id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
1217
పెనిమిటి వలదని చెప్పిన పని యెన్నఁడుఁ జేయరాదు బావల కెదుటన్‌ కనఁబడఁగ రాదు కోపము మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!
1
kandamu
1133
అప్పం దన తల్లిగ మే లొప్పం గని జరుపవలయు నుర్వీస్థలిఁ జి న్నప్పుడు చన్నిడి మనిపిన యప్పడఁతియు మాతృతుల్య యండ్రు కుమారా!
1
kandamu
3444
_x000D_ విషయము లొరసిన నొరయఁడు _x000D_ విషయేంద్రియ పరదళంబు సేయగ మఱిదా _x000D_ విషమాది షట్కమను దు _x000D_ ర్విషయములను బొందకుండ వేమన నేర్చు\న్‌.
1
kandamu
2940
శ్రీకృష్ణు నెవ్వరు సేవించుచుందురో వైకుంఠపురమున వారు ఘనులుకమలనాభుని జిత్తకమలంబులో నిల్పి వసుధలో మెలగెడువాడు రాజుధనము మెండుగ గూర్చు ధన్యులెందరునైన స్వామిభక్తులతోటి సాటిగారుహరినామకీర్తన లతిభక్తి చేసినవారి దుష్కర్మముల్ వదలిపోను
3
seesamu
4157
_x000D_ ఉపవసములనున్న నూరపందిగఁబుట్టుఁ _x000D_ దపసియై దరిద్రతను వహించు _x000D_ శిలకు మ్రొక్కనగునె జీవమడుగు పొమ్ము _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
476
పట్టుగ నిక్కుచున్‌ మదముఁ బట్టి మహాత్ములఁ దూలనాడినం బట్టిన కార్యముల్‌ చెడును బ్రాణమువోవు నిరర్థదోషముల్‌ పుట్టు, మహేశుఁ గాదని కుబుద్ధి నొనర్చిన యజ్ఞ తంత్రముల్‌ ముట్టక పోయి దక్షునికి మోసము వచ్చెఁగదయ్య భాస్కరా!
6
vutpalamaala
250
నిను సేవింపని పాపకర్ములకు వాణీనాథగోరాజవా- హనసుత్రామముఖామరప్రవర వాచాగోచరంబై సనా- తనమై ముక్తి రమాసమేతమగు నీ ధామంబు సిద్ధించునే మనురాడ్వంశసుధాబ్ధిసోమ! రామా! భక్తమందారమా!
4
mattebhamu
1556
తరుణిం గ్రీష్మగభస్తి, తప్తలతచందానన్‌ రహిన్‌ వాడి భీ కర దైత్యాంగన లాడు మాటలకు నాకంపించుచున్‌ సారెకున్‌ జిరభక్తిన్‌ రఘురామ, రామ యనుచుం బేర్కొంచు శోకార్తయై తరుమూలంబున నున్న జానకిని సందర్శింపవే మారుతీ!
4
mattebhamu
2578
అజుఁడై సృష్టి యొనర్చు రాజసముచే నందంబుగాఁ దా నధో- క్షజుఁడై వర్ధిలఁజేయు సాత్త్వికము సంప్రవ్యక్తిగా గోపతి- ధ్వజుఁడై సంహృతిసేయుఁ దామసమునం దత్సర్వముం గూడఁగా నిజవిస్ఫూర్తి వెలుంగుఁ దుర్యమగుచున్ నీ యాజ్ఞ సర్వేశ్వరా!
4
mattebhamu
1944
ధరణిన్‌ రక్తమహాహ్రదంబు లెలమిం ద్రైలోక్య నిర్దిష్టమై పరగం బైతృక తర్పణంబుకొరకై ప్రఖ్యాతిగాఁ దీవ్రతన్‌ నిరువై యొక్కటిమారు క్షత్రవరుల న్నేపార నిర్జించి త త్పరశుభ్రాజిత రామనామము కడు\న్‌ ధన్యంబు, నారాయణా!
4
mattebhamu
1147
మనుజుఁడు సభ్యుఁడు దానై గనియున్న యధార్థమెల్ల గానని యట్లా మనుజుండు పలుకకున్నను ఘనమగు పాతకము నాఁడు గనును గుమారా!
1
kandamu
4425
పీనుగందపుమోము పిల్లిమీసంబులు । కట్టెశరీరంబు కాకినలుపు ఆర్చుకన్నులు వెన్నునంటిన యుదరంబు । జొళ్ళుకారెడి నోరు ఒళ్ళుకంపు చేచెయ్యి దిగరాచి చెక్కిళ్ళు రుద్దుట । దవడలు సొట్టపాదములు మిట్ట యొకరిని జూచి మేలోర్చక యేడ్చుట । దౌర్భాగ్యగుణములు తగని యాశ
3
seesamu
3012
రహి లక్ష్మణుండను రాజును గాపిడి సీతను చెరసాల చేసివావుమారీచుడని నీవు మర్మంబుగానక గాసిల్ల నమ్మున నేసినావుహా లక్ష్మణా యని యా మృగంబటు గూయ వడిగ నీకోసమె వచ్చినాడురథమెక్కి యత్తరి రావణుం డరుదెంచి సీతను భీతిల్లజేసినాడు
3
seesamu
1764
దమకమున నిన్ను వలపింపదగినయట్టి | కొమ్మ ముద్దులగుమ్మయా కోమలాంగినెనయదగు నీకు నా యింతి నేలుకొమ్ము | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
315
క్షితినంభోనిధి కర్ఘ్యమిచ్చు క్రియ భక్తిన్బద్మినీభర్త కా- రతి యర్పించు తెఱంగున న్బహుతరబ్రహ్మాండసంత్రాతకున్ శతకంబొక్కటి గూర్చి నీ కొసగెద న్సంరూఢిఁ గైకొమ్ము నా కృతి సంస్తుత్యలసద్గుణాభరణ! భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
3218
_x000D_ దేశవేషములను తేటసేయక దేవుఁ _x000D_ డాత్మలోన నుండ ననగిపెనగి _x000D_ వేషమరసిచూడ గ్రాసంబు కొఱకయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4607
"వాయువు వొందు యీవిగతవావ అమా పరహంబ భౌ న్యాయ విధేయమీశతరి యన్యన బాణు కళాభి" దంచు 'వా గ్దేయ మణిప్రవాళము'నఁ దెల్లము నిన్ను నలంకరింతు దే వా యమిబృంద వంద్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
3100
_x000D_ ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని _x000D_ భావ మిచ్చి మెచ్చు పరమ లుబ్ధు _x000D_ పంది బురద మెచ్చుఁ బన్నీరు మెచ్చునా? _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2171
అమల! కమలాక్ష! నేనిట్లు శ్రమపడంగఁ - గన్నులకుఁ బండువై నీకుఁ గానఁబడునె? భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
1662
బాలుని వృద్ధికై యొరులు పల్కినయట్టుల నెంత ద్రవ్యమై- నా లవమాత్ర మంచుఁ దన నాథునకున్ దెలియంగఁ బల్కుచున్ లీల ఘటించి నందనుని లీలలకు న్మది సొక్కి యోగులం బోలినయట్టులుండు ననబోణినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
6
vutpalamaala
1682
కలకొలఁదిం దనూజునకుఁ గా నొనరించినయట్టి భూషణం- బులు ధరియించుచో నెదుటఁ బుత్రునకుం దన దృష్టి తాఁకి మై- చెలువు దొలంగునో యనుచుఁ జేరువవారలమీఁద దృష్టి నె- క్కొలుపుచు సంతసిల్లు సుమకోమలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
485
ఫలమతి సూక్ష్మమైనను నృపాలుడు మంచిగుణాఢ్యుడైనచో నెలమి వివేకులాతని కపేక్షయొనర్తు; రదెట్లు చంద్రికా విలసనమైనఁ దా మనుభవింపఁ జకోరము లాసఁ జేరవే చలువ గలట్టివాఁడగుటఁ జందురు నెంతయుఁ గోరి భాస్కరా!
5
champakamaala
3854
_x000D_ నీళ్ళమీఁదజూడు నెఱయ నోడలబల్మి _x000D_ బట్టబయలఁ జూడు బండిబలిమి _x000D_ ఆఁడుదాని బలిమి నాడనే చూడరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
119
అబ్ధిపయఃపాత్ర మద్రికాణంధాన- మహిరాజగుణము దా రమరఁ గూర్చి యమృతాభిలాష దేవతాసురుల్‌ మథియింప- గిరి మున్గం గచ్ఛపాకృతి వహించి నిర్వహించుట గాని సర్వకాశ్యపులలోఁ- బఙ్క్తిభేదముఁ జేసి పల్మ ఱాస కొల్పి దైత్యులనోరుఁ గొట్టి యాదిత్యుల- కమృతాన్న మిడితి వాయమరులందుఁ
3
seesamu
3547
_x000D_ కొండెగాఁడు చావఁ గొంపదనుకఁ బోక _x000D_ వంతు కింతెకాని వగపులేదు _x000D_ కొంకనక్క చావ గొఱ్ఱెలేమిటి కేడ్చు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3065
వందనము నీకు సతతము యిందిరేశ | నందనందన శ్రీధర కుందరదనతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన.
2
teytageethi
4322
యోగ్యతలేనికష్టుఁడ నయోగ్యుఁడ నన్నిటఁ జూడ గర్భని ర్భాగ్యుఁడ నీకృపామతికిఁ బ్రాప్తుఁడ నోయలమేలుమంగ నా భాగ్యము నీగృపాకరుణఁ బ్రాప్యము కావుమటంచు సారెనీ భాగ్యవతీ శిరోమణినిఁ బ్రస్తుతిసేసెద వేంకటేశ్వరా!
6
vutpalamaala
3127
_x000D_ మందుదినఁ బోటు మానును _x000D_ మందు దినగ జేయఁ బొలఁతి మహిలో వలచు\న్‌ _x000D_ మందుదిన కుదురు రోగము _x000D_ మందుదినం గలదు పుష్టి మహిలో వేమా.
1
kandamu
2707
వన్నేయేనుఁగు తోలుదుప్పటము బువ్వా కాలకూటంబు చే గిన్నే కపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మే ల్నిన్నీలాగున నుంటయుందెలిసియు న్నీపాదపద్మంబు చే ర్చెన్నారాయణుఁడెట్లు మానసముఁ దా శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
2061
యిట్టి దుష్టుల కధికారమిచ్చినట్టి - ప్రభువు తప్పులటంచును బలుకవలెను భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
4577
భువన హితార్థ తీర్థ! భవభూరుహ శాతకుఠారధార! గౌ రవ సముదాత్తవృత్త! యనురాగ రసామృతసారపూర! శాం భవమయ వేదబోధ! శివభక్తహృదబ్జ వికాసభాస! దే వ వరద కావుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
5
champakamaala
3253
_x000D_ తాననంగ నెవరు తనవారన నెవరు _x000D_ తెలిసి తెలియలేరు తిక్క నరులు _x000D_ అరయ పిసినికాయ పురుగు పద్ధతికాగ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
216
అకలంకాయతకీర్తి జాల! మహనీయాభీలశౌర్యస్ఫుర- న్మకరాక్షాసురరావణప్రముఖ నానాదానవోత్తాలతూ- లకరాళస్ఫుటవహ్నికీల! జయశీలా! సద్దయావాల! హే- మకనచ్చేల! బుధానుపాల! రఘురామా! భక్తమందారమా!
4
mattebhamu
2116
తాపసార్చిత! నేను పాపకర్ముఁడనంచు - నాకు వంకలఁ బెట్టఁబోకు సుమ్మి నాఁటికి శిక్షలు నన్ను చేయుటకంటె - నేఁడు సేయుము నీవు నేస్తమనక అతిభయంకరులైన యమదూతలకు నన్ను - నొప్పగింపకు మయ్య యురగశయన! నీ దాసులను బట్టి నీవు దండింపంగ - వద్దు వద్దనరెంత పెద్దలైనఁ
3
seesamu
167
ఘోరకబంధుదీర్ఘోరుదోర్దండముల్‌- తరిగి వచ్చిన మాట తథ్య మేని పంఙ్క్తికంఠాత్మజ ఫణిరాజబంధమో- చనుఁడ వై వచ్చుట సత్యమేని మైరావణాభేద్య కారాగృహముఁ గూల్చి- బ్రదికి వచ్చినపల్కు భద్రమేని మారీచు దుస్తరమాయాభ్రమతఁ బాసి- విజయ మొందినసుద్ధి నిజమ యేని
3
seesamu
970
గాని తులువల డెందంబు గరగఁ జేయ | వశము గాదయ్య భువిని నెవ్వరికినైన, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
3010
జనకుడన్ బహుశాంతశాలి సముఖమ్మున విఱువరానట్టి విల్విరచినానుయవనిపుత్రిక సీత నతివేగముగ నేను గెల్చుకొంటిని భూమికీర్తికొఱకుజోడుగా భూపుత్రికూడ వేడుక లలరంగ నయ్యోధ్యాపురంబు జేరితల్లిదండ్రుల నన్నదమ్ముల మెలగుచు రారాజునైతి నో రమణి నేను
3
seesamu
3795
_x000D_ తామరపాకున నీర్వలె _x000D_ వేమన చరియించుచుండు వెదకుచు శివుని\న్‌ _x000D_ నీమాయ నమ్మరాఁగా _x000D_ దీమనమునఁ దెలియరాదు నీశుని వేమా.
1
kandamu
3686
_x000D_ త్రాసును పడియును లంజయు _x000D_ భాసురగతి నొక్కరూపు పరికింపంగా _x000D_ వీసంబధికంబిచ్చిన _x000D_ వాసరమున నొక్కవంక వారలు వేమా.
1
kandamu
2124
కమలలోచన! నన్నుఁ గన్నతండ్రివి గాన - నిన్ను నేమఱకుంటి నేను విడక యుదరపోషణకునై యొకరి నే నాశింప - నేర నా కన్నంబు నీవు నడుపు పెట్టలేనంటివా పిన్న పెద్దలలోనఁ - దగవు కిప్పుడు దీయఁ దలఁచినాను ధనము భారంబైనఁ దల కిరీటము నమ్ము - కుండలంబులు పైఁడిగొలుసు లమ్ము
3
seesamu
4351
సూక్ష్మస్నానము చేసి సొక్కినవేళ సా- । మితధారణము చేసి మెలఁగువేళ బడలిక పైనంబు నడచి వచ్చినవేళ । సురతాప్తి ‘హా’ యని సొక్కువేళ నొంటరిగాఁ జీఁకటింట నుండినవేళ । నలుకతోఁ బవళించునట్టివేళ దెఱఁగొప్ప మనమున దిగులు చెందినవేళ । భక్తి గన్నట్టి విరక్తివేళ
3
seesamu
3526
_x000D_ తరుణి సొగసుఁగన్న తనయుని గన్నను _x000D_ మరునికళల మించి మనము పాఱు _x000D_ పాపజాతి మనము పట్టంగ రాదయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2361
తాటాకులలో వ్రాసిన మాటలనా ముక్తి పాడిమర్మముఁ దెలియున్‌? సూటి యగురాజమార్గము సాటి యగునె యెచట నున్న! సంపఁగిమన్నా!
1
kandamu
4482
దుర్ణయుల దుర్గుణంబులు ద్రోయరాదు । దానికి ఫలంబు యమసన్నిధానమునను దేటపడు గాక యొరులకు దెలుప వశమె మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
538
తరలని భక్తి నెల్లపుడు ధ్యానము సేతు తుషారధారుణీ- ధరవరకన్యకావిలసితస్తనకుంభవిలిప్తకుంకుమా- గరుఘనసారచందనసుగంధవిభాస్వదురఃస్థలు న్నినున్ జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
1137
లోకులు తనుఁ గొనియాడ వి వేకి యదియు నింద గాక విననొల్లఁడు సు శ్లోకుల చరితం బిట్టిది చేకొనవలె నట్టి నడత చిన్ని కుమారా!
1
kandamu
1927
దండంబు యదువంశమండన గోవింద దండంబు నీకు వేదండవరదదండంబు చంద్రమార్తాండ సులోచన దండంబు నీకు బ్రహ్మాండపోషదండంబు పద్మజాఖండలసన్నుత దండంబు కుండలగండయుగళదండంబు భండనోద్దండపరాక్రమ దండంబు సద్గుణకాండ నీకు
3
seesamu
2018
కరినాథుండు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాంతుఁడై యీశ మీ శరణం బన్నఁ గృశాను భానుశతతేజస్ఫూర్తి యైనట్టి మీ కరచక్రంబున నక్రకంఠము వెస\న్‌ ఖండించి మించెం దయా పరసద్భక్త భయానక ప్రకర సత్ప్రాకట్య నారాయణా!
4
mattebhamu
1359
పదినూరుకన్నులపాదుషా కొల్వులో- । పలనెత్తు ధవళాతపత్రమనగ హరుని నేత్రాగ్నిచే కరిగి నీరైన పూ- । విలుకాని సతి మోముచెలువనంగ వలరాజు వేటాడి వచ్చిన రతి దృష్టి- । పట్టిన రతనాలపళ్లెమనగ ప్రాగ్దిశాంగన కొప్పుపై తళతళమంచు । రహిగాంచు వజ్రాలరాకిడి యన
3
seesamu
998
యనఁగ నెన్నిక గన్న లేయన్నుమిన్న | దొరకి ఘను నిన్ను నుతిగొన్న పురుషుఁ డహహ, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
1768
యతివ దన కేళిగృహము నలంకరించి | విభుని దోడ్కొని రమ్మని వెలది వనిచెపాన్పుపై నిన్ను గూడ నా పద్మగంధి | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
1857
ధవుని బాసినయట్టి తరి గని నను జూచి వేగ మారుడు చెలరేగు గొమ్మచెలరేగి యదను క్రొంజిగురమ్ము లేసిన గోవెల లటుగూసె మావిగొమ్మమావిగొమ్మ బికాళి మది కలగించిన గల్కిచిల్కలు బల్కె గలివిగొమ్మకలివిమాటలు వినగా నోపకుండిన వెసవీచె దెమ్మెర వేపగొమ్మ
3
seesamu
454
చంద్రకళావతంసు కృపచాలనినాఁడు మహాత్ముఁడైనఁ దా సాంద్రవిభూతిఁ బాసి యొక జాతివిహీనునిఁ గొల్చియుంట యో గీంద్ర నుతాంఘ్రి పద్మ మతిహీనత నొందుట కాదుగా; హరి శ్చంద్రుఁడు వీరబాహుని నిజంబుగఁ గొల్వఁడె నాఁడు భాస్కరా!
6
vutpalamaala
430
ఉరుబలశాలి నంచుఁ దను నొల్లని యన్య [పతివ్రతాంగనా సురతము గోరెనేని కడసుమ్మది భూతికిఁ బ్రాణహాని యౌ; శిరములు గూల రాఘవునిచే దశకంఠుఁడు ద్రుంగిపోవఁడే యెఱుఁగక సీత కాసపడి యిష్టుల భృత్యులఁ గూడి భాస్కరా!
5
champakamaala
2316
ఇల నిన్నుం దొలుబామునం దలఁప నే నీజన్మమందైన నా తలఁపు ల్మీపదపంకజంబులపయిన్ దాపింతు నే నింక బు ట్టలలోఁ జెట్టులలోన నంబువులఁ బుట్టం బుట్టఁగా నోపఁ గ ర్మలతాబంధము మాపవయ్య! రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
1579
ప్రకటింపన్‌ జగముల్‌ దహించు శిఖి నీవాలాగ్రగుండయ్యు జా నకి యాశీర్వచనంబునన్‌ బవనబాంధవ్యంబునన్‌ జేసి తా వకవాలాంచితరోమమైనఁ గమలింపన్‌ శక్తుఁడుంగాక పొం దికతోఁ జందనపంకశీతుఁ డగుచున్‌ దీపింపఁడే మారుతీ!
4
mattebhamu
3241
_x000D_ ఎఱుకకన్నను సుఖమే లోకమునలేదు _x000D_ ఎఱుకనెఱుఁగ నెవని కెఱుకలేదు _x000D_ ఎఱుకసాటి ఎఱుక యేతత్వమున లేదు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1129
చేయకుము కాని కార్యము పాయకుము మఱిన్‌ శుభం బవని భోజనమున్‌ జేయకుము రిపు గృహంబునఁ, గూయకు మొరుమనసు నొచ్చుఁ గూఁత కుమారా!
1
kandamu
768
ఘనుల\న్‌ నీచుల నీచుల\న్‌ ఘనుల సత్కారాఢ్యుల\న్‌ దుష్క్రియా జనితోద్యోగుల నర్థవంతులను భిక్షాయుక్తుల\న్‌ భిక్షుల\న్‌ ధనికవ్రాతముగా నొనర్చుచును నిత్యంబు\న్‌ మహాగారడం బని నందించు వినోదరాయ హరి కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
793
బొంకు ల్లక్షలు నిత్యసంభరితసంభోగారతుల్‌ దుర్మదా హంకారంబులు కోట్లసంఖ్యయగు మోహంబాయనంతంబు దు ష్పంకాభార మపార మిన్నిగల భూపవ్రాతసర్పాళి ని శ్శంకం బ్రాజ్ఞులు చేర వోవుదురె కృష్ణా దేవకీనందనా.
7
saardulamu
2783
చేతులకుఁ దొడవు దానము భూతల నాథులకుఁ దొడవు బొంకమి ధరలో నీతియ తొడవెవ్వారికి నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!
1
kandamu
2203
యెందుఁ బోవక నేను నీ మందిరమున - నిలిచితిని నీకు నామీఁద నెనరు లేదు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
3782
_x000D_ ఒల్లనిపతి నొల్లనిసతి _x000D_ నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడె _x000D_ గొల్లండు గాక ధరలో _x000D_ గొల్లనికిం గలవె వేఱె కొమ్ములు వేమా.
1
kandamu
3967
_x000D_ తల్లి కెదురుకొనుట తండ్రి కెదురుకొనుట _x000D_ యన్న కెదురుకొనుట యనఁగ మూఁడు _x000D_ పాతకముల నెఱిఁగి వర్తింపఁగావలె _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3177
_x000D_ మనసు ముక్తియనుచు మది నెఱుంగఁగలేరు _x000D_ మనసుచేతఁ దగిలి మాయమైరి _x000D_ మనసు తానయైన మర్మజ్ఞుడగు యోగి _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
429
ఉరుగుణవంతుఁడొడ్లు తనకొం డపకారము చేయునప్పుడుం బరహితమే యొనర్చు నొకపట్టున నైనను గీడుఁ జేయగా నెఱు గఁడు; నిక్కమేకద యదెట్లన? గవ్వముఁ బట్టి యంతయుం దరువఁగఁ జొచ్చినం బెరుగుతాలిమి నీయదె వెన్న? భాస్కరా!
5
champakamaala
2127
నేఁడు కరుణింపకుంటివా నిశ్చయముగఁ - దెగఁబడితి చూడు నీ తోడ జగడమునకు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
2720
జలజశ్రీగల మంచినీళ్ళు గలవా చట్రాతిలో బాపురే! వెలివాడన్మఱి బాఁపనిల్లు గలదా వేసాలు గాకక్కటా! నలి నారెండుగుణంబులెంచి మదిలో నన్నేమి రోయంగ నీ చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
2839
స్త్రీలయెడ వాదులాడకు బాలురతోఁ జెలిమి సేసి భాషింపకుమీ మేలైన గుణము విడువకు యేలినపతి నిందసేయ కెన్నడు సుమతీ.
1
kandamu
4301
అపు డలమేలుమంగ పొలయల్కలు వద్దని చాఁటి చెప్పిన\న్‌ గపటపుటల్క లల్లితివి గర్వితనంబునఁ గాంత కోరమే రపమునఁ జూతుగా కలుక రాజసలీలల నింత దీఱునా విపులవియోగతాపమున వేడుకకూటమి వేంకటేశ్వరా!
5
champakamaala
1496
నెనరు మితిలేదు కంటికి నిదుర రాదు । యితరమతి బోదు యాహార మింపు గాదు మెలత యికమీదు నిజము నా మేను నీదు । వశము శ్రీరామరామ లావణ్యసీమ.
2
teytageethi
1358
యిచ్చటికి చెచ్చెరను బలుమచ్చరమున । చిచ్చు కైవడి విడివడి వచ్చువాని విచ్చుకత్తికి నెద నెదురిచ్చి నిలువ । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
474
నొగిలిన వేళ నెంతటి ఘనుండును దన్నొక రొక్క నేర్పుతో నగపడి ప్రోదిసేయక తనంతట బల్మికిరాడు నిక్కమే; జగమున నగ్నియైనఁ గడు సన్నగిలంబడియున్న, నింధనం బెగయగఁ ద్రోచి యూదక మఱెట్లు రవుల్కొన నేర్చు భాస్కరా!
5
champakamaala
4632
భీకర రుద్రనేత్ర శిఖిఁ బెద్దఁగఁ జేయఁగ వీరభద్రు ను ద్రేక గజంబునా నితర దేవతలన్‌ బడఁదాఁకు నుద్ధతుం డా కలికేత బ్రహ్మయకు నర్మిలి భృత్యుఁడ! నిన్నుగొల్తు దే వా కరుణింపుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
1119
నరవరుఁడు నమ్మి తను నౌ కరిలో నుంచునెడ వాని కార్యములందున్‌ సరిగా మెలంగ నేర్చిన పురుషుఁడు లోకమునఁగీర్తి బొందుఁ గుమారా!
1
kandamu
3016
ధరణిలో గృష్ణావతారమెత్తిననాడు తల్లిమాటకు మేఱ దప్పినావుఆ తల్లి నిన్నెంతో యాసక్తి బెంపగా దుందుడుకై చాల దూకినావుగద్దఱీవని తల్లి పెద్దరోటను గట్ట మద్దులఁ బడద్రోసి మళ్ళినావుమగుడి యావెంటను మఱి బుద్ధరూపమై చెలుల వ్రతంబులఁ జెఱచినావు
3
seesamu
1819
వదనాంబుజమునందు కొదమతేటుల మాడ్కి నలువైన ముంగురుల్ నటనమాడపసమించు బంగారుపతకముల్ జతగూడి కులుకుగుబ్బలమీద గుసియాడసందిటగల బాజుబందుకుచ్చులచాలు తోరమై పలుమారు తూగులాడచెలువైన మొలనూలి చిరుఘంటలొరయుచు సారె కణిల్లని సద్దుసేయ
3
seesamu
3867
_x000D_ ధారదత్తమైన తామ్రపుఁబలకను _x000D_ లావుటుంగరమున లంకెజేసి _x000D_ యరయ మీఁదముద్ర యమరియుండంగను _x000D_ నదియ శాసనంబు నవని వేమ.
0
aataveladi
694
దురమునఁ దాటకం దునిమి ధూర్జటివిల్‌ దునుమాడి సీతనుం బరిణయమంది తండ్రిపనుపన్‌ ఘనకాననభూమి కేఁగి దు స్తరపటుచండ కాండకులిశాహతి రావణకుంభకర్ణ భూ ధరములఁ గూల్చితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
4229
_x000D_ తఱచు చదువు చదువఁ దర్కవాదమె కాని _x000D_ దివ్యజ్ఞాన మన్న తేటపడదు _x000D_ పసిరికాయపురుగు పగిదిని చెడిపోవు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4459
వితరణశౌర్యప్రతిష్ఠునకే కాక । మీసము పిసినారికోసకేల సిరిగల ఘనసువాసిని కొప్పునకుఁ గాక । బొండుమల్లెలు బోడిముండకేల ప్రజ సుఖింపగజేయు పంటచెర్వుకు గాక । గండిగుంటకు ఱాతికట్ట యేల జాతైన బారాహజారితేజికిఁ గాక । కఱకుల కళ్ళెంబు గాడ్దెకేల
3
seesamu
3414
_x000D_ ఆకృతి యనఁగను నిరాకృతి యనఁదగు _x000D_ నాకృతి నొగిఁదగు నిరాకృతిట్టు _x000D_ లవియు రెండు లే యపురూపమై యుండు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4272
రాపుగ మమ్ము నేయునపరాధశతంబుల సంతముల్‌ సదా ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... కాపురమున్‌ నిరంతము గల్కితనంబును వేంకటేశ్వరా!
6
vutpalamaala
4097
_x000D_ ప్రస్తుతించువేళ బద్యంబుఁ జదివినఁ _x000D_ దప్పుదగిలియున్న నొప్పియుండు _x000D_ వెలఁది సురతవేళ బిత్తరై యొప్పదా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
75
బొచ్చెచేఁపకు నైన మచ్చరం బున్నది- తాఁబేటి కైన సత్త్వంబు గలదు డీకొన్న నడవిపందికిఁ గల్గు రోసంబు- తెరనోటినరుఁడైనఁ దెగువ సేయుఁ బొట్టివానికి నైన దిట్టతనం బుండు- బాపని కైన దర్పంబు గలదు చుంచురాజున కైన శూరత్వ మున్నది- ముసలికి నైనఁ జేపుష్టి గలదు
3
seesamu
3328
_x000D_ నది నుదకంబులు చనుక్రియ _x000D_ మది నొదవెడు తత్వబుద్ధిమగ్నత లెల్లం _x000D_ దుది పదవి గలయ ఘనుఁడగు _x000D_ మదధిఁ బ్రవేశించి గంగ యొప్పున వేమా.
0
aataveladi
3346
_x000D_ విత్తులేని వృక్షమొక్కటి పుట్టె _x000D_ ఫలము లేని పువ్వు మొదలు పత్రిలేదు _x000D_ స్వాదులేదు చూడ నాపాటుకును లెస్స _x000D_ దీనిభావ మేమి తెలుపు వేమా.
0
aataveladi
1002
తవిలి పదుగురుబిడ్డల తల్లియైన | విడువవలెనండ్రు పెద్ద లిప్పుడమియందు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
1049
మొదవుల బదివేలు కదుపులు గూర్చిన | దూడ యొక్కటియైనఁ దోడరాదు మాత లసంఖ్యముల్ మాటుగా నించినఁ | బసిఁడి వీసమును వెంబడిని రాదు కోకలు మేట్లుగా గొట్ల నిండించిన | గుడ్డ యొక్కటియైనఁ గూడరాము గొలుసులు రాసులు బలుపాతరల నిడ్డ | గింజ యొక్కటియన గెలన రాదు
3
seesamu
2135
దొరికితివి నాకు దండి వైద్యుఁడవు నీవు - వేయికష్టాలు వచ్చిన వెఱవనయ్య భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
2254
దాతల్ ద్రాతలు తల్లిదండ్రులు మఱిన్ దైవంబు లాప్తుల్ చెలుల్ భ్రాత ల్దక్కినవారు చుట్టములు మీపాదాలపై నాన నా దాత ల్ద్రాతలు తల్లిదండ్రులు మఱిన్ దైవంబు లాప్తుల్ చెలుల్ భ్రాతల్ సర్వము నీవె కావె రఘువీరా! జానకీనాయకా!
7
saardulamu
3711
_x000D_ కొండఱేఁడు మామ కొండకూతురు నాలు _x000D_ కొండ యిల్లు పసిఁడికొండ విల్లు _x000D_ కొండవంటి దొరకు గుండురూపంబురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3899
_x000D_ పరమహంస ననుచు వరవఁ గట్టుక భూమి _x000D_ పరధనముల కాసపఁడెను వాఁడు _x000D_ పరమహంస గాఁడు పరమహింసుఁ డటండ్రు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
413
ధరలో నెన్నఁగ శాలివాహనశకాబ్దంబు ల్దగ న్యామినీ- కరబాణాంగశశాంకసంఖ్యఁ జెలువై కన్పట్టు (సౌమ్యా)హ్వ- యస్ఫురదబ్దంబున నిమ్మహాశతక మేఁ బూర్ణంబు గావించి శ్రీ- కరలీల న్బుధులెన్న నీకిడితి భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
2946
కౌస్తుభమణిహారకంకణంబుల జూచి రానియ్యదయ్యె నా రమణి యెవతినాసాగ్రమందున్న నవమౌక్తికము జూచి వలచిన దెవ్వతె నాడు వల్ల-భుని హరిచందనము మేన నలదికొన్నది చూచి పరిమళగంధి యెవతె పక్కజేర్చెశంఖచక్రములున్న పొంక మెవ్వతె చూచి బలవంతమున వాని భ్రమలు గొల్పె
3
seesamu
2980
చెంగల్వకొలనులో శృంగారముగ జలక్రీడ చేడియలతో నాడువానిసిగ్గులేకను వారి చీరలన్నియు గొని తక్కక పొన్న మ్రానెక్కువానినెక్కడి చోరకుం డెత్తుకపోయెనో యనుచు వ్రేతల నలయించువానికొలనులో సిగ్గుచే గొంకెడు వనితల చలువలిచ్చెదనని వచ్చువాని
3
seesamu
4295
అందము చూతు రుప్పవడమై ఘను లాయలమేలుమంగ మో మందము గాఁగఁ జూతువు ప్రియంబున మెల్లన నీవటుండఁబో యందఱి మోముటద్దములు నవ్వల నవ్వుల గోటికొండలై యందములోన నందములునై వెలుగొందుచు వేంకటేశ్వరా!
6
vutpalamaala
2345
ఉండందెక్కడ నీవు లేక వెలియై యుండేది యెచ్చోటు బ్ర హ్మాండంబుల్ లయమందు నీవు కనుమూయన్ లోకపర్వంబుగా నండంబున్ బ్రభవించు నీకును వినోదార్థంబు నీ మాయ మా ర్కండేయాదు లెఱుంగలేరు రఘువీరా! జానకీనాయకా!
7
saardulamu
1295
కామము సంకల్పంబున బామొందెడుఁ దొలగుఁ దేహ భావము దెలియన్‌ వేమఱు నిది పరికించుట క్షేమం బగు ముక్తిఁ గని సుఖింపు కుమారీ!
1
kandamu
426
ఈ క్షితినర్థకాంక్ష మదినెప్పుడు పాయక లోకులెల్ల సం రక్షకుఁడైన సత్ప్రభుని రాకలు గోరుదు రెందుఁ; జంద్రికా పేక్షఁ జెలంగి చంద్రుఁడుదయించు విధంబునకై చకోరపుం బక్షులు చూడవే యెదు రపార ముదంబును బూని భాస్కరా!
6
vutpalamaala