file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
silence_ratio
float64
0.1
0.35
clipping_ratio
float64
0
0
audio/te/indictts_te_male_train_telugumale_05347.wav
శత్రుసేనలు బారులు తీర్చి ఎదురుగా నిలబడి ఉండటం , చూడగానే భీమసేనుడికి దడ పుట్టుకొచ్చింది ముచ్చెమటలు పోశాయి కాళ్లు చేతులు చల్లబడ్డాయి అతను ఏనుగుమీదినుంచి కిందకి జారి తప్పించుకోవాలని చూశాడు సమయానికి మరుగుజ్జు అతన్ని పట్టుకుని ఏనుగుకు కట్టి వెయ్యక పోయినట్టయితే భీమసేనుడు గుర్రాల కాళ్లకింద నలిగి నిష్కారణంగా చచ్చి పోవాల్సిన వాడే .
te
indictts_te_male
21.173
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05348.wav
మరుగుజ్జు , యుద్ధరంగంనుంచి విజయుడై తిరిగి రాగానే , రాజుగారికి నిజమైన విలుకాడెవరో తెలిసిపోయింది ఆయన మరుగుజ్జును సేనానాయకుడుగా నియమించాడు మరుగుజ్జు భీమసేనుడికి అంతులేని కానుకలిచ్చి పంపేశాడు .
te
indictts_te_male
13.365
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05349.wav
పూర్వం హంసల దీవిని ఒకరాజు ఏలుతూండేవాడు ఆ రాజుకు ఇందుమతి అని ఒక్కతే కుమార్తె ఉండేది ఆ పిల్ల అస్తమానం దాదివెంట తోటలో తిరుగుతూ అక్కడ తాను చూసే ప్రతి పక్షిని గురించీ జంతువును గురించీ ఆమెను అడిగి తెలుసుకుంటూ ఉండేది .
te
indictts_te_male
14.784
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05350.wav
ఇందుమతి ఒకనాడు ఒక తొండను చూసింది ప్రళయానికి ముందు తొండలు కొండలంతగా పెరిగేవనీ వాటిని మొయ్యలేనని భూదేవి మొర పెట్టుకుంటే బ్రహ్మదేవుడు వాటిని పెరగకుండా చేశాడనీ , దాది ఆమెకు కధ చెప్పింది ఇందుమతి ఆ తొండను పట్టుకుని తీసుకుపోయి తండ్రి ఒడిలో వేసింది .
te
indictts_te_male
16.427
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05351.wav
పరధ్యానంలో ఉన్న రాజుగారు దడుచుకున్నాడు తరువాత ఆయనకు కూతురి మీద పట్టరాని అగ్రహం వచ్చింది .
te
indictts_te_male
5.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05352.wav
అమాయకురాలైన ఇందుమతి కిలకిలా నవ్వి ఇంత చిన్న తొండను చూసే దడుచుకున్నావే ఇది పెరిగి చాలా పెద్దదైతే అప్పుడు ఏంచేస్తావు అని , తండ్రిని వేళాకోళం పట్టించింది .
te
indictts_te_male
10.176
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05353.wav
ఈ తొండ నీ అంత పెరిగేదాకా నీకు పెళ్ళి చెయ్యను ఏంచేస్తానో తెలిసిందా అని రాజు హూంకరించాడు .
te
indictts_te_male
6.325
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05354.wav
అదేంమాట మహారాజా చిన్నపిల్ల ఏదో తెలియక చేసింది క్షమించండి అన్నారు మంత్రుల వాళ్ళు .
te
indictts_te_male
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05355.wav
రాజు మరింత బిర్రబిగిసి నా నోటంట వచ్చినమాట , జరిగితీరవలసిందే అన్నాడు .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05356.wav
రాజు ఇలా అన్నట్టు విని దాది ఇందుమతిని కౌగిలించుకుని నా చిట్టితల్లి కింక పెళ్లి కాదుగామాలు అని ఏడ్చింది .
te
indictts_te_male
7.243
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05357.wav
అది మొదలు ఇందుమతి ప్రతీరోజూ ఓ బ్రహ్మదేవుడా నా ప్రార్ధన ఆలకించి తొండమీద నీ శాపం తీసిపారెయ్యి అది నా అంత పెరిగేట్టుచెయ్యి అని రహస్యంగా ప్రార్ధించేది .
te
indictts_te_male
9.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05358.wav
బ్రహ్మదేవుడు శాపమే తీసేశాడో లేక ఆ తొండ మామూలు తొండలవంటిది కాదో అది రోజురోజుకూ ఒక్కొక్క అంగుళం చప్పున పెరుగుతూ ఇందుమతికి యుక్తవయస్సు వచ్చేసరికి పెద్ద మొసలి ప్రమాణానికి పెరిగింది .
te
indictts_te_male
12.192
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05359.wav
ఇదిచూసి రాజుగారు లోలోపల చాలా సంతోషించాడు ఆయన కోపావేశంలో నోరు జారి కూతుర్ని అంతమాట అనేశాడేగాని ఆ మాట నిలబెట్టుకోవలిసి వస్తుందేమోనని ఆయన చాలా భయపడ్డాడు .
te
indictts_te_male
11.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05360.wav
రాజకుమార్తె వివాహానికి రాజు చేసిన ఆలోచనగురించి వినగానే , దాదికి , చాలా చిరాకు వేసింది ఈ రాజుగారికి ఆగ్రహం వచ్చినా చిక్కే అనుగ్రహం వచ్చినా చిక్కే ఆ గుండెకాయ తొండదని భూప్రపంచంలో ఎవడైనా కనుక్కో గలడా పిల్లదానికి పెళ్లి కాకుండా ఉండేటందుకే ఆయన ఈ పని చేసినట్టుగా ఉంది అనుకున్నదామె .
te
indictts_te_male
19.563
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05361.wav
పెళ్లి దగ్గరపడింది దేశాలనుంచీ అతిధులు వచ్చి దిగుతున్నారు వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విడిదికి వెళ్లి దాది ఒక్కొక్కరినే చూసింది ఒక్కరూ ఆవిడకు నచ్చలేదు అందరూ అందరే ఒక్కరూ మా ఇందు కాలిగోరుకు , సమంకారు అనుకున్నది దాది .
te
indictts_te_male
17.12
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05362.wav
ఇంతలో , చిలకలదీవి రాజకుమారుడు వేంచేశాడు మిగిలినవారిమధ్య అతను చుక్కల్లో చంద్రుడల్లే ఉన్నాడు మంచి అందగాడు ఇందుమతికి ఈడయినవాడు బుద్దిమంతుడు ఎలాగైనా రాజకుమార్తెను అతను చేసుకునేటట్టు చూడాలని దాది నిశ్చయించుకున్నది .
te
indictts_te_male
13.856
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05365.wav
మర్నాడు అతిధులందరూ రాజభవనానికి వచ్చారు రాజుగారు వారందరికీ గాజు జాడీ చూపించి ఇందులో ఉండే గుండెకాయ ఏ జంతువుదో కనుక్కున్నవారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయటమే గాక అర్ధరాజ్యంకూడా ఇస్తాను అని చెప్పాడు .
te
indictts_te_male
13.621
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05366.wav
ఎవరికి తోచిన జంతువుపేరు వారు చెప్పారు కుక్కకన్నా చిన్న జంతువు పేరు ఎవరూ చెప్పలేదు కొందరు దాన్ని ఏనుగు గుండెకాయ అనికూడా చెప్పారు అందరి వంతూ అయిపోయాక గూనివాడు ముందుకు వచ్చి మహారాజా ఆ గుండెకాయ ఏ జంతువుదో నేను చెబితే నాకు అమ్మాయిగారి నిచ్చి పెళ్లిచేసి అర్ధరాజ్యం ఇస్తారా అని అడిగాడు .
te
indictts_te_male
18.763
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05367.wav
అన్నమాట తప్పేది లేదు తెలిస్తే చెప్పుకో అన్నాడు రాజు .
te
indictts_te_male
3.307
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05370.wav
ఇదంతా చూస్తున్న , రాజకుమార్తెకు ఆ గూనివాళ్ళమీద జాలివేసి ఒక నౌకరుతో , రహస్యంగా వాళ్ళ ముగ్గుర్నీ నా గదికి తీసుకు పో నేను ఇప్పుడే వచ్చి వాళ్లకు బహుమతు లిస్తాను అని చెప్పింది .
te
indictts_te_male
10.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05371.wav
భోజనాలు ముగియగానే ఇందుమతి గబ గబా మేడమీదికి వెళ్లి తన గదిలో ప్రవేశించింది ఆమెకోసం గూనివాళ్లు వేచి ఉన్నారు ఇందుమతి తలుపు గడియపెట్టి గూనివాళ్ల కివ్వటానికిగాను తన పెట్టెలన్నీ తెరిచి నగలు బట్టలు పైకి తీయసాగింది .
te
indictts_te_male
14.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05372.wav
ఇంతలో బయట అడుగుల చప్పుడు వినపడింది తలుపుమీద ఎవరో తట్టారు .
te
indictts_te_male
3.915
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05373.wav
ఎవరు వారు అన్నది ఇందుమతి రాజుగారు పెళ్లికొడుకు పలికారు ఏమి చెయ్యటానికీ పాలుపోక ఇందుమతి గూనివాళ్లను తన పెట్టెలలో పడుకోమని మూతలు వేసి , తాళాలు బిగించింది తరువాత వెళ్లి , తలుపు తెరిచింది ఇందుమతి తండ్రీ కాబోయే భర్త లోపలికి వచ్చారు .
te
indictts_te_male
15.456
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05374.wav
వాళ్లు ఎంతకీ వెళ్లలేదు ఇందుమతికి తండ్రి చాలా పెద్ద ఉపన్యాసం చెప్పాడు ఆడితప్పటంతమ వంశంలో ఎన్నడూ లేదన్నాడు తండ్రి మాట పాటించటం కూతురి విధి అన్నాడు ఆడదానికి భర్తకు మించిన దైవంలేడన్నాడు మహారాజుల్లో కూడా గూనివాళ్లున్నారన్నాడు సూర్యాస్తమయం కాబోయే వేళవరకూ ఇందుమతికి నీతులు భోధించి మహారాజు తన కాబోయే అల్లుడితో పెళ్ళి ప్రయత్నాలు చూడ బోయాడు లగ్నం సరిగా అర్ధరాత్రికి .
te
indictts_te_male
25.675
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05375.wav
వాళ్లు వెళ్ళిపోగానే ఇందుమతి మళ్ళి తలుపుమూసి పెట్టెలు తెరిచింది కాని అప్పటికే గూనివాళ్లు ఊపిరి సలపక చచ్చి పోయారు ఇందుమతి తన దాదిని పిలిపించి జరిగినదంతా చెప్పింది .
te
indictts_te_male
10.709
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05376.wav
దాది వెంటనే ఊళ్లోకి వెళ్లి ఒక ఆజాను బాహువయిన వాణ్ణి పట్టుకుని ఒరే ఒక రహస్యమైన పని నీవల్ల కావాలి రాజుగారి ఇంటో ఒక మూట ఉన్నది దాన్ని చీకట్లో పట్టుకుపోయి సముద్రంలో పారేసి రావాలి ముందు పది రూపాయలిస్తాను పని పూర్తి చేసుకు వచ్చాక మరో ఇరవై రూపాయలిస్తాను అన్నది కట్టె కొట్టి బేడా పావలా సంపాదించుకునే ఆ పేదవాడికి ఇది చాలా మంచి బేరంగా కనపడింది .
te
indictts_te_male
23.712
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05377.wav
ఈ గోతం , చాలా జిత్తులమారిది నిన్ను ఏమార్చి తిరిగివచ్చింది ఈ మారైనా మోసుకుపోకుండా దీన్ని సముద్రంలో పారేసి రా అన్నది దాది .
te
indictts_te_male
8.192
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05378.wav
ఈసారి కట్టేలుకొట్టేవాడు సముద్రం లోతుకు వెళ్లి గోతాన్ని పారేసి వచ్చాడు కాని వాడు వచ్చేసరికి మళ్ళీ గోతం యధా స్థానంలో ఉన్నది .
te
indictts_te_male
8.459
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05379.wav
కట్టెలకొట్టేవాడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది ఆ గోతాన్ని సముద్రం దగ్గిరికి తీసుకుపోయి గోతం తెరిచిచూశాడు లోపల ఒక గూనివాడి శవం కనిపించింది .
te
indictts_te_male
10.4
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05380.wav
ఇంతసేపు ఏంచేశావు అని దాది ఆశ్చర్యంగా అడిగింది ఆ గూనికుంక మూడుసార్లు పారేస్తే నాలుగోసారి నాకన్నా ముందు తిరిగివచ్చాడు జరీబట్టలు కట్టుకుని కులుకుతూ మెట్లెక్కి రావటం చూశాను వాణ్ణి నాలుగోసారి పట్టుకుపోయి ఇంత బూడిదచేసి సముద్రంలో కలిపేసి మరీవచ్చాను అన్నాడు కట్టెలుకొట్టేవాడు .
te
indictts_te_male
18.56
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05381.wav
ఈ మాటలు వినగానే దాదికీ ఇందుమతికీ కలిగిన ఆనందం ఇంతా అంతాకాదు దాది వాడికొక వరహాలమూట ఇచ్చింది రాజకుమార్తె మెడలో ఉన్న ముత్యాలహారం ఇచ్చేసింది వెయ్యి దణ్ణాలు పెట్టి వాడు వెళ్లిపోయాడు .
te
indictts_te_male
12.683
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05382.wav
ముహూర్తం దగ్గరపడుతున్నది గూని పెళ్లికొడుకు జాడలేదు దాది వెళ్లి రాజుతో మహారాజా పెళ్లికొడుకు జాముకిందట మెట్లమీద నుంచి పడి నడుము విరిగి చనిపోయాడు అందరికీ తెలిసిపోతుందని నేను వాణ్ణి రహస్యంగా దహనం చేయించేశాను ఈ మాత్రానికి అమ్మాయి పెళ్లి ఆగవలిసిన అవసరంలేదు చిలకదీవి రాజకుమారుడికిచ్చి పెళ్లిచెయ్యండి ఈడూ జోడుగా ఉంటుంది అని సలహా ఇచ్చింది .
te
indictts_te_male
22.176
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05383.wav
రాజు ఆ ప్రకారమే చెయ్యటానికి , సమ్మతించాడు ముహూర్తానికి పెళ్లీ తెల్లవారీ అర్ధరాజ్యాభిషేకము వైభవంగా జరిగాయి .
te
indictts_te_male
7.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05385.wav
మనం కష్టాలకు గురి అయ్యేసమయంలో వాటిని ఎట్లా భరించగలమా అని ఎప్పుడు గడిచిపోతాయా అనిపిస్తుంది కాని అవి తొలగిపోయి సుఖమైన రోజులు వచ్చాక వెనక్కుతిరిగి చూసుకుంటే ఆ కష్టాలలోనే ఏదో ఆనందం కనిపించి వాటిని గురించి అప్పట్లో ఎందుకు అంతగా దిగులుపడ్డామా అని ఆశ్చర్యపోతాం .
te
indictts_te_male
18.005
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05386.wav
నేను మూడు భయంకరమైన సముద్రయానాలు చేసి ఇంత సుఖంగా కుడిచి కూచునికూడా ఈ భోగాలలో ముణిగి తేలటంకంటే మళ్ళీ ప్రపంచ పర్యటన చేసి అనుభవాలు సంపాదించటమే మేలనిపించింది వర్తకంచేసి డబ్బు మరింత గడించాలని కూడా కోరిక కలిగింది ఈ కోరిక రానురానూ , ఎంత తీవ్రంగా పరిణమించిందంటే నేనిక ఒక్క క్షణం కూడా ఇంట నిలవలేక పోయాను తిరిగేకాలూ తిట్టేనోరూ ఊరుకోవని ఇందుకే అంటారు .
te
indictts_te_male
26.155
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05387.wav
విధి తోసినట్టుగా ఒకనాడు , నేను నా ఇల్లూవాకిలీ ఆస్తీపాస్తీ వదిలేసి పూర్వంకన్నా ఎక్కువ ఖరీదైన సరుకులు కొనుక్కుని వాటితో బస్రా చేరాను .
te
indictts_te_male
9.76
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05388.wav
అక్కడ ఒక పెద్దనౌక పట్టుకున్నాను ఆ నౌకలోనే అనేకమంది బస్రా వర్తకులు కూడా ప్రయాణమైనారు .
te
indictts_te_male
6.037
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05390.wav
అల్లా కటాక్షంవల్ల నేనూ మరికొందరు వర్తకులు ఒక విశాలమైన చెక్కలతెట్టును ఆశ్రయించ గలిగాం అలలు మమ్మల్ని , ఒకపూటల్లా అటూ ఇటూ కొట్టాయి తరువాత పెద్దగాలి మమ్మల్ని ఒక ఒడ్డున పారేసింది మేమందరము ఉప్పెన తాకిడికి మూడువంతులు చచ్చిఉండటంవల్ల ఆ రాత్రల్లా సముద్రతీరాన ఇసకలో ఎట్లా పడినవాళ్లం అట్లాగే సొమ్మసిల్లి బాగా నిద్ర పోయాం .
te
indictts_te_male
22.805
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05392.wav
క్షణంలో నల్లటివాళ్లు మా ముందు కంచాలలో కనీవినీ ఎరగని కూరలతో భోజనం ఉంచారు వాటిని చూస్తే నాకు అంట బుద్దికూడా కాలేదు కాని నా మిత్రులు బాగా ఆకలి గొని ఉన్న కారణం చేత ఆవురావురుమని , కంచాలలో పెట్టిన ఆహారం తినేశారు నేనా ఆహారం తినక పోవటం , మేలయిందని నాకు తరువాత తెలిసి వచ్చింది .
te
indictts_te_male
18.507
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05393.wav
నా స్నేహితులైన వర్తకులకు ఆకలి ఆహారం తింటున్నకొద్దీ , జాస్తీ కాసాగింది వారు గంటల తరబడి తమ కంచంలో వడ్డించిదల్లా ఆత్రంగా తినసాగారు అంత కంతకూ వాళ్లు తినే పద్దతికూడా పశువులు తినే ధోరణి లోకి దిగ సాగింది .
te
indictts_te_male
15.307
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05394.wav
ఇదంతా కళ్లారా చూస్తూ నేను ముద్ద ఎట్లా నోట పెట్టుకునేది నా శరీరానికి లేపనం పూయవస్తే , నేను నిరాకరించాను ఇదీ నాకు మేలే అయింది ఎందుచేతనంటే వీళ్లు నరభక్షకులనీ చంపితినటానికే , వాళ్ళా విధంగా మనుషులకు కొవ్వు పట్టేటట్టు తినిపిస్తారనీ నాకు త్వరలోనే తెలిసింది ఇంకో ఘోరమేమిటంటే వీళ్లరాజు రోజుకొక మనిషిని కాల్చుకుతింటాడు వీళ్లుమటుకూ పచ్చిమనుషులనే పీక్కుతింటారు .
te
indictts_te_male
25.568
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05395.wav
ఈ విషయాలు నాకు తెలియవచ్చాక నా గతీ నా స్నేహితుల గతీ ఏమవుతుందో నని నేను చాలా ఆందోళనచెందాను పైగా నా మిత్రుల పొట్టలు , పెరిగిపోతున్నకొద్దీ , వాళ్ల వివేకం క్షీణించి పోతున్నట్టు స్పష్టమయింది చిట్టచివరకు వాళ్లు వేటపశువుల్లాగా అయిపోయారు ఆ నల్లటి వాళ్లు వీళ్లని దూరన వున్న పచ్చికమైదానాల మీదికి మేపటానికి తోలుకుపోయారు .
te
indictts_te_male
22.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05396.wav
నేను భయంతోను , ఆకలితోను చిక్కి శల్యమైపోయాను నా చర్మం ఎముకలకు అంటుకు పోయింది అక్కడి వాళ్లకు నా యందు కొంచెంకూడా , ఆసక్తి లేకుండా పోయింది వారు నన్ను మరిచిపోయారు అందుచేత నేను ఒకరోజు వాళ్ల భవనం నుంచి , తప్పించుకుని దీవికి అడ్డంపడి నడవ సాగాను దారిలో నాకు నా మిత్రులను తోలుకుపోతున్న నల్లటివాళ్ళు తటస్థ పడ్డారు నేను చెట్లచాటున దాక్కుని వారి కంటపడకుండా తప్పించుకున్నాను .
te
indictts_te_male
25.909
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05398.wav
రాజధానిలో జనసమ్మర్ధం హెచ్చుగా ఉంది అంగళ్ళలో , సమస్తమైన సరుకులు ఉన్నాయి వీధులు విశాలంగా నిర్మలంగా ఉన్నాయి ఈ వీధుల వెంట అనేకమంది మేలుజాతి , గుఱ్ఱాలమీద జీను లేకుండా సవారీఅయి అటూ ఇటూ వెళుతున్నారు నేను రాజుగారిని , దర్శనం చేసుకుంటూనే మీ దేశంలో రౌతులు జీనులేకుండా గుర్రాలమీద సవారీఅయి వెళుతున్నారు కారణమేమిటి సవారీకి జీనులుండటం మరింత సుఖం కదా అని అడిగాను .
te
indictts_te_male
25.461
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05399.wav
జీనులేమిటి వాటిని మేమెన్నడూ చూడనేలేదే అన్నాడు రాజు ఆశ్చర్యంగా అలా అయితే అనుమతి ఇవ్వండి నేను ఒకటీ రెండురోజుల్లో జీను తయారు చేసి ఇస్తాను దానిలో ఉండే సౌకర్యం మీకే తెలిసివస్తుంది అన్నాను .
te
indictts_te_male
12.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05400.wav
రాజు సరేనన్నాడు పనివంతుడైన వడ్రంగి నొకణ్ణి పట్టుకొని దగ్గర ఉండి వాడిచేత కొయ్యజీను తయారుచేయించాను తరువాత దానికి ఈకలు కూరిన మెత్త ఒకటి కుట్టించి దానికి తోలుతొడుగూ జలతారు అంచులు రంగురంగుల కుచ్చులు ఏర్పాటు చేయించాను తరువాత ఒక కమ్మరి వద్దకు వెళ్లి కళ్లెం తగిలించే ఇనుపముక్క చేయించాను రెండు రికాబులు చేయించాను నేను వాడి గొంతుమీద కూచోవటం వల్ల నాకు కావలిసిన విధంగా వాటిని తయారుచేసి ఇచ్చాడు .
te
indictts_te_male
27.275
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05401.wav
అన్నీ చక్కగా అమరినాక నేను అశ్వశాలకు వెళ్లి అక్కడ ఉన్న గుర్రాలలో ఉత్తమమైన దాన్ని ఏరి , దానికి జీనూ కళ్లాలూ తగిలించాను దాని మెడకు , నీలం కుచ్చులు అమర్చాను తరువాత దాన్ని , తీసుకుపోయి రాజుగారి ముందుంచాను రాజుగారు గుర్రం ఎక్కి జీనులోగల సౌకర్యాలు గుర్రాన్ని నడపటంలో కొత్తగా వచ్చిన సులువూ తెలుసుకుని నాకు అంతు లేని ధనము బహుమతులు ఇచ్చాడు .
te
indictts_te_male
23.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05402.wav
రాజుగారికి నాకు గాఢమైన స్నేహం ఏర్పడింది ఒకనాడాయన , నాతో చూడు సింద్ బాద్ నువ్వు నాకు ఆప్తులందరిలోకి ఆప్తుడవైపోయావు నువ్వు పరదేశీయుడివనే భావం కూడా నాలో కలగటంలేదు అందుచేత నా కోరిక ఒకటి తీర్చగలవా అని ఆప్యాయంగా అడిగాడు .
te
indictts_te_male
16.064
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05403.wav
ఏలినవారు అనటమూ నేను కాదనటమూనా సెలవియ్యండి అన్నాను అయితే నువ్వొక అందమైన స్త్రీని పెళ్ళాడాలి ఆమె ఉత్తమవంశాన పుట్టినది చాలాధనం కలది ఆమెను వివాహం ఆడితే నువ్విక్కడే ఉండిపోతావని నా ఆశ కాదనకు , సింద్ బాద్ అన్నడు రాజుగారు .
te
indictts_te_male
16.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05405.wav
మాట్లాడవేమోయ్ అన్నాడు రాజుగారు మహారాజా నేను తమ సేవకుణ్ణి తమ యిష్టప్రకారం చెయ్యండి అన్నాను వెంటనే ఆయన వధువును కాదీనీ సాక్షులను పిలిపించి నా వివాహం జరిపించేశాడు ఆమె అందగత్తె మాత్రమే కాక చాలా సంపన్నురాలు ఆమెకు అనేకమైన భవనాలు వస్తువాహనాలు భూములు ఉన్నాయి రాజుగారు , మేం ఉండటానికి ఒక దివ్యమైన భవనము అనేకమంది నౌకర్లు చాకర్లు ఆడ మగ బానిసలూ బహూకరించాడు .
te
indictts_te_male
26.101
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05409.wav
చంద్రవర్మా సుబ్బుద్దీ , ఒకే గురువువద్ద చదువుకున్నారు అస్త్రవిద్య నేర్చుకున్నారు వారిద్దరూ ఇరవై ఏళ్లప్రాయంవాళ్లయి ఉండగా శూరవర్మ జయంతదేశం పై దండేత్తిపోతూ సేనలవెంట తన కుమారుణ్ణీ అతని స్నేహితుణ్ణీకూడా యుద్దానికి తీసుకుపోయాడు చంద్రవర్మ యుద్దంలో పాల్గొనటం అదే మొదలు .
te
indictts_te_male
16.107
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05410.wav
యుద్దం త్వరలోనే ముగిసింది జయంత దేశపు రాజైన రణజితుడు చిత్తుగా ఓడిపోయి తన కోట విడిచి అడవులలోకి వెళ్లి దాక్కున్నాడు ఆయన దాగిన స్థలం బహుకొద్దిమందికే తెలుసు .
te
indictts_te_male
10.901
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05411.wav
శూరవర్మ కోటలో ప్రవేశించిన వెంటనే రణజితమహారాజు కుమార్తె ఊర్మిళ కన్నీరు కార్చుతూ ఆయన కంట పడింది ఊర్మిళ అసాధారణమైన అందగత్తె జయంతదేశపు రాజుకు ఆమె ఒక్కతే కుమార్తె ఆమెను చూస్తూనే శూరవర్మ పెళ్ళాడ నిశ్చయించాడు తాను గెల్చిన రాజ్యంకన్నా ఊర్మిళ ఆయనకు ఎక్కువగా కనిపించింది .
te
indictts_te_male
19.488
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05412.wav
ఊర్మిళను చూడగానే చంద్రవర్మకూడా ఆమెను ప్రేమించాడు ఆమె కన్నీరు అతన్ని చాలా కలవర పరిచింది జయంత దేశాన్ని ఓడించటంలో తానుకూడా పాల్గొన్నందుకు అతనికి చాలా కష్టంవేసింది తన తండ్రి శత్రువులపట్ల , చాలా క్రూరుడు ఊర్మిళనుగాని ఆమె తండ్రినిగాని ఆయన ఎక్కడ సింహాలకు వేసిపోతాడో అని అతను చాలా భయపడ్డాడు .
te
indictts_te_male
18.741
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05413.wav
అతను అవకాశం చూసుకుని ఊర్మిళ ఉండే గదికి వెళ్ళి ఆమెతో ఓడిపోయి నందుకు విచారించకు నీ కంట నీరు కారుతుంటే నాకు చాలా భాధగా వుంది ఇది చూసేకన్నా నేను యుద్దభూమిలో దెబ్బతిని రక్తం కార్చినా ఇంత భాదపడను నా తండ్రి నా మాట తీసివెయ్యడు ఆయనతో చెప్పి మీకు మాకూ , గౌరవ ప్రదంగా ఉందే పద్దతిలో సంధి జరిగేటట్టు చూస్తాను అన్నాడు .
te
indictts_te_male
21.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05414.wav
మొదట ఊర్మిళకు చంద్రవర్మ మీద ఆదరభావం లేదు ఎందుకంటే తన తండ్రికి కష్టాలు తెచ్చిన , శత్రుకోటిలో ఈ చంద్రవర్మ కూడా ఉన్నాడు కాని అతని మాటలు వింటున్నకొద్దీ ఊర్మిళకు అతని పైన మంచి అభిప్రాయం ఏర్పడింది ఆమె క్రమంగా తన ఆశలన్నీ అతనిమీదనే పెట్టుకోసాగింది .
te
indictts_te_male
17.931
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05416.wav
ఊర్మిళను విడిచి వెళ్లటం , చంద్రవర్మకు ఇష్టంలేదు కాని తండ్రి ఆజ్ఞ శిరసావహించక తప్పదు అతను తన ప్రాణస్నేహితుడైన సుబుద్దిని పిలిచి అన్నా ఊర్మిళను వెయ్యి కళ్ళతో కనిపెట్టివుండు ఆమెకు మనం తప్ప వేరే దిక్కులేరు నాయనగారి గుండె రాతి గుండె నీకు తెలుసుకదా అందుచేత ఏ రోజు వార్తలు ఆ రోజు నాకు రహస్యంగా పంపుతూ వుండు ఊర్మిళ ఎటువంటి పరిస్థితిలోనూ విచారపడకుండా చూడవలసిన బాధ్యత నీది అని హెచ్చరించి సైనిక శిబిరానికి వెళ్ళిపోయాడు .
te
indictts_te_male
27.531
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05417.wav
కుమారుడు వెళ్ళిపోగానే శూరవర్మ ఊర్మిళవద్దకు వెళ్లి ఆమెతో చాలా మంచిగా నీవు నన్ను పగవాడిలాగా చూడనవసరంలేదు నేను మీ వంశానికిగాని రాజ్యానికిగాని ఎట్టి అపకారము చేయదలచలేదు ఒక్క షరతుపైన నేను మీ తండ్రితో సంధిచేయటానికి సిద్దంగా ఉన్నాను ఆ శరతు ఏమిటంటే నీవు నన్ను పెళ్ళాడాలి ఈ సంగతి మీ తండ్రిగారికి కబురు చేయవచ్చు అని చెప్పాడు .
te
indictts_te_male
21.696
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05418.wav
ఆ తరువాత శూరవర్మ తన భటులతో రాజకుమార్తెను , ఖైదీగా చూడవద్దనీ , కోటలో స్వేచ్చగా తిరగనిమ్మని చెప్పాడు కాని ఆయన తన నమ్మిన బంటులను ఇద్దరిని పిలిచి , ఊర్మిళతో ఎవరెవరు మాట్లాడుతారో , వేగు కాయమని హెచ్చరించాడు .
te
indictts_te_male
14.027
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05419.wav
శూరవర్మ కోరిన ప్రకారం తండ్రికి కబురు పంపామని ఊర్మిళ తమ మంత్రితో చెప్పి తనతో ఒకసారి మాట్లాడి వెళ్లమని సుబుద్దిని పిలవనంపింది సుబుద్ది ఊర్మిళా దేవి గదిలోకి వెళ్లటం చూసిన వేగులవాళ్లు శూరవర్మకి , ఈ వార్త తెలిపారు సుబుద్ధిని తక్షణం పెడరెక్కలు విరిచికట్టి ఖైదులో వెయ్యవలిసిందిగా శూరవర్మ తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు .
te
indictts_te_male
20.331
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05420.wav
మంత్రి పంపిన కబురు అంది అరణ్యంలో రహస్యంగా దాగివున్న రణజిత మహారాజు తన కోటకు రహస్య మార్గాన తిరిగివచ్చాడు తన కుమార్తెను శూరవర్మ పెళ్ళాడటానికి ఆయన ఆమోదించాడు .
te
indictts_te_male
10.581
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05421.wav
సంధిపత్రం తయారుచేయటానికి ఊర్మిళను శూరవర్మకిచ్చి వివాహం చెయ్యటానికి మంచి రోజు నిర్ణయించ బడింది .
te
indictts_te_male
6.037
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05422.wav
అక్కడ సైనిక శిబిరంలో ఉన్న చంద్రవర్మకు సుబుద్ధినుంచి ఏ వార్తా రాలేదు అతను ఆందోళన చెందాడు దీనికి తగ్గట్టుగా సైనికులలో కొన్ని పుకార్లు బయలుదేరాయి రణజితమహారాజు కోటకు తిరిగి వచ్చాడనీ , త్వరలోనే సంధి జరగబోతున్నదనీ తామంతా పాటలీపుత్రానికి తిరిగిపోవచ్చుననీ సైనికిలు చెప్పుకోసాగారు .
te
indictts_te_male
17.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05423.wav
ఒక రాత్రి చంద్రవర్మ , సామాన్య దుస్తులతో సైనిక శిబిరంనుంచి కోటకు బయలు దేరాడు దారివెంబడి జనం చెప్పుకునే మాటలను బట్టి మర్నాడే తన తండ్రి ఊర్మిళను వివాహం చేసుకోబోతున్నాడనీ రాజ ద్రోహం నేరంకింద సుబుద్ధిని ఖైదు చేశారనీ అతనికి తెలిసింది అతను కోట ప్రవేశించి నేరుగా ఖైదుకు వెళ్ళాడు అక్కడి పహరా వాళ్లతో తాను శూరవర్మ కుమారుణ్ణని , చెప్పి సుబుద్ధివద్దకు తనను తీసుకుపొమ్మన్నాడు .
te
indictts_te_male
24.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05424.wav
బాబూ మీ తండ్రిగారు ఆయనను , రేపు సింహాలకు వేస్తారు ఆయనను ఇప్పుడు పలకరించటం మంచిదికాదు అన్నారు పహరావాళ్ళు చంద్రవర్మకు ఈ మాటలు వినగానే కంపరం ఎత్తింది .
te
indictts_te_male
10.464
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05425.wav
అందుకే ఈ పూట అతనినుంచి ఒక ముఖ్యమైన రహస్యం తెలుసుకోవాలి నన్నతని దగ్గిరకి వెంటనే తీసుకుపోండి అన్నాడు చంద్రవర్మ .
te
indictts_te_male
6.56
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05426.wav
ఒక పహారావాడు చంద్రవర్మను వెంట బెట్టుకుని సుబుద్ధి ఉన్న ఖైదుకు తీసుకు వెళ్ళాడు అప్పటికి బాగాపొద్దుపోయినా యింకా సుబుద్ధి మేలుకునే ఉన్నాడు అతను మోకాళ్ల మీద , చేతులు ముడుచుకుని వాటిమీద ముఖం వాల్చుకుని గోడకు చేరగిలబడి కూచున్నాడు .
te
indictts_te_male
16.117
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05427.wav
చంద్రవర్మ సుబుద్ధీ అని పిలిచాడు సుబుద్ధి వంచిన తల ఎత్తకుండానే ఎవరు నువ్వు నీతో నాకు పనిలేదు యిక్కడనుంచి వెళ్లు అన్నాడు .
te
indictts_te_male
7.424
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05428.wav
సుబుద్ధి లేచినిలబడి చంద్రవర్మను కౌగిలించుకున్నాడు .
te
indictts_te_male
3.125
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05429.wav
మనం దుస్తులు మార్చుకుందాం నీ బదులు నేను ఖైదులో కూచుంటాను నా దుస్తులతో నువ్వు తప్పించుకో అన్నాడు చంద్రవర్మ .
te
indictts_te_male
6.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05430.wav
అసంభవం రేపు నన్ను సింహాలకు వేస్తారు అన్నాడు సుబుద్ధి .
te
indictts_te_male
3.52
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05431.wav
నీకు ఈ దుర్గతి పట్టటానికి నేనే కారకుణ్ణి నా మూలంగా నువ్వెందుకు చావాలి త్వరగా నా దుస్తులు వేసుకో అన్నాడు చంద్రవర్మ .
te
indictts_te_male
7.243
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05432.wav
ఎంతకూ సుబుద్ధి ఒప్పుకోలేదు చివరకు చంద్రవర్మ సుబుద్ధిని రాజుగా ఆజ్ఞాపించి తన దుస్తులు ధరింపజేశాడు తాను సుబుద్ధి దుస్తులు ధరించి అతనిలాగే గోడనానుకుని కూర్చున్నాడు తరువాత సుబుద్ధి బయటకి వెళ్లిపోయాడు పహారావాడు వచ్చి గోడ నానుకుని కూర్చుని ఉన్న రాజకుమారుణ్ణి చూసి ఏమీ అనుమానించకుండానే తలుపు తాళం పెట్టేశాడు .
te
indictts_te_male
19.787
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05435.wav
ఈ భయంకరమైన పోరాటాన్ని చూడ లేక ఊర్మిళాదేవి చేతితో కళ్లు మూసుకున్నది ఒక్క శూరవర్మ మినహాగా ఈ పోరాటం ఇంకెవరినీ ఉత్సాహపరచలేదు ఖైదీ ఎంతో యుక్తిగా సింహంతో పోరాడుతుండటం అతను గమనించాడు కాని సింహం ఎప్పుడు ఖైదీని జయిస్తుందా అని ఆత్రంగా చూస్తున్నాడు .
te
indictts_te_male
17.12
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05436.wav
సరిగా ఈ సమయంలో సుబుద్ధి అక్కడికి రొప్పుకుంటూ పరిగెత్తివచ్చి మహారాజా చంద్రవర్మను కాపాడండి ఆ సింహం అతన్ని చంపేస్తుంది అన్నాడు .
te
indictts_te_male
8.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05437.wav
శూరవర్మ సుబుద్ధికేసి చూసి గుర్తించాడు అయితే ఆ సింహంతో పోరాడేది సుబుద్ధి కాదన్నమాట ఆయనకు మతిపోయినట్టయింది నా కొడుకుని సింహం చంపేస్తుంది రక్షించండి అని శూరవర్మ కేకలు పెట్టసాగాడు .
te
indictts_te_male
12.149
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05438.wav
సింహంతో పోరాడేవాడు చంద్రవర్మ అని వినగానే ఊర్మిళ మొదలు నరికిన అరటిచెట్టులాగా పడిపోయింది చుట్టూ చేరిన జనంలో హాహాకారాలు చెలరేగాయి సింహం కూడా ఈ గోలకు బాగా దడుచుకున్నది అంతవరకూ అవకాశంకోసం చూస్తున్న చంద్రవర్మ దాని గుండెలో కత్తి దిగవేశాడు భీకరంగా అరుస్తూ సింహం పడిపోయి ప్రాణం వదిలింది .
te
indictts_te_male
19.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05439.wav
శూరవర్మలో పెద్దమార్పు వచ్చేసింది ఆయన తన కొడుకును కౌగిలించుకుని ఆడదానిలాగా ఏడిచాడు ఎందరినో పులులు సింహాలు చంపగాచూచి ఆనందించాడు గాని తన కొడుకునే సింహం చంపబోవటం చూసి ఆనందించానన్న బాధ ఆయన మనసులో నుంచి జీవితాంతందాకా పోలేదు ఆయన తిరిగి తన జన్మలో ఎన్నడూ యుద్దం చేయలేదు మనుషులను క్రూరమృగాలకు వెయ్యలేదు .
te
indictts_te_male
20.533
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05440.wav
చంద్రవర్మకు ఊర్మిళకు యధావిధిగా వివాహం జరిగింది అతను పాటలీ పుత్రానికీ జయంతదేశానికీకూడా రాజై చాలా కాలం పరిపాలించాడు .
te
indictts_te_male
7.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05442.wav
విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్లి శవాన్ని దించి భుజం మీద వేసుకుని ఇంకొకసారి శ్మశానంకేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని భేతాళుడు బిగ్గరిగా నవ్వి రాజా నీవు ఇంత ప్రయాసపడుతున్నప్పటికీ జరగ బోయేదాన్ని మార్చే శక్తి నీకు కొంచెమైనా లేదు ఆ సంగతి గ్రహించలేక పూర్వం కుణాళుడనే యువకుడు ప్రాణాన్ని సయితం పోగొట్టుకున్నాడు అతని కధ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్ప సాగాడు .
te
indictts_te_male
25.707
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05443.wav
పూర్వం ఒక గ్రామంలో కుణాళుడనే యువకుడుండేవాడు వాడు ఎంతో భూత దయ కలవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు వాడు రాచనగరుకు వెళ్లి ఏదైనా ఉద్యోగం చేసుకుందామనే ఉద్దేశంతో ఒకనాడు ఇంటి నుంచి బయలుదేరాడు .
te
indictts_te_male
13.387
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05445.wav
కుణాళుడు అడవి చేరేసరికి మిట్ట మధ్యాహ్నమయింది అడవిలో నీడగా చల్లగా ఉంటుంది ఎండవేడి తగ్గేదాకా ఆడుతూ పాడుతూ అడవిలోనే నడిచే ఉద్దేశంతో కుణాళుడు అడవిలోకి ప్రవేశించబోయాడు .
te
indictts_te_male
11.147
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05446.wav
సరిగ్గా ఆ సమయానికి ఒక గంభీరమైన కంఠం కుణాలా అడవిలో ప్రవేశించ వద్దు హత్య చెయ్యగలవు అని హెచ్చరించింది ఆ శబ్దం ఎటునుండి వచ్చిందో ఎంత దూరం నుండి వచ్చిందో వాడు తెలుసుకో లేకపోయాడు మొదట తనతో ఎవరో పరాచకాలాడుతున్నారనుకుని చెట్లవెనక చూశాడు ఎక్కడా ఎవరూ కనిపించలేదు .
te
indictts_te_male
17.504
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05447.wav
ముందుకు పోదామనే ఉత్సాహంలో కుణాళుడు ఈ హెచ్చరికను పాటించలేదు వాడు అడవి ప్రవేశించి చెట్ల నీడన నడవ సాగాడు ఎంతో మెత్తని స్వభావం కలవాడు గనుక ఇంకొకరిని చంపవలిసి వస్తుందేమోనని వాడు చాలాభాధపడ్డాడు కాని అడవిలో ఎవరూ తగలలేదు ఏమీ జరగకుండానే వాడు అడవి అవతలివైపు చేరాడు .
te
indictts_te_male
18.229
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05448.wav
పూర్వంలాగే మళ్ళీ కంఠం వినిపించింది కుణాలా బీడుమీదకు వెళ్లకు దేశానికి అరిష్ఠం తేగలవు ఎవర్ నువ్వు నన్నెందుకిలా బెదిరిస్తావు నీమాట నేను నమ్మను అడవిలో ప్రవేశిస్తే హత్య చేస్తానన్నావు నేనెవరినీ హత్య చేయలేదు అన్నాడు కుణాళుడు .
te
indictts_te_male
14.56
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05449.wav
హత్యచేశావు నీకు తెలియదేమో నీ పాదంకింద బడి ఒక పురుగు చచ్చిపోయింది అన్నది కంఠం .
te
indictts_te_male
5.536
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05450.wav
దానికి నేనేం చెయ్యగలను అటు వంటి పొరపాటు ఎవరివల్లనైనా జరగవచ్చు ఈ బీడుమీద ప్రవేశించినంత మాత్రాన నేను దేశానికి అరిష్టం తెస్తాననటం పచ్చి అబద్దం అంటూ కుణాళుడు ముందుకు నడక సాగించాడు .
te
indictts_te_male
13.237
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05454.wav
కణాళుడు విజయ గర్వంతో ఇప్పుడేం చెబుతావు కొండ ఎక్కాను కాని ఇంకా బతికే ఉన్నాను నీ మాటలన్నీ అబద్దాలు అన్నాడు నవ్వుతూ .
te
indictts_te_male
8.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05455.wav
పిచ్చివాడా నీతో అబద్ధం చెప్పవలిసిన , అవసరం నాకు లేదు కొండ ఎక్కినవాడు దిగాలి గదా ప్రాణాలుండగా నువ్వు ఇంకెవ్వరినీ చూడబోవు నిన్నెవరూ ప్రాణాలతో చూడబోరు అన్నది కంఠం .
te
indictts_te_male
10.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05456.wav
కుణాళుడు ఈసారి బెదిరిపోయాడు కమ్ముకువచ్చే చీకట్లో కొండ దిగడం వాడికి ప్రమాదమనిపించింది తెల్లవారే దాకా కొండమీదనే ఉందామనుకున్నాడు కాని కొంచెం ఆలోచించాక భయటపడటం అనవసరమని వాడికి తోచింది ఎందుకంటే వాడితో మాట్లాడిన ఆ కంఠం అశరీరవాణిది అయితే అది , జరగబోయే సంగతి తెలిసి మాట్లాడుతున్నది అప్పుడు తనకు చావు తప్పదు అలాంటప్పుడు చావుకోసం తాను తెల్లవారిందాకా కాచుకొని ఉండనవసరం లేదు అశరీరవాణి భవిష్యత్తు తెలియక మాట్లాడుతున్నట్టయితే అది చేసే హెచ్చరికను పాటించనవసరంలేదు .
te
indictts_te_male
29.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05457.wav
ఇలా అనుకుని కుణాళుడు చీకటిలోనే కొండదిగ నారంభించి ఒకచోట కాలు జారి చాలా లోతున పడి చనిపోయాడు తరువాత కొద్దికాలానికి అశరీరవాణి చెప్పినట్టే రాణిగారి మెడమీద ఆకుపురుగు పాకటము ఆమె మూర్చపోవటము గర్భ స్రావం కావటము రాజుగారికి మరి పిల్లలు కలగక రాజ్యం రాజుగారి తమ్ముడికి చెందటము వాడు దుర్మార్గుడై అరాచకం కలిగించటము రాజ్యం కాలక్రమాన శత్రువుల పాలు కావటమూ జరిగాయి .
te
indictts_te_male
26.645
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05458.wav
బేతాళుడీ కథ చెప్పి , రాజా నాకొక సందేహం కలిగింది అశరీరవాణి చేసిన హెచ్చరికలు పాటించకపోవటంలో కుణాళుడు తప్పు చేశాడా లేదా అతనికి హత్య చేసిన పాపము రాజ్యానికి విపత్తు కలిగించిన పాపము ఆత్మహత్య చేసుకున్న పాపము అంటుతాయా అంటవా ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసికూడా చెప్పక పోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు .
te
indictts_te_male
19.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05460.wav
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు , శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు .
te
indictts_te_male
6.187
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05462.wav
మోహనుడు తీసుకుపోయిన , భువనసుందరిని మంచిగా తిరిగి తెచ్చుకోవటానికి గ్రీకులు చేసిన యత్నం విఫలమయింది ట్రోయ్ నగరం పై దాడి వెడలటానికి తనకు సాయం రమ్మని భువనసుందరి భర్త ప్రతాపుడు గ్రీకు రాజకుమారుల నందరినీకోరాడు అతి కష్టంమీద గ్రీకు సైన్యం , నౌకలలో ఆయత్తపరచబడ్డాయి రూపధరుడు పిచ్చి నటించాడు వజ్రకాయుడు ఆడవేషంతో ఒక రాజాంతఃపురంలో దాగాడు అయినప్పటికీ వీరందరితోను చేరి గ్రీకు బలాలు ఆయత్తమై కాలక్రమాన ట్రోయ్ తీరాన్ని చెరుకున్నాయి .
te
indictts_te_male
29.771
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05463.wav
గ్రీకు నౌకలలోనుంచి తీరానికి దూకిన మొదటివాడు చంద్రప్రభుడైతే రెండవ వాడు వజ్రకాయుడు అతని వెనకనే గ్రీకు బలాలన్నీ దిగి సమరానికి తలపడ్డాయి .
te
indictts_te_male
8.597
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05464.wav
ట్రోజనులలో మరాళుడని ఒక వీరుడున్నాడు అతను కత్తితోగాని బల్లెంతో గాని చావడు ఈ మరాళుడు ఆ తొలిరోజు యుద్దంలో అనేక వందలమంది గ్రీకు యోధులను యమపురానికి పంపాడు .
te
indictts_te_male
9.643
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05465.wav
మరాళుడు చావగానే ట్రోజను సేనలు బెదిరి చెదిరి వెన్నిచ్చి ట్రోయ్ నగరానికి పారిపోయాయి ఆ తరువాత గ్రీకులు తమనావలను సముద్ర తీరాన ఒక సురక్షిత ప్రాంతాన ఉంచి ట్రోయ్ నగరపు గోడల బయట ముట్టడి చేశారు ఈ ముట్టడి పదేళ్లు సాగింది మొదటి తొమ్మిది సంవత్సరాల కాలంలో ఉభయపక్షాలకూ , మధ్య చెప్పుకో దగిన యుద్దం ఏమీ జరగలేదుగాని అనేక ఇతర సంఘటనలు జరిగాయి .
te
indictts_te_male
24.405
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05466.wav
ట్రోయ్ రాజైన , వర్ధనుడికి ఇద్దరు భార్యలు మోహనుడి తల్లి ఆయనకు రెండవ భార్య ఆయనకు కలిగిన యాభై మంది కుమారులలో పందొమ్మిది మంది అమె కన్న బిడ్డలే వారందరిలోకీ జేష్ఠుడు వీరసింహుడు ఆమెకు కలిగిన కుమారులలో ఇలియుడు ఒకడు ఇలియుడికి ఇరవై ఏళ్లు నిండినట్లయితే ట్రోయ్ నగరాన్ని ఎవరూ జయించలేరని దైవజ్ఞులు చెప్పారు .
te
indictts_te_male
21.291
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05467.wav
వర్ధనుడి కొడుకులలో వృక్షాకుడని మరొకడున్నాడు వాడు తోటలో కొమ్మలు నరికి రధాలకు పనికివచ్చే కాడి కర్రలు తయారుచేస్తూ ఉండగా రాత్రివేళ వజ్రకాయుడు రహస్యంగా నగరంలోకి ప్రవేశించి వృక్షాకుడు పని చేసుకుంటూ ఉండిన తోటకు వెళ్లి అతనిని పట్టుకుని తమ శిబిరానికి తీసుకుపోయాడు .
te
indictts_te_male
16.864
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_05468.wav
వజ్రకాయుడు , ఇలాంటి పనులింకా చేశాడు యుద్దం లేదు గ్రీకు సైనికులకు పని కూడా లేదు అందుచేత వజ్రకాయుడు ఒక సైనిక దళాన్ని వెంటబెట్టుకుని ట్రోయ్ నగరపు పరిసరాలు కొల్లగొట్ట నారంభించాడు వారు ఐడా పర్వతంమీదికి వెళ్లే సరికి అక్కడ వారికి ప్రశంసనుడు అనే వాడు తటస్థపడ్డాడు .
te
indictts_te_male
17.141
indictts_iitm
neutral
null
null
null
null