id stringlengths 1 4 | poem stringlengths 71 312 | label int64 0 7 | label_name stringclasses 8
values |
|---|---|---|---|
950 | గాఁగ నణిమాది భూతులు గల్గు నీకుఁ | బునుకలెత్తంగ నేరీతిఁ బొసఁగెనయ్య,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
4569 | చర్వితశృంగిగర్వ! గుణసంపద ఖర్వ! యపూర్వగీతగాం
ధర్వ! దిగంతపూర్ణ సముదాత్త యశః కృతకర్ణపర్వ! యం
తర్వినివిష్టశర్వ! విదితస్ఫురణాంచిత దర్వ! కావుమో
పర్వఘనప్రసాద బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
2261 | ఏ దైవాల వరాలకంటె సులభం బెవ్వారికైనన్ మదిన్
నీ దాతృత్వము చెప్పనేల శరణంటేన్ గాతు వింతేల నీ
పాదాంభోజరజంబు రాతికయినన్ బ్రాణంబు లీఁజాలు నౌ
రా! దిక్పూరితకీర్తిపూర! రఘువీరా! జానకీనాయకా! | 7 | saardulamu |
4488 | దుర్జనుఁడు వాని నమ్మిన దొడరకున్నె । హాని యెంతటివానికినైన గాని
తలదడవి బాసజేసిన తగదు నమ్మ
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
1515 | నిజగర్భస్థితశైవతేజము, సమున్నిద్రాత్మ తేజంబుఁ గూ
డ జగత్ప్రాణుఁ డమోఘ కేసరివనాటక్షేత్రమందర్థి నిం
చ, జయశ్రీ మహిమాప్తి నయ్యుభయతేజంబుల్ రహిన్ మిశ్రమై
త్రిజగంబుల్ గొనియాడ బుట్టితివి గాదే నీవిలన్ మారుతీ! | 4 | mattebhamu |
3400 | _x000D_
బ్రహ్మగ్రుడ్డు మేను ప్రాణమన్నది గాలి
_x000D_
కనులు చంద్రరవులు గారవింప
_x000D_
నింతకంటె బ్రహ్మ మెక్కడనున్నది
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3051 | మిగుల తలపులు సేతురే మగువలెల్ల | గుట్టు బైటను వేసిన కొదవ కాదేనా యూరి పేర్విను తాడిమళ్ళ | రాజగోపాలుడందురే రమణి నన్ను. | 2 | teytageethi |
2769 | కవిగాని వాని వ్రాఁతయు
నవరసభావములులేని నాతుల వలంపున్
దవిలి చను పందినేయని
వివిధాయుధకౌశలంబు వృథరా సుమతీ! | 1 | kandamu |
1307 | నేలన్ వ్రాలిన పత్రము
లోలిం జోడించి, మడచు చుండిన యవియున్
బోలఁగ సున్నపుటాకులు
దూలించు దరిద్రదశల దోఁచఁ గుమారీ! | 1 | kandamu |
3784 | _x000D_
జీవభేద మెఱిగి చెడిపోనివారికి
_x000D_
భావిజనుల చెలిమి పట్టుపడదు
_x000D_
ఈశ్వరునినెఱిఁగిన నెఱుగఁడీ జగమును
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1965 | భవరోగంబుల మందు పాతకతమోబాలార్కబింబంబు క
ర్మ విషజ్వాలసుధాంశుగామృత తుషారవ్రాతపాథోధిమూ
ర్తివి కైవల్యపదావలోకన కళాదివ్యాంజనశ్రేష్ఠమై
భువిలో మీదగు మంత్రరాజ మమరున్ భూతాత్మ, నారాయణా! | 4 | mattebhamu |
2343 | త్రేతా ద్వాపరసంధి నుద్ధతమదాంధీభూత ధాత్రీధవ
వ్రాతంబున్ జననీ ప్రతిజ్ఞకొఱ కిర్వైయొక్కమారుల్ బహు
ప్రీతిం ద్రుంచితి గాదె నీవు విలసద్వీర్యంబుమై ఘోరని
ర్ఘాతక్రూరకుఠారధార రఘువీరా! జానకీనాయకా! | 7 | saardulamu |
2104 | ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్ని - కలుగఁజేసెడి భారకర్త వీవె
చదువు లెస్సఁగనేర్పి సభలో గరిష్ఠాధి - కార మొందించెడి ఘనుఁడ వీవె
నడక మంచిది పెట్టి నరులు మెచ్చెడునట్టి - పేరు రప్పించెడి పెద్ద వీవె
బలువైన వైరాగ్యభక్తిజ్ఞానములిచ్చి - ముక్తిఁ బొందించెడు మూర్తి వీవె | 3 | seesamu |
2640 | తరఁగల్ పిప్పల పత్త్రముల్ మెఱుఁగుటద్దంబుల్ మరుద్దీపముల్,
కరికర్ణాంతము లెండమావులతతుల్ ఖద్యోత కీట ప్రభల్
సురవీథీ లిఖితాక్షరంబు లసువుల్ జ్యోత్స్నాపయఃపిండముల్
సిరులందేల మదాంధులౌదురు జనుల్ శ్రీకాళహస్తీశ్వరా! | 4 | mattebhamu |
3235 | _x000D_
పాలనీరుక్రమము పరమహంస యెఱుంగు
_x000D_
నీరుపాలక్రమము నెమలి కేల
_x000D_
అజ్ఞుఁడయినవాఁడు నలశివు నెఱుఁగునా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2678 | అంతా సంశయమే శరీర ఘటనంబంతా విచారంబె లో
నంతా దుఃఖపరంపరాన్వితమె మేనంతా భయభ్రాంతమే
యంతానాంత శరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్
జింతన్నిన్నుఁ దలంచి పొందరు నరుల్ శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
2924 | భామిని నిన్న రే నిదుర పట్టక పట్టక పట్టినంతలో
కామునికేళిలో మనము కౌతుకమంది పెనంగులాడి యే-
మేమొ వినోదముల్ సలుప, నెక్కడి పాపపుకోడి కూసెనో
స్వామికటాక్ష మట్లలరె స్వప్నమునందును, సుందరీమణీ! | 6 | vutpalamaala |
4353 | అగ్రజన్మము తీరమందు వాసంబును । వితరణము ననుభవించు నేర్పు
సంగీతసాహిత్యసంపన్నతయు మఱి । రసికత బంధుసంరక్షణంబు
ననుకూలమైన చక్కని భార్య రాజస- । న్మానంబు ప్రఖ్యాతి మానుషంబు
సౌందర్య మతిదృఢశక్తి విలాసంబు । జ్ఞానంబు నీ పదధ్యాననిష్ఠ | 3 | seesamu |
624 | శ్రీద సనందనాది మునిసేవితపాద దిగంతకీర్తిసం
పాద సమస్తభూతపరిపాలవినోద విషాదవల్లికా
చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
1785 | తీరైన మృగనాభి తిలకంబు ధరియించి కనుల కాటుక దీర్చి గరిమ మీరనగరుగంధము మేన నలది కొప్పున దావి పొలివోని పువ్వులు పొందుపరచివన్నెమీరగ సన్నవలిపెపై పన్నీరుచల్లి ఘమ్మనుచు వాసన చెలంగకుంకుమ యత్తరు గోరజవ్వాదియు బొంకమౌ పాలిండ్ల బూసె నీదు | 3 | seesamu |
1632 | బాలలఁ గూడి బొమ్మ నొడిపైఁ గడుఁబ్రేమ చెలంగ నిల్పి తా-
నోలలు పాడుచున్ బొదలి యుగ్గిడి కేలను మేను దువ్వుచోఁ
జాల మనంబుతో నిటులఁ జక్కనిపట్టిని గాన నెప్పుడో
కాల మటంచు నెంచు మదిఁ గల్గిన తల్లినిఁ బోలరెవ్వరున్. | 6 | vutpalamaala |
4023 | _x000D_
దోపునిచ్చువాఁడు తులలేని నెఱదాత
_x000D_
దోఁచుకొన్నవాఁడు ద్రోహి యయ్యె
_x000D_
ప్రాపుఁ జూపువాఁడు పరమపుణ్యుం డయ్యె
_x000D_
ప్రాపుఁజెఱచువాఁడు పశువు వేమ. | 0 | aataveladi |
4374 | ననుచుఁ బాత్ర మపాత్రము ననక యిచ్చి । చెప్పుకొందురు మూఢులు సిగ్గులేక
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
913 | యమునకు నిఁక నే వెఱువను
కమలాక్ష జగన్నివాస కామితఫలదా
విమలమగు నీదు నామము
నమఁరఁగఁ దలఁచెదను వేగ ననిశము కృష్ణా. | 1 | kandamu |
410 | ఆఁకొన్నప్పుడు వంటకంబయిన బియ్యంబైన జావైనఁ గూ-
రాకైన న్ఫలమైన నీరమయినన్ హాళిం గల ట్లిచ్చుచున్
జేకోనౌఁ బరదేశులం గృహులకు న్సిద్ధంబు గావింప ఛీ!
కాకున్న న్మఱి యేఁటికొంప లవి? భర్గా! పార్వతీవల్లభా! | 7 | saardulamu |
1617 | ధృతియున్, నీతియు, సాహసంబు, స్మృతియున్, తేజంబు సర్వశ్రుతి
స్మృతిపారీణతయున్, యశంబు, విజయోన్మేషంబు, శాస్త్రజ్ఞతా
చతురత్వంబు, శమక్షమాదిగుణముల్, సాధుత్వమున్, శౌర్యమున్
వితతప్రజ్ఞ, జితేంద్రియత్వము రహిన్ నీకే తగున్ మారుతీ! | 4 | mattebhamu |
3510 | _x000D_
పాగ పచ్చడంబు పైకిఁ గూసంబును
_x000D_
పోగు లుంగరములు బొజ్జకడుపు
_x000D_
గలిగినట్టివానిఁ గందురు చుట్టముల్
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
621 | రామ విశాలవిక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనావిముఖ సువ్రతకామ వినీల నీరద
శ్యామ కకుత్స్థవంశకలశాంబుధి సోమ సురారిదోర్బలో
ద్దామవిరామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
269 | ఎన్నం గార్ధభ ముత్తమాశ్వమగునే; హీనుండు దాతృత్వసం-
పన్నుండౌనె; ఖలుండు పుణ్యుఁడగునే; పల్గాకి సాధౌనె; క-
ల్జున్నౌనే; మహిషంబ హస్తి యగునే; జోరీగ దేఁటౌనెటుల్
మన్నుం బిల్లి మృగేంద్రమౌనె భువి రామా! భక్తమందారమా! | 7 | saardulamu |
387 | తేజంబొప్పఁ బురాకృతంబున జగద్ధ్యేయత్వదంఘ్రిద్వయీ-
పూజాపుణ్యఫలంబునం దమరిటుల్ భూపత్వముం గంటకున్
వ్యాజంబూని కడుం జెడంగవలెనా యాలింపరా యీ నృపుల్
‘రాజాంతే నరకం వ్రజే’త్తనుట? భర్గా! పార్వతీవల్లభా! | 7 | saardulamu |
103 | కూరిమి నల తంతెగొట్టు సన్న్యాసితో- ముచ్చటించెద వేమి పుణ్యమూర్తి
సాటిగా వెలిగొండవీటి జంగముచెల్మిఁ- బచరింతు వేనాఁటి బాంధవుండు
వెలిపాపపాన్పుపై వేడ్కతోఁ బవళింతు- వది యేమి భోగిభోగాంతరంబు
పొరుగిండ్ల కేప్రొద్దుఁ బో రాఁ దలఁచునింతిఁ- బాయకుండెద వేమి భాగ్యలక్ష్మి | 3 | seesamu |
1600 | మాయాసీతను జంపి నిన్ను భ్రమియింపం జేసి దుర్వారదై
తేయ ప్రావృతుఁడై నికుంభిలకు నెంతేఁ గోర్కితో నేగి, య
చ్చో యాగం బొనరింపుచున్న యసురేశున్ మేఘనాధాఖ్యు దీ
క్షాయుక్తిన్ సమరోర్వి లక్ష్మణునిచేఁ జంపింపవే మారుతీ! | 7 | saardulamu |
2353 | అతులప్రౌఢిమ మీఱ రాయకవి యయ్యల్‌రాజు సత్పుత్రుఁ డ
చ్యుతభక్తిం ద్రిపురాంతకుం డొనరిచెన్ శుద్ధంబుగా నాంధ్ర సం
గత పద్యంబుల నూటి నివ్వి వెలయుం గాతన్ రవీందుప్రచా
రత యెందాకనొ యంత దాక రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
1629 | శ్రీపతియైనఁ గాని విధుశేఖరుఁడైన త్రిశూలపాణియై-
నా పరమేష్ఠియైన గణనాయకుఁడైన రమామృడానులై-
నా పలుకుం బొలంతియయినా పరిరక్షణకార్యసత్క్రియో-
ద్దీపనబోధనోక్తులను దెల్పను తల్లినిఁ బోలరెవ్వరున్. | 6 | vutpalamaala |
3959 | _x000D_
ఉండియుండు జ్ఞాని యుగములు చనినను
_x000D_
బ్రాణహాని లేదు ప్రళయమునను
_x000D_
బ్రాణహానియైనఁ బరమాత్ము గలియునో
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2609 | బాలుం డాడెడు మాటలెల్ల నుపమింపం దండ్రికి బ్రౌఢభా-
వాలాపంబులకంటె మించుగతి నే నజ్ఞానభావంబునం-
దాలోచించి రచించినట్టి కృతి యింపారంగ నీకు న్మహా-
లాలిత్యస్తుతికంటెఁ గైకొనుఁగదా శ్లాఘ్యంబు సర్వేశ్వరా! | 7 | saardulamu |
2928 | వింతగ నన్ను నీవు బదివేలవిధంబుల నవ్వులాట కొ-
ట్టింతువు మాటల న్నెదఘటింతువు చన్గవ యల్కసేయ న-
వ్వింతువు పల్కుఁ గప్పురపు వీడె మొసంగి మనోజరాజ్య మే-
లింతువు నీ గతుల్ పొగడలేము గదే మది సుందరీమణీ! | 6 | vutpalamaala |
3500 | _x000D_
పురుషుఁ డెఱుఁగఁ జంపు భూపతి వినఁజేటు
_x000D_
నఖిలనిందలకును నాలయంబు
_x000D_
పరపురుష గమనము ప్రత్యక్ష నరకము
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3437 | _x000D_
చేతస్సంకల్పంబులు
_x000D_
నీతిని వర్జించి నపుడె నిర్మల పదవుల్
_x000D_
ప్రీతిం బొందు నటందురు
_x000D_
భూతములనఁ బరఁగ యోగ పురుషులు వేమా. | 1 | kandamu |
2826 | మాటకుఁ బ్రాణము సత్యము
కోటకుఁ బ్రాణంబు సుభటకోటి ధరిత్రిన్
బోటికిఁ బ్రాణము మానము
చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ! | 1 | kandamu |
249 | ప్రాణివ్యూహలలాటభాగముల లీలాలోలచిత్తంబునన్
పాణీకోకిలవాణినాథుఁడు లిఖింపంబొల్చు భాగ్యాక్షర-
శ్రేణిం బెంపఁ గరంబె యెవ్వరికి సంసిద్ధంబు స్వారాట్ఛిరో-
మాణిక్యస్ఫురదంఘ్రితామరస రామా! భక్తమందారమా! | 7 | saardulamu |
2235 | తారుణ్యోదయ! యొంటిమిట్టరఘునాథా! నీకు నేఁ బద్యముల్
నూఱుం జెప్పెద నూరుఁబేరు వెలయన్ నూత్నంబుగా; నంత నా
నోరుం బావన మౌను, నీ కరుణఁ గాంతున్, భక్తి నన్నందఱున్
రారమ్మందురు గారవించి రఘువీరా! జానకీనాయకా! | 7 | saardulamu |
159 | ఒక్కవ్రేటునఁ గూలునో వాలి బలశాలి- చెట్లుమా టొగ్గి వేసితివి గాని
మొనసి నీల్గునె పఙ్క్తిముఖుఁడు తన్నాభికా- మృతకుంభ పగలఁ గొట్టితివి గాని
కుంభకర్ణుఁడు రణక్షోణిలోఁ దీరునే- తీఱని నిద్ర నెదిర్చెఁ గాని
చిక్కునే యింద్రజి త్తుక్కున సోదరుం- డశననిద్రలు మాని యఁడఁచె గాని | 3 | seesamu |
1095 | పొద్దుపొద్దుకు వచ్చి పోలిబొట్లయ్య దా | పంచాగమిప్పి ఒప్పన్న సేసి
సాతి బూదారంబు సాతి నచ్చత్తరా | మసిలేటి కారితే యల్లకలికి
గాందారిపొద్దున గాని వర్చీర్జాలు | రావు మీఁదాతులా రాశి నీకు
సూరీడు సందుడు సుకురుండు నని బుర- | స్సపతి పద్దనకొంట సాగినారు | 3 | seesamu |
2916 | బోటిరొ వానచే వెడలిపోవఁగలే కొకనాఁడటుండి యే-
ర్పాటుగ నిద్రవోవ నెఱపయ్యెద దీపము త్రెంచి వచ్చి, స-
య్యాటలు మాటలున్ బెనఁకులాటలు సీత్కృతు లేమి లేక నన్
గూటమి నేలుటల్ దలచుకొందువొ లేదొకొ సుందరీమణీ! | 6 | vutpalamaala |
715 | నోఁచిన తల్లితండ్రికిఁ దనూభవుఁడొక్కడె చాలు మేటి చే
చాఁచనివాఁడు వేఱొకఁడు చాచిన లేదనకిచ్చువాఁడు నో
రాఁచి నిజంబకాని పలుకాడనివాఁడు రణంబులోన మేన్
దాఁచనివాఁడు భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
1368 | తీవ్రగతినేగి చెలులతో తేటి యిచట । కొరికెనో గాక చెయ్యెత్తగూడదనుచు
చెప్పుకొనునాటి యణుకువ చెలువ దలప । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
3009 | చోరుడై వచ్చి యీపాటి ధీరవరుల | గొట్టవచ్చునె పదికోట్ల గుంపులోనతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. | 2 | teytageethi |
2958 | పగతుడై మదనుండు బాణముల్సంధించి చురచురక్కున సేయజూచెనమ్మబాల యాతని వేడిబాణముల్ దాకక తప్పించుకొనగ నా తరముగాదుయో సఖి నిమిషంబు నూరకుండనుగాదు వెడవిలుకాడు నా వెంటనంటిజాముజామున లేపి లేమరో నా పైని తన శరంబులు చేర్చి దాకునమ్మ | 3 | seesamu |
10 | తెలియ శ్రీకాకుళంబు నీ దివ్యదేశ-మాంధ్రనాయక నీవె శ్రీహరివి నిజము
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
4313 | నాఁడలమేలుమంగ జననంబుకై కలశాబ్ధిఁద్రచ్చియీ
మూఁడుజగంబులందును బ్రమోదము నించితి వట్ల నుండుచో
నాఁడుఁదనంపుబృంద ముదయంబును బొందఁగ నిత్యసంపదల్
నేఁ డిఁక నేమిటం గడమ నీకృప వారికి వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
1855 | కాంత నెమ్మెయి సాముగంబము గావించి విభుని పొందుమటంచు వేడుకలరనునుగోటి బాకుల నెనయించి గుబ్బల వదలని చేపట్ల వరుస దెల్పికొమ్మ నునుతొడలను కోణిత నెనయగజేసి మోవిమావుల వింతమొగ్గ నిల్చిచెలి వేణివిసరుల జిరంతసాము ఘటించి సరిబోర దొడరి హెచ్చరిక దెల్పి | 3 | seesamu |
182 | యెంచ దేవర దైవమో యీవె కాని-చూపఱకు నీదు మహిమను జూపవలదె?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
1739 | అరవిరిగొమ్మరా యపరంజిబొమ్మరా మరునిచేచిల్కరా మందయానయలికులవేణిరా యంబుజపాణిరా చిలుకలకొలికిరా చిగురుబోడివెన్నెలగుమ్మరా యన్నులమిన్నరా పన్నీటిసోనరా పంకజాక్షిచిలికికటారిరా చిత్తజదంతిరా శుకవాణిరా మేటి సుందరాంగి | 3 | seesamu |
3553 | _x000D_
కోఁతిఁ బట్టితెచ్చి క్రొత్తపుట్టముగట్టి
_x000D_
కొండమ్రుచ్చు లెల్లఁ గొలిచినట్లు
_x000D_
నీతిహీనునొద్ద నిర్భాగ్యు లుందురు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3105 | _x000D_
లోభి వానిఁ జంప లోకంబు లోపల
_x000D_
మందు వలదు; వేఱె మతము గలదు
_x000D_
పైక మడుగఁ జాల భగ్గున పడి చచ్చు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4197 | _x000D_
విషసహితులు నరులు విషధరు లెన్నఁగ
_x000D_
విష విషధరములను విరియఁగొట్ట
_x000D_
నఘము వచ్చుకడకు నాయువుకొదువగు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2880 | నీ కడకంటి చూపు, బలునిద్దపు నీ చనుదోయి ప్రాపు, నన్
బైకొను కోపు, నీ జిలుగుబంగరు మై నునుతాపు, నీ సుధా-
స్తోక రదాంశుకంబు చవి చూపు, దయామతి దాపు, నీవే నన్
జేకొను కోపు లేక గడెసేపు రుచించదు సుందరీమణీ! | 6 | vutpalamaala |
883 | మందుఁడ నే దురితాత్ముఁడ
నిందల కొడిఁగట్టినట్టి నీచుని నన్ను\న్
సందేహింపక కావుము
నందుని వరపుత్ర నిన్ను నమ్మితి గృష్ణా. | 1 | kandamu |
3096 | _x000D_
కులము లో నొకండు గుణవంతు డుండెనా
_x000D_
కులము వెలయు వాని గుణముచేత
_x000D_
వెలయ వనము లోన మలయజంబున్నట్లు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3099 | _x000D_
అల్పుఁ డెపుడు బల్కు నాడంబరము గాను
_x000D_
సజ్జనుండు బలుకుఁ జల్లగాను
_x000D_
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1936 | నీ పుత్రుండు చరాచరప్రతతుల న్నిర్మించి పెంపారఁగా
నీ పుణ్యాంగన సర్వజీవతతుల న్నిత్యంబు రక్షింపఁగా
నీ పాదోదక మీజగత్త్రయముల న్నిష్పాపులం జేయఁగా
నీ పెంపేమని చెప్పవచ్చు సుగుణా నిత్యాత్మ, నారాయణా! | 7 | saardulamu |
1553 | కంటిం జారణ సిద్ధ కిన్నర మరుద్గంధర్వ కాంతావళిన్
గంటిన్ మానవయోషలన్ బవనభుగ్రామా లలామంబులన్
గంటిన్ సర్వనిశాచరప్రమదలన్ గంటిం బురంబందు నే
వెంటం జానకిఁ గాననైతి నని నిర్వేదింపవే మారుతీ! | 7 | saardulamu |
712 | సిరిగలనాఁడు మైమఱచి చిక్కిననాఁడు దలంచి పుణ్యముల్
పొరిఁబొరి సేయనైతినని పొక్కినఁగల్గునె గాలిచిచ్చుపైఁ
గెరలినవేళఁ దప్పికొని కీడ్పడువేళ జలంబుగోరి త
త్తరమునఁ ద్రవ్వినంగలదె దాశరథీ! కరుణాపయోనిధీ! | 5 | champakamaala |
3258 | _x000D_
పసులవన్నె వేఱు పాలెల్లనొక్కటి
_x000D_
పుష్పజాతి వేఱు పూజయొకటి
_x000D_
దర్శనంబు వేఱు దైవంబ యొక్కటి
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2137 | నిటుల సంసారవారధి నీఁదలేక - వేయి విధముల నిన్ను నే వేఁడుకొంటి
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
2227 | యిట్టి పనులెల్లఁ జేయఁగా నెవరికేని - తగునె నరసింహ! నీ కిది దగును గాక!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
2785 | తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌఁ
దన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ! | 1 | kandamu |
3578 | _x000D_
ఎఱిఁగిన శివపూజ యెన్నడు చెడిపోదు
_x000D_
మొదలఁబట్టుపట్టి వదల రాదు
_x000D_
మొదలు విడిచి గోడ తుదిఁ బెట్ట గల్గురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2275 | జననాథాగ్రణి! నిన్నుఁ గొల్చునతఁ డాచండాలుఁడైనం బున
ర్జననం బొందక ముక్తిఁ గాంచు నొనరన్ సద్భక్తుఁడైనం దుదిన్,
జనుఁ జండాలకులంబులోన నుదయించం గోరి నీ నామకీ
ర్తన సేయ న్నిరసించెనేని రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
1521 | మనుజగ్రామణి సత్కృపాత్త కపిసామ్రాజ్య స్థితుండయ్యు భూ
తనయాన్వేషణ కార్యమున్ మఱచి కందర్పక్రియామత్తుఁడై
తనివిం జెందక యున్న భానుజునిఁ దత్కాలార్హ నీత్యుక్తయు
క్తిని బోధించిన నీతిశాలివి నినుం గీర్తించెదన్ మారుతీ! | 4 | mattebhamu |
4165 | _x000D_
చదువులందు లేదు శాస్త్రంబులను లేదు
_x000D_
వేదములను దైవభేదములను
_x000D_
బైటనున్న ముక్తి పాటించ లేఁడయా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2075 | చుట్టముల మీఁది భ్రమదీసి చూరఁ జెక్కి - సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
1319 | పాకంబునకు తగు ఫణితి గానక కిరీ- । టము బెట్టినట్లు నీమములు లేక
తెనుగు పొయ్యెటి జాడ తెలియజాలక పెక్కు । శృంగారరీతులు చేతగాక
గ్రామ్యదేశ్యమ్ముల క్రమములెరుంగక । జాతీయములు గూర్చు సరణి రాక
పెళుచుమాటల దొంతి బేర్చుచు సాధార- । ణములౌ యతిప్రయోగములు లేక | 3 | seesamu |
1604 | తొలుతం బల్మరు మందు లిమ్మనుచు నెంతో వేడి, యీకున్న కే
వలశక్తిన్ హరి మందరాచలము నుత్పాటించినట్లీవు క
ట్టలుకన్ వాలముఁజుట్టి పాదముల నిట్టట్టూచి దిగ్రాజిఘూ
ర్ణిల దివ్యౌషధశైలముం బెఱుకవే క్రీడాగతిన్ మారుతీ! | 4 | mattebhamu |
644 | చక్కరమాని వేము దినఁజాలిన కైవడి మానవాధముల్
పెక్కురు బక్కదైవముల వేమఱుగొల్చెద రట్లకాదయా
మ్రొక్కిన నీక మ్రొక్కవలె మోక్షమొసంగిన నీవ యీవలెన్
దక్కినమాట లేమిటికి దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
996 | గలిగి కవిరాజ రాజశేఖరులు మెచ్చు | కబ్బములు గూర్చువాఁడె పో కవి యనంగ,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
494 | భ్రష్టున కర్థవంతులగు బాంధవులెందఱు గల్గినన్ నిజా
దృష్టము లేదు గావున దరిద్రతఁ బాపఁగలేరు; సత్కృపా
దృష్టిని నిల్పి లోకుల కతిస్థిరసంపద లిచ్చు లక్ష్మి యా
జ్యేష్ట కదేటికిం గలుగఁజేయదు తోడనె పుట్టి భాస్కరా! | 6 | vutpalamaala |
3935 | _x000D_
చావుఁ దెలియువాఁడు సన్యసించునదెల్ల
_x000D_
కడవలందు కులము చెడినయట్లు
_x000D_
పాపమొకటె మీఁద ఫలమేమి లేదురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
388 | కవివిద్వద్ధరణీసుధాశనవరుల్ కార్యార్థులై యొద్ద డా-
సి వడిం జేతులు దోయిలించుకొని యాశీర్వాదముల్సేయ నె-
క్కువదర్పంబున నట్టిట్టుం బొరలకే కొర్మ్రింగినట్లుండ్రుగా
రవళిం దుర్నృపు లేమి యీఁగలరొ భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
2334 | అమరుల్ రాక్షసనాయకుల్ కడఁకతో నత్యంతగర్వంబునన్
దమ సత్త్వంబుల మందరాచలముచేఁ దర్వంగ నంభోధిలో
రమణం దద్గిరి మోచి కాచిన జగత్త్రాణుండ! కూర్మావతా
ర మనంగా మఱి నీవెకావె రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
1169 | తన పంక్తియందు బాంధవ
జనము లొక విధంబుగ మెసంగుచు నుండం
గను దా సద్రసముల మెసఁ
గిన విషభోజనసమంబు క్షితిని గుమారా! | 1 | kandamu |
4214 | _x000D_
కుంటికుక్క కేల కుందేటిపరువులు
_x000D_
పిరికిబంటుకేల బిరుదుగొడుగు
_x000D_
ముసలిముండ కేల ముసిముసినవ్వులు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
490 | భుజబల శౌర్యవంతులగు పుత్త్రుల గాంచిన వారి కెయ్యెడన్
నిజహృదయేప్సితార్థములు నిక్కము చేకుఱుఁ గుంతిదేవికిన్
విజయబలాఢ్యుఁ డర్జునుఁడు వీరపరాక్రమ మొప్ప దేవతా
గజమును దెచ్చి తల్లి వ్రతకార్యము దీర్పఁడె తొల్లి భాస్కరా! | 5 | champakamaala |
4276 | ... ... ... ... లును బబ్బిలికాయలు పైఁడిమట్టియల్
మోద మెలర్ప నందియలు మ్రోయఁగనయ్యలమేలుమంగ క
త్యాదరలీలఁబాడ బలువంచును వేదము ... ... ...
... ... ... ... ... ... ... ... ... ... ను వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
1491 | తీపైన బేషక్ మఠా పఠాన్ తురకి క- । చ్చీ మాదువాను తేజీల పాగ
దిట్టంపు మేల్ జుల్ఫ తీపిల్ల చిగురుఖాం- । డా కమ్మి యస్సల్ కడానిబొమ్మ
తరుణుల మేటి నిద్దాహొంతకారి బి- । త్తరుల మిన్నా తేటకురుచతేనె
గరిగె లేతాకు తేగా బాదుషా సాము- । వస్తాదు యెనలేని వన్నెలాడి | 3 | seesamu |
4136 | _x000D_
రాతిప్రతిమ దెచ్చి రాజసంబుననుంచి
_x000D_
పూజసేయు నరుఁడు బుద్ధిమాలి
_x000D_
భావమందుఁ బరము భావించ నేరఁడు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1423 | పూవిల్తుడొక పచ్చిబోయవానికి తోడు । మలయానిలుడు పరమాతతాయి
తొగరేడనే గురుద్రోహి వెన్నెలగాయ । గండుకోవిల చెట్టునుండి కూయ
చేజేత నెత్తిపెంచిన చిల్క పగదాయె । గ్రుక్కద్రిప్పదె దాని గొంతుకోయ
మొదటనే కొదమతుమ్మెద వేరువిత్తాయె । గోర్వంక కాపురాల్ గుత్తసేయ | 3 | seesamu |
2527 | ఎచ్చో నీ పదభక్తుఁ డుండు మది నింపెక్కం బ్రయత్నంబుతో
నచ్చో నీ వనిశంబు నుండుదు త్వదీయధ్యానచిన్మూర్తులై
యచ్చో సన్మునులెల్ల నుండుదురు మంత్రాంగాక్షరాయుక్తులై
యచ్చోఁ దీర్థములెల్ల నుండు నిది వేదార్థంబు సర్వేశ్వరా! | 7 | saardulamu |
537 | తరమె నుతింప నేరికిని దావక దివ్యపదప్రభావమున్
గరికిని సాలెపుర్వునకు గాడుపుదిండికి మోక్షమిచ్చి యా-
దరమున నేలుకొంటివట దాన వరేణ్యులఁ బ్రోచుటబ్రమా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
4261 | వెలదిఁ మహాపరాధములు వేయును జేసితిఁ గావుమన్న నీ
పులకలు మేనిఘాతలును బూఁతలు జూ చలమేలుమంగ నీ
యలకలు దీర్చి చెక్కు చెమ టల్లన గోళ్లను జిమ్మి పయ్యెదన్
బలుచనినవ్వుతో విసరుఁ బై చెమ టారఁగ వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
3923 | _x000D_
భేదాభేదంబులకును
_x000D_
వాదంబై జనముచూడ వర్తించును నా
_x000D_
భేదాభేదము లుడిగిన
_x000D_
వేదాంత ధ్యాని యగుచు వెలుఁగుర వేమా. | 1 | kandamu |
2723 | సలిలమ్మున్జుళుకప్రమాణ మొక పుష్పమ్మున్భవన్మౌళి ని
శ్చల భక్తిప్రపత్తిచే నరుఁడు పూజల్సేయఁగా ధన్యుఁడౌ
నిల గంగానదిఁ జంద్రఖండమును దా నిందుం దుదింగాంచు నీ
చెలువంబంతయు నీ మహత్త్వమిదిగా శ్రీకాళహస్తీశ్వరా! | 4 | mattebhamu |
152 | లంక సాధించితివి గాని లావుచేత-నిర్జరారుల గెలువంగ నీతరంబె?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
751 | తినదేచెట్టున నాకు మేఁక గుహ గొందిం బాము నిద్రింపదే
వనవాసంబునఁ బక్షులు\న్ మృగములు\న్ వర్తింపవే నీటిలో
మునుకల్ వేయవె మత్స్యకచ్ఛపములు న్మోక్షార్థమౌ ముక్తికి\న్
మనసే మూలము నీదుభక్తులకు కృష్ణా దేవకీనందనా. | 4 | mattebhamu |
102 | యిట్టివే కద నీవిద్య లెన్ని యైన-నింక నేమిట ఘనుఁడవో యెఱుఁగరాదు
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
955 | పుఱియలు పునుకలు నెఱియఁ బేర్లుగ వైచి | కుత్తుక గరళంబు కుదురు కొలిపి
కడఁగి పెన్బాముల తొడపులుగాఁ బెట్టి | పచ్చియేనుఁగుతోలు పైని గప్పి
నెమ్మేన శవభస్మ మిమ్ముమీఱ నలంది | బికిరంబు చలికూడు ప్రేమఁ దినుచు
భూతపిశాచముల్ ప్రీతిఁ గొల్వగఁ బ్రేత- | భూములయందు నబ్బురము మీఱ | 3 | seesamu |
2918 | వేడిమి మాను చంద్ర! నిను వేఁడెదఁ జల్లనిరాజ వీవు నీ
వాడను నే నటంచు బహువారము దూరిన నీ మొగంబునున్
జూడక యేఁచుచుండె జడ చొప్పడ నల్లుము నీదు కొప్పుచే
వీడదె రాహువం చడలి వెల్వడు దెన్నఁడు సుందరీమణీ! | 6 | vutpalamaala |
1280 | కలహపడునింట నిలువదు
కలుముల జవరాలు కానఁ గలకాలం బే
కలహములు లేక సమ్మతి
మెలఁగంగా నేర్చెనేని మేలు కుమారీ! | 1 | kandamu |
704 | చిరతరభక్తి నొక్కతులసీదళ మర్పణ సేయువాఁడు ఖే
చరగరుడోరగ ప్రముఖసంఘములో వెలుఁగన్ సదాభవత్
స్ఫురదరవింద పాదములఁ బూజలొనర్చినవారికెల్లఁ ద
త్పర మఱచేతిధాత్రిగద దాశరథీ! కరుణాపయోనిధీ! | 5 | champakamaala |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.