id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
1856
యనయ గుబ్బల కుంకుమ యెఱ్ఱమట్టి | మేననంటగ మరునాము మెలత నీకుదెల్ప గోరుచునున్నది దెలసిరమ్ము | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
1271
తనకడుపు కట్టుకొని యై నను జుట్టమ్మునకు బెట్టి నను గీర్తి వహిం చును భుక్తి ముక్తు లబ్బును దన కెవ్వరు సాటిరారు ధరణిఁ గుమారీ!
1
kandamu
4277
కాంచనరత్న నూత్న కటకంబులు సందులదండలు\న్‌ బ్రభల్‌ ముంచిన మేఖలావళులు మ్రోయగ నయ్యలమేలుమంగ నే త్రాంచలగర్వవీక్షణ సుహాసముతో నినుఁ గోరి భ్రూలతన్‌ వంచినఁ దియ్యవిల్లు కడవంచు మరుండును వేంకటేశ్వరా!
6
vutpalamaala
1437
నీలాంబరౌర పెన్నెరుల సౌరుదనంబు । వీనులు శ్రీరాగవిభవమేలు పొలతి నెమ్మొగము సంపూర్ణచంద్రిక మణి- । తము పరీక్షింప ఘంటారవంబు సారంగ చూడ్కుల చపలత వీక్షింప । మెరుపగు లేగౌను మేఘరంజి చాన రోమావళి శంకరాభరణంబు । తీరైన కెమ్మోవి దీపకళిక ముదిత క్రొంజిగిమేను మోహన సద్గుణ । లావణ్యగరిమ కల్యాణి భళిర
3
seesamu
3098
_x000D_ ఎఱుఁగు వాని దెలుప నెవ్వఁడయిననుఁ జాలు _x000D_ నొరుల వశము గాదు వోగుఁ దెల్ప _x000D_ యేటి వంక దీర్ప నెవ్వరి తరమయా? _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3133
_x000D_ వెఱ్ఱివాని కయిన వేషధారికయిన _x000D_ రోగికైన పరమయోగికైన _x000D_ స్త్రీలఁజూచినపుడె చిత్తంబు రంజిల్లు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3811
_x000D_ అరయ నాస్తి యనక యడ్డుమాటాడక _x000D_ తట్టుపడక మదిని తన్నుకోక _x000D_ తన్నుఁ దాఁ గనుగొని తాఁ బెట్టినది పెట్టు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
404
ధరణిన్ సద్గురుచెంత నెందఱు ఖలుల్ దార్కొన్న నచ్చోటికే కరమర్థి న్బుధులేఁగుచుండుదురు నిక్కంబారయన్ గంటకా- వరణోజ్జృంభితకేతకీవని కళుల్ వాలెంబుగాఁ జేరవే? కరుణాదభ్రపయఃపయోనిలయ! భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
2715
పదివేలైనను లోకకంటకులచేఁ బ్రాపించు సౌఖ్యంబు నా మదికిం బథ్యముగాదు సర్వమునకున్‌ మధ్యస్థుఁడై సత్యదా న దయాదుల్గల రాజు నా కొసఁగు మెన్నన్వాని నీయట్ల చూ చి దినంబున్ముద మొందుదుం గడపటన్‌ శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
3438
_x000D_ సుఖసుఖాన దాను సుగుణుఁడై యుండఁగఁ _x000D_ బ్రకృతి పెండ్లిచేసి పరముఁ జెడిచి _x000D_ విధులఁ బుట్టఁజేయు విధినిదాఁగానఁడు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3320
_x000D_ నిరతం బెడతెగ కుండక _x000D_ బరిపూర్ణ బ్రహ్మ మాత్మపదమున నుండ\న్‌ _x000D_ నిరవద్యమయిన యడవిని _x000D_ జరియించును జగమెఱుంగ సత్యము వేమా.
1
kandamu
3310
_x000D_ మానసంబు మంచిమల్లెపూవులచవికె _x000D_ బావితోఁటచేసి బాలఁగూడి _x000D_ భోగినయ్యెద ననఁ బోయెపో కాలంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4537
వసుధాధిపతికి విశ్వాసగుణంబు జా- । రునకు సత్యంబు చోరునకు భయము లంజెకు మోమోట పంజకు ధైర్య మెం- । గిలి కెగ్గు మద్యపాయులకు సిగ్గు ద్రవ్యాధికులకును దానధర్మములపై । దృష్టియు జారిణిస్త్రీకి వావి పలుగాకులకు మేలు పందగొడ్డుకుఁ బాలు । మానికిఁ గఱవు కోమటికి బరువు
3
seesamu
3314
_x000D_ మ్రాకున ననలము పుట్టును _x000D_ మ్రాకెదుగును ననలమునకు మనుజునిలోన\న్‌ _x000D_ మ్రాకుననలముల క్రియఁ జీ _x000D_ జా కుడి నయోగి నెవరు గానరు వేమా.
1
kandamu
3158
_x000D_ మంటలోహమునలు మ్రాను చీలలయందు _x000D_ పటముగోడలందుఁ బరగ నిసుక _x000D_ బెట్టనంటునట్ల పెనఁగు దేహముజీవి _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3915
_x000D_ జాతసూతకములు సత్యమై యుండంగ _x000D_ నంటిన గుణములు హతమ్ముగాక _x000D_ యతియుఁగాగనేల నవనిలో జీవుఁడు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1304
మును నాథుఁడు దరలినచో వెనువెంటనె పోయి యెల్ల వేల్పులు పొగడం గని యెందు నిందు నందును ఘనకీర్తులఁ బొందుచుండుఁ గాదె కుమారీ!
1
kandamu
2103
ఈ విధంబున నీనామమిష్టముగను - భజన సేయుచు నుందు నా భావమందు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
1545
వరుసన్‌ గ్రంతులు రచ్చచావడులు భాస్వచ్చైత్యముల్‌ భూరిగో పురముల్‌ మేడలు పుణ్యవీధులగముల్‌ భూమీగృహశ్రేణులున్‌ హరిజిత్కుంభ నికుంభులున్‌, శుకుఁడు యూపాక్షాసురుం డాదియౌ సురవిద్వేషుల చారుమందిరములన్‌ శోధింపవే మారుతీ!
4
mattebhamu
1202
మునుగల్గి ధర్మమును జే యునతఁడు పేదవడెనేని యున్నంతకుఁ దోఁ చిన భంగి నర్థులకు ని చ్చునతఁడె బహుపుణ్యపూరుషుండు కుమార!
1
kandamu
492
భూపతి కాత్మబుద్ధి మది బుట్టనిచోఁట బ్రధానులెంత ప్ర జ్ఞాపరిపూర్ణులైనఁ గొనసాగదు కార్యము; కార్యదక్షులై యోపిన ద్రోణ భీష్మ కృప యోధులనేకులు గూడి కౌరవ క్ష్మాపతికార్యమేమయినఁ జాలిరె చేయఁగ నాడు భాస్కరా!
6
vutpalamaala
1567
వరుసన్‌ దారుణ సప్తమంత్రితనయుల్‌ బాహాబలంబొప్ప బం దుర వైశ్వానర సప్తహేతులన దోడ్తో వెల్గుచున్‌ డాసినన్‌ కరులం గన్న మృగేంద్రులీల పెనుకిన్కం బొంగి యద్దైత్యుల స్థిరసత్వంబున ద్రుంపవే కలన నిశ్శేషంబుగా మారుతీ!
4
mattebhamu
3205
_x000D_ అంత కొఱత దీఱి అతిశయకాముఁడై _x000D_ నిన్ను నమ్మిచాల నిష్ఠతోడ _x000D_ నిన్నుఁగొల్వ ముక్తి నిశ్చయముగఁ గల్గు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
385
ప్రజలం గాఱియఁబెట్టి పెట్టియల నర్థంబెప్పుడు న్నించుచున్ ద్విజవిద్వత్కవివందిగాయకుల కేదే నొక్కటీలేక య- క్కజమొప్పం బలుమూలలం దిరుగు భూకాంతాంళికిం గీర్తిధ- ర్మజయౌద్ధత్యము లేక్రియం గలుగు? భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
1262
వేళాకోళంబులు గ య్యాళితనంబులును జగడ మాడుటలును గం గాళీపోకలుఁ గొండెము లాలోచించుటయుఁ గూడ దమ్మ కుమారీ!
1
kandamu
986
దయ్యమా కాయకసరైన దక్కనియ్య- | రేమి సేయుదు మను మోటులిలను గలరు భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
1915
పదవె భామిని కడకు బయినమై వచ్చెదనని లేచి శ్రీకృష్ణు డతిముదమునమహనియ్యమగు దివ్యమణికిరీటము దాల్చి వరరత్నభూషణావళులు మెఱయకర్ణశోభితమగు కనకకుండలములు పాదనూపురములు ప్రబలి మ్రోయపసిడిబంగారుదుప్పటివల్లెవాటుతో వెడలిన హరి జూచి వేగ జెలియ
3
seesamu
1097
నింబభూజమునకు నిర్మలోదక మిడి | మనిచినఁ దన చేఁదు మానఁగలదె పాపకూనకు మంచిపాల్పోసి పెంచిన | నెడరూను తన విషం బుడుగఁగలదె ఉల్లిగడ్డకుఁ దుషారోదకంబిడి ప్రోది | యిడినను దన కంపు విడువఁగలదె కందదుంపకుఁ బానకము పోసి పెంచిన | గొదలేని తన దూల వదలఁగలదె
3
seesamu
4132
_x000D_ కలియుగమునఁ బుట్టి కడతేఱఁగా లేక _x000D_ యొడలు బడలఁజేసి యుగ్రతపము _x000D_ తపసు చేసియేమి తత్వంబుఁ గనలేరు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3955
_x000D_ అగ్ని చేతఁబట్టి యాపరమేశుని _x000D_ నిండఁజేసి నరులు నీఱుగారె _x000D_ దక్షుక్రతువులోని తల్లడ మెఱుఁగరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2863
కాటుకకంటి నిగ్గులెసఁగం బొసఁగంగను నీ కటాక్షమై నాటెను ఱొమ్ము తాళఁగలనా లలనా? యిదిగాక కప్రపున్ వీటి యొసంగుచుం బికిలిపిట్ట వగం, గవ గన్ననాటి నీ కూటము లెన్న గుండె కరఁగుఁన్ జరగున్ ధృతి సుందరీమణీ!
6
vutpalamaala
1564
వప్రంబుల్‌ బడఁగూల్చి బల్విడి నభోభాగంబుతో రాయు చై త్యప్రాసాదముఁ గూలఁదన్ని విపులస్తంభంబుచే బాహుస త్త్వప్రావీణ్య మెలర్పఁ దద్వనముఁ దత్ప్రాసాదముం గాచు దే వప్రద్వేషుల నెల్ల దారుణగతిన్‌ భంజింపవే మారుతీ!
7
saardulamu
3663
_x000D_ స్త్రీలమాయచేతఁ జిక్కి తాఁ గొన్నాళ్ళు _x000D_ తగులు గోరునట్లు తగిలిపోవు _x000D_ తనిసిపోయి తాను దైవంబుచేఁజెడు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
456
చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం; బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం పొదవెడు నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా!
5
champakamaala
3657
_x000D_ పరబలంబుఁజూచి ప్రాణరక్షణమున _x000D_ కుఱికి పాఱిపోవు పిఱికినరుఁడు _x000D_ యముఁడు కుపితుఁడైన నడ్డ మెవ్వండయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3522
_x000D_ కుక్క యేమెఱుంగు గురులింగజంగంబుఁ _x000D_ బిక్కనొడిసిపట్టి పీఁకుగాక _x000D_ సంతపాకతొత్తు సన్యాసి నెఱుఁగునా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3588
_x000D_ కనకమేడల మంచి కాంతలయెడలను _x000D_ వలఁచియుందు రెంతవారలైన _x000D_ తోయజాక్షిఁ బాయుదొర లెవ్వరును లేరు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
173
వెఱపించఁ గలవొ చేవిలు నీ కొసంగి తా- విగతరోషుం డైన విప్రవరునిఁ గట్టించఁ గలవొ సాగరముపై సేతువు- మలలఁ గోఁతులమూక లలరఁ బట్టి ఘనత నీఁ గలవొ యన్నను గొట్టి తమ్మున- కారాజ్య మా చంద్రతారకముగ వేంచేయఁ గలవొ విన్వీథిఁ దేరగ నున్న- పుష్పకం బెక్కి నీపురికి మరల
3
seesamu
3601
_x000D_ కాఁగల పను లెల్లగా కెట్లుపోవును _x000D_ కాని పనులు భువిని కానె కావు _x000D_ మహిమవేఱె యుండు మనతోడ నున్నదా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1422
బోటి శతకోటిలోన నీ సాటియగు వ- । ధూటి యే మేటి వెతుక ముమ్మాటికైన నేటి మోహంబు నొక్కరితోటి దెలుప । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
4617
ఉరు శివయోగనిద్ర మెయినున్న తఱిన్‌ ఫణిహారి యేఁగుడున్‌ మరచి చనంగ జంగమసమన్వితమై మును బ్రాణమేగి యు ద్ధుర గతివారు వచ్చుటయుఁ దోడనె వచ్చిన జంగమాత్మ! నీ వరవుఁడ నేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
5
champakamaala
4147
_x000D_ నల్లబోడితలలు తెల్లనిగొంగళ్లు _x000D_ ఒడల బూడ్దెపూత యొంటిరోఁత _x000D_ యిట్టివేషములును పొట్టకోసము సుమీ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1342
వెనక జిక్కితిరో యని వెన్ను జరచి । నొసటి చెమ్మట పయ్యెదనొత్తికొనుచు నిలిచి నను జూచి పలికిన నీటు దలప । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
1089
జింక బొడ్డునఁ దావి జిల్లు కస్తురివోలె | జంబాలమున నీరజంబు వోలె మొరవ మంచిహొరంగుమెఱుఁగువజ్రమువలెఁ | గప్పచిప్పను మౌక్తికంబు వోలె సరసోత్కరమునందు విరిదేనియలు వోలె | నెండుగడ్డిని గృశానుండు వోలె వనబిడాలమునందుఁ గన జవాదిని బోలెఁ | బ్రకటింపఁ గృమియందుఁ బట్టువోలె
3
seesamu
1518
ఒక పాదంబు మహోదయాచలముపై నొప్పారఁగా నుంచి వే ఱొక పాదం బపరాద్రి మీఁద నిడి యయ్యుష్ణాంశుచే బల్విడిన్‌ సకలామ్నాయము లభ్యసించిన భవచ్చాతుర్య మేమందు దా పక దివ్యోరుతర ప్రభావము నుతింపన్‌ శక్యమే? మారుతీ!
4
mattebhamu
719
భ్రమరము గీటకంబుఁగొని పాల్పడి ఝాంకరణోపకారియై భ్రమరముగా నొనర్చునని పల్కుటఁజేసి భవాది దుఃఖసం తమసమెడల్చి భక్తి సహితంబుగ జీవుని విశ్వరూప త త్త్వమును ధరించుటేమరుదు దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
1070
కులుకుప్రాయంపు ముద్దుగుమ్మలును గలిగి | పొలుచువారలె మును నిన్నుఁ గొలుచువారు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
4016
_x000D_ సాధుసజ్జనులను సంతరించినవాఁడు _x000D_ ప్రజల సంతసంబు పఱచువాఁడు _x000D_ కదిసి శాత్రవులను గరుణఁజూచినవాఁడు _x000D_ పాదుకొన్న ముక్తిపరుఁడు వేమ.
1
kandamu
4231
_x000D_ ఇట్టి సాధువిద్య యెందులేదని చూచి _x000D_ గాఢవిద్య నేర్చి కానలేక _x000D_ సాధుసజ్జనముల సాంగత్యమెఱుఁగక _x000D_ బాధపడుదురు తుది పరులు వేమ.
0
aataveladi
824
శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగధర శౌరీ ద్వారకనిలయ జనార్దన కారుణ్యముతోడ మమ్ముఁ గావుము కృష్ణా.
1
kandamu
1154
దుర్జనుల నైనఁ దిట్టకు వర్జింపకు సుజనగోష్ఠి, పరులను నెల్లన్‌ నిర్జింతు ననుచుఁ ద్రుళ్ళకు, దుర్జనుఁడండ్రు నిను నిందఁ దోఁపఁ గుమారా!
1
kandamu
4343
వేదాంతమనుచు బ్రహ్మాదులెంచిన వెల్గు । నాదాంతసీమల నడరు వెల్గు సాధుజనానందసంపూర్ణమౌ వెల్గు । బోధకు నిలయమై పొసగు వెల్గు ద్విదశాబ్జమధ్యమందుదయమౌ వెల్గు । సుషుమ్ననాళంబునఁ జొచ్చు వెల్గు చూడఁజూడఁగ మహాశోభితంబగు వెల్గు । నిఖిలజగంబుల నిండు వెల్గు
3
seesamu
1338
తమిని కళలూర నొసట కెంజెమట జార । కదలవలదని యెదనెద నదిమి గదిమి యుపరతి యొనర్చునాటి నీ హొయలు దలప । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
1219
పదములపైఁ జెయివేయక మదవతి పతిచెంత నిద్ర మరగినఁ జేతుల్‌ గదలంగనీక కట్టుచు గదఁ గొని శిక్షించు యముఁడు కాంక్షఁ గుమారీ!
1
kandamu
963
విధవాకుచంబుల విధమున ససి చెడ్డ | పాడింట నిడిన దీపంబు కరణి, గాననాంతరమునఁ గాయు వెన్నెల రీతి | షండున కబ్బిన చాన పోల్కిఁ గ్రోఁతి చే నొదవిన కొబ్బరికాయ య- | ట్లంబుధిం బడిన తోయంబు మాడ్కి ముసిడిఁ బండిన ఫలమ్ముల చందమున దుష్ట- | ఫణిశిరంబున వెల్గు మణి విధమున
3
seesamu
4642
అనయము భక్తులీడ్యకులులంచును వేదములా ద్విజోత్తముల్‌ విన నుతియింపఁ గుక్కఁ జదివించిన హావినహళ్ళికళ్ళి దే వునకు ననుంగువాడవని యుత్సుకతన్‌ నుతియింతు భక్తహృ ద్వనజవిహారలోల బసవా! బసవా! బసవా! వృషాధిపా!
5
champakamaala
3
వైజయంతీధామ వర్ణిత సుత్రామ- శోభననామ లోకాభిరామ కువలయశ్యామ వికుంఠపట్టణధామ- శ్రుతిహితనామ దైవతలలామ కృత్యదైత్య సంగ్రామ గీతార్థ పరిణామ- యదుకులాంబుధిసోమ అఘవిరామ సంగర జిత భౌమ రంగద్గుణస్తోమ- త్రిభువన క్షేమ వర్ధిష్ణుకామ
3
seesamu
3309
_x000D_ ఆత్మలోన నాద మాలించి మాలించి _x000D_ యాసలందుఁ జిక్కఁ డాదియోగి _x000D_ ఆత్మలోనికళల నంటినఁ దత్వంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3778
_x000D_ ప్రాకటమున నిట్టిలోకములోఁ గుంటి _x000D_ పల్లెముత్తఁ డెన్న పరమగురుడు _x000D_ అన్నదానమునను హరిపూజచేతను _x000D_ హరుని లోనఁగలసె నరయ వేమా.
0
aataveladi
2444
నలుగురు నడచెడుత్రోవను బలిమిని లోకంబు నడచుఁ బ్రాజ్ఞుం డైనన్‌ నలువు రెఱుంగనిత్రోవలఁ జలియింపక నడచు నన్న! సంపఁగిమన్నా!
1
kandamu
3050
పాముమీఁదను జేరి సాము జేసితివంటె విషమైన జంతువు విడువనగునెపాలీయవచ్చిన పడతి జంపితివంటె దగవుమాలినయట్టి ధర్మమగునెమేనమామను గంసు మీఱి ద్రుంచితివంటె దుష్టనిగ్రహము నదోషమగునుపసులగాపరివాండ్ర పలుకులు వినకుంటె లీలావినోదంపు కేళియగునె
3
seesamu
2607
కరఢక్కారవవాద్య మింపొదవ గంగాతుంగరంగత్తరం- గరవప్రస్ఫుటతాళసమ్మిళిత తత్కంజాతపుంజస్ఫుర- ద్వరపుష్పంధయ మందరధ్వనులు గీతంబొప్ప తౌర్యత్రికం- బిరవై యుండఁగ నీదు తాండవమహం బేపారు సర్వేశ్వరా!
4
mattebhamu
3616
_x000D_ గతము చేసినట్టి కర్మబంధము లన్ని _x000D_ తరలిపోవు సత్యగురునివలన _x000D_ కమ్మరి కొకయేఁడు గుదియకు నొకనాఁడు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2754
ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్‌ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాఁడు ధన్యుడు సుమతీ!
1
kandamu
4589
సురవర పూజ్య! పూజ్యగుణశోభిత! శోభితరూప! రూప వి స్ఫురతరశీల! శీలగుణపుంగవ! పుంగవ సత్త్వ! సత్త్వసం వర పరవాద! వాద భయవర్జిత పాపవిచారచార! ఈ శ్వర సమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
5
champakamaala
3836
_x000D_ సాగి పాఱురారు సకలకార్యంబుల _x000D_ వాక్ప్రగల్భములచె వరలుచుండ్రు _x000D_ సాగిపాఱక సఱిసమకూడ దొక్కటి _x000D_ ధనమదెంతయున్న ధరను వేమా.
0
aataveladi
2089
జిత్త మన్యస్థలంబునఁ జేరకుండ - నీ పదాంభోజములయందు నిలుపరాదు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
3456
_x000D_ హంస మానసోద మంటక తిరిగిన _x000D_ యట్టు కర్మచయము నంటకుండ _x000D_ యోగి తిరుగు సకలభోగంబుతోడను _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2252
ప్రణుతింపన్ మృతదేహుఁ జూచి బ్రదికింపన్ బ్రహ్మరుద్రుల్ మరు ద్గణనాథాదులు నోప, రద్భుతము గాఁగన్ నీదు భృత్యుండు ల క్ష్మణు ప్రాణంబులు దెచ్చెఁ జచ్చినతఱిన్ సంజీవనీప్రక్రియన్ రణభూభాగములోనఁ దానె రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
1245
కడుఁ బెద్దమూటఁ దెచ్చినఁ జెడుగై వర్తించు నేనిఁ జిరతర చింతం బడుదురు తల్లిదండ్రులు తోఁ బడుచులు సోదరులు నిందఁ బడుదురుఁ గుమారీ!
1
kandamu
2579
సకలాధీశ్వరపట్టభద్రుఁడవు భిక్షాగామి వత్యంతశాం- తకళాత్ముండవు రౌద్రమూర్తి వతిసౌందర్యాంబికాసంగమా- ధికలోలుండవు దివ్యయోగివి మదిం దెల్లంబుగా నెట్టివా- రికిఁ దా శక్యమే నీ నిజం బరసి వర్ణింపంగ సర్వేశ్వరా!
4
mattebhamu
1968
శ్రీకిన్మందిరమైన వక్షము, సురజ్యేష్ఠోద్భవస్థాన నా భీకంజాతము, చంద్రికాంతర సుధాభివ్యక్త నేత్రంబులు\న్‌, లోకస్తుత్య మరున్నదీజనక మాలోలాంఘ్రియు\న్‌ గల్గు నా లోకారాధ్యుఁడ వైన నిన్నెపుడు నాలోఁ జూతు, నారాయణా!
7
saardulamu
1992
తనచిత్తాబ్జము మీపదాబ్జములకుం దాత్పర్యసద్భక్తి తం తున బంధించిన బంధనంబు కతనం దుష్పాపపుంజంబు లె ల్లను విచ్ఛిన్నములై యడంగు మహిమోల్లాసాబ్ధి యైనట్టి దా సున కింపొందును మోక్షవైభవము దా సుశ్లోక నారాయణా!
4
mattebhamu
2056
పసరంబు పంజైనఁ బసులకాపరి తప్పు - ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు భార్య గయ్యాళైనఁ బ్రాణనాథుని తప్పు - తనయుఁడు దుష్టైన తండ్రి తప్పు సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు - కూఁతురు చెడుగైన మాత తప్పు అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు - దంతి దుష్టైన మామంతు తప్పు
3
seesamu
63
కవ్వడి కెంత చక్కఁగ బోధ చేసిన- నితరహింసాకర్మ మిష్టపఱుప రాయబారం బెంత రసికత నడిపిన- ననికి భారతుల నాయత్త పఱుప విశ్వరూపం బెంత విమలతఁ జూపిన- నోర్వని కురురాజు నులుకు పఱుప విలుఁ బట్ట నని యెంతొ చెలిమిగఁ బలికిన- నవల సుయోధను నాసపఱుప
3
seesamu
2016
ధర గ్రామాధిపు నింటిదాసుఁడు వెసం దా ద్రోహముం జేసినన్‌ పరగం జెల్లుట సూచి తీ భువనసంపాద్యుండ వైనట్టి మీ వరదాసావలి దాసదాసి నని దుర్వారౌఘముల్‌ జేసితి\న్‌ కరుణం జేకొని కావు మయ్య త్రిజగత్కల్యాణ నారాయణా!
4
mattebhamu
4282
అరిసెలు నూనెబూరియలు నౌఁగులుఁ జక్కెరమండిగల్‌ వడల్‌ బురుడలు పాలమండిగ లపూపముల య్యలమేలుమంగ నీ కరుదుగ విందువెట్టు పరమాన్నచయంబులు సూపకోటియు\న్‌ నిరతి వినిర్మలాన్నములు నేతులసోనలు వేంకటేశ్వరా!
5
champakamaala
3693
_x000D_ అధిక సూక్ష్మమైన యానంద మెఱుఁగక _x000D_ మతియు లేక చదివి మగ్నుఁ డయ్యె _x000D_ నతిరహస్య మెల్ల నాజనుఁ డెఱుఁగునా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3298
_x000D_ దోసముల్లువంటి తుర్యమం దాత్మను _x000D_ జూచి యాసలనటుతోచివేసి _x000D_ వాసనను దెలిసినవాఁడెపో బ్రహ్మంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3431
_x000D_ తాను దానె యనెడి తత్వాల లోపల _x000D_ నన్య మెఱుఁగకుండు నబ్బతోడు _x000D_ తానెతానునయిన దల్లడం బేలరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2364
వాటమగురీతి ముక్తిక వాటము భేదింప నెట్లు వశపడుఁ దనలో నాటుకొనుమాయఁ దగ ను చ్చాటన మొగిఁ జేయకున్న సంపఁగిమన్నా!
1
kandamu
2748
ఇమ్ముగఁ జదువని నోరును 'నమ్మా' యని పిలిచి యన్న మడుగని నోరు\న్‌ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
1
kandamu
1468
యేలనే గోల చలము నీకేల సైప- । జాల నీ జాలమేల నన్ చాలరతుల దేల దయనేలకున్న నీవేళ తాళ । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
3604
_x000D_ మొదట నాకుఁ బెట్టి తుది లేదు పొమ్మను _x000D_ పరమలోభులైన పాపులకును _x000D_ వారియుసురు దాకి వగచెడి పోవరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2174
ప్రహ్లాదుఁ డేపాటి పైఁడి కానుక లిచ్చె? - మదగజం బెన్నిచ్చె మౌక్తికములు? నారదుం డెన్నిచ్చె నగలు రత్నంబు? ల - హల్య నీకే యగ్రహారమిచ్చె? ఉడుత నీ కేపాటి యూడిగంబులు చేసె? - ఘనవిభీషణుఁ డేమి కట్నమిచ్చె? పంచపాండవు లేమి లంచ మిచ్చిరి నీకు? - ద్రౌపతి నీ కెంత ద్రవ్యమిచ్చె?
3
seesamu
3480
_x000D_ లోను బదిలపఱచి లోనివికారముల్‌ _x000D_ దలఁచి మెట్టువారు తెలియువారు _x000D_ ఆకసమున వేడ్కనరయంగ నుందురు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2459
శోధింపరు తత్త్వజ్ఞులు నీధరఁ దమతోడిసరికి నీదుర్మనుజుల్‌ మేధావంతులు పెద్దలు సాధువు లని యెంతు రన్న! సంపఁగిమన్నా!
1
kandamu
4446
యిచ్చినను నేమి వినయోక్తు లెఱుఁగవలయు । గడుసుకూఁతల సత్కీర్తి కలుగబోదు మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
3912
_x000D_ ఆలిఱంకుఁ దెలుపు నఖిలయజ్ఞంబులు _x000D_ తల్లిఱంకు తెలుపుఁ దద్దినములు _x000D_ కానితెరువు కర్మ కాన కల్పితమాయె _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1439
తమ్మిలో నవకందమము తేటలా చంద- । మామ యందముదీసి మోముజేసి పూబంతిలో సౌరు ప్రొద్దులో తళ్కు క- । డాని చాయల గూర్చి మేనొనర్చి మల్లెమొగ్గల చాలు మంచికెంపుల డాలు । వజ్రంపు జిగిని పల్వరుస దీర్చి గాజుగిన్నెల నున్పు గట్టుగట్టిన వీణె- । కాయల తీరు చన్గవనొనర్చి
3
seesamu
220
రకపుం గావ్యకళాకలాపరచనాప్రాగల్భ్యసంసిద్ధికై ప్రకటప్రేమ భజింతు నీశ మకుటప్రస్ఫీతగంగాజలా- ధికమాధుర్యకవిత్వధూర్వహన ధీదివ్యప్రభావాఢ్యఁ ది- మ్మకవిశ్రేష్ఠు మదగ్రజున్ మదిని రామా! భక్తమందారమా!
4
mattebhamu
646
"రామహరే కకుత్స్థకుల రామహరే రఘురామరామ శ్రీ రామహరే" యటంచు మది రంజిల భేకగళంబులీల నీ నామము సంస్మరించిన జనంబు భవంబెడబాసి తత్పరం ధామనివాసులౌదుఁరట దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
1151
ధీరుఁడు తనదగు సంపద జారినయెడఁ జింత నొందఁజాలక తా ల క్ష్మీరమణుని వరచరణాం భోరుహములు గొలిచి ముక్తిఁ బొందుఁ గుమారా!
1
kandamu
3646
_x000D_ స్థిరముగాని క్షుద్రపర నటనలుచేసి _x000D_ హెచ్చుతగ్గు లొంది హీనమతులు _x000D_ గాడ్దెపిల్ల లరుతుఁ గ్రక్కునఁ జెడుదురు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
502
లోకములోన దుర్జనుల లోఁతు నెఱుంగక చేరరాదు సు శ్లోకుఁడు చేరినం గవయఁజూతురు చేయుదు రెక్కసక్కెముల్‌ కోకిలఁ గన్నచోట గుమికూడి యసహ్యపుఁ గూతలార్చుచుం గాకులు తన్నవే తఱిమి కాయము తల్లడమంద భాస్కరా!
6
vutpalamaala
3837
_x000D_ అదయ హస్తమందు నభయహస్తంబీయ _x000D_ దర్పకాంగుఁడైన తన్నుఁ జూచి _x000D_ మంగళంబుచేయు మంగళహీనుఁడు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
975
ఆసనబేదంబు లనుకొంటి సేనియా- | డులు సాల రచ్చింపవలెనటంట కైసవరుఁడనంట నాసారపుసుకుఁడ- | నంట యేధాంతుండనంట పెద్ద- యెద్దు మారిసుఁడనంట సిద్దాంతుడనటంట | వాసి పేగుల నంటదోసినంట సోమాదిగులనంట సామిపాకాలంట | సంతుకు తంబులు సతుకుకుంట
3
seesamu
3545
_x000D_ పూసపోగుపైడి పుట్టంబు విడియంబు _x000D_ కాయపుష్టిమిగులఁ గలిగియున్న _x000D_ హీనజాతి నైన నిందురమ్మందురు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
840
మడుగుకుఁ జని కాళీయుని పడగలపై భరతశాస్త్ర పద్ధతి వెలయ\న్‌ గడువేడుకతో నాడెడు నడుగులు నా మదిని దలఁతు నచ్యుత కృష్ణా.
1
kandamu
202
మనుజయత్నంబు బల మెంత మాత్ర మీవు-నిజము కరుణించు నాతఁడే విజయుఁ డరయ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi