Datasets:

Modalities:
Image
Text
Formats:
text
Languages:
Telugu
DOI:
Libraries:
Datasets
License:
AlbertoChestnut commited on
Commit
91c9f23
·
verified ·
1 Parent(s): aa2a7bf

Add files using upload-large-folder tool

Browse files
This view is limited to 50 files because it contains too many changes.   See raw diff
Files changed (50) hide show
  1. Andhraveerulupar025903mbp/meta.json +299 -0
  2. Andhraveerulupar025903mbp/page_0004.txt +5 -0
  3. Andhraveerulupar025903mbp/page_0005.txt +3 -0
  4. Andhraveerulupar025903mbp/page_0006.txt +5 -0
  5. Andhraveerulupar025903mbp/page_0007.txt +3 -0
  6. Andhraveerulupar025903mbp/page_0008.txt +3 -0
  7. Andhraveerulupar025903mbp/page_0009.txt +3 -0
  8. Andhraveerulupar025903mbp/page_0011.txt +1 -0
  9. Andhraveerulupar025903mbp/page_0012.txt +3 -0
  10. Andhraveerulupar025903mbp/page_0013.txt +3 -0
  11. Andhraveerulupar025903mbp/page_0014.txt +3 -0
  12. Andhraveerulupar025903mbp/page_0015.txt +1 -0
  13. Andhraveerulupar025903mbp/page_0016.txt +3 -0
  14. Andhraveerulupar025903mbp/page_0021.txt +3 -0
  15. Andhraveerulupar025903mbp/page_0022.txt +5 -0
  16. Andhraveerulupar025903mbp/page_0024.txt +3 -0
  17. Andhraveerulupar025903mbp/page_0025.txt +3 -0
  18. Andhraveerulupar025903mbp/page_0026.txt +3 -0
  19. Andhraveerulupar025903mbp/page_0027.txt +3 -0
  20. Andhraveerulupar025903mbp/page_0031.txt +1 -0
  21. Andhraveerulupar025903mbp/page_0033.txt +3 -0
  22. Andhraveerulupar025903mbp/page_0034.txt +1 -0
  23. Andhraveerulupar025903mbp/page_0035.txt +3 -0
  24. Andhraveerulupar025903mbp/page_0038.txt +1 -0
  25. Andhraveerulupar025903mbp/page_0039.txt +1 -0
  26. Andhraveerulupar025903mbp/page_0040.txt +3 -0
  27. Andhraveerulupar025903mbp/page_0041.txt +3 -0
  28. Andhraveerulupar025903mbp/page_0042.txt +1 -0
  29. Andhraveerulupar025903mbp/page_0043.txt +1 -0
  30. Andhraveerulupar025903mbp/page_0044.txt +3 -0
  31. Andhraveerulupar025903mbp/page_0045.txt +1 -0
  32. Andhraveerulupar025903mbp/page_0046.txt +3 -0
  33. Andhraveerulupar025903mbp/page_0047.txt +1 -0
  34. Andhraveerulupar025903mbp/page_0048.txt +3 -0
  35. Andhraveerulupar025903mbp/page_0049.txt +1 -0
  36. Andhraveerulupar025903mbp/page_0050.txt +3 -0
  37. Andhraveerulupar025903mbp/page_0052.txt +3 -0
  38. Andhraveerulupar025903mbp/page_0055.txt +3 -0
  39. Andhraveerulupar025903mbp/page_0059.txt +1 -0
  40. Andhraveerulupar025903mbp/page_0060.txt +3 -0
  41. Andhraveerulupar025903mbp/page_0061.txt +3 -0
  42. Andhraveerulupar025903mbp/page_0064.txt +3 -0
  43. Andhraveerulupar025903mbp/page_0065.txt +5 -0
  44. Andhraveerulupar025903mbp/page_0066.txt +1 -0
  45. Andhraveerulupar025903mbp/page_0067.txt +5 -0
  46. Andhraveerulupar025903mbp/page_0068.txt +1 -0
  47. Andhraveerulupar025903mbp/page_0069.txt +3 -0
  48. Andhraveerulupar025903mbp/page_0070.txt +5 -0
  49. Andhraveerulupar025903mbp/page_0071.txt +1 -0
  50. Andhraveerulupar025903mbp/page_0072.txt +3 -0
Andhraveerulupar025903mbp/meta.json ADDED
@@ -0,0 +1,299 @@
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
1
+ {
2
+ "status": "done",
3
+ "saved": 97,
4
+ "total_pages": 143,
5
+ "filename": "Andhraveerulupar025903mbp.pdf",
6
+ "pages": {
7
+ "4": {
8
+ "quality": 4
9
+ },
10
+ "5": {
11
+ "quality": 4
12
+ },
13
+ "6": {
14
+ "quality": 4
15
+ },
16
+ "7": {
17
+ "quality": 4
18
+ },
19
+ "8": {
20
+ "quality": 4
21
+ },
22
+ "9": {
23
+ "quality": 4
24
+ },
25
+ "11": {
26
+ "quality": 4
27
+ },
28
+ "12": {
29
+ "quality": 4
30
+ },
31
+ "13": {
32
+ "quality": 4
33
+ },
34
+ "14": {
35
+ "quality": 4
36
+ },
37
+ "15": {
38
+ "quality": 4
39
+ },
40
+ "16": {
41
+ "quality": 4
42
+ },
43
+ "21": {
44
+ "quality": 4
45
+ },
46
+ "22": {
47
+ "quality": 4
48
+ },
49
+ "24": {
50
+ "quality": 4
51
+ },
52
+ "25": {
53
+ "quality": 4
54
+ },
55
+ "26": {
56
+ "quality": 4
57
+ },
58
+ "27": {
59
+ "quality": 4
60
+ },
61
+ "31": {
62
+ "quality": 4
63
+ },
64
+ "33": {
65
+ "quality": 4
66
+ },
67
+ "34": {
68
+ "quality": 4
69
+ },
70
+ "35": {
71
+ "quality": 4
72
+ },
73
+ "38": {
74
+ "quality": 4
75
+ },
76
+ "39": {
77
+ "quality": 4
78
+ },
79
+ "40": {
80
+ "quality": 4
81
+ },
82
+ "41": {
83
+ "quality": 4
84
+ },
85
+ "42": {
86
+ "quality": 4
87
+ },
88
+ "43": {
89
+ "quality": 4
90
+ },
91
+ "44": {
92
+ "quality": 4
93
+ },
94
+ "45": {
95
+ "quality": 4
96
+ },
97
+ "46": {
98
+ "quality": 4
99
+ },
100
+ "47": {
101
+ "quality": 4
102
+ },
103
+ "48": {
104
+ "quality": 4
105
+ },
106
+ "49": {
107
+ "quality": 4
108
+ },
109
+ "50": {
110
+ "quality": 4
111
+ },
112
+ "52": {
113
+ "quality": 4
114
+ },
115
+ "55": {
116
+ "quality": 4
117
+ },
118
+ "59": {
119
+ "quality": 4
120
+ },
121
+ "60": {
122
+ "quality": 4
123
+ },
124
+ "61": {
125
+ "quality": 4
126
+ },
127
+ "64": {
128
+ "quality": 4
129
+ },
130
+ "65": {
131
+ "quality": 4
132
+ },
133
+ "66": {
134
+ "quality": 4
135
+ },
136
+ "67": {
137
+ "quality": 4
138
+ },
139
+ "68": {
140
+ "quality": 4
141
+ },
142
+ "69": {
143
+ "quality": 4
144
+ },
145
+ "70": {
146
+ "quality": 4
147
+ },
148
+ "71": {
149
+ "quality": 4
150
+ },
151
+ "72": {
152
+ "quality": 4
153
+ },
154
+ "73": {
155
+ "quality": 4
156
+ },
157
+ "76": {
158
+ "quality": 4
159
+ },
160
+ "77": {
161
+ "quality": 4
162
+ },
163
+ "78": {
164
+ "quality": 4
165
+ },
166
+ "79": {
167
+ "quality": 4
168
+ },
169
+ "80": {
170
+ "quality": 4
171
+ },
172
+ "84": {
173
+ "quality": 4
174
+ },
175
+ "86": {
176
+ "quality": 4
177
+ },
178
+ "87": {
179
+ "quality": 4
180
+ },
181
+ "88": {
182
+ "quality": 4
183
+ },
184
+ "89": {
185
+ "quality": 4
186
+ },
187
+ "90": {
188
+ "quality": 4
189
+ },
190
+ "91": {
191
+ "quality": 4
192
+ },
193
+ "92": {
194
+ "quality": 4
195
+ },
196
+ "95": {
197
+ "quality": 4
198
+ },
199
+ "96": {
200
+ "quality": 4
201
+ },
202
+ "97": {
203
+ "quality": 4
204
+ },
205
+ "98": {
206
+ "quality": 4
207
+ },
208
+ "99": {
209
+ "quality": 4
210
+ },
211
+ "102": {
212
+ "quality": 4
213
+ },
214
+ "103": {
215
+ "quality": 4
216
+ },
217
+ "104": {
218
+ "quality": 4
219
+ },
220
+ "106": {
221
+ "quality": 4
222
+ },
223
+ "108": {
224
+ "quality": 4
225
+ },
226
+ "109": {
227
+ "quality": 4
228
+ },
229
+ "113": {
230
+ "quality": 4
231
+ },
232
+ "114": {
233
+ "quality": 4
234
+ },
235
+ "115": {
236
+ "quality": 4
237
+ },
238
+ "117": {
239
+ "quality": 4
240
+ },
241
+ "118": {
242
+ "quality": 4
243
+ },
244
+ "119": {
245
+ "quality": 4
246
+ },
247
+ "120": {
248
+ "quality": 4
249
+ },
250
+ "121": {
251
+ "quality": 4
252
+ },
253
+ "123": {
254
+ "quality": 4
255
+ },
256
+ "125": {
257
+ "quality": 4
258
+ },
259
+ "127": {
260
+ "quality": 4
261
+ },
262
+ "128": {
263
+ "quality": 4
264
+ },
265
+ "129": {
266
+ "quality": 4
267
+ },
268
+ "130": {
269
+ "quality": 4
270
+ },
271
+ "133": {
272
+ "quality": 4
273
+ },
274
+ "134": {
275
+ "quality": 4
276
+ },
277
+ "137": {
278
+ "quality": 4
279
+ },
280
+ "138": {
281
+ "quality": 4
282
+ },
283
+ "139": {
284
+ "quality": 4
285
+ },
286
+ "140": {
287
+ "quality": 4
288
+ },
289
+ "141": {
290
+ "quality": 4
291
+ },
292
+ "142": {
293
+ "quality": 4
294
+ },
295
+ "143": {
296
+ "quality": 4
297
+ }
298
+ }
299
+ }
Andhraveerulupar025903mbp/page_0004.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ సహృదయులారా ?
2
+
3
+ ఆంధ్రవీరరత్నావళి యను పేరుతో ఆంధ్రులందు బ్రసిద్ధులైన లోకోత్తర పురుషుల జీవితములు కథలుగ వ్రాసి బాలురకు పద్యార్థిదశలోనే మాతృదేశాభిమానము గలిగించుట యుచితమని యీ పుస్తకమును వ్రాయ దొరకొంటిమి. మాయుద్యమము వే. సత్యనారాయణమూర్తి గారి వలన విని వేంకటరాం అండుకో వారు తాము స్వయముగ బ్రకటించి కొందుమనియు ద్వరలో బూర్తిచేయుమనియు, బ్రోత్సహించిరి. వారి యాదరణము నూతగా గొని ఉన్నత పాఠశాలయందలి మా పండిత పదవి యందలి యనుభవమును బురస్కరించుకొని యీ చరిత్ర కథాగ్రంథమును రచించితిమి.
4
+
5
+ విస్తృతమగు నాంధ్రదేశమునందు బలువురు మహనీయు లుద్భవించిరి. వారి త్యాగదీక్ష, కౌశలము ప్రపంచమునందలి యేజాతీయ నాయకునకు దీసిపోవదనుట కీ చిన్నిపొత్తము సాక్ష్యము గాగలదు. ఆంధ్రవీరుల వికాసము, రాజ్యవిస్తృతి. పతనము క్రమముగా నీపుస్తకమునందు దెలుపబడినవి. ఆంధ్రుల చరిత్రము చాల వఱకు బురాణ యుగమున నజ్ఞాతముగ గున్నదనుటకు జాణక్యుని చరిత్రమును దార్కాణముగ దీసికొన వచ్చును. తరువాత నాంధ్రులు జాతీయతా ధర్మ నిర్వహణ ప్రవీణులై పొందిన మహత్తరమగు నభ్యున్నతికి గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్రము దృష్టాంతము. తరువాత బశ్చిమ చాళుక్యులు, రాష్ట్రకూటులు తమలో దాము పోరాడుకొనుటయు జోడులు విజృంభించుటయు జరిత్ర విశేషములు. వీనిని గమనించితిమేని అసల నాంధ్రదేశము నంతయు నేకధాటిగ బాలించిన వీరుడు కులోత్తుంగ ఛోళదేవుడు. ఈతని యనంతరము ఆంధ్రదేశమును జీలికలు గావించుకొని
Andhraveerulupar025903mbp/page_0005.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ చిన్న చిన్న రాజులు పాలించుటయు బ్రజలలో స్వాతంత్ర్యభావ ముదయించి తమలో దాము పోరాడు కొనసాగిరనుటకు బాలచంద్రుడు ఖడ్గ తిక్కనల చరిత్ర ముదాహరణముగ గొననగును. చీలిపోయిన యాంధ్ర తేజమును గేంద్రీకరించి స్వతంత్రమగు సామ్రాజ్యమును బ్రజా క్షేమకరముగా బాలించిన మహోదారుడు ప్రతాపరుద్ర చక్రవర్తి. ఈతని కాలముననే సమస్త కళలు, భాష ఆంధ్రజాతీయిత అభివృద్ధికి వచ్చినవి. పరాధీన దుర్దశ బ్రాప్తింపవలసి యుండుటచే నీ చక్రవర్తి బంధీకృతుడు గావలసి వచ్చినది. ఈయన యనంతరము దేశీయువీరులు చిన్న చిన్న రాజ్యములు స్థాపించి యెటుల నభివృద్ధిమార్గముల నన్వేషించిరో బ్రాహ్మణు వీరు లెటుల సామ్రాజ్య నిర్మాణమునకు దోడుపడిరో తెలిసికొనుటకు హరిహరరాయల బుక్కరాయల మాధవవిద్యారణ్యుల చరిత్ర సంగ్రహము సాధనము కాగలదు. ఆంధ్రసామ్రాజ్యము పునరుద్ధరించి తనకత్తి కెదురులేకుండ బోయినతావున నెల్ల జయము నొంది ద్రవిడాంధ్రోత్కలు దేశములను లోగొని ఆంధ్రదేశమును యపనులపాలుగాకుండ గాపాడినది శ్రీకృష్ణదేవరాయలు.
2
+
3
+ ఈ మహాత్ముని వాజ్మయసేవ, దేశసేవ, మాతృదేశాభిమానము నద్వితీయము. సమగ్రమగు నాంధ్రత్వ మంతయు నితనియెడ నిండి నిబిడీకృత మయ్యెను. ఆంధ్రుల పతనమునకు సూచనలు కృష్ణదేవరాయల తుది కాలము నుండియే యేర్పడెను. తరువాత నేకామిషవాంఛతో హిందూ మహమ్మదీయులకు రాజకుటుంబమునకు గలతలు సంభవించెను. అన్నింటిని సవరించి రాజ్యము పునరుద్ధరించిన వాడు రామరాజు. పూర్వులకంటె నీత డత్యున్నత వహించెను గాని యీతడు ఘోర మృత్యు ముఖమున నదృశ్యు డగుటతో నాంధ్రుల సంపద, పెంపు, ఉన్నతి నసించెను. ఇవియే పరాధీనతకు మొదటి దినములు. తరువాత నెంత వీరుడేని స్వతంత్రరాజ్యము స్థాపింప వీలు లేకపోవుటయు బరస్పరాసూయలు ప్రజల
Andhraveerulupar025903mbp/page_0006.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ టయు ధర్మ సంస్థాపనార్థము వీరు లాత్మార్పణము గావించుటయు యాచశూరుని చరిత్రమువలన దెలియును. అంతటితో ఆంధ్రుల స్వాతంత్ర్య వికాసము కడబట్టి చిన్న చిన్న జమీనులతో దృప్తిపడవలసి వచ్చినది. మొగలు రాజ్యములలో నొకటగు గోలకొండ రాజ్యమునందు మంత్రులుగ నుండి ఆర్షధర్మములను యవనులు ద్రోహము గావింపకుండ జెల్లెలి కట్టవలె నడుపడి మంత్రిపదవిని నామమాత్రముగా నుంచుకొని ఆంధ్రదేశము నేక హేలగా బాలించిన యక్కన్న మాదన్నలనాడు మఱల నాంధ్ర వికాసము తలయెత్తినది. దురాగతులగు రాజద్రోహులచే మిగుల ఘోరముగా అక్కన్న మాదన్న లేనాడు గోలకొండ రాజవీధిలో జంప బడిరో ఆంధ్రజాతీయ పతనము దర్శింపజాలక యాత్మ రక్తముతో నాంధ్రమాత పదము లభిషేకించి యేనాడు అక్కన్న మాదన్నలు త్యాగము ప్రకటించిరో యానాటితో నాంధ్రులు చరిత్రశరణ్యులై పూర్వ వికాసము నంతయు గోలుపోయిరనియు నాటినుండి స్వతంత్ర రాజ్యస్థాపకుడగు వీరుడు జనింప లేదనియు నెఱుంగనగును.
2
+
3
+ ఈవిధముగా గ్రీస్తుశకము పూర్వము నుండి పదునెనిమిదవ శతాబ్దము వఱకు గల సంగ్రహచరిత్ర యీగ్రంథమున నిముడ్పబడెను. ప్రకాశకు నీ పొత్తములు ఆంధ్రవీర రత్నావళి అనుటకంటె ఆంధ్రవీరు లనుట యుక్తమని పేరు మార్చుటలో స్వతంత్రించిరి. ఈ చిన్ని పుస్తకము ఆంధ్రుల హృదయమున నాంధ్రప్రతిభను ద్యోతకము చేయునేని ధన్యులము. గ్రంథము గ్రాంథికభాషలో జరిత్రానుకూలముగ వ్రాసితిమని పాఠకులకు విన్న వించుచున్నారము.
4
+
5
+ _______
Andhraveerulupar025903mbp/page_0007.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ భరతఖండమునందలి దేశములన్నిటెలో మగధ మిగుల బ్రసిద్ధమైనది. మగధదేశము చిరకాలము వీరాధివీరులు, పరాక్రమశాలురు, ధర్మస్వరూపులు నగు రాజులకు రాజధానిగ నుండెను. పాండవులను శ్రీకృష్ణుని ఉఱ్ఱూతలూపిన వీరవతంసుడగు జరాసంధుని రాజధాని యీ మగధదేశమందలి గిరివ్రజము. దీనిచెంతనే బింబిసారుడు రాజగృహ మను నగరమును నిర్మించెను. తరువాత గొంతకాలమునకు అజాతశత్రుడు రాజ్యమునకువచ్చి గంగాతీరమునందున్న పాటలియను నొక పల్లెచెంత గొప్ప దుర్గమును గట్టెను. అతని మనుమడగు ఉదయనుడు పాటలీదుర్గముచెంత పాటలీపుత్రమను గొప్పనగరము నిర్మించెను.
2
+
3
+ పాటలీపుత్రము గంగ, శౌణ, గోగ్ర మొదలగు నదులు సంగమస్థలము చెంత నిర్మింపబడెను. బుద్ధాది మహానుభావు
Andhraveerulupar025903mbp/page_0008.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ లచే నీ పాటలీపుత్రము పవిత్ర మొనర్పబడియెను. మన కథాకాలమున నీ రాజ్యమును మహాపద్మనందుడు తన యెనమండ్రు కుమారుల సాయముతో బాలించుచుండెను. మహాపద్మునకు ఇళ, ముర యను నిరువురు రాణులు గలరు. ఇళ యందు ఎనిమిదిమంది కుమారులు జనించిరి. మహాపద్మునితో గలిపి వీరిని నవనందు లని యాకాలమున బేర్కొనుచుండిరి. రెండవ భార్యయగు మురయందు జన్మించిన వాడు చంద్రగుప్తుడు. తేజశ్శాలియు బుద్ధిమంతుడు నగు చంద్రగుప్తునియెడ సవతియన్న లెనమండ్రును పగ బూని యెటులేని మట్టుపెట్ట జూచుచుండిరి. మహాపద్ముడు ముదుసలియగుట చేతను జంద్రగుప్తుడు మిగుల జిన్నవాడగుట చేతను, రాజ్యభారమంతయు ఎనమండ్రునందులకు గైవసమయ్యెను. చంద్రగుప్తుని మట్టు పెట్ట నెన్నియో కపటోపాయములను బన్నుచు నందులెనమండ్రు దురాలోచనము జేయుచుండిరి. చంద్రగుప్తుడు మిగుల శ్రమలందుచు దైవ సహాయమున నెటులో యాపదనుండి గట్టెక్కుచు గాలయాపనము దినమొక యేడుగ జేయుచుండెను. కడకు జంద్రగుప్తుడు పొట్టకూటికి వెరవు చాలక సత్రాధికారిగనుండి దీనుడై కాలము గడుపుచుండెను.
2
+
3
+ నందు లహంకరించి మహామంత్రియు నేర్పరియునగు రాక్షసుని మాటనేని పాటింపక మిగుల స్వతంత్ర భావముతో వర్తించుచుండిరి. ఒకదినమున చాణక్యు డను
Andhraveerulupar025903mbp/page_0009.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ యువకుడు పండితవతంసుడు నందరాజుల సభకువచ్చి యటగల యొక యున్నతాసనమున నాసీనుడై యుండెను. నందు లచటకువచ్చి యుత్తమ పీఠమునందున్న యాపేదబాపని మిగుల దిరస్కారభావముతో జూచి సింహాసనమునుండి పడ లాగిరి. అమాత్యరాక్షసుం డిది యక్రమమనియు బండితులు పూజనీయులనియు బోధించెను కాని లాభములేకపోయెను. సిగముడి వీడ నున్న తాసనమునుండి లాగబడిన చాణక్యుడు నందులను గోపముతో దేఱి పాఱజూచి "ఓ నందాధము లారా! బహుజనమధ్యమునందు నన్నిటల అవమానించితిరి. మిమ్మిటులే సింహాసనమునుండి లాగి మీతలలను నరికి మీచే నూడ దీయబడిన యీ తలవెండ్రుకల ముడి వేసు కొనను" అని సభామందిరమును వదలి వెడలిపోయెను.
2
+
3
+ చాణక్యు డిటుల గోపించి పోవుటజూచి చంద్రగుప్తుడు మాఱుత్రోవను బోయి యొక యేకాంత ప్రదేశమున జాణక్యుని గలిసికొని సాగిలి నమస్కరించి నందాదులచే దానొందు నవస్థల దెలిపి తన్నను గ్రహింపుమని వేడుకొనెను. చంద్రగుప్తుని లేవనెత్తి చాణక్యు డాదరించి నందరాజ్యమునకు నిన్ను బట్టాభిషిక్తునిగావించుట నారెండవ ప్రతిజ్ఞయని నాడు మొదలు చంద్రగుప్తుని తనయొద్దనే యుంచుకొని నందకుల నిర్మూలమునకై ప్రయత్నములు చేయుచుండెను.
Andhraveerulupar025903mbp/page_0011.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ సర్వశాస్త్ర పారంగతుడు, రాజనీతివిదుడు, దూరాలోచనపరుడు నగు చాణక్యుడు తన మిత్రుడును సహాధ్యాయయు నగు నిందుశర్మను సమీపించి జరిగిన యంశము తన ప్రతిజ్ఞయు దెలిపి 'నీ వెటులేని క్షపణక వేషముతో అభిచారిక విద్యచే నందులను, రాక్షసుని లోగొని యచటి రహస్యములను చారులచే నెఱింగించుచు, జంద్రగుప్తునకు నందరాజ్యమును ధారవోయుటకు దోడ్పడు' మని కోరెను. ఇందుశర్మ యటులె యని యంగీకరించి నందుల చెంతకేగి చెలిమిగడించి రాక్షసుని చెంత బ్రాపకము నార్జించి తలలో నాలుకవలె గలిసిమెలసి యుండి రాజ్యరహస్యము లన్నియు నెప్పటికప్పుడు చాణక్యున కెఱింగించుచుండెను. చాణక్యుడు చంద్రగుప్తుని వెంటగొని హిమాలయపర్వత ప్రాంతమునందున్న యరణ్య భాగములను బాలించుపర్వతరాజు చెంత జేరి యతని స్నేహమును సంపాదించి నందసంహారమున కాతని బ్రోత్సహించెను. గెలిచిన యెడల నందరాజ్యమునందు సగము పర్వతరాజునకొసంగుటకు గూడ జాణక్యుడు వాగ్దానము గావించెను. జయించితిమేని జాణక్యుని జంద్రగుప్తుని వంచించి నందరాజ్యము నంతయు హరింప వచ్చునని పర్వతరాజు తలంచి సామంతుల యొద్దనుండి మిత్రుల యొద్దనుండి యసంఖ్యాకమగు సైన్యమును రప్పించి చాణక్యుడు పెట్టిన సంమూర్తమున నందరాజ్యముపైకి దా వెడలెను. పర్వతరాజు వెంట నాతని సైన్యమె కాక శక, యవన
Andhraveerulupar025903mbp/page_0012.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ కిరాత, కాంభోజ, పారసీక, బాహ్లి కాది సైన్యములుగూడ వచ్చెను. చాణక్యుడు, చంద్రగుప్తుడు సైన్యమును మూడు భాగములుగా భాగించి తాము చెరియొక భాగమును దీసికొని గండకీ ప్రాంతమునకు బోయి పాటలీపుత్రమును ముట్టడించిరి. పర్వతరాజు కడమ మూడవభాగమును వెంటగొని గంగా శోణా సంగమప్రదేశము చెంత పాటలీపుత్రమును ముట్టడించెను. ఇందుశర్మ నందులనందఱ జీలదీసి చాణక్యునకు మోసముగా బట్టియిచ్చెను. చాణక్యుడు ఎనమండ్రు నందులను సంహరించి తన మొదటిప్రతిజ్ఞను నిర్వహించి యప్పుడు తల వెండ్రుకలను ముడివైచికొనెను.
2
+
3
+ నందుల నాశము జూచి మంత్రియగు రాక్షసుడు మిగుల జింతించి చీలిన సైన్యమునంతయు గూడబఱచి పర్వతరాజు సైన్యముతో బాటలీపుత్రసైన్యమును భయంకరముగా యుద్ధము జేయించెను. నందరాజులమరణము విన్న రాక్షసుల సైన్యము కొంతసేపటికి బర్వతరాజు సైన్యమునకు లొంగిపోయెను. పాటలీపుత్రమునందు అమాత్య రాక్షసున కెక్కుడు పలుకుబడి యుండుటచేతను వెంటనే రాజ్యమున బ్రవేశించినచో జంద్రగుప్తునకైనను దనకైనను నపాయము గలుగవచ్చుననియు బర్వతరాజు నందరాజ్యమంతయు దానే లోగొను నేమోయనియు సంశయించి చాణ
Andhraveerulupar025903mbp/page_0013.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ క్యుడు జయించిన రాజ్యమున బ్రవేశింప నగరబహిర్భాగమున బరిజనముతో విడిసి యుండెను.
2
+
3
+ రాక్షసు డెటులేని జంద్రగుప్తుని జాణక్యుని జంప దలంచి మాయోపాయములు దక్క వేఱు గతిలేదని యొక యుపాయము పన్నెను. రాక్షసు డొకబాలికను విస మలవాటు చేసి పెంచుచుండెను. ఆబాలిక విసము జీర్ణించుకొనుట కలవాటుపడి యౌవనవతియై సర్వాంగసుందరియై యుండెను. ఆసుందరి తాకినయెడ విసముసోకి మనుజులు మరణింతురు. ఆమెను బిలువనంపి రప్పించి తనచెంత విశ్వాసపాత్రునివలె క్షపణకవేషథారియై వర్తించుచు జీవసిద్ధియను పేరుతోనున్న ఇందుశర్మను బిలిచి యీబాలికను జంద్రగుప్తునకు నేను సమర్పించితి ననియు బరిగ్రహించి మమ్ముల ననుగ్రహింపు మనియు జెప్పి పంపెను. జీవసిద్ధి 'చిత్త మటులనే కావింతు'నని విసకన్యను వెంటగొని చాణక్యునికడకు బోయి జరిగిన యుదంత మంతయు రహస్యముగా దెలిపి విషకన్యను సమర్పించెను. నందరాజ్యము నంతయు హరింపనెంచిన పర్వతరాజును జంప నిదియ తరుణమని చాణక్యుడు విషకన్యను బర్వతరాజునొద్దకు బంపెను. కామాతురుడగు పర్వతరాజు విషకన్యనుజూడగనే యొడలుప్పొంగి కౌగిలించుకొని విషము తల కెక్కి మరణించెను. రాక్షసుని యాన యడుగంటెను. నందరాజ్యమునంతయు హరింపదలంచిన పర్వతేశ్వరుడు గతించుట చాణక్యుని సంకల్పమునకు సర్వవిధముల సహాయకారి యయ్యెను.
Andhraveerulupar025903mbp/page_0014.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ పర్వతరాజుమరణము విని యతని కుమారుడగు మలయ కేతువు విచారపడుచుండ బ్రతిపక్షుల సేనానయకుడగు భాగురాయణుడు వచ్చి చెలిమి సంపాదించుకొని 'మలయ కేతూ! చాణక్యుడు నీతండ్రిని జంపించినటులె నిన్నును జంపింప నున్నాడు. బ్రదుక దలచిన నిటనుండి వెడలిపోవుట మంచి'దని తెల్పెను. అతని మోసపుమాటలు నమ్మి మలయ కేతువు భాగురాయణుని మంత్రిగ జేసికొని తన పర్వత రాజ్యమునకు వెడలిపోయెను.
2
+
3
+ పర్వతరాజ కాలమరణ మొందుటయు మలయకేతువు పాఱిపోవుటయు జూచి యిదియె యదనని చాణక్య చంద్రగుప్తులు మంగళవాద్యములతో బాటలీపుత్రమున బ్రవేశించిరి. రాక్షసుడు సైన్యముల బ్రోత్సాహపఱచి చాణక్య చంద్రగుప్తుల బలము మీదికి దన బలమును నడపెను. ఉభయ బలములకు భయంకరమగు సంగరము జరిగెను. రాక్షసుడు ఈ యదును గనిపెట్టి నందులపక్షమున జేరి, చంద్రగుప్తునకు బట్టాభిషేకము చేయరాదని చాటించెను. అంతతో బోక మహానందుని ఒక సురంగ మార్గమున దపము జేసికొనుటకు బంపి యతని స్వీకారపుత్రుని రాజ్యమునందు బ్రతిష్ఠింపవలయునని రాక్షసుడు నిశ్చయించెను. చంద్రగుప్త చాణక్యులు పాటలీపుత్రమున బరిచయము సంపాదించుకొనిన కొలది తన కపకారము కలుగక తప్పదని రాక్షసుడు గర్భవతి యగు తన
Andhraveerulupar025903mbp/page_0015.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ భార్యను పుత్రుని ప్రాణమిత్రుడగు చందనదాసునియింట రహస్యముగా నుంఛెను. తన యంతరంగ మిత్రుడగు శకటదాసునకు గోశాగారమునందలి ధనము నంతయు నొసంగి నందపక్షమునకు సహాయముచేయు నేర్పాటు చేయించెను. అంతతో దృప్తినందక చంద్రగుప్తుని మట్టుపెట్టిన గాని చాణక్యుడు లొంగడని యమాత్యరాక్షసుడు తలంచి దారు వర్మయను శిల్పిని బిలిపించి చంద్రగుప్తుడు నగరమున జేరునపుడు ద్వారము కూలునటుల జేయుమనెను. ఏనుగు నెక్కి నపుడు చంద్రగుప్తుని చుఱకత్తితో బొడిచి చంపుమని మావటీనిని బ్రోత్సహించెను. రాజవైద్యునితో జంద్రగుప్తునకు విషప్రయోగము చేయుమనియు, శయనాధికారితో నిదురించునపుడు తలనఱకు మనియు గొందఱు ఘాతుకులను గోడ సందులలో బంధించి సమయము జూచి చంపుమనియు రాక్షసుడు కట్టుదిట్టములు చేసెను. చాణక్యుడు తన యసాధారణ ప్రజ్ఞచే రాక్షసుని మాయోపాయము లన్నియు గమనించి చంద్రగుప్తున కెట్టి యపాయము గలుగకుండ గాపాడి హంతకుల నందఱ జంపించెను. సర్వార్థసిద్ధిని వెదకించి చాణక్యుడు కొందఱు హంతకుల బంపి చంపునటుల జేసెను. తన ప్రయత్నము లన్నియు విఫలమగుటయు బర్వతరాజు, సర్వార్థసిద్ధి మరణించుటయు మలయ కేతువు పాఱిపోవుటయు జూచి రాక్షసుడు తాన్విక బాటలీపుత్రమున నున్న గావంతయేని లాభములేదని
Andhraveerulupar025903mbp/page_0016.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ సురంగమార్గమున నగరుదాటి పర్వతరాజ్యమునకు వెడలి పోయెను. ఇట్లు రాక్షసుడు మలయ కేతువు నొద్దకేగి యతనితో చాణక్యుడె నీతండ్రియగు పర్వతరాజును జంపించెననియు బాటలీపుత్రమును ముట్టడించి తండ్రిని జంపిన పగ దీర్చు కొమ్మనియు బ్రోత్సహించెను. మలయ కేతువునకు శక, గాంధార, యవన, శచీన, హూణాదిరాజులు సైన్యసహితముగా సాయము రానుండిరి.
2
+
3
+ చంద్రగుప్తుని బట్టాభిషిక్తుని జేయుటతో దనభారము తీరలేదని చాణక్యుడు తలంచి తన యంతరంగ మిత్రుడగు జీవసిద్ధిని బిలువనంపి నీవు విషకన్యను బ్రయోగించి పర్వతరాజును జంపితివి గాన రాజ్యమునం దుండదగవని వెడల నంపెను. ఈయవకాశమును బురస్కరించుకొని జీవసిద్ధి మలయ కేతువును శరణుగోరి రాక్షసునకు మలయ కేతువునకు విరోదము కలుగజేయుచు విషకన్యను బ్రయోగించి రాక్షసుడె పర్వతరాజును జంపెనను ప్రవాదము నందందు గలుగ జేసెను. జీవసిద్ధి యవకాశమున్నపుడెల్ల నచటి రహస్యములు చాణక్యాదులకు గూడచారులచే దెలియబఱచుచు బయటికి మలయ కేతువు పక్షమువానివలె నటించుచుండెను. చాణక్యుడు పాటలీపుత్రమున రాక్షసుని పక్షము వారెటనుండిరొ తెలిసికొనుటకు జారులను నియోగింప వారు వెదకి వెదకి చందనదాసుని యింటిలో రాక్షసుని భార్యయు బిడ్డలు నుండిరని తెలిసి కపటో
Andhraveerulupar025903mbp/page_0021.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ ఆంధ్రదేశము నందలి పురాతననగరములలో ధాన్యకటకము తొలుత యెన్నదగినది. బెజవాడకు మూడామడల దూరమున బశ్చిమదిశను గృష్ణాతీరమున అమరావతి చెంత నీజీర్ణనగరము గలదు. దీనినే మనమిపుడు ధరణికోట యని వ్యవహరించుచున్నారము. మిగుల నున్నతములగు మంటిదిబ్బలతో మనోహరములగు బౌద్ధస్థూపములతో నొప్పి పూర్వశోభల గోలుపోయిన యీప్రదేశము నొకమారు సందర్శించి మన పూర్వచరిత్రము స్మరింతుమేని ఆంధ్రరాజుల రాజధాని నగరమునకా యీదుర్దశ యని పరితాపము కలుగకమానదు.
2
+
3
+ ధరణికోట రాజధానిగ జేసికొని పాలించిన శాతవాహన వంశజులగు నాంధ్రరాజులలో గౌతమీపుత్ర శాతకర్ణి ప్రథమగణ్యుడు. విజ్ఞానమునందును బరాక్రమమందును బరిపాలనాచాకచక్యమునందును నీత డసమానుడు. ఇతడు పలుమాఱు విజయయాత్రల కేగి యవనులను, శకులను, పహ్లవులను లోబఱచికొని ధాన్యకటక సింహాసనాశీనుడైన వెంటనే తన పెద్దకుమారుడగు వులమాయిని యువరాజపట్టాభిషిక్తుని గావించి ప్రతిష్ఠానపురమునం దాతని నుంచి తనపూర్వులు కోలుపోయిన రాజ్యములన్నింటిని గడించెను. ఈనృపాలుని వంశమును శాతవాహనవంశ మని యందురు. శాతవాహన నామము ఎటుల వచ్చినదో తెలుపు చిత్రకథయొకటి వాడుక
Andhraveerulupar025903mbp/page_0022.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ లోనున్నది. ఆకథయందలి సత్యాసత్యముల జర్చింపక హృదయరంజకమగు నాకథ నిట వ్రాసెదము.
2
+
3
+ పరాక్రమశాలియు ధర్మమూర్తియు నగు దీపకర్ణిమహారాజు దక్షిణాపథమును బాలించుచుండెను. ఆతనికి రూపవతియు విద్యావతియునగు శక్తిమతియను భార్య కలదు. ఇరువురును మిగుల సౌఖ్యముగ గలసిమెలసియుండ వారి దాంపత్యము గాంచి దైవము కన్ను కుట్టెనేమోయన శక్తిమతి సర్పదష్టురాలై మరణించెను. దీపకర్ణి అనుకూలపత్నీ వియోగమునకు మిగుల దు:ఖించి యుత్తరక్రియు లన్నియు నిర్వహించి తనజీవితమునంతయు బ్రహ్మచర్యావస్థలోనే గడపుచుండెను. నాయనంతర మీమహారాజ్య మెవరిపాలుగానున్నదో, సంతానము లేదుగదా యను చింత దీపకర్ణిహృదయమును దహించు చుండెను. ఒకనాటి వేకువజామున సుఖనిద్రలోనుండ దీపకర్ణి కొక స్వప్నమువచ్చెను. కలలో నీశ్వరుడు కనిపించి నీవరణ్యములకు ఱేపు వేటకుబొమ్ము. నీకు సింహరాజముపై స్వారిచేయు నొకబాలుడు గనిపించును. వానిని గొనితెచ్చి పెంచి యీరాజ్యమును వానికి నిమ్మని చెప్పి యదృశ్యమయ్యెను.
4
+
5
+ తెల్లవారుగనే దీపకర్ణి పరిజనమును వెంటగొని వేటలాడుట కొక యరణ్యమునకుబోయి విహరించుచుండ మార్గమున బరుగెత్తుచున్న యొకసింహరాజము కనబడెను. దానిపై నమితతేజోరాశియు, సుందరాకారుడు నగు నొకబాలుడు
Andhraveerulupar025903mbp/page_0024.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ కూర్చుండియుండెను. దీపకర్ణి స్వప్నమున గాంచినదెల్ల ప్రత్యక్షమగుటచే మిగుల సంతసించి పదునైన బాణమును వెంట సంధించి పరుగెత్తు సింగముపై బ్రయోగించెను. సింగము వెంటనే మరణించెను. సింహ దేహము నుండి యక్షుడొకడు బయలు వెడలి నమస్కరించి దీపకర్ణి నృపాలా! నేను సాతుడను వాడను. యక్షుడను. కుబేరుని సఖుడను. నే నొకముని కన్యను వలచి మునియనుజ్ఞ గొనకమున్ను గాంధర్వవిధి బెండ్లాడితిని. నాసాహసమునకు గోపించి మమ్మిరువుర సింగముల గండని ముని శపించెను. నాభార్య గర్భవతియై యీ బాలుని గని యకాలమరణ మొందెను. తల్లిలేని బిడ్డనెటులో పెంచుచుంటిని. నాశాపము తొలంగినది. నే నేగుచున్నాడను. ఈబాలుని పోషించు భారమంతయు నీదెయని సాతు డదృశ్యమయ్యెను. సాతుడే వాహనముగనున్న యా బాలకునకు సాతవాహనుడను నామమొసంగి దీపకర్ణి యాబాలుని మక్కువతో బెంచి పెద్దవాని గావించి శుభదినమున దన రాజ్యము నాబాలకున కొసంగి పట్టాభిషేకము గావించెను. సాతవాహనునే ప్రాకృత గ్రంథములందు శాలివాహనుడని వ్యవహరించిరి. ఈతని వంశమె శాతవాహనవంశమని వ్యవహరించుచుండిరి.
2
+
3
+ శాతకర్ణుడు బౌద్ధుడు. అతనికాలమున జైనబౌద్ధ శైవమతములు పరస్పర భిన్నాభిప్రాయములతో ద్వేషము పెంచుకొనుచున్నను దానందు బాల్గొనక సర్వమత సామరస్యమునకె పాటుపడెను. బౌద్ధభిక్షువులకేకాక యితరమతముల
Andhraveerulupar025903mbp/page_0025.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ వారికి గూడ నీరాజు మిగుల సహాయము చేసెను. ఆ కాలమున బేరుగల రాజ్యము లన్నియు శాతకర్ణునకు బన్నుగట్టుచుండెను. శాతకర్ణుడు బౌద్ధమతావలంబియైనను విరోధిసంహారమున దయాదాక్షిణ్యములు వదిలి యెన్నియో కుటుంబములను రూపుమాపెను. తనకు దిరుగబడి సామంతులుగా నుండనీయ కొననందులకు గోపించి విరోధుల వంశములను నిర్మూలము గావించెను. యవన శక పహ్లావవంశములు పెక్కు రూపుమాపెను. సౌరాష్ట్రదేశముమీదికి దండెత్తి యాభాగమును బాలించు రాజవంశమును కూకటివ్రేళ్లతో బెరికి కూలార్చెను. పలువురు రాజులు శాతికర్ణికి లోబడి తమపూర్వమతములు వదలి బౌద్ధులుగా మాఱిపోయిరి. ఇతని పుత్రుడగు పులమాయి (పౌలోమి) గూడ విజయ యాత్రల యందు దండ్రికిదోడ్పడి విజయములు సమకూర్చి సామ్రాజ్యమును మిగుల విస్తరము గావించెను.
2
+
3
+ శాతకర్ణుని రాజ్యమును హరింపదలంచి యవనులు, శకనులు, పహ్లవులు పలుమారు దండెత్తివచ్చి పరాభవము నొంది పోవుటయేకాని జయము నొకమాఱేని గాంచి యెఱుంగరు. ఆకాలమున సుప్రసిద్ధులుగానున్న చేరదేశపాలకుడగు చెంకుడువాను భూపతియు సింహళమును బాలించు గజబాహునృపుడును మాళవదేశమును బరిపాలించు చస్తనుడును శాతకర్ణి కనుసన్నల మెలగుచు స్నేహము వాంఛించుచుండిరి. పశ్చిమాంధ్రదేశము పులమాయి యధికారము క్రిందను
Andhraveerulupar025903mbp/page_0026.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ పూర్వాంధ్రదేశము ధరణికోట రాజధానిగా శాతకర్ణి పరిపాలనము క్రిందను నుండెను. శాసనములవలన గౌతమీపుత్రశాతకర్ణి ఆస్మిక, ఆసిక, మూలక, సురాష్ట్ర, కుకుర, అపరాంతక, అనూప, విదర్భ, అకరావంతి లోనగు దేశముల కధిపతియనియు వింధ్యావతము, పారియాత్రము, సహ్యము, కృష్ణగిరి, మలయము, మహేంద్రము, శ్రేష్ఠగిరి, చకోరము, మొదలగు పర్వతముల కధినాధుడుగా నుండెననియు దెలియుచున్నది. మగధదేశమునకు గూడ ధరణికోట యాకాలమున రాజధానిగానుండెను. ఉత్తరదిశను గంగానదిమొదలుకొని దక్షిణమున గాంచీపురివఱకు గల దేశమంతయు నాంధ్ర రాజుల పరిపాలనమున నున్నటుల నిశ్చయింప నవకాశములు గలవు.
2
+
3
+ శాతకర్ణి యాంధ్రుడైనను అతని కాలమున వ్యాప్తిలో నున్న ఆంధ్రభాషాస్వరూప మెట్టిదో నిశ్చయింప నాధారములు లభించుటలేదు. రాజకీయవ్యవహారములయందును శాసనములయందును సంస్కృతభాష మిగుల స్వల్పముగను విశేషముగ బ్రాకృతయు నుపయోగింపబడెను. శాతకర్ణి ప్రాకృతవాజ్మయమును మిగుల నభివృద్ధిలోనికి దెచ్చెను. ప్రాకృతభాషలో బెక్కు లుత్తమగ్రంథము లీనృపాలునికాలమునందే బయలు వెడలెను. విదేశవ్యాపారమునుగూడ నీతడు మిగుల నభివృద్ధిలోనికి దెచ్చి ద్వీపాంతరముల కిచటివస్తువులు పోవునట్లును
Andhraveerulupar025903mbp/page_0027.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ ఇతరద్వీపవస్తువు లచటికి వచ్చునట్లును జేసెను. స్వయముగా బండితు డగుటచే శాతకర్ణి వర్ణాశ్రమధర్మముల గుర్తించి వర్ణములను సంకరముగాకుండ గట్టుదిట్టములను మిక్కిలి దిట్టముగాజేసెను. దండయాత్రలలో నీ దేశమునకు వచ్చి యిచటనే ప్రాతకాపులుగానున్న విదేశీయుల నాదరించి వారి కెట్టిపన్ను లవసరము లేకుండజేసి శాతకర్ణి వారి కెన్నియో సౌకర్యములు కలుగజేసెను. పూర్వరాజులు తమపేరుముందు మాతృనామ ముంచుకొని వ్యవహరించినటుల గానరాదు. శాతకర్ణి తన మాతృదేవియగు గౌతమీనామమును తన పేరుతో గలిపికొని గౌతమీపుత్ర శాతకర్ణియనియె వ్యవహరించెను. దీనిచే నీతనికి గల యపారమగు మాతృభక్తి వెల్లడి యగుచున్నది.
2
+
3
+ గౌతమీపుత్రుడు క్రీ.శ. 133 మొదలు 154 వఱకు రాజ్యమును బాలించియుండునని యింతవఱకు లభించిన శాసనా ద్యాధారములవలన దెలియుచున్నది. ఇతని ధర్మపత్ని వాసిష్ఠి. ఈరాజన్యుని జీవితమునందలి యపూర్వాంశము లెన్నియో కాలగర్భమున మరుగుపడియున్నవి. శాతకర్ణి యపూర్వ చరిత్ర మంతయు గీర్యంకములుగ బరిగణింపబడు శిలాశాసనములం దింకను అజ్ఞాతావస్థయందె యున్నదని యొప్పుకొనక తప్పదు. మహావిస్తృతమైన ఆంధ్రసాంరాజ్యమునకు నెలవైన ధాన్యకటకము నేడు పూర్వవైభవములన్నియు గోలుపోయి చిఱుపల్లెగా మాఱిపోయినది. ఆంధ్ర
Andhraveerulupar025903mbp/page_0031.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ యైన విజయాదిత్యుడు బలవంతుడై రాజకీయోద్యోగులను సైనికులను లోగొని యక్రమముగా భ్రాతృరాజ్యము నాక్రమించెను. కులోత్తుంగచోడుడు రాజ్యభ్రష్టుడై పినతండ్రిని సాధించి నిజ రాజ్యము నెటుల లోగొనవలయునా యని తీవ్ర యత్నములు గావించుచు సైనికబలమును సమకూర్చు చుండెను. విజయాదిత్యుడు ప్రసిద్ధ పరాక్రమశాలి కాకపోవుటయు, గులోత్తుంగుడు సైన్యమును జీలదీయుచుంటయు గమనించి చిరకాలమునుండి వేంగిదేశమును గబళింప వలయునని ప్రయత్నించుచున్న పశ్చిమ చాళుక్యులలోనివాడగు (నాఱవ) విక్రమాదిత్యుడు అమితసైనిక బలముతో గృష్ణా గోదావరీ నదులదాటి రాజమహేంద్రవరముపైకి దండయాత్ర కేతెంచెను. స్వదేశము పర రాజాక్రాంతముగా నున్న చనియు నిపు డూఱకయున్నయెడల వేంగిరాజ్యమునకు మనకు బ్రాప్తము తీరుననియు గులోత్తుంగచోడరాజు నిశ్చయించి పశ్చిమచాళుక్యుల నెదిరించెను. ఉభయపక్షములకు గౌతమీ తీరమున భయంకరసంగ్రామము జరిగెను. కడకు బశ్చిమ చాళుక్యుడగు విక్రమాదిత్యుడు ఓడిపోయెను. తన రాజ్యము సరిహద్దులవఱకు బశ్చిమచాళుక్యరాజును గులోత్తుంగచోడుడు తరిమి వేసి వెనుకకు మరలి తన రాజ్యమునకు జేరి యంతవఱకు దనకు వ్యతిరేకముగ రాజ్యమేలుపినతండ్రియగు విజయాదిత్యునే తనకు ప్రతినిధిగా వేంగిరాజ్యము బాలించు
Andhraveerulupar025903mbp/page_0033.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ చోడదేశమునకు వచ్చి యరాజకమునంతయు నివారించి తన బావమఱంది యగు పర కేసరివర్మను సింహాసనాసీనుని గావించి చీలిపోయిన సామంతులను బౌరులను గూడబఱచి కొంతకాల మటనుండి రాజ్యమునందు శాంతి స్థాపించి తనదేశమునకు బోయెను. విక్రమాదిత్యు డటులబోయి పోకమున్నె మఱల జోళరాజ్యమునం దశాంతి పెచ్చరిల్లెను. ఈవృత్తాంతము విని విక్రమాదిత్యుడు వచ్చి మఱల మఱల శాంతినెలకొల్పి వెళ్లు చుండెను. చోడరాజ్యము నింక జూచుచున్నయెడ బరుల పాలగునని మార్గమధ్యముననే రాజేంద్రచోడుడు విక్రమాదిత్యుని నోడించి వెనుకకు బంపివైచి యమిత బలసహాయముతో జోడదేశమును జయించి పరకేసరివర్మను జంపి "కులోత్తుంగ చోడనామము" సమస్త సామంతులకు భయంకరమగునటుల జోళమండలము బాలించుచుండెను.
2
+
3
+ ఇటు చోడరాజ్యము, అటు వేంగిరాజ్యము తన హస్తగతములైనను అంతతో దృప్తినొందక తిరుగబడిన రాజుల నందఱ జయించి తనరాజ్యము మిగుల విస్తరముజేయ సంకల్పించి కులోత్తుంగ చోడదేవుడు చెంగల్పట్టు ఉత్తరార్కాడు మండలములోని పులియారునాడు, ఎళుమూరునాడు గూడ జయించెను. కుంతలదేశమును బాలించుపశ్చిమచాళుక్యులలో బ్రసిద్ధుడగు విక్రమాదిత్యునిగూడ నతని సోదరుడగు జయసింహ సహితముగా నోడించి పూర్వవైరమునకు బ్రతి
Andhraveerulupar025903mbp/page_0034.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ క్రియగావించెను. మైసూరురాజ్యమునందలి కొంతభాగమును పాండ్యదేశమును జయించి పంచపాండ్యుల నంకితుల గావించుకొనెను. ఇంతతో దృప్తినొందక మలబారుదేశములోని పశ్చిమ భాగమగు కుడలైనాడునుగూడ జయించి మేటివీరుల ననేకుల బొరిగొని యాదేశమునంతయు లోగొనెను. చేరరాజునకుగల నావికాబలమును సైన్యమును గూడ మట్టుపెట్టి కులోత్తుంగచోడుడు చేర దేశమునందు గూడ దన స్వతంత్ర పతాకమును నిలువబెట్టెను. ఇంచుమించుగ నితడు గౌతమీపుత్ర శాతకర్ణి రాజ్యమునకు సమానవైశాల్యముగల యాంధ్రభాగమును బాలించెనని చెప్పవచ్చును. వేంగిదేశమును గుళోత్తుంగునకు బ్రతినిధిగ బరిపాలించు నతనిపినతండ్రియగు విజయాదిత్యుడు కొంతకాలమునకు (క్రీ.శ.1099) పరలోక గతుండయ్యెను. తరువాత దనకుమారుడగు రాజరాజును వేంగిదేశమునకు బాలకునిగా నియోగించెను. ఎల్లపుడును ఆధ్యాత్మిక చింతామగ్నుడగు రాజరాజు కొంత కాలమునకు రాజ్యభోగములపై విరాగమూని తన పరిపాలనాభారము మఱల దండ్రికప్పగించెను. తరువాత మఱియొక కుమారుడగు వీరచోడుని నియమించెను. ఇతడు దాదాపుగ నాఱు సంవత్సరములు వేంగిరాజ్యము పాలించి కాంచీనగరమునకు బోయెను. తనకుమారుల నందఱను వేంగిదేశము పాలించుట కిటుల నొకనివెంట మరియొకని నియోగించుచు చోళ, వేంగి దేశముల రెంటిని సమానముగ దిలకించుచుండెను.
Andhraveerulupar025903mbp/page_0035.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ కులోత్తుంగచోడుడు కళింగదేశముపైకి రెండు మాఱులు దండయాత్రకు బయలుదేరి విజయము గడించెను. పరిపాల నారంభమున నొకమాఱు పరిపాలనాంత్యమున నొకమాఱు నని యితని కళింగ దేశ దండయాత్రలకు సంకేతము లిడవచ్చును. కులోత్తుంగుడు తన పుత్రియగు రాజసుందరిని కళింగదేశపాలకున కొసంగెను. మనుమడగు అనంతవర్మ కళింగ దేశమును బాలించుతఱి గొందఱు కాళింగులు తిరుగబడి యరాజక ప్రయత్నములు చేయుచుండిరి. రెండవ దండయాత్రలో నరాజకముల నడంచి అనంతవర్మ రాజ్యమును సంస్కరించి తనపేర కులోత్తుంగ చోడనగరమును గట్టించెను. తరువాతి కాలమున నీనగరము విశాఖపట్టణమను వ్యవహార నామము వహించెను.
2
+
3
+ కులోత్తుంగ చోడునకు నలువురు ధర్మపత్నులు గలరు. వారిపేరులు మధురాంతక దేవి, దీన చింతామణి, ఎళిశైవల్లభి, త్యాగవల్లి. మధురాంతక దేవియందు ఈరాజన్యునకు ఏడుగురు పుత్రులు ఒకపుత్రియు జనించిరి. పుత్రిక అనంతవర్మ తల్లియగు రాజసుందరి. పుత్రు లేడుగురిలో రాజరాజ చోడగంగు, రాజరాజ ముమ్మడిచోడుడు, వీరచోడు డను మువ్వురె చరిత్రవిదులకు బరిచితులు. కులోత్తుంగ చోడునకు జోడరాజ్య మాక్రమించికొన్న పిదప గంగయకొండపురము, గంగయకొండ చోడపురము అని వ్యవహరింపబడు గంగాపురము
Andhraveerulupar025903mbp/page_0038.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ వీరకుమారుడు బాలచంద్రుడు భారతవీరులలో సుప్రసిద్ధుడగు అభిమన్యునితో బోల్పదగినవాడు. ఈవీర బాలుని జీవితము జెప్పుటకు ముందు బూర్వకథ కొంచెము చెప్పుటయవసరము. మన కథా కాలమునకు గొంచెముముందు గురిజాల రాజధానిగ జేసికొని అనుగురాజు పల్నాటి రాజ్యమును బరిపాలించుచుండెను. అనుగురాజునకు ముగ్గురుభార్యలు. వీరవిద్యాదేవి, భూరమాదేవి, మైలమాదేవియని వారిపేరులు. భూరమాదేవియందు కామరాజు, నరసింహరాజు, జెట్టిరాజు, పెరుమాళ్ళురాజు అను నలుగురు కుమారులు. వీరవిద్యాదేవి యందు పెదమల్లదేవుడు, పినమల్లదేవుడు, బాలమల్ల దేవుడు అను మువ్వురు తనయు లుద్భవించిరి. వీరందరి కంటె మైలమాదేవి కుమారుడగు నలగామరాజు పెద్దవాడు. అనుగురాజు తన యంత్యకాలమునందు రాజ్యమును దనకుమారులను రేచర్లగోత్రుడును వెలమవీరుడు నగు శీలము బ్రహ్మానాయని చేతబెట్టి కుమారుల నుద్ధరించి రాజ్య తంత్రములను మంత్రివై నిర్వహింపుమని చెప్పి ప్రాణములు విడిచెను. బ్రహ్మనాయడు మృతభూపులకు క్షత్రియవంశాచారానుగుణముగా నుత్తరక్రియ లాచరించి కుమారులపక్షమున రాజ్యచక్రము తానె జయప్రదముగా ద్రిప్పుచుండెను.
Andhraveerulupar025903mbp/page_0039.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ నలగామరాజు పెద్దవాడై గురిజాలరాజ్యము తాను స్వయముగా బాలింప దొడగెను. సోదరు లతని పోషణముక్రింద నే యుండిరి. వీరవిద్యాదేవియందు జనించిన పెదమల దేనాదులు మిక్కిలి చిన్నవారు. వీరి కేమేని యాపదకలిగింతురేమో యని బ్రహ్మనాయ డీబాలురను వెంటగొని మాచర్ల రాజధానిగ జేసికొని కొంత దేశమును బాలించుచుండెను. బ్రహ్మ నాయకుడు పేరునకు మంత్రియైనను రాజ్యవ్యవహారములు స్వయముగ నిర్వహించుచు పెదమల్లదేవాదుల వేయి కనులతో గాపాడుచు వారిసుఖము తన సుఖముగ భావించుచుండెను. బ్రహ్మనాయకుని సత్పరిపాలనమునకు బ్రజలుమెచ్చి పలనాటికృష్ణుడని యతనిని బ్రశంసించుచుండిరి. గురిజాల రాజ్యము స్వతంత్రముగ నలగామరాజు తక్కినసోదరుల నందఱ జెంతనుంచుకొని పాలించుచుండెను. నాగాంబయను నొకరెడ్డి కాంత నలగామాదుల దననేర్పుచే లోగొని గురిజాలరాజ్యమునకు మంత్రిణియై రాజ్యతంత్రములు నిర్వహించుచుండెను. ఈ యమనె నాయకురాలందురు. నాయకురాలు మంత్రిణిగ జేరినది మొదలు బ్రహ్మనాయకుని ద్వేషింపసాగెను. రెండు రాజ్యములవారు ఒకరినొకరు ద్వేషించుకొనుచుండిరి. నాయకురాలు దు సంత్రము లొనర్చి మాచర్లరాజ్యము నాశనము చేసి గురిజాల రాజ్యములో గలుప నెన్నియో ప్రయత్నములు గావించుచుండెను. బ్రహ్మనాయకుడు తన మెలకువచే నా చిక్కులు తొలగించుచు కాలము గడపుచుండెను.
Andhraveerulupar025903mbp/page_0040.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ మనమిక బ్రధానకథలోనికి వచ్చుచున్నారము. బ్రహ్మనాయనికి సంతానము లేదు. ఆయనభార్య ఐతాంబ. చిరకాలము సంతానార్థము ఎన్నియో నోములు నోచెను. ఎన్నియో ధానధర్మము లాచరించెను. అన్నసత్రములు పెట్టించెను. సంతానము కలుగదయ్యె. కడకు గజనిమ్మనోము నోచెను. మాచర్ల చెన్నకేశవుని యనుగ్రహమున గర్భవతియై నవమాసములు నిండినవెనుక నొకశుభముహూర్తమున గుమారుని గనెను. జాతకర్మలాచరించి బ్రహ్మనాయకుడు బాలచంద్రుడని యాబాలునకు నామకరణము గావించెను. బాలచంద్రుని వలె నా బాలుడు దినదినాభివృద్ధి నొందుచు దల్లితండ్రులకు గనులపండువు గూర్చుచుండెను.
2
+
3
+ నాయకురాలు ఒకదినమున గురిజాలకు బ్రహ్మనాయడువచ్చుట గనిపెట్టి కోడిపందెముల వేయించుచు ఓడినకోడి బ్రహ్మనాయనిదని, గెలిచినకోడి తనదని పరిహాసము లాడుచుండెను.. బ్రహ్మనాయ డదిచూచి పౌరుషము నాపుకొనజాలక తాను స్వయముగా గోడిపందెమున బాల్గొని పుంజును విడచెను. నాయకురాలు వేఱొక పుంజును విడచెను. వట్టిపందెములతో లాభము లేదని యెవరిపక్షము కోడి యోడిన వారు పండ్రెండేడులు పరదేశమున వసింపవలె ననియు ఒకయే డజ్ఞాతవాసము గావింపవలెనని కట్టుదిట్టముల జేసికొనిరి. గ్రహచారవశమున బ్రహ్మనాయనికోడి యోడిపోయెను. అనుకొన్న పంతముచొప్పున బ్రహ్మనాయకుడు
Andhraveerulupar025903mbp/page_0041.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ సపరివారసహితముగా వలసబోయెను. నానావస్థలకు లోనై రాజకుమారులతో వలసయందు బడవలసిన కష్టములన్నియు బడి బ్రహ్మనాయడు కడకు గడువుతుదను రాజ్యమునకు రానెంచి మాచర్లరాజ్యము తమకొప్పగింపుమని రాజకుమారులపక్షమున గురిజాలకు వర్తమానము పంపెను. నాయకురా లా దూతను జంపించెను. భాగమీయ వీలుగాదనెను. ఉభయపక్షములకు పల్నాటిసీమలోని నాగులేటి తీరమునందు కారెముపూడిచెంత భయంకర యుద్ధము జరుగవలసివచ్చెను. సమకాలికులగు రాజులందరు రెండుపక్షములలో దమ యన కూలములబట్టిచేరిరి. గురిజాల పక్షమున సర్వభారములు నాయకురాలు వహించి రాజులుగనున్న నలగామరాజును, నరసింహ రాజును, కీలుబొమ్మలుగ జేసి సంగ్రామ ప్రయత్నములు తానె స్వతంత్రించి చేయుచుండెను. నియతకాలమున నుభయ దళములు పరస్పర జిగీషతో యుద్ధము చేయుచుండెను.
2
+
3
+ బ్రహ్మనాయకుడు రాజకుటుంబమును తన కుటుంబమును వీర మేడపిలోనుంచి బాలచంద్రుని గొంత సైన్యమును సంరక్షణమున కుంచి సంగ్రామరంగ మలంకరించెను. బాలచంద్రుడు పదునాఱుసంవత్సరముల బాలుడు. మిగులగారాబముగా బెరిగినవాడు. ఇత డితరవ్యవహారములలో జోక్యము పెట్టుకొనక తన సవయస్కులగు అనపోతు, కమ్మర కాచెన్న, మంగల మల్లు, చాకల చందు, కుమ్మర పట్టి, వెలమ
Andhraveerulupar025903mbp/page_0042.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ దోర్నీడు, కంసాల చందు, అను బాలురతో గలిసి క్రీడా విహారములతో గాలము గడపుచుండెను. లేక లేక పుట్టిన తనయుడుగాన దలిదండ్రు లీబాలకుని స్వేచ్ఛకు భంగము చేయరైరి. తండ్రి యుద్ధమున కేగినసంగతి వినిన బాలచంద్రు డేమి సాహసము చేయునో యని తల్లి యతని స్వతంత్రవిహారమున కెట్టియాటంకము కలుగజేయకుండెను. ఒకనాడు బాలుడు తన తల్లియొద్దకువచ్చి బొంగరములాడ దనకు గోరికగలదనియు బంగారు బొంగరములు చేయించి యిమ్మనియు బ్రార్థించెను. ఆయమ్మ తనకుమారుని బుజ్జగించి మన కివి చాలనిదినములు. మీతండ్రి దూరదేశము పోయుయున్నాడు. మనము వలసలోనున్నారము. ఆటలో బ్రమాదమున బొంగరము లెవరికి దగిలినను దగవులు వచ్చును. దానివలన ననేకకష్టములు ప్రాప్తించును. బొంగరములయాట మానుకొమ్మని యెన్ని తెఱంగులనో చెప్పెను. బాలచంద్రుడు తల్లిమాట వినక నాకు బంగారు బొంగరములె కావలయును. వానితో నేనాడుకొనితీరవలయునని మూర్ఖపు బట్టు పట్టెను. తల్లివిధిలేక సొన్నారుల బిలిపించి వారికి మేలిమి బంగారము నొసంగి బొంగరముల జేయించి కుమారున కొసంగెను. తన సవయస్కులు మిత్రులునగు బాలురనందరను వెంటగొని పొట్టేళ్ళపై నెక్కి, పందెములకు బికిలిపిట్టలు, కౌజులు, తగళ్ళను బట్టించుకొని బాలచంద్రుడు క్రీడారంగముగ నేర్పరచుకొనిన సోలురావులవద్దకు జేరిరి. అంతకు
Andhraveerulupar025903mbp/page_0043.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ ముందె యాప్రదేశమునిండ రత్నకంబళములు, చాపలు పఱచిరి. బాలురంద ఱచట గూర్చుండి యాటలాడ నారంభించిరి. మొదట గొందరు బాలురు కసరత్తులు, పికిలిపిట్ట పందెములు కౌజుల పందెములు, పొట్టేళ్ళ పందెములు జరిపిరి. బంగారు బొంగరములతో బాలచంద్రు డాటలాడునని గ్రామములోని వారందరు చూచుటకు స్త్రీబాల సహితముగా వచ్చిరి. బాలచంద్రుడు బొంగరముల యాటలో మిగుల నేర్పరి. బరువైన యాబంగారు బొంగరమును బాలచంద్రుడు తీసికొని త్రాడుచుట్టి వేయబోవుసరికి బంట్రోతులు గుంపును వెనుకకు నెట్టివేసిరి. మధ్యనున్న విశాలస్థలమున బాలచంద్రుదు నిలిచి బొంగరమును లాగి విసరెను. బొంగరము రుంయి రుంయిమని మ్రోగుచు గిరగిర తిరుగుచుండ బాలచంద్రుడు దానిని తిన్నగ జేతిమీది కెక్కించి కొంతసేపాడించి తరువాత బాణము చివర నిల్పి కొంతసేపాడించెను. తిరిగి నే మీద నాడింప వలయునని బాలుడు బొంగరమును విసరి క్రిందికి వైచెను. అటనున్న యొక యెదురురాతికి గొట్టుకొని, బొంగరము బెడసి ఆవేడుక చూడవచ్చిన యొక కోమటిచిన్నదాని కాలికి దగిలెను. మొనగ్రుచ్చికొనుటచే గాలినుండి రక్తము చిమ్మినక్రోవితో జిమ్మి నటుల గారెను. ఆమె పేరు అన్నమ్మ. అన్నమ్మ మూర్ఛపోయెను. చూడవచ్చిన స్త్రీలంద రాయమకు శీతలోపచారములు గావించిరి. బాలచంద్రుడు తన ప్రమాదమునకు జిం
Andhraveerulupar025903mbp/page_0044.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ తించి చేతులు కట్టుకొని యాకాంతకు జెంత నిలిచి విచారపడుచు అన్యాయముగ బరకాంతకు శ్రమగూర్చితినే యని లోలోన గృశించుచుండెను. కొంతసేపటికి అన్నమ్మకు దెలివి వచ్చెను. బాలచంద్రునకు బ్రాణములు లేచివచ్చెను.
2
+
3
+ అన్నమ్మ కనులు తెఱచువరకు బాలచంద్రు డెదుట గానవచ్చెను. బాధచే మైమఱచి అన్నమ్మ నీకండకావరము కాలిపోను, బొంగరముతో గొట్టుదువా? రాజుసొమ్ము తేరగా దిని యొడలు బలిసియున్నావు. నీచూచుకన్నులలో సూదులుగ్రుచ్చ, నీకాలిలో గత్తులుదిగ, నీతండ్రి, రాజు యుద్ధములో నుండ బోతుసింగమువలె బోతరించి యింట నుండునది ఆడువారిమీద నాగడము చేయుటకా, యని పెళపెళ దిట్టిపోసెను. బాలచంద్రుడు తిట్లన్నిటికి సహించి దోసలిమోడ్చి, తల్లీ! క్షమింపుము. ప్రమాదమునకు మన్నించుట విధి యని బ్రతిమాలి ఐదువందల మాడల నామెకిచ్చి తప్పు క్షమింప బ్రార్థించి తన తలపాగ చించి, యామె కాలికిం గట్టుకట్టించి మాతండ్రు లెచటనున్నారో చెప్పుమనెను. అన్నమ్మ బాలునిపై కోపమునాపుకొని "కోపముచే నేమంటినో నేనెఱుగను. మీతండ్రిగారి సంగతి నేనెఱుగననెను." బాలచంద్రుడు వెంటనే యింటికిబోయి తల్లియగు నైతమ్మను సమీపించి నాతండ్రి యెచట కేగెనో తెలుపుమనెను. ఏదో ప్రమాదముజరిగినది. బాలుడు సంగరమునకురుకు నటులున్నాడు. ఇంకనేమి చేయవలయునోయని యైతమ్మవిచారపడి, బాలుడా!
Andhraveerulupar025903mbp/page_0045.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ మీతండ్రి యెటకేగినది నాకు దెలియదనెను. బాలుడు కోపించి, నేనెఱుంగ ననుకొంటివా? నాతండ్రియు బెదమల్ల దేవాదులు కారెమపూడివద్ద యుద్ధముచేయుటకు బోయిరి. తండ్రికి రాజునకు దేశమునకు గానికొడుకు కొడుకా? నే నిక నిట నుండజనదు. యుద్ధమున కేగెదనని పయనమునకు సిద్ధపడెను. ఐతమ్మ యెన్నివిధములనో నయమున భయమునం జెప్పెను. లాభము లేకపోయెను. నాయనమ్మ మాట వినునేమో యని తల్లి తన యత్తగారగు శీలమ్మను బిలిచెను. ఆమె మాటలు బాలచంద్రుడు నిరాకరించెను. జ్యోతిశ్శాస్త్రపండితుల బిలువనంపి బాలుని జాతకము జూప ఇక పదునైదు దినములలో నితనికి గొప్ప గండగలదని సంకోచించుచు జెప్పిరి. యుద్ధరంగము భయంకరముగా నుండునని చెప్పి శీలమ్మయు ఐతమ్మయు బాలుని భయపెట్టిరి. చావునకు దెగించిన బాలవీరునకు సంగ్రామరంగముకంటె సౌఖ్యకరమైన ప్రదేశములేదని బదులుచెప్పెను. ఐతమ్మ కన్నీరు నించుచు నాకు గడుపుశోకము పెట్టుదువా? యని వాయెత్తియేడ్చెను. బాలచంద్రుని హృదయము మఱింత మొద్దుబాఱెను. తాను వీర మరణమునకు సిద్ధముగా నున్నాడననిచెప్పెను. ఐతమ్మయు శీలమ్మయు యోజించి బాలుని ప్రయత్నము ఆపుట యసాధ్యము. ఐనను చేయగల యత్నములు చేయవలయునని రూపవతియగు భార్యను జూచియేని కామపరవశమున గదనము మానునేమో యనుకొని నీభార్యయగు మంచాలవద్ద సెల
Andhraveerulupar025903mbp/page_0046.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ వొంది సంగరరంగ మలంకరింపుమని బాలచంద్రునకు జెప్పిరి. బాలచంద్రుడు సంతసించి కామవశమున గదనప్రయత్నమే మానుదునేమోయని వెంట బ్రాహ్మణ బాలుడగు ననపోతు నుంచుకొని యత్తవారింటికి బయలుదేరెను. వీరమేడపిలోనె మఱియొక వీధి బాలునియత్తవారిల్లు. పెండ్లి జరిగి యెన్నియో దినములు కాలేదు. నాడు పెండ్లిపీటలమీద సిగ్గుతో నేమి చూచెనోగాని బాలచంద్రు నాతనిభార్యయగు మంచాల తేరి పాఱజూచి యెఱుంగదు.
2
+
3
+ మంచాల అర్ఘ్యపాద్యాదులొసంగి యుచితవిధిని దన భర్తను, అనపోతుని బూజించెను. దంపతు లొకరినొకరు ప్రేమ పూర్వకములగు చూపులతో జూచుకొనిరి. అనపోతు తానీ సమయమున నచటనుంటకియ్యకొనక, 'మిత్రమా! బాలచంద్రా! ఏడుగడియలలో రావలయును., నేను ద్వారముకడ వేచియుందు'నని వెడలిపోయెను. బాలచంద్రుడు తాను నగరమున కేగుచుంటినని మంచాలకు జెప్పెను. ఆమె భర్త నాదరించి 'నాకు వీరపత్నియను పతివ్రతానామము సమకూర్చితివి. ఇంత కంటె నాకు గావలసినది ఏమియున్నది. ఇదుగో ఖడ్గము దీనితోవిరోధుల సంహరించి జయము సాధింపుము. బ్రాహ్మణులు ధర్మపరిపాలకులు. వారిని గాపాడుట రాజధర్మముగాన 'అనపోతును సంగరమునకు గొనిపోకుము. ఒక వేళ నాతడు సంగరమున మరణించిన బ్రహ్మహత్యాపాపము వచ్చునని వా కొనెను. బాలచంద్రుడు తన భార్యవద్దను అత్తయగు రేఖాంబవద్దను సెలవుగెకొని యింటికివచ్చెను! తలి కుమా
Andhraveerulupar025903mbp/page_0047.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ రుని గౌగిలించుకొని 'తండ్రీ యుద్ధప్రయత్నము మానవా?' యని బ్రతిమాలెను. బాలచంద్రు డెంతకు వినడయ్యెను. కడకు ఐతాంబ ధైర్యము తెచ్చుకొని 'నేను మాత్రము వీరకాంతను కానా? నాభర్త వీరపత్ని బిరుదము, నా తనయుడు వీరమాతృబిరుదము నాకు బ్రసాదింపుచుండ జేజేత బోగొట్టనగునా' యని బాలచంద్రునకు బెరుగుతో నన్నము కలిపిపెట్టెను. బాలచంద్రుడు భోజనానంతరమున వీరవేషము దాల్చి తల్లికి నాయనమ్మకు నమస్కరించి వారి దీవనలనంది కదనరంగమునకు బయనమయ్యెను. పూర్వోక్తమిత్రులందఱు బాలచంద్రునితో సంగరమునకు బయలుదేరిరి. బాలుడు అనపోతును వెనుకకు బంపదలంచి కత్తియును డాలును ఉంగరమును మంచాలవద్ద మఱచివచ్చితిని. పరిచితుడవు నీవెపోయి దెమ్మనెను. అనపోతు పోకతప్పినదికాదు. అతని బోవనిచ్చి బాలుడు ఒకతాటియాకుమీద నేదియోవ్రాసి రావిచెట్టు కొమ్మకుగట్టి త్రిపురాంతకము, ముటుకూరు, గరికపాడు, మేళ్ళవాగుగ్రామములు దాటి బాలుడు పరిజనముతో వచ్చుచుండ మధ్యగ్రామములవా రీ వీరపుత్రుని గౌరవించిరి. తరువాత కనుమవద్దకు వచ్చువఱకు నాయకురాలు త్రోవగాచియుండెను. బాలుడు వేఱొకత్రోవను బయలు దేఱి నల్లగొండ నత్తమువకు మిత్రులతో నెక్కెను. గుట్టమీదనుండి నలగామ రాజుబలమును సేనానాయకులను శిబిరములను జూచెను. మంత్రిణియగు నాయకురాలిని సర్వసేనాధిపతియగు నరసింగ
Andhraveerulupar025903mbp/page_0048.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ రాజును బాలుడు గుర్తించెను. కొదమసింగమువలె గుట్టపై నుండి విరోధిసేనమీదికి బాలు డుఱకబోవ మిత్రులు వారించిరి.
2
+
3
+ బాలచంద్రుడు గుట్టదిగి పెదమలిదేవుని శిబిరమునకు జేరబోవ గండుకన్నమనీడు వారించెను. త్రోసికొని రాజును సమీపించి, రాజా! సంధికి రాయబారముల కిది యదనుగాదు వనవాసములచే మీహృదయములు నీరసమైయున్నవి. దేహము శుష్కించినది. పరాభవ దైన్యముచే దలవ్రాలినది. ఇంక నేమని రాయబారములు చేయుచున్నారు, విరోధులను రణరంగమున బొరిగొనుటో మరణించుటయో మనవిధి. ఇదుగో! నేను రణరంగమున కుఱుకుచున్నాను. రాదలచినవారు రండు. లెండని బాలచంద్రుడు వైరిశిబిరముల కభిముఖముగా బోవ సమకట్టెను. కొమ్మరాజను నొక వీరుడు బాలునాపి వీర కుమారా! తొందరపడకుము. నా తనయుని నరసింహరా జక్రమముగా రాయబారమునకు బోవ జంపినాడు. నీవు వానిని జంపి నాకు శాంతిగూర్చెదవని నమ్మినాడను. కోపముతో గార్యముగాదు. కొలదిసేపులో సంగ్రామము కట్టాయితము కాగలదు. ఉపాయము లేనిది వైరిచిక్కడు. అని చెప్పుచుండు నంతలో రెండుపక్షముల వారికి సంధి కుదిరినది. యుద్ధప్రయత్నములింక నవసరములేదని పెదమల్లదేవుడు తన సేనామధ్యమున
Andhraveerulupar025903mbp/page_0049.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ నిలిచి చెప్పెను. ఇంతలో నొకయువతి బాలచంద్రునివద్దకు వచ్చి అయ్యా! నేను మాడచి యనుదానను, మేడపిలో అంతిపురి కాపాడుదానను. నీవు రావి చెట్టునకు గట్టిన చీటి చదివి యుద్ధమునకు బాలుడు రావద్దనినాడు. నేను బ్రతికి లాభమేమని అనపోతు మెడగోసికొని మరణించుచు నీకిమ్మని వీరకంకణము జందెము ఇచ్చినాడు. అనపోతుభార్య సహగమనము చేసెనని చెప్పి కంకణము జందెము నొసంగెను. బాలచంద్రున కొడలెఱుగనంతటి యావేశమువచ్చెను. వీరకంకణము చేతికి ధరించుకొని జందెము మెడలోవేసికొనెను. అనపోతూ! మిగిలిపోకుము. నిన్ను స్వర్గమునకు జేరులోగ గలిసికొందునని బాలుడు పలికి సైనికుల నందఱను సంగరమునకు బురిగొల్పెను. నేను బాలుడనని మీరుసంకోచింపకుడు. ఒకప్పుడు నేను కుమారస్వామిని, ఇంకొకప్పుడు నేను అభిమన్యుడను. వేఱొకప్పుడు నేను సిరియాళుడను. దేహములు నశించుచున్నవిగాని ఆత్మ నశించుటలేదు. వీరునకు సంగరమరణమును బోలిన దింకొకటి లేదు. యుద్ధరంగమునకురండు. ఆలసింపకుడని బాలుడు పలికి యుద్ధమునకు త్రోవదీసెను. భోజనము చేయుచున్న వీరులందఱు విస్తళ్లు నాగులేటిలోవైచి ముందునకు దుమికిరి. ఈసంబరముజూచి యెదుట పక్షమువారు సిద్ధపడిరి. భగవంతునకుగూడ సంగరమిష్టము వలె నున్నది. చెన్న కేశవుని యనుగ్రహమెటులున్న నటులె జరుగునని బ్రహ్మనాయకుడు బాలచంద్రునకు ముందు, దక్కిన
Andhraveerulupar025903mbp/page_0050.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ వారికి దరువాత శంఖముతో దీర్థమునొసంగి వీరగంథము మేనబూసి వీరతాంబూలము లొసంగి యుద్ధరంగమునకు సాగనంపెను.
2
+
3
+ రెండుపక్షములవారు భయంకరసంగరమునకు దారసిల్లిరి. రక్తము ప్రవహించెను. అనేకులు వీరులు వీరమరణ మొందిరి. ఒకప్రక్క నాయకురాలు, వేరొకప్రక్క నరసింగ రాజు బాలచంద్రుని బలమును జుట్టుముట్టిరి. కమ్మర కాచెన్న, మంగల మల్లు, చాకల చందు, కుమ్మర పట్టి, వెలమ దోర్నీడు, కంసాల చందులను బిలిచి వారివారి స్వాధీనమున గొంతసైన్యముంచి విరోధిసైన్యమును ఆవరించి రూపు మాపుట కన్నిదిక్కులకు బంపించెను. బాలచంద్రుడు స్వయముగా గొంత బలముతో నరసింగరాజు నెదిరించెను. నలగామరాజు మంచెపై నెక్కి తన బలము చెందు వినాశనమునకు బరితపించుచు, బ్రోత్సాహవాక్యములు పలుకుచుండెను. మలిదేవాదులు, బ్రహ్మనాయకాదులు బాలచంద్రుని యుద్ధ కౌశలమును వేయినోళ్ళ బ్రశంస చేయుచుండిరి. నరసింగరాజు బాలచంద్రుని ధాటికాగలేక వేఱొకత్రోవకేగి హతశేషమగు సైన్యమును సంగరమునకు బురికొల్పుచుండెను. తన ముందటనున్న మత్తగజముపై నెక్కినవీరుని నరసింహరాజని తలంచి బాలచంద్రుడు కుప్పించి ముందునకు దుమికి యేనుగుమీదివానిని గ్రిందికిలాగి వానితల జెండాడి తన బల్లెమునకు గ్రుచ్చుకొని తీసికొనిపోయి బ్రహ్మ
Andhraveerulupar025903mbp/page_0052.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ నాడెను. బాలు డామాటకు గోపించి, 'తండ్రీ! నాడు పుత్రదు:ఖముతో నున్న కొమ్మరాజు నోదార్చి నన్నాయన చేతిలో బెట్టి యలరాజును జంపిన నరసింగరాజును బాలుడు చంపగలడంటివి. నాధర్మము నేను నెఱవేర్చితిననెను. బ్రహ్మనాయడు బాలచంద్రునిజూచి ఒక్కవీరుని జంపినంతనే శూరుడవైతివా? అరులకు వెన్నుజూపి పాఱివచ్చితివి గదాయని యెత్తిపొడిచెను. బాలచంద్రునియొడలు మండిపోయెను. విరోధిసైన్యమును జక్కాడి రాజుతల తెచ్చినందులకు వెన్నుజూపి వచ్చితినని కన్నతండ్రియే నొవ్వనాడినాడు. ఇక గదనమునుండి వెనుకకు బ్రాణములతోరాను. ఇదియె నాప్రతిజ్ఞయని బాలుడు నవయస్కులగు మిత్రులతో గదనరంగ మలంకరించెను.
2
+
3
+ 'చిన్నవాడు గాడురాచిచ్చులపిడు'గని బాలునివిరోధులందఱు చుట్టుముట్టి వివిధాస్త్రములచే నొప్పించిరి. మొక్కబోని పరాక్రమమున బాలచంద్రుడు ముందునకు నడచుచుండెను. అభిమన్యుడు పద్మవ్యూహము భేధించినటుల బాలుడు విరీధిబలముల జించి చెండాడెను. కొంతసేపటికి విరోధులు చెలరేగి కమ్మర కాచెన్నను గడతేర్చిరి. మంగల మల్లును మది యించిరి. చాకలచందును జంపిరి. కుమ్మరపట్టిని గూల్చిరి. వెలమదోర్నిని చత్రవధ చేసిరి. బాలచంద్రుడు తన సైన్యమునంతయు నొకమాఱు పాఱజూచెను. మిత్రులందఱు మరణించిరి.
Andhraveerulupar025903mbp/page_0055.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ ఆంధ్రులలో ఖడ్గతిక్కన మిగుల బ్రసిద్ధుడు. ఈతని పరాక్రమజీవితము పల్లెపదములందును జాటు పద్యములందును నిమిడియుండుటచే జిరకాలమునుండి యాంధ్రసోదరు లీశూరమూర్తిని స్మరించుచున్నారు. ఇతడు నియోగి బ్రాహ్మణుడు. సిద్ధనామాత్యునకు బోలమాంబకు జనించిన యేడుగురు కుమారులలో బెద్దవాడు. గౌతమస గోత్రుడు. భారతమును రచించిన తిక్కనసోమయాజితండ్రియగు కొమ్మనామాత్యుడును, ఈవీరుని తండ్రియగు సిద్ధనామాత్యుడును నొక తల్లిబిడ్డలు. గాన నీవీరులిద్దరు నన్నదమ్ములు కొమారులు. ఖడ్గతిక్కన బాల్యమున సంస్కృతాంధ్రభాషలభ్యసించి రాజనీతిశాస్త్రమునందును. ధనుర్విద్యయందును బ్రసిద్ధిగడించి యాకాలమున బ్రసిద్ధుడై నెల్లూరురాజ్యమును బాలించుచున్న మనుమసిద్ధి నృపాలుని యొద్ద సేనానాయకుడుగ నుండి యాతడు గడించిన విజయము లన్నింటికి దానె యాధారమయ్యెను. ఈవీరవతంసుడు విద్యా వితరణ విక్రాంతులలో నిరుపమానుడై విక్రమసింహపుర రాజ్యమును, దానొక్కండె భుజపీఠిపై ధరించెనని చెప్పుదుమేని యిందతిశయొక్తి కలదని చరిత్రవిదులు వాకొనలేరు.
2
+
3
+ ఖడ్గతిక్కన మనుమసిద్ధి కేయేసంగ్రామములలో నెంతెంత సహాయపడినో నిర్ణయించు నాధారములు లభించుట
Andhraveerulupar025903mbp/page_0059.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ భూపాలుని దగ్గరకుబోయి తనకష్టములనెల్ల నెఱింగించి పాలేటి తీరమునగల బీళ్లు కొంతకాలము పశువులు మేపుకొనుటకు బుల్లరికి దీసికొనెను. పాలేటితీరమున గాటమరాజు కొన్నాళ్ళు నివసించి పశుగణమును బోషించుకొని కాలము గడుపుచుండు నంతలో ఎఱ్ఱగడ్డపాటినుండి కొందఱు గొల్లలువచ్చి వర్షములు కురిసినవనియు దేశము సుభిక్షముగా నున్నదనియు బశువులకు గూడ మేతగలదనియు వర్తమానము చెప్పిరి. కాటమరాజు ఆవార్త విన్నంతనె మిగులసంతసించి గంగమ్మకు జాతరులుచేయించి పరిమితివఱకు బశువుల మేపుకొనలేదు గాన మనుమసిద్ధికి మనము పుల్లరినీయ నవసరములేదని తమలోదాము నిశ్చయించుకొని యాదవులను బశువులను వెంటబెట్టుకొని పోవుచుండ మనుమసిద్ధిభటు లడ్డగించిరి. వారల దిరస్కరించి యాదవులు తమగ్రామము వెడలిపోయిరి. భటులవలన మనుమసిద్ధి యీవర్తమానము విని మండిపడి యాదవుల దురాగతమున కేవగించి అన్నము భట్టు అను నొక బ్రాహ్మణుని కాటమరాజువద్దకు పుల్లగి యొసంగుడని కోరుటకు బంపెను. యాదవులు పుల్లరి నీయవలసిన యవసరములేదనియు, గొలదికాలమె పశువులను మేపితిమిగాన నీయక పోవుటయె ధర్మమనియు, రాయబారములకు లొంగి కనకవర్షము గురిపించుటకు గొల్లలు పిచ్చి వాండ్రుకారనియు నందఱపక్షమున కాటమరాజు వర్తమానము చేసెను. యాదవులను వంచింపకున్న లాభములేదనియు పుల్లరి విడిచిపెట్టితిమేని పౌరులకు గూడ
Andhraveerulupar025903mbp/page_0060.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ నలుసు కలుగుననియు మనుమసిద్ధి భూపాలుడు సర్వసేనానాయకుడగు ఖడ్గతిక్కన యనుమతి చొప్పున సంగరమునకు తలపడియెను.
2
+
3
+ ఈవార్త యాదవులు విని కాటమరాజున కెఱింగించిరి. కాటమరాజు తన బంధువులు వీరులు నగువారికందఱకు వర్తమానము లంపి పిలువనంపి సైనికబలము నాయత్తపఱచెను. కొండపల్లి చల్లపిన్నమ్మనాయకుడు, దొనకొండ అయితమరాజు, ఎఱ్ఱయ్య, భట్టామరాజు, కరియాపులరాజు, వల్లభన్న, నేతిముద్దయ్యనాయడు, పురుషోత్తమరాజు లోనగు సుప్రసిద్ధ యాదవప్రముఖులు సైనికసహాయులై కాటమరాజు పక్షమున జేరిరి. కాటమరాజు తనసేనకు గ్రమశిక్ష నొసంగి చిన్నమనాయని మంత్రిగను బ్రహ్మరుద్రయ్యయను బ్రాహ్మణుని సేనానాయకునిగను నేర్పఱచి సంగరమునకు సైన్యసహితముగ బయలుదేరెను. మనుమసిద్ధిపక్షమున సర్వసేనానాయకుడగు ఖడ్గతిక్కన కొంతసేన్యమును వెంటగొని ఎఱ్ఱగడ్డపాటికి బయలుదేరెను. రెండు సైన్యములును బాలేరుయొడ్డున నున్న పంచలింగములకడ సంగరమునకు దలకొనెను. యాదవులు చెక్కు చెదరులేక మతావేశము స్వతంత్రదీక్ష నూతగాగొని ముక్కాకలదీరిన ఖడ్గతిక్కన సైన్యముతో మిగుల భయంకరముగా బోరాడిరి. ఖడ్గతిక్కన నిర్లక్ష్యభావముతో యాదవులను సరుకుసేయక స్వల్పబలమును మాత్రమె వెంటతెచ్చెను. ఐనను నిరుత్సాహపడక యాదవ
Andhraveerulupar025903mbp/page_0061.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ సైన్యము నెదిరించి పట్టుదలతో బోరాడుచుండెను. యాదవ సైన్యము ఖడ్గతిక్కన సైన్యమును జాలవఱకు నాశనముగావించి ముందునకు వచ్చుచుండెను. ఈపరాజయ పరిస్థితులగాంచి యేని జంకక ఖడ్గతిక్కన హతశేషమగు సైన్యముతో జిరకాలము పోరాడెను. యాదవసైన్యము చుట్టుముట్టి ఖడ్గతిక్కనను నాతని స్వల్పసైన్యమును బట్టుకొనిరి. ఖడ్గతిక్కనను కాటమరాజు సమీపించి "బ్రాహ్మణోత్తమా! సంగరము మానుకొనుము. బ్రాహ్మణుల జంపిన మాకు బ్రహ్మహత్య వచ్చును. అగ్రవర్ణులగు మీరు మాతోబోరుట న్యాయముగాదు. మమ్ము గోపింపక సంగరయత్నము మానుకొను" మని ప్రార్థించి విడిచిపెట్టెను. ఖడ్గతిక్కన చేయునదిలేక గుఱ్ఱమునెక్కి నెల్లూరి కేగి సైన్యముతో రాదలంచి గృహాభిముఖు డయ్యెను.
2
+
3
+ పరాభవదు:ఖముతో ఖడ్గతిక్కన గృహము చేరెను. మంచములోనున్న సిద్ధానామాత్యుడు తన కుమారుడు పారి వచ్చినాడని తలంచి "ఛీ పాఱుబోతా! తుచ్ఛమగు ప్రాణము కాశపడి యిల్లు చేరిన నిన్ను జూచిన పాపమువచ్చు"నని ఖడ్గతిక్కనను నొవ్వనాడెను. తండ్రియొనరించిన తిరస్కారముచే ఖడ్గతిక్కనహృదయము కలగిపోయెను. ఇంటిలోనికిబోవ నతని భార్య చావమ్మ భర్తను సాదరంబున జూచి 'వంటయైనది, స్నానముచేయు' డని చెప్పి స్త్రీలు స్నానముచేయుతావున నొక మంచము చాటుజేసి పసుపుకుంకుమ యట పదిలపఱచెను. ఖడ్గ
Andhraveerulupar025903mbp/page_0064.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ నుండుము. నేను జయము సాధింతు"నని ఖడ్గతిక్కనను సైన్య సహాయముతో నెదిరించెను. ఉభయులు రణకౌశలులగుటచే జిరకాలము జయాపజయ నిర్ణయముల కనువుగానటుల బోరాడిరి. కాలవశమున వీరవతంసుడగు ఖడ్గతిక్కన మరణించెను. స్వామిభక్తిగల యాతనియశ్వము ఖడ్గతిక్కన శిరమును నోట దగిలించుకొని నెల్లూరిలోని తన యజమాని యింటివద్దకు జేరి సకిలించెను. ఇంటిలోని వారందఱువచ్చి చూడఖడ్గతిక్కనశిరము గోచరించెను. ఖడ్గతిక్కన రణరంగమున మరణించినవా ర్త వినినంతనె నగరమంతయు క్షోభించెను. వీరవతంసు లందఱు కన్నీరు గార్చిరి.
2
+
3
+ మంచములోనున్న సిద్ధానామాత్యుడు కుమారుని వీరమరణవార్త వినినంతన యానందబాష్పములు విడుచుచు బరలోక మలంకరించెను. ఆయన తల్లియగు ప్రోలమాంబ కుమారుని శిరము ముద్దాడి యిప్పటికి వీరమాత ననిపించుకొంటినని ప్రాణములు విడిచెను. చానమ్మ భర్తతల నొక కాష్ఠమునందుంచి తానును నందుజొచ్చి సర్వజన ప్రశంసాపాత్రురాలై కీర్తివహించెను. ఖడ్గతిక్కన భౌతికస్వరూప మేనాడో నశించినది. చరిత్రాభిరతులు నుత్సాహశాలురునగు నాంధ్రయువక హృదయములం దామహావీరునితేజము నేటికి బ్రకాశించుచున్నది. ఈవీరునిజన్మకాలము తెలియదుగాని క్రీ.శ. 1200-1260 వఱకున్న తిక్కనసోమయాజికి సమకాలికుడును, సోదరుడును గాన నించుమించుగా నాకాలముననే యున్నటుల
Andhraveerulupar025903mbp/page_0065.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ విశ్వసింపవచ్చును. స్వామిభక్తిపరాయణతయందును. శూరత్వమునందును నీవీరవతంసుడు ఆంధ్ర వీరసందోహమునందవతంసప్రాయుడై యున్నాడు. ఆంధ్రుల పునరభ్యుదయమున కీవీరుని సంకల్పము దోహద మొసంగుగాక.
2
+
3
+ ______
4
+
5
+ మన కథానాయకుడగు ప్రతాపరుద్రచక్రవర్తి క్షత్రియ వంశజుడు. వీరాధివీరుడగు నీరాజసింహుని చరిత్రము తెలిసికొనుటకు ముం దీయన పూర్వులను గుఱించి తెలిసికొనుట యావశ్యకము. తొలుత కళ్యాణపురరాజులగు పశ్చిమచాళుక్యులకడ దండనాయకుడుగ నున్న ప్రోలరాజను వీరుడు తద్రాజ్యపతనానంతరము హనుమకొండ రాజధానిగా జేసికొని స్వతంత్రపతాకము స్థాపించి యాంధ్రదేశములో జాలభాగము తన పరిపాలనమున జేర్చుకొనెను. ఈనరపాలుని పుత్రుడగు రుద్రదేవుడు పితృసంపాదితమగు రాజ్యమును మిగుల నభివృద్ధిలోనికి దెచ్చెను. ఈ నరపాలుడు శిల్పములకు లలితకళయగు కవితకు గూడ నభివృద్ధి మార్గముల నన్వేషించెను. ఈయన యనంతరము ఇతని తమ్ము డగు మహ దేవరాయల పుత్రుడు గణపతి దేవుడు రాజ్యమునకు వచ్చెను. ఈనృపుని కాలమునాటికి ఓరుగల్లుకోట పూర్తి
Andhraveerulupar025903mbp/page_0066.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ యయ్యెను. తన సామ్రాజ్యము నీత డోరుగల్లులో స్థాపించి చాళుక్యులను చోళులను జయించి యభివృద్ధిలోనికి దెచ్చెను. పుత్రసంతానము లేకపొవుటచే నీయనపుత్రి రుద్రమదేవి రాజ్యమునకు వచ్చి చిరకాలము మహత్తరముగ నాంధ్ర సామ్రాజ్యమును బాలించెను. పితృ దత్తమగు రాజ్యము నీయమ విస్తరింపజేసి తిరుగబడిన రాజుల బిలుకుమార్చి యాంధ్రజాతియం దంతర్హితమైన పరాక్రమము నీయమ యొక్కమాఱు బ్రజ్వలింపజేసెను. ఈయమకు బురుషసంతతి లేదు. ముమ్మడమ్మ, రుయ్యమ్మయను నిరువురు కుమార్తెలు గలరు. ముమ్మడమ్మను చాళుక్యాన్వయుడగు వీరభద్రరాజు, రుయ్యమ్మను ఇందులూరి అన్నభూపతియు బెండ్లాడిరి. అల్లుండ్లిరువురు ప్రత్యేక మండలాధిపతులైనను రుద్రమదేవికి గుడి భుజముల వలె నుండి సంగరములం దాయమకు సాయపడుచు విజయలక్ష్మిని గనుసన్నలలో నుంచిరి. రుద్రమదేవి తనపుత్రికలకు బుత్రసంతానము గలిగెనేని వారికి రాజ్యము స్వాధీనము జేసి కృతార్థురాలు గావలెనని సంకల్పించెను. పెక్కువ్రతములు గావించెను. ఎన్నియో యాలయములు గట్టించెను. కానవచ్చిన దేవరలకెల్ల దాను మ్రొక్కి కుమార్తెలచే మ్రొక్కించెను. అయినవోలు మైలారుదేవరకు, కొలనుపాక సోమనాథునకు, వేములవాడ రాజేశ్వరునకు, మొగిలిచర్ల ఏకవీరాదేవికి మహోత్సవముల జేయించెను. దైవానుగ్రహమున ముమ్మడమ్మ గర్భ
Andhraveerulupar025903mbp/page_0067.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ వతి యయ్యెను. ప్రజ లీశుభవార్తవిని యుత్సవము లొనర్చిరి. శాలివాహనశకము...... ఆనందనామ సంవత్సర చైత్రశుద్ధ పంచమి గురువారము బ్రాహ్మీముహుర్తమందు సూర్యుడు, అంగారకుండు, బుధుడు, బృహస్పతి, యుచ్చస్థానమునను, శని స్వక్షేత్రమున నున్న శుభసమయమున నొకబాలు డుద యించెను.
2
+
3
+ ఓరుగల్లునగరమున నానా డొనరింపబడిన వేడుకలకు మితము లేదు. పురమంతయు నలకరింపడెను. ఆలయము లన్నింటియందు మహోత్సవములు జగన్మోహనముగా జరుపబడెను. మంగళవాద్యము లెడతెగక మ్రోయింపబడెను. రుద్రమదేవి నామకరణోత్సవము మహావైభవముగ నెర వేర్ప జేసి ప్రధానమంత్రియగు శివదేవయ్య యనుమతిచే నాబాలునకు శ్రీమన్మహారాజ వీరప్రతాప రుద్రదేవ చక్రవర్తియని నామకరణ మొనరించెను. శుక్లపక్షచంద్రునివలె నాబాలు డభివృద్ధి నొంది బాల్యమునందె ధనుర్విద్యయు, వ్యాయామ విద్యయు, సంస్కృతాంధ్రములు, రాజనీతియు గురువులకడ నభ్యసించి ముత్తవయగు రుద్రమదేవితో రాజసభామందిరమున ఆసీనుడై పరిపాలనా విధానమును గూడ బసితనముననె నేర్చు కొనెను.
4
+
5
+ రుద్రమదేవి తనవార్ధకమున మనుమడగు ప్రతాపరుద్ర దేవునకు బట్టాభిషేకము జేయసంకల్పించెను. ఈశుభసంకల్పము వినినంతన ప్రతాపరుద్రుడు పట్టాభిషేకానంతరము విశ్రాంతి
Andhraveerulupar025903mbp/page_0068.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ ప్రతాపరుద్ర చక్రవర్తి
Andhraveerulupar025903mbp/page_0069.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ చాలదని తనమంత్రిని సైన్యమును వెంటగొని యొకమాఱు విజయయాత్రకు వెడలి పలువురు స్వతంత్రరాజులను సామంతులుగా గొని కొన్నిచోటుల జయస్తంభముల స్థాపించి నియమిత కాలమునకు రాజధాని చేరెను. ఓరుగల్లు నగరము మిక్కిలి రమణీయముగా నలంకరింప బడెను. స్వయంభూదేవాలయము నందును, జెన్న కేశవాలయము నందును మహోత్సవములు జరుప బడెను. జరుపబడిన వేడుకలకు మితములేదు. మంగళవాద్యములచే భూనభోంతరములు మాఱుమ్రోగెను. వివిధ ప్రాంతములతో బుణ్యనదులనుండి తెచ్చిన శుద్ధోదకముచే బ్రతాపరుద్రచక్రవర్తిని బట్టాభిషిక్తుని గావించిరి. ప్రజల యుత్సాహము మేరమీఱెను. రుద్రమదేవి యాశుభావపరము బురస్కరించుకొని యుద్యోగులందఱకు సత్కృతు లొనరించెను.
2
+
3
+ ప్రతాపరుద్రుడు రాజ్యమునకు వచ్చిన క్రొత్తలో గొంద ఱాతని నిరాకరించి కప్పములొసంగుట మానిరి. కొందఱు స్వాతంత్ర్య సంపాదమునకు గుట్రలు చేయసాగిరి. మనుమగండగోపాలుడు, అంబయదేవమహారాజు, త్రిపురారి దేవుడులోనగు నెల్లూరు మండలపాలకులు తిరుగబడిరి. ప్రతాపరుద్రుడు తనసైన్యమునంపి మనుమగండ గోపాలుని దెగటార్పించి రాజ్యమున శాంతి స్థాపింప జేసెను. అంబయ దేవ త్రిపురారి దేవాదులు తమంతతాము లోబడిరి. ప్రతాపరుద్రుడు స్వాతంత్ర్యము ప్రకటించుటకు యత్నించుచున్న పాండ్య చోళ
Andhraveerulupar025903mbp/page_0070.txt ADDED
@@ -0,0 +1,5 @@
 
 
 
 
 
 
1
+ కేరళ దేశాధిపతుల జయింపనెంచి కోటలు కొత్తళములు బాగుచేయించి సైన్యమును మిగుల వృద్ధికిదెచ్చెను. ఆ తరుణమున దేవగిరిదుర్గమున యాదవవంశజుడగు రామదేవుడు పాలించుచుండెను. ఇతడు భోగలాలసుడై కాలము గడుపుచు రాజ్యవ్యవహారములలో నంతగ జోక్యము పుచ్చుకొనకుండెను. ప్రతాపరుద్రుని త్రిలింగసామ్రాజ్యము మహోన్నత దశలోనుండుటచే నుత్తరహిందూస్థానమును బాలించు మహమ్మదీయ నృపాలురకు దేవగిరిని లోగొని యాంధ్రసామ్రాజ్యమును హరింపవలెనను కోర్కి జనించెను.
2
+
3
+ డిల్లీ సామ్రాజ్యమును జలాయుద్దీను ఫిరోజు పాలించు కాలమున అల్లాఉద్దీను అపరిమితసైన్య సహాయముతో నొకమాఱు దండయాత్ర కరుదెంచి దేవగిరిని ముట్టడించి జయించి రామదేవునివలన గొంతధనము, అమూల్యరత్నములు, బంగారము గైకొని సామంతునిజేసికొని వెనుకకు మఱలెను. ఆంధ్ర సామ్రాజ్యముగొప్పతన మపు డతడు వినెనుగాని సైన్యమలసి యుండుటచే ముందునకేగ మానెను.
4
+
5
+ అల్లాఉద్దీను తన మేనమామయగు జలాలుద్దీను ఫిరోజును జంపి తాను క్రీ.శ. 1296 లో బ్రభువయ్యెను. ఇతడు ఓరుగల్లు రాజ్యమును జయింపనెంచి సైనికబలమును ఆయుధసామగ్రిని మిగుల నభివృద్ధిపరచి క్రీ. 1303 లో మల్లిక్ నాయబ్ కాపూరనువాని సేనాధిపతిగ నొనర్చిపంపెను. మల్లిక్ నాయబ్
Andhraveerulupar025903mbp/page_0071.txt ADDED
@@ -0,0 +1 @@
 
 
1
+ కాపూరు పదివేల గుఱ్ఱపుదళము నలుబదివేల సైనికులతో బయలుదేరి దేవగిరిచేరి యంతకుమున్ను యంకితుడైన రామదేవునియొద్ద నాతిధ్యముల గైకొని ఆంధ్రనగరము మీదికి బయలువెడలెను. ఈవార్త ప్రతాపరుద్రదేవుడు వినినంతనె యవనసైన్యమునకు బరాభవము సులభముగ జేయవచ్చునని పాండ్య చోళ కేరళదేశములపైకి బోవ సర్వసిద్ధముగా నున్న యాత్మీయసైన్యమునకు దన తమ్ముడగు అన్నమదేవుని యధ్యక్షుని గావించి యెదిరింపబంపెను. పురవరి మహాదేవనాయకుడు, సాహిణిమారుడు, మేచయనాయకుడు బెండపూడి అన్నయమంత్రి, ముప్పడినాయకుడు లోనగు మహావీరులకు గొంతబలము నొసంగి తాను గోదావరీతీరమువఱకు యవనసైన్యము నెదిరింపనేగెను. ఆంధ్రసైనికులు మహమ్మదీయ సైన్యమును గోదావరి దాటకుండ బెక్కువిధముల నరికట్టిరి. పడవలలో వచ్చుసైనికులను సుడిగుండములలో గూలద్రోసిరి. పడవలు బగులగొట్టిరి. ప్రాణములకు దెగించి హతశేషులగు యవన సైనికులు గోదావరి దాటి యీవలకు వచ్చినంతనె ఆంధ్రమహమ్మదీయ సైన్యములకు మహాసమరము జరిగెను. ఆంధ్రవీరులు మొక్కవోని పరాక్రమమున ముందున కుఱికి యవన సైన్యము నంతయు జిందరవందర గావించి రణరంగము నంతయు బ్రతిపక్ష రక్తప్రవాహములతో నించిరి. ప్రాణముల మీది యాసతో జెట్టునకొకరు గుట్టకొక----------విడిచి మైమఱచి తురు:
Andhraveerulupar025903mbp/page_0072.txt ADDED
@@ -0,0 +1,3 @@
 
 
 
 
1
+ సైన్యమునుజెండాడి విజయలక్ష్మీద్వితీయులై యాంధ్రసైనికు లేకశిలానగరము జేరిరి. పరాభవదు:ఖముతో హతశేషమగు సైన్యమును సమకూర్చుకొని మల్లిక్ కాపూరు డిల్లీకి జేరెను.
2
+
3
+ రణమున జయించి సైన్యమును జెండాడి నగరమున కేతెంచిన యాంధ్ర వీరులనందఱను బ్రతాపరుద్ర చక్రవర్తి గౌరవించి యుచిత సత్కారములగావించి గౌరవించెను. ప్రజలు తమ సామ్రాజ్యజయమున కానందించి వీరులకు హారతులొసంగి మహోత్సవము లొనరించి మృతవీరుల పొలికలనిలో స్మరణ చిహ్నముల నెలకొల్పిరి. ఏకశిలానగర రాజ్యమును గబళింప నెంచిన త్రిపురాంతకుడు అంబయదేవుడు ప్రతాపరుద్రుని వంచింప నిదియ తరుణమని యోరుగంటికోటపైకి వచ్చిరి. సోమయగన్నవీరు డపరిమిత సైన్యబలముతో వారి నెదిరించి సైన్యసహితముగ దునుమాడి వారిరాజ్యము నాంధ్రసామ్రాజ్యములో గలిపివేసెను. యవనసైన్యము డిల్లీకేగినది మొదలు అల్లాఉద్దీను ఆంధ్ర సామ్రాజ్యమును హరింపనైతినే యనిమిగుల నాందోళనపడి యచిరకాలమున మఱల దండయాత్ర కేగనిశ్చయించి సైనిక బలమునభివృద్ధి జేయుచుండెను. అపుడు దేవగిరిని డిల్లీకంకితుడై పాలించు మహారాష్ట్రుడగు రామదేవుడను నామాంతరముగల రామచంద్రదేవుడు డిల్లీసామ్రాజ్యమునకు బన్నునొసంగమానెను. అల్లాఉద్దీను రెండవదండయాత్ర కాంధ్రకోశముమీదికి మల్లికాపూరునుబంపెను. అతడు తొలుత దేవ