id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
4489
తన తల్లి శిశువుల తల ద్రుంచివైచినఁ । జెడుముండ యనుచు వచింపరాదె తన తండ్రి యొరుల విత్త మపహరించిన । నన్యాయవర్తనుం డనఁగరాదె తన దేశికుఁడు పరదారసంగ మొనర్పఁ । బాపకర్ముండని పలుకరాదె తన రాజు ప్రజలపట్ల నదప జూచినఁ । గ్రూరాత్ముఁడనుచు వాక్రువ్వరాదె
3
seesamu
2323
వివిధబ్రహ్మల యంత్యకాలముల నేవే నిల్వ వావేళలన్ ధ్రువుఁడో యొండె విభీషణుండు బలి యుందుర్ వారు నీ దాసులై న విశేషంబునఁ గాక తక్కొరుల కుండంబోలునే యింద్రరు ద్రవిరించిస్తుత శౌర్యసార! రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
2330
బహురూపాలు ధరించుకొంచును గ్రియాభాషాంగము ల్ముట్టఁగా బహుకాలంబులనుండి యాడితి నిఁకం బ్రాల్మాలినట్లయ్యెడిన్ దహలంబెట్టక చాల్పురేయనుము నీత్యాగంబు నేనొల్ల సా గ్రహ దైతేయ మదాపహార! రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
4403
చదువుచుండెడివేళ సభలోనఁ గూర్చుండి । దున్నపోతుల కొడుకెన్నుఁ దప్పు విద్యాధికుల కిచ్చువేళడ్డుపడి మాల- । ధగిడీల కొడుకు వద్దనుచుఁ జెప్పు ధనమెక్కుడుగఁ గూర్చి తినలేక యేడ్చెడి । పెనులుబ్ధుఁ డర్థుల గనిన ఱొప్పు బిరుదుగల్గిన యింటఁ బెరిగినఁ గొణతంబు । విప్పినంతనె కుక్క వెదకుఁ జెప్పు
3
seesamu
1386
లేవి జూచిన దాని కెమ్మోవిఠీవి । సాటియగు డాలుగాన ముజ్జగములోన పరవశముతోన వలరాజుపనులు మాన । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
3809
_x000D_ పేదవాని బాధ పెనుభూతమై యుండు _x000D_ చూడ నట్టిబాధ జాడ కనదు _x000D_ కలుగువాని బాధ కనులఁ జూడఁగ రామి _x000D_ కేమి చెప్పవచ్చు నింక వేమా.
0
aataveladi
3092
చంపఁదగిన యట్టి శత్రువు తన చేతఁ జిక్కెనేని కీడు సేయ రాదు పొసఁగ మేలు జేసి పొమ్మనుటే చాలు! విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1211
ఇల ఫక్కికులోద్భవుఁడ ప్పల నరసింహాఖ్యుఁ డిట్టి పద్ధతులు ధరం గల బాలుర కెల్ల గుణం బులు కలుగఁగ వెలయఁజెప్పె బుద్ధి కుమారా!
1
kandamu
3394
_x000D_ నిజము వరుస నెఱిఁగి నిత్యుండు గావలె _x000D_ పలుకులోనిపలుకు పదిలపఱపు _x000D_ పలుకుఁజూడ నెవరొ పరికించి చూడరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2538
అరయన్ గర్మవిధావధానవిధివద్ధ్యానోత్తమజ్ఞానముల్ వరుసన్ బేర్కొన నాల్గుయోగములు తత్త్వంబెందు నీ భక్తి వి- స్తరబాహ్యక్రియలెల్లఁ బొల్లులగుటం దద్భక్తియోగంబు తాఁ బరగం దక్కిన మూఁడుయోగములకుం బ్రాణంబు సర్వేశ్వరా!
4
mattebhamu
842
వారిజ నేత్రలు యమునా వారిని జలకంబులాడ వచ్చిన నీ వా చీరలు మ్రుచ్చిలి యిచ్చితి నేరుపురా యదియు నీకు నీతియె కృష్ణా.
1
kandamu
2959
బుట్టి వెతలకు లోనయి యెట్టులుందు | మంచిపనిగాదు రమ్మని మందలించితరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన.
2
teytageethi
4264
తిరుమగు మంచి కుందనపుఁ దీగపయిన్‌ ఘనచక్రవాకముల్‌ పరగినరీతిఁ జన్నుఁగవ భావముతో నలమేలుమంగ నీ యురముపయిం జెలంగఁగని యోగిజనంబులు నీలమేఘవి స్ఫురణముతోడి మిం చనుచుఁ జూచి నుతింతురు వేంకటేశ్వరా!
5
champakamaala
3572
_x000D_ మొదల క్రియను దప్పి మోసంబుచేసియు _x000D_ పొట్టకొఱకు మనసుఁ బొందుపఱచి _x000D_ బీద కుక్కరీతి పెరుగును మనుజుండు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1099
ఎనుబోతునకు విద్దె లెన్నింటి నేర్పిన | మడుగున కేగుటల్ మానఁగలదె శునకంబునకు నెన్ని సూడిదల్ వెట్టినఁ | బుల్లెలు నాకక మళ్ళఁగలదె గాడిద కెన్ని సింగారముల్ దిద్దిన | బూడ్దెలోఁ బొరలక పోవఁగలదె యూరబందికి నెన్ని తీరుల మేపినఁ | బరగళ్ళ కేగక బ్రదుకఁగలదె
3
seesamu
2413
చేతావాతాగొట్టెడి ఘాతుకు లవివేకు లనుచుఁ గని వారలతోఁ నీతిపరు లడ్డ మాడరు చాతుర్యధురీణు లెన్న సంపఁగిమన్నా!
1
kandamu
2253
ఏ తాత్పర్యము గల్గి కొల్చెదవురా? యే నేల నిన్మెత్తురా? నీతో నాకుఁ బనేమిరా? యనక మన్నింపం దగున్; మున్ను నీ చేతన్ మోక్షముఁ గన్నవారి వినమా చిత్రంబుగా నిర్జరా రాతిన్ నాతిని రాతిఁ దొల్లి రఘువీరా! జానకీనాయకా!
7
saardulamu
3928
_x000D_ కలుషమొక్క యింత గాన్పింప దెందును _x000D_ జూడ నెవరికైన సొంపుమీఱఁ _x000D_ దామసం బడంగఁ దావెల్గు జ్ఞానంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3828
_x000D_ తన్నువలె నవియును ధరఁబుట్టినవి గావొ _x000D_ పరఁగఁదమ్మువంటి బ్రతుకు గాదొ _x000D_ జ్ఞాని జ్ఞానిఁ జంపిఁ గారణమేమిరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
349
తనకున్ మిక్కిలి ముజ్జగంబుల కిఁకన్ దైవంబు లేఁడంచుఁ బా- యని దర్పంబున దైత్యదానవమునీంద్రామర్త్యసంసత్పదం- బున వాదించు విరించి పంచమమహామూర్ధంబు ఖండింపవే కన నత్యుద్ధతభైరవాకృతిని భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
3221
_x000D_ కస్తూరి యటుచూడఁ గాంతి నల్లగనుండు _x000D_ పరిమళించుదాని పరిమళంబు _x000D_ గురువులయినవారి గుణము లీలాగురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
744
శీలంబు\న్‌ గులము\న్‌ వివేకనిధి లక్ష్మీకాంతవక్షస్స్థలి\న్‌ హాళింబాయకయుండు కాముకుఁడవై హంకారవృత్తి\న్‌ సదా స్త్రీలోలుండన రాధతోఁ బెనఁగుట ల్చిత్రంబులు న్నౌర నీ జాలం బే మని సన్నుతించెదను కృష్ణా దేవకీనందనా.
7
saardulamu
2074
తల్లిదండ్రులు భార్య తనయు లాప్తులు బావ - మఱఁదు లన్నలు మేనమామ గారు ఘనముగా బంధువుల్‌ గల్గినప్పటికైనఁ - దాను దర్లఁగ వెంటఁదగిలి రారు యముని దూతలు ప్రాణమపహరించుక పోఁగ - మమతతోఁ బోరాడి మాన్పలేరు బలగ మందఱు దుఃఖపడుట మాత్రమె కాని - యించుక యాయుష్యమియ్యలేరు
3
seesamu
2415
దేహమె తా నై యున్నెడ దేహముతోఁగూడఁ గాలితేనే నిజమౌ దేహాత్మవాదిమాటలు సాహసములు బొంకులన్న సంపఁగిమన్నా!
1
kandamu
2060
మాన్యంబులీయ సమర్థుఁ డొక్కఁడు లేఁడు - మాన్యముల్‌ చెఱుప సమర్థులంత యెండిన యూళ్ల గోఁడెఱిఁగింపఁ డెవ్వఁడుఁ - బండిన యూళ్లకుఁ బ్రభువులంత యితఁడు పేద యటంచు నెఱిఁగింపఁ డెవ్వఁడు - కలవారి సిరు లెన్నఁగలరు చాలఁ దనయాలి చేష్టల తప్పెన్నఁ డెవ్వఁడు - బెఱకాంత ఱంకెన్నఁ బెద్దలంత
3
seesamu
2216
నిగమగోచర! నేను నీకు మెప్పగునట్లు - లెస్సగాఁ బూజింపలేను సుమ్మి నాకుఁ దోఁచిన భూషణములు పెట్టెదనన్నఁ - గౌస్తుభమణి నీకుఁ గలదు ముందె భక్ష్యభోజ్యముల నర్పణముఁ జేసెద నన్న - నీవు పెట్టితి సుధ నిర్జరులకుఁ గలిమికొలదిగఁ గానుకల నొసంగెద నన్న - భార్గవీదేవి నీ భార్యయయ్యె
3
seesamu
2655
పదునాల్గేలె మహాయుగంబులొక భూపాలుండు, చెల్లించె న య్యుదయాస్తాచలసంధినాజ్ఞ నొకఁడాయుష్మంతుఁడై వీరి య భ్యుదయంబెవ్వరు చెప్పఁగా వినరొ? యల్పుల్మత్తులై యేల చ చ్చెదరో రాజులమంచు నక్కటకటా! శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
2309
తలఁపం జిత్రము మీ మహత్త్వములు మీ దాసుల్ మహాభాగ్యవం తులు త్రైలోక్యమునన్ బదస్థుఁడు ధ్రువుం డుండున్ నభోమండలిన్, బలి పాతాళమునన్, విభీషణుఁడు భూభాగంబునం, బద్మజ ప్రలయంబైనను బోవరౌర! రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
2126
కువలయశ్యామ! నీకొలువు చేసిన నాకు - జీత మెందుకు ముట్టఁజెప్పవైతి మంచిమాటలచేతఁ గొంచెమియ్యఁగలేవు - కలహమౌ నిఁకఁ జుమ్మి ఖండితముగ నీవు సాధువు గాననింత పర్యంతంబు - చనవుచే నిన్నాళ్ళు జరుపవలసె నిఁక నేసహింప నీవిపుడు నన్నేమైన - శిక్ష చేసినఁ జేయు సిద్ధమైతి
3
seesamu
2829
రూపించి పలికి బొంకకు ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ గోపించు రాజుఁ గొల్వకు పాపపు దేశంబు సొరకు పదిలము సుమతీ!
1
kandamu
2310
చెలఁగన్ మర్త్యులు వేగి లేచి తమిచేఁ జేయంగఁ బాపంబు లీ కలుషంబుల్ పెడఁబాయ నేదిగతి? యింకన్ ద్రోవ యొండెద్ది? పు ర్వులగుంటం బడనీని పోకడయు నేర్పున్ బుద్ధియుం గల్గువా రలు నీ సేవకు లౌట లెస్స రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
3532
_x000D_ సుతులు పతులు మాయ సుఖదుఃఖములు మాయ _x000D_ సంస్మృతియును మాయ జాతిమాయ _x000D_ మాయబ్రతుకుకింత మాయ గల్పించెరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1533
పటుపాథోధి తరంగ పంక్తులు గణింపం బోవు చందాన ను త్కటవేగంబునఁ బోవు నిన్నుఁ గని వేడ్కన్‌ వీతసందేహులై చటుల స్థైర్యబలద్యుతిస్యదమతుల్‌ శౌర్యంబు ధైర్యంబు మి క్కుట మౌఁగా కని నీకొసంగరె దివౌకుల్‌ దీవనల్‌ మారుతీ!
4
mattebhamu
530
హరిముఖసర్వదిక్పరివృతార్చితపాదసరోజుఁడైన య- క్కరిముఖుఁ డెప్పుడున్ వితతకౌతుకలీలఁ బొసంగఁజేయుఁబో నిరతముగాఁ ద్వదీయపదనీరజభక్తు లొనర్చు సత్కృతుల్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
2888
గడి యెడబాసి చిత్రఫలకంబున నా నునుచూపు వ్రాసి న- ల్గడలును జూచి మోహమున కన్నులనద్దుక చన్నుదోయిపై నిడికొని జంకుకొంకునెడ నేఁ గనుగొందు పిఱుందపొంచి బ- ల్వెడవిలుకాఁడు కత్తి ఝళిపించెను కోయను సుందరీమణీ!
5
champakamaala
1987
వరకాళిందితరంగడోలికలలో వైకుంఠధామంబులో వెర వొప్పార నయోధ్యలో మధురలో వ్రేపల్లెలో ద్వారకా పురిలో నాడెడుభంగి నాదుమదిలో భూరిప్రసన్నాననాం బురుహం బొప్ప నటించు టొప్పును సితాంభోజాక్ష, నారాయణా!
4
mattebhamu
3250
_x000D_ లోకములకు గురువు లోకులకును గురు _x000D_ వదియుఁ దెలిసి మోక్ష మందుగోరి _x000D_ గురునిఁ గనక నరక కూపము నందురు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3260
_x000D_ కానలేఁడు నుదురు కర్ణముల్‌ వీఁపును _x000D_ నెఱులు కానలేఁడు నెత్తిమీఁద _x000D_ తన్ను గానలేఁడు తత్వ మేమెఱుఁగును _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4036
_x000D_ చంపఁదలఁచురాజు చనవగ్గలం బిచ్చుఁ _x000D_ జెఱుపనున్న పగఱ చెలిమిసేయుఁ _x000D_ గఱవనున్న పాము నెఱికాచుకొనియుండు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3649
_x000D_ తనకు ప్రాప్తిలేక దానమియ్యరటంచు _x000D_ దోషబుద్ధిచేత దూరుటెల్ల _x000D_ ముక్కువంకఁ జూచి ముక్కఱదూరుట _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1825
చెఱగు మాసిన మొదముల్ చెలియ మూడవనాడు గడిచి వేడ్కను జలకంబులాడిపసపూని నెమ్మేన మిసిమికాంతి చెలంగ చాన పాదిరిపూల చాదుబెట్టినొసట బాసటబొట్టు పసమించు వజ్రాల యాభరణంబుల నమర దాల్చితళుకుబంగరు బుటేదారి పావడ పైని సరిగె పైటచెరంగు జాళువార
3
seesamu
4192
_x000D_ గట్టురాళ్ళఁ దెచ్చి కాళ్ళచేతులఁ ద్రొక్కి _x000D_ కాసెయులులచేతఁ గాసిఁజేసి _x000D_ మొఱుపురాళ్ళ కెఱగుమొప్పెల నేమందు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1464
వెరవకని మోదమలర నామీద ప్రేమ । నింపగా రాద జాలి యొక్కింత గాద తరుణి యికమీద విరహసాగరము నీద । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
3418
_x000D_ నరకులమునఁ దాఁబుట్టియు _x000D_ నరకులమునఁ దాని బెరిగి నరుఁడయ్యును దా _x000D_ నరకులమును ఛీ ఛీ యని _x000D_ హరకులమునఁ దిరిగెనేని హరుఁడగు వేమా.
1
kandamu
4490
యిట్టి పలుకులు తప్పుగా నెన్నునట్టి । కుటిలచిత్తుల గర్వంబు కొంచెపఱుప మీకు గాకన్యులకు శక్యమే తలంప మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
412
కాకిన్శాశ్వతజీవిగా నునిచి చిల్కన్వేగ పోకార్చి సు- శ్లోకుం గొంచెపుటేండ్లలోఁ గెడపి దుష్టుం బెక్కునాళ్లుంచి య- స్తోకత్యాగి దరిద్రుఁ జేసి కఠినాత్మున్ శ్రీయుతుం జేయు నా- హా! కొంకేదిఁక నల్వచెయ్వులకు? భర్గా! పార్వతీవల్లభా!
7
saardulamu
4387
కన్నెనిచ్చినవానిఁ గబ్బమిచ్చినవాని । సొంపుగా నింపుగాఁ జూడవలయు అన్నమిచ్చినవాని నాదరించినవాని । దాతఁగాఁ దండ్రిఁగా దలపవలయు విద్యనేర్పినవాని వెఱపుదీర్చినవాని । గురునిగా హరునిగా నెఱుఁగవలయు కొల్వు గాచినవానిఁ గూర్మి చూపినవాని । సుతునిగా హితునిగాఁ జూడవలయు
3
seesamu
2512
తమ తేజంబుఁ దృణీకరించుచు సముద్యత్తేజులై మీఁదిలో- కములందున్ జరియించు నీ యచలభక్తశ్రేష్ఠులం జూచి నె- య్యమునం దారును దద్విధంబునను నిన్నర్చింప నూహించి మ- ర్త్యమునం బుట్టఁగ వాంఛసేయుదు రమర్త్యశ్రేణి సర్వేశ్వరా!
4
mattebhamu
890
ఒకసారి నీదునామము ప్రకటముగాఁ దలఁచువారి పాపము లెల్ల\న్‌ వికలములై తొలఁగుటకును సకలార్థ యజామిళుండు సాక్షియె కృష్ణా.
1
kandamu
1795
సుదతి దా దశవిధచుంబనగతులను దన భర్తకును దెల్పు దావులరయగుచయుగంబులు నాభి గొనబైన కెమ్మోవి హస్తముల్ చెక్కులు మస్తకంబుకక్షంబు నుదురును కంఠంబు మరునిల్లు వదలక పదిచోట్ల ముదము మీరకరికరలీలల గావించి నఖముల ముద్దులాడగ గొంత మొనయవలయు
3
seesamu
1447
శుకమా చికాకు సేయకుమా యటన్న శా- । రిక మాట వినుట నాయికము గాదు పికమా భళాన యోపిక మానియున్న నీ- । విక కూయుచుండ భావికము గాదు మదమా శబాసు షట్పదమా సరేనె నీ । రొద మానవైతివే ముదమె నీకు బతిమాలుకొన్న నీ మతి మానలేవు మా- । రుత నీ చలంబు శాశ్వతము గాదు
3
seesamu
4162
_x000D_ తాను విమలుఁడైనఁ దనగుణ మంతయు _x000D_ శివుని కీనిగురువు చెడుగురుండు _x000D_ గ్రుడ్డిగుఱ్ఱ మెక్కి గుడి దిరిగినటుల _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1241
మృతియైనను బ్రతుకైనం బతితోడనె సతికిఁ జెల్లుఁ బతిబాసిన యా బ్రతు కొక బ్రతుకా! జీవ న్మృతి గాక వధూటి కెన్న నిదియుఁ గుమారీ!
1
kandamu
4249
అతఁడె నీవు, నీ వనఁగ నాతఁడు, నీ పలుకే తలంపఁగా నాతనిపల్కు నీ హృదయ మాతఁడె పో యలమేలుమంగ నీ చేతిదె సర్వజంతువుల జీవన మంతయు నంచు సన్ముని వ్రాతము సన్నుతించు ననివారణ నీసతి వేంకటేశ్వరా!
6
vutpalamaala
1539
తతవేగంబున వార్థి దాటి గడిమిం దద్యామ్యతీరస్థ ప ర్వతముం జేరి నగోపమాన నిజగాత్రవ్యాప్తి జాలించి, ని ర్గత మోహుండగు యోగిభంగిఁ బ్రకృతిం బ్రాపించి, లంకాపురీ స్థితసర్వంబును బోల జూచితివి గాదే దవ్వులన్‌ మారుతీ!
4
mattebhamu
1069
మణిభూషణములు చామరములు ముత్యాల | గొడుగులు పడిగలు గుజ్జుపరపు మిద్దెటిళ్ళు మెఱుంగుటద్దముల్ గద్దియల్ | చందుగల్ చందువాల్ మందసములు పూలపాన్పులు శీరతాళవృంతము మేల్ | కలపముల్ తూగుటుయ్యెలలు పసిఁడి- పల్లకీలు గుఱాలు బంట్లు బానిసలును | ధనధాన్య వసన గో దంతి తతులు
3
seesamu
3329
_x000D_ మనసుఁ బాఱవీడి మనసుఁ దా మగుడించి _x000D_ మనసులోనఁగలుగు మర్మమెఱిగి _x000D_ మనసు తాను నిల్ప మఱియుఁదా బ్రహ్మంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1114
తనపై దయ నుల్కొనఁగను గొన నేతెంచిన సుశీల గురుమతులను వం దనముగఁ బూజింపఁ దగు మనమలరఁగ నిదియ విబుధ మతము కుమారా!
1
kandamu
2005
మదిలో నుత్తమభక్తి పీఠముపయి\న్‌ మానాథ మీపాదముల్‌ గదియం జేర్చిన వాని కే నొడయడన్‌ గా దంచు నత్యున్నతిన్‌ పదిలుం డై సమవర్తి మృత్యువునకు\న్‌ బాఠంబుగాఁ బల్కు మీ పదపద్మార్చకు లెంత పుణ్యులొ కృపాపారీణ నారాయణా!
4
mattebhamu
1667
క్షీరము శర్కరాన్నమును జిక్కని గట్టిపెరుంగు పాయసం- బారయ బొజ్జ నిండునటు లామెతగాఁ దినిపించి బిడ్డఁ డే- మో రహిలేక ముట్టఁ డని మో మఱ వాంచుచు “ముద్దులయ్యగా, రార” యటంచుఁ బిల్చుచును రాజిలు తల్లినిఁ బోలరెవ్వరున్.
6
vutpalamaala
2478
ఇన విఘ్నేశ్వర మాతృకాద్రుహిణ బ్రాహ్మీ స్కంద దుర్గా రమా వనితాధీశ్వర భైరవుల్ బలిసి భాస్వద్భక్తిసంయుక్తి నీ- కనిశంబుం బరివారభృత్యనికరంబైరన్న నిన్నింకం గొ- ల్వనివారెవ్వ రజాండభాండములలో వర్ణింప సర్వేశ్వరా!
4
mattebhamu
2496
పలుతీర్థంబులఁ గ్రుంకుకంటె మహిలో భక్తాంఘ్రిపానీయముల్ తలమీఁదం జిలికించుకొన్న శుచితీర్థం బాడ భారంబు త- త్ఫల మత్యల్పము భక్తపాదయుగళాంభఃస్పర్శ నిర్భారమై యలరున్ శాశ్వతభుక్తిముక్తిఫలదంబై యుండు సర్వేశ్వరా!
4
mattebhamu
1812
యవుర నా సామి విడువకుమనుచు జాల మ్రొక్కి కౌఁగిట జేరిచి ముద్దుబెట్టికొసరి భర్తను లాలించు కోమలాంగి | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
1864
మగువ యీ రీతి మోహాబ్ధిమగ్న యగుచు | నున్న దాయింతి నెడబాయ నుచితమగునెజాగుసేయక రావయ్య సారసాక్ష | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
2134
పలురోగములకు నీపాదతీర్థమె కాని - వలపు మందులు నాకు వలదు వలదు చెలిమిసేయుచు నీకు సేవఁ జేసెదఁ గాన - నీ దాసకోటిలో నిలుపవయ్య గ్రహభయంబునకుఁ జక్రముఁ దలంచెదఁ గాని - ఘోరరక్షలు గట్టఁగోరనయ్య పాముకాటుకు నిన్నుఁభజనఁ జేసెదఁ గాని - దాని మంత్రము నేను తలఁపనయ్య
3
seesamu
4530
గలియుగమ్మున వర్ణసంకరము ప్రబలి । యుత్తమకులంబు లొకమూల నొత్తిగిల్లె మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
1765
తలవాకిలిల్లుగా దన ప్రాణనాథుని రాక కెదురుచూచు రాజవదనవచ్చిన దన విభు గ్రుచ్చి కౌఁగిట జేర్చి మచ్చికతో బల్కు మందయానమజ్జన మొనరించి మంచిగంధము మేన నలది వేడ్క యొనర్చు నబ్జపాణిపళ్లెరమిడి చాల బసయైన కూరలు రతిరసాన్నము పెట్టు కుసుమగంధి
3
seesamu
4402
అహహ! కలియుగధర్మ మేమనఁగ వచ్చు । నన్నిటికి నోర్చి యూరక యుండదగునే మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
4591
రుద్ర గణాదిరుద్ర! వినిరూపిత లింగసుఖాదిసంద్ర య చ్ఛిద్ర! దయాసముద్ర! సవిశేష పరాక్రమ వీరభద్ర! య క్షుద్ర జనావళీభవ నిషూదన రౌద్ర! సమస్త భక్త దే వ ద్రుమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
1213
శ్రీ భూ నీళా హైమవ తీ భారతు లతుల శుభవతిగ నెన్నుచు స త్సౌభాగ్యము నీ కొసఁగఁగ లో భావించెదరు ధర్మలోల కుమారీ!
1
kandamu
4456
సతముగల భూషణము లెన్నిజన్మములకు । యెట్టివైనను వీని కెచ్చేమిగలదు మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
4019
_x000D_ ధనము లేమి యనెడు దావానలం బది _x000D_ తన్నుఁ జెఱచును దరిదాపుఁ జెఱచు _x000D_ ధనములేమి చూడఁదలఁచగా పాపంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
782
ధారాపూర్వముగాఁగ సంయమికి సప్తద్వీపముల్‌ సూనృత ప్రారంభమున నిచ్చి చేతితడియాఱ\న్‌ లేక వర్తింపఁడే శారీరార్థ మటంచు భిక్షము హరిశ్చంద్రుండు యాగాదిసం చారుం డుండు మనండె తొల్లి హరి కృష్ణా దేవకీనందనా.
7
saardulamu
2508
భవదభ్యర్చనవేళలన్ భవుల సంపద్భ్రాంతులన్ దీనమా- నవులన్ విద్విషులన్ భవాతురుల సన్మానించుటల్ సౌఖ్యము- ఖ్యవిహారేచ్ఛలు నీ మహత్త్వములు నిత్యానంద మూహించుచో భువి నీ భక్తుల కాత్మలో విరసము ల్వుట్టించు సర్వేశ్వరా!
4
mattebhamu
1330
నరనిదుర జెంది పవళించినట్టివేళ । వచ్చి మెల్లనె సైగగా నెచ్చరించి పైకొని యొనర్చునటువంటి పనులు దలప । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
262
గణుతింపంగ నరాధముల్ సుకవికిం గాసీనివాఁడున్ దయా- గుణ మొక్కింతయు లేనివాఁడు నొరుపై గొండెంబు గావించువాఁ డణుమధ్యన్ సతిఁ బాసి దాసిపొం దాసించువాఁ డుర్వి బ్రా- హ్మణవిత్తంబు హరించువాఁ డరయ రామా! భక్తమందారమా!
4
mattebhamu
34
నిట్టీ నగుబాటుపనులు నీ వెన్ని కలుగఁ-జేసినాఁడవు మంచిప్రసిద్ధకుఁడవె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
734
విలసిల్ల\న్‌ పదియాఱువేలసతుల\న్‌ వీక్షించి వారిండ్ల లో పల వర్తించుచునుండి వీటఁ గల గోపస్త్రీలనెల్ల\న్‌ గడుం బలిమి\న్‌ బట్టి రమించినాఁడవు భళీ ప్రాజ్ఞుండ వీవౌదు భూ స్థలి నీవేకద కొంటెదేవరవు కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
3293
_x000D_ తరువఁ దరువఁ బుట్టు దరువున ననలంబు _x000D_ తరువఁ దరువఁ బుట్టు దధిని ఘృతము _x000D_ తలఁప దలపఁ బుట్టు తనువునఁ దత్వంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1704
భూరివివేకుఁడై సుజనపోషకుఁడై యభిమానుఁడై సదా- చారవిహారుఁడై పరమసాత్త్వికుఁడై గుణవంతుఁడయ్యు నేఁ గోరినయట్లు పట్టి తనకుం బ్రభవిల్లెఁ గదా యటంచుఁ దా- నూరక సంతసిల్లి మదినుబ్బెడు తల్లినిఁ బోలరెవ్వరున్.
6
vutpalamaala
636
"పరమదయానిధే పతిత పావననామ హరే"యటంచు సు స్థిరమతులై సదా భజన సేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు జేరకుఁడంచు యముండు కింకరో త్కరముల కాన బెట్టునఁట దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
662
కలియుగ మర్త్యకోటి నినుఁ గన్గొనరాని విధంబొ భక్తవ త్సలతవహింపవో చటుల సాంద్రవిపద్దశ వార్ధిఁగ్రుంకుచో బిలిచినఁ బల్కవింతమఱపే నరులిట్లనరాదుగాక నీ తలఁపునలేదే సీత చెఱ దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
369
మిము నొక్కప్పుడుఁ గొల్వనేరక వృథామిథ్యాప్రచారంబులం- గములై వాఁగులయందు నెల్ల మునుగంగాఁ బుణ్యము ల్సేరునే? తమి నశ్రాంతము నీటఁ గ్రుంకులిడి యేధర్మంబు లార్జించెనో కమఠగ్రాహఢులీకుళీరములు! భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
95
పురుషాకృతిగ నిన్ను గురుతుఁ బట్టఁగ రాదు- స్త్రీమూర్తి వనుచును జెప్ప రాదు పరఁగ నపుంసకభావ మెన్నఁగ రాదు- రూపంబు గల్గు టెఱుంగ రాదు గుణవంతుఁడ వ టంచు గణుతింపఁగా రాదు- మర్యాద దెలియ నేమతికి రాదు కులజుఁడ వనుచు నిక్కువముఁ జెప్పఁగ రాదు- స్థల మెక్కడనొ కాని తెలియరాదు
3
seesamu
601
పరునిఁ బరేశు భక్తజనపాలనశీలు ననంతు నాద్యు న- క్షరు నపవర్గదాయకు జగన్మయు నద్వయు నప్రమేయు నం- బురుహభవాండభాండపరిపూర్ణపిచండుఁ దలంతు నిన్మదిన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
480
పాపపుఁ ద్రోవవాని కొకపట్టున మేను వికాసమొందినన్‌ లోపల దుర్గుణంబె ప్రబలుం గద! నమ్మగఁ గూడ దాతనిన్‌; బాపటకాయకున్‌ నునుపు పైపయి గల్గినఁ గల్గుగాక యే రూపున దానిలోఁగల విరుద్ధపుఁ జేదు నశించు భాస్కరా!
6
vutpalamaala
2232
శేషప్ప యను కవిచెప్పిన పద్యముల్‌ - చెవుల కానందమై చెలఁగుచుండు నే మనుజుండైన నెలమి నీ శతకంబు - భక్తితో విన్న సత్ఫలము గలుగుఁ జెలఁగి యీ పద్యముల్‌ చేర్చి వ్రాసినవారు - కమలాక్షు కరుణను గాంతురెపుడు నింపుగాఁ బుస్తకంబెపుడుఁ బూజించిన - దురితజాలంబులు దొలఁగిపోవు
3
seesamu
3357
_x000D_ అరిషడ్వర్గంబులచే _x000D_ నరులెల్లను జొక్కిచిక్కినయగతి యనుచు\న్‌ _x000D_ జరుగుదురు గాకతత్వము _x000D_ నరయంగను లేరు నించుకైనను వేమా.
1
kandamu
2536
ఉరుపక్షంబులు వచ్చునంతకు నిరుద్యోగంబున న్వృక్షకో- టరమధ్యంబుననుండు పక్షిగతి నిష్ఠం గోరి నీ భక్తి వి- స్తర మాత్మం బ్రభవించు నంతకును నీ సంసారకారాగృహాం- తరగేహంబున నుండి జీవుఁ డతివంతన్ బొందు సర్వేశ్వరా!
4
mattebhamu
1301
బహుకష్టములం బొందక మహిలో సమకూడఁబోదు మానవజన్మం బహహా! యీ జన్మంబున నిహపరములఁ గొనెడుజాడ లెఱుఁగు కుమారీ!
1
kandamu
2805
పతికడకుఁ దన్నుగూర్చిన సతికడకును వేల్పుకడకు సద్గురుకడకున్‌ సుతుకడకు రిత్తచేతుల మతిమంతులు చనరు నీతి మార్గము సుమతీ!
1
kandamu
4375
ఈనెగాండ్లంటరో యీండ్లను బగిసార- । సెన్నంగిసుద్దులు సెప్పలేరు యేదగాండ్లంటరో యీండ్లింట పొగవెల్ల । గొర్లాల బిగ్గెన గొసుగుతారు కయితగాండ్లంటరో కాల్పంగటించుక । చిన్నచ్చరము సేరు చెప్పలేరు వాసివేలంట తమాసగా ఱొమ్మున । దప్పెట వేసుక తట్టలేరు
3
seesamu
25
మానితంబుగ గరుత్మద్ధ్వజారోహణం- బెప్పుడొనర్తువో చెప్పుమయ్య! గరిమతో నీ తిరుక్కల్యాణసంభ్రమం- బెప్పు డెప్పుడొ వేగ చెప్పు మయ్య రమతో మహోన్నతరథ మెక్కి తిరువీథు- లెప్పు డేతెంతువో చెప్పు మయ్య ధరణి నభ్యాగతదాన ప్రజాబృంద- మెప్పుడు బలియునో చెప్పు మయ్య
3
seesamu
2577
అతివాగ్జాలమునై యజాండనిలయంబై యాదిమధ్యాంతవ- ర్జితమై నిర్గుణనిష్కలంకపదమై సిద్ధాంతమధ్యాత్మసం- యుతమై కోటిరవిప్రకాశయుతమై యోంకారమంత్రాదిసం- స్తుతమై యెంచ నచింత్యమై వెలుఁగు నీ సూక్ష్మంబు సర్వేశ్వరా!
4
mattebhamu
1840
గాన జెలి సాటి యెవ్వరి గాన జగతి | దరుణులకు మిన్న దానెన్న దరముగాదుపరమగుణజాల కాంచనభవ్యచేల | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
1389
నారాయణవనంబు చీరకుచ్చంచులు । మీగాళ్ల కెలమి కైలాగు లెసగ సన్నగీరుల గులాల్ వన్నెరైక మెరుంగు । గుబ్బల పొగరానికుట్లు పిగల కమ్మని దవనంపురెమ్మల జడ పైడి- । కుచ్చులు పిరుదుల గునిసియాడ పొలుపొందు పావడంబులు మొల్కపాంజేలు । గిలగిలమని పదంబులను మొరయ
3
seesamu
3726
_x000D_ ప్రజ లెఱుంగ బ్రదుకుఁ బట్టభద్రుఁడు గాఁడు _x000D_ పైఁగిరీటముండు బ్రహ్మగాఁడు _x000D_ ఓగుఁ దెలిసి పలుకు యోగీశ్వరుఁడు గాఁడు _x000D_ అట్టివానిఁ దెలియ నగును వేమ.
0
aataveladi
3620
_x000D_ సతులఁ జూచి నరుఁడు సౌఖ్యంబు గోరును _x000D_ గతులఁ గానలేఁడు కర్మమందు _x000D_ గతుల సతులవలనఁ గానంగ లేఁడయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
542
వరుణభవాత్రిగౌతములు వ్యాసవసిష్ఠఘటోద్భవుల్ పరా- శరసుతకణ్వకౌశికులు జహ్నుశమీకముఖాఖిలర్షిశే- ఖరులు నుతింపఁజూలరటకా నిను మాదృశు లెన్ననేర్తురే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
1478
నెపుడు లోచూపు చూచి తదేకనిష్ఠ । దనరి శృంగారదేవతవని తలంచి మానసిక మొనరించుచో మరుల తాళ । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi