id stringlengths 1 4 | poem stringlengths 71 312 | label int64 0 7 | label_name stringclasses 8
values |
|---|---|---|---|
2255 | శ్రుతిపాథోధి మథించి శాస్త్రమహిమ ల్శోధించి యష్టాదశ
స్మృతు లాలించి మహేతిహాసకథలుం జింతించి తా రొక్క స
మ్మతమై సన్మును లాచరించిన మహామార్గంబు నీసేవ; దు
ర్మతు లీమార్గముఁ గానలేరు రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
837 | అందెలు గజ్జెలు మ్రోయఁగఁ
జిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందుని సతి యాగోపిక
ముందఱ నాడుదువు మిగుల మురియుచుఁ గృష్ణా. | 1 | kandamu |
1480 | తనువు గెంజాయతళుకు వాసనల బిగివి- । నెంతని వచింతు నిన్ను నేనెపుడు గాంతు-
నట్టి నిను దల్ప మనసు మోహంబు నిలుప । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
1724 | సరవిఁ గుమారవాంఛ కొనసాగుటకై పడు వేవులింత నో-
రరుచి విచేష్ట గాసి మొదలైన ప్రయాసములెల్లఁ జూడఁగా
హరిహరపంకజాసనముఖామరులైననుగాని యిట్టి దు-
ష్కరతరబాధ లోరువరు గావునఁ దల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
1176 | లోకమున సర్వజనులకు
నా కాలుఁడు ప్రాణహారి యై యుండఁగ శో
భాకృతకార్యముల వడిం
బ్రాకటముగఁ జేయకుండ రాదు కుమారా! | 1 | kandamu |
2831 | వఱదైన చేను దున్నకు
కఱవైనను బంధుజనుల కడ కేఁగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిఱికికి దళవాయితనముఁ బెట్టకు సుమతీ! | 1 | kandamu |
1569 | అక్షీణస్ఫుట బాహుశౌర్యుఁడు మహాహంకారుఁడున్ దైత్యహ
ర్యక్షుం డక్షుఁడు డాయఁ దార్క్ష్యుఁడహినట్ల వాని పదంబులన్
దక్షత్వంబునఁ బట్టి యెత్తి వడి మింటన్ బల్మరుం ద్రిప్పి జ
న్యక్షోణిం బడవైచి చంపవె బలౌద్ధత్యంబునన్ మారుతీ! | 7 | saardulamu |
1557 | కమనీయాకృతి శింశుపాఖ్యతరుశాఖాపర్ణలీనుండవై
యమరారాతి దశాస్యుడన్న కటుక్రూరాలాపముల్ రాక్షస
ప్రమదల్ వల్కు దురుక్తులంత త్రిజటాస్వప్నప్రకారంబు న
య్యమ గావించు విలాపమంతయును నీ వాలింపవే మారుతీ! | 4 | mattebhamu |
1649 | మాసములెల్లఁ బూర్ణమయి మానవతీమణి గర్భవేదనా-
యాసముతోడ నుండుతఱి నంగన పుత్రునిఁ గాంచె నన్నుఁ దా-
నా సడి విన్న మాత్రమున నా వచనం బమృతప్రవాహధా-
రాసమమైనచో మనము రంజిలు తల్లినిఁ బోలరెవ్వరున్. | 6 | vutpalamaala |
1848 | వనిత వగనెన్న నెవ్వరి వశముగాదు | మరుని చేచిల్క యనదగు మందయానదాని కెనగాన నియ్యానత గజగాన | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
3011 | సుదతి యీవేళ నన్నింత చుల్కచేసి | మాటలాడుట యిది నీకు మంచిదటనేతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. | 2 | teytageethi |
3651 | _x000D_
తండ్రికన సుగుణి తనయుఁడు గల్గెనా
_x000D_
పిన్న తనము లెన్నఁదగదు
_x000D_
వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
691 | పెటపెట నుక్కు కంబమున భీకరదంత నఖాంకుర ప్రభా
పటలము గప్ప నుప్పతిలి భండనవీథి నృసింహభీకర
స్ఫుటపటుశక్తి హేమకశిపున్ విదలించి సురారిపట్టి నం
తటఁగృపఁజూచితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ! | 5 | champakamaala |
1426 | వంతకు చలింపకున్న గిల్గింత సేతు- । వపుడు నే నవ్వ వెండి ప్రొద్ద్దయెనందు-
వా దినమురేయిసొగసెన్న నజునకైన । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
3476 | _x000D_
వేమన చెప్పిన మాటలు
_x000D_
సామంబున సకలవేద సారంబుగదా
_x000D_
సామెత పంచాక్షరిలో
_x000D_
నీమహిమలఁ దెలియకున్న నింపా వేమా. | 1 | kandamu |
4173 | _x000D_
కానలేరు గాని కలియుగంబుననున్న
_x000D_
మనుజులందఱికిని మాన మొకటి
_x000D_
దౌష్టికు లగువారు తమవలెఁ జూడక
_x000D_
పరులఁదూల నాడుదురుగ వేమ. | 1 | kandamu |
1763 | కళలంటి సొక్కించగలయట్టి నిను బాయజాలరా యని రాల సాగి మ్రొక్కునా సామి నా దొర నా మనోహర యని జిగి బిగికౌఁగిట జేర్చి కొసరునిను గానకుండిన నిమిషంబు నా యెద జాలి బొందునటంచు చాల వెఱచుతగ నిను గూడని తరుణి యవ్వనమెల్ల నడవిగాచిన వెన్నెలనుచు బలుకు | 3 | seesamu |
3842 | _x000D_
అనఘ పురుషుండు నొక్కఁడు
_x000D_
విను నిత్య మనిత్యమనెడివిధ మిట్టి దగు\న్
_x000D_
తన సంకల్పమె బంధము
_x000D_
తన సంకల్పక్షయంబె తత్వము వేమా. | 1 | kandamu |
1310 | దీపములనీడ మానవ
రూపంబులనీడ శనితరులనీడను ఖ
ట్వాపాదిత మగు నీడ
నేపట్టున నిలువఁగూడ దెపుడుఁ గుమారీ! | 1 | kandamu |
3330 | _x000D_
దేహాభిమాన ముండఁగ
_x000D_
మోహాదులు జననవార్ధిముంచును కలగా
_x000D_
నీహా విషయభావన
_x000D_
కూహాదులు పోవు మేలుకొన్నను వేమా. | 1 | kandamu |
1108 | శివశివా ధాత్రిఁ దా వలచిన వధూటిఁ | బాయు వెత వద్దు సుమ్మెట్టి పలువకైన,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
2787 | తన కలిమి యింద్ర భోగము
తన లేమియె సర్వలోక దారిద్ర్యంబు\న్
దన చావు జగత్ప్రళయము
తను వలచినదియె రంభ తథ్యము సుమతీ! | 1 | kandamu |
2065 | శ్రీరమానాథ! యిటువంటిక్రూరునకును - భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
1519 | బలవంతుండగు వాలి ప్రోలు వెడలింపం, బత్నిఁ గోల్పోయి మి
క్కిలి దుఃఖంబున ఘోరకాననములం గ్రీడించి వర్తించు నా
జలజాప్తాత్మజు నొజ్జ పట్టి యని యశ్రాంతంబుఁ జేపట్టి యా
బలభిత్సూతికిఁ జిక్కకుండ ననుకంపం బ్రోవవే మారుతీ! | 4 | mattebhamu |
323 | జగదీశాయ నమోస్తు తే భగవతే చంద్రావతంసాయ ప-
న్నగహారాయ శివాయ లోకగురవే నానామరుద్రూపిణే
నిగమాంతప్రతిపాదితాయ విలసన్నిర్వాణనాథాయ ధీ-
రగుణాఢ్యాయ యటంచు మ్రొక్కిడుదు భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
1842 | వెలదియంగాంగముల తళ్కులలరు నిటుల | నీరజాసను డా యింతి నీకు గానుదలచి సృజియించనేమొకో తరుణి నిపుడు | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
2480 | జలజాతప్రభవాండబుద్బుదము లశ్రాంతంబునుం బుట్టుచుం
గలయం గ్రాఁగుచునుండు నీ పృథులలింగస్ఫారగర్భాబ్ధిలో-
పలఁ దద్బుద్బుదగర్భవాసులు హరిబ్రహ్మాది దేవాళియుం
గలదే వారికి నీ మహత్త్వ మెఱుఁగంగా శక్తి సర్వేశ్వరా! | 4 | mattebhamu |
3911 | _x000D_
వెఱ్ఱినక్కలవలె వేదముల్ చదివెద
_x000D_
రాశయంబు లెఱుఁగరయ్య వారు
_x000D_
వేదసారమంత వేమన యెఱుఁగును
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2773 | కులకాంత తోడనెప్పుడుఁ
గలహింపకు వట్టితప్పు ఘటియింపకుమీ
కలకంఠికంట కన్నీ
రొలికిన సిరి యింటనుంట నొల్లదు సుమతీ! | 1 | kandamu |
635 | ముప్పునఁ గాలకింకరులు ముంగిటవచ్చినవేళ రోగముల్
గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండినవేళ బాంధవుల్
గప్పిన వేళ మీ స్మరణ గల్గునొ గల్గదొ నాఁటి కిప్పుడే
తప్పక చేతు మీభజన దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
3393 | _x000D_
కంటిలోనివానిఁ గఱకంఠుఁ డెఱుఁగును
_x000D_
గంటిలోనివాని మింటఁ జూడ
_x000D_
కన్నుమిన్ను హృదయంబాయె నెంచంగ
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4087 | _x000D_
తండ్రిసొమ్మునైన దాయాదిసొమ్మైనఁ
_x000D_
బరులసొమ్మునయినఁ బ్రాప్తధనము
_x000D_
దయను దీనులకును దాన మిచ్చినవాఁడె
_x000D_
బహుళపుణ్యజనుఁడు పరఁగ వేమ. | 0 | aataveladi |
1315 | ముందు సత్కవిబృందములలోకి వాల్మీకి । నఖిలపౌరాణికాఖ్యాసు వ్యాసు-
నతిమూఢజనుల కద్భుతనీతి భవభూతి । మహనియ్యకావ్యనిర్మాణు బాణు-
నసమానశబ్దశాస్త్రసముద్రు శివభద్రు । కవిరాజితవిలాసు కాళిదాసు
భవఘోరతిమిరప్రభారవి భారవి । సురుచిరసద్గుణస్తోము భీము- | 3 | seesamu |
3284 | _x000D_
ఎందు నెఱుకవాని కిహపరములు లేవు
_x000D_
ప్రాణహానిలేదు ప్రళయమునను
_x000D_
ప్రళయకాలమైనఁ బరమాత్ముఁ గలయురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2111 | ఎచట నన్నుంచిననుగాని యెపుడు నిన్ను - మఱచి పోకుండ నీ నామస్మరణనొసఁగు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
3216 | _x000D_
శిష్యవర్గమునకు శివుఁ జూపనేరక
_x000D_
కానిమతములోని గలుగునట్టి
_x000D_
గురునియెఱుక నరయ గ్రుడ్డెద్దు చేనురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2094 | అతివిద్యనేర్చుట యన్నవస్త్రములకే - పసుల నార్జించుట పాలకొఱకె
సతిని బెండ్లాడుట సంసారసుఖముకే - సుతులఁ బోషించుట గతులకొఱకె
సైన్యముల్ గూర్చుట శత్రుభయమునకే - సాము నేర్చుటలెల్ల చావుకొఱకె
దానమిచ్చుటయు ముందటి సంచితమునకే - ఘనముగాఁ జదువుట కడుపుకొఱకె | 3 | seesamu |
2263 | సందిం బూసలలోన నీ కవచరక్షామంత్రరాజంబుఁ బెం
పొందన్ వ్రాసి ధరించినాతఁడు రిపువ్యూహంబులో నైన నే
కందుం బొందక వజ్రపంజరములోఁ గాఁపున్న చందానఁ బా
ఱం దోలుం బగవారి నౌర రఘువీరా! జానకీనాయకా! | 7 | saardulamu |
3455 | _x000D_
చెట్టునందుఁబుట్టి చెలరేఁగి కాయలు
_x000D_
దనరుఁగాంతితోడఁ దగిలిపండ్లు
_x000D_
పండ్లు దినుచుఁ గాయవర్ణంబు దెలియుఁడీ
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4516 | నుభయభ్రష్టత్వములు గాన నుర్విలోన । రాజసభలందు నెన్నగా రాదు గదర
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
1234 | ధనవంతు డైనఁ యప్పుడుఁ
పెనిమిటి చిత్తం బెఱింగి పెండ్లాము మెలం
గును లేమి మెలఁగ నేర్చిన
వనితకు లోకమున వన్నె వచ్చుఁ గుమారీ! | 1 | kandamu |
1093 | గజముపై మహిషంబు కాలు ద్రవ్వెడునట్లు | కొండతోఁ దగరు డీకొనినయట్లు
కార్చిచ్చుపైఁ బతంగము తారసిలునట్లు | మృగరాజుపై నక్క మొగియునట్లు
బెబ్బులితో జింక పెనఁగఁబోయినయట్లు | పెనుబాముపైఁ గప్ప చనినయట్లు
పిల్లితో నెలుక దర్పించి దార్కొనునట్లు | తోడేలితో మేఁక దొడరునట్లు | 3 | seesamu |
1079 | లవణాబ్ధి లంఘించు పవనాత్మజున కొక్క | తోటకాలువ పూని దాటుటెంత
జగమెల్ల ముంచు వర్షము నించు కాలాంబు- | ధరమున కొకపాదు దడుపుటెంత
బహులోకవాంఛితఫలదమౌ సురశాఖి | కొక యణూపమఫలం బొసగుటెంత
చెడుగు రక్కసిమూఁకఁ జెండు చక్రమునకుఁ | బుడమి నొక్కరుని జంపుట యదెంత | 3 | seesamu |
1120 | పుడమిని దుష్టత గలయా
తఁడు లంచంబులను బట్టఁ దలఁచును మిడి యౌ
నడవడి విడి యందఱి వెం
బడి ద్రిప్పికొనుచును గీడు పఱప బుత్రా! | 1 | kandamu |
4454 | హరునకైనను నివి గెల్వ నలవికాదు । ఇతరులగు మానవులనంగ నెంతవారు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
4296 | తలఁచిన గుండె జల్లనును దల్లడమందెడు నేమిసేతు నా
చెలువుఁడు రాఁడటంచు లలసీనవి వో యలమేలుమంగ నీ
తొలకరిమించు నెమ్మనముతొయ్యలిఁ జూడక యెట్టులోర్తువో
యలుగకు మన్న మాన విఁకనైనను నెన్నఁడు వేంకటేశ్వరా! | 5 | champakamaala |
2351 | కొమరౌ నాండ్రు పదాఱువేలు గొలువన్ గోపాలకృష్ణావతా
రమునన్ జాలక చొచ్చి గోపికల చీరల్ దీసి రాఁదీసి నె
య్యమునం బొందిన కొయ్యదేవరవు గావా నీవు కృష్ణావతా
రమునన్ లోకమనోభిరామ! రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
4215 | _x000D_
ఎంతభూమి దిరిగి యేపాటు పడుచున్న
_x000D_
నంటనీకప్రాప్తి వెంటదిరుగు
_x000D_
భూమిక్రొత్తదైన భోక్తలుక్రొత్తలా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3243 | _x000D_
ఊరకుంట దెలియ నుత్తమయోగంబు
_x000D_
మానసంబు కలిమి మధ్యమంబు
_x000D_
ఆసనాది విధుల నధమ యోగంబురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3332 | _x000D_
ఈతనువునందుఁ జూచిన
_x000D_
నేతనువుల కింతె యనుచు నెఱిగియుఁ దన్నుఁ
_x000D_
జూతురు నాలోఁ జూపున
_x000D_
నాతురమునఁ దపసులెల్ల నమరఁగ వేమా. | 1 | kandamu |
848 | హా వసుదేవకుమారక
కావుము నా మాన మనుచు కామిని వేఁడ\న్
ఆ వనజాక్షికి నిచ్చితి
శ్రీవర యక్షయ మటంచు జీరలు కృష్ణా. | 1 | kandamu |
3164 | _x000D_
కప్పురంబు మనసు గాంక్షించుయోగికి
_x000D_
జ్ఞానదీపశిఖయుఁ దానటించుఁ
_x000D_
గానవచ్చు నాత్మ క్రమమాణమై నిచ్చ
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2296 | నా యజ్ఞానముఁ బాపుమంచు మదిలో నానాప్రకారంబులన్
గూయం గూయ నదేమిరా యనవు నీకున్ మ్రొక్కనా? కుక్కనా?
చీ యంచేటికి రోఁతగించెదవు? నీచిత్తంబు రాకుండినన్
బ్రాయశ్చిత్తము నాకునెద్ది? రఘువీరా! జానకీనాయకా! | 7 | saardulamu |
4284 | పెనఁగకుమమ్మ! చిమ్ము జళిపించిన చూపుల గర్వరేఖ రాఁ
జెనకకు మమ్మ! లేఁ జెమటచెక్కుల నోయలమేలుమంగ నీ
ఘనుఁడు కళావినోది రతికాంత విలాససహస్రమూర్తి వ
ద్దని పొలయల్క దీర్తురు లతాంగులు నీసతి వేంకటేశ్వరా! | 5 | champakamaala |
3334 | _x000D_
నియమాది సంగుఁడై నిలిచినఁ దత్వంబు - తామసంబగుఁ నిద్రఁ దలఁగఁజేయు
_x000D_
నిద్ర తలంగిన నిర్భీతినొందించు - శమమున నానంద సమితి పుట్టు
_x000D_
నానందమున విశ్వమంతయుఁ దానగుఁ - దాను విశ్వంబయినఁ దత్వమగును
_x000D_
తత్వ మింద్రియ పంచతత్వంబునను - నిల్చుఁ దత్వంబు నిలిచినఁ దానయగును | 3 | seesamu |
1517 | అపుడా గంధవహుండు నీదయిన మూర్ఛావస్థ వీక్షించి, తా
గుపితుండై నిజమూర్తి వైభవము సంకోచింపఁగాఁ జేయ న
చ్చపు గూర్మిన్ నిఖిలాస్త్రశస్త్రముల బంచత్వంబు లేకుండ స
త్కృపతో నీకు వరంబులిచ్చిరిగదా బృందారకుల్ మారుతీ! | 4 | mattebhamu |
2158 | వెఱ్ఱివానికి నేల వేదాక్షరంబులు? - మోటువానికి మంచిపాట లేల?
పసులకాఁపరి కేల పరతత్త్వబోధలు? విటకాని కేటికో విష్ణుకథలు?
వదరు శుంఠల కేల వ్రాఁత పుస్తకములు? - తిరుఁగు ద్రిమ్మరి కేల దేవపూజ?
ద్రవ్యలోభికి నేల దాతృత్వ గుణములు? - దొంగబంటుకు మంచిసంగ తేల? | 3 | seesamu |
569 | హరుఁడు మురారి యబ్జభవుఁ డాఢ్యులటంచు పురందరుండు దే-
వర యనుచు న్విభావసుఁడు వహ్నియు వేల్పులటంచు నెంత్రు బు-
ద్ధిరహితమానవు ల్పశుపతిత్వము నీయెడఁ గల్గుటెన్నకే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
4546 | భక్తిరసాభిషిక్త! భవపాశవితాన విముక్త! జంగమా
సక్త! దయాభిషిక్త! తనుసంగతసౌఖ్యవిరక్త! సంతతో
ద్యుక్త గుణానురక్త! పరితోషితభక్త! శివైక్యయుక్త! ప్ర
వ్యక్తమ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
3724 | _x000D_
ముండమోపితోడ మునుఁగుచుఁ దేలుచు
_x000D_
నుండఁగానె మోహ ముండెఁ గాక
_x000D_
అండఁబాయు వెనుక నాయాసలే లేవు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2208 | భువనేశ! గోవింద! రవికోటిసంకాశ! - పక్షివాహన! భక్తపారిజాత!
యంభోజభవరుద్ర జంభారిసన్నుత! - సామగానవిలోల! సారసాక్ష!
వనధిగంభీర! శ్రీవత్స కౌస్తుభవక్ష! - శంఖచక్ర గదాసి శార్ఙ్గహస్త!
దీనరక్షక! వాసుదేవ! దైత్యవినాశ! - నారదార్చిత! దివ్యనాగశయన! | 3 | seesamu |
4158 | _x000D_
ఇహము విడచి ఫలము లింపుగఁ గలవని
_x000D_
మహిని బల్కు వారిమతము కల్ల
_x000D_
యిహములోనఁ బరము నెసఁగుట గానరో
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1314 | మనిన శారద నేకదంతుని నుతించి । నే రచించెద పద్యముల్ నేర్చినటుల
నీదు కృపలేక కృతి సేయ నెవరికైన । వశమె శ్రీరామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
3249 | _x000D_
గురుఁ డనఁగా పరమాత్ముఁడు
_x000D_
పరగంగా శిష్యుఁడనఁగఁ బటుజీవుఁడగు\న్
_x000D_
గురుశిష్య జీవసంపద
_x000D_
గురుతరముగఁ గూర్చు నతఁడు గురువగు వేమా. | 1 | kandamu |
2683 | శుకముల్కింశుకపుష్పము ల్గని ఫలస్తోమంబటంచు న్సము
త్సుకతం జేరఁగఁబోవ నచ్చట మహాదుఃఖంబు సిద్ధించుఁ గ
ర్మకళాభాషలకెల్లఁ బ్రాపులగు శాస్త్రంబుల్విలోకించు వా
రికి నిత్యత్వమనీష దూరమగునో శ్రీకాళహస్తీశ్వరా! | 4 | mattebhamu |
3890 | _x000D_
జదలుదాల్చు టెల్ల జగము ఛీయను టెల్ల
_x000D_
యొడలువిఱచుటెల్ల యోగ మెల్ల
_x000D_
ముక్తికాంతఁ బట్టి ముద్దాడుకొరకురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
414 | ధనధాన్యాంబరపుత్రపౌత్రమణిగోదాసీభటాందోళికా-
వనితాబంధురసింధురాశ్వ (మహితైశ్వర్యంబు) దీర్ఘాయువు
న్ఘనభాగ్యంబును గల్గి వర్ధిలుదు రెక్కాలంబుఁ జేట్పాటులే-
క నరు ల్దీని బఠించిరేని భువి భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
1885 | ఠీకు కీల్కావిబుటేదారు పావడపై జరీచేలంబు బాగుమీరహురుమంజి ముత్యాలసరులు గన్పడ బట్టు కనకపు మొగ్గల కంచుకంబుబవిరెలు బొగడలు బావిలీల్ వజ్రంపు బలుకులచే నొప్పు పాపటయునునందెలు మువ్వలు హస్తకడియములు సందిదండలు గుండ్లసరులు దూగ | 3 | seesamu |
2268 | విను నా కెన్నియొ దోసముల్ గలవు నొప్పిం బొందఁగా మ్రంద ర
మ్మని రౌద్రంబుగఁ గాలుబంటు లన నే రాఁపేరు? నా పేరుఁ బె
ట్టినవానిన్ బరలోకదూరుఁడని యండ్రే పొండు పొండంచు బో
రన సాయమ్మయి యడ్డగింపు రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
2180 | వ్యాసుఁడే కులమందు వాసిగా జన్మించె? - విదురుఁడే కులమందు వృద్ధిఁ బొందెఁ?
గర్ణుఁడే కులమందు ఘనముగా వర్ధిల్లె? - నా వసిష్ఠుం డెందు నవతరించె?
నింపుగా వాల్మీకి యే కులంబునఁ బుట్టె? - గుహుఁ డను పుణ్యుఁడే కులమువాఁడు?
శ్రీశుకుఁ డెచ్చటఁ జెలఁగి జన్మించెను? - శబరి యే కులమందు జన్మమొందె? | 3 | seesamu |
1327 | చనువిచ్చి నను మచ్చికను వచ్చి నెనరిచ్చి । మనసిచ్చి పైకొను మధురవాణి
వలపింపులను యింపుగలిగింపు బలుసొంపు । పలుగెంపు లొనరింపు భ్రమరవేణి
యల జంటి రయికంటినటువంటి మొనచంటి । నెదనాని కళలంటు మిందువదన
తమిదీర భ్రమమీర తనివార కొనగోర । తొడల కొక్కెసమించు తోయజాక్షి | 3 | seesamu |
1948 | కలిధర్మంబునఁ బాపసంకలితులై గర్వాంధులై తుచ్ఛులై
కులశీలంబులు మాని హేయగతులం గ్రొవ్వారు దుష్టాత్ములం
బలిగాఁ జేయఁ దలంచి ధర్మ మెలమిం బాలించి నిల్పంగ మీ
వలనం గల్క్యవతార మొందఁగల నిన్ వర్ణింతు నారాయణా! | 4 | mattebhamu |
3149 | _x000D_
ఆశచేత మనుజు లాయువుగలనాళ్లు
_x000D_
దిరుగుచుంద్రు భ్రమను ద్రిప్పలేక
_x000D_
మురికిభాండమందు ముసరు నీఁగలభంగి
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4448 | ననుచు మూర్ఖులు పలుకుదు రవనియందుఁ । గవివరులు బోయిన కానికాలమందు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
4484 | దుర్ణయులు మీదెఱుంగల దుండగమున । గార్యతతులెల్లఁ జేసి తత్కార్యఫలము
లనుభవింపుదు రాయాయి యవసరముల
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
2663 | లేవో కానలఁ గందమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్
లేవో యేఱులఁ బల్లవాస్తరణముల్ లేవో సదాయాత్మలో
లేవో నీవు విరక్తులన్మనుప జాలింబొంది భూపాలుర\న్
సేవల్సేయఁగఁ బోదురేలొకొ జనుల్ శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
270 | బలిభిక్షన్ దయఁ బెట్టఁబూనిన మహాపాపాత్మకుల్ భూమిలో-
పలఁ గోట్యర్బుదసంఖ్యయైనఁ ద్రిజగత్ప్రఖ్యాతదానవచ్ఛటా-
కలనావర్తితపుణ్యమూర్తియగునే గాటంబుగాఁ బర్వు దో-
మలు వేయైన మదద్విపంబగునె రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
1546 | చలమొప్పన్ దశకంఠరాక్షస నివేశంబు బ్రవేశించి యం
దు లతామందిరముల్ దివాగృహకముల్ తోరంపుక్రీడాగృహం
బులు, చిత్రావసదంబులున్ మణిగృహంబుల్ చారుశయ్యాగృహం
బులు వీక్షింపుచు నంతటన్ వెదకవే భూపుత్రికన్ మారుతీ! | 4 | mattebhamu |
866 | దశకంఠునిఁ బరిమార్చియు
గుశలముతో సీతఁదెచ్చి కొనియు నయోధ్య\న్
విశదముగఁ గీర్తి నేలిన
దశరథరామావతార ధన్యుఁడ కృష్ణా. | 1 | kandamu |
1906 | గాన నా సుందరాంగిని గారవమున | ... ... ... ... నదగు నీకైన యింతి నిపుడుచలముడిగి వేగ రావయ్య సారసాక్ష | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
4022 | _x000D_
చేకొనుచును తనకుఁ జేరి సాగినంతలోఁ
_x000D_
జెడిన ప్రజల రక్షసేయకున్న
_x000D_
తనదుసాగుటేమి తనతనువదియేమి
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3564 | _x000D_
భూమి నాదియన్న భూమి ఫక్కున నవ్వు
_x000D_
దానహీనుఁ జూచి ధనము నవ్వు
_x000D_
కదన భీతుఁ జూచి కాలుండు నవ్వును
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3020 | ఓలలాడుచునున్న స్త్రీలయొద్దకు బోయి సిగ్గుమాలిన పేర్మి జెప్పవలెనుతప్పక నీ దుష్టతనము నింపాయకాని పాయక యా పనుల్సేయదగునెవావివర్తనలేక వరించుచును నీవు కోరిన మేనత్తను గూడదగునెపాపమౌననకను బడఁతుల వంచించి చెయియూత లొదవింప జేయదగునె | 3 | seesamu |
4096 | _x000D_
పచ్చఁజూచువారు పచ్చ మెచ్చెడివారు
_x000D_
పచ్చబడెడువారు చెడ్డవారు
_x000D_
పచ్చ విడుచువాని ప్రభువుఁగా జూతురు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3337 | _x000D_
మాయ నరకమనుచు మాయ రోయకసాటి
_x000D_
సమముగ నరదేవసభలయందు
_x000D_
నందఱు ఘనులయిన హరునకుఁ దావేది
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
285 | ధాటీపాటవచాటుకావ్యరచనోద్యద్ధోరణీసారణీ-
వాటీకోద్గతి సత్కవీశ్వరుఁడు నిత్యంబుం దమున్ వేఁడఁగా
వీటీఘోటకహాటకాదు లిడ రుర్విన్ నిర్దయాబుద్ధిచే
మాటే బంగరు నేటి రాజులకు రామా! భక్తమందారమా! | 7 | saardulamu |
2737 | శ్రీ రాముని దయ చేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనఁగా
ధారాళమైన నీతులు
నోరూఁరఁగ జవులు పుట్ట నుడివెద సుమతీ! | 1 | kandamu |
4624 | శంకదలిర్చ నెంతయు వెసన్ బరదైవ పతంగ కోట్లకున్
బింకముతోడ ఫాలతట భీమవిలోచన వహ్ని నేర్చు నా
శంకరదాసి దేవునకు సద్భటుఁడంచు నుతించు నన్ను నీ
వంకను ద్రిప్పుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
2037 | దప్పుగలిగిన సద్భక్తి తక్కువౌనె - చెఱకునకు వంకపోయిన చెడునె తీపు?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
275 | చలదశ్వత్థతరుప్రవాళమనుచున్ సారంగహేరంబటం-
చలరుం దింటెనపూవటంచు ముకురంబంచున్ భ్రమన్ సజ్జనుల్
కళలూరంగ రమించుచున్ వదల రేకాలంబు ముగ్ధాంగనా-
మలమూత్రాకరమారమందిరము రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
4274 | వెలయఁగ వేంకటాచలమువీథులఁ గమ్మనిపుష్పవృష్టి కిం
పలరఁగ నేఁగి వచ్చి యలపారఁగ నయ్యల మేలుమంగతో
నలరఁగఁ గోరకమ్ముల లతాంగన లిమ్ముల సేసఁ జల్లఁగాఁ
గలకల నవ్వు మిమ్ముఁ గలకంఠశుకావళి వేంకటేశ్వరా! | 5 | champakamaala |
2443 | తెఱచియుఁ దెఱవనికన్నులు
మఱచియు మఱువనితలంపు మ్రాన్పడుమేనున్
పరమచిదాకాశస్థితిఁ
చరితార్థుఁడు నిలుతునన్న! సంపఁగిమన్నా! | 1 | kandamu |
2767 | కరణము సాధై యున్నను
గరి మదముడిఁగినను బాము గఱవకయున్నన్
ధరఁ దేలు మీటకున్నను
గర మరుదుగ లెక్కఁగొనరు గదరా సుమతీ! | 1 | kandamu |
4034 | _x000D_
అన్న మధికమైన నది తనుఁజంపును
_x000D_
నన్న మంటకున్న నాత్మ నొచ్చుఁ
_x000D_
జంప నొంప బువ్వ చాలదా వెయ్యేల
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1402 | యనుచు నాతోడ కందువ లాడుకొనుచు । నెన్నదగు శయ్య మనమున్న వితము
తలచి చూచిన నెమ్మది తాళియుండ । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
4318 | నడవకుమమ్మ పాదనలినంబులు గందెడి, మాట బెట్టుగా
నొడువకుమమ్మ, చెక్కునును నొక్కులతో నలమేలుమంగ నీ
వెడనగ కీమొగంబునకు వెన్నెలలాయె నటంచు నీసతి\న్
బడఁతులు మేలమాడుదురు పల్కుల తేనెల వేంకటేశ్వరా! | 5 | champakamaala |
1425 | పొలయల్కచే నొత్తిగిలి పవ్వళించిన । చెయిదీసి కుచముల జేర్చుకొందు-
వదిసైచకను ప్రక్క కదలి హూహూ యన । కదిసి పైకొన బిగ్గ గౌగిలింతు-
వవల పోపోవె పొమ్మని రెమ్మి కసరిన । నవ్వు చేసుక మోవి నానవత్తు-
వా తీరు జూచి యేమనకూరకుండిన । పూమొగ్గతో బిగ్గపోటులిడుదు- | 3 | seesamu |
889 | పరుసము సోకిన యినుమును
వరుసగ బంగారమైన వడువున జిహ్వ\న్
హరి నీ నామము సోకిన
సురవందిత నేను నటుల సులభుఁడ గృష్ణా. | 1 | kandamu |
677 | తప్పులెఱుంగలేక దురితంబులు సేసితినంటి నీవు మా
యప్పవుగావుమంటి నిఁక నన్యులకున్ నుదురంటనంటి నీ
కొప్పిదమైన దాసజను లొప్పిన బంటుకు బంటనంటి నా
తప్పులకెల్ల నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
2941 | గలియుగమునం దొనర్చు నఘంబులెల్ల | బాసిపో గాక వెంబడి బడియు రావుకల్లగాదయ్య శ్రీతాడిమళ్ళవాస | రాజగోపాల నీ పూజ తేజమయ్యె. | 2 | teytageethi |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.