Datasets:
text string |
|---|
RIGHTS RESERVED] - [PRICE Rs, 0 - 12 - 0 |
విశ్వనాథనాయకుఁడు. </p> |
పదునేనవశతాబ్దాంతమున దక్షిణహిందూదేశమునఁ బ్రవర్థమానమై వెలుంగుచుండిన విజయనగరసామ్రాజ్యమును సాళువ నరసింహరాయలవా రప్రతిమాన ప్రతాపాధ్యులై పరిపాలనము సేయుచుండ నాచక్రవర్తికార్యకర్తలలో నొక్కండుగానుండి పే రెన్నికగాంచినవాఁడు కోట్యము నాగమనాయకుఁడు. పవిత్రపుణ్యక్షేత్ర మగుకాంచీపుర మీతని జన్మస్థానము. ఇతనిది కాశ్యపగోత్రము; బలిజ కులము. ఈ త... |
మున కీతఁడు గాంచినది యుపకృతిని మఱువక కృష్ణదేవరాయలు విశ్వాసపాత్రుఁ డయిననీతనియెడ నధికప్రేమను జూపుచుఁ దన 'తోషేఖానా' (ధనాగారము) కధికారిగ నియమించెను. కృష్ణదేవరాయలు విజనగరసామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తుఁడు గాకపూర్వమె నాగమనాయఁడు తనకు సంతానము గలుగ లేదని పరితపింపుచు నూఱుదేవుళ్లకు మ్రొక్కుచు, పుణ్యయాత్రలు సేవింపసంకల్పించి, కాశీ క్ష... |
యొకనాఁడు చక్రవర్తి కొల్వుకూటమునకుఁ గొనిపోయి యాయన సందర్శనభాగ్యమును లభింపఁజేసి యాయనకుఁ గృతప్రణాముఁ డగు నట్లుద్భోధించెను. ఆ సుందరబాలవిగ్రహమునుఁ జూచినతోడనే యతఁ డొకబలాఢ్యుఁడైన శూరశిఖామణియనియు, బుద్ధిమంతుఁడనియుఁ జక్రవర్తికిఁ దోఁచుటయె గాక రాజకీయపరిజ్ఞాతయై మున్ముం దింకను నభివృద్ధికి రాఁగలఁడను నూహతట్టి యాతని స్వకీయభృత్యునిగ గ్ర... |
కృష్ణదేవరాయలవారు కటకము మొదలుకొని కన్యాకుమారిదాఁక దేశము లోపఱుచుకొని విజయనగరసామ్రాజ్యము నవక్రపరాక్రమముతో నేలుచు సుఖసత్కధావినోదములతో విజయనగరమునఁ బ్రొద్దుపుచ్చుచున్న కడపటి |
కాలమున నొక వింతసమాచారముఁ దెలియవచ్చెను. చిరకాలమునుండి దక్షిణహిందూదేశమున సుప్రసిద్ధములైన చోళ పాండ్యరాజ్యములవారు తమలోఁ దా మైకమత్యములేక నిరంతరము పోరాడుకొనుచున్నను దమస్వాతంత్ర్యమునుఁ గోల్పోవక పదునాలుగవశతాబ్దివఱకు నెట్టెటో నెట్టుకొనుచు వచ్చిరి గాని యా శతాబ్దిమొదట తురకలదాడికి నిలువఁజాలక తమ స్వాతంత్ర్యమును గోల్పోయిరి. వాటితోఁ ... |
తోఁ దడుపుచుఁ దన దౌర్భాగ్యదశనంతయు నేకరువుపెట్టి "ఓమహాప్రభూ! సార్వభౌమా! 'దుర్బలస్యబలంరాజా' యను న్యాయము మీ రెఱుంగనిది కాదు; మాకు దిక్కు మీరు గాని యన్యులు గారు; ఏమియాజ్ఞ? యని మొఱలెత్తెను. వీని మెఱల నాలించి రాయలు జాలిగొని కోపోద్దీపితమానసుండై తన 'తోషేఖానా' కధికారి యైన నాగమనాయని రప్పించి వింటివా వీరశేఖరుని దుండగము? వీఁడు మనలఁ... |
చోడునిఠాణాలనుఁ దఱుమఁగొట్టి యారాజ్యమునుఁ గూడ వశపఱుచుకొని రాయలయాజ్ఞ నుల్లఘించి చంద్రశేఖర పాండ్యునికి రాజ్యము నొసంగక రెండురాజ్యములనుగూడఁ దానే పరిపాలనము సేయుచుండెను. అంత నాగమనాయని చర్య కచ్చెరువందుచు చేయునదిలేక నిరుత్సాహుఁడై పాండ్యుఁడు మరల విజయనగరమున కేతెంచి రాయలకు యావద్వృత్తాంతము నివేదించెను. |
అంతట రాయ లాశ్చర్యమునుజెంది "ఇది యేమి చిత్రముగా నున్నది! నీవు మా యాజ్ఞాను నెఱవేర్పక పాండ్యునిరాజ్యము పాండ్యునికీక నీవే యపహరించి పరిపాలించుచున్నావు. ఇట్లు చేయుమని నీకాజ్ఞ నొసంగి యుండ లేదే! ఈ యాజ్ఞాపత్రమునుఁ జూచికొన్న వెంటనే పాండ్యరాజ్యమును పాండ్యుని కిచ్చివేసి మాసన్నిధానమునకు రావలసినది." అని యొక యాజ్ఞాపత్రమును వ్రాయించి ... |
ఇట్లు పంపించిన యాజ్ఞాపత్రమును జదివించుకొని విని మరల తా నీక్రింది విజ్ఞప్తిని బంపుకొనియెనఁట. |
"దేవరవారియాజ్ఞ నుల్లంఘించుటకు నే నెంతవాఁడను; నావిషయమై దేవరవారికి విన్నవింపఁబడిన విషయము లన్నియు సత్యములు గావు; నేను పాండ్యరాజ్యముఁ జేరునప్పటికి రాజ్య మంతయు నరాజకమై యుండెను. ఇంతకుఁబూర్వము చంద్రశేఖరపాండ్యుఁడు రాజ్యముచేయునపుడుకూడ నరాజకముగనే |
యుండెనఁట! రాజ్య మరాజకముగ నుండుటచేతనే వీర శేఖరచోడుఁ డీ రాజ్యము నాక్రమించెను. ఇందుకుఁ గారణము పూర్వపురాజున కీతఁ డౌరసపుత్రుఁడుగాక యుంపుడుగత్తె పుత్రుఁ డగుటవలన నీరాజ్యమునందలి ప్రభువులును, ప్రజలును నీతని పాలన మంగీకరింపక నలుప్రక్కల స్వతంత్రసీమల నేర్పాటుచేసికొని పాలన సేయుచుండిరి. ఈ కారణమున వీరశేఖర చోడుఁడు మంచిసమయము దొరికినని వ... |
గినదానిని గొడ్డళ్ళతోఁ దునుమవలసివచ్చును. మహాప్రభూ! నేను చేసినద్రోహ మేమియును లేదు. నే నింతవఱకు నాజీవితము సామ్రాజ్యసేవయందే గడిపి కష్టపడి యున్నవాఁడను గావునఁ గొంతలాలమయిన సుఖపడ నభిలషించుట తగదా? ఈరాజ్యాభివృద్ధికై నా ద్రవ్యమంతయు వెచ్చఁ బెట్టియున్నాను గనుక నాద్రవ్యమును రాఁబట్టుకొనునంతవఱకు నిచటనేయుండి సామ్రాజ్యమున కేవిధమయిన నప్ర... |
ఈవిజ్ఞాపనముఁజదువుకొన్నమీఁదట గృష్ణదేవరాయలు తోకఁ ద్రొక్కఁబడిన త్రాఁచువలె లేఁచి "ఔరా! నాగమనాయఁ డెంతపనిచేసెను. నమ్మించి స్వామిద్రోహమునకుఁ గడంగెను; ఇంకనేల వీని మన్నింపవలయును; ఈద్రోహి తలఁబట్టి యీడ్చుకొని రాఁ గలిగినవీరపురుషుఁ డెవ్వఁడయిన నీ దర్బారులో నుండెనా యని ప్రశ్నింపుచుఁ గొల్వుకూటము నంతయుఁ దేఱిపాఱఁజూచెను. అందఱు నివ్వెఱపడి... |
గలేచి 'అహో! మన ప్రభూ! దేవరవారియుత్తరు వైనయెడల నిదెపోయి నాగనాయనిఁ గొనివచ్చుచున్నా' నని తడువుకొనక ప్రత్యుత్తర మిచ్చెను. సభ్యులెల్లరు విశ్వనాథనాయని ధైర్యసాహసముల కబ్బురపడసాగిరి. "ఓహో! నాగమనాయని కుమారుఁడవా? ఇదే సందుగాఁ జేసికొని నీతండ్రిని నీవు గలియఁగోరి మాయాజ్ఞనడుగుచున్నావా?' అని యధిక్షేపించెను. అంత విశ్వనాథనాయఁడు "దేవరవారి... |
"మీరు రాయలవారి యుత్తరువును దిరస్కరించి స్వతంత్రముగాఁ బ్రవర్తించుచున్నారు. మిమ్మును తలకొట్టి తెమ్మని యుత్తరు వైనది. అయిన నేమాయను. ఇంతటనైన నుపేక్ష వహింపక పాండ్యుని పాండ్యరాజ్యమునకుఁ బట్టముగట్టి మీరు రాయలవారి సాన్నిధ్యమునకు వచ్చిన యెడల వారితోఁ జెప్పవలసినవిధముగాఁ జెప్పి వారి యాగ్రహము ముడివ రక్షించునటుల ప్రయత్నింతును రండు." |
ఈ జాబు అందినవెంటనే నాగమనాయఁ డాశ్చర్యమును జెంది కుమారునికి రాయలయెడఁగల భక్తివిశ్వాసములుఁ దలపోసి తనలోఁ దాను మెచ్చుకొనుచు నిట్లు ప్రత్యుత్తర మంపెను. |
"కుమారా! నావలె నీవును సామ్రాజ్యమునకు శత్రువులయినవారిని సాధించి సామ్రాజ్యమును విస్తరింపఁ జేసినావు. రెండుతడవులు సామ్రాజ్యము చిక్కులపాలఁ బడినపుడు నిలువఁబెట్టినాము. నీ వెట్టియుపకారము చేసినను దానివలనఁ గలిగిన ఘనత నన్నుఁగూడఁ జెందవలయును గదా! రాయలు మనపట్ల విశ్వాసముగలవాఁ డయినపుడు పాండ్యరాజ్యమును నొక దాసీపుత్రుఁ డనుభవించిన నాయనకు... |
ఈ ప్రత్యుత్తరమును జదువుకొని విశ్వనాథనాయఁడు మరల యిట్లు సమాచార మంపెను. |
"మీరుచేయునదిస్వామిద్రోహము. మిమ్మునమ్మిసమస్త భారము మీ పైని పెట్టిన ప్రభువును మోసపుచ్చి రాజ్యముఁ గట్టుకొని ద్రోహి నాకు తండ్రియని సహించి యపకీర్తి భరిం |
పఁజాలను. మీరు నాకు తండ్రిగాదు. నేను మీకుమారుండను గాను. మీరు సంపాదించిన రాజ్యముతో నాకుఁ బనిలేదు. నా మాట విని మీరు నాతోడ వచ్చెదరా మీకును నాకును శ్రేయస్సు కలుగును. మీ ప్రాణములకు భయములేకుండఁ జేసికొన వచ్చును. ఒకవేళ మీరు యుద్ధమునకే సంసిద్ధులయిన యెడల మీకు దైవము జయము సమకూర్పఁడు. ఏవిధమున నైన నా ప్రతిజ్ఞను నేను నెఱవేర్చుకొని పోద... |
ఇట్టి పల్కులు చెవి సోకఁగా నాగమనాయఁడు కటకటం బడుచు 'ఆహా! నాదురదృష్టము! పుత్రబిక్ష పెట్టుమని విశ్వనాథునిఁగూర్చి తపస్సు చేసినందుకు నా మహాదేవుఁడు తనపై కత్తిచేపట్టు కుమారునిఁ బ్రసాదించెగదా' యని దుఃఖపడి తుదకు ధైర్యము తెచ్చుకొని 'ఇట్టికొడుకు బ్రదికియుండియుఁ జచ్చినవానితో సమానుఁడే యని తలపోసి యెట్టకేలకు నర్జునుఁడు బబ్రువాహనునితోఁ... |
అప్పుడు కుమారుఁడు తన తండ్రి సజీవుఁడై యుండఁ బట్టువడుట తన యదృష్టముగా భావించి సంతోషముతో నతని నొక యంబారీమీఁద నెక్కించి వానిచుట్టును తనపారాకడాయించి విజయనగరమునకుఁ గొనిపోవుచు యావద్వృత్తాంతమునుఁ బూసగ్రుచ్చినటుల యొక జాబులో లిఖించి ముందుగా నాలేఖను రాయలవారికిఁ బంపించెను. కృష్ణదేవరాయలవా రాలేఖను గాంచి యపరిమితానందమునుఁ జెంది యానాఁడు... |
"విశ్వనాథనాయఁడు స్వామికార్యము నెట్లు నిర్వహించుకొని తనప్రతిజ్ఞను మఱువక తనతండ్రిని సజ్జివునిగాఁ జెఱపట్టి దర్బారునకుఁ గొనివచ్చు చున్నాఁడో విన్నారు గదా? నాఁడు మీ రెల్లరును నాగమనాయనికి వెఱచి యీ మహాకార్యము నిర్వహింప శక్తి చాలనివార మని చెప్పఁగా యువకుఁ డగువిశ్వనాథనాయఁడు తాను నిర్వహింతునని లేచినపు డాతఁ డెందఱపరిహాసములకుఁ బాత్రు... |
అని యాజాబును దనకొల్వుకూటమున నున్న వారి కెల్లరకుఁ దెలియునట్లుగాఁ జదివింపఁ జేసెను. ఎల్లవా రాశ్చర్య నిమగ్నులైరి. ఇతఁడు మనుష్యమాత్రుఁడుగాఁ గన్పట్టఁడు. కేవలము విశ్వనాథుఁ డీరూపమున నవతరించి |
యుండఁబోలు" నని బహువిధముల నాతని శ్లాఘించిరి. కృష్ణదేవరాయలవారు తనసంతోషమును బట్టజాలక యిరుబుజములు పొంగిపోవుచుండ "ఓహో! ఇటువంటి బంటునకు నేలికనై యుంట నేను ధన్యాత్ముఁడ నగుటచేతనేగదా సంభవించెను! మీవాక్కులు నిక్కువములు. ఆతఁడు మనుష్యులలోఁ బరిగణింపఁ దగినవాఁడు గాఁడు. ఇతఁ డొకనాడు అడవి దున్నపోతును నఱకి నాప్రాణమును రక్షించినవాఁడు. ఇటువ... |
"స్వామీ! విశ్వనాథనాయనికి రాజ్యపేక్ష లేదు. ఉన్నచో నాతఁడు తండ్రితో నేకమై మన మీఁదికి దాడిచేసియే యుండును. అపుడు వారిని మనము జయించుటయు సుసాధ్యము గాకుయుండును. అతఁడు విశ్వేశ్వరాంశ సంభూతుఁడు గనుకనే విద్వౌసపాత్రుఁడై స్వామికార్యమును నిర్వహించుకొని వచ్చు చున్నాఁడు. ఈ కలికాలమున నిట్టి వీరకృత్యములను వినఁజాలము, కనఁజాలము. తలపోసినకొలఁ... |
నారము. ఇఁక మీరింటికి పొం" డని రాయలు విశ్వనాథనాయని కుత్తరువు చేసెను. అంత విశ్వనాథనాయఁడు తన తండ్రిని చెఱనుండి విడిపించి యింటికిఁ దీసికొనిపోయి 'ఇఁక నేను మీ కుమారుఁడను; మీరు నాకు తండ్రులు; ఇంత పర్యంతము నేను మీకు శత్రువునుగాఁ బ్రవర్తించితిని; నన్ను క్షమింపు'మని శతవిధముల వేడికొని తండ్రిగారిని స్నానముచేయించి నూతనవస్త్రములనుఁ ... |
ఇటులు సుఖసంతుష్టుఁడైయుండి యొకనాఁడు నాగమనాయఁడు కుమారుని రప్పించి "నీవు రాజ్యము చేయవలయునను తలంపుతో నింతయెత్తు యెత్తినాను గాని మఱియొకటి గాదు. నాకు రాజ్యకాంక్ష లేదు. ఇంక నేను పరలోక సాధనమును జూచికొనియెదను. ఇంతవఱకు నేను సంపాదించిన ద్రవ్యమంతయు నున్నది. దీనిని తీసికొమ్ము. నీకు రాయలవారు రాజ్యము నిచ్చెదరు. చక్కఁగా నేలుకొమ్ము" అన... |
అంత నతఁడు "నాయనా! మీరార్జించిన ధనమును మీరే దానధర్మములు చేసికొని మీరే యనుభవింపుఁడు. నా కక్కఱలేఁదని ప్రత్యుత్తరము పలికెను. అందుకు సమ్మతింపక నాగమనాయఁడు తనపెద్దలు కూడబెట్టిన ధనమును, తా నార్జించినధనమునుఁ గూడఁ జూపించి దానినంతయు గైకొని సద్వినియోగమునకుఁ దెమ్మని కుమారునికి బోధిం |
చెను. విశ్వనాధనాయఁ డాధనము నంతయుఁ గాంచి యెట్లీతఁడింత ధనమార్జింపఁగలిగెనా యనియాశ్చర్యముఁ జెందెను. |
ఇ ట్లచ్చెరువందుచున్న కుమారుని జూచి 'పుత్రా! ఈ మధురానగరము నాకిష్టదైవములగు మీనాక్షీసుందరేశ్వరులకు నిలయమై దివ్యస్థలముగాఁ బేరుగాంచి యున్నది. ఒకనాఁడా మీనాక్షీదేవి నాకు స్వప్నములోఁ గానుపించి నీకుమారుఁడు విశ్వనాథనాయఁడు నా సన్నిధానముననుండి యీపాండ్యరాజ్యమునంతయు నేలుటకు సమర్థుఁ డయి యుండు నని చెప్పియున్నది. ఈ యర్థమునంతయుఁ దీసికొన... |
ఇట్లు రాయలు ప్రశంసించిన వెనువెంటనే చంద్రశేఖరపాండ్యుఁడు వినమ్రుఁడై లేఁచి సభాసదులెల్లరు విను |
చుండఁ దన యభిప్రాయమంతయు విస్పష్ట మగునట్లుగా 'మహా ప్రభూ! ఈ రాజ్యపరిపాలనము నావలన నగునది కాదని నే నెఱుంగుదును; ఒకవేళ నే నీరాజ్యమును కోరినా చోళరాజు నన్నుఁ బ్రాణముతో విడిచిపెట్టువాఁడు కాఁడు; ఇదియుఁగాక మాతండ్రితాతలకు నుంపుడుసంబంధాలవలనఁ బుట్టినవారు శ్రీవిల్లిపుత్తూరు, తెంగాశి, రాచపాళియము మొదలగుస్థలములలో నున్నవారు; వారు నన్ను త... |
కృష్ణదేవరాయలవా రందులకు సమ్మతించి విశ్వనాథనాయనివారిని గాంచి యిట్లు పలికిరి. |
ఇదివరకు నీవు మాకును, మా సామ్రాజ్యమునకును పెక్కులుపకృతులు గావించి యున్నావు. ఇంతియగాక మీ తండ్రిగారు మమ్మును లక్ష్యముసేయక మాయాజ్ఞను నిరాకరించినపుడు స్వామికార్యమే పరమ ధర్మమని యెంచి |
ణలేక వ్యధలం బడియుండుటయుఁ గన్నులారఁ గాంచి మిక్కిలి విచారించెను. వీని నన్నిటిని జక్కపఱచి రాజ్యమును సౌభాగ్యస్థితికిఁ గొనివచ్చుటకు రాణువలోనిబొక్కసము చాలదని తలపోసి తనతండ్రి యొసంగిన ద్రవ్యమునంతయు నాతనియిష్టానుసారముగా వ్రయపఱచి సఫలీకృతమనోరథుఁ డగుటకు సంకల్పించి మిక్కిలి సమర్థుఁడయిన 'అరియనాధ మొదలారిని ముఖ్యమంత్రిగను, దళవాయిగ నేర... |
తమ్ముఁ డచ్యుతదేవరాయలవారు విజయనగరసామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తులయిరి. అప్పుడాయన తన మఱదలి పెనిమిటి యైన చెన్వప్పనాయనివారిని చోళ రాజ్యప్రతినిధిగా నియమించిరి గావున నప్పటినుండియు నారాజ్యము విశ్వనాథనాయని వారి పరిపాలనమునుండి తొలఁగిపోయెను. రాయలవారి యుత్తరువు ననుసరించి తిరుచునాపల్లె మధురరాజ్యమునకును వల్లము తంజాపురరాజ్యమునకును జేర... |
మఱియు విశ్వనాథనాయనివారు శ్రీరంగము, తిరుచునాపల్లె దేవాలయముల విషయమై మిగుల శ్రద్ధవహించి యనేకరీతులుగా వానినభివృద్ధికిఁ దీసికొనివచ్చెను. ఈయనకాలముననే సుందరమైన తెప్పాకుళమనెడు కోనేరు నిర్మింపఁబడి తిరుచునాపల్లె కొకవినూతన మైనసౌందర్యమును గలుగఁజే |
సెను. శ్రీరంగదేవాలయము ననేకనూతనభవనములతో నలంకరింపఁజేసి కన్నులపండు వౌనట్లుగా దిద్ది తీర్పరింపఁజేసెను. ఈదేవాలయ రక్షణకొఱకు మూఁడులక్షలపొన్నుల ద్రవ్యమును వెచ్చించెను. ఈప్రాకారములలోపల జనులు నివసించుటకై యనేకగృహములను గట్టించెను. ఇట్లు ప్రధాన దుర్గములను ముఖ్యములయిన దివ్యక్షేత్రములను చక్కపఱచుకొనుటకై విశేషద్రవ్యమును వెచ్చబెట్టి కృత... |
ఇట్లు తెంగాశి పాండ్యులను జయించినవెనుక విశ్వనాథనాయని వారు తన ప్రధానమంత్రితోఁగలసి రాజ్యాభివృద్ధి మార్గముల నాలోచించి యందుకుఁ దగినకృషి ప్రారంభించెను. తిన్నెవెల్లి పట్టణమును విస్తరింపఁజేసి యభివృద్ధి పఱచెను. దేవాలయములను నిర్మించెను. ఎట్లు గ్రామపరిస్థితులఁ జక్కచేసి పరిపాలనము నడుపవలసియుండునో యారీతి నడుపునట్లు గావించెను. |
చెఱువులను, కాలువలను ద్రవ్వించి తనరాజ్యము నందలి గ్రామాదులలోని వ్యవసాయకులను భూములనిచ్చియు, ధనము నొసంగియుఁ గృషివ్యాపారము లభివృద్ధి నొందునటులు మనఃపూర్వక మైనప్రేమను జూపుచుఁ బ్రవర్తించెను. అందువలన వ్యవసాయ మభివృద్ధిని గాంచెను. దేశమునందంటట క్రమమైనశాంతి నెలకొనియెను. ఇతనిపరిపాలనమునఁ బ్రజలు సంతృప్తిఁ గాంచిరి. ఈతనిరాజ్యమున కుత్తరమ... |
వంతు కప్పముక్రింద రాజ్యాంగమునకుఁ జెల్లించుచుండిరి. యుద్ధకాలములందుఁ దమ ప్రభువాజ్ఞయైనయెడల మఱియొక మూఁడవ వంతు రాఁబడి సైన్యముల క్రిందను వినియోగించి వారికిఁ దోడ్పడుచుండిరి. తక్కిన రాఁబడిని వారు స్వేచ్ఛగా ననుభవింపుచుండిరి. రాజ్యాంగమునం దిట్టిపద్ధతు లవలంబించుటవలన పాళెగాం డ్రందఱును విశ్వనాథనాయనివారిపట్ల భక్తివిశ్వాసములతోఁ బ్రవర... |
ఇత డత్యంత బాహుబలాఢ్యుఁ డని తెలుపుటకుఁ గాఁబోలు స్థానిక చరిత్రములయం దతిచిత్రము లగు కథలు కొన్ని వక్కాణింపఁబడి యున్నవి. అట్టివానిలో నొక్కిఅకథను మాత్రము చదువరుల వినోదార్థ మిందుఁ దెలుపుచున్నారము. |
పాండ్యరాజ్యమునకుఁ దామే హక్కు దారులమని తొలుదొల్త విశ్వనాథనాయనివారి నెదుర్కొని పోరాడినవారు |
తెంగాశి పాండ్యులని యింతకుఁ బూర్వము తెలిసికొనియున్న వారము. తెంగాశి పాండ్యు లైదుగురు వీరు పంచపాండ్యులని పరఁగినవారు. పంచపాండ్యులనునది ప్రాచీనకాలమునుండి వ్యవహరింపబడుచున్న సమాసపదముకాని నేడు క్రొత్తగ సృజింపఁబడినది కాదు. వీరిలోఁ బరాగ్రమపాండ్య దేవపెరుమాళ్లనునతఁడు ప్రముఖుఁడుగా నుండెను. వీరికి కులశేఖరదేవుఁ డను నామాంతరము గలదు. ఇత... |
అట్టితలవంపులను విశ్వనాథనాయనివారు భరింప జాలక రెండవమాఱు తానే మహాసైన్యముతో దండెత్తిపోయి వారల దుర్గమును ముట్టడించి యాఱుమాసములవఱకు ఘన ప్రయత్నములు గావించినను దుర్గము స్వాధీనమురాకపోవుటయెగాక యుభయసైన్యములును నాశనమునొందుచుండుటఁ గన్నులారగాంచెను. |
'అయ్యో! నాయొక్కనిలాభమునిమిత్త మెన్నోకుటుంబములు దిక్కులేక దుఃఖభాజనము లగుచున్నవి. ఒక్కనిసంతృప్తికై పెక్కుకుటుంబములను దుఃఖపరంపరలలో ముంచెత్తివిడుచుట ధర్మముగాఁ గన్పట్టుచుండలేదు' అని తలపోసి పశ్చాత్తాపమును దెలుపుచు నీ క్రింది జాబును వ్రాసి యొక దూతచేఁ దనప్రతిపక్షులకుఁ బంపెను. |
"మీరైదుగురు, నేనొక్కఁడను. మననిమిత్తమై ప్రజలు దుఃఖపరంపరల పాలగుచున్నారు. అట్లు జరుగరాదు. మనము యుద్ధములను జాలించి మనసైన్యములను దూరముగా నిలిపి పోరాటముడిగించి యుభయసైన్యములనడుమ నొక శిలాస్తంభమునాటి మీరైదుగురును నాయొక్కనితో ద్వంద్వ యుద్ధమునకుఁ గడంగవలసినది. మీరు జయించిరా యీరాజ్యమును గైకొనుఁడు. నేను జయింతునా మీ రాజ్యమును విడిచి ... |
ఈ పయిజాబును వారు చూచుకొని 'మీ రొక్కరును మా యైదుగురుతోఁ దలపడుటధర్మము కాదు; మాలో నొక్కఁడు మాత్రము వచ్చును. మీరు వచ్చి వానితోఁ దల |
పడుదురా! అట్లయినపక్షమున మీకోరికప్రకారము నడువంగలవార' మని ప్రత్యుత్తరము వ్రాసి విశ్వనాథనాయనివారికిఁ బంపిరఁట. విశ్వనాథనాయనివారి పౌరుషపరాక్రమములుపాండ్య వీరులైదుగురు దలపడినను వెనుదీయ నట్టివికావు. కనుక మరల యతఁడు 'మీరైదుగురు నైదుసీమలకు ప్రభువులుగ నున్నారు. నే నొక్కఁడనైయుండియు మిమ్ములను జయించి మీసీమల నొడిచికొనవలయు నని వచ్చియున... |
వా రంగీకరింపక తమలో బాహుబలపరాక్రమ వంతుడైనవాని నేరుకొని యంగరక్షకై కవచమును దొడిగి యశ్వారూఢుని గావించి వాని కొక ఖడ్గము నొసంగి యుద్ధముచేయుటకై నిర్ణీతరంగస్థలమునకుఁ గొనివచ్చిరఁట! |
ఈద్వంద్వయుద్ధము ముగియుట కెంతోకాలము పట్టలేదు. విశ్వనాథుఁడు తుదకంగీకరించి తానును యుద్ధసన్నద్ధుఁడై రంగస్థలమున కుఱికి 'మొట్టమొదట నీవే కొట్టుమని పాండ్యవీరుని నాహ్వానించెనట! ఆతఁ డట్లే యొక్కవ్రేటువేసెను. విశ్వనాథుఁడు తనఖడ్గముతో నావ్రేటు తప్పించుకొనియెనట. అంత పాండ్యుఁడు విశ్వనాథనాయని వ్రేటువేయమని పలికెనఁట! అతఁడు నిరాకారించి పా... |
పాండ్య దేవుఁడే' యనియుఁ దక్కినవారు విశ్వనాథనాయని వారికి సామంతులై మైత్రితితోఁ బ్రవర్తించి రని మనము నిశ్చయింపవచ్చును. |
ఈవిశ్వనాథనాయనివా రెంతసమర్థుఁడైనను, ఎట్టిరాజ్య తంతజ్ఞుఁడైనను, ఒకటి రెండుమాఱులు సామ్రాజ్యము వారి సహాయమును గోరక తప్పినది కాదు. ఇతఁడు తెంగాశి పాండ్యులతోఁ బోరాడుచున్న కాలమున పోర్సుగీసువారు సముద్రతీరమునందు నివసింపుచు ముత్తెపు చిప్పలను సముద్రమునుండి దేవి తెచ్చి వ్యాపారము చేసెడి పరవజాతివారిని పెక్కండ్ర క్రైస్తవమత ప్రవిష్టులనుగ... |
విజృంభణము నడగించి వారినుండి కప్పములు గైకొని యాభాగములందు శాంతి నెలకొనునటుల పాండ్యరాజ్యమును బలపఱచి విశ్వనాథనాయనివారి పరిపాలనమును దృఢపఱచి రావలయునని పెనుగొండరాజ్యాధిపతియైన విఠ్ఠలరాయని, వీని తమ్ముఁడును, చంద్రగిరిరాజ్యాధిపతియైన యౌకు చినతిమ్మరాజును దక్షిణదేశమునకుఁ బంపించెను. విఠ్ఠలదేవరాయలు రాజప్రతినిధిగా నియమింపఁబడియెను. విశ్... |
తిరువడి రాజ్యాధిపతి యగు భూతల శ్రీవీరరామవర్మయును పోర్చుగీసువారును క్రైస్తవమత మవలంబించిన పరవజాతివారును దక్షిణదేశమున సామ్రాజ్యాధికారమును దొలఁగించి యాస్థానమున పోర్చుగీసువారి రాజ్యాధికారమును స్థాపించుటకై ప్రయత్నించిన విధానమును భగ్నపఱచుటకును, ఈ ప్రాంతదేశమున విజయనగర సామ్రాజ్యప్రతిష్ఠను స్థిరముగా నెలకొల్పుటకును విఠ్ఠలరాయలు నియ... |
మాకరాజును, వెంకప్పనాయఁడు ననువారు. వీరినిఁ బ్రతిఘటించి వీరి దుష్ప్రయత్నములను భగ్నపఱచి శాశ్వతమైన విజయకీర్తిని గాంచినవాఁడు యాచమనాయఁడు. ఇతఁడు పద్మనాయకకులాభరణము,వేంకటగిరిపురాధీశ్వరుఁ డయిన వెలుగోటి యాచమనాయనిమనుమఁడు. కాళహస్తిపురాధీశ్వరుఁ డయిన దామర్ల వెంగళనాయని దహోత్రుఁడు. ఇతనితండ్రి కస్తూరి రంగప్పనాయఁడు. తల్లి వేంకటాంబ. వీ రె... |
సాధ్య మగుచున్నవి. అందుగుల వెంకయవిరచిత మగు నరపతివిజయమునందు :- |
"సీ. పరమపాతివ్రత్యగరిమచే మిక్కిలి |
యతిశయిల్లినవెంకటమ్మగారిఁ |
జిరయశోనిధి యైనజిల్లేళ్ల రంగనృ |
పాధిపు పుత్రి నోబమ్మగారి |
జిల్లేళ్లకృష్ణరాట్చీతమయాఖు ప్రి |
యాత్మజ యైనకృష్ణమ్మగారి |
భూరి శౌర్యోగ్ర గొబ్బూరి యోబక్షమా |
ధ్యక్షు తనూజఁ గొండమ్మగారి |
గీ. నెమ్మివరుసఁ బాణిగ్రహణమ్ముఁ జేసి |
Telugu OCR Dataset
A corpus of aligned scanned page images and human-transcribed Telugu text, sourced from Telugu Wikisource. Built for OCR model training and evaluation.
Stats
| Total page pairs | ~25,565 |
| Books | 221 |
| Total size | ~11 GB |
| License | CC BY-SA 4.0 |
Dataset Structure
dataset/
<book_title>/
page_0001.jpg ← scan image
page_0001.txt ← transcribed Telugu text (UTF-8)
page_0004.jpg
page_0004.txt
...
meta.json ← per-book metadata
corpus_profile.json ← index of all books with quality and curation details
curation_decisions.json ← approved/excluded status for every book in the manifest
Page numbers are not always consecutive — gaps indicate pages with no transcription available.
corpus_profile.json
Top-level file. One JSON object per book covering every book in the original manifest (including excluded ones).
| Field | Type | Description |
|---|---|---|
index_title |
string | Wikisource index page title (unique identifier) |
filename |
string | Original PDF filename on Wikimedia Commons |
page_count |
int | Total scan pages in the source PDF |
mime_type |
string | MIME type of source file (usually application/pdf) |
size_mb |
float | Source file size in MB |
telugu_ratio |
float | Fraction of non-whitespace, non-digit characters in the Telugu Unicode block (ఀ–౿), sampled from 3 evenly-spaced pages |
telugu_pct |
float | telugu_ratio as a percentage |
no_transcriptions |
bool | true if no transcribed pages were found on Wikisource |
quality_samples |
int[] | ProofreadPage quality levels from sampled pages (see Quality Levels below) |
quality_avg |
float | Mean of quality_samples |
quality_label |
string | Human-readable label for round(quality_avg) |
decision |
string | "approved" or "excluded" |
exclusion_reason |
string | Why the book was excluded (empty if approved) |
decided_at |
string | ISO 8601 timestamp of the curation decision |
auto_decision |
bool | true if decided automatically by the pipeline |
profiled_at |
string | ISO 8601 timestamp of language profiling |
Approved books pass all three criteria: ≥ 80% Telugu script ratio, ≥ 50 scan pages, and at least one transcribed page.
dataset/<book>/meta.json
One file per book directory. Describes what was actually downloaded.
| Field | Type | Description |
|---|---|---|
status |
string | "done" if completed successfully |
saved |
int | Number of page pairs (image + text) saved |
total_pages |
int | Total scan pages in the source PDF |
filename |
string | Original PDF filename |
pages |
object | Map of "page_number" → { "quality": int } for every downloaded page |
The pages object contains only pages that have both an image and a transcription. Pages missing from this map either had no transcription or failed to download.
Quality Levels
From the Wikisource ProofreadPage extension:
| Level | Label | Meaning |
|---|---|---|
| 0 | no_text |
Blank or image-only page |
| 1 | not_proofread |
Transcription exists but has not been reviewed |
| 2 | problematic |
Flagged as having errors |
| 3 | human_proofread |
Reviewed and corrected by a human editor |
| 4 | validated |
Reviewed and validated by a second human editor |
Levels 3 and 4 are the most reliable ground truth for OCR evaluation.
Source & License
All text transcriptions and original book scans are from Telugu Wikisource and are licensed under CC BY-SA 4.0. Attribution: Telugu Wikisource contributors.
Author
Alberto J. Chestnut Contact: data@chest.nu
Citation
If you use this dataset, please cite:
@dataset{chestnut2026telugu,
author = {Chestnut, Alberto J.},
title = {Telugu OCR Dataset},
year = {2026},
publisher = {Hugging Face},
note = {Sourced from Telugu Wikisource (CC BY-SA 4.0)},
url = {https://huggingface.co/datasets/AlbertoChestnut/telugu-ocr},
doi = { 10.57967/hf/9079 }
}
- Downloads last month
- 28