id
stringlengths
1
3
poem
stringlengths
89
220
label
int64
0
6
label_name
stringclasses
7 values
252
దారుణపాత కాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తివి స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురంత దుర్మతా చారభయంక రాటవికి జండకఠోరకుఠారధార నీ తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ.
1
ఉత్పలమాల
509
రావణుచేతి బాధల నిరంతరమున్ బడి వేఁగి, మూఁకలై దేవత లెల్ల గీష్పతికిఁ దెల్లముగా నెఱిఁగింప, వారి రా జీవ తనూజుఁ డున్నెడకు శీఘ్రమ తోడ్కొనిపోయి చెప్ప, నా దేవుఁడు విష్ణు సన్నిధికి దిగ్గనఁ జేకొనిపోయి యచ్చటన్.
1
ఉత్పలమాల
228
గద సారించి యసహ్యవిక్రమ సమగ్రస్ఫూర్తిచే వేయఁగా నది దప్పించి వరాహమూర్తి నిజదంష్ట్రాగ్రాహతిం ద్రుంచెఁ బెం పొదవం గ్రోధమదాతిరేక బలశౌర్యోదార విస్తార సం పదఁ బంచాస్యము సామజేంద్రుఁ జల మొప్పం ద్రుంచు చందంబునన్.
3
మత్తేభము
68
మందుని గతి యము నాంబువు లందు నిసిం గ్రుంకి బద్ధుఁడై చిక్కిన యా నందుని వరుణుని బంధన మందు నివృత్తునిగఁ జేసె హరి సదయుండై.
0
కందం
166
లలిత పతివ్రతామణి విలాసవతీతిలకంబు పార్వతీ లలన గుమారుఁ గన్నటు సులక్షణ జాంబవతీ లలామ ని ర్మల గతిఁ గన్న పట్టి సుకుమారతనుండు విరోధిభంజనో త్కలిక సుఖించునే గుణకదంబుఁడు సాంబుఁడు వృష్ణిపుంగవా!
2
చంపకమాల
102
సరసిజగర్భ! నీ యెడఁ బ్రసన్నత నొంది మదీయలోక మే నిరవుగఁ జూపుటెల్లను నహేతుక భూరి దయా కటాక్ష వి స్ఫురణన కాని, నీ దగు తపోవిభవంబునఁ గాదు; నీ తప శ్చరణము నాదు వాక్యముల సంగతిఁ గాదె సరోజసంభవా!
2
చంపకమాల
75
నరక మురప్రలంబ యవనద్విప ముష్టికమల్ల కంసశం బర శిశుపాల పంచజన పౌండ్రక పల్వల దంతవక్త్ర వా నర ఖర సాల్వ వత్స బక నాగ విదూరథ రుక్మి కేశి ద ర్దుర వృష ధేనుక ప్రముఖ దుష్ట నిశాటులఁ ద్రుంచె వ్రేల్మిడిన్.
2
చంపకమాల
56
ఆ వనమున వసియించి నృ పావననయశాలి యిచ్చె నభయములు జగ త్పావన మునిసంతతికిఁ గృ పావననిధి యైన రామభద్రుం డెలమిన్.
0
కందం
281
కోతికిశక్యమా యసురకోటుల గెల్వను, గెల్చెబో నిజం బాతనిమేన శీతకరుడౌట దవానలు డెట్టివింత? మా సీతపతివ్రతా మహిమ, సేవకు భాగ్యము, మీ కటాక్షమున్ ధాతకు శక్యమా పొగడ? దాశరథీ కరుణాపయోనిధీ.
1
ఉత్పలమాల
403
బహుళజలప్లవమాన ద్రుహిణాండము చెమ్మ యుఱికి రూక్షార్కవిభా రహితతఁ గాటుకపట్టెను రహి చెడి యన నంధతమసరాసులు బెరసెన్.
0
కందం
533
కొడు కుదయించె నంచలరి కోరి సుధాంబుధి మిన్ను ముట్టి, య ప్పుడు జగమెల్లఁ గప్పె ననఁ బూర్ణత నొందెను సాంద్ర చంద్రికల్ పుడమికిఁ బాలవెల్లి గతిఁ బొల్పెసలారఁగఁ జంద్రుఁ డొప్పె, న య్యుడుపతి మేని మచ్చయును నొప్పెఁ బయోనిధిఁ బద్మనాభుఁడై.
2
చంపకమాల
153
కూరలుఁ గాయలు నీళ్ళా హారముగాఁ గొనుచు నియమ మలవడఁగ నసం స్కారశరీరుం డగుచు ను దారత నవధూతవేషధరుఁడై వరుసన్.
0
కందం
245
అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూత కృ ద్గగన ధునీ మరంద పదకంజ విశేష మణిప్రభా ధగ ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
2
చంపకమాల
578
మొగము బిగించి, పాదములు మొత్తముగా వడినూఁది త్రొక్కి, నీ టుగ మొగమెత్తి, భీకర కఠోర రవంబున నార్చి, బాహు ల త్యగణిత లీల నూఁచి, వలయంబుగ వాలముఁ ద్రిప్పి, వ్రేఁగునన్ నగము సగమ్ము గ్రుంగఁ, గపి నాథుఁడు నింగికి దాఁటె ఱివ్వునన్.
2
చంపకమాల
295
ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా; అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ
0
కందం
125
మనుజేంద్ర! విదురుఁ డంతకు మును వనమున కేఁగి యచట మునిజనగేయున్ వినుత తపోధౌరేయున్ ఘను ననుపమ గుణవిధేయుఁ గనె మైత్రేయున్.
0
కందం
387
నిక్కము దాఁప నేల ధరణీసుతనందన యింక నీపయిన్ జిక్కె మనంబు నాకు ననుఁ జిత్తజుబారికి నప్పగించెదో చొక్కి మరందమద్యములచూఱలఁబాటలు వాడుతేంట్లసొం పెక్కినయట్టిపూవుఁబొదరిండ్లను గౌఁగిట గారవించెదో.
1
ఉత్పలమాల
162
హరి దన నాభిపంకరుహమందు జనించిన యట్టి భారతీ శ్వరుఁ డతిభక్తి వేడ యదువంశమునన్ బలకృష్ణమూర్తులై పరఁగ జనించి భూభరముఁ బాపిన భవ్యులు రేవతీందిరా వరులట శూరసేనుని నివాసమునన్ సుఖ మున్నవారలే?
2
చంపకమాల
518
అంబర వీథి నిల్చి త్రిదశాంతకు లెంతయు నేచి, రక్తమాం సంబులు గాధినందనుని జన్నముపైఁ గురియంగ, నంతలో నంబర రత్న వంశ కలశాంబుధి చంద్రుఁడు, రామచంద్రుఁడు గ్రంబుగఁ ద్రుంచెఁ జండబల గర్వులఁ దమ్ముఁడు దాను నొక్కటై.
1
ఉత్పలమాల
32
భువనాత్మకుఁ డా యీశుఁడు భవనాకృతితోడ నుండు బ్రహ్మాండంబున్ వివరముతోఁ బదునాలుఁగు వివరంబులుగా నొనర్చె విశదంబులుగన్
0
కందం
571
పగ నీ కెక్కడి దింకను నగచర! నగ భేది సుతుని నా యస్త్రమునన్ దెగ నేయుదు నమ్ము మనుచు జగదీశుఁడు పలుక నతఁడు సంతోషించెన్.
0
కందం
469
చనువారిన్ గని యేడ్చువారు జముఁడా! సత్యంబుగా వత్తు మే మనుమానం బిఁకలేదు నమ్ముమని తా రావేళ నా రేవునన్ మునుగన్ బోవుచు బాసచేయుట సుమీ ముమ్మాటికింజూడగాఁ చెనటుల్గానరు దీని భావమిదివో శ్రీకాళహస్తీశ్వరా!
3
మత్తేభము
121
రామ! గుణాభిరామ! దినరాజకులాంబుధిసోమ! తోయద శ్యామ! దశాననప్రబలసైన్యవిరామ! సురారిగోత్రసు త్రామ! సుబాహుబాహుబలదర్ప తమఃపటుతీవ్రధామ! ని ష్కామ! కుభృల్లలామ! కఱకంఠసతీనుతనామ! రాఘవా!
1
ఉత్పలమాల
459
అమ్మా! యయ్య! యటంచునెవ్వరిని నేనన్నన్శివా! నిన్ను నే సుమ్మీ నీ మదిఁ తల్లిదండ్రులనటంచున్జూడఁగాఁబోకు నా కిమ్మైఁ దల్లియు దండ్రియున్ గురుఁడు నీవేకాన సంసారపుం జిమ్మంజీకటిఁగప్పకుండఁ గనుమా! శ్రీకాళహస్తీశ్వరా!
4
శార్దూలము
163
కురుకులు లాదరింపఁగ సఖుండును నాప్తుఁడునై తనర్చి సో దర తరుణీజనంబులనుఁ దత్పతులం గడు గారవంబునం గరుణ దలిర్ప నాత్మజులకంటెఁ బ్రియోన్నతిఁ బ్రోచువాడు సు స్థిరమతి నున్నవాఁడె వసుదేవుఁడు వృష్ణికులప్రదీపకా!
2
చంపకమాల
520
కొందఱు పల్లకీల, మఱి కొందఱు తేరుల, నందలంబులం గొందఱు, కొంద ఱశ్వములఁ, గొందఱు మత్త గజేంద్ర సంఘమున్ గొందఱు స్వర్ణ డోలికలఁ, గోరిక నెక్కి నృపాల నందనుల్ సందడిఁగాఁగ వచ్చిరి, బుజంబు బుజంబును ద్రోపులాడఁగన్.
1
ఉత్పలమాల
298
ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్ సర్పంబు పడగ నీడను గప్ప వసించిన విధంబు గదరా సుమతీ
0
కందం
112
లోకద్రోహినరేంద్రా నీకముఁ బరిమార్చి జగము నెఱి నిల్పిన యా వైకుంఠనాథు విజయం బాకల్పస్థాన మయ్యె నవనీనాథా!
0
కందం
35
మండలములోన భాస్కరుఁ డుండి జగంబులకు దీప్తి నొసఁగెడి క్రియ బ్ర హ్మాండములోపల నచ్యుతుఁ డుండుచు బహిరంతరముల నొగి వెలిఁగించున్.
0
కందం
532
నారదు లైరి సన్మునులు, నాక మహీజము లయ్యె భూజముల్, శారద లైరి భామినులు, శంకర శైలము లయ్యె గోత్రముల్, పారద మయ్యె నీరధులు, పన్నగ నాయకు లయ్యె నాగముల్, వారిద వర్గ మెల్ల సిత వర్ణము లయ్యెను బండు వెన్నెలన్.
1
ఉత్పలమాల
545
ఆరాము భార్య విభ్రమ మే రాజకుమార్తెలందు నెఱుఁగము విని మున్ ధారుణిలోపలఁ గామిను లా రమణికి సాటి పోల రభినుతి సేయన్.
0
కందం
135
సూరిజనగేయ మగు రాజసూయ యజ్ఞ విలస దవభృథస్నాన పవిత్రమైన ద్రౌపదీ చారు వేణీభరంబు పట్టి కొలువులోపల నీడ్చిరి కుత్సితమున.
5
తేటగీతి
95
శ్రీకాంతాతిలకంబు రత్నరుచిరాజిప్రేంఖితస్వర్ణడో లాకేళిన్ విలసిల్లి తత్కచభరాలంకార స్రగ్గంధలో భాకీర్ణప్రచరన్మధువ్రత మనోజ్ఞాలోలనాదంబు ల స్తోకానుస్వర లీల నొప్పఁగ నిజేశున్ వేడ్కతోఁ బాడఁగన్.
4
శార్దూలము
288
అప్పిచ్చువాడు, వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్ జొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ
0
కందం
450
ఱాలన్ రువ్వఁగ చేతులాడవు, కుమారా! రమ్మురమ్మంచునే చాలన్ చంపగ, నేత్రముల్దివియగా శక్తుండనేఁ గాను, నా శీలంబేమని చెప్పనున్న దిక నీ చిత్తంబు, నా భాగ్యమో శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా! శ్రీ కాళహస్తీశ్వరా!
4
శార్దూలము
230
బాలశీతాంశురేఖా విభాసమాన ధవళ దంష్ట్రాగ్రమున నున్న ధరణి యొప్పె హరికి నిత్యానపాయిని యైన లక్ష్మి నెఱయఁ బూసిన కస్తూరినికర మనఁగ.
5
తేటగీతి
355
ఏగతిఁ బాటుపడ్డఁ గలదే భువి నల్పునకున్ సమగ్రతా భోగము భాగ్యరేఖగల పుణ్యునకుంబలె; భూరి సత్త్వసం యోగ మదేభ కుంభయుగళోత్థిత మాంసము నక్కకూనకే లాగు ఘటించు! సింహము దలంచినఁ జేకురు గాక భాస్కరా!
1
ఉత్పలమాల
549
అంత పనయ్యెనేని, దను జాంతకు, నంతకు, మన్మథాంతకున్ బంతము మీఱఁగా గలఁచి, పన్నగ మర్త్య సురేంద్ర లోకముల్ బంతులు గట్టియూడ్చి, రిపు భంజను రాముని గందకుండ న ర్పింతును నీకుఁ దెచ్చి, మది భీతిని బొందకు మమ్మ జానకీ!
1
ఉత్పలమాల
460
కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్జీవనభ్రాంతులై కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్ వడసెం బుత్రులులేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా!
3
మత్తేభము
87
కారణకార్యహేతు వగు కంజదళాక్షునికంటె నన్యు లె వ్వారును లేరు; తండ్రి! భగవంతు ననంతుని విశ్వభావనో దారుని సద్గుణావళు లుదాత్తమతిం గొనియాడకుండినం జేరవు చిత్తముల్ ప్రకృతిఁ జెందని నిర్గుణమైన బ్రహ్మమున్.
1
ఉత్పలమాల
470
భవదుఃఖంబులు రాజకీటముల నే బ్రార్థించినం బాయునే భవదంఘ్రిస్తుతిచేతఁగాక విలసద్బాలక్షుధాక్లేశదు ష్టవిధుల్మానునె చూడ మేఁకమెడచంటందల్లి కారుణ్య దృ ష్టివిశేషంబున నిచ్చు చంటఁబలెనో శ్రీకాళహస్తీశ్వరా!
3
మత్తేభము
231
హవరూపివి హవనేతవు హవభోక్తవు నిఖిలహవఫలాధారుఁడవున్ హవరక్షకుఁడవు నగు నీ కవితథముగ నుతులొనర్తు మయ్య; ముకుందా!
0
కందం
167
హరిపదసేవకుఁ డరి భీ కరుఁ డర్జును వలన మిగులఁ గార్ముక విద్యల్ దిరముగఁ గఱచిన సాత్యకి వరసుఖ విభవముల నున్నవాఁడె ధరిత్రిన్?
0
కందం
58
హరిసుతుఁ బరిచరుఁగాఁ గొని హరిసుతుఁ దునుమాడి పనిచె హరిపురమునకున్; హరివిభునకు హరిమధ్యను హరిరాజ్యపదంబు నిచ్చె హరివిక్రముఁడై.
0
కందం
251
శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ
1
ఉత్పలమాల
265
సిరులిడసీత పీడలెగ జిమ్ముటకున్ హనుమంతుడార్తిసో దరుడు సుమిత్రసూతి దురితంబులుమానుప రామ నామముం గరుణదలిర్ప మానవులగావగ బన్నిన వజ్రపంజరో త్కరముగదా భవన్మహిమ దాశరథీ కరుణాపయోనిధీ.
2
చంపకమాల
313
కొక్కోకమెల్ల జదివిన, చక్కనివాడైన, రాజ చంద్రుండైనన్, మిక్కిలి రొక్కము లియ్యక, చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ
0
కందం
524
ఇన వంశోద్భవుఁడైన రాఘవుఁడు, భూమీశాత్మజుల్ వేడ్కతోఁ దను వీక్షింప, మునీశ్వరుం డలరఁ, గోదండంబు చే నంది, చి వ్వన మోపెట్టి, గుణంబు పట్టి, పటు బాహా శక్తితోఁ దీసినన్, దునిఁగెన్ జాపము భూరి ఘోషమున, వార్ధుల్ మ్రోయుచందంబునన్
3
మత్తేభము
59
వికటభ్రూకుటిఫాలభాగుఁ డగుచున్ వీరుండు క్రోధారుణాం బకుడై చూచిన యంతమాత్రమున నప్పాథోధి సంతప్తతో యకణగ్రాహ తిమింగిలప్లవ ఢులీ వ్యాళప్రవాళోర్మికా బక కారండవ చక్ర ముఖ్య జలసత్వశ్రేణితో నింకినన్.
3
మత్తేభము
140
కౌరవ పాండవు లిరువురు నారయ నీ కొక్క సమమ యవనీవర! నీ వే రీతి నైన బాండుకు మారుల పాలొసఁగి తేని మను నుభయంబున్.
0
కందం
485
స్తోత్రం బన్యులఁ జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసంబుతోఁ బుత్రీపుత్రకళత్రరక్షణ కళాబుద్ధిన్ నృపాలాధమున్ బాత్రంబంచు భజింపఁబోదు రిదియున్భావ్యంబె యవ్వారి చా రిత్రం బెన్నఁడు మెచ్చనెంచ మదిలో శ్రీకాళహస్తీశ్వరా!
4
శార్దూలము
94
కమనీయ రూపరేఖా రమణీయతఁ జాల నొప్పు రమణీమణి య క్కమలాలయ దన మృదు కర కమలంబుల విభుని పాదకమలము లొత్తెన్.
0
కందం
488
శ్రీనగమందిరుం, డమరసేవితుఁ డర్ధశశాంక మౌళి, స న్మౌని, మనః పయోజ దిననాయకుఁ డబ్జభవామరేశ్వర ధ్యాన లసత్ప్రసన్నుఁ డతి ధన్యుండు, శేషవిభూషణుండు, వి ద్యానిధి, మల్లికార్జునుఁడు, తానిడు మాకు శుభంబులొప్పగన్‌.
1
ఉత్పలమాల
369
దివి బిసరుహబాంధవసైం ధవసంఘం బెంతదవ్వు దగ లేకరుగున్ భువి నంతదవ్వు నేమును ఠవఠవ లేకరుగుదుము హుటాహుటి నడలన్.
0
కందం
414
గాండీవము నీచేతిది పాండవునిన్ జేరఁబట్టి బ్రతికితి మా వి ల్లుండిన నేఁడు నిశాచర చెండవె యల్లునికిఁ దోడు శితభల్లములన్.
0
కందం
145
నీపుత్రుల శౌర్యంబునుఁ జాపాచార్యాపగాత్మజాత కృపభుజా టోపంబునుఁ గర్ణు దురా లాపంబులు నిజముగాఁ దలంతె మనమునన్.
0
కందం
574
కూరలు నోటికిన్ రుచులు గూడుట దప్పెను, దుంపదూఁడులుం గారము తోఁచె, జిహ్వకును గమ్మని తేనెలు చేఁదు లయ్యెఁ, గం గారయెఁ జిత్తమంతయును, గంటికి నిద్ర రహింపదయ్యె శృం గార మెలర్ప సీతఁ బొడఁగానమి, రామనృపాల మౌళికిన్.
1
ఉత్పలమాల
136
కావున వారల కపకృతిఁ గావింపని దొక దినంబు గలుగదు, తమ జ న్మావధి నిజ నందనులను వావిరి నయ్యంధనృపతి వలదనఁ డయ్యెన్.
0
కందం
510
వనజ గర్భుని గూర్చి రావణుఁడు మున్ను తపముఁ జేసిన వర మిచ్చు తఱినిఁ దనకు నేరిచేఁ జావు లేకుండఁ గోరువాఁడు నరుల వానరులను జెప్ప మఱచినాఁడు
5
తేటగీతి
110
మహదహంకార పంచ తన్మాత్ర గగన పవన శిఖి తోయ భూ భూతపంచ కేంద్రి యప్రపంచంబు భగవంతునందు నగుట సర్గ మందురు దీనిని జనవరేణ్య!
5
తేటగీతి
374
విలయకృశానుకీలములవేఁడిమిఁ బోఁడిమి మాలి వెల్మిడిన్ గలసిన భూతధాత్రి మఱి క్రమ్మఱ రూపయి నిల్చి యోషధుల్ మొలవఁగఁజేయునట్టి నయమున్ బ్రతికల్పము నెట్లు గాంచు నీ చలిమలవల్ల నుల్లసిలు చల్లఁదనంబును నూనకుండినన్.
2
చంపకమాల
46
వేనుఁడు విప్రభాషణ పవిప్రహతిచ్యుత భాగ్యపౌరుషుం డై నిరయంబునం బడిన నాత్మ తనూభవుఁడై పృథుండు నాఁ బూని జనించి తజ్జనకుఁ బున్నరకంబును బాపె; మేదినిన్ థేనువుఁ జేసి వస్తువితతిం బితికెన్ హరి సత్కళాంశుఁడై.
1
ఉత్పలమాల
405
రాజు తేజస్వియై గ్రహరాజుమీఁద నలిగి దాడిగ వెంటాడ నిలువ కతఁడు బెగడువడి పాఱుచోఁ జెఱఁ దగిలినట్టి ఛాయ యిది యన నీలలాంఛనము మెఱసె.
5
తేటగీతి
511
ధరణీపతి యగు దశరథ నరనాయకు నింటఁ బుట్టి నర రూపమునం బెరిగెద నేనిక, మీరును సుర కంటకుమీఁద లావు సూపుటకొఱకై.
0
కందం
127
మండితతేజోనిధి యై పాండవ హితమతిని దూతభావంబున వే దండపురి కేగి కురుకుల మండనుఁ డగు ధార్తరాష్ట్రు మందిరమునకున్.
0
కందం
415
అనుచు నిందించి వలవంత యినుమడింప నవ్వరారోహ విదళితహల్లకముల కమ్మపుప్పొడిపై దుమారమ్ము రేఁచు మలయమంథరపవనుపై నలుక వొడమి.
5
తేటగీతి
330
నవరస భావాలంకృత కవితా గోష్టియును, మధుర గానంబును దా నవివేకి కెంత జెప్పిన జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ!
0
కందం
69
మయసూనుండు నిజానువర్తుల మహామాయన్ మహీభృద్గుహా శ్రయులంగా నొనరించి తత్పథము నీరంధ్రంబు గావించినన్ రయ మొప్పం గుటిలాసురాధమునిఁ బోరం ద్రుంచి గోపావళిన్ దయతోఁ గాచిన కృష్ణు సన్మహిమ మేతన్మాత్రమే తాపసా!
3
మత్తేభము
302
ఓడల బండ్లును వచ్చును, ఓడలు నాబండ్లమీద నొప్పుగ వచ్చున్, ఓడలు బండ్లును వలనే వాడంబడు గలిమి లేమి వసుధను సుమతీ
0
కందం
179
కావున నమ్మహాత్ముని వికారవిదూరుని సర్వమోహమా యావిలమానసుండ నగునప్పుడు సంసృతిదుఃఖినౌదు న ద్ధేవుని సత్కృపామహిమఁ దేలినవేళ సుఖింతు నేనకా దా విధిశంకరప్రభృతు లవ్విభుమాయఁ దరింపనేర్తురే.
1
ఉత్పలమాల
555
వనచరు లొక గిరి చేరువ వనమునఁ జరియింపఁ జూచి వసుధా సుతయున్ దన చీర కొంగు తునకను దన సొమ్ములు మూట గట్టి ధరపై వైచెన్.
0
కందం
89
పురుషభవంబునొందుట యపూర్వము జన్మము లందు; నందు భూ సుర కుల మందుఁ పుట్టు టతిచోద్యము; నిట్లగుటన్ మనుష్యుల స్థిర మగు కార్య దుర్దశలచేత నశింపక విష్ణు సేవనా పరతఁ దనర్చి నిత్యమగు భవ్యపథంబును బొందు టొప్పదే?
2
చంపకమాల
192
హరి పితృ సుపర్వ తిర్య ఙ్నర రూపములన్ జనించి నయమున మన్వం తరముల నిజ సత్త్వంబునఁ బరిపాలించును జగంబుఁ బౌరుష మొప్పన్.
0
కందం
506
అమృత ధారా ప్రవాహమ్మునందు నెపుడు నొక్క ధేనువు దివి నున్న నుచిత మగునె? అమృత ధారా ప్రవాహమ్మునందు నెపుడుఁ బెక్కు ధేనువు లప్పురిఁ బేరు నొందు.
5
తేటగీతి
268
అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడు సోమ, జానకీ కువలయనేత్రి గబ్బిచనుకొండల నుండు ఘనంబ మైథిలీ నవనవ యౌవనంబను వనంబునకున్ మదదంతి నీవెకా దవిలి భజింతు నెల్లపుడు దాశరథీ కరుణాపయోనిధీ!
2
చంపకమాల
376
అకలంకౌషధసత్త్వమున్ దెలియ మాయాద్వారకావంతికా శికురుక్షేత్రగయాప్రయాగములు నే సేవింప కుద్దండగం డకవేదండవరాహవాహరిపుఖడ్గవ్యాఘ్ర మిమ్మంచుఁగొం డకు రాఁ జెల్లునె బుద్ధిజాడ్యజనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్.
3
మత్తేభము
429
చూతమె డాసి పక్వతరశుక్తిపుటాంతరదృశ్యమౌక్తిక వ్రాతము లై వెలుంగు గరువంపుఁగొటారులనొప్పు తామ్రప ర్ణీతట మట్లు జీర్ణదళబృందసమావృతపాండురప్రసూ నాతిమనోజ్ఞమూలముల నర్థి నెసంగుమధూకసాలముల్.
1
ఉత్పలమాల
106
హరివచనంబు లాత్మకుఁ బ్రియం బొనరింపఁ బయోజగర్భుఁ "డో! పరమపదేశ! యోగిజనభావన! యీ నిఖిలోర్వి యందు నీ యరయని యట్టి యర్థ మొకఁడైననుఁ గల్గునె? యైన నా మదిన్ బెరసిన కోర్కి దేవ! వినిపింతు దయామతిఁ జిత్తగింపవే.
2
చంపకమాల
550
సన్యాసి వేష మలరఁగ నన్యాయము తలఁచుకొనుచు నసురేంద్రుఁడు దాఁ గన్యారత్నముఁగని సౌ జన్యమునన దీవన లిడె శాంతము దోఁపన్.
0
కందం
80
అమరఁ ద్రివిక్రమస్ఫురణ నందిన యమ్మహితాత్ముపాద వే గమున హతంబులైన త్రిజగంబుల కావల వెల్గు సత్యలో కము చలియించినం గరుణఁ గైకొని కాచి ధరించు పాదప ద్మము తుది నున్న యప్రతిహతం బగు శక్తి గణింప శక్యమే?
2
చంపకమాల
139
చని యచట భీష్మ గురు త త్తనయ కృపాచార్య నిఖిల ధాత్రీపతులున్ విని యనుమోదింపఁగ ని ట్లనియెన్ ధృతరాష్ట్రుతోడ నవనీనాథా!
0
కందం
487
ఒకయర్థంబును నిన్ను నే నడుగఁగా నూహింప నెట్లైన బొ మ్ము కవిత్వంబులు నాకు జెందవని యేమోయంటివా నాదు జి హ్వకు నైసర్గిక కృత్యమింతయు సుమీ ప్రార్థించుటే కాదు కో రికలన్నిన్నును గాన నాకు వశమా శ్రీకాళహస్తీశ్వరా!
3
మత్తేభము
10
చారుతర ధర్మరాశికి భారకుఁడగు కృష్ణుఁ డాత్మపదమున కేఁగన్, భారకుఁడు లేక యెవ్వనిఁ జేరును ధర్మంబు బలుపు సెడి, మునినాథా!
0
కందం
285
అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ
0
కందం
442
నీనా సందొడబాటు మాట వినుమా! నీచేత జీతంబునేఁ గానింబట్టక సంతతంబు మదివేడ్కన్గొల్తు నంతస్సప త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలుఁదే జీనొల్లం గరినొల్ల నొల్లసిరులన్ శ్రీకాళహస్తీశ్వరా!
4
శార్దూలము
114
జలజనాభ దయాకటాక్షప్రసాద లబ్ధి నఖిలైక లోకపాలక విభూతి మహిమఁ బొందిన వారి ధర్మములు విస్త రమునఁ బలుకుట మన్వంతరములు భూప!
5
తేటగీతి
385
అండజయాన నీ వొసఁగునట్టి సపర్యలు మాకు వచ్చె నిం దుండఁగ రాదు పోవలయు నూరికి నింటికి నిప్పు డేను రా కుండ నొకండు వచ్చి మఱియొండునె భక్తియ చాలు సత్క్రియా కాండముఁ దీర్ప వేగ సనఁగావలయున్ గరుణింపు నాపయిన్
1
ఉత్పలమాల
423
రారమ్మనుటయు దివిష న్నారీరత్నంబు నికటనాకధునీక ల్హారాంభోరుహమధురస ధారాచంద్రకితసలిలధౌతానన యై.
0
కందం
365
కులమున నక్కడక్కడ నకుంఠిత ధార్మికుఁడొక్కఁడొక్కఁడే కలిగెడుఁగాక పెందఱుచు గల్గగ నేరరు; చెట్టు చెట్టునన్ గలుగఁగ నేర్చునే? గొడుగు కామలు చూడఁగ నాడనాడ నిం పలరఁగ నొక్కటొక్కటి నయంబునఁ జేకురుఁగాక భాస్కరా!
2
చంపకమాల
261
చక్కెరమాని వేము దినజాలినకైవడి మానవాధముల్ పెక్కురు బక్కదైవముల వేమఱుగొల్చెదరట్లు కాదయా మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్షమొసంగిన నీవ యీవలెం దక్కిన మాటలేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ.
1
ఉత్పలమాల
256
శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ.
1
ఉత్పలమాల
576
ఆ తఱి వానరప్రవరులా ధరణీ సుతఁ గానలేక దుః ఖాతురులై వగం బడఁగ నయ్యెడఁ దద్గిరినుండి వచ్చి సం పాతి యనం బ్రసిద్ధుఁ డగు పక్షి కులేంద్రుఁడు రావణుండు దా సీతను గొంచుఁ బోవుగతిఁ జెప్పుచుఁ దెల్పెను లంక త్రోవయున్.
1
ఉత్పలమాల
280
దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు; నీ దాసుని దాసుడా గుహుడు తావకదాస్యమొసంగినావు; నే జేసిన పాపమో వినుతి చేసిన గావవు; గావుమయ్య, నీ దాసులలోన నేనొకడ దాశరథీ కరుణాపయోనిధీ!
1
ఉత్పలమాల
287
అప్పు కొని చేయు విభవము, ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్, దప్పరయని నృపు రాజ్యము దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ
0
కందం
215
ఘనుఁడు స్వయంభువునకుఁ బ్రియ తనయుఁడు స్వాయంభువుండు దైతేయవిభే దనసేవాచతురుండును జనవినుతుండాదిరాజ్యసత్తముఁడౌటన్.
0
కందం
342
అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండు కోరినన్ గదిసి పదార్థమిత్తురటు కానగ వేగమె కొట్టి తెండనన్ మొదటికి మోసమౌఁ; బొదుగు మూలముగోసినఁ బాలు గల్గునే పిదికినఁ గాక భూమిఁ బశుబృందము నెవ్వరికైన భాస్కరా!
2
చంపకమాల
22
తీర్థపాదుఁడయిన దేవుండు విష్ణుండు తన చరిత్ర మేను దవిలి పాడఁ, జీరఁబడ్డవాని చెలువున నేతెంచి ఘనుఁడు నామనమునఁ గానవచ్చు.
6
ఆటవెలది
546
ఒడ లెల్లను బంగారము, పొడ లెల్లను రత్న సమితిఁ బోలిన మెఱపుల్ నడ లెల్ల నెఱపి మెలఁగెడు కడ లెల్ల విలాస రేఖ కళలం దొప్పెన్.
0
కందం
104
కావున మద్భక్తికిఁ దప మేవిధమున మూలధనము నిది నీ మది రా జీవభవ! యెఱిఁగి తప మిటు గావించుట విగతమోహకర్ముఁడ వింకన్.
0
కందం
472
లేవో కానలఁ గందమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్ లేవో యేఱులఁ బల్లవాస్తరణముల్ లేవో సదాయాత్మలో లేవో నీవు విరక్తులన్మనుప జాలింబొంది భూపాలురన్ సేవల్సేయఁగఁ బోదురేలొకొ జనుల్ శ్రీకాళహస్తీశ్వరా!
4
శార్దూలము