id
stringlengths
1
3
poem
stringlengths
89
220
label
int64
0
6
label_name
stringclasses
7 values
124
పాండునృపాల నందనులు బాహుబలంబున ధార్తరాష్ట్రులన్ భండనభూమిలో గెలిచి పాండుర శారదచంద్రచంద్రి కా ఖండయశః ప్రసూన కలికావళిఁ గౌరవరాజ్యలక్ష్మి నొం డొండ యలంకరింపుచు జయోన్నతి రాజ్యము సేయుచుండగన్.
1
ఉత్పలమాల
496
వలిపపు సన్న పయ్యెదను వాసిగ గంధపుఁ బూఁత తోడుతన్ గొలదిగఁగానవచ్చు వలిగుబ్బ చనుంగవఠీవి నొప్పఁగా దెలుఁగని చెప్పుచోటఁ గడుఁ దేటలఁ మాటలఁ గ్రొత్తరీతులం బొలుపు వహింపకున్న మఱి పొందగునే పటహాది శబ్దముల్
2
చంపకమాల
291
ఇమ్ముగ జదువని నోరును, నమ్మా యని బిలిచి యన్న మడుగని నోరున్, దమ్ముల బిలువని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ
0
కందం
430
పంకజముఖి విరహులపయిఁ గింకన్ నిజసైన్యకోటికిని సెలవిడుమీ నాంకునికరతల మన నల కంకేళిన్ జిగురు గాలిఁ గదలెడుఁ గంటే.
0
కందం
74
హరివేణూద్గత మంజులస్వరనినాదాహూతలై గోప సుం దరు లేతేర ధనాధిపానుచరగంధర్వుండు గొంపోవఁ ద త్తరుణుల్ గుయ్యిడ శంఖచూడుని భుజాదర్పంబు మాయించి తాఁ బరిరక్షించిన యట్టి కృష్ణుని నుతింపన్ శక్యమే యేరికిన్?
3
మత్తేభము
209
పాపము దలఁపక నిమిషము లోపలఁ జెడు సౌఖ్యమునకు లోనైతివె యిం తే పో ధారుణిఁ గామా న్ధోపి న పశ్యతి యనంగఁ దొల్లియు వినమే.
0
కందం
176
అనుజాతుండగు పాండుభూవిభుఁడు నిర్యాణంబునుంబొందనా తనిపుత్రుల్ తనుఁ జేరవచ్చినను మాధ్యస్థ్యంబుఁబోఁదట్టి యె గ్గొనరించెన్ ధృతరాష్ట్రభూమివిభుఁ డట్లూహింపఁగా నెగ్గుసే సినవాఁడే యగుగాక మేలుగలదే చింతింపఁగా నుద్ధవా!
3
మత్తేభము
321
తన వారు లేని చోటను, జనమించుక లేని చోట, జగడము చోటన్, అనుమానమైన చోటను, మనుజునకును నిలువ దగదు మహిలో సుమతీ
0
కందం
347
ఈ క్షితినర్థకాంక్ష మదినెప్పుడు పాయక లోకులెల్ల సం రక్షకుఁడైన సత్ప్రభుని రాకలు గోరుదు రెందుఁ; జంద్రికా పేక్షఁ జెలంగి చంద్రుఁడుదయించు విధంబునకై చకోరపుం బక్షులు చూడవే యెదు రపార ముదంబును బూని భాస్కరా!
1
ఉత్పలమాల
381
పంకజముఖి కప్పుడు మై నంకురితము లయ్యెఁ బులక లావిష్కృతమీ నాంకానలసూచకధూ మాంకురములుఁ బోలె మఱియు నతనిన్ జూడన్.
0
కందం
522
కొంకక సావధాన మతిఁ గూర్చి వినుం డిదె, మత్తనూజకై యుంకువ సేసిఁనాడ వివిధోజ్జ్వల మైన ధనంబుఁ, గాన నీ శంకరు చాప మెక్కిడిన సత్త్వ ఘనుం డగువాని కిత్తునీ పంకజనేత్ర సీత, నరపాలకులార! నిజంబు సెప్పితిన్.
1
ఉత్పలమాల
484
సంతోషించితిఁ జాలుఁ జాలు రతిరాజద్వారసౌఖ్యంబులన్ శాంతిన్ బొందితిఁ జాలుఁ జాలు బహురాజద్వార సౌఖ్యంబులన్ శాంతిన్ బొందెదఁ జూపు బ్రహ్మపద రాజద్వార సౌఖ్యంబు ని శ్చింతన్ శాంతుఁడనౌదు నీ కరుణచే శ్రీకాళహస్తీశ్వరా!
4
శార్దూలము
410
త్రిపురసంహార మొనరించునపుడు హరుఁడు బండికల్లుగ నీమేను గండి చేసె నదియు నెలవాఱి తెగటాఱ వైతి చంద్ర యకట! రోహిణియెడ నపథ్యమునఁ జేసి.
5
తేటగీతి
294
ఉదకము ద్రావెడు హయమును, మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్, మొదవు కడ నున్న వృషభము, జదువని యానీచు గడకు జనకుర సుమతీ
0
కందం
562
చించెద దైత్య సంఘములఁ జిందఱవందఱఁ జేసి, బ్రహ్మ బా ధించెద, లోక పాలకులఁ ద్రెళ్ళఁగ నేసెద, భూతలమ్ము గ్ర క్కించెద, శైల జాలముల గీటడఁగించెద, భూమినందనన్ గాంచెదఁ, దల్లడిల్లకుము కంజహితాన్వయ వార్ధి చంద్రమా!
1
ఉత్పలమాల
516
తాటక వచ్చిన దదిగో నాటగ నాఁడుదని మేలమాడక నీ వీ పాటి పడనేయు మని తడ బాటున శంకించు రామ భద్రున కనియెన్‌.
0
కందం
367
వెఱవక మీ కొనర్తు నొకవిన్నప మిట్టివి యెల్లఁ జూచి రా నెఱకలు గట్టుకొన్న మఱి యేండ్లును బూండ్లును బట్టుఁ బ్రాయపుం జిఱుతతనంబు మీమొగము సెప్పక చెప్పెడు నద్దిరయ్య మా కెఱుఁగఁ దరంబె మీమహిమలీర యెఱుంగుడు రేమి చెప్పుదున్.
2
చంపకమాల
421
⁠ఉరుసంధ్యాతపశోణమృత్కలితమై యొప్పారు బ్రహ్మాండమ న్గరిడిన్ గాలపుహొంతకాఁడు చరమాగస్కంధమున్ జేర్చుని బ్బరపున్ సంగడమో యనన్ శశి డిగెన్ బ్రాగ్భూమిభృత్కైతవే తరబాహాగ్రపుసంగడం బనఁగ మార్తండుండు దోఁచెన్ దివిన్.
3
మత్తేభము
269
ఖరకరవంశజా విను మఖండిత భూతపిశాచఢాకినీ జ్వర పరితాపసర్పభయ వారకమైన భవత్పదాబ్జ ని స్పుర దురువజ్రపంజరముజొచ్చితి, నీయెడ దీన మానవో ధ్ధర బిరుదంక మేమఱుకు దాశరథీ కరుణాపయోనిధీ!
2
చంపకమాల
479
సులభుల్ మూర్ఖులు నుత్తమోత్తములు రాజుల్ కల్గి యేవేళ న న్నలఁతం బెట్టిన నీ పదాబ్జములఁ బాయంజాల, నేమిచ్సినం గలధౌతాచల మేలు టంబునిధిలోఁ గావుండు టబ్జంబు పైఁ జెలువొప్పన్ సుఖియింపఁ గాంచుట సుమీ, శ్రీకాళహస్తీశ్వరా!
3
మత్తేభము
260
రాముఁడు ఘోరపాతక విరాముడు సద్గుణకల్పవల్లికా రాముడు షడ్వికార జయరాముడు సాధుజనావనా వ్రతో ద్దాముఁడు రాముడే పరమదైవము మాకని మీ యడుంగు గెం దామరలే భజించెదను దాశరథీ కరుణాపయోనిధీ.
1
ఉత్పలమాల
307
కరణము సాదైయున్నను, గరి మద ముడిగినను, బాము గఱవక యున్నన్, ధర దేలు మీటకున్నను, గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ
0
కందం
158
వెండియుఁ బుణ్యభూములఁ బవిత్రసరిత్తులఁ జూచుచున్ రమా మండనుఁ డుండు దివ్యరుచిమన్మణిచారుకవాట గేహళీ మండిత సౌధగోపుర విమానము లున్నత భక్తిఁ జూచుచున్ నిండిన వేడ్కఁ గృష్ణు పద నీరజ చింతనుఁ డై క్రమంబునన్.
1
ఉత్పలమాల
433
తల్లిందండ్రియు నన్నుఁ గాననిమనస్తాపంబునం బొక్కఁగా నిల్లాలార్తిఁ గృశింపఁగా సవనవహ్నిశ్రేణి చల్లారఁగా నిల్లున్ శూన్యత నొంది సొంపు చెడఁగా నిచ్చోట నేఁ జిక్కి యో ఫుల్లాంభోరుహనేత్ర యేసుఖమతిన్ భోగించెదం జెప్పవే.
4
శార్దూలము
73
సప్తాబ్దంబుల బాలుఁడై నిజభుజాస్తంభంబునన్ లీలమై సప్తాహంబులు శైలరాజము లసచ్ఛత్త్రంబుగాఁ దాల్చి, సం గుప్తప్రాణులఁ జేసె మాధవుఁడు గోగోపాలకవ్రాతమున్ సప్తాంభోధి పరీతభూధరున కాశ్చర్యంబె చింతింపఁగన్.
4
శార్దూలము
17
ఆనందాశ్రులు గన్నులన్ వెడల, రోమాంచంబుతోఁ, దత్పద ధ్యానారూఢుఁడ నైన నా తలఁపులో నద్దేవుఁడుం దోఁచె నే నానందాబ్ధిగతుండనై యెఱుఁగలేనైతిన్ ననున్నీశ్వరున్, నానాశోకహమైన యత్తనువు గానన్ లేక యట్లంతటన్.
4
శార్దూలము
234
చతురామ్నాయ వపుర్విశేష ధర! చంచత్సూకరాకార! నీ సిత దంష్ట్రాగ్ర విలగ్నమై ధరణి రాజిల్లెం గులాద్రీంద్ర రా జత శృంగోపరిలగ్న మేఘము గతిం జాలం దగెన్ సజ్జనాం చిత హృత్పల్వలలోల! భూరమణ! లక్ష్మీనాథ! దేవోత్తమా!
3
మత్తేభము
24
యమనియమాది యోగముల నాత్మ నియంత్రిత మయ్యుఁ, గామరో షములఁ బ్రచోదితంబ యగు, శాంతి వహింపదు, విష్ణుసేవచేఁ గ్రమమున శాంతిఁ గైకొనిన కైవడి; నాదు శరీర జన్మ క ర్మముల రహస్య మెల్ల మునిమండన! చెప్పితి నీవు గోరినన్.
2
చంపకమాల
397
ఆభూదేవకుమారుఁ డేఁగినఁ దదీయానూనరమ్యాకృతిన్ దా భావంబున నిల్పి యంగభవకోదండోగ్రమౌర్వీరవ క్షోభాకంపితధైర్యయై యలఁత నచ్చో నిల్వ కచ్చెల్వ త ద్భూభృన్మేఖలవెంటఁ గానలబడిన్ దుఃఖాబ్ధినిర్మగ్న యై.
4
శార్దూలము
437
నీచనుదోయిసంకుమదనిర్భరవాసన మేన నూన న య్యోచిరసౌఖ్యముల్ గనుటయొండెఁ దపం బొనరించి పాపముల్ రాచుట యొండెఁ గా కిహపరంబుల కూరక దూరమై వయ శ్శ్రీ చన రెంటికిన్ జెడిన రేవఁడ నౌదునె నీరజేక్షణా.
1
ఉత్పలమాల
2
శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణ హస్త ని ర్మూలికి, ఘోర నీరదవిముక్త శిలాహతగోపగోపికా పాలికి, వర్ణధర్మపరిపాలికి, నర్జునభూజయుగ్మ సం చాలికి, మాలికిన్, విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్.
1
ఉత్పలమాల
382
ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ యొంటిఁ జరించె దోట లే కివ్వనభూమి భూసురుఁడ నేఁ బ్రవరాఖ్యుఁడఁ ద్రోవతప్పితిన్ గ్రొవ్వున నిన్నగాగ్రమునకున్ జనుదెంచి పురంబుఁ జేర నిం కెవ్విధిఁ గాంతుఁ దెల్పఁగదవే! తెరువెద్ది శుభంబు నీకగున్
1
ఉత్పలమాల
534
వసుమతీశ! నాకు వర మిచ్చి తప్పుట తగవు గాదు మీకుఁ, దలఁపులోన మఱచినా రదేమొ, మన్నించి తొల్లింటి యీవు లీయవలయు నీ క్షణంబ.
6
ఆటవెలది
353
ఎడపక దుర్జనుండొరుల కెంతయుఁ గీడొనరించుఁ గాని యే యెడలను మేలు సేయఁడొక యించుకయైనను; జీడపుర్వు దాఁ జెడఁ దిను నెంతెకాక పుడుసెండు జలంబిడి పెంప నేర్చునే పొడవగుచున్న పుష్పఫల భూరుహ మొక్కటినైన భాస్కరా!
2
చంపకమాల
198
నిరతిశయోజ్జ్వల తేజ స్స్ఫురణం దనరారు పరమపురుషుని విష్ణుం బురుషోత్తము వర్ణింపను సరసిజభవ భవులకైన శక్యమె? చెపుమా.
0
కందం
398
అక్కట వాఁడు నాతగులు మాఱడి సేసి దయావిహీనుఁడై చిక్కక త్రోచి పోయె దరిఁ జేరఁగ రాని వియోగసాగరం బెక్కడ నీఁదుదాన నిఁక నీకొఱనోములు నోఁచినట్టి నే నెక్కడ వానికౌఁగి లది యెక్కడ హావిధి యేమి సేయుదున్.
1
ఉత్పలమాల
540
ఆ వేళన్ ఖరుఁ డుగ్రవృత్తి లయకాలాభీల ఘోరాకృతుల్ దైవారన్, గజవాజి సంఘములతో, దైత్యాళితో, భూరి రో షావిర్భూత మనస్కుఁడై నడిచె గర్వారంభ సంరంభుఁడై దేవవ్రాతము భీతి నొంది కలఁగన్ దేజంబు సొంపారఁగన్.
4
శార్దూలము
356
ఏడ ననర్హుఁడుండు నటకేఁగు ననర్హుఁడు నర్హుఁడున్నచోఁ జూడగఁ నొల్లడెట్లన; నశుద్ధగుణస్థితి నీఁగ పూయముం గూడిన పుంటిపై నిలువఁ గోరిన యట్టులు నిల్వ నేర్చునే సూడిదఁ బెట్టు నెన్నుదుటి చొక్కపుఁ గస్తురి మీఁద భాస్కరా!
1
ఉత్పలమాల
573
తారాపతి శిక్షింపుచుఁ దారా పతి ధవళ కీర్తిఁ దగు నర్కజునిన్ దారా దేవికిఁ బురి కా తారార్కము గాఁగ రాజ తనయుఁడు నిల్పెన్.
0
కందం
439
శ్రీవిద్యుత్కలితాజవంజవ మహాజీమూతపాపాంబు ధా రావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్ దేవా! నీ కరుణా శరత్సమయమింతేఁ జాలు సద్భావనా సేవం దామరతంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా!
4
శార్దూలము
544
చలమున నంత శూర్పణఖ సయ్యన లంకకు నేఁగి, రావణుం గొలువునఁ గాంచి మ్రొక్కి, తనకున్ నృపసూనులు సేసినట్టి చేఁ తలు వినుపించి, వారు తమ తండ్రి యనుజ్ఞను వచ్చి, కానలో పలఁ దిరుగాడు చందములుఁ బన్నుగ నేర్పడఁ జెప్పి పిమ్మటన్.
2
చంపకమాల
468
అమరస్త్రీల రమించినన్ జెడదు మోహంబింతయున్ బ్రహ్మ ప ట్టము సిద్దించిన నాస దీరదు నిరూఢక్రోధమున్ సర్వలో కములన్మ్రింగినమాన దిందుఁగల సౌఖ్యంబొల్ల నీ సేవ చే సి మహాపాతక వారిరాశిఁ గడతున్ శ్రీకాళహస్తీశ్వరా!
3
మత్తేభము
5
అలసులు, మందబుద్దియుతు, లల్పతరాయువు, లుగ్రరోగసం కలితులు, మందభాగ్యులు సుకర్మము లెవ్వియుఁ జేయఁజాల రీ కలియుగమందు మానవులు; గావున నెయ్యది సర్వసౌఖ్యమై యలవడు? నేమిటం బొడము నాత్మకు? శాంతి, మునీంద్ర! చెప్పవే.
2
చంపకమాల
455
తరఁగల్‌ పిప్పల పత్త్రముల్‌ మెఱుఁగుటద్దంబుల్‌ మరుద్దీపముల్‌, కరికర్ణాంతము లెండమావులతతుల్‌ ఖద్యోత కీట ప్రభల్‌ సురవీథీ లిఖితాక్షరంబు లసువుల్‌ జ్యోత్స్నాపయఃపిండముల్‌ సిరులందేల మదాంధులౌదురు జనుల్‌ శ్రీకాళహస్తీశ్వరా
3
మత్తేభము
8
వర గోవింద కథా సుధారస మహావర్షోరు ధారా పరం పరలం గాక బుధేంద్రచంద్ర! యితరోపాయానురక్తిం బ్రవి స్తర, దుర్దాంత, దురంత, దుస్సహ, జనుస్సంభావితానేక దు స్తర, గంభీర, కఠోర, కల్మష కనద్దావానలం బాఱునే?
3
మత్తేభము
41
నరనారాయణు లున్న చోటికి మరున్నారీ సమూహంబు భా స్వరలీలం జని రూప విభ్రమ కళా చాతుర్య మేపారఁగాఁ బరిహాసోక్తుల నాటపాటలఁ జరింపం జూచి నిశ్చింతతన్ భరితధ్యాన తపః ప్రభావ నిరతిం బాటించి నిష్కాములై.
3
మత్తేభము
548
ఏచిన కినుకను బలు నా రాచము సంధించి డాసి రాఘవుఁ డా మా రీచుని దైత్యాధముఁ గుల నీచునిఁ గూలంగ నేసె నిర్జరు లలరన్.
0
కందం
345
అవనివిభుండు నేరుపరియై చరియించినఁ గొల్చువార లె ట్లవగుణు లైననేమి? పనులన్నియుఁ జేకుఱు వారిచేతనే; ప్రవిమలనీతిశాలి యగు రాముని కార్యము మర్కటంబులే తవిలి యొనర్పవే జలధి దాఁటి సురారులఁ ద్రుంచి భాస్కరా!
2
చంపకమాల
318
తడ వోర్వక, యొడ లోర్వక, కడు వేగం బడిచి పడిన గార్యం బగునే; తడ వోర్చిన, నొడ లోర్చిన, జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ
0
కందం
16
హరిపాదద్వయభక్తి మీ వలన నిట్లారూఢమై యుండునే తిరుగంబాఱదు చిత్తవృత్తి హరిపై దీపించి మీలోపలన్ ధరణీదేవతలార! మీరలు మహాధన్యుల్ సమస్తజ్ఞులున్ హరిచింతన్ మిముఁ జెంద వెన్నడును జన్మాంతర్వ్యధాయోగముల్
3
మత్తేభము
278
అగణిత జన్మకర్మదురితాంబుధిలో బహుదుఃఖ వీచికల్ దెగిపడ నీదలేక, జగతీధర నీపదభక్తి నావచే దగిలి తరింపగోరితి పదంబడి, నాదు భయంబు మాన్పవే తగదని చిత్తమందిడక, దాశరథీ కరుణాపయోనిధీ!
2
చంపకమాల
354
ఎడ్డె మనుష్యుఁడే మెఱుఁగు నిన్నె దినంబులు గూడి యుండినన్ దొడ్డ గుణాఢ్యునందుఁ గల తోరపు వర్తనలెల్ల బ్రజ్ఞఁ బే ర్వడ్డ వివేకి రీతి; రుచిపాకము నాలుకగా కెఱుంగునే? తెడ్డది కూరలోఁ గలయఁ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా!
1
ఉత్పలమాల
267
జలనిధిలోనదూఱి కుల శైలముమీటి ధరిత్రిగొమ్మునం దలవడమాటిరక్కసుని యంగముగీటిబలీంద్రునిన్ రసా తలమునమాటి పార్ధివక దంబముగూల్చిన మేటిరామ నా తలపుననాటి రాగదవె దాశరథీ కరుణాపయోనిధీ.
2
చంపకమాల
30
గిరులంబోలెడి కరులను, హరులం, దన ప్రాణదయితలై మనియెడి సుం దరులను, హితవరులను, బుధ వరులను వర్జించి గాఢవైరాగ్యమునన్.
0
కందం
270
జుఱ్ఱెదమీక థామృతము జుఱ్ఱెదమీపదకంజతో యమున్ జుఱ్ఱెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే జుఱ్ఱెద జుఱ్ఱుజుఱ్ఱుఁన రుచుల్ గనువారిపదంబు గూర్పవే తఱ్ఱులతోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ.
1
ఉత్పలమాల
195
జనలోక నివాసకు ల ర్థిని వినుతింపంగ నతుల దివ్యప్రభచేఁ దనరుచు మీలిత నిజలో చనుఁడై వసియించు నతఁడు సముచితలీలన్.
0
కందం
100
కపట మునులకెంత కాలమునకు నైన సంతసింప నేను జలజగర్భ! చిరతపస్సమాధిఁ జెంది విసర్గేచ్ఛ మెలఁగు నిన్నుఁ బరిణమింతుఁ గాని.
6
ఆటవెలది
238
విశ్వభవస్థితిప్రళయ వేళల యందు వికారసత్త్వమున్ విశ్వము నీవ యై నిఖిల విశ్వము లోలి సృజింతు విందిరా ధీశ్వర! యీశ! కేశవ! త్రయీమయ! దివ్యశరీర! దేవ! నీ శాశ్వతలీల లిట్టి వని సన్నుతిసేయఁగ మాకు శక్యమే?
1
ఉత్పలమాల
513
ఇల సాకేత నృపాల శేఖరుఁడు దా హేలా విలాసంబుతో ఫల కాంక్షన్ గ్రతువుం బొనర్చినయెడన్ బంగారు పాత్రమ్ము లో పల దుగ్ధాన్నము చాల నించుకొని తాఁ బ్రత్యక్షమై నిల్చి ని ర్మల తేజంబునఁ బావకుం డనియెఁ బ్రేమన్ మంజు వాక్యంబులన్.
3
మత్తేభము
514
పాయసమ్ము రెండు భాగముల్ గావించి, యగ్ర సతుల కీయ, నందులోన సగము సగము దీసి ముగుద సుమిత్రకు నొసఁగి, రంత నామె మెసవెఁ బ్రీతి.
6
ఆటవెలది
43
నారాయణుఁ డప్పుడు దన యూరువు వెసఁ జీఱ నందు నుదయించెను, బెం పారంగ నూర్వశీ ముఖ నారీజనకోటి దివిజనారులు మెచ్చన్.
0
కందం
493
తొల్లిటి యిప్పటి సత్కవి వల్లభులను రసిక వినుత వాగ్విభవకళా మల్లులఁ గవితా రచనల బల్లిదులైనట్టి ఘనుల భక్తిగఁ దలఁతున్
0
కందం
91
వనజాక్షు మహిమ నిత్యము వినుతించుచు; నొరులు వొగడ వినుచున్; మదిలో ననుమోదించుచు నుండెడు జనములు దన్మోహవశతఁ జనరు మునీంద్రా!
0
కందం
490
మించి సమస్తలోకములు మిన్నక తాఁ దన నేర్చుమీఱ ని ర్మించి, ప్రగల్భతన్ మెఱసి, మేలును గీడును బ్రాణికోట్లు సే వించ ఘటించి శాస్త్రములు, వేదములుం గొనియాడు చుండు నా కాంచన గుర్భుఁ డిచ్చు నధికంబుగ నాయువు నీప్సితార్థముల్‌
1
ఉత్పలమాల
27
ధీరులు, నిరపేక్షులు, నా త్మారాములునైన మునులు హరిభజనము ని ష్కారణమ చేయుచుందురు; నారాయణుఁ డట్టి వాఁ, డనవ్యచరిత్రా!
0
కందం
331
పాలను గలసిన జలమును పాల విధంబుననె యుండు బరికింపంగా పాల చవి జెఱచు గావున పాలసుడగు వాని పొందు వలదుర సుమతీ
0
కందం
352
ఎట్టుగఁ బాటుపడ్డ నొక యించుక ప్రాప్తము లేక వస్తువుల్ పట్టుపడంగ నేరవు; నిబద్ధి సురావళిఁ గూడి రాక్షసుల్ గట్టు పెకల్చి పాల్కడలిఁ గవ్వముచేసి మథించి రంతయున్ వెట్టియె గాక యేమనుభవించిరి వారమృతంబు భాస్కరా!
1
ఉత్పలమాల
44
ఊరువులందు జనించిన కారణమున నూర్వశి యన ఘనతకు నెక్కెన్ వారల రూప విలాస వి హారములకు నోడి రంత నమరీజనముల్.
0
కందం
351
ఊరక సజ్జనుండొదిఁగి యుండిననైన దురాత్మకుండు ని ష్కారణమోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా; చీరలు నూరుటంకములు చేసెడివైనను బెట్టె నుండఁగాఁ జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు? భాస్కరా!
1
ఉత్పలమాల
335
పొరుగున బగవాడుండిన, నిరవొందక వ్రాతకాడె యేలిక యైనన్, ధర గాపు కొండెమాడిన, గరణాలకు బ్రదుకు లేదు గదరా సుమతీ!
0
కందం
464
దినముంజిత్తములో సువర్ణముఖరీతీరప్రదేశామ్ర కా ననమధ్యోపల వేదికాగ్రమున నానందంబునం బంకజా సననిష్ఠన్నినుఁ జూడఁగన్న నదివో సౌఖ్యంబు లక్ష్మీవిలా సిని మాయానటనల్ సుఖంబులగునే శ్రీకాళహస్తీశ్వరా!
3
మత్తేభము
11
అతిరహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుఁ డెవ్వఁ డేని మాపు రేపుఁ జాల భక్తితోడఁ జదివిన సంసార దుఃఖరాశిఁ బాసి తొలఁగిపోవు.
6
ఆటవెలది
581
మఱువులు, సందులు, గొందులు, నిరవులుఁ, జొరరాని చోట్లు, నేకాంతంపుం దెరువులు, నంతఃపురములు నెరవునఁ గపి కుంజరుండు వెదకం జొచ్చెన్.
0
కందం
486
అకలంకస్థితినిల్పి నాదమను ఘంటారావమున్ బిందు దీ ప కళాశ్రేణి వివేక సాధనము లొప్పంబూని యానంద దా రక దుర్గాటవిలో మనోమృగము గర్వస్ఫూర్తి వారించు వా రికిఁగా వీడు భవోగ్రబంధలతికల్ శ్రీకాళహస్తీశ్వరా!
3
మత్తేభము
271
విన్నపమాలకించు రఘువీర నహి ప్రతిలోకమందు నా కన్న దురాత్ముడున్, బరమ కారుణికోత్తమ వేల్పులందు నీ కన్న మహాత్ముడుం బతిత కల్మషదూరుడు లేడు నాకు, వి ద్వన్నుత నీవె నాకు గతి దాశరథీ కరుణాపయోనిధీ.
1
ఉత్పలమాల
370
గంగాస్వచ్ఛతరంగభంగికయశోగాఢచ్ఛవిచ్ఛన్నపా రంగాంకాంక నిరంకుశప్రతికళాప్రౌఢిప్రియంభావుకా గాంగేయాచలచాపనూపురవచోగాంభీర్యలీలాస్పదా బంగాళాంగకళింగభూపసుభటాభ్రశ్రేణిఝంఝానిలా.
4
శార్దూలము
151
దాసీపుత్రుని మీరలుఁ దాసీనుం జేయ కిటకుఁ దగునె పిలువఁగా? నాసీనుండై ప్రేలెడు గాసిలి చెడిపోవ వెడలఁగా నడువుఁ డిఁకన్.
0
కందం
392
ఎందేడెందము కందళించు రహిచే నేకాగ్రతన్ నిర్వృతిన్ జెందున్ గుంభగతప్రదీపకళికాశ్రీ దోఁప నెం దెందుఁ బో కెందే నింద్రియముల్ సుఖంబుఁ గనునాయింపే పరబ్రహ్మ 'మా నందో బ్రహ్మ' యటన్న ప్రాఁజదువు నంతర్బుద్ధి నూహింపుమా.
4
శార్దూలము
131
ఇన్నిదెలియంగ నానతి యిచ్చి నన్ను నర్థి రక్షింపవే విమలాంతరంగ! ఘనదయాపాంగ! హరిపాదకమలభృంగ! మహితగుణసంగ! పాపతమఃపతంగ!
5
తేటగీతి
216
అతని చరిత్రం బవ్యా హత సుఖదము నిఖిల మంగళావహము సమం చితముం గావున బుధసే విత! నా కెఱుఁగంగఁ బలుకవే మునితిలకా!
0
కందం
51
బలి నిజమౌళి నవ్వటుని పాదసరోరుహ భవ్యతీర్థ ము త్కలిక ధరించి, తన్నును జగత్త్రయమున్ హరికిచ్చి, కీర్తులన్ నిలిపె వసుంధరాస్థలిని నిర్జరలోక విభుత్వహానికిం దలఁకక శుక్రు మాటల కుఁదారక భూరివదాన్యశీలుఁడై.
2
చంపకమాల
566
అని సీత తెఱఁగుఁ దన పని జన నాయకుఁడైన రామచంద్రునితోడన్ వినిపించి, యా జటాయువు తను వెరియఁగ నంతఁ గాలధర్మము నొందెన్.
0
కందం
494
గురు లింగ జంగ మార్చన పరుఁడును, శివభక్తి రతుఁడు, బాంధవ హితుఁదున్, గురుఁ దాతుకూరి కేసయ వరపుత్రిని మొల్లయనఁగ వఱలిన దానన్
0
కందం
170
ఇతరారాధన మాని కృష్ణుఁ గమలాధీశుం బయోజాసనా ర్చితు భక్తిన్ నిజనాథుఁగా సతతమున్ సేవించు పుణ్యుల్ జగ న్నుతు లధ్యాత్మ విదుల్మహాభుజులు మాన్యుల్ ధర్మమార్గుల్సము న్నతి సత్యాత్మజ చారుదేష్ణ గదు లానందాత్ములే యుద్ధవా!
3
మత్తేభము
93
భరితోదగ్రనిదాఘతప్తు డగు నప్పాంథుం డరణ్యాది సం చరణక్లేశసముద్భవం బగు పిపాసం జెంది యాత్మీయ మం దిరముం జేరి గతశ్రముం డగుచు నెందేనిం జనంబోని భం గి రమాధీశుపదారవిందయుగ సంగీభూతుఁడై మానునే?
3
మత్తేభము
551
దీవించుడు, మునియే యని భావింపుచుఁ జేర వచ్చు భామిని, నపు డా రావణుఁడు రథము మీఁదికి వే వేగము తిగిచి గగన వీథిని జనియెన్.
0
కందం
575
గిరులును, నదులును, వనములుఁ బరికింపుచుఁ, బట్టణములు బహు విధ గతులన్ దిరుగుచు వెదకుచుఁ, గానక కరువలి సుతుఁ డాది యైన కపి వరు లెదుటన్.
0
కందం
67
తనయా! గోపకు లొక్క రేయితఱి, నిద్రం జెందఁ గార్చిచ్చు వ చ్చినఁ గృష్ణా మము నగ్నిపీడితుల రక్షింపం దగుం గావవే యనినం గన్నులు మీరు మోడ్వుఁ డిదె దావాగ్నిన్ వెసన్నార్తు నే నన వారట్ల యొనర్ప మ్రింగె శిఖిఁ బద్మాక్షుండు లీలా గతిన్.
3
మత్తేభము
233
అరవిందోదర తావకీనసితదంష్ట్రాగ్రావ లగ్నక్షమా ధరనద్యబ్ధినదాటవీయుత సమిద్ధక్ష్మాతలంబొప్పె భా సురకాసారజలావతీర్ణమదవచ్ఛుండాలరాడ్దంతశే ఖరసంసక్త వినీలపంకజమురేఖంబొల్పు దీపింపఁగన్
3
మత్తేభము
197
హరి పరమాణురూపమున నందు వసించి విరాజమానుఁడై సరి వెలుఁగొందు నిమ్ముల నసంఖ్యము లైన మహాండకోశముల్ నెఱిఁ దన యందు డింద నవనీరజనేత్రుఁ డనంతుఁ డాఢ్యుఁ డ క్షరుఁడు పరాపరుం డఖిలకారణకారణుఁ డప్రమేయుఁ డై.
2
చంపకమాల
323
తలనుండు విషము ఫణికిని, వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్, తలతోక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
0
కందం
274
గద్దరి యోగి హృత్కమలగంధ రసానుభవంబుఁజెందు పె న్నిద్దపు గండుఁదేఁటి, ధరణీసుత కౌఁగిలిపంజరంబునన్ ముద్దులుగుల్కు రాచిలుక, ముక్తినిధానమ రామ, రాఁగదే తద్దయు నేఁడు నాకడకు, దాశరథీ కరుణాపయోనిధీ.
1
ఉత్పలమాల
25
వాయించు వీణ నెప్పుడు, మ్రోయించు ముకుందగీతములు, జగములకుం జేయించుఁ జెవుల పండువు, మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలఁడే
0
కందం
199
అని మైత్రేయుఁడు విదురుం గనుఁగొని వెండియును బలికెఁ గాలాహ్వయుఁ డై తనరిన హరి మహిమల నే వినిపించితి; సృష్టిమహిమ విను మెఱిఁగింతున్.
0
కందం
92
అని వాణీశుఁడు నారద మునివరునకుఁ జెప్పినట్టి ముఖ్యకథా సూ చన మతిభక్తిఁ బరీక్షి జ్జనపాలునితోడ యోగిచంద్రుఁడు నుడివెన్.
0
కందం
65
మదిఁ గృష్ణుండు యశోదబిడ్డఁ డని నమ్మంజాల యోగీంద్ర త ద్వదనాంభోజములోఁ జరాచర సమస్తప్రాణిజాతాటవీ నద నద్యద్రి పయోధి యుక్త మగు నానా లోకజాలంబు భా స్వ దనూనక్రియఁ జూపెఁ దల్లికి మహాశ్చర్యంబు వాటిల్లఁగన్.
3
మత్తేభము
246
రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ.
1
ఉత్పలమాల
49
సురలోకంబుఁ గలంచి దేవసమితిన్ స్రుక్కించి యుద్యద్గదా ధరుఁడై వచ్చు నిశాచరుం గని, కనద్దంష్ట్రా కరాళస్య వి స్ఫురిత భ్రూకుటితో నృసింహగతి రక్షోరాజ వక్షంబు భీ కరభాస్వన్నఖరాజిఁ ద్రుంచె ద్రిజగత్కల్యాణసంధాయియై.
3
మత్తేభము
517
ఆకాశ వీథి నెలకొని రాకాసులు గురిసి రమిత రక్తముఁ, బలలం బా కౌశికు యజ్ఞముపై భీకరముగ ముని గణంబు భీతిం బొందన్.
0
కందం
90
ఉపవాసవ్రత శౌచ శీల మఖ సంధ్యోపాస నాగ్నిక్రియా జప దానాధ్యయ నాది కర్మముల మోక్షప్రాప్తిసేకూర; ద చ్చపుభక్తిన్ హరిఁ బుండరీకనయనున్ సర్వాతిశాయిన్ రమా ధిపుఁ బాపఘ్నుఁ బరేశు నచ్యుతుని నర్థిం గొల్వలేకుండినన్.
3
మత్తేభము