id stringlengths 1 4 | poem stringlengths 71 312 | label int64 0 7 | label_name stringclasses 8
values |
|---|---|---|---|
1951 | జగదాధారక భక్తవత్సల కృపాజన్మాలయాపాంగ! భూ
గగనార్కేందుజలాత్మపావక మరుత్కాయా! ప్రదీపప్రయో
గి గణస్తుత్య మహాఘనాశన! లసద్గీర్వాణ సంసేవితా!
త్రిగుణాతీత! ముకుంద! నాదు మదిలో దీపింపు, నారాయణా! | 4 | mattebhamu |
4360 | ఒకరికుండెనటంచు మేలోర్వలేక । నేడ్వఁగరాదు తన ప్రాప్తి నెన్నవలయు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
3643 | _x000D_
మొగముఁ జూచినపుడె మోహంబు ఘన మౌను
_x000D_
ధనముఁ జూచినపుడె తగులు మనసు
_x000D_
కూలినప్పు డరయకుసులెల్ల విఱుగును
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
785 | తెగువన్నిర్జరుల\న్ జయించుచు మదోద్రేకంబున\న్ గానలో
మృగనేత్రి\న్ ధరణీతనూజ నసురు ల్మెచ్చంగఁ దాఁదెచ్చి నె
వ్వగలం బెట్టి విధిప్రయత్నమున నిర్వంశంబుగా రాముచే
జగతిం గూలఁడె యాదశాననుఁడు కృష్ణా దేవకీనందనా. | 4 | mattebhamu |
3236 | _x000D_
కన్నులందు మదము గప్పి కానరుగాని
_x000D_
నిరుడు మీదటేఁడు నిన్న మొన్న
_x000D_
దగ్ధులయిన వారు తమకంటెఁ దక్కువా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1337 | ఘనమైన రవలచెక్కటపు పాపట చేర్చు । బిందీలపైన నందంది పొదల
చెలువొంద బాజుబందులక్రింద పికిలి చెం- । డ్లానుగా దుమికి యుయ్యాలలూగ
రాగిడి నెలవంక రతనంపు బిళ్లల । జడ పిరుందులతో సరసమాడ
సొగసైన లేగౌను బిగిసి యొడ్డాణంపు । ఘంటలొక్కొకసారి ఘల్లురనగ
మేలైన చెంపఖల్లీలు గుబ్బల మధ్య । చంద్రహారములతో జత బెనంగ | 3 | seesamu |
2398 | తలకొని దుఃఖము రానీ
వలనొప్పఁగ నిత్యసుఖము వచ్చిన రానీ
నలఁకువను బడనిమనుజుఁడు
చలియింపఁడు బోధ గన్న సంపఁగిమన్నా! | 1 | kandamu |
2503 | జలజాతప్రభవాచ్యుతాదులు మదిం జర్చించి చర్చించి నీ
కల రూపారయలేక చిక్కులఁ బడంగా నిన్ను హస్తార్పితా-
మలకవ్యాప్తికిఁ దెచ్చి యేర్పఱచి సంబంధించి చేకొన్న భ-
క్తుల శౌర్యం బుపమింప నెవ్వఁడు సమర్థుం డింక సర్వేశ్వరా! | 4 | mattebhamu |
3389 | _x000D_
తన్నెఱుఁగనివాఁడు తానె తానై యుండుఁ
_x000D_
దన్నెఱుంగువాఁడు తానె తాను
_x000D_
తనువులేనివాఁడు తానె తానౌనయా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1059 | నడచిపోవఁగ జవం బడరకుండుటఁ జేసి | పుణ్యతీర్థము లాడఁ బోవరాదు
కాసు వీసము చేతఁ గల్గకుండుటఁ జేసి | దానధర్మక్రియల్ తలఁపరాదు
తనువున రుగ్బాధ తరలకుండుటఁ జేసి | స్నానజపాదులు సలుపరాదు
గడితంపుటాఁకలి విడువకుండుటఁ జేసి | యుపవాసములు నిష్ఠ నుండరాదు | 3 | seesamu |
3810 | _x000D_
జీవగుణము గల్గుజీవుండు బ్రహ్మంబు
_x000D_
సాటివచ్చునెట్లు సరవితోడ
_x000D_
నూరికుక్క సింగమొకటి జేయురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2932 | రతి మును గేలిసోలి నడురాతిరి మేల్కని నేను నిన్ బునా-
రతమతిఁ గౌఁగిలించినఁ బిరాలున నవ్వలికేఁగి రాక య-
ద్భుతపడి నేను బిల్వ విని ప్రొద్దిక నెంతని పల్కి సిగ్గుతో
ఋతుమతివౌట తెల్పకయె యేర్పడఁ దెల్పుదు సుందరీమణీ! | 5 | champakamaala |
4102 | _x000D_
తెలుపు మాపుచేసి దిట్టతనంబునఁ
_x000D_
దెలుపు భస్మముగను దేటపఱుచు
_x000D_
విధముకన్నఁ బరుసవేదియు లేదురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3725 | _x000D_
చరణంబులు పదితోఁకలు
_x000D_
పరగంగా మూడు తలలు బైటనె తిరుగు\న్
_x000D_
వరభూమి తల్లడిల్లగ
_x000D_
నిరవొందఁగ దీని దెలియ నీశుఁడు వేమా. | 1 | kandamu |
263 | వృషలీభర్తయు దేవలుండు నటుఁడున్ వేదాభిశస్తుండు మా-
హిషికుం డగ్నిద కుండగోళకులునున్ హింసాపరస్వాంతుడున్
విషదుండుం గొఱగాఁడు పంక్తి కెపుడుర్విన్ భక్తసంఘాతక-
ల్మషమత్తద్విరదౌఘ పంచముఖరామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
2145 | పరమభక్తుండు ధన్యుండు భానుతేజ! - వానిఁ గనుఁగొన్నఁ బుణ్యంబు వసుధలోన
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
958 | వీరభద్రావతార విహారలీలఁ | దలఁచినప్పుడె యాపదల్ తలఁగు నౌర
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
3005 | మర్మమొచ్చిన యీలాగు మంచిఘనులు | సంహరించుట సరసమా సమరసమునతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. | 2 | teytageethi |
3947 | _x000D_
ఉపవసములనుండి యొగినీళ్ళ మునిగియు
_x000D_
కూడువండి వేల్పుఁ గుడువు మనుచు
_x000D_
దాని నోరుఁగొట్టి తమరె తిందురుగదా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2547 | చావంబుట్టుచుఁ బుట్టఁజచ్చుచు మహాచండాలసంసారపా-
రావారంబునఁ గూలి తాఁ జెడుటకుం బ్రవ్యక్తిగా నాత్మలో-
నేవం బొందక యేను నీవనుట తా నేజ్ఞానమో శ్రీమహా-
దేవా యిట్టి కుతర్కముం గలదే చింతింపంగ సర్వేశ్వరా! | 7 | saardulamu |
482 | పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూప సంపదల్
దూరములైన వాని యెడ దొడ్డగఁ జూతురు బుద్ధిమంతు లె
ట్లారయ; గొగ్గులైన మఱి యందుల మాధురి చూచి కాదె ఖ
ర్జూర ఫలంబులం ప్రియము చొప్పడ లోకులు గొంట భాస్కరా! | 6 | vutpalamaala |
4100 | _x000D_
ఆకాశంబున వాయువు
_x000D_
మ్రాకునదావాగ్ని యటుల మానసమందు\న్
_x000D_
ఏకాకారుఁడు జగమున
_x000D_
జోకైతనుదానె వెల్గు సుమ్ముర వేమ. | 1 | kandamu |
3857 | _x000D_
బ్రహ్మవాదు లెల్ల బ్రహ్మంబనంగను
_x000D_
వలను తెలిసిచూడ వద్దనుండు
_x000D_
ముందునున్న యట్టి ముద్రిక కానరో
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3792 | _x000D_
పొట్లకాయ రాయి పొడవు త్రాటను గట్ట
_x000D_
లీలతోడ వంక లేక పెరుఁగు
_x000D_
కుక్కతోఁక గట్టఁ జక్కఁగా వచ్చునా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
812 | పాత్రాపాత్రవివేకము ల్సమసె పాపం బెచ్చె ధర్మంబును\న్
మిత్రఘ్నత్వము కల్లలాడుటయు స్వామిద్రోహముం గొండెము\న్
ధాత్రిం బూజ్యము లయ్యె సజ్జనులచందం బెట్లు రక్షించెదో
సత్రాజిత్తనయా మనోరమణ కృష్ణా దేవకీనందనా. | 7 | saardulamu |
1140 | పనిఁబూని జనులు సంతత
మునఁ దాలిమి సత్యశౌచములను బ్రవర్తిం
చిన యశము నొందుచుందురు
గనుగొను మిదె దొడ్డనడక గాఁగ కుమారా! | 1 | kandamu |
1559 | ఇది సంధింపఁగ వేళ యంచుఁ గడఁకన్ వృక్షంబు వేఁడిగ్గి య
మ్మదిరాక్షీమణి మ్రోల నిల్చి పతిసేమంబంతయుం జెప్పి త
ద్వదనాద్యాకృతి చిహ్నముల్ దెలిపి విశ్వాసంబు పుట్టించి దీ
ప్యదనర్ఘాంగుళి ముద్రికం గుఱుతుగా నర్పింపవే మారుతీ! | 4 | mattebhamu |
1250 | ఇంటఁ గల గుట్టు నీ పొరు
గింట రవంతైనఁ దెలుప నేఁగకు దానం
గంటనపడి నీవారలు
గెంటించెద రిల్లు వెడలఁ గినుకఁ గుమారీ! | 1 | kandamu |
3965 | _x000D_
లేఁడు లేఁడనినను లేఁడు లేనేలేఁడు
_x000D_
కాఁడు కాఁడటన్న కానెకాఁడు
_x000D_
తోడు తోడనినను తోడనే తోడౌను
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
146 | పతిత శరణాగతావన ప్రకటదీక్ష-లోకముల కబ్బురంబుగ నీకె గలదొ?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
1928 | దండ మహిరాజశయన నీ దండ నమ్మి | యున్నవాడను నన్నేలుకొమ్ము తండ్రిప్రియజనోల్లాసభక్తమనోభిలాష | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
629 | కనకవిశాలచేల భవకాననశాతకుఠారధార స
జ్జనపరిపాలశీల దివిజస్తుతసద్గుణకాండ కాండసం
జనిత పరాక్రమ క్రమవిశారద శారద కందకుంద చం
దనఘనసార సారయశ దాశరథీ! కరుణాపయోనిధీ! | 5 | champakamaala |
790 | నుతలోకప్రతిసృష్ట నిర్మలకళానూత్నాబ్జగర్భు\న్ మహా
ప్రతిభు\న్ గౌశికుఁ గుక్కమాంసము భుజింపం జేసి మాలాతని\న్
బతిమాలించవె చండచండతరశుంభత్వంబు పాల్మాలునా
శతఁ బొందించవె దేవదేవమయ కృష్ణా దేవకీనందనా. | 4 | mattebhamu |
2043 | నేను గోరిన దొక్కటే నీలవర్ణ - చయ్యనను మోక్షమిచ్చినఁ జాలు నాకు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
2974 | అతనికి నేమేమి యానవాలంటివా వేణువు దనచేత బూనువాడు రహినొప్ప శంఖచక్రంబులు గలవాడు సఖియ శ్రీవత్సలాంఛనమువాడుకోమలి నవరత్నకుండలంబులవాడు కస్తూరితిలకము గలుగువాడునలినాక్షి స్త్రీలతో నవ్వుచుండెడువాడు కమనీయ జీమూతకాంతివాడు | 3 | seesamu |
424 | ఆదరమింత లేక నరుఁడాత్మబలోన్నతి మంచివారికిన్
భేదము చేయుటం దనదు పేర్మికిఁ గీడగు మూలమె; ట్లమ
ర్యాద హిరణ్యపూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుడైన ప్ర
హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా! | 6 | vutpalamaala |
1922 | కేళి దేలుచు సుఖియించి కీరవాణి | మమత బాయక విభు చెంత మగువ జేరియవుర నా సామి నను బాయకనుచు బొగడె | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
2921 | కమలదళాక్షి నీవొకప్రకారముగాఁ బొలయల్కచే ముఖా-
బ్జము వెడసేయ నే నెనరుపల్కులు పల్కి, పయంట లాగి హ-
స్తము గదియించిన న్వడి విదల్చి ససీత్కృతితో నురోజమ-
ధ్యమమున నాదు చే యిఱికెనన్న హసింతువు సుందరీమణీ! | 5 | champakamaala |
680 | జలనిధులేడునొక్క మొగిఁ జక్కికిఁదెచ్చె శరంబు ఱాతినిం
పలరగఁ జేసెనాతిగఁ బదాబ్జపరాగము నీ చరిత్రముం
జలజభవాది నిర్జరులు సన్నుతి సేయఁగ లేరు గావునం
దలఁప నగణ్యమయ్య యిది దాశరథీ! కరుణాపయోనిధీ! | 5 | champakamaala |
1731 | దండము యదువీర దశరూపధర నీకు దండము వసుదేవతనయ శౌరిదండము హరిధరాధర నీకు విమలారి దండము శతకోటిసవనతేజదండము మందరోద్ధర నీకు సాష్టాంగదండము కంసమర్దన మురారిదండము కోదండధర మాధవా తన దండకు నిను బిల్వ తరుణి పనిచె | 3 | seesamu |
4495 | తల్లిని సేవించ దైవతార్చన యేల । తండ్రి గల్గిన పెన్నిధానమేల
దీనరక్షణమున్న దీర్థాటనంబేల । విద్యాధికతయున్న వేషమేల
పరమమిత్రుండున్న బంధువర్గంబేల । పతిభక్తి గల్గిన వ్రతములేల
రసికత్వమున్న సురత్నభూషణమేల । ఘనవాహనంబున్నఁ గవచమేల | 3 | seesamu |
3146 | _x000D_
నీళ్లమీద బుగ్గ నిలచిన యప్పుడు
_x000D_
తళ్లువేగవచ్చి తాకుఁ గాక
_x000D_
విడెడుకుండకింత విభ్రాంతి పడుదురు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
478 | పలుచని హీనమానవుఁడు పాటిఁదలంపక నిష్ఠురోక్తులం
బలుకుచు నుండుఁగాని, మతి భాసురుఁడైన గుణప్రపూర్ణుఁడ
ప్పలుకులఁ బల్కఁబోవఁడు నిబద్ధిగ నెట్లన; వెల్తికుండఁ దా
దొలకుచునుండుఁ గాని మఱితొల్కునె నిండుఘటంబు భాస్కరా! | 5 | champakamaala |
73 | అప్పనంబులు గొన్ను నఖిలదిఙ్మండలే- శ్వరులచే వేంకటాచలనివాసుఁ
డరుదుగా నరువదా ఱవసరంబులు మహా- భోగంబుఁ గొనునీలభూధ్రవరుఁడు
పానకం బాలు సాఁబాలు భక్తుల కిచ్చి- మెసఁగును మంగళాద్రీశ్వరుండు
పుట్టకొలంది మైపూఁతఁగాఁ గొను మంచి- గంధంబు సింహనగ ప్రభుండు | 3 | seesamu |
1130 | పిన్నల పెద్దలయెడఁ గడు
మన్ననచే మెలఁగు సుజన మార్గంబుల నీ
వెన్నికొని తిరుగు చుండిన
నన్నియెడల నెన్నఁబడుదు వన్న! కుమారా! | 1 | kandamu |
1132 | తమ్ములు తమ యన్న యెడ భ
యమ్మును భక్తియును గలిగి యారాధింపన్
దమ్ముల నన్నయు సమ్మో
దమ్మునఁ బ్రేమింపఁ గీర్తి దనరుఁ గుమారా! | 1 | kandamu |
2849 | పాపటదీర్చి నెన్నొసటిపై నునుపై యసియాడు చేయుచు-
క్కాపయిఁ గూర్చి గుబ్బలనొయారపు జాఱుపయంట చేర్చి వాల్
జూపుల నాదు మానసము చూఱఁగొనన్ సొగసైన రత్నపుం
దీపములాగ నా యెదుర నిల్చుట యెన్నడొ సుందరీమణీ! | 6 | vutpalamaala |
2860 | రతిఁ జిగురాకువంటి యధరంబు చుఱుక్కునఁ బంటనొక్కి సీ-
త్కృతి యొనరించి, బొమ్మముడి దేరఁగ నోరగఁజూచి, నీకు నీ
గతి నొనరించనేర్తునని, గంటుగ నా నునుమోవి నొక్కి నొ-
చ్చితివే యటంచుఁ గేలఁ బరిశీలన చేతువె సుందరీమణీ! | 5 | champakamaala |
74 | సాటిసాములరీతి నిచ్చోట నీవు-మూర్తిమంతంబుఁ జూపక కీర్తి గలదె?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
702 | వనకరిచిక్కె మైనసకు వాచవికిం జెడిపోయె మీను తా
వినికికిఁ జిక్కెఁ జిల్వ గనువేఁదుఱు జెందెను లేళ్ళు తావిలో
మనికినశించె దేఁటి తరమా యిరుమూఁటిని గెల్వనైదుసా
ధనములనీవె కావదగు దాశరథీ! కరుణాపయోనిధీ! | 5 | champakamaala |
3822 | _x000D_
బాలచనులఁ బూలబంతులఁ బోల్తురు
_x000D_
ప్రాలుమాలినట్టి భ్రష్టు లవని
_x000D_
మాంసఖండమందు మఱియేమియున్నది
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1725 | కడువడి మీఱ నందనుని గర్భములో భరియించి యింటిలో
నడిచెడివేళఁ దాఁ బనులు నాణెముగా నొనరించువేళ నిం-
పడరఁగఁ గూరుచుండు నెడనైన ప్రయాసము లోర్చెఁ గాన నీ
పుడమిని లోకమాత యనఁబోలిన తల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
897 | ఏతండ్రి కనకకశ్యపు
ఘాతకుఁడై యతనిసుతుని గరుణను గాచె\న్
ప్రీతి సురకోటి పొగడఁగ
నా తండ్రీ నిన్ను నేను నమ్మితి గృష్ణా. | 1 | kandamu |
808 | శ్రీజన్మప్రభుతావిశేషుఁ డగు రాజేంద్రుండు ధీపాలనా
జ్ఞాజాగ్రత్వనిదానకీర్తియుత రక్షాలక్షణాధీశుఁడై
రాజిల్లుం బహుకష్టుఁడైన ధరసామ్రాజ్యంబు బాలింపుచో
నైజంబై తగునా విశేషములు కృష్ణా దేవకీనందనా. | 7 | saardulamu |
1761 | చెండ్లాడమనుచు బాలిండ్లు నాథుని చేతికబ్బంగనిచ్చు నా యలరుబోడిగాటంపు రతుల జొకాటంపు వగలను మొనసి కూడగజాలు మోహనాంగిబడలిన విభునకు బలుమీరు గెమ్మోవియానంగనిచ్చు నా పంకజాక్షిపన్నీరుగంధంబు పైజల్లి శైత్యోపచారంబు సేయునా జలజపాణి | 3 | seesamu |
3508 | _x000D_
మ్రుచ్చు తీర్థమేగి ముల్లె విడుచును గాని
_x000D_
మ్రొక్కఁబ్రొద్దు లేదు మొనసి యెపుడు
_x000D_
కుక్క యిల్లుచొచ్చి కుండలు వెతుకదా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3962 | _x000D_
కడగిఁ గాలిలేని గగనంబుభంగిని
_x000D_
బలుతరఁగలు లేని జలధిమాడ్కి
_x000D_
నిర్వికారమునను నిశ్చలత్వమునఁ దా
_x000D_
నుండెనేని ముక్తి యొనరు వేమ. | 0 | aataveladi |
2530 | ఉరుసంసారగజేంద్రదర్పదళన వ్యూఢప్రతాపోగ్రకే-
సరి దుష్ప్రాపశరీధబంధవిపులక్ష్మాజవ్రజచ్ఛేదవి-
స్ఫురితక్రూర కుఠారధార దురితప్రోద్భూతజీమూతదు-
స్తరసంఘాతవిఘాత మారుతము నీ సద్భక్తి సర్వేశ్వరా! | 4 | mattebhamu |
4155 | _x000D_
పడిపడి మ్రొక్కఁగ నేటికి
_x000D_
గుడిలోపలి కఠినశిలల గుణములు చెడునా
_x000D_
గుడి దేహ మాత్మదేవుఁడు
_x000D_
చెడురాళ్ళకు వట్టిపూజ సేయకు వేమా. | 1 | kandamu |
1285 | సుమతియును జంద్రమతియును
దమయంతియు జానకియును ద్రౌపదియును బ
న్నములం బడి పతిభక్తిం
గ్రమమున నడుపుటలు తలఁప గాదె? కుమారీ! | 1 | kandamu |
1956 | సవిశేషోరు సువర్ణబిందువిలస చ్చక్రాంకలింగాకృతి\న్
భవుచే నుద్ధవుచేఁ బయోజభవుచేఁ బద్మారిచే భానుచే
ధ్రువుచే నా దివిజాధినాయకులచే దీప్యన్మునీంద్రాళిచే
నవదివ్యార్చన లందుచుందువు రమానారీశ, నారాయణా! | 4 | mattebhamu |
549 | కిరికలహంసరూపములఁ గృష్ణుఁడు నంబురుహాసనుండు నీ
చరణములున్ శిరంబు గనఁ జాగి రసాతలము న్నభంబు వే-
సరి వెదుకంగ వారికిఁ బ్రసన్నతనొందవె లింగమూర్తివై
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
160 | యింద ఱాయంబు లెరుగుదు వందువలన-మడిసి రసురులు నీచేత మడియువారె?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
1096 | మంచిదని సెప్పి సూకలు మానెఁ డన్ని | కొల్లఁగొనిపోయె నని మూర్ఖకోటి పలుకు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
2228 | లక్ష్మీశ! నీ దివ్యలక్షణ గుణముల - వినఁజాల కెప్పుడు వెఱ్ఱినైతి
నావెఱ్ఱిగుణములు నయముగా ఖండించి - నన్ను రక్షింపుమో నళిననేత్ర!
నిన్ను నే నమ్మితి నితరదైవముల నే - నమ్మలేదెప్పుడు నాగశయన!
కాపాడినను నీవె కష్టపెట్టిన నీవె - నీ పాదకమలముల్ నిరత మేను | 3 | seesamu |
4336 | ఇట్టివారలఁ గృపజూచు టెచ్చుగాదు । దేవ నా వంటి దీనుని బ్రోవవలయు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
4394 | గాఁపువానికి గ్రామాధికారమైన । దేవభూసురవృత్తులు దియ్యఁగోరు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
2546 | మోహధ్వాంతములో మునింగిన మహామూఢుం డతిభ్రష్టుఁడై
సోహంబంచుఁ దొడంగి నీకుఁ గడు దూరాత్ముం డగుంగాని దు-
ష్టాహంకారగుణంబు మాని మది సొంపారంగ సద్భక్తి దా-
సోహంబన్న భవత్పదార్చకుఁడు నీవై యుండు సర్వేశ్వరా! | 7 | saardulamu |
3628 | _x000D_
కరఁగకరగఁబుట్టు కనకంబునకు వన్నె
_x000D_
పెనఁగ పెనఁగబుట్టు ప్రేమసతికి
_x000D_
ముదియ ముదియఁ బుట్టు మోహంబు లోభంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1092 | నిలను దుష్కర్మసహితుల కెట్టి గట్టి | బంధుజనులున్నఁ గీడు వాపంగ లేరు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
4198 | _x000D_
వేము పాలఁబోసి వెయ్యేండ్లు పెంచిన
_x000D_
చేదువిడిచి తీపు చెందదెపుడు
_x000D_
నోగుగుణము విడిచి యుచితజ్ఞుఁ డగునట్లు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3465 | _x000D_
ఆకు కానవచ్చు హరిహరాదులకును
_x000D_
కొమ్మ గానరాదు కోరిచూడ
_x000D_
కొమ్మగానరాగఁ గొనియాడ కుండురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
872 | నరపశువ మూఢచిత్తుఁడ
దురితారంభుఁడను మిగుల దోషగుఁడను నీ
గుఱు తెఱుఁగ నెంతవాడఁను
హరి నీవే ప్రాపు దాపు వౌదువు కృష్ణా. | 1 | kandamu |
4033 | _x000D_
అండములను బుట్టు నలరు ప్రాణులు కొన్ని
_x000D_
బుద్బుదములఁ బుట్టుఁ బురుగు లెల్ల
_x000D_
స్వేదముననుబుట్టు జీవులు కొన్నిరా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
978 | పట్టిబుజములు గాలసబట్టెననెడు | చెనటుల తెఱంగు లేమని చెప్పనేర్తు
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
4054 | _x000D_
ఏమి గొంచువచ్చె నేమి తాఁగొనిపోవుఁ
_x000D_
బుట్టువేళ నరుఁడు గిట్టువేళ
_x000D_
ధనము లెచటి కేఁగు దానేగు నెచటికి
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3063 | నిత్యమును నిన్ను బ్రార్థింతు నీలవర్ణ | నాదు కోరిక లీడేర్చు నళిననాభతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. | 2 | teytageethi |
608 | వరద పరాకు భక్తజనవంద్య పరాకు సమస్తపాపసం-
హరణ పరాకు భక్తనివహావహదక్ష పరాకు యోగిహృ-
శ్చరణ పరాకు సేయకిఁక సయ్యన నా మనవాలకించవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
3477 | _x000D_
ప్రణవమంత్రమహిమ భావింప లింగంబు
_x000D_
మూడుమూర్తులందు మొనసియుండు
_x000D_
నతని నెఱిఁగి కొలువ నన్యుల వశమా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
911 | అయ్యా పంచేంద్రియములు
నుయ్యాలల నూచినట్టు లూచఁగ నేను\న్
జయ్యన గలఁగుచు నుంటిని
గుయ్యాలింపుము మహాత్మ గుఱుతుగఁ గృష్ణా. | 1 | kandamu |
344 | గొనబార న్విటజంగమాకృతిని మున్ గొంకేది భల్లాణరా-
యని సద్మంబున కేఁగి యాతని సతి న్బ్రార్థించి యా లేమ య-
క్కునఁ జక్క న్నెలనాళ్ళబాలకుఁడవై గోమొప్పఁ గన్పట్టితౌఁ
గన నబ్రంబులు నీ విహారములు భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
3849 | _x000D_
కోమటినిష్ఠలు గుఱికి రావెన్నఁడు
_x000D_
లోభగుణము చేతలోని కడఁగు
_x000D_
పులియు దాసరి కీడుపొలువగు చందమౌ
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2009 | విదితామ్నాయ నికాయ భూతములలో విజ్ఞానసంపత్కళా
స్పద యోగీంద్రమనస్సరోజములలో బ్రహ్మేంద్రదిక్పాలక
త్రిదశవ్రాతకిరీటరత్నములలో దీపించుచున్నట్టి మీ
పదపద్మంబులు భావగేహమున నే భావింతు నారాయణా! | 4 | mattebhamu |
2318 | దేవా! నాదొక విన్నపంబు గల దేదీ యంటివా వింటివా
త్రోవం దండధరుండు దుర్గతులకై త్రోవన్ విచారించునో
యేవిఘ్నం బొనరించునో యెఱుఁగరా దే ముక్తికిం బోవుచో
రావే వెంబడి నింతనంత రఘువీరా! జానకీనాయకా! | 7 | saardulamu |
45 | విక్రమాక్రమిత భూచక్రుఁ డౌ హేమాక్షు- పొం గణంచుటలు కోణంగితనము
కరగతామృతకుంభ గర్వితాసురకోటిఁ- దూలఁగొట్టుటలు గయ్యాళితనము
కుచపూర్ణ విషదుగ్ధకుటిల యౌ పూతన- పేరు మాయించుట పిల్లతనము
కంసపురీ ద్వారగమనావరోధి యౌ- మదకరి నీడ్చుట మకురుతనము | 3 | seesamu |
606 | దొరకెను నాకు భాగ్యమున దుస్సహదండధరప్రచండకిం-
కరపటుదర్పసంహరణకారణమై యయిదక్షరంబులు-
న్బరగిన మంత్రరాజము సుపర్వులకైనఁ దలంక నేనిఁకన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
908 | అప్పా యిత్తువు దయతో
నప్పాలను నతిరసంబు లనుభవశాలీ
యప్పా నను గనుఁగొనవే
యప్పా నను బ్రోవు వేంకటప్పా కృష్ణా. | 1 | kandamu |
1474 | చెరుకుసింగిణిదొర బారి తరముగాక । వెరచి మరులను తానయై వేడుకొనిన
తెలియవైతివి మనసులో దిగులు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
473 | నేరిచి బుద్ధిమంతుఁడతి నీతివివేకము దెల్పినం జెడం
గారణమున్నవాని కది కైకొనఁగూడదు నిక్కమే; దురా
చారుఁడు రావణాసురుఁడసహ్యమునొందఁడె చేటుకాలముం
జేరువయైననాఁడు నిరసించి విభీషణు బుద్ధి భాస్కరా! | 6 | vutpalamaala |
3921 | _x000D_
చాడికానిమాట చావడిలో నిక్కు
_x000D_
వెంటఁ బో శునకము వెలయ నిక్కు
_x000D_
స్త్రీలఁజూచినపుడు శిశ్నంబు నిక్కురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3273 | _x000D_
శతసంఖ్యపదమ్ముల నే
_x000D_
మతిమంతుఁడు పఠనసేయు మమతులు దీరు
_x000D_
న్నతఁడే నాలుగుపదముల
_x000D_
శితికంఠునిపదముఁ జేరు సిద్ధము వేమా. | 1 | kandamu |
439 | ఏల సమస్త విద్యల నొకించుక భాగ్యము గల్గియుండినన్
జాలు, ననేక మార్గముల సన్నుతికెక్క నదెట్లొకో యనన్
రాలకు నేడ విద్యలు తిరంబుగ దేవరరూపు చేసినన్
వ్రాలి నమస్కరించి ప్రసవంబులు పెట్టరె మీఁద భాస్కరా! | 6 | vutpalamaala |
1919 | తన ప్రాణవిభునకు దడయక పన్నీట మజ్జనం బొనరించి మగువ కనకపళ్లెరంబున మంచిపస గల యన్నంబు గోఘృతపక్వమౌ కూరలమరనప్పడంబులు కందిపప్పును నొబ్బట్లు పాలుచక్కెర వెన్న పాయసంబుఘమ్మని వాసింపగా చారువడియముల్ పసిడిచెంబుల నీరు బాగుమీర | 3 | seesamu |
896 | ఓ భవబంధవిమోచన
ఓ భరతాగ్రజ మురారి యోరఘు రామా
ఓ భక్తకామధేనువ
ఓ భయహర నన్నుగావుమో హరి కృష్ణా. | 1 | kandamu |
4095 | _x000D_
వినియుండెడి జనమెల్లను
_x000D_
చనిపోయినవారి పుణ్యసత్కథ లెలమి\న్
_x000D_
వినవలెఁ గనవలె ననవలె
_x000D_
ననిమిషునకునైనఁ దెలియ దంత్యము వేమ. | 1 | kandamu |
154 | కోప మిటు లేమి? వారు మహాపరాధు-లైన ముక్తిప్రసాదార్హు లగుట యేమి?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
318 | ప్రచురత్వంబుగ నెంతు నాత్మనెపుడు న్బ్రత్యూహసంశాంతికై
విచలత్కర్ణసమీరదూరిత మహావిఘ్నంబుభృజ్జాలునిన్
రుచిరాస్వాంబురుహస్రవన్మదజలప్రోత్సాహ లీలాముహుః
ప్రచురద్భృంగకులున్ గణాధిపుని భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
1881 | వగలాడి నగుమోము నిగనిగల్ చూచిన బంగారుచాయల పర్వు గదరననబోడి నునుజెక్కులను జూడ దళతళ మించుటద్దంబులై మెఱయు గదరకొమ్మ జిగికెమ్మోవి నెమ్మిడాల్ చూచిన నీలవిద్రుమచ్ఛయ వెసగు గదరచెలి దంతముల కాంతు లెలమితో జూచిన దాడింబవిత్తులై తనరు గదర | 3 | seesamu |
4304 | సరి నలమేలుమంగకును జక్కనిమీకును మీకుమీకు లో
నరుదుగ నేకతస్ఫురణ నమ్ముడు వోయితి రొక్కరొక్కరు\న్
ఇరువురు నింక నేటితెలి వెక్కడినేరుపు లేటిసైరణల్
గిరపులపుచ్చె మేనఁ బులకింతలు వింతలు వేంకటేశ్వరా! | 5 | champakamaala |
4528 | బలము గలవాడు దుర్బలు బాఱఁ దఱుమ । దైవమొక ప్రాపు గల్పింపఁ దలఁపకున్నె
పొరలునే ప్రొద్దహంకారమున నరుండు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.