id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
2365
ఎక్కటిచదువులు బోధలు మక్కువ ననుభవములేనిమాటలు వినఁగాఁ బుక్కిటిపురాణములకై జక్కులసంతోష మెన్న సంపఁగిమన్నా!
1
kandamu
1263
బంతులను బక్షపాత మొ కింతైనను జేయరాదు హీనదశుల సా మతుల నొక భంగి నిరీ క్షింతురు బుధులెల్ల సంతసిల్లం గుమారీ!
1
kandamu
217
దురితధ్వాంతపతంగ! సంగరమహాదుర్వారగర్వాహితో- త్కర సేనాకదళీమతంగ! లసదేకాంతాత్మపంకేజసం- చరదుద్యన్మదభృంగ! పుంగవ ఘనశ్యామాంగ! సద్గంగ! క- మ్రరమాలింగనసంగతాంగ! రఘురామా! భక్తమందారమా!
4
mattebhamu
2233
నిద్ది పుణ్యాకరం బనియెపుడు జనులు - గష్టమెన్నక పఠియింపఁ గలుగు ముక్తి భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
3825
_x000D_ పుట్టలోన తేనె పుట్టినరీతిని _x000D_ గుట్టమీఁద మణియు పుట్టువిధము _x000D_ కట్టెలోన నగ్ని పుట్టినవిధమున _x000D_ పుట్టి పెట్టవలెను భువిని వేమా.
0
aataveladi
3979
_x000D_ రానిధనమునకును దానును కొడుకును _x000D_ వాంఛఁబడుటె కాని వట్టి భ్రమలు _x000D_ భాగ్యహీనునకును ఫలము లభించునా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
157
నిర్దయాత్ములె కాని నిత్యాగ్ని హోత్రాది- కర్మనైష్ఠికులైన ఘనులు గారె? శుచిశూన్యులే కాని శ్రుత్యాదిపాఠక- ప్రకటవేదార్థబోధకులు గారె? సత్యహీనులె కాని చంద్రశేఖరపాద-పద్మపూజానందపరులు గారె? మాయికులే గాని మంత్ర ప్రయోగోప- సంహరణ క్రియాచణులు గారె?
3
seesamu
780
అక్రూరస్థితి నుండఁగా వలయు రాజాస్థానమధ్యంబున\న్‌ వక్రింపం బనిలేదు ధర్మమునకై వర్తింపఁగాఁ బోయిన\న్‌ శుక్రాచార్యుని కన్నుఁ బో నడఁచవే సూటి\న్‌ గుశాగ్రంబున\న్‌ జక్రీ నీకరపంకజాంతరముఁ గృష్ణా దేవకీనందనా.
7
saardulamu
1688
పెనఁకువ మీఱ భోజనము పెట్టుమటంచని రాఁ గుమారునిన్ గని చిఱునవ్వు మోవిపయిఁ గ్రమ్మఁగ నీ విపుడేమి నేర్చితో వినవలెనంచుఁ గోరుచును వేమఱు లాలనసేసి వేడుకన్‌ దినుమని బువ్వఁ బెట్టు యువతీమణిఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
557
సరసవిహారలీల విటజంగమరూపముతోడ నేగి య- బ్బురముగ మున్ను భల్లణుని పత్నిని చల్లమదేవిఁ గోరి యా గురుకుచ కౌఁగిట న్నిలవె గోమెలయ న్నెలనాళ్లపట్టివై చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
4545
అప్రతిమప్రతాప! సముదంచిత నాదకళాకలాప! దీ ప్త ప్రమథస్వరూప! శివభక్తగణాత్మ గతప్రదీప! ధూ త ప్రబలేక్షుచాప! విగతప్రకటాఖిలపాప లింగ త త్త్వప్రద! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
2399
చాలా లోకులు నగనీ వాలాయము కీడు మేలు వచ్చిన రానీ యేలా గైనను బురుషుఁడు జాలిం బడఁ డాత్మఁ గన్న సంపఁగిమన్నా!
1
kandamu
1754
కేళి మరుకేళి గూడంగ కోరి పలుక యతనుసామ్రాజ్య మెల్ల నీ కబ్బినటుల-నుండదే చూడు మా యింతి నొనరగూడి | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
1136
తల్లిని దండ్రిని సహజల నల్లరఁ బెట్టినను వార లలుగుచు నీపై నుల్లముల రోయుచుందురు కల్లరి వీఁడనుచుఁ గీర్తి గందఁ గుమారా!
1
kandamu
2423
ఎప్పుడు కర్మముఁ జేసెడి యప్పురుషుఁడు తన్నుఁ గన్న నది చాలించున్‌ చప్పిడిగాదా నోటికిఁ జప్పనియాపిప్పిఁ దిన్న సంపఁగిమన్నా!
1
kandamu
134
నబ్బె నీకుఁ బరోపకారైన ఫలము-లంతియే కాక నీచేత నైన దేమి? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
3994
_x000D_ జ్ఞానమెన్న గురువు జ్ఞానహీనము బుద్ధి _x000D_ రెంటిసందు రిమ్మరేచు నపుడు _x000D_ రిమ్మ తెలిసెనేని రెండొకరూపురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
674
దీక్షవహించి నా కొలది దీనుల నెందఱిఁ గాచితో జగ ద్రక్షక తొల్లి యా ద్రుపదరాజతనూజ తలంచినంతనే యక్షయమైన వల్వలిడి తక్కట నా మొఱఁజిత్తగించి ప్ర త్యక్షము గావవేమిటికి దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
607
గిరిశ నమోస్తు యోగిజనగేయ నమోస్తు మహోగ్రదోషసం- హరణ నమోస్తు భోగికులహార నమోస్తు సమస్తదేవతా- చరణ నమోస్తు తే యనుచు సారెకుఁ గోరి నమస్కరించెదన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
3457
_x000D_ తనువు శోధఁజేసి దైవమ్ము మొనఁజేసి _x000D_ ముందు కర్మములను మూలఁద్రోసి _x000D_ మనము నిజముఁజేసి మమతలన్నియు రోసి _x000D_ మొనసి నిల్చువాఁడు మోక్షి వేమా.
1
kandamu
3308
_x000D_ ఆశ విడక గాని పాశముక్తుఁడు గాఁడు _x000D_ ముక్తుఁడయినఁగాని మునియుఁగాఁడు _x000D_ మునికిఁగాని సర్వమోహంబు లూడవు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1339
పసుపునిగ్గుల చల్వపావడతో కుసుం- । బా కలాబతు జారుపైటతోడ మొనబంటి కసికాటులను కందు మోవితో । విరులు వాడిన వేణిభరముతోడ నెలవంక గోటిపోటుల చన్నుదోయితో । సొక్కిన నెమ్మోముసొగసుతోడ కొద్దిగా చెదరు కుంకుమతో కరంగిన । కాటుక కనుసోగ నీటుతోడ
3
seesamu
1894
వెలయు నారామమున జేరి వెలది మదన | తాపమున నిన్ను దలచుచు దాళలేకయున్నదిక వేగ రావయ్య యూరడింప | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
4357
విధవ చెవులకేల యరిది వజ్రపుఁ గమ్మ । లురుకు తొత్తుకు విటుఁ డుండనేల గ్రుడ్డిముండకు మంచి గొప్పయద్దంబేల । సరవి గుడిసెకు బల్ చాందినేల యూరఁబందులకుఁ బన్నీరుగంధంబేల । బధిరున కల వీణపాటలేల కుక్కపోతుకు జరీకుచ్చుల జీనేల । పూఁటకూళ్ళమ్మకుఁ బుణ్యమేల
3
seesamu
2378
సంతతయోగానందా నంతసుఖాంభోధి నలరు నాతనిభాగ్యం బింతింతనఁ దరమా ఘన సంతోషము జగతి నెన్న సంపఁగిమన్నా!
1
kandamu
1924
నున్న దేవుని ... ... ... ... న్ని పూజ సేయదలచిన వారికి సిరులొసంగికోర్కెలొడగూర్తు గదవయ్య కోవలంక(?) | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
4380
ఘనతగల్గిన దొరబిడ్డ గాక సుకవి । నోటితిట్లకు వెఱచునా మోటువాడు మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
554
ముఱియుచుఁ గాశికాపురిని మూఢత బాహువులెత్తి ధారుణీ- ధరములకన్న నెవ్వఁడును దైవము లేడని పల్కు నప్పరా- శరసుతు బాహుయుగ్మకము స్తంభనమొందఁగఁ జేసి కుంచవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
536
కరయుగళంబు మోడ్చి కుతుకంబున మ్రొక్కెద సర్వదేవతా- పరివృఢమౌళిభాగ్మకుటపంకజరాగమణిప్రభాచ్ఛటా- నిరతవిరాజమానరమణీయభవచ్చరణాగ్రపీఠికిం జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
2862
చిలుకలకొల్కి! నీ నగవుచిల్కెడు నెమ్మొగ మొక్కమాఱు క- న్నులఁ గనుఁగొన్ననాఁడు మదనుండు ననుం గరుణించుగాక! యో చెలి, నినుఁ బాసి వ్యర్థగతిఁ జెందిననాఁ డకటా! మరుండు కే- వలమతి కర్కశాస్త్రముల వంచును నొంచును సుందరీమణీ!
5
champakamaala
1481
మొనపంట కసిదీరగను చురుక్కున నొక్కి । నొచ్చెనో మోవంచు నూరడించు కిలకిల నవ్వి చెక్కిలి నొక్కి నా సామి । కందెరా యంచు చన్గవలనంచు ప్రొద్దాయ లెమ్మని గద్దించి పల్కుచు । కదిసి ప్రేమను వచ్చి కౌగిలించు సురతంబునను చాల సొక్కితివని పైట- । చెరగెత్తి నెమ్మోము చెమటలొత్తు-
3
seesamu
2657
మును నీచే నపవర్గ రాజ్యపదవీమూర్ధాభిషేకంబు గాం చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో చింతించి చూడంగ నె ట్లనినం గీటఫణీంద్రపోతమదవేదండోగ్ర హింసావిచా రినిఁగాఁగా నినుఁగానఁగాక మదిలో శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
3655
_x000D_ వచ్చెడిది పోయెడిది మఱి _x000D_ చచ్చెడిదియుఁ గనకలేక సహజము లనుచు\న్‌ _x000D_ విచ్చలవిడిగాఁ దిరుగుట _x000D_ చిచ్చునఁబడునట్టి మిడుత చెలువము వేమా.
1
kandamu
3590
_x000D_ ఒడలుఁ బెంచులంజ యుబ్బకంబుననైన _x000D_ వేగ విటునిమీఁద విఱుఁగఁబడును _x000D_ పందికొక్కుమీద బండికల్‌ పడ్డట్లు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4118
_x000D_ మాదిగ చెవులను మనసులోఁ బెట్టుక _x000D_ మాదిగలను దెగడు మాదిగపుడు _x000D_ మంచిగుణములేక మఱిద్విజుఁ డెట్లగు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2836
శుభముల నొందని చదువును నభినయమును రాగరసము నందని పాటల్‌ అభిలాష లేని కూటమి సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!
1
kandamu
1758
యట్టి కనకాంగి వగలెన్న నలవి గాదు | పంకజాక్షిని చౌసీతిబంధగతులనేలుకొనవయ్య యతివేగ నీరజాక్ష | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
3210
_x000D_ ఎన్నాళ్ళకుఁ దానుండును _x000D_ ఎన్నాళ్లను దాను నేర్చి యెన్నిటవెలయున్‌ _x000D_ కొన్నాళ్లకుఁ దాఁ జన్నను _x000D_ మన్నేయగు విద్యలెల్ల మహిలో వేమా.
1
kandamu
4594
ప్రమథగణాధినాథ సముపాసన భాసుర పార్వతీమనో రమ రమణీయ హృత్కమలరాజిత నవ్యపతంగ సౌరభ భ్రమరవిలోలతా మధుకరాయిత దివ్యశరీర! సత్ప్రభా వమహిత! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
5
champakamaala
1067
పరుసంబు వలన నబ్బురముగా లోహంబు | మేల్మిబంగారమై మెఱసినట్లు భ్రమరంబు వలన విభ్రమరూఢి యలరారి | శలభంబు భ్రమరమై చెలఁగినట్లు మలయభూజాతంబు వలన నింబము పటీ- | రావనీజాతమై యలరినట్లు కతకంబు వలన నుద్గాఢపంకోదకం- | బతినిర్మలోదకంబైనయట్లు
3
seesamu
3920
_x000D_ అరయఁదోచునాఁడు గురువని తా నెంచి _x000D_ తిరుగువాఁడు తన్ను నరయలేఁడు _x000D_ పనికిమాలినట్టి బానిసె కొడుకురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
362
ఓంకారప్రముఖాక్షరోచ్చరణసంయోగంబు గావేన్ముఖా- లంకారార్థము శబ్దబిందుకళలున్ లక్ష్యప్రయోగక్రియల్ పొంకంబౌ గురుమార్గముల్ యతిగతిం బో దుష్కృతిం బోలి సా- హంకారుండయి ప్రాకృతుండు చెడు భర్గా! పార్వతీవల్లభా!
7
saardulamu
2120
అడవిపక్షుల కెవ్వఁడాహార మిచ్చెను - మృగజాతి కెవ్వఁడు మేఁతఁబెట్టె వనచరాదులకు భోజన మెవ్వఁ డిప్పించెఁ - జెట్లకెవ్వఁడు నీళ్లు చేదిపోసె స్త్రీల గర్భంబున శిశువు నెవ్వఁడు పెంచె - ఫణుల కెవ్వఁడు పోసెఁ బరగఁ బాలు మధుపాళి కెవ్వఁడు మకరంద మొనరించె - బసుల కెవ్వఁ డొసంగెఁ బచ్చిపూరి
3
seesamu
2337
వడుగా! నీవడుగంగనేర విట నల్పంబైన దానంబు న న్నడుగన్ వచ్చితి వన్నఁ గన్గొని బలీంద్రా! నాకు నీవిచ్చు మూఁ డడుగు ల్మూఁడు జగంబులంచుఁ గొనవా యాద్యంతముల్ మాటమా ర్పడ నాడన్ నుడికాఁడవౌర! రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
2490
అతిదక్షుండగు దక్షుఁ డీజగములో యాగంబు సల్లక్షణ- స్థితిగాఁ జేయుచునుండి మిము మది నుద్దేశింపమిం జేసి తా హతుఁడయ్యెం దుది నట్టికార్యములుఁ బొందై యుండునే కర్తస- మ్మతితో జేయని దుర్మదుండు మనునే భావింప సర్వేశ్వరా!
4
mattebhamu
4358
తనకు గతిలేక యొకఁడిచ్చు తఱిని వారి । మతులు చెరపెడి రండకుఁ గ్రతువులేల మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
966
నౌర యిక్కలికాల మహత్త్వమెంతొ | వింతయై తోఁచుఁ గద ధరాభ్యంతరమున, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
2384
సాధింపఁగ నిరతులకున్‌ బోధింపఁగ నేర్పు గల్గుపుణ్యాత్ముల యా యీధరఁ గల రొకకొందఱు సాధారణవిబుధు లెన్న సంపఁగిమన్నా!
1
kandamu
3070
వేమననగ యోగి వెలసె లోకములోనఁ బూజలిడుఁడు, పుణ్య పురుషులార పూజలిడిన యంత, భుక్తి ముక్తుల నిచ్చు విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2015
భవనాశి\న్‌ గయ తుంగభద్ర యమున\న్‌ భాగీరథిం గృష్ణ వే త్రవతి న్నర్మద పెన్న గౌతమి పయోరాశి న్వియద్గంగ యం దవగాహంబున నైన పుణ్యములు బెంపారంగ నేఁ డిచ్చట\న్‌ భవదంఘ్రిస్మరణంబునం గలుగు పో పద్మాక్ష నారాయణా!
4
mattebhamu
1868
కలికి యీ రీతి మదిలోన కలక జెంది | యున్న దా యింతి నతివేగ నూరడించిజాగుసేయక నేలుము జలరుహాక్ష | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
1018
వంగడంబున నొక క్రూరవర్తనుండు | పొడమి తత్ప్రాభవంబెల్ల నుడుగఁజేయు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
3131
_x000D_ ఇంద్రియ పరవశుఁ డధముం _x000D_ డింద్రియ పరవశుఁడు భక్తియెడ మధ్యముంఁడౌ _x000D_ నింద్రియజయుఁ డుత్తముఁ జి _x000D_ తేంద్రియసుతుఁడు విన మహేశుఁడు వేమా.
1
kandamu
3230
_x000D_ ధర్మమరసి పూని ధర్మరాజాదులు _x000D_ నిర్మలంపు ప్రౌఢి నిలుపుకొనిరి _x000D_ ధర్మమే నృపులకు తారకయోగంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3333
_x000D_ గురుని పరమగురుని గుఱుతుగాఁ దెలియక _x000D_ గురువుగాను నుండు గ్రుడ్డిరీతి _x000D_ గురువుకు గురువైన గురుఁడు ప్రాణేశుండు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3556
_x000D_ అప్పుదీయ రోఁత హరిహరాదులకైన _x000D_ మొప్పెతోడ మైత్రి మొదలె రోఁత _x000D_ తప్పు బలుక రోఁత తాకట్టిడిన రోఁత _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4341
వేదంబులును నీవె వేదాంగములు నీవె । జలధులు నీవె భూజములు నీవె క్రతువులు నీవె సద్వ్రతములు నీవె కో- । విదుఁ డటంచన నీవె నదులు నీవె కనకాద్రి నీవె యాకాశంబు నీవె ప- । ద్మాప్తసోములు నీవె యగ్ని నీవె యణురూపములు నీవె యవనీతలము నీవె । బ్రహ్మము నీవె గోపతియు నీవె
3
seesamu
3969
_x000D_ వరలు రత్నసమితివలెఁ గూర్చుధాన్యంబుఁ _x000D_ జక్కదంచి వండి మిక్కుటముగ _x000D_ సుష్టుభోజనములఁ జూరగా నిడువాఁడు _x000D_ చెప్పనేల వాఁడు శివుఁడు వేమ.
0
aataveladi
1601
విద్యుద్వల్లిక భంగి వాలము వియద్వీథిం బ్రకాశింప ను ష్ణద్యుత్యున్నతమండలంబు కరణిన్‌ వక్త్రంబు శోభిల్లగా ప్రోద్యద్బాహుబలం బెలర్పఁగ నికుంభుం గుంభకర్ణాత్మజున్‌ సద్యోమృత్యువు నొందఁజేయవె మహాజన్యంబునన్‌ మారుతీ!
7
saardulamu
3460
_x000D_ మూల మెవ్వ రనుచు ముగ్గురిలోపల _x000D_ మూల మెఱుఁగలేరు మూఢజనులు _x000D_ మూలమందఱకును ముఖ్యమౌఁ గర్మము _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2796
ధీరులకుఁ జేయు మేలది సారంబగు నారికేళ సలిలము భంగిన్‌ గౌరవమును మఱి మీఁదట భూరి సుఖావహము నగును భువిలో సుమతీ!
1
kandamu
123
అయవారు చదివించినట్లుగాఁ జదువక- మఱి కొట్టి తిట్టక వెఱపుఁ గొనక తనయుఁ డెంతో పరధ్యానంబుగా నున్నఁ- దండ్రి వల్దని చెప్పఁ దగఁడె ధాత్రి నీకుఁ గోపం బేమి నృహరిరూపంబున- స్తంభంబులోఁ బుట్టి చటులనేత్ర దంష్ట్రానఖప్రభ దహనకీలలఁ బోలి- భగ్గు రనంగఁ బైఁబడి హిరణ్య
3
seesamu
2195
స్వప్నమున నైన నేవేళ సంతతమును - బుద్ధి నీ పాదములయందుఁ బూనియుండు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
3234
_x000D_ ఎక్కడిసుతు లెక్కడిసతు _x000D_ లెక్కడిబంధువులు సఖులు నెక్కడి భృత్యుల్‌ _x000D_ డొక్కువడి పోవు వేళలఁ _x000D_ జక్కటికిని నెవరురారు సహజము వేమా.
1
kandamu
4378
బవరమునఁ జొచ్చి పొడువని బంటుచేతి । దాయుధంబైననేమి తెడ్డయిననేమి మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
2400
బాలుఁడుగానీ భోగ స్త్రీలోలుఁడుగాని విషయశీలుఁడు గానీ మేలైనబోధ గలిగినఁ జాలదె ముక్తిని గనంగ సంపఁగిమన్నా!
1
kandamu
1073
కుంభికుంభస్థలాక్షుద్రామిషము మెక్కు | సింగంబు కప్పల మ్రింగఁ జనునె సారభూరుహఫలాహారలీలఁ జెలంగు | కీర ముమ్మెతలఁ జేరుకొనునె యభ్రాపగాహాటకాబ్జమృణాళముల్ | కొను నంచ బురదవాగులకుఁ జనునె ప్రబలవర్షాంబుధారలు గ్రోలు వానకో - | యిల యిల మంచుసోనలకుఁ జనునె
3
seesamu
1815
సొగసైన మైనిగ్గు సుదతి సొమ్ముల జగ్గు వెలలేని మణులచే వేడ్కలలరుపగడంపు జిగిడాలు పడతి మోవిని బోలు జూడజూడగ నెంతోచోద్యముగనువిరిబోడి పాలిండ్లు గురులైన పూచెండు నీక్షింపనీక్షింప నెనగు ముదముచెలిహస్తముల బాగు చిగురుటాకుల లాగు గనుగొన నతిమోహకాంక్ష జెందు
3
seesamu
43
విమతభూపతు లెట్లు విముఖులై పాఱిరో- రాజపీఠం బెక్కరాని నీకు కుంభినీధవు లెట్లు కూఁతుండ్ర నిచ్చిరో- కుల మొల్లకయె నీకు గోపకునకు సుందరీమణు లెట్లు చూచి మోహించిరో- క ప్పగు మైచాయ గలుగునీకు దాసజనం బెట్లు దాస్యంబు సలిపిరో- తిరియువానిని మారు తిరియు నీకు
3
seesamu
1646
వేవిళు లోఁకిరింతలును విన్నఁదనంబును దోఁప డస్సి గ- ర్భావరణార్భకావనశుభక్రమ మొప్పఁగ మంత్రతంత్రసం- భావన మీఱ మాంత్రికుల భావనఁ జేయుచుఁ ‘బుత్రవృద్ధికిన్ దైవము తోడు గావలె సదా’ యను తల్లినిఁ బోలరెవ్వరున్.
6
vutpalamaala
2544
అకలంకస్థిరభక్తి మున్సొగయ నిన్నశ్రాంతముం జూచి పా- యక పూజించు మహామహుండు భవదభ్యర్చ్యుం డగుంగాక దా సకలేచ్ఛావిషయంబులం బొగయుచుం జాపల్యతం జేయు నా బకవేషార్చనలేల నిన్ను సొగయింపం జాలు సర్వేశ్వరా!
4
mattebhamu
2944
నాథుని కస్తూరినామంబు గన్గొని కలికి యెవ్వతె వాని గౌగిలించెదక్కుచు నా యింటి దగ్గర రాకుండ మాటున బెట్టిన మగువ యెవతెప్రియుని నా పనుల కొప్పించిన దెవ్వతె దానికి నా యుసుర్తగులుగాకదోషమంచెన్నక దుడుకులాడెవ్వతె మన్నన రావించి మరులుకొల్పె
3
seesamu
1355
తొలకరిమెఱప నా వెలలేని జీవర- । త్నమ జున్నుగిన్నె బిత్తరులమేటి రామచిల్క యొయారిరాయంచ ఖండచ- । క్కెరరాశి మేల్మిబంగరుసలాక మదనమంజరి తియ్యమామిడి కుం- । కుమబొమ్మ కల్కికుల్కులకొఠారు కట్టాణిముత్యము కస్తూరివీణె ము- । ద్దులగని సింగారములబిడారు
3
seesamu
128
సేసి యిల విప్రులకు ధారఁ బోసినట్టి-కీర్తియే కాని బ్రహ్మణ్యకృత్య మగునె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
4161
_x000D_ కంటికంటి ననుచుఁ గర్మాధికారంబు _x000D_ వెంటఁబట్టి చెడును వెఱ్ఱినరుఁడు _x000D_ బట్టబయట ముక్తి చాటించిచూడరో _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
221
సకలాభీష్టఫలప్రదాయకుఁడవై చంచద్దయాశాలివై ప్రకటస్నేహరసార్ద్రమానసుఁడవై భంగీకృతానేకపా- తకఘోరామయశాత్రవోత్కరుడవై ధాత్రీసుతం గూడి మా- మక చిత్తాబ్జమునన్ వసించు మొగి, రామా! భక్తమందారమా!
4
mattebhamu
1771
నెమ్మదిగా భర్త నెనరుంచవలెనని పొలతి పున్నమ యొక్కప్రొద్దులుండుమమత బాయక పతి మందిరంబుననుండ మరుమంత్రజపము లేమరక సేయునన్యకాంతల విభు డాసింపకుండగా శివు నభిషేకంబు చేయుచుండుమగడు దన మాటకు నూరాడకుండగా జెలి వినాయకపూజ సేయుచుండు
3
seesamu
238
అకలంకాయతభోగభాగ్యదము నిత్యానందసంధానహే- తుక మాభీలతరాఘమేఘఘనవాతూలంబు ముక్తిప్రదా- యక మత్యంతపవిత్ర మెంచ నిల నాహా! తారకబ్రహ్మ నా- మకమంత్రంబు భళీ! భవన్మహిమ! రామా! భక్తమందారమా!
4
mattebhamu
4476
లిట్టి ప్రభు దుర్ణయపుఁ జేష్ట లెఱుగలేక । వెంబడించెడివాడెపో వెఱ్ఱివాడు వాని కొడబడఁ డింగితజ్ఞానశాలి మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
891
హరి సర్వంబునఁ గలఁ డని గరిమను దైత్యుండు పలుకఁ గంబములోన\న్‌ ఇరవొంది వెడలిచీల్చవె శరణనఁ బ్రహ్లాదుడిండు సాక్షియె కృష్ణా.
1
kandamu
3213
_x000D_ ఈకపట నాటకంబును _x000D_ ఈకపటపుఁ జదువులన్ని యింపు దలిర్ప\న్‌ _x000D_ ఏకపటాత్ముఁడు సేసెనొ _x000D_ యాకపటాత్మునకు మ్రొక్కి యలరుము వేమా.
1
kandamu
4117
_x000D_ నొసలు బత్తుఁడయ్యె నోరు తోడే లయ్యె _x000D_ మనసు భూతమువలె మలయఁగాను _x000D_ శివునిఁ గనియె నన్నసిగ్గెట్లు గాదొకొ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4390
నట్టియాతఁడు సుకవి కానట్టి యతనిఁ । గవియనఁగనేల కవిమాలకాకి గాఁడె మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
3580
_x000D_ కడుపుచిచ్చుచేత కామానలముచేత _x000D_ క్రోధవహ్నిచేత కుతిలపడకను _x000D_ యుక్తమనసుతోడ నుండినప్పుడె ముక్తి _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1392
కలువకొలనికి పడమటిగట్టు పొన్న- । గున్నలకు తోడితెమ్మని గురుతుజెప్పి కన్య నంపించునాటి సౌఖ్యంబు దలప । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
2744
అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్యవిద్య కోమలి నిజము\న్‌ బొల్లున దంచిన బియ్యముఁ దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!
1
kandamu
301
నే నీ బంటను నీవు నా దొర విదే నిక్కంబటంచు న్మదిన్ నానాభంగుల నమ్మి కొల్చితినె యెన్నాళ్ళాయె జీతంబు కా- సైన న్నేఁటి కొసంగవైతి భళి యాహా! లెస్స! బాగాయెగా! మౌనీంద్రాశయపద్మషట్చరణ! రామా! భక్తమందారమా!
7
saardulamu
3852
_x000D_ తల్లిదండ్రులెన్నఁ దనతొలి గురులు _x000D_ పార్వతీభవులును పరమగురువులు _x000D_ కూలివాండ్ర జగతి గురు లన ద్రోహంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
882
శతకోటి భానుతేజా యతులితసద్గుణగణాఢ్య యంబుజనాభా రతినాథజనక లక్ష్మీ సతిహిత ననుఁ గావు భక్త వత్సల కృష్ణా.
1
kandamu
1597
హరిజిచ్చాపవిముక్త ఘోరతరబ్రహ్మాస్త్ర ప్రభావంబునన్‌ వరుసన్‌ మూర్ఛిలి చాపకట్టుగ రహిన్‌ సంగ్రామరంగమ్మునం దరుదారం బడియున్న వానరుల నుద్యచ్ఛక్తి సంజీవిచే కర మర్థిం బ్రతికించి మెప్పు గొనవే కాకుత్స్థుచే మారుతీ!
4
mattebhamu
1012
కూడదన్నను గవితలఁ గూర్చి బలిమి | గుమతులకు నిచ్చువాఁ డొక్కకూళ సుమ్ము, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
3493
_x000D_ జీవిఁజంపుటెల్ల శివభక్తి తప్పుట _x000D_ జీవు నరసిచూడ శివుఁడు గాదె _x000D_ జీవుఁడు శివుఁడగును సిద్ధంబు దెలియరో _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
773
అమరు ల్పద్మజువ్రాతఁదాఁటి యిపుడొక్కబ్దంబు పెద్దయ్య దు ర్దమ దోర్దండపటుప్రతాప నిజసంరంభామరానీక వి క్రమ దుర్వారగజాసురప్రళయ మింకం జేయ ఫాలాక్షుని\న్‌ సమరక్షోణి జయించె నర్జునుఁడు కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
3982
_x000D_ ఇహమునందు బాధలెన్నైనఁ బడవచ్చు _x000D_ యముని బాధలేక యమరవలెను _x000D_ పరుల బాధలేక బ్రతుకుఁడీ నరులార _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3170
_x000D_ ఉత్తమోత్తముండు తత్వజ్ఞుఁ డిలమీద _x000D_ మహిమఁజూపువాఁడు మధ్యముండు _x000D_ వేషధారి యుదరపోషకుఁడధముండు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4497
అర్థాతురునకు గృత్యాకృత్యములు లేవు । కవిజనంబుల కెఱుంగనివి లేవు కుక్షింభరుఁడు కాని కూటికి రోయఁడు । కామాతురుం డర్థకాంక్ష వీడఁడు వెలిచవుల్గొను కాంత వెఱవదు నిందకు । నీతకు మిక్కిలిలోతు లేదు పాపశీలికి దయాపరత యెందును లేదు । వెఱ్ఱివానికి సాధువృత్తి లేదు
3
seesamu
988
రహహ దందర మిటులయ్యె ననెడి మోటుఁ | బెద్దదొక్కుడుగాళ్ళఁ జెప్పెడిదిఁకేమి, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
4416
రవివికాసంబు లేనట్టి దివసమేల । ధైర్యమొదవని వస్తాదుతనమదేల మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
761
గహనావాసములోన నన్నలకుఁ దా గారాబుతమ్ముండునై విహరించేతఱి భావికాలగతి నన్వేషించుచు\న్‌ శౌర్యసం గ్రహుఁడై యావులఁగాచె మత్స్యపురిలోఁ గర్మానుగుణ్యక్రియ స్సహదేవుం డతిధైర్యమార్గమునఁ గృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
1483
నిదురలేపిన కోపమొదవు నంచని మెల్ల- । గా వచ్చి వెన్కపక్కల పరుండు నలతగా తన రాక తెలియకూరక నున్న । నెరగనట్టుగ మీద కరము వైచు తిరిగి నేనపుడు వాతెర చురుక్కని నొక్క । లేచి నా నెమ్మోము చూచి నవ్వు మరిచి నిద్దురబోవు తరిని నన్నితూ భంగ- । పరతురా యనుచు నిష్ఠురతలాడు
3
seesamu