id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
699
ముదమున కాటపట్టు భవమోహమద ద్విరదాంకుశంబు సం పదల కొటారు కోరికల పంట పరంబునకాది వైరుల న్నదన జయించుత్రోవ విపదబ్ధికి నావ గదా సదాభవ త్సదమల నామసంస్మరణ దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
3671
_x000D_ గాడ్దె యేమెఱుంగు గంధంబు వాసన _x000D_ కుక్క యేమెఱుంగు గొప్పబుద్ధి _x000D_ అల్పుఁడే మెఱుంగు హరునిఁ గొల్చు విరక్తి _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2187
ప్రేమతో నన్నుఁ బోషించి పెంచుకొనుము - ఘనత కెక్కించు నీ దాసగుణములోన భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
3474
_x000D_ ఏడె యక్షరముల నీయంద మొందిన _x000D_ నందు నిందు ముక్తి యలరుచుండు _x000D_ నందు నిందుఁ దెలియ నదియెపో బ్రహ్మంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2019
ఏభావంబున ని\న్‌ దలంచె గజయూధేంద్రుండు ఆపన్నుఁడై యేభావంబున ద్రౌప దయ్యెడ రమాధీశా యనె న్వాయసం బేభావంబున నీశరణ్య మనెనో యీ నీ కృపాదృష్టిచే నాభావంబున నీతలంపుఁ గలుగ న్నా కిమ్ము నారాయణా!
7
saardulamu
2877
అలితతి మ్రోఁతకున్ శుకపికావళి కూఁతకు మంటమారిపూ- విలుతుని కత్తికోతఁకు నవీనసమీరకుమారు నేఁతకున్ బొలుపుఁగ జంద్రు పెళ్లుడుకపోఁతకుఁ క్రొవ్విరిమల్లె పూతఁకున్ జలనమునొంది గుండె ఝలుఝల్లుమనెం గదె సుందరీమణీ!
5
champakamaala
2264
వృథగా దెవ్వఁడు నిన్నుఁ గొల్చినఁ గృపన్ వీక్షించి వాఁ డేమనో రథముల్ వేఁడిన నట్లె సేయుదువుగా రక్షావిధేయుండవై కథగాదీ వచనంబు నిక్క మటులే కాదేని మున్నేల సా రథివై తర్జునుతేరిఁ దోల రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
1935
మన మార న్నచలేంద్రజాధిపతికి న్మస్తాగ్రమాణిక్యమై మునికోపానలదగ్ధ రాజతతికి న్ముక్తిస్ఫురన్మార్గమై యెనయ\న్‌ సాయకశాయికిం జననియై యేపారు మిన్నేటికిం జని మూలంబగు నంఘ్రి నాదు మదిలోఁ జర్చింతు, నారాయణా!
4
mattebhamu
4293
కులికెడు పండుటామనులఁ గోయిలకూఁతల గుండె ఝల్లనన్‌ జెలువము గల్గు రాకలను జెంగట శ్రీయలమేలుమంగ కో విలకలనాదకోటులచవిం బచరింపఁగ నెట్టు లోర్తువో వలపులవార్ధిలోన ననివారణఁ దేలుచు వేంకటేశ్వరా!
5
champakamaala
1762
గాన నా యింతి వగలెన్నగా దరంబె | సరససద్గుణజాల యా సన్నుతాంగిచాల నిను గోరియున్నది జాలమేల | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
116
క్షోణిఁ బుట్టుక మాలిన గొల్లవాని-నిన్ను నావేల్పు లోడింప నేర రేమి? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
794
చీమల్‌ పుట్టలు పెట్టుచుండ నవి విస్తీర్ణంబు గావించిన\న్‌ పాముల్‌ జేరినరీతి లోభిజనసంపన్నార్థరాసుల్‌ వృథా భూమీపాలుల పాలుగాక చనునా పుణ్యంబులే లొల్లరో సామాన్యంబు ధనాధినాథులకుఁ గృష్ణా దేవకీనందనా.
7
saardulamu
574
అరయఁగ నీరబుద్బుదములట్ల నశించుచునుండు మేనులున్ శరధితరంగమాలికల చందమునం గనుపట్టు ఠీవులు స్థిరమని నమ్మి నిన్గొలువనేరక రిత్త నశింతురౌ ఖలుల్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
49
వ్రేపల్లెలో గొల్లవెలఁదులు గొట్ట రా- దొడిదొడి యిల్లిల్లుఁ దూఱలేదొ రాసకేళికయందు రమణులా యెందఱో- చుట్టి పట్టినఁ బాఱఁ జూడలేదొ పదియాఱు వేల గోపకుమారికలు తేరి- పాఱఁ జూచిన మతి బ్రమయలేదొ ప్రణయవాదంబున భార్య లా యెనమండ్రు- గసరివేసినఁ గూర్మిఁ గొసరలేదొ
3
seesamu
2473
మందేహామందౌషధ మెందు న్సరిలేని దైవ మిలలో సత్యా నందంబు జయమునందు త మందఱము సుఖంబు లంది యలరుద మెలమిన్‌.
1
kandamu
3254
_x000D_ భయముసుమీ యజ్ఞానము _x000D_ భయముడిగిన నిశ్చయంబు పరమార్థంబౌ _x000D_ లయముసుమీ యీ దేహము _x000D_ జయముసుమీ జీవుఁడనుచుఁ జాటర వేమా.
1
kandamu
2300
తిరునామంబు ధరింపఁడేని నొసలన్ దిక్పూరితంబైన నీ వరనామంబుఁ దలంపఁడేని మదిలో వాంఛించి నీ పాదపం కరుహ శ్రీతులసీదళోదకముఁ ద్రాగండేని వాఁడేటి నే ర్పరి వైకుంఠపురంబుఁ జేర రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
1088
రాజగునె జాగ్రదుడు దురాగ్రహముచేతఁ | బ్రజల బాధించు ఘోరదర్పధ్వజుండు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
2894
కులుకుచుఁ గేళిసౌధమునకున్ వెస నీ వరుదెంచి, నాదు క- న్నులు వడిమూయ నే నిను గనుంగొను లాగు మోము గు- బ్బలు వళులుల్కవేసి పిరుదు పల్మరు నంటుచు నీవె లాగినన్ భళిభళి! యంచు నవ్వుదువు పక్కను పైఁబడి సుందరీమణీ!
5
champakamaala
1901
శుకతురంగము పౌజు యొక లక్ష చనుదేర తేటికాల్బల మొక్క కోటి గొల్వగోర్వంక బలములు గొల్చి కైవారంబు సేయ నెమ్ములును హెచ్చరికె దెల్పతెమ్మెరరథమెక్కి కమ్మవిల్తుడు చెరుకువింటను సంధించి విరుల సరముతరుణిపై వడిదాక గురుకుచంబుల సందు గురుతుగా నేసిన కొమ్మ యెటుల
3
seesamu
3974
_x000D_ కలిగి పెట్టలేని కర్మజీవులకెల్ల _x000D_ తిరిపెమును దొరకదు దీనులార _x000D_ తెలియఁ జూచుకొనుఁడు దృష్టాంత మిదిమీకు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
353
శిలలన్ఱొప్పియుఁ జెప్పుఁగాలను గడున్జిత్రంబుగాఁ ద్రొక్కియున్ వెలివెట్టించియుఁ గుంటెనల్నడపియు న్వే రోఁకటం గ్రుమ్మియు న్నిలయద్వారమునందుఁ గాఁపునిచియున్ నీవారలైనారు వా- రల భాగ్యం బిఁక నేమిచెప్పనగు? భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
3870
_x000D_ చిత్తవాజి నెక్కి శిక్షింప నేరక _x000D_ తత్తఱించి రౌతు తరల నేల _x000D_ వారణాసి తనకు వయ్యాళి కాబోలు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4270
పల్లవపాణి విశ్వగురుభామిని యిట్టి ప్రపంచ మంతకున్‌ దల్లి సమస్తజీవులనిధానమ శ్రీయలమేలుమంగ నీ చల్లనిచూపు చిల్కి వెదచల్లఁగఁ బుణ్యులమైతి మండ్రు భూ మెల్లను నీ వధూమణి ననేకవిధంబుల వేంకటేశ్వరా!
6
vutpalamaala
3511
_x000D_ ఈఁతకంటె లోతు నెంచంగఁ బనిలేదు _x000D_ చావుకంటెఁ గీడు జగతిలేదు _x000D_ గోచిపాతకంటె కొంచెంబు మఱిలేదు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2046
చిత్తశుద్ధిగ నీకుసేవఁజేసెదఁ గాని - పుడమిలో జనుల మెప్పులకుఁ గాదు జన్మపావనతకై స్మరణఁజేసెదఁ గాని - సరివారిలోఁ బ్రతిష్ఠలకుఁ గాదు ముక్తికోసము నేనుమ్రొక్కి వేఁడెదఁ గాని - దండి భాగ్యము నిమిత్తంబుఁ గాదు నిన్నుఁ బొగడఁగ విద్యనేర్చితినే కాని - కుక్షినిండెడి కూటికొఱకుఁ గాదు
3
seesamu
19
అంచితాఖండ దీపారాధనల చేత- దీపించు నెప్పుడు దేవళంబు అగరుసాంబ్రాణి ధూపార్పణంబులచేత- భవనం బ దెప్పుడుఁ బరిమళించు నతినృత్యగీత వాద్యస్వనంబులచేత- నెప్పుడుఁ గోవెల యెసక మెసఁగు నఖిలోపచార సమర్పణంబులచేత- మెఱయు నెప్పుడుఁ దిరుమేను కళల
3
seesamu
3593
_x000D_ బ్రహ్మ మున్నచోటు పరగంగఁ దెలియక _x000D_ యెందొవెదుక బ్రహ్మ మేల కలుగు _x000D_ అంజనంబు లేక యా సొమ్ము దొరకదు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
904
నీ నామము భవహరణము నీ నామము సర్వసౌఖ్య నివహకరంబు\న్‌ నీ నామ మమృత పూర్ణము నీ నామము నేఁదలంతు నిత్యము కృష్ణా.
1
kandamu
378
అమరం ద్వత్పదపంకజాతయుగళధ్యానక్రియాశ్రాంతసం- భ్రమలీలన్ విలసిల్లు డెంద మొరులన్ బ్రార్థింపఁగా నేర్చునే? సుమనోనిర్ఝరిణీసువర్ణకమలస్తోమాసవాలంపట భ్రమరం బేఁగునే తుమ్మకొమ్మలకు భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
1394
వెన్ని చూచిన దాని పాలిండ్లతీరు । గాన త్రిజగాన చాన నీ యాన యెంత- కైన నేమాయ నా మందయానపైన । వలపునిక రామరామ లావణ్యసీమ.
2
teytageethi
1969
విందుల్‌ విందు లటంచు గోపరమణుల్‌ వ్రేపల్లెలోఁ బిన్ననాఁ డందెల్‌ మ్రోయఁగ ముద్దుమోమలర ని న్నాలింగితుం జేయుచో డెందంబుల్‌ దనివార రాగరసవీటీలీలల\న్‌ దేల్చు మీ మందస్మేర ముఖేందురోచులు మము న్మన్నించు, నారాయణా!
7
saardulamu
3068
వైకుంఠవాసాయ వారిజనేత్రాయ ద్విజరాజసుముఖాయ తే నమోస్తుజలధరదేహాయ శంఖచక్రధరాయ మానితభర్గాయ తే నమోస్తుపాలితసుజనాయ భావజజనకాయ దీనార్తిహరణాయ తే నమోస్తుసామజవరదాయ శాత్రవహరణాయ దేవకీతనయాయ తే నమోస్తు
3
seesamu
767
క్రతువుల్‌ నూఱొనరించి యింద్రపదవిన్గర్వించియింద్రాణికై ధృతిఁదూల\న్‌ మరుఁడేచఁగా నహుషుఁడద్దేవేంద్రుభోగానుసం గతిగాఁ గోరినకుంభసంభవుఁడు గిన్క\న్‌ దిట్టిన\న్‌ జెందఁడే సతతంబు\న్‌ పెనుబాముచందమును కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
3162
_x000D_ తేనెతెరలజాడ తేనెటీఁగ యెఱుంగు _x000D_ సుమరసంబుజాడ భ్రమర మెఱుఁగు _x000D_ పరమయోగి జాడభక్తుం డెఱుంగును _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2210
నాగేంద్రశయన! నీనామమాధుర్యంబు - మూఁడుకన్నుల సాంబమూర్తి కెఱుక పంకజాతాక్ష! నీ బలపరాక్రమ మెల్ల - భారతీపతి యైన బ్రహ్మ కెఱుక మధుకైటభారి! నీ మాయాసమర్థత - వసుధలో బలిచక్రవర్తి కెఱుక పరమాత్మ! నీదగు పక్షపాతిత్వంబు - దశశతాక్షుల పురందరుని కెఱుక
3
seesamu
874
పంచేంద్రియమార్గంబులఁ గొంచెపు బుద్ధిని జరించి కొన్ని దినంబుల్‌ ఇంచుక సజ్జన సంగతి నెంచగ మిమ్మెఱిఁగినాఁడ నిప్పుడె కృష్ణా.
1
kandamu
3752
_x000D_ మన్ను మిన్ను నంటి మహిమీఁద నొకకోట _x000D_ కొమ్మ లమరియుండు కొనలుసాగి _x000D_ దివ్వెలేని వెలుఁగు తేజరిల్లుచు నుండు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
739
పెచ్చుల్‌ ప్రేలుచుఁ బిల్లఁగ్రోవి రవము\న్‌ బెంపొందఁగాఁ జొక్కుచు\న్‌ నిచ్చల్‌ నిన్ను భజింప గోపగణము\న్‌ నిత్యోత్సవక్రీడమై నెచ్చల్‌ మచ్చిక ముచ్చటచ్చుపడఁగా హెచ్చించి కీర్తించి నీ సచ్చారిత్రము విన్నఁ బుణ్యమగుఁ గృష్ణా దేవకీనందనా.
7
saardulamu
2552
కడుఁ జిత్రంబుగఁ జేయఁగా నొఱ సురంగంబయ్యెనే ఖడ్గమం- దిడకున్నం జెడురూపదేమి గొఱ? దానిం బెక్కు పాటింపఁగా నొడ లెబ్భంగుల నోపునే నియతితో నూహించి నిన్నాత్మలో నిడకున్నం జనురూపు నేమికొఱ తా నీక్షింప సర్వేశ్వరా!
4
mattebhamu
190
ధాత్రి నెవ్వరి రక్షించఁ దలఁచినావొ-కోరువారలచేఁ బూజ గొందు వింతె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
3639
_x000D_ కాంత కుంకయైనఁ గానికులం బైనఁ _x000D_ బాయలేక విటుఁడు బ్రమసియుండు _x000D_ మరగి గ్రుడ్డికుక్క మాంసంబు గన్నట్లు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4298
నెఱి నలమేలుమంగకును నీకును పద్మభవాండభాండమే మెఱసిన బొమ్మరిల్లు తగుమేడలు మీఁదటిలోకముల్‌ ప్రభల్‌ తెఱలఁగ మించు నయ్యినుఁడె దీపము గుజ్జనఁగూడు చంద్రుడే తొఱలిన దేవసంఘములె తొత్తులు బంట్లును వేంకటేశ్వరా!
5
champakamaala
730
జపముల్‌ సేయఁగ నేర నీమమున నిచ్చ ల్పూజ సేయంగలే నుపవాస వ్రతభక్తి చొప్పెఱుఁగ వేదోక్తక్రమస్థుండఁగా నపరాధంబులు నాయెడం దఱచు నే నజ్ఞాని నెబ్భంగుల\న్‌ జపలుం డంచు నుపేక్ష సేయకుము కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
2038
నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - దురితజాలములెల్ల ద్రోలవచ్చు నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - బలువైన రోగముల్‌ బాపవచ్చు నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - రిపు సంఘముల సంహరింపవచ్చు నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - దండహస్తుని బంట్లఁదఱుమవచ్చు
3
seesamu
3695
_x000D_ రామనామపఠనమహిమచే వాల్మీకి _x000D_ పరఁగ బోయ యయ్యు బాపఁడయ్యె _x000D_ కులము ఘనము గాదు గుణము ఘనంబురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4219
_x000D_ కాశినీళ్ళు మోసి కాళ్లు మొగము వాచి _x000D_ యెందు సుఖము లేక యెండి యెండి _x000D_ చచ్చివెనుక ముక్తి సాధించఁగలరొకో _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1098
దుర్గుణున కెన్ని మంచి వస్తువులు పెట్టి | మనుపఁ జూచిన తన యోజ మానఁగలఁడె, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
2907
వెలదిరొ! కొంతసిగ్గు విడివీడని కాలమునందుఁ గేళి నే చెలఁగుచుఁ బూరుషాయితము చేయుమటన్న నెఱుంగనంచు లోఁ గులుకుచునున్న బాహువులు గొబ్బునఁ జేకొని పైకి లాగి, చె- క్కిలి గిలిగింతగొల్పి యుబికించుట యెంతును సుందరీమణీ!
5
champakamaala
4078
_x000D_ మూఢకోపములను మోహలాభంబులు _x000D_ నక్కజంపు క్రూర మధిక మయ్యె _x000D_ కక్కసంబుచేతఁ గాలునిచేతను _x000D_ మొక్కఁబోదురు తుది మొనసి వేమ.
0
aataveladi
3863
_x000D_ వేయువిధము లమర వేమనపద్యంబు _x000D_ లర్థ మిచ్చువాని నరసి చూడ _x000D_ చూడఁజూడఁ గలుగుచోద్యమౌ జ్ఞానంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3626
_x000D_ కులము గలుగువారు గోత్రంబు గలవారు _x000D_ విద్యచేత విఱ్ఱవీగువారు _x000D_ పసిఁడిగల్గువాని బానిసకొడుకులు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3180
_x000D_ నిన్నుఁజూచుచుండ నిండును దత్వంబు _x000D_ తన్నుఁ జూచుచుండఁ దగులు మాయ _x000D_ నిన్ను నెఱిఁగినపుడె తన్నుఁదా నెఱుఁగును _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
380
ద్విపగంధర్వవిభూషణాంబరవధూవీటీభటాందోళికా- తపనీయాదులచేత మత్తిలి బుధేంద్రశ్రేణిఁ బీడింతురౌ తపనప్రోద్భవఘోరకింకరగదాదండోగ్రదుఃఖంబు లొ- క్కపుడుం దుష్ప్రభులేల యెంచరొకొ? భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
3229
_x000D_ అధికుడైనరాజు నల్పును చేపట్టు _x000D_ వానిమాట చెల్లు వసుధలోన _x000D_ గణికు లొప్పియున్న గవ్వలు చెల్లవా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2463
కీలెఱిఁగి జీవపదముల నోలిన్‌ సమరసము చేసి యోగానందుల్‌ బాలోన్మత్తపిశాచుల చాలుగ వర్తింతు రన్న! సంపఁగిమన్నా!
1
kandamu
3321
_x000D_ తఱచుచీఁకటి విడి తఱితోడఁ దనుమఱచి _x000D_ పరమునందు మనసుఁ బదిలపఱచి _x000D_ గరిమయున్నయట్టి ఘనుఁడెందు లేదురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4061
_x000D_ హీననరులతోడ నింతులతోడను _x000D_ పడుచువాండ్రతోడ ప్రభువుతోడ _x000D_ ప్రాజ్ఞ జనులతోడ బ్రహ్మఘ్న జనులతో _x000D_ వైపు దెలిసి పలుకవలయు వేమ.
0
aataveladi
1730
అనుచు నిను చాల నుతియించి యబ్జభవుని | వెలది నెంతయు గొనియాడి విఘ్నపతినిసన్నుతి యొనర్చి రచియింతు శతకముగను | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
3280
_x000D_ ఒక్కఁడు రోగి యాయె మఱియొక్కఁడు దిక్కులఁ ద్యాగి యాయె _x000D_ వేఱొక్కఁడు భోగి యాయెనటు నొక్కఁడు చక్కనియోగి యాయెఁ _x000D_ దా నొక్కఁడు రాగియాయె నినుబోలు మహాత్మునిఁగాన మెచ్చట\న్‌ _x000D_ నిక్కము నిన్నిరూపములు నీకును జెల్లుగదన్న వేమనా.
6
vutpalamaala
4563
ఆద్య! సమర్పితాఖిల పురాతనభక్తగణానువేద్య! సం పాద్య! గుణానవద్య! యనుభావశివాంకిత గద్యపద్య! ని ర్భేద్య! గణైకవేద్య యురరీకృతవాద్య! భవాదిరోగ స ద్వైద్య! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
1813
పల్కున దేనియలొల్కు రాజిల్క నా మదిరాక్షి విభునితో మాటలాడుఠీవి మీరిన మేటిపావురావలె గుల్కి మొనసి నాథునకు కెమ్మోవి యొసగుజిగిమీర గౌగిళ్ల పికిలిపిట్టల భాతి తరుణి నాథుని గూడి తగ బెనంగుశుకవాణి భర్తతో లకుముకి చందాన చెలరేగి యుపరతి సలిపి సొక్కు
3
seesamu
1711
తనవలె నన్నపానములఁ దన్పునొ తన్పదొ ప్రేమమీఱ నం- దనుని నటంచు సందియము తన్నెడఁబాయమిఁ గోడ లంత భో- జన మిడువేళఁ దాను బతిసౌఖ్యసమాచరణంబు ముక్తిసా- ధనమని తెల్పు ధర్మగుణదాయినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
1883
వెలది నవ్వుల తేటవెన్నెల హరియించు గల్కి పల్కుల దేనెలొల్కజేయుకలకంఠి కన్నులు కలువల నిరసించు మోము చందురుతోడ మొనయుచుండుగామిని నాసిక కనకసూనము గేరు జెక్కు లద్దంబుల జెనకజూచుఘనవేణి కంఠంబు గడగి శంఖము గెల్చు చన్నులు పూచెండ్ల సరకు గొనవు
3
seesamu
2704
సంపద్వర్గముఁ బాఱఁదోలి రిపులన్‌ జంకించి యాకాంక్షలన్‌ దంపుల్వెట్టి కళంకముల్నఱికి బంధక్లేశ దోషంబులం జింపుల్చేసి వయోవిలాసములు సంక్షేపించి భూతంబులం జెంపల్వేయక నిన్నుఁ గాననగునా? శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
3451
_x000D_ విత్తును నుముకయుఁ ధరలోఁ _x000D_ బొత్తున జనియించి పొట్టుపోయినభంగి\న్‌ _x000D_ వేత్తయగువానికర్మం _x000D_ బత్తెఱగున విడిచిపోవు ననువున వేమా.
1
kandamu
4631
బల్లిదుఁడై గణాధిపుల పాదజలంబులు కట్టెమోపుపైఁ జల్లికడాని గావుడును జంగమకోటికిఁ బంచి యిచ్చుచున్‌ మొల్లపు భక్తిఁ బేర్కొనిన మోళిగ మారయ కూర్మిబంట! మ ద్వల్లభ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
3021
మొగ్గలంబాయె నీదగు మగతనంబు | సిగ్గులేకను నాతోడఁ జెప్పినపుడెతగవులున్నది మనమధ్య తాడిమళ్ళ | రాజగోపాల రావయ్య తేజముగను.
2
teytageethi
2237
నీ కేలన్ దృణ మంది వైవ నదియున్ నిర్ఘాతపాతక్రియన్ గాకాకారనికారదానవుని లోకాలోకపర్యంత మీ లోకంబుల్ పదునాల్గు త్రిప్పినది కాలున్మోపఁగానీక యౌ రా! కాకుత్స్థ కులాగ్రగణ్య! రఘువీరా! జానకీనాయకా!
7
saardulamu
4345
వేదాంతయుక్తులు విని రెండు నేర్చుక । వాగునాతఁడు రాజయోగి గాఁడు కల్లు లొట్టెడు త్రాగి కైపెక్కి తెలియక । వదరినంతనె శాస్త్రవిదుఁడు గాఁడు పట్టపురాజు చేపట్టి యుంచంగానె । గుడిసెవాటికి బారి గుణము రాదు ముండపై వలపున రెండెఱుంగక మోవి । యానఁగానె జొల్లు తేనె గాదు
3
seesamu
1751
రవనూనె మెరుగిడి రాణించు నెరికురుల్ దువ్వి కొప్పమరించి తోరమైనగొప్పరాగిడి మేటియొప్పైన కుప్పెయు సవరించి మొగ్గల సరులు మీరపరగ కెంపులు చెక్కబడినట్టి పాపటబొట్టుపై శశిపువ్వు పొసగ దాల్చినిద్దంపు చెక్కుల వద్దికగా వజ్రతాటకముల ధాళధళ్య మమర
3
seesamu
1669
అరమర మానుచున్ గురుపదార్థము లెవ్వి భుజించితేని పా- లరుగవు బిడ్డకంచు విహితాశనముం గబళించుచోఁ బరా- త్పరుని మునీంద్రు లట్లు సుతతత్పరదృష్టు లనంతపథ్యవి- స్ఫురణఁ జెలంగుచున్న యిలసుందరిఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
2194
వదనంబు నీనామభజన గోరుచునుండు - జిహ్వ నీ కీర్తనల్‌ సేయఁ గోరు హస్తయుగ్మంబు నిన్నర్చింపఁ గోరును - గర్ణముల్‌ నీ మీఁద కథలు గోరుఁ దనువు నీ సేవయే ఘనముగాఁ గోరును - నయనముల్‌ నీ దర్శనంబుఁ గోరు మూర్ధమ్ము నీ పదమ్ముల మ్రొక్కఁగాఁ గోరుఁ - నాత్మ నీదై యుండు నరసి చూడ
3
seesamu
3618
_x000D_ కూటికి వగలేక కూర్చున్నవారికి _x000D_ నాఁడుదానిమీఁది యాస గలదె _x000D_ యన్నమదముచేత నన్ని మదంబులౌ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2854
మును కనుఱెప్ప వేయు క్షణమున్ యుగరీతిని దోఁచునట్టి నే నిను నెడఁబాయఁ బ్రాణములు నిల్చె, నిదేమని కొంతసేపు నె- మ్మనమునఁ జింత చేసి వినుమా పరికించితి నంతలోనె నీ ఘనమధురాధరామృతము కారణమౌనని సుందరీమణీ!
5
champakamaala
1296
పరజనము లాచరించెడి దురితంబునఁ గ్రోధగుణము దోఁచెడి నధిక స్ఫురణన్‌ క్షమఁ గైకొనినం దఱుఁగు నది యెఱింగి మెలఁగ దగును కుమారీ!
1
kandamu
3665
_x000D_ వారకాంత లెల్ల వలచి యేతెంతురా _x000D_ పొందుఁజేసి ధనము పుచ్చుకొఱకు _x000D_ మాచలమ్మ వచ్చి మఱి యిల్లువెళ్లురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1013
ఆరకూటములోన నపరంజి యిడినట్లు | చెరువులోఁ బన్నీరు చిలికినట్లు చౌటినేలను మంచిసస్యం బిడినయట్లు | వెలిమిడిలో నెయ్యి వేల్చినట్లు షండున కందమౌ సకిని గూర్చినయట్లు | పేడలోఁ గస్తూరి పెట్టినట్లు పాడింటిలోన దీపంబు నిల్పినయట్లు | వార్ధిలోఁ గురిసిన వానయట్లు
3
seesamu
2200
పలుమాఱు దశ రూపములు ధరించితి వేల? - యేకరూపముఁ బొందవేల నీవు? నయమున క్షీరాబ్ధి నడుమఁ జేరితి వేల? - రత్నకాంచన మందిరములు లేవె? పన్నగేంద్రునిమీఁదఁ బవ్వళించితి వేల? - జలతారు పట్టెమంచములు లేరె? ఱెక్కలు గల పక్షినెక్కసాగితి వేల? - గజతురంగాందోళికములు లేవె?
3
seesamu
4217
_x000D_ మనసు నిల్పలేని మాయావిరక్తులు _x000D_ మనసుపడుదు రొక్క మగువమీదఁ _x000D_ నిట్టివ్యర్థజన్మ మీ బ్రతుకేటికి _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2439
తోరంబై యోగీంద్రవిహా రంబై విమలచిన్మయాకారం బై ధీరంబై చిద్రూపము సారంబై వెలుఁగు నన్న సంపఁగిమన్నా!
1
kandamu
1328
యెపుడు నే గందు నీ వుసురెవరి జెందు । నెటుల మతిబొందు నీ తమికేది మందు జాలినెటునొందు దెవతె నీ సరి పసందు । వచ్చునటె రామరామ లావణ్యసీమ.
2
teytageethi
1209
మర్మము పరులకుఁ దెలుపకుఁ దుర్మార్గున చెంత నెపుడు దూరకు, మిల దు ష్కర్మములఁ జేయ నొల్లకు, నిర్మలమతి నుంట లెస్స నిజము కుమారా!
1
kandamu
2165
దాత దైవంబు తల్లియుఁ దండ్రి వీవె - నమ్మియున్నాను నీ పాదనళినములను భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
356
భంజించుం గద! ఘోరదుష్కృతతతిన్ భస్మత్రిపుండ్రంబుల- న్మంజుశ్రీలలితాక్షమాలికలఁ బ్రేమం బూని సద్భక్తి నీ- కుం జేమోడ్చు మహానుభావుఁ డెపుడుం కుక్షిస్థలప్రోల్లస- త్కంజాతప్రభవాండభాండచయ! భర్గా! పార్వతీవల్లభా!
7
saardulamu
1959
ఎల రారన్‌ భవదీయనామకథనం బేమర్త్యుచిత్తంబులోఁ బొలుపారం దగిలుండునేని యఘముల్‌ పొందంగ నె ట్లోపెడు\న్‌ కలయం బావకుచేతఁ బట్టువడు నక్కాష్ఠంబుపైఁ గీటముల్‌ నిలువ న్నేర్చునే భక్తపోషణ కృపానిత్యాత్మ, నారాయణా!
4
mattebhamu
2972
తరుణి నా యధరామృతముగోరు నా పతికిప్పుడు విసము నేనెట్టులైతినతనికి నా నేస్త మతిదూరమేయుండ నెవ్వతె చేసెనో యెఱుగనైతిమగువ చిన్నప్పటిమాటలో చోద్యముల్ గలుగు నాకెపుడని గర్వపడితిబడతి నన్నందఱి పాటిగా నెంచక యెక్కువ లాలించు టెఱుగనైతి
3
seesamu
2375
పేరుకొనుమంత్రవాదము భారం బది కుక్కనోటిపాఁతై రోఁతై పోరై యారై దూఱై జాఱఁగవలె సుప్రసన్న! సంపఁగిమన్నా!
1
kandamu
3823
_x000D_ ఒకనికీడు వేఱెయొక్కని కియ్యఁడు _x000D_ ఒకరిమేలు వేఱెయొకరి కీఁడు _x000D_ కీడుమేలు వారు పోఁడిమి దెలియరు _x000D_ కాలుఁ డెఱుఁగు వారిగతిని వేమా.
0
aataveladi
4547
శత్రు లతాలవిత్ర! గుణజైత్ర! భవాబ్ధివహిత్ర! జంగమ క్షేత్రవిచిత్ర! సూత్ర బుధగీత చరిత్ర! శిలాదపుత్ర! స త్పాత్ర! విశుద్ధగాత్ర! శివభక్తి కళత్ర! శరణ్యమయ్య! భా స్వత్త్రిజగత్పవిత్ర బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
1444
నే నితరకాంతల గూడిరాగానె యున్న । చిన్నె పరికించి మనమున చిడిముడగుచు నపుడు నిను నీవె దూరుకొన్నది దలంప । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
3783
_x000D_ ఎంత సంపదున్న నంత కష్టపుఁజింత _x000D_ చింతచేత మిగుల చివుకు మనసు _x000D_ చింతలేయుంట చెదలని సంపద _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
809
సమరద్వేషుల సంగరాంగణమున\న్‌ సాధించి సామ్రాజ్య సౌ ఖ్యముఁ దాఁగాంచి సహించి చొప్పడు వివేకప్రాజ్ఞతల్గాంచు భూ రమణశ్రేష్ఠుఁడు తావకానుచరుఁడై రాణించు శిక్షించు దు ష్టమతి భ్రష్టమదాంధ శత్రువుల కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
331
పురుహుతాగ్నిపరేతరాట్పలభుగంభోదీశవాతార్థపాం బరకేశాబ్జభవాచ్యుతాదిక మహాబర్హిర్ముఖానేకభా- స్వరకార్తస్వరవిస్ఫురన్మకుట శశ్వత్పద్మరాగప్రభో- త్కరనీరాజిత పాదపంకరుహ! భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
4056
_x000D_ అన్నిగోసివేసి యనలంబు చల్లార్చి _x000D_ గోచిబిగియఁగట్టి కోప మడచి _x000D_ యాసవిడిచెనేని యతఁడు తా యోగిరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2221
స్వామి నీ భక్తవరులు దుర్జనులతోడఁ - జెలిమిఁ జేసిన యట్లైనఁ జేటు వచ్చు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
526
పరమకృపార్ణవా! తుహినపర్వతరాజకుమారికాధవా! వరవృషసైంధవా! కుటిలవైరినిశాటసమిద్ధవా! మనో- హరకరసారసాగ్రనిహితాజిగతానతబాంధవా! శివా! చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
3961
_x000D_ ధనమే మూలము జగతికి _x000D_ ధనమే మూలంబు సకలధర్మంబులకు\న్‌ _x000D_ గొనమే మూలము సిరులకు _x000D_ మనమే మూలంబు ముక్తి మహిమకు వేమా.
1
kandamu
2347
వెనుకం జేసిన దోషముల్గలుగ నుర్విన్ ముక్తికిం బోదురే చనఁ బొయ్యే వని కాలుబంట్లె నుడువన్, సాక్షాత్తు నా బంటు వీ నిని బట్టన్ గమకించు టొప్ప దనియున్ నీవే నివారించవా ప్రణతాశేష శరణ్యచిత్త! రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
1435
జల్తారుపేటు గంజముచీరకుచ్చిళ్లు । గిల్కుమట్టెల తట్టి పల్కరింప రవ కసీదా గోటు రయిక ముస్తీబుగా । కుచకుంభముల నాని గురుతుజూప సికజుట్టు నునుబట్టు చెండ్లునీటు గల స- । దంసయుగంబుపైనంది బొదల తళుకుబెడస తీరు బెళుకుకన్నుల సౌరు । వీనులతో నొగ్గి వియ్యమంద
3
seesamu