id stringlengths 17 17 | image imagewidth (px) 131 3.62k | text stringlengths 30 2.12k | match_score float32 85 100 |
|---|---|---|---|
telugu_ocr_120301 | మరికొద్ది రోజులకి వారిద్దరికి చిన్న నాటి స్నేహితుడు అయిన వీరయ్య కలిసాడు. మాటల మధ్యలో కాశయ్య ప్రస్తావన తెచ్చి ‘ఎలా ఉన్నాడు మన చిన్ననాటి నేస్తం. యేమైనా మారాడా? లేక అలాగే ఉన్నాడా?' అని ప్రశ్నిం చాడు. దానికి సీతయ్య తన అనుభ వాలు వివరించి ‘నాకు సాయం చేయక పోతే పోయాడు. కనీసం మేలు పొందిన రోజు కూడా కృత జ్ఞతలు చెప్పేవాడు కాదు. అం... | 98.648651 | |
telugu_ocr_120302 | దానికి వీరయ్య ఫకాలున నవ్వాడు. ‘కృతజ్ఞత అనేది చెప్పాల్సిన వాడి తల మీదున్న బరువు. చెప్ప లేదని బాధపడుతూ ఆ బరువుని నీ తల మీదకు ఎత్తుకోవాలని చూస్తా వెందుకు? నీవు రైతు బిడ్డవు. నీ వృత్తి వ్యవసాయం. అంటే నీ పని లోనే సాయం అనే పదాన్ని తగిలించు కున్నవాడివి. నీ సహజగుణం పరు లకు సాయపడడం. అందువల్ల నీవు ఉదారంగా సహాయం చేశావు. ఇక ముందు ... | 97.406342 | |
telugu_ocr_120303 | ఈనాడు బీజింగ్ రాజధానిగా వున్న చైనా దేశం, ఈ ఉదంతం జరిగిన కాలంలో లేదు. అతి విశాలమెన భూభాగం చిన్నచిన్న రాజ్యాలుగా విభజించబడి ఉండేది. అలాంటి చిన్న రాజ్యాలలో ముఖ్యమైనది చూ. | 95.32164 | |
telugu_ocr_120304 | దాదాపు 2600 సంవత్సరాలకు పూర్వం చూ రాజ్యాన్ని జువాంగ్ అనే రాజు పరిపాలిం చేవాడు. ఆ కాలఘట్టంలో చిన్న చిన్న రాజ్యాలు తరచూ ఒకదానితో ఒకటి యుద్ధాలు చేసుకుంటూ ఉండేవి. అలా జరిగిన ఒక యుద్ధంలో పొరుగు రాజ్యం మీద జువాంగ్ రాజు విజయం సాధించాడు. ఆ సందర్భంగా యుద్ధంలో విజయానికి తోడ్పడిన సేనాధిపతులు, దళనాయకులు, మంత్రులు, అధికారుల గౌరవార్... | 99.433426 | |
telugu_ocr_120305 | రాజభవన ప్రాంగణంలో అందమైన పం దిళ్ళువేశారు. వీనుల విందుగా సంగీత కళాకారులు సంగీత వాయిద్యాలను వాయి స్తుండగా, వేదిక మీద అందమైన నర్తకీమణులు నయనానందకరంగా నాట్యం చేయసాగారు. రకరకాల వంటలతో, పానీయాలతో అతిథు లకు రుచికరమైన విందు భోజనాలు వడ్డిం చారు. ఆహూతులందరూ పరమానందంతో విందుభోజనం చేస్తున్నారు. రాజు తన కుమార్తె యువరాణి 'జూ'ను స్వయ... | 91.788528 | |
telugu_ocr_120306 | యువరాణి పేరుగాంచింది. ఆమె స్వయం గా తమ వద్దకు రావడం, తమనెంతో ప్రత్యే కంగా గౌరవించినట్టు అతిథులు భావించి పొంగి పోయారు. | 100 | |
telugu_ocr_120307 | వీచడంతో, ఒక్కసారిగా దీపాలన్నీ ఆరిపోయాయి. చుట్టూ చీకటి అలముకు న్నది. చాందినీ వేయబడిన స్తంభాలు అటూ ఇటూ ఊగసాగాయి. ఒక్కసారిగా, సంగీతం, నాట్య ప్రదర్శన ఆగిపోయిందే తప్ప, అతిథుల మధ్య ఎలాంటి కలకలం చెలరేగలేదు. భటులు వచ్చి మళ్ళీ దీపాలు వెలిగించేంతవరకు అతిథులు కదలకుండా ఓర్పుతో అలాగే కూర్చున్నారు. | 99.649124 | |
telugu_ocr_120308 | కమ్ముకోగానే ఒక దళనాయకుడు నన్ను అతడికేసి లాక్కోబోయాడు. అయితే, నేను వెంటనే వాడి చేయిని విడిపించుకుని ఇవతలికి వచ్చేశాను. అలా వచ్చేప్పుడు వాడి | 100 | |
telugu_ocr_120309 | అంగీనుంచి, రిబ్బన్ను లాక్కొచ్చేశాను. దీపాలు వెలింగించమని ఆజ్ఞాపించండి. ఈ రిబ్బను సాయంతో దోషిని సులభంగా పట్టుకోవచ్చు,” అన్నది చెవిలో రహస్యంగా. రాజు కుమార్తెను, ఆప్యాయంగా మంచి మాటలతో ఓదార్చాడు. ఆ తరవాత ఆసనం నుంచి లేచి నిలబడి, "ప్రియమెన అతిథులం దరికీ ఒక సంగతి చెప్పదలచాను!” అన్నాడు. తన తండ్రి ఏం చెప్పనున్నాడో యువరాణి ఊహించ... | 96.631203 | |
telugu_ocr_120310 | ముఖ్యమైనది. భయంకరమైన యుద్ధం ముగిసి, ఇప్పుడు మనం శాంతి ఉత్సవం జరుపుకుంటున్నాం. దళనాయకుల అంగీ మీద ఉన్న రిబ్బన్లు, వారి సెనిక స్థాయిని తెలియజేసే చిహ్నాలు. అయితే మనం ఇప్పుడు ఇక్కడ శాంతి ప్రియులుగా కూర్చుని వున్నాం. మనకు శాంతిపట్లవున్న ప్రేమకు గుర్తుగా, మీరందరూ మీ మీ అంగీల మీద ఉన్న రిబ్బన్లను తొలగించాలని కోరుతున్నాను. వెంటన... | 98.062592 | |
telugu_ocr_120311 | రాజుగారి సూచనకు అతిథులు హర్షాతిరేకం తో ఆమోదం తెలియజేస్తూ తమ రిబ్బన్లను తొలగించారు. భటులు దీపాలు వెలిగించసా గారు. మళ్ళీ యథాప్రకారం సంగీతం, నాట్య ప్రదర్శన ఆరంభమయ్యాయి. అర్ధరాత్రి వరకు విందులు వినోదాలు కొనసాగాయి. | 100 | |
telugu_ocr_120312 | అతిథులందరూ వెళ్ళిపోయాక రాజు కుమార్తెతో, "బిడ్డా, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నీ పట్ల అగౌరవం కనబరచిన దళనాయకుడు కొద్దిగా తాగిన మత్తులో ఉం డి ఉంటాడు. అయినా, మన రాజ్య రక్షణకోసం ధైర్యంగా పోరాడిన వారి గౌర వార్థం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం అది. ఒక్కసారి అతడి అపరాధం బట్టబయ లయితే, అతన్ని శిక్షించక తప్పదు. అప్పుడు విందు ... | 98.691101 | |
telugu_ocr_120313 | మరణశిక్ష పొందడం ఇతర దళనాయకులకు మధురస్మృతి కాజాలదు కదా. పెగ్డా, ఆ దళనాయకుడి చర్యకు అసలు ఉద్దేశం ఏమిటో మనకు తెలియదు. ఆ సమయంలో అతన్ని పట్టుకుని, ఆరాతీయడం అంటే అప్పటి ఉత్సవ వాతావరణాన్ని పాడుచేయడమే అవుతుంది. కాబట్టి దాన్ని క్షమాహృదయం | 99.34066 | |
telugu_ocr_120314 | తో క్షమించి, ప్రశాంతంగా ఉండు,” అన్నాడు ఓదార్పుగా. ఒక సంవత్సరం గడిచింది. పొరు గున వున్న శత్రురాజ్యం సేనలు హఠాత్తుగా చూ మీద దండెత్తి వచ్చాయి. జువాంగ్ రాజు స్వయంగా నాయకత్వం వహించి సేనలను | 99.727524 | |
telugu_ocr_120315 | యంలో, మెరుపులా ఒక వీరుడు శత్రువల యంలోకి దూకి, రాజును తెగటార్చడానికి కత్తిదూసిన వాడి తలను తెగనరికాడు. దాంతో యుద్ధం మలుపు తిరిగింది. శత్రు సేనలు వెనుదిరిగాయి. జువాంగ్ రాజు విజయం సాధించాడు. | 99.731903 | |
telugu_ocr_120316 | మరునాడు సభ జరిగింది. సమయానికి వచ్చి తన ప్రాణాలను కాపాడిన దళనాయకుడితో రాజు, “నీ ధైర్ఘ్యం అనుపమానం. నీ సాయం మరువరానిది. నిన్ను ఘనంగా సన్మానిం చాలి,” అన్నాడు పరమానందంతో. | 99.088142 | |
telugu_ocr_120317 | "ప్రభూ, అది ఇప్పుడు అవసరం లేదు. ఒక్క సంవత్సరం క్రితమే మీరు నాకు ప్రాణ భిక్ష పెట్టి ఘనంగా సన్మానించారు కదా!" అన్నాడు దళనాయకుడు వినయంగా. | 95.131088 | |
telugu_ocr_120318 | ఆనాడు విందు సమయంలో యువరాణికి బాధ కలిగించినవాడు తానే నన్న విషయం దళనాయకుడు బయటపెట్టాడు. అయితే, అది ఉద్దేశపూర్వకంగా చేయలేదనీ - భయం కరమెన గాలి తాకిడికి యువరాణికి వెనకవున్న స్తంభం ఆమె మీద పడబోవడం | 98.952881 | |
telugu_ocr_120319 | తో, దాన్నుంచి రక్షించే ప్రయత్నంలో ఆమె చేయిపట్టి ఇవతలికి లాగ వల్సి వచ్చిందనీ చెప్పాడు. తన చర్యను గురించి ఆలోచించే సావకాశం కూడా లేదనీ వివరించాడు. రాజే గనక అతన్ని శిక్షించాలని నిర్ణయించి వుంటే. అసలు సంగతి వివరించే అవకాశం కూడా ఉండేది కాదు. రిబ్బను ద్వారా తనను పట్టుకోవాలని యువరాణి భావించివుం డవచ్చు. అయితే, ఉదార హృదయుడెన రాజ... | 98.749176 | |
telugu_ocr_120320 | ఆహ్వా అనే గ్రామంలో నిరుపేద బ్రాహ్మ డొకడు ఉండేవాడు. అతడు చదువుకోలేదు. ఎంత ప్రయత్నించినా ఎక్కడా చేయడానికి తగిన పని దొరకలేదు. అందువల్ల చేసేదిలేక రోజూ ఇంటింటికీ వెళ్ళి బిచ్చ మెత్తగా వచ్చిన బియ్యాన్ని, పిండిని భార్యకిచ్చేవాడు. ఆమె వండిపెడితే, భార్యా భర్తలూ, నలుగురు పిల్లలూ తలా కొంచెం తినేవారు. ఒక్కొక్కసారి బిచ్చమెత్తింది, ప... | 100 | |
telugu_ocr_120321 | ఆ దుస్థితి తట్టుకోలేక అతని భార్య, “నువ్వు తెచ్చేది ఒక్క పూటగడవడానికి కూడా చాలడం లేదు. కుటుంబ పోషణకు నువ్వేదెనా మరొక మార్గం ఆలోచించక తప్పదు,” అన్నది. | 99.328857 |