id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
3957
_x000D_ చెవిని నిలుగట్టి చెప్పెను వేమన _x000D_ బట్టబయలనుండు బ్రహ్మమనుచు _x000D_ బుద్ధిఁ గలిగి యందుఁ బొంది సుఖించుఁడీ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
16
నిఖిలదైవత కార్యముల్‌ నిర్వహించు-నీకు నిజకార్యము భరంబె నిర్వహింప! చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
3097
_x000D_ పంది పిల్ల లీనుఁ బదియు నైదింటిని _x000D_ కుంజరంబు యీను కొదమ నొకటి _x000D_ యుత్తమ పురుషుండు నొక్కఁడు జాలడా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
79
పూతనాకుచకుంభపూర్ణ విషస్తన్య- పాయివై బ్రదికిన భాగ్య మేమి? కాళియాశీవిషగ్రసన ప్రమాదంబు గడచి జీవించిన ఘనత యేమి? చాణూరమల్లదో స్తంభ ఘట్టన కోర్చి- లబ్ధజయుఁడ వైన లాభ మేమి? సాళ్వరాజామోఘ శక్తిప్రయోగంబు- మరలించుకొనిన సామర్ధ్యమేమి?
3
seesamu
3847
_x000D_ తపముజపములెన్నొ ధాత్రిజనుల కెల్ల _x000D_ నొనర శివునిఁజూడ నుపమగలదు _x000D_ మనసుఁజెదరనీక మదిలోనఁజూడరో _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4059
_x000D_ గీము విడిచి సుగుడి గిక్కురుమన కుండు _x000D_ జీవు విడుచువేళ శివునిఁ దలఁచు _x000D_ మనసు గొల్పకయును మాయచేఁ బొరలెడు _x000D_ పాపనరుల కేటి పరము వేమ.
0
aataveladi
124
కశిపుఁ దునుమాడి ప్రహ్లాదుఁ గరుణ నేలి-తందఱి కసహ్య మయ్యె ని న్నపుడె కనఁగ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
4501
పాపాత్మునకు బారుపత్య మియ్యగరాదు । చాలని పనికిఁ గాల్సాచరాదు పలుగాకివానితో భాషింపగా రాదు । చెడ్డవానికి మేలు సేయరాదు యాదాయమెఱుఁగక యప్పు తీయగరాదు । పలువురితో ద్వేషపడగరాదు తప్పు సేయనివాని దండింపబోరాదు । చేసిన కృత్యంబు చెప్పరాదు
3
seesamu
2057
ఇట్టి తప్పు లెరుంగక యిచ్చవచ్చి - నటుల మెలఁగుదు రిప్పుడీ యవని జనులు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
2778
కోమలి విశ్వాసంబును బాములతోఁ జెలిమి యన్యభామల వలపున్‌ వేముల తియ్యఁదనంబును భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ!
1
kandamu
668
చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్‌ చేసితి నన్యదైవములఁ జేరి భజించిన వారిపొందు నేఁ చేసితినేరముల్‌ దలఁచి చిక్కులఁబెట్టకుమయ్య యయ్య నీ దాసుఁడనయ్య భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
2379
నావయగు\న్‌ భవజలధికిఁ ద్రోవయగు\న్‌ ముక్తికాంతతోఁ గూడుటకు\న్‌ కేవలనిజదేశిక ర క్షావహ మగుయోగ మెన్న సంపఁగిమన్నా!
1
kandamu
2890
చిత్తము రంజిలంగ నల చిత్తజుపట్టపుదంతివై ??? వత్తువు వచ్చి చిత్రితమ??? యిబ్బడి నుండెడు నన్ను కేళిలో మెత్తువొ మెచ్చి నా సొలపు మేన్ వెదదీరగ మోవినానకన్ బిత్తువొ, నీ ఋణంబు లిక యెన్నడు దీర్తును సుందరీమణీ!
6
vutpalamaala
566
సురపతి వేణువుం గలిమికొమ్మమగండు మృదంగవాద్య మం- బురుహభవుండు తాళమును పొత్తముముత్తవ వీణఁ బూనఁగా హరిసతి బాడినం జదల నద్భుతతాండవకేళి సల్పితౌ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
3446
_x000D_ తాను పుట్టుచోటు తాఁజూచి పలికెనా _x000D_ తాను బుద్ధిదిరుగు ధరణిలోన _x000D_ తాను బుట్టుచోటు తత్వంబు తలపోయ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
999
పతిని దైవమ యంచు మతి నెంచి యరయుచుఁ | గలనైనఁ గ్రోధంబు నిలుపఁబోక యతిథులఁ జుట్టాల నతిభక్తిఁ జూచుచు | సత్యవాక్యనిరూఢి జరుపుచుండి యుభయవంశములకు నుపకీర్తి నించుచు | నిమ్ముగా నగు సుచిత్తమ్ము పూని యత్తమామల మాట కడుగు దాఁటగఁబోక | మాన మాభరణంబుగా నమర్చి
3
seesamu
2875
మించెడు వేడ్కఁ బైకొని రమించెడుచోఁ గటిమీఁద వేణి న- ర్తించుట యొప్పు రాచిలుకతేజిమనోజుఁడు చౌపటాలి ద్రొ- క్కించుచుఁ జిత్రభంగి దుమికింపుచు నీలకశాహతిం దుటా- యించిన లాగు నా సొగసు లెన్నఁగ శక్యమే, సుందరీమణీ!
6
vutpalamaala
4561
సాధిత జన్మబాధ! గతసర్వనిషేధ! హతాపరాధ దు ర్బోధ కళావిరోధ! పరిపోషిత శాంభవవేధ! వర్జిత క్రోధ! నిరాకృతాఖిల విరోధ! శివైక్య సుబోధ! యీ భవ వ్యాధికి నీవె మందు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
1438
నడక మెల్లదనంబు పున్నాగ దాని । సురత మానందభైరవి సొంపు నాట నెనయకుండినవేళ నా నెనరు తాళ । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
247
అరిషడ్వర్గముఁ బాఱఁద్రోలి సకలవ్యామోహముల్ వీడి సు- స్థిరయోగాంతరదృష్టి మీ చరణముల్ సేవించు పుణ్యాత్మకుల్ వరవైకుంఠపురాంతరాళమున భాస్వల్లీలలన్ ముక్తి తా- మరసాక్షీరతికేలిఁ జొక్కుదురు రామా! భక్తమందారమా!
4
mattebhamu
4169
_x000D_ తప్పురూపు గట్టి ధరలోనఁ దిరిగెడు _x000D_ సేఁతలెల్ల మిత్తిఁజేరుకొఱకె _x000D_ కడుపునిండ నింత కష్టంబు లేలరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4073
_x000D_ బ్రతుకువార లెవరు బ్రతుకకుందు రెవరు _x000D_ బ్రతికిబ్రతుకలేని ప్రాణు లెవరు _x000D_ క్షితిని శోధఁజేసి స్థిరమునఁజూడరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
711
దొరసిన కాయముల్ముదిమి తోచినఁజూచి ప్రభుత్వముల్సిరుల్‌ మెఱపులుగాగజూచి మఱి మేదినిలోఁ దమతోడివారు ముం దరుగుటచూచి చూచి తెగునాయువెఱుంగక మోహపాశము ల్దరుఁగని వారికేమి గతి దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
392
అపవర్గం బొనగూడునో చిరసుఖాహ్లాదంబు చేకూరునో జపహోమాధ్యయనార్చనాదిక మహాషట్కర్మము ల్డించి దు- ష్కపటోపాయవిజృంభమాణధరణీకాంతాధమాగారని- ష్కపటభ్రాంతి జరింతు రార్యు లిల భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
3268
_x000D_ ఆశలనెడు తాళ్ళ నమరఁ గోయగఁ జేసి _x000D_ పారవైవఁగాని పరములేదు _x000D_ కొక్కు తిండియాసఁ జిక్కి చచ్చినయట్లు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2011
బలుకర్మాయత పాశబంధవితతి\న్‌ బాహాపరిశ్రేణికి\న్‌ జలయంత్రాన్విత బంధయాతనగతిన్‌ సంసారకూపంబులో నలరం ద్రిమ్మరుచుండు నన్ను నకటా! యార్తుండనై వేఁడెదన్‌ వెలయ న్నీకృపచేతఁ జేకొనవె నన్‌ వేవేగ నారాయణా!
4
mattebhamu
1177
అల సరస్నానంబులఁ బరి మళముం గలుగు వస్తువులను మహితల యానం బుల నాసనముల నుబ్బకు, కలుగుం జనుఁ గాలవశము గాను గుమారా!
1
kandamu
391
హృద్వీథిం గనరుం దిరస్కృతియు బిట్టేపార నొక్కప్పుడున్ సద్వాక్యంబును దర్శనం బిడని రాజశ్రేణి కాశింతురౌ ‘విద్వద్దండ మగౌరవం’ బను స్మృతుల్ వీక్షింపరా దుర్నృపా- గ్రద్వారంబుల వ్రేలు పండితులు భర్గా! పార్వతీవల్లభా!
7
saardulamu
1937
బ్రహ్మాండావలిలోన సత్వగుణివై బాహ్యంబునం దాదిమ బ్రహ్మాఖ్యం బరతత్వబోధములకున్‌ భవ్యాధినాథుండవై బ్రహ్మేంద్రామరవాయుభుక్పతులకు\న్‌ భావింప రాకున్న నా జిహ్మవ్యాప్తుల నెన్న నాదు వశమే చిద్రూప, నారాయణా!
7
saardulamu
1697
విమలవిచారశీలుఁడయి విశ్రుతకీర్తి దిశల్ ఘటిల్ల మా- ఘము మొదలైన కావ్యరసకల్పనలు న్మఱి శాస్త్రము ల్పురా- ణములు నలంకృతు ల్మనమునన్ బెనుపారఁగ నెన్నఁ డింక నా కొమరుఁడు నేర్చునో యనుచుఁ గోరెడు తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
3632
_x000D_ నెయ్యి లేనికూడు నీయాన కసవది _x000D_ కూరలేని తిండి కుక్కతిండి _x000D_ ప్రియములేనికూడు పిండపుఁ గూడురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2878
జడ కటి సంచరింప, బురుసాపనిచీరె పయిన్ మెఱుంగుపా- వడ తళుకుల్ నటింప, బిగివట్రువగుబ్బల రత్నహారముల్ తడఁబడి సందడింప, మరుతంత్రము లందియ లుగ్గడింపఁగాఁ, బడకకు వచ్చు నీ సొబగు భావముఁ బాయదు సుందరీమణీ!
5
champakamaala
650
సిరులిడ సీత పీడలెగజిమ్ముటకున్‌ హనుమంతుఁ డార్తి సో దరుఁడు సుమిత్రసూతి దురితంబులు మానుప రామనామమున్‌ గరుణఁ దరిల్ప మానవులఁ గావఁగఁ బన్నిన వజ్రపంజరో త్కరముగదా భవన్మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
500
మునుపొనరించు పాతక మమోఘము జీవులకెల్లఁ బూని యా వెనుకటి జన్మమం దనుభవింపక తీఱదు; రాఘవుండు వా లిని బడనేసి తా మగుడ లీల యదూద్భవుఁడై కిరాతుచే వినిశిత బాణపాతమున వీడ్కొనఁడే తన మేను భాస్కరా!
5
champakamaala
3286
_x000D_ సొమ్ము దొరకుదనుక జ్యోతి యంతియెకాక _x000D_ సొమ్ము దొరకునెనక జ్యోతి యేల _x000D_ దేవుఁడైన వెనుక దేహంబు మఱియేల _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2597
ఏయేవేళల నేవయస్సున నరుం డేభూమి నేయూరిలో నేయేకర్మము నాచరించు నశుభంబేని న్శుభంబేని దా నాయావేళల నావయస్సున నరుం డాభూమి నాయూరిలో నాయాకర్మములెల్లఁ దాఁ గుడుచుఁ దథ్యంబింత సర్వేశ్వరా!
7
saardulamu
1472
గుబ్బిచనుమొన లెదనాని గురుతులుంచి । తరుణి చౌశీతిబంధపద్ధతు లెరింగి రతుల దేలించు నీ చమత్కృతి దలంప । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
722
అల్లన లింగమంత్రిసుతుఁ డత్రిజ గోత్రజుఁడాదిశాఖ కం చెర్లకులోద్భవుండనఁ బ్రసిద్ధుఁడనై భవదంకితంబుగా నెల్లకవుల్‌ నుతింప రచియించితి గోపకవీంద్రుఁడన్‌ జగ ద్వల్లభ నీకు దాసుఁడను దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
2794
దగ్గఱ కొండెము చెప్పెడు ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మఱి తా నెగ్గుఁ బ్రజ కాచరించుట బొగ్గులకై కల్పతరువుఁ బొడుచుట సుమతీ!
1
kandamu
4349
దారిద్ర్యమనెడు భూధరచయంబులు గూల్ప । హరి నీదు భక్తి వజ్రాయుధంబు అజ్ఞానమనెడు గాఢాంధకార మణంప । నీదు సపర్య భానూదయంబు ఘోరమౌ దుష్కృతాంభోరాశి నింకింపఁ- । గా నీదు సేవ దావానలంబు చపలం బనెడు రోగసమితిని మాన్ప న- । బ్జాక్ష నీ స్మరణ దివ్యౌషధంబు
3
seesamu
1643
మునుకొని తాను బెద్దలకు మ్రొక్కిన వారును బ్రేమఁ బుత్రులం గనుఁగొని సర్వకాలము సుఖంబున నుండుదు వీ వటంచు దీ- వన లిడునంతలోనన సువర్ణమహీధర మెక్కినట్లు నె- మ్మనమున జాల సంతసిలు మానినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
3859
_x000D_ మనసనలము రెంటికినిల _x000D_ ఘనమును కొంచెంబుఁ దెలియఁగావలె సుమ్మీ _x000D_ కనుమూసి తెరచినంతనె _x000D_ ఘనమై విహరించుమనసుఁగానరు వేమా.
1
kandamu
924
అనుదినము కృష్ణశతకము వినినఁ బఠించినను ముక్తి వేడుక గలుగు\న్‌ ధనధాన్యము గోగణములు తనయులు నభివృద్ధిఁ బొందు దద్దయుఁ గృష్ణా.
1
kandamu
3145
_x000D_ తత్వ మెఱుఁగువాడు దైవంబు నెఱుఁగును _x000D_ సర్వసారములను జావఁ జేయు _x000D_ కదళిమ్రింగునట్లు గరళంబు మ్రింగునా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4114
_x000D_ శుద్ధదృష్టిఁ దెలిసి శుక్రునంతటివాఁడు _x000D_ పట్టలేక మనసు పాఱవిడిచి _x000D_ కన్నుపోయి పిదప కాకిచందం బయ్యె _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3381
_x000D_ రోయవచ్చుఁ బరము రూఢిగాఁ దెలిసిన _x000D_ గానవచ్చు గ్రుడ్డు కదలకున్న _x000D_ రెప్పలార్పకున్న రెంటి సందుననుండి _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
922
దుర్మతిని మిగుల దుష్టపుఁ గర్మంబులఁ జేసినట్టి కష్టుండ నన్ను\న్‌ నిర్మలునిఁ జేయవలె ని ష్కర్ముఁడ నిన్ను నమ్మినాను సతతము కృష్ణా.
1
kandamu
1899
జాబిల్లివేడికి సైరింపజాలునా కరుణించి మా చెలి గావకున్నకోవెలరొదలకు గుండెలు దాళునా యలివేణి యెద చేతనంటకున్నచలువతెమ్మెర వీవ సారెకు వణకదా చెలిని నీ కౌఁగిట జేర్పకున్నతేటిఝంకృతులకు దెరవ దిగులొందదా యేకాంతమున దాని నేలకున్న
3
seesamu
411
మడతల్వల్కు నృపాలుతోఁ బలుమాఱు న్మారాడు పెండ్లాముతోఁ జెడుజూడం బ్రచరించు నాత్మజునితోఁ జేట్పాటు గోర్లెంకతో బొడవం జూడఁగవచ్చు కార్మొదవుతోఁ బోరాడు చుట్టంబుతోఁ గడతేరం దరమా గృహస్థునకు? భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
110
తెలిసె నీరక్షకత్వంబు దేవదేవ!-వేఱె గతి లేక నిన్ను సేవింప వలసె? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
2501
ధరణిం బ్రాక్తనభక్తనిర్మితమహాస్థానంబులై యొప్పు శ్రీ- గిరిముఖ్యంబగు దివ్యతీర్థములు భక్తిం జూచిరే వారి దు- స్తరదోషంబులు వాయునన్న మఱి సాక్షాద్భక్తులం జూచినం బరమార్థంబుగఁ బాయదే నరుల పాపంబెల్ల సర్వేశ్వరా!
4
mattebhamu
2699
తమకంబొప్పఁ బరాంగనాజన పరద్రవ్యంబులన్‌ మ్రుచ్చిలం గ మహోద్యోగము సేయు నెమ్మనము దొంగంబట్టి వైరాగ్యపా శములంబట్టి బిగించి నీదు చరణస్తంభంబున\న్‌ గట్టివై చి ముదంబెప్పుడుఁ గల్గజేయఁగదవే శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
421
అనఘుని కైనఁ జేకుఱు ననర్హునిఁ గూడి చరించునంతలో మన మెరియంగ నప్పుడవమానము కీడు ధరిత్రియందు నే యనువుననైనఁ దప్పవు యదార్థము; తానది యెట్టులన్నచో నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెటపెట్టు భాస్కరా!
5
champakamaala
1377
జాతిజంగాలి బనాతి కనాతి స- । రాతిలోదటను సూరతువులందు మొఖమల్ ఖురాళ మిమ్ముగ నఖాసీచుట్టు । తగుటుచీనీలి ముత్యముల చేర్లు పగడంపు చేవ కంబాలు ముప్పిరిపట్టు । పగ్గముల్ సరిగెహొంబట్టు కుట్టు నమరుషమేనాకృశములు కమానువా- । కిళ్లు నీలంపు మేకీలు కొణిగె
3
seesamu
2457
సంపద లెఱుఁగక తామే సంపదగలవార మనుచు జడు లిలఁ దమలో సంపదఁ గననేరక వెలి సంపదలే చూతు రన్న! సంపఁగిమన్నా!
1
kandamu
236
అహితార్తుల్ వెడఁబాయు లేము లెడలున్ వ్యాధుల్ దొలంగు న్నవ- గ్రహదోషంబులు శాంతిఁ బొందుఁ గలుషవ్రాతంబు జాఱున్ శుభా- వహమౌ తావక దివ్యనామ మెలమిన్ వాక్రుచ్చినన్ ధాత్రిపై మహితోద్దండతరప్రతాపగుణ! రామా! భక్తమందారమా!
4
mattebhamu
4616
బిజ్జలు నర్థమంతయు బ్రీతిగ జంగమకోటికిచ్చె నా నజ్జగతీశ్వరుండడుగ, నక్షయ బండరువా క్షణంబులో నిజ్జగమెల్లఁ జోద్యపడ నిచ్చిన, లింగ సదర్థ నమ్ర వి ద్వజ్జన నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
1917
సరసిజాక్షుడు ప్రాణసఖిమందిరము జేరవచ్చిన నెదురేగి వనిత విభునినర్ఘ్యపాద్యాదుల నతివేగ నర్చించి దండప్రణామంబు దగ నొనర్చికనకాంగి ప్రాణేశు గౌఁగిట దగ జేర్చి పరగెడి తన కేళిభవనమునకువేగ దోడ్కొనిపోయి వెలది పచ్చలగద్దెపయి నునిచి యా సతి బాగుమీర
3
seesamu
4187
_x000D_ తాతజనించెఁ గన్యకకు తండ్రులు తామును కుండగోళకుల్‌ _x000D_ మాతపరానుకూలి మరి యెక్కువ ద్రౌపతి భర్తలేవురు\న్‌ _x000D_ నీతులు చెప్ప పాండవులనీమము లిట్టి వటంచు నెన్నుచు\న్‌ _x000D_ భూతలమందు మిక్కిలిగఁ బూజలఁ జేసిరి వెఱ్ఱి వేమనా.
6
vutpalamaala
3143
_x000D_ తల్లిదండ్రిమీద దయలేని పుత్రుండు _x000D_ పుట్టనేమివాఁడు గిట్టనేమి _x000D_ పుట్టలోనఁ జెదలు పుట్టదా గిట్టదా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
705
భానుఁడు తూర్పునందు గనుపట్టినఁ బావక చంద్రతేజముల్‌ హీనతఁజెందినట్లు జగదేకవిరాజితమైన నీ పద ధ్యానముచేయుచున్నఁ బరదైవమరీచులడంగకుండునే దానవ గర్వనిర్దళన దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
3776
_x000D_ దానధర్మములను తెగ రేపు నేఁడని _x000D_ కాలవ్యయముఁ జేయు కష్టజనుఁడు _x000D_ తానునేమి యౌనొ తనబ్రతు కేమౌనొ _x000D_ మాయఁదెలియ లేదు మహిని వేమా.
0
aataveladi
552
కరమరుదార నల్వఁ దనకన్న ఘనుండగు వేల్పు లేఁడటం- చురుగతి దేవతాసభ దురూక్తులు బల్కఁగ నల్గి వాని దు- ర్భరతరగర్వభారమును బల్వడిఁ ద్రుంపవె భైరవాకృతిన్ జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
2682
ఒకయర్థంబును నిన్ను నే నడుగఁగా నూహింప నెట్లైన బొ మ్ము కవిత్వంబులు నాకు జెందవని యేమోయంటివా నాదు జి హ్వకు నైసర్గిక కృత్యమింతయు సుమీ ప్రార్థించుటే కాదు కో రికల న్నిన్నును గాన నాకు వశమా శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
4317
నిగిడి పయోధిఁ ద్రచ్చు నెడ నిర్జరసంఘము నిక్కి చూడఁగా ధగధగ యంచు దిక్కుల నుదగ్రతటిల్లత లుల్లసిల్లఁగాఁ దగ నుదయించి మించిన సుధాప్రతి మీయలమేలుమంగ నీ మగువ యటంచు మెత్తురు సమస్తమునీంద్రులు వేంకటేశ్వరా!
5
champakamaala
3498
_x000D_ ఆపదందుఁ జూడు మారయ బంధుల _x000D_ భయమువేళఁజూడు బంటుగుణము _x000D_ పేదపడ్డ వెనుక పెండ్లము మతిఁజూడు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
716
"శ్రీయుత జానకీరమణ చిన్మయరూప రమేశరామ నా రాయణ పాహిపాహి"యని బ్రస్తుతిఁ జేసితి నా మనంబునం బాయక కిల్బిష వ్రజ విపాటనమందఁగజేసి సత్కళా దాయి ఫలంబు నాకియవె దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
2039
భళిర నేనీ మహామంత్రబలముచేత - దివ్యవైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
3630
_x000D_ గొడ్డుటావుఁ బితుకకుండఁ గొంపోయిన _x000D_ పండ్లు నూడఁదన్నుఁ బాలు రావు _x000D_ లోభివాని నడుగ లాభంబు లేదయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
992
ధరణి నధముల దాంభికత్వములు చూచి | చేరి యాచింపఁ దలతురు సూరిజనులు భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
2542
అమరంగా గురుమంత్రకార్ముకమునం దాత్మాస్త్రమష్టాంగయో- గమహాముష్టి వివేకి యేయుటయుఁ దత్కాండం బజాండాది త- త్త్వములెల్ల న్వడి నుచ్చిపాఱి భవదుద్యత్సూక్ష్మకైవల్యల- క్ష్యమునం దద్భుతశక్తితోడఁ గమియంగా నాఁటు సర్వేశ్వరా!
4
mattebhamu
2992
ఏమిరా కృష్ణ నీకెంత గర్వంబురా పిలిచిన పలుకవు పిరికితనముఆలకాపరివాడ పతిభీతితనమైన గనిపెట్టి గోవుల గాయవలదెచీకటియిండ్లలో బ్రాకులాడుచు వెన్నపాలు దావుట నీకు భయముగాదెదూరి పొరుగిండ్లలో దొంగిలి దినకుండ చోరుడవై స్త్రీల జేరదగునే
3
seesamu
2929
తొలఁగక చెంతనున్న ననుఁ దొంగిలి రెప్పలఁ జూచిచూడన- ట్టులు వగగుల్కియుండెడు గడున్ బయనం బరుగంగ వేఁగి వి- చ్చలవిడి సౌధవీథిపయి చాయలఁ జూచెద వోరగంటనే పొలమున వెళ్లు నీ బెళుకుఁబొంకపుఁ జూపులు సుందరీమణీ!
5
champakamaala
1080
సకలబ్రహ్మాండభాండరక్షణకలాభి- | రామునకు నీకు ననుఁ బ్రోచుటేమి వింత? భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
3958
_x000D_ పొంకములకు మనసుఁ బోనీక సర్వేశు _x000D_ వంక నిలుపువాఁడు వంశపరుఁడు _x000D_ వంక నిల్పకున్న వచ్చునా పదవులు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3006
సూర్యవంశమునందు శూరుడై వెలసిన దశరథరాజుకు దనయుడైతిగౌసల్య నన్నును గర్భంబులో మోసి గన్నది మరి దైవఘటనచేతభరతశత్రుఘ్నులు పరగంగ లక్ష్మణు లనుజులు దొడ్డవా రవని గలరురహి లంకలోనున్న రావణాసురు గెల్వ రాజెవ్వడును లేడు రాజ్యమందు
3
seesamu
3913
_x000D_ హింసఁ జేయకుండుటే ముఖ్య ధర్మంబు _x000D_ ఆనక హింసచేసి రవనిసురులు _x000D_ చావుపశువుఁ దినెడు చండాలుఁడే మేలు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1153
జగడంబు లాడుచోటను మగువలు వసియించుచోట మదగజము దరిన్‌ బగతుండు తిరుగుచోటన్‌ మగిడి చనఁగవలయుఁ జలము మాని గుమారా!
1
kandamu
4392
సమరమున జొచ్చి ఱొమ్ముగాయములకోర్చి । శాత్రవుల ద్రుంచనేరని క్షత్రియులకు నేల కాల్పనె యీ వట్టి యెమ్మెలెల్ల మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
1174
మును మనుజుఁడు జన్మాంతర మునఁజేసిన పుణ్యపాపములు పుడమిని వా నిని బొందక విడువవు, దే వుని నిందింపకుము కీడు వొడముఁ గుమారా!
1
kandamu
3159
_x000D_ కలుషమెల్లఁ దెలియఁ దలవంపులకు మూల _x000D_ మరయఁదత్వ మెల్ల నాత్మఁబుట్టు _x000D_ తెలిసినందుకు మఱిధీరుఁడు గావలె _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
598
బెరసిన వేడ్క యుల్లమునఁ బిక్కటిల న్మనుజుండు నీకుఁ గొ- వ్విరిసరమొక్క టచ్చపువివేకముతోడ నొసంగిన న్బురం- దరధరణీరుహప్రసవదామవిభూషితుఁడై చెలంగుఁబో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
277
రసికోత్తంసులు సత్కులీనులు మహాద్రాఘిష్ఠసంసారఘో- రసముద్రాంతరమగ్నులై దరికిఁ జేరన్ లేక విభ్రాంతిచేఁ బసులం గాచిన మోటకొయ్యదొరలం బ్రార్థింతురెంతేని దే- మసగాదే యిది యెంచి చూచినను రామా! భక్తమందారమా!
4
mattebhamu
4570
ఖ్యాత దయాభిజాత! విపదంబుధిపోత! యజాతతత్త్వ ని ర్ణేత! వినేత భక్తిపరిణేత! మనోరథదాత! జంగమ స్తోత! ముముక్షుగీత పరిశోభిత నీతిసమేత! సద్గుణ వ్రాత శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
2934
గొదగొని మోవులానుచును గొంకక నేఁ బయికొందునంచు మైఁ బొదలి పెనంగులాడి చలవొంది వచించఁగరాని చేష్టలన్ మదనుని కేళిలో మెలఁగు నాలవనాఁటి గతుల్ తలంచితే హృదయము జల్లుజల్లుమను నెంతని యోర్చెద సుందరీమణీ!
5
champakamaala
1753
కొసరంచు పలుమారు కొమ్మ కమ్మనిమోవి యాని తేనియ గ్రోలుమనుచు బలుకవద్దికతో దన నిద్దంపు చెక్కులు ముద్దాడరా యని మురియ బల్కమొనసి పాలిండ్లపై మొనగోరు లించుకయుంచరా యని తమిమించు పలుకవడిబోక ముడివిచ్చి తడయక నాభిలో నంగుళం బానరా యనుచు బలుక
3
seesamu
1741
నడుముల్కు తొడబెళ్కు మెడకుల్కు కడుతళ్కు మోము చూచిన చాల మురియవటరపగడంపు జగనింపు తగకెంపు జిగిబెంపు కొమ్మవాతెర జూచి కోరవటరబిగినుండు జిగిమించు తొలగించు వగలాడి పాలిండ్లు జూచిన భ్రమయవటరననబోడి శుకవాణి ఘనశ్రోణి మృదుపాణి వగలు చూచిన దాళవచ్చునటర
3
seesamu
3073
నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తళుకు బెళుకు రాళ్లు తట్టె డేల? చదువఁ బద్య మరయఁ జాలదా యొక్కటి విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1972
ఉల్లోలంబులుగాఁ గురుల్‌ నుదుటిపై నుప్పొంగ మోమెత్తి ధ మ్మిల్లం బల్లలనాడ రాగరససమ్మిశ్రంబుగా నీవు వ్రే పల్లెం దాడుచు గోప గోనివహ గోపస్త్రీల యుల్లంబు మీ పిల్లంగ్రోవిని జుట్టి రాఁ దిగుచు నీ పెంపొప్పు, నారాయణా!
7
saardulamu
4175
_x000D_ చావు వచ్చినపుడు సన్యసించునదెట్లు _x000D_ కడకు మొదటికులము చెడినదగును _x000D_ పాప మొకటి గలదు ఫలమేమి లేదయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
871
అపరాధ సహస్రంబుల నపరిమితములైన యఘము లనిశము నేను\న్‌ గపటాత్ముఁడనై చేసితిఁ జపలుని ననుగావు శేషశాయివి కృష్ణా.
1
kandamu
3690
_x000D_ ఇచ్చిపుచ్చుకొన్న హితమయిన మనువులు _x000D_ తగ్గులేక యల్లు తామరవలె _x000D_ కాచిపూచి పండి కడురమ్యమై యుండు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2001
వేదంబందు సునిశ్చయుండగు మహావేల్పెవ్వఁడో యంచు నా వేదవ్యాస పరాశరుల్‌ వెదకిన న్వేఱొండు లేఁ డంచు మీ పాదాంభోజము లెల్లప్రొద్దు మదిలో భావింతు రత్యున్నతిన్‌ శ్రీదేవీవదనారవిందమధుపా శ్రీరంగ నారాయణా!
7
saardulamu
72
తగువరివె యన్నదమ్ముల ధర్మ మీవె-తీర్చవలెఁ గాని మఱియొండు తీర్పఁగలఁడె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
2910
చిలుకకు నాదు పేర విలసిల్లెడు పద్యము చెప్పుచుండ నా యలుకుడుగాగ నూరకె విహారము చేసెడు రీతినుండఁగా చెలియలు సైఁగలున్ బరిహసించిన కోపపుఁజూపుచేత బొ- మ్మలముడి యొప్పు శేషరతి మారధనుర్గతి సుందరీమణీ!
5
champakamaala
3165
_x000D_ నీ వాడిన నే నాడుదు _x000D_ నీవుండిన నేను నుందు నిర్విణ్ణుఁడనై _x000D_ నీవు తలంచినఁదలఁపుదు _x000D_ నీవు నగిన నేను నగుదు నిజముగ వేమా.
1
kandamu
1552
ఈలీలన్‌ దశకంఠుపట్టణములో నేపారఁగాఁ బెక్కు చం దాలమ్‌ గేలలిడునంత భూమితల మైనం దప్పకుండంగ నీ వాలోకించి మహీజఁ గానక నిజస్వాంతంబులోఁ గొంతసే పాలోచింపవే స్వామికార్యఘటనావ్యాపారమునన్‌ మారుతీ!
7
saardulamu
1322
మదిని తలపోసి యితరరామలను రోసి । నేర్పు వెడజేసి కంటికి నిదురబాసి మమత నిను డాసియుండక మరుని గాసి । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
360
తలపోయన్ దిలజాలకాంతరమహాతైలంబు చందానఁ బూ- సలలో దారము పోల్కి నాత్మమయతన్ సర్వాంతరస్థాయివై విలసల్లీలల నిండియుండుకొను నిన్వీక్షంపఁగా నేర్చువా- రలె ధన్యుల్ గద ముజ్జగంబులను భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
1740
యనగ దగినట్టి యా బాల నేలుకొనక | మోడిసేయంగ నుచితమే మోహనాంగతామసించక రావయ్య దానవారి | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi