id stringlengths 17 17 | image imagewidth (px) 131 3.62k | text stringlengths 30 2.12k | match_score float32 85 100 |
|---|---|---|---|
telugu_ocr_000001 | మీకు ఊహ వచ్చినప్పటినుంచీ నన్ను మీ చిట్టి చిట్టి చేతులతో 'చందమామ రావే, జాబిల్లి రావే', అని పిలుస్తూ ఉండేవాళ్లు. మీరే కాదు; మీలాగా మీ అమ్మ, మీ నాన్న, మీ అవ్వ, మీ తాత, మీ ముత్తవ, మీ ముత్తాత, ఆయన తండ్రి, ఆయన తాత, అందరూ నన్ను 'మామా' అనే పిలిచేవాళ్లు. నేను నవ్వేవాణ్ణి. నా నవ్వుచూస్తే మీకు ఎకడలేని సంతోషం. నన్ను తెచ్చిపెట్టమని అమ్మతో పోరు పెట్టేవాళ్లు! చూశారూ? మీరేకాదు, శ్రీరాముడు కూడా వెనక ఇలాగే పోరుపెట్టాడు. అప్పుడు వాళ్ల అమ్మ కౌసల్య ఏమిచేసిందనుకున్నారు? అద్దం | 90.967743 | |
telugu_ocr_000002 | అయితే నేను మీ ముత్తాతల, తాతల, తండ్రుల కాలంలో రాలేకపోయాను. కాని ఇప్పుడు. వస్తున్నాను. మీకూ, మీ చెల్లెళ్లకూ, అక్కలకూ, అన్నలకూ, తమ్ముళ్లకూ కనిపిస్తాను. క్రింద భూలోకంలో, పైన ఆకాశంలో నేను చూసిన వింతలు, విడ్డూరాలు అన్నీ చెప్పుతాను. నాకు తెలిసిన కధలు, శాస్త్రాలు, పాటలు, పదాలు, గమ్మత్తులు, అన్నీ మీకు వినిపిస్తాను. ఇదుగో ఇప్పుడు కొన్ని చెప్పుతున్నాను. ఇప్పటి కివి చాలుకదూ? చాలకపోతే నాకు చెప్పండి. వచ్చే నెల వాటి అన్నిటితో మీ దగ్గరికి వస్తాను. | 95.161293 | |
telugu_ocr_000003 | హారన్ ఊత్తూ రావే, ఆకలికధలు తేవే కొండెక్కి రావే, కోటి వేలు తేవే ఒలిచిన చోకలేట్లు ఒళ్లో పెట్టుకొని కరిగిన ఐస్క్రీం చేత్తో పట్టుకొని అలా అలా అలా వచ్చి, మా తెలుగుపిల్లల తీపి నోట్లో పోసిపోవే. | 96.236557 | |
telugu_ocr_000004 | వెళ్లాలి ఉడతా, ఉడతా! ఉ డ త హెూరుగాలి కొట్టొచ్చు, కారుమబ్బు పట్టొచ్చు, ఏరోప్లేను తేలేను సీతా, సీతా, నే యూరోపు రాలేను సీతా, సీతా! సీత స్టీమరేనా తెచ్చావా, ఉడతా, ఉడతా, నే సీమకెళ్లి రావాలి, ఉడతా, ఉడతా! ఉ డ త ఏ తుపాను వస్తుందో! ఏ కెరటం లేస్తుందో! స్టీమరేనా తేలేను సీతా, సీతా! నే సీమకేనా రాలేను సీతా, సీతా! | 90.099007 | |
telugu_ocr_000005 | రైలుబండి తెచ్చావా ఉడతా, ఉడతా, నే రామేశ్వరం' వెళ్లాలి ఉడతా, ఉడతా! ఉ డ త అడుగడుక్కి వంతెనలు, నడుమ నడుమ సొరంగాలు, రైలుబండి తేలేను సీతా, సీతా, నే రామేశ్వరం రాలేను సీతా, సీతా! సీ త కారుగాని తెన్చావా ఉడతా, ఉడతా, నే కాకినాడ వెళ్లాలి ఉడతా, ఉడతా ! | 88.741722 | |
telugu_ocr_000006 | నక్క ఉండేది. అది చాలా జిత్తుల మారిది. అది ఎక్కడినించి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు. దానితరహా అంతా చిత్రంగా ఉండేది. అందుకని మిగతా నక్కలన్నీ “నువు తినవచ్చు, మిగతావి అమ్ముకుని పొది మా కులముదానివేకాదు పొ" మన్నవి. దానితో మాట్లాడటంకూడా మానివేసినై. | 88.841202 | |
telugu_ocr_000007 | ఇక నక్క ఏమిచేస్తుంది ? అక్కడ తన ఆటలు సాగకపోయేవరకు అడివికి దగ్గరగా ఉన్న ఊరు పోయి అక్కడ మంగలివానితో స్నేహం చేసుకున్నది. | 99.145302 | |
telugu_ocr_000008 | అతనికి ఈ నక్క సంగతి తెలియదు. పైగా నక్క చాలా పెద్దమనిషిలాగా తియ్యతియ్యగా మాట్లాడేది. అది నిజమని మంగలి | 96 | |
telugu_ocr_000009 | వాళ్లిద్దరికీ మంచిస్నేహం కలిసింది. ఒకనాడు నక్క మంగలితో అన్నది కదా "మంగలి మామా, మంగలి మామా ! మనం పళ్లతోట వేసుకుం టే ఎట్లా ఉంటుంది ? మనం తిన్నన్ని నిండా డబ్బులు పోసుకోవచ్చు.” పాపం మంగలికి ఈ మాట లు వినేవరకు నోరు వూరింది. మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరిటి మొక్కలూ తెచ్చి తోటవేశాడు. అక్కడక్కడా గుమ్మడిపాదులూ, దోసపాదు లూ పెట్టాడు. తనూ పెళ్లామూ కలిసి పాదులుచేసి, నీళ్ళు తెచ్చి. చెట్లకు పోసేవాళ్ళు. నక్క పైన కర్రపెత్తనం చేస్తూ | 93.060295 | |
telugu_ocr_000010 | బావా ! తోటలో కాయలేమైనా ఉన్నా యా?" అని అడిగాడు. “ఇప్పుడెక్క డివి ? వానాకాలం వస్తేగా దొరికేదీ ?" అన్నది నక్క. పాపం, మంగలి నమ్హాడు. వానాకాలంవచ్చినాక అడిగాడు. “వానాకాలంలో ఎక్కడన్నా కాయలు ఉంటాయా? చలికాలం రావాలి " అన్నది. చలికాలం వచ్చినాక అడిగితే, "పిచ్చివాడా ! చలికాలంలో కాయలు దొరుకుతాయా, పిందెలు ఉంటాయి. ఎండాకాలంలో అడుగు," అని ఇట్లా ఏదో ఒకసాకు చెప్పుతూ మంగలిని ఒక కాయ తిన నివ్వలేదు. ఇంతలో ఎండా కాలం వచ్చింది. కాయలు కాచినై. నక్క ఒకనాటి రాత్రి అడివికిపోయి మిగతా | 95.092697 | |
telugu_ocr_000011 | నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని వాటినన్నిటినీ విందుకు పిలిచింది. అవి వచ్చి, పొట్ట పట్టినన్ని తిని, మిగతావి తుంచి, కొరికి, మట్టిలో పారవేసిపోయి చక్షా పండుకొన్నవి. | 94.805191 | |
telugu_ocr_000012 | పాపం, మర్నాడు పొద్దున మంగలి వచ్చి తోట చూసుకుంటే కళ్ల వెంబడి నీళ్ళు వచ్చినై. చెట్లుని ఒక్క కాయ లేదు. ఒక్కమూలనుమాత్రం గుమ్మడి పాదుకు ఒక గుమ్మడికాయ ఉంది. అదీ ఆకులు కమ్మి ఉండటం మూలాన కనపడటంలేదు. నక్కచేసిన మోసానికి దాన్ని దండించాలనుకున్నాడు మంగలి . ఇంటోకిపోయి పొదిలో నుంచి మంగలి కత్తులు తీసి బాగా సానపట్టి గుమ్మడి కాయకి చుట్టూ కట్టాడు. ఆ కత్తులు కనపడ కుండా ఆ కులు అడ్డం | 96.153847 | |
telugu_ocr_000013 | నెత్తురు కారకుండా ఉంటుందా ? నెత్తురు కారటం ఆగినతర్వాత బయలుదేరుదా మనుకున్నది. కాని ఆ నెత్తురు ఎండి గడ్డకట్టి అందులో ఇరుక్కుపోయింది. అందులోంచి కదలాలేదు, మెదలాలేదు. నకకి మంగలిమీద భలేకోపం వచ్చింది. "నన్ను ఇందుట్లోనించి బయటికిరానియ్యి వీడిపని పట్టకపోతే:” అని శపధం చేసింది. | 97.397766 | |
telugu_ocr_000014 | పాపం: ముందు ఇది బయటపడితే కదా మంగలిపని పట్టటానికి. అబ్బాయి లూ. మనంకూడా చూద్దాము, నక్క వాడిపని ఎట్లా పట్టుతుందో | 93.212669 | |
telugu_ocr_000015 | అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరి బైట వాములదొడ్లో ఒకపిల్లి ఉండేది. దానికో బుల్లి పిల్లికూన పుట్టింది. పాపం : పిల్లికూనని కన్న వెంటనే దాని తల్లి చచ్చిపోయింది. తల్లి లేని పిల్లికూనకి పిల్లిభాష తెలియనేలేదు. | 98.453606 | |
telugu_ocr_000016 | పాపం, ఆకలితో ఆవు రావురు మంటూ పిల్లికూన వీధిలో పడింది. ఏడుస్తూ నడుస్తోంది. దారిలో దానికొక కుక్కపిల్ల కనబడింది. పిల్లికూనని కుక్కపిల్ల అడిగిందిగదా: | 100 | |
telugu_ocr_000017 | కుక్కపిల్ల అంది : 'భౌభౌమని అరుస్తాను పసందైన కుక్కభాష పాలు నీకుకావాలా భౌభౌమని అరిచిచూడు.' | 96 | |
telugu_ocr_000018 | “ఓహో! ఆకలేస్తోందా పిల్లికూనా, పాలు తెస్తాను తాగు”అని శారద ఒక పళ్లెంనిండా పాలుపోసి తెచ్చింది. పిల్లి కూన సంతోషంతో పాలన్నీ తాగింది. తరవాత పిల్లికూనా, శారదా చాలా సేపు ఆడుకున్నారు. ఆఖరికి అలసిపోయి శారద నిద్రపోయింది. పిల్లి కూనకూడా ఒకమూల హాయిగా నిద్రపోయింది. | 98.224854 | |
telugu_ocr_000019 | పిల్లలు ఉండరు. అతని కాపేరు ఎలా వచ్చిందనుకున్నారు? తెనాలిలో పుట్టాడు కనుక తెనాలి రామలింగ మయాడు. ఆ రోజుల్లో తెనాలి చిన్న ఊరు. | 97.991966 | |
telugu_ocr_000020 | చిన్నప్పటినుంచి రామలింగం వట్టి చిలిపివాడు. ప్రతివాళ్లనీ పేర్లు పెట్టే వాడు. అతనికి నదురు బెదురు ఏ కోశానా ఉండేది కాదు. తనకు నచ్చనిదాన్ని వెక్కిరించటంలో మొనగాడు. | 99.68454 | |
telugu_ocr_000021 | ఒక రోజున రామలింగం వీధిలో ఆడుకొంటూవున్నాడు. ఒక యోగి ఆ దారిని పోతూ అతన్ని చూచాడు. రామలింగం రూపురేఖల్లోనూ, అతని మాటల్లోనూ యోగికి తెలివితేటలు కనిపించాయి. వెంటనే ఆయన రామలింగాన్ని దగ్గిరకు పిలిచి శక్తి మంత్రం ఉపదేశించి యిలా చెప్పాడు: | 98.030632 | |
telugu_ocr_000022 | "నాయనా! ఈ మంత్రం వెయ్యిసార్లు కాళికాదేవి గుడిలో జపిస్తే, దేవి నీకు ప్రత్యక్ష మౌతుంది. వెయ్యి తలలతో కనిపిస్తుంది. నీవు భయపడగూడదు. అప్పుడు దేవి మెచ్చి నీవు కోరుకొన్న వరం ఇస్తుంది,” అని చెప్పి యోగి వెళ్లి పోయాడు. | 98.095238 | |
telugu_ocr_000023 | “అమ్మా! మాకు ఒక టే ముకు, కాని రెండుచేతులున్నాయి. ఎప్పుడన్నా జలుబు చేస్తే ఈ ఒకముక్కు చీదుకోటానికే రెండుచేతులు చాలటంలేదు. ఇక మీకా వెయ్యితలలు. కర్మంజాలక జలుబుచేస్తే ఆ వెయ్యిముక్తులు చీదుకోటానికి ఈ రెండుచేతులు ఎలా చాలుతాయా అని నవ్వు వచ్చింది.” | 97.703552 | |
telugu_ocr_000024 | దేవికూడా అతనిమాటకు నవ్వి- “నాయనా, నన్ను చూచి నవ్వినవాడివి ఇక నువ్వు ఎవరిని చూచి నవ్వవు గనుక. నీవు తప్పకుండా వికటకవి వవుతావు,” అంది. | 97.338402 | |
telugu_ocr_000025 | రామలింగం నమస్కరించి "తల్లీ ఎటుతిప్పి చదివినా చెడనిమాట వరంగా ఇచ్చావు. ఇంతకంటే నాకు ఏమికావాలి," అన్నాడు. | 97.058823 | |
telugu_ocr_000026 | కాళిక అతని తెలివితేటలకు మెచ్చు కొన్నది. 'వికటకవి' అనే మాట ఎటు తిప్పిచదివినా మారేది ఏమి ఉంది? దేవి సంతోషించి మరొక వరంకూడా అతనికి ఇచ్చింది. “నీవు రాజాస్థానంలో విదూష కుడ వవుతావు. అంతే కాదు. నీలాగా పద్యం కూర్చటం మరొకరికి చేతకాదు.” అని ఆశీర్వదించింది. | 97.154472 | |
telugu_ocr_000027 | రామలింగం వికటకవిగా ప్రసిద్ధి కెళ్లాడు. ఆయన పేరుతో ఎన్నో హాస్య కధలు ఉన్నాయి. ఇవికాక వీరు రెండు మహాకావ్యాలు వ్రాశాడు. ఉద్భటారాధ్య చరిత్ర ఒకటీ. పాం డురంగ మాహా త్మ్యం రెండూ. | 96.187683 | |
telugu_ocr_000028 | అనగా అనగా ఒక పెద్ద రావిచెట్టు. ఆ చెట్టు కొక పెద్దకొమ్మ. ఆ కొమ్మ కొక చిన్న రెమ్మ. ఆ రేష్త్రు కొక చిన్ని చిగురుటాకు చిగురుటాకును గాలి చల్లగా జోకొట్టింది. సూర్యకిరణాలు వెచ్చగా మేలుకొలిపాయి. ఆనందంతో ఉబ్బిపోయింది, చిగురుటాకు. | 92.018776 | |
telugu_ocr_000029 | ఇంతలో ఒకపాట సన్నగా వినిపించింది. ఈ పాట చుట్టుపట్ల చెట్లమీదినుంచి సన్న సన్నగావచ్చింది. ఈ పాటను పండుటాకులు విన్నాయి. అవికూడా పాట అందుకున్నాయి. రావిచెట్టుమీది పండుటాకులన్నీ పాడసాగాయి. | 93.66391 | |
telugu_ocr_000030 | “చిగురుటాకును విచారించవద్దను. నన్నే అంటిపెట్టుకుని ఉండమను. నేనిచ్చే ఆహారం ఆరగించమను. ఎండలో చలి కాచు కోమను. గాలిలో ఆడుకోమను. పండుటాకుల పాటపాడే సమయం దానంతట అదే వస్తుంది. అప్పటిదాకా ఆగమను.” | 94.400002 | |
telugu_ocr_000031 | అది తల్లినే అంటిపెట్టుకున్నది. ఎంతో ఆహారం తీసుకున్నది. ఎండలో చలి కాచుకున్నది. గాలిలో ఆడుకున్నది. పెరిగి పెద్దదై ముదురు ఆకుపచ్చ రంగుకు తిరిగింది. క్రమంగా దానిరంగు తేలిక ఆకుపచ్చగా మారింది. తరవాత పసుపు పచ్చగా అయింది. | 96.969696 | |
telugu_ocr_000032 | మళ్లీ పండుటాకులపాట వినిపించింది. పండిన ఈ ఆకు కూడా ఆపాట విన్నది. మిగిలిన పండుటాకులతోపాటు పాడ నారంభించింది. పాట తెచ్చిన గాలి మెల్లిగా పండుటాకును చెట్టునుంచి వేరుచేసింది. | 96.407188 | |
telugu_ocr_000033 | రామయ్య మూడింట్లో రెండు వరాలు యిలా వూరికే పోగొట్టుకుని కాళ్ళీడ్చు కుంటూ యింటికివచ్చాడు. ఇంట్లో పెళ్ళాం కూర్చునివున్నది. ఆమె నెత్తిమీద జీను. ఆమె రామయ్యని చూడగానే మండి పడుతూ, 'ఏమిటిదీ? ఎట్లావచ్చింది నీ జీను నా. నెత్తిమీదికి ?' అని అడిగింది. | 93.478264 | |
telugu_ocr_000034 | జరిగిన పొరబాటేదో జరిగిపోయింది. నువ్వు వోర్పుగా జీను మోస్తూవుండు. మనదగ్గిర యింకోవరం మిగిలివున్నది. దీంతో మనం యేదైనా మంచివరం కోరుకుని | 93.984962 | |
telugu_ocr_000035 | ఈ రాక్షసులు వెతు క్కుంటూరావడం మన గుడ్డివాడు కనిపెట్టాడు. వాడు చప్పుడువిని-“చెమి టన్నా: రాక్షసులు మన వెంటపడ్డారు. గా డి ద ని అడివిలోపలికి తోలి, మన ఇద్దరం చెట్టు ఎక్కితే | 94.428154 | |
telugu_ocr_000036 | బాగుంటుంది. వాళ్లు దాటి పోయిన తర్వాత మనం వెళ్లవచ్చు,” అన్నాడు. చెమిటివాడు సరేనని గాడిదను అడివిలోకి తోలి, చెట్టెక్కి కూర్చు | 98.373985 | |
telugu_ocr_000037 | కున్నారు. రాక్షసులు చెట్టుదగ్గరికి వచ్చి గుడ్డివాణ్ణి చూశారు. కొంగకాళ్ళ రాక్షసి ముందు వీణ్ణి పట్టుకుతిందామన్నాడు. అక్కడినించి ఒకళ్ల మీద ఒకళ్లు ఎక్కి అందరికీ పైన గాడిదచెవుల రాక్షసిని | 98.05014 | |
telugu_ocr_000038 | గుడ్డివాడికి వీళ్ళమాటలు వినేవరకు భయంవేసింది. చేతులతో అటూ ఇటూ తడవటం మొదలుపెట్టాడు. వాడి చేతికి గాడిదచెవుల రాక్షసి చెపులు చిక్కినవి. వాడు తన సత్తవంతాచూపి ఆ చెవులు మెలిపెట్టాడు: ఇటు చెమిటివాడు ‘పోనివ్వమాకు : అట్లాగే పట్టుకో ' | 95.322937 | |
telugu_ocr_000039 | వచ్చాడు. అప్పటికి తెల్లవారింది ఇద్దరూకలిసి ఊరిముఖంగా ప్రయాణం సాగించారు. ఊరి దగ్గరికి చేరినాక చెమిటివాడు —— “గుడ్డిమామా ! గుడ్డి మామా! మనం ఊరిదగ్గరికి చేరాము. ఇక ఫర్వాలేదు. మనం తెచ్చుకున్నది భాగాలు వేసుకుందామా ?" అన్నాడు. | 95.909088 | |
telugu_ocr_000040 | అందులో చెమిటి వాడు తన భాగానికి కాస్త ఎక్కువగా వేసుకున్నాడు. గుడ్డి వాడు రెండు రాసులూ చేతులతో తడివిచూశాడు. తనభాగం చిన్నది. వాడికి కోపంవొచ్చి చెమిటివాడిని చరిచి కొట్టాడు చెంపమీద. ఆ దెబ్బకు చెమి టివాడు బిత్తర పోయాడు. తర్వాత సంబాళించుకుని వాడు గుడ్డివాడి కణతమీద లాగిగుద్దాడు. | 96.309959 | |
telugu_ocr_000041 | మొదలు పెట్టింది. ఈసంగతి . ఒకరి కొకరు చెప్పుకున్నారు. ఆ తర్వాత న్యాయంగా భాగాలు వేసుకుని, పక్క వూరుపోయి హాయిగా ఉన్నారు. చూశారా గమ్మత్తు. కలిసి వచ్చే టప్పుడు మనం పొరపాట్లుపడ్డా మనకు మంచే కలిగిస్తాయి. | 97.201019 | |
telugu_ocr_000042 | రాజుగారి ముకుమీద దోమ కుట్టింది. రాజ్యంలో ప్రజకంతా హడలెత్తింది! సామంతులు, సర్దార్లూ, బంట్లూ, సైన్యాధిపతులు కత్తులతో ఈటెలతో కదనానికి లేచినారు. | 93.379791 | |
telugu_ocr_000043 | కత్తులతో నరకలేక ఈటెలతో పొడవలేక సర్దార్లూ సామంతులు చలచల్లగ జారినారు. తిరిగి తిరిగి దోమ మళ్లి రాజుకడకె వచ్చింది. జనమంతా చూస్తుండగ ముకువిద వాలింది. | 92.957748 | |
telugu_ocr_000044 | తన చేతుల్లోకి తీసుకొన్నది. నేను ఏడు స్తూనే చినిగిపోయిన కోటు చూపించాను. మా అమ్మ ఎగాదిగా నా కోటుచూచి "నా బంగరు తండ్రిగా. ఏడవకు. నీకు ఇంకో మంచి కోటు కుట్టి తొడుగుతాగా. ఏడవకు. చాలకుండా కుడితే చినిగింది. ఈతడవ నీకు సరిపోయేటట్టుకుడతానుగా” అంది. మా అమ్మ మళ్ళీ అంగళ్ళన్నీ తిరిగి మంచి గుడ్డతెచ్చి వొకటికి రెండుసార్లు కొలతలు తీసుకుని కోటుకుట్టి తొడిగింది. ఆకోటు తడువుకొంటూ, రోహిణి జోలపాట వింటూ నిద్రపోయాను. మరునాడు లేచే టప్పటికి ఏమి జరిగిందనుకొన్నారు. బంగారంవంటి కోటు బదాబదలుగా చిరిగి వుంది. మళ్ళీ బావురుమన్నాను. | 96.150047 | |
telugu_ocr_000045 | ఇలా ప్రతిరోజు వొక కొత్తకోటు కుట్టి తొడగటం, మరునాటిప్రొద్దుటికి అది చాలక చిరిగిపోవటం జరిగింది. మా అమ్మ యిట్లా 14 కోట్లు కుట్టింది. 14 కోట్లు చినిగాయి' 15వ కోటు అన్నిటికన్నా పెద్దది. చాల అం దంగా ఉంది. అది ఏమైందో తెలుసునా ? మరునాటి ప్రొద్దుటికి పట్టి గంగిరెద్దు బొంత అయింది. ఆమర్నాటికి మళ్ళీ నేను చిక్కి పోయాను. | 97.560974 | |
telugu_ocr_000046 | ఇదంతాచూసి మా అమ్మకు విసు గెత్తింది. అప్పటినుంచి మళ్ళీ కోటుకాని చొక్కా కాని కుట్టి తొడగలేదు. ఎవరన్నా నాకు సరిపోయిన కోటు కుట్టిస్తే ఎంతో | 96.992477 | |
telugu_ocr_000047 | తెలుగు తోటలలోని కలువపూ దేనె తెలుగు ఊటలబావి తియ్యన్ని నీరు తెలుగు పిల్లల్లార! తీసుకొచ్చాను. తియ్యన్ని ఆనీట తేలిపోదాము తియ్యన్ని ఆతేనె తిందాము రండి! చుక్కల్ల తోగూడి చక్కగా ఆడి మబ్బుల్ల తోగూడి పాడుకుందాము ఆటల్ల పాటల్ల అలసిపోతేను | 97.560974 | |
telugu_ocr_000048 | వుంటారు. “లోకులు పలుగాకులు ' అని సామెత ఒకటిఉన్నది. ఈవిధంగా మనం కాకులను తిడతాం. కాని కాకులు చాలాగొప్పవి. మనకు తెలియని విష యాలు కాకులకు తెలుసు. కాకి గుమ్మం ముందు నిలబడి అరిస్తే మనయింటికి చుట్టాలు వస్తారు. చచ్చిపోయినవాళ్ళ మనస్సుల్లో ఏవైనా తీరని కోరికలుంటే కాకులు పిండాలు ముట్టవు. అప్పుడు మనం చచ్చిపోయినవాళ్ళ కోరికలు తీర్చటానికి ఒప్పుకుంటాం. | 96.307236 | |
telugu_ocr_000049 | దండ్రులు చాలా ప్రజ్ఞావంతులు. ఎండు పుల్లలూ, చీపురు పుల్లలూ, రకరకాల ఈకెలూపెట్టి అందంగా గూడు కట్టటం వారికి తెలుసు. | 98.214287 | |
telugu_ocr_000050 | పుట్టినప్పుడు కాకమ్మ ఏమీ అం దంగా ఉండేదికాదు. ఈకలులేనివొళ్లూ, బోడితలా, తలకన్న పెద్దముక్కూ, చూస్తే ఎవరికైనా నవ్వొచ్చేది. కాని మనం కాకి పిల్లల్నిచూసి నవ్వరాదు. నవ్వితే వాటి తల్లిదండ్రులకు కోపం వస్తుంది. మనకు అందవికారంగా కని పించినా, కాకిపిల్ల కాకికిముద్దు. ఆ సం గతి మీకు తెలిసే ఉంటుందికదూ ! | 98.257843 | |
telugu_ocr_000051 | కాకమ్మకు ముగ్గురు తోబుట్టువులు, ఇద్దరు అన్నదమ్ములూ ఒక చెల్లెలూ ఉండేవారు. ఇంతమందినీ పెంచుకు రావటం కాకమ్మ తల్లిదండ్రులకు ప్రయాసగా ఉండేది. కాకమ్మ తోబుట్టు వులలో ఇద్దరు మరీ ఆశాపాతకులు | 98.888885 | |
telugu_ocr_000052 | ఉండేవాళ్లు. తల్లిదండ్రులు తెచ్చిన ఆహా రాన్ని అందరికన్న ముందు వాళ్లు యిద్దరూ అందిపుచ్చుకుని కాజేసేవారు. మిగతా పిల్లలకిది కష్టంగా ఉండేది. అందరికన్నా వాళ్లకు ముందుగా రెక్షలు | 85.266457 | |
telugu_ocr_000053 | వచ్చాయి. ఒకరోజు వాళ్లిద్దరు'కూ'అని అరిచారు. వాళ్లు కాకులు కారనీ కోయిల లనీ కాకమ్మ నాన్నా అమ్మకూ తెలిసి పోయింది. కాకమ్మ తండ్రి వాటిని | 87.804878 | |
telugu_ocr_000054 | కోపంకొద్దీ వెంటబడి తరిమాడు కాని ఆ దుర్మార్గులు చికలేదు. కాకమ్మ తల్లి పెంచిన మోహంచేత వాటిని పోనిమ్మని తన భర్తను శాంతపరిచింది. | 92.244896 | |
telugu_ocr_000055 | వచ్చాయి. పక్కనున్న చెట్లమీదికీ ఇంటి కప్పులమీదికీ ఎగరటం అభ్యాసం చేశాయి. కొంతకాలం గడిచాక పిల్ల లను తిండివేటకు పట్టుకుపోయేసమయం వచ్చింది. మొదటిరోజు కాకమ్మవంతు. తల్లిదండ్రులవెంట కాకమ్మక్క తిండి వేటకు బయలుదేరింది. | 94.403893 | |
telugu_ocr_000056 | ఒకానొక ఇంటి ఆవరణలో ఒక గండుకుక్క ఉన్నది. రోజూ దాని యజమాని దానికి ఉడక వేసిన ఎముకలు పెడతాడు. ఈరోజున కుక్కకు యజ మాని స్వయంగా ఆహారం పెట్టక నౌకరు చేత పెట్టించాడు. అందుకని కుక్క అలిగి నేలమీద | 97.267761 | |
telugu_ocr_000057 | కాకమ్మా, వాళ్ల అమ్మా, నాన్నా ఇంటి చూరుమీదినుంచి ఇదంతా చూస్తు న్నారు. కాకమ్మ తండ్రి “కా, కా,” అని అరిచాడు. కుక్క వాళ్ళకేసి నిర్లక్ష్యంగా చూసింది. కాకమ్మతల్లి “కా, కా, కా,” అని అరిచింది. కుక్కకు కోపంవచ్చి మొరిగింది. మళ్ళీ కాకమ్మ తండ్రి అరిచాడు. ఈసారి కుక్క పట్టించుకోలేదు. దానికి కాకులమీద విసుగెత్తింది. ఈ సంగతి గ్రహించి | 95.761383 | |
telugu_ocr_000058 | కాకమ్మతల్లి “కా” అని చిన్న కేక పెట్టి కుమా ర్తెను హెచ్చరించింది. కాకమ్మ రివ్వునవాలి, ఒకఎముక అందుకుని, మళ్ళీవచ్చి తల్లిదండ్రులను చేరుకున్నది. కాకుల కుటుంబం అక్కడినుంచి కదిలి. బండరాముడుగా రింటికి చేరుకున్నాయి. | 98.321342 | |
telugu_ocr_000059 | కాకమ్మ తల్లిదండ్రులు బండరాముణ్ణి బాగా ఎరుగుదురు. వాడిదగ్గిరవాళ్లు ఎన్నో అప్పచ్చులు కాజేశారు. వాణ్ణి ఎన్నిసార్లో ఏడిపించారు. బండ రాముడి అమ్మమ్మ చాలా ఆచారవంతురాలు. వాళ్ళింటో మాంసం వండుకోరు. | 98.930481 | |
telugu_ocr_000060 | ఆవాళ రాముడు వాళ్ల ఇంటిపంచలో తప్ప అన్నం తిననని మొండికేశాడు. వాళ్ల అవ్వ పళ్లెంలో అన్నం పెట్టుకుని మనమడికి వడ్డించ టానికి వంటయింటినించి వస్తున్నది. ఆవిడను చూసి బెదిరి కాకమ్మ నోట్లో ఉన్న ఎముక కాస్తా జారవిడిచింది. అది ఖర్మంచాలక అవ్వ చేతిలో ఉన్న అన్నం పళ్లెంలో పడింది. | 97.14286 | |
telugu_ocr_000061 | కాకులు పురాణకాలంనించికూడా ప్రసిద్ధిగన్నవి. వెనక ఎప్పుడో ఒక కాకి అగస్త్యుడి కమండలం ఒలకబోసిం దట. అప్పుడు అందులో ఉన్న గంగ బయటికి వచ్చి నదిగా ప్రవహించింది. శ్రీరామచంద్రుడు సీతతో అరణ్యంలో ఉన్నప్పుడు ఒకనాడు ఒక కాకివచ్చి సీతామహాదేవి రొమ్ముమీద పొడిచింది. రాముడికి కాకిమీద ఆగ్రహం వచ్చింది. దగ్గిర ఉన్న గడ్డిపరక ఎత్తి కాకిమీద విసిరాడు. కాకి భయపడి మూడులోకాలూ తిరిగింది. రక్షించేవారు లేక ఆఖరుకు రామచంద్రుడినే శరణువేడింది. కాకికి ప్రాణం దక్కిందిగాని ఒక కన్ను పోయింది. ఆనాటినుంచీ కాకులకు ఒంటికంటి -చూపే. | 97.456764 | |
telugu_ocr_000062 | కాకులలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు మనుషులలో కూడా లేవు. వాటిలో వర్ణభేదంలేదు. అందుక నే 'తెల్లనికాకులునులేవు తెలియర సుమతీ’ అన్నాడు కవి. కొన్ని కాకులను మనం మాలకాకు లంటాం. కాని నిజంగా వాటిలో అంటరానితనం లేదు. కాకులు ఇళ్ల కప్పుల మీద వరసగా కూర్చుని చదువుకోవటం చూశారా ? దాన్నే కాకి బడి అంటారు. కాకుల్లో ఇంకో మంచి బుద్ధికూడా ఉంది. ఒక కాకికి తినేటందు కేమైనా దొరికితే అన్ని కాకులనూ పిలు స్తుంది. అంతేకాని తనపొట్టకు మాత్రమే చూసుకోదు. వీటినిబట్టి కాకులు చాలా గొప్పవని చెప్పవచ్చు. | 97.291443 | |
telugu_ocr_000063 | కాకి వంశంలో పుట్టింది మన కాకమ్మక్క. ఆవిడ గొప్ప సంగీత విద్వాంసురాలు. ఆవిడ గొంతెత్తి కాకధ్వనీ, కాకభైరవీ మొద లై న రాగాలు పాడితే దిక్కులు మారు మోగుతాయి. వినేవాళ్ల చెవులు చిల్లులు పడతాయి. | 99.450546 | |
telugu_ocr_000064 | చాలా విద్యలు నేర్చినవాడు. పిల్లల నెత్తి కొట్టి చేతిలో ఉన్న అప్పచ్చులు కా జెయ్యటంలో నేర్పరి. ఇన్ని గొప్ప గుణాలుచూసే కాకమ్మక్క కాకిబావను వరించింది. | 93.197281 | |
telugu_ocr_000065 | “బాగానే ఉంటుంది. ఎవరి ఇంటికి పోదాం?” అని రాగం తీసింది కాకమ్మ. కాకమ్మక్క ఎప్పుడూ మామూలుగా మాట్లాడదు, సంగీతంలోతప్ప. | 93.212669 | |
telugu_ocr_000066 | “దగ్గిరే నాయుడుగారిల్లుంది. పొద్దుటి పూట వారింటో చక్కని ఇడ్డెనలూ, ఉపా చేసుకుంటారు. ఆయితే నాయుడు గారు కుంభకర్ణుడు. బారెడు పొద్దెక్కి గాని లేవడు. ఏం మనుషులో వీళ్ళు! మనలాగా వీళ్లకు తెల్లారుజామునే లేచే అలవాటులేదు. వొట్టి సోమరిపోతులు. మన యిద్దరమూ నాయుడుగారింటికి పోదాం. నువు కమ్మగా ఆయనకు మేలు కొలుపులు పాడు. అప్పుడాయన లేచి మనకు ఫలహారం పెట్టిస్తాడు,” అన్నాడు కాకిబావ. | 97.237572 | |
telugu_ocr_000067 | నాయుడుగారి ఇంటిపక్షనే వేపచెట్టు ఒకటి ఉంది. దానికొమ్మ ఒకటి మేడ మీదికి ఉంది. ఆ కొమ్మమీద కాకి దంప తులు కూర్చున్నారు. ఇద్దరూ గొంతులు కలిపి ముచ్చటగా నాయుడుగారికి మేలు కొలుపు పాడ నారంభించారు. | 96.685081 | |
telugu_ocr_000068 | కాకిపాటకు ఎంతటివాడై నానిద్రలేవవలిసిందే. కాకిపాట రుషుల తపస్సు కూడా భగ్నం చెయ్యగలదు. కాని నాయుడుగారు ఎద్దుమొద్దు స్వరూపం. అందుచేత ఆయన కాకిదంపతుల పాట లక్ష్యం చెయ్యకుండా గురకపెట్టి నిద్ర పోతున్నాడు. | 97.686378 | |
telugu_ocr_000069 | అందుచేత మన కాకిదంపతులు స్థాయి హెచ్చించి రాగం మార్చి ఇంకో మాంఛిపాట ఆరంభించారు. కాకభైరవి ఆలాపన జోరుగా సాగింది. అంతకంతకూ పంచమస్థాయికి వెళ్లింది. ఎట్లాగయితేనేం నాయుడుగారు లేచాడు. కాని కాకిపాట ఆనందించటానికి | 89.223061 | |
telugu_ocr_000070 | కాకిబావా కాకమ్మక్కయ్యా చెట్టుమీదనుంచి దిగివచ్చి ఫలహారం ప్రారంభించారు. కాక మ్మక్కయ్య వొక్క ఇడ్డెనూ, వొక్ట్లగారే తిన్నది. కాకిబావ మాత్రం దిట్టంగా తిన్నాడు. అయితే ఇద్దరూ వెన్న నంజుకున్నారు. ఇద్దరి ముక్కులకూ వెన్న అంటింది. ఇద్దరూ కాసిని మంచి | 95.615868 | |
telugu_ocr_000071 | ఆ నవాబు ప్రతి సంవత్సరం మహా వైభవంగా పీర్లపండగ చేసేవాడు. ఆ ఉత్సవాలు చూడడానికి దేశదేశాల నుంచి రాజకుమారులు, కవులు, గాయకులు, శిల్పులు వచ్చేవాళ్ళు. వచ్చి తమతమ విద్యలను చూపి నవాబువద్ద బహుమతులు పొందుతుండేవాళ్ళు. | 97.536949 | |
telugu_ocr_000072 | రకాల ప్రతిమలుతెస్తే, ముసలితాత ఒక కొయ్యబొమ్మ గుర్రాన్ని పట్టుకొచ్చాడు. తాతను చూడగానే తతిమ్మా శిల్పులకు ఎక్ట్లడలేని నవ్వువచ్చింది. | 95.752899 | |
telugu_ocr_000073 | “ఏమి గుర్ర మనుకున్నా వేమిరా అది దేవతాగుర్రం,” అన్నాడు మరొక శిల్పి. "వాళ్లతో నీకెందుకుకాని దీన్ని ఎంతకిస్తావో నిజంగాచెప్పు తాతయ్యా.” అన్నాడు నవ్వకుండా మరొక శిల్పి. తాతకు కోపం వచ్చింది. "మీరు కొనలేరు, మీ అబ్బలు కొనలేరు. ఎందుకు | 95.384613 | |
telugu_ocr_000074 | తిరిగేవాణ్ణి. చుక్కలు ఎంతో ప్రేమతో పిలిచేవి కాని నేను మా అమ్మను వదలిపెట్టేవాణ్ణికాను. చుక్కమ్మలు నన్ను ఎగతాళిచేసేవి. నేను ఆడంగి వాడిననీ, అమ్మ కొంగు వదిలిపెట్టననీ. ఆ రోజుల్లో నేను మా తాత సూర్యుడి లాగా వుండేవాణ్ణి. అందుకని అందరూ నన్ను ఎత్తి ముద్దులాడ పిలిచేవాళ్ళు. మా అమ్మకు నన్ను చూస్తే ఎంతో సంతోషం. నా ఆటపాటలకు మురిసి చక్కని అద్దం ఇచ్చింది. మీకు అద్దంఇస్తే ఏం చేస్తారు? ముఖం చూచుకోరూ? నేనూ ఆపొర పాటే చేశాను. అద్దంలో చూచుకున్న కొందికి నాముఖం నాకే ఎంతో అందంగా కనిపించసాగి ది అలా చూచుకొంటూ వుంటే ఇక ప్రపంచంలో మరోటి అంద | 94.395279 | |
telugu_ocr_000075 | మైనది ఉన్నట్లే కనిపించేది కాదు. అందువల్ల ఎప్పుడూ అదేపనిగా నన్ను నేను అద్దంలో చూచుకొనేవాణ్ణి. మా అమ్మ చివాట్లు పెడుతూవుండేది. నేను వింటేగా? ఇలా చేయగా చేయగా కొన్నాళ్ళకు నా కాంతి అంతా పోయింది. ముఖం మాడిన అట్ల పెనంలాగా అయిపోయింది. | 94.356659 | |
telugu_ocr_000076 | మాఅమ్మ జ్యోతిలాగా వెలిగిపోతున్నది. మాఅమ్మకు ప్రక్కగా చూచాను. మా తాత ఎలావున్నాడని ? చూడటానికి కళ్లు చాలకుండా ఉన్నాయి. నన్ను నేను చూచు కొన్నాను. నాఒళ్లు నాకే కనిపించలేదు. | 98.809525 | |
telugu_ocr_000077 | నాకు పట్టరాని యేడుపు వచ్చింది. పోయినకాంతి ఎలా తిరిగి సంపాదించ టం? ఆలోచించాను, ఏమీ పాలుపోలేదు. దిగాలుపడి కూర్చున్నాను. అప్పుడే ఆకాశంలో చుక్కమ్మ కిటికీ మిలమిల లాడింది. చప్పున ఒక ఉపాయం. తోచింది. అక్షడనుంచి ఒక గంతులో పోయి చుక్రమ్మ ఇంటి తలుపు తట్టాను. ఆమె తలుపు తీయకుండానే “ఎవరది, ఎందుకొచ్చావు" అని కిటికీలోనుంచే గద్దించింది. | 95.238098 | |
telugu_ocr_000078 | మీ అక్కయ్య బొమ్మ యియ్యక కరిసితే ఎలావుంటుంది? నాపనీ అంతే అయింది. కాళ్ళీడ్చుకొంటూ. ఇంకొక చుక్కమ్మ యింటికి వెళ్లాను. | 97.797356 | |
telugu_ocr_000079 | "ఇక్కడ మాకే లేకపోతే నీ మొహానికెక్కడ ఇవ్వమంటావు, వెలుగు ?" అని మూలిగింది ఆమె. తతిమ్మా చుక్కమ్మలూ యిలాగే అన్నాయి. ఇక ఏమిచేసేది ? బావురు మని ఏడ్చాను. | 90.526314 | |
telugu_ocr_000080 | అప్పుడే మాతాత సూర్యుడు జ్ఞాపకం వచ్చాడు. వెంటనే ఒక్కగంతులో మా తాతయ్య యింటిముందు వచ్చిపడ్డాను. కాని లోపలికివెళ్ళటం ఎట్లా? తలుపు తీదామంటే చేతులు కాలిపోవూ ? అంతగా మా తాతయ్య యిల్లు వెలిగి | 98.342545 | |
telugu_ocr_000081 | పోతున్నది. నేను ఏడుస్తూ అక్కడే నుంచున్నాను. అంతలో మా తాతయ్య ఏడుగుఱ్ఱాల బండిలో వస్తూ నన్ను చూచాడు. | 95.384613 | |
telugu_ocr_000082 | "తాతయ్యా, నాలోని మంటలన్నీ ఆరిపోయాయి. వెలుతురంతా పోయింది. నాకన్నా చుక్కలే బాగున్నాయి. ఈ మాడుచెక్కముఖంతో మీఅందరిమధ్య ఎలావుండేది? తాతయ్యా, తాతయ్యా! నాకు కాస్త వెలుగివ్వవూ,” అని జాలిగా అడిగాను. | 98.68074 | |
telugu_ocr_000083 | తాతయ్య ఆలోచించి ఆలోచించి చివరికి అన్నాడు: “నువ్వుచాల పెద్ద పొర పాటు చేశావురా. మీ అమ్మ యిచ్చిన అద్దం సరిగా వాడుకోలేక చెడిపోయావు. ఆ అద్దం పెట్టిచూ స్తే ఎన్ని రంగులు కని | 96.36364 | |
telugu_ocr_000084 | ఎన్ని విచిత్రాలు కనిపించేవి : సరే జరిగిం దేదో జరిగింది. ఇకమీదనన్నా నేను చెప్పినట్టుచెయ్యి. నీ అద్దం ఉంది చూశావూ? దానిమీద ఎప్పుడూ నాకాంతి . పడుతూ ఉండేటట్టుగా పట్టుకో. ఆ అద్దంమీది వెలుతురు నీ ముఖానికి తిప్పుకో. అప్పుడు నీముఖం తెల్లగా ఉంటుంది." అన్నాడు. | 95.983932 | |
telugu_ocr_000085 | అప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందనుకొన్నారు. నాటినుంచి మా తాతయ్య చెప్పినట్టు చేస్తున్నాను. ఆయన వెలుగును నా అద్దంలో పట్టి నావైపు తిప్పుకుంటూవుంటాను. నాముఖం మళ్ళీ ప్రకాశించ మొదలుపెట్టింది. అయితే అప్పుడప్పుడు మాఅమ్మ నా అద్దానికి మా తాతయ్యకు అడ్డం వస్తుంది. అందు వల్ల మీకు సరిగా వేళకు కనిపించలేక పోతున్నాను. అంతేగాని మరేమీ లేదు. | 97.984497 | |
telugu_ocr_000086 | మీరు నన్నుచూసి సంతోషాన్ని వెలిబుచ్చుతూ వ్రాసిన జాబులన్నీ నాకు చేరినవి. మీకు ఇవే నా దీవెనలు. ఇకముందుకూడా మీకు ఇంతకంటె అంద చందాలతో, గమ్మత్తు గమ్మత్తు కబుర్లు చెప్పుతూ కనిపిస్తాను, సరేనా! | 93.478264 | |
telugu_ocr_000087 | చూడండి, చందమామ ఏఒక్క జాతికి ఏఒక్క వ్యక్తికి మాత్రమే మామకాదు. హిందూదేశంలో అన్ని జాతులకూ, అందరికీ మామే. అందుచేత నేను అరవం, కన్నడం, మళయాళం, హిందీ మొదలైన అన్ని భాషలలోవచ్చి అందరికీ కనిపించా లని అనుకుంటున్నాను. మీరేమంటారు? | 92.413795 | |
telugu_ocr_000088 | "అమ్మా అమ్మా ! చందమామ వట్టి అల్లరివాడే. ఎప్పుడూ చొక్కా అన్నా తోడు క్కోడు. నేను చూడు ఎలా తొడుక్కు న్నానో" అని మీ అమ్మతో నామీద చాడీలు చెబుతుంటారు. నిజమేనా? నేను ఎందుకు | 91.772148 | |
telugu_ocr_000089 | నేను పుట్టగానే ఆకాశమంతా వెలుతు రుతో నిండిపోయిందట. అదిచూచి ఆశ్చర్య పోయి గ్రహాలు వచ్చాయి, చుక్కలు వచ్చాయి. నన్ను అంతా చక్కని తండ్రి అంటే చక్కని తండ్రి అన్నారు. | 95.14563 | |
telugu_ocr_000090 | మంచిరోజు చూచి అశ్వని నాకు చక్కని ఉయ్యాల తెచ్చింది. భరణి అందులో ముత్యాలు వేలాడకట్టింది. కృత్తిక, రోహిణి అనూరాధ, రేవతి దానికి రంగురంగుల మబ్బుతెరలు కట్టారు. ఆతెరలకు వొక అంచున మెరుపు మరొక అంచున ఇంద్ర ధనుస్సు ఉండేవి. | 94.71154 | |
telugu_ocr_000091 | “చందమామ ఉయ్యాల నేను ఊపాలి అంది” రోహిణి. “కాదు నేను” అంది రేవతి. ఇలా చుక్కలంతా పోట్లాడుకుం టూఉంటే మాఅమ్మ చివరికి రాజీ కుది ర్చింది. దానిప్రకారం వంతులచొప్పున | 95.176849 | |
telugu_ocr_000092 | వొకరోజున చలిగాలి బయలుదేరిపోతూ నేను నిద్రపోతూవుంటే వచ్చి సూదులతో గుచ్చినట్టు గుచ్చింది. మీకు అలాంటి మనుషులు తగిలారో లేదో, వాళ్లకి చిన్న పిల్లల్ని ఏడిపిస్తేనే కాని ముద్దు రాదు. నేను వొక్కసారిగా కెవ్వుమన్నాను. | 95.377129 | |
telugu_ocr_000093 | మా అమ్మ గబగబా పరిగెత్తుకొచ్చి, “నా తండ్రిగా, ఏడవకు" అంటూ ఎత్తు కొంది. నా ఏడుపుకు కారణం తెలుసు కొంది. ఆరోజునే ఆకాశంలోని అంగళ్లన్నీ తిరగ వేసి చలిదూర ని చక్కనిగుడ్డ తెచ్చింది. అది పెట్టి నాకు వక చిన్నకోటు కుట్టి తొడిగింది. ఆకోటు మెత్తగా, హాయిగా, వెచ్చవెచ్చగా ఉంది. ఆ కోటుతోనే ఆ రాత్రి నిద్రపోయాను. | 92.844681 | |
telugu_ocr_000094 | ఇట్లా నిద్రపోయి లేచేటప్పటికి నాకోటు కాస్తా చినిగిపోయి ఉంది. వక్కసారి బావురుమన్నాను. మా అమ్మ గబగబా వచ్చి “ఎందుకోయి తండ్రీ ఏడుస్తావు ? ఎవరు కొట్టారు?" అని అడిగింది. నేను జరిగింది చెప్పలేకపోయాను. ఉయ్యాల ఊపుతూన్న రోహిణి వట్టి కొంటె కోణంగి. అది ఏమన్నా చేసిందేమోనని కసిరి | 93.75 | |
telugu_ocr_000095 | అనగా అనగా ఒక ఊళ్లో ఒక చెమిటి వాడూ ఒక గుడ్డివాడూ ఉండేవాళ్లు. వాళ్లిద్దరికీ మాంచి సావాసం. ఇద్దరూ ఆ ఊళ్లోనే అడుక్కుతిని బతికేవాళ్లు. కాని ఒక్క ఊళ్ళో ఎన్నాళ్లు దొరుకు తుంది వాళ్లకు బిచ్చం ? అందుకని ఆ ఊరువదిలి దూరదేశాలు పోయి బతుకు దామని ఇద్దరూ కలిసి బయలుదేరారు. దోవలో గుడ్డివాడు చెమిటివాడితో – "ఇదుగో చెమిటి మామా ! మని ద్దరంఒక మాటకు వద్దాము. నేను విన్నదెల్లా నీకు చెప్పుతాను నువ్వు చూసిందెల్లా నాకు చెప్పు. మనకు దొరికిందెల్లా చెరి సగం పంచుకుం | 95.862068 | |
telugu_ocr_000096 | చెమిటివాడు ఎగిరి గంతేసి 'సరే!' నన్నాడు. కొంతదూరం పోయేపరకు గుడ్డివాడికి గాడిద అరుపు వినిపించింది. "ఇదుగో, ఇక్కడ దగ్గరలో ఎక్కడో గాడిద ఉంది. దాన్ని పట్టుకు తీసు కెళ్లామా, మనకు ఏది దొరికినా దాని మీద వేసుకోవచ్చు.” అన్నాడు. | 96.091957 | |
telugu_ocr_000097 | చెమిటివాడు గుడ్డివాడు చెప్పిన దోవనే పోయా డు. అక్కడ ఒక గుం జ కు గాడిద కట్టేసి ఉంది. చెమిటి వా డు దాన్ని విప్పి తోలుకు వచ్చాడు. | 96.774193 | |
telugu_ocr_000098 | ఇంక కొంచెందూరం పోయేవరకు చాకలివాడి బాన కనిపించింది. దాన్ని కూడా తీసుకుని గాడిదమీద కట్టుకుని బయలుదేరారు. | 97.584541 | |
telugu_ocr_000099 | ఇంతలో పొద్దుకూకవచ్చింది. ఆకా శాన దట్టంగ మబ్బుపట్టింది. ఉరుములూ మెఱుపులతో వానవచ్చింది. దగ్గరలో ఏది కనపడినా చాలు, అందులో తల దాచుకుందా మనుకున్నారు ఇద్దరూ. అలాగే కా సైదూరం పోయేవరకు పెద్ద మేడ కనిపించింది. | 92.105263 | |
telugu_ocr_000100 | ఇద్దరూ బలమంతా ఉపయోగించి తలుపునెట్టి గాడిదను లోపలికితోలి మళ్లీ తలుపుబిగించారు. లోపల రాక్షసీ లేదు, గీక్షసీ లేదు. వాళ్ళకు బాగా ఆకలి వేస్తున్నది. అన్నమూ, కూరలూ, పళ్లూ పెట్టి ఉన్నవి. గాడిదను స్తంభానికి కట్టివేసి ఇద్దరూ కూచుని ఆ అన్న మంతా మెక్కారు. కడుపు నిండేవరకు వాళ్ళకు నిద్రవచ్చింది. గురక పెట్టడం మొదలు పెట్టారు. | 97.411003 |