id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
3192
_x000D_ తారకంబుఁ జూచుదారి వేఱుగఁగల్గు _x000D_ సమముగాను జూడఁ జక్కఁబడును _x000D_ వెఱ్ఱిగాను జూడ వెలుగెల్ల బాఱురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2440
చింతించి యోగి మోక్షా నంతసుఖం బొదువఁ జక్షురగ్రంబునఁ దా నంతర్దృష్టిని గనవలె సంతతమును నాత్మఁ గన్న సంపఁగిమన్నా!
1
kandamu
2951
యనుచు బోధించి యీ మాటలన్ని చెప్పి | సొరిది కృష్ణుని దేవమ్మ సుందరాంగితరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన.
2
teytageethi
4368
యరసికుండైన నరపతి నాశ్రయించి । కృతులొనర్చెడి కవి నెత్తిగీఁత రోఁత మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
2734
ఊరూరన్‌ బవినీని కాండ్లు కవులై యొక్కొక్కచోఁ గొందఱన్‌ కేరే మీరును బాణకాదురనుచున్‌ గీతాలు బోధింపఁగా సారాసారమెఱుంగలేక మిగులంజౌకయ్యెగా పద్యముల్‌ జేరంజోటికనేది సత్కవులకున్‌ శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
1660
అనుదిన మాత్మసంభవున కాముద ముగ్గిడు నంతమీఁద లో- చనములు ముక్కు పెందొడలు చంకలు కాళ్లును చేతు లాదిగాఁ గను సమమొందఁగా నివిరి చక్కనివాఁ డగునట్లు చేయు నే- ర్పున నలరారుచున్న ననబోణినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
637
అజునకుదండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యు స ద్ద్విజమునికోటికెల్లఁ గులదేవతవయ్యు దినేశవంశ భూ భుజులకు మేటివయ్యు బరిపూర్ణుఁడవై వెలుగొందు పక్షిరా డ్ధ్వజ మిముఁ బ్రస్తుతించెదను దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
3278
_x000D_ ఆకు చాటునుండు నన్నిలోకంబులు _x000D_ కొమ్మ గానరాదు బ్రహ్మకైన _x000D_ కొమ్మ గానఁబడినఁ గొనియాడవచ్చురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3228
_x000D_ దేహము లెస్సగ నుండిన _x000D_ పోషణ తత్వంబులన్ని పొందుగఁ దెలియు\న్‌ _x000D_ దేహము బడలికఁ బడినను _x000D_ పోషణ తత్వములు వచ్చి పొందవు వేమా.
1
kandamu
2346
జననీగర్భములందు నన్నిటు బడన్ జన్మిచ్చి బాల్యంబులన్ జనుబా లెందఱివైనఁ ద్రాపి యటు వేల్ సంబంధముల్గా పురా తనకాలంబుననుండి యెంతగను యత్నంబున్న నిందాకఁ దీ రని కర్మంబులు దీఱు టెట్లు? రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
1091
సిరికిఁ దోఁబుట్టువౌ జ్యేష్ఠామహాదేవి | దీనత నింటింటఁ దిరుగఁజాగె హరికిఁ గూరిమిపట్టి యగు మకరాంకుండు | మెయిలేక సోకుఁడై మెలఁగుచుండె మృడునకు గాదిలికొడుకైన వెనకయ్య | యిప్పటికిని బెండ్లి యెఱుఁగఁడయ్యె నలినాసనునకు మానసపుత్రుఁడైన ద- | క్షుం డుక్కు సెడి తలకొట్లఁ బడియె
3
seesamu
2389
కల్ల యగుజ్ఞాన మేలా చెల్లనికా సెచట నైనఁ జెల్లనికాసే తెల్లమిగఁ దెలుపునాతఁడు సల్లలితజ్ఞాని యెన్న సంపఁగిమన్నా!
1
kandamu
951
చెలిమి నోగిర యిడ్డ చిరితొండబత్తుని | కొడుకుఁ జంపించుట దుడుకు గాదె పరకాంత యని మది నరయక భల్లాణు | నిల్లాలి గోరుట యెగ్గు గాదె మాలని యెంగిలిమాంసంబు రోయక | తవిలి మెసంగుట తప్పు గాదె మొనసి యాడుది పంపు పనులకై కినియక | కుంటెనల్ తిరుగుట కొఱఁత గాదె
3
seesamu
2393
చేతోగతిఁ దము నెఱిఁగిన యాతద్‌జ్ఞులు భువిని జనుల నందఱ సరిగాఁ జూతురు సమరసభావనఁ జాతుర్యధురీణు లెన్న సంపఁగిమన్నా!
1
kandamu
577
సరవి చతుశ్రుతు ల్నిఖిలశాస్త్రపురాణకథారహస్యముల్ విరివిగ నిచ్చనిచ్చలును విందుముగాని తలంచిచూడ మా గురుచరణంబులాన నినుఁ గొల్వక యేరికి ముక్తి లేదయా చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
1774
అనుచు దగినట్టి చెలులతో నలరుబోడి | బలుకుచున్నది యతిమోహపరవశతనుగాన నా యింతి నేలుము కమలనాభ | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
4311
మతి నలమేలుమంగకును మంతనమాడెడు నీవిలాసముల్‌ తతిఁ దలపోఁతలై సురతతాండవసంభ్రమలీలలై సమం చిత సరసప్రసంగములు చిమ్మనిదొంతరలై ప్రియంబులై వితతమనోజవిద్యల నవీనము లైనవి వేంకటేశ్వరా!
5
champakamaala
69
రాజు లెవ్వరుఁ బఙ్క్తిభోజన మిడకున్న- దాసునింట భుజించి తనియలేదొ? బంధువు లెవ్వరు గంధ మీ కుండిన- మువ్వంకలది పూయ మురియలేదొ? దొర లెవ్వరును బూలసరము లీకుండినఁ- దెలిసి మాలికుఁ డీగ నలరలేదొ? ప్రభువు లెవ్వరు వస్త్రబహుమాన మీ కున్నఁ- దెచ్చి యిచ్చిన చాకి మెచ్చలేదొ?
3
seesamu
2522
వెలి వీక్షించిన నీ స్వరూపమె మహావిస్పష్టమై యాత్మలో- పల భావించిన నీ స్వరూపమె మహాప్రవ్యక్తమై దృష్టులం దలఁపం జేకొని యున్న నీ యచలితధ్యానంబునం జేసి తాఁ గలనైన న్శివయోగి తన్ను జగముం గానండు సర్వేశ్వరా!
4
mattebhamu
2151
కుజనులను దెచ్చి నీ సేవ కొరకుఁ బెట్ట - వాంఛతోఁ జేతురే భక్తవరుల వలెను? భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
1187
తన సత్కర్మాచరణం బున భాగ్యము వేగ వృద్ధి బొందు, జగత్ప్రా ణుని వర సాహాయ్యముచే ననలం బెంతైనఁ బెరఁగు నయ్య కుమారా!
1
kandamu
2152
నీకు దాసుఁడ నంటి నిన్ను నమ్ముకయుంటిఁ - గాన నాపై నేఁడు కరుణఁజూడు దోసిలొగ్గితి నీకు ద్రోహ మెన్నఁగఁబోకు - పద్మలోచన! నేను పరుఁడగాను భక్తి నీపై నుంచి భజనఁ జేసెదఁ గాని - పరుల వేఁడను జుమ్మి వరము లిమ్ము దండిదాతవు నీవు తడవు సేయక కావు - ఘోరపాతకరాశిఁ గొట్టివైచి
3
seesamu
3120
_x000D_ పరనారీ దూరగుడై _x000D_ పరధనముల కాసపడక పరహితదారై _x000D_ పరులలిగిన దానలుగక _x000D_ పరులెన్నగ బ్రతుకువాఁడు ప్రాజ్ఞుఁడు వేమా.
1
kandamu
2122
దనుజారి! నావంటి దాసజాలము నీకు - కోటి సంఖ్య గలరు కొదువ లేదు బంట్లసందడివల్ల బహుపరాకై నన్ను - మఱచి పోకుము భాగ్యమహిమచేత దండిగా భృత్యులు దగిలి నీకుండంగ - బక్క బంటే పాటి పనికి వచ్చు? నీవు మెచ్చెడి పనుల్‌ నేను జేయఁగలేక - యింత వృథా జన్మమెత్తినాను
3
seesamu
1030
నిక్కి మిక్కుటమైన యాదొక్కి బొక్కి- | లో టక్కరి నృపాలకులకీ ర్తి దక్కునొక్కొ, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
1791
సురతచమత్క్రియల్ సూపించిచూపించి మేలిమి నీ పొందు మెచ్చిమెచ్చిమోము మోమున జేర్చి ముద్దాడిముద్దాడి గొసబులియ్యని మోవి గ్రోలి గ్రోలిగబ్బిగుబ్బల నెద గదియించిగదియించి బిగువు కౌఁగిళ్ళను బెనగిపెనగిమరుకేళి గవయగ మనసిచ్చి మనసిచ్చి గౌరవంబు చెలంగగలసికలసి
3
seesamu
651
హలి కులిశాంకుశ ధ్వజ శరాసన శంఖ రథాంగ కల్పకో జ్జ్వల జలజాత రేఖలను సాంకములై కనుపట్టుచున్న మీ కలితపదాంబుజ ద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా తలవునఁజేర్చి కావగఁదె దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
35
అబ్బుకో గలవొ కాయక్లేశ మొనరించుఁ- దేవాసురు లటుండ దివ్యరమను దోచుకోఁ గలవొ చే సాచి లోకము లాచి- బలిమహాదాత వైభవము లెల్ల రాఁ దీయఁగలవొ సత్రాజిత్తుఁ డీకున్న- మణిశమంతక మొక మమతఁ గొల్పి నాటించఁ గలవొ సన్న కసన్ననె వనంబు- పెట్టు మ్రాన్పెకలించి పెరటిలోనఁ
3
seesamu
70
పాటి సేయంగ నేరాజు బంధుగుఁడవొ?-మున్నె నీపస దెలిసిన దెన్న నేమి? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
2930
నను నెడబాసి యుండిన దినంబుల లెక్కలఁ గొంతసేపు, నా మునుపటి కేళిలో మెలఁగి ముచ్చటలాడుట కొంతసేపు, నా కనుగుణమైన వస్తువుల నంపెడు సందడిఁ గొంతసేపు, నొ- య్యన పవలెల్ల నోర్చి నిశియం దెటులోర్తువొ సుందరీమణీ!
5
champakamaala
4620
శృంగి పురోగమాఖిల విశేషవిషంబులు గూర్చి మండుచున్‌ బొంగి భుగిల్లు భుగ్గురను భూరివిషాగ్ని నిషాదులార్తులై చెంగి చనన్‌ శివార్పితము చేసి భుజించిన సుప్రసాద! నీ వంగడమేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! 7
6
vutpalamaala
1721
కోడలు గర్భమౌట తనకు న్మదిఁ దోఁచినయంత బ్రేమ గొం- డాడ సుపుత్రునిం బడయునట్లు ఘటింపు మటంచు శూలి పూఁ- బోఁడిని మందగామినినిఁ బుష్పసుగంధిని మీనలోచనన్ వేడుకమీఱ వేఁడు నలివేణినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
6
vutpalamaala
1220
తెచ్చినఁ దేకుండిన నీ కిచ్చిన నీకున్న మగని నెగ్గాడకుమీ యొచ్చెము నీపైఁ దేలును రచ్చల కామాట లెక్కు రవ్వ కుమారీ!
1
kandamu
2088
అవనిలోఁ గల యాత్రలన్ని చేయఁగవచ్చు - ముఖ్యుఁడై నదులందు మునుఁగవచ్చు ముక్కుపట్టుక సంధ్యమొనసి వార్వఁగవచ్చు - దిన్నఁగా జపమాలఁ ద్రిప్పవచ్చుఁ వేదాల కర్థంబువిఱిచి చెప్పఁగవచ్చు - శ్రేష్ఠ క్రతువులెల్లఁ జేయవచ్చు ధనము లక్షలు కోట్లు దానమియ్యఁగవచ్చు - నైష్ఠికాచారముల్‌ నడుపవచ్చు
3
seesamu
1925
వసుధ విజయనగవంశాబ్ధిచంద్రుడౌ వెలయ వెంకటగిరి విభున కెలమివరపుత్ర ... ... ... రివరమున బహువిధకృతులు గావించి సత్కీర్తి వెలసిరాజిల్లు చెంగల్వరాయాహ్వయంబున దేజమొప్ప నృసింహదేవు పాదకమలముల్ మదినుంచి గరిమ శ్రీహరిపేర నంకితంబుగ కబ్బమమరజెప్పి
3
seesamu
2242
నీ చారిత్రముఁ జెప్ప నద్భుతమగున్, నీ నామసంకీర్తనం బాచండాలునకైన మోక్ష మొసఁగున్, హత్యాదిదోషంబులన్ వే చించున్ విదళించుఁ ద్రుంచుఁ దునుమున్ వేఁటాడు నంటంబడున్ రాచుం ద్రోచు నడంచు నొంచు రఘువీరా! జానకీనాయకా!
7
saardulamu
4014
_x000D_ కోపమునను నరక కూపముఁ జెందును _x000D_ కోపమునను గుణము కొంచె మగును _x000D_ కోపమునను బ్రతుకు కొంచెమై పోవును _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1847
వదలని కౌఁగిళ్ళ వాతెరనొక్కులు నెద గుబ్బయొరపుల యా లతాంగిచిరునవ్వు మాటల జిలిబిలి పాటల దురుసుపై కొసరుల దోయజాక్షికొనగోటిమీటుల నెనలేనియాటల మొనసిన బొమముళ్ళ మోహనాంగిగళరవంబుల చాలగానొప్పు సన్నల సైగల తగు ముద్దుచాన గాన
3
seesamu
613
ఒరిమెఁ గవీంద్రుఁ డేమెఱుఁగునో యని దర్శనమియ్యనోడి బ- ల్దొరలును మూలనీగుదురు లోభమున న్నిను నే మఱేమియు- న్వరములు వేడ నాకిపుడు వైళము దర్శనమియ్యరాగదే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
4179
_x000D_ కులము హెచ్చుతగ్గు గొడవలు పనిలేదు _x000D_ సానుజాత మయ్యె సకలకులము _x000D_ హెచ్చుతగ్గుమాట లెటులెఱుంగఁగ వచ్చు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
546
తరణిసుతోగ్రపాశవితతవ్యథ గాసిలి స్వేతుఁ డర్థి నిన్ స్మరణము నొంద నజ్జము వెసం బడదన్ని ధరామరోత్తమున్ గరమనురక్తిఁ బ్రోవవె జగంబున శాశ్వతజీవిఁ జేసి మేల్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
4335
నిను సదా హృత్కంజమునఁ బాయకుండ నా । ప్రహ్లాదువలెను నేర్పరిని గాను ఏవేళ నిను ధ్యానించుచుండుటకు నా । దృఢచిత్తుఁ డైనట్టి ధ్రువుఁడ గాను సతతంబు నిన్ను సంస్తుతి చేయుచుండ నా । వేశిరంబుల సర్పవిభుఁడ గాను నీ విశ్వరూపంబు సేవించుటకు సహ- । స్రాక్షముల్ గల్గు వాసవుఁడఁ గాను
3
seesamu
1918
విభుని సన్నిధిలోనుండి వెలది బలికె | నన్ను నెడబాసి యిట్లుండ న్యాయమటరమరుని బారికి నెటులోర్తు మగువ నేను | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
2529
పెంపన్ దల్లి యగున్ రుజాపటలదుష్పీడావిధి క్షోభ వా- రింపన్ వైద్యుఁ డగుం గుమార్గవిధులం గ్రీడింపఁబోకుండ శి- క్షింపన్ బల్లిదుఁడైన తండ్రి యగుచున్ శ్రీమంతుఁగా నెంతయున్ సంపద్వృద్ధి యొనర్ప దాతయగు నీ సద్భక్తి సర్వేశ్వరా!
7
saardulamu
1748
మెలత మొలనూలిఘంటలు మిగుల మ్రోయ | కాళ్ళనందెలు గజ్జెలు ఘల్లుమనగచెలిని జూచిన మరువారి చిక్కవటర | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
2979
వెలది నా వెతలెంతని విన్నవింతు | నతని దయరాదు నేనెంత యడరియున్నతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన.
2
teytageethi
1728
శ్రీ వెలయంగ లోకు లిది చిత్రమటంచు మదిం దలంప న- ప్పా వతిభక్తితో జననిపైఁ గల ప్రేమ దురంగలించి రాఁ- గా వగ మీఱ మాతృశతకం బొనగూరిచెఁ గానఁ జూచినం బూవిలుకానిఁ గన్న సిరిఁబోలిన తల్లినిఁ బోలరెవ్వరున్.
6
vutpalamaala
3338
_x000D_ బ్రతుకులెల్ల మాయ భవబంధములు మాయ _x000D_ తెలివి మాయ తన్నుఁ దెలియ మాయ _x000D_ మాయ దెలియువాఁడు మర్మజ్ఞుఁడగు యోగి _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1216
మగనికి నత్తకు మామకుఁ దగ సేవ యొనర్చుఁచోటఁ దత్పరిచర్యన్‌ మిగుల నుతిఁ బొందుచుండుట మగువలకుం బాడి తెలిసి మసలు కుమారీ!
1
kandamu
1718
“అనయము రాజకార్యములయందుఁ బ్రవర్తన సేయువేళ భూ- జనులకుఁ గీడు పన్నునెడ సడ్డ ఘటింపఁగ నీకు లోకనిం- దన కెడగాని నిర్మలవిధంబు సమస్తము నీకుఁ గీర్తిసా- ధన” మని తెల్పు సద్గుణమతల్లిని దల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
3656
_x000D_ కుక్కతోలు దెచ్చి యెఱుపుబొమ్మను జేసి _x000D_ యాడునట్టుచేసి యట్టెవేసె _x000D_ తన్నుఁ ద్రిప్పువానిఁ దానేలకానఁడో _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3901
_x000D_ బారెడేసి జడలు భస్మంబుపూఁతలు _x000D_ మరునితోడ మాఱుమలయఁ గలరు _x000D_ ముంజికోకలెల్ల లంజెకోకలాయె _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1166
రోషావేశము జనులకు దోషము తలపోయ విపుల దుఃఖకరమునౌ, రోషము విడిచిన యెడ సం తోషింతురు బుధులు హితము దోఁపఁ గుమారా!
1
kandamu
2670
కలలంచు న్శకునంబులంచు గ్రహయోగంబంచు సాముద్రికం బులటంచుం దెవులంచు దిష్టియనుచు న్భూతంబులంచున్విషా దులటంచు న్నిమిషార్ధజీవనములందుం బ్రీతిఁబుట్టించి యీ సిలుగుల్‌ ప్రాణుల కెన్నిచేసితివయా శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
2630
ఏ వేదంబుఁ బఠించె లూత, భుజగంబే శాస్త్రముల్చూచెఁ దా నే విద్యాభ్యసనంబొనర్చెఁ గరి, చెంచే మంత్రమూహించె, బో ధావిర్భావనిధానముల్‌ చదువులయ్యా! కావు! మీపాద సం సేవాసక్తియె కాక జంతుతతికిన్‌ శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
708
నీ సతి పెక్కుగల్ములిడ నేర్పరి లోక మకల్మషంబుగా నీ సుత సేయు పావనము నిర్మితి కార్యధురీణదక్షుఁడై నీ సుతుఁడిచ్చు నాయువులు నిన్ను భజించినఁ గల్గకుండునే దాసుల కీప్సితార్థములు దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
3558
_x000D_ చూపువలనఁ బుట్టు సుఖదుఃఖములు రెండు _x000D_ పతికి సతికిఁ బుట్ట పరగ సుతుఁడు _x000D_ సతికి సుతునివలన సౌఖ్యంబు గలుగును _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3086
జీవి పోక ముందె జీవ వస్తువు లిచ్చి జీవి నిలుప వలయు జీవనముగ జీవి తొలఁగు వెనుక జీవ వస్తువు లేల? విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1484
యేమొనర్చితినన్న మీకెరుక లేదా । చేసినటువంటి పనులంచు చెలిమి గాంచు దాని వగ దల్చి ప్రేమనెంతనుచు నోర్వ । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
2533
చటులప్రాయగుణేంద్రియాత్ములకు వాంఛావృత్తి నీ భక్తి సం- స్ఫుటమై యుండదు భక్తితత్పరులకుం బొల్పొందఁగాఁ జిత్త ము- త్కటదుష్టేంద్రియవర్గతామసపరిగ్రస్తంబు గాదెట్లు చీ- కటికిం దిగ్మమరీచికిం గలదె సాంగత్యంబు సర్వేశ్వరా!
4
mattebhamu
446
కామిత వస్తుసంపదలు గల్గు ఫలం బొరు లాసపడ్డచో నేమియుఁ బెట్టఁడేని సిరి యేటికి నిష్ఫలమున్నఁ బోయినన్‌ బ్రామికపడ్డ; లోకులకుఁ బండగ నే మది యెండి పోవఁగా నేమి ఫలంబు చేఁదు విడదెన్నటికైన ముసిండి భాస్కరా!
6
vutpalamaala
1960
కలయం దిక్కులు నిండి చండతరమై కప్పారు మేఘౌఘముల్‌ వెలయ\న్‌ ఘోరసమీరణస్ఫురణచే వే పాయుచందంబున\న్‌ జలదంభోళి మృగాగ్నితస్కరరుజాశత్రోరగవ్రాతముల్‌ దొలఁగు న్మీ దగు దివ్యమంత్రపఠన\న్‌ దోషఘ్న, నారాయణా!
4
mattebhamu
2097
వెఱ్ఱికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను - భజనఁ జేసెడివారికిఁ బరమసుఖము భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
117
కొనముట్ట హెచ్చుతగ్గుల ప్రాతఁసుద్దుల- తాతపుస్తక మొకఁ డాతతాయి మ్రుచ్చిలి నీటిలోఁ జొచ్చి డాఁగిన వాని- పావన మేమి వెంబడిగఁ బెద్ద కోఱమీనంబవై యాఱొండుసంద్రము- ల్నిముసంబులో నీఁది నెమకి వాని డొక్క వ్రక్కలుగాఁ గఱుక్కున బరిఁ గోసి- కడ లేనినుడువు లెక్కటికి నోట
3
seesamu
397
పటులోభాత్మున కెవ్వరైనఁ గడఁకం బద్యాదు లర్పించినం గుటిలుండై యవియెల్ల నిల్పుకొనఁగా గోరండు నిక్కంబహా! దిట మొప్పారఁగ నిల్పుకోఁగలదె ధాత్రిన్ గొంతసేపైన మ- ర్కటపోతం బురురత్నహారంబులు? భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
2055
ద్రోహచింతనఁ జేసెడు దుర్జనులకు - మధురమైన నీ నామమంత్రమేల? భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
4572
దేశిక జన్మదేశ! యవిదేశ యనావృతపాశ! సంహృత క్లేశ! మహాప్రకాశ! కృత కిల్బిషనాశ! దయానివేశ! నం దీశనికాశ! జంగమ సమీహితకారి గుణావకాశ! దే వా శరణీయవయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
2898
దీపములున్ మతాబులును దివ్వటులున్ కొరవియున్ శశాంకుడున్ దీపితులై వెలింగినను నీమెయి వెన్నెల నీ యొయారపుం జూపు మెఱుంగు తామరల సొంపును గన్గొనకున్నఁ జిత్తవి- క్షేపమునొంది రేపగలు చీకటియౌఁ గదె సుందరీమణీ!
6
vutpalamaala
215
కదనప్రాంగణకార్తికేయ! విలసద్గాంగేయకౌశేయ! భా- స్వదుదంచద్ఘననీలకాయ! త్రిజగత్సంరక్షణోపాయ! స- మ్ముదితాశేషమరున్నికాయ! దివిషన్ముఖ్యాతిగేయా! గరు- త్మదమేయాశ్వ! సుధీవిధేయగుణ! రామా! భక్తమందారమా!
4
mattebhamu
58
పరువు గలవాఁడ వేమి ప్రాఁబల్కు లంచు-దెలియ వరిముక్కు ముల్లంత తలవొ! లేవొ! చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
1796
ననుచు జుంబనవిధముల నన్ని వగల | దెల్ప వలపింపదగినట్టి తెరవ నిపుడుగలసి యేలుట దగునయ్య కామజనక | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
4041
_x000D_ దైవమతుల నరులు తమవంటివా రని _x000D_ యరసి గూఢతత్వ మరయ లేరు _x000D_ ఇల్లు మూయఁబడిన నెట్లు మర్మ మెఱుఁగు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4513
ఋణశేషమున్నను రిపుశేషమున్నను । వహ్నిశేషంబున్న వచ్చుఁ గీడు భుక్తి వధూజనరక్తి నిద్రాసక్తి । యగ్గలంబైనఁ గీ డావహిల్లు గుత్సితాత్మునితోడఁ గోవధజనముతో । గొండికవానితో గోష్ఠి తగదు అర్భక పశు మందిరాంగరక్షల యందు । నేమఱుపాటొంద నెగ్గుఁ జెందు
3
seesamu
1441
కుటిలకుంతలికి చన్గుదురు లున్నతమైన । వేళ నా మనసేమొ వేడ్క గాంచె జలజాక్షి నునుపిరుందులు మిన్నలైన నా । మదికి చమత్కారమహిమ గల్గె భ్రమరాలక సమర్తపాయమైనంత నా । తనువు బంగారుచాయను వహించె రమణి నూగారు దట్టము మీరి నలుపెక్క । లేకురు మీసంబు లేర్పరించె-
3
seesamu
4238
చికురభరంబుచే (నదిమి) శ్రీలలితాంగివి నీవు నాగుణా ధికునియురంబుపై రతులఁ దేలుచు శ్రీయలమేలుమంగ నీ లికుచకుచ ప్రభావమున లేఁతవయస్సున నింత నేతురా వెకలి వటండ్రు నెచ్చెలులు వేడ్కల నీసతి వేంకటేశ్వరా!
5
champakamaala
2435
సత్తును నెఱుఁగ దస త్తా సత్తును నెఱుఁగంగలే దసత్తును నిఁక నీ సత్తాసత్తలఁ దగ సద సత్తైకను జీవుఁ డన్న సంపఁగిమన్నా!
1
kandamu
1397
జాతివజ్రాల బేసరి బులాకీనత్తు । నాసాగ్రమున దుంకి నాట్యమాడ జాజిబందులు నూగుపాటీలు కంకణ- । మ్ములు చేకటుల్ ఘలుఘలుమనంగ జల్తారు పయ్యెద జారి దళుక్కని । బాహుమూలద్యుతుల్ పరిఢవిల్ల తలయంట వక్షోజములు గోర నే జీర । యలగి నే జెల్ల బాగాయనౌర
3
seesamu
2086
భుజబలంబునఁ బెద్దపులులఁ జంపఁగవచ్చు - పాము కంఠముఁ చేతఁబట్టవచ్చు బ్రహ్మరాక్షసకోట్ల బాఱఁద్రోలఁగవచ్చు - మనుజుల రోగముల్‌ మాన్పవచ్చు జిహ్వ కిష్టముగాని చేఁదు మ్రింగఁగవచ్చు - పదును ఖడ్గముచేత నదుమవచ్చుఁ గష్టమొందుచు ముండ్లకంపలోఁ జొరవచ్చుఁ - దిట్టుఁబోతుల నోళ్లు కట్టవచ్చుఁ
3
seesamu
676
వలదు పరాకు భక్తజన వత్సల నీ చరితంబు వమ్ముగా వలదు పరాకు నీ బిరుదు వజ్రమువంటిది కావకూరకే వలదు పరాకు నా దురిత వార్ధికిఁదెప్పవుగా మనంబులో దలఁతుమె కా నిరంతరము దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
4210
_x000D_ కాశి కాశి యనుచుఁ గడువేడ్కతోఁ బోదు _x000D_ రందుఁగల్గు దేవుఁడిందు లేఁడె _x000D_ యిందు నందు గలఁడు హృదయంబు లెస్సైన _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
647
చక్కెర లప్పకున్‌ మిగుల జవ్వని కెంజిగురాకు మోవికిం జొక్కపుజుంటి తేనియకుఁ జొక్కులుచుం గనలేరుగాక నేఁ డక్కట రామనామ మధురామృతమానుటకంటె సౌఖ్యమా తక్కినమాధురీ మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
2050
గౌతమీస్నానానఁ గడతేఱుద మఁటన్న - మొనసి చన్నీళ్లలో మునుఁగలేను తీర్థయాత్రలచేఁ గృతార్థుఁ డౌద మఁటన్న - బడలి నేమంబు లే నడుపలేను దాన ధర్మముల సద్గతిని జెందుదమన్న - ఘనముగా నా యొద్ద ధనము లేదు తపమాచరించి సార్థకత నొందుదమన్న - నిమిషమైన మనస్సు నిలుపలేను
3
seesamu
4520
గుడిసెవేటుల నిల్లాలు గుత్తులంజె । గనుక నీ రీతిఁ బెక్కులు గలవు తలప మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
1665
ఇంతులఁ జూచి మీ సుతుల కే పస రుగ్గిడినారు మీరు గో- రంత యెఱుంగఁ బల్కఁగదరమ్మ యటంచుఁ జికిత్స దోఁప నిం- తంతనరాని యౌషధము లారయుచున్ గడుబ్రోచుచున్న ధ- న్వంతరియో యనంగఁ జెలువారెడు తల్లినిఁ బోలరెవ్వరున్.
6
vutpalamaala
3960
_x000D_ గురువు తానయైన హరిని తాఁ జూచును _x000D_ బ్రహ్మలోక మతఁడు పాఱఁజూచు _x000D_ శిష్యు నరసిపట్టి చీఁకటిఁ బాపురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1388
లెన్ని జూచినగాని యా వన్నెలాడి । యధరబింబసమానమౌ మధురమొకటి గాన నా చానపైని నా కరుణ మాన । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
3411
_x000D_ కాయముఁదగఁ గూడి కడఁగి యోగిగనున్న _x000D_ కాయ ముండికాని ఘనుఁడు గాఁడు _x000D_ కాయమునను ముక్తిగతి కేగవలెనయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1454
వలపుల మిటారి నిత్యము వచ్చు దారి । చూచి వేసారి మనమున సొలపు మీరి మగువ నొకసారి నెనయక మరుని బారి । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
2872
వాడిన మోముతోఁ దొగరువాతెఱఁ బలుగెంపుగుంపుతో వీడిన కొప్పుతో సొలపువింతలతో ననుఁ బాసిఁపోవఁ గా- ళ్లాడనియట్లు తొట్రువడు నందపు నెన్నడతోడఁ బ్రొద్దునన్ వేడుకఁ గేళిమందిరము వెల్వడుచుందువు సుందరీమణీ!
6
vutpalamaala
3789
_x000D_ సిగ్గటంచనఁ బడు సిగ్గునెచ్చోనుండు _x000D_ ఆఁకలనుచు నుందు రాఁకలేది _x000D_ దాఁగియున్న వానిఁ దానేల యెఱుఁగఁడో _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4194
_x000D_ రాతిబసవని గని రంగుగా మ్రొక్కుచు _x000D_ గునుకుబసవని గని గ్రుద్దుచుండ్రు _x000D_ బసవభక్తులెల్ల పాపులె తలపోయ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4450
నీటుగాఁ బిన్నవై పల్లెకూటమునకు । నరుగుచున్నట్లె ధేనుకాసురుని బట్టి కొట్టి ధరఁ గూలద్రోయవా గుండెలవియ మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
1356
నెనరుమాటలదీవి పన్నీటిచెలమ । కన్నె వేడిమిఠారి యంగజునిసొక్కు మందుపొడిడబ్బి జాణ నిన్మది దలంప । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
111
నీరుపట్టుగ నుంట నారాయణుఁడ వండ్రు- నారాయణాఖ్యాధికార మేమి? బలిసి యంతట నీవె గలుగ విష్ణుఁడ వందు- రావిష్ణునామప్రభావ వేమి? ముగురు నీవై వెలుంగఁగఁ గేశవుఁడ వండ్రు- కేశవాభిఖ్యాప్రకాశ మేమి? సిరికి మగఁడ వై మెరయ శ్రీపతి వండ్రు- శ్రీపతినామప్రసిద్ధి యేమి?
3
seesamu
4203
_x000D_ తొత్తు తొత్తెగాని దొరసాని గాఁబోదు _x000D_ అడఁచుటింతె దానికైన గుణము _x000D_ మిత్తికూళ్ళ దొంగ మేలెఱుఁగ నేర్చునా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
737
ఇల గోవర్ధన మెత్తితీ వనుచు బ్రహ్మేంద్రాదు లెంతో నినుం బలుమారున్నుతులొప్పఁ జేసెదరు పద్మాక్షా కుచాగ్రంబునం జులకన్నెత్తిన రాధనెన్న రిదిగో సొంపొంద సత్కీర్తి ని శ్చలపుణ్యంబునఁ గాక చొప్పడునె కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
3986
_x000D_ ధర్మకంటకుండు ధనముచే గర్వించి _x000D_ సకలసంపదలను జాలఁ బొరసి _x000D_ కడకు తాను మేలు గానక చెడిపోవు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2322
నవనీతంబుల కేల పాఱెదవురా నాయన్న! రా! యెన్నరా యివి దూష్యంబులు గాఁగ గోపికలు? నీయింటం బదార్థంబు లె య్యవి లే? వంచు వచించు నమ్మకడ కొయ్యంజేరు కైశోర చో రవినోదంబులు నేఁ దలంతు రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
113
వేఁడని చూదక విపినవహ్నిజ్వాలఁ- ద్రావెదో తేనియఁ ద్రావినట్లు భార మం చనక గోవర్ధనపర్వతం- బెత్తెదో పూబంతి యెత్తినట్లు విషపుంజ మనక నాభీలాజగరజిహ్వఁ- జింపెదో ప్రాబట్టఁ జింపినట్లు పెస నసాధ్యుండని వెరవక నరకుని- నఱికెదో పార్వేఁట నఱికినట్లు
3
seesamu
1415
వనజాస్య నీదు పావడనైన గానైతి- । నరసి పెందొడలపై నొరయుచుందు శుకవాణి నీదు కంచుకమైన గానైతి । నుదుట గుబ్బలమీద గదిసియుందు రమణి నీ నత్తుముత్యమునైన గానైతి- । ననుదినంబును మోవి యానుచుందు మదిరాక్షి నీకు పయ్యెదనైన గానైతి । కడువేడ్క మేనెల్ల గప్పియుందు
3
seesamu