id stringlengths 1 3 | poem stringlengths 89 220 | label int64 0 6 | label_name stringclasses 7
values |
|---|---|---|---|
586 | జగతీశుఁడు మానవుఁడట!
నగరే భుజ శక్తిచేత నా కెదు రన్నన్?
నగ ధరుఁడో, నగ ధన్వుఁడొ,
నగ భేదియొ, కొంత కొంత నాతోఁ బోరన్? | 0 | కందం |
181 | హరి నరులకెల్లఁ బూజ్యుఁడు
హరి లీలామనుజుఁడును గుణాతీతుఁడునై
పరఁగిన భవకర్మంబులఁ
బొఁరయండఁట హరికిఁ గర్మములు లీలలగున్. | 0 | కందం |
12 | జననము లేక కర్మముల జాడలఁ బోక సమస్త చిత్త వ
ర్తనుఁడగు చక్రికిం గవు లుదార పదంబుల జన్మకర్మముల్
వినుతులు సేయుచుండుదురు వేదరహస్యములందు నెందుఁ జూ
చిన మఱి లేవు జీవునికిఁ జెప్పిన కైవడి జన్మకర్మముల్. | 2 | చంపకమాల |
492 | మేలిమి మంచుకొండ నుపమింపఁగఁ జాలిన యంచనెక్కి, వా
హ్యాళి నటించి వచ్చు చతురాస్యు నెదుర్కొని నవ్వుదేరగా
వాలిక సోగకన్నుల నివాళి యొనర్చి, ముదంబు గూర్చు వి
ద్యాలయవాణి శబ్దముల నర్థములన్ సతతంబు మాకిడున్ | 1 | ఉత్పలమాల |
164 | కందర్పాంశమునం దనూజుఁ బడయం గామించి భూదేవతా
బృందంబున్ భజియించి తత్కరుణ దీపింపం బ్రభావంబు పెం
పొందన్ రుక్మిణి గన్ననందనుఁడు ప్రద్యుమ్నుండు భాస్వచ్ఛమూ
సందోహంబులు దన్నుఁ గొల్వ మహితోత్సాహంబునన్ మించునే. | 4 | శార్దూలము |
338 | మండల పతి సముఖంబున
మెండైన ప్రధాని లేక మెలగుట యెల్లన్
గొండంత మదపు టేనుగు
తొండము లేకుండినట్లు దోచుర సుమతీ | 0 | కందం |
329 | నరపతులు మేఱ దప్పిన,
దిరమొప్పగ విధవ యింట దీర్పరి యైనన్,
గరణము వైదికుడైనను,
మరణాంతక మౌనుగాని మానదు సుమతీ! | 0 | కందం |
119 | ఈ పగిదిని విశ్వము సం
స్థాపించును మనుచు నడఁచు ధర్మాత్మకుఁడై
దీపిత తిర్యఙ్నర సుర
రూపంబులు దాన తాల్చి రూఢి దలిర్పన్. | 0 | కందం |
20 | నాయందుఁ గలుగు నీ మది
వాయదు జన్మాంతరముల బాలక! నీ వీ
కాయంబు విడిచి మీఁదట
మా యనుమతిఁ బుట్టఁగలవు మద్భక్తుఁడవై. | 0 | కందం |
336 | బంగారు కుదువ బెట్టకు,
సంగరమున బాఱిపోకు సరసుడవైతే,
నంగడి వెచ్చము వాడకు,
వెంగలితో జెలిమి వలదు వినరా సుమతీ | 0 | కందం |
257 | కంటి నదీతటంబుబొడగంటిని భద్రనగాధివాసమున్
గంటి నిలాతనూజనురు కార్ముక మార్గణశంఖచక్రముల్
గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్ధుడ నైతి నో జగ
త్కంటక దైత్యనిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ! | 1 | ఉత్పలమాల |
249 | దురితలతాలవిత్ర, ఖర దూషణ కానన వీతిహోత్ర, భూ
భరణకళావిచిత్ర, భవ బంధ విమోచన సూత్ర, చారువి
స్ఫురదరవింద నేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం
ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. | 2 | చంపకమాల |
466 | పదునాల్గేలె మహాయుగంబులొక భూపాలుండు, చెల్లించె న
య్యుదయాస్తాచలసంధినాజ్ఞ నొకఁడాయుష్మంతుఁడై వీరి య
భ్యుదయంబెవ్వరు చెప్పఁగా వినరొ? యల్పుల్మత్తులై యేల చ
చ్చెదరో రాజులమంచు నక్కటకటా! శ్రీకాళహస్తీశ్వరా! | 3 | మత్తేభము |
263 | అండజవాహ నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్
కొండలవంటివైన వెసగూలి నశింపకయున్నె సంతతా
ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్షలక్ష్మి కై
దండయొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ. | 1 | ఉత్పలమాల |
462 | అడుగంబోనిఁక నన్యమార్గరతులం బ్రాణావనోత్సాహినై,
యడుగంబోయినఁబోదు నీదు పదపద్మారాధకశ్రేణియు
న్నెడకున్నిన్ను భజింపఁగాఁ గనియు నాకేలా పరాపేక్ష కో
రెడిదింకేమి? భవత్ప్రసాదమె తగున్ శ్రీకాళహస్తీశ్వరా! | 3 | మత్తేభము |
53 | చిత్రముగ భరత లక్ష్మణ
శత్రుఘ్నుల కర్థి నగ్రజన్ముం డగుచున్
ధాత్రిన్ రాముఁడు వెలసెఁ బ
విత్రుఁడు దుష్కృత లతా లవిత్రుం డగుచున్. | 0 | కందం |
250 | కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స
జ్జనపరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాండకాండ సం
జనిత పరాక్రమక్రమ విశారద శారద కందకుంద చం
దన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ. | 2 | చంపకమాల |
406 | నోములు నోఁచినమ్మలు మనోరథముల్ దయివాఱనిత్తఱిన్
దామరతంపరై ప్రియులుఁ దారువిహారము సల్ప వీరిలో
నీమెయి దుఃఖశీల నగు నే వసియింపఁ దరంబె పోద మా
రామముఁ జూడ నందు సుకరం బగు సర్వము నంబుజాననా. | 1 | ఉత్పలమాల |
147 | అట్టి జగన్నివాసుఁడు మురాసురభేది పరాపరుండు చే
పట్టి సఖుండు, వియ్యమును, బాంధవుఁడున్, గురుఁడున్, విభుండునై
యిట్టలమైన ప్రేమమున నెప్పుడుఁ దోడ్పడుచుండు వారలం
జుట్టన వ్రేల నెవ్వరికిఁ జూపఁగ వచ్చునె? పార్థివోత్తమా! | 1 | ఉత్పలమాల |
561 | వ్రచ్చెద నాక లోకమున వారల గుండెలు, నాగ లోకమున్
గ్రొచ్చి యహీంద్ర వర్గమును గూల్చెదఁ, గవ్వపుఁ గొండకైవడిన్
ద్రచ్చెద మర్త్య లోకము, నుదారత నే గతి నైనఁ గ్రమ్మఱం
దెచ్చెద సీత, నీ క్షణము దేవర చిత్తము మెచ్చునట్లుగన్. | 1 | ఉత్పలమాల |
567 | చని చని, యెదుటను రాముఁడు
గనుఁగొనియె మహీజనోగ్ర కలుషాద్రి మహా
శని రూపం బనఁ దగు, నా
ఘన ముక్తి వధూ విలాస కబరిన్, శబరిన్. | 0 | కందం |
314 | కొఱ గాని కొడుకు బుట్టిన
కొఱ గామియె కాదు, తండ్రి గుణముల జెఱచున్
చెఱకు తుద వెన్ను బుట్టిన
జెఱకున తీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ | 0 | కందం |
227 | శరనిధిలోన మహోగ్రా
మరకంటకుఁ డెదురఁ గాంచె మఖమయగాత్రిన్
ఖురవిదళితకులగోత్రిన్
ధరణికళత్రిన్ గవేషధాత్రిన్ పోత్రిన్. | 0 | కందం |
66 | వర యమునానదీ హ్రద నివాసకుఁడై నిజ వక్త్ర నిర్గత
స్ఫురిత విషాంబుపానమున భూజనులన్ మృతిఁ బొందఁ జేయు భీ
కర గరళద్విజిహ్వుఁ డగు కాళియ పన్నగు నా హ్రదంబుఁ జె
చ్చెర వెడలించి కాచె యదుసింహుఁడు గోపకగోగణంబులన్. | 2 | చంపకమాల |
77 | ప్రతియుగమందు సంకుచితభావులు నల్పతరాయువుల్ సుదు
ర్గతికులునైన మర్త్యుల కగమ్యములున్ స్వకృతంబులున్ సుశా
శ్వతములునైన వేదతరుశాఖలు దా విభజించినట్టి స
న్నుతుఁడు పరాశరప్రియతనూజుఁడు నా హరి పుట్టె నర్మిలిన్. | 2 | చంపకమాల |
218 | మునుకొని తండ్రియాజ్ఞఁదలమోచి నిజోచితకృత్యమేమి పం
చినఁ దన శక్తియుక్తి నెడసేయక చేయుట పుండరీకలో
చన పదసేవ సేయుట ప్రజాపరిపాలనశాలి యౌటయున్
జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట సువ్వె పుత్రకా! | 2 | చంపకమాల |
118 | ఇరవొందన్ ద్రుహిణాత్మకుండయి రమాధీశుండు విశ్వంబుసు
స్థిరతం జేసి, హరిస్వరూపుఁడయి రక్షించున్ సమస్త ప్రజో
త్కర సంహారము సేయు నప్పుడు హరాంతర్యామియై యింతయున్
హరియించుం బవనుండు మేఘముల మాయం జేయు చందంబునన్. | 3 | మత్తేభము |
396 | చేసితి జన్నముల్ తపము చేసితి వంటి దయావిహీనతన్
జేసినపుణ్యముల్ ఫలము సెందునె పుణ్యము లెన్నియేనియున్
జేసినవానిసద్గతియె చేకుఱు భూతదయార్ద్రబుద్ధి కో
భూసురవర్య యింత దలపోయవు నీచదు వేల చెప్పుమా? | 1 | ఉత్పలమాల |
190 | తెఱఁ గొప్ప నఖిల విశ్వముఁ
బురుషోత్తము మాయచేతఁ బుట్టుం బెరుఁగున్
విరతింబొందుచు నుండుం
గర మర్థిన్ భూతభావికాలము లందున్. | 0 | కందం |
531 | కుముదములుం, జకోరములుఁ, గోమల సస్యముఁ, జంద్రకాంతముల్
రమణఁ జెలంగ వెన్నెల తిరంబుగఁ జేసె జగంబు లుబ్బఁగాఁ,
గమలములున్, వియోగు, లధికంబుగఁ జోరులుఁ, జక్రవాకముల్
రమణఁ గలంగ వెన్నెల తిరంబుగఁ గాచె జగంబు లుబ్బఁగాన్. | 2 | చంపకమాల |
258 | హలికునకున్ హలాగ్రమున నర్థము చేకురుభంగి దప్పిచే
నలమట జెందువానికి సురాపగలో జలమబ్బినట్లు దు
ర్మలిన మనోవికారినగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్
దలవు ఘటింపజేసితివి దాశరథీ కరుణాపయోనిధీ! | 2 | చంపకమాల |
84 | శశ్వత్ప్రశాంతు నభయుని
విశ్వాత్ముఁ బ్రబోధమాత్రు విభు సంశుద్ధున్
శాశ్వతు సము సదసత్పరు
నీశ్వరుఁ జిత్తమున నిలుపు మెపుడు మునీంద్రా! | 0 | కందం |
154 | హర్షము గదురఁగ భారత
వర్షమునం గలుగు పుణ్యవరతీర్థము లు
త్కర్షం జూచుచు విగతా
మర్షుండై సంచరించె మనుజవరేణ్యా! | 0 | కందం |
538 | పదునాల్గు వేల దైత్యులు
మదమున సోదరులు గొల్వ మండుచు శూరా
స్పద మగు రథ నికరముతోఁ
గదనంబున రాము కడకు ఖరుఁ డేతెంచెన్. | 0 | కందం |
50 | కరినాథుండు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాంతుఁడై వేయి వ
త్సరముల్ గుయ్యిడుచుండ వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండుటన్
హరి నీవే శరణంబు నా కనినఁ గుయ్యాలించి వేవేగ వా
శ్చరముం ద్రుంచి కరీంద్రుఁ గాచె మహితోత్సాహంబునం దాపసా! | 3 | మత్తేభము |
480 | కలధౌతాద్రియు నస్థిమాలికయు గోగంధర్వమున్బున్నయుం,
బులిలోలున్భసితంబుఁ బాపతొడవుల్పోకుండఁ దోఁబుట్లకై,
తొలినేవారలతోడఁబుట్టగఁ గళాదుల్గల్గె మేలయ్యె నా
సిలువుల్దూరము చేసికొంటెఱిగియే శ్రీకాళహస్తీశ్వరా! | 3 | మత్తేభము |
371 | అటఁ జని కాంచె భూమిసురు డంబరచుంబిశిరస్సరజ్ఝరీ
పటలముహుర్ముహుర్లుఠదభంగతరంగమృదంగనిస్స్వన
స్ఫుటనటనానుకూలపరిఫుల్లకలాపకలాపిజాలమున్
గటకచరత్కరేణుకరకంపితసాలము శీతశైలమున్. | 2 | చంపకమాల |
315 | చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుడు దగన్
హేమంబు గూడ బెట్టిన
భూమీశుల పాల జేరు భువిలో సుమతీ | 0 | కందం |
475 | ఏలీలన్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షా ధ్వనివ్యంగ్యశ
బ్దాలంకార విశేషభాషల కలభ్యంబైన నీరూపముం
జాలుంజాలుఁ గవిత్వమున్నిలుచునే సత్యంబు వర్ణించుచో,
చీ! లజ్జింపరుగాక మాదృశకవుల్ శ్రీకాళహస్తీశ్వరా! | 4 | శార్దూలము |
236 | సకల జగన్నియామక విచక్షణలీలఁ దనర్చు నట్టి నం
దకధర! తావకస్ఫుర దుదారత మంత్రసమర్థుఁ డైన యా
జ్ఞికుఁ డరణిన్ హుతాశనుని నిల్పిన కైవడి మన్నివాస మౌ
టకుఁ దలపోసి యా క్షితిఁ దృఢంబుగ నిల్పితి వయ్య; యీశ్వరా! | 2 | చంపకమాల |
13 | భువనశ్రేణి నమోఘలీలుఁ డగుచుం బుట్టించు రక్షించు నం
తవిధింజేయు మునుంగఁడందు; బహుభూతవ్రాతమం దాత్మతం
త్రవిహారస్థితుడై షడింద్రియ సమస్తప్రీతియున్ దవ్వులన్
దివిభంగిం గొనుఁ జిక్కఁ డింద్రియములం ద్రిప్పున్ నిబంధించుచున్. | 3 | మత్తేభము |
138 | సకల నియంత యైన హరి సర్వశరణ్యుఁడు మాధవుండు సే
వక నవ కల్పకంబు భగవంతుఁ డనంతుఁ డనంతశక్తి నం
దకధరుఁ డబ్జలోచనుఁడు ధర్మతనూభవుచే నియుక్తుఁడై
యకుటిల భక్తి యోగమహితాత్మకుఁడై ధృతరాష్ట్రు పాలికిన్. | 2 | చంపకమాల |
304 | కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ | 0 | కందం |
542 | ఘోషించి, రామచంద్రుని
దూషించుచు వచ్చినట్టి దూషణు మీఁదన్
రోషించి, సురలు కడు సం
తోషింపఁగ వాని కరముఁ ద్రుంచెఁ గడంకన్. | 0 | కందం |
206 | వినుము, భగవద్బలాన్విత వినుత గుణులు
భువన సంతానహేతు విస్ఫురణ కరులు
పద్మసంభవ తుల్య ప్రభావ యుతులు
పదురు గొడుకులు పుట్టిరి భవ్యయశులు. | 5 | తేటగీతి |
461 | గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కల్యాణనామంబు ప్ర
త్యహముంబేర్కొను నుత్తమోత్తముల బాధంబెట్టగానోపునే
దహనుం గప్పఁగఁజాలునే శలభసంతానంబు నీ సేవఁజే
సి హతక్లేశులుగారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వరా! | 3 | మత్తేభము |
1 | హారికి, నందగోకులవిహారికిఁ జక్రసమీరదైత్య సం
హారికి, భక్తదుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో
హారికి, దుష్టసంపదపహారికి, ఘోషకుటీపయోఘృతా
హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితాప్రహారికిన్. | 1 | ఉత్పలమాల |
165 | సరసిజలోచన కరుణా
పరిలబ్ధ సమస్త ధరణిపాలన మహిమం
బరమప్రీతి సుఖించునె
చిరవిభవోదారుఁ డుగ్రసేనుఁడు జగతిన్. | 0 | కందం |
123 | శ్రీమహిత వినుత దివిజ
స్తోమ! యశస్సీమ! రాజసోమ! సుమేరు
స్థేమ! వినిర్జితభార్గవ
రామ! దశాననవిరామ! రఘుకులరామా! | 0 | కందం |
454 | రాజై దుష్కృతిజెందెఁ జందురుఁడు రారాజై కుబేరుండు దృ
గ్రాజీవంబునఁగాంచె దుఃఖము కురుక్ష్మాపాలుఁడామాటనే
యాజింగూలె సమస్త బంధువులతో నా రాజశబ్దంబు చీ,
చీ జన్మాంతరమందు నొల్లనుజుమీ శ్రీకాళహస్తీశ్వరా! | 4 | శార్దూలము |
182 | మదిఁ దనశాసనమిడి నిజ
పదములు సేవించు లోకపాలాదుల పెం
పొదవింప యదుకులంబున
నుదయించెను భువిని బలసహోదరుఁడగుచున్. | 0 | కందం |
432 | అని పొగడుచు నొయ్యారపు
టనువున జడ లల్లి జిలుఁగు లగుపయ్యెదలం
జనుకట్లు గట్టి గట్టిగ
ననిమిషకాంతలు లతాంతహరణోత్సుకలై. | 0 | కందం |
76 | బలభీమార్జున ముఖ్య చాపధర రూపవ్యాజతం గ్రూరులన్
ఖలులన్ దుష్టధరాతలేశ్వరుల సంగ్రామైక పారీణ దో
ర్బలకేళిం దునుమాడి సర్వధరణీభారంబు మాయించి సా
ధుల రక్షించిన యట్టి కృష్ణుని ననంతుం గొల్తు నెల్లప్పుడున్. | 3 | మత్తేభము |
440 | వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని
ర్వాణశ్రీఁ జెఱపట్టజూచిన విచారద్రోహమో నిత్యక
ల్యాణక్రీడలఁబాసి దుర్దశలపాలై రాజలోకాధమ
శ్రేణీద్వారము దూరఁజేసెదిపుడో శ్రీకాళహస్తీశ్వరా! | 4 | శార్దూలము |
116 | వరుసఁ బృథివ్యాద్యష్టా
వరణావృతమై సమగ్ర వైభవములఁ బం
కరుహభవాండాతీత
స్ఫురణం జెలువొందు నతివిభూతి దలిర్పన్. | 0 | కందం |
556 | అంతట దైత్యుఁడు లంకకుఁ
బంతముతో నేఁగి శింశుపా తరు క్రిందన్
సంతసమున నిడి, దానవ
కాంతల నవనిజకుఁ దోడు కావలి యుంచెన్. | 0 | కందం |
378 | అతఁ డావాతపరంపరాపరిమళవ్యాపారలీలన్ జనా
న్విత మిచ్చోటని చేరఁబోయి కనియెన్ విద్యుల్లతావిగ్రహన్
శతపత్రేక్షణఁ జంచరీకచికురన్ జంద్రాస్యఁ జక్రస్తనిన్
నతనాభిన్ నవలా నొకానొకమరున్నారీశిరోరత్నమున్. | 3 | మత్తేభము |
31 | గోవిందనామకీర్తనఁ
గావించి భయంబు దక్కి ఖట్వాంగ ధరి
త్రీవిభుఁడు సూర గొనియెనుఁ
గైవల్యముఁ దొల్లి రెండు గడియలలోనన్. | 0 | కందం |
57 | ఖరకర కుల జలనిధి హిమ
కరుఁ డగు రఘురామవిభుఁడు గఱకఱితోడన్
ఖరుని వధించెను ఘనభీ
కర శరముల నఖిల జనులుఁ గర మరుదందన్. | 0 | కందం |
333 | పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని బొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! | 0 | కందం |
326 | ధీరులకు జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మఱి మీదట
భూరి సుఖావహము నగును భువిలో సుమతీ! | 0 | కందం |
537 | అందు రామచంద్రుఁ డనుజన్ముఁడును దాను
గొన్ని వాసరంబు లున్నవేళ
వికృత వేషధారి వేవేగ నట శూర్ప
ణఖ యనంగ దైత్య నారి యోర్తు. | 6 | ఆటవెలది |
150 | అని యిట్లుఁ దఱిమి చెప్పిన
విని దుర్యోధనుఁడు రోషవివశుండై తా
నినతనయ శకుని దుశ్శా
సనుల నిరీక్షించి తామసంబునఁ బలికెన్. | 0 | కందం |
451 | రాజుల్మత్తులు, వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చు నం
భోజాక్షీ చతురంత యాన తురగీ భూషాదులాత్మ వ్యధా
బీజంబుల్, తదపేక్ష చాలుఁ, పరితృప్తింబొందితిన్, జ్ఞానల
క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము, దయతో శ్రీకాళహస్తీశ్వరా! | 4 | శార్దూలము |
264 | చిక్కని పాలపై మిసిమిజెందిన మీగడ పంచదారతో
మెక్కిన భంగి మీ విమలమేచక రూపసుధారసంబు నా
మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్
దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ కరుణాపయోనిధీ. | 1 | ఉత్పలమాల |
178 | నరలోకవిడంబనమున
హరి పరమపరుండు మానవాకృతితో ని
ద్ధరఁబుట్టి యాత్మమాయా
స్ఫురణన్ మోహింపఁజేయు భూజనకోటిన్. | 0 | కందం |
361 | కానగ చేరఁ బోలఁ డతికర్ముఁడు నమ్మిక లెన్ని చేసినం
దానది నమ్మి వానికడ డాయఁగ బోయిన హాని వచ్చు న
చ్చో నది యెట్లనం; గొఱఁకు చూపుచు నొడ్డిన బోను మేలుగా
బోనని కానకాసపడి పోవుచుఁ గూలదెఁ గొక్కు భాస్కరా! | 1 | ఉత్పలమాల |
458 | నీపేరున్ భవదంఘ్రితీర్థము భవన్నిష్ఠ్యూత తాంబూలముల్
నీ పళ్ళెంబు ప్రసాదముంగొనికదా నే బిడ్డఁడైనాఁడ న
న్నీ పాటిం గరుణింపు మోపనిఁక నేనెవ్వారికిం బిడ్డఁగాన్
జేపట్టందగుఁ బట్టి మానఁదగదో శ్రీకాళహస్తీశ్వరా! | 4 | శార్దూలము |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.