Datasets:

Modalities:
Image
Text
Formats:
text
Languages:
Telugu
DOI:
Libraries:
Datasets
License:
AlbertoChestnut commited on
Commit
047503d
·
verified ·
1 Parent(s): d875e7e

Add files using upload-large-folder tool

Browse files
This view is limited to 50 files because it contains too many changes.   See raw diff
Files changed (50) hide show
  1. Dvipada-Bagavathamu/page_0001.txt +5 -0
  2. Dvipada-Bagavathamu/page_0003.txt +20 -0
  3. Dvipada-Bagavathamu/page_0005.txt +3 -0
  4. Dvipada-Bagavathamu/page_0006.txt +5 -0
  5. Dvipada-Bagavathamu/page_0010.txt +2 -0
  6. Dvipada-Bagavathamu/page_0012.txt +23 -0
  7. Dvipada-Bagavathamu/page_0013.txt +15 -0
  8. Dvipada-Bagavathamu/page_0014.txt +10 -0
  9. Dvipada-Bagavathamu/page_0015.txt +5 -0
  10. Dvipada-Bagavathamu/page_0017.txt +5 -0
  11. Dvipada-Bagavathamu/page_0019.txt +3 -0
  12. Dvipada-Bagavathamu/page_0020.txt +1 -0
  13. Dvipada-Bagavathamu/page_0021.txt +1 -0
  14. Dvipada-Bagavathamu/page_0026.txt +9 -0
  15. Dvipada-Bagavathamu/page_0027.txt +8 -0
  16. Dvipada-Bagavathamu/page_0028.txt +3 -0
  17. Dvipada-Bagavathamu/page_0029.txt +7 -0
  18. Dvipada-Bagavathamu/page_0043.txt +13 -0
  19. Dvipada-Bagavathamu/page_0044.txt +23 -0
  20. Dvipada-Bagavathamu/page_0045.txt +23 -0
  21. Dvipada-Bagavathamu/page_0046.txt +23 -0
  22. Dvipada-Bagavathamu/page_0048.txt +23 -0
  23. Dvipada-Bagavathamu/page_0052.txt +24 -0
  24. Dvipada-Bagavathamu/page_0053.txt +23 -0
  25. Dvipada-Bagavathamu/page_0054.txt +22 -0
  26. Dvipada-Bagavathamu/page_0055.txt +24 -0
  27. Dvipada-Bagavathamu/page_0060.txt +22 -0
  28. Dvipada-Bagavathamu/page_0061.txt +25 -0
  29. Dvipada-Bagavathamu/page_0065.txt +25 -0
  30. Dvipada-Bagavathamu/page_0066.txt +24 -0
  31. Dvipada-Bagavathamu/page_0067.txt +25 -0
  32. Dvipada-Bagavathamu/page_0068.txt +24 -0
  33. Dvipada-Bagavathamu/page_0069.txt +25 -0
  34. Dvipada-Bagavathamu/page_0070.txt +23 -0
  35. Dvipada-Bagavathamu/page_0071.txt +20 -0
  36. Dvipada-Bagavathamu/page_0074.txt +23 -0
  37. Dvipada-Bagavathamu/page_0076.txt +24 -0
  38. Dvipada-Bagavathamu/page_0077.txt +23 -0
  39. Dvipada-Bagavathamu/page_0079.txt +23 -0
  40. Dvipada-Bagavathamu/page_0084.txt +23 -0
  41. Dvipada-Bagavathamu/page_0090.txt +22 -0
  42. Dvipada-Bagavathamu/page_0092.txt +25 -0
  43. Dvipada-Bagavathamu/page_0113.txt +24 -0
  44. Dvipada-Bagavathamu/page_0114.txt +25 -0
  45. Dvipada-Bagavathamu/page_0115.txt +25 -0
  46. Dvipada-Bagavathamu/page_0117.txt +24 -0
  47. Dvipada-Bagavathamu/page_0120.txt +24 -0
  48. Dvipada-Bagavathamu/page_0121.txt +25 -0
  49. Dvipada-Bagavathamu/page_0122.txt +25 -0
  50. Dvipada-Bagavathamu/page_0125.txt +23 -0
Dvipada-Bagavathamu/page_0001.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ తంజావూరు సరస్వతీ మహల్ ప్రచురణము - 23
2
+
3
+ ద్విపదభాగవతము.</p>
4
+
5
+ ద్విపదకావ్యము.</p>
Dvipada-Bagavathamu/page_0003.txt ADDED
@@ -0,0 +1,20 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ This publication contains the earliest Telugu version available of SRI BHAGAVATA 10th Skanda, dealing with Sri KRISHNA'S life in MADHURA and in DWARAKA. The author Madiki Singanaraya lived in the early part of the fifteenth century. He was therefore an elder contemporary of POTHANNA the celebrated author ol ANDHRA BHAGAVATAMU.
2
+
3
+ The present work which is in Dvipada is anterior to POTHANNA'S work. The merits of the Author's poetry can be gathered from the fact that his verses are cited as models in standard works on Grammar and Rhetoric. The author has also written three other works in Telugu namely:
4
+
5
+ 1. VASISHTA RAMAYANA
6
+ The well known philosophical work,
7
+
8
+ 2. PADMA PURANA
9
+ and
10
+
11
+ 3. SAKALA NITI SAMMATAMU
12
+ a work in politics,
13
+
14
+ The present work has three Kandas in it:-(1) Madura Kanda (2) Kalyana Kanda and (3) Jagadhabiraksha Kanda. The Kandas dealing with the Balaleela in the beginning and the Bhaktanugraha in the end are missing.
15
+
16
+ The portion that is now published is complete so far as it goes and has been selected for its value as a high class Dvipada Kavya of the early classical age in Telugu literature. For a fuller account of the Author and the diverse merits of the work the reader is referred to the Telugu introduction of the learned Editor who has spared no pains in editing this work.
17
+
18
+ Our thanks are due to him for his valuable services.
19
+
20
+ Our grateful thanks are due to the Government of Madras for the liberal grants which have enabled us to publish this and other valuable manuscripts of this Library.
Dvipada-Bagavathamu/page_0005.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ ఉపోద్ఘాతము</p>
2
+
3
+ శ్రీపతియొక్క యెనిమిదియవ యవతారమగు శ్రీకృష్ణ భగవానుని చరిత్ర గలది భాగవతమందు దశమస్కంధము. భాగవతమహాగ్రంథమును దెనుఁగు భాషలో విలసిల్లఁ జేసిన మహాకవి బమ్మెరపోతరాజు. ఈ బమ్మెరపోతనార్యుఁడు హూణశకము 1400 మొదలు 1470 ప్రాంతమందుండినట్లు, ఆంధ్ర కవుల చరిత్రలో శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులుగారు చర్చించి యున్నారు. వాసిష్ఠరామాయణ, పద్మపురాణ, భాగవత దశమస్కంధముల కర్త యగు మడికి సింగనార్యుఁడు హూణశకము 1430వ ప్రాంతము వఱకు నైనను జీవించి యుండవలయునని వారు నిర్ధారించిరి. పోతనార్యుని భోగినీదండకము తన 25వ వత్సరమున అనగా 1425వ సంవత్సరమున విరచించినట్లు తెలియుచున్నది. మడికి సింగనార్యుఁడు పద్మపురాణమును దెనిఁగించి ముగించిన వత్సరము దాని కృత్యంత పద్యమువలన స్పష్టమగుచున్నది.
Dvipada-Bagavathamu/page_0006.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ (కర = 2 యుగ = 4 అనల = 3 మృగాంక = 1 అంకానాం వామతోగతిః. కాబట్టి శాలివాహనశకము 1342. హూణశకము 1420 శార్వరి సంవత్సరమున మార్గశీర్ష శుద్ధ పంచమీ బుధవారమునాఁడు పద్మపురాణము ముగింపఁబడెను.)
2
+
3
+ దీనిని బట్టి పర్యాలోచించి చూచిన మడికి సింగనార్యుఁడు ప్రౌఢావస్థ యందున్న సమయమందు పోతనార్యుని భోగినీదండకము పుట్టినదని నిర్ణయించుటకు వీలున్నది. అప్పటికింకను పోతనార్యుఁడు భాగవతమును దెనిఁగించుటకుఁ బూనుకొని యుండలేదు.
4
+
5
+ “వాసిష్ఠ రామాయణము పద్మపురాణమునకుఁ దరువాత రచయింపఁబడిన దగుటచే నది 1420కిఁ దరువాతఁ జేయఁబడినది. ఈ రెండుకావ్యములకు నడుమ సింగన్న భాగవత దశమస్కంధమునుఁ గూడఁ దెనిఁగించి కందనామాత్యునికే అంకిత మొనరించెను. సింగన కృత భాగవత దశమస్కంధము నాకు లభింపలేదు. అటుతరువాత నీకవి సకలనీతిసమ్మత మను నీతిగ్రంథమును సమకూర్చె నని రామకృష్ణ కవిగారు చెప్పుచున్నారు.
Dvipada-Bagavathamu/page_0010.txt ADDED
@@ -0,0 +1,2 @@
 
 
 
1
+ భరద్వాజగోత్రసంజాతుఁడును, ఆరూఢమతి యయ్యలార్యనందనుఁడును నగు సింగయామాత్యుఁడు ఔబళమంత్రి కందామాత్యున కంకితముగా నీభాగవతదశమస్కంధమును రచించినట్లు స్పష్టము: మడికి సింగనామాత్యుఁడు రచించిన వాసిష్ఠరామాయణము యొక్క ప్రారంభమున నొక వచన భాగమును దిలకింపుడు.
2
+ “అని సకలజన సమ్మతంబుగా నుపక్రమించి భాగవత దశమస్కంధంబును దెనుంగున రచియించి యిచ్చి, అప్పుణ్యపురాణంబులకుఁ గృతిపతిగా నేపుణ్యునిఁ బ్రార్ధింతునో యని విచారించి, గజగంధవారణగంధ గోవాళ చలమర్తి గండగండరాయ గజశేఖరదొంతి మన్యవిభాళాది నానాబిరుదవిఖ్యాతులఁ బ్రసిద్ధుండగు రామగిరి పట్టణాధీశ్వరుండైన కుమారముప్ప భూపాలు మాన్యమంత్రి పదదురంధురుండగు నమ్మహారాజు దిగంతవ్యావృతకీర్తిలతాలవాలుండును, ధర్మచారిత్రుండును, నీతిచాతుర్య విశేషగుణగణాలంకారుండును, అనవరతదానశీలుండును, అఖిలదిక్పరీతవిశాలుండును, వారణ వంశాబ్ధిసుధాకర కాశ్యపగోత్రపవిత్ర అబ్బనాచార్య తనూభవ కందనామాత్యుండు నాకు నతిస్నేహ బాంధవుండును నభీష్ట ఫలప్రదుండును నపూర్వవచనరచనానుబంధురకావ్య రసాభిజ్ఞుండును, అర్థిజన పారిజాతంబును గావున నమ్మంత్రి యుగంధరుం గృతిపతింగావించి, వెండియు కవిత్వత్త్వ రచనా కౌతుకంబున
Dvipada-Bagavathamu/page_0012.txt ADDED
@@ -0,0 +1,23 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ కృతిభర్త – కందామాత్యుఁడు</p>
2
+
3
+ మడికి సింగనార్యుఁడు భాగవతదశమస్కంధమును, పద్మపురాణమును దెనిఁగించి ఔబళ కందామాత్యునకుఁ గృతిగా నిచ్చి యున్నాఁడు. పద్మపురాణమందుఁ గృతిపతిని వర్ణించు పద్యము లీక్రింది విధముగా నున్నవి.
4
+
5
+ సీ॥ స్వామి భక్తుఁడు కార్యచతురుఁడు బహుకళా
6
+ వేది నీతిజ్ఞుఁడు విప్రహితుఁడు
7
+ సరస సల్లాపుఁడు సప్తాంగరక్షణ
8
+ క్షముఁడు భావజ్ఞుఁడు సర్వసులభుఁ
9
+ డరి మంత్రభేదన పరుఁడు ధర్మాత్ముఁడు
10
+ సుందరాకారుఁడు సుజనవినతుఁ
11
+ డురుదయాపరుఁడు నిత్యోత్సవాసక్తుండు
12
+ సద్గుణాధారుండు సౌమ్యమూర్తి
13
+ సతత గురుదేవతా పరిచారరతుఁడు
14
+ గుణసముద్రుండు కాశ్యప గోత్రజనితుఁ
15
+ డనఁగ నుతికెక్కి పెంపున నతిశయిల్లు
16
+ మదన సదృశుండు కందన మంత్రివరుఁడు.
17
+
18
+ సీ॥ ఈ ధర్మచారిత్రు నేధాత్రిపతి యేలు
19
+ నాధాత్రిపతి యేలు నఖిల జగము
20
+ నీకామినీకాము నేకామినులు చూతు
21
+ రాకామినులు చూడ రన్యపురుషు
22
+ నీయర్కనుతతుల్యు నేయర్థి గొనియాడు
23
+ నాయర్థి యెరువేఁడ నాస సేయఁ
Dvipada-Bagavathamu/page_0013.txt ADDED
@@ -0,0 +1,15 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ డీమంత్రి కులచంద్రు నేమంత్రి వురణించు
2
+ నామంత్రి విముఖాత్ముఁడఖిలమునకు
3
+ ననఁ బ్రగల్భరూపఘనదాననయమార్గ
4
+ ముల నుతింప నొప్పు ముజ్జగములఁ
5
+ దారహారహీరధవళాంశుసమకీర్తి
6
+ కలితుఁ డౌబళ కందవిభుఁడు.
7
+
8
+ కందన మంత్రికిఁ దాతుకుఁ దాతయైన గన్నయ మంత్రి కాకతీయ గణపతిదేవుని కాలములో నుండినట్లు పద్మపురాణములోని యీక్రింది పద్యము చెప్పుచున్నది.
9
+
10
+ చ॥ “పరువడిఁ గాకతీయ గణపతి నాయకు నొద్ద మాన్యుఁడై
11
+ ధరణిఁ బ్రశస్తుఁడై నెగడి దానములెల్లను జేసి భక్తి పెం
12
+ పిరవుగ గుళ్ళు గట్టి గణపేశ్వర దేవుని గోపికాధిపున్
13
+ దిరమగుచున్న లక్ష్మిని బ్రతిష్ఠలు చేసెఁ బ్రభుత్వమేర్పడన్”.
14
+
15
+ కృతిపతి కందామాత్యుని వంశవృక్షము నిచ్చుచున్నాను.
Dvipada-Bagavathamu/page_0014.txt ADDED
@@ -0,0 +1,10 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ కాకతీయ గణపతిరాజు క్రీ.శ. 1200 మొదలు 1260 వఱకును రాజ్యపరిపాలన చేసెను. దీనినిఁ బట్టి శ్రీ వీరేశలింగము పంతులుగారు తరమునకు నలుబదేసి సంవత్సరముల చొప్పున నేర్పఱచి కందన మంత్రికాలమును 1420 గా లెక్కవేసిరి. 1420వ సంవత్సరమునఁ బద్మపురాణమును గందనమంత్రి కృతినందుట దీనికి సరిపోయినది.
2
+
3
+ మడికి సింగనార్యుఁడు తాను మొదట రచించిన పద్మపురాణ భాగవతదశమ స్కంధములను నరాంకితము చేసెను. కాలక్రమమున నతని చిత్తవృత్తి దైవపరాధీనమగుట బట్టి కాఁబోలును దన మూఁడవ కృతియగు వాసిష్ఠరామాయణమును అహోబలస్వామి కంకితమొనర్చెను. తనకు ముందుండిన నన్నయాది యాదిమ కవీశ్వరుల యాచారము ననుసరించి కృత్యాదిని గీర్వాణభాషాబద్ధమగు శ్లోకమును వేసుకొనెను. వాసిష్ఠరామాయణము యొక్క ఆదిమ శ్లోకమును చూడుడు.
4
+
5
+ “శ్రీమద్దివ్యమునీంద్రచిత్తనిలయం సీతామనోనాయకం
6
+ వల్మీకోద్భవ వాక్పయోధిశశినం స్మేరాననం చిన్మయం
7
+ నిత్యం నీరదనీలకాయ మమలం నిర్వాణ సంధాయినం
8
+ శాంతం నిత్యమనామయం శివకరం శ్రీరామచంద్రంభజే. ”
9
+
10
+ ఇవిగాక మడికి సింగనార్యుఁడు “సకలనీతిసమ్మత” మను నీతిశాస్త్రమును రచియించెను. సకలనీతిసమ్మతమును శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు ప్రచురించినట్లు తెలియుచున్నది. దీనిలోని కొన్ని పద్యములను కీర్తిశేషులైన శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు, ఈ గ్రంధాలయము తరఫున మద్రాసు ప్రభుత్వసహాయముచేఁ బ్రచురింపఁబడిన “ఆంధ్రకామందుకము” యొక్క పీఠికలో నుదహరించి యున్నారు.
Dvipada-Bagavathamu/page_0015.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ ఈ విధముగా సంస్కృతాంధ్రములందసాధారణ పాండిత్యము కలవాఁడును, నీతి వేదాంతశాస్త్రము లందభిరుచి కలవాఁడును, మహాకవియు నగు మడికి సింగనార్యుని ప్రభావంతమైన అమృతవాహిని యగు లేఖిని పండిత పామర రంజక మగు ద్విపదలచే భక్తజనమందార మగు భాగవత దశమస్కంధమును రచించి, ఆంధ్రసారస్వతమునకు మహత్తర మగు సేవ యొనరించినది!
2
+ పరిష్కరణ — కథా విభాగము</p>
3
+ తంజావూరు సరస్వతీమహల్ లైబ్రెరీ నెం 150 తాళపత్రప్రతి, ఈ పరిష్కరణకు మాతృకయై యున్నది. ఇట్టి ప్రతిగాని, ఇతోధికప్రతిగాని వేఱే ఎచ్చటను లేనందున నేను గావించిన సంస్కరణము పూర్తిగా నీతాళపత్ర ప్రతిపైననే యాధారపడి యున్నది. దీనియందు 180 తాళపత్రములున్నవి. వ్రాత సుమారుగా నున్నను, తప్పులు విశేషముగా దొర్లియున్నవి. అక్రూరుడు శ్రీకృష్ణభగవానుని స్తుతించు ఘట్టమునుండి యారంభమగుచున్నది. మొదటి నాలుగు పత్రములు కీట దష్టములు: అక్షరముల యాకారము బొత్తిగా నశించియున్నది.
4
+
5
+ కవి భాగవత దశమస్కంధము యొక్క పూర్వోత్తర భాగములను కాండ సంజ్ఞలతో విభజించుకొని యున్నాడు. దశమ స్కంధ పూర్వభాగము కంసుడు తన చెల్లెలు దేవకిని వసుదేవునితోఁ గలిపి రథారూడులఁ జేసి మంగళతూర్యనినాద వైభవములతో భర్తృగృహమునకుఁ దానే సారథియై రథమును నడుపుటతో నారంభించుచున్నది. తరువాతి కథయగు నాకాశవాణి కథనము, శ్రీకృష్ణావతార ఘట్టము, నందగోపుని యింట శ్రీకృష్ణుని
Dvipada-Bagavathamu/page_0017.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ విజ్ఞాననిధి యగు మహాకవి సింగనార్యుని విరచితమైన దీనిని పరిష్కరించుటలో నాయల్పీయమగు బుద్ధిని సాధ్యమైనంత వఱకు నరికట్టి మిక్కిలి శ్రద్ధగానే యుపయోగించితిని. యుక్తి కందుబాటులో నున్నట్టి కొన్ని లుప్తభాగములను బూరించి కుండలీకరణముగావించి పాఠకులకుఁ జూపి యున్నాను. వ్రాయసకాని ప్రమాదముచే నేర్పడిన గణభంగములను సవరించితిని. ఈ సవరణ కవిహృదయమునకు భంగముండదని విమర్శన జ్ఞానముతోనే చేయఁబడినదని మనవి చేసుకొను చున్నాను. అన్వయము సరిగా కాని కొన్ని ద్విపద భాగములను సరిదిద్దిన పూర్తిగా క్రొత్తరూపము సిద్ధించునని తోచిన చోట్ల యథా మాతృకముగానే విడిచి వేసితిని.
2
+
3
+ బురదలో మాణిక్యమువలె, గుణగ్రాహకుల దృష్టికి మఱుఁగుపడి, ఈ ద్విపదకావ్యము సరస్వతీమహల్ లైబ్రరి అలమారలలోఁ బడియుండినది. దాని యునికిని, శ్రేష్టతను నాకెఱుక పఱచినవారు మన్మిత్రులును, బహుగ్రంథ ద్రష్టలును, విద్యా నిధులును నగు బ్రహ్మశ్రీ నిడదవోలు వెంకటరావుగారు M. A. (Head of the Telugu Department Madras University) వారికి నా మనఃపూర్వకమైన కృతజ్ఞతాభివందనము లర్పించు కొనుచున్నాఁడను.
4
+ రచన</p>
5
+ శ్రీ మద్భాగవతములో రసవంతమైనభాగము దశమస్కంధము. దీనిని సంగ్రహించి తెనుఁగు చేయుటలో మడికి సింగనార్యుఁడు కవితాశక్తితో పాటు విషయములను బెంచియో, క్లుప్తపఱచియో ఘట్టములను బ్రతిపాదించుటలోఁ దన విమర్శనా జ్ఞానమును జూపి యున్నాడు.
Dvipada-Bagavathamu/page_0019.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ తెనుఁగు జాతీయ కవిత్వమును బాగుగాఁ బోషించి, దీర్ఘములగు సంస్కృత సమాసములను దొర్లించి విసువుఁ బుట్టించక భాగవత దశమస్కంధ రచన యింపుఁ గల్గించునదై యున్నదన్నచో సత్యదూరము కాదు. కవి స్వాభిమానము కలవాఁడు. తన శక్తిని బాగుగాఁ గుర్తెఱిఁగినవాఁడు.
2
+
3
+ కవి గొప్పభక్తుఁడు. వేదాంత శాస్త్రమందభిరుచి కలవాఁడు. కాఁబట్టి సాక్షాత్ లక్ష్మీదేవి యవతారమగు రుక్మిణిని వర్ణించు సందర్భమునందు స్తోత్రసాహిత్య ఫక్కీని పాదాదికేశాంత వర్ణన జేసి యున్నాఁడు.
Dvipada-Bagavathamu/page_0020.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ విష్ణుశక్తియగు రుక్మిణీదేవి వర్ణనము శ్రీకృష్ణుని వద్దకు దూతగా వెళ్ళిన బ్రాహ్మణుని నోట నుండి వచ్చునప్పుడు చితజ్ఞుఁడగు కవి చూపిన మర్యాదను, బ్రాహ్మణుఁడు రుక్మిణీదేవి యొక్క యభిప్రాయమును రసికాగ్రేశరుఁడగు శ్రీకృష్ణుని యెదుట ప్రతిపాదించిన నేర్పును గమనింపుడు.
Dvipada-Bagavathamu/page_0021.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ మొదట శ్రీ రుక్మిణి యొక్క నామ వంశాదికమును జెప్పి యాదవాన్వయవంశమణియగు శ్రీకృష్ణుని వరించుటకుఁ దగిన యోగ్యతను నిరూపించెను. తరువాత దక్షిణనాయకుఁడైన శ్రీకృష్ణుని చిత్తము నాకర్షించుటకై యువజనాకర్షములైన తను
Dvipada-Bagavathamu/page_0026.txt ADDED
@@ -0,0 +1,9 @@
 
 
 
 
 
 
 
 
 
 
1
+ అప్పకవి వంటి లాక్షణికుఁడు మడికి సింగనార్య కృతమగు వాసిష్ఠరామాయణములోని రెండు పద్యములను “అప్పకవీయము” లో నుదహరించి యున్నాఁడు. </p>
2
+ ముగింపు</p>
3
+ సరస్వతీమహల్ లైబ్రరీలోని తెనుఁగు వ్రాతప్రతుల సంఖ్య సుమారు 816 ఉన్నవి. ఇవి తంజావూరాంధ్ర నాయక రాజుల కాలమునుండి వచ్చుచున్నవి. నాయకుల పరిపాలన హూణశకము 1535—1675 వఱకు సాగినది. తరువాత మహారాష్ట్ర రాజులు తంజావూరును బరిపాలించిరి. నాయకరాజులలో “రఘునాథ నాయకుఁడు”. అతని కుమారుఁడు “విజయరాఘవ నాయకుఁడు”. ఈ యిద్దఱును తంజావూరాంధ్రసాహిత్యమునకు జీవగఱ్ఱలై యుండిరి. స్వయముగా గూడ అనేక గ్రంథములను విరచించిన ప్రజ్ఞానిధులు వారు. మహారాష్ట్ర రాజులలో గూడ తెనుఁగు సాహిత్యము కొనసాగినదే కాని మొరడు పోలేదు. మహారాష్ట్ర రాజులైన ఏకోజీ, శాహ మహారాజులు స్వయముగా తెనుఁగు ప్రబంధములను వ్రాసిన మేధావులు. లైబ్రరీలోని తెనుఁగు గ్రంథములను ఈవిధముగా విభజించవచ్చును.
4
+ పద్యకావ్యములు
5
+ ద్విపదకావ్యములు
6
+ శతకములు
7
+ దండకములు
8
+ గానములు
9
+ నాటకములు (యక్షగానములు)
Dvipada-Bagavathamu/page_0027.txt ADDED
@@ -0,0 +1,8 @@
 
 
 
 
 
 
 
 
 
1
+ వచనకావ్యములు
2
+ శాస్త్రసాహిత్యము
3
+ వివిధగ్రంథములు.
4
+ మద్రాసు ప్రభుత్వమువారు స్వతంత్రమును బొందిన హిందూదేశ పురోభివృద్ధికి విజ్ఞానము ప్రధానాంశముగా గమనించి పై లైబ్రరీలోని తెనుఁగు శాఖకు సంబంధించిన పుస్తకములను గొన్నింటిని బ్రచురించి, ఆంధ్రసాహిత్యమునకు మహాదుపకారమును జేయుటకు పూనుకొని యున్నారు. ఈ విషయమందు మద్రాసు ప్రభుత్వము వారు చూపిన శ్రద్ధకు ఆంధ్రలోకము మనఃపూర్వకమైన ధన్యవాదములు సమర్పించుకొనుటలో వెనుకంజ వేయదు. ఈ చిన్న సేవను జేయు సందర్భమును నాకిచ్చి భాగవత దశమస్కంధము యొక్క పరిష్కరణ భారమును నాకొసంగిన సరస్వతీమహల్ లైబ్రరీ గౌరవకార్యదర్శి శ్రీయుతులు యన్. గోపాలన్ బి. ఎ., బి. ల్. గారికి నా కృతజ్ఞతాభివందనములను సమర్పించు కొనుచున్నాను.
5
+
6
+ మా సరస్వతీమహల్ లైబ్రరీ విమర్శనశాఖా నిర్వాహకులును, బహుగ్రంథ ద్రష్టలును, సర్వతోముఖ పాండిత్యమును గల శ్రీయుతులు కె. వాసుదేవశాస్త్రిగారు నా కన్నివిధములుగా ప్రోత్సాహము నొసంగి నాయుద్యమము కొనసాగుటకు సహాయ మొనరించిరి. వారికి నా మనఃపూర్వకమైన కృతజ్ఞతాభివందనము లర్పించుకొనుచున్నాను.
7
+
8
+ నాకన్ని విధములనుఁ జేదోడు వాదోడుగానుండి సహాయ మొనర్చిన మన్మిత్రులు శ్రీయుతులు విఠలదేవుని సుందరశర్మగారికి నా కృతజ్ఞతాభివందనములను నివేదించు కొనుచున్నాను. తాళపత్ర
Dvipada-Bagavathamu/page_0028.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ ప్రతి గ్రంథమును శ్రమను బాటించక శ్రద్ధగావ్రాసి యిచ్చిన లైబ్రరీ తెనుఁగు లేఖకుఁడు చిరంజీవి యన్. విశ్వనాథునకు నా యాశీర్వాదపూర్వకమైన ధన్యవాదములు. ఈ చిన్న పొత్తమును సకాలమందు తగు విధముగా ముద్రణ చేసిన “ఆముద నిలయం” ముద్రణాలయమువారికి నా ధన్యవాదములను సమర్పించుకొనుచున్నాను.
2
+
3
+ ఈ యుపోద్ఘాతారంభము మా కులమునకు పరమగురువు లగు శ్రీరమణమహర్షులవారికి నమస్కృతులతో ప్రారంభించినది. నాజనకులును, గురువును దైవమునగు శ్రీ వాసిష్ఠ కావ్యకంఠ గణపతి మునులవారిని స్మరించుటతోపాటు శ్రీకృష్ణ భగవానుని పై వారు సెలవిచ్చిన శ్లోకముతో నీ యుపోద్ఘాతమును ముగించుచున్నాను.
Dvipada-Bagavathamu/page_0029.txt ADDED
@@ -0,0 +1,7 @@
 
 
 
 
 
 
 
 
1
+ ఉపోద్ఘాతానుబంధము</p>
2
+ క్రీ. శ. 1948వ వత్సరమునందు జరిగిన భాగవత ముద్రణమునకు విద్యారత్న శ్రీ నిడదవోలు వెంకటరావుగారు M. A. (Senior Lecturer and the Head of the Telugu Department, Madras University.) వ్రాసిన పీఠికలో “భాగవతానువాదములు” అను శీర్షికలో నదహరింపఁబడిన ద్విపదభాగవతముల పట్టిక నీక్రింద నుదహరించుచున్నాను. చిత్తగింపుడు.
3
+ పండ్రెండు స్కంధములు (సంపూర్ణము) – తరిగొండ వెంగమాంబ (అముద్రి)
4
+ మొదటినాలుగు స్కంధములు — తేకుమళ్ళ రంగసాయి (అము)
5
+ దశమస్కంధము (ప్రస్తుత పరిష్కరణము)—మడికి సింగన.
6
+ దశమస్కంధము. రత్నాకరము గోపాలకృష్ణకవి (అము)
7
+ రుక్మిణీకల్యాణము —చెన్నయ (అము)
Dvipada-Bagavathamu/page_0043.txt ADDED
@@ -0,0 +1,13 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ .......................లబ్ధిచయము
2
+ లన్నగంబులు, గుహ్యమ ప్రజాపతియు
3
+ నగు, విశ్వరూపాత్మ! అధ్యాత్మరహిత!
4
+ నిగమార్థగోచర! నినుఁ గొల్తుఁ గృష్ణ!
5
+ విద్యా(ధరస్తుత్య!) విశ్వలోకేశ!
6
+ ప్రద్యుమ్న! యనిరుద్ధ! బల! వాసుదేవ!
7
+ సంకర్షణాభీమ! సర్వసర్వాత్మ!
8
+ పంకజోదర! శుభప్రద! హృషీకేశ!
9
+ జలధిలోపల నున్న జలచరములును
10
+ (చెలఁగ) నవని సర్వజీవులు నినుఁడు
11
+ సరసిజాసన రుద్రషణ్ముఖభోగి
12
+ వరులును, నీలీల వర్ణింపలేరు.
13
+ ఏనొక్క మనుజుండ హీనమానుసుఁడ
Dvipada-Bagavathamu/page_0044.txt ADDED
@@ -0,0 +1,23 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ ………………… మూర్తిఁ బొగడగ గలనె?”
2
+ అని యిట్లు కొనియాడు నక్రూరుఁ జూచి,
3
+ తనరార శౌరి యంతర్ధానమయ్యె.
4
+ ఆతత సుస్నాతుఁడైన యక్రూరు
5
+ నీతరి మురహరి యీక్షించి పలికె
6
+ …………………………………………
7
+ …………………………………………
8
+ …………………………………………
9
+ ……………………………………………
10
+ …………………………………………
11
+ ……………………………………………
12
+ ……………………………………………
13
+ ……………………………………………
14
+
15
+ “కావున నీవు నక్కంసుతోఁ జెప్పు,
16
+ వేవేగ మేము నీ వెంటనే వత్తు”
17
+ మనవుండు నక్రూరుఁ డరదంబు నెక్కి.
18
+ …………………………… నచ్చటి వార్తఁ జెప్పె.
19
+ తన యింటి కేఁగినంతట రామకృష్ణు
20
+ లనుపమం బగు వేడ్క ననుఁగులుఁ దారు.
21
+
22
+ తొడిపూసి కట్టి సంతోషంబుతోడ,
23
+ ………………………… దెంచి కని రంతమ్రోల;
Dvipada-Bagavathamu/page_0045.txt ADDED
@@ -0,0 +1,23 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ పసిడిగోపురములుఁ బసిడికోటలును
2
+ బసిడి మాడవులను బసిడిమేడలును
3
+ హేమకుంభంబుల నెంతయు నొప్పి
4
+ హేమమయముగ సొంపెసలారి యుండఁ
5
+ గని వాని మహిమకుఁ గడు సోద్యమంది
6
+ తనరార తత్పురద్వారంబు సొచ్చి
7
+ రమణీయ(శోభ వుర)మున నేతెంచుఁ
8
+ గమలాయతాక్షులఁ గని చాలవేడ్కఁ
9
+ బౌరకామిను లెల్ల భావకోల్లాస
10
+ పారవశ్యంబునఁ బరతెంచి పేర్చి
11
+
12
+ సౌధాగ్రముల యందు సదనంబు (లందు)
13
+ వీధుల యందును వెఱవొప్ప నిలిచి
14
+ సొరిది వారందఱుఁ జూపులు పఱపి;
15
+ “ ఈతఁడే, యెలనాగ ఇసుమంతనాఁడు
16
+ పూతన (పాల్ ద్రావి) పొరిఁగొన్న వాఁడు,
17
+ సకియరో! ఈతఁడే శకటమై వచ్చు
18
+ ప్రకట దానవుఁ ద్రుళ్ళిపడఁ దన్నినాఁడు.
19
+ ముద్ధియ! ఈతఁడే మొగిఱోలుఁ ద్రోచి
20
+ మద్దియ లుడిపిన మహనీయ యశుఁడు.
21
+ అక్కరో! ఈతఁడే యఘదైత్యుఁ జీరి
22
+ కొక్కెర రక్కసుఁ గూల్చినవాఁడు.
23
+ గోవర్ధనముఁ గేల గొడుగుగాఁ బట్టి.
Dvipada-Bagavathamu/page_0046.txt ADDED
@@ -0,0 +1,23 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ (గోవులఁ దే)ర్చిన గోవిందుఁ డితఁడె.
2
+ కొమ్మ! ఈతఁడె పిల్లఁ గ్రోవూది వ్రేతఁ
3
+ గొమ్మలఁ గడువెఱ్ఱిఁ గొలిపినవాఁడు.
4
+ కాళీయు పడగ లుగ్రతఁ దొక్కి వాని
5
+ కాళి .......................... న పుణ్యుఁ డితఁడె.
6
+ .................................................
7
+ .................................................
8
+ .................................................
9
+ .................................................
10
+ (పదవిని దండ్రిచేఁ బలమినిఁ గొన్న)
11
+ యెదిరిని కంసుని యేపుమాయించి
12
+ యీతఁడే రాజైన నిల యెల్లఁ బ్రతుకు;
13
+ .................................................
14
+ నెలఁత యీతఁడు రోహిణీదేవికొడుకు
15
+ బలుఁ డను రక్కసుఁ బరిమార్చి నతఁడు;
16
+ .................................................
17
+ మలసి యిద్దఱి విక్రమంబులఁ జూడ
18
+ నా రామ కృష్ణులు నా పట్టణంబు,
19
+ భూరి సౌఖ్యమ్ముల నుబ్బుచుం బోయి
20
+
21
+ రాచ చీరలఁ దెచ్చు రజకుని శౌరి
22
+ చూచి యల్లన నవ్వుచుం జేరి పలికె.
23
+ “మడివాల! మాకైన మణుఁగుఁ బుట్టములు
Dvipada-Bagavathamu/page_0048.txt ADDED
@@ -0,0 +1,23 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ మనుజేంద్రునకు నిచ్చి మన్నన వడయఁ
2
+ గొనిపోవుచు మ్రోల గోవిందుఁగాంచి
3
+ (యసుపమ) భక్తితో నడుగుల కెఱఁగి
4
+ తనచేతి చీర ముందటబెట్టి నిలిచి;
5
+ యవధరింపుము కృష్ణ! అంభోజనయన!
6
+ తవిలి పుణ్యుఁడనైతి ధన్యుఁడనైతి
7
+ (నాపద్మ)జాదుల కందగరాని
8
+ నీపాదము (లభించె) నిఖలలోకేశ!
9
+ మునిలోకనుతపాద! మురవైరికృష్ణ!
10
+ (కొనుము యీ పుట్టంబు గోవింద! యనినఁ)
11
+ గని శౌరి కరుణ (సకల కామ్యములును)
12
+ తనలోకమును నిచ్చి ధన్యునిఁ జేసె
13
+
14
+ అరుగు దేర సుదాముఁడను పుష్పలావుఁ
15
+ డరిగి యెదుర్కొనె నత్యంతభక్తి
16
+ బలరామ కృష్ణుల పాదాబ్జములఁ
17
+ జెలువారఁ బూజించి చెంగల్వదండ
18
+ లిరువురకునునిచ్చి యింపుసొంపార
19
+ విరు(లమాలి)కలిచ్చి వెసవేయుగతులఁ
20
+ గీర్తింపఁగని హృషీకేశుండు శౌరి
21
+ యార్తరక్షణశీలి యతనిమన్నించి
22
+ వరము వేడుమటన్న వాఁడు “మీపాద
23
+ సరసిజంబులుఁ గొల్చు సద్భక్తి నాకు
Dvipada-Bagavathamu/page_0052.txt ADDED
@@ -0,0 +1,24 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ చనుదెంచి వారితో సమరంబు సేయ
2
+ నారామకృష్ణులు నవ్వీరవరులఁ
3
+ దోరంబుగల వింటితునుకల నడచి
4
+ మెఱసి కంసునియింటిభృత్యుని బలునిఁ
5
+ బరిమార్చి యందఱిఁ బఱపి యాలోన
6
+ గమ్మన నాయుధాగారంబు వెడలి
7
+ యిమ్ములఁ బురలక్ష్మి నెలమిఁ జూచుచును
8
+ నొప్పార నందాదులున్న యయ్యెడకుఁ
9
+ దప్పకఁ జనిరంతఁ దపసుండుఁ గ్రుంకె.
10
+
11
+ తనరార కాలోచితమ్ములుఁ దీర్చి
12
+ యనుపమసుఖలీల నారాత్రియందు
13
+ నంతనంతయు విని యాభోజనృపతి
14
+ చింతించి బెగ్గలి చేష్టలు సడలి
15
+ దారుణంబైన వేదనఁ బొంది కంది
16
+ కూరుకుఁ గానకఁ గొందలంబంది
17
+ యద్దంపునీడలో నాతతంబునను
18
+ నిద్దంబుగాఁ దననీడఁ జూడఁగను
19
+ తలలు రెండై యుంట...........
20
+ గలవెత నగ్నులు గానంగ బడుట
21
+ ఖరలులాయోష్ట్రాదికములును గనుట
22
+ యరుదార తలనూనెలంటుకొంచుంట
23
+ బిసములుఁదినుచుంట ప్రీతిదాసనపు
24
+ కుసుమధామంబులఁ గొనధరించుటయు
Dvipada-Bagavathamu/page_0053.txt ADDED
@@ -0,0 +1,23 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ ధూళిలో రొంపిలోఁ ద్రొక్కినయవుడు
2
+ కాలుమోవక పాదఖండమై యుంటఁ
3
+ చెపులు మూసినయెడ సింధుఘోషంబుఁ
4
+ బ్రవిమలంబుగ వినఁబడకుండుటయును
5
+ నివియాదిగాఁ బెక్కు లీక్షించి తనకు
6
+ యవసానకాల మౌనని యాత్మ నెఱిఁగి
7
+ పురపురఁ బొక్కుచుఁ బొగిలి లోగంది
8
+ మరణభయంబున మదిఁదప్పెనంత;
9
+ నెట్టకేలకు వేఁగ నినుఁడు పూర్వాద్రి
10
+ దట్టుఁడై పొడతెంచెఁ దమ్ములింపలర.
11
+
12
+ అంతఁ గంసుఁడు పూర్వాహ్నికక్రియలు
13
+ సంతసంబునఁ దీర్చి సకలభూపతులుఁ
14
+ గొలిచియుండఁగఁ బెద్దకొలువుండి వేడ్క
15
+ బలరామకృష్ణుల బవరంబుఁ జూడఁ
16
+ దలఁచి పెంపెసలారు తమకంబులందు
17
+ వలయువారును వసియించెనంత;
18
+ మఱియును బహువిధమంచియలందు
19
+ వరులు సద్విజరాజవైశ్యశూద్రులను
20
+ ప్రవిమలంబుగనుండి, రంగమధ్యమున
21
+ వివిధపుష్పసుగంధవిధులు వాసించి
22
+ పరగ నవ్వేళ గోపాలురుఁ దాను
23
+ నరుదెంచి నందుండు నాభోజపతికిఁ
Dvipada-Bagavathamu/page_0054.txt ADDED
@@ -0,0 +1,22 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ బొడఁజూపి తమతెచ్చు భూరివస్తువులు
2
+ కడఁకతో నిచ్చినఁ గరము మన్నించి
3
+ తనచేరువనె యొక్క తమకంబుమీఁద
4
+ నునిచి వారును దాను నొగిఁజూచుచుండె.
5
+ కరియూధ మే చుగతి మల్లవర్గ
6
+ మరుదెంచ వందిబృందారవం బెసఁగఁ
7
+
8
+ జను దెంచి ముష్టిక చాణూరముఖుల
9
+ లెనయ రంగస్థలంబెల్లఁ దారగుచు
10
+ భుజమప్పళింపుచుఁ బొరి విజృంభించి
11
+ గజభజింపుచునుండగా నంతలోన;
12
+
13
+ వికసితపుష్కరవిభవంబుఁ జెంది
14
+ యకుటిలదీర్ఘశృంగారూఢి నొప్పి
15
+ మానుగా వంశాఢ్యమహిమఁ జెన్నొంది
16
+ దాన నిర్జరలీలఁ దనుపారఁ బేర్చి
17
+ పొడవు తక్కువగాని భూధరేంద్రంబు
18
+ వడువునఁ జెలువారు వరశక్తిచేత
19
+ నష్టదిగ్గజముల నాపంగనోపు
20
+ నష్టమదాపూర్ణమై పేర్చుకరణి
21
+ కువలయవేలంబు కోరియాశాల
22
+ నవిరళంబుగ నిల్చి యతికౌతుకమున
Dvipada-Bagavathamu/page_0055.txt ADDED
@@ -0,0 +1,24 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ నెదరుచూచుచునుండె నెంతయు వేడ్క.
2
+ యదుకులోత్తంసులు హలియును హరియు
3
+ రమణీయజలజాకరమునఁ గ్రీడింప
4
+ గమనోగ్రగతివచ్చు గజయుగ్మ మఁనగఁ
5
+ గరియూధములమీఁద కలుషించివచ్చు
6
+ హరిశోరద్వయమనఁ బెంపు మిగిలి
7
+ పౌరులుఁ దముఁ జూచి బహుభంగిఁ బొగడ
8
+ నారూఢరంగము నటు డాసి శౌరి
9
+ యరుదారఁ దెరుపున కడ్డంబు వేర్చు
10
+ కరిఁ జూచి మావంతుఁ గనియు నిట్లనియె.
11
+ “ఈకరిఁ దొలగించి యిటఁద్రోవఁ జూపు
12
+ మాకంసుకడకు మాకరుగఁగావలయుఁ
13
+ బోవనీకుండినఁ బొరిపుత్తు" ననిన;
14
+ మావంతుఁడంత నర్మరుషంబుతోడఁ
15
+ గరిపతి హరిమీఁదఁ గదియింప నదియుఁ
16
+ దిరిగి మహోదండతీవ్రతుండంబుఁ
17
+ బ్రసరింపుచును గృష్ణుఁ బటుశక్తి నొడియ
18
+ నసమసత్వుఁడు కృష్ణుఁ డటఁ దప్పఁగ్రుంకి
19
+
20
+ చరణమధ్యములకుఁ జని బాహు లెత్తి
21
+ యరుముష్టి బొడిచిన యురమూరదాఁకి
22
+ హుంకారరవమున నోడించి మొరగ
23
+ నంకుశంబున సూది హస్తిపుం డార్వఁ,
24
+ బురికొని కరటి యపుండరీకాక్షుఁ
Dvipada-Bagavathamu/page_0060.txt ADDED
@@ -0,0 +1,22 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ "పల్లవులము పిన్నపాపలు మేము
2
+ తగిన జెట్లును మీరు ధరణీశునొద్ద
3
+ జగతిపైఁ బోరుల సడిసన్నవారు
4
+ మీతోడ రణవీథి మెఱసి సేయంగ
5
+ నాతరంబులవార మగుదుమే మేము?
6
+ చెనసి భూపతి వేడ్కఁ జెడకుండ కొంత
7
+ పెనఁగెద”మని పల్కి ప్రీతి మై పెంచి
8
+
9
+ వడిమల్ల చఱచి భూవలయంబు పగుల
10
+ బెడిదంబుగా నార్చి పిడికిళ్లు చాఁచి
11
+ వానిమై కదియు ముష్టాముష్టి గవియఁ
12
+ జూణూరుఁడును మల్ల చఱచి యిట్లొరసి
13
+ యిరువురు భుజ మప్పళించు చప్పుళ్లు
14
+ శరనిధి కలఁగె నాశాచక్ర మగిలె
15
+ నంతకుఁ దెసఁజేరి యవనిపరాగ,
16
+ మింతింతఁగొన మేన నిరవారఁజల్లి
17
+ కొనిపదఘాతల కూర్మంబు వగులఁ
18
+ దనరు మహాభద్రదంతుల రీతిఁ
19
+ జేతికి నొడిసినఁ జేయీక తివిసి
20
+ ఘాతసేయంగ దగ్గఱి మేను దొలఁగి
21
+ పొడిచిన నది వెలిపుచ్చి మైవంచి
22
+ యొడిసి తొడలఁ దట్టి యార్చి పెల్లురికి
Dvipada-Bagavathamu/page_0061.txt ADDED
@@ -0,0 +1,25 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ లాగంబుఁ గొచను మేలనఁదలఁగ్రుంకి
2
+ బాగుఁదప్పకఁ దలప్రహతుల నొంచి
3
+ నడుముఁ బీడింప విణ్ణనుదున మలఁగి
4
+ విడిపించుకొని ముష్టి విసరమై పొడిచి
5
+ పట్టుచు విడుచుచుఁ బరుషఘాతముల
6
+ దట్టించి కూర్పరోద్ధతుల నొప్పించి
7
+ కరవశంబుఁగొన కాభీరువోక
8
+ దర కాండములు లోనుగానీక తొలఁగి
9
+ శిసకంబొనరింప శిరమూన్చి పెట్టు
10
+ గాసిల్లి కేలడొక్కరమున నొత్తి
11
+ రంకెలువైచు గోరాజుల భంగి
12
+ ఝంకించి బింకంబు సరిగాఁగఁబెనఁగి
13
+ ముంగలు బలసింగములభంగిఁబొంగి
14
+ నింగిమోవంగ నార్చి నిడుగుడి పై కుఱికి
15
+ మెడయు గాళ్లును బట్టి మీఁదికి నెత్తి
16
+ పుడమి మోవంగవ్రేయ భోరున నెగసి
17
+ యడపకరాఁగేల నిరియ బిగించి
18
+ వడి నుగ్రమగు ముష్టి వక్షంబుఁ బొడువఁ
19
+ దడబడ ముష్టిఘాతల మోములవసి
20
+ దొడిదొడి పన్నెత్తురులు వఱ్ఱుగాఁగ
21
+ హరియు చాణూరుఁడు నటమల్లయుద్ధ
22
+ పరుషతఁ దుల్యులై బవరంబు సేయ;
23
+
24
+ సీరితోఁ దొడరి ముష్టికుఁ డుగ్రవృత్తి
25
+ బోరెఁ జూపరకు సభ్యులు చూచి పొగడ;
Dvipada-Bagavathamu/page_0065.txt ADDED
@@ -0,0 +1,25 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ పిడికిళ్ళ నొప్పింపఁ భిరికి ప్రాణములు
2
+ యొడలికిఁబెడఁబాయ నొప్పార కంసు
3
+ ఘనకళేబరము రంగము వాయనీడ్చి
4
+ యనుపమధ్వనిఁ బేర్చి యార్చి మురారి
5
+ యతనితమ్ములు సునాభక్రోధనాథు
6
+ లతిసత్వు లెనమండ్ర మలపాణి చంపె;
7
+ నప్పుడు పౌరులయార్పులు నింగి
8
+ నుప్పొంగి బహుపాశకోక్తులఁ జెలంగె.
9
+
10
+ భవకమలాసనప్రముఖదేవతలు
11
+ ప్రవిమలంబుగఁ బ్రణుతించి రెలమి
12
+ దివిబీఁటకొని మ్రోసె దేవధుందుభులు
13
+ దివిజకామినులు నర్తించి రింపార;
14
+ పొరిఁబొరి మందారపుష్పవర్షములు
15
+ సురకోటి దేవకీసుతుమీఁదఁ గురిసి
16
+ రంతట, కంసుండు హతుడౌట యెఱిఁగి
17
+ యంతఃపురాంగన లడలు దీపింప
18
+ నడుగులు తడబడ నాత్మలు కలఁగ
19
+ సుడివడి లోగుంది సృక్కి బల్వడిని,
20
+ నురముల శిరముల నొరి మ్రోదుకొనుచు
21
+ పరిపరివిధముల పలవించి మిగుల
22
+ నార్తనాదంబుల నందంద బొగిలి
23
+
24
+ భర్తపై వ్రాలుచు బహుభంగి నొగిలి
25
+ హా! యని యేడ్చుచు హా నాథ! యనుచు
Dvipada-Bagavathamu/page_0066.txt ADDED
@@ -0,0 +1,24 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ పోయితే! మము బాసి భోజవంశాఢ్య!
2
+ కటకటా! శోకానఁ గ్రాలంగ మమ్ము
3
+ నిటఁ జూడ వించుక యేలఁ గైకొనవు?
4
+ ఇనుఁడు నీమీఁదట యెండరానోడు;
5
+ ననిలుండు నీమీఁద నటవీవ వెఱచు;
6
+ ననలుండు తీవ్రార్చు లడరింపనోడు;
7
+ ననిమిషాదులు మీకు నడకుదు రెపుడు;
8
+ నీయాజ్ఞ నీలావు నీరాజసంబు
9
+ నీయొప్పు నీనేర్పు నీమంచితనము
10
+ వ్రేయవారలచేత వేల్మిడినడఁగి
11
+ మాయమైపోయితే మనుజదేవేంద్ర!"
12
+ అని బహుభంగుల నార్తులై పొగుల
13
+ వనితల నూరార్చి వాసుదేవుండు
14
+
15
+ కారాగృహంబునఁ గడునొచ్చియున్న
16
+ వీరుని వసుదేవు, వెలఁది దేవకిని,
17
+ గని వారికాలి సంకిలియలూడ్పించి
18
+ వినయంబుతో మ్రొక్క వెఱఁగంది వారు
19
+ గోవిందహలులఁ గల్గొని తమపాలి
20
+ దైవంబులని, యాత్మఁదలఁచిరి గాని
21
+ తనయభావంబుగాఁ దలఁచకయున్న
22
+ తనమాయ హరి మోహతమముఁ గారించ
23
+ చన్నులఁ బాలును సమ్మదాశ్రువులు
24
+ కన్నులఁ దొరల నక్కాంతాలలామ
Dvipada-Bagavathamu/page_0067.txt ADDED
@@ -0,0 +1,25 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ సుతులఁ గౌఁగిటఁ జేర్చి శోకంబుఁ దక్కి
2
+ యతులితంబగు ప్రేమ నందఁదఁ జూడ
3
+ వసుదేవుఁడును బుత్రవరుల నీక్షించి
4
+ యసమానమగుప్రేమ నక్కునఁ జేర్చి
5
+ “పుణ్యాత్మ! మీయట్టి పుత్రులఁ గాంచి
6
+ పుణ్యకీర్తులఁ గంటి పుణ్యుఁడ నైతి;
7
+ నింతగాలము మిమ్ము నీక్షింపలేక
8
+ సంతాపమందుచు శత్రులచేత
9
+ బడని బాధలఁ బడి పసువుచుండితిమి;
10
+ కడపట! నినుఁ జూడగంటిమి నేడు;
11
+ జన్మజన్మాంతరసంచితౌఘములు
12
+ చిన్మయ! నినుఁ దలఁచిన మాత్రమేఁగు.
13
+ మహనీయ! నీవు కుమారుఁడ వైతి
14
+ విహపరంబుల మాకు నేమిటఁ గొఱత?”
15
+ అనియున్న గురుల నత్యాదరలీలఁ
16
+ గనుఁగొని శౌరి యుత్కటబాష్పుఁ డగుచు
17
+
18
+ “మానిమిత్తముల దుర్మనుజులచేతఁ
19
+ బూని బహుక్లేశములు మీకుఁ గలిగె;
20
+ జనియించినపుడే యిచ్చటనున్న వెఱచి
21
+ యనఘ! నందునియింటి కనిచిన, వారు
22
+ బాల్యంబు మొదలుగా భక్తిఁ బోషింపఁ
23
+ గౌల్యవర్తనల మెలఁగి కాంచితిఁ గాని
24
+ యప్పటప్పటికి మమ్మరసి మీ రర్ధిఁ
25
+ జెప్పిన పనిసేయ సిద్ధించదయ్యె;
Dvipada-Bagavathamu/page_0068.txt ADDED
@@ -0,0 +1,24 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ తనయుఁడు జయించి తల్లిదండ్రులకు
2
+ ననుపమంబగుభక్తి నరయకుండినను
3
+ దనయుండె? ఆతఁడు తల్లియవ్వనముఁ
4
+ గొనకొని తెగఁజూచు గొడ్డలిగాక!"
5
+
6
+ అనిభక్తి సూరార్చి యయ్యుగ్రసేనుఁ
7
+ గనుఁగొని కౌఁగిట గదియించి, శౌరి
8
+ “నీరాజ్యమంతయు నిర్దయవృత్తి
9
+ గ్రూరుఁడై తానె కైకొని యంతఁబోక
10
+ యాకలఁ బెట్టి మిమ్మలఁచినయతఁడు
11
+ కాకున్న పనియట్లగాక పోరాదు
12
+ హీనమానసులైన యీదురాత్ములకుఁ
13
+ గానఁజింతింపకఁ గంసాదిసుతుల
14
+ కగ్నిసంస్కారాదు లర్థిఁ జేయింపు
15
+ ప్రాజ్ఞుల విప్రులఁ బనిచి వేవేగ
16
+ రాజ్యభారముఁ దాల్చి రమణ మా కెల్ల
17
+ పూజ్యుఁడవై లీల భూమి పాలింపు”,
18
+ మనుటయు హరిఁ జూచి యయ్యుగ్రసేనుఁ
19
+ “డనఘ! న న్నిమ్మాటలాడంగఁదగునె?
20
+ హీనుఁడ నతివృద్ధ నీరాజ్యభరము
21
+ పూన నాకర్హంబె? పుండరీకాక్ష!
22
+ వసుదేవుఁబట్టంబు వలనొప్పఁగట్టి
23
+ యసమానగతిని రాజ్యము నీవె తీర్పు;
24
+ కన్నులు చల్లఁగాఁ గలకాలమెల్ల
Dvipada-Bagavathamu/page_0069.txt ADDED
@@ -0,0 +1,25 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ నిన్నుఁ జూచుచుఁ బ్రీతి నెగెడద కృష్ణ!"
2
+ అనుచుఁ బల్కిన శౌరి యారాజుఁ జూచి
3
+ వినయంబు నీతియు వెలయ నిట్లనియె.
4
+ “యాదవులకు రాజ్యమర్హకృత్యములు
5
+ గాదు యయాతివాక్యముఁద్రోయరాదు;
6
+ కావున సామ్రాజ్య కమనీయలక్ష్మి
7
+ నీవె పాలించి మన్నించు, బాంధవుల
8
+ రప్పించి వారికి రాజ్యంబు లిచ్చి
9
+ తప్పక మమ్మెల్ల దయ నేలుకొనుము.
10
+ నిఖిలభూపతులును నింపు సేయంగ
11
+ సుఖలీలనుండు; కంసుని వంతమాను”.
12
+ మనిపల్కి యాతని నవనీభరంబుఁ
13
+ గొనకొనుమని నీయకొలిపి మురారి
14
+
15
+ బలుఁడుఁ దానును నందుపాలి కేతెంచి
16
+ కలిసి యాతనిఁ జిక్కకౌఁగిటఁ జేల్చ
17
+ భోజాధిపతియింటఁ బొలుచు వస్తువులు
18
+ రాజ్యయోగ్యములైన రవణంబు లిచ్చి
19
+ యతని మన్నించి నెయ్యము తియ్యదనము
20
+ నతిగారవంబున నమర నిట్లనియె.
21
+ “నీవు నీసతియును నెమ్మిఁబోషించి
22
+ ప్రోవఁగఁ బ్రతికిన ప్రోఢల మేము
23
+ తల్లియుఁ దండ్రియు ధనము లియ్యమును
24
+ నెల్లబంధువులును నిట మాకు నీవ;
25
+ మందలోపలికి నెమ్మది నేఁగి మీర
Dvipada-Bagavathamu/page_0070.txt ADDED
@@ -0,0 +1,23 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ లందఱిసేమంబు లడిగితిమనుఁడు;
2
+ యేనాఱుదినముల యీలోనె నచటి
3
+ కే నేగుదెంచెద నీవంతమాను”.
4
+ మని వారి నూరార్చి యనుప నందుండుఁ
5
+ జనియె గోపాలకసమితియుఁ దాను.
6
+ అంతట నిశ్శంక నారాత్రి సౌఖ్య
7
+ సంతోషలీలలు సలిపి రింపొంద.
8
+ మరునాఁడు శౌరి కుమారులఁ జూచి
9
+
10
+ తెరగొప్ప సద్గురుద్విజుల రప్పించి
11
+ కాలోపనయనసంస్కారాదివిధులు
12
+ గాలోచితక్రియగతులుఁ జెప్పింప
13
+ యదుకులాగతగురుఁడగు గర్గ్యువలనఁ
14
+ జదువొప్ప వేదశాస్త్రము లభ్యసించి
15
+ యెఱుక సాధింపుడంచను విప్రునింట
16
+ యఱవదినాల్గువిద్యలు నభ్యసించి
17
+
18
+ గురువులఁ బూజించి కొలిచి మన్నించి
19
+ “గురులార! యేనీకు గురుడక్షిణార్థ
20
+ మిరవార మదినున్న యీప్పితార్థములఁ
21
+ దరమిడికొనివత్తు దయ వేఁడు” మనిన
22
+ నతఁడు భార్యయుఁ దాను నటవిచారించి
23
+ హితబలాఢ్యునిఁ గృష్ణు నెఱిఁగి యిట్లనియె.
Dvipada-Bagavathamu/page_0071.txt ADDED
@@ -0,0 +1,20 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ “తనర ప్రభాసతీర్థములోనఁ దొల్లి
2
+ మునిగిపోయినపుత్రు మొగిఁ దెచ్చియిమ్ము
3
+ డిది దుష్కరపుకార్య మిటు సేయుఁ” డనిన
4
+ యగుఁగాక యని ప్రీతి హాలియును దాను
5
+ నగణితాయుధపూర్ణమగురథం బెక్కి
6
+
7
+ చను దేర; నెదురేఁగి జలరాశి మ్రొక్కి
8
+ యనుపమదివ్యరత్నాళిఁ బూజించి
9
+ “తామరసాక్ష! మాధవ! లోకవంద్య!
10
+ ఏమి విచ్చేసితి రెఱిఁగింపు” మనుఁడు;
11
+ “తొడరి మాగురువుపుత్రుని మ్రింగినాఁడ
12
+ వుడుకకఁ దెచ్చి మా కొప్పించు” మనిన;
13
+ “నా కేమి పని యిది? నాలోన నుండి
14
+ భీకరాకారుండు పృథుకంపురూపుఁ
15
+ డగురాక్షసుఁడు మ్రింగె” నని చెప్ప శౌరి
16
+ యగణితశక్తిని యంబోధి నుఱికి
17
+ వేదచోరునిఁ దొల్లి విదళించుభంగి
18
+ నాదుష్టదనుజుని యడగించి వాని
19
+ కడుపులోనున్న శంఖము పుచ్చుకొనుచు
20
+ తడయక వెడలి రథంబెక్కి కదలి
Dvipada-Bagavathamu/page_0074.txt ADDED
@@ -0,0 +1,23 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ సకలసంపదలకు సదనమై పొలుచు
2
+ నకలంకగతి మందకరిగె నుద్ధవుఁడు
3
+ తనరాక నెరిగింపఁ దగ నందుఁ డెదురు
4
+
5
+ చనుదెంచి యతనికి సాష్టాంగ మెఱఁగి
6
+ కొనిపోయి పెక్కుభంగులఁ బూజసేసి
7
+ యనుపమప్రీతిమై నప్పుణ్యధనుని
8
+ యలవడ మజ్జనయాహారవిధుల.
9
+ వలయకఁ దీర్పించి యతని కిట్లనియె.
10
+ "దేవకియును వసుదేవుఁడు సుఖులె?
11
+ కోవిదగ్రామణి కొడుకులుఁ దాను
12
+ సురచిరప్రీతిమై సుఖమున్నవాఁడె?
13
+ హరి మమ్ముఁ దలఁచునే యప్పటప్పటికి?
14
+ సురలోకవైరిఁ గంసుని నేలఁగూల్చి
15
+ ధరణిరాజ్యము వానితండ్రికి నొసఁగి
16
+ యన్నయుఁ దమ్ముఁడు నతులితప్రేమ
17
+ నున్నారె సౌఖ్యులె, యుద్ధవాచార్య
18
+ బలురక్కసులబారిఁ బడి చావనీక
19
+ చెలఁగు మహాదావశిఖి గ్రాఁగనీక
20
+ యహివిషానలవహ్ని నడగంగనీక
21
+ మహనీయమగువాన మడియంగనీక
22
+ యప్పటప్పటికి మమ్మరసి గండములు
23
+ దప్పించి రక్షించె దానవారాతి.
Dvipada-Bagavathamu/page_0076.txt ADDED
@@ -0,0 +1,24 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ శోభనాఢ్యుల మిమ్ముఁ జూడంగఁగలిగె;
2
+ హరికిని మీమీఁది యర్మిలి ఘనము
3
+ సొరిది మిమ్మందఱిఁ జూడంగ వచ్చు
4
+ జననంబు మరణంబు శత్రులు హితులు
5
+ తనువు లింద్రియములు తల్లిదండ్రులును
6
+ నతని కెవ్వరు లేరు యతఁడె యందఱికిఁ
7
+ బతి, జగత్పతి, రామపతి, సర్వసముఁడు,
8
+ నిర్గుణుండయ్యును నిఖిలంబుఁ ద్రావ
9
+ స్వర్గాదులకు వచ్చు సర్వాత్ముఁ డతఁడు;
10
+ అతఁడు సర్వాత్ములయందె కాపుండు
11
+ నతనివ్వతిరిక్తమది లేదు దలఁప”.
12
+ అనియిట్లు బోధించి నవ్విభావరియుఁ
13
+ జనియె నంతట గోపసతు లొప్ప పెరుగు
14
+
15
+ ద్రచ్చుచు ఘుమఘుమధ్వనులతోఁ గృష్ణు
16
+ సచ్చరిత్రముఁ బాడు సామగానములు
17
+ ఘోషింప నంత నర్కుఁడు దోఁప వినయ
18
+ భాషణుఁడగు నెదుప్రవరుఁడు వెడలి
19
+ యరదంబు వెసనెక్కి యమునకు నరిగి
20
+ తరమిడి కాలోచితంబులు దీర్చి
21
+ చనుదెంచి వల్లవసతుల నీక్షించి
22
+ యనునయోక్తుల వారినందఱఁ బిలిచి
23
+ తప్పక కృష్ణుఁడు తమతోడ మున్ను
24
+ చెప్పినమాటలు నేర్పుగాఁ జెప్ప
Dvipada-Bagavathamu/page_0077.txt ADDED
@@ -0,0 +1,23 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ విని గోవరమణులు వెఱఁగంది యతనిఁ
2
+ గనుఁగొని పలికి రుద్ధతబాష్పు లగుచు,
3
+
4
+ “హరి నిన్నుఁ బుత్తేర నరుదెంచి యంత
5
+ వరయశోదకును నవ్వార్తలుఁ జెప్పి
6
+ యూరకె పోవేల? ఒగి మమ్ముఁ జూచి
7
+ చేరి స్వామిహితంబుఁ జెప్పెదుగాక!
8
+ ఇట నింక నెనరువా రెవ్వరు గలరు?
9
+ కటకటా! మమ్మేల కమలాక్షుఁ డడుగు?
10
+ అడిగెడివాఁడైన నరుదేఁడె యిట్లు
11
+ విడుచునే మమ్ము నీవిరహాగ్నినడుమ?"
12
+ అని పల్కి కృష్ణుని యంగంబుసొబగుఁ
13
+ కనుబారులీలలు, తనువు చిత్తమునఁ
14
+ గ్రొత్తైన విరహాగ్ని గురుసులు వార
15
+ నత్తలోదరులు సిగ్గరి యాడిపాడి
16
+ యొకయింతి కుసుమగుచ్ఛోద్ధూతమధువుఁ
17
+ బ్రకటితంబుగఁ గ్రోలి పాడుచునున్న
18
+ మధుపంబుఁ జూపి నెమ్మది మాటువెట్టి
19
+ మధురగర్వోక్తి నున్మాదియై పలికె.
20
+
21
+ “చంచరీకమ! నీవు చంచలాత్ముఁడవు
22
+ వంచకుండవు పుష్పవతులఁ గీలింతు
23
+ నిలిచినకాలున నిలువ వేప్రొద్దు
Dvipada-Bagavathamu/page_0079.txt ADDED
@@ -0,0 +1,23 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ విరహాగ్నినెపమున వెలుపల మఱచి
2
+ పరమయోగధ్యానపరులచందమున
3
+ పరమానురక్తి హృత్పద్మంబులందు
4
+ చిరలీల నిలిచి భజింపుటఁ జేసి
5
+ మీతలంపులయందు మెలఁగుదుఁగాని
6
+ మీతో వియోగమేమియు లేదు మాకు
7
+ నిచ్చట పనిఁజూడ నెఱిఁగి మీకడకు
8
+ వచ్చెదననియె నవ్వసుదేవతనయుఁ"
9
+ డని చెప్ప, నుద్ధవాచార్యునిఁ జూచి
10
+ మనసిజోన్మాదులై మగువలిట్లనిరి.
11
+
12
+ “నల్లని మే నున్నతమైన యురముఁ
13
+ దెల్లదమ్ముల మించు తెలిగన్నుగవయు
14
+ నెరిజడ చొళ్లెము నిటలరేఖయును
15
+ జిరునవ్వు మోమును జేత వేణువును
16
+ నాయతబాహులు నధరంపుకెంపు
17
+ పాయక జిగిమించు పసిఁడిచేలయును
18
+ దలఁబురిపెనపు కదంబమంజరియు
19
+ ధళధళ వెలుఁగెడు దంతదీధితియుఁ
20
+ గలరూపు మోమున గట్టినట్లుండ
21
+ తలఁచకుండిన నుండు తలఁచిన నుండు
22
+ కలలందు మాతోడఁ గవయుచు నుండు
23
+ నెన్నడు వచ్చునో యిందిరావిభుఁడు
Dvipada-Bagavathamu/page_0084.txt ADDED
@@ -0,0 +1,23 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ యీతెఱంగని చెప్పు దేకార్యమైన;”
2
+ ననిపల్కి కమలాక్షుఁ డక్రూరుఁ జూచి,
3
+ తనరార బాంధవత్వముఁదోఁపఁ బలికె.
4
+ “ఆనకదుందుభియనుజ! ధర్మాత్మ!
5
+ మేనత్త మాకు నర్మిలి తల్లికంటె
6
+ పెనిమిటి గడచన్న బిడ్డలుఁ దాను
7
+ మనపట్టు లేక యున్మలికతోఁ గొంతి
8
+ క్రూరాత్ముఁడగు బావ కుదురునేయున్న
9
+ యారాజపుత్రులు యసమపాహసులు
10
+ తమ్మునిపాలుఁ దత్తనయుల కిచ్చి
11
+ నెమ్మదినుండగ నేరఁ డానృపతి
12
+ వారికి వీరికి వసుధకైఁ బోర
13
+ నీరసంబున మీఁద నెట్లు గాఁగలదొ?
14
+ కరివురి కేఁగి యక్కడ పాండుసుతుల
15
+ నరసి యిచ్చటి సేమమంతయుఁ జెప్పి
16
+ గర్వితుఁడగు కంసుఁ గడపి తజ్జనకు
17
+ నుర్వి యేలింపుచున్నారమనుము
18
+ ధృతరాష్ట్రుచందంబుఁ దెలిసి
19
+ మతులెల్లఁ దెలిసి క్రమ్మర వేగరమ్ము
20
+ పొ మ్మందఱకుఁ గట్నములు భూషణములు
21
+ నిమ్మంచు” చెప్పించి యిచ్చి యాలోన
22
+ నుద్ధవుండును దాను నొగియింటి కరిగి
23
+ బద్ధానురాగుఁడై పద్మాక్షుఁ డుండె.
Dvipada-Bagavathamu/page_0090.txt ADDED
@@ -0,0 +1,22 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ గడురోషభీషణాగ్రహవృత్తిఁ బలికె
2
+ “ఏమేమిరా! కృష్ణుఁడే యింత సేసె!
3
+ భూమి నయాదవంబుగ సేయవలయు"
4
+
5
+ నని పల్కి, యందంద ననిభేరి వేయ
6
+ ఘనభాంకృతుల నబ్ధిగలఁగ సైనికుల
7
+ నీక్షించి మొనలేర్చి యిరువదినాల్గు
8
+ యక్షోహిణులఁ గూడి యటవచ్చి మధుర
9
+ వెడలె మైముచ్చుట విడిసిన ప్రజను
10
+ వొడకుండ శ్రీకృష్ణుఁ డుగ్రసేనాదు
11
+ లగువారుఁ దానుఁ గార్యాలోచనంబుఁ
12
+ దగఁ జేయ వేగ నందఱుఁ జూచుచుండ
13
+
14
+ దివ్యరథంబులు దివ్యాయుధములు
15
+ నవ్యోహగతి వచ్చి హరిమ్రోల నిలిచె
16
+ నప్పుడు కమలాక్షుఁ డన్న నీక్షించి
17
+ “తప్పక చూడు యాదవకోటి నెల్ల
18
+ మడియఁగాలంబన మనమీఁద నాజి
19
+ నడచి వచ్చిరి వీరి నడఁపక నుండ
20
+ నొండుపాయంబున నుడుగునే వీడు?
21
+ దండిమీరిన యాయుధంబులుఁ బూను”
22
+ మనవుఁడు ముసలము శూలమునుఁ బుచ్చు
Dvipada-Bagavathamu/page_0092.txt ADDED
@@ -0,0 +1,25 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ కరములు దునిసి యంగంబులు నాటి
2
+ శిరములు వెసఁ ద్రుంచి శిడములు నఱికి
3
+ బరులు వ్రక్కలు వాపి పదములు విఱిచి
4
+ కత్తళంబులు చించి కంఠంబు లెడపి
5
+ నెత్తురు వెడలించి నెనళ్లు గలఁచి
6
+ కండలుఁ దెగఁజెండి గాత్రంబు లడఁచి
7
+ గుండెలుఁ గూల్చి ప్రేగులు వెల్వరించి
8
+ బొమ్మిడకల్ రాల్చి బొడగలుఁ గూల్చి
9
+ యెమ్ములు నలిసేసి యెఱచులు చదిపి
10
+ పొరి వీరి వారిని బోలింపరాక
11
+ బెరసె పీనుగులై పృథివియంతయును;
12
+ హలికుండు నఱికిన యడవిచందమునఁ
13
+ గలసి కాల్వురు చాపకట్టుగాఁ బడిరి
14
+ ముందఱ బయలైన మొనసి రావుతులు
15
+ యందఱు నొక్కసాహసకేళి సలిపి
16
+ తురగంబు రవుతును దునుకలై పడఁగఁ
17
+ దరవలికత్తి నుద్ధతి మొత్తువారు
18
+ లవుణి వ్రేశిన మేను లవుణియై తిరిగి
19
+ తివిరి ఖడ్గంబులఁ దెగవ్రేయువారు
20
+ యంతళంబుల మేను లందంద పొడువ
21
+ నెత్తురు వఱ్ఱలై నెఱిఁ గూలువారు
22
+ మునిగాళ్లు తెగి వాహములు మ్రొగ్గ సరకు
23
+ గొనక మార్తురమ్మని కొనునాశ్వికులును
24
+ యమ్ములు తగనాట యావల వెడలి
25
+ బొమ్మలక్రియఁ గూలి పొలయు గుఱ్ఱములు
Dvipada-Bagavathamu/page_0113.txt ADDED
@@ -0,0 +1,24 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ హరికి యిక్కడివార్త లందెనో! నడుమ
2
+ దిరిగెనో! శౌరిఁ దోతెచ్చుచున్నాఁడొ!
3
+ ఈకార్య మెఱిఁగింప నిందిరావిభుఁడు
4
+ కైకొనకుండునో! కడువేడ్కతోడ
5
+ వచ్చునో! ఎవ్వరే వలదందురొక్కొ!
6
+ మచ్చికతో నన్ను మన్నించునొక్కొ!
7
+ నెడమకన్నును జన్ను నేడమభుజంబు
8
+ వడి నదరెడి హరివచ్చు నిశ్చయము.”
9
+ అని యిచ్చ నూహింప నంబుజోదరుఁడు
10
+ చనుదెంచి సీరితో సైన్యంబుతోడ
11
+ నాపురోద్యానంబు నందొప్ప విడిసి
12
+ భూపాలతనయ కింపుగఁ దనరాకఁ
13
+ జెప్పి పుంచినఁ జెన్నార విప్రుఁ
14
+ డప్పొలంతుకఁ గాంచి హరి వచ్చె ననుడు
15
+ హరుషాశ్రువులు గ్రమ్మ నందంద మేను
16
+ గరుపార నవ్విప్రుఁ గని యిట్టులనియె,
17
+ “పురుషార్థపరుఁడవు పుణ్యచిత్తుఁడవు
18
+ పరమాప్తుఁడవు నాకుఁ బ్రాణంబు నీవ!
19
+ ప్రాణవల్లభుఁడైనఁ బద్మాక్షుఁ దెచ్చి
20
+ ప్రాణంబుఁ గాచితి పలుకులిం కేల!”
21
+ అని పల్కి యతనికి నందంద మ్రొక్కి
22
+ కనకాంబరము లిచ్చి ఘనతతో ననిచె.
23
+
24
+ గౌరికి మ్రొక్కింపఁ గరము సంప్రీతి
Dvipada-Bagavathamu/page_0114.txt ADDED
@@ -0,0 +1,25 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ నారాజబింబాస్య నటతోడి తేరఁ
2
+ గలికి రాయంచల గతుల గీడ్వఱచుఁ
3
+ జెలువలు నలుగడఁ జెన్నారి కొలువ
4
+ పటహకాహళశంఖఫణవాదు లొలయ
5
+ పటుతరంబగు వీరభటకోటి కొలువ
6
+ దేవతనగరి కేతెమ్మన్న, శౌరి
7
+ కావార్త యెఱిఁగింప నవ్విప్రుఁ బంచె,
8
+ ఆమెలఁత కాల్నడ నరుదెంచె నప్పు
9
+ డేమని వర్ణింతు! ఇభపురాధీశ!
10
+ అడుగడుగిడుచోట నవనియంతయును
11
+ గడునొప్పు పద్మరాగశ్రీ వహించు;
12
+ ఉచ్చిఁతపండ్లతో నుల్లసంబాడు
13
+ నచ్చపలాక్ష్మికి నంగుష్ఠచయము;
14
+ వదనఖద్యుతు లనుపచరించు నెలవుఁ
15
+ గదియ మౌక్తికములుఁ గట్టి నట్లుండు;
16
+ తనరు గచ్ఛపనిధిద్వయ మింతిపాద
17
+ వనజాతములమీఁద వ్రాలెనో యనఁగ;
18
+ గమనజాడ్యము శుభాకరమును నగుచుఁ
19
+ గమనీయలీల మీఁగాళ్ళొప్పు సతికి;
20
+ పగడంపుఁదీగెలపంక్తులో యనఁగ
21
+ మగువకు నొప్పారు మడిమెల తీరు;
22
+ తరిసేయు మదనుపుత్తళికలుఁ దమకు
23
+ నెరతనంబంచును నెరసులు వలుకు
24
+ గనకకాహళకాంతిఁ గడచి చూపరకుఁ
25
+ గనుపట్టు కాంతజంఘలు దన్యమగుచు;
Dvipada-Bagavathamu/page_0115.txt ADDED
@@ -0,0 +1,25 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ కదళికాయుగళంబు కటిభార మొప్ప
2
+ నదనపుఁగరికరయమళంబు పసిఁడి
3
+ తొలచి నిలిపిన భంగిఁ దొలుకాడు రుచులఁ
4
+ గలకంఠి కొప్పారుఁ గరభోరుయుగము;
5
+ వెడవిల్తుఁ గల్యాణవేదిక తోడఁ
6
+ దడఁబడు కొంత నితంబభారంబుఁ
7
+ గరిశిరస్పధియై కనకపుపెట్టె;
8
+ వరసైకతంబనా వలనొప్పు కటియు;
9
+ కటిసూత్రఘంటికాఘనరత్నకాంతి
10
+ పటిమతో నొప్పారు పసిఁడిదువ్వలువ;
11
+ కామునికై పుత్రకామేష్టి వెల్వ
12
+ హోమగుండముభంగి నొప్పారు నాభి;
13
+ చలదలపల్లవసంకాశమగుచు
14
+ పలుచనై కనుపట్టు భామిని కడుపు;
15
+ అలమిన ముష్టిలో నడఁగి చూపరకు
16
+ కలదు లేదను వాదుఁ గలిగించు నడుము;
17
+ ఆపూర్ణకుచవిహారాద్రులకిడిన
18
+ సోపానములభంగిఁ జూపట్టు వళులు;
19
+ హరినీలనాళంబులం దుద్భవించు
20
+ గురుహేమసరసిజకోరకద్వయము
21
+ కరణి నూఁగారుపై ఘనకుచద్వయము
22
+ కరమొప్పుఁ జూడ నా కామినీమణికి;
23
+ పసిఁడి మించుల మించు పణఁతి కక్షములు;
24
+ బిసవల్లి కలయోజ బెరయు చేఁదోయి;
25
+ కెందమ్మిరేకుల గెలిచి కెంపొదవు
Dvipada-Bagavathamu/page_0117.txt ADDED
@@ -0,0 +1,24 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ తొయ్యలిమోము చందురువెంటఁ దగులు
2
+ నయ్యహిభంగిఁ జెన్నగు నీలవేణి;
3
+ భావజన్ముని నెత్త పలకచందమున
4
+ నావామలోచనకసలారె వెన్ను;
5
+ కటకనూపురహారకంకణరత్న
6
+ పటలరోచుల దిశాభాగంబుఁ గప్పు
7
+ గరిరాజుగమనంబుగతి రాజతనయ
8
+ యరు డెంచే గౌరినిజాలయంబునకు
9
+ ఈభంగి సౌభాగ్య మెసఁగ నేతెంచి
10
+
11
+ యాభామినీమణి యంబిక కెఱఁగి
12
+ ఘనసారమృగమదగంధమాల్యములు
13
+ కనకపుష్పంబుల ఘనధూపదీప
14
+ నైవేద్యతాంబూలనవ్యోపచార
15
+ భావార్చనల సేసి ప్రణుతించి మ్రొక్కి,
16
+ “అంబిక! గౌరి! లోకాంబ! కల్యాణి!
17
+ అంబుజాసనవంద్య! ఆత్మసంచారి!
18
+ శంకరుమేనిలో సాబాలుఁగొన్న
19
+ శంకరి! పావకశశిభానునయన!
20
+ ఈ లగ్న మెడరుగానీక శ్రీవిభుని
21
+ వాలాయమున నాకు వరునిఁ గావింపు”
22
+ మని ప్రదక్షిణపూర్వమై భక్తి విప్ర
23
+ వనితలకును బెక్కువాయనా లిచ్చి
24
+ కంకణఝణఝణత్కారంబు లెసఁగ
Dvipada-Bagavathamu/page_0120.txt ADDED
@@ -0,0 +1,24 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ చటులఘోటకకరిస్యందనవీర
2
+ భటపాదహతుల భూభాగంబు వగులఁ
3
+ బేర్చినయలుకలఁ బృథులరావముల
4
+ నార్చుచు దాటిరా యాదవోత్తములఁ
5
+ గవిసియుఁ గార్చిచ్చుగతిఁ బెచ్చు పెఱిగి
6
+ యవిరళంబుగ వెంటనంటఁ దాఁకుటయు
7
+ నాయడ బలభద్రుఁ డనుజన్ముఁ జూచి
8
+ “యీయింతయును నీవు యిందుండ నేల?
9
+ కొని వేగ మరుగు మీకూటపమూఁక
10
+ నణఁచి యేనునుఁగూడ నరుదెంతు" ననుచుఁ
11
+
12
+ గమలాక్షు ననిచి యక్కామపాలుండు
13
+ సమరసన్నుద్ధుఁడై చతురత నిలిచి
14
+ యాదవనికరంబు యత్యుగ్రసింహ
15
+ నాదంబుతోఁ దూర్యనాదంబు లొలియఁ
16
+ దలకొని యొండొంటిఁ దార్కొని మంట
17
+ లొలుక కైదువల సముద్ధతిఁ జూపి
18
+ యరదంబు నరదంబు నశ్వ మశ్వంబు
19
+ కరిఁ గరి కాల్వురుఁ గాల్వురుఁ దొడరి
20
+ యీరసంబున ముట్టి యిరువాఁగు గిట్టి
21
+ పోరాడ సురుల కద్భుతముగా నిగుడి
22
+ విలుకాండ్లు గవిసి దోర్వీర్యయంబు మెఱసి
23
+ పలునారసములు నిర్భరముగా నేయ
24
+ నలువురు నేవుర నలినుచ్చిపారఁ
Dvipada-Bagavathamu/page_0121.txt ADDED
@@ -0,0 +1,25 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ దలలొక్క పెట్టు భూతలముల రాల్చి
2
+ రథములఁ జెక్కి సారథుల నుక్కడఁచి
3
+ రథరథ్యనివహంబు రణభూమిఁ గూల్చి
4
+ కరులఁ జెండాడి పుష్కరములఁ దునిమి
5
+ హరుల విదారించి యాశ్వికోత్తములఁ
6
+ బ్రాణంబు లెడలించి బాణాసనములఁ
7
+ దూణీరములఁ ద్రుంచి దొరల గీటణఁచి,
8
+ వారు వీరన కెల్లవారికాయములఁ
9
+ దోరంపురుధిరంబుఁ దోఁగించిరంత;
10
+ దొంకెనపోటులు దూరఁగానాటి
11
+ బింకంబు లెడలక బెరయు వీరులును
12
+ గోరీ పెక్కండ్రను గుదులుగాఁ గ్రుచ్చి
13
+ పేరు వాడునట్టి బిరుదులువారు;
14
+ తల త్రెవ్విపడియు ముందఱఁ దమ్ముఁబొడుచు
15
+ బలియులనొప్పించి పడియెడువారు;
16
+ శిరములు వగిలినఁజిందెలఁగట్టి
17
+ సరకు సేయకఁ బోరుసల్పు లావరులు;
18
+ దొఱసిన వేటాడితునుకలుగాఁగ
19
+ యఱిముఱిఁ దెగవ్రేసి యార్చురాహుతులు;
20
+ సామజంబులనడుము సరిగ్రుచ్చిపారఁ
21
+ దోమరంబుల వ్రేసి త్రుళ్లు మావుతులు;
22
+ లవణిసారించి పల్లమును గుఱ్ఱమును
23
+ రవుతును జిదియ భోరన మ్రోచువారు;
24
+ ఱోలుచు నెత్తురుఱొంపిలో మునిఁగి
25
+ కాలార్పనేరని కరితురంగములు;
Dvipada-Bagavathamu/page_0122.txt ADDED
@@ -0,0 +1,25 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ దారగండులు వడి ధరణిపై వ్రాలు
2
+ తేరులు వెసనోళ్లుఁ దెఱచు పీనుగలుఁ
3
+ జదిసిన కండలు జదుపంబులైన
4
+ మెదడు మిడమిడమని మిడుకు బొమ్మలును
5
+ నవ్వెడి మోములు నలినంగకములు
6
+ విఱిగినవిండ్లును విటతాటమైన
7
+ వుఱియలతో నొప్పు బోమిడికంబులును;
8
+ కరవాలకంకణకలితమై పడిన
9
+ కరములుఁ తుమురైన కాండకుంతములు;
10
+ పఱియలై కూలిన పలకలు నాజిఁ
11
+ దఱచుగాఁ దెగిపడ్డ ధవళచామరలు;
12
+ నాడాడకుఁజింపులై దూర మెడలి
13
+ చూడనక్కజమైన జోడుపక్కెరలు;
14
+ నెత్తురు నెఱచియు నెరి బొట్టకోలఁ
15
+ గుత్తుకబంటిగాఁ గ్రోలు భూతములుఁ;
16
+ గొడపంపుఁగంకాళి ఘోరనాదముల
17
+ వెడయాట లాడెడు వేతాళములును;
18
+ వలనొప్పు భూతేశువక్షంబు వోలె
19
+ లలితకపాలమాలాయుక్తమగుచు
20
+ సమధికదానఢ్య సరసంబెవోలె
21
+ కమనీయమార్గణఘనఘోష మగుచుఁ
22
+ గలగొన వైశాఖకాలంబె వోలె
23
+ నలినొప్పు బాణాసనధ్వస్తమగుచు
24
+ విహితమహారణ్యవిభవంబె వోలె
25
+ బహుఖగనాగసంప్రస్థితంబగుచు
Dvipada-Bagavathamu/page_0125.txt ADDED
@@ -0,0 +1,23 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ నని గుణధ్వని సేసి యాఱుబాణములుఁ
2
+ దనువుఁ గీలింప దానవాంతకుఁడు
3
+ నల్లన నవ్వుచు నతనికేతనము
4
+ విల్లునుద్రుంచిన వేరొక్క ధనువుఁ
5
+ గొని బాణవర్షంబుఁ గురియఁగ శౌరి
6
+ కనిసి తేజుల సూతుఁ గీటణఁగించి
7
+ దనువుఁ ద్రుంచుటయు, నాతఁడు వమ్మువోక
8
+ ఘనమైన ఖేటకఖడ్గంబుఁ గొనుచు
9
+ హరితేరిపైకి రయంబునఁ గదిసి
10
+ కరవాలమున వేయఁ గమలాక్షుఁ డతని
11
+ పలుకయు వాలును బాణాష్టకమునఁ
12
+ దృణమాత్రమునఁ ద్రుంచి ధృతిమూర్చ వుచ్చి
13
+
14
+ తనపాగఁగొని ధ్వజస్తంభంబుతోడ
15
+ మెలివట్టి మెడగట్టి మిడమిడఁ జూడ
16
+ నలుకమైఁ బేర్చి పెద్దమ్మున శిరముఁ
17
+ బలుపున జుట్టును బాఱఁగ గొఱిగి
18
+ యునిచిన భేదంబు నుమ్మలికంబుఁ
19
+ బెనుపాటు గదుర నిర్విణ్ణుఁడై యున్న
20
+ యన్నను గనుగొని యడలు దీపింపఁ
21
+ గన్నుల నీరొల్క గద్గద యగుచు
22
+ మొగము వెల్వలబార ముదమున సిగ్గు
23
+ వగయుఁ దోఁపఁగ నిల్చి వైదర్భి పలికె.