id stringlengths 1 4 | poem stringlengths 71 312 | label int64 0 7 | label_name stringclasses 8
values |
|---|---|---|---|
1876 | గాన నా యింతితో గూడగలిగెనేని | నెల్లభోగంబులును నీకు నెలమి గల్గుతరుణమిప్పుడు రావయ్య తరుణి కడకు | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
2848 | సరసములాడు నేర్పు కనుసైగలు సేసెడు నేర్పు నా మనం-
బెఱిఁగెడు నేర్పు నెమ్మది నొకించుక గోపము సేయు నేర్పు క్ర-
మ్మఱ మురిపెంబుతోడ బ్రతిమాలెడు నేర్పు మనోజకేళిలోఁ
గరఁగెడు నేర్పు నీకె తగుఁగాదె తలంపఁగ సుందరీమణీ! | 5 | champakamaala |
640 | కంటి నదీతటంబుఁ బొడఁగంటిని భద్రనగాదివాసముం
గంటి నిలాతనూజ నురు కార్ముకమార్గణ శంఖచక్రముల్
గంటిని మిమ్ము లక్ష్మణునిఁ గంటి కృతార్థుడనైతి నో జగ
త్కంటక దైత్యనిర్దళన దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
3540 | _x000D_
సుతులచేతఁ బుణ్య సుఖముఁబొందుదు నని
_x000D_
మనుజుఁడుండు కర్మమతముఁ దగిలి
_x000D_
యేనుఁగు పడియున్న నెత్తునా మశకంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2225 | యుందు రరవిందనయన! నీయునికిఁ దెలియు - వారలకు వేగ మోక్షంబు వచ్చు ననఘ!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
4580 | నిర్గతధర్మ కర్మ! యవినీత పునర్చవ యంత్ర తంత్ర! దు
ర్మార్గ విహీనయాన! గుణమాన్య మహావృషసామ్య! సౌమష
డ్వర్గ విరక్త శక్త! మదడంబర వర్జిత వేషభూష! నీ
వర్గమునేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
3325 | _x000D_
ధ్యానివలెనె యుండు మౌనివలనె యుండు
_x000D_
భోగివలెనె యుండు రోగివలెనె
_x000D_
సకలము దెలిసినను సర్వజ్ఞుఁడై యుండు
_x000D_
బరమయోగివలెనె పరగ వేమా. | 0 | aataveladi |
3270 | ముక్కు గోరును సద్గంధములను జెలఁగి
చెవులు చర్మంబు కన్నులు జిహ్వ ముక్కు
నిన్నియుం చాడినటువంటి యిల్లురోసి
తన్ను గనుగొని సుఖియింపఁ దగును వేమ. | 2 | teytageethi |
3904 | _x000D_
కుక్కుటమననంబు కొక్కెర ధ్యానంబు
_x000D_
యతుల నొసట నొనరునట్లు వ్రాసె
_x000D_
తొల్లి చేసినట్టి దోషంబు తగిలెనో
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
886 | దుర్వార చక్రధరకర
శర్వాణీ భర్తృవినుత జగదాధారా
నిర్వాణనాథ మాధవ
సర్వాత్మక నన్నుఁగావు సరగున కృష్ణా. | 1 | kandamu |
188 | సన్నుతామోఘ బాణైకశార్ఞ్గచక్ర-శయుఁడవే నమ్మవచ్చునే స్వామి! నిన్ను?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
3023 | గాగ నా మార్గమున వచ్చి కలసి నాతో | సంపదల బొందియుండవె సత్యభామతరుణ నా యూరి పేర్విను తాడిమళ్ల | రాజగోపాలు డందురే రమణి నన్ను. | 2 | teytageethi |
3621 | _x000D_
అన్నిజాడ లుడిగి యానందగాముఁడై
_x000D_
నిన్ను నమ్మఁజూచు నిష్ఠతోడ
_x000D_
నిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీయాన
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
465 | తాలిమితోఁడ గూరిమిఁ గృతఘ్నునకెయ్యెడ నుత్తమోత్తముల్
మేలొనరించినన్ గుణము మిక్కిలి కీడగుఁ, బాముపిల్లకున్
బాలిడి పెంచిన న్విషము పాయఁగ నేర్చునె దాని కోఱలం
జాలఁగ నంతకంత కొక చాయను, హెచ్చును గాక భాస్కరా! | 6 | vutpalamaala |
2615 | కానీ దారసమన్వితుండు మిగులం గానీఁడు కందర్పునిన్
గోనీ మానవకోటిలో మరులు పైకోనీఁడు మోహంబునున్
రానీ రాజితరాజ్యవైభవము పైరానీఁడు గర్వంబునున్
లో నీవైన మహాత్ముఁ డన్యమునకున్ బోనీఁడు సర్వేశ్వరా! | 7 | saardulamu |
550 | శరధిశయానుఁడైన హరి సారసబంధుకులంబునందు దా-
శరథి యనం జనించి బహుసంఖ్యలు మీఱిన లింగమూర్తులన్
సరవిఁ బ్రతిష్ఠఁ జేసెనఁట శక్యమె నీ యధికత్వమెన్నఁగాఁ
జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
1126 | కల్లలగుమాట లాడక
యెల్ల జనంబులకు వేగ హృదయము కడు రం
జిల్లఁగఁ బల్కుము నీ కది
తెల్లమి రహిఁ గీర్తిఁ గాంచు తెఱఁగు కుమారా! | 1 | kandamu |
126 | నట్టిదాతను దిగఁద్రొక్కి యతనిసిరులు-దెచ్చి కులగోత్రభేది కీ నిచ్చకంబో
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
4045 | _x000D_
పికము వనములోన విలసిల్ల పలికిన
_x000D_
భంగి ప్రాజ్ఞుడనుల పలుకుకులుకు
_x000D_
కాకికూతఁ బోలుఁ గర్మబంధులకూఁత
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
993 | ఇల జొన్నఁ బడు గ్రుడ్డియెద్దు చాడ్పున మృదు- | పదగతు లరయక పరుపుకొనుచుఁ
బెనకున నోడిన పిఱికిబంటును బోలె | వడి లేక ప్రాసంబు విడిచివైచి
సారెఁ గొక్కెర రీతి జడధుల నెరసుల | నెమకుచు మిగులభంగములఁ దోఁగి
పెంటలపైఁ బొరల్వెట్టు రాసభమట్లు | పలుమఱు నపశబ్దమునె పలుకుచు | 3 | seesamu |
3189 | _x000D_
మొదటఁ బోయునీవు మొగిబీజముల కెక్కి
_x000D_
మొదటి కుఱుకువేగ మొలక లెత్తు
_x000D_
మొలక పృథివిఁ బెరిగి వెలయును వృక్షంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1408 | పాదములు ముట్టి గండదీపంబు తట్టి । చేత చెయి పెట్టి యాకున శిరము గొట్టి
బాస చేసిన స్త్రీల భావంబు నమ్మ । వచ్చునటె రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
936 | నైన వంచాక్షరిని భక్తి యతిశయిల్లఁ | దవిలి జపియించు వారెపో ధన్యతములు
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
3600 | _x000D_
పచ్చవిల్తుచేత గ్రచ్చఱ జను లెల్ల
_x000D_
తచ్చవాడఁ బడిరి ధరణిలోన
_x000D_
కులజుఁ డెవ్వఁ డిందుఁ గులహీనుఁ డెవ్వడు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1933 | చదువుల్ పెక్కులు సంగ్రహించి పిదపం జాలంగ సుజ్ఞాని యై
మదిలోఁ బాయక నిన్ను నిల్పఁ దగు నామర్మంబు వీక్షింపఁడే
మొదలం గాడిద చారుగంధవితతుల్ మోవంగ శక్యంబె కా
కది సౌరభ్యపరీక్ష జూడ కుశలే యవ్యక్త, నారాయణా! | 4 | mattebhamu |
3122 | _x000D_
నీళ్లలోనిచేప నెఱమాంస మాశకు
_x000D_
గాలమందుఁజిక్కి కూలినట్లు
_x000D_
ఆశపుట్టి మనుజుఁ డారీతి జెడిపోవు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3088 | అంగ మెల్ల వదలి, యటు దంతములు నూడి
తనువు ముదిమిచేతఁ దఱుచు వడక
ముప్పు తిప్పలఁ బడి మోహంబు విడువడు
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1076 | కరయ వితరణశూరులైనట్టి ఘనులు | కొంచకేమైన ఘనుల కర్పించుచుంద్రు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
4297 | ఆయలమేలుమంగ కమలాననయుం గలుహార నేత్రియుం
బాయక తానయై చెలఁగుబద్మ హితాక్షముఁజంద్ర నేత్రము\న్
సోయగలీల మించు నెటుచూచినఁ బొందిక నెద్ది నిద్ర నీ
కేయెడ మేల్కొనంగఁ దఱి యెయ్యది చూడఁగ వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
2223 | సకలవైభవములు నీకు సార్వభౌమ! - నిత్యకల్యాణములు నగు నీకు నెపుడు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
1551 | అరవిందోత్పల కైరవోదరమరందాస్వాదనోన్మత్తబం
భరమాలా పరిషన్మనోజ్ఞ మధురధ్వానాభిరంజత్ సరొ
వరతీరంబులఁ బుష్పపల్లవ ఫలవ్రాతాగ్ర ధాత్రీరుహో
త్కరమూలంబుల నేర్పునన్ వెదకవే ధాత్రీసుతన్ మారుతీ! | 4 | mattebhamu |
2193 | నమ్మరాదయ్య! యిది మాయనాటకంబు - జన్మమిఁక నొల్ల నన్నేలు జలజనాభ!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
4338 | సుందరకపోల విబుధసంస్తుత కృపాల- । వాల ధృతశైల కాంచనవర్ణచేల
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
4124 | _x000D_
కల్లటికెకు భూతి గట్టిగాఁ బెట్టిన
_x000D_
నందులోని కంపు లడఁగనట్లు
_x000D_
మెడను త్రాడు వేయ మెఱపుతో ద్విజుఁడౌనె
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2112 | దేహ మున్నవఱకు మోహసాగరమందు - మునుఁగుచుందురు శుద్ధమూఢజనులు
సలలితైశ్వర్యముల్ శాశ్వతం బనుకొని - షడ్భ్రమలను మానఁజాల రెవరు
సర్వకాలము మాయసంసార బద్ధులై - గురుని కారుణ్యంబుఁ గోరుకొనరు
జ్ఞాన భక్తి విరక్తులైన పెద్దలఁ జూచి - నిందఁ జేయక తాము నిలువలేరు | 3 | seesamu |
2438 | నష్టపదార్థం బగునీ
సృష్టిని నుపసంహరించి చిన్మయ నంత
ర్దృష్టిని గనవలె జనులకు
స్రష్టతనం బేటి కన్న సంపఁగిమన్నా! | 1 | kandamu |
1148 | అంగీకార రహిత మగు
సంగతికి బోవరాదు సామాన్యులతో
డం గడు జగడమునకుఁ జన
వెంగలితనమండ్రు వినుము కుమారా! | 1 | kandamu |
765 | బలశౌర్యోన్నతి శత్రులం గెలిచి సప్తద్వీపవిశ్వంభరా
స్థలి నేలించి సమస్తవైభవములన్ దీపించి దిక్పాలకా
వళి కీర్తింప మెలంగునైషధుఁడు దా వర్తింపఁడే తొల్లి వం
టలవాఁడై ఋతుపర్ణుచెంగటను కృష్ణా దేవకీనందనా. | 4 | mattebhamu |
805 | మతిలో మిమ్ముఁదలంచు పుణ్యుఁడిలఁ దామాయ\న్ స్వదారాదుల
న్వెతలం బొర్లఁడు భాగ్యవంతుఁడగుఠీవి\న్ దివ్యమృష్టాన్న సం
గతిలోనాడి మనుండు భిక్షమునొసంగ\న్ నేర్చునే శూలభృ
చ్చతురాస్య ప్రముఖామర ప్రణుత కృష్ణా దేవకీనందనా. | 4 | mattebhamu |
3503 | _x000D_
కుక్కతోకఁ దెచ్చి గొట్టంబుఁ జేర్చిన
_x000D_
గ్రోవిచెంతనుండుఁ గొంతతడవు
_x000D_
ఎంతఁజెప్పఁ జెడుగు పంతంబు మానునా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
861 | అందఱు సురలును దనుజులు
పొందుగ క్షీరాబ్ధిఁ దఱువఁ బొలుపున నీ వా
నందంబుగఁ గూర్మమవై
మందరగిరి యెత్తితౌర మాధవ కృష్ణా. | 1 | kandamu |
3257 | _x000D_
బ్రహ్మమేడ ననుచు పలుమాఱు లాడేరు
_x000D_
వెఱ్ఱిమూర్ఖ జనుల విధముఁజూడ
_x000D_
బ్రహ్మ మన్నిటందుఁ బరిపూర్ణమైయుండు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4369 | ఆస్థానమందు విద్వాంసుల గని లేచి । మ్రొక్కులేయని వారమోహినులను
దల గొరిగించి మెత్తని సున్నమును బూసి । బొగ్గుగంధమున బొట్టమర్చి
చెప్పులు మెడఁ గట్టి చింపిచేటలఁ గొట్టి । గాడిదపైఁబెట్టి కాల మెట్టి
తటుకునఁ గ్రామప్రదక్షిణం బొనరించి । నిల్చినచోటఁ బేణ్ణీళ్ళు చల్లి | 3 | seesamu |
3812 | _x000D_
పరుల నిందఁజేసి పరులు నావారని
_x000D_
స్థిరము నస్థిరము తెలియలేక
_x000D_
పరఁగ దన్నుఁ జేతఁబట్టుక పెట్టిన
_x000D_
పెట్టుగాదు కట్టిపెట్టు వేమా. | 0 | aataveladi |
820 | అతికాకోల కరాళ కాయక కఠోరాశీ విషావిర్భవ
క్షతినోనాటిన నాఁటిపాటు తలఁప\న్ శంకించి యుంకించె దౌ
సతతోద్వర్తుల వర్ణ సర్వభయదాంచత్పింఛ చూడావతం
సతతం గారుడకేతనోద్ధృతియు కృష్ణా దేవకీనందనా. | 4 | mattebhamu |
17 | అచట లే వని కదా యరచేతఁ జఱచెఁ గ్రు- ద్ధత సభా స్తంభంబు దానవేంద్రుఁ
డచట లే వని కదా యస్త్రరాజం బేసె- గురుసుతుం డుత్తరోదరమునందు
నచట లే వని కదా యతికోపి ననిచెఁ- బాండవు లున్నవనికిఁ గౌరవకులేంద్రుఁ
డచట లే వని కదా యాత్మీయసభను ద్రౌ- పది వల్వ లూడ్చె సర్పధ్వజుండు | 3 | seesamu |
2370 | వానలు పస పైరుల కభి
మానము పస వనితలకును మఱి యోగులకున్
ధ్యానము పస యామీఁదట
జ్ఞానము పస సుప్రసన్న సంపఁగిమన్నా! | 1 | kandamu |
4074 | _x000D_
పెట్టువార లెవరు పెట్టకుందు రెవరు
_x000D_
పెట్టిపుట్టినట్టిదిట్ట లెవరు
_x000D_
పట్టుదప్పకుండ భావించి చూడరా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3108 | _x000D_
కనియుఁ గాన లేఁడు కదలింపఁ డానోరు
_x000D_
వినియు వినగ లేఁడు విస్మయమున
_x000D_
సంపద గల వాఁడు సన్నిపాతక మది
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3702 | _x000D_
కూడు గుడిచి లెస్స గూర్చున్నవాఁడైన
_x000D_
నాడుదానిఁ గన్న నట్టె తగులు
_x000D_
నన్న సారమొడలి కతిమదం బిడుసుమీ
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
281 | భువిలో లోభులు కూడఁబెట్టిన ధనంబున్ బందికాం డ్రూడిగల్
బవినీలున్ దరిబేసులున్ దొరలొగిన్ బచ్చుల్ నటీదాసికా-
యువతుల్ గుంటెనకత్తెలున్ గొనుదు రోహో! యెట్టి కర్మంబొ! హై-
మవతిసన్నుతదివ్యనామ! రఘురామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
1670 | ఆఁకొని పోరువెట్టునెడ నారయ నడ్డముగాఁ దనూజునిం
జేకొని క్రుచ్చి ముద్దిడుచుఁ జెక్కిలి దువ్వుచుఁ “బాయి ద్రావ రా-
రా కనతండ్రి” యంచని మనంబునఁ గుందుచు బొజ్జనిండ ర-
క్షాకలితోక్తిఁ జన్గుడుపు కామినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. | 6 | vutpalamaala |
3981 | _x000D_
ధనవిహీనుఁడైన తండ్రి గర్భంబున
_x000D_
భాగ్యపురుషుఁ డొకఁడు పరఁగఁబుట్టి
_x000D_
బహుళధనము గూర్చి భద్రమార్గంబున
_x000D_
పరుల కుపకరించి పరఁగు వేమ. | 0 | aataveladi |
2938 | అలికులవేణి నీ కొరకు నన్నలఁ దమ్ములఁ బాసి వస్తి నీ
కులుకుమిటారిగబ్బిచనుగుబ్బల నొత్తుచుఁ గౌఁగిలించవే
కలికిరొ నీకు గుండె బలుకట్టిఁడి దైవము రాయి చేసెనే
చెలియరొ నీకు నా యుసురు చెందక మానునె సుందరీమణీ! | 5 | champakamaala |
858 | విశ్వోత్పత్తికి బ్రహ్మవు
విశ్వము రక్షింపఁ దలఁచి విష్ణుఁడ వనగా
విశ్వము జెఱుపను హరుఁడవు
విశ్వాత్మక నీవె యగుచు వెలయుదు కృష్ణా. | 1 | kandamu |
2648 | అదమాతంగము లందలంబులు హరుల్మాణిక్యము ల్పల్లకుల్,
ముదితల్, చిత్రదుకూలము ల్పరిమళంబు ల్మోక్షమీఁజాలునేఁ
మదిలో వీని నపేక్ష సేసి నృపధామ ద్వారదేశంబుఁగా
చి దినంబుల్ వృథపుత్తురజ్ఞులకటా! శ్రీకాళహస్తీశ్వరా! | 4 | mattebhamu |
1298 | జనియించెడు నజ్ఞానం
బున మోహగుణంబు, ధర్మమునఁ బరికింపం
దునుమాడఁ బడును దీనిం
గనుఁగొని మెలఁగంగ వలయుఁ గాదె కుమారీ! | 1 | kandamu |
983 | పాతపొత్తపుకట్ట సేత పట్టుకవచ్చి | దోసిబాపఁడనంట దోసిలొట్టి
జలము సంద్రుఁడటంట సని సాలదనుకొంట | సెడుగు వాసారులు సెప్పుకుంట
తిండికిఁ దెమ్మంట దేయిరింపుచు తూపె- | తూపెకు సేతులు సాపు గాని
మఱఁదలెన్నఁడు పెదమనిసైనదంటేను | తప్పక మూత్రంబె సెప్పలేఁడు | 3 | seesamu |
2177 | భక్తులకు నీవు పెట్టుట భాగ్యమౌను - వారి కాశించితివి తిండివాఁడ వగుచు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
2142 | నరసింహ! నా తండ్రి నన్నేలు నన్నేలు - కామితార్థము లిచ్చి కావు కావు
దైత్యసంహార! చాల దయయుంచు దయయుంచు - దీనపోషక! నీవె దిక్కు దిక్కు
రత్నభూషితవక్ష! రక్షించు రక్షించు - భువనరక్షక! నన్నుఁ బ్రోవు బ్రోవు
మారకోటిస్వరూప! మన్నించు మన్నించు - పద్మలోచన! చేయి పట్టు పట్టు | 3 | seesamu |
1290 | ఆలోచన యొనరించెడి
వేళలలో మంత్రిభంగి వివరింపవలెన్
కాలోచిత కృత్యంబుల
భూలోకమునందుఁ గీర్తి బొందుఁ గుమారీ! | 1 | kandamu |
2540 | అనుబంధేంద్రియభూతవర్గము యమాద్యష్టాంగమంత్రోరుసా-
ధన నుచ్చాటన సేసి పాపి గురుసద్వాక్యప్రకాశోత్తమాం-
జనదృష్టిం బరికించి యేర్పఱిచి వాంఛం గోరి సాధించి చే-
కొను చిన్మూర్తికి గాని భక్తివిధి గీల్కోదెందు సర్వేశ్వరా! | 4 | mattebhamu |
2594 | పటుశాస్త్రాగమదృష్టి నివ్విధమునన్ భావించి వీక్షించి యు-
ద్భటవృత్తిన్ భవదీయభక్తినికరబ్రహ్మాండకుండైన నా-
దట లోఁ గాచుకొనంగవచ్చు విదితోద్దండప్రతాపోత్కట-
స్ఫుటకోపానలమూర్తియై యముఁడు గొంపోకుండ సర్వేశ్వరా! | 4 | mattebhamu |
3008 | ఎనమండ్రు పట్టపుటింతుల విడనాడి నలినాక్ష విరహివైనావు గావపదియారువేల యా పడతులకోసమై నరకాసురుని గొట్టినావు గావభూపతివై పుట్టి బోరజొచ్చితిగాని యాద్యవతారమై యలరినావమకరిని చాటున మదమడంచితిగాని సమముగా జగడము సలిపినావ | 3 | seesamu |
3775 | _x000D_
కడుపు కెంత నరులు కళవళపడుదురు
_x000D_
కడుపుకొఱకు నూళ్ళు గహనములును
_x000D_
కడుపు కెట్ల యయినఁ గలుగును భుక్తిరా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2006 | కుల మెన్నం గొల దేల యేకులజుఁడుం గోత్రాభిమానాభిలా
షలునజ్ఞానము బాసి జ్ఞానము మదిన్ సంధించి శుద్ధాత్ముఁడై
యలరారం బరుసంబు సోఁకు నిను మున్ హేమాకృతిస్తోమమై
వెలయు న్నాగతివాఁడు ముక్తి కరుగున్ వేదాత్మ నారాయణా! | 4 | mattebhamu |
4232 | _x000D_
ఇదియ పరమటంచు నితరచింతలు వీడి
_x000D_
మనసుఁ జెదరనీక మట్టుపఱచి
_x000D_
కొదువలేక నిలువ కోర్కెలు ఫలియించు
_x000D_
మనసులోన నుండు మహిమ వేమ. | 0 | aataveladi |
620 | శ్రీరఘురామ చారుతులసీదళదామ శమక్షమాది శృం
గారగుణాభిరామ త్రిజగన్నుతశౌర్యరమాలలామ దు
ర్వార కబంధరాక్షసవిరామ జగజ్జనకల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
2377 | చలపట్టియు హఠయోగముఁ
దలపెట్టిన వట్టిగొడ్డుతాఁకట్టింతే
యలసిద్ధి దొరక దడియా
సలుగా కిందేమియున్నె! సంపఁగిమన్నా! | 1 | kandamu |
1568 | దురితాత్ముల్ దశకంఠుపంపున మదాంధుల్ పంచసేనాగ్రగుల్
పరుషోగ్రాస్త్రము వేయుచుం గదియఁ గాలం గేల మర్దించి భీ
కరభంగిన్ పరిమార్చి తోరణ విటంకస్థుండవై, వెండి దు
ష్కరదైతేయ సమాగమంబు మదిలోఁ గాంక్షింపవే మారుతీ! | 4 | mattebhamu |
1128 | నగఁగూడదు పరసతిఁ గనఁ
దగు మాతృసమాన మెన్నఁ దగు నెవ్వరితోఁ
బగ గూడదొరుల నిందిం
పగఁగూడదు గనుము వృద్ధ పథము కుమారా! | 1 | kandamu |
222 | మణిపుంఖాంకితకంకపత్రచయ సమ్యగ్దివ్యతూణద్వయం-
బణుమధ్యంబునఁ దళ్కు గుల్క ఖలదైత్యానీకహృద్భేదకృ-
ద్ధణనీయోగ్రకఠోరకార్ముకము చేతంబూని నా వెంట ల-
క్ష్మణుడు న్నీవును నంటి త్రిమ్మరుము రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
3908 | _x000D_
శివుని భక్తులెల్ల భువి మంటిపాలైరి
_x000D_
వాదమేల దైవభేదమేల
_x000D_
విష్ణుభక్తులెల్ల వెలిబూదిపాలైరి
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
957 | జంభాహితుని భుజాస్తంభనం బొనరించి | విష్ణుని చక్రంబు విఱిచి పుచ్చి
బ్రహ్మదేవునిఁ బటాపంచలుగాఁ గొట్టి | భగుని కన్నులు నేలఁబడఁగఁ దిగిచి
పూషార్కు దంతముల్ పొడిపొడిగాఁ దన్ని | సోముని నరకాల భూమిఁ జమరి
దక్షుని తలఁ గొట్టి తవిలి వేల్పులనెల్లఁ | దఱిమి వేఁటాడిన తావకీన | 3 | seesamu |
1524 | సీతన్ గానక, దప్పిచే బడలి గాసిం జెందు శైలాట సం
ఘాతంబుం గొని, శైలగహ్వర సుధా కల్పాంబువుల్, సత్ఫల
వ్రాతంబుం దనివార నందఱ భుజింపంజేసి, తద్దేవతా
ఖాతశ్వభ్రము వెల్వరించితివి యోగప్రౌఢిచే మారుతీ! | 7 | saardulamu |
2721 | గడియల్ రెంటికొ మూఁటికో గడియకో కాదేని నేఁడెల్లియో
కడనేఁడాదికొ యెన్నడో యెఱుఁగ మీ కాయంబు లీ భూమిపైఁ
బడఁగా నున్నవి ధర్మమార్గమొకటిం బాటింపరీ మానవుల్
చెడుగుల్ నీ పదభక్తిం దెలియరో శ్రీకాళహస్తీశ్వరా! | 4 | mattebhamu |
1476 | ననుచు నుండెడితరి తెలియకను నేను । కాచుకొని యుంటి నిటుల నీ కరుణ నమ్మి
దోసమెంచక నన్నింత మోసపుచ్చ । వచ్చునటె రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
4263 | పరిమళమో కదంబమొ ప్రభల్ విడ నించిననిగ్గొ నిర్మలా
భరణమొ నిత్యవైభవమొ భాగ్యమొ శ్రీయలమేలుమంగ భూ
ధరునకు నాదిలక్ష్మి యని తత్త్వమహత్త్వ రహస్యవేత్తలం
బరమున నుండి నీవనితఁ బ్రస్తుతి సేతురు వేంకటేశ్వరా! | 5 | champakamaala |
2745 | ఆఁకొన్న కూడె యమృతము
తాఁకొంకక నిచ్చు వాఁడె దాత ధరిత్రి\న్
సోఁకోర్చు వాఁడె మనుజుఁడు
తేఁకువ కల వాఁడె వంశతిలకుఁడు సుమతీ! | 1 | kandamu |
1427 | కడనున్నతరి నెరుంగక చేరవచ్చిన । దూరదూరమటంచు తొలగుచొందు-
వాయెడ హేలి నేడాడితో యన సిగ్గు- । నవునంచు చిరునవ్వు నవ్వుచుందు-
వదియేమి నొసలిచుక్కన నాల్గుదినములు । చాదు స్త్రీలకునుంచ సహజమందు-
వతిమోహమున చమత్కృతి బల్క తెలుసుక । కొదువపనుల దీక్షకూడదందు- | 3 | seesamu |
211 | శతక మొకటి 'మనసా హరిపాదము- లాశ్రయించవె' యని యల్లినాఁడఁ
గరిమ 'రామా! భక్త కల్పద్రుమా!' యని యొప్పగా శతకంబుఁ జెప్పినాఁడ
నలరులదండ మీ కనఁగ 'హంసలదీవి- గోపాల శతకంబుఁ' గూర్చినాఁడ
యుష్మ దంకితముగా నూహించ శకమ మీ- నంచితంబుగ రచియించినాఁడ | 3 | seesamu |
1462 | నింత నావలె బాళి నీయంత కఠిన । నెందు గానను జాణనయింది మొదలు
నతివ దానిల్లు బంగారమైరి యింత । వంచనటె రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
2256 | మతి నూహింపరు కొంద ఱీసుకృత మేమార్గంబునం దున్న ను
గ్రతపోధ్యానము సామగానమును దీర్థస్నానమున్ దానమున్
గ్రతుసంధానము లేల? నేలఁ దులసిం గర్వయ్యెనో? యూర నీ
ప్రతిమ ల్లేవొ నమస్కరింప? రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
4300 | నిను నలమేలుమంగ ఘననీరజపంక్తులు దాఁక నేసిన\న్
జనుఁగవ నొత్తినట్లు కెరజంబుల వాండ్లును నొత్తినట్లు ని
గ్గునఁగనుదోయితామరలఁ గొంకక సారెకు నొత్తినట్లు మైఁ
జెనకి మరుండు బాణములు చిమ్మినయట్లగు వేంకటేశ్వరా! | 5 | champakamaala |
2716 | తాతల్ తల్లియుఁ దండ్రియున్ మఱియు బెద్దల్చావగాఁ జూడరో
భీతింబొందఁగనేల చావునకుఁగాఁ బెండ్లాము బిడ్డల్హిత
వ్రాతంబున్బలవింప జంతువులకు న్వాలాయమై యుండఁగాఁ
జేతోవీధి నరుండు నిన్గొలువఁడో శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
2666 | మలభూయిష్ఠ మనోజధామము సుషుమ్నాద్వారమో? యారు కుం
డలియో? పాదకరాక్షియుగ్మములు షట్కంజంబులో? మోముదా
జలజంబో? నిటలంబు చంద్రకళయో, సంగంబు యోగంబొ? గా
సిలిసేవింతురు కాంతల\న్ భువి జనుల్ శ్రీకాళహస్తీశ్వరా! | 4 | mattebhamu |
177 | పరపురుషాకృత గురుతుగాఁ జూడక- త్రిపుర పతివ్రతాతిలకములను
విటపయుక్తి భ్రమించి విఫలభ్రమతఁజేసి- తత్సతీపతుల దుర్దాంతబలుల
హతము సేయించితి వల మహానటునిచే- రథారధాంగాశ్వసారథిశరాన
గుణనిషంగాస్త్రము ల్కోరినట్లుండు నే- సమకూర్చి యసురుల సంహరించి | 3 | seesamu |
3427 | _x000D_
విన్నవానికన్నఁ గన్నవాఁ డధికుండు
_x000D_
కన్నవానికన్నఁ గలియువాఁడు
_x000D_
ఉన్నతోన్నతుఁడయి యుర్విలోపల నుండు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3738 | _x000D_
ముఱికిలోనఁ బుట్టి ముఱికిలోనఁ బెరిగి
_x000D_
ముఱికితనువు కింత మురిప మేల
_x000D_
ముఱికి తెలియు నరుఁడు ముఱుగునఁ బుట్టునా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
292 | రసికత్వంబును దానధర్మగుణముం బ్రత్యర్థిశిక్షాకళా-
భ్యసనప్రౌఢిమ సాధుబంధుజనతాత్యంతావనోపాయలా-
లసచిత్తంబును దృప్తియుం గొఁఱత వాలాయంబు దానెంచఁ దా-
మసమే మిక్కిలి దుర్నరేంద్రులకు రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
4515 | నంబి కవిత్వంబు తంబళ జోస్యంబు । వలనొప్ప కోమటి వైష్ణవంబు
వరుసనె యుప్పరివాని సన్యాసంబు । తరువాత శూద్ర సంతర్పణంబు
రజకుని గానంబు రండా ప్రభుత్వంబు । వెలయఁగా వెలమల వితరణంబు
సాని పండితశాస్త్రవాదము వేశ్య- । తనయుఁ డబ్బకుఁ బెట్టు తద్దినంబు | 3 | seesamu |
4340 | ఆదిమధ్యాంతరరహితమైనట్టి వెల్గు । నిట్టి వెల్గును సేవింపనట్టి చెట్ట-
వారికే లభించు కైవల్యపదము
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
1997 | సరిఘోరాంధక బోధకారణ విపత్సంసార మాలిన్యము\న్
పరమానంద సుబోధకారణ లసద్భస్మంబుపై నూఁది యా
నిరతజ్ఞానసుకాంతిదర్పణమున న్నిస్సంగుఁ డై తన్ను దా
నరయం గాంచినవాఁడు నిన్నుఁగనువాఁ డబ్జాక్ష నారాయణా! | 4 | mattebhamu |
649 | చిక్కని పాలపై మిసిమిఁ జెందిన మీఁగడ పంచదారతో
మెక్కినభంగి మీ విమల మేచకరూప సుధారసంబు నా
మక్కువపళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్
దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
3129 | _x000D_
స్త్రీలసుఖముఁ జూచి చిత్తంబు నిలుకడ
_x000D_
సేయని మనుజుండు చెడు నిజంబు
_x000D_
ఏటికట్టు మ్రాని కెప్పుడు చలనంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4222 | _x000D_
వలపు తీఱువెనుక వనజాక్షి యధరంబు
_x000D_
ములకపంటిగిజరు ముష్టిరసము
_x000D_
చింతలేనివేళ జీడిసమానమౌ
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2295 | ప్రమదారత్న మహల్య గౌతముని శాపప్రాప్తి పాషాణరూ
పముతోఁ బెక్కుయుగంబులుండఁగ హరబ్రహ్మాదులుం బాపలే
ని మహాపాపము పాపనోపినదిగా నీ పాదరేణుప్రకా
రము నేనేమని సన్నుతింతు రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
3142 | _x000D_
రాజవరుల కెపుడు రణరంగముల చింత
_x000D_
పరమ మునులకెల్ల పరముచింత
_x000D_
యల్పనరుల కెల్ల నతివలపై చింత
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2999 | ధరణిలోపల నా విల్లు విఱుగనీక | పట్టి బరువును నాపైని బెట్టుకొంటితరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. | 2 | teytageethi |
982 | ఎంటఁ బట్టిరి గదరబ్బ యనెడు మూఢ | కష్టచిత్తుల కిఁక మఱెక్కడి యశంబు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.