id stringlengths 1 4 | poem stringlengths 71 312 | label int64 0 7 | label_name stringclasses 8
values |
|---|---|---|---|
602 | హరునకు వందనంబు ఫణిహారునకు న్శరణ్యార్థి దేవతా-
వరదునకుం జొహారు పురవైరికి మ్రొక్కు నగేంద్రజామనో-
హరునకు జోత యంచు ననయంబును నీకు నమస్కరించెదన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
4089 | _x000D_
ధైర్యయుతుని కితరధనమైన నదురేమి
_x000D_
దాన మిచ్చునపుడె తనకుఁదక్కె
_x000D_
నెలమి మించుపనికినెవ రేమిసేయుదు
_x000D_
రడుగుదప్ప తప్పు పిడుగు వేమ. | 0 | aataveladi |
4287 | చొచ్చితిఁ దల్లి నీమఱుఁగు సొంపుఁగ నీకరుణాకటాక్ష మె
ట్లిచ్చెదొ నాకు నేఁడు పరమేశ్వరి! యోయలమేలుమంగ నీ
మచ్చిక నంచు నీతరుణి మన్నన నే నినుఁ గంటి నీకు నా
బచ్చెనమాట లేమిటికిఁ బ్రాఁ తిదె చూడఁగ వేంకటేశ్వరా! | 5 | champakamaala |
114 | భక్తసంరక్షణ త్వరా పరవశతను-జేసినా వేమొ యూరక సేయఁగలవె?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
4002 | _x000D_
వ్రేయవ్రేయనదియ విత్తన మనిపించు
_x000D_
వ్రేయవ్రేయఁ బ్రబల వృక్షమగును
_x000D_
తెలియఁ దెలియవాఁడు దేవుఁడనందగు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2313 | చెలువంబొప్ప సువర్ణముద్ర లితరుల్ చెల్లించుటే క్రొత్త, కా
కల నీ ముద్రలు చూడఁ జెల్లుబడి చక్రాలంచు వేయించుమం
డలనాథాగ్రణి క్రొత్త, నీ బలిమి నానావర్ణపుం దోలుము
ద్రలు చెల్లించితి విందు నందు రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
3762 | _x000D_
ఘటము జలములందు గగనంబు కనఁబడు
_x000D_
ఘటము జలము లేమి గగనమేది
_x000D_
ఘటములోన జ్యోతిఁ గ్రమమునఁ దెలియుఁడీ
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3341 | _x000D_
మాయలోనఁ బుట్టి మాయలోననె పెరిగి
_x000D_
మాయఁ దెలియలేని మనుజుఁడేల
_x000D_
మాయఁ దెలియువాఁడు మహిమీఁద ధన్యుండు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1121 | పనులెన్ని కలిగి యున్నను
దిన దినముల విద్యపెంపు ధీయుక్తుఁడవై
వినఁగోరుము సత్కథలను
కని విబుధులు సంతసించు గతినిఁ గుమారా! | 1 | kandamu |
3989 | _x000D_
అలయఁజేసి మలఁచి యడిగండ్లు మలిగండ్లు
_x000D_
తిరిపెమిడెడు కటికిదేబెలెల్ల
_x000D_
నెలమి మన్నుదినెడు నెఱ్ఱలౌదురు సుమీ
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1297 | దృశ్యపదార్థము లెల్లను
నశ్యము లని తలపఁ కుండినను లోపంబౌ
దృశ్యంబున నస్థిరత న
వశ్యము చిత్తమునఁ దలఁప వలదె కుమారీ! | 1 | kandamu |
3940 | _x000D_
తల్లిగర్భమందు తాను వెడలువేళ
_x000D_
నఱుత లింగముండ దరసిచూడ
_x000D_
నడుమ లింగమూన నగుఁబాటు గాదటో
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2632 | నిన్నే రూపముగా భజింతుమదిలో, నీరూపుమోఁకాలొ, స్త్రీ
చన్నో, కుంచమొ, మేఁకపెంట్రికయొ, యీసందేహముల్మాన్పి నా
కన్నారన్భవదీయమూర్తి సగుణాకారంబుగాఁజూపవే
చిన్నీరేజవిహారమత్తమధుపా శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
2451 | ఇప్పదవు లందనేరని
మొప్పెలకుం దెలుప వశమె ముందఱగానే
తప్పులు పట్టుచు మఱి చేఁ
జప్ప ట్లిడి నగుదురన్న! సంపఁగిమన్నా! | 1 | kandamu |
77 | మును నందగోవత్సములఁ గాయునప్పుడు- సనునయించిరె కంజజాది సురలు?
విటచోరచేష్టల వ్రేపల్లెఁ దిరుగు నీ- దగుమ్రోల నచ్చర లాడినారె?
నరరథాశ్వముల సంగరవీథిఁ దోలునాఁ- డెంచి దిక్పతులు భావించినారె?
మగధేశుదాడికి మథుర వీడిననాఁడు- దేవర్షు లెల్లఁ గీర్తించినారె? | 3 | seesamu |
4246 | తొలకరించు తొయ్యలి వధూమణి చక్కనితల్లి మానినీ
తిలకమ దేవదేవుని సతీమణి యోయలమేలుమంగ నీ
సొలపులచూపులే విభునిచూపులవిందు లటంచు నెచ్చెలుల్
పలుకఁగ నిన్నుఁ జూచి నగుఁ బైకొని నీసతి వేంకటేశ్వరా! | 5 | champakamaala |
4366 | కూటికియ్యని విటకాని పోటు మెండు । మాచకమ్మకు మోహంబు మదిని మెండు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
3954 | _x000D_
శివుఁడు బ్రహ్మ మనుచు శ్రుతులెల్లఁ బలుకంగ
_x000D_
పరులఁ గొల్చు నేల బ్రాహ్మణుండు
_x000D_
హరునిభక్తజనుల యగ్రజు లగుఁ గాదె
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4250 | లోలవిలోలనేత్రకుఁ దళుక్కున ఱెప్పలు వంచి యెత్తినన్
మేలిమిఁ జెక్కుటద్దముల మేలములై యలమేలుమంగకున్
నీలపయోదపుందుఱుము నిగ్గుతటిల్లతలే యటంచు ను
న్మీలనిమీలనంబులకె మెత్తువు నీవును వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
1752 | నాణిముత్తెపు నత్తు మోవంది గుల్క | నెంచదగినట్టి తొలకరి మించొ యనగదాని వగ జూడ దమి నిల్వ దరమె నీకు | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
3541 | _x000D_
ఎంతచదువుఁ జదివి యెన్ని విన్నను గాని
_x000D_
హీనుఁ డవగుణంబు మానలేఁడు
_x000D_
బొగ్గు పాలఁగడుగఁ బోవునా మలినంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3835 | _x000D_
పలుగువానికేల పదనమృద్ధి దలంప
_x000D_
పలుగువరుస వానిబలిమి దప్ప
_x000D_
చలమువాని కేల సాత్వికధర్మంబు
_x000D_
ఏమి యొకటి ఘనము నిలను వేమా. | 0 | aataveladi |
2642 | నీపంచం బడియుండఁగాఁ గలిగిన న్భిక్షాన్నమే చాలు ని
క్షేపంబబ్బిన రాజకీటముల నే సేవింపఁగా నోప నా
శాపాశంబులఁజుట్టి త్రిప్పకుము సంసారార్థమై బంటుగాఁ
జేపట్టం దయగల్గెనేని మదిలో శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
2905 | అంగన నన్నుఁ గూడి చతురంగములాడఁగ నోరఁజూపు క-
న్నుంగవ నీటుపొంగెడు చనుంగవ నీటుమెఱుంగు చక్కటిన్
సంగతినుంచు హస్తజలజాతము నీటఁ దలంచుకొన్న న-
న్నంగజుఁ డీరుబారుగ సుమాసిని వ్రేసెడు సుందరీమణీ! | 6 | vutpalamaala |
1458 | హా మరుని నాజిలో గెల్చినపుడె నీదు । కుసుమబాణునినగరెల్ల కొల్లసేయ
నెపుడు గల్గును చాన నీ హితము మాన । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
2565 | మలినాంగుం డగుటేమి కష్టము మనోమార్గంబు నీ భక్తిని-
ర్మలసౌభాగ్యనిధానదీపశిఖయై రంజిల్లదే భూషణో-
జ్జ్వలదేహుం డగుటేమి తేజము మనోవ్యావృత్తి దుర్మోహసం-
చలదుష్పంకముఁ బొంది పీడఁ బడఁగాఁ జర్చింప సర్వేశ్వరా! | 4 | mattebhamu |
381 | నానాద్వీపధరాధురావహనమాన్యస్ఫారబాహాబలా-
నూనఖ్యాతిసమేతులైన శశిబిందుక్ష్మాతలేశాదిక
క్ష్మానాథు ల్చనిపోవుట ల్దెలియరో సత్యంబులా దేహముల్?
కానంజాలరు గాక దుర్నృపులు భర్గా! పార్వతీవల్లభా! | 7 | saardulamu |
3191 | _x000D_
ఆఱురుచులు వేఱు సారంబు నొక్కటి
_x000D_
సత్యనిష్ఠ వేఱు సత్యమొకటి
_x000D_
పరమఋషులు వేఱు భావ్యుఁ డొక్కండురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3747 | _x000D_
బ్రహ్మ యెవనికొడుకు పరికింపఁగా భువి
_x000D_
విష్ణు వెవనికొడుకు వెలయఁజూడ
_x000D_
శివుఁడు నెవనికొడుకు సిగ్గెఱుఁగరు జనుల్
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2833 | వినఁదగు నెవ్వరు సెప్పిన
వినినంతనె వేగపడక వివరింపఁదగున్
గని కల్ల నిజముఁ దెలిసిన
మనుజుఁడె పో నీతిపరుఁడు మహిలో సుమతీ! | 1 | kandamu |
3895 | _x000D_
కాలచక్ర మెఱుఁగఁగా లేక యెప్పుడు
_x000D_
సంధ్యజపముసేయు జాణలార
_x000D_
సంధ్యజపములోన జాడ లెట్లుండును
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1780 | చెరుకవిలు వంచి యటపొంచి చేవమించి | పదరి యెద నాటనేసెనే పణతి యనుచుబలుకుచున్నది వలపున భ్రమసి మిగుల | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
3103 | _x000D_
పిసిని వాని యింట పీనుఁగు వెడలిన
_x000D_
కట్ట కోలలకును కాసు లిచ్చి
_x000D_
వెచ్చ మాయె నంచు వెక్కి వెక్కేడ్చురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4244 | తరుణీ! మహానిధానమ! సుధామయకూపసమస్త వైభవా
భరణమ! దేవదేవుని కృపామతి! యోయలమేలుమంగ! నీ
కరుణయ చాలు లోకములఁ గావఁగ నంచు మునీంద్రులున్
సురల్ నిరతి నుతించి మ్రొక్కుదురు నీ ప్రియకాంతను వేంకటేశ్వరా! | 5 | champakamaala |
3091 | తన మదిఁ గపటము గలిగిన
తనవలెనే కపట ముండు, తగ జీవులకు\న్
తన మది కపటము విడిచినఁ
దన కెవ్వడు కపటి లేఁడు ధరలో వేమా! | 1 | kandamu |
2064 | లోకమం దెవఁడైన లోభి మానవుఁ డున్న - భిక్ష మర్థికిఁ జేతఁ బెట్టలేఁడు
తాను బెట్టకయున్న తగవు పుట్టదుగాని - యొరులు పెట్టఁగఁ జూచి యోర్వలేఁడు
దాత దగ్గఱఁ జేరి తన ముల్లె చెడినట్లు - జిహ్వతోఁ జాడీలు చెప్పుచుండు
ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు - మేలు కల్గినఁ జాల మిడుకుచుండు | 3 | seesamu |
3467 | _x000D_
అయిదు నక్షరముల యంగంబు దెలిసిన
_x000D_
నైదునందు ముక్తి యమరియుండు
_x000D_
నైదులోననున్న యతఁడెపో బ్రహంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
875 | దుష్టుండ దురాచారుఁడ
దుష్టచరిఁత్రుఁడను చాల దుర్బుద్ధిని నేఁ
నిష్ట నిను గొల్వనేరను
కష్టుఁడ నగు నన్ను కావు కరుణను గృష్ణా. | 1 | kandamu |
1103 | బావిలోపలఁ బడ్డ పామును వెడలింపఁ | జనువానిఁ గరువక చనఁగఁగలదె
చిచ్చులోఁ బడెడు వృశ్చికమును వెడలింపఁ | జనువాని మీటక నడలఁగలదె
పెనువెల్లిఁ బడి పోవు బెబ్బులిఁ బరికింపఁ | జనువాని మ్రింగక మనుపఁగలదె
బురదగోఁతను బడ్డ పోట్లావు లెగనెత్తఁ | జనువాని బొడువక జరగఁగలదె | 3 | seesamu |
3887 | _x000D_
మంత్రమెల్ల మఱచి మధురాధరముఁగోరు
_x000D_
నేవిధమున భక్తుఁ డెఱుఁగు నిన్ను
_x000D_
యోనిఁ జూచి పరమయోగంబు మఱచురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
698 | మనమున నూహపోహణలు మర్వకమున్నె కఫాదిరోగముల్
దనువుననంటి మేనిబిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా
ధన మొనరింపఁగావలయుఁ దత్త్వవిచారము మానియుండుట
ల్తనువునకున్ విరోధమిది దాశరథీ! కరుణాపయోనిధీ! | 5 | champakamaala |
1766 | యొనర భుజింప బ్రాణేశు నుపచరించు | సురటి చేబూని విసరును సొంపుమీరనింపు బుట్టించు నా బాల నేలవేల | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
1641 | తనయుల బాళి మ్రుగ్గులిడుఁ దాలిమి మీఱఁగ నెవ్వరేమి చె-
ప్పిన నది సేయుచుండు నిలవేల్పులకున్ మఱి మీఁదు గట్టు దా-
ననయము గర్భహేతువివిధౌషధముల్ పచరించు ధర్మచిం-
తన నొకకాలమైన మదిఁ దప్పని తల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
433 | ఎట్టుగఁ బాటుపడ్డ నొక యించుక ప్రాప్తము లేక వస్తువుల్
పట్టుపడంగ నేరవు; నిబద్ధి సురావళిఁ గూడి రాక్షసుల్
గట్టు పెకల్చి పాల్కడలిఁ గవ్వముచేసి మథించి రంతయున్
వెట్టియె గాక యేమనుభవించిరి వారమృతంబు భాస్కరా! | 6 | vutpalamaala |
1215 | ఆటలఁ బాటలలో నే
మాటయు రాకుండఁ దండ్రి మందిరమందున్
బాటిల్లుఁ గాపురములో
వాట మెఱిఁగి బాల! తిరుగ వలయుఁ గుమారీ! | 1 | kandamu |
334 | పురరక్షఃపటుతూల హవ్యవహ! విస్ఫూర్జద్రురుక్రూరగో-
పరిపంథిక్షణదాచరోరగ మహాపక్షీంద్ర! ఘోరాంధకా-
సురగంధద్విరదేంద్ర పంచముఖ! యక్షుద్రప్రభావోల్లస-
త్కరిలేఖద్విషదభ్ర గంధవహ! భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
2277 | జనకుండా జనకుండు నీ సతికిఁ, గౌసల్యా యహల్యాఘమో
చన!నిన్ గాంచిన తల్లి, పంక్తిరథుఁడా సర్వేశ! మీ తండ్రి, యే
మి నిమిత్తంబున నుద్భవించితివొ నెమ్మి న్నిట్టు లీపుట్టు వు
గ్రనిశాటాంతక! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
1331 | వంకెవంకెల గాజు వైఖరి పొడగన్న । తలపౌను నీదు ముంగురుల ఘనము
దాడింబపండ్లు చేదగిలిన తరిని జ్ఞా- । పకమౌను నీదు గుబ్బల పసందు
చీమలబారు చూచినవేళ మది కళు- । క్కని గప్తి తగులు నూగారు తీరు
జలపూత గల కెడముల డాలు గాంచిన । తోచు నీ నునుపిరుందుల మిజాదు | 3 | seesamu |
3430 | _x000D_
తనలోననె సకలంబును
_x000D_
తనరందా నగుటయెఱిఁగి తారకమాత్మన్
_x000D_
దనువనుచుఁ బరిణమించిన
_x000D_
మనుజునకును ముక్తికలదు మహిలో వేమా. | 1 | kandamu |
370 | హరి దైవంబు విరించి సర్వభువనాధ్యక్షుండు బృందారకే-
శ్వరుఁడాఢ్యుండు హుతాశనుండు పతి భాస్వంతుండు వేల్పండ్రు
లో నరయ న్నేరరుగా ‘శివాత్పరతరం నాస్తీ’తివాక్యార్థ మే-
కరణిం గోవిదులైరొ కాని మఱి! భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
1302 | ఎన్నాళ్లు బ్రతుకఁ బోదురు
కొన్నాళ్లకు మరణదశలఁ గ్రుంగుట జగమం
దున్నట్టివారి కందఱి
కిన్నిహితము సతము మంచి కీర్తి కుమారీ! | 1 | kandamu |
3973 | _x000D_
ఆఁకలన్నవాని కన్నంబు పెట్టిన
_x000D_
హరున కర్పితముగ నారగించు
_x000D_
ధరవిహీనునకును దానము నటువలె
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2113 | మత్తులైనట్టి దుర్జాతిమనుజులెల్ల - నిన్నుఁ గనలేరు మొదటికే నీరజాక్ష!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
854 | దుర్భర బాణము రాఁగా
గర్భములోనుండి యభవ కావు మటన్న\న్
నిర్భరకృప రక్షించితి
వర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా. | 1 | kandamu |
138 | రాజకళఁ జూచి ని న్నొక రాజు వనిన-మానుషం బేది? యిది యంత మాయ గాని
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
2206 | అమరేంద్రవినుత! నేనతి దురాత్ముఁడ నంచుఁ - గలలోన నైనను గనులఁ బడవు
నీవు ప్రత్యక్షమై నిలువకుండిన మానె - దొడ్డగా నొక యుక్తి దొరకెనయ్య!
గట్టికొయ్యను దెచ్చి ఘనముగా ఖండించి - నీ స్వరూపము చేసి నిలుపుకొందు
ధూప దీపము లిచ్చి తులసితోఁ బూజించి - నిత్యనైవేద్యముల్ నేమముగను | 3 | seesamu |
3827 | _x000D_
తావులేనిచోట తాను తానె యుండు
_x000D_
తావు కలుగుచోట తానులేఁడు
_x000D_
తావు తానెయైన తత్వంబుఁ దెలియుఁడీ
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
933 | దండ ముద్దండదోర్దండకోదండవి- | ఖండిత చండవేదండ, నీకు!
జోహారు హారామరాహారనీహార- | గోహర గోహీరదేహ, నీకు!
నతి శతక్రతుముఖాదితిసుతాతతకృత- | స్తుతికృతామితహిత కుతుక, నీకు!
జేజే పరాజితోగ్రాజివిరాజిత- | వ్యాజనిరీజసమాజ, నీకు! | 3 | seesamu |
4125 | _x000D_
బిందురక్తములను బెరసిన దేహంబు
_x000D_
చంద మెఱుఁగక ద్విజశబ్ద మిడఁగ
_x000D_
నడచిన విడుచున నరకంబు మృత్యువు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1887 | పదివన్నె బంగారుపడతి నెమ్మెయి కాంతి యలరు చందురుని హసించు మోమువెలలేని వజ్రాల వెలసేయు రదనముల్ పచ్చివిద్రుమకాంతి సుదతి మోవిముకురసన్నిభములు శుకవాణి చెక్కులు ముంగుర్లు తేటుల రంగు దెగడుకనకకలశములు కామిని పాలిండ్లు నలినాక్షి నాభి పున్నాగకుసుమ | 3 | seesamu |
707 | కాంచన వస్తుసంకలిత కల్మషమగ్నిపుటంబు బెట్టి వా
రించినరీతి నాత్మనిగిడించిన దుష్కర దుర్మలత్రయం
బంచిత భక్తియోగ దహనార్చిఁ దగుల్పక పాయునే కన
త్కాంచనకుండలాభరణ దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
575 | పొరిఁబొరిఁ బుణ్యభూములకు బోవఁగనేలఁ గడు న్దపోమహా-
ధ్వరము లొనర్చనేల యుపవాసములన్ గృశియింపనేటికిన్
హరహర యంచు నొక్కతరి నాడినఁజాలు నఘప్రశాంతికై
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
956 | మెలఁగుచుండియు భువనమంగళవిలాస- | లీలఁ జెలగుదువంట మేల్ బళీ యయారె!
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
38 | నెల్లలోక మెఱింగిన గొల్లవాఁడ-వేది కుల మింత రాజస మేమి నీకు
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
2583 | అమరేంద్రాబ్జభవాచ్యుతాదులకు నీ యాజ్ఞాప్రభావం బలం-
ఘ్యము నీకు భవదీయభక్తమహదాజ్ఞాపంబు నుద్యత్ప్రభా-
వము లోకంబులలో నలంఘ్యమగుట న్వర్ణింపఁగా నీ మహ-
త్త్వముకంటెం గడుఁ జెల్లు భక్తుల మహత్త్వంబెన్న సర్వేశ్వరా! | 4 | mattebhamu |
1949 | ఇరవొంద\న్ సచరాచరప్రతతుల న్నెన్నంగ శక్యంబు కా
కరయ\న్ పద్మభవాండ భాండచయము న్నారంగ మీకుక్షిలో
నరుదార న్నుదయించుఁ బెంచు నడఁగు న్నన్నారికేళోద్భవాం
తర వాఃపూరము చంద మొంది యెపుడున్ దైత్యారి నారాయణా! | 4 | mattebhamu |
3944 | _x000D_
స్థావరముల భక్షింతురు
_x000D_
భావింపగ జంగమములు బహువిధ రుచుల\న్
_x000D_
ఆవల సకలప్రాణులు
_x000D_
తీవరమునఁ దమ్ముఁ దామె తిందురు వేమా. | 1 | kandamu |
2595 | కలవారై మతిమంతులై రసికులై గంభీరులై ధీరులై
లలనామన్మథులై సముజ్జ్వలవచోలాలిత్యులై నిత్యులై
బలవిభ్రాజితులై యశోభరితులై భాసిల్లు భాగ్యోదయుల్
తొలిజన్మంబుల మిముఁ గొల్చిన మహాత్ముల్ వారు సర్వేశ్వరా! | 4 | mattebhamu |
851 | దుర్జనులగు నృపసంఘము
నిర్జింపఁగఁ దలచి నీవు నిఖిలాధారా
దుర్జనులను వధియింపను
నర్జును రధచోదకుండ వైతివి కృష్ణా. | 1 | kandamu |
3946 | _x000D_
ప్రాణ లింగ మెన్నఁ బ్రార్థించి కీర్తించి
_x000D_
కట్టివేయ నేమి కల్గఁజేసె
_x000D_
నఖిలజనులకెల్ల నానందమే సాక్షి
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4474 | వావివరుసలు లేవాయె వసుధలోన । నీదు కరుణయు రాదాయె నీరజాక్ష
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
2925 | నెల పయనం బటన్న విని నీవడలొందుదువంచు నింతలో
నెలతరొ వత్తునంచు వెస నిన్నొక సమ్మతి చేసివచ్చి క్రొ-
న్నెలలకు వేఁడివెన్నెలకు నిద్దపుఁ బూవిలుకాని కాఱుచి-
న్నెలలకుఁ దాళలేనయితి నీవెటులోర్తువె సుందరీమణీ! | 5 | champakamaala |
583 | వెరవిరవార నేపగిది వేఁడినఁ గానియు నియ్యలేని ము-
ష్కరనరనాయకాధముల సావడులం బడి ప్రేలువారికిన్
నిరతకృపార్ద్రదృష్టిమెయి నీవిడ కన్యుఁ డొసంగఁజాలునే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
4092 | _x000D_
బిడ్డలను సతులను వేఱైనచుట్టాల
_x000D_
సంపదల తనువులఁ జాలనమ్మి
_x000D_
సంతసిల్లుచుండు క్షణభంగురము లన్ని
_x000D_
దెలియ నేరఁడేమి దెల్ప వేమ. | 0 | aataveladi |
1914 | నెన్ని నేర్చినదానవే యింతి నీవు | వనిత వెనువెంట నిదిగొ నే వత్తు బోవెరమ్ము వేవేగ నిక నింత రవ్వలేల | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
3482 | _x000D_
చూపులోనిచూపు సూక్ష్మమౌఁ దెలియంగఁ
_x000D_
జూపులోనిచూపు శుభ్రమాయె
_x000D_
జూపులోనిచూపు సురవరగమ్యము
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
206 | కృపకుఁ బాత్రముఁ జేయు మక్షీణభాగ్య-లక్షణాంచిత పాదపల్లవకరాబ్జ!
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
4542 | లోభితనమున నేడ్చె నిద్రాభవాని । గడన వీండ్లకె కాక సత్కవులకౌనె
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
2913 | కాంచనగంధి రాచిలుకకైవడి నీ వల దొండపండు మె-
ప్పించెడు వేళ నిన్ను మరపింపఁగ నే నల చిల్కచేతఁ ది-
ట్టించిన దానిపైఁ బ్రతిఘటించి తొలంగఁగ జేయ దొండపం-
డంచును మోవినొక్కి పరిహాసమొనర్తును సుందరీమణీ! | 6 | vutpalamaala |
2422 | చేతోగతినెఱిఁగినవా
రేతీరున విధినిషేధ మెఱుఁగక యున్నన్
జూతురు సమరసభావనఁ
జాతుర్యధురీణు లెన్న సంపఁగిమన్నా! | 1 | kandamu |
741 | కలకాంచీమణికింకిణీమధురనిక్వాణంబు మంజీరమం
జులరావంబును గొంతకొంత వినవచ్చెన్ బట్ట లేనైతి నం
కిలి నిద్రించుట మోసపుచ్చె హితవాగ్గేయుండు నేఁడంచు ని
చ్చలు మీశౌర్యము లెంచు గోపతతి కృష్ణా దేవకీనందనా. | 4 | mattebhamu |
442 | కట్టడ యైనయట్టి నిజకర్మము చుట్టుచు వచ్చి యే గతం
బెట్టునొ పెట్టినయట్లనుభవింపక తీఱదు; కాళ్ళు మీఁదుగాఁ
గట్టుక వ్రేలుడంచుఁ దలక్రిందుగఁ గట్టిరె యెవ్వరైన నా
చెట్టున గబ్బిలంబులకుఁ జేసిన కర్మముగాక భాస్కరా! | 6 | vutpalamaala |
2452 | కను జెదర మనసుఁ జెదరం
గను జెదరు న్సుఖము చెదరుఁ గాలియుఁ జెదరున్
గనుఁ జెదరక తనుఁ
గనవలె సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా! | 1 | kandamu |
4426 | యిట్టి యవలక్షణపు మంత్రి నేర్పరింప । దొరకు నపకీర్తి దెచ్చు నా దుర్జనుండు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
2705 | రాజశ్రేణికి దాసులై సిరులఁ గోరం జేరఁగా సౌఖ్యమో
యీ జన్మంబు తరింపఁజేయఁగల మిమ్మే ప్రొద్దు సేవించు ని
ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరో మానవు ల్బాపరా
జీజాతాది మదాంధ బుద్ధులగుచున్ శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
4129 | _x000D_
కాయగూరలుతిని కాషాయవస్త్రముల్
_x000D_
బోడినెత్తి గలిగి పొరయుచుండ్రు
_x000D_
తలలు బోడులైనఁ దలఁపులు బోడులా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
518 | స్థిరతర ధర్మవర్తన బ్రసిద్ధికి నెక్కినవాని నొక్క ము
ష్కరుఁ డతినీచవాక్యములఁ గాదని పల్కిన నమ్మహాత్ముఁడుం
గొఱఁత వహింపఁడయ్యెడ; నకుంఠిత పూర్ణసుధాపయోధిలో
నరుగుచుఁ గాకి రెట్ట యిడినందున నేమి కొఱంత భాస్కరా! | 5 | champakamaala |
2123 | భూజనులలోన నే నప్రయోజకుఁడను - గనుక నీ సత్కటాక్షంబు గలుగఁజేయు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
91 | కఠిన స్తనంబుల ఘట్టించి దట్టించి- జడలచే మోది నున్దొడల నదిమి
పలుగంట్లు చేసి గోరుల నాటి దొమ్మిగా- యువతీసహస్రంబు లుపరతాది
బంధనంబుల నిన్నుఁ బైకొని తమి రేచి- రమియింప నిదురింప రాక నాఁటి
బడలిక దీర నాపఁగ రాని సుఖనిద్ర- బవళించియున్నట్టి భావ మిచటఁ | 3 | seesamu |
1432 | దాని మెయితళ్కు మెడకుల్కు దాని బెళ్కు । దాని వగనీటు బిగిదాటు దాని నేటు
దాని నీవేళ నా మది దలచి తాళ । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
2278 | హనుమంతుం డొక యబ్ధి దాఁటె నని యేలా ప్రస్తుతుల్ సేయఁగా
దనుజారాతి! భవత్పదాబ్జములు హృత్పద్మంబున న్నిల్పు నా
ఘనపుణ్యుండు భవాంబురాశులు తృణీకారంబుగా దాఁటు బో
రన నెన్నైనను గొంకులేక రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
2702 | విత్తజ్ఞానము పాడుచిత్తము భవావేశంబు రక్షాంబువుల్
మత్తత్త్వంబు తదంకురం బనృతముల్ మాఱాకులత్యంత దు
ర్వృత్తుల్ పువ్వులు పండ్లు మన్మథ ముఖావిర్భూత దోషంబులుం
జిత్తాభ్యున్నత నింబభూజమునకున్ శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
3227 | _x000D_
పాలలోన బులుసు లీలతోఁ గలిసిన
_x000D_
విఱిసి తునుక లగును విరివిగాను
_x000D_
తెలివి మనసులోన దివ్యతత్త్వము తేట
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
183 | ఆలగాపరివాఁడ వనక నిన్నఖిలవే- దాంతమార్గ విహారి వందు నేమి?
హలముఁ బట్టివవాఁడ వనక న్బహువిధా- జాండనిర్వాహుఁడ వందు నేమి?
యలసారివాఁడ వంచనక నిన్ను సమస్త- శాస్త్రప్రపూర్ణుఁడ వందు నేమి?
యడవి ద్రిమ్మరివాఁడ వనక నిన్సకల లో- కాపన్నివారుఁడ వందు నేమి? | 3 | seesamu |
3596 | _x000D_
హీనుఁ డెన్నివిద్య లిల నభ్యసించిన
_x000D_
ఘనుఁడు గాఁడు హీనజనుఁడె కాని
_x000D_
పరిమళమ్ము గర్దభము మోయ ఘనమౌనె
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2985 | పగలు రేయును దానింట బండనాయె | నెలక నాపొందుమదిలోన నెన్నడాయెతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. | 2 | teytageethi |
1757 | బిగికౌఁగిలింతల బెనగుచు పలుమారు విడెమందుకొమ్మను వేడ్కలాడికిలకిలమనుచు వెన్నెలతేటనగవుల గిలగింతలొనరించు కీరవాణితలపున విభునిపై తప్పేమియును లేక పొలయల్క గావించు పువ్వుబోడికొసరి వేడుచు బతి గూడినది యెంతహాయిరా నా సామి యను లతాంగి | 3 | seesamu |
3820 | _x000D_
ఎలమిని ధనకాంక్ష నెదిరిఁ దన్నెఱుఁగక
_x000D_
కన్నుఁ గాన కెల్ల కర్మలాగు
_x000D_
పుట్టినపుడు పుట్టె బుద్ధిహీనతవాని
_x000D_
నడుఁగబోవ కష్టమదియ వేమా. | 0 | aataveladi |
3197 | _x000D_
జీవమేడ నుండు భావమెక్కడ నుండు
_x000D_
కాఁపురంబు లేడఁ గదిసియుండుఁ
_x000D_
దనరుచున్న రెండిస్థల మేల తెలియరు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3712 | _x000D_
వెలయ పరమతత్వ విభవంబు దెలియక
_x000D_
బాహ్యవిద్యచేత బరఁగు టెల్ల
_x000D_
పూరి మెసవఁగ హరి పోయినచందంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.