id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
2858
అలుక యిదేమిరా! వెగటులాడకురా! దయతోడ జూడరా! పలుక విదేలరా! గడుసు పల్కులెఱుంగని చిన్నదానరా! చెలిమిఁ దలంపరా! మనవి చేకొనరా వినరా మనోహరా! చెలువుఁడ యన్న నీ నెనరు చిత్తము వాయదు సుందరీమణీ!
5
champakamaala
870
వనజాక్ష భక్తవత్సల ఘనులగు త్రైమూర్తులందుఁ గరుణానిధివై కన నీ సద్గుణజాలము సనకాది మునీంద్రు లెన్నఁ జాలరు కృష్ణా.
1
kandamu
3996
_x000D_ నే నెవ్వండని వలపడు _x000D_ మానసమునఁ బుడమిలోని మనుజుండటరా _x000D_ కానడు తనశవమును దా _x000D_ మానుగఁ గనుగొనుట యెట్లు మహిలో వేమా.
1
kandamu
1783
సుదతి వెన్నెలపిండు జూచిన కడు తాపమందును జూడరాదనుచు బల్కువిరులు దురుమగరాదు వెలదిరో యతనుని శరజాలములటంచు చేరి పల్కుగంధ మలదగరాదు గంధవాహుండల్గి యదర వీవగ వేడియనుచు బల్కునిటు దలపోయుచున్నది యింతి మరుని దాడికిని వెఱచి నిను మది దలచితలచి
3
seesamu
4292
పరిమళముం బ్రభావము శుభస్థితి నిత్యవిభూతి విభ్రమ స్ఫురణము దివ్యవైభవము భోగము శ్రీయలమేలుమంగ నీ యురమున నంచు సన్మునులు యోగిజనంబులు మెచ్చి మెచ్చి నీ వరవనితాశిరోమణి నవారణఁ గొల్తురు వేంకటేశ్వరా!
5
champakamaala
865
ఇరువదొకమాఱు నృపతుల శిరములు ఖండించితౌర చేగొడ్డంట\న్‌ ధరఁ గశ్యపునకు నిచ్చియుఁ బరఁగవె జమదగ్ని రామభద్రుడ కృష్ణా.
1
kandamu
781
వరసౌందర్యవివేకధైర్యనయనావాత్సల్యధౌరేయుఁ డీ ధరణీనాయకరత్న మంచు మహితార్థంబాశ్రితశ్రేణికి\న్‌ స్థిరసామ్రాజ్యవిభుత్వ మాధ్రువునికి\న్‌ దేజంబుగానిచ్చి తా సరణి\న్‌ మీకృప గల్గువాఁ డగుట కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
4128
_x000D_ బోడితలల జడల బూడిదెపూఁతల _x000D_ భాషణాసనముల వేషములను _x000D_ యోగిగాఁడు లోన బాగుగాకుండెనా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4221
_x000D_ కచ్చమీఁద నాస కనకంబుపై నాస _x000D_ లేనివాఁడు పుడమి లేనివాఁడు _x000D_ కలిగెనేని యతఁడు గానంగ రాఁడయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3183
_x000D_ తను వలచినఁదా వలచును _x000D_ దను వలవక యున్నఁదన్ను దా వలవడిల\న్‌ _x000D_ దనదు పటాటోపంబులు _x000D_ తనమాయలు పనికిరావు ధరలో వేమా.
1
kandamu
2920
నునుమునిపంటఁ గ్రొంబెదవి నొక్కి యనంగునికేళి నీదు మై పెనఁగొని నొక్కి క్రిక్కిరిసి పెక్కువ నెక్కువ పిక్కటిల్లఁ జ- క్కని చనుగుబ్బలంటి బిగికౌఁగిటఁ జిక్కిననాఁడె జన్మమె- త్తిన ఫలమబ్బె నేమయిన దిట్టము మాకిక సుందరీమణీ!
5
champakamaala
372
ఆఘంటాపథపద్ధతిన్ శివశివే త్యాలాపసంశీలులై రేఘస్రంబులు ద్రోచు పుణ్యతము లుర్విన్ బ్రహ్మహత్యాద్యనే- కాఘౌఘంబులు వాసి తావకపదప్రాప్తిన్ విడంబింతురౌ ద్రాఘిష్ఠప్రభుతాగుణోల్లాసన! భర్గా! పార్వతీవల్లభా!
7
saardulamu
4127
_x000D_ ఆకులెల్లఁదిన్న మేఁకపోతుల కేల _x000D_ గాకపోవునయ్య కాయసిద్ధి _x000D_ లోకులెల్ల వెఱ్ఱి పోకళ్ళఁ బోదురు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2729
తనయుం గాంచి ధనంబు వాడి దివిజస్థానంబు గట్టించి వి ప్రున కుద్వాహముఁ జేసి సత్కృతికిఁ బాత్రుండై తటాకంబు నే ర్పునఁ ద్రవ్వించి వనంబు బెట్టి మననీ పోలేఁడు నీ సేవజే సిన పుణ్యాత్ముఁడు పోవు లోకమునకున్‌ శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
3112
_x000D_ చమురు గలుగు దివ్వె సరవితో మండును _x000D_ చమురు లేని దివ్వె సమసి పోవు _x000D_ తనువు తీఱె నేని తలపు తోడనె తీరు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1852
జాల మదికింపుమాటల సరసిజాక్షి | మగని వలపింపదగినట్టి మందయాననెలత నేలుట తగునయ్య నెనరుతోడ | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
3193
_x000D_ సజ్జనముల చెలిమి చాలింపఁగా రాదు _x000D_ ప్రకృతి నెఱుఁగకున్న భక్తిలేదు _x000D_ పలువ లెట్టిరీతి భక్తి సల్పుదురయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3277
_x000D_ తలపఁగ మూలమందు పరతత్త్వము దెల్పఁగ పాటుగాదు లో _x000D_ బలిమిని నాత్మగుట్టు మది భావననెంచగ బ్రహ్మకల్పము\న్‌ _x000D_ గలుగును ముక్తి జీవులకుఁ గావున నాత్మవిధానదృశ్య మీ _x000D_ సలలిత శక్తిరూపు నిను సన్నుతి వేమన చేసె కల్పమున్‌.
5
champakamaala
3331
_x000D_ మర్మమంతగొనకు మనసైన్యమేగాన _x000D_ పరరహస్య మంత బయలుపడదు _x000D_ పడినమనస దెన్న బయలుపడినరీతి _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3817
_x000D_ ఆఁడు దానిబొంకు గోడపెట్టినయట్టు _x000D_ పురుషవరుని బొంకు పూలతడిక _x000D_ స్త్రీలనేర్పులు భువి చీకు రాయితపము _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3761
_x000D_ కురుపులు గండముల్‌ కఠినకష్టపు రోగము లెన్నివచ్చిన\న్‌ _x000D_ గరిమను జీవరాసులకు గట్టిగ నాయువు గల్గినంత వే _x000D_ మరు వగవంగ నేల క్షుధమాయను లేదననేల మూఢుఁడై _x000D_ యరయ దయాళుఁడైన పరమాత్ముఁడె యొక్కఁడు దిక్కు వేమా.
5
champakamaala
237
గర్గాగస్త్య వసిష్ఠశుక మార్కండేయగాధేయు లం- తర్గాఢాధికశత్రుశిక్షణకళాధౌరేయతాబుద్ధి సం- సర్గప్రక్రియ మిమ్ముఁ గొల్తురుగదా క్ష్మాకన్యకోరోజస- న్మార్గస్ఫాయదురఃకవాటతట! రామా! భక్తమందారమా!
4
mattebhamu
2701
పుడమిన్నిన్నొక బిల్వపత్త్రమున నేఁ బూజించి పుణ్యంబునుం బడయన్నేరక పెక్కుదైవములకుం బప్పుల్‌ ప్రసాదంబులుం గుడుముల్‌ దోసెలు సారెసత్తులడుకుల్‌ గుగ్గిళ్లునుం బెట్టుచుం జెడి యెందుం గొఱగాకపోదురకటా! శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
541
శిరములు వేయిగల్గు నహిశేఖరుఁడైన చతుర్ముఖంబులన్ బరగు విధాతయైన సులభంబుగ నొక్కిసుమంతయైన నీ చరితము లెన్నఁజాలరట శక్తులమే మముబోంట్ల మెన్నఁగాఁ జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
1508
వచ్చి మనసిచ్చి ననుమెచ్చి వలపులెచ్చి । కరుణతో మచ్చికను గ్రుచ్చి కౌగలిచ్చి కలయికకుజొచ్చినట్టి నీ ఘనత దలప । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
2867
నేటికి నిండె నా తపము నిక్కమటంచు సుఖించి యుంటి, స- య్యాటల నాటపాటల నొయారపుదేటల ముద్దుమాటలన్ గూటమి నేలు నిన్నుఁ గని కోమలి! నిన్నెడబాసి యుంటి నీ- నాఁటికి నేది మున్నెడ నొనర్చితినో యిట సుందరీమణీ!
6
vutpalamaala
894
తటతట లేటికిఁ జేసెదు కటకట పరమాత్మ నీవు ఘంటాకర్ణు\న్‌ ఎటువలె పుణ్యునిఁ జేసితి వటువలె రక్షింపుమయ్య యచ్యుత కృష్ణా.
1
kandamu
396
సుగుణోద్దామమహాకవింద్రఘటితాక్షుద్రప్రబంధావళుల్ జగదుద్దండపరాక్రమక్రమవిరాజద్భూమిభృన్మౌళికిన్ దగుఁ గా కల్పుల కొప్పునే? కరికి ముక్తాకాయమానంబు సొం పగుఁ గా కొప్పునే యూరఁబందులకు? భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
3662
_x000D_ తామసేంద్రియములఁ దనర జయించిన _x000D_ తత్వ మరసి చూడఁ దాన యగును _x000D_ రాజయోగి యిట్లు తేజరిల్లుచు నుండు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1606
గరిమన్‌ మాల్యవదాది రాక్షసు లసంఖ్యాతంబుగా వచ్చి యం బరవీథిం జలరాశిమధ్యమున దర్పం బేర్పడం దాకినన్‌ గిరిరాజంబును కందుకంబు కరణిన్‌ గేలన్‌ రహిం దాల్చి దు ర్భరవీర్యంబున వారిఁ జంపి జముఁ గొల్వం బంపవే మారుతీ!
4
mattebhamu
3872
_x000D_ దేవభూములందు దేవాలయములందు _x000D_ దేవుఁడంచుఁ జెప్పి తెరువుఁజూపె _x000D_ తెలియ విశ్వమెల్ల దేవాది దేవుఁడౌ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
350
సకలాధీశుఁడ వెన్న నీవొక్కఁడవే సత్యంబు సత్యంబు కొం- చక యంతర్బహిరుజ్జ్వలద్భువనరక్షాదీక్షఁ గాకోల ము- త్సుకతం గంఠమునందుఁ దాల్చితివి మెచ్చుల్మీఱఁ గ్రూరాత్ములై యకటా! మూఢు లెఱుంగఁజాలరిది భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
1222
నోరెత్తి మాటలాడకు మాఱాడకు కోపపడిన మర్యాదలలో గోరంత తప్పి తిరుగక మీఱకుమీ యత్తపనుల మెలఁగు కుమారీ!
1
kandamu
1007
ఒరుల భాగ్యము సూచి యోర్వఁజాలనివాడు | బుధజనద్వేషంబు పూనువాఁడు చెలిమిమైఁ దల్లిదండ్రులను బ్రోవనివాఁడు | పరకామినుల కాసపడెడివాఁడు శివవిష్ణుదూషణల్ సేయుచుండెడివాఁడు | పలుమఱు కొండెముల్ పలుకువాఁడు భూసుపర్వక్షేత్రములు మ్రింగఁజూచువాఁ | డాడినమాట లేదనెడువాఁడు
3
seesamu
4363
అవనీశ్వరుఁడు మందుఁడైన నర్థుల కియ్య- । వద్దని వద్ది దివాను చెప్పు మునిషీ యొకడు చెప్పు మొనసి బక్షీ చెప్పుఁ । దరువాత నా మజుందారు చెప్పుఁ దల ద్రిప్పుచును శిరస్తా చెప్పు వెంటనే । కేలు మొగిడ్చి వకీలు చెప్పు దేశపాండ్యా తాను దినవలెనని చెప్పు । ముసరద్ది చెవిలోన మొనసి చెప్పు
3
seesamu
1493
కలగంటినే రేయి కలహంసగామిని । ప్రేమచే నను చేరబిలిచినటుల బలుకకుండిన చెయ్యి బట్టుక నింత మీ- । కలుకలేమంచు నన్నడిగినటుల- నపుడు నే కసరిన నౌనౌను నిటుల సే- । నా గలదని కేరి నవ్వినటుల- నంతట నే సుంత ననుమతించగనె యొ- । ద్దికను పూశయ్యకు దీసినటుల-
3
seesamu
1637
తనయుని మీఁది బాళి మదిఁ దాఁకినచో నుపవాస మీశ్వరా- ర్చనమును నోములాదియగు సత్క్రియలెల్లను జేయుచో నెదం బెనఁగిన ప్రేమమై నొగిఁ దపింపఁగ నోర్చుచు సౌఖ్యమేమి నె- మ్మనమున నాస పాల్పడని మానినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
3019
తగనెఱుంగవె కృష్ణావతార మహిమ | యింతవాడని నా గుణ మెఱుగలేవెతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన.
2
teytageethi
4130
_x000D_ కాలు చేయి వంచి గాలి నిండఁగఁజేర్చి _x000D_ నేలవ్రాలి కొన్ని నిలిచికొన్ని _x000D_ యాసనముఖవిద్య లభ్యాస విద్యలు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4567
నిత్య యుదాత్తసత్య! యతినిశ్చల జంగమ భృత్య! సజ్జన స్తుత్య! కృపాకటాక్ష పరిశోభితచైత్య! మహిష్ఠ భక్తి సం గత్యభిరామ సత్య! గురుకార్య పరాయణకృత్య! వర్జిత వ్రాత్య! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
703
కరములు మీకు మ్రొక్కులిడఁ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ స్మరణఁ దనర్ప వీనులు భవత్కథలన్‌ వినుచుండ నాస మీ యఱుతనుబెట్టు పూసరుల కాసగొనం బరమార్థ సాధనో త్కరమిది చేయవే కృపను దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
3176
_x000D_ మనసునందు ముక్తిమలయుచు నుండంగ _x000D_ మనసు లెఱుఁగలేక మనుజులెల్ల _x000D_ మనసు నంటలేక మాయమై పోదురు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1839
కలికి కీల్జడ సాటి గానోపకను భోగి కాలకంఠుని చేత కట్టుబడియెపద్మంబు చెలి ముఖపద్మంబునకు నోడి హరిణచయంబుల నాదుకొనియెవజ్రంబు చెలి దంతవరరుచులకు నోడి పాకశాసను చేత బట్టువడియెరామతో నడ సరిరా నోడి రాయంచ వనజసంభవునకు వాహమయ్యె
3
seesamu
4025
_x000D_ కూటవాసి యగుచు గుణములఁ బచరించి _x000D_ నీటనీడవలెను నిలిచియుండు _x000D_ నుదకఘటములందు నొగిఁదోఁచుటే గాని _x000D_ సూర్యుఁడొకఁడు గాఁడె చూడ వేమ.
0
aataveladi
4634
ఎన్నఁగ జంగమంబుఁ దన యింటికి నెప్పుడు వచ్చునప్డు దాఁ గన్నము వెట్టితెచ్చి యధికంబగు నర్థము వానికిచ్చు నా కన్నడబ్రహ్మ సంయమికి గాదిలిభృత్యుఁడవైన నిన్ను శ శ్వన్నుతులన్‌ భజింతు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
2802
నవ్వకుమీ సభ లోపల నవ్వకుమీ తల్లిదండ్రి నాథుల తోడన్‌ నవ్వకుమీ పరసతితో నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!
1
kandamu
2660
చనువారిం గని యేడ్చువారు జముఁడా సత్యంబుగా వత్తు మే మనుమానంబిఁకలేదు నమ్మమని తారావేళ నా రేవునన్‌ మునుఁగంబోవుచు బాససేయుటసుమీ ముమ్మాటికింజూడఁగాఁ జెనఁటుల్గానరు దీని భావమిదివో శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
2948
సన్నజాజుల సొబగెన్ననేమిటికి నా పతి నన్ను విడనాడి పల్కనపుడురమణిరో కృష్ణుడు రాడాయెనని మది తళ్కు చీరయు గట్ట దలంపురాదువనితరో నా యేడువారాల సొమ్ముల బరిణె విప్పను నాకు భ్రాంతి లేదుఆభరణాలంకృతాంగినై యేనున్న ఫలమేమి కృష్ణుడు వలచిరాడు
3
seesamu
4026
_x000D_ ప్రాఁతచేసిన నర్తనల్‌ పదటఁగలిపి _x000D_ క్రొత్తనర్తనఁ జేతురు కోడెకాండ్రు _x000D_ కన్నతల్లిని విడనాడి కష్టపెట్టి _x000D_ యన్యకాంతలఁ బోషించునట్లు వేమ.
2
teytageethi
2258
క్షితిలోఁ దామును బ్రహ్మసృష్టికిఁ బునస్సృష్టిన్ వినిర్మించియున్ గ్రతువిఘ్నం బొనరించు దానవుల వీఁకం దోలఁగా లేక నాఁ డతిబాలున్ నినుఁ దోడు తోడుకొనిపోఁడా గాధిసూనుండు నీ ప్రతివీరాగ్రణి యెవ్వఁ డింక? రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
3054
పతి నన్ను గూర్చరే రతికరువు దీర్చరే మదితాప మార్చరే మగువలారచాన మేలెంచరే జాగు చాలించరే నన్ను లాలించరే కన్యలారకపటంబు వీడరే కరుణతో జూడరే కోరికల దీర్చరే కొమ్మలారవిభు దార్చి గావరే వేడుకల్ సేయరే యిదివేళ బ్రోవరే యింతులార
3
seesamu
3018
చెంగల్వకొలనిలో శృంగారసతులెల్ల జలక్రీడలాడిన జాడ గంటిసిగ్గులేకను బట్టుచీరలన్నియు విప్పిపెట్టిన జాడ నేనట్టె గంటి మగువరోయా చీరమడతలన్నియు గొని చెలియరో యా పొన్నచెట్ల నిడితి భామఅందఱు గూడి బట్టబైలను నిల్చి ముమ్మారు మ్రొక్కిరి ముద్దుగాను
3
seesamu
1820
జెలగి మొనసియు రతిగూడు చిన్నెలన్ని | మఱచియున్నాడొ దెల్పవే మగువ యనుచునన్ను బనిచిన వచ్చితి నలిననాభ | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
1167
ధనవంతులైన బహు స జ్జనులైనను నీకు మిగుల సమ్మతులై యు న్నను సతి జనకుని గృహమం దున నుండుట తగదు కీర్తి తొలఁగుఁ గుమారా!
1
kandamu
231
అతసీపుష్పసమానకోమలవినీలాంగున్ సముద్యన్మహో- న్నతకోదండనిషంగగంగు బలవన్నక్తంచరాఖర్వప- ర్వతజీమూతతురంగుఁ గింకరజనవ్రాతావనాత్యంతర- మ్యతరాపాంగుని నిన్ భజింతు మది రామా! భక్తమందారమా!
4
mattebhamu
1115
ఉన్నను లేకున్నను పై కెన్నఁడు మర్మంబుఁ దెలుప నేగకుమీ నీ కన్న తలిదండ్రుల యశం బెన్నఁబడెడు మాడ్కిఁ దిరుగు మెలమిఁ గుమారా!
1
kandamu
278
సరసుం డాతఁడు పెద్ద యాతఁడు మహాసౌందర్యవంతుం డతం డరిహృద్భీకరశౌర్యధుర్యుఁ డతఁ డుద్యద్దానకర్ణుం డతం డురుగోత్రోద్భవుఁ డాత డెవ్వడిల నుద్యోగార్థసంపన్నుఁడౌ మరుదీశోపలనీలమూర్తి ధర! రామా! భక్తమందారమా!
4
mattebhamu
4113
_x000D_ పురహరునకు నేఁతపరువు తానేసిన _x000D_ స్థిరముగల్గు జ్ఞానజీవ మయ్యె _x000D_ నేత కేమివచ్చె నిజభక్తి హేతువు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3819
_x000D_ కండలెల్లఁ గోయ కావికిఁజాలని _x000D_ బండగోవు కాసపడినఁ గలదె _x000D_ కొండఁ బసిఁడి కొండ గోరిన చందమౌ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4255
అందవు కోసి యిమ్ము విరు లంచును జే రలమేలుమంగ ని న్నందగఁగోరఁ జెక్కులటు నొక్కిన నాకును నందవంచు న య్యిందుముఖిం బ్రియంబలర నెత్తుచుఁ బువ్వులు కోయఁజేయ ని ష్యందమరందఘర్మరససంగతు లబ్బెను వేంకటేశ్వరా!
6
vutpalamaala
1
శ్రీమదనంత లక్ష్మీ యుతోరః స్థల- చతురాననాండ పూరిత పిచండ ధర చక్ర ఖడ్గ గదా శరాసనహస్త- నిఖిల వేదాంత వర్ణిత చరిత్ర సకల పావన నదీ జనక పాదాంభోజ- దమణీయ ఖగకులోత్తమ తురంగ మణి సౌధవ త్ఫణామండ లోరగతల్ప- వరకల్పకోద్యాన వన విహార
3
seesamu
127
జపతపోనిష్ఠుఁడౌ జమదగ్ని కుదయించి- కరము దారుణవృత్తిఁ గత్తి కట్టి కినుక రాజద్రోహమునకు శంకింపక- సకలభూపతుల గొంతుకలు గోసి కార్తవీర్యార్జును కరసహస్రం బొండు- తఱి గండ్రగొడ్డంట నఱికివైచి వసుధపై రక్తప్రవాహంబు లొనరించి- తజ్జలంబులఁ బితృతర్పణములు
3
seesamu
3773
_x000D_ తనువు లస్థిరములు ధర్మము నిత్యము _x000D_ చేయుధర్మమెల్ల చెడని పదవి _x000D_ కనివిని మఱి తెలియఁ గానరు నరపశుల్‌ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4385
కనుముక్కుతీరు చక్కనికాంతి పొందిన । శుభలక్షణంబులు సూక్ష్మబుద్ధి ఘనత వివేకవిక్రమము బాంధవ్యంబు । మర్మవిలాసంబు మానుషంబు సరసవాచాలత సాహసం బొకవేళ । విద్యావిచక్షణ విప్రపూజ వితరణగుణము భూపతియందు భయభక్తి । నీతియు సర్వంబు నేర్చునోర్పు స్నానసంధ్యాద్యనుష్ఠానసంపన్నత । గాంభీర్యము పరోపకారచింత
3
seesamu
90
యేమి యాలస్య మిది నీకు నేల సకల-జంతుసంతాన రక్షావిచక్షణునకు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
2843
వెలయాలు సేయు బాసలు వెలయఁగ నగసాలిపొందు వెలమల చెలిమియున్‌ గలలోనఁ గన్న కలిమియు విలసితముగ నమ్మరాదు వినురా సుమతీ.
1
kandamu
2317
ఇల నీ మీఁదను జాలభక్తిగలవాఁ డేచెట్టవాఁడైన నే ఖలుఁడైనం దుది నుత్తమోత్తముఁడగున్ గాదన్నఁ గొంగీడ్చెదన్ దెలుప న్నిల్చిన నాడుకొన్న పరవాదిన్ గెల్చెదన్ వేదశా స్త్ర లసద్వాక్యనుత ప్రతాప! రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
787
వెఱచైన\న్‌ మఱచైనఁ గార్యముతఱి\న్‌ వేసారుచున్నైన యా దరమొప్పైనను మాయనైన నృపతుల్‌ దండింపఁగా నైనను\న్‌ పరిహాసంబుననైన మిమ్మునుడువ\న్‌ బ్రాపించు పుణ్యాత్మకుల్‌ నరకావాసముఁ జేరరా ఘనులు కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
4553
గానరసప్రవీణ! గతకాల వితాన! సమస్త భక్తస న్మాన! మహాకులీన! యసమాన చరాచర రూపభేద సం ధాన! జితాభిమాన! తనుధర్మవిహీన! మహాప్రదాన! దే వా ననుఁ గావుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
232
ఆర్తత్రాణపరాయణుండవని నిన్నత్యంతమున్ సజ్జను- ల్గీర్తింపన్ విని తావకీన పదనాళీకద్వయంబాత్మ వి- స్ఫూర్తిం జెందఁగ నెంతు నెల్లపుడు నన్బోషింపుమీ సత్కృపన్ మార్తాండద్విజరాజసన్నయన! రామా! భక్తమందారమా!
7
saardulamu
4461
విద్యాధికుల రాజు వివరించి నిలిపెనా । యిందఱేమిటికంచుఁ గుందుచుండు మోమీను కుగ్రాణమును జెప్ప నొడ్లగిం- । జలకు బరాతముల్ సరవి వ్రాయు తిండికిఁ జేటుగాఁ బండితులేల తె- । ప్పున సెలవిమ్మని పోరుచుండు బారిశాల్వలు దెచ్చి బహుమతినిమ్మన్నఁ । తలపక సీమవస్త్రముల నిచ్చు
3
seesamu
3723
_x000D_ కుక్క తిన్నవాఁడు గురిలింగ జంగంబు _x000D_ పంది తిన్నవాఁడు పరమయోగి _x000D_ యేన్గుతిన్నవాఁడు నెంతసుజ్ఞానిరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1805
పలుమరు మేల్‍జరీ పైటకొంగున గట్టివలపు నిల్పగలేనె వనిత యనుచుజెలరేగి నీ ముద్దుజెక్కులపై నొక్కి ముద్దుబెట్టనియవె ముదితయనుచుకనకాంగి నీ బిగికౌఁగిట నను జేర్చి మనసియ్యరాదటే మగువ యనుచుకొమరొప్ప నీ కుల్కుగుబ్బలపై నాట గోరులుంచగనీవె కొమ్మ యనుచు
3
seesamu
2022
నిను వర్ణింపని నీచబంధమతి దా నిర్మగ్నమూఢాత్ముఁడై పెనుదైవంబులఁ గోరి తా మనమునన్‌ సేవించుచందంబు తా నవలం బారిన భూతియందు వెలయ న్నాజ్యాహుతుల్‌ పూని వే ల్చిన చందంబున వ్యర్థమై తనరు జూ చిద్రూప నారాయణా!
4
mattebhamu
4455
వాగ్భూషణంబు నీ వర్ణన సేయుట । కర్ణభూషణము నీ కథలు వినుట హస్తభూషణము నీ కర్చన సేయుట । నేత్రభూషణము నీ నీటు గనుట హృదయభూషణము నిన్మదిఁ బాయకుండుట । మూర్ధభూషణము నిన్ మ్రొక్కుటరయ అంఘ్రిభూషణము నీ యానందనిలయప్ర । దక్షిణం బేగుట ధర్మచరిత!
3
seesamu
3169
_x000D_ కడుపునిండ సుధను గ్రమముతోఁ ద్రావిన _x000D_ బాలమీఁద నేల పాఱు మనసు? _x000D_ తత్వ మెఱుఁగువెనుక తన్వంగు లేటికో? _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3549
_x000D_ ఆడు పాపజాతి యన్నిటికంటెను _x000D_ ఆశచేత యతులు మోసపోరె _x000D_ చూచి విడుచువారు శుద్ధాత్ములెందును _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1453
చిలకముక్కున కాటు జెందని బింబంబు । పొగలేక నిల్చు కప్పురపు దివ్వె కోయిల నొక్కుగా కొరకని చిగురాకు । ఘాటింపు పచ్చిమరాటి మొగ్గ తుమ్మెద వ్రాలని కమ్మదామరపువ్వు । నవకమౌ మేల్దవనంపు మొల్క సానపై దీరిన జాతివజ్రపురవ । వాసించు గోవజవాజి భరణి
3
seesamu
1971
అన్నా కృష్ణమ నేడు వేల్పులకు మీఁదన్నార మీచట్లలో వెన్నల్‌ ముట్టకు మన్న నాక్షణమున న్విశ్వాకృతిస్ఫూర్తి వై యున్నన్‌ దిక్కులు చూచుచున్‌ బెగడి నిన్నోలి న్నుతుల్‌ సేయుచున్‌ గన్నుల్‌ మూయ యశోదకున్‌ జిఱుత వై కన్పింతు, నారాయణా!
7
saardulamu
3759
_x000D_ ఇహమునందు నేమి యిడుములఁ బడినను _x000D_ పరమ సాధనార్హ పదవి గాదు _x000D_ పరులుకారు నెట్టి వెరవునఁ జూచిన _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3748
_x000D_ సోమయాజిని బట్టి సొడ్డు వేసెను రంభ _x000D_ యందె సోమయా జనంగఁబట్టి _x000D_ క్రతువుఁజేయు ఫలము గల్గెరా చేసెఁత _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2108
జందెమింపుగ వేసి సంధ్య వార్చిన నేమి - బ్రహ్మ మందక కాఁడు బ్రాహ్మణుండు తిరుమణి శ్రీచూర్ణగురురేఖ లిడినను - విష్ణు నొందక కాఁడు వైష్ణవుండు బూదిని నుదుటను బూసికొనిన నేమి - శంభు నొందక కాఁడు శైవజనుఁడు కాషాయ వస్త్రాలుగట్టి కప్పిన నేమి - యాశ పోవక కాఁడు యతివరుండు
3
seesamu
3821
_x000D_ అష్టకష్టు బ్రదుకు నగ్నిపాలై పోవు _x000D_ నిర్దయాత్ము బ్రతుకు నీటఁగలియు _x000D_ క్రూరకర్ముబ్రతుకు చోరులపాలౌను _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2239
కొంకం గారణ మేమి ధర్మములు పెక్కుల్ చేసి మర్త్యుండు నీ వంకం జిత్తము నిల్పలేక పెరత్రోవల్ త్రొక్కినన్ సర్వముం బొంకై పోవుఁ; గురంగనేత్ర తగునోముల్ వేయునున్ నోచి తా ఱంకాడంగఁ దొడంగినట్లు రఘువీరా! జానకీనాయకా!
7
saardulamu
455
చక్కఁదలంపఁగా విధివశంబున నల్పుని చేతనైనఁ దా; జిక్కి యవస్థలం బొరలుఁ జెప్పఁగరాని మహాబలాఢ్యుఁడున్‌ మిక్కిలి సత్త్వ సంపదల మీఱిన గంధగజంబు మావటీఁ డెక్కి యదల్చి కొట్టి కుదియించిన నుండదె యోర్చి భాస్కరా!
6
vutpalamaala
2133
బొందిలో నుండు ప్రాణముల్‌ పోయినంతఁ - గాటికే గాని కొఱగాదు గవ్వకైన భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
3204
_x000D_ పరగ రాతిగుండు పగులఁగొట్టఁగ వచ్చుఁ _x000D_ గొండలన్ని పిండిగొట్టవచ్చు _x000D_ కఠినచిత్తు మనసు కరగింప రాదయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
985
కరణాలటంటను కైలకట్టల యిప్పి | పాతికలంటను పరిగలంట కాన్లంట గీన్లంట కలయి లేనియి కొన్ని | సెల్లులు బాకీలు సెప్పుకొంట బిరబిర గంటాలు గిరగిర దిప్పుతా | నాకులన్నియు నెడ గోఁకుకుంట యెగరాసి దిగరాసి సగమేసి యెగదొబ్బి | కొంపలు పడదోసి సంపుతారు
3
seesamu
2023
నిను వర్ణింపని జిహ్వ దాఁ బదటికా? నీలాభ్రదేహాంగకా నిను నాలింపని చెవ్లు దాఁ బదటికా? నీరేజపత్రేక్షణా నినుఁ బూజింపని కేలు దాఁ బదటికా? నిర్వాహకక్ష్మాతలా నినుఁ జింతింపని యాత్మ దాఁ బదటికా? నిర్వాణ నారాయణా!
4
mattebhamu
1903
అతనుడు చలపట్టి యతివపై దండెత్తి యనిలరథంబెక్కి యళులగములుచేరి కొల్వగ మేటిచిలుకగుర్రపుపౌజు తఱుచుగా వెనువెంట దగిలి నడువగోర్వంక లిరుగడ కొల్చి భటావళి కైవారములు సేయగాను మందుతమ్మిఫిరంగుల దమ్మున పుప్పొడిమందు వెట్టుడు బొండుమల్లెగుండ్లు
3
seesamu
3259
_x000D_ పనితొడవులు వేఱు బంగార మొక్కటి _x000D_ పరగ ఘటము వేఱు ప్రాణమొకటి _x000D_ అరయఁ దిండ్లు వేఱు ఆఁకలి యొక్కటి _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
807
ప్రారబ్ధానుభవంబు దీఱ కపవర్గప్రాప్తి లేదండ్రుగా దీరశ్రేష్ఠు లనంతకోటులిఁక నైతే వారికర్మంబులు\న్‌ ప్రారబ్ధంబులు గావె ముందఱకు నోభావజ్ఞ సైరించి నా ప్రారబ్ధంబులఁ దీర్పవే కరుణఁ గృష్ణా దేవకీనందనా.
7
saardulamu
2590
ఏదేశంబున నేదిశాముఖమునం దేయూర నేవాడ మీ పాదాభ్యర్చన సేయు నిర్మలుఁడు సద్భక్తుం డొకండుండె నా- యాదేశంబును నాదిశాముఖమును న్నాయూరు నావాడ గం- గాదిస్నాన నదీప్రవాహఫలదంబై యొప్పు సర్వేశ్వరా!
7
saardulamu
230
నిక్కంబారయఁ దావకాంఘ్రివిలసన్నీరేరుహద్వంద్వమే దిక్కెల్లప్పుడు మాకటంచు మదినెంతే వేడ్క భావించెదన్ జిక్కుల్ పన్నక నమ్మికిచ్చి సరగం జేపట్టి రక్షింపు స- మ్యక్కారుణ్యకటాక్షవీక్ష నను రామా! భక్తమందారమా!
7
saardulamu
2095
యితర కామంబుఁ గోరక సతతముగను - భక్తి నీయందు నిలుపుట ముక్తికొఱకె భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
3407
_x000D_ భయమంతయు దేహముదే _x000D_ భయ ముడిగిన నిశ్చయంబు పరమాత్మునిదే _x000D_ లయమంతయు దేహముదే _x000D_ జయమంతయు జీవుఁడనుచుఁ జాటర వేమా.
1
kandamu
3787
_x000D_ కట్టెపైన నున్న కట్టెకు ఘనమేమి _x000D_ చెట్టు పైననున్నఁ జేరు ఘనము _x000D_ కట్టెచెట్టుగూడి గలసె దైవంబులో _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4327
ధళధళ మించు కన్నుఁగవ తమ్ముల మిమ్ములఁ జూపు చిమ్మిన\న్‌ గళవళమందకుండుదురె గ్రక్కున శ్రీయలమేలుమంగకు\న్‌ సళువుల నవ్వుఁ గొంత నునుసోనలగర్వముఁ గొంతనవ్వుఁగా కెలపులఁ గొంతకొంత పులకింతలు వింతలు వేంకటేశ్వరా!
5
champakamaala
3581
_x000D_ ఏవంక మనసు కలిగిన _x000D_ నా వంకకు నింద్రియంబు లన్నియు నేగు\న్‌ _x000D_ నీ వంక మనసు కలిగిన _x000D_ నే వంకకు నింద్రియంబు లేగవు వేమా.
1
kandamu
3829
_x000D_ ఒక్కమనసుతోడ నున్నది సకలము _x000D_ తిక్క బట్టి నరులు తెలియలేరు _x000D_ తిక్క నెఱిఁగి నడువ నొక్కఁడే చాలురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi