id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
2572
శ్రీకంఠాయ నమోనమో నతసురజ్యేష్ఠాయ రుద్రాయ లిం- గాకారాయ నమోనమో విగతసంసారాయ శాంతాయ చం- ద్రాకల్పాయ నమోనమో దురితసంహారాయ తే యంచు ని- న్నాకాంక్షం బ్రణుతించు మానవుఁడు నీవై యుండు సర్వేశ్వరా!
7
saardulamu
1027
బంధుజాతములోన బహుమాన మెడలించు | సభలలో మాటాడఁ జనవులేదు పరమైన విజ్ఞానసరత సిద్ధించదు | కుమతులు గెగ్గెర్లఁ గొట్టుచుంద్రు పరభూమి కేఁగినఁ బాటింపరెవ్వరుఁ | బ్రతిభావిశేషంబు పట్టువడదు ధారుణీపతు లొక్కదానమే నొసఁగరు | కులసతి యతనిఁ దక్కువగఁ జూచు
3
seesamu
3780
_x000D_ తనదుదత్తము పరదత్త మొకటిగాగఁ _x000D_ జాడ కనుభవింపఁజోద్య మిలను _x000D_ తొడగి యాలు నమ్మితొత్తును గొన్నట్టు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1403
మేఘంబు చేజేత మెరయుచుండగ నిండు- । వృష్టి లేదని మిన్ను వెతుకనేల నమృతప్రవాహంబు కధికారమిచ్చిన । నరుచికై తాంబూల మడుగనేల పస గందమేదిన కసరితంచనువేళ । లోడీలు తెమ్మని వేడనేల పైదుర్గముల ఠాను బందిచేసిన క్రింది- । సీమకోసము మన్వి సేయనేల
3
seesamu
1565
శైలోత్పాటన దక్షిణుండగు నభస్వత్పుత్రుఁడన్‌ జన్యవి ద్యాలోలుండగు రామభద్రునకు నే దాసుండ సుగ్రీవునిన్‌ వాలాయంబు భజించువాఁడ హనుమన్నామంబునం బొల్తు భూ పాలుండంపఁగ భూమిపుత్రిఁ బరికింపన్‌ వచ్చితిన్‌ గ్రవ్యభు క్కాలుండన్‌ జనుతెండు పోరి కని లంకం జాటవే మారుతీ!
7
saardulamu
4243
సరసిజసంభవాది దివిజప్రకరంబులసంపదల్‌ సువి స్తరములు గాఁగఁ గన్గొనలఁ జల్లెడు శ్రీయలమేలుమంగ నీ తరుణీయురంబునం జెలఁగఁ దన్మయ మందెడు నీకు బ్రాఁతియే పరమపద ప్రభుత్వము నపారమహత్త్వము వేంకటేశ్వరా!
5
champakamaala
418
అడిగినయట్టి యాచకుల యాశలెఱుంగక లోభవర్తియై కడపిన ధర్మదేవత యొకానొక యప్పుడు నీదు వాని కె య్యెడల; నదెట్లు పాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్‌ గుడువఁగ నీనిచోఁ గెరలి గోవులు తన్నునుగాక భాస్కరా!
5
champakamaala
631
గురుతరమైన కావ్యరస గుంభనకబ్బురమంది ముష్కరుల్‌ సరసులమాడ్కి సంతసిల జాలుదురోటు శశాంకచంద్రికాం కురముల కిందుకాంతమణికోటి స్రవించినభంగి వింధ్యభూ ధరమున జాఱునే శిలలు దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
3160
_x000D_ అనఁగ ననగ రాగ మతిశయిల్లుచునుండు _x000D_ తినఁగ దినఁగ వేము దీయనుండు _x000D_ సాధనమున బనులు సమకూరు ధరలోన _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1418
కుందనపుపళ్లెమున తోటకూరవిత్తు- । లెండ నెరపిన పై పిల్లలేడి పదము- నిడిన గతి దోచు నీ మరునిల్లు దలప । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
4337
శ్రీరుక్మిణీ ముఖసారసమార్తాండ । సత్యభామా మనశ్శశిచకోర జాంబవతీ కుచశైలకంధర మిత్ర- । విందా సుధాధరబింబకీర భద్రా వయోవనభద్రేభరాజ క- । శిందాత్మజా చిదానందనిలయ లక్షణా శృంగారవీక్షణకాసార- । హంస సుధేష్ణా గుణాపహార
3
seesamu
663
జనవర! మీ కథాళి విన సైఁపక కర్ణములందు ఘంటికా నినద వినోదముల్‌ సలుపు నీచునకున్‌ వరమిచ్చినావు ని న్ననయమునమ్మి కొల్చిన మహాత్ములకేమి యొసంగెదో సనం దననుత! మాకొసంగుమయ దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
475
పండితులైనవారు దిగువం దగనుండగ, నల్పుఁ డొక్కడు ద్ధండతఁ బీఠమెక్కిన బుధ ప్రకరంబులకేమి యెగ్గగున్‌; కొండొకకోతిఁ జెట్టు కొనకొమ్మల నుండగ, గ్రింద గండ భే రుండ మదేభ సింహనికురంబములుండవె చేరి భాస్కరా!
6
vutpalamaala
4428
ధర్మవిధులైన రాజసంస్థానములను । జేరు నొక్కొక్క చీవాట్లమారిశుంఠ మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
5
మానుషహర్యక్ష మార్తాండ సోమాక్ష- త్రిభువనాధ్యక్ష కౌంతేయపక్ష మదనకోటివిలాస మంజుల దరహాస- శ్రీహృన్నివాస కౌశేయవాస శార్ఙ్గకోదండ పిచండ భృతాజాండ- వినుతవేదండ రవిప్రచండ దీనశరణ్య విద్విట్భేద నైపుణ్య- భక్తానుగణ్య దిక్ప్రభువరేణ్య
3
seesamu
2299
చీరల్ దీయకు చన్నుగుబ్బల పయిం జీకాకుగాఁ గాకుగాఁ జీరల్ దీయకు మందబోయఁడిదె వచ్చే బ్రొద్దు రావల్దు నా జారా! మేలను జారలం గవయు కృష్ణా! యేకపత్నీవ్రత ప్రారంభం బిపుడేల నీకు రఘువీరా! జానకీనాయకా!
7
saardulamu
2224
మత్స్యావతారమై మడుఁగులోపలఁ జొచ్చి - సోమకాసురుఁ ద్రుంచి చోద్యముగను దెచ్చి వేదములెల్ల మెచ్చ దేవతలెల్ల - బ్రహ్మకిచ్చితి వీవు భళి! యనంగ నా వేదముల నియ్య నాచారనిష్ఠల - ననుభవించుచు నుందు రవనిసురులు సకలపాపంబులు సమసిపోవు నటంచు - మనుజులందఱు నీదు మహిమఁ దెలిసి
3
seesamu
1044
సర్వసర్వంసహాభుజాధూర్వహుఁడు న- | భంగుఁ డగువాఁడెపో నృపపుంగవుండు భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
2401
విత్తపరాయణుఁ డయినన్‌ మత్తచకోరాక్షులందు మగ్నుండైన\న్‌ సూత్తమపురుషుఁడె గాదా సత్తామాత్రంబు గనును సంపఁగిమన్నా!
1
kandamu
2231
ననుచుఁ బలుమాఱు వేఁడెద నబ్జనాభ! - నాకుఁ బ్రత్యక్ష మగుము నిన్‌ నమ్మినాను భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
1343
చూపుమార్పులను హెచ్చుగ నాస గల్పించి । చేమార్పులను చాల ప్రేమ నించి కౌగిటిమార్పుల కడుమోదమున మించి । మోవిమార్పుల మెచ్చి ముద్దునిచ్చి తమలంపుమార్పుల క్రమముగా దనియించి । తొడసందిమార్పుల దుడుకు గాంచి ప్రక్కమార్పుల ప్రౌఢిపని గాదని మదించి । పడకమార్పుల హాయిబడ రమించి
3
seesamu
3058
ఘనముగా నలివేణి కరుణించి యింతైన నా పలుకాలించి నేలవమ్మనాయందు బలికిన న్యాయంబుగా నిప్పు డతియసహ్యంబయ్యె నరసిచూడరాధయు రుక్మిణీరమణీయ నాతని రానివ్వరైరిగా రట్టుజేసిసారసనేత్రుని శ్యామలాంగుని బలభద్రానుజుని నాదు ప్రాణసఖుని
3
seesamu
2600
అమర న్వేదపురాణశాస్త్రములు మున్నాకాంక్షఁ దత్త్వప్రభే- దము రూపింపఁగ నేరవన్న మఱి యా తత్త్వంబులెట్లన్న ను- త్తమసంతోషమె కోరునన్న నరుఁ డుత్సాహించి నీ భక్తస- త్తమపూజారతి నేర్చునే నతఁడు తత్త్వజ్ఞుండు సర్వేశ్వరా!
4
mattebhamu
3057
కమలనాభుండ నామీదఁ గరుణయుంచి | వేగ నిను రమ్మనుచు విన్నవించెనన్నతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన.
2
teytageethi
660
కుక్షినజాండ పంక్తులొనఁగూర్చి చరాచరజంతుకోటి సం రక్షణసేయు తండ్రివి పరంపర నీ తనయుండనైన నా పక్షము నీవు గావలదె పాపము లెన్ని యొనర్చినన్‌ జగ ద్రక్షక కర్త వీవె కద దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
3704
_x000D_ వానను దడియనివారును _x000D_ పూనిక విడ మన్న చేఁత బొరయనివారు\న్‌ _x000D_ నానాదిక్కుల వెదకినఁ _x000D_ గానమురా నెంతవాని గానము వేమ.
1
kandamu
2241
జగముల్ మూఁడు సృజింపఁబ్రోవఁ బిదపన్ సంహారముం జేయఁగాఁ ద్రిగుణాకారముఁ దాల్చినట్టి వరమూర్తీ! వాసుదేవా! హరీ! నిగమస్తుత్యపవిత్రగాత్ర! నృహరీ! నీలాభ్రవర్ణా! మహో రగతల్పా! జనకల్పభూజ! రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
4150
_x000D_ పుస్తకములు జడలు పులితోలు బెత్తంబు _x000D_ కక్షపాలలు పది లక్షలైన _x000D_ మోత చేటు గాని మోక్షంబు లేదయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1186
పురుషుం డొనర్పని పనికి నరయఁగ దైవం బదెట్టు లనుకూలించున్‌ సరణిగ విత్తకయున్నను వరిపండునె ధరణిలోన వఱలి కుమారా!
1
kandamu
3363
_x000D_ కడఁగి సంకల్పములనెల్లఁ గట్టిపెట్టి _x000D_ చిత్తమున నేమి తలఁపక చిత్రరూపు _x000D_ కైవడిని నున్న యాతఁడు ఘనుఁడు దలఁప _x000D_ నడవియందైనఁ బట్టణమందు వేమా.
2
teytageethi
2386
బరువఁట యెవరికి గురువో హరిహరి తనుఁ దెలియలేనియాతఁడు గురువా? గురువనఁగా సిగ్గుగదే శరణాగతసుప్రసన్న! సంపఁగిమన్నా!
1
kandamu
3519
_x000D_ పనసతొనలకన్నఁ బంచదారలకన్న _x000D_ జుంటితేనెకన్న జున్నుకన్నఁ _x000D_ జెఱకురసముకన్నఁ జెలిమాట తీపురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3611
_x000D_ ఆడితప్పువార లభిమానహీనులు _x000D_ గో డెఱుఁగనివారు కొద్దివారు _x000D_ కూడి కీడు సేయఁగ్రూరుండు తలపోయ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2616
ఏ నిన్నే శరణందు బాంధవులు గానీ యెల్లవారుం బగే కానీ మృత్యువు తలక్రిందువడనీ కాలుండు గీవెట్టనీ నానాకర్మచయంబు గింజుకొననీ నాకేమి నేరాజ నిం- తే నీ చాటున దాఁగియున్నపుడు బీతే యింక సర్వేశ్వరా!
7
saardulamu
2674
కలధౌతాద్రియు నస్థిమాలికయు గోగంధర్వమున్బున్నయుం, బులిలోలున్భసితంబుఁ బాపతొడవుల్పోకుండఁ దోఁబుట్లకై, తొలినేవారలతోడఁబుట్టగఁ గళాదుల్గల్గె మేలయ్యె నా సిలువుల్దూరము చేసికొంటెఱిగియే శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
4645
దండితవాదియై శివుఁడ దైవముగా కని కన్నులిచ్చి తా నిండు మనంబుతో నిలువు నిద్దపుఁగన్నులు దాల్చి పొల్చు మా పండిత మల్లికార్జునుఁడు ప్రస్తుతి సేయఁగ నేర్చు నిన్ను నె వ్వండు నుతింప నేర్చు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
641
హలికునకున్‌ హలాగ్రమున నర్థము చేకురుభంగి దప్పిచే నలమటఁజెందువానికి సురాపగలో జలమబ్బినట్లు దు ర్మలిన మనోవికారినగు మర్త్యుని నన్నొడఁగూర్చి నీపయిం దలపు ఘటింపఁజేసితివి దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
2727
కరిదైత్యున్బొరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదో రతీ శ్వరునిన్‌ గాల్చిన ఫాలలోచన శిఖావర్గంబు చల్లాఱెనో పరనిందాపరుల న్వధింపవిదియున్‌ భావ్యంబె వారేమి చే సిరి నీకున్బరమోపకార మరయన్‌ శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
62
మేమి ఘనకార్యములు చేసి తిద్ధరిత్రి-నెన్నటికి నీ వొనర్చిన విట్టిపనులె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
3335
రాజయోగీంద్రుఁ డాతఁడై తేజరిల్లు వెలయ జగముల విహరించు విశ్రుతముగ బాలు విధమున వృద్ధుని పగిదిసోకు కరణివెంగలిక్రియ చూడ ఘనత వేమా
2
teytageethi
428
ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మ దలంచి యుగ్రవా క్పరుషత జూపినన్‌ ఫలము గల్గుట తథ్యముగాదె; యంబుదం బురిమినయంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ స్థిరతరపౌరుషంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా!
5
champakamaala
3703
_x000D_ దేవపూజ సేయ దివ్యభోగము గల్గు _x000D_ తత్వ మెఱింగెనేని దైవసముఁడె _x000D_ యేమిలేనినరున కేగతిలేదురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
158
కులము బ్రాహ్మణ్య మగు దైత్యకులము నెట్లు-గూల్చితివి బ్రహ్మహత్యకు గొంక కహహ? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
1118
పోషకుల మతముఁ గనుఁగొని భూషింపక కాని ముదముఁ బొందఁడు మఱియున్‌ దోషముల నెంచుచుండును దోషివయిన మిగులఁ గీడు దోఁచుఁ గుమారా!
1
kandamu
572
పురుషులలోన విప్రుఁడును పుష్పకదంబములోన జాజియున్ దరువులలోన రావియును దానచయంబుల నన్నదానమున్ ధరణిఁ బ్రశస్తిఁ గన్న ప్రియదైవములం దధికుండ వీవయా చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
451
ఘనబలసత్త్వ మచ్చుపడఁ గల్గిన వానికి హాని లేనిచోఁ దనదగు సత్త్వమే చెరచుఁ దన్ను; నదెట్లన నీరు మిక్కిలిన్‌ గినుక వసించినన్‌ జెఱువు కట్టకు సత్వము చాలకున్నచోఁ గనుమలు పెట్టి నట్టనడి గండి తెగంబడకున్నె భాస్కరా!
5
champakamaala
696
సురలునుతింపగాఁ ద్రిపుర సుందరులన్‌ వరియింప బుద్ధరూ పరయఁగ దాల్చితీవు త్రిపురాసురకోటి దహించుచున్నప్పుడా హరునకుఁ దోడుగా వరశరాసన బాణముఖోగ్రసాధనో త్కర మొనరించితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
2148
నిగమాదిశాస్త్రముల్‌ నేర్చిన ద్విజుఁడైన - యజ్ఞకర్తగు సోమయాజియైన ధరణిలోపలఁ బ్రభాత స్నానపరుడైన - నిత్య సత్కర్మాది నిరతుఁడైన నుపవాస నియమంబులొందు సజ్జనుఁడైనఁ - గావివస్త్రము గట్టు ఘనుఁడునైనఁ దండిషోడశ మహాదానపరుండైన - సకల యాత్రలు సల్పు సరసుఁడైన
3
seesamu
193
అఖిలలోక స్థాపనాచార్యమణి వయ్యు- నిజభక్తగురునిచే నిలుపుకొన్న గర్భస్థితానేక కమలజాండుఁడ వయ్యు- నొండుకోవెలని జెల్వొందుచున్న బహుచరాచర భూతపరిపాలకుఁడ వయ్యు- భక్తార్పితార్థము ల్పట్టుచున్న హరచతుర్ముఖ దేవతాగోచరుఁడ వయ్యు- నెప్పుడు దర్శనం బిచ్చుచున్న
3
seesamu
1647
నెల నిలువన్ మనోరథము నివ్వటిలంగను బైఁడిరక్ష రే- కులు మెడఁగట్టు మోమునను గోరిక మీఱ విభూతిఁ బెట్టు దా- నలయక గాలి సోఁకెడునటంచు సుతేచ్ఛను నాఁడునాఁటి కీ- చెలువున నుత్తమక్రియలు చేసెడు తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
2521
చెదరం బాఱు దశప్రభంజనములన్ శిక్షన్ సుషుమ్నంబునం గుదియం బట్టి చలింపకుండ శశినర్కుం గట్టి భాస్వన్మన- స్సదనస్థానమునందు నిన్నెలమి సంస్థాప్యంబుగాఁ జేసి తా హృదయానందరసాబ్ధిఁ దేలు శివయోగీంద్రుండు సర్వేశ్వరా!
4
mattebhamu
932
నిక్కముగ నిన్ను వర్ణింపనేర రనఁగ | నెంతవారింక నరులు ని న్నెఱిఁగి పొగడ, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
265
అలుకన్ మిక్కిలి సాహసంబు ఘనమన్యాయప్రచారంబునుం జలముం దట్టము కామమెక్కుడు మహాజాలంబు శీలంబహో తలపైఁ జేయిడి బాసచేసిన యథార్థం బుర్విపైఁ బుష్పకో- మలుల న్నమ్మఁగరాదు పూరుషులు రామా! భక్తమందారమా!
4
mattebhamu
4030
_x000D_ తనుఁదాఁ దెలియుట తత్త్వము _x000D_ తన కన్యులు బోధసేయ ధరలోఁ గలరే _x000D_ తనుఁదాఁ దెలియక యుండినఁ _x000D_ దన కెవరుం దెలుపలేరు తథ్యము వేమ.
1
kandamu
4566
స్వీకృత భక్తలోక! యవశీకృత కర్కశవావదూక! యూ రీకృత సద్వివేక! యురరీకృత జంగమభక్తి శూక! దూ రీకృత దుష్టపాక! యధరీకృత వేద విరుద్ధబౌద్ధ చా ర్వాక! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
4050
_x000D_ బుద్ధియుతున కేల పొసఁగని సౌఖ్యంబు _x000D_ కార్యవాదికేల కడుచలంబు _x000D_ కుత్సితునకు నేల గురుదేవతాభక్తి _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3942
_x000D_ రూపవతులు ముగ్గురు రూపవంతులు చూడ _x000D_ వారి వారి నేల గారవింప _x000D_ మొద లెఱుగకయున్న మోక్షంబు గలుగునా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
361
ఏణాంకుండొకఁడై పయోఘటములందెల్ల న్బహుత్వంబుచే రాణం బొల్చు తెఱంగునం బృథుతరబ్రహ్మాండభాండాంతర ప్రాణిశ్రేణులయందు నీవొకఁడవే రాణింతువౌ సర్వగీ- ర్వాణస్తుత్యచరిత్ర! యాత్మమయ! భర్గా! పార్వతీవల్లభా!
7
saardulamu
678
ఇతఁడు దురాత్ముఁడంచు జనులెన్నఁగ నాఱడిఁగొంటి నేనెపో పతితుఁడనంటిపో పతితపావనమూర్తివి నీవుగల్గ నే నితరుల వేఁడనంటి నిహమిచ్చిన నిమ్ము పరంబొసంగు మీ యతులిత రామనామ మధురాక్షరపాళి నిరంతరంబు హృ ద్గతమని నమ్మికొల్చెదను దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
255
దానం బాభరణంబు హస్తమునకు దద్‍జ్ఞానికి న్నీపద- ధ్యానం బాభరణంబు భూసురున కత్యంతంబ గంగానదీ- స్నానం బాభరణంబు భూతలమునన్ నాడెంపుటిల్లాలికిన్ మానం బాభరణంబు తథ్యమిది రామా! భక్తమందారమా!
7
saardulamu
1168
సభలోపల నవ్వినయెడ సభకులు నిరసింతు రెట్టి జనుని, న్నెఱి నీ కభయం బొసంగె నేనియుఁ బ్రభు కరుణము నమ్మి గర్వ పడకు కుమారా!
1
kandamu
2504
అమరన్ భక్తగణాత్మమధ్యమము లింగావాస మీ లింగ మ- ధ్యమముం బద్మభవాండభాండనిలయంబై యుండుట భక్తతృ- ప్తిమహాలింగము తృప్తియై మహిమ నుద్దీపించుఁ దల్లింగతృ- ప్తిమహత్త్వంబున నీ సమస్తమును దృప్తిం బొందు సర్వేశ్వరా!
4
mattebhamu
3238
_x000D_ ఏరుదాఁటి మెట్ట కేగినపురుషుండు _x000D_ పుట్టి సరుకుగొనక పోయినట్లు _x000D_ యోగపురుషుఁడేల యొడలిఁ బాటించురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1384
గలుగు రతనాలు దివ్వెలుగా వెలుంగ । యతివ భయమున కనులు మూసితిని యవల- నేమి గనుగొననని పల్కు ప్రేమ దలప । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
2759
ఒల్లని సతి నొల్లని పతి నొల్లని చెలికాని విడువ నొల్లని వాఁడే గొల్లండు కాక ధరలో గొల్లండును గొల్లఁడౌనె గుణమున సుమతీ!
1
kandamu
4268
ఓ కమనీయకంజముఖి! యోవలరాయనితల్లి! యోసుధా సైకతచాతురీజఘన చక్రిణి! యోయలమేలుమంగ! నీ వే కరుణించి కావుమని వేడ్కల నింద్రపురంధ్రు లందఱున్‌ బైకొని నీలతాప్రతిమ బ్రస్తుతిసేతురు వేంకటేశ్వరా!
6
vutpalamaala
2140
పరులద్రవ్యము మీఁద భ్రాంతి నొందినవాఁడు - పరకాంతల కపేక్ష పడెడువాఁడు అర్థుల విత్తంబు లపహరించెడువాఁడు - దాన మియ్యంగ వద్దనెడివాఁడు సభలలోపల నిల్చి చాడి చెప్పెడివాఁడు - పక్షపు సాక్ష్యంబు పలుకువాఁడు విష్ణుదాసులఁ జూచి వెక్కిరించెడివాఁడు - ధర్మసాధులఁ దిట్టఁ దలఁచువాఁడు
3
seesamu
1075
అడిగినప్పుడ తన యొడలి చర్మం బూడ్చి | కర్ణుఁ డీయండె యాఖండలునకు నుడివినప్పుడ యొప్పి పుడమి మూఁడడుగులు | వైరోచనుం డీఁడె వామనునకు శరణన్న యప్పుడు పరఁగ గువ్వను బ్రోచి | శిబి మేని పొలసీఁడె శ్యేనమునకు ప్రార్థించినప్పుడే బ్రాహ్మణుఁ గాచి ఖే- | చరుఁడు ప్రాణములీఁడె సురవిరోధి-
3
seesamu
3605
_x000D_ బడుగు నెఱుఁగ లేని ప్రాభవం బది యేల _x000D_ ప్రోదియిడని బంధు భూతి యేల _x000D_ వ్యాధి దెలియలేని వైద్యుఁడు మఱియేల _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3200
_x000D_ పాలఁగలయు నీరు పాలెయై రాజిల్లు _x000D_ నదియు పానయోగ్య మయినయట్లు _x000D_ సాధుసజ్జనముల సాంగత్యములచేత _x000D_ మూఢజనుఁడు ముక్తి మొనయు వేమ
0
aataveladi
2612
శాకాబ్దంబులు వార్ధిషట్కపురజిత్సంఖ్యం బ్రవర్తింప సు- శ్లోకానందకరంబుగా మహిమతో శోభిల్ల సర్వేశ్వర- ప్రాకామ్యస్తవ మొప్పఁ జెప్పె శుభకృత్ప్రవ్యక్తవర్షంబునన్ శ్రీకంఠార్పితమై వసుంధరపయిం జెన్నొంద సర్వేశ్వరా!
7
saardulamu
2164
నే నెంత వేఁడిన నీకేల దయరాదు? - పలుమాఱు పిలిచినఁ బలుక వేమి? పలికిన నీ కున్న పద వేమి బోవు? నీ - మోమైనఁ బొడచూపవేమి నాకు? శరణుఁ జొచ్చినవాని సవరింపవలెఁ గాక - పరిహరించుట నీకు బిరుదు గాదు నీ దాసులను నీవు నిర్వహింపక యున్నఁ - బరు లెవ్వ రగుదురు పంకజాక్ష!
3
seesamu
3409
_x000D_ తాను దప్పకుండ తనమనంబు నిల్పి _x000D_ తావుఁ జేరునట్ల తంత్రపఱచి _x000D_ తాను తావుఁ జేరి తావుఁదానేకమై _x000D_ తాను దాన యగుచుఁడనరు వేమా.
1
kandamu
1943
మహియు న్నాకసముం బదద్వయ పరీమాణంబుగాఁ బెట్టి యా గ్రహ మొప్పం బలిమస్తకం బొక పదగ్రస్తంబుగా నెమ్మితో విహరించింద్ర విరించి శంకర మహావిర్భూత దివ్యాకృతిన్‌ సహజంబై వెలసిల్లు వామన లసచ్చారిత్ర, నారాయణా!
4
mattebhamu
929
గురుతరకౌండిన్యగోత్ర పవిత్రుండ | గంగనమంత్రిశేఖరుని సుతుఁడ కూచిమంచన్వయాకూపార చంద్రుండ | వితతతావకకృపావీక్షణాప్త- సత్కలితామహాసామ్రాజ్యభార ధౌ- | రేయుండ బుధజనప్రియ సచివుఁడ ఘన దెందులూరి లింగన గురూత్తమదత్త | సారశైవాచార సంగ్రహుఁడను
3
seesamu
726
నీడల్‌ దేఱెడు చెక్కుటద్దములతో నిద్దంపుఁగెమ్మోవితో కూడీకూడని చిన్నికూకటులతో గోపార్భకశ్రేణితో వ్రీడాశూన్య కటీరమండలముతో వేడ్క\న్‌ వినోదించుచు న్నాఁ డా శైశవమూర్తి నేఁ దలఁతుఁ గృష్ణా దేవకీనందనా.
7
saardulamu
3168
_x000D_ ఇంద్రియములచేత నెగ్గొందుచుండెడు _x000D_ వెఱ్ఱిమనుజుఁ డేల వెదకు శివుని? _x000D_ ఇంద్రియముల రోసి యీశునిఁ జూడరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3364
_x000D_ రెప్పలు మూసియు మూయఁగఁ _x000D_ దప్పక తనమనమునందుఁ దత్వము గూడున్‌ _x000D_ ఎప్పుడు చూచెడువానికిఁ _x000D_ జొప్పెడు నెచ్చోట ముక్తి సులభము వేమా.
1
kandamu
3524
_x000D_ తనదునృపతితోడఁ దనయాయుధముతోడ _x000D_ నగ్నితోడఁ బరులయాలితోడ _x000D_ హాస్యమాడుటెల్ల హాని ప్రాణమునకు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2896
హా తరళాక్షి! హా రమణి! హా చెలి! నీవును నేను మేడలోఁ గౌతుకమందు నున్‍హవుసు ఖానపు వారము చింద మల్లికా- నూతనశయ్యపై మరువినోదములొందు మజా దలంచితే రాతిరి కంటికిన్ నిదురరాదిక నెట్లొకొ సుందరీమణీ!
6
vutpalamaala
952
శివశివా! నీవె యిటువలెఁ జేయునప్పు | డవని నరులకు నింకేమి యడ్డు కలుగు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
3826
_x000D_ తనదునీడ శిశువు దాఁజూచుకొన్నట్టు _x000D_ తనదునీడఁ జూచి తన్ను మఱచి _x000D_ పతిని ననుమ నుడువు భ్రాంతుల నేమందు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1050
కావున నొడళ్ళు నిల్కడల్ కావటంచుఁ | జెలఁగి సుజనులు ధర్మంబు సేయుచుంద్రు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
1814
నహహఈ యింతి వగలెన్న నలవిగాదు | మగువ మరువేదముల కుప్ప మదిని యొప్ప-గోరియున్నది నీ చెల్మి కువలయాక్ష | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
802
పలుమాఱు\న్‌ ఇహభోగకాంక్షసభల\న్‌ పాండిత్యముల్‌ సేయువా రలయజ్ఞానము మాన్పఁగాఁ గలరె యెట్లైన\న్‌ బ్రకాశించు కో మలదీపాళిఁదొలంగఁ ద్రోయునె భవన్మాయాంధకారంబును జ్జ్వలితానందమయ స్వరూపయుత కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
2279
నీ పాదోదక మక్షులం దదుముకొంటిం, గొంటి నాలోనికిన్, నీ పళ్లెంబు ప్రసాదముం గుడిచితిన్, నీ పేరునుం బెట్టితిన్, నీ పెన్ముద్రలు దాల్చితిన్ భుజములన్, నీవింక నన్నేగతిన్ బ్రాపై ప్రోచెదొ కాని పూని రఘువీరా! జానకీనాయకా!
7
saardulamu
2693
వెనుకంజేసిన ఘోరదుర్దశలు భావింపంగ రోఁతయ్యెడున్‌ వెనుకన్ముందటవచ్చు దుర్మరణముల్వీక్షింప భీతయ్యెడున్‌ నను నేఁజూచియు నావిధుల్దలఁచియున్నాకే భయంబయ్యెడుం జెనకుంజీకటినాయెఁ గాలమునకున్‌ శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
1306
ఆకు లొకిన్నియుఁ జేకొని పోఁక నమిలి సున్న మడుగఁ బోయినఁ గని యీ లోకులు నవ్వుదురు సుమీ! కైకొనవలె మంచినడత ఘనతఁ గుమారీ!
1
kandamu
2832
వరిపంట లేని యూరును దొరయుండని యూరు తోడు దొరకని తెరువున్‌ ధరను బతిలేని గృహమును నరయంగా రుద్రభూమి యనఁదగు సుమతీ!
1
kandamu
1964
పొనర న్ముక్తికిఁ ద్రోవ వేదములకుం బుట్టిల్లు మోదంబునం దునికిస్థానము నిష్టభోగములకు న్నుత్పత్తి యేప్రొద్దును\న్‌ ఘనపాపంబుల వైరి షడ్రిపులకు\న్‌ గాలావసానంబు మీ వినుతాంఘ్రిద్వయపద్మసేవన గదా విశ్వేశ, నారాయణా!
4
mattebhamu
4254
కస్తురి పచ్చకప్పురముఁ గమ్మనిపుప్పొడి ధూళ్లు హత్తి శ్రీ హస్తమునందుఁ దట్టిపునుఁగందుచు శ్రీయలమేలుమంగ భా రస్తనవైభవంబులఁ గరంగుచు నిన్ను గఱంగ మెత్తు నీ కౌస్తుభరత్న సౌధమునఁ గౌఁగిటిపాన్పున వేంకటేశ్వరా!
6
vutpalamaala
3406
_x000D_ రూపడఁగక జీవరూపంబుఁ గనరాదు _x000D_ నట్టిరూప మడగ నలవిగాదు _x000D_ బ్రహ్మ మడఁగకున్న బ్రహ్మంబుఁ గనఁరాదు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2414
తనలో నెప్పుడు నుండెడు తనుఁ దెలియఁగలేడు నిన్ను దరమా తెలియం దనుఁ దెలియుట నినుఁ దెలియుటె సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా!
1
kandamu
2244
గాజుం బూస సురేంద్రనీలమణిగాఁ గల్పించు చందంబునన్ బాజుం జర్మము మీఁది బేగడపొరల్ బంగార మౌ రీతిగన్ నా జన్మంబు పవిత్రభాజనముగా నన్నేల రావేలరా రాజీవాక్ష! కృపాకటాక్ష! రఘువీరా! జానకీనాయకా!
7
saardulamu
540
సరసీరుహాక్ష పద్మభవ శక్ర కృశానుకృతాంత యామినీ- చర వరుణానిలైలబిల చంద్రకిరీట సుధామయూఖ భా- స్కరముఖదేవతాప్రముఖసర్వము నీవె యటంచు వేఁడెదన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
980
సెడుగుబాపఁడు నాబంటుకొడు కబ్బబ్బ | యెంటఁబడె నను మూర్ఖుల నెన్నదరమె భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
2738
అక్కఱకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁ దా నెక్కినఁ బాఱని గుఱ్ఱము గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ !
1
kandamu
804
బాలక్రీడలఁ గొన్నినాళ్లు పిదప\న్‌ భామాకుచాలింగనా లోలాభ్యున్నతిఁ గొన్నినాళ్లు మఱియిల్లు\న్‌ ముంగిలింగొన్ని నా ళ్లీలీల\న్‌ విహరించితి\న్‌ సుఖఫలం బెందేనియు\న్‌ లేదుగా చాల\న్‌ నీపదభక్తిఁ జేసెదను కృష్ణా దేవకీనందనా.
7
saardulamu
626
మసకొని రేఁగుబండ్లకును మౌక్తికముల్‌ వెలబోసినట్లు దు ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యె నా రసనకుఁ బూతవృత్తిసుకరంబుగఁ జేకురునట్లు వాక్సుధా రసములు చిల్కఁ బద్యముఖరంగమునందు నటింపవయ్య సం తసమును జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
2428
కలలో నొక్కఁడు పులిఁ గని పులిచే నణఁగుటను దాను పులియుటబొంకా కలవలెను జగమెల్లను సలలితభక్తిప్రసన్న! సంపఁగిమన్నా!
1
kandamu