id
stringlengths
1
3
poem
stringlengths
89
220
label
int64
0
6
label_name
stringclasses
7 values
541
అప్పుడు రామచంద్రుఁడు భయంకర రౌద్ర రసంబు కన్నులన్ నిప్పులు రాల్చుచున్ నెరయ, నిర్జరులార్వ, విచిత్ర శస్త్రముల్ కుప్పలుగాఁగ నేయుచును, గుంజరవాజి రథావళుల్ ధరన్ దప్పక కూల్చుచున్, రుధిరధారలఁ దేల్చె సురారి సంఘమున్.
1
ఉత్పలమాల
564
నీ తండ్రికి నతి మిత్త్రుఁడ నో తండ్రీ! నన్ను నేయ నుచితమె నీకున్? నా తగు పేరు జటాయువు సీతాధిప! నన్ను నెఱుఁగు చిత్తములోనన్.
0
కందం
428
శ్యామలోపరినిబిడపత్త్రాభ్రములకుఁ గాండషండంబు దిగువానకాళ్లు గాఁగఁ బంకరుహనేత్ర వర్షర్తుశంక నొసఁగు పోఁకబోదియనవకంపుమోకఁ గంటె.
5
తేటగీతి
200
జననం బందిన నీలలోహితుఁడు గంజాతాసనుం జూచి యి ట్లను నో దేవ! మదాఖ్య లెట్టివి మదీ యావాసముల్ వీఁక నా కనయంబున్నెఱిఁగింపవే యనుడు నయ్యంభోజగర్భుండు లా లనముం దోఁపఁ గుమార! నీ జననవేళన్ రోదనం బిచ్చుటన్.
3
మత్తేభము
400
తరుణి ననన్యకాంత నతిదారుణపుష్పశిలీముఖవ్యథా భరవివశాంగి నంగభవుబారికి నగ్గము సేసి క్రూరుఁ డై యరిగె మహీసురాధముఁ డహంకృతితో నని రోషభీషణ స్ఫురణ వహించెనో యన నభోమణి దాల్చెఁ గషాయదీధితిన్.
2
చంపకమాల
219
వివరింపన్ హరి యజ్ఞమూర్తి బరమున్ విష్ణున్ హృషీకేశుఁ గే శవుఁ బద్మాక్షు గుఱించి జన్నములు శశ్వద్భక్తిఁ గావింప మా ధవుఁ డాత్మం బరితోష మొందు నతఁ డుద్యత్ప్రీతిఁ గైకొన్న లో కవితానంబులు దుష్టి నొందు ననఘా! కావింపుమా యజ్ఞముల్.
3
మత్తేభము
72
సప్తస్కంధ శిఖా కలాప రుచిమత్సౌదామనీవల్లికా దీప్తోదగ్రముహుస్తమః పిహితధాత్రీ భాగనీరంధ్రమై సప్తాశ్వస్ఫుర దిందు మండల నభస్సంఛాదితాశాంతర వ్యాప్తాంభోద నిరర్గళస్ఫుట శిలావాః పూరధారాళమై.
4
శార్దూలము
175
పాండుభూమీశ్వరుండు సంప్రాప్తమరణుఁ డైన శిశువులఁ బ్రోచుటకై నిజేశుఁ గూడి చనకున్న యట్టి యా కుంతిభోజ తనయ జీవించునే నేఁడు? మనుచరిత్ర!
5
తేటగీతి
401
శ్రేణుల్ గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షు లుష్ణాంశుపా షాణవ్రాతము కోష్ణ మయ్యె మృగతృష్ణావార్ధు లింకెన్ జపా శోణం బయ్యెఁ బతంగబింబము దిశాస్తోమంబు శోభాదరి ద్రాణం బయ్యె సరోజషండములు నిద్రాణంబు లయ్యెన్ గడున్.
4
శార్దూలము
62
నూతన గరళస్తని యగు పూతనఁ బురిటింటిలోనఁ బొత్తుల శిశువై చేతనముల హరియించి ప రేతనగరమునకు ననిచెఁ గృష్ణుఁడు పెలుచన్.
0
కందం
585
దానవు లెప్పుడు చూచిన మానవులను గెలువఁ గలరు, మది నూహింపన్ మానవ భక్షకులై మను దానవులను గెలువ నరుల తరమే జగతిన్?
0
కందం
416
అక్కట గంధవాహ తగవా హరిణాంకునిఁ గూడి పాంథులన్ బొక్కఁగఁ జేయఁ బావకునిపొం దొనరించి జగమ్ము లేర్చునీ యక్కొఱగామి మాన వది యట్టిద చుల్కనివృత్తిదుర్జనుం డొక్కనిఁ జొచ్చి క్రిందుపడు నొండ్లకుఁ గీ డొనరింపగల్గినన్.
1
ఉత్పలమాల
266
హలికులిశాంకుశధ్వజ శరాసన శంఖరథాంగ కల్పకో జ్వలజలజాత రేఖలను సాంశములై కనుపట్టుచున్న మీ కలితపదాంబుజ ద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా తలపున జేర్చికావగదె దాశరథీ కరుణాపయోనిధీ.
2
చంపకమాల
448
కాయల్గాచె వధూ నఖాగ్రములచే గాయంబు, వక్షోజముల్ రాయన్ ఱాపడె ఱొమ్ము, మన్మథవిహారక్లేశ విభ్రాంతిచే బ్రాయంబాయెను, బట్టగట్టె దల, చెప్పన్ రోత సంసారమే జేయంజాల విరక్తు జేయ గదవే శ్రీకాళహస్తీశ్వరా!
4
శార్దూలము
519
ధరణీ సుత యగు సీతకుఁ బరిణయ మొనరింప జనక పార్థిపుఁ డిల భూ వర సుతుల రం డని స్వయం వర మొగిఁ జాటించె నెల్ల వారలు వినఁగన్.
0
కందం
14
జగదధినాథుఁడైన హరిసంతతలీలలు నామరూపముల్ దగిలి మనోవచోగతులఁ దార్కికచాతురి యెంత గల్గినన్ మిగిలి కుతర్కవాది తగ మేరలు సేసి యెఱుంగ నేర్చునే? యగణిత నర్తనక్రమము నజ్ఞుఁ డెఱింగి నుతింప నోపునే?
2
చంపకమాల
349
ఉరుబలశాలి నంచుఁ దను నొల్లని యన్య పతివ్రతాంగనా సురతము గోరెనేని కడసుమ్మది భూతికిఁ బ్రాణహాని యౌ; శిరములు గూల రాఘవునిచే దశకంఠుఁడు ద్రుంగిపోవఁడే యెఱుఁగక సీత కాసపడి యిష్టుల భృత్యులఁ గూడి భాస్కరా!
2
చంపకమాల
419
వాలారుంగొనగోళ్ల నీవలసతన్ వాయించుచో నాటకున్ మేళం బైనవిపంచి నిన్న మొదలున్ నీవంటమింజేసి యా యాలాపంబె యవేళఁ బల్కెడుఁ బ్రభాతాయాతవాతాహతా లోలత్తంత్రుల మేళవింపఁగదవే లోలాక్షి దేశాక్షికిన్.
4
శార్దూలము
232
సత్త్వగుణమున సద్భక్తి సంభవించు భక్తియుతముగఁ జిత్తంబు భవ్య మగును హృదయపద్మంబునం దోలి నెఱుఁగఁబడిన యట్టి నీకు నమస్కారమయ్య; వరద!
5
తేటగీతి
569
వాయు దేవుని బ్రార్థించి, వేయి గతుల నంజనాదేవి గాంచిన యాత్మజుండ, నర్కజుని మంత్రినై యుందు ననుదినంబు, వినుఁడు నా పేరు హనుమంతుఁ డనుదు రిలను
5
తేటగీతి
337
బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా; బలవంత మైన సర్పము చలి చీమల చేత జిక్కి చావదె సుమతీ!
0
కందం
159
చని చని తొంటి మత్స్యకురుజాంగలభూము లతిక్రమించి చ య్యన యమునానదిం గదిసి యచ్చట భాగవతున్ సరోజలో చన దృఢభక్తు సద్గుణవిశారదు శాంతుని దేవమంత్రి శి ష్యుని మహితప్రసిద్ధుఁ బరిశోషితదోషుఁ బ్రబుద్ధు నుద్ధవున్.
2
చంపకమాల
350
ఊరక వచ్చుఁ బాటు పడకుండిననైన ఫలం బదృష్ట మే పారఁగఁ గల్గువానికిఁ బ్రయాసము నొందిన దేవదానవుల్ వారలటుండఁగా నడుమ వచ్చిన శౌరికిఁ గల్గెఁ గాదె సృం గారపుఁ బ్రోవు లక్ష్మియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా!
1
ఉత్పలమాల
502
సల్లలిత ప్రతాప గుణ సాగరుఁడై విలసిల్లి, ధాత్రిపై బల్లిదుఁ డైన రామ నరపాలకునిన్‌ స్తుతి సేయు జిహ్వకున్‌ జిల్లర రాజ లోకమును జేకొని మెచ్చఁగ నిచ్చ పుట్టునే? యల్లము బెల్లముం దినుచు నప్పటి కప్పటి కాస సేయునే?
1
ఉత్పలమాల
86
సర్వఫలప్రదాతయును, సర్వశరణ్యుఁడు, సర్వశక్తుఁడున్, సర్వజగత్ప్రసిద్ధుఁడును, సర్వగతుం డగు చక్రపాణి యీ సర్వశరీరులున్ విగమసంగతిఁ జెంది విశీర్యమాణులై పర్వినచో నభంబుగతి బ్రహ్మము దాఁ జెడకుండు నెప్పుడున్.
1
ఉత్పలమాల
360
కట్టడ లేని కాలమున గాదు శుభం బొరులెంతవారు చే పట్టిననైన మర్త్యునకు భాగ్యము రాదనుటెల్లఁ గల్లకా దెట్టని పల్కినన్; దశరథేశ వసిష్ఠులు రామమూర్తికిన్ బట్టము కట్టఁ గోరి రది పాయక చేకుఱెనోటు భాస్కరా!
1
ఉత్పలమాల
290
ఇచ్చునదె విద్య, రణమున జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్ మెచ్చునదే నేర్చు, వదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ
0
కందం
552
అసుర గొంచుఁ బోవ నవనీ తనూభవ వెఱచి పలికె దిశలు వినఁగ నంత సీత నాదు పేరు, శ్రీరాము భార్యను నన్నుఁ గావరయ్య మిన్న కిపుడు
6
ఆటవెలది
375
అతఁ డట్లౌషధహీనుఁడై నిజపురీయాత్రామిళత్కౌతుకో ద్ధతిఁ బోవన్ సపదిస్ఫుటార్తిఁ జరణద్వంద్వంబు రాకుండినన్ మతిఁ జింతించుచు నవ్విధం బెఱిగి హా నన్నిట్లు దైవంబ తె చ్చితె యీఘోరవనప్రదేశమునకున్ సిద్ధాపదేశంబునన్.
3
మత్తేభము
402
క్రుంకె నపరాంబురాశిం బంకజబంధుఁడు తదీయబడబాముఖవీ క్షాంకురితకుతుకరథ్యని రంకుశవేగాపహృతశతాంగుఁడువోలెన్.
0
కందం
6
భూషణములు వాణికి, నఘ పేషణములు, మృత్యుచిత్త భీషణములు, హృ త్తోషణములు, కల్యాణ వి శేషణములు, హరి గుణోపచితభాషణముల్.
0
కందం
570
వినుఁడు మహాత్ములార! యరవింద హితాత్మజుఁ దోడితెచ్చి, మి మ్మును బొడఁ గానుపింతు నని మ్రొక్కుచు నేఁగి, కపీంద్రుఁ జేరి, తాఁ జనిన తెఱంగు, వారిఁ గను చందము నేర్పడఁ జెప్పి, గొబ్బునన్ బనిగొనివచ్చి, రాము పద పంకజముల్ గనిపించె నంతటన్.
2
చంపకమాల
225
నా మనమునఁ గల దుఃఖవి రామము గావించుకొఱకు రాజీవాక్షుం డీమేర యజ్ఞపోత్రి శ్రీమూర్తి వహించె నిది విచిత్రము దలఁపన్.
0
కందం
97
దరహాసామృత పూరితాస్యు నిజభక్తత్రాణ పారాయణు న్నరుణాంభోరుహపత్ర లోచనునిఁ బీతావాసుఁ ద్రైలోక్యసుం దరు మంజీర కిరీట కుండల ముఖోద్యద్భూషు యోగీశ్వరే శ్వరు లక్ష్మీయుతవక్షుఁ జిన్మయు దయాసాంద్రుం జతుర్భాహునిన్.
3
మత్తేభము
412
గోవధము సేయు తురకల దైవంబవు నీవు మొదలఁ దక్కక పాంథ స్త్రీవధము సేయ రోయుదె నీవర్తన మేమి చెప్ప నీరజవైరీ.
0
కందం
214
అని మైత్రేయుఁడు పలికిన విని మనమున హర్ష మొదవ విదురుఁడు మునినా థునిఁ జూచి పలికెఁ గ్రమ్మఱ వనజోదర పాదభక్తివశ మానసుఁ డై.
0
కందం
327
నడువకుమీ తెరువొక్కట, గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్, ముడువకుమీ పరధనముల, నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ
0
కందం
220
అకుటిల భక్తిఁ గేశవ సమర్పణబుద్ధిఁ గ్రతుక్రియల్ వొన ర్పక విపరీతు లై యుముకురాసులు దంచి ఫలంబు నందఁ గా నక చెడురీతి నూరక ధనవ్యయ మౌటయ కాని మోక్షదా యక మగుచున్నఁ దత్ఫలము నందరు విష్ణుపరాఙ్ముఖక్రియుల్.
2
చంపకమాల
301
ఒక యూరికి నొక కరణము, నొక తీర్పరియైన గాక, నొగి దఱుచైనన్, గకవికలు గాక యుండునె సకలంబును గొట్టువడక సహజము సుమతీ
0
కందం
289
ఆకొన్న కూడె యమృతము, తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్, సోకోర్చువాడె మనుజుడు, తేకువ గలవాడె వంశ తిలకుడు సుమతీ
0
కందం
528
పగలు ప్రాగ్భాగమున నుండి గగన వీథిఁ జరమ దిక్కున కేఁగఁగా శ్రమము దోఁచి చెమట పట్టిన స్నానంబుఁ జేయ నరుగు కరణి, నపరాబ్ధిలో దివాకరుఁడు గ్రుంకె.
5
తేటగీతి
262
చక్కెరలప్పకున్ మిగుల జవ్వని కెంజిగురాకు మోవికిం జొక్కపు జుంటితేనియకు జోకిలుచుం గనలేరు గాక నే డక్కట! రామనామమధురామృతమానుటకంటె సౌఖ్యమా తక్కిన మాధురీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ.
1
ఉత్పలమాల
563
పక్షములుఁ గాళ్ళుఁ దునిఁగిన పక్షీంద్రునిఁ జూచి రామభద్రుఁడు మదిలో రాక్షస మాయయొ? యనుచును శిక్షింపఁ దలంచు నంత శీఘ్రమె పలికెన్.
0
కందం
128
చనఁగ నొల్లక మద్గృహంబునకు భక్త వత్సలుం డగు కృష్ణుండు వచ్చు టేమి కతము? నా కది యెఱిఁగింపు కరుణతోడ ననుచు విదురుండు మైత్రేయు నడిగె ననిన.
5
తేటగీతి
584
ఎత్తితి శంకరాచల మహీన బలంబున బంతి లాగునన్ మొత్తితి సర్వ దిక్పతుల మూఁగిన గర్వము విచ్చిపాఱఁగా, నొత్తితి శత్రు భూపతుల నుగ్ర రణంబున భూమిఁ ద్రెళ్ళఁగా మొత్తితి భోగి కంఠము లమోఘ జవంబున మేటి కీర్తులన్.
1
ఉత్పలమాల
582
గాలి లీల, శీతకర కాంతి విఖ్యాతి, ధూమ రేఖ రీతిఁ దూఱి చొచ్చి యసుర మందిరముల నక్కడ నిక్కడఁ గలయఁ దిరిగి వెదకెఁ గపివరుండు.
6
ఆటవెలది
441
అంతామిథ్య తలంచిచూచిన నరుండట్లౌటెఱింగిన్ సదా కాంతల్పుత్రులు నర్థమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతింజెంది చరించుఁగాని పరమార్థంబైన నీయందుఁ దాఁ జింతాకంతయుఁ జింతనిల్పఁడు గదా శ్రీకాళహస్తీశ్వరా!
4
శార్దూలము
19
నావలని కోర్కి యూరక పోవదు, విడిపించు దోషపుంజములను, మ త్సేవం బుట్టును వైళమ భావింపఁగ నాదు భక్తి బాలక! వింటే.
0
కందం
553
దేవ గణములార! దిక్పాల వరులార! వృక్ష జాతులార! పక్షులార! కుటిల దానవుండు గొంపోవుచున్నాఁడు కరుణతోడ నన్నుఁ గావరయ్య!
6
ఆటవెలది
120
ధరణీశోత్తమ! భూత సృష్టి నిటు సంస్థాపించి రక్షించు నా హరి కర్తృత్వము నొల్ల కాత్మగత మాయారోపితం జేసి తా నిరవద్యుండు నిరంజనుండుఁ బరుఁడున్ నిష్కించనుం డాఢ్యుఁడున్ నిరపేక్షుండును నిష్కళంకుఁ డగుచున్ నిత్యత్వముం బొందెడిన్.
3
మత్తేభము
457
నీపంచం బడియుండఁగాఁ గలిగినన్భిక్షాన్నమే చాలు ని క్షేపంబబ్బిన రాజకీటముల నే సేవింపఁగా నోప నా శాపాశంబులఁజుట్టి త్రిప్పకుము సంసారార్థమై బంటుగాఁ జేపట్టం దయగల్గెనేని మదిలో శ్రీకాళహస్తీశ్వరా!
4
శార్దూలము
273
కుక్షినజాండపం క్తులొన గూర్చి చరాచరజంతుకోటి సం రక్షణసేయు తండ్రివి పరంపర నీ తనయుండనైన నా పక్షము నీవుగావలదె పాపము లెన్ని యొనర్చినన్ జగ ద్రక్షక కర్తవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.
1
ఉత్పలమాల
530
భాను సహస్ర సత్కిరణ పంక్తుల నుద్భవ మైన యా బృహ ద్భానుని వెట్టఁ బెల్లుడుకఁ బడ్డ సుధాంబుధి మీఁది మీఁగడల్ పూని సమీరుచేఁ దెరలఁ బూర్వ దిశం గనుపట్ట దానిపై ఫేన మనంగ నొప్పె శశి బింబము తూరుపుఁ గొండపైఁ దగన్.
1
ఉత్పలమాల
18
ఏల కుమార! శోషిలఁగ? నీ జననంబున నన్నుఁ గానఁగాఁ జాలవు నీవు, కామముఖషట్కము నిర్దళితంబు సేసి ని ర్మూలితకర్ములైన మునిముఖ్యులు గాని, కుయోగిఁ గానఁగాఁ జాలఁడు, నీదు కోర్కి కొనసాఁగుటకై నిజమూర్తిఁ జూపితిన్.
1
ఉత్పలమాల
293
ఉత్తమగుణములు నీచున కెత్తెఱగున గలుగ నేర్చు; నెయ్యెడలం దా నెత్తిచ్చి కరగి పోసిన నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ?
0
కందం
134
క్రూరాత్ము లగుచు లాక్షా గారంబున వారు నిద్ర గైకొని యుండన్ దారుణ శిఖిఁ దరికొలిపిరి మారణకర్మముల కప్రమత్తులు నగుచున్.
0
కందం
48
అమృతోత్పాదన యత్నులై విబుధ దైత్యానీకముల్, మందరా గముఁ గవ్వంబుగఁ జేసి యబ్ధిదఱువంగాఁ గవ్వపుంగొండ వా ర్థి మునుంగన్ హరి కూర్మరూపమున నద్రిం దాల్చెఁ దత్పర్వత భ్రమణవ్యాజత వీఁపుఁదీట శమియింపం జేయఁగా నారదా!
3
మత్తేభము
26
అవనీచక్రములోన నే పురుషుఁ డే యామ్నాయమున్ విన్న మా ధవుపై లోకశరణ్యుపై భవములం దప్పింపఁగాఁ జాలు భ క్తివిశేషంబు జనించు నట్టి భువనక్షేమంకరంబైన భా గవతామ్నాయము బాదరాయణుఁడు దాఁ గల్పించె నేర్పొప్పగన్.
3
మత్తేభము
467
మును నీచే నపవర్గ రాజ్యపదవీమూర్ధాభిషేకంబు గాం చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె ట్లనినం గీటఫణీంద్రపోతమదవేదండోగ్ర హింసావిచా రినిఁగాఁగా నినుఁగానఁగాక మదిలో శ్రీకాళహస్తీశ్వరా!
3
మత్తేభము
111
సరసిజగర్భుండు విరా ట్పురుషునివలనన్ జనించి, భూరితర చరా చర భూత సృష్టిఁ జేయుట వరువడిని విసర్గ మండ్రు భరతకులేశా!
0
కందం
98
వర పరమహంస గమ్య స్ఫురణం దనరారు పరమపురుషుని పదపం కరుహములకు నజుఁడు చతు శ్శిరములు సోఁకంగ నతులు సేసిన హరియున్.
0
కందం
210
అని యిబ్భంగి మునీంద్రు లాడిన కఠోరాలాపముల్ వీనుల న్విని లజ్జావనతాననుం డగుచు నా నీరేజగర్భుండు స య్యన దేహంబు విసర్జనీయముగఁ జేయన్ దిక్కు లేతెంచి త త్తనువుం గైకొనఁ బుట్టె దిక్కలితమై 'తామిస్ర నీహారముల్'.
3
మత్తేభము
88
నిగమార్థప్రతిపాదకప్రకటమై; నిర్వాణ సంధాయిగా భగవంతుండు రచింప భాగవతకల్పక్ష్మాజమై శాస్త్ర రా జి గరిష్ఠంబగు నీ పురాణ కథ సంక్షేపంబునం జెప్పితిన్; జగతిన్ నీవు రచింపు దాని నతివిస్తారంబుగాఁ బుత్రకా!
3
మత్తేభము
515
అనినం గౌశికుఁ డాత్మ నవ్వి, విను మయ్యా! రాజ! నీచేతఁ గా దనరా దైనను రాక్షసుల్ విపుల గర్వాటోప బాహా బలుల్, ఘనుఁడీ రాముఁడు దక్క వారి గెలువంగా రాదు, పిన్నంచు నీ వనుమానింపక పంపు మింకఁ, గ్రతు రక్షార్థంబు భూనాయకా!
3
మత్తేభము
185
అట్లు దలఁచి సరోజజుం డంబుజమును గగనతలమునఁ జూచి యా కమలకోశ లీనమై యున్న లోకవితానములను నొయ్యఁ బొడఁగని హరిచే నియుక్తుఁ డైన.
5
తేటగీతి
189
అమరె భువనంబు లతని కాలాఖ్యతయును గణుతిసేయు తదీయ లక్షణము లర్థి నాకు నెఱిఁగింపు మయ్య వివేకచరిత! యనిన మైత్రేయుఁ డవ్విదురునకు ననియె.
5
తేటగీతి
201
రుద్రనామంబు నీకు నిరూఢమయ్యెఁ జంద్ర సూర్యానలానిల సలిల గగన పృథివి ప్రాణ తపోహృదింద్రియము లనఁగఁ గలుగు నేకాదశస్థానముల వసింపు.
5
తేటగీతి
473
మును నేఁ బుట్టిన పుట్టులెన్నిగలవో మోహంబుచే నందుఁ జే సిన కర్మంబుల ప్రోవులెన్నిగలవో చింతించినం గాన నీ జననంబే యని యున్నవాఁడ నిదియే చాలింపవే నిన్నుఁగొ ల్చినపుణ్యంబునకుం గృపారతుఁడవై శ్రీకాళహస్తీశ్వరా!
3
మత్తేభము
272
పెంపనుఁదల్లివై కలుష బృందసమాగమ మొందకుండ ర క్షింపను దండ్రివై మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివా రింపను వెజ్జవై కృప గుఱించి పరంబు దిర౦బుగాఁగ స త్సంపదలీయ నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ.
1
ఉత్పలమాల
420
పలుకులు నేర్పువేళఁ గలభాషిణి నీ విటులుండఁ బంజరం బుల నరగన్ను పెట్టి ముఖముల్ చరణాగ్రనఖాళి గోఁకుచున్ నిలుగుచు నావులింపుచు వనీవిహగోత్కర మెట్లు వల్కు న ప్పలుకులె యఱ్ఱు లెత్తి విని పల్కెడు వింటివె కీరశారికల్.
2
చంపకమాల
497
మును సంస్కృతమ్ముఁ దేటగఁ దెనిఁగించెడి చోట నేమి దెలియకయుండన్ దన విద్య మెఱయఁ గ్రమ్మఱ ఘన మగు సంస్కృతముఁ జెప్పఁగా రుచియగునే?
0
కందం
241
హరి నిజదాసకోటికిఁ దదాశ్రయులై రమియించు నట్టి స త్పురుషుల కిష్ట వస్తు పరిపూర్ణ మనోరథసిద్ధి గల్గు సు స్థిర మగుచున్న ముక్తియును సిద్ధముగాఁ జెలువారు నన్న న స్థిరతర తుచ్ఛ సౌఖ్యములు సేకురుటల్ మఱి చెప్పనేటికిన్.
2
చంపకమాల
465
తనువే నిత్యముగానొనర్చు మది లేదా, చచ్చి జన్మింపకుం డ నుపాయంబు ఘటింపు, మీ గతుల రెంటన్నేర్పు లేకున్న లే దని నాకిప్పుడెచెప్పు; చేయఁగల కార్యంబున్న సంసేవఁజే సి నినుంగాంచెదఁగాక కాలముననో శ్రీకాళహస్తీశ్వరా!
3
మత్తేభము
583
సీతను గనుగొని రావణుఁ డాతత నయవాక్యఫణితి నతికుతుకమునన్ జేతోభవ నిశితాంబక పాతంబులఁ జాల నొచ్చి పలుకఁగఁ జొచ్చెన్
0
కందం
223
కావున భూమ్యుద్ధరణము గావించు నుపాయ మిపుడు గైకొని నాకున్ దేవా నీ వెఱిఁగింపుము నావుడుఁ బద్మజుఁడు దన మనంబునఁ దలఁచెన్.
0
కందం
283
మనమున నూహపోహణలు మర్వకమున్నె, కఫాది రోగముల్ దనువుననంటి మేనిబిగి దప్పకమున్నె, నరుండు మోక్ష సా ధన మొనరింపఁగావలయుఁ, దత్త్వవిచారము మానియుండుట ల్తనువునకున్ విరోధమది, దాశరథీ కరుణాపయోనిధీ.
2
చంపకమాల
284
శ్రీ రాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరా యనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ
0
కందం
379
అబ్బురపాటుతోడ నయనాంబుజముల్ వికసింపఁ గాంతి పె ల్లుబ్బి కనీనికల్ వికసితోత్పలపంక్తులఁ గ్రుమ్మరింపఁగా గుబ్బ మెఱుంగుఁజన్గవ గగుర్పొడువన్ మదిలోనఁ గోరికల్ గుబ్బతిలంగఁ జూచె నలకూబరసన్నిభు నద్ధరామరున్.
1
ఉత్పలమాల
547
కనియును వినియును నెఱుఁగము కనక మృగం బనుచు వేడ్క గడలుకొనంగన్ గనఁగ, మృగం బద్భుత మిది కనక మృగం బేమి సేయఁగలదో మీఁదన్.
0
కందం
161
హరిభక్తులు పుణ్యాత్ములు దురితవిదూరులు విరోధిదుర్దమబలులుం గురుకులతిలకులు కుంతీ వరసూనులు గుశలులే యవారిత భక్తిన్
0
కందం
312
కొంచెపు నరు సంగతిచే నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ గించిత్తు నల్లి కుట్టిన మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ
0
కందం
177
అనుజుఁడు వీఁడనకయ తన తనయులు నను వెడలనడువఁ దానూరకయుం డిన ధృతరాష్ట్రుఁడు నరకం బునఁబడు నాదైన దుఃఖమున ననఘాత్మా!
0
కందం
560
దీనుని కైవడి నూరక మానము సెడి వగవ నేల మనుజేశ్వర! యీ కానన భూముల వెదకఁగఁ గానని మీఁదటను వగవఁగాఁ దగు మనకున్.
0
కందం
221
కావున యజ్ఞముల్ హరి వికారవిదూరు గుఱించి చేయు నీ భావము సూనృతవ్రత శుభస్థితిఁ జెందెడు నీ కుమారులున్ నీవును నీ ధరాభరము నెమ్మి వహింపుము సజ్జనావలిం బ్రోవుము ధర్మమార్గమునఁ బుత్రక! దోషలతాలవిత్రకా!
1
ఉత్పలమాల
169
శ్రుతులునుఁ గ్రతుజాతము స మ్మతిఁ దాల్చినయట్టి వేదమాతగతిన్ శ్రీ పతిఁ దనగర్భంబున ర క్షితుఁ జేసిన గరిత దేవకీసతి సుఖమే.
0
కందం
226
ప్రళయజీమూతసంఘాత భయద భూరి గర్జనాటోపభిన్న దిగ్ఘన గభీర రావ మడరింప నపుడు రాజీవభవుఁడు మునులు నానందమును బొంది రనఘచరిత!
5
తేటగీతి
358
ఒక్కఁడె చాలు నిశ్చల బలోన్నతుఁ డెంతటి కార్యమైనఁ దాఁ జక్క నొనర్పఁ; గౌరవులసంఖ్యులు పట్టిన ధేనుకోటలం జిక్కఁగనీక తత్ప్రబల సేన ననేక శిలీముఖంబులన్ మొక్కపడంగఁ జేసి తుదముట్టఁడె యొక్కకిరీటి భాస్కరా!
1
ఉత్పలమాల
29
నిగమములు వేయుఁ జదివిన సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్. సుగమంబు భాగవత మను నిగమంబుఁ బఠింప ముక్తినివసనము బుధా!
0
కందం
320
తన యూరి తపసి తపమును, తన పుత్రుని విద్య పెంపు, దన సతి రూపున్, దన పెరటి చెట్టు మందును, మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ
0
కందం
498
తేనెసోఁక నోరుతీయన యగురీతిఁ దోడ నర్థమెల్లఁ దోచకుండ గూఢ శబ్దములను గూర్చిన కావ్యమ్ము మూఁగ చెవిటి వారి ముచ్చటగును.
6
ఆటవెలది
505
పంటల భాగ్యము గలరై పంటలపైఁ బంట లమర బ్రతుకుదు రెపుడున్ బంటలుఁ బాడియుఁ గల యా పంటలు మొదలైన కాఁపుఁ బ్రజలా నగరిన్.
0
కందం
449
నిను నావాఁకిలి గావుమంటినొ? మరున్నీలాలకభ్రాంతిఁ గుం టెన పొమ్మంటినొ? యెంగిలిచ్చి తిను తింటేఁగాని కాదంటినో నిను నెమ్మిందగ విశ్వసించు సుజనానీకంబు రక్షింపఁ జే సిన నావిన్నపమేల గైకొనవయా! శ్రీకాళహస్తీశ్వరా!
4
శార్దూలము
310
కాదు సుమీ దుస్సంగతి, పోదుసుమీ కీర్తి కాంత పొందిన పిదపన్, వాదు సుమీ యప్పిచ్చుట, లేదు సుమీ సతుల వలపు లేశము సుమతీ
0
కందం
435
తివురక యిం కొక్కటి విను కవయునెడన్ వలయుఁ గన్నుఁగవయును మూయన్ భువి నిది యస్మద్దేశ వ్యవహారము కన్నుఁ దెఱవ నఘ మగుఁ దెఱవా.
0
కందం
248
శ్రీరమణీయహార యతసీ కుసుమాభ శరీర, భక్త మం దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో ద్ధార, దురంత పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
1
ఉత్పలమాల
328
నయమున బాలుం ద్రావరు, భయమునను విషమ్మునైన భక్షింతురుగా; నయమెంత దోషకారియొ, భయమే జూపంగ వలయు బాగుగ సుమతీ!
0
కందం
491
సామజయుగ్మ మింపలరఁ జల్లనినీరు పసిండికుండలన్ వేమఱు వంచి వంచి కడువేడుకతో నభిషిక్తఁ జేయగాఁ తామరపువ్వు గద్దియ ముదంబున నుండెడి లోకమాత యా కాముని తల్లి సంపద నఖండముగా నిడు మాకు నెప్పుడున్
1
ఉత్పలమాల
340
అడిగినయట్టి యాచకుల యాశలెఱుంగక లోభవర్తియై కడపిన ధర్మదేవత యొకానొక యప్పుడు నీదు వాని కె య్యెడల; నదెట్లు పాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్ గుడువఁగ నీనిచోఁ గెరలి గోవులు తన్నునుగాక భాస్కరా!
2
చంపకమాల
366
క్రూర మనస్కులౌ పతులఁ గొల్చి వసించిన మంచివారికిన్‌ వారి గుణంబె పట్టి, చెడు వర్తన వాటిలు; మాధురీజలో దారలు గౌతమీముఖమహానదు లంబుధిఁ గూడినంతనే క్షారముఁ జెందవే మొదలి కట్టడ లన్నియుఁ దప్పి భాస్కరా!
1
ఉత్పలమాల
275
కలియుగ మర్త్యకోటి నిను గన్గొనరాని విధంబొ, భక్తవ త్సలత వహింపవో, చటులసాంద్రవిపద్దశవార్ధి గ్రుంకుచో బిలిచిన బల్కవింతమఱపే, నరులిట్లనరాదుగాక నీ తలపున లేదె సీతచెఱ, దాశరథీ కరుణాపయోనిధీ.
2
చంపకమాల