id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
1303
పెనిమిటికన్నఁ బతివ్రత మునుపే మృతిఁ బొందెనేనిఁ బురుషాగమనం బున కెదురుచూచు వచ్చినఁ గనుగొని యనురాగ మెనయఁ గలయుఁ గుమారీ!
1
kandamu
2971
జాగు సేయక రాగదే జాములోన | నానవాలందుకొని వేగనతనికడకుతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన.
2
teytageethi
2192
ఇహలోకసౌఖ్యము లిచ్చగించెద మన్న - దేహ మెప్పటికిఁ దా స్థిరత నొంద దాయుష్యమున్న పర్యంతంబు పటుతయు - నొక్కతీరున నుండ దుర్విలోన బాల్య యువత్వ దుర్బల వార్ధకము లను - మూఁటిలో మునిఁగెడి ముఱికికొంప భ్రాంతితో దీనిఁ గాపాడుద మనుకొన్నఁ - గాల మృత్యువు చేతఁ గోలుపోవు
3
seesamu
954
బళిర జగముల నీవంటి భక్తిసులభుఁ | డైన దైవంబు గలఁడె లోనరసి చూడ, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
1690
కొడు కెటువంటివాఁ డయినఁ గుంభినిలో నదలింపరాని దుం- దుడుకయి యున్న నన్యులకు దొడ్డఱికం బెఱిఁగించుచున్ మదిన్ జిడజిడ మాని సంతసము చిప్పిలఁ గంటికి ఱెప్ప చాడ్పునన్ దొడఁబడి ప్రోచుచున్న యలతొయ్యలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
628
దురితలతాలవిత్ర ఖరదూషణకాననవీతిహోత్ర భూ భరణకళావిచిత్ర భవబంధవిమోచనసూత్ర చారువి స్ఫురదరవిందనేత్ర ఘనపుణ్యచరిత్ర వినీలభూరికం ధరసమగాత్ర భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
3658
_x000D_ తల్లిదండ్రి చావఁ దనయుఁడు తానేడ్చు _x000D_ మగఁడు చావ నాలు వగచుచుండు _x000D_ కార్యవశము గాని కలుగదు మోహంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3064
మత్స్యావతార సన్మహితకచ్ఛపగాత్ర వరహరూపా నీకు వందనంబునారసింహా వామనశరీర జమదగ్నివరతనయా నీకు వందనంబురఘువంశతిలక యో రాజీవదళనేత్ర బలరామ నీకు నా వందనంబుబౌద్ధావతారసంభావితా గజవరద కల్క్యవతార నా వందనంబు
3
seesamu
1526
శరధిం గాంచి యలంఘనీయ మని తత్సంతారణాదక్షులై వరుసన్‌ గీశులు భీతిచేఁ గళవళింపన్‌ వారి వారించి ని న్నురుపాథోధి విలంఘన క్షమునిఁగా నూహించి ధీమంతుఁడా పరమేష్ఠి ప్రియపుత్రుఁ డంచితగతిన్‌ బ్రార్థింపఁడే మారుతీ!
4
mattebhamu
717
ఎంతటి పుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ మంతనమెట్టిదో యుడుతమైని కరాగ్ర నఖాంకురంబులన్‌ సంతసమందఁజేసితివి సత్కులజన్మమ దేమిలెక్క వే దాంతముగాదె నీ మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
1123
సదమల మతితోఁ బెద్దల మది కింపుగ మెలఁగు, నింద మానుము పరులన్‌ మృదు మార్గములను వదలకు విదితంబుగ దానఁగీర్తి వెలయుఁ గుమారా!
1
kandamu
3660
_x000D_ ఆశకన్న దుఃఖ మతిశయంబుగ లేదు _x000D_ చూపు నిలుపకున్న సుఖము లేదు _x000D_ మనసు నిల్పకున్న మఱి ముక్తి లేదయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2912
హారములల్లనన్ గుచములందుఁ జరింపగ వచ్చునట్టి యొ- య్యారము నోరచూపుల యొయారము నవ్వుచుఁ జెంతనిల్చు నొ- య్యారము శయ్య చెందెడు నొయారము కేళికిఁ దార్పఁగల్గు నొ- య్యారము నాదు మానసమునం దెడబాయవు సుందరీమణీ!
6
vutpalamaala
735
పొలుపొంద\న్‌ నడిరేయిఁ గుక్కుట రవంబుల్‌ చూపి గోపాలకా వళి విభ్రాంతులఁ జేసి మందలకునై వారేఁగఁ దత్కామినీ కలనాయత్నము తామ్రచూడగతుల\న్‌ గావించి నీకీర్తి ర చ్చల కెక్కెం గడుగొయ్యదేవరవు కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
564
గరళము కంఠమూలమున గట్టిగ దాల్చుట నీకు నంగదల్ బరగునటంచు రుద్రపశుపత్యభిధానుఁ డెదం గలంగఁగా నొరిమెర నంగపీఠమున నుంచవె యాతని శాశ్వతంబుగాఁ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
1014
తొడరి సుజనులు ధరణిలో దుర్జనులకుఁ | జేయు నుపకృతి వ్యర్థమై చెడు గదయ్య, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
667
పరధనముల్‌ హరించి పరభామలనంటి పరాన్నమబ్బినన్‌ మురిపముకాని మీఁదనగు మోసమెఱుంగదు మానసంబు దు స్తరమిది కాలకింకర గదాహతి పాల్పడనీక మమ్మునే తఱిదరిఁజేర్చి కాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
1171
గుణవంతుని సంగతి ని ర్గుణులకు గుణములు ఘటించు, గుసుమాది సమ ర్పణమున వస్త్రాదిక మా క్షణమునఁ పరిమళము నొందు కరణిఁ గుమారా!
1
kandamu
857
కుక్షిని నఖిలజగంబుల నిక్షేపముఁజేసి ప్రళయ నీరధి నడుమ\న్‌ రక్షక వటపత్రముపై దక్షతఁ బవళించునట్టి ధన్యుఁడ కృష్ణా.
1
kandamu
3106
_x000D_ మాట లెల్ల కల్ల, మన సెల్ల దొంగకె _x000D_ నేటి ప్రాణ మింక నేటి బ్రతుకు? _x000D_ మాట సత్యమైన మఱి శతాయుష్యంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
266
కుకవుల్ కూళలు కొంటెతొత్తుకొడుకుల్ కొండీలు కోనారులుం దకతైతత్తలవారు పాచకులు జూదంబాడువారు న్మహిం బ్రకటంబై సిరిగాంచిరీ కలియుగప్రామాణ్య మాశ్చర్య మో మకరాక్షాసురగర్వసంహరణ రామా! భక్తమందారమా!
4
mattebhamu
101
ఆడించెదవు బొమ్మలాటవాఁడును బోలె- సర్వచరాచరజంతువులను కనుకట్టు గట్టెదు గారడీఁడును బోలె- మిథ్యాప్రపంచంబు తథ్యముగను వేర్వేఱఁ దోఁతువు వేషధారియుఁ బోలెఁ- బహువిధదేవతాభద్రకళలఁ దెలివి మాన్పుదువు జక్కులవాని చందానఁ- బ్రజల సంపద్రంగవల్లిఁ జేర్చి
3
seesamu
3831
_x000D_ తిట్టికొట్టిరేని తిరిగి మాటాడక _x000D_ యడరుఁజూచి యదరింపకనీవు _x000D_ తన్నుఁ గాదని నట్లు కాతఱపడకున్న _x000D_ నట్టివాఁడు బ్రహ్మ మౌను వేమా.
0
aataveladi
3251
_x000D_ జీవిలోననుండు సిద్ధునిగానక _x000D_ తిరుగు నస్థిరంబు వరుసనమ్మి _x000D_ స్థిరము నస్థిరమును దెలియ జీవికిముక్తి _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1672
తన సరిబాలురం గలసి దవ్వుల కాటల కేగియున్నచోఁ దనయుఁ డిదేమొ లేఁడనుచుఁ దత్తఱ మొందుచు నావ తాగిన- ట్లనయము నాత్మఁ గుందుచుఁ దదాగమనాభిముఖాభిలాష పై- కొని కనినంత సంతసిలు కోమలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
3391
_x000D_ బయలున సర్వము పుట్టును _x000D_ బయలందే లీనమగును బ్రహ్మం బనఁగా _x000D_ బయలని మదిలోఁ దెలిసిన _x000D_ బయలందే ముక్తి బట్టబయలగు వేమ.
1
kandamu
389
గాజుంబూస యనర్ఘరత్నమగునా? కాకంబు రాయంచయౌ- నా? జోరీఁగ మధువ్రతేంద్రమగునా? నట్టెన్ము పంచాస్యమౌ- నా? జిల్లేడు సురావనీజమగునా? నానాదిగంతంబులన్ రాజౌనా ఘనలోభిదుర్జనుఁడు? భర్గా! పార్వతీవల్లభా!
7
saardulamu
2047
పారమార్థికమునకు నేఁ బాటుపడితిఁ - గీర్తికి నపేక్షపడలేదు కృష్ణవర్ణ! భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
3119
_x000D_ ఇనుము విఱిగె నేని యినుమాఱు ముమ్మాఱు _x000D_ కాచియతుక నేర్చు కమ్మరీడు _x000D_ మనసు విఱిగెనేని మఱియంట నేర్చునా? _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
20
నిపు డొకించుక లోభిత్వ మెనసి నట్లు-దోఁచుచున్నాఁడ విట్టియద్భుతము గలదె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
4463
వండలేనమ్మకు వక్కణంబులు గొప్ప । యారిపొయ్యెడి దివ్వె కధికదీప్తి కట్టనిల్వని చెర్వు గడియలోపల నిండు । బ్రతుకనేరని బిడ్డ బారెడుండు వృద్ధినొందని చెట్టు వెఱ్ఱితీగిడు జాడ్య - । మెచ్చు ముందటికన్న నిచ్చు తళుకు మన్నించుటకు దొరల్ గని చనవిచ్చుట । పొయిసాలకే పాలు పొంగుటెల్ల
3
seesamu
2539
అమరంగా ధనమిచ్చి కాతురు మహీయఃప్రీతిఁ బ్రాణంబుఁ బ్రా- ణము నర్థంబును నిచ్చి కాతు రభిమానంబు న్విశేషించి మా- నము బ్రాణంబు ధనంబునిచ్చి కడుసన్మానంబుగా నుత్తమో- త్తమచారిత్రులు భక్తిఁ గాతురు ప్రమోదంబంది సర్వేశ్వరా!
4
mattebhamu
3678
_x000D_ కొండరాళ్లు దెచ్చి కోరికఁ గట్టిన _x000D_ గుళ్ళలోనఁదిరిగి కుళ్ళ నేల _x000D_ పాయని శివుఁడు ప్రాణమై యుండంగ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2199
పతితపావన! లక్ష్మీశ! బ్రహ్మజనక! - భక్తవత్సల! సర్వేశ! పరమపురుష! భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
3858
_x000D_ మదిని గానవలెను మఱిబ్రహ్మమూర్తిని _x000D_ మదినిగన్నవారు మహినిలేరు _x000D_ వెదకి తనువులోన వేడ్కతో నెఱిఁగిన _x000D_ యతఁడె యోగివరుఁడు నగును వేమా.
0
aataveladi
3916
_x000D_ మదమువలనఁ గల్గు మాటల బహుపల్కి _x000D_ మ్రుచ్చుసుద్దులఁ గొని మోసపుచ్చి _x000D_ కాసురాఁబెనగెడు కష్టుండుగురుఁ డౌనె _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3542
_x000D_ మొదటను మతమును వదలక _x000D_ తుద నెవ్వరిమతమునైన దూషింపకయు\న్‌ _x000D_ పదిలుఁడయి కోర్కెఁగోరక _x000D_ ముదమునఁ జరియించువాఁడె ముఖ్యుఁడు వేమా.
1
kandamu
3595
_x000D_ సాధుచరితయైన సతి సత్ప్రవర్తన _x000D_ జార యే మెఱుంగు సాధువైన _x000D_ బ్రహ్మనిష్ఠ నెఱుఁగుఁ బ్రాకృతుఁ డెఱుఁగునా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4485
కన్నంబు ద్రవ్వి తస్కరు డింటివానికి । వాడలేదని ముంత వైచి చనునె తెరవాటుకాడు చింతించునే కట్టిన । బట్ట నూడ్చిన మానభంగమనుచు వలబడ్డ మెకము చూల్ వహియించెనంచును । విడువంగఁ జూచునే వేఁటకాఁడు జారుండు పరకాంత శయ్యపై దారిచి । వావి గాదని పల్కి వదలి చనునె
3
seesamu
940
నహరహంబును నిను భక్తి నాత్మఁ దలఁచు | పుణ్యమతులకుఁ గడు సులభుఁడవు నీవు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
3373
_x000D_ బయలులోని బయలు పరికించి చూడక _x000D_ బయలు రూపుఁ జూచి వలచెఁగాక _x000D_ ముఱికిదేహమందు మోహంబు విడదాయె _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3814
_x000D_ బీఱుబోవుకులకు బిరుదు మ్రింగుకులంబు _x000D_ నెల్ల జీవులకు భరించుకులము _x000D_ ఇట్టుకులమువారు హరదూరులు _x000D_ పట్ట గలుగువాఁడు పరఁగ వేమా.
0
aataveladi
4099
_x000D_ పతియొప్పిన సతి యొప్పును _x000D_ సతిపతు లొకటైనఁ బరమపావన మందూ _x000D_ స్సతిపతిన్యాయమె మోక్షం _x000D_ బతులితపరమాత్మ నైక్య మగురా వేమ.
1
kandamu
1664
చెలు లుదకంబు దేరఁ దన చేతను నూనియఁ దోఁగ నంటుచోఁ దల జలకంబు లార్చి బలుతాలిమితోఁ దడి యొత్తి మోమునన్ దిలకముచుక్క బొట్టువలె దీరిచి సంతసమంద నాత్మలో- పల నలరారుచున్న యల భామినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
3025
గాన నీదు ప్రభావముఁ గానఁబడియె | మర్మమెఱిగితి నీ కీర్తిమహిమఁ గంటితగవులన్నియు మనమధ్య తాడిమళ్ళ | రాజగోపాల రావయ్య రమణి గూడ.
2
teytageethi
2574
కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కూలంబునం గూలినం జలజాతప్రియశీతభానులు యథాసంచారము ల్దప్పినం జలధు ల్మేరల నాక్రమించి సముదంచద్భంగి నుప్పొంగినన్ దలఁకం డుబ్బఁడు చొప్పుఁ దప్పఁడు భవద్భక్తుండు సర్వేశ్వరా!
4
mattebhamu
1100
హీనుఁడగువాని సత్ప్రభు లెన్నిగతుల | నునిచి మనిచినఁ జెడుజాడ లుడుగఁగలఁడె, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
4188
_x000D_ తనదు తల్లి లంజె తనయాలు మాదిగ _x000D_ శ్రీపతికి గురువసిష్ఠుఁ డరయ _x000D_ తపముచేత ద్విజుఁడు తర్కింప కులమెట్లు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3641
_x000D_ పేదరిక మంతదోషము _x000D_ లేదే యీ జగతిలోన నీశ్వరుఁ డెఱుఁగ\న్‌ _x000D_ పేదను పొడఁగనువాడు\న్‌ _x000D_ గాదము విధమునను జూచుఁ గదరా వేమా.
1
kandamu
3215
_x000D_ ఎండినమ్రా నొక టడవిని _x000D_ నుండిన నందగ్నిపుట్టి యూడ్చును చెట్ల\న్‌ _x000D_ దండిగలవంశ మెల్లను _x000D_ చండాలుం డొకఁడుపుట్టి చెఱుచును వేమా.
1
kandamu
1172
మును స్నానము సేయక చం దన మలఁదుట యనుచితం బుదకయుత వస్త్రం బును విదలించుట కూడదు, మనమున నివి తెలిసి మనుము మహిని గుమారా!
1
kandamu
1135
తనయుఁడు చెడుగైయుండిన జనకుని తప్పన్నమాట సత్యమెఱుఁగుదు గా వున నీ జననీ జనకుల కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా!
1
kandamu
2000
వెర వొప్ప న్బహుశాస్త్రమంత్రము లొగి న్వీక్షించి వే తెల్పి మీ వరనామామృతపూర మానుచుఁ దగన్‌ వైరాగ్యభావంబున\న్‌ సరి నశ్రాంతముఁ గోరువారు పిదపన్‌ సంసారమాతుఃపయో ధరదుగ్ధంబులు గ్రోల నేరరు వెస\న్‌ దైత్యారి నారాయణా!
4
mattebhamu
1661
పిడికిలి పట్టువేళఁ దనుఁ బేర్కొని నవ్వెడువేళ నోరలం బడియెడువేళ నూకురులు పల్కెడివేళను దోఁగులాడుటన్ దడఁబడువేళఁ జూడఁ గని తప్పుటడుంగిడువేళఁ బ్రేమ బల్ గడలుకొనంగ సంతసిలు కామినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
1530
అగజాలావృతమూర్తివై భుజరయోద్యద్వారివాహంబు లొ ప్పుగ నిర్వంకల నంటి రా గదలి యంభోరాశిమధ్యంబునన్‌ గగనాధ్వంబున నేగు నిన్నమిషుల్‌, గంధర్వులున్‌ లంబప క్ష గిరీంద్రంబును బోలె జూచిరికదా సంభ్రాంతులై మారుతీ!
4
mattebhamu
3585
_x000D_ శూద్రతనము పోయె శూద్రుఁడఁ గానని _x000D_ ద్విజుఁ డనుకొనుటెల్ల దెలివిలేమి _x000D_ ఇత్త డెసఁగ పసిడి కీడన వచ్చునా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
8
పండితస్తోత్ర చారిత్ర పద్మనేత్ర-మధుర మంజులభాష సమస్తపోష చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
118
మాట వెళ్ళనివానికి మగుడ నిచ్చి-యింతపనికిని నవతార మెత్తి తీవు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
1254
వారికి వీరికిఁ గలిగెను గోరిన వస్తువులు మాకుఁ గొదవాయె నటం చూరక గుటకలు మ్రింగుట నేరముగాఁ దలఁపవలయు నెలఁత కుమారీ!
1
kandamu
4281
చక్కనితల్లికిన్‌ నవరసంబుల వెల్లికిఁ బుష్పవల్లికిం జక్కనిమోవిముత్తియపుజల్లికి శ్రీయలమేలుమంగకున్‌ జెక్కులు మించుటద్దములు చేతులు క్రొత్తమెఱుంగుఁదీగ లా క్రిక్కిరిగుబ్బలే పసిఁడికిన్నరకాయలు వేంకటేశ్వరా!
6
vutpalamaala
2987
వలచి వలపించి నా ప్రాణవల్లభుండు | రాడనుచు వీరలందఱు గూడికొనిరితరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన.
2
teytageethi
3342
_x000D_ మాయల సంసారమునకు _x000D_ మాయలనే తిరుగుచుండు మనుజుఁడులోనై _x000D_ మాయలఁ దెలిసిన యంతట _x000D_ మాయలనే ముక్తి గలుగు మహిలో వేమా.
1
kandamu
3717
_x000D_ సతులఁ బడయ రాదు సుతులఁ బడయరాదు _x000D_ వెతలఁ బడినవాఁడు వెఱ్ఱివాఁడు _x000D_ నేలనున్న ఱాయి నెత్తి కెత్తినయట్లు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2320
చావు ల్మర్త్యులకెల్లఁ గల్గుటలు నిస్సందేహముల్ దేహముల్ చేవ ల్గల్గిననాఁడె శ్రీగిరి గయా శ్రీవేంకటాహోబిల గ్రావప్రాంతములందుఁ జేరవలెఁ; జేరంబోవ కేలబ్బు నా ర్యావాణీస్తుత మోక్షలక్ష్మి? రఘువీరా! జానకీనాయకా!
7
saardulamu
2219
బరమ సంతోషమాయె నా ప్రాణములకు - నీ ఋణము దీర్చుకొననేర నీరజాక్ష! భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
3102
_x000D_ కాని వాని చేత కాసు వీసము లిచ్చి _x000D_ వెంటఁ దిరుగు టెల్ల వెఱ్ఱి తనము _x000D_ పిల్లిఁ బట్ట కోడి పిలిచినఁ బలుకునా? _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1755
విడెమందుకొమ్మన్న తొడలపై గూర్చుండి దొంతరవిడెమిచ్చు తోయజాక్షినెనరుంచుమనినను చనువున చెలరేగి మోవితేనియలాను ముద్దుగుమ్మయదనిదియన్నను వదలక బిగబట్టి యదనుగుబ్బలగుమ్ము పద్మగంధి... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...
3
seesamu
1066
యెన్ని తెఱఁగులఁ బొరలుచునున్న నిన్ను | లీలఁ గొలువని ఖలునకు లేదు ముక్తి, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
3038
మగువరో కాళిందిమడువులోపల గ్రుంకి ఫణిగర్వ మే నెడబాపినానువనిత నరయబోయి వాలి నా క్షణమందు గురిబెట్టి దెబ్బను గూల్చినానువనజాక్షిరో ఱాళ్ళవానలు గురియగా బలుకొండ గొడుగుగా బట్టినానుపశువులతో చిన్నిబాలుఁడనయియుండి గోవుల పాల్వెన్న గ్రోలినాను
3
seesamu
3518
_x000D_ తీపులోన తీపు తెలియంగఁ బ్రాణంబు _x000D_ ప్రాణవితతికన్నఁ బసిడి తీపు _x000D_ పసిడికన్న మిగులఁ బడతిమాటలు తీపు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1621
నీ కళ్యానగుణంబులున్‌, మహిమయున్‌, నీరేజగర్భుండు, తా రాకాంతుండును, భోగివల్లభుఁడు, గీర్వాణప్రభుండును, భవా నీకాంతుండు గణింపజాల రనినన్‌ నేనెంతవాడన్‌ రహిన్‌ నాకుం దోఁచినభంగి నెన్నితిఁ గృపన్‌ మన్నింపవే మారుతీ!
7
saardulamu
2838
మేలెంచని మాలిన్యుని మాలను నగసాలివాని మంగలి హితుగా నేలిన నరపతి రాజ్యము నేలఁ గలసిపోవుఁగాని నెగడదు సుమతీ.
1
kandamu
1015
పరమలోభిని దివాకరతనూభవుఁ డంచు | ఛద్మచిత్తుని హరిశ్చంద్రుఁ డనుచు నిర్దయాత్ముని రామనృపశిఖామణి యంచుఁ | గడుకురూపిని రతికాంతుఁ డనుచు పాపకర్ము నభంగపాండవాగ్రజుఁ డంచు | సమరభీరుని సవ్యసాచి యనుచు కుండబీదను మరున్మండలేశ్వరుఁ డంచు | మతివిహీనుని భోగిపతి యటంచు
3
seesamu
2764
కమలములు నీటఁ బాసినఁ గమలాప్తుని రశ్మి సోఁకి కమలిన భంగిన్‌ దమ తమ నెలవులు దప్పినఁ దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!
1
kandamu
4395
కండచక్కెర పానకముఁ బోసి పెంచిన । ముషిచెట్టుకుఁ దీపి పుట్టబోదు పాలమున్నీటి లోపల ముంచి కశిగినఁ । గాకిఱెక్కకుఁ దెల్పు గలుగఁబోదు పన్నీరుగంధంబు పట్టించి విసరినఁ । దేలుకొండి విసంబు తియ్యఁబోదు వెదురుబద్దలు చుట్టు వేసి బిగించినఁ । గుక్కతోఁకకు వంక కుదురబోదు
3
seesamu
2714
కాలద్వార కవాటబంధనము దుష్కాల ప్రమాణక్రియా లీలాజాలక చిత్రగుప్త ముఖవల్మీకోగ్ర జిహ్వాద్భుత వ్యాళ వ్యాళవిరోధి మృత్యుముఖదంష్ట్రాహార్య వజ్రంబు ది క్చేలాలంకృత! నీదు నామ మరయన్‌ శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
2673
సులభుల్మూర్ఖు లనుత్తమోత్తములు రాజుల్గల్గి యేవేళన న్నలఁతం బెట్టిన నీ పదాబ్జములఁ బాయంజాల నేమిచ్చినం గలధౌతాచల మేలుటంబునిధిలోఁ గాపుండుటబ్జంబుపైఁ జెలువొప్పన్సుఖియింపఁ గాంచుటసుమీ శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
3676
_x000D_ కుక్క యేకతంబు కొక్కెరధ్యానంబు _x000D_ గాడ్దెరాగ మెన్నఁ గప్పుముసుఁగు _x000D_ ఆత్మ యెఱుఁగుభావ మదియేల చేయరో _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
280
శమ మావంతయుఁ బూననొల్లఁడు గరిష్ఠజ్ఞానవిద్యావిశే- షము గోరంతయు నాత్మలోఁ దలఁపఁ డాచారప్రచారంబు ధ- ర్మము వీసంబును జేయఁజాలఁడు గదా మందుండు పెన్ రొక్కపున్ మమతన్ దేహమెఱుంగలేక ధర రామా! భక్తమందారమా!
4
mattebhamu
2083
దన్ను విడిపింప వచ్చెడి ధన్యుఁడేడి - ముందు నీ దాసుఁడైయున్న ముక్తి గలుగు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
1628
చతురత్వంబున గోపినాథకులవిస్తారుండు శ్రీపద్మనా భతనూజుండగు వేంకటాఖ్యకవి విద్వత్సమ్మతంబైన యీ శతకంబున్‌ రచియించి, నీకు సముదంచద్భక్తి నర్పించె, స మ్మతితో దీనిఁ బరిగ్రహించి, కరుణ బాలింపవే మారుతీ!
4
mattebhamu
3919
_x000D_ కుక్కల దిని కడుబాపలు _x000D_ నక్కను భుజియించువారు నాకేశులగు\న్‌ _x000D_ చొక్కముగ జీవహత్యల _x000D_ మిక్కుటముగఁ జేసి తమిని మించిరి వేమా.
1
kandamu
1127
ఏనాఁడైనను వినయము మానకుమీ, మత్సరమున మనుజేశులతోఁ బూనకు మసమ్మతము, బహు మానమును బొందు మిదియె మతము కుమారా!
1
kandamu
1843
మరుని కార్ముకములై తెరవ కన్బొమలొప్పు గురుకుచంబులు గెల్చు కోకయుగమునసియాడు లేగౌను హరిమధ్య యనదగు నయ్యింతి నునుదొడ లనటితరులుకలికిజంఘలు పొట్టకరగులై చెన్నొందు నతివపదములు చిగురుటాకులనగచుక్కలకాంతి పెంపెక్కు నఖావళి దంతిరాజముఖము బోలు తరుణినడక
3
seesamu
2397
క్రమమున సుఖదుఃఖంబులు కమలిన నుతినింద లాదిగాఁ గలయవియా యమివర్యుఁ డన్నిక్రియలం సముఁడై వర్తించు నన్న సంపఁగిమన్నా!
1
kandamu
3231
_x000D_ దానములను జేయఁ దన చేతులాడక _x000D_ బహుధనంబుఁగూర్చి పాతిపెట్టు _x000D_ తుదను దండుగ నిడు మొదలు చేర్చునరుండు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2967
ఇంత బహిరంగమాతని యింటిగుట్టు | కడకు దన కెట్టు సుగుణంబు గలుగునమ్మతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన.
2
teytageethi
1685
శ్రీలు చెలంగఁగాఁ జదువు చెప్పెడువేళఁ బరాకు మాని మా బాలున కిప్డు విద్య బహుభంగుల నేర్పుమటంచు పెక్కుచం- దాల నొసంగు వస్తుసముదాయము నాథుఁ డెఱుంగనీక బ- ల్మాలిమి మీఱ నట్టి సుకుమారిని దల్లినిఁ బోలరెవ్వరున్.
6
vutpalamaala
2656
రాజన్నంతనెపోవునా కృపయు ధర్మంబాభిజాత్యంబు వి ద్యాజాత క్షమ సత్యభాషణము విద్వన్మిత్ర సంరక్షయున్‌ సౌజన్యంబు కృతంబెఱుంగుటయు విశ్వాసంబుగాకున్న దు ర్బీజ శ్రేష్ఠులుగా గతంబుగలదే శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
122
నొక్కి పుడ మింత నీటిపై కెక్కఁదీయ-మక్కువ దనర్ప నది యేమి రక్కరింపు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
2697
ఒకపూఁటించుక కూడు తక్కువగునే నోర్వంగలేఁ డెండకో పక నీడన్వెదకుం జలికింజడిసి కుంపట్లెత్తుకోఁ జూచు వా నకు నిల్లిల్లును దూఱు నీతనువు దీనన్వచ్చు సౌఖ్యంబు రో సి కడాసింపరుగాక మర్త్యులకటా! శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
2532
కమలాప్తుం డుదయింపఁగా ననలనక్షత్రక్షపాధీశతే- జములెల్లం బెడఁబాసిపోవు గతి నీ సద్భక్తిభావంబు చి- త్తములోనం బ్రభవింపఁగా నితరమంత్రధ్యాన తద్దేవతా- క్రమమాయాపటలంబు లన్నియును వీఁకం గ్రాఁగు సర్వేశ్వరా!
4
mattebhamu
1932
నెరయ న్నిర్మల మైన నీ స్తుతికథానీకంబు పద్యంబులో నొరుగుల్‌ మిక్కిలి గల్గెనేనియుఁ గడు న్యోగంబె చర్చింపఁగాఁ గుఱుగ ణ్పైనను వంకబోయినఁ గడుం గుజ్జైనఁ బేడెత్తినం జెఱకుం గోలకు తీపు గాక కలదే, చే దెందు, నారాయణా!
4
mattebhamu
1094
క్రూరు లొక కొంద రసమానవైర మూని | పోరుచుందురు ఘనులతో బుద్ధిమాలి భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
4636
సుంకపుఁ బైఁడి భక్తులకుఁ జూరలు విడ్వఁ బసిండి క్రాగులన్‌ శంకరుఁ బూటవెట్టి నరనాయకుచేతను మ్రొక్కుగొన్న యా సుంకర బంకిదేవునకు సూనుడవైన ప్రసాది! దేవ! నీ వంకకుఁ ద్రిప్పుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
2531
అరివీరప్రకరంబు భీకరతరంబై తాఁకుచో సింహసిం- ధురశార్దూలమృగోరగాది భయము ల్దోతెంచుచో ఘోరదు- స్తరసంసారవికారవేదనలు మీఁదం బర్వుచో వజ్రపం- జరమై చేకొని తన్ను నెత్తుకొను నీ సద్భక్తి సర్వేశ్వరా!
4
mattebhamu
148
దొలఁగి రసురులు కొంత నీబలిమి దెలిసె-ముష్టి నీ దెంత నీయస్త్రములదె వింత చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
3114
_x000D_ పాప మనఁగ వేఱె పరదేశమున లేదు _x000D_ తనదు కర్మములను దగిలియుండు _x000D_ కర్మ తంత్రిగాక, గనుకని యుంటొప్పు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1687
చిఱుతను ద్రోవ బాలకులు చిన్నతనంబునఁ గొట్టకుండ భూ- సురునకు దిట్టముం బఱుచుచో నిలుచేరను బ్రొద్దుపోవఁగా నరయుచు బిడ్డఁ డాఁకొనియెనంచు మదిన్ దిగులొంది పిల్వఁగాఁ బఱచుఁ దనంతటన్ బడికిఁ బల్మఱు తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
4180
_x000D_ గ్రామము భూముల మానుక _x000D_ ప్రేమోదయమింత లేక భీకరమతులై _x000D_ భామల సుతులను వదలుక _x000D_ బాములఁ బడనేల యడవిపట్టున వేమా.
1
kandamu