
దనర వెన్నెలవెల్లి మునుఁగు నవియుఁ
|
| 34 |
+
బగలింటి యాఁకలి పాయఁ బైపైఁబడి
|
| 35 |
+
ముదురు వెన్నెలఁ గ్రోలి పొదలు నవియు
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0035.txt
ADDED
|
@@ -0,0 +1,38 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
తే. గడుపునిండినఁ గసికాటు కఱచునవియు
|
| 2 |
+
గూడి యొండొంటితోఁ జెఱలాడు నవియు
|
| 3 |
+
నగుచు వెన్నెల తమ సొమ్మె యనిన యట్లు
|
| 4 |
+
కోరి చరియించెఁ జదలఁ జకోరచయము
|
| 5 |
+
|
| 6 |
+
అని యందలి విభేదముల వీనులలర వినిపించినాఁడు. కౌముదీమహోత్సవములతోఁ
|
| 7 |
+
బాటు మదనోత్సవములును జరుగుచుండుట భారత రసిక లోక మెఱిఁగినదే. 'కొలము
|
| 8 |
+
సాముల నందఱఁ గూడఁ బెట్టి చిగురు విలుకాని జాతర సేయువేళఁ జకోరపుఁ
|
| 9 |
+
బేరటాండ్రు :
|
| 10 |
+
|
| 11 |
+
సీ. విరహుల మైసోకి వేడియౌ వెన్నెల
|
| 12 |
+
బచ్చి వెన్నెల నులివెచ్చఁ జేసి
|
| 13 |
+
కలువ పుప్పొళ్లచేఁ గసటైన వెన్నెల
|
| 14 |
+
వలిపవెన్నెలలోన వడిచి తేర్చి
|
| 15 |
+
చంద్రకాంతపు నీట జాలైన వెన్నెల
|
| 16 |
+
ముదురు వెన్నెల జుట్టఁ బదును చేసి
|
| 17 |
+
సతుల మైపూఁతం బిసాళించు వెన్నెలఁ
|
| 18 |
+
దనుపు వెన్నెల రసాయనము గూర్చి
|
| 19 |
+
|
| 20 |
+
వంతుగలియఁగ బువ్వంపుబంతివిందుఁ బెట్టుట లొక మహాకవి దర్శించి
|
| 21 |
+
చకోరకులముల యన్నరసాస్వాదనా శేముషికి జోహారు లర్పించినాఁడు.
|
| 22 |
+
|
| 23 |
+
ఒక మహాకవి కౌముదీ మహోత్సవమున కాదంబరీ పాన మదఘూర్ణిత నేత్రయై
|
| 24 |
+
గోత్రమునం దున్న యొక యుజ్జ్వలవిలాసిని యున్మతయై పల్కిన “చంద్రా! ఏల యీ
|
| 25 |
+
సురాచషకమునఁ బ్రతిఫలింతువు? రోహిణీదేవి ధమ్మిల్లముతోఁ బాటు విరుల నెత్తానికి
|
| 26 |
+
వీడ్కోలు సుమా! ద్విజరాజువై యుండి యీ మధువుతో నీకేమి పని? మద్యముతోఁ
|
| 27 |
+
బాటె నిన్నును ద్రాగి వైచెదను. మా యందెవ్వరినో కామించి యిట్లు తట్టాడు
|
| 28 |
+
చున్నట్లున్నావు. ఇది నిజము. లేకున్న నీపై నీ తారకల కనుమానమెందులకు? వారు
|
| 29 |
+
నిన్నేల యనుసరింతురు? పశ్చిమ దిశను నీకెవరో ప్రణయిని యున్నట్లున్నది; కాదేని
|
| 30 |
+
నిశాంతమున నీ నా దెస కేల పయనింతువు?" అను ప్రలాపముల వీనులలర విని
|
| 31 |
+
రసానందానుభూతి నొందినాఁడు.
|
| 32 |
+
|
| 33 |
+
చంద్రునకు నూలుపో గర్పించు వేళ నొక భావుకుఁడిట్లు దర్శించి
|
| 34 |
+
|
| 35 |
+
మ. చరమక్ష్మాధరసింహచారుము ఖదంష్ట్రాకోటియో నాఁగ నం
|
| 36 |
+
బరశార్దూలనఖంబు నాఁగఁ దిమిరేభ ప్రస్ఫురద్గర్వసం
|
| 37 |
+
|
| 38 |
+
</div>
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0040.txt
ADDED
|
@@ -0,0 +1,35 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
మధురనిశార్ధభాగధునీవిధాప్రియా
|
| 2 |
+
హేలామనోజసాహిత్యవశత
|
| 3 |
+
|
| 4 |
+
తే. శిశిరహేమంతశుచిశరత్సేవ్యమానుఁ
|
| 5 |
+
డై మహారాజవైభవోద్దామమూర్తి
|
| 6 |
+
కూడి ఋతురాట్సభానలకూబరుండు
|
| 7 |
+
మాధవుఁడు వచ్చె సుమసుకుమారమూర్తి.”
|
| 8 |
+
|
| 9 |
+
చిలుకలతేరు నెక్కి జైత్రయాత్రకు బయల్వెడలు వేళ సేనాసమేతముగ వనవీథులఁ
|
| 10 |
+
బయనింప 'ప్రత్యగ్రసాలాగ్రహర్మ్య విటంకంబులు ప్రాఁకి వల్లివనజాస్యల్ సల్లిరుత్ఫుల్ల
|
| 11 |
+
పల్లవహస్తంబుల భావిభావుక ఫలోల్లాసంబుతోఁ గొవ్విరుల్.'
|
| 12 |
+
|
| 13 |
+
ఉత్కంఠాపనోదితకలకంఠకంఠములతో వనలక్ష్మి 'నందనవనసుందరి
|
| 14 |
+
నీ న్నందగాని రానిచ్చెనె?' యని సాకూతముగఁ బ్రశ్నించినది. ఆమె 'శోభా
|
| 15 |
+
నవతరుణిమ నాశుష్క జీవతరువుల కిఁక, ఋతునేతా! వసంతా!!" యను
|
| 16 |
+
ప్రమోదోన్మత్తమధుర గానమున మంజులముగ్ధనృత్య మొనర్చి యతని కాతిథ్య
|
| 17 |
+
మిచ్చినది.
|
| 18 |
+
|
| 19 |
+
'మన సఖుఁడు, గురుఁడు దైవ' మీ మాధవస్వామియని మనసారనమ్మి
|
| 20 |
+
మనోవాక్కాయకర్మల నాజ్ఞానువర్తియై మెలఁగు మలయమారుతుఁడు వసంతుని
|
| 21 |
+
అభ్యుదయపరంపరాభివృద్ధి నర్థించుచు నానందాబ్ధి నోలాడుచు బహురూపముల
|
| 22 |
+
ధరించి పొంపిళ్లు వోవుచున్నాడు. ఇతఁడు వనప్రియ కడకు వసంతాగమన వార్తఁ
|
| 23 |
+
గొనిపోయి నపుడామె ముఖసమీరముతో గౌరవపురస్సరముగ నెదురురా 'నిలువెల్లఁ
|
| 24 |
+
బొంగిపోయి యొడలెల్లఁ గాళ్లుగ వడిబారు నదియై' సకలచారీకరణాంగ
|
| 25 |
+
హారచతురనృత్య మొనర్చినాఁడు. ఇది గమనించిన మన ప్రబంధపరమేశ్వరుఁడు :
|
| 26 |
+
|
| 27 |
+
చ. ఇదె చనుదెంచెఁ జైత్రమని యెల్లవనంబులకుం బ్రమోదముల్
|
| 28 |
+
బొదలఁగ మేలివార్తఁ గొని బోరన వచ్చిన దాడికాఁ డనన్
|
| 29 |
+
మృదువనదేవతాముఖసమీర మెదుర్కొన నుల్లసిల్లె నిం
|
| 30 |
+
పొదవఁగ దక్షిణానిల మనూనమనోహరఖేలనంబునన్.”
|
| 31 |
+
|
| 32 |
+
అని వర్ణించినాఁడు.
|
| 33 |
+
|
| 34 |
+
వసంతుఁ డతని యనుంగునెచ్చెలి యగుట నతఁడు వచ్చునపు డెదురేఁగి
|
| 35 |
+
సుగంధసేకరణ మిచ్చి మిత్రునికెత్తని కీర్తిధ్వజమై మలయానిలుఁ డొప్పినాఁడు.
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0041.txt
ADDED
|
@@ -0,0 +1,31 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
పుష్టివర్ధనమైన యీ నెత్తావిసంపుటి యొకనాఁటిదా! ఒక చోటిదా!! దీని
|
| 2 |
+
సంపాదించువేళ:
|
| 3 |
+
|
| 4 |
+
సీ. "కేళీసరోవీథి నాళీక వా టీషు
|
| 5 |
+
ధూళీఝరీరాజి తేలి తేలి
|
| 6 |
+
చోళీమహాభోగచూళీనవప్రసూ
|
| 7 |
+
నాళీ సుగంధంబు లాని యాని
|
| 8 |
+
లోలీభవత్పుష్పధూళీచరద్భృంగ
|
| 9 |
+
పాళీనిరోధాప్తిఁ దాళి తాళి
|
| 10 |
+
తాళీవనీనారి కేళీరసాలకం
|
| 11 |
+
కేళీహితచ్ఛాయఁ గెరలి కెరలి
|
| 12 |
+
|
| 13 |
+
తే.గీ. మెలఁగు నామని మణిధరావలయనిలయ
|
| 14 |
+
కనకనందనచందనాకలితలలిత
|
| 15 |
+
వలితలవలీనికుంజాబ్జవదనమదన
|
| 16 |
+
కదనఘర్మాప(హుం డయ్యె) గంధవహుఁడు.”
|
| 17 |
+
|
| 18 |
+
వసంతప్రాదుర్భావమున మలయానిలుఁడు సమస్త ప్రపంచమునఁ దానెయై
|
| 19 |
+
ప్రవర్తించి యాకర్షించినాఁడు. ఒనర హిమావకుంఠనము లూడ్చి తెమల్చిన
|
| 20 |
+
పత్రభంగముల్ సన నసియాడుచు న్మొగుడి చెక్కుల పల్లవపాణిఁ గప్పు నూతనలతి
|
| 21 |
+
కాలతాంగుల నుదారగతి న్జలివాపినాఁడు. వారికి నెయ్యంపుఁ బెనఁకువ నేర్పినాఁడు.
|
| 22 |
+
నితాంతనూతనలతాంగా శ్లేషముల్ నిశ్చలలీల న్మధుపాంగనా సమితి కలరఁజేసినాఁడు.
|
| 23 |
+
సంధించు తామ్రాక్షియౌ కలకంఠిని నేర్పు మెఱయఁ బలికించినాఁడు. లోక మతని
|
| 24 |
+
భుజంగగ్రామధామైక సంకలనాభ్యాస విలాసపాటవునిగఁ గీర్తించినది. కొమ్మల డాసి
|
| 25 |
+
పండుటాకుల మిషతో నిచోళావకుంఠనముఁ దొలగించు చిలిపితనమును గూర్చి
|
| 26 |
+
లోకము పరిపరి విధములఁ జెప్పుకొనినది.
|
| 27 |
+
|
| 28 |
+
ఈ గంధవహుఁ డెవ్వఁడు? ఏ కడవాఁడు? ఈతని రాకకుఁ గారణ మెయ్యది?
|
| 29 |
+
భావుకుల నీ ప్రశ్నలు కలఁతపెట్టినవి, అతని వంశాభిజాత్యములు గుర్తించినవా రతఁడు
|
| 30 |
+
పుట్టుపూర్వోత్తరములు, మట్టుమర్యాదలు లేనివాఁడు కాఁడని నిర్ణయించి యతని
|
| 31 |
+
చరిత్రనిట్లు సంక్షేపముగఁ బ్రవచించినారు.
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0046.txt
ADDED
|
@@ -0,0 +1,31 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
‘అమరాంగనాతుంగ
|
| 2 |
+
సంగతోన్నతవక్ష
|
| 3 |
+
ఘనసారకాశ్మీర
|
| 4 |
+
చర్చాసుగంధముల సొలసి,
|
| 5 |
+
|
| 6 |
+
వెఱ్ఱి నైనాను నేను - ఇఁక
|
| 7 |
+
విశ్వచాలన చేయలేను
|
| 8 |
+
|
| 9 |
+
ఖేచరీముఖసక
|
| 10 |
+
ర్పూరతాంబూలాది
|
| 11 |
+
వాసనానిఃశ్వాస
|
| 12 |
+
పవనచాలనలకున్ భ్రమిసి,
|
| 13 |
+
|
| 14 |
+
వెఱ్ఱి నైనాను నేను ఇఁక
|
| 15 |
+
విశ్వచాలన చేయలేను”
|
| 16 |
+
|
| 17 |
+
అని జగత్ప్రణుఁడై సదాగతి యగుట బాధపడిఁనాడు. కొన్ని సమయముల నెత్తావులు
|
| 18 |
+
మునిఁగి యున్మత్తనృత్య మొనర్చు నాతనిఁగని పెద్దలు వినయవిధేయత లితనికి
|
| 19 |
+
లేవని పలుకవచ్చును. ఇది పొరబాటు. అతని యణఁకువను గూర్చియు,
|
| 20 |
+
వృద్ధగౌరవాభిజ్ఞతను గూర్చియు మన మహాకవి కాళిదాసు నడుగుఁడు, కులపతియగు
|
| 21 |
+
వసిష్టాశ్రమమున కేఁగుచున్న సుదక్షిణాదిలీపుల మలయానిలుఁడు సేవించిన రీతి
|
| 22 |
+
నా మహానుభావుఁడు తిలకించి యిట్లు కలకాలము వినఁ బల్కినాడు :
|
| 23 |
+
|
| 24 |
+
'సేవ్యమానౌ సుఖస్పర్శైః
|
| 25 |
+
సాలనిర్యాస గంధిభిః
|
| 26 |
+
పుష్పరేణూత్కిరై ర్వాతై
|
| 27 |
+
రాధూత వనరాజిభిః'
|
| 28 |
+
|
| 29 |
+
(చల్లనైనవియు, సాలతరు రసపరిమళమిళితము లైనవియు, కుసుమరజస్సుల
|
| 30 |
+
రాల్చునట్టివియు సుఖస్పర్శగలవియు నగు తెమ్మెరలచే సేవింపఁబడువారై వారు
|
| 31 |
+
తరలిపోయిరి.)
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0047.txt
ADDED
|
@@ -0,0 +1,28 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
"శివ, శివా! యనమేలు తుమ్మెదా!
|
| 2 |
+
శివయన్న వినమేలు తుమ్మెదా!!
|
| 3 |
+
శ్రీకంఠుఁ డనుపూవు తుమ్మెదా!
|
| 4 |
+
మూఁడులోకమ్ము లయ్యెనే తుమ్మెదా!
|
| 5 |
+
ఆఱు రేకులపూవు తుమ్మెదా!
|
| 6 |
+
యది మీఱునే వాసనల తుమ్మెదా!
|
| 7 |
+
వేఱు సేయక నీవు తుమ్మెదా! శివుఁ
|
| 8 |
+
జేరి భజియింపవే తుమ్మెదా!!
|
| 9 |
+
అష్టదళముల మీఁద తుమ్మెదా! నీ
|
| 10 |
+
వంటి చరియింపవే తుమ్మెదా!!
|
| 11 |
+
సాకారమైయుండు తుమ్మెదా! పర
|
| 12 |
+
మైకాంతమునఁ జూడు తుమ్మెదా!!”
|
| 13 |
+
|
| 14 |
+
భిక్షుకుని కోమలకంఠము నుండి విడివడి సమీరసమీరిత మగుచు నీ భ్రమర
|
| 15 |
+
గీతి శ్రుతిపుటములఁ బ్రవేశించి నా స్నిగ్ధచిత్తమును ద్విరేఫాన్వేషణకుఁ బురికొల్పినది.
|
| 16 |
+
|
| 17 |
+
అది యుజ్జ్వల కావ్యోపవనవాటి. సాకూతమధుర కోమలవిలాసినీకలకంఠ
|
| 18 |
+
కూజితప్రాయము. శివతపోభంగ సమయము. హుతాశనునకుఁ డోడ్పడు మని
|
| 19 |
+
వాయువు నెవరు ప్రేరేపింపవలయును? మన్మథునకు మాధవుఁడు సర్వ ప్రావీణ్యము
|
| 20 |
+
మెఱసి తోడ్పడుచున్నాఁడు. మహాకవి కాళిదాసు వాసంత విలాసశ్రీ వహించియున్న
|
| 21 |
+
పరమేశ్వరాశ్రమమునందు మదనుని రతిద్వితీయునిగఁ బ్రవేశపెట్టి యొక పొదరింట
|
| 22 |
+
నుపవిష్ణుఁడై సమస్తమును రసనిషణ్ణచిత్తముతోఁ దిలకించుచున్నాఁడు. స్థాణ్వాశ్రమమున
|
| 23 |
+
మదనాగమానంతరము చరాచరమైన సమస్త ప్రకృతియు నుజ్జ్వల రసప్రపూర్ణమై
|
| 24 |
+
యొప్పుచున్నది. మిథునము లుత్కృష్ట ప్రేమరసావేశము గలవై యొప్పు దృశ్యములు
|
| 25 |
+
భ్రమరాన్వేషణకై పర్యటించు నా కంటఁబడినవి.
|
| 26 |
+
|
| 27 |
+
అట గండుతేఁటి పూవనెడు నొంటికోరలో ముందుగ నెచ్చెలికిం ద్రాగనిచ్చి
|
| 28 |
+
యది త్రావమిగిలిన పుష్పరసము నానందరసోత్కరుఁడై త్రావుచున్నాఁడు. నా దృష్టి
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0048.txt
ADDED
|
@@ -0,0 +1,30 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
యా రమణీయ దర్శనముపై నిల్చినది. కొంతకాలమైన పిమ్మట బుద్ధి యా రసిక
|
| 2 |
+
దాంపత్యమున కత్యామోదము నొందినదయ్యు నిది రసాభాసము కదా యను శంక
|
| 3 |
+
నొందినది. అప్రయత్నముగ నా యభిప్రాయము నా నోఁటినుండి బయటపడినంత
|
| 4 |
+
టనుండియో 'రసాభాసమును రసమే' యగు నను నొక కమనీయకంఠము
|
| 5 |
+
విన్పించినది.
|
| 6 |
+
|
| 7 |
+
'అది యెచట నుండి?' యని యొక వంకకుఁ జూతునుగదా యట లతా
|
| 8 |
+
గృహద్వారమున వామప్రకోష్టార్పిత హేమవ్రేతుఁడై ముఖార్పితైకాంగుళి సంజ్ఞచే ‘నల్లరి
|
| 9 |
+
జేయకుఁ’ డని గణముల శాసించు నందీశ్వరుఁడు నా కంటఁబడినాడు. మఱుక్షణమున
|
| 10 |
+
వనమంతయు నతని యనుశాసనమున నిష్కంపవృక్షము, నిభృత ద్విరేఫము,
|
| 11 |
+
మూకాండజము, శాంతమృగ ప్రచారము నైనది. మున్ను పొడకట్టిన ద్వి రేఫప్రియుఁడు
|
| 12 |
+
ప్రియావియోగము నొంది యొంటిగ నొక యామ్రశాఖికపై నిలచియున్నాఁడు. ఇట
|
| 13 |
+
షట్పదాన్వేషణ మిఁక సాఁగ దను బుద్ధితో సాఁగిపోవుచుండఁ బర్యంకబంధ స్థిర
|
| 14 |
+
పూర్వకాయము, ఋజ్వాయత సన్నమితో భయాంసము, ప్రఫుల్ల రాజీవభ్రమకృ
|
| 15 |
+
దుత్తాపాదద్వయ సన్నివేశము నగు పరమేశ్వరరూపము గోచరించినది. నా చూపు
|
| 16 |
+
ప్రాణాపానాది మరుత్పంచకమును నిరోధించిన మహేశ్వరుని భుజంగమోన్నద్ధ
|
| 17 |
+
జటాకలాపముపై నిల్చి కర్ణావసక్త ద్విగుణాక్ష సూత్రమును గని కంఠప్రభాసంగ విశేషనీల
|
| 18 |
+
కృష్ణాజినముపైఁ బర్వినది. వృష్టిసంరంభము లేని యంబువాహము వలెఁ, దరంగ
|
| 19 |
+
రహితమైన నీరాధారము వలెఁ నివాతనిష్కంపప్రదీపము వలెఁ, బరమశివుఁ
|
| 20 |
+
డటనుండఁ గని యిట భ్రమరములకై వెదకుట 'వెఱ్ఱియన్వేషణ' మని నిశ్చయించి
|
| 21 |
+
తిరోగముఁడ నగుచున్నాను.
|
| 22 |
+
|
| 23 |
+
అందుకు వ్యతిరిక్తముగ నా హిమగిరి రాజపుత్రి నిత్యకైంకర్యమునకై
|
| 24 |
+
సమ్మోహనరూపమున సదాశివుని సన్నిధానమునకు వచ్చుచున్నది. సుగంధ నిశ్శ్వాస
|
| 25 |
+
వివృద్ధతృష్ణుఁడై యొక సారంగాధీశ్వరుఁడు గిరిసుతాబింబాధరాసన్న సీమఁ
|
| 26 |
+
జరింపనామె ప్రతిక్షణ సంభ్రమలోలదృష్టితో విలోకించుచు లీలారవిందమున నివారించు
|
| 27 |
+
దృశ్యమును జూచియు నిట నింక భ్రమరాన్వేషణము పొసంగు టెట్లనుకొంటిని.
|
| 28 |
+
ఆ మాట వూకుటీరమున నున్న కవికులగురువు చెవిఁబడెనేమో! 'అలక
|
| 29 |
+
కేఁగుము, అట పాదపములు నిత్య పుష్పములు, నున్మత్తభ్రమర ముఖరములు' నని
|
| 30 |
+
సెలవిచ్చినాఁడు.
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0049.txt
ADDED
|
@@ -0,0 +1,36 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
సీ. "గగన స్రవంతిలోఁ గల సువర్ణాబ్జంబు
|
| 2 |
+
లందు మే లేర్చి తా నపహరించి,
|
| 3 |
+
మానసంబు శఠాత్ముమానసంబునుబోలె
|
| 4 |
+
నిస్సారసత్త్వంబు నెఱయఁ జేసి
|
| 5 |
+
బిందుసరమ్ములోఁ గుందనపుం దమ్మి
|
| 6 |
+
పేరులేకుండంగఁ బెల్లగించి
|
| 7 |
+
సౌగంధికాఖ్యకాసారంబు జలమాత్ర
|
| 8 |
+
శేషమై దీనతఁ జెందఁ జేసి”
|
| 9 |
+
|
| 10 |
+
వజ్రనాభుని వంటి రక్కసులే కేళాకూళులఁ బోషించి రసికజన రాజేంద్రు
|
| 11 |
+
లనిపించుకొనినారు. అట్టి యెడ నార్యధర్మాభినిష్ఠ గల
|
| 12 |
+
|
| 13 |
+
శ్రీహర్ష చక్రవర్తి వనపాలన
|
| 14 |
+
దక్షుఁడై యుంట తప్పదను నాశతో నతని సాహిత్యోద్యానమునఁ బ్రవేశించితిని.
|
| 15 |
+
అప్పు డందొక పద్మాకరమున భ్రమరయువకుఁ డొక్కఁడు కమలమును జేరి
|
| 16 |
+
మరందపాన మొనర్చుచుండ హిమానీవర్షము కురిసినది. అతఁడు మంచుదెబ్బ తగిలి
|
| 17 |
+
పడిపోయినాడు. అంతకుమున్నే వారి పరిచయ మొనర్చుకొని ప్రక్క నిలచియున్న
|
| 18 |
+
నాతో నా కవిచక్రవర్తి యా కరుణదృశ్యమును జూపి 'వామే విధానహి ఫలం
|
| 19 |
+
త్యభివాంఛితాని' (దైవము ప్రతికూలముగా నుండఁగా గోర్కెలు ఫలింపవు కదా!)
|
| 20 |
+
యనినారు
|
| 21 |
+
|
| 22 |
+
పిమ్మటఁ గొంత కాలమునకు బిల్హణభట్టు విక్రమాంక వనమునఁ
|
| 23 |
+
బ్రవేశించితిని. అప్పు డట నొక పెనుగాలి పుష్పలోకప్రళయమై యొప్పినది. పుష్పధూళి
|
| 24 |
+
చెలరేఁగి కన్నులఁ గప్పుటచే రెప్ప లల్లార్చుచు నాకాశపథమున కెగయుచున్న
|
| 25 |
+
యళిసంతానములు బహుళ పౌరందరచాపవిభ్రాంతులఁ గల్పించి యనతికాలములోఁ
|
| 26 |
+
గారుచీఁకట్ల గగనవీథిఁ గప్పినవి.
|
| 27 |
+
|
| 28 |
+
ఇఁక సంస్కృతసాహిత్యవనీవీథుల షట్పదాన్వేషణ మొనర్ప బుద్ధి వోకుండుటచే
|
| 29 |
+
నాంధ్రసాహిత్య పుష్పకాననములఁ బ్రవేశించితిని. ఆదిలో నది 'సంహితాభ్యాసి' వనము.
|
| 30 |
+
ఛందోముఖరితమై యొప్పు నిందుఁ గేవలము శుకానువాదములు తప్ప విన్పింపనేమో
|
| 31 |
+
యను సందేహము కలిగినది. కాని యదృష్టవశమున నాదియందే నన్నయ 'కమ్మని
|
| 32 |
+
లతాంతమ్ములకు మ్మొనయు మధుప సంతానముల' మధురఝాంకరణములు
|
| 33 |
+
విన్పించినవి.
|
| 34 |
+
|
| 35 |
+
తదుపరి నే ప్రవేశించినది తిక్కనార్యుని 'రామాయణ వనము'. తొలుదొల్తఁ
|
| 36 |
+
బ్రభువగు శ్రీరామచంద్రమూర్తికి వనపాలిక మత్తమధుపములకుఁ దప్పి
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0050.txt
ADDED
|
@@ -0,0 +1,33 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
మధుభరితంబై క్రొత్తావిఁ గ్రమ్ము నరవిరి గుత్తి నొకదానిని వినయ వికుంచిత తనువై
|
| 2 |
+
యర్పించుచు నొప్పినది. అనతికాలమునకుఁ దీఁగెయుయ్యలల నెక్కి తూఁగియాడుచుఁ
|
| 3 |
+
గూడిపాడెడి మత్తాళిబాలికలను గని యొండొరులకుఁ జూపించుచు నలరులఁ
|
| 4 |
+
గోయుచోట మధుపాళి మ్రోఁతకు ముగ్ధ లుల్కినం గలకల నవ్వుచున్న వారివిహార
|
| 5 |
+
ప్రియుఁడగు రామచంద్రుఁడు' కన్పించెను. మఱియొక చోట
|
| 6 |
+
|
| 7 |
+
ఉ. తుమ్మెద పిండు మెండుకొని త్రొక్కిన రేకుల సందు సందులం
|
| 8 |
+
గ్రమ్మి చలత్తరంగ శిఖరంబులఁ దూలెడి తమ్మి పుప్పొడుల్
|
| 9 |
+
కొమ్ముడులూడఁ గ్రమ్ము పొది లోపల నొక్కొకచోటఁ గెంపుచం
|
| 10 |
+
దమ్మునఁ జెన్నుచేసె వనితల్ కమలాకర కేళి సల్ఫగన్.”
|
| 11 |
+
|
| 12 |
+
ప్రబంధ పరమేశ్వరుని యారామవీథిఁ బ్రవేశించి చూడ నట జైత్రారూఢిఁ
|
| 13 |
+
జిగురుం గెంజెడ లొప్పఁ బుష్పరజముల్ సెల్వార నున్బూది పూఁతగ లేదేఁటులు
|
| 14 |
+
చుట్టుకోలు జపసూత్రశ్రీలుగాఁ గోకిల ప్రగుణాత్తాధ్యయనంబుతో శాంభవంబగు
|
| 15 |
+
దీక్షావిధి నొంది యొప్పుచున్నది. మఱియొక దిక్కున వాగర్ధ ప్రణయమూర్తులైన
|
| 16 |
+
యుమామహేశ్వరులు కేళీవిలాసములఁ దేలియాడుచున్నారు. పరమేశ్వరీ
|
| 17 |
+
లీలారవిందము నందలి భ్రమరబాలుఁడు మన్మథమథనుని మానసవీథిని జీరనిద్ర
|
| 18 |
+
నొందుచున్న చిత్తజాగ్నిని మేల్కొల్పుచున్నాఁడు. ఇది యనంగ విజయము అమ్మవారి
|
| 19 |
+
కైంకర్యసమయ మని ముందున కేఁగ నిచ్చగింపక యందుండి యన్యవనములకుఁ
|
| 20 |
+
బయనమైతిని.
|
| 21 |
+
|
| 22 |
+
'ఉల్లల దలకాజలకణ పల్లవిత కదంబముకుళ పరిమళ లహరీ హల్లోహల
|
| 23 |
+
మదబంభర మల్లధ్వను లెసఁగ మరుదంకురములు నన్నాహ్వానించుచున్నవి. 'ఆవాత
|
| 24 |
+
పరంపరా పరిమళ వ్యాపార లీల న్జనాన్విత మిచ్చోటని చేరఁబోయి’ యట నొక్కచో
|
| 25 |
+
నిల్చి 'ఈ రమ్యవృక్షవాటిక లెవ్వరివి చెప్పుమా!' యని ప్రశ్నించుకొంటిని. 'నభో
|
| 26 |
+
వాహినీలహరీ శీతలగంధవాహ పరిఖేలన్మంజరీ సౌరభగ్రహణేందిందిర తుందిలమ్ము
|
| 27 |
+
లివి మత్కాం తార సంతానముల్' అనునొక కామినీకలస్వనము విన్పించినది. చకితుఁడ
|
| 28 |
+
నగుచుండ మఱుక్షణమున నొక చంచల్లతావిగ్రహ, శతపత్త్రేక్షణ, చంచరీక చికుర,
|
| 29 |
+
చంద్రాస్య, చక్రస్తని, నతనాభి, నవల నా యెదుట నిల్చినది. జ్ఞప్తి కెలయించుకొని
|
| 30 |
+
'ఓహో! నీవు మా యాంధ్ర కవితా పితామహుని యమృత దుహితవు నమరనర్తకివి,
|
| 31 |
+
యా వరూధినివి కావా?' యని ప్రశ్నించి యేమో సంభాషింప నూహించు చున్నంతలోనే
|
| 32 |
+
యటకుఁ 'జెప్పకు మిట్టి తుచ్ఛ సుఖముల్ మీసాలపైఁ దేనియల్' అనుకొనుచుఁ
|
| 33 |
+
బోవుచున్న తరుణాగ్నిహోత్రి ప్రవరుఁడు స్వాహావధూవల్లభుని యింటికిఁ ��ేర్పుమని
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0051.txt
ADDED
|
@@ -0,0 +1,34 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
ప్రార్థించుట విన్పించింది. మున్ను వరూధిని ప్రవరునితో నన్న 'వనిత తనంతఁ దా
|
| 2 |
+
వలచివచ్చినఁ జుల్కనగాదె యేరికిన్' అన్న సాకూతాభిభాషణము వినఁబడియెనేమో!
|
| 3 |
+
|
| 4 |
+
చ. "తరుణి ననన్య కాంత నతి దారుణపుష్ప శిలీముఖవ్యథా
|
| 5 |
+
భరవివశాంగి సంగభవు బారికి నగ్గముసేసి క్రూరుఁడై
|
| 6 |
+
యరిగె మహీసురాధముఁ డహంకృతితో నని రోషభీషణ
|
| 7 |
+
స్ఫురణ వహించెనో యన నభోమణి తాల్చెఁ గషాయదీధితిన్.”
|
| 8 |
+
|
| 9 |
+
కంపించి మఱల నే వరూథినికైనఁ గన్పింపక బయటఁ బడితిని.
|
| 10 |
+
|
| 11 |
+
అది 'గగనధునీ శీకరముల' చెమ్మ, నంది తిమ్మయ్య పారిజాతోద్యానము.
|
| 12 |
+
ప్రవేశింపనొక షట్పదకుమారుఁ 'డే వియోగశాలినీ హృదయ రేఖగ’ నో కన్పట్టుచు
|
| 13 |
+
నా వలె నొక వెఱ్ఱియన్వేషణ మొనర్చుచుఁ గన్పించినాఁడు. అతని యవ్యక్త కంఠధ్వని
|
| 14 |
+
యందామె సొగసు రేకుల విప్పి యమృత నటనఁ గానుపింపఁబోదు; నా కుగాదులు
|
| 15 |
+
లేవు నా కుషస్సులు లేవు' మొదలగు ననేక విరహవిధుర భావములు పొడకట్టుచున్నవి.
|
| 16 |
+
'పాపము! ఈ మధువ్రతుని బాధ యేమిటి? వాడిపోయిన సుమసౌరభమ్ము కొఱకుఁ
|
| 17 |
+
గను మొఱంగిన ప్రతిహిమకణమ్ము కొఱకు బ్రతుకు బ్రతుకెల్ల నెదియొ యొక బాష్ప
|
| 18 |
+
గీతిక వలె' నున్నదే!
|
| 19 |
+
|
| 20 |
+
ఈ రీతి భావించుచుండ నట నొక గిరిపొంతఁ జక్కగఁ దీర్చి దిద్దిన పూఁదేనియ
|
| 21 |
+
యేటికాలువ దరిఁ జెంగల్వ పుప్పొళ్లు నించిన సాంద్రోపల వేదిపై నధివసించి
|
| 22 |
+
యీషత్కషాయ సౌరభమై స్వర్గమునుండి తన సత్య కొనితెచ్చి యిచ్చిన పారిజాత
|
| 23 |
+
కుసుమ సౌరభ మాఘ్రాణించుచు తిమ్మన్న మహాకవి యా సత్యాదేవికి నూతన
|
| 24 |
+
ప్రహేళికల నేఱ్పుచున్నాఁడు. వినమ్రభావముతో వారి దరిఁ జేరిఁ మహానుభావా!
|
| 25 |
+
ఈ బంభరకుమారుని బాధ యే?” మని మున్ను నేఁ జూచినవానిఁ జూపించుచుఁ
|
| 26 |
+
బృచ్ఛ యొనర్చితిని.
|
| 27 |
+
|
| 28 |
+
మ. “ఒక భృంగంబు పరాళినీమదనతంత్రోన్మాదిఁ బ్రాణేశ్వరిన్
|
| 29 |
+
మకరందాసవమత్త మజ్జగృహసీమం బెట్టి తాఁబోయి సం
|
| 30 |
+
జకడ న్వచ్చి తదానమన్ముకుళ మే జాడం జొరంరాక యా
|
| 31 |
+
మికుఁడో నాఁ దిరుగున్ - గొలంకు రమకు న్మేలెంత హీనంబొకో!"
|
| 32 |
+
|
| 33 |
+
యని తిమ్మనవారు సమాధానము చెప్పి తుదకర్థాంతరము నుంచినారు. భ్రమరకుల
|
| 34 |
+
విచిత్ర చేష్టలను గూర్చి మఱి యొక విశేషాంశమును గూడ వినిపించినారు.
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0056.txt
ADDED
|
@@ -0,0 +1,33 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
ఈ పరార్థత వలననే గదా భ్రమరయువకుఁడు కృష్ణభగవానుని దూతగ నేఁగి
|
| 2 |
+
వల్లవీసంఫుల్లాబ్జనేత్రల వలన నపూర్వావమానము నొందినది! ఇందులకు సాక్షి
|
| 3 |
+
మఱియొకరు మఱియొకరు కాదు మన మహాభక్తకవి పోతనామాత్యుఁడు!
|
| 4 |
+
|
| 5 |
+
మ. “భ్రమరా దుర్జనమిత్ర! ముట్టకుము మా పాదాబ్జముల్ నాగర
|
| 6 |
+
ప్రమదాళీకుచకుంకుమాంకిత లసత్రాణేశ దామప్రసూ
|
| 7 |
+
నమరందారుణితాననుండ వగుటన్ నాథుండు మన్నించుఁ గా
|
| 8 |
+
క మము న్నేపుచుఁ బౌరకాంతల శుభాగారంబున న్నిత్యమున్.”
|
| 9 |
+
|
| 10 |
+
ఇవి కదా వారన్న మాటలు! పాదముల నంటి దౌత్యమును నెఱపిన
|
| 11 |
+
నెఱజాణతనము స్నేహార్ద్రత భ్రమరుని కడఁగాక యే దూతయం దున్నవి?
|
| 12 |
+
|
| 13 |
+
నలుఁ డేమొనర్చినాడు? దమయంతికడకుఁ ద్రిదశేశుల దూతగ నేఁగి 'యెన్ని
|
| 14 |
+
చెప్పిన నామె యన్నింటి కన్ని చెప్పి' కన్నీరు పెట్టునంతకు 'దివిజోపకారసంస్తం
|
| 15 |
+
భితవిప్రలంబ వేదనాభరుండై' సంభాషించుట మెచ్చుకొనఁ దగినదే! కాని యా విదర్భ
|
| 16 |
+
రాజపుత్రి ‘యప్రతివిధానంబైన ప్రియావాప్తి విఘాతంబున... వేడియశ్రుల నిగుడంగ
|
| 17 |
+
వెక్కి వెక్కి యేడ్వఁ (ధీరోదాత్తుఁడైన తాను) దన్నును, దన వచ్చిన కార్యంబును దన్నుఁ
|
| 18 |
+
బుత్తెంచిన వేల్పులను మఱచి యవస్థావశంబున నుచితానుచిత వివేకంబులు దప్ప
|
| 19 |
+
భావనానిరూఢంబులైన ప్రియావికల్పంబులు వికల్పించుచు:
|
| 20 |
+
|
| 21 |
+
కం. "ఏమిటి కేడ్చెద వానన
|
| 22 |
+
తామరసం బెత్తి చూడు తరుణీ! నన్నున్
|
| 23 |
+
గోమలకటాక్షవీక్షా
|
| 24 |
+
దామకముల వీరసేనతనయుని నలునిన్.”
|
| 25 |
+
|
| 26 |
+
అని బయటఁబడిపోవచ్చునా? ఎంత విస్పష్టముగఁ బలికినాఁడు! మఱియొక నలుఁ
|
| 27 |
+
డెవ్వరైన నుండవచ్చు నేమో! 'వీరసేన తనయుఁ' డఁట! కేవలము 'గోత్రస్థాలిత్యము'తో
|
| 28 |
+
నూరకొనిన నదియుఁ గొంత మేలై యుండెడిది.
|
| 29 |
+
|
| 30 |
+
"కాంత యశ్రుబిందుచ్యుతి కైతవమునఁ
|
| 31 |
+
దివిరి బిందుచ్యుతక కేళిఁ దవిలె దీవు;
|
| 32 |
+
సారెసారెకు నాదు సంసారమును స
|
| 33 |
+
సారముగఁ జేయుచు మసారతారనయన!”
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0057.txt
ADDED
|
@@ -0,0 +1,33 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
అని యతఁడు పల్కిన పల్కు నూహింప నెన్ని విశేషములు ద్యోతకము లగుచున్నవి!
|
| 2 |
+
'ఉన్మాదులు సంఘటింపగ సమర్థులె యెందును రాయబారముల్' అని తుద కతఁడెంత
|
| 3 |
+
విలపించిన బ్రయోజన మేమున్నది?
|
| 4 |
+
|
| 5 |
+
దౌత్యమునకే కాదు, మైత్రికిని మధుకరకుమారునిది పెట్టిన పేరు. మిత్రులను
|
| 6 |
+
దన పారిపార్శ్వకులలోఁ జేర్చుకొని తాను రిక్కల మధ్య వెలుఁగు రేవెలుఁగు వలె
|
| 7 |
+
సంచరించుట యతని యభిమతము కాదు. అతని హితులు గ్రహములు గాని
|
| 8 |
+
యుషగ్రహములు కారు. 'భయయోగమున నైనఁ' దనతో మైత్రియొనర్చు వారిఁ
|
| 9 |
+
దనంత వారిఁ జేయుట యతనికిఁ బరిపాటి. దీనిఁ గమనించియే కదా విజ్ఞులు
|
| 10 |
+
'భ్రమరకీటన్యాయ' మును లోక విఖ్యాత మొనర్చినది!.
|
| 11 |
+
|
| 12 |
+
భ్రమర ముదాత్తప్రకృతి; ఉన్నతసృష్టి. కాకున్న శంకరపూజ్యపాదులు కవుల
|
| 13 |
+
సందర్భ స్తబక మకరందైక రసిక కర్ణయుగళమును విడువక నవరసాస్వాద తరళ
|
| 14 |
+
కటాక్ష వ్యాక్షేప భ్రమరకలభములఁ జూచి భవదళికనయన మసూయాసంసర్గముచే
|
| 15 |
+
నించుక యెఱ్ఱవారిన' దని యా సౌందర్యలహరిని వర్ణించునా! "ఓ భగవతీ! దీనుల
|
| 16 |
+
కనిశ మాశాసుసదృశశ్రీదాత్రియును, నమందవికిరన్మందార స్తబకసుభగమును నగు
|
| 17 |
+
నీ చరణమందుఁ గరచరణములచే నేను షట్పదము నగుదును గాక!!' యని
|
| 18 |
+
తానంబికాపాద మకరందలోలుప భ్రమరము గానాకాంక్షించునా!
|
| 19 |
+
|
| 20 |
+
మేఘమండలమున యాన మొనర్చు 'భ్రమరకుల రాజ్ఞి'ని గనినవేళ నెన్నెన్ని
|
| 21 |
+
మనోజ్ఞ భావము లుత్పన్నము లగుచున్నవి? శాంకరీ! పల్కు మీ ఝంకార మేమిటో,
|
| 22 |
+
మంత్రమా? గీతమా? మఱి మాయయా? లీలయో, నాట్యమో లేక భ్రామరీ తెల్పు
|
| 23 |
+
మీ భ్రమర విభ్రమ మేమొ! సాధకుని యాత్మలో జ్ఞానదీపము వోలెఁ గనుపించి
|
| 24 |
+
మాయమై కనుపింతునే! తెలియలేమే మేము! ప్రణయమో, ప్రభవమో, లాస్యమో,
|
| 25 |
+
తాండవమొ మముఁ దేల్చవే తల్లి!” ఈ రీతిఁ బొడము నూహ లనంతములు
|
| 26 |
+
కదా!
|
| 27 |
+
|
| 28 |
+
సృష్టిస్వరూపుఁ డైన పరమాత్మ పరముగఁ 'బ్రళయావసానమునఁ బ్రహ్మాండ
|
| 29 |
+
మవియఁగాఁ బ్రభవించు నాత్మభవుఁ డీ రీతిన్. చీఁకటుల సృష్టించి లోకముల శ్రీమించు
|
| 30 |
+
నాత్మభవుఁ డీరీతిన్' మొదలైన యూహ లెన్నెన్నియో సాధకునకుఁ దోఁచును.
|
| 31 |
+
భ్రమరశిల్పమున జగత్స్రష్ట యింతటి భావగోపన మెందుల కొనర్చినాఁ డను ప్రశ్న
|
| 32 |
+
యుదయింప నించుక తర్కింప సమస్త సృష్టియు నరసికుల కైనది కాదని యభివ్యక్త
|
| 33 |
+
మగును. 'రసోవై సః', 'నేహ నానాస్తి కించన్'.
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0058.txt
ADDED
|
@@ -0,0 +1,27 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
అది యాముక్తమాల్యద పాఠము. నాకు వెఱ్ఱి నిదుర వచ్చుచున్నది. సర్వావయవము
|
| 2 |
+
లనెడి సంకెలలనుండి జారుచు నే నెటకుఁ బోవుచున్నాఁడనో నాకె యెఱుక లేకుండెను.
|
| 3 |
+
శ్రీకుప్పయాచార్యులవారు పాఠమునాపి కుదురైన గొంతుకతో 'నిద్రాదేవత నిన్నుఁ
|
| 4 |
+
బూనెఁ గదరా నిర్భాగ్యదామోదరా!' అను పద్యపాదమును ఘనజటవైచి చదువుచుండ
|
| 5 |
+
మిత్రుడు నన్నుఁ దట్టి మేల్కొల్పినాఁడు. మఱియొక సహాధ్యాయి నేఁ దెప్పరిలి స్వస్థితికి
|
| 6 |
+
వచ్చునంతలో నాచార్యులవారిని "ఆర్యా! నిద్రకును నొక దేవత యున్నదా?” యని
|
| 7 |
+
వినయముతోఁ బ్రశ్నించినాఁడు. ఆ దొడ్డపండితుఁడు "ఔను. జ్యేష్ఠాదేవి అలక్ష్మి...
|
| 8 |
+
జగదేక మాతకు జ్యేష్ఠభగిని" యని సమాధానము చెప్పినారు. నిదుర మబ్బులు నన్నుఁ
|
| 9 |
+
బూర్తిగ విడిపోయినవి.
|
| 10 |
+
|
| 11 |
+
సహపాఠి మఱల నాచార్యులవారిని జ్యేష్ఠాదేవి రూపాదికమును గూర్చి ప్రశ్నింప
|
| 12 |
+
వారు 'అలక్ష్మీం స్వం కురూపాసి కుత్సిత స్థానవాసినీ... అలక్ష్మీం కృష్ణవర్ణాం, ద్విభుజాం
|
| 13 |
+
కృష్ణ వస్త్రవరిధానం లౌహాభరణ భూషితాం శర్కరా చందన చర్చితాం
|
| 14 |
+
గృహసమ్మార్జనీహస్తాం, గర్దభారూఢాం, కలహ ప్రియాం' అని యేమేమో పఠించుచు
|
| 15 |
+
నాపై దృష్టి నిల్పుచు మందస్మిత మొనర్చినారు.
|
| 16 |
+
|
| 17 |
+
"ఏమీ దామోదరా! తామీలోకమునకుఁ దిరిగి వచ్చినట్లేనా?” అను వారి ప్రశ్న
|
| 18 |
+
కవనత శిరస్కుఁడనుగాక ప్రౌఢముగ బ్రతిస్మిత మొనర్చి 'ఇట దామోదర శబ్దౌచిత్య
|
| 19 |
+
మేమియో సెలవిం’ డని వారిని వేడుకొంటిని. వారొక చిరునవ్వుతో నా చిలిపితనమును
|
| 20 |
+
గమనించి ‘ఉదరే దామ యస్యేతి దామోదరః' యశోద మృద్భక్షణ మొనర్చిన బాలకృష్ణుని
|
| 21 |
+
నడుమున బలుపుతోఁ గట్టినది కనుక దామోదరుఁడైనాఁడు. మన్నుఁ దీనినట్లు
|
| 22 |
+
నిద్రనోవు మిమ్ము నిద్రాదేవత పాశబద్ధులఁ గావించుటచే మీరును దామోదరులే!”
|
| 23 |
+
అని సెలవిచ్చినారు. ఆ నాఁడు భారతీయులు నిద్రకు నొక దేవతను సృష్టించుకొని
|
| 24 |
+
నారని నాకుఁ దెలిసినది.
|
| 25 |
+
|
| 26 |
+
ప్రాచీన కాలమున బాబిలోనియను జాతివారు నిద్రపట్టకున్న 'లోహర్' అను
|
| 27 |
+
నిద్రాదేవతను బూజింతు రనియు, నేఁటి ఫిన్నిష్' జాతివారికి 'ఉని' యను నిద్రా
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0059.txt
ADDED
|
@@ -0,0 +1,33 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
దేవత 'ఉంటామో' యను స్వప్నదేవతలుండియున్నారని మఱికొంత కాలమునకుఁ
|
| 2 |
+
జదివి నేర్చుకొంటిని. నిజము! సమస్తశక్తులును దేవతలు కదా! నిద్ర యొక శక్తి!
|
| 3 |
+
ఒక దేవత!!
|
| 4 |
+
|
| 5 |
+
నిద్ర సృష్టియందొక విచిత్రమైన సృష్టి. 'అది దుప్పటి వంటిది. దానిఁగప్పుకొన
|
| 6 |
+
నవసరము లేని వ్యక్తి యెవఁడు? నిద్రయన్నాతురున కాహారము, తృష్ణాతురునకు
|
| 7 |
+
దాహము, శీతోష్ణబాధితుల కది యుష్ణము, శీతము; మిత్రరహితులకు మిత్రము,
|
| 8 |
+
నిలయవిహీనులకు నీడము, మనోబాధితులకు మహనీయాంజనము. ఇన్ని
|
| 9 |
+
సుగుణములు గల్గియు నిది మృత్యువును బోలి యుండుట యొక్కటియే యిందలి
|
| 10 |
+
దోష' మని యొక జిజ్ఞాసు వభిప్రాయ మిచ్చినాఁడు.
|
| 11 |
+
|
| 12 |
+
చంపుట తప్ప మృత్యువొనర్చు సర్వకృత్యములఁ గావించుటకు నిద్ర
|
| 13 |
+
సమర్థమైనది. మృత్యువుతో నిద్ర కున్న సహజ బాంధవ్యమును గుర్తించిన యొక
|
| 14 |
+
భావుకుఁడు 'నిద్ర యొక జాతి మృత్యువు; నిరయము దాని జన్మభూమి; అయ్యు
|
| 15 |
+
నరకము దీనిని దఱిమి వేసినది స్వర్గము చేరనీయలేదు' అని పలికినాఁడు. దీనిని
|
| 16 |
+
బట్టి నిద్రకు నివాసభూమి 'త్రిశంకు స్వర్గ' మన్నమాట!
|
| 17 |
+
|
| 18 |
+
నిద్రామృత్యువుల కొక ధర్మసామ్యమున్నది. ఇవి రెండు నావహించి నపు డాత్మకు
|
| 19 |
+
స్వాతంత్య్రము లభించును. రెంటియందును శరీరి విముక్తుఁడగును. ఈ కారణముననే
|
| 20 |
+
పెద్దలు నిద్రామృత్యువులఁ గూర్చిన నిండు విజ్ఞానము కలవాఁడు పరమ వివేకియని
|
| 21 |
+
పలికినారు.
|
| 22 |
+
|
| 23 |
+
‘మన జన్మమే యొక నిద్ర; ఒక విస్మృతి' జన్మయను నిద్రలో నాత్మ నిజదేశమును
|
| 24 |
+
వదలి సుదూరము వచ్చుచున్నాఁ'డని యాంగ్ల తాత్విక మహాకవి వర్డ్సువర్తు
|
| 25 |
+
ప్రవచించినాఁడు. ఇట్లు వచ్చిన ప్రాణి విజ్ఞానియును గాఁడు; అజ్ఞానియును గాఁడు.
|
| 26 |
+
సర్వకాలములందతనికిఁ తన నిజస్వరూపమును గుర్తించుటకుఁ దగు నవకాశము
|
| 27 |
+
లున్నవి. అన నతనికిఁ బ్రత్యభిజ్ఞావకాశమున్న దన్నమాట!
|
| 28 |
+
|
| 29 |
+
'నిద్ర తంద్ర భయము క్రోధ మాలస్యము దీర్ఘసూత్రతల వలన లక్ష్మి
|
| 30 |
+
సంప్రాప్తింప' దని యార్యోక్తి. దీనినిబట్టి దురదృష్ట హేతువులలో నిద్ర యొకటగు
|
| 31 |
+
చున్నది. అంత మాత్రమున నిద్ర దరిద్ర హేతువని నిర్ణయింప వీలుకాదు; పనికిరాదని
|
| 32 |
+
పరిహరింపఁ బొసఁగదు. నిద్ర ప్రాణాధారమనియు నది లేకున్న నారోగ్య వినాశన
|
| 33 |
+
మగుననియు నార్యక్షేమేశ్వరుని యభిప్రాయము. "నిద్ర మనోమాలిన్యమును క్షాళన
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0062.txt
ADDED
|
@@ -0,0 +1,33 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
ప్రదర్శనాలయమునఁ బ్రదర్శింప నయిదు సంవత్సరములు గడచిన పిమ్మట నందలి
|
| 2 |
+
నత్త మేల్కొని నడువసాగి యధికారులు నాశ్చర్యచకితుల నొనర్చిన ట్లా మ్యూజియము
|
| 3 |
+
చరిత్ర వలనఁ దెలియుచున్నది.
|
| 4 |
+
|
| 5 |
+
ఈ రీతిగఁ గ్రిమికీటకములు జంతువులు నిద్రవోవుటకుఁ గారణ మాయా
|
| 6 |
+
కాలముల వాని కాహారములైయుండు క్రిమికీటకములు నిద్రించుటయే. శీతకాలపు
|
| 7 |
+
బాధను దొలగించుకొనుటకుఁ దనసంతానమగు వీనికిఁ దల్లియగు ప్రకృతి దీర్ఘనిద్రను
|
| 8 |
+
బ్రసాదించినది. ఆకాశ వీథుల నెగసి యుష్ణమును బడయఁగల పక్షులు, తేనియను
|
| 9 |
+
సేకరించుకొని రెక్కలాడించుచుఁ బట్టునకు 'వెట్టతనము గల్పింపఁగల తేనెటీఁగలు
|
| 10 |
+
నిట్టి దీర్ఘనిద్ర నొందవు.
|
| 11 |
+
|
| 12 |
+
మానవ జీవితచరిత్రయందు నిద్రకు సంబంధించిన విచిత్రాంశములు కొన్ని
|
| 13 |
+
కన్పించుచున్నవి. జగజ్జేత అలెగ్జాండరు పర్షియా చక్రవర్తి డెరయస్ మీఁదఁ
|
| 14 |
+
బ్రచండయుద్ధమును బ్రకటించునాఁడు సుదీర్ఘమగు నిద్ర నొందినాఁడఁట! ఒకానొక
|
| 15 |
+
యత్యవసరమైన రాచకార్యమునకై యతనిని మేల్కొల్ప సేనా నాయకుఁడగు
|
| 16 |
+
'పర్నీనియస్' ఎంతయో యత్నించి విఫలమైనట్లు గ్రీసు దేశచరిత్రల వలన
|
| 17 |
+
వ్యక్తమగుచున్నది.
|
| 18 |
+
|
| 19 |
+
ఆత్మహత్యఁ జేసికొన నిశ్చయించుకొనిననాఁడు కేటో చక్రవర్తికి దీర్ఘనిద్ర
|
| 20 |
+
పట్టినదట
|
| 21 |
+
|
| 22 |
+
సెక్టస్ పాపేను జయింప వలసిన సమయము. సముద్ర యుద్ధ మతి
|
| 23 |
+
తీవ్రతరముగ సాగుచున్నది. తాను నాయకత్వము వహింపవలయును. లేకున్న
|
| 24 |
+
సమస్తమును దారుమారై తీవ్రతమ ప్రమాదము సంభవించును. అట్టిస్థితిలో ‘అగస్టస్
|
| 25 |
+
సీజరు' మృత్యువుతోఁ దుల్యమైన నిద్ర నొందినాఁడు. ధైర్యమొనర్చి తానే
|
| 26 |
+
సర్వసేనాధిపత్యమును స్వీకరించి, శత్రువుల హతమార్చి విజయముతోఁ దిరిగి వచ్చిన
|
| 27 |
+
మహాసేనాని ‘ఎగ్రిపా’, బహుకాలము విజయవార్తను దెల్పుటకై యీ సీజరు మేల్కొను
|
| 28 |
+
నంతవఱకు వేఁచియుండవలసి వచ్చినది.
|
| 29 |
+
|
| 30 |
+
దీర్ఘ నిద్రయం దుండియే కొందఱితరులు జాగ్రదవస్థలోఁ జేయఁగల
|
| 31 |
+
కార్యకలాపములను నిర్వర్తింపఁ గలరు. జేన్ రైడర్ - అను పదునైదేండ్ల కన్యక
|
| 32 |
+
నిద్రావస్థలో నెన్నియో గ్రంథములఁ జదివినది. ఆమెకు జాగ్రదవస్థయందును నందలి
|
| 33 |
+
విశేషము లన్నియు జ్ఞప్తియుండుట విశేషము. ఆమె నిదురింప నారంభింప నదే
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0063.txt
ADDED
|
@@ -0,0 +1,32 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
పనిగ నిద్రించునఁట! ఆమెను బరిశీలింప బంధువులు ముసాచ్యుసెట్సులోని ఓల్డెన్
|
| 2 |
+
వైద్య శాస్త్రజ్ఞున కొప్పజెప్పిరి. అతఁడు బహువిధ పరిశోధనలు జరిపి 'యిదమిత్థ
|
| 3 |
+
మని నిర్ణయింప లేకున్నాను. నా మతి చెడుచున్న' దని నివేదించినాఁడు. అమెరికా
|
| 4 |
+
దేశమునందలి యొక సుప్రసిద్ధ రచయిత నిద్రాసమయముననే నిజరచనల 'టైపు’
|
| 5 |
+
జేసెడివాఁడు. జాగ్రదవస్థనొందిన పిమ్మట నవి తన రచనలేనా యను
|
| 6 |
+
ననుమానమతనికిఁ గలుగుచుండెడి దఁట! 'ఇట్టి దీర్ఘ నిద్రావస్థలందుఁ దాను బూర్వము
|
| 7 |
+
భావించిన రూపకము లందలి పాత్రలు కన్పించి సంభాషణమును సాగింపఁ దన
|
| 8 |
+
రచనలు సాగుచున్నవని చెప్పు కవి యున్నాఁడని' స్వాన్సు విశ్వవిద్యాలయ తత్త్వశాస్త్రో
|
| 9 |
+
పాధ్యాయుఁడు 'హీత్' ఒక విశిష్టోపన్యాసమునఁ బేర్కొనినాఁడు. నిదురించుచుఁ గొన్ని
|
| 10 |
+
గృహకృత్యములొనర్చుట ప్రపంచమునందన్ని దేశములందును సర్వసామాన్యమైన
|
| 11 |
+
నిద్రావైచిత్య్రము!
|
| 12 |
+
|
| 13 |
+
నిద్రాసమయ పరిమితిని గూర్చి లోకమున భిన్నాభిప్రాయములున్నవి.
|
| 14 |
+
నెపోలియను చక్రవర్తి 'పురుషుల కారు గంటలు, స్త్రీల కేడుగంటలు, బుద్ధిహీనుల
|
| 15 |
+
కెనిమిదిగంటలు నిద్ర చాలు' నని పల్కినటులఁ దెలియుచున్నది. కాని యా చక్రవర్తి
|
| 16 |
+
వాటర్లూ యుద్ధానంతరము హెలీనాద్వీపమున దినమునకుఁ తొమ్మిది గంటలు
|
| 17 |
+
దీర్ఘనిద్ర ననుభవించినట్లు జీవిత చరిత్ర చెప్పుచున్నది.బిస్మార్కు, హంబోల్టు, చర్చిలు
|
| 18 |
+
వంటి ప్రసిద్ధ రాజకీయ వేత్తలు నాల్గుగంటల కంటే నిద్రవోనివారు కన్పించుచున్నారు.
|
| 19 |
+
'నలుబది యెనిమిది గంటలు తీక్ష్ణమైన కృషి యొనర్చిన పిమ్మట నెనిమిది గంటల
|
| 20 |
+
నిద్ర చాలు' నని శాస్త్రజ్ఞుఁడు ఎడిసన్ మహాశయుఁ డభిప్రాయపడినాఁడు.
|
| 21 |
+
|
| 22 |
+
'ప్రాణికోటికి నిద్ర యత్యవసరము కా' దని నిరూపింపఁగల ననెడు
|
| 23 |
+
స్థిరనిశ్చయముతో హార్వర్డు పరిశోధనాలయమునఁ బ్రవేశించిన యొక యువకుఁడు
|
| 24 |
+
రెండు వందల ముప్పది యొక్క గంటలు మేల్కొనిన తరువాత నిఁక దానిని గొనసాగింప
|
| 25 |
+
లేక బాధపడి యట్టె విరమించినాడు. మిగిలిన జీవితమున నతఁ డున్మత్తుఁడైనాఁడు.
|
| 26 |
+
|
| 27 |
+
నిద్రాకాలనిర్ణయము దేశకాలవయోనుకూలము లని నిశ్చయింప వచ్చును.
|
| 28 |
+
పసిపిల్లలకుఁ బదియు నారు గంటలు నిద్ర యత్యవసరము. మహాకవి కాళిదాసు
|
| 29 |
+
'పద్మినీజాతి స్త్రీ జాము కాలము కంటే మించి నిద్రింప' దని పలికియున్నాఁడు.
|
| 30 |
+
అల్పకాలనిద్ర నారోగ్య శాస్త్రవేత్త లంగీకరింపరు. నిద్రాసమయము నెనిమిది
|
| 31 |
+
గంటలనుండి యారుగంటలకుఁ దగ్గించుకొనుటచే 'కలొరిక్' శక్తిని బాత��కపాళ్ళు
|
| 32 |
+
విస్తారముగ నుపయోగింపవలసి యుండునని వారి నిర్ణయము. నిద్ర నీ రీతిఁ
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0064.txt
ADDED
|
@@ -0,0 +1,33 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
దగ్గించుకొనుట వలనఁ జర్మవ్యాధులు, శరీర దౌర్బల్యము, మనోమాంద్యము కలుగునని
|
| 2 |
+
వారందురు.
|
| 3 |
+
|
| 4 |
+
పరిశోధింపఁ దగిన యంశములలో నిద్ర నతి ప్రముఖమైన దానినిగ శాస్త్రజ్ఞులు
|
| 5 |
+
పరిగణించినారు. వారు కడుశ్రద్ధతోఁ బరిశోధనలు సాగించుచున్నారు. నిద్రను గూర్చిన
|
| 6 |
+
యే యొక యంశమునైన 'నిది నిర్ణయ' మని చెప్ప వీలుకల్గక పోవుటచేఁ
|
| 7 |
+
జమత్కారగర్భితముగ నొక శాస్త్రజ్ఞుఁడు "నిద్రనుగూర్చిన మా పరిశోధనల సారాంశము
|
| 8 |
+
రాత్రి శయనించుట, యుదయము మేల్కొనుట" యని యభిప్రాయ మిచ్చినాఁడు.
|
| 9 |
+
|
| 10 |
+
నెబ్రాస్కా విశ్వవిద్యాలయమునందలి వైద్యకళాశాలలో, జహార్ అను
|
| 11 |
+
నాచార్యుఁడు నిద్రను గూర్చి దీర్ఘ పరిశోధన లొనర్చి కొన్ని విశేషాంశములఁ బ్రకటించి
|
| 12 |
+
యున్నాఁడు. ఆధునిక ప్రపంచమున నిద్ర పట్టనివారు విశేషముగ నున్నారు. వారు
|
| 13 |
+
రెండు తెగలవారు. శాంతియుతమైన నిద్ర కావలయునని కోరుకొనుచు
|
| 14 |
+
నిద్రాసమయమును దప్పించుకొని పిమ్మట బాధపడువారు మొదటి తెగవారు.
|
| 15 |
+
వ్యాధిగ్రస్తులు రెండవ తెగవారు. వయసు మరలినవారికి నిద్రపట్టక పోవుటకుఁ
|
| 16 |
+
గారణము చిన్నతనమున వారిని తల్లిదండ్రులు బలవంతముగ నిద్రపుచ్చుటయే యని
|
| 17 |
+
యొక యభిప్రాయము. నిద్ర కొఱకను నుద్దేశముతో మనస్సును గాని, శరీరమును
|
| 18 |
+
గాని శిక్షింపయత్నించుట మంచిది కాదు.
|
| 19 |
+
|
| 20 |
+
"జంతువులు త్వరితముగ మృతినొందుటకుఁ గ్రమమైన నిద్ర లేకుండుటయే
|
| 21 |
+
గారణము. కళాశాల విద్యార్థులు ముప్పది యెనిమిది మారులు, మధ్యమ వయస్సు
|
| 22 |
+
గలవా రేబది మూఁడు మాఱులు నిద్రలోఁ గదిలెదరు" - ఇవి జహార్ అను శాస్త్రజ్ఞుని
|
| 23 |
+
పరిశోధనమువలనఁ దేలిన కొన్ని యంశములు.
|
| 24 |
+
|
| 25 |
+
"శయ్యమీఁదఁ జేరి సున్నితముగ సుఖనిద్ర నొందుటకంటె నదృష్టవంతులకు
|
| 26 |
+
వేడొక శుభలక్షణము లే' దాని యొక తాత్వికుఁడనినాఁడు. అలసిపోయిన
|
| 27 |
+
యవయవములు కష్టపడుట కిచ్చగింప నపుడు క్రమముగా విశ్రాంతినొందు యత్న
|
| 28 |
+
మారంభించును. తొలుదొల్త ఘ్రాణశక్తి, తరువాత రసన, పిమ్మట క్రమముగ
|
| 29 |
+
స్పర్శజ్ఞానము, శబ్దగ్రహణశక్తి తప్పిన పిమ్మట మనస్సు వ్యవహరించుట మానివైచును.
|
| 30 |
+
జోషువా రోసెట్ అను విజ్ఞాని "నిద్రారంభదశలో నిత్య జీవితము నందలి కొన్ని
|
| 31 |
+
విశేషాంశములు జ్ఞప్తికి వచ్చుట, పిమ్మటఁ గొన్ని మధురములైన కోర్కెలు జన్మించుట,
|
| 32 |
+
యటుతరువాత సుఖాభిలాషలు కలుగుట, భ్రమలు కొన్ని పుట్టి తదుపరి నిదురమంపు,
|
| 33 |
+
స్వప్నావస్థ యేర్పడు' నని నిరూపించినాఁడు.
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0065.txt
ADDED
|
@@ -0,0 +1,33 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
అందఱకును నిద్ర కలుగు కాలము సమము కాదంట! కళాశాల విద్యార్థులకిరువది
|
| 2 |
+
యెనిమిది నిమిషములు, నడివయసున నున్నవారి కిరువదియైదు నిమిషములు కాలము
|
| 3 |
+
కావలయు నఁట! స్త్రీలకుఁ బదునైదు నిమిషముల కాలము చాలునఁట!
|
| 4 |
+
|
| 5 |
+
నిద్రలోఁ గదలి నంత మాత్రమునఁ గలఁత నిదుర కాఁజాలదు. పసిబిడ్డ వలె
|
| 6 |
+
నిద్ర నోవుట పరమప్రయోజనకారి. 'మొద్దువలె నిద్రించినవాఁ డెద్దు వలెఁ
|
| 7 |
+
బనియొనర్చు' నను సామెత యున్నది.
|
| 8 |
+
|
| 9 |
+
ఏకాదశి సంపూర్ణ జాగరము వ్రతవిధానములందును శాసింపఁ బడినది.
|
| 10 |
+
దశమి యేకభుక్తము; ద్వాదశి పూర్ణ భోజనము. 'దివానిద్ర యోగభంజక' మని
|
| 11 |
+
యోగకుండ ల్యుపనిషత్తు పలుకుచున్నది. పూర్వరాత్రి నిద్ర సౌందర్యసంవర్ధక
|
| 12 |
+
మని పాశ్చాత్యులలో నొక ప్రథ యున్నది.
|
| 13 |
+
|
| 14 |
+
పూర్వము టర్కీ దేశములలోని అంకారా విశ్వవిద్యాలయ విద్యార్థిలోకము పగటి
|
| 15 |
+
నిద్దురను గూర్చి కొన్ని పరిశోధనలు సాగించినది. వారి పరిశోధనల ఫలితాంశములు
|
| 16 |
+
రాత్రి నిద్ర మానవునకుఁ బనికిరాదనియు, దీర్ఘ నిద్ర నిష్ప్రయోజనకరమైనదనియును,
|
| 17 |
+
ప్రతి వ్యక్తియును బగ లొకమాఱు మూఁడు గంటలు మఱల నొకమాఱు రెండుగంటలు
|
| 18 |
+
నిద్రించుట కలవాటు పడిన, మిగిలిన కాలమంతయు శ్రమ యనుకొనకుండఁ బనిఁ
|
| 19 |
+
జేయవచ్చునని సిద్ధాంతీకరించినారు. వారి పరిశోధనలవలన రాత్రి పదియును రెండు
|
| 20 |
+
గంటలు నిదురించు వారి మించి పైరీతిగ నిదురింప నలవాటు పడినవారు పని
|
| 21 |
+
చేయవచ్చుననియు, వారలకే విశేష విశ్రాంతి చేకూరునట్లును వెల్లడియైనది.
|
| 22 |
+
పరీక్షాఫలితములందును పగటి నిద్ర నొందువారే ప్రథమగణ్యు లైనారట. వీరి
|
| 23 |
+
పరిశోధనలయందలి సత్యాసత్యము లెట్లున్నను వీరి మార్గము వైద్యశాస్త్రమునకు,
|
| 24 |
+
సామాన్య ప్రకృతికి విరుద్ధమగుటచే నీ విద్యార్థులకు 'ఉలూక' ములను నామము
|
| 25 |
+
కొంతకాలము ప్రపంచమున విశేషప్రాచుర్యము వహించినది.
|
| 26 |
+
|
| 27 |
+
“నిద్ర సుఖ మెఱుఁగదు, ఆఁకలి రుచి నెఱుఁగదు" ఈ సామెత యాంధ్రభూమి
|
| 28 |
+
నతి ప్రసిద్ధ మైనది. అయినను సుఖనిద్రకును సుందరమగు శయ్యకును సన్నిహితమగు
|
| 29 |
+
సంబంధమున్నది. శయ్యప్రాముఖ్యమును గుర్తించిన నెపోలియను చక్రవర్తి 'జగత్తు
|
| 30 |
+
నందలి సమస్త సింహాసనము లిచ్చినఁ బ్రతిగ నా శయ్యను విడువలే' నని పలికినాఁడు.
|
| 31 |
+
మానవుఁడు శయ్యయందు బెరుగుచున్నాఁడు శయ్యయందు మరణించు చున్నాఁడు.
|
| 32 |
+
దేశకాల పాత్రముల ననుసరించి శయ్యావిభేదము లెట్లు మార్పునొందినను శయ్య
|
| 33 |
+
తప్పదు. అర్జునుని గౌరవానురాగములఁ జూఱఁగొనిన భీష్ములవారి కుత్క్రాంతి వేళ
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0072.txt
ADDED
|
@@ -0,0 +1,33 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
ప్రశస్తమైనది. శాశ్వతమైనది. జంగమ రూపమున సాహిత్యము కృతిభర్తకీర్తిని
|
| 2 |
+
బహుముఖముల వ్యాపింపఁ జేయుటయే కాక సురుచిర సుస్థితిని జేకూర్చును. ఈ
|
| 3 |
+
కారణము వలననే కీర్తి కాములకు సాహిత్యకు లాత్మబంధువు లగుచుందురు.
|
| 4 |
+
సాహిత్యకు లందు వ్యాకరణజ్ఞుని బితరుని వలెను, తార్కికుని భ్రాతవలెను, వేదజ్ఞుని
|
| 5 |
+
చండాలుని వలెను జూచుచుఁ గవిత యలంకరణజ్ఞుఁడగుటచేఁ గవిని వరించినది.
|
| 6 |
+
కవికి వాఙ్మయకళా వైదగ్ధ్యము వెన్నతోఁ బెట్టిన విద్య.
|
| 7 |
+
|
| 8 |
+
పూర్వ రాజన్యులలోఁ గొంద రీ రహస్యము నెఱింగిన వారగుటచే నుచితజ్ఞులై
|
| 9 |
+
విశేషముగఁ గవి సంగ్రహణ మొనర్చిరి. ఎంతటి శ్రమకైన నోర్చి కవుల సంగ్ర
|
| 10 |
+
హించుటకు మూలకారణము స్తోత్రపాఠాభిమానమే యని మా మతము, కవులు వారి
|
| 11 |
+
పోషకునికిఁ బుష్టిగల కీర్తి శరీరమును గల్పించి యుగ యుగముల ఖ్యాతిఁ గల్గించినారు.
|
| 12 |
+
|
| 13 |
+
సమర్ధత గల చక్రవర్తుల కిట్టి యపూర్వ ప్రాభవమును జేకూర్చుట సహజమును
|
| 14 |
+
సమంజసమును నైయున్నది. అయ్యుఁగొందఱు కవులు తాము 'సత్యరథములకుఁ
|
| 15 |
+
గట్టిన యశ్వము'లను శ్రుతిప్రమాణముల మఱచి, తమ పోషకులకుఁ గేవలకీర్తి కాయ
|
| 16 |
+
నిర్మాతలై వారి తుచ్ఛ శృంగారాభిమానమునకుఁ దోహదకారులగుచు తమ యనంత
|
| 17 |
+
వాగ్వైచిత్రములతో లోకమును మభ్య పెట్టుచు వచ్చినారు. దీనిని గమనించి యుత్తమ
|
| 18 |
+
ద్రష్ట లొకానొక కాలమున 'కావ్యాలాపాంశ్చ వర్జయే'త్తని యనుశాసింపవలసివచ్చినది.
|
| 19 |
+
|
| 20 |
+
ఉత్తమశ్రేణికిఁ జెందిన కొందఱు మహాకవులు తాము స్తోత్రపాఠమొనర్చుట
|
| 21 |
+
కంగీకరింపక మడిదున్నుకొని బ్రతుకఁదలఁచిరి; చారుచరిత్ర, ధర్మచరిత్ర లేని
|
| 22 |
+
రాజశబ్దవాచ్యులపై నేహ్యభావమును బ్రకటించిరి. అట్టివారిలోఁ బ్రముఖుఁడగు నొక
|
| 23 |
+
కవీంద్రుఁ డొక సందర్భమున రాజదర్శన మొనర్చి తిరస్కృతుఁడైనపుడు
|
| 24 |
+
'బండిగురివింద పూల పేరులతోఁ దృప్తినందు కిరాతకాంతలకు స్వర్ణ కారునితోఁ
|
| 25 |
+
బనిలేనట్లు సాధుచరిత్ర లేని రాజులకుఁ గవులతోఁ బని యేమున్నదని ప్రాగల్భ్యము
|
| 26 |
+
మెఱయఁ బలికివచ్చినాఁడు.
|
| 27 |
+
|
| 28 |
+
కొందఱు ముష్టికవులు 'ముష్టికి నష్టి' లేదని నమ్మి యపాత్రుల కడకైన నేఁగి
|
| 29 |
+
యాశుకవితఁజెప్పి యింతయో యంతయో పుచ్చుకొనకపోలేదు. కవి ప్రాశస్త్యమును
|
| 30 |
+
గుర్తింపలేని వారు వీరిని వందిమాగధ వైతాళికాది గణమునఁ బరిగణించుట
|
| 31 |
+
పరిపాటియైనది. ఇట్టి భట్టుకవులలో నుద్దండులును గొందఱున్నారు. అల్పదేశ
|
| 32 |
+
పాలకుడైనను దానొక త్రిలోకాధిపతి నను భావముతోఁ బ్రియఁగూడి రాజ్యమేలు
|
| 33 |
+
నొక యేకాక్షి ప్రభువును దర్శించి ��ుష్కప్రియముల శూన్యహస్తములని
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0073.txt
ADDED
|
@@ -0,0 +1,13 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
గ్రహించువాఁడగుటచే 'అన్నాతిఁ గూడ హరుఁడవు, అన్నాతిం గూడకున్న నసుర గురుండౌ, దన్నా! తిరుమలరాయా!, కన్నొక్కటి లేదుగాని కంతుఁడవయ్యా!' యని యొకడు స్తోత్రపాఠమును విసిరినాఁడు. అంతటితో నా రాజు తబ్బిబ్బై బహుళ పారితోషికమును దుశ్శాలువల నిచ్చి పంపించినాఁడు.
|
| 2 |
+
|
| 3 |
+
స్తోత్రపాఠకుఁడు కొన్ని వేళలందు స్తుతించెడివారి యుత్కర్షను నిరూపించుటకుఁ దన్నల్పునిగ జీత్రించుకొనును. చౌడప్ప వంటి వాచాప్రాగల్భ్యముగల భట్టుకవి
|
| 4 |
+
తంజావూరు రఘునాథ రాయలవారి యొద్ద 'నేరుతు నని మాటాడఁగ, వారిజభవు నంత వాని వశమా తంజా, వూరి రఘునాథ రాయలుగా, రెఱుఁగఁగఁ గుందవరపుకవి చౌడప్పా!' యని తన్నుద్దేశించి చెప్పుకొనినాఁడు.
|
| 5 |
+
|
| 6 |
+
అంతవాడినైన 'నేనే నిన్ను స్తుతించుచున్నాను నీవెంత వాఁడవో చూచుకొ'మ్మనట్లు కొన్ని సందర్భముల స్తోత్రపాఠకులు తమ యాధిక్యమును వర్ణించుటయు సహజము. ఇట్టివారు స్తోత్రపాఠ కులపతులు.
|
| 7 |
+
|
| 8 |
+
'ఉదయం బస్తనగంబు సేతువు హిమవ్యూహంబునుం జుట్టిరా విదితంబైన మహిన్మహాంధ్ర కవితా విద్యాబలప్రౌఢ నీకెదు రేరీ?” యని సామాన్యస్తోత్ర పాఠకులు తమ్ముఁగూర్చి చెప్పికొనుట పరిపాటి. ఒక సామాన్యమైన సామంతుని పట్టుకొని మహాకవి తిక్కనవలె 'ఎవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడఁగు... నెవ్వాని గుణలత లేడు వారాశుల కడపటి కొండపైఁ గలయఁ బ్రాకు' -
|
| 9 |
+
ఇత్యాది స్తోత్రపాఠ పరంపరలఁ గురిపించుటయును లోక సహజము. ఈ యసత్యస్తుతులు ప్రాఁత కాలపునాఁటి వని పరిహసింప వీలులేదు; ఈ శతాబ్ది యందును వినిపించుచున్నవి.
|
| 10 |
+
|
| 11 |
+
అట్టి స్థితిలో గీర్తికాములైన పూర్వరాజన్యులు కొంద రప్రశస్తము లయ్యు నగ్నములైన యసత్యములు కాని యిట్టిస్తుతులకు మురిసి యే సంక్రాంతి పుణ్యకాలముననో పెద్దల పుణ్యమునకని పేరు పెట్టి సర్వబాధా పరిహారముగ దేవమాతృకలు పండు కేదార ఖండముల స్తుతి పాఠకులకు దానమిచ్చిరని యీనాఁడు మనము బాధపడుట యెందులకు?
|
| 12 |
+
|
| 13 |
+
స్తుతి పాఠకులు పరస్తుతి పరాయణులు కాని పరదూషకులు కాదు. అయినను పరవంచులు. వీరివలన వినువారు చెడిపోవుట నిస్సంశయము. వీరు లోకమున స్తుతిగీతా ప్రియత్వమును బెంపొందితురు. వీరి స్తోత్రములకుఁ దగినవార
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0074.txt
ADDED
|
@@ -0,0 +1,33 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
భావము నిగూఢముగనో, యీషత్సృష్టముగనొ వినువారియందుఁ బొడకట్టును. లేకున్న
|
| 2 |
+
వీరిస్తుతుల వినుటయెట్లు? ఇది యహంకృతి యైనను నాత్మవిశ్వాసమైనను దీనికి
|
| 3 |
+
మూలకారకులు స్తుతిపాఠకులు. వ్యక్తిద్రోహులైన వీరు రాజద్రోహులు! రాష్ట్రద్రోహులు!
|
| 4 |
+
జాతిద్రోహులు! ప్రపంచ ద్రోహులు! విశ్వ ద్రోహులు!!! అంగవ్రాతములోఁ
|
| 5 |
+
జికిత్సకుఁడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయుక్రియ'
|
| 6 |
+
సంఘమునందొకరైన వేరుపురుఁగులగు వీరిని పట్టి శిక్ష చెప్పించుట 'సంఘనీతి’.
|
| 7 |
+
|
| 8 |
+
స్తోత్రపాఠము చేయువారి, నది విని నిజమని భ్రమించువారి నిరువురఁ జెడగొట్టు
|
| 9 |
+
శక్తి దానియందున్న' దాని యొక తాత్త్విక మహాశయుని సుసత్య ప్రవచనము. వస్తుతః
|
| 10 |
+
స్తుతి పరాయణత్వము లేకున్న నది గల్పించి పోషించును. ఆత్మవిశ్వాస మణుమాత్రమైన
|
| 11 |
+
లేక నణగారిపోవు వారి కది మహాంజనమై వర్తిల్లుటయును సత్యమగుటచేఁ
|
| 12 |
+
బండితాగ్రగణ్యుఁడు జాన్సను 'పొగడ్త పొందుటయును నొకరీతి శ్రేయస్కరమని
|
| 13 |
+
ప్రవచించినాఁడు. 'లోక మీ రీతిగ నన్నుఁ గూర్చి భావించుచున్నది కాఁబోలు. నేనీ
|
| 14 |
+
ప్రథకుఁదగిన శక్తిసామర్థ్యములు సంపాదించెదను గాక' యని నిశ్చయించుకొని
|
| 15 |
+
కొందఱు తమలో నిద్రించుచున్న శక్తిని మేల్కొల్పుటకు శతవిధ యత్నము లొనర్ప
|
| 16 |
+
స్తోత్రపాఠము సాయపడవచ్చు నన్నమాట!
|
| 17 |
+
|
| 18 |
+
ఆత్మబంధువుల మధ్య స్తుతిపాఠములు వినిపించిన లోకము సహింపదు.
|
| 19 |
+
అందెంతటి సత్యమున్నను బ్రయోజనము లేదు. ఇట్టిస్తుతులకు మూలకారణముల
|
| 20 |
+
వెదకుట దాని లక్షణము. కుమారుఁడు తండ్రి నే ప్రతిభావిశేషమునకో
|
| 21 |
+
హృదయపూర్వకముగ నమ్మి స్తుతించిన స్వార్జితమైన సంపదను దండ్రి యన్యాక్రాంత
|
| 22 |
+
మొనర్చునేమోయను భీతి యిందులకుఁ గారణమని లోకము శంకించును. పితరులే
|
| 23 |
+
పుత్రునిఁ బొగడిన నివి మేనకోడలిని వివాహమాడఁజేయ బన్నుచున్న వాగురు లని
|
| 24 |
+
యతని మది నిశ్చయించును.
|
| 25 |
+
|
| 26 |
+
అల్లుఁడు మామలమధ్య పరస్పరోత్కర్ష కనుపించిన గొడుకులతోఁ బాటు
|
| 27 |
+
పాలుపంచఁడను భయమునో, కుమార్తె కురూపియగుట నల్లుఁడు పరిత్యజించు నను
|
| 28 |
+
భయమునో కల్పించి ఓడిపస్ కాంప్లెక్సు'ను దలఁ దన్నఁగల యొక 'శ్వశ్రుజామాతా
|
| 29 |
+
'కాంప్లెక్సు'ను సృష్టించుటకు వెనుదీయని మానసిక శాస్త్రవేత్తలు మానవలోకమున
|
| 30 |
+
నుండకపోరు.
|
| 31 |
+
|
| 32 |
+
భార్యాభర్తల మధ్య స్తుతిపాఠ మంతకంటే నతి ప్రమాదకరమైనది. 'అన్యోన్యము
|
| 33 |
+
ప్రేమించుకొనినవారు పొగడుకొనరు. సామాన్యస్త్రీ భర్తను పొగడవలసిన యగత్యము
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0075.txt
ADDED
|
@@ -0,0 +1,32 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
లేదనునవి యన్య దేశీయ జిజ్ఞాసువులు చెప్పిన సూక్తి విశేషములు. ఇట్టి
|
| 2 |
+
యభిప్రాయముల నాధారముగఁ గొని మిథ్యాభిమాన ప్రకటన మనియో, శీలసంబంధ
|
| 3 |
+
మగు భీతియనియో సిద్ధాంతీకరింప వచ్చును.
|
| 4 |
+
|
| 5 |
+
సామితేయులు కొందఱు కొన్ని సందర్భముల సభావేదికలఁ నన్యోన్య గుణకీర్తన
|
| 6 |
+
మొనర్చుకొనినచో వారిని యజ్ఞాహ్వానితులైన దేవతలవలె నింద్రుఁడగ్ని, నగ్ని వరుణుని,
|
| 7 |
+
వరుణుడు ధర్ముని, ధర్ముఁడు వాయువును హవిర్భాగములఁ గైకొన స్తుతిపాఠము
|
| 8 |
+
లొనర్చుకొనుచుఁ బరస్పర మాహ్వానించుకొను రీతిగఁ బ్రవర్తించు నొక స్తుతి పాఠక
|
| 9 |
+
గణముగఁ బరిగణింపని వ్యక్తులు, సమాజములు లోకమున నరుదు కాదు. అట్టి
|
| 10 |
+
యవసరముల స్తుతి తప్పదు జన మనుకొనుటయుఁ దప్పదు.
|
| 11 |
+
|
| 12 |
+
కొందఱాత్మ బంధువుల కంటెను, కొందఱు సామితేయుల కంటెను, బ్రేయసీ
|
| 13 |
+
ప్రియులలో స్తోత్ర పాఠములు విశేషముగ విన్పించును. 'తావలచినది రంభ
|
| 14 |
+
తామునిఁగినది గంగ.' కవి, ఉన్మత్తుడు, ప్రియుఁడు నేకకోటిలోని వారని మహాకవి
|
| 15 |
+
షేక్స్పియరు పలుకనే పలికినాఁడు. ఇట్టి స్థితిలో వారి స్తోత్రపాఠము లెట్లుండునో
|
| 16 |
+
యూహించుట కష్టముకాదు. ప్రియాప్రియుల మధ్య నడచు స్తోత్రపాఠములకు మధ్య
|
| 17 |
+
'బ్రణయంపు మేలిముసుఁ’ గొకటి కన్పించును. ప్రేమికుఁడు ప్రియనుగూర్చి నీవు
|
| 18 |
+
గంధర్వలోక మధుర సుషమా సుధాగాన మంజురేఖ' వనినను, బ్రియురాలు
|
| 19 |
+
ప్రియునిగూర్చి నీవు కంతుఁడవో, జయంతుఁడవొ యనినను, ప్రియ పాదచిహ్న
|
| 20 |
+
ములున్న స్థలముల మఱియొకరు ప్రయాగ క్షేత్రములుగ విధురభక్తి భావమున
|
| 21 |
+
భావించినను వీని నుత్తమ కవితోక్తుల క్రింద మన్నించి వారి యనురాగమును
|
| 22 |
+
ధర్మేతరమైనను నార్ద్ర హృదయముతో లోకము పరిగణించుచున్నది.
|
| 23 |
+
|
| 24 |
+
అర్థమునకు స్తుతికి నవినాభావసంబంధము. '....... అతఁడు మహాకులీనుఁ
|
| 25 |
+
డాతండు కళావిదుండతఁడు ధన్యుఁ డతండు మనోజ్ఞమూర్తి యెవ్వండు భవత్కృ
|
| 26 |
+
పాకలన వైభవలక్ష్మికిఁ బాత్రుఁడిందిరా!' యని కవి చెప్పనే చెప్పినాఁడు. ఇట్టి
|
| 27 |
+
ధనవంతునిపై స్తోత్రపాఠపుష్పవృష్టి గురియుటలో సందేహ మేమున్నది? ఇతర
|
| 28 |
+
విద్యావిశేషములులేని కేవలధనికుఁడు సుతికిమించి స్తుతించెడు
|
| 29 |
+
స్తోత్రపాఠకునిఁజేరరానీయఁడు. ఇందుకుఁ గారణము స్తోత్రపాఠముపై నభిమానము
|
| 30 |
+
లేక కాదు; 'అతి సర్వత్ర వర్జయే' తను నార్యోక్తిపై నభిమానమును కాదు. మఱియొక
|
| 31 |
+
'కొంటె కోణంగి' స్తోత్రపాఠకుఁడై వచ్చి యిచ్చిన దానితోఁ దృప్తినొందక తన 'బ్రతుకు
|
| 32 |
+
బండారము’ను బయటపెట్టు నను భయమిందుకు మూలమని విబుధుల యభ్యూహ��ు.
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0099.txt
ADDED
|
@@ -0,0 +1,48 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
27. రెడ్ ఇండియనులు - కొలంబస్ ఇండియా యను భ్రాంతితోఁ గనుగొన్న
|
| 2 |
+
యమెరికా ద్వీపములందలి యాదిమనివాసులు
|
| 3 |
+
|
| 4 |
+
28. షింటోలు - జపానీయులు 'Shintoism is the pure land school of Japan in its
|
| 5 |
+
extreme form of Salvation by pure faith'
|
| 6 |
+
|
| 7 |
+
29. ఒక వేయి తలలతో - పోతన భాగవతము
|
| 8 |
+
|
| 9 |
+
30. రాజయక్ష్మము - కుమార్తెలు మొఱవిని క్రుద్ధుఁడైన దక్షునకుఁ జంద్రునకు
|
| 10 |
+
సంధికుదిర్చి శివుఁడర్ధభాగమును శిరముపై ధరించినట్లు బ్రహ్మవైవర్తపురాణము
|
| 11 |
+
|
| 12 |
+
31. ఉత్క్రాంతివేళ : మరణవేళ
|
| 13 |
+
|
| 14 |
+
32. శశినర్ధించినాఁడు'; శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 'శశిదూతము' కావ్యమున
|
| 15 |
+
జెప్పినారు.
|
| 16 |
+
|
| 17 |
+
33. మేఘవిజయకవి (క్రీ.శ. 1660 ప్రాంతము) హైమకౌముది యనునితని వ్యాకరణ
|
| 18 |
+
గ్రంథమును భట్టోజి దీక్షితు లనుకరించినారని కొందఱు, భట్టోజి (క్రీ.శ. 1640
|
| 19 |
+
ప్రాంతము) అద్వైతాగమ, తంత్రధర్మజ్యోతిషాదికములు ముప్పది రెండు
|
| 20 |
+
గ్రంథములు రచించిన మహాపండితుఁడు.)
|
| 21 |
+
సిద్ధాంత కౌముది సంస్కృత వ్యాకరణమును శబ్దరూప నిష్పత్తి క్రమమున మార్చి
|
| 22 |
+
వ్రాసిన పన్నెండువేల గ్రంథము.
|
| 23 |
+
|
| 24 |
+
34. సుషుమ్న- సూర్యుని సప్తకిరణముల నొకటియని శ్రుతి
|
| 25 |
+
|
| 26 |
+
35. శతపథ బ్రాహ్మణము - యజుర్వేదీయ గ్రంథము
|
| 27 |
+
|
| 28 |
+
36.కెరలి చీఁకటిమ్రాను - తిమ్మన పారిజా. ఆ. 2, ప. 36
|
| 29 |
+
|
| 30 |
+
37. మన్మథ దివ్యాగమమున – మహాకవి పెద్దపాఁటి యెఱ్ఱన కుమార నైషధములోనిది
|
| 31 |
+
(ప్రబంధ రత్నా. 84).
|
| 32 |
+
|
| 33 |
+
38. విరహుల కెల్ల సంధ్యవతి - ప్రబంధ రత్నా. 581
|
| 34 |
+
|
| 35 |
+
39. అద్యతనాంధ్ర కవి కుమారుఁడు - శ్రీ శ్రీ
|
| 36 |
+
|
| 37 |
+
40. దినపరిణామలక్ష్మి - పారిజా. ఆ. 2, ప. 44
|
| 38 |
+
|
| 39 |
+
41. కాల మనియెడి పారిజా. ఆ. 2. ప. 43
|
| 40 |
+
-
|
| 41 |
+
42. ఉదయగ్రావము - ధూర్జటి కాళహస్తీ... ఆ. 2. ప. 232
|
| 42 |
+
|
| 43 |
+
43. కడక న్రేచలి గట్టుపట్టి - పారిజా. ఆ. 2. ప. 45
|
| 44 |
+
|
| 45 |
+
44. అనలాక్షు - మనుచరిత్ర వంశావతార వర్ణనమున 'కలశపాథోరాశి' నుండి
|
| 46 |
+
|
| 47 |
+
45. పొందుగఁ బశ్చిమాబ్దితట - పారిజా. ఆ. 2, ప. 42
|
| 48 |
+
____________________________________________________________________________________________________
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0106.txt
ADDED
|
@@ -0,0 +1,30 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
140. సౌదీ - పర్షియను కవి
|
| 2 |
+
|
| 3 |
+
141. మయూరంబవోలె - మడికి సింగన సకల నీతి సమ్మతము
|
| 4 |
+
|
| 5 |
+
142. ఎరిస్టోఫానిస్ - క్రీ.పూ. 445-385) ఏఁబదినాలుగు సుఖాంతనాటకముల
|
| 6 |
+
రచించిన గ్రీకు నాటకకర్త - The World's Greatest Comic dramatist;
|
| 7 |
+
|
| 8 |
+
143. ఒనరన్ - పోతన భాగవతకృత్యాదినిఁ జెప్పిన పద్యము
|
| 9 |
+
|
| 10 |
+
144. సత్యముతో - మహాత్ముఁడు తన యాత్మకథకు 'My experiments with truth’
|
| 11 |
+
అని నామకరణము చేసినాడు.
|
| 12 |
+
|
| 13 |
+
145. దక్షిణామూర్తి - శ్రుతి శాస్త్రార్థ వ్యాఖ్యాన మొనర్చు శివమూర్తి విభేదము
|
| 14 |
+
|
| 15 |
+
146. అస్తంగతత్వము - రవితోఁ జేరిన గ్రహముల కస్తంగతత్వదోషము కలుగుట
|
| 16 |
+
జ్యోతిషశాస్త్ర ప్రసిద్ధము.
|
| 17 |
+
|
| 18 |
+
147. క్లియోపాత్రా అంటోనీనిఁ బ్రేమపాశబద్ధునిఁ గావించిన సుందరి
|
| 19 |
+
|
| 20 |
+
148. పండిత రాయలు - రసగంగాధరాది గ్రంథకర్త; క్రీ.శ. 15వ శతాబ్ది సుప్రసిద్ధ
|
| 21 |
+
పండితుడు
|
| 22 |
+
|
| 23 |
+
149. హెర్బర్టు స్పెన్సర్ - (క్రీ.శ. 1820-1903) ఇకానమిస్టు సంపాదకుడు,
|
| 24 |
+
ప్రత్యేకతత్త్వ నిరూపకుఁడు. His system of philosophy is based upon the
|
| 25 |
+
principle that all organic development is a change from homogeneity to
|
| 26 |
+
heterogeneity.'
|
| 27 |
+
|
| 28 |
+
150. బెర్గసన్ - ఒకానొక యాధునిక యూరప్ దేశ తాత్త్వికుఁడు:
|
| 29 |
+
|
| 30 |
+
151. భరతాచార్యుఁడు - నాట్యశాస్త్ర కర్త.
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0109.txt
ADDED
|
@@ -0,0 +1,26 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
చతుర్విధ పురుషార్థములలో కామము తృతీయము. పరలోక సాధకమైనది
|
| 2 |
+
ధర్మము. ఇహలోక సాధకమైనది కామము. మతిమంతులై మెలగినవారికి కామమును
|
| 3 |
+
మోక్షసాధకమే అగునని 'ధర్మావిరుద్ధో లోకేస్మిన్ కామోస్మి భరతవర్షభ' అను
|
| 4 |
+
గీతావచనమును బట్టి వ్యక్తమగుచున్నది. సర్వేంద్రియ తోషకమైన కామము సర్వార్థ
|
| 5 |
+
సాధకమగుటచే దీనిని పరమ పురుషార్థముగ పరిగణించి, మహర్షి వాత్స్యాయనుడు
|
| 6 |
+
'ధర్మార్థ కామేభ్యో నమః' అని మంగళారంభమును పలికినాడు. త్రివర్గములందును
|
| 7 |
+
ధర్మార్థములు పురుషార్థములని సూచించుటకే మున్ముందు అట్లు వచించినాడుగాని
|
| 8 |
+
కేవలమగు పరమపురుషార్థము కామమే అని వాత్స్యాయనుని అభిప్రాయమై నట్లు
|
| 9 |
+
నరసింహవృత్తి పలుకుచున్నది.
|
| 10 |
+
|
| 11 |
+
'పునీత భారతమున సమస్త తేజమును శ్వేతరక్తవర్ణ జలబిందు ద్వయమున
|
| 12 |
+
నున్నది. ఈ రెంటిలో శ్వేతము పురుషకము, రక్తము స్త్రైణము, ఇవి భిన్నాభిన్నములు.
|
| 13 |
+
కామదేవతా విధ్ధములు. అందువలన కామము సృష్టి సమస్తమును బంధించు
|
| 14 |
+
అంతరికశక్తి. కాని అది శక్తిశేఖరము కాదు. ఈ బిందుద్వయ సంయోగ వియోగములకు
|
| 15 |
+
కారణభూతమైన పరమశక్తి కామాధిదేవత కంటె గొప్పది. స్త్రీ పురుష లింగద్వయ
|
| 16 |
+
సంయోగమువలన కామకళాదేవి రూపకల్పన మొందినది. సూర్యచంద్రములు ఆ
|
| 17 |
+
దేవత పయోధరములు. ఆమె సృజనేంద్రియములు హార్ధకళాయుతములు. వారి
|
| 18 |
+
కామకథనమును గురించియు, జగదుత్పత్తి, స్థితిలయములను, తార్తీయ పురుషార్థ
|
| 19 |
+
స్థానమును గురించియు ఒక వృద్ధ భారతీయవేత్త నాతో పలికినాడు' అని 'గోల్డు
|
| 20 |
+
బెర్గు’ పండితుడు అతని పవిత్రాగ్ని (Sacred Fire) అను గ్రంథమున వ్రాసి ఉన్నాడు. '
|
| 21 |
+
ఇట్టి మహోన్నత దృష్టితోను, పరిపూర్ణ జ్ఞానమును కామమును ఉపాసించిన జాతి
|
| 22 |
+
మరెచ్చటను లేదని చెప్పజూచుట అతిశయోక్తి కాజాలదు.
|
| 23 |
+
|
| 24 |
+
ప్రాచీన భారతీయుల కామతంత్ర లోలతకు ప్రధాన కారణము ప్రజ.
|
| 25 |
+
గృహమేధులగుట సంతానము కొరకే. ప్రజాతంతు విచ్ఛేదము జరుగకుండునట్లు
|
| 26 |
+
జూచుటకే కామకళా విజ్ఞాన మత్యావశ్యకముగ వారు పరిగణించిరి. ఏతద్విజ్ఞాన
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0116.txt
ADDED
|
@@ -0,0 +1,16 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
(శ్రీమద్రామాయణము నాంధ్రీకరించిన వాడు) శృంగార పరాకాష్ఠను పొందిన
|
| 2 |
+
బ్రహ్మానంద శతకమును వ్రాసి యున్నాడు. ఇంకను ఆంధ్రమున ననేకములైన చిల్లర గ్రంథములున్నవి.
|
| 3 |
+
|
| 4 |
+
ఉపలబ్ధ మానములగు సమస్త భారతీయ కామకళాగ్రంథ పరంపరలోను, అతి
|
| 5 |
+
ప్రాచీనమును, ప్రామాణికమును అయిన గ్రంథము వాత్స్యాయన మహర్షి
|
| 6 |
+
కామసూత్రములు. ఈ గ్రంథమునకున్న సమగ్రస్ఫూర్తిగాని, ప్రాగల్భ్య ప్రాశస్త్యములుగాని అన్యగ్రంథములకు లేవు. సమస్త కామకళా గ్రంథములకును నిదియే ఆదిభిక్ష వెట్టినది; అన్నియును దీని ననుసరించినవి అని ఘంటాపథముగ చెప్పవచ్చును. వాత్స్యాయనుడు పూర్వాచార్యులను కొందరిని పేర్కొని వారి మతములను విమర్శించుట వలన నితడు శాస్త్ర సంధాతయే గాని స్వతంత్ర రచయిత కాడని ఒక అభిప్రాయమున్నది. ఇది ఎంతయు సత్యదూరము. మన పూర్వులు ఇతనిని మహర్షిగ భావించినారు. ఇతడు
|
| 7 |
+
కామకళాద్రష్ట, స్రష్ట, ఇతని కామసూత్రములను అవలోడన మొనర్చి ప్రపంచములోని ఉత్తమజాతి శాస్త్రవేత్తలును, కామశాస్త్ర వేత్తలును (Sex and Erotic Scholars) ఇతని 'కామశాస్త్ర విజ్ఞానమునకు బుద్ధినైశిత్యముతో రాజ్యతంత్రమును నడపి శాస్త్రరచన మొనర్చిన విశిష్ట పాశ్చాత్య రాజకీయవేత్త - మేకవెల్లీ' అని ప్రశంసించినారు.
|
| 8 |
+
|
| 9 |
+
మన ప్రాచీన సాహితీపరులు కామసూత్రములకు విశేష గౌరవమిచ్చినట్టు
|
| 10 |
+
సంస్కృత కావ్యపఠనము వలన వ్యక్తమగుచున్నది. మల్లినాథాది వ్యాఖ్యాతలమాట
|
| 11 |
+
అటుంచినను, మహాకవులు కాళిదాసు, భవభూతి, ఆచార్య దండి, ప్రభృతులు వారి కావ్యములందు సందర్భానుసారముగ వాత్స్యాయన కామసూత్రములను
|
| 12 |
+
అనువదించినారు. వరాహ మిహిరాచార్యులవారును కొన్ని సందర్భములందు ఈ
|
| 13 |
+
గ్రంథమునుండి ఉదాహరణములను గ్రహించినారు.
|
| 14 |
+
|
| 15 |
+
వాత్స్యాయనుని 'కామసూత్రములు' నేటికి ప్రపంచములోని 160 భాషలలోనికి
|
| 16 |
+
వ్యాఖ్యాన టిప్పణి సహితముగ అనువదితములైనవి. దీనికి 11 ఆంగ్లానువాదములు, 20 ఫ్రెంచి అనువాదములు, 40 జర్మను అనువాదములు నున్నవి. ఫ్రెంచి వానిలో నుత్తమమైనది లామైరీ అనువాదము, రిచ్చర్డు స్కిమిడ్జ్ హైమన్, స్టీఫెనుల అనువాదములు జర్మను పరివర్తనములోని కెల్ల ముఖ్యమైనవి. నేటి జాతి శాస్త్రజ్ఞులలో కామసూత్రములను మెచ్చుకొననివారు లేరు. అతి ప్రాచీన కాలముననే వాత్స్యాయనుని ప్రభావము అరబ్బు దేశములలో పుట్టిన కామశాస్త్ర గ్రంథములపై బడినది. పూర్వ రోమక చక్రవర్తులనాటి జాతిశాస్త్రవేత్తలును భారతీయ కామశాస్త్రపు చవి��ూచినవారే
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0117.txt
ADDED
|
@@ -0,0 +1,19 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
ననుటలో అతిశయోక్తి లేదు. ఈ సందర్భమున వసు మహాశయుని వాత్స్యాయన
|
| 2 |
+
ప్రశంసను పేర్కొనుట ఉచితము.
|
| 3 |
+
|
| 4 |
+
“The Kama-Sastra is written in brilliantly arranged and superbly pithy Sutra form in the style of many of the ancient and Mediaeval Hindu scriptural works. The foreign scholars, particularly authorities on sexual science in the nineteenth and twentieth centuries have justly appraised and recognised the value of such a supremely interesting and useful treatise on the art of
|
| 5 |
+
love that had presumably attained wonderful perfection in India several centuries before CHRIST. It is acclaimed as the most precise but elucidating ancient work for all times and with a universal appeal by celebrities like Havelock Ellis, Kraft-Ebing, Kisch Forel, Mantegazza, Lombroso, Iwan Block and others ... It can be proved beyond doubt that almost all the Turkish, Arabic and Persian Books on Erotics have freely derived help from the precontemporaneous Hindu manuscripts-The KAMA SUTRA etc... It becomes very difficult to gain say if somebody presumes that Ovidus Nasso the Roman composer of A R S A Mooris who lived during the reign of first Imperial Caesar filled his cup at the fountain - head of Vatsyayana or his
|
| 6 |
+
predecessors."
|
| 7 |
+
|
| 8 |
+
ఇందు వాత్స్యాయనుని కామసూత్రములు గూర్చి 'వసు' మహాశయుడు చెప్పిన
|
| 9 |
+
వాక్యములలో సత్యేతర మిసుమంత యైనను లేదు; నేటి కామతంత్ర రచయితల
|
| 10 |
+
గ్రంథములను గాని అరేబియా, పర్షియా దేశములందును, రోమునగరమునను
|
| 11 |
+
జన్మించిన పురాతన కామకళా గ్రంథములనుగాని పరికించిన నీ విషయము
|
| 12 |
+
తేటపడగలదు.
|
| 13 |
+
|
| 14 |
+
కామసూత్రములకు వ్యాఖ్య లొనర్చిన వారిలో ప్రముఖుడు యశోధరమహారాజు.
|
| 15 |
+
ఇతని వ్యాఖ్యానమునకు 'జయమంగళ' మని నామము. ఇతడు క్రీ.శ. 10వ శతాబ్ది వాడని చరిత్రజ్ఞుల అభిప్రాయము. వ్యాఖ్యాప్రారంభమునందు యశోధరుడు చెప్పిన -
|
| 16 |
+
|
| 17 |
+
“వాత్స్యాయనీయం కిల కామసూత్రం వ్యాఖ్యాయి తత్కైశ్చిది హాదేన్యథైవ,
|
| 18 |
+
తస్మాద్విధాస్యే జయమంగళాఖ్యాం, టీకామిమాం సర్వ మిదం ప్రణమ్య" అను శ్లోకము వలన ఇతని నాటికి వాత్స్యాయనమునకు సంప్రదాయ విరుద్ధములైన కొన్ని
|
| 19 |
+
వ్యాఖ్యానములున్నట్లును, ఇతడు సంప్రదాయార్థములను కొనివచ్చుటకై వ్యాఖ్యచేయ
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0118.txt
ADDED
|
@@ -0,0 +1,13 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
పూనుకొనినట్లును అర్థమగుచున్నది. అందువలన నితని వ్యాఖ్యానము సమగ్రమును ప్రామాణికమునునని మన మంగీకరింపవచ్చును. సూత్ర హృదయము నెఱిగినట్లు వ్యాఖ్యానించు పట్ల నితని కామకళా విజ్ఞానము, తదితర శాస్త్ర విజ్ఞానము సర్వేసర్వత్ర గోచరించుచుండును. ఇతనికి కామకళ స్వానుభవ పూర్వకమైనట్లు గద్యలో చెప్పుకొనిన 'విదగ్ధాంగనా విరహకాతర' శబ్దము వలన మన కర్థమగుచున్నది. క్రీ.శ. 1577లో వీరభద్రుడు 'కందర్ప చూడామణి' అనుపేర ఆర్యావృత్తములలో కామసూత్రములకు వేరొక వ్యాఖ్యానము జెప్పినాడు. క్రీ.శ. 1789లో సర్వేశ్వరశాస్త్రి శిష్యుడును కాశీనివాసియు నైన ఆంధ్రుడు భాస్కర నృసింహుడు రాజా ప్రజలాల్ అనువాని ప్రోత్సాహమున వాత్స్యాయనీయమునకు ఒక వృత్తిని వ్రాసినాడు. అఖిల ప్రౌఢక్రియయైన వృత్తిని రచింపబూనినట్లు గ్రంథారంభమున చెప్పుకొనిన శ్లోకమునందున్నది. వాత్స్యాయన సూత్ర వ్యాఖ్యాతలలో మల్లదేవుడొకడు. ఇతనిని పంచసాయక కర్త జ్యోతీశ్వరాచార్యుడు మూలదేవుడని వ్యవహరించినాడు. క్షేమేంద్రమహాకవి ఔచిత్య విచారచర్చయను అతని గ్రంథమున నొక వాత్స్యాయన సూత్రసారమును పేర్కొనినాడు. కాని నేడది లభించుట లేదు.
|
| 2 |
+
|
| 3 |
+
భాస్కర నృసింహుడు కామసూత్ర వృత్తిని ఆరంభించుచు ‘వత్సోపరి వాత్సల్యా
|
| 4 |
+
వాత్స్యాయనీయ కామసూత్రం యః' అనినాడు. దీని కుపోద్బలకముగ వత్సరాజు
|
| 5 |
+
వాత్స్యాయనుల మైత్రి కనుగుణములైన జనశ్రుతులున్నవి. మల్లనాగు డను ఆచార్యుడు వత్సదేశ పరిపాలకుడైన వత్సరాజుకు మిత్రుడై, అతని కుమారుడు లోకతంత్ర మెరుగని వాడగుటచే ప్రభువు పరితపింప, నాతడు కనికరించి ఈ కామసూత్రములను చెప్పినాడట! దీనికి ప్రమాణముగ 'మల్లనాగ ప్రబోధితో వత్సేశ్వర ఇవ' అను వాక్యములు ఉదాహృతములైనవి. ఇందలి సత్యాసత్యము లెట్లున్నను 'వాత్స్యాయన' శబ్దము బిరుదనామము. అయిన కామసూత్ర కర్త పేరేమి?
|
| 6 |
+
|
| 7 |
+
యాదవ ప్రకాశ హేమచంద్రులు వాత్స్యాయన శబ్దమునకు క్రింది శ్లోకముల
|
| 8 |
+
పర్యాయ పదముల నిచ్చి ఉన్నారు.
|
| 9 |
+
|
| 10 |
+
“వాత్స్యాయనస్తు కౌటిల్యో విష్ణుగుప్తో వరాణకః ద్రమిళః పక్షిల స్వామీ మల్ల
|
| 11 |
+
నాగోంగులోపి చ;
|
| 12 |
+
|
| 13 |
+
వాత్స్యాయనో మల్లనాగః కౌటిల్యశ్చ కాత్మజః, ద్రామిళః పక్షిల స్వామీ విష్ణుగుప్తోంగుళశ్చ సః
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0122.txt
ADDED
|
@@ -0,0 +1,12 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
పరస్పరానుబద్ధములగు రీతులను వ్యక్తమొనర్చి, శాస్త్రరచనావశ్యకతను నిరూపణ
|
| 2 |
+
చేసినాడు. ఈ సందర్భమున మహర్షి నాస్తిక లోకాయతాది మత విమర్శన మొనర్చి ధర్మా చరణీయ సిద్ధాంతమును ప్రతిపాదించినాడు. కామమును సేవింపరాదనువారి వాదములు ఖండించు సందర్భమున ప్రతిపక్షులు సూపు అనర్థ జనసంసర్గ అసద్వ్యవసాయ అశౌచ అనార్య అనాయత్యాదులైన దోషములను త్రోసిరాజని 'శరీరస్థితి హేతుత్వాదాహర సధర్మాణోహి కామః' (1.2.46) అని కామమును శరీరస్థితికి హేతుభూతమనియును, ఆహారముతో తుల్యమైనదనియును నిర్ణయించినాడు. అంతేకాదు. 'ఫలభూతాశ్చ ధర్మార్థ యోః' (1.2.47) అని సూత్రీకరించి దానిని ధర్మార్థ సాధకముగ చెప్పియున్నాడు. అజీర్ణము మొదలగు దోషములందు ఏ విధమగు ప్రతీకారము నవలంబింతువో అట్టి ప్రతివిధానమును అవలంబించి కామమును సేవింపవలెననియును, దోషములున్నవని పరిత్యజింపరాదు, అని వాత్స్యాయనుని
|
| 3 |
+
సిద్ధాంతము.
|
| 4 |
+
|
| 5 |
+
తదుపరి వచ్చు విద్యాసముద్దేశాధ్యాయమున త్రివర్గమును పొందినవానికి
|
| 6 |
+
కామసిద్ధి కలుగవలెనన్న ప్రథమోపాయము విద్యాగ్రహణము. అందు మూలమున
|
| 7 |
+
విద్యాసముద్దేశము మహర్షి పలికినాడు. ధర్మ (శ్రుతి స్మృతులు) అర్థ (వార్తా) విద్యలకు అడ్డురానిరీతిగ కామసూత్రమును తదంగ విద్యయైన చతుష్షష్టితో అధ్యయనము చేయవలెనని ఆయన నియమము." 'ప్రాగ్యౌవనాత్త్స్రీ' (1.2.2) అను సూత్రమున పురుషులవలె స్త్రీలకును అంగసహిత కామవిద్య అధ్యయనమునకు కావలెనట! స్త్రీలకు శాస్త్రములు పఠించు అధికారము లేదనియును, ఒకవేళ పఠించినను గ్రహించు సామర్థ్యము లేదు కావున, శాసించుట నిరర్థకమను పూర్వాచార్యుల మతమును త్రోసిరాజని, వాత్స్యాయనుడు 'ప్రయోగ గ్రహిణం త్వాసామ్. ప్రయోగస్య చ శాస్త్ర పూర్వకత్వాత్' (1.3.5) అని స్త్రీలకు ఈ శాస్త్ర విషయమున ప్రవేశముండవలెనని శాసించుట నిరర్థకము, అనర్థకము కాజాలదని సిద్ధాంత మొనర్చెను. కొందరు స్త్రీలకు శాస్త్ర గ్రహణము కూడ కలదనియును, పురుషులవలె శాస్త్రములను జదివి, తత్పరిశ్రమ
|
| 8 |
+
మూలమున బుద్ధి సంపాదించిన వేశ్యాజనము, రాజకుమార్తెలు, సామంతపుత్రికలు ఉన్నారనియును నిరూపణ మొనర్చినాడు (1.3.12)
|
| 9 |
+
|
| 10 |
+
స్త్రీలు కామసూత్రములను ఏకాంతముగ నభ్యసింపవలెనట. వారి కాచార్యత్వము
|
| 11 |
+
వహింపదగిన వ్యక్తులను వారి గుణగణములను వ్యక్తమొనర్చిన తదుపరి చతుష్షష్టి
|
| 12 |
+
సంప్రయోగాంత మగుటచే దానిని విపులముగ వివరించి, వేశ్య, రాకొమరిత,
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0123.txt
ADDED
|
@@ -0,0 +1,33 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
మహామాత్ర దుహితాదులు దానిని నేర్చుకొనుట వలన కలుగు ఫలములు, పురుషులు
|
| 2 |
+
నేర్చుకొనుట వలన కలుగు ఫలములను విశదీకరించినాడు. ప్రయోగశాస్త్ర గ్రహణముల
|
| 3 |
+
రెంటిని నేర్చుకొనలేని పక్షమున కేవలము నొకదానినిగాని అందుకును చాలనపుడు
|
| 4 |
+
సంప్రయోగాంగము నందలి భాగముగాని నేర్చుకొనవలెనని శాసించినాడు. (1.2.13)
|
| 5 |
+
|
| 6 |
+
నాగరక వృత్తము తదుపరి అధ్యాయము, ఇందు నాగరకుని గృహనిర్మాణ
|
| 7 |
+
విధానము ప్రథమమున వివరించినాడు. గృహమున అంతర్గృహ, బాహ్యగృహ,
|
| 8 |
+
బహిర్గృహములు, నందుండవలసిన వేదిక, అనులేపన, తాంబూల పాత్రికలు,
|
| 9 |
+
వీణాదిస్థానములు, పతద్గృహము, చిత్రఫలకము, పుస్తకము, వర్తికా సముద్గకము,
|
| 10 |
+
గోరింటమాలికలు, వృత్తాస్తరణము, ఆకర్ష ఫలకము, ద్యూత ఫలము,
|
| 11 |
+
క్రీడాపంజరములు, ప్రేంఖాడోలిక, స్థండిల పీఠిక మున్నగు భవన విన్యాసములు
|
| 12 |
+
చెప్పిన వెనుక నాగరకుల ప్రాతఃకాల కృత్యాదికములు వివరించినాడు. అటు పిమ్మట
|
| 13 |
+
అపరాహ్ణ కాలకృత్యమును నిర్వర్తించిన వెనుక నాగరకు డొనర్పవలసిన కర్మలను
|
| 14 |
+
చెప్పినాడు. అపరసంధ్యవేళ అలంకరించుకొని సంగీత వ్యాపారములు నిర్వర్తించి
|
| 15 |
+
శయనరచన మొనర్చుకొని అభిసారికకై వేచి యుండవలెనట! తరువాత పర్వదినము
|
| 16 |
+
లందొనర్పవలసిన గోష్ఠీవిభేదములు వివరించినాడు" అందలి ఆపానకవిధులు, కావ్య
|
| 17 |
+
సంగీత నాట్యాది ప్రసంగములు గమనింపదగినవి. గ్రీష్మకాలమున జలక్రీడాదికములు,
|
| 18 |
+
ప్రియులతో కూడి ఒనర్పవలెనని చెప్పి ఉన్నాడు. యక్షరాత్రి కౌముదీజాగరాది క్రీడలను
|
| 19 |
+
తరువాత సంగ్రహముగ నిర్దేశించిన వెనుక నుపనాగరకుని గోష్ఠీ విధానమును
|
| 20 |
+
గ్రామీణుల గోష్ఠీ విధానమును వ్యక్తమొనర్చినాడు. ఇట -
|
| 21 |
+
|
| 22 |
+
'నాత్యంతం సంస్కృతే నైవ నా అత్యంతం దేశభాషయా, కథాం గోష్ఠీషు కథయన్
|
| 23 |
+
లోకే బహు మతో భవేత్.' (1.4.50) అని నిబద్ధము చేసి గోష్ఠి సర్వజన విజ్ఞాన
|
| 24 |
+
ప్రదముగ నుండునట్లు శాసించినాడు
|
| 25 |
+
|
| 26 |
+
మహర్షి ‘యాగోష్ఠీ లోక విద్విష్టా యాచ స్వైర విసర్పణీ పరహింసాత్మికా యాచ
|
| 27 |
+
వతా మవత రేద్భుధః' అనుట వలన నా కాలమున వెలసిన కౌముదీ జాగరాది
|
| 28 |
+
గోష్ఠులు లోక చిత్తానువర్తులని గ్రహింపవలసి ఉన్నది.
|
| 29 |
+
|
| 30 |
+
ఇక సాధారణాధికరణమున మిగిలినది నాయిక సహాయదూతకర్మ
|
| 31 |
+
విమర్శాధ్యాయము. ఇందలి ప్రథమ సూత్రమును 'కామశ్చతురు వర్ణేషు సవర్ణ తశ్చా
|
| 32 |
+
నన్య పూర్వాయం ప్రయుజ్య మానః పుత్రియో యశస్యో లౌకి కశ్చ భవతి' అను
|
| 33 |
+
సూత్రము ననుసరించి కామము చతుర్వర్ణముల వారి యందును, సవర్ణముననుసరించి
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0124.txt
ADDED
|
@@ -0,0 +1,32 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
శాస్త్రముననుసరించి అనన్యపూర్వమై కన్యాత్వమును కోల్పోవని నాయికయందు
|
| 2 |
+
ప్రవర్తమైన నది పుత్రీయము, యశస్యము, లౌకికమయినది వశ్యమగుచున్నది.
|
| 3 |
+
తద్విపరీత కామము ఆ నాడు ప్రతిషిద్ధము. అని వరసిద్ధులందును, వేశ్యాస్త్రీల
|
| 4 |
+
యందును, పునర్భువులయందును ప్రయోగితమైన కామము సుఖార్థము కాన నిషిద్ధము
|
| 5 |
+
కాదు, శాస్త్ర విహితము కాదు. అందువలన శిష్టము కాదు. దీనిని బట్టి ఆ నాడు
|
| 6 |
+
అధమవర్ణ వివాహము లున్నను అవి కేవల సుఖార్ధములని వక్తమగుచున్నది. వేశ్యా,
|
| 7 |
+
పునర్భువులందు పుత్రాశలేదు. పునర్భువ పుత్రుడు పౌనర్భువుడు, పునర్భువ 20 కంటే
|
| 8 |
+
వేశ్య స్థితి తక్కువ.
|
| 9 |
+
|
| 10 |
+
దీనిని బట్టి కన్యల వలన పుత్రుడు, అని వరసిద్ధులందును, పునర్భువ,
|
| 11 |
+
వేశ్యలందు, సుఖము కామమును ప్రయోగించుట వలన కలుగుచున్నది. అంతేకాక
|
| 12 |
+
ఇతర కారణముల వలన పరపరిగృహీత యైన స్త్రీ పాక్షికయగు నాల్గవ నాయిక
|
| 13 |
+
అగుచున్నదని గోణికాపుత్రుని అభిప్రాయమును వాత్స్యాయన మహర్షి
|
| 14 |
+
వెల్లడించినాడు. " పరపరిగృహీత యెడ కామము ధర్మవిరుద్ధము కాదా అని
|
| 15 |
+
శంకించినచో, దానికి సమాధానముగ నామె ఉత్తమ వర్ణయైనను శీలము విడుచుట
|
| 16 |
+
వలన ధర్మహాని కలుగదని చెప్పినాడు. ఆమె శీలభ్రష్ట కావున వేశ్యవంటిదట.
|
| 17 |
+
అందువలన దోషము లేదట. దీనికి జయమంగళ వ్యాఖ్యాత 'జీవకార్ముక వస్తా
|
| 18 |
+
వీన్దధ్యాదాత్మ విశుద్ధయే చతుర్ణామమి వర్ణానాం నారీర్హత్వా వ్యవస్థితాః' అని ధర్మశాస్త్ర
|
| 19 |
+
ప్రమాణము ఉటంకించినాడు.
|
| 20 |
+
|
| 21 |
+
విధవను పంచమ నాయికనుగా గ్రహింపమను చారాయణుని అభిప్రాయమును,
|
| 22 |
+
ప్రవ్రజితను షష్టనాయికగా స్వీకరింపమను సువర్ణనాభుని మతమును, అనన్య
|
| 23 |
+
పూర్వయైన వేశ్యాదుహితనుగాని, కన్యకయయ్యు పాణిగ్రహ ధర్మము లేనిదై నాయకునికి
|
| 24 |
+
పరిచర్య చేయునట్టి పరిచారికను సప్తమనాయికగ పొందవలయునను ఘోటకముఖుని
|
| 25 |
+
అభిప్రాయమును ఉత్క్రాంత బాలభావయైన కులయువతిని అష్టమ నాయికగ
|
| 26 |
+
స్వీకరింపమను గోనర్డీయుని అభిప్రాయమును మహర్షి ఈ సందర్భమున పేర్కొనినాడు.
|
| 27 |
+
(1. 5. 22, 23, 24, 24)
|
| 28 |
+
|
| 29 |
+
"కార్యాంతరాభావాదేతా సామసి పూర్వాస్వేవోపలక్షణం తస్మా దేతా ఏవ నాయికా
|
| 30 |
+
ఇతి వాత్స్యాయనః” అని పై సమస్తమునకును తన అభిప్రాయమును స్పష్టీకరించినాడు.
|
| 31 |
+
పై రీతిన నాయికలు అష్టవిధములు అని పూర్వాచార్యులు నిర్దేశించినను
|
| 32 |
+
ఈ నాయికలును "కన్యకలు, పునర్భవలు, వేశ్యలు, పరదారలు" అను నల్వురు
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0125.txt
ADDED
|
@@ -0,0 +1,32 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
చేయు కృత్యములనే చేయుట వలనను. తదితరములగు కృత్యములు వీరికి లేకుండుట
|
| 2 |
+
వలనను వీరును నందే చేరుచున్నారని ఆయన అభిప్రాయము. నిజమునకును నంతే.
|
| 3 |
+
విధవ, ప్రవ్రజికలు, పరదారలు, గణికాదుహితగాని పరదారగాని సుఖార్థమగుట
|
| 4 |
+
వలన వేశ్యయందంతర్భూత లగుచున్నారు. కులయువతియైన నాయిక పుత్రమిత్రాది
|
| 5 |
+
ఫలము కలిగినది కనుక, కన్యక కనుక నాయికలు నల్వురే. అందువలననే వారిని
|
| 6 |
+
గురించిన అధికరణములు మాత్రము వాత్స్యాయనమున ఒప్పుచున్నవి.
|
| 7 |
+
|
| 8 |
+
తదుపరి గమనింపవలసిన సూత్రము 'భిన్నత్వాత్తృతీయా ప్రకృతి పంచమీత్సేకే
|
| 9 |
+
అనునది. స్త్రీ ప్రకృతి పురుష ప్రకృతులకు భిన్నుడై ఔపరిష్టకాదులకు మైథున కర్మలకును,
|
| 10 |
+
రూప వ్యాపారలాభ ముండుట వలనను నపుంసకుని అయిదవ నాయికగ
|
| 11 |
+
పరిగణింపదగునని కొంద రాచార్యులు పలికిరని ఊరకొనినాడేగాని తన అభిప్రాయ
|
| 12 |
+
వ్యతిరేకతను వ్యక్తపరుపలేదు.
|
| 13 |
+
|
| 14 |
+
నాయకుల విషయము వచ్చినప్పుడు 'ఏక ఏవతు సార్వలౌకికో నాయకః”
|
| 15 |
+
(1.5.28) అని ఒక అర్థవాదమును పలికినాడు. కాని ఏకపత్నీవ్రత, బహుపత్నీ
|
| 16 |
+
వ్రతాదులను బట్టియును, ప్రచ్ఛన్న బహిరంగాదులను బట్టియును, నాయకోప నాయకాది
|
| 17 |
+
భేదములను బట్టియు, గుణములను బట్టియు, నాయక విభేదములున్నట్లు తదుపరి
|
| 18 |
+
చెప్పియున్నాడు.
|
| 19 |
+
|
| 20 |
+
అగమ్యలను (సంప్రయోగము నెరపదగని వారు) గూర్చి తదుపరి
|
| 21 |
+
ప్రసంగించినాడు. ఇట పరిశిష్ట న్యాయమున గమ్యలెవరో వాత్స్యాయన మహర్షి
|
| 22 |
+
భంగ్యంతరముగ నిరూపించినాడనుట స్పష్టము. ఇట్టి నిరూపణ మొనర్చుటలో మహర్షి
|
| 23 |
+
ధర్మ, మానసిక, శారీరకారోగ్యాది లక్షణముల ననుసరించి నియమించి నాడు.
|
| 24 |
+
కుష్ఠురోగ, అతిశ్వేత, అతి కృష్ణాదులు ఆరోగ్య శాస్త్రసంబంధమున అగమ్యలు.
|
| 25 |
+
సంబంధిని, సఖిప్రవ్రజిత రాజదారాదులు ధర్మమూలమున అగమ్యలు. ఉన్మత్త, దుర్గంధ
|
| 26 |
+
ఇత్యాదులు మానసిక వికాస రహితలుగాను అగమ్యలు - 28. అగమ్యల విషయమున
|
| 27 |
+
హిందూ, మహమ్మదీయ కామశాస్త్ర గ్రంథకర్తలు ఏకాభిప్రాయులై యున్నారు. గత
|
| 28 |
+
యౌవనప్రాయను మహర్షి అగమ్యనుగ పేర్కొనినాడు. 'బాలార్కో ప్రేత ధూమశ్చ వృద్ధస్త్రీ
|
| 29 |
+
పల్వ లోదకమ్ రాత్రే దధ్యన్న భుక్తిశ్చ ఆయుః క్షీణం దినే దినే' అను ఆర్యవచనమును
|
| 30 |
+
దీని కానుగుణ్యముగ నున్నది. నఫోజైషేకు చిన్నదానితో రతి శక్తి నిచ్చుననియును,
|
| 31 |
+
సమాన వయస్కవలన లాభముగాని నష్టముగాని లేదనియును, వృద్ధ స్త్రీ సంగమము
|
| 32 |
+
విషసర్పము కాటు వంటిదనియును పలికినాడు. వంధ్య, మృతశిశు ప్రసవ
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0132.txt
ADDED
|
@@ -0,0 +1,32 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
మహర్షి విసృష్టిని గురించి యొనర్చిన చర్చ యెంతయు సమంజసముగ నున్నది.
|
| 2 |
+
ఆధునిక జాతిశాస్త్రజ్ఞుల అభిప్రాయములు కానుగుణ్యముగ నున్నది. ఆధునిక
|
| 3 |
+
వివాహమను గ్రంథమున గ్రిఫ్ఫెత్ మహాశయుడు ఇట్లు వ్రాసి ఉన్నాడు. "స్త్రీ పురుషులకు
|
| 4 |
+
విసృష్టి సుఖము పరస్పరమున్న కాని పరిపూర్ణ సంభోగ రసానుభవము కలుగదు.
|
| 5 |
+
మూఢులైన నాయకానాయికలు వ్యక్తిగతముగ స్వేచ్ఛగ విసృష్టి సుఖమును
|
| 6 |
+
పొందగలుగుదురు, పురుషుని శుక్ర వినిర్గమమునకు పూర్వమే స్త్రీ ఒకటి రెండు
|
| 7 |
+
మారులు స్యందనము పొందవచ్చునని నేను అంగీకరింతును. కాని ఏక కాలమున
|
| 8 |
+
నిరువురును పొందిన విసృష్టితో నిది సమము కాదు. శుక్రబహిర్గమను సంభోగము
|
| 9 |
+
(Coitus Interruptus) నొనర్చువారికి అట్టి విసృష్టి సుఖము లభ్యము కాదు.
|
| 10 |
+
ఈ అభిప్రాయమునే మహాశయుడు Havelock Ellis ఇట్లు చెప్పినాడు.
|
| 11 |
+
|
| 12 |
+
“The whole structure of the world is built upon the general fact that
|
| 13 |
+
the intimate contact of the male and female who have chosen each other is
|
| 14 |
+
mutually pleasurable. Below this general fact is the more specific fact that in
|
| 15 |
+
the normal accomplishment of the act of sexual consummation the two
|
| 16 |
+
partners experience the actual gratification of simultaneous orgasm. Herein
|
| 17 |
+
it is said, lies the secret of love"
|
| 18 |
+
|
| 19 |
+
స్త్రీలు వదులు నీ శుక్ర మెచ్చటిదను ప్రశ్న ఉదయించగా మనవారు అది
|
| 20 |
+
రసధాతుజనితమై అసృగ్ధాతునే (రక్తధాతువు) ఒక స్థితిలో ఆర్తవమనిపించుకొను
|
| 21 |
+
ననియును, అది మజ్జాధాతువు నుండి పుట్టినదని అభిప్రాయములో పడినారు.
|
| 22 |
+
పాశ్చాత్య శాస్త్రజ్ఞులలో వాన్ డివెల్డి ఈ విసృష్టి మూలకమైన స్త్రీ శుక్రము బర్తలోనియన్
|
| 23 |
+
గ్లాండులనుండి నరముల ఒత్తిడి మూలమున బయటకు స్రవించునని అభిప్రాయ
|
| 24 |
+
మిచ్చినాడు. కాని అనేకులు సుప్రసిద్ధ వైద్య శిఖామణులు దీనినంగీకరింపక,
|
| 25 |
+
ప్రాచీనులు చెప్పినట్లు అది మజ్జాధాతు సంబంధమైన దనినారు. స్త్రీ శుక్ర
|
| 26 |
+
సంబంధమైన అనేక విశేషాంశములు వైద్యశాస్త్రజ్ఞులు వెల్లడించినారు.
|
| 27 |
+
|
| 28 |
+
'జాతే రభేదాద్దుపత్యోః సదృశం సుఖమిష్యతే, తస్మాత్తథోపచర్యా స్త్రీయథాగ్రే
|
| 29 |
+
ప్రాప్నుయాద్రతిమ్' అను సూత్రము వలన వాత్స్యాయన మహర్షి జాతిభేద రహితమగు
|
| 30 |
+
స్త్రీ పురుషులకు సదృశముగనే సుఖము కలుగునని చెప్పియున్నాడు. కండూతి
|
| 31 |
+
నివారణమును బట్టియును, శుక్రక్షరణమును బట్టియును, స్త్రీలకు కలుగు సుఖము
|
| 32 |
+
ద్వివిధము. అందును శుక్రక్షరణము స్యందనమని విసృష్టియని మరల ద్వివిధము.
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0140.txt
ADDED
|
@@ -0,0 +1,32 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
లాటదేశ స్త్రీల పోలినవారే అపరాంతవాసులని వాత్స్యాయనుని అభిప్రాయము. వారికి
|
| 2 |
+
బాహ్యరతి, సంప్రయోగముల వెంటను ప్రీతి కలదని కొక్కోకుడనినాడు. సింధు స్త్రీలు
|
| 3 |
+
ఔపరిష్టక ప్రియలనినాడు. వారికి ఔపరిష్ట కాద్యము కాని రతమున తృప్తి లేదనినాడు.
|
| 4 |
+
జలంధర దేశ స్త్రీలకు ప్రయోగవిధాన వైచిత్య్రములన్న (Sexual Movements)
|
| 5 |
+
(కామసూత్రములు, ద్వితీయాధికరణము, అష్టమాధ్యాయమున వర్ణితములు) ఆసక్తి
|
| 6 |
+
అధికమని పద్మశ్రీ అభిప్రాయము. ద్రావిడ స్త్రీలకు శుక్రక్షరణము రతారంభమునుండి
|
| 7 |
+
కలుగుననియును అందువలన ప్రథమ రతముననే తృప్తలగుదురని వాత్స్యాయన
|
| 8 |
+
కొక్కోకుల మతము. పద్మశ్రీ వీరికి కరతాడన, మర్దన, ఔపరిష్టకాది ప్రీతి కలదని
|
| 9 |
+
చెప్పుచున్నాడు. కాశ్మీరస్త్రీ గంధప్రియ అని పద్మశ్రీ. ఇతర గ్రంథములు కానరాని
|
| 10 |
+
అనేక దేశస్త్రీల సాత్మ్యములను నాగరసర్వస్వకర్త నిరూపించినాడు. ఈ
|
| 11 |
+
అధ్యాయాంతరమున సూత్రకర్త దేశ సాత్మ్య ప్రకృతి సాత్యముల ప్రయోగ విధానమును
|
| 12 |
+
గుర్తించి 'దేశసాత్మ్యాతృకృతి సాత్మ్యం బలీయ ఇతి సువర్ణ నాభో నతత్ర దేశ్యా ఉపచారాః'
|
| 13 |
+
(2.5.34) అని నిశ్చయించినాడు. తుది సూత్రముగ చెప్పిన 'పరస్పరాను కూల్యేన
|
| 14 |
+
తదేవం లజ్జమానయోః సంవత్సర శతేనాపి ప్రీతిర్నపరిహీయతే' అను వాక్యమెంతయో
|
| 15 |
+
సమంజసమైనది. వీనిని గుర్తింపక పోవుట వలననే భారతదేశమున ప్రీతిరహిత
|
| 16 |
+
వివాహ ధర్మములును, పాశ్చాత్య లోకములందు వివాహ విచ్ఛేదనములును
|
| 17 |
+
జరుగుటయును, కలుగుటయును.
|
| 18 |
+
|
| 19 |
+
సంవేశన చిత్రరతములు (MODUS SEXUALIS) : దేశప్రకృతి సాత్మ్యా పేక్షయా
|
| 20 |
+
ఆలింగనా ద్యుపచారముల మూలమున పరస్పరము అనురాగము కల్గిన
|
| 21 |
+
నాయికానాయకులు సంవేశమునకు అర్హులయ్యెదరని పూర్వాధ్యాయమున స్థాపించిన
|
| 22 |
+
తదనంతరము మహర్షి వాత్స్యాయనుడు సంవేశన ప్రకారమును, తదంతర్గతములైన
|
| 23 |
+
చిత్రరతములను నిరూపించినాడు.
|
| 24 |
+
|
| 25 |
+
ప్రాచీన అర్వాచీన ప్రపంచములో రతిబంధ విభేదములు విశేషముగ
|
| 26 |
+
కనుపించుచున్నవి. ఇవి కొన్ని స్వతః సిద్ధములు. కొన్ని నూతనత్వాపేక్షకులైన
|
| 27 |
+
దంపతులు కనుగొనినవి. అనేక కారణముల మూలమున సమస్త కాలములలోను
|
| 28 |
+
సమస్త దేశ ప్రజలును వీనిని ఆదరించినారు. క్రీస్తునకు నెంతో పూర్వముననే ఔద్దాలక,
|
| 29 |
+
శ్వేత కాదులు, భారతావనిలో రతిబంధ విభేదములను గుర్తించి శాస్త్రనిబద్ధములుగ
|
| 30 |
+
నొనర్చిరి. వాత్స్యాయనుని నాటికి అవి క్రమక్రమముగ నలువది ఎనిమిదిగ
|
| 31 |
+
సంగ్రహితములైనవి. ప్రాచీన భారతము నాటికి సంబంధించిన విజ్ఞానము విశేషముగ
|
| 32 |
+
��ుండుట వలన నివి సాహిత్యశాస్త్ర గ్రంథముల కెక్కినవి. '
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0146.txt
ADDED
|
@@ -0,0 +1,19 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
యుద్దామగతిన్ రమింప నది ధాత్రిని ఫుల్లక నామబంధమౌ” అని నిరూపించినాడు.
|
| 2 |
+
కౌర్మక బంధమును అనంగరంగకర్త అనాలోచితముగ స్థితకరణముల (Sedentary
|
| 3 |
+
Postures) నుంచినాడు. అతడు దీనిలో పిరుదులు ఉన్నతములుగ నొనర్చిన కలుగు
|
| 4 |
+
పరివర్తిత బంధమును ఉత్తాన కరణమేయనెను. రతిరహస్యము దీనిని వేరుగ
|
| 5 |
+
చెప్పుచున్నది. నాయిక పాన్పుపై వెలికిల పరుండి చేతులను కాళ్ళను
|
| 6 |
+
వివరమొనర్చినపుడు నాయకుడు ముఖమున ముఖమును, చేతుల చేతులును చేర్చగా
|
| 7 |
+
నాయిక తొడల నెత్తిన నది పరివర్తితమట. అయిన నిది ఒక నూతన బంధవిభేదముగ
|
| 8 |
+
కనుపించుటలేదు. దీనాలాపనిక శుకసప్తతిలో ఘనకూర్మమను మరియొక ఉత్తాన
|
| 9 |
+
కరణము కనిపించుచున్నది. నాయిక వెనుకగ పరుండినపుడు నాయకుడు ఆమె
|
| 10 |
+
పాదములను మోచేతులలోనికి తీసుకొని తన పాదములను ఆమె వక్షఃస్థలమున
|
| 11 |
+
నుంచి రెండు చేతులతో నామె చేతులను పట్టుకొని రమించిన నది ఘనకూర్మమట.
|
| 12 |
+
నెల్లూరు శివరామకవి ముప్పదిఆరు ఉత్తానకరణ విభేదములను పలికినాడు.
|
| 13 |
+
|
| 14 |
+
ఇందు యుగ్మపాదము నాగరసర్వస్వమతమున తిర్యక్కరణము, రతిరహస్య,
|
| 15 |
+
అనంగ కర్తల మతమున నది స్థితకరణము. అర్ధపీడిత కార్కటక, పరావృత్తకములు
|
| 16 |
+
కామసూత్ర రతిరహస్యాది గ్రంథముల ననుసరించి స్థితకరణములు.
|
| 17 |
+
|
| 18 |
+
కామసూత్రములలోని పార్శ్వ సంపుటకమునే అనంగరంగకర్త సంపుటక
|
| 19 |
+
మనినాడు. 'ఋజు ప్రసారితా వప్పుభయో శ్చరణావితి సంపుటః స ద్వివిధః పార్శ్వ
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0148.txt
ADDED
|
@@ -0,0 +1,31 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
కవకాశము లేదు. సముద్గక ముద్గ కాది తిర్యక్కరణము లందు నాయకుని ఒక తొడ
|
| 2 |
+
నాయిక ఊరువుల మధ్యనుండును. పరివర్తనక బంధమున నాయకుడు నాయికను
|
| 3 |
+
వెనుక నుంచి పట్టుకొని రమించును. రతిరహస్య పరివర్తనకమునకును దీనికిని
|
| 4 |
+
భేదమున్నది. అందు నాయికానాయకులిరువురుమ మేహన సంయోగమైన వెనుక
|
| 5 |
+
సముద్గక విధానము నొంది విడివడక రమించిననది పరివర్తకము.
|
| 6 |
+
|
| 7 |
+
కొక్కోకుడు మర్కటకమును స్థితకరణముగ చెప్పినాడు. లలితము పంచసాయక
|
| 8 |
+
రతిమంజరులందు పద్మాసనముగ నున్నది. యుగ్మపాదము అనంగరంగ
|
| 9 |
+
రతిరహస్యములలో స్థితకరణముగాని నాగరసర్వస్వము నది తిర్యక్కరణము. రతిరహస్య
|
| 10 |
+
కామసూత్రములను అనువదించి జూచినచో అర్ధపీడితకము, కార్కటకములు రెండును
|
| 11 |
+
ఉత్తానకరణములు. 'చరణా వూర్ధ్వం నాయకో స్యాధారయే దితి జృంభితకమ్;
|
| 12 |
+
తత్కుంచితా ఉత్పీడితకమ్; తదేక స్మిన్ ప్రసారితేర్ధ పీడితకమ్ (2.6.23-25) సంకుచితే
|
| 13 |
+
స్వబస్తిదేశే విదధ్యాదితి కార్కటకమ్; (2.6.28) ఇవి ఈ బంధ ద్వితీయమునకును
|
| 14 |
+
వాత్స్యాయన లక్షణములు - అనంగరంగ కర్తకు పూర్వముందున్న రచయిత లందరును
|
| 15 |
+
పద్మాసనమును, ఉపపాదమును ఉత్తానకరణములుగ నిరూపింప నతడు వీనిని
|
| 16 |
+
స్థితకరణములుగా పరిగణించినాడు. స్థిత కరణముగ పద్మాసన బంధ మొనర్చుట
|
| 17 |
+
యతి కష్టసాధ్యము. కామప్రబోధములోని పద్మాసమును నాగరసర్వస్వములోని
|
| 18 |
+
లలితమును నొకటియని కామశాస్త్ర గ్రంథ పఠనము మూలమున తెలియుచున్నది.
|
| 19 |
+
అర్ధపాదమును అర్ధోపపాద మనుట యసమంజసము. ఇది పొరబాటు. " బంధురితము
|
| 20 |
+
అనంగరంగమునను కామప్రబోధమునందును తప్ప తదితర గ్రంథములందు
|
| 21 |
+
కనిపించుట లేదు. రతిరహస్యమున ఫణిపాశబంధమును వర్ణించు సందర్భమున
|
| 22 |
+
ఉన్న శ్లోకములోని 'గట్టిగ బిగించు' అను నర్థముగల బంధురిత శబ్ద ప్రయోగమును
|
| 23 |
+
చూచి కల్యాణమల్లుడు ఈ బంధవిభేదమును సృజించినట్లున్నాడని ఒకానొక నేటి
|
| 24 |
+
కామకళావేత్త అభిప్రాయము. బంధురితము కామప్రబోధము, అనంగరంగములందు
|
| 25 |
+
తప్ప ఇతర గ్రంథములందు కనుపించుట లేదు. ఫణిపాశము కామప్రబోధమున
|
| 26 |
+
కనుపింపదు. దీనికి శక్తిమంతము, దీర్ఘమునైన సాధకము (లింగము) కావలయును.
|
| 27 |
+
నాగరసర్వస్వ రతిరహస్యములు దీనిని ఉత్తానకరణము క్రింద లెక్కకట్టినవి. ఇందు
|
| 28 |
+
నాయిక మోకాలి సందులనుండి చేతులపోనిచ్చి నాయకుని కంఠాలింగన మొనర్చిన
|
| 29 |
+
నది నాగరపాశమగునని నిర్ణయించినవి. స్మరదీపికలో దీని నిరూపణము మరియొక
|
| 30 |
+
రీతిగ నున్నది. భర్త హస్తములను మోకాలిసందుల యందుంచి రమించు విధానమే
|
| 31 |
+
ఫణిపాశమని అందు��్నది. కామప్రబోధకర్త సంయమన బంధమును కౌర్మమని పేర్కొని
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0149.txt
ADDED
|
@@ -0,0 +1,30 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
అనంగరంగ కర్తవలె స్థితకరణముగ పరిగణించినాడు. నాగరసర్వస్వకర్త ఉత్తానకరణ
|
| 2 |
+
విభాగమగు నొకదానిని కార్ముకాకృతిని పోలిన దానిని 'హనుపాద' మని నామకరణ
|
| 3 |
+
మొనర్చినాడు. అనంగరంగపు పరివర్తితమును పూర్వశాస్త్రజ్ఞులు ఉత్తానకరణముగ
|
| 4 |
+
పరిగణించినారు. ఇది ప్రత్యేక బంధము కాదని విజ్ఞుల అభిప్రాయము. యుగ్మ
|
| 5 |
+
పాదబంధమును అనేకులు అనేక రీతులుగ నిరూపించిరి. పద్మశ్రీ దీనిని తిర్యక్కరణ
|
| 6 |
+
మనినాడు. అట్టయినచో 'ప్రక్కకు తిరిగి పరుండిన నాయిక పాదములు ఎదురుగ
|
| 7 |
+
కూర్చుండిన నాయకుని క్రోడము వద్ద నుంచును'. రతిరహస్యమును బట్టి దీని
|
| 8 |
+
స్వరూపమును గ్రహించుట కష్టము. కొక్కోక గ్రంథానువాదకు డొకడు యుగ్మపాదమున
|
| 9 |
+
నాయికానాయకులిరువురును ఒకరి కొక రెదురుగ ఒక మోకాలిని ముడిచి రెండవ
|
| 10 |
+
పాదమును ముడిచినవారి పాదమున కెదురుగ నిల్చి రమించుట అని పలికినాడు.
|
| 11 |
+
రతిరత్న ప్రదీపికలో నాయిక కాళ్ళను ప్రక్కలకు ముడిచి రెండు పాదముల నొక
|
| 12 |
+
చోటికి చేర్చును. నాయకుడు నట్లే ఆమెకు క్రిందుగ నొనర్చును. కామప్రబోధమున
|
| 13 |
+
నాయకుడు కూర్చొని కాళ్ళు ముడుచుననియును, నాయికయు నట్లే
|
| 14 |
+
యొనర్చుననియును నున్నది. విమర్దిత మర్కటక బంధములకు గలభేద మత్యల్పము.
|
| 15 |
+
ఇందు మొదటి దానియందు భర్త పిరుదులనే వర్తులముగ నాడించును. రెండవ
|
| 16 |
+
దానియందు పైకి క్రిందికి నాడించును. కొక్కోకకారుడు విమర్దితమున నాయిక
|
| 17 |
+
నాయకుని కెదురుగ కూర్చుండు ననియును, మర్కటమున తొడపై కూర్చుండి అటే
|
| 18 |
+
చూచుననియును చెప్పినాడు. ఇది వెనుక మళ్ళ అయిన స్థితకరణము. నాగర
|
| 19 |
+
సర్వస్వమున ఒక మర్కటబంధమున్నది. కాని దానికిని అనంగరంగములోని
|
| 20 |
+
మర్కటబంధమునకు పోలిక లేదు. నాగరసర్వస్వమున స్థితకరణములుగ నున్న అశిన,
|
| 21 |
+
లలితములు - రెండును విపరీత బంధముగ పొడకట్టుచున్నవి.
|
| 22 |
+
|
| 23 |
+
ఉత్థిత కరణములు (Standing Attitudes): మహర్షి వాత్స్యాయనుడు ఉతిత వ్యాన
|
| 24 |
+
కరణముల రెంటిని చిత్రరతములనినాడు. సువర్ణనాభుడు స్థితకరణములను గురించి
|
| 25 |
+
చెప్పలేదు. కాని నీటియందు పరుండి కూర్చొని, నిలచి భూమియందు కంటే
|
| 26 |
+
సుగమముగ సంభోగించవచ్చునని అతని అభిప్రాయమైనట్లు మహర్షి వాత్స్యాయనుడు
|
| 27 |
+
“జలే చ సంవిష్ణోప విష్టస్థితాత్మకాం శ్చిత్రా న్యోగా నుపలక్షయేత్తథా సుకరత్వా దితి
|
| 28 |
+
సువర్ణ నాభః” (2.6.32) అని చెప్పి తదుపరి వానిని శిష్టులంగీకరింపనట్లు వార్తంతు
|
| 29 |
+
తచ్ఛిష్టే రపస్మృతత్వాదితి వాత్స్యాయనః' (2.6.33) అని తన మతమును
|
| 30 |
+
నిరూపించినాడు.
|
Vavilala_Somayajulu_Sahityam-4_Vyasalu/page_0157.txt
ADDED
|
@@ -0,0 +1,31 @@
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| 1 |
+
గురించి చెప్పిన వాక్యములన్నియును సత్యములని వాత్స్యాయనుడు భంగ్యంతరముగ
|
| 2 |
+
నిరూపించినట్లు వ్యక్తమగును. ఇందలి జ్యేష్టావృత్త ప్రకరణమున "జాడ్య ద్సౌశీల్య
|
| 3 |
+
దౌర్భాగ్యే భ్యః ప్రజానుత్పత్తే రాఖీక్ష్యేన దారికోత్పత్తే నాయక చాపలాద్వా సపత్యధిక
|
| 4 |
+
వేదనమ్' (4.2.1) అను సూత్రమున బహుభార్యాత్వ కారణముల జెప్పినాడు.
|
| 5 |
+
సపత్నిక భార్యాలక్షణములు చెప్పిన తరువాత పునర్భువును పేర్కొని ఆమెకు ప్రథమ
|
| 6 |
+
గౌరవము లేదనియును, అందలి అక్షతయోని (అగర్భాదాన క్షతయోని (గర్భాధాన)
|
| 7 |
+
అనుభేదములున్నవనియును చెప్పినాడు. ఇటు పునర్భూ నిర్వచనమున గోనర్దీయ,
|
| 8 |
+
బాభ్రవ్య మతభేదములు నిరూపితములైనవి. బాభ్రవ్యుని పునర్భువు పునర్భువు కాదని
|
| 9 |
+
కామసూత్ర వ్యాఖ్యాత 'యాతు పునః పున్నిష్కా మత్ససౌవేశ్యా విశేషే అంతర్భూతా’
|
| 10 |
+
అని కొట్టివేసి వేశ్యావిశేషముగ పరిగణించినాడు. పునర్భూప్రకరణమున కొన్ని
|
| 11 |
+
సూత్రములలో (996-1002) ఆమెకు వేశ్యకంటే ఉన్నత స్థానము నిచ్చినను ఉపపత్ని
|
| 12 |
+
(Secondary Wife) గ మహర్షి పరిగణించినాడు. దుర్భగా ప్రకరణమున సపత్నీ
|
| 13 |
+
బాధనొందు స్త్రీ తప్పించుకొని నాయకానురాగమును పొందురీతిని అతడు
|
| 14 |
+
విశదీకరించినాడు. అంతఃపురికా ప్రకరణమున అంతఃపుర స్త్రీల విషయమున
|
| 15 |
+
రాజును, జానపదులను భార్య లే రీతి వశమొనర్చుకొన వలయునో చెప్పినాడు.
|
| 16 |
+
భార్యాధికరణ ఫలశ్రుతిగ మహర్షి పలిత “యువతిశ్చ జితక్రోధా యథా శాస్త్ర ప్రవర్తినీ
|
| 17 |
+
హోతి వశ్యం భక్తారం సపత్నీ శ్చాధితిష్ఠతి' అనుమాట సత్యముగ విజ్ఞానప్రదముగ నీ
|
| 18 |
+
యధికరణమును ఆయన చేకూర్చినాడు.
|
| 19 |
+
|
| 20 |
+
వేశ్యవల్ల కేవలము కామము మాత్రమే లభించి పరదారల వలన అర్థకామములు
|
| 21 |
+
లభించుటచే వైశికము కంటే పారదారికాధికరణమును తదుపరి మున్ముందుగ మహర్షి
|
| 22 |
+
పలికినాడు. అందును ముందు స్త్రీ పురుష శీలావస్థాపన మొనర్చి భారతీయుల
|
| 23 |
+
పావిత్య్రలక్షణములను ద్యోతకమొనర్చినాడు.పరదారల పొందవలసిన
|
| 24 |
+
నాయకునకును, నాయకుని పొందగోరు పరదారకును పరస్పరము స్త్రీ పురుష
|
| 25 |
+
శీలావస్థాపన శక్తులత్యవసర మగుటయే ఈ అధ్యాయమును చెప్పుటకు మూల
|
| 26 |
+
కారణము. ఇందు మదనావస్థ ఉత్పత్తి మొదలు ప్రాణాంతము వరకు పదిదశలని
|
| 27 |
+
ప్రాచీనమతమును పేర్కొనినాడు. (5.1.5) స్త్రీలు సర్వసాధారణముగ వ్యావర్తనమును
|
| 28 |
+
పొందుటకు గల కారణములను చెప్పి (5.1.17.42) స్థాలీపులాక న్యాయమున
|
| 29 |
+
చెప్పినానుగాని ఇంకను నిట్టి వనేకములున్న వనినాడు. పరదారలయెడ సంసిద్ధతగల
|
| 30 |
+
పురుషుల నెన్ని, తదుపరి కామసూత్ర కర్త అభియోగ విధానములను, పరిచయ
|
| 31 |
+
కారణములను, బాహాభ్యంతర పరిచయ లక్షణములను చెప్పినాడు. భావపరీక్షా
|