Dataset Viewer
Auto-converted to Parquet Duplicate
id
stringlengths
1
3
source_text
stringlengths
89
375
target_text
stringlengths
88
656
1
హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్.
మనోహర హారాలు ధరించువాడికిం; నంద వంశం వారి గోకులంలో విహరించినవాడికి; తృణావర్తు డనే దానవుణ్ణి సంహరించిన వాడికి; భక్తుల పరితాపాలను పరిహరించువాడికి; గోపాంగనల మనస్సులను అపహరించినవాడికి; దుష్టుల సంపదలను హరించిన వాడికి; వ్రేపల్లెలో గోపికల యిండ్లలో పాలు, నెయ్యి, అపహరించినవాడికి; పిల్లల పాలిటి పెనుభూతమైన పూతన అనే మహారాక్షసిని మ...
2
శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణ హస్త ని ర్మూలికి, ఘోర నీరదవిముక్త శిలాహతగోపగోపికా పాలికి, వర్ణధర్మపరిపాలికి, నర్జునభూజయుగ్మ సం చాలికి, మాలికిన్, విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్.
శీలవంతుడికి; నీతిమంతుడికి; త్రిశూలధారియైన శివుణ్ణి వశం చేసుకున్నవాడికి; బాణాసురుని బాహువులు ఖండించిన వాడికి; ఇంద్రుని మేఘాల నుండి కురిసిన రాళ్ల జల్లుకు చెల్లా చెదరైన గోపాలురను, గోపికలను కాపాడినవాడికి; వర్ణాశ్రమ ధర్మాలను ఉద్ధరించిన వాడికి; జంట మద్ది చెట్లు పెల్లగించినవాడికి; వనమాల ధరించు వాడికి; సైంధవ సంహార సమయాన తన చేత...
3
క్షంతకుఁ, గాళియోరగవిశాలఫణావళినర్తనక్రియా రంతకు, నుల్లసన్మగధరాజ చతుర్విధ ఘోర వాహినీ హంతకు, నింద్ర నందన నియంతకు, సర్వచరాచరావళీ మంతకు, నిర్జితేంద్రియసమంచితభక్తజనానుగంతకున్.
క్షమాగుణశీలికి; కాళీయుని విశాలమైన పడగలపై నాట్యమాడటం నేర్చినవాడికి; పొంగి దాడిచేసిన భయంకరమైన జరాసంధుని చతురంగ సైన్యాలను హతమార్చినవాడికి; పార్థుని రథాన్ని, పార్థుని నడిపినవాడికి; సమస్త చరాచర ప్రపంచం స్మరిస్తుండే వాడికి; జితేంద్రియులైన భక్తుల వెంటనుండువాడకి.
4
న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన స్థ్సాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం ధాయికిఁ, బీతవస్త్రపరిధాయికిఁ, బద్మభవాండభాండ ని ర్మాయికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్.
న్యాయాన్ని మెచ్చువాడికి, చచ్చిపోయిన బ్రాహ్మణ బాలుణ్ణి తెచ్చి యిచ్చినవాడికి, రుక్మిణీదేవి మనస్సుకు బాగా నచ్చినవాడికి, సకల జగత్తుకీ సంతోషాన్ని సమకూర్చేవాడికి, సజ్జనుల ఆదరాభిమానాలను తీర్చిదిద్దేవాడికి, పట్టు పీతాంబరాన్ని కట్టుకునేవాడికి, బ్రహ్మాండ భాండాలను సృజించేవాడికి, గోపికల గృహాలన్నింటికి వెళ్ళువాడికి, ఆదిశేషునిపై శయన...
5
అలసులు, మందబుద్దియుతు, లల్పతరాయువు, లుగ్రరోగసం కలితులు, మందభాగ్యులు సుకర్మము లెవ్వియుఁ జేయఁజాల రీ కలియుగమందు మానవులు; గావున నెయ్యది సర్వసౌఖ్యమై యలవడు? నేమిటం బొడము నాత్మకు? శాంతి, మునీంద్ర! చెప్పవే.
మునీంద్రా! సూతా! ఈ కలియుగంలోని మానవులందరు సోమరి పోతులు, మందబుద్ధులు, మందభాగ్యులు, అల్పాయుష్కులు. రకరకాల భయంకర వ్యాధులతో పీడింపబడుతున్నవారు. వారు సత్కార్యాలు చేయటానికి అసమర్థులు. అందువల్ల వారి ఆత్మలకు ఏది శాంతిని ప్రసాదిస్తుందో అట్టి మార్గాన్ని అనుగ్రహించు.
6
భూషణములు వాణికి, నఘ పేషణములు, మృత్యుచిత్త భీషణములు, హృ త్తోషణములు, కల్యాణ వి శేషణములు, హరి గుణోపచితభాషణముల్.
శ్రీమహావిష్ణువు యొక్క గుణకీర్తనములతో కూడిన పలుకులు, వాక్కులకు అధిదేవత యైన సరస్వతీ దేవికి అలంకారాలు. మృత్యు దేవతకు భయం కలిగించేవి. భక్తుల హృదయాలకు సంతోషాలు కలిగించేవి. సకల పాపాలను పోగొట్టునవి. నిత్యకల్యాణములను సమకూర్చేవి.
7
అనఘ! విను, రసజ్ఞులై వినువారికి మాటమాట కధిక మధురమైన యట్టి కృష్ణు కథన మాకర్ణనము సేయఁ దలఁపు గలదు, మాకుఁ దనివి లేదు.
పుణ్యాత్మా! సూతా! శ్రీకృష్ణుని కథలు ఆసక్తితో ఆలకించే రసజ్ఞుల హృదయాలకు పదే పదే మధురాతి మధురాలై ఆనందాన్ని కలిగిస్తాయి. వాటిని ఆలకించాలని మాకు ఎంతో కుతూహలంగా ఉంది. ఎన్ని విన్నా మాకు తనివి తీరటం లేదు.
8
వర గోవింద కథా సుధారస మహావర్షోరు ధారా పరం పరలం గాక బుధేంద్రచంద్ర! యితరోపాయానురక్తిం బ్రవి స్తర, దుర్దాంత, దురంత, దుస్సహ, జనుస్సంభావితానేక దు స్తర, గంభీర, కఠోర, కల్మష కనద్దావానలం బాఱునే?
సూతా! బుధేంద్రచంద్ర! అత్యంత విస్తరమైనది, దాటరానిది, అణచుట సాధ్యం కానిది, అంతులేనిది, సహింపశక్యముకానిది అయి, అనేక జన్మల నుంచి పేరుకుపోయి, చుట్టుకుపోయినది అయి, దాటశక్యంగానిదై, గంభీరము, కఠోరమునైన కల్మషమనే కారుచిచ్చు మహాభయంకరంగా ఉన్నది. దీన్ని ఆర్పివేయాలంటే శ్రేష్ఠమైన ఆ నందనందనుని కథాసుధారసంతో నిండిన బ్రహ్మాండమైన వర్షధారాప...
9
జలరాశి దాఁటఁ గోరెడి కలము జనుల్ కర్ణధారుఁ గాంచిన భంగిం. గలి దోష హరణ వాంఛా కలితులమగు మేము నిన్నుఁ గంటిమి, సూతా!
ఓ సూతమహర్షీ! మహాసముద్రాన్ని దాటాలని ప్రయత్నించే ప్రయాణికులకు ఓడ నడిపే నావికుడు లభించినట్లుగా, కలికాల పాపాలను పోగొట్టుకొని తరించాలని కోరుతున్న మాకు నీవు కన్పించావు.
10
చారుతర ధర్మరాశికి భారకుఁడగు కృష్ణుఁ డాత్మపదమున కేఁగన్, భారకుఁడు లేక యెవ్వనిఁ జేరును ధర్మంబు బలుపు సెడి, మునినాథా!
ఓ సూతమహర్షీ! ఉత్తమ ధర్మాలకు ఆధారంగా ఉండే శ్రీకృష్ణుడు పరమపదం చేరుకున్న తరువాత, ఆధారంలేని ధర్మం దిక్కుమాలి, చిక్కి జీర్ణించి ఎవరిని ఆశ్రయిస్తుందో వివరించు.”
11
అతిరహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుఁ డెవ్వఁ డేని మాపు రేపుఁ జాల భక్తితోడఁ జదివిన సంసార దుఃఖరాశిఁ బాసి తొలఁగిపోవు.
అత్యంత రహస్య గాథలైన వాసుదేవుని అవతార గాథలు, ఏ మానవుడైతే ఉదయము సాయంకాలము అత్యంత శ్రద్ధాభక్తులతో నిత్యము పఠిస్తాడో, అతడు దుఃఖమయమైన సంసార బంధాలకు దూరంగా తొలగిపోయి ఆనందం అనుభవిస్తాడు.
12
జననము లేక కర్మముల జాడలఁ బోక సమస్త చిత్త వ ర్తనుఁడగు చక్రికిం గవు లుదార పదంబుల జన్మకర్మముల్ వినుతులు సేయుచుండుదురు వేదరహస్యములందు నెందుఁ జూ చిన మఱి లేవు జీవునికిఁ జెప్పిన కైవడి జన్మకర్మముల్.
చక్రధారుడైన ఆ హరికి జన్మ అన్నది లేదు. ఏ కర్మలూ ఆయనని అంటవు. సమస్తజీవుల చిత్తములలోను ఆయన నివసిస్తూ ఉంటాడు. ఆ పరాత్పరునికి విద్వాంసులు జన్మలు కర్మలు కల్పించి, ఉదాత్తములైన పదజాలాలతో వర్ణిస్తున్నారు. స్తోత్రాలు చేస్తున్నారు. వాస్తవానికి వేదాలన్నీ వెదకి చూసినా జీవునికి వలె దేవునికి జన్మలు కర్మలు లేనేలేవు.
13
భువనశ్రేణి నమోఘలీలుఁ డగుచుం బుట్టించు రక్షించు నం తవిధింజేయు మునుంగఁడందు; బహుభూతవ్రాతమం దాత్మతం త్రవిహారస్థితుడై షడింద్రియ సమస్తప్రీతియున్ దవ్వులన్ దివిభంగిం గొనుఁ జిక్కఁ డింద్రియములం ద్రిప్పున్ నిబంధించుచున్.
ఈ సకల భువన జాలాన్నీ తన అమోఘమైన లీలావిలాసం చేత శ్రీమన్నారాయణుడు పుట్టిస్తుంటాడు, రక్షిస్తుంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. కాని తాను మాత్రం ఆ జనన మరణాలలో నిమగ్నం కాడు. సర్వ ప్రాణి సమూహ మందు ఆత్మస్వరూపుడై విహరిస్తుంటాడు. ఎంతో దూరంలో అందకుండా స్వర్గంలాగా ఉండి, జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సమకూరుస్తూ, తాను మాత్రం ఇంద్రియాలకు అతీ...
14
జగదధినాథుఁడైన హరిసంతతలీలలు నామరూపముల్ దగిలి మనోవచోగతులఁ దార్కికచాతురి యెంత గల్గినన్ మిగిలి కుతర్కవాది తగ మేరలు సేసి యెఱుంగ నేర్చునే? యగణిత నర్తనక్రమము నజ్ఞుఁ డెఱింగి నుతింప నోపునే?
సర్వలోకేశ్వరుడైన శ్రీహరి లీలావిలాసంగా నానావిధాలైన నామరూపాలు ధరిస్తూ ఉంటాడు. కళా హృదయం లేని అజ్ఞుడు, నాట్యంలోని అందచందాలను అర్థంచేసికొని ఆనందించి అభినందించ లేనట్లే, వితర్కాలు కుతర్కాలు నేర్చినవాడు తర్క శాస్ర్త పాండిత్యం ఎంత ఉన్నా, భగవంతుని సత్యస్వరూపాన్ని మనస్సుచేత గానీ వాక్కుల చేతగానీ ఇంత అని గ్రహింపలేడు.
15
ఇంచుక మాయలేక మది నెప్పుడుఁ బాయని భక్తితోడ వ ర్తించుచు నెవ్వఁడేని హరిదివ్యపదాంబుజ గంధరాశి సే వించు, నతం డెఱుంగు నరవింద భవాదులకైన దుర్లభో దంచితమైన, యా హరి యుదార మహాద్భుత కర్మమార్గముల్.
మర్మము అన్నది కొంచం కూడ లేకుండ, ఎడతెగని భక్తితో ప్రవర్తిస్తూ, నారాయణ చరణారవింద సుగంధాన్ని సేవించే మహాత్ముడు, బ్రహ్మాదులకు సైతం అందుకొన శక్యం కాని భగవంతుని అత్యద్భుతమైన లీలావిశేషాలను తెలుసుకొంటాడు” ఇలా చెప్పి సూతుడు శౌనకాది మహర్షులతో ఇలా అన్నాడు.
16
హరిపాదద్వయభక్తి మీ వలన నిట్లారూఢమై యుండునే తిరుగంబాఱదు చిత్తవృత్తి హరిపై దీపించి మీలోపలన్ ధరణీదేవతలార! మీరలు మహాధన్యుల్ సమస్తజ్ఞులున్ హరిచింతన్ మిముఁ జెంద వెన్నడును జన్మాంతర్వ్యధాయోగముల్
ఓ బ్రహ్మణ్యులారా ! మీరు పుణ్యవంతులలో శ్రేష్ఠులు, సర్వం తెలిసిన మునివరేణ్యులు. మీలో శ్రీహరి చరణయుగంపై భక్తి ఇంతగా ఆరూఢమై ఉన్నది. మీ హృదయాలు శ్రీహరి యందు అసక్తములై ఎడబాటు ఎరుగకుండా ఉన్నాయి. శ్రీమన్నారాయణ సంస్మరణ ప్రభావం వల్ల ఈ చావు పుట్టుకల బాధలు ఎన్నడూ మీ సమీపానికి రాలేవు.
17
ఆనందాశ్రులు గన్నులన్ వెడల, రోమాంచంబుతోఁ, దత్పద ధ్యానారూఢుఁడ నైన నా తలఁపులో నద్దేవుఁడుం దోఁచె నే నానందాబ్ధిగతుండనై యెఱుఁగలేనైతిన్ ననున్నీశ్వరున్, నానాశోకహమైన యత్తనువు గానన్ లేక యట్లంతటన్.
నా కళ్ళల్లో ఆనందబాష్పాలు పొంగిపొర్లాయి. నా శరీరమంతా పులకించింది. ఆ భక్తి పారవశ్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు. నేను కన్నులు తెరచి చూచేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచలు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైపోయింది.
18
ఏల కుమార! శోషిలఁగ? నీ జననంబున నన్నుఁ గానఁగాఁ జాలవు నీవు, కామముఖషట్కము నిర్దళితంబు సేసి ని ర్మూలితకర్ములైన మునిముఖ్యులు గాని, కుయోగిఁ గానఁగాఁ జాలఁడు, నీదు కోర్కి కొనసాఁగుటకై నిజమూర్తిఁ జూపితిన్.
నాయనా! ఎందుకలా వృథాగా ఆయాసపడతావు. నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు. కామక్రోధాది అరిషడ్వర్గాన్ని జయించి నిర్మూలితకర్ములైన ముని ముఖ్యులే నన్ను చూడ గల్గుతారు. అంతే కాని జితేంద్రియులు కానివారు నన్ను దర్శించలేరు. అయినా నీ మనసులోని కోరికను కొనసాగించటం కోసం క్షణ కాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశాను.
19
నావలని కోర్కి యూరక పోవదు, విడిపించు దోషపుంజములను, మ త్సేవం బుట్టును వైళమ భావింపఁగ నాదు భక్తి బాలక! వింటే.
వత్సా! నా యందు లగ్నమైన నీ కోరిక వ్యర్థం కాదు. నీ సమస్త దోషాలూ దూరమౌతాయి. నన్ను సేవించటం వల్ల నాభక్తి అచిరకాలంలోనే నీమదిలో పదిలమౌతుంది.
20
నాయందుఁ గలుగు నీ మది వాయదు జన్మాంతరముల బాలక! నీ వీ కాయంబు విడిచి మీఁదట మా యనుమతిఁ బుట్టఁగలవు మద్భక్తుఁడవై.
కుమారా నా యందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో కూడా నన్ను అంటిపెట్టుకొని ఉంటుంది. నీవు ఈ దేహాన్ని వదలిన అనంతరం నా అనుజ్ఞతో మరు జన్మలో నా భక్తుడివై ఉద్భవిస్తావు.
21
విను; మీ సృష్టిలయంబు నొంది యుగముల్ వేయైన కాలంబు యా మినియైపోయెడిఁ బోవఁగాఁ, గలుగుఁజూమీఁదం బునఃసృష్టి, యం దు నిరూఢస్మృతితోడఁ బుట్టెదవు నిర్దోషుండవై నా కృపన్, ఘనతం జెందెదు శుద్ధ సాత్త్వికులలో గణ్యుండవై యర్భకా!
విను చిట్టితండ్రి! ఈ సృష్టి యావత్తూ లయమైపోయిన పిమ్మట వేయి యుగాలు చీకటి రాత్రిగా గడిచిపోతుంది. అప్పుడు తిరిగి సృష్టి ఏర్పడుతుంది. నీవు మళ్లీ జన్మిస్తావు. నీకు పూర్వస్మృతి ఉంటుంది. నా అనుగ్రహం వల్ల నీ దోషాలన్నీ నశించి సత్వ గుణసంపన్నులైన హరిభక్తులలో అగ్రగణ్యుడవై ప్రసిద్ధుడవు అవుతావు.”
22
తీర్థపాదుఁడయిన దేవుండు విష్ణుండు తన చరిత్ర మేను దవిలి పాడఁ, జీరఁబడ్డవాని చెలువున నేతెంచి ఘనుఁడు నామనమునఁ గానవచ్చు.
నేను విష్ణుమూర్తి లీలలను గానం చేసినప్పుడు, తీర్థపాదుడు, దేవాదిదేవుడు, వాసుదేవుడు అయిన హరి పేరు పెట్టి పిలిచినట్లుగా వచ్చి నా మనస్సులో దర్శనము ఇచ్చేవాడు.
23
విను మీ సంసారంబను వననిధిలో మునిఁగి కర్మవాంఛలచే వే దనఁ బొందెడువానికి వి ష్ణుని గుణవర్ణనము తెప్ప సుమ్ము మునీంద్రా!
ఓ వ్యాసమహర్షీ! ఈ సంసార సముద్రంలో మునిగి తేలుతూ విషయవాంఛలచే క్రిందుమీదై బాధపడేవానికి గోవింద గుణకీర్తనం గట్టుకు చేర్చే తెప్ప లాంటిది.
24
యమనియమాది యోగముల నాత్మ నియంత్రిత మయ్యుఁ, గామరో షములఁ బ్రచోదితంబ యగు, శాంతి వహింపదు, విష్ణుసేవచేఁ గ్రమమున శాంతిఁ గైకొనిన కైవడి; నాదు శరీర జన్మ క ర్మముల రహస్య మెల్ల మునిమండన! చెప్పితి నీవు గోరినన్.
మునికులభూషణా! యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహారాది అష్టాంగముల ద్వారా మనస్సును ఎంత కట్టుదిట్టం చేసుకొన్నప్పటికీ కామం, రోషం మొదలైన వానిచే అది మాటిమాటికీ రెచ్చిపోతూనే ఉంటుంది. కానీ శాంతించదు. అట్టి శాంతి వాసుదేవుని సేవ వల్లనే క్రమంగా లభిస్తుంది. నా పుట్టు పూర్వోత్తరాల రహస్యమంతా నీవు కోరిన ప్రకారం నీకు వివరించి చెప్పాను.“
25
వాయించు వీణ నెప్పుడు, మ్రోయించు ముకుందగీతములు, జగములకుం జేయించుఁ జెవుల పండువు, మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలఁడే
నారదమహర్షి సర్వదా మహతీ విపంచి వాయిస్తు, ముకుందగీతాలు మ్రోయిస్తు, సకల జగత్తులకు వీనులవిందు చేస్తు, లోకుల పాపసమూహాలను మాయిస్తు, సంచరించే మేటి భక్తుడు. ఆయనకు ఆయనే సాటి.
26
అవనీచక్రములోన నే పురుషుఁ డే యామ్నాయమున్ విన్న మా ధవుపై లోకశరణ్యుపై భవములం దప్పింపఁగాఁ జాలు భ క్తివిశేషంబు జనించు నట్టి భువనక్షేమంకరంబైన భా గవతామ్నాయము బాదరాయణుఁడు దాఁ గల్పించె నేర్పొప్పగన్.
ఈ విశాల భూమండలంలో ఏ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రం చేతనే సంసారబంధాలు సమసిపోయి జగన్నాథుడైన నారాయణునిపై అచంచలమైన భక్తి ఆవిర్భవిస్తుందో, అట్టి లోకకల్యాణకరమైన మహాగ్రంథాన్ని, వేదస్వరూపమైన భాగవతాన్ని బాదరాయణ మహర్షి ఓర్పుతో నేర్పుతో రూపొందించాడు.
27
ధీరులు, నిరపేక్షులు, నా త్మారాములునైన మునులు హరిభజనము ని ష్కారణమ చేయుచుందురు; నారాయణుఁ డట్టి వాఁ, డనవ్యచరిత్రా!
పురాణప్రవర్తకా! జితేంద్రియులు, నిష్కాములు, ఆత్మారాములు అయిన మహామునులు ఫలాపేక్ష లేకుండానే కారణములేకనే భక్తితో శ్రీహరిని భజిస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణుడు సైతం భక్తుల విషయంలో కారణము లేకుండానే కటాక్షిస్తూ ఉంటాడు.
28
హరిగుణవర్ణన రతుఁడై హరితత్పరుఁడైన బాదరాయణి శుభత త్పరతంబఠించెఁ ద్రిజగ ద్వరమంగళమైన భాగవత నిగమంబున్.
శ్రీహరి గుణకీర్తన మందు ఆసక్తుడూ, ఉత్తమ విష్ణుభక్తుడూ అయిన శుకమహర్షి ముల్లోకాలకూ కల్యాణప్రదమైన భాగవతము అనే వేదమును విశ్వశ్రేయస్సును ఆకాక్షించి అధ్యయనం చేసాడు.
29
నిగమములు వేయుఁ జదివిన సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్. సుగమంబు భాగవత మను నిగమంబుఁ బఠింప ముక్తినివసనము బుధా!
జ్ఞానవంతుడా! వేలకొద్దీ వేదాలను ఎంత చదివినా మోక్షసంపదలు అందుకోడం అంత సుళువు కాదు. అదే భాగవతము, అనే వేదాన్ని పఠిచటం ద్వారా అయితే మోక్షం అతి సుళువుగా దొరుకుతుంది.
30
హరినెఱుంగక యింటిలో బహుహాయనంబులు మత్తుఁడై పొరలుచుండెడి వెఱ్ఱి ముక్తికిఁ బోవనేర్చునె? వాఁడు సం సరణముం బెడఁబాయఁ డెన్నఁడు; సత్య మా హరినామ సం స్మరణ మొక్క ముహూర్తమాత్రము చాలు ముక్తిదమౌ నృపా!
విష్ణుదేవుని తెలుసుకోకుండా మత్తెక్కి సంసారములో సంవత్సరాల తరబడి పొరలాడుతూ సతమత మవుతుండే అవివేకి ముక్తి కెలా పోగలడు. వాడు సంసారబంధం నుండి ఎన్నటికీ బయటపడలేడు. కాని ఓ రాజా! ఒక్క క్షణమైనా హరినామం స్మరిస్తే చాలు. అది ముక్తిని ప్రసాదిస్తుంది ఇది నిజం.
31
గిరులంబోలెడి కరులను, హరులం, దన ప్రాణదయితలై మనియెడి సుం దరులను, హితవరులను, బుధ వరులను వర్జించి గాఢవైరాగ్యమునన్.
ప్రగాఢమైన వైరాగ్యంతో పర్వతాలవంటి ఏనుగులను, గుఱ్ఱాలను, ప్రాణప్రియాలైన సుందరాంగులను, సన్నిహితులను, హితులను, పండితశ్రేష్ఠులను పరిత్యజించాడు.
32
గోవిందనామకీర్తనఁ గావించి భయంబు దక్కి ఖట్వాంగ ధరి త్రీవిభుఁడు సూర గొనియెనుఁ గైవల్యముఁ దొల్లి రెండు గడియలలోనన్.
అలా ముక్తసంగుడైన ఖట్వాంగుడు, పూర్వం, గోవిందనామ సంకీర్తనం చేసి భయరహితుడై రెండు గడియల్లోనే చక్కగా మోక్షం పొందాడు.
33
భువనాత్మకుఁ డా యీశుఁడు భవనాకృతితోడ నుండు బ్రహ్మాండంబున్ వివరముతోఁ బదునాలుఁగు వివరంబులుగా నొనర్చె విశదంబులుగన్
ప్రపంచ స్వరూపుడైన ఆ ఈశ్వరుడు ఒక భవనం లాగ ఉన్న బ్రహ్మాండాన్ని విడివిడిగాచేసి విపులమైన చతుర్దశభువనాలుగా తీర్చిదిద్దాడు.
34
బహు పా దోరు భు జాన నేక్షణ శిరఃఫాలశ్రవోయుక్తుఁడై విహరించున్ బహుదేహి దేహగతుఁడై; విద్వాంసు లూహించి త ద్బహురూపావయవంబులన్ భువనసంపత్తిన్ విచారింతు; రా మహనీయాద్భుతమూర్తి యోగిజన హృన్మాన్యుండు మేధానిధీ!
బుద్ధిమంతుడవైన వాడా! ఆ దేవుడు అనేకాలైన పాదాలూ, ఊరువులూ, భుజాలూ, ముఖాలూ, నేత్రాలూ, శిరస్సులూ, నోళ్లూ, చెవులతో కూడి ఉన్నాడు. అలా ఉంటూ అనేక ప్రాణుల శరీరాలలో నెలకొని విహరిస్తూ వుంటాడు. పండితులు చక్కగా విమర్శించి ఆ భగవంతుని అనేక రూపాలైన అవయవాలలోనే సమస్త భువనాల ఉనికినీ విచారిస్తూ ఉంటారు. మహామహూడూ, ఆశ్చర్యకర స్వరూపుడూ అయిన ఆ ...
35
నీలకంధరునకు నీకు నాకు సనత్కు మార ముఖ్య సుతసమాజమునకు ధర్మ సత్త్వ బుద్ధి తత్త్వములకు నీశ్వ రాత్మ వినుము పరమమైన నెలవు.
శివునికీ, నీకూ, నాకూ, సనత్కుమారాదులకూ, ధర్మానికీ, సత్త్యానికీ, విజ్ఞానానికీ శ్రేష్ఠమైన ఉనికి పట్టు ఆ పరమేశ్వరుని అత్మే.
36
మండలములోన భాస్కరుఁ డుండి జగంబులకు దీప్తి నొసఁగెడి క్రియ బ్ర హ్మాండములోపల నచ్యుతుఁ డుండుచు బహిరంతరముల నొగి వెలిఁగించున్.
తన మండలంలోనే తానుంటు సూర్యుడు లోకాలకు కాంతి నిస్తున్నాడు. అలాగే అచ్యుతుడు బ్రహ్మాండంలో ఉంటూనే లోపలా, వెలుపలా ప్రకాశింపజేస్తున్నాడు.
37
అనఘా! విశ్వము నెల్ల దీప్తముగఁ జేయన్ నే సమర్థుండనే? యిన చంద్రానల తారకా గ్రహగణం బే రీతి నా రీతి నె వ్వని దీప్తిం బ్రతిదీప్తమయ్యె భువనవ్రాతంబు దద్ధీప్తిచే ననుదీప్తం బగునట్టి యీశ్వరున కే నశ్రాంతమున్ మ్రొక్కెదన్.
పాపరహితుడా! ఈ ప్రపంచాన్నంతటినీ ప్రకాశింపజేసే సామర్థ్యం నాకు లేదు. ఎవని దివ్య ప్రకాశం వల్ల సూర్యుడు, చంద్రుడు, అగ్నీ, నక్షత్రాలు, గ్రహాలు ఆలాగే ఈ లోకాలన్నీ కూడ సముజ్జ్వలంగా ప్రకాశిస్తున్నాయో, అట్టి దివ్యదీప్తితో తేజరిల్లుతున్న పరమేశ్వరునకు నే నెల్ల వేళలా ప్రణమిల్లుతున్నాను.
38
ఆ యీశుఁడ నంతుఁడు హరి నాయకుఁ డీ భువనములకు, నాకున్, నీకున్, మాయకుఁ బ్రాణివ్రాతము కీ యెడలన్ లేద యీశ్వరేతరము సుతా!
కుమారా! ఆ పరమేశ్వరుడు తుది లేనివాడు. ఆ శ్రీహరి ఈ లోకాలకు, నాకు, నీకు, మాయకు, ప్రాణికోటికి ప్రభువు. ఆయన కంటే అన్యమైనది ఏది ఈ జగత్తులో లేనే లేదు.
39
గణుతింపఁగ నరనారా యణు లన ధర్మునకు నుదయ మందిరి; దాక్షా యణియైన మూర్తి వలనం బ్రణుతగుణోత్తరులు పరమపావనమూర్తుల్.
మిక్కిలి ప్రసిద్ధమైన గుణాలు గలవారు, మిక్కిలి పవిత్రమూర్తులైన నరనారాయణు లనేవారు ధర్మానికి అధిష్ఠానమైన ధర్ముడికి, దక్షుని కుమార్తె అయిన మూర్తి యందు, జన్మించారు.
40
అనఘులు బదరీవనమున వినుత తపోవృత్తి నుండ, విబుధాధిపుఁడున్ మనమున నిజపదహానికి ఘనముగఁ జింతించి దివిజకాంతామణులన్.
ఆ ఆనఘులు బదరికావనంలో గొప్ప తపస్సు చేయసాగారు. అందువలన, తన పదవికి ప్రమాదం వాటిల్లుతుంది అని ఇంద్రుడు బెదిరాడు. అందుచేత ఇంద్రుడు దేవకాంతలను పిలిపించి “వాళ్ళ తపస్సు చెడగొట్టండి” అని చెప్పి పంపాడు.
41
రావించి తపోవిఘ్నముఁ గావింపుం డనుచు బనుపఁ గడు వేడుకతో భావభవానీకిను లనఁ గా వనితలు సనిరి బదరికావనమునకున్.
అలా పిలిపించి నరనారాయణుల తపస్సు భగ్నం చేయమని ఇంద్రుడు పంపగా, అప్సరసలు ఎంతో సంతోషంతో కంతుని చతురంగసేనలా అన్నట్లు బయలుదేరి బదరీవనానికి వెళ్ళారు.
42
నరనారాయణు లున్న చోటికి మరున్నారీ సమూహంబు భా స్వరలీలం జని రూప విభ్రమ కళా చాతుర్య మేపారఁగాఁ బరిహాసోక్తుల నాటపాటలఁ జరింపం జూచి నిశ్చింతతన్ భరితధ్యాన తపః ప్రభావ నిరతిం బాటించి నిష్కాములై.
అక్కడ నరుడు, నారాయణుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి దేవకాంతలు సవిలాసంగా వచ్చారు. అందచందాల తీరు, కళానైపుణ్యాల సౌరు ఉట్టిపడేలా పరాచికాలాడుతు, ఆటలాడుతూ, పాటలు పాడుతూ విహరించారు. అలా విలాసలీలలతో తపోవనంలో విచ్చలవిడిగా విహరిస్తున్న అప్సరసలను నరనారాయణులు చూసారు. కాని ఏ మాత్రం చలించలేదు. కామానికి లోను కాలేదు. నిశ్చింతులై, నిర్...
43
క్రోధము దమ తపములకును బాధక మగు టెఱిఁగి దివిజభామలపై న మ్మేధాత్మకు లొక యింతయు క్రోధముఁ దేరైరి సత్వగుణయుతు లగుటన్.
తమ తపస్సులకు కోపం నష్టదాయక మని తెలిసిన సత్త్వ సంపన్నులు, బుద్ధిమంతులు అయిన వారు సురసుందరులపై ఏ మాత్రం కోపం చూపలేదు.
44
నారాయణుఁ డప్పుడు దన యూరువు వెసఁ జీఱ నందు నుదయించెను, బెం పారంగ నూర్వశీ ముఖ నారీజనకోటి దివిజనారులు మెచ్చన్.
అప్పుడు నారాయణుడు తన ఊరు భాగాన్ని గోటితో వేగంగా గీరాడు. అతని తొడలోనుండి అమరాంగనలు అచ్చెరువొందేలా ఊర్వశి మొదలైన అప్సరస స్ర్తీ సమూహం ఉద్భవించింది.
45
ఊరువులందు జనించిన కారణమున నూర్వశి యన ఘనతకు నెక్కెన్ వారల రూప విలాస వి హారములకు నోడి రంత నమరీజనముల్.
నారాయణుని ఊరువు నుండి పుట్టడంవల్ల ఆమె ఊర్వశి అని పేరుగాంచింది. ఇంద్రుడు పంపగా వచ్చిన అప్సరసలు ఊర్వశి మొదలైన వాళ్ల అందచందాలు, హావభావాలు, వినోదవిహారాలు చూసి లజ్జతో కుంచించుకు పోయారు.
46
కాముని దహించెఁ గ్రోధమ హామహిమను రుద్రుఁ; డట్టి యతికోపము నా ధీమంతులు గెలిచి రనం; గామము గెలుచుటలు సెప్పఁగా నేమిటికిన్.
కామానికి అధిదేవత యైన మన్మథుని, పూర్వం శివుడు తన కోపపు తీవ్రతచే కాల్చివేసాడు. అంతటి అలవికానిది కోపము. అటువంటి కోపాన్ని కూడ జయించారు ఆ మహా జ్ఞానులు నరనారాయణులు. ఇక కామాన్ని గెలవటం గురించి చెప్పేదేం ఉంది.
47
వేనుఁడు విప్రభాషణ పవిప్రహతిచ్యుత భాగ్యపౌరుషుం డై నిరయంబునం బడిన నాత్మ తనూభవుఁడై పృథుండు నాఁ బూని జనించి తజ్జనకుఁ బున్నరకంబును బాపె; మేదినిన్ థేనువుఁ జేసి వస్తువితతిం బితికెన్ హరి సత్కళాంశుఁడై.
వేను డనే భూపాలుడు భూసురుల శాపాలనే వజ్రాయుధం దెబ్బలు తిని, సిరిని పౌరుషాన్ని కోల్పోయాడు. తుదకు నరకం పాలయ్యాడు. అతనికి పృథుడనే కుమారుడు కలిగాడు. అతడు తండ్రిని పున్నామనరకం నుండి రక్షించాడు. శ్రీహరి కళాంశభవుడైన ఆ పృథుచక్రవర్తి భూమిని ధేనువుగా జేసి అమూల్యమైన అనేక వస్తువులను పిదికాడు.
48
అనఘచరిత్ర! మన్మఖము నందు జనించె హయాననాఖ్యతన్ వినుత సువర్ణ వర్ణుఁడును వేదమయుం డఖిలాంతరాత్మకుం డనుపమ యజ్ఞపూరుషుఁడునై భగవంతుఁడు దత్సమస్త పా వనమగు నాసికాశ్వసనవర్గములం దుదయించె వేదముల్.
సచ్చరిత్ర! మేలిమిబంగారు కాంతికలవాడు, వేదస్వరూపుడు, సర్వాంతర్యామి, సాటిలేని యజ్ఞపురుషుడు హయగ్రీవునిగా దేవదేవుడు నేను చేసిన యజ్ఞంలోనుండి అవతరించాడు. సర్వాన్నీ పవిత్రం చేసే ఆ హయగ్రీవుని ముకుపుటాలలోని శ్వాసవాయువులనుండి వేదాలు ప్రాదుర్భవించాయి.
49
అమృతోత్పాదన యత్నులై విబుధ దైత్యానీకముల్, మందరా గముఁ గవ్వంబుగఁ జేసి యబ్ధిదఱువంగాఁ గవ్వపుంగొండ వా ర్థి మునుంగన్ హరి కూర్మరూపమున నద్రిం దాల్చెఁ దత్పర్వత భ్రమణవ్యాజత వీఁపుఁదీట శమియింపం జేయఁగా నారదా!
నారద! పూర్వం దేవతలు, రాక్షసులు కలిసి అమృతం సాధించాలనే ప్రయత్నంలో మందరగిరిని కవ్వంగా జేసుకొని క్షీరసాగరాన్ని మథించారు. ఆ కవ్వపు కొండ కడలి నడుమ మునిగిపోయింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు తన వీపుదురద తొలగించుకోవటానికా అన్నట్లు గిరగిర తిరుగుతున్న గిరిని కూర్మరూపం ధరించాడు.
50
సురలోకంబుఁ గలంచి దేవసమితిన్ స్రుక్కించి యుద్యద్గదా ధరుఁడై వచ్చు నిశాచరుం గని, కనద్దంష్ట్రా కరాళస్య వి స్ఫురిత భ్రూకుటితో నృసింహగతి రక్షోరాజ వక్షంబు భీ కరభాస్వన్నఖరాజిఁ ద్రుంచె ద్రిజగత్కల్యాణసంధాయియై.
ఒకప్పుడు రాక్షసుడు హిరణ్యకశిపుడు, దేవలోకంపై దండెత్తి దేవతలను బాధించసాగాడు. ప్రచండమైన గదాదండం చేబూని వస్తున్న ఆ దానవుణ్ణి శ్రీహరి చూచాడు. వాణ్ణి ఫరిమార్చి ముల్లోకాలకు క్షేమం కలిగించాలనుకొన్నాడు. వెంటనే కోరలతో భీతికొలిపే నోరు, కోపంతో ముడివడ్డ కనుబొమ్మలు కలిగిన నరసింహావతారం ధరించాడు. వాడి గోళ్లతో ఆ రాక్షసేశ్వరుని వక్షం చీ...
51
కరినాథుండు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాంతుఁడై వేయి వ త్సరముల్ గుయ్యిడుచుండ వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండుటన్ హరి నీవే శరణంబు నా కనినఁ గుయ్యాలించి వేవేగ వా శ్చరముం ద్రుంచి కరీంద్రుఁ గాచె మహితోత్సాహంబునం దాపసా!
ఓ మహర్షి! గజేంద్రుడు మొసలిచేత పట్టువడి దుఃఖించసాగాడు. వేయి సంవత్సరాలు దానితో పెనగులాడుతు రక్షణకై విశ్వమయునికి మొరపెట్టుకొన్నాడు. నీవే నాకిక దిక్కు అని ఆర్తుడై ఆక్రందనం చేసాడు. తక్కిన దేవతలు విశ్వమయులు కారు. కాబట్టి అతని ఆపద మాస్పలేక పోయారు. అప్పుడతడు అది విని వెనువెంటనే పరమాత్ముడు, శ్రీహరి ఆదిమూల స్వరూపుడై వచ్చి పరమోత్...
52
బలి నిజమౌళి నవ్వటుని పాదసరోరుహ భవ్యతీర్థ ము త్కలిక ధరించి, తన్నును జగత్త్రయమున్ హరికిచ్చి, కీర్తులన్ నిలిపె వసుంధరాస్థలిని నిర్జరలోక విభుత్వహానికిం దలఁకక శుక్రు మాటల కుఁదారక భూరివదాన్యశీలుఁడై.
పరమదాత అయిన బలిచక్రవర్తి ఆ బ్రహ్మచారి వామనుని పాదపద్మాలు కడిగిన పవిత్ర తీర్థాన్ని ఉత్సుకతతో తలమీద చల్లుకున్నాడు. తనతోపాటు మూడులోకాలను నారాయణుడికి ధారాదత్తం చేసాడు. విశ్వమంతట శాశ్వతమైన యశస్సు నిలుపుకొన్నాడు. ఆ దానంవల్ల దేవలోకం మీద తనకున్న పెత్తనం పోతుందని జంక లేదు. తనకు హాని జరుగుతుందని శుక్రాచార్యుడు చెప్పినా లక్ష్య పె...
53
ధరణీ కంటకులైన హైహయనరేంద్రవ్రాతమున్ భూరివి స్ఫురితోదారకుఠారధారఁ గలనన్ ముయ్యేడు మాఱుల్ పొరిం బొరి మర్దించి, సమస్త భూతలము విప్రుల్ వేఁడఁగా నిచ్చి తాఁ జిర కీర్తిన్ జమదగ్నిరాముఁ డన మించెం దాపసేంద్రోత్తమా!
మునీంద్రులలో అగ్రగణ్యుడవైన నారద! హైహయరాజులు లోక విరోధులై దురుసుగా ప్రవర్తించారు. వాళ్లను శిక్షించడానికి శ్రీమన్నారాయణమూర్తి జమదగ్నిసుతుడైన ఆ పరశురాముడుగా అవతరించాడు. రణరంగంలో ఇరవై యొక్కసార్లు ఈ రాజసమూహాన్ని దారుణమైన తన గండ్రగొడ్డలితో చెండాడు. బ్రాహ్మణులు వేడుకోగా భూమండల మంతా వాళ్లకు దానం చేసాడు. ఆ భార్గవరాముడు అలా శాశ్...
54
తోయజహిత వంశ దుగ్ధ పారావార-   రాకా విహార కైరవహితుండు కమనీయ కోసలక్ష్మాభృత్సుతా గర్భ-   శుక్తి సంపుట లసన్మౌక్తికంబు నిజపాదసేవక వ్రజ దుఃఖ నిబిడాంధ-   కార విస్ఫురిత పంకరుహసఖుఁడు దశరథేశ్వర కృతాధ్వరవాటికా ప్రాంగ-   ణాకర దేవతానోకహంబు చటుల దానవ గహన వైశ్వానరుండు రావణాటోప శైల పురందరుండు నగుచు లోకోపకారార్థ మవతరించె రాముఁడై చక్రి ...
ఆయన సూర్యవంశమనే పాల్కడలికి పున్నమ చంద్రుడు. కోసలరాజు కూతురైన కౌసల్యాదేవి గర్భమనే ముత్తెపు చిప్పలో పుట్టిన మేలి ముత్యము. తన పాదసేవకుల శోకమనే చిమ్మచీకట్లను పోకార్చే సూర్యభగవానుడు. దశరథమహారాజు గారి పుత్రకామేష్ఠి యాగశాల ముంగిట మొలకెత్తిన కల్పవృక్షం. దానవులనే దారుణారణ్యాన్ని దహించే కార్చిచ్చు. రావణుని గర్వమనే పర్వతాన్ని బద్...
55
చిత్రముగ భరత లక్ష్మణ శత్రుఘ్నుల కర్థి నగ్రజన్ముం డగుచున్ ధాత్రిన్ రాముఁడు వెలసెఁ బ విత్రుఁడు దుష్కృత లతా లవిత్రుం డగుచున్.
ఆ శ్రీరామచంద్రునిగా అవతరించాడు. భరత లక్ష్మణ శత్రుఘ్నులకు అన్నగా జన్మించాడు. భూలోకంలో పరమ పవిత్రుడుగా, పాపాలనే కలుపు లతలను కోసివేసే కొడవలి వంటి వాడుగా ప్రసిద్ధికెక్కాడు.
56
కిసలయ ఖండేందు బిస కుంద పద్మాబ్జ-   పద ఫాల భుజ రద పాణి నేత్రఁ గాహళ కరభ చక్ర వియత్పులిన శంఖ-   జంఘోరు కుచ మధ్య జఘన కంఠ ముకుర చందన బింబ శుక గజ శ్రీకార-   గండ గంధోష్ఠ వాగ్గమన కర్ణఁ జంపకేందుస్వర్ణ శఫర ధనుర్నీల-   నాసికాస్యాంగ దృగ్భ్రూ శిరోజ నళి సుధావర్త కుంతల హాస నాభి కలిత జనకావనీ పాల కన్యకా ల లామఁ బరిణయ మయ్యె లలాటనేత్ర కా...
ఆ శ్రీరాముడు శివుని ధనుర్భంగం ఓలి కాగా జనకమహారాజు పుత్రిక సీతాదేవిని చేపట్టాడు. ఆ మహాదేవి పాదాలు చివుళ్ల వంటివి, ఫాలం అర్ధచంద్రుని వంచిది, భుజాలు తామరతూండ్ల వంటివి, దంతాలు మొల్లల వంటివి, హస్తాలు పద్మాల వంటివి, నేత్రాలు కలువల వంటివి, పిక్కలు కాహళుల వంటివి, తొడలు కరభాల వంటివి, స్తనాలు చక్రవాకాల వంటిని, నడుము ఆకాశం వంటిది...
57
రామున్ మేచకజలద శ్యామున్ సుగుణాభిరాము సద్వైభవసు త్రామున్ దుష్టనిశాటవి రాముం బొమ్మనియెఁ బంక్తిరథుఁ డడవులకున్.
నల్లని మేఘఛాయతో మెరిసిపోతు ఉండే వాడు, సర్వసుగుణాలతో ఒప్పి ఉండే వాడు, ఐశ్వర్యంతో ఇంద్రునికి సాటివచ్చే వాడు, దుష్టులైన రాక్షసులను చెండాడెడి వాడు అయిన శ్రీరామచంద్రుడిని దశరథుడు అడవులకు పొమ్మన్నాడు.
58
అరుదుగ లక్ష్మణుండు జనకాత్మజయుం దనతోడ నేఁగుదే నరిగి రఘూత్తముండు ముదమారఁగ జొచ్చెఁ దరక్షు సింహ సూ కర కరి పుండరీక కపి ఖడ్గ కురంగ వృకాహి భల్ల కా సర ముఖ వన్యసత్త్వచయ చండతరాటవి దండకాటవిన్.
లక్ష్మణుడు, సీత అడవులకు వెళ్తున్న రాముడి వెంట వెళ్ళారు. అలా రఘువంశ లలాముడైన ఆ శ్రీరాముడు సివంగులు, సింహాలు, అడవిపందులు, ఏనుగులు, పులులు, కోతులు, ఖడ్గమృగాలు, జింకలు, తోడేళ్లు, పాములు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు మొదలైన అడవి మృగాలు వసించే అత్యంత భీకరమైన దండకారణ్యం ప్రవేశించాడు.
59
ఆ వనమున వసియించి నృ పావననయశాలి యిచ్చె నభయములు జగ త్పావన మునిసంతతికిఁ గృ పావననిధి యైన రామభద్రుం డెలమిన్.
రాజుల లందరిలోను నీతిసంపన్నుడు, దయాసముద్రుడు అయిన ఆ శ్రీరాముడు ఆ దండకారణ్యంలోని లోకాలను పవిత్రం చేసే మునులు అందరికి అభయాలు యిచ్చాడు.
60
ఖరకర కుల జలనిధి హిమ కరుఁ డగు రఘురామవిభుఁడు గఱకఱితోడన్ ఖరుని వధించెను ఘనభీ కర శరముల నఖిల జనులుఁ గర మరుదందన్.
సూర్యవంశమనే సముద్రానికి చంద్రునివంటివాడైన ఆ రామచంద్రుడు అందలి జనులందరు ఆశ్చర్యపడగా కోపంతో మిక్కిలి భయంకరమైన బాణాలు ప్రయోగించి ఖరుడనే రక్కసుణ్ణి ఉక్కడగించాడు.
61
హరిసుతుఁ బరిచరుఁగాఁ గొని హరిసుతుఁ దునుమాడి పనిచె హరిపురమునకున్; హరివిభునకు హరిమధ్యను హరిరాజ్యపదంబు నిచ్చె హరివిక్రముఁడై.
సింహపరాక్రముడైన శ్రీరామచంద్రుడు సూర్యసుతుడైన సుగ్రీవుణ్ణి అనుచరునిగ స్వీకరించాడు. ఇంద్ర పుత్రుడైన వాలిని నేలగూల్చి యమపురికి పంపాడు. వానరాధిపుడైన సుగ్రీవునికి కిష్కింధ రాజ్యాన్ని, సింహం వంటి నడుము గల రుమని అప్పగించాడు.
62
వికటభ్రూకుటిఫాలభాగుఁ డగుచున్ వీరుండు క్రోధారుణాం బకుడై చూచిన యంతమాత్రమున నప్పాథోధి సంతప్తతో యకణగ్రాహ తిమింగిలప్లవ ఢులీ వ్యాళప్రవాళోర్మికా బక కారండవ చక్ర ముఖ్య జలసత్వశ్రేణితో నింకినన్.
ఆ మహావీరుడు రాముడు నొసట కనుబొమలు ముడివడగా, కోపం వల్ల ఎరుపెక్కిన నేత్రాలతో సముద్రం వైపు చూసాడు. అలా చూసేసరికి సముద్రం, నీటికోళ్లు, తాబేళ్లు, పాములు, మొసళ్లు, తిమింగిలాలు, పగడపు తీగలు, తరంగాలు, కొంగలు, కన్నెలేడి యను పక్షులు, చక్రవాకాలు మొదలైన జలజంతువులతో సహా నీళ్లు తుకతుక ఉడకగా ఇంకి పోయింది.
63
పురముల్ మూఁడును నొక్కబాణమున నిర్మూలంబు గావించు శం కరు చందంబున నేర్చె రాఘవుఁడు లంకాపట్టణం బిద్ధగో పుర శాలాంగణ హర్మ్య రాజభవనప్రోద్యత్ప్రతోళీ కవా ట రథాశ్వద్విప శస్త్ర మందిర నిశాటశ్రేణితో వ్రేల్మిడిన్.
పూర్వము శివుడు ఒకే బాణంతో త్రిపురాలను కాల్చివేసి నట్లు, రాముడు పెద్దపెద్ద గోపురాలు, శాలలు, ముంగిళ్లు, మేడలు , రాజగృహాలు, రచ్చలు, తలుపులు, రథాలు, గుఱ్ఱాలు, ఏనుగులు, ఆయుధాగారాలు, రాక్షసగణాలుతో నిండివున్న లంకానగరాన్ని చిటికలో భస్మీపటలం చేసాడు.
64
రావణు నఖిల జగద్వి ద్రావణుఁ బరిమార్చి నిలిపె రక్షోవిభుఁగా రావణుననుజన్ముని నై రావణసితకీర్తి మెఱసి రాఘవుఁ డెలమిన్.
ఈ విధంగా ఐరావత గజం వలె తెల్లని కీర్తితో ప్రకాశించిన శ్రీ రాముడు సమస్త భువనాలనూ వేధించి బాధించిన రావణుని హతమార్చాడు. అతని తమ్ముడైన విభీషణుణ్ణి రక్కసులకు రాజుగా చేసాడు.
65
ధర్మ సంరక్షకత్వప్రభావుం డయ్యు-   ధర్మవిధ్వంసకత్వమునఁ బొదలి ఖరదండనాభిముఖ్యముఁ బొంద కుండియు-   ఖరదండ నాభిముఖ్యమున మెఱసి బుణ్యజనావన స్ఫూర్తిఁ బెంపొందియుఁ-   పుణ్యజఁనాంతక స్ఫురణఁ దనరి సంతతాశ్రిత విభీషణుఁడు గాకుండియు-   సంతతాశ్రిత విభీషణత నొప్పి మించెఁ దనకీర్తిచేత వాసించె దిశలు; దరమె నుతియింప జగతి నెవ్వరికినైనఁ జారుతరమూర్త...
ఆయన ధర్మాన్ని రక్షించినవాడు అనే మహత్వం కలిగి కూడ ధర్మవిధ్వంసకుడై ప్రకాశించాడు, అనగా శివధనుర్భంగం చేశాడన్నమాట. ఖరదండనలో అభిముఖుడు కాకపోయినా ఖరదండనలో అభిముఖుయ్యాడు, అంటే కఠినశిక్షలు విధించడానికి విముఖుడైన ఆ రాముడు ఖరుడనే రాక్షసుణ్ణి దండించడానికి సుముఖు డయ్యాడు. పుణ్య జనరక్షకుడై కూడ పుణ్యజనులను హతమార్చాడు, అనగా పుణ్యాత్యు...
66
తాపసోత్తమ! విను దైత్యాంశములఁ బుట్టి-   నరనాథు లతుల సేనాసమేతు లగుచు ధర్మేతరులై ధాత్రిఁ బెక్కు బా-   ధల నలంచుటఁ జేసి ధరణి వగలఁ బొందుచు వాపోవ భూభార ముడుపుట-   కై హరి పరుఁడు నారాయణుండు చెచ్చెరఁ దన సితాసిత కేశయుగమున-   బలరామ కృష్ణ రూపములఁ దనరి యదుకులంబున లీలమై నుదయ మయ్యె భవ్యయశుఁ డగు వసుదేవు భార్యలైన రోహిణియు దేవకియు నను ర...
మునిశ్రేష్ఠుడ! రాక్షస అంశలతో పుట్టిన రాజులు అనేకమంది తమ అపారసేనాబలాలతో అధర్మమార్గాన ప్రవర్తించారు. భూదేవికి పెక్కుబాధలు కలిగించారు. ఆమె దుఃఖిస్తూ విష్ణుమూర్తికి మొరపెట్టుకుంది. పరాత్పరుడైన శ్రీహరి మదోన్మత్తులైన దానవులను సంహరించి భూ భారాన్ని తొలగించాలనుకొన్నాడు. యదువంశంలో వన్నెకెక్కిన వాసుదేవునకు రోహిణి, దేవకి అనే భార్య...
67
నూతన గరళస్తని యగు పూతనఁ బురిటింటిలోనఁ బొత్తుల శిశువై చేతనముల హరియించి ప రేతనగరమునకు ననిచెఁ గృష్ణుఁడు పెలుచన్.
శ్రీకృష్ణుడు పురుటింటిలో చంటిబిడ్డగా పొత్తిళ్ళలో ఉన్న సమయ మది. పాలిళ్ళలో ప్రత్యేక విషం కలిగిన పూతన అనే రాక్షసి పాలివ్వటానికి వచ్చింది. ఆ శైశవ కృష్ణుడు ఆమె ప్రాణాలను తాగేసి యమలోకానికి పంపేసాడు.
68
వికటముగ నిజపదాహతిఁ బ్రకటముగా మూఁడు నెలల బాలకుఁడై యా శకటనిశాటుని నంతక నికటస్థునిఁ జేసె భక్తనికరావనుఁడై.
భక్తలోక రక్షకుడైన శ్రీకృష్ణుడు మూడునెలల పిల్లవాడుగా ఉన్నాడు. శకటరూపంలో ఒక రాక్షసుడు అతణ్ణి పరిమార్చటానికి వచ్చాడు. అది గమనించిన బాలకృష్ణుడు తన కాలితన్నుతో ఆ దానవుణ్ణి దండధరుని వద్దకు సాగనంపాడు.
69
ముద్దుల కొమరుని వ్రేతల రద్దులకై తల్లి ఱోల రజ్జులఁ గట్టం బద్దులకు మిన్నుముట్టిన మద్దుల వడిఁ గూల్చె జనసమాజము వొగడన్.
కృష్ణుడు అల్లరి చేస్తున్నాడని గోపికలు యశోదవద్ద గోలపెట్టారు. యశోద అతణ్ణి త్రాటితో రోటికి కట్టివేసింది. అతడు ఆ రోటిని ఈడ్చుకొంటూ వెళ్లి ఆకాశాన్ని అంటే జంట మద్దులను నేలగూల్చాడు. అప్పుడు అక్కడి జనమంతా కృష్ణుణ్ణి కీర్తించారు.
70
మదిఁ గృష్ణుండు యశోదబిడ్డఁ డని నమ్మంజాల యోగీంద్ర త ద్వదనాంభోజములోఁ జరాచర సమస్తప్రాణిజాతాటవీ నద నద్యద్రి పయోధి యుక్త మగు నానా లోకజాలంబు భా స్వ దనూనక్రియఁ జూపెఁ దల్లికి మహాశ్చర్యంబు వాటిల్లఁగన్.
యోగివరేణ్యుడ! ఇలాంటి పరమాద్భుతాలు ఎన్నో బాల్యంలోనే చేసిన కృష్ణుడు యశోద కొడుకని నేను నమ్మలేకుండా ఉన్నానయ్యా. ఒకనాడు అతడు తల్లికి సకలచరాచర జీవులు, అడవులు, నదీనదాలు, పర్వతాలు, సముద్రాలు సమస్తంతో కూడిన వివిధ జగజ్జాలాలని అపూర్వంగా తన నోట చూపాడు. అది చూసి ఆ తల్లి అమితాశ్చర్యంతో చకితురా లయింది.
71
వర యమునానదీ హ్రద నివాసకుఁడై నిజ వక్త్ర నిర్గత స్ఫురిత విషాంబుపానమున భూజనులన్ మృతిఁ బొందఁ జేయు భీ కర గరళద్విజిహ్వుఁ డగు కాళియ పన్నగు నా హ్రదంబుఁ జె చ్చెర వెడలించి కాచె యదుసింహుఁడు గోపకగోగణంబులన్.
కాళియుడనే సర్పరాజు యమునా నది మడుగులో నివసించేవాడు. అతని కోరలలో భయంకరమైన విషం వుండేది. అతడు క్రక్కిన ఆ గరళం కలిసిన నీళ్లు త్రాగి ప్రజలు ప్రాణాలు గోల్పోయే వారు. ఇలా వుండగా యాదవశ్రేష్ఠుడైన కృష్ణుడు కాళియుణ్ణి ఆ మడుగునుండి వెడలగొట్టి గోవులను, గోపాలురను కాపాడాడు.
72
తనయా! గోపకు లొక్క రేయితఱి, నిద్రం జెందఁ గార్చిచ్చు వ చ్చినఁ గృష్ణా మము నగ్నిపీడితుల రక్షింపం దగుం గావవే యనినం గన్నులు మీరు మోడ్వుఁ డిదె దావాగ్నిన్ వెసన్నార్తు నే నన వారట్ల యొనర్ప మ్రింగె శిఖిఁ బద్మాక్షుండు లీలా గతిన్.
కుమార! గోపకు లందరు ఒకనాటి రాత్రి నిద్రిస్తున్నారు. ఇంతలో అమాంతంగా కార్చిచ్చు వాళ్లను చుట్టుముట్టింది. “కృష్ణా! మంటల్లో చిక్కుకొన్నాము. మమ్మల్ని కాపాడు, కాపాడు” అంటు వాళ్లందరూ తన్ను వేడుకొన్నారు. అప్పుడు పద్మాక్షుడు “మీరంతా కళ్లు మూసుకొండి ఇదిగో క్షణంలో నేను ఆ దావానలాన్ని ఆర్పి వేస్తాను అన్నాడు.” వారలా చేశారు. కృష్ణుడు ...
73
మందుని గతి యము నాంబువు లందు నిసిం గ్రుంకి బద్ధుఁడై చిక్కిన యా నందుని వరుణుని బంధన మందు నివృత్తునిగఁ జేసె హరి సదయుండై.
ఒక రాత్రివేళ నందుడు మందమతి వలె యమునా నదీ జలాలలో స్నానం చేస్తూ మునిగి, అక్కడ వరుణుని పాశాలలో చిక్కకొన్నాడు. అప్పుడు దయాసింధుడైన హరి ఆ బంధంనుండి అతణ్ణి విడిపించాడు.
74
మయసూనుండు నిజానువర్తుల మహామాయన్ మహీభృద్గుహా శ్రయులంగా నొనరించి తత్పథము నీరంధ్రంబు గావించినన్ రయ మొప్పం గుటిలాసురాధమునిఁ బోరం ద్రుంచి గోపావళిన్ దయతోఁ గాచిన కృష్ణు సన్మహిమ మేతన్మాత్రమే తాపసా!
నారదమునీశ్వర! వ్యోమాసురుడు మయుని కుమారుడు. అతను ఒకసారి తన మాయా ప్రభావంతో కృష్ణుని సహచరులైన గోపకు లందరినీ ఒక గుహలో దాచేసాడు. ఇంకెవ్వరు ఆ గుహలో వెళ్ళడానికి లేకుండా మూసివేశాడు. అంతట మహావేగంతో కృష్ణుడు ఆ క్రూరదానవుణ్ణి పోరాటంలో చంపాడు. గోపాలకుల నందరినీ కృపతో కాపాడాడు. అటువంటి కృష్ణుని మహామహిమలను ఇంతింతని చెప్పతరమా.
75
దివిజేంద్రప్రీతిగ వ ల్లవజను లేఁటేఁటఁ జేయు లాలిత సవనో త్సవము హరి మానిపిన గో పవరులు గావింపకున్న బలరిపుఁ డలుకన్.
గోపకులు ప్రతిసంవత్సరము ఇంద్రుడికి ప్రితిగా చేసే యాగాన్ని శ్రీకృష్ణుడుమానిపించగా, గోపకులు యాగం చేయడం మానివేశారు. దానితో ఇంద్రుడు కోపంతో....
76
మంద గొందల మంద నమందవృష్టిఁ గ్రందుకొనుఁ డంచు నింద్రుండు మందలింపఁ జండపవన సముద్ధూత చటుల విలయ సమయ సంవర్త కాభీల జలధరములు.
వ్రేపల్లె కలతపడేటట్టు జోరున ఎడతెరపిలేని వాన వెంటనే కురవండి అంటూ ఇంద్రుడు మేఘాలను ఆదేశించాడు. ప్రచండమైన మారుతవేగానికి పై కెగిరి ప్రళయకాలంలోని సంవర్తకాలవంటి భయంకరమైన మేఘాలు.
77
సప్తస్కంధ శిఖా కలాప రుచిమత్సౌదామనీవల్లికా దీప్తోదగ్రముహుస్తమః పిహితధాత్రీ భాగనీరంధ్రమై సప్తాశ్వస్ఫుర దిందు మండల నభస్సంఛాదితాశాంతర వ్యాప్తాంభోద నిరర్గళస్ఫుట శిలావాః పూరధారాళమై.
వాన ప్రారంభ మయింది. అగ్ని జ్వాలల్లాగా మిరుమిట్లు గొలిపే మెరుపులతోటివాటి మధ్యలో మాటిమాటికి భీకరంగా కమ్ముకొచ్చే కారుచీకట్లతోటి, దేవేంద్రునిచే ప్రేరేపింపబడిన వర్షం అంతకంతకూ భయంకర మయింది. సూర్య చంద్రమండలాలతో సహా గగనాన్ని కప్పివేసి దిగంతరాలకు వ్యాపించాయి ఆ కారుమబ్బులు, ధారాళంగా కుండపోతగా రాళ్లవాన కురియసాగింది.
78
సప్తాబ్దంబుల బాలుఁడై నిజభుజాస్తంభంబునన్ లీలమై సప్తాహంబులు శైలరాజము లసచ్ఛత్త్రంబుగాఁ దాల్చి, సం గుప్తప్రాణులఁ జేసె మాధవుఁడు గోగోపాలకవ్రాతమున్ సప్తాంభోధి పరీతభూధరున కాశ్చర్యంబె చింతింపఁగన్.
శ్రీకృష్ణుడు ఏడేళ్ళ బాలుడై ఉన్నా ఏడు రోజుల పాటు స్తంభములాంటి తన భుజముపై అలవోకగా శ్రేష్ఠమైన శైలము గోవర్థనగిరిని ఓ ప్రకాశించే గొడుగులాగ ఎత్తి పట్టుకున్నాడు. గోవులను గోపాలకులను దాని మరుగున దాచి అందరి ప్రాణాలను రక్షించాడు. సప్తసముద్రాలతో చుట్టబడి ఉండే భూమి నంతటిని ధరించిన ఆ పరమపురుషునికి ఇది వింత పనేం కాదు.
79
హరివేణూద్గత మంజులస్వరనినాదాహూతలై గోప సుం దరు లేతేర ధనాధిపానుచరగంధర్వుండు గొంపోవఁ ద త్తరుణుల్ గుయ్యిడ శంఖచూడుని భుజాదర్పంబు మాయించి తాఁ బరిరక్షించిన యట్టి కృష్ణుని నుతింపన్ శక్యమే యేరికిన్?
మధుర స్వరాల పిలుపులు శ్రీహరి వేణువు నుండి వెలువడి ఆకర్షిస్తున్నాయి. దానితో గోపికలు పరుగెత్తుకు వచ్చారు. అప్పుడు కుబేరుని అనుచరుడైన శంఖచూడుడనే గంధర్వుడు వాళ్ల నెత్తుకుపోయాడు, వాళ్ళు “కృష్ణా!, కృష్ణా!” అంటూ మొరపెట్టుకొన్నారు. వెంటనే మాధవుడు శంఖచూడుని భుజగర్వం పోకార్చి ఆ రమణీమణులను రక్షించాడు. అలాంటి వనమాలిని కొనయాడడం ఎవర...
80
నరక మురప్రలంబ యవనద్విప ముష్టికమల్ల కంసశం బర శిశుపాల పంచజన పౌండ్రక పల్వల దంతవక్త్ర వా నర ఖర సాల్వ వత్స బక నాగ విదూరథ రుక్మి కేశి ద ర్దుర వృష ధేనుక ప్రముఖ దుష్ట నిశాటులఁ ద్రుంచె వ్రేల్మిడిన్.
ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు నరకాసురుడు, మురాసురుడు, ప్రలంబుడు, కాలయవనుడు, కువలయాపీడము అనే ఏనుగు, ముష్టికుడు చాణూరుడు మొదలైన మల్లురు, కంసుడు, శంబరుడు, శిశుపాలుడు, పౌండ్రక వాసుదేవుడు, పల్వలుడు, దంతవక్ర్తుడు, ద్వివిదుడు అనే వానరుడు, గర్దభాసురుడు, సాల్వుడు, వత్సాసురుడు, బకాసురుడు, విదూరథుడు, రుక్మి, కేశి, దర్దురుడు, వృషభాకారాలు...
81
బలభీమార్జున ముఖ్య చాపధర రూపవ్యాజతం గ్రూరులన్ ఖలులన్ దుష్టధరాతలేశ్వరుల సంగ్రామైక పారీణ దో ర్బలకేళిం దునుమాడి సర్వధరణీభారంబు మాయించి సా ధుల రక్షించిన యట్టి కృష్ణుని ననంతుం గొల్తు నెల్లప్పుడున్.
బలరాముడు, భీముడు, అర్జునుడు మొదలైన విలుకాండ్ర రూపాలతో అవతరించి కఠినులు, నీచులు, దుర్మార్గులు అయిన రాజులను రణరంగంలో ఆరితేరిన భుజబలక్రీడతో శ్రీకృష్ణుడు హతమార్చాడు. సమస్త భూభారాన్ని తొలగించాడు. సజ్జనులను రక్షించాడు. అట్టి అనంతుణ్ణి నేను అనుక్షణమూ ఆరాధిస్తాను.
82
ప్రతియుగమందు సంకుచితభావులు నల్పతరాయువుల్ సుదు ర్గతికులునైన మర్త్యుల కగమ్యములున్ స్వకృతంబులున్ సుశా శ్వతములునైన వేదతరుశాఖలు దా విభజించినట్టి స న్నుతుఁడు పరాశరప్రియతనూజుఁడు నా హరి పుట్టె నర్మిలిన్.
ప్రతి యుగంలో అల్పబుద్ధులు, అల్పాయుష్కులు, దుర్గతి పాలయ్యేవారు అయిన మానవు లుంటారు. వాళ్లకు భగవంతుడు నిర్మించినవి, శాశ్వతములు అయిన వేదాలు బోధపడవు. అలాంటి వాళ్లను అనుగ్రహించాలనే బుద్ధితో శ్రీహరి సజ్జనస్తుతి పాత్రుడై పరాశర మహర్షి ప్రియపుత్రుడైన వ్యాసుడుగా అవతరించి ఆ వేదవృక్షాన్ని శాఖలు శాఖలుగా విభజించాడు.
83
అతిలోలాత్ములు సూనృతేతరులు భేదాచార సంశీలురు ద్ధత పాషాండమ తౌపధర్మ్యులు జగత్సంహారు లైనట్టి యా దితి సంజాతు లధర్మవాసనల వర్తింపం దదాచార సం హతి మాయించి హరించె దానవులఁ బద్మాక్షుండు బుద్ధాకృతిన్.
మిక్కిలి చపలస్వభావులు, అసత్యవాదులు, భేదాచారపరాయణులు, చెలరేగి శుద్ధ పాషండ మతమనే అభాస ధర్మములు పాటించువారు అయిన దైత్యులు లోకాన్ని చంపుకు తినేవారు. పుండరీకాక్షుడు బుద్ధుడుగా అవతరించి ఆ రక్కసులను వారి దురాచారాలతోపాటు నిర్మూలించాడు.
84
వనజాక్షస్తవశూన్యులై మఱి వషట్స్వాహాస్వధావాక్య శో భనరాహిత్యులు, సూనృతేతరులునుం, బాషండులున్నైన వి ప్రనికాయంబును శూద్రభూపులుఁ గలింబాటిల్లినం గల్కియై జననంబంది యధర్మమున్నడఁచు సంస్థాపించు ధర్మం బిలన్.
కలియుగంలో బ్రాహ్మణులు భగవంతుని వినుతించరు. వేదవిహితమైన యజ్ఞయాగాది కర్మలు ఆచరించరు. వాళ్ల నోటినుండి “వషట్”, “స్వాహా”, “స్వధా” అనే మంగళ వచనాలు వినిపించవు. వాళ్ళు సత్యం పాటించరు. నాస్తికులై ప్రవర్తిస్తారు. శూద్రులు రాజు లవుతారు. ఇలాంటి పరిస్థితి సంభవించినప్పుడు భగవంతుడు కల్కిగా అవతరిస్తాడు. అధర్మం తొలగిస్తాడు. భూతలంలో ధర్...
85
అమరఁ ద్రివిక్రమస్ఫురణ నందిన యమ్మహితాత్ముపాద వే గమున హతంబులైన త్రిజగంబుల కావల వెల్గు సత్యలో కము చలియించినం గరుణఁ గైకొని కాచి ధరించు పాదప ద్మము తుది నున్న యప్రతిహతం బగు శక్తి గణింప శక్యమే?
ఆ మహాత్ముడు త్రివిక్రమావతారం ధరించాడు. ఆయన పాదాల విసురుకు ముల్లోకాలూ తల్లడిల్లాయి. అంతేకాదు. ఆ ముజ్జగాలకు ఆవల వెలుగొందే సత్యలోకం గూడా వణకిపోయింది. అప్పుడు దయతలచి కాపాడి, రక్షించే ఆ పాదపద్మాల కుండే అప్రతిహతమైన శక్తి ఇంతింతని వర్ణించడం ఎవరికీ శక్యం కాదు.
86
హరి మాయా బల మే నెఱుంగ నఁట శక్యంబే సనందాది స త్పురుషవ్రాతము కైన, బుద్ధి నితరంబున్ మాని సేవాధిక స్ఫురణం దచ్ఛరితానురాగగుణవిస్ఫూర్తిన్ సహస్రాస్య సుం దరతం బొల్పగు శేషుఁడుం దెలియఁ డన్నం జెప్ప నే లొండొరున్.
నేనే శ్రీహరి మాయాశక్తిని తెలుసుకోలేకున్నాను. ఇక తెలుసుకోవడానికి సనందుడు, సనకుడు, సనత్కుమారుడు మొదలైన సజ్జన సంఘాలకు మాత్రం వీలవుతుందా. ఆదిశేషుడు ఇతరమైన ఆలోచనలన్నీ వదలి పెట్టి బుద్ధిని సదా భగవత్సేవకే అంకితం చేసాడు. వేయి నోళ్లతో ఆ పరమేశ్వరుని చరిత్రను అనురక్తుడై కీర్తిస్తు ఉంటాడు. అట్టి శేషుడు గూడ ఆయన మాయామహిమ ఎలాంటిదో తె...
87
ఇతరముమాని తన్ను మది నెంతయు నమ్మి భజించువారి నా శ్రితజన సేవితాంఘ్రి సరసీరుహుఁడైన సరోజనాభుఁ డం చితదయతోడ నిష్కపటచిత్తమునం గరుణించు; నట్టివా రతుల దురంతమై తనరు నవ్విభు మాయఁ దరింతు రెప్పుడున్.
ఎవరు ఇతర చింతలు మాని సదా శ్రీమన్నారాయణుణ్ణే దృఢంగా నమ్మి సేవిస్తారో, వాళ్లను, ఆశ్రితులు అర్చించే పాదపద్మాలు కలవాడైన పద్మనాభుడు మిక్కిలి దయగలిగి, కల్లాకపటంలేని మనస్సుతో అనుగ్రహిస్తాడు. అలా భగవంతుని సేవించి ఆయన కృపకు పాత్రులైనవాళ్లు మాత్రమే సాటిలేనిది, దాటరానిది అయిన ఆ భగవంతుని మాయను నిరంతరం తరింపగలుగుతారు.
88
గాధి, గయాదు; లిక్ష్వాకు, దిలీప, మాం-   ధాతలు; భీష్మ, యయాతి, సగర, రఘు, ముచుకుందైళ, రంతిదేవోద్ధవ,-   సారస్వతోదంక, భూరిషేణ, శ్రుతదేవ, మారుతి, శతధన్వ, పిప్పల,-   బలి, విభీషణ, శిబి, పార్థ, విదురు; లంబరీష, పరాశరాలర్క, దేవల,-   సౌభరి, మిథిలేశ్వరాభిమన్యు, లార్ష్ణిషేణాదులైన మహాత్ము లెలమిఁ దవిలి యద్దేవు భక్తిఁ జిత్తముల నిల్పి త...
గాధి, గయుడు మొదలైనవారు, ఇక్ష్యాకుడు, దిలీపుడు, మాంధాత, భీష్ముడు, యయాతి, సగర చక్రవర్తి, రఘు మహారాజు, ముచుకుందుడు, ఐలుడు, రంతిదేవుడు, ఉద్ధవుడు, సారస్వతుడు, ఉదంకుడు, భూరిషేణుడు, శ్రుతదేవుడు, హనుమంతుడు, శతధన్వుడు, పిప్పలుడు, బలిచక్రవర్తి, విభీషణుడు, శిబిచక్రవర్తి, అర్జునుడు, విదురుడు, అంబరీషుడు, పరాశరమహర్షి, అలర్క మహారాజు,...
89
అనఘా! వీరల నెన్ననేమిటికిఁ; దిర్యగ్జంతుసంతాన ప క్షి నిశాటాటవికాఘ జీవనివహస్త్రీ శూద్ర హూణాదులై నను నారాయణభక్తి యోగమహితానందాత్ములై రేని వా రనయంబుం దరియింతు రవ్విభుని మాయావైభవాంభోనిధిన్.
పుణ్యాత్ముడ! సహజంగా పుణ్యాత్ములయిన వీళ్లను గూర్చి చెప్పవలసిన పనిలేదు. పశువులైన, పక్షులైన, రాక్షసులైన, అడవిలో జీవించేవారైన, పాపజీవనులైన, స్త్రీలైన, శూద్రులైన, హూణులు మొదలైన వారైన లేదా మరి ఎవరైనా సరే ఆ శ్రీమన్నారాయణుని మీది భక్తి యోగంతో అఖండమైన ఆత్మానందం పొందినవారైతే చాలు. అవశ్యం ఆ దేవదేవుని మాయావైభవమనే మహాసముద్రాన్ని సు...
90
శశ్వత్ప్రశాంతు నభయుని విశ్వాత్ముఁ బ్రబోధమాత్రు విభు సంశుద్ధున్ శాశ్వతు సము సదసత్పరు నీశ్వరుఁ జిత్తమున నిలుపు మెపుడు మునీంద్రా!
మునీశ్వర! ఎల్లవేళల మిక్కిలి శాంతుడై వుండేవాడు, భయరహితుడు, విశ్వమయుడు, కేవల జ్ఞానస్వరూపుడు, సర్వేశ్వరుడు, శుద్ధాత్ముడు, శాశ్వతుడు, సముడు, సత్తు అసత్తులకు అతీతుడు అయినట్టి పరమేశ్వరుణ్ణి సదా నీ హృదయంలో ప్రతిష్ఠించుకో.
91
హరిఁ బరమాత్ము నచ్యుతు ననంతునిఁ జిత్తములం దలంచి సు స్థిరత విశోక సౌఖ్యములఁ జెందిన ధీనిధు లన్యకృత్యము ల్మఱచియుఁ జేయనొల్లరు ;తలంచిన నట్టిదయౌ; సురేంద్రుఁడుం బరువడి నుయ్యి; ద్రవ్వునె పిపాసితుఁడై సలిలాభిలాషితన్?
పరమాత్ముడు, చ్యుతి లేనివాడు, అంతం లేనివాడు అయిన శ్రీమహావిష్ణుని మనస్సులో స్థిరంగా భావించిన వాళ్లు, శోకం లేని సుఖస్థితి పొందుతారు. అలాంటి బుద్ధిమంతులు భగవంతుని స్మరణ తప్ప ఇతర కార్యాలు ఏమరుపాటువ గూడ చేయరు. ఆలోచిస్తే అది అంతే వర్షం కురిపించే దేవేంద్రుడు అయినా దాహంవేసిన పిమ్మట నీళ్లకొరకై బావి త్రవ్వడానికి పరుగెడతాడా.
92
సర్వఫలప్రదాతయును, సర్వశరణ్యుఁడు, సర్వశక్తుఁడున్, సర్వజగత్ప్రసిద్ధుఁడును, సర్వగతుం డగు చక్రపాణి యీ సర్వశరీరులున్ విగమసంగతిఁ జెంది విశీర్యమాణులై పర్వినచో నభంబుగతి బ్రహ్మము దాఁ జెడకుండు నెప్పుడున్.
ఆ భగవంతుడు అందరికీ తగిన ఫలితాలు అన్ని ఇచ్చేవాడు. అందరికీ శరణు పొందదగినవాడు. అన్ని శక్తులు గలవాడు. అన్ని లోకాలలో ప్రసిద్ధి పొందినవాడు. అంతటా వ్యాపించినవాడు. సుదర్శన మనే చక్రం ధరించిన బ్రహ్మస్వరూపుడైన ఆ దేవుడు, తక్కిన ఈ సమస్త ప్రాణులు చిక్కి స్రుక్కి శిథిలమై అంతరించిపోయిన కల్పాంత కాలంలో గూడ ఆకాశంలాగ తానొక్కడు చెక్కుచెదరక...
93
కారణకార్యహేతు వగు కంజదళాక్షునికంటె నన్యు లె వ్వారును లేరు; తండ్రి! భగవంతు ననంతుని విశ్వభావనో దారుని సద్గుణావళు లుదాత్తమతిం గొనియాడకుండినం జేరవు చిత్తముల్ ప్రకృతిఁ జెందని నిర్గుణమైన బ్రహ్మమున్.
నాయనా! నారద! అటు కారణాలకు, ఇటు కార్యాలకు అన్నిటికి కారణభూతుడైనవాడు ఆ కమలాక్షుడే. ఆయన కంటే ఇతరు లెవరూ ఆశ్రయింపదగిన వాళ్లు లేరు. షడ్గుణైశ్వర్య సంపన్నుడు, తుది లేనివాడు, ప్రపంచసృష్టి గావించే ఉదారుడు అయిన ఆ పరమాత్ముని గుణవంతులు గొప్ప మనస్సుతో కొనియాడాలి. లేకుంటే మనస్సులు ప్రకృతికి అతీతమైన నిర్గుణ బ్రహ్మను పొందలేవు.
94
నిగమార్థప్రతిపాదకప్రకటమై; నిర్వాణ సంధాయిగా భగవంతుండు రచింప భాగవతకల్పక్ష్మాజమై శాస్త్ర రా జి గరిష్ఠంబగు నీ పురాణ కథ సంక్షేపంబునం జెప్పితిన్; జగతిన్ నీవు రచింపు దాని నతివిస్తారంబుగాఁ బుత్రకా!
కుమార! నారద! ఈ భాగవతం అనే పురాణకథ వేదార్థాలను ప్రతిపాదించడం చేత ప్రశస్తమై వుంది. మోక్షప్రదంగా ఉండేటట్లు ఆ భగవంతుడు దీన్ని రచించాడు. ఇది భగవద్భక్తులకు కల్పవృక్షం, శాస్త్రాలంన్నిటి కంటె శ్రేష్ఠమైనది. ఈ పురాణకథను నేను నీకు సంగ్రహంగా చెప్పాను. నీవు దీన్ని లోకంలో బహు విస్తృతమైన కృతిగా కావించుము.
95
పురుషభవంబునొందుట యపూర్వము జన్మము లందు; నందు భూ సుర కుల మందుఁ పుట్టు టతిచోద్యము; నిట్లగుటన్ మనుష్యుల స్థిర మగు కార్య దుర్దశలచేత నశింపక విష్ణు సేవనా పరతఁ దనర్చి నిత్యమగు భవ్యపథంబును బొందు టొప్పదే?
అన్ని జన్మలలోను పురుషజన్మం చాలా అపురూపం. అందులోను బ్రాహ్మణకులంలో పుట్టడం మరీ అరుదు. అందువల్ల మానవులు అనిత్యమైన నిష్ర్పయోజన కార్యాలలో బడి దురవస్థల పాలు కాకుండ, శ్రీహరిని సేవించి నిత్యమైన పరమపదం పొందడం సముచితం కదా.
96
ఉపవాసవ్రత శౌచ శీల మఖ సంధ్యోపాస నాగ్నిక్రియా జప దానాధ్యయ నాది కర్మముల మోక్షప్రాప్తిసేకూర; ద చ్చపుభక్తిన్ హరిఁ బుండరీకనయనున్ సర్వాతిశాయిన్ రమా ధిపుఁ బాపఘ్నుఁ బరేశు నచ్యుతుని నర్థిం గొల్వలేకుండినన్.
పద్మాక్షుడు, అన్నిటి యందు మించినవాడు, లక్ష్మీపతి, పాపనాశకుడు, పరమేశ్వరుడు, చ్యుతిరహితుడు అయిన శ్రీహరిని నిర్మలభక్తి గలిగి ఆసక్తితో భజించాలి. అలా చేయకుండ ఉపవాసాలు, వ్రతాలు, శౌచాలు, శీలాలు, యాగాలు, సంధ్యోపాసనలు, అగ్నికార్యాలు, జపాలు, దానాలు, వేదాధ్యయనాలు లాంటి వెన్ని చేసినా మోక్షం లభించదు.
97
వనజాక్షు మహిమ నిత్యము వినుతించుచు; నొరులు వొగడ వినుచున్; మదిలో ననుమోదించుచు నుండెడు జనములు దన్మోహవశతఁ జనరు మునీంద్రా!
నారదమునిశ్రేష్ఠ! ఎల్లవేళలా కమలనయనుని మహిమను స్తుతించాలి. ఇతరులు స్తుతిస్తూ వుంటే వినాలి. మనస్సులో ఆ మహిమను మననం చేస్తూ సంతసించాలి. అలా చేసే వాళ్లు దేవుని మాయకు లోనుగారు.
98
అని వాణీశుఁడు నారద మునివరునకుఁ జెప్పినట్టి ముఖ్యకథా సూ చన మతిభక్తిఁ బరీక్షి జ్జనపాలునితోడ యోగిచంద్రుఁడు నుడివెన్.
ఇలా పూర్వం బ్రహ్మదేవుడు ఋషీశ్వరుడైన నారదునికి భాగవత ముఖ్యకథను వివరించాడు. ఆ విషయాన్ని యోగీశ్వరుడైన శుకుడు మహా భక్తితో పరీక్షిన్మహారాజుకు తెలియజేప్పాడు.
99
భరితోదగ్రనిదాఘతప్తు డగు నప్పాంథుం డరణ్యాది సం చరణక్లేశసముద్భవం బగు పిపాసం జెంది యాత్మీయ మం దిరముం జేరి గతశ్రముం డగుచు నెందేనిం జనంబోని భం గి రమాధీశుపదారవిందయుగ సంగీభూతుఁడై మానునే?
అడవులందు సంచరిస్తు, వేసవి మండుటెండల తాపానికి పరితాపం చెందిన బాటసారి బడలి దాహంతో చివరికి తన యిల్లు చేరుకొంటాడు. అక్కడ హాయిగా అలసట తీర్చుకొంటాడు. అక్కడినుండి మళ్ళీ ఎక్కడికీ కదలడు. అలాగే రమాకాంతుని చరణకమల ద్వంద్వంతో సంబంధం కలిగి ఆ ఆనందం చవి చూచినవాడు మళ్లీ దాన్ని వదలడు.
100
విను శుకయోగికి మనుజేశుఁ డిట్లను-   మునినాథ! దేవదర్శనము గలుగ నారదమునికిఁ బంకేరుహభవుఁ డెఱిం-   గించిన తెఱఁగు సత్కృప దలిర్ప గణుతింప సత్వాదిగుణశూన్యుఁ డగు హరి-   కమలాక్షు లోకమంగళము లైన కథలు నా కెఱిఁగింపు; కైకొని నిస్సంగ-   మైన నా హృదయాబ్జ మందుఁ గృష్ణు భవ్యచరితుని నాద్యంతభావశూన్యుఁ జిన్మయాకారు ననఘు లక్ష్మీసమేతు నిలిపి, యస్...
తరువాత పరీక్షిత్తు శుకమహర్షిని ఇలా అడిగాడు – ఓ మునీశ్వర! బ్రహ్మదేవుడు నారదమునికి భగవత్సాక్షాత్కారం కలగడానికి చెప్పిన ఉపాయం దయతో నాకు చెప్పండి సత్త్వరజస్తమోగుణాలకు అతీతుడు, పద్మనేత్రుడు అయిన శ్రీహరి కథలు లోకానికి మంగళం చేకూరుస్తాయి. అవి నాకు తెలియపరచండి. మీరు చెప్పింది విని సంగరహితమయిన నా హృదయకమలంలో శుభచరిత్రుడు, తుది మ...
End of preview. Expand in Data Studio

Padyam2GadyamBitextMining

Bitext mining packaging of Padyam2Gadyam (classical Telugu poem → modern prose) for PoetryMTEB embedding evaluation.

The upstream release is an evaluation set; this Hub dataset keeps test-only splits (no train/validation).

Config Pair #test
tel-tel Classical Telugu poem → modern Telugu prose 600
tel-eng Classical Telugu poem → English prose (post-edited) 599

Dataset Card

Item Description
Source TeluguLLMResearch/Padyam2Gadyam
Paper Translating Classical Poetry into Modern Prose (arXiv:2606.02806)
Languages Telugu (te), English (en)
Size 600 (tel-tel); 599 (tel-eng) — test only
Pair type Poem ↔ prose meaning (intra-lingual Telugu; cross-lingual English)
Splits test only (matches upstream EvalSet design)
License CC BY-NC 4.0 (same as upstream)
Evaluation metrics MTEB Bitext Mining: F1 / precision / recall of nearest-neighbor retrieval

Features

Field Type Description
id string Pair id
source_text string Classical Telugu poem (Poem)
target_text string Telugu prose or English prose (post-edited), depending on config

Schema matches other PoetryMTEB Bitext Mining sets (id, source_text, target_text).


Construction method

  1. Load TeluguLLMResearch/Padyam2Gadyam (test split, 600 poems).
  2. Build parallel pairs:
    • tel-tel: PoemMeaning in Telugu
    • tel-eng: PoemMeaning in English - Post Edited
  3. Drop rows with empty source or target; write PoetryMTEB Bitext Mining parquet shards.
  4. Keep test-only (no re-split into train/validation).

Upstream notes (from the paper/dataset card): Telugu prose is from the same source as the poem; English prose was machine-generated then manually post-edited.


How to load

from datasets import load_dataset

tel_tel = load_dataset("PoetryMTEB/Padyam2GadyamBitextMining", "tel-tel")
tel_eng = load_dataset("PoetryMTEB/Padyam2GadyamBitextMining", "tel-eng")
print(tel_tel["test"][0]["source_text"][:80])
print(tel_eng["test"][0]["target_text"][:80])

License

Distributed under Creative Commons Attribution-NonCommercial 4.0 International (CC BY-NC 4.0), consistent with the upstream dataset.


Citation / provenance

Please cite the original Padyam2Gadyam work:

@misc{kranti2026translatingclassicalpoetrymodern,
      title={Translating Classical Poetry into Modern Prose}, 
      author={Chalamalasetti Kranti and Sowmya Vajjala},
      year={2026},
      eprint={2606.02806},
      archivePrefix={arXiv},
      primaryClass={cs.CL},
      url={https://arxiv.org/abs/2606.02806}, 
}
Downloads last month
45

Paper for PoetryMTEB/Padyam2GadyamBitextMining