file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_06187.wav | వారం రోజులు గడిచినా కామాక్షి నెయ్యి ఇవ్వలేదు సరికదా ఆరు గేదలు ఉన్న నేను రెండు గేదెలు ఉన్న నీ దగ్గరికి నెయ్యి కి వచ్చాన అని బదలాయించింది కామాక్షి . | te | indictts_te_male | 10.336 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06188.wav | వెంటనే కామాక్షి ఆ ఊరి కరణం గారి వద్దకు వెళ్లి మీరే తీర్పు చెప్పాలి అని మీనాక్షి నెయ్యి అడిగిన విషయం చెప్పింది . | te | indictts_te_male | 8.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06189.wav | అప్పుడు కరణంగారు ఇద్దరినీ పిలిపించి నాకు జ్వరంగా ఉంది నాలుగు రోజుల తర్వాత ఇద్దరు రండి , వచ్చేటప్పుడు పాతచింతకాయ పచ్చడి తీసుకుని రండి అని ఒక గాజు పాత్ర ఇచ్చారు కరణం గారు . | te | indictts_te_male | 11.68 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06190.wav | సరేనని ఇద్దరూ వెళ్లి నాలుగు రోజుల తర్వాత మీనాక్షి గాజుపాత్రలో పాత చింతకాయపచ్చడి తెచ్చింది , కామాక్షి వేరొక పాత్రలో కొత్త చింతకాయ పచ్చడి తో వచ్చింది . | te | indictts_te_male | 10.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06191.wav | కరణం గారు ఇద్దరినీ పిలిచి ఆ పాత్రను చూపిస్తూ మీనాక్షి పొదుపుతో పాత చింతకాయ పచ్చడి దాచి పెట్టింది , గాజు పాత్రలో జాగ్రత్తగా తెచ్చింది . | te | indictts_te_male | 8.885 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06192.wav | నీలో పొదుపు లేదు అజాగ్రత్తతో గాజు పాత్ర పగిలినది కొత్త పచ్చడి తెచ్చావు . | te | indictts_te_male | 4.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06193.wav | నీకు ఆరు గేదెలు ఉన్న పొదుపు చేయలేదు , కాబట్టి నీ వద్ద నెయ్యి లేదు అన్నాడు కామాక్షి తో . | te | indictts_te_male | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06194.wav | మీనాక్షి కి నెయ్యి ఇప్పించాడు ఆ కరణం గారు . | te | indictts_te_male | 2.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06195.wav | ఈ కథలోని నీతి , పొదుపు లేకపోతే ఎంత సంపద అయిన వృధా . | te | indictts_te_male | 4.331 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06197.wav | ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు . | te | indictts_te_male | 2.4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06198.wav | అతనికి ఇతరులు సంతోషంగా ఉండడం ఇష్టముండేది కాదు . | te | indictts_te_male | 3.52 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06199.wav | ఏదో విధంగా ఇతరులను ఇబ్బంది పెట్టాలని అనుకునేవాడు , రకరకాల జంతువుల శబ్దాలు చేస్తూ రాత్రిలో ఊరంతా తిరిగేవాడు . | te | indictts_te_male | 7.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06201.wav | రామయ్యకు ఏదో విధంగా బుద్ధి చెప్పాలని ఊరివారంతా నిర్ణయించుకున్నారు , ఒకరోజు ఊరివారు రామయ్యకు సన్మాన సభకు రావలసినదిగా కబురు పంపారు . | te | indictts_te_male | 8.619 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06202.wav | ఆ విషయం రామయ్యకు అర్థం కాక ఆలోచనల నిమగ్నమయ్యాడు . | te | indictts_te_male | 4.043 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06203.wav | అదే దారి గుండా పింకీ అనే పాప వెళుతుండగా రామయ్య సన్మాన సభ గురించి చెప్పాడు . | te | indictts_te_male | 4.928 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06204.wav | అప్పుడు పింకీ రామయ్యతో నీవు చేసే జంతువుల శబ్దాలవలన ఎలాంటి దొంగల భయం లేకుండా ప్రశాంతంగా నిద్ర పోతున్నారు అని అందుకే నీకు సన్మానం చేయాలని అనుకున్నారు అని చెప్పింది . | te | indictts_te_male | 10.091 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06205.wav | ఎదుటి వారు సంతోషంగా ఉండడం ఇష్టం లేని రామయ్య ఆరోజు నుండి ఎలాంటి శబ్దాలు చేయడం లేదు , దీనితో ఊరివారు ప్రశాంతంగా నిద్రపో గలిగారు . | te | indictts_te_male | 8.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06207.wav | ఏడు చేపల కథ , అనగనగా విక్రమశ అనే రాజు గారు ఉండేవారు . | te | indictts_te_male | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06208.wav | ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు . | te | indictts_te_male | 2.197 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06209.wav | ఒకరోజు రాజకుమారులు అందరూ కలిసి సరదాగా చేపలు పట్టడానికి వెళ్ళారు . | te | indictts_te_male | 4.725 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06211.wav | అయితే , ఆ చేపలను ఇంటికి తీసుకొని వెళ్లి ఎండలో పెట్టారు . | te | indictts_te_male | 3.776 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06212.wav | ఎండలో పెట్టిన చేపల్లో ఒక చేప ఎండలేదు . | te | indictts_te_male | 2.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06213.wav | అప్పుడు రాజకుమారుడు చేప చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని అడిగాడు . | te | indictts_te_male | 4.768 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06214.wav | గడ్డివాము ఎండకు అడ్డం వచ్చింది అని అన్నది చేప . | te | indictts_te_male | 3.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06215.wav | గడ్డివాము గడ్డివాము నువ్వు ఎందుకు సూర్యుడికి అడ్డం వచ్చావు అని రాజకుమారుడు అడిగాడు . | te | indictts_te_male | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06216.wav | ఆవు నన్ను తినకుండా వదిలేసింది అని అన్నది గడ్డివాము . | te | indictts_te_male | 3.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06217.wav | రాజకుమారుడు ఆవు దగ్గరికి వెళ్లి గడ్డివాము తినలేదు ఎందుకు అని అడిగారు . | te | indictts_te_male | 4.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06218.wav | యజమాని నాకు గడ్డి వేయలేదు అని అన్నది ఆవు . | te | indictts_te_male | 3.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06219.wav | యువరాజు యజమాని దగ్గరికి వెళ్లి ఆవుకి ఎందుకు గడ్డి వేయలేదు అని అడగగా . | te | indictts_te_male | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06220.wav | నాకు మా అవ్వ అన్నం పెట్టలేదు అందుకే వెయ్యలేదు అని చెప్పాడు . | te | indictts_te_male | 3.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06221.wav | యువరాజు అవ్వను అన్నం ఎందుకు పెట్టలేదు అని అడుగగా మా ఇంట్లో నా మనుమడు ఏడుస్తున్నాడు అని చెప్పింది అవ్వ . | te | indictts_te_male | 6.752 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06224.wav | దానికి బదులుగా చీమ నా బంగారు పుట్టలో చేయి పెడితే నేను కుట్టనా అని చెప్పింది . | te | indictts_te_male | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06225.wav | మంచి యువరాజు , అనగనగా దరిక అనే రాజ్యానికి చంద్రసేనుడు మహారాజు గా ఉండేవారు . | te | indictts_te_male | 5.931 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06226.wav | ఆ రాజ్యానికి కౌసల్యాదేవి మహారాణి . | te | indictts_te_male | 2.859 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06227.wav | వీరికి ఇద్దరు సంతానం , యువరాజు కార్తికేయుడు మరియు యువరాణి మహానిక . | te | indictts_te_male | 5.024 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06228.wav | ఒకరోజు రాజుగారు తన కుమారుడైన కార్తికేయుడు తో కలిసి వేటకు బయలు దేరాడు . | te | indictts_te_male | 5.013 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06229.wav | అడవిలో ప్రయాణిస్తుండగా నది దగ్గర్లో ఉన్న గుడిసె పక్కన ముసలి వాడిని దీనంగా కూర్చోవడం గమనించాడు . | te | indictts_te_male | 6.357 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06230.wav | అది చూసిన యువరాజు అతని దగ్గరికి వెళ్లి మీరు వయసులో పెద్దవారు గా కనిపిస్తున్నారు , మీరు ఎవరు ఇలా ఎందుకు దీనంగా కూర్చున్నారు అని అడిగాడు . | te | indictts_te_male | 8.597 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06231.wav | యువరాజు వారిని గమనించిన ఆ ముసలి వ్యక్తి నా పేరు రామయ్య నేను రోజు అడవిలో చెట్లు కొట్టి వారం వారం పట్టణంలో కట్టెలు అమ్మి ఇల్లు నడిపించాను ఈరోజు కట్టెలు కొడుతుండగా దాహం వేసి నదీ తీరానికి మంచినీళ్ళు తాగడానికి వచ్చాను ఇంతలో నా కట్టెలమోపును ఎవరో ఎత్తుకెళ్లారు దీంతో ఈ వారం ఆదాయాన్ని కోల్పోయాను . | te | indictts_te_male | 20.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06232.wav | అయితే ఈ వారం ఇల్లు ఎలా నడపాలో తెలువక ఖాళీ చేతులతో కూర్చున్నాను . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06233.wav | అప్పుడు ఆ ముసలి వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న యువరాజు ఇలా అన్నాడు దిగులు చెందకు నేను దరిక రాజ్యానికి యువరాజును నా రాజ్యంలో ప్రజలు కష్టాల్లో ఉండటం నేను చూడలేదు మీరు మాతోని రండి మీకు రాజ్యంలో వ్యవసాయం చేసుకోవడానికి స్థలం ఇస్తాము ఇక మీరు వ్యవసాయం చేసుకుంటూ మీ కుటుంబంతో సంతోషంగా ఉండవచ్చు . | te | indictts_te_male | 20.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06234.wav | యువరాజు గారి మాటలు విన్న రామయ్యా ఎంతో సంతోషించాడు . | te | indictts_te_male | 3.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06235.wav | తన కుమారుని చూసి భవిష్యత్తులో ప్రజలందరిని సంతోషంగా చూసుకుంటాడని రాజుగారి గుండె ఎంతో గర్వం తో నిండి పోయింది . | te | indictts_te_male | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06236.wav | అప్పుడు రాజు వెంబడి ఉన్న సైనికులు యువరాజు గారికి జేజేలు పలికారు . | te | indictts_te_male | 4.032 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06237.wav | అన్నట్టుగానే యువరాజు గారు రాజ్యానికి తిరిగి వెళ్ళిన వెంటనే రామయ్యకి పొలం ఇచ్చారు . | te | indictts_te_male | 4.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06238.wav | దీంతో రామయ్య కుటుంబం మొత్తం రాజ్యంలో సంతోషంగా ఉండసాగారు . | te | indictts_te_male | 3.776 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06240.wav | పిసినారి పుల్లయ్య , ఒక గ్రామంలో పుల్లయ్య అనే పిసినారి ఉండేవాడు . | te | indictts_te_male | 4.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06241.wav | అతను తాతల కాలంనాటి పాతగుడిసెలో నివాసం ఉండేవాడు . | te | indictts_te_male | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06243.wav | ఐనా పుల్లయ్య ఆ గుడిసెను బాగుచేయించలేదు , ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుంది అని భయం . | te | indictts_te_male | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06244.wav | కొద్ది రోజులకు వానా కాలం వచ్చింది . | te | indictts_te_male | 2.475 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06245.wav | బాగా వానలు పడుతున్నాయి . | te | indictts_te_male | 1.579 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06247.wav | పుల్లయ్య ఒక మూలన తడుచుకుంటూ గజగజ వణుకుతూ నిలబడ్డాడు . | te | indictts_te_male | 4.576 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06248.wav | పొరిగింటి వాడైన మల్లయ్య ఏదో పని మీద బయటకు వెళుతుండగా వర్షానికి తడిచి గజగజ వణుకుతున్న పుల్లయ్య కనిపించాడు . | te | indictts_te_male | 8.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06249.wav | పుల్లయ్యతో ఎందుకు ఇంత బాధ పడుతున్నావు , గుడిసెను బాగుచేయించుకోవచ్చు కదా అన్నాడు మల్లయ్య . | te | indictts_te_male | 5.696 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06250.wav | మల్లయ్య ! నేను అలాగే చేయించుకోవాలి అనుకుంటున్నాను , కానీ ఈ వానల్లో పని ఎలా జరుగుతుంది , ఎండాకాలంలో గుడిసెను బాగుచేయిస్తాను అన్నాడు పుల్లయ్య . | te | indictts_te_male | 8.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06253.wav | కొన్ని రోజుల్లో ఎండా కాలం రానే వచ్చింది . | te | indictts_te_male | 2.347 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06254.wav | ఊరిలోని వారందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు . | te | indictts_te_male | 3.52 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06255.wav | ఒకరోజు మల్లయ్య పొలానికి పుల్లయ్య గుడిసె ముందునుండి వెళుతుండగా వానా కాలంలో జరిగిన విషయం గుర్తుకువచ్చి పుల్లయ్య ! గుడిసెను ఎప్పుడు బాగుచేపిస్తున్నావు , ఎండా కాలం వచ్చింది కదా ! అన్నాడు . | te | indictts_te_male | 11.413 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06256.wav | మల్లయ్య ! ఎండా కాలం ఇల్లు ఎలా ఉన్నాఒకటే నాకు , ఎందుకంటే పగలు పొలం పనుల్లో ఉంటాను , రాత్రికి వాకిట్లో పాడుకుంటాను . | te | indictts_te_male | 7.84 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06257.wav | ఈ మాత్రం దానికి డబ్బులు వృధా చేయడం ఎందుకు అన్నాడు పుల్లయ్య . | te | indictts_te_male | 3.765 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06258.wav | పుల్లయ్య మాటలకు మల్లయ్య ఆశ్చర్యపోయి , వానాకాలం వానలు , ఎండాకాలం అవసరం లేదు అంటావు , నీ గుడిసె బాగైనట్టే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళాడు మల్లయ్య . | te | indictts_te_male | 9.419 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06259.wav | మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది . | te | indictts_te_male | 1.824 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06260.wav | ఈ సారి గాలితోకూడిన పెద్ద వర్షాలు వచ్చాయి . | te | indictts_te_male | 2.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06261.wav | ఈ వానలకు పుల్లయ్య గుడిసె కూలిపోయింది . | te | indictts_te_male | 3.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06266.wav | దేవుడు సృష్టి , రంగాపురం అనే ఊరిలో పుల్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు . | te | indictts_te_male | 4.939 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06267.wav | అతడు ఒక రోజు పనిమీద పక్క ఊరికి నడుచుకుంటూ బయలుదేరాడు . | te | indictts_te_male | 3.861 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06268.wav | ఎండ ఎక్కువగా ఉండటం వలన కొంచెం దూరం నడిచే సరికి బాగా అలసిపోయాడు . | te | indictts_te_male | 5.611 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06269.wav | దూరంలో ఒక పెద్ద మర్రిచెట్టు కనిపించినది . | te | indictts_te_male | 2.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06270.wav | దాని నీడలో విశ్రాంతి తీసుకొని తర్వాత బయలుదేరు దాము అనుకున్నాడు . | te | indictts_te_male | 4.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06271.wav | ఆ చెట్టు వైపు వెళుతుండగా అతని కాలికి ఒక పెద్ద గుమ్మడికాయ తగిలింది , దానిని పరీక్షగా చూస్తూ ఇంత సన్నని తీగకు అంత పెద్ద కాయలు ఎలా కాస్తున్నాయి , అని ఆశ్చర్యపోతూ మర్రిచెట్టు వైపు వెళ్లాడు . | te | indictts_te_male | 12.96 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06273.wav | ఇది మరీ అన్యాయం అనుకొని గుమ్మడి తీగకు పెద్ద కాయలతో భారం మోస్తుంటే ఇంత పెద్ద చెట్టుకి చిన్న చిన్న కాయలు నేనే దేవుడిని అయితే గుమ్మడి తీగకు మర్రి కాయలు మర్రి చెట్టుకు పెద్ద గుమ్మడి కాయలు కా ఇచ్చేవాడిని అనుకుంటూ చెట్టు నీడన చెట్టు నీడన . | te | indictts_te_male | 16.427 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06274.wav | ఇంతలో గాలికి మర్రిచెట్టు కోమ్మలు కదలడం వల్ల మర్రి పండు అతడి తల పై పడింది వెంటనే , ఉలిక్కిపడి . | te | indictts_te_male | 6.432 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06275.wav | దేవుడు చాలా తెలివైనవాడు . | te | indictts_te_male | 1.643 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06277.wav | లేకపోతే మర్రిచెట్టుకు గుమ్మడికాయ అయితే నా తల బద్దలు అయిపోయింది అనుకున్నాడు . | te | indictts_te_male | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06279.wav | నీతి , ప్రకృతిని , సృష్టిని ఎవరు తప్పు పట్టరాదు . | te | indictts_te_male | 2.955 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06281.wav | అవి రెండు మంచి స్నేహంగా ఉండేవి . | te | indictts_te_male | 2.197 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06282.wav | ఒకరోజు వేటగాడు అలసిపోయి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు . | te | indictts_te_male | 4.171 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06285.wav | మంచిది అయినా హంస తన రెక్కలతో అతనికి గాలి విసర సాగింది . | te | indictts_te_male | 3.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06286.wav | అక్కడికి వచ్చిన కాకి అది చూసి వాడు వేటగాడు మనల్ని చంపుతాడు అలాంటి వాడికి సేవ చేస్తున్నావ్ ఎంత పిచ్చి దానివి అని నవ్వి అతడి మీద రెట్ట వేసి వెళ్ళిపోయింది . | te | indictts_te_male | 10.837 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06288.wav | అదే తనపై రెట్ట ఏసింది అనుకుని బాణంతో కొటి చంపాడు . | te | indictts_te_male | 3.499 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06291.wav | ఒక అడవిలో రేన అనే తోడేలు ఉండేది . | te | indictts_te_male | 2.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06292.wav | వేసవికాలంలో దానికి ఏమి ఆహారం దొరకక చాలా రోజులు గా ఆకలితో ఉంది . | te | indictts_te_male | 5.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06293.wav | మండుటెండలో కూడా ఆహారం కొరకు వెతుక్కుంటుంది దానికి తోడు ఆరోగ్యం బాగాలేక నడవలేక పోతుంది . | te | indictts_te_male | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06294.wav | ఏమైనా ఆహారం దొరికితే బాగుండు చాలా నీరసంగా ఉంది , అనుకుంటూ చుట్టుపక్కల చూస్తుంది ఆహారం కొరకు అప్పుడు దానికి ఒక ద్రాక్ష చెట్టు కనిపించినది . | te | indictts_te_male | 9.547 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06295.wav | ద్రాక్ష పళ్లను చూచి నోట్లో నీళ్ళు ఊరినవి ఎలాగైనా తీయటి ద్రాక్ష పళ్లను తిని కడుపు నింపుకోవాలి అని అనుకుంటూ ద్రాక్ష చెట్టు వద్దకు పోయింది . | te | indictts_te_male | 9.173 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06296.wav | ద్రాక్ష పళ్ళు చాలా ఎత్తుగా ఉన్నవి పైకి ఎగిరి అందుకో బోయింది , ద్రాక్ష పళ్ళు అందలేదు మళ్లీ మళ్లీ ప్రయత్నించినది ఎగురుతూ కింద పడినది . | te | indictts_te_male | 9.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06297.wav | కానీ పళ్ళు అందలేదు అప్పుడు తోడేలు ఇలా అనుకుంది ఈ ద్రాక్ష పళ్ళు చాలా పుల్లగా ఉన్నట్టున్నది ఈ పుల్లటి పండు తిని నా నోరు పాడు చేసుకోవడం ఎందుకు వేరే ఆహారం ఏమైనా వెతుక్కుంటా , అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది . | te | indictts_te_male | 12.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06300.wav | పంచమ అనే ఒక రాజ్యం కలదు , ఆ రాజ్యములోని అడవిలో ఒక చిన్న సరస్సు ఉంది ఆ సరస్సులో ఒక హంస ఉండేది . | te | indictts_te_male | 7.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06301.wav | మిగతా ఏ ప్రాణులు ఉండేవి కావు . | te | indictts_te_male | 2.347 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06302.wav | ఆ సరస్సులోని హంస బంగారు రంగులో మెరిసిపోయేది దానికి గత జన్మ రహస్యాలన్నీ తెలుసు . | te | indictts_te_male | 6.144 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06303.wav | పక్కనే ఉన్న ఊరు నుండి ఓ పేదరాలు కట్టెలు ఎరుకోవడానికి అడవికి వచ్చింది . | te | indictts_te_male | 5.355 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06304.wav | దూప కావడం వలన ఆ పేదరాలు సరస్సు దగ్గరికి వెళ్ళింది . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06305.wav | ఆమెను చూసిన హంస వెంటనే నీకు ఒక రహస్యం చెబుతాను నీవు ఇక్కడకు రా ! అని పిలిచింది . | te | indictts_te_male | 6.027 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06306.wav | పేదరాలి తో హంసా ఇలా చెప్పింది నేను నీ భర్తని చనిపోయాక హంస జన్మ ఎత్తినట్లు చెప్పింది . | te | indictts_te_male | 6.155 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06307.wav | భార్య బిడ్డలు పేదరికంలో ఉన్నారని తెలుసుకున్న హంస , రోజుకు ఒక బంగారు ఈకను సృష్టించి ఇస్తాను వచ్చి తీసుకో అని చెప్పింది హంస పేదరాలి తో . | te | indictts_te_male | 9.483 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06308.wav | అలానే తీసుకుంది పేదరాలు కొద్దిరోజుల్లోనే ఆమె ధనవంతురాలు అయిపోయింది . | te | indictts_te_male | 4.491 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06309.wav | పెద్ద ఇల్లు కట్టుకుని బిడ్డలతో సంతోషంగా ఉంది . | te | indictts_te_male | 3.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06310.wav | కొన్ని రోజులకు ఒక దురాశ కలిగింది హంస రోజుకు ఒక బంగారు ఈకను మాత్రమే ఇస్తుంది . | te | indictts_te_male | 5.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06311.wav | అలా కాక దాని ఒంటి మీద ఉన్న ఈకలన్నీ ఒకేసారి తీసుకుంటే మళ్లీ కొత్త ఈకలు పుడతాయి అనుకుంది మనసులో . | te | indictts_te_male | 6.677 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06313.wav | ఆ ఈకలు బూడిదలా మారాయి , బంగారం సృష్టించే శక్తిని కోల్పోయింది హంస మళ్లీ ఆమె పేదరాలి గా మారింది . | te | indictts_te_male | 7.499 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.