id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
1036
రాజ్యమేలంగఁ గలవాఁడె రాజు గాక | హీనమతియై చరించువాఁ డేటి రాజు? భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
83
కడు దొంగతనమునఁ గని తల్లి వైచినఁ- దనబిడ్డనిగ బెంచె నిను యశోద జనని గర్భము దించుకొనిన వేఱొకతల్లి- కడుపుఁ జేసికొనంగ గలిగెనన్న తండ్రి వివాహయత్నము సేయ నొల్లక- తగులుక వచ్చె నీ ధర్మపత్ని యన్న రారాజు కీనున్న నీసోదరి- యింటికి జోగిరా నంటుకొనియె
3
seesamu
1313
శ్రీమదఖండలక్ష్మీప్రసన్నుడు మాక- । రాట్కులాంబోధికైరవహితుండు సరసుడౌ వేంకటపెరుమాళ్ల రాజేంద్రు- । డొకనాడు కొలువు కూర్చుండి నన్ను గని పోలిపెద్దివేంకటరాయసుకవీంద్ర । రమ్మని ప్రేమమీరంగ పురుష- విరహంబు శ్రీహరిస్మరణశృంగారంబు- । గను చమత్కృతిశతకం బొనర్పు-
3
seesamu
1475
కలవి గ్రక్కకురె కోకిలలార మీ కూక । సుదతి నెమ్మొగమెత్తి చూచుదాక చలము సేయకురె వెన్నెలలార మీ కాక । హరిమధ్య సుంత మాటాడుదాక మురిపేల చల్వతెమ్మెరలార మీ రాక । చంచలాక్షిని కౌగిలించుదాక మదనా సరేను మంచిది లేర నీ ఢాక । ననబోణి నాతోడ నెనయుదాక
3
seesamu
2308
కొలువం జాలక మాన, నీ నుతులు పెక్కుల్ సేయుటన్ మాన, నిన్ దలఁపం జాలక మాన, నేఁ గలసి నీ దాసానువర్గంబుతో నిలువం జాలక మానఁబో! కడపటన్ నీనామముల్ విన్నవా రలకుం గల్గును మోక్షలక్ష్మి రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
2357
జిలిబిలిమాటలఁ బలికెడి యలశిశువును దండ్రి ముద్దులాడెడుపగిదిన్‌ బలికెద నను మన్నింపుము సలలితకాంతిప్రసన్న! సంపఁగిమన్నా!
1
kandamu
1321
శ్రీకరంబుగ ప్రేమచే నాదు మనసు రా । నడుచుకొన్నట్టి నీ నాగరికము వినయవివేకభావనలొప్ప కందువ । మాటలాడెడు నెరనీటుతనము దర్పకశాస్త్రపద్ధతి మీరి కళలంటి । సొక్కించునట్టి నీ సోయగము సరసత్వమున బంధసరణి గుర్తెరిగి నన్ । రతుల తేలించు నీ రసికతయును
3
seesamu
587
ఉరగము గాలిఁ గ్రోలి గుహనుండదె యాకులు నించుకోనల- న్దిరుగదె మేఁక నీళ్ల వెనుదీయకఁ గృంకదె కప్ప యెవ్వరే- కరణిఁ జరించుచున్న నినుఁ గన్గొనకున్నఁ బరంబు లేదుగా చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
3093
తామసించి సేయఁదగ దెట్టి కార్యంబు వేగిరింప నదియు విషమ మగును పచ్చి కాయ దెచ్చి పడవేయ ఫలమౌనె? విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3976
_x000D_ తాము బలిమిఁబెట్ట తమకు తామే కల్గు _x000D_ నడుగనిడినఁ దాము నడుగఁగలుగు _x000D_ విందునీనివాని కెందునులేదయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1205
ధర నొక్క బుద్ధిహీనునిఁ దిరముగ రోటనిడి దంచెఁ దేనియుఁ బెలుచం దురు మగును గాని, యతనికి సరసత్వము గలుగదండ్రు సతము కుమారా!
1
kandamu
2220
ఫణుల పుట్టల మీఁదఁ బవ్వళించిన యట్లు - పులుల గుంపునఁ జేరఁబోయిన యట్లు మకరి వర్గంబున్న మడుఁగుఁ జొచ్చినయట్లు - గంగ దాపున నిండ్లు గట్టినట్లు చెదల భూమిని చెరగు చాఁప బఱచినయట్లు - ఓటిబిందెలఁ బాల నునిచినట్లు వెఱ్ఱివానికిఁ బహువిత్త మిచ్చినయట్లు - కమ్మగుడిసె మందుఁ గాల్చినట్లు
3
seesamu
3709
_x000D_ మునిజనములు కలఁగ మునిఁగి వెళ్ళిన బావి _x000D_ బ్రహ్మకుఁ దలయెత్తరాని బావి _x000D_ మొలల బంటిగానుముంచు నెవ్వరినైన _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2141
ప్రజల జంతుల హింసించు పాతకుండు - కాలకింకర గదలచేఁ గష్టమొందు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
3041
గాన నీయొక్క ప్రజ్ఞలు గట్టిపెట్టి | రాజసముతోడ నుండుడు తేజమలరతగవులున్నది మనమధ్య తాడిమళ్ళ | రాజగోపాల రావయ్య రమణి గూడ.
2
teytageethi
162
భవభయంబున నిన్నెంత ప్రస్తుతింపఁ-గరుణఁ జేపట్ట లేని నీ ఘనత యేమి? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
364
ఆకుల్ మెక్కదె మేఁక? చెట్టుకొననొయ్యన్ వ్రేలదే పక్షి? పె- న్గాకుల్ గ్రుంకవె నీట? గాలిఁ గొనదే నాగంబు? బల్గొందులన్ ఘూకం బుండదె? కోనలం దిరుగదే క్రోడంబు? నిన్గాంచినన్ గాకిన్నింటను ముక్తి చేకుఱునె? భర్గా! పార్వతీవల్లభా!
7
saardulamu
3494
_x000D_ పరగ చెట్టుఁబెట్టి పాలింప కుండెనా _x000D_ వెలుగుదాటి వీధి వెళ్ళిరాఱు _x000D_ ఆడువారి చిత్త మటువలె నుండురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3004
అవతారమెత్తుచు హతము సేయుటగాని గొనసాగనీయవు గొల్లబిరుదువంచించి మరి గొల్లవారల నందఱ చిక్కుబెట్టుచు నీవు చెలగినావుబలిచక్రవర్తిని బంధించితివిగాని పాపమెఱుంగవు పడుచవగుచుసుఖము నెరుంగగా సూటివౌదువెకాని బిరుదైన చక్కని పేరు గనవు
3
seesamu
4471
నందిగణం బెక్కి నడువీథినే వచ్చు । దైవమో గంగ మోదమ్ము రాజో ఇసకాప్పసీనఁడో యీరుఁడో యీసుఁడో । యీసుడైతే యెనకఁ దోఁకలేదె ఆళ్ళరో గణపతో అమ్మ చీతమ్మరో । చీతామ్మరైయుంటె సింగమేది మంచిది చూతాము మారమ్మ కాబోలు । మారెమ్మయైతేను మాలయేది
3
seesamu
1184
కత్తిని చేతంబట్టుచు మొత్తఁదలఁచి వచ్చువాని ముఖ్యముగా మే ల్హత్తించిన నదె ప్రాయ శ్చిత్త మతనిఁ జంపఁదగదు చిన్ని కుమారా!
1
kandamu