id stringlengths 1 4 | poem stringlengths 71 312 | label int64 0 7 | label_name stringclasses 8
values |
|---|---|---|---|
2030 | శ్రీనారాయణ యన్నఁ జాలు దురితశ్రేణి న్నివారింపఁగా
నానందస్థితి గల్గు నంచు నిగమార్థానేక మెల్లప్పుడు\న్
నానాభంగులఁ జెప్ప నేను విని శ్రీనారాయణా యంచు ని
న్నే నే నెప్పుడు గొల్తు బ్రోవఁ గదె తండ్రీ నన్ను నారాయణా! | 7 | saardulamu |
3839 | _x000D_
జన్మమరణ సుషుప్తుల జనము లెల్ల
_x000D_
జరుగుచుండంగ నరుఁడు తా జంగమమను
_x000D_
నదియుఁ దెలియంగలేర నీయజ్ఞులైన
_x000D_
భూప్రజలు బుద్ధిలేకయు పొసఁగు వేమా. | 1 | kandamu |
3555 | _x000D_
విడువవలయు నూరు విశ్రాంతి గాకున్న
_x000D_
విడువవలయు నాలి విధముఁ దెలిసి
_x000D_
విడువవలయు రాజు వితరణి గాకున్న
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4534 | కన్నవారెల్లఁ బండితుల్ కవులుఁ గాగ । వేదశాస్త్రంబు లేడను విప్రులేడ
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
2408 | వదలరు విషయము లెచటను
మెదలరు సజ్జనులకడను మిధ్యాజ్ఞానుల్
చదివితి మని యజ్ఞులతోఁ
జదువులుపచరింతు రన్న సంపఁగిమన్నా! | 1 | kandamu |
2700 | వేధం దిట్టఁగరాదు గాని భువిలో విద్వాంసులం జేయనే
లా ధీచాతురిఁ జేసిఁ జేసిన గులామాపాటునే పోక క్షు
ద్బాధాదుల్ కలిగింపనేల యదికృత్యంబైన దుర్మార్గులన్
ఛీ! ధాత్రీశులఁ జేయనేఁటి కకటా! శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
2329 | పిసినిం జూచి మహాప్రదాతయనుచున్ బీభత్సకుత్సాంగునిన్
బ్రసవాస్త్ర ప్రతిమానరూపుఁడనుచున్ బందం బ్రియంబంద శ
త్రుసమూహాంతకుఁ డంచు నెప్పుడు నరస్తోత్రంబు గావించు నీ
రసుఁడన్ నిన్ను నుతింపనేర రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
1572 | భవదీయాకృతియున్ బ్రతాపమును శుంభద్వీర్యముం గాంచి దై
త్యవిభుండీతఁడు కీశమాత్రకుఁడుగాఁ డాదిత్యులుం బంపఁగా
భువిఁ గీశాకృతిఁ దాల్చి వచ్చిన మహాభూతంబగుం గానిచో
దివిజారాతులఁ జంపునే యనుచుఁ జింతింపండొకో మారుతీ! | 4 | mattebhamu |
3318 | _x000D_
మనసులోనఁ దెలిసి మనసులోనే కలిసి
_x000D_
మనసులోనివాని మరలఁదిగిచి
_x000D_
మనసునిల్పువాఁడు మర్మజ్ఞుఁడగు యోగి
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3844 | _x000D_
ఎన్ని తనువులైన మృతికి నడ్డముగావు
_x000D_
మృతిని గెలువలేని యెఱుఁకలేక
_x000D_
దొంగరీతి కాఁగ దొరుకునో మోక్షంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
30 | నేఁటిదా నీ ప్రతిష్ఠ వర్ణించి చూడఁ-బాడి దప్పిన బలునిందపాలు గావె?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
4433 | మకరందపానంబు మధుకరాళికిఁ గాక । జోఱీగఁ చవిగని జుఱ్ఱగలదె
హరిపదాబ్జధ్యాన మమనస్కులకుఁ గాక । చెనఁటి సద్భక్తితోఁ జేయగలడె
కవితారసజ్ఞత సువివేకులకుఁ గాక । యవివేకి చెవియొగ్గి యాఁనగలడె
పద్మినీరతి వేడ్క పాంచాలునకుఁ గాక । దేబైన షండుఁడు తెలియఁగలఁడె | 3 | seesamu |
1648 | చెలు లిటు రమ్మటంచుఁ దనుఁ జీఱిన వేసట గర్భగోళసం-
కలితసుతావనేచ్ఛఁ జనఁగా మఱి యూహఁ దొలంగు దేహళీ-
స్థలి నెగదాఁటనేరనని తగ్గులు మిఱ్ఱులు చూచి తిన్నఁగాఁ
గలక దలంగి తా నడచు కామినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
3401 | _x000D_
వాయువందె పుట్టి వాయువందె పెఱిగి
_x000D_
వాయువందు మేలు వరుసఁ దెలియ
_x000D_
వాయువందు ప్రాణవాయువు తత్వంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2168 | సకలవిద్యలు నేర్చి సభ జయింపఁగవచ్చుఁ - శూరుఁడై రణమందుఁ బోరవచ్చు
రాజరాజై పుట్టి రాజ్య మేలఁగవచ్చు - హేమ గోదానంబు లియ్యగవచ్చు
గగనమం దున్న చుక్కల నెంచఁగావచ్చు - జీవరాశుల పేళ్లు చెప్పవచ్చు
నష్టాంగయోగము లభ్యసింపఁగవచ్చు - మేఁక రీతిగ నాకు మెసవవచ్చు | 3 | seesamu |
2661 | భవదుఃఖంబులు రాజకీటముల నేఁ బ్రార్థించినం బాయునే
భవదంఘ్రిస్తుతి చేతఁగాక, విలసద్బాల క్షుథాక్లేశ దు
ష్ట విధుల్మానునె? చూడ మేఁకమెడచంటం దల్లి కారుణ్యదృ
ష్టి విశేషంబుననిచ్చు చంటబలెనో శ్రీకాళహస్తీశ్వరా! | 4 | mattebhamu |
3791 | _x000D_
పెట్టిపోయ నొగిని విరుగుఁడు సౌఖ్యంబు
_x000D_
బలుచచ్చినగతి యదియుగాక
_x000D_
నుండు నాశివుండు నొగివానియందున
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4181 | _x000D_
మాలవాని నేల మహిమీఁద నిందింప
_x000D_
నొడలరక్తమాంస మొకటిగాదె
_x000D_
వానిలోన మెలఁగువాని కులంబేది
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2105 | అవనిలో మానవుల కన్నియాసలిచ్చి - వ్యర్థులను జేసి తెలిపెడివాఁడ వీవె
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
1720 | శిష్టులు మెచ్చ సజ్జనులు చేకొనునట్లు దలంచి జ్ఞానవా-
సిష్ఠముఖప్రబంధములు చెప్పుచు సత్త్వపురాణమర్మసా-
భీష్టవిధుల్ పఠించుటకుఁ బెద్దలఁ జూపుచుఁ బుత్రవాంఛ సం-
తుష్టి చెలంగుచున్న యల తొయ్యలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. | 6 | vutpalamaala |
2198 | గరుడవాహన! దివ్యకౌస్తుభాలంకార! - రవికోటితేజ! సారంగవదన!
మణిగణాన్విత! హేమమకుటాభరణ! చారు - మకరకుండల! లసన్మందహాస!
కాంచనాంబర! రత్నకాంచీవిభూషిత! - సురవరార్చిత! చంద్రసూర్యనయన!
కమలనాభ! ముకుంద! గంగాధరస్తుత! - రాక్షసాంతక! నాగరాజశయన! | 3 | seesamu |
2197 | నీ శరీరాలు పడిపోవుటెఱుఁగ కేము - కాముకుల మైతిమిఁక మిమ్ముఁగానలేము
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
2892 | ... ... ... ... వత్తు నలివేణి దయన్ ... ... మ్మటంచు మో-
హమ్మున కౌఁగలించుకొన నక్కున జేర్చి ... ... .. ... ... ...
... ... ... సిల్లుగతి కన్నుల నశ్రులు కమ్మ ... ... ... ... ... ...
... ... .. ... ... ... ... ... ... దైన్యము లెంచుదు సుందరీమణీ! | 6 | vutpalamaala |
432 | ఊరక సజ్జనుండొదిఁగి యుండిననైన దురాత్మకుండు ని
ష్కారణమోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా;
చీరలు నూరుటంకములు చేసెడివైనను బెట్టె నుండఁగాఁ
జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు? భాస్కరా! | 6 | vutpalamaala |
2077 | మోక్షదాయక! యిటువంటి మూర్ఖజనుని - కష్టపెట్టిన నీకేమి కడుపునిండు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
2804 | పగ వలదెవ్వరి తోడను
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్
దెగనాడవలదు సభలను
మగువకు మనసీయవలదు మహిలో సుమతీ! | 1 | kandamu |
153 | నడువఁజాల దని జానకి నెత్తుకొని ముందు- నడచు విరాధుని నఱకు టేమి?
చనవున వైదేహి చనుబిడ్డవలెఁ నోటఁ- బట్టిన యైంద్రికన్గొట్టు టేమి?
సీత సంతోషింపఁ జిత్రవేషముఁ దాల్చి- తిరుగు మారీచుని నరుకు టేమి?
తల్లినివలెఁ దెచ్చి ధరణీజను నశోక- వని నిల్ప రావఁణు దునుము టేమి? | 3 | seesamu |
743 | నినునెవ్వాఁడు దలంచు నీమహిమ వర్ణింపంగ నెవ్వాఁడు నే
ర్పునఁబూను\న్ నినుగొల్చునట్టిఘనుఁ డాపుణ్యాత్ములోకైకమా
న్యునిఁగా ధన్యునిఁగా వివేకనిధిఁగా నుద్యద్గుణాంభోధిఁగా
ననిశంబుం గొనియాడఁ గోరుదురు కృష్ణా దేవకీనందనా. | 4 | mattebhamu |
3327 | _x000D_
తరువున నెడియింటఁ దనశత్రుమిత్రులఁ
_x000D_
దెలియ లేనివాని తెలివదేల
_x000D_
తెలిసిన మనుజునకు దివ్యామృతమ్మురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
888 | బలమెవ్వఁడు కరిఁ బ్రోవను
బలమెవ్వఁడు పాండుసుతుల భార్యను గావ\న్
బలమెవ్వఁడు రవిసుతునకు
బలమెవ్వఁడు నాకు నీవ బలమౌఁ గృష్ణా. | 1 | kandamu |
2121 | జీవకోట్లను బోషింప నీవెకాని - వేఱె యొక దాత లేఁడయ్య వెదకిచూడ
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
638 | "పండిత రక్షకుం డఖిల పాపవిమోచనుఁ డబ్జసంభవా
ఖండలపూజితుండు దశ కంఠవిలుంఠన చండకాండ కో
దండకళాప్రవీణుఁ"డను తావక కీర్తివధూటికిత్తు బూ
దండలుగాఁగ నా కవిత దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
2840 | సిరిదా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి దాఁ బోయిన బోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ. | 1 | kandamu |
3043 | యాడుదానవు గనుక నీ యర్థమెల్ల | దెలిసి తెలియనితనమెల్ల దేటపడియెనా యూరి పేర్విను తాడిమళ్ళ | రాజగోపాలుడందురే రమణి నన్ను. | 2 | teytageethi |
3479 | _x000D_
అక్షరపుటడవిఁజొర వే
_x000D_
లక్షలఁ జదువంగ నేల లాలితముగఁ బ్ర
_x000D_
త్యక్షముగను శివ యను రెం
_x000D_
డక్షరములు మనకి శుద్ధి యగురా వేమా. | 1 | kandamu |
3117 | _x000D_
పుట్టు బిత్తలి వలె పోవు బిత్తలి వలె;
_x000D_
తిరుగు బిత్తలి వలె, దేహి ధరణి
_x000D_
యున్న నాటి కైన నుపకారి గాలేఁడు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
286 | పలుమాఱుం ద్విజరాజు లొక్కటఁ దముం బాధింతురంచున్ విషా-
నలఘోరాననము ల్ముండుంచుకొని కానన్ రాక దుర్గస్థలం-
బుల వర్తించుచు బుస్సురందు రిల నాభోగేశు లెందైననున్
మలఁకల్మాని చరింపఁగాఁ గలరె? రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
504 | వంచన యింతలేక యెటువంటి మహాత్ముల నాశ్రయించినం
గొంచెమె కాని మేలు సమకూడ దదృష్టము లేనివారికిన్;
సంచితబుద్ధి బ్రహ్మ ననిశంబును వీఁపున మోచునట్టి రా
యంచకుఁ దమ్మితూండ్లు దిననాయెఁగదా ఫలమేమి భాస్కరా! | 6 | vutpalamaala |
4126 | _x000D_
భూతి దేహమందుఁ బూసిన నాయెనా
_x000D_
నిష్ఠ శివునియందె నిలుపవలయుఁ
_x000D_
గాని భస్మమందు గాడిదె పొర్లదా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
28 | నిండుకొన్నావు గడియించు నేరుపరివె-ప్రావలువ బ్రారువాణముల్ బ్రాఁతి యేమి?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
2319 | గోవం దొల్తటి జన్మకాలముల నీకుం బంటఁ గానైతి నం
చీవక్రంబులె కాక నాకు నివి లక్షింపంగ జన్మంబులా
చావుం బుట్టువు మాన్పుకోవలయు నీ జన్మాన నీవాఁడనై
రావా నా మది కింకనైన రఘువీరా! జానకీనాయకా! | 7 | saardulamu |
339 | కిరిహంసాకృతులూని వెన్నుఁడును బంకేజాతగర్భుండు నీ
చరణంబుల్ శిరము న్గనం దలఁచి నిచ్చల్భోగిలోకంబు పు-
ష్కరమార్గంబును రోసి కానక నిరాశం జెందుచో వారలం
గరుణం బ్రోవవె లింగమూర్తివయి! భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
272 | పద్యంబేల పిసిండి? కీప్సితము దీర్పన్ లేని జేజేకు నై-
వేద్యంబేల? పదార్థచోరునకు నుర్విన్ వేదవేదాంతస-
ద్విద్యాభ్యాసకబుద్ధియేల? మది భావింపంగ నెల్లప్పుడున్
మద్యం బానెడువానికేల సుధ? రామా! భక్తమందారమా! | 7 | saardulamu |
3067 | యనుచు బెక్కువిధంబుల నార్తిజెందు | నతివ విడనాడగా నీకు సరసమగునెతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. | 2 | teytageethi |
2118 | ధరణిలోపల నేను తల్లి గర్భమునందుఁ - బుట్టినప్పటినుండి పుణ్య మెఱుఁగ
నేకాదశీ వ్రతంబెన్నఁ డుండఁగ లేదు - తీర్థయాత్రలకైనఁ దిరుగలేదు
పారమార్థికమైన పనులు చేయఁగలేదు - భిక్ష మొక్కనికైనఁ బెట్టలేదు
జ్ఞానవంతులకైనఁ బూని మ్రొక్కఁగ లేదు - ఇతర దానములైన నియ్యలేదు | 3 | seesamu |
201 | వెనుక వేసుకొని యుర్వీనాథకోటులు- సైంథవుఁ గావంగఁ జాలినారె?
ధర నేయు తనసుతు శిర మెవ్వఁడతఁ డీల్గ- శాపించి సింధురా జోపినాఁడె?
సాటింతు నాసర్వసైన్యంబు లని కర్ణు- చేశక్తి నరు నేయఁ జెప్పినారె?
పరులచే నొవ్వని పంతంబు గలభీష్ము- డర్జునాస్త్రంబుల కాఁగినాఁడె? | 3 | seesamu |
571 | శరనిధికన్యనాగ హిమశైలతనూజయనంగ వాణినాఁ
బరగు వధూట్లఁ గూడి భవపాలననాశము లోలిఁ జేయుచున్
హరిహరధాతృమూర్తి వగు నాఢ్యు నినుం గనుగొందు నీశ్వరా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
2963 | పడతిరో నాదు కౌగిట పంజరమున | జేర్పబొసగదె యెటులైన జెలిమికానితరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. | 2 | teytageethi |
2847 | ముసిముసినవ్వుతోఁ జిగురుమోవి కదల్పుచుఁ జన్నుదోయి నె-
న్నొసలు చమర్చఁగా ననుఁ గనుంగొని నానమరల్చు జూపులఁ-
య్యసమశరుండు మున్ను యెదనంటఁగ గ్రుచ్చి పెగల్చు పూవునా-
రసములనంగఁ దోఁచఁగ దరంబులె యోర్వఁగ సుందరీమణీ! | 6 | vutpalamaala |
2817 | పిలువని పనులకుఁ బోవుట
కలయని సతిరతియు రాజుగానని కొలువున్
బిలువని పేరంటంబును
వలవని చెలిమియును జేయవలదుర సుమతీ! | 1 | kandamu |
2332 | అక్షీణాప్రతిమానదానవిభవాహంకారపారీణ! యో
రక్షోదైత్యమదాపహార విబుధా! త్రైలోక్యసంరక్షకా!
దక్షధ్వంసివధూటికావినుత! నీ దాసానుదాసుండ నన్
రక్షింపం గదవయ్య! రామ! రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
973 | అబ్బబ్బ కిందటేఁ డప్పయ్య తీర్తాన | జోలెజంగము కిస్తి సోలెఁడుప్పు
సాతాని జియరయ్య సతికితే పోయిస్తి | కొల్లఁగా గుల్లెఁడు సల్లబొట్టు
లంక సత్తెలవాఁడు పొఁకాన పొగిడితే | మాలదాసరికిస్తి మానెఁడూద
వేదాలు వాగితే యెల్లుబొట్టయ్యకు | కొలకుండ దోసెఁడు కొఱ్ఱలిస్తి | 3 | seesamu |
2822 | బంగారు కుదువఁ బెట్టకు
సంగరమునఁ బాఱిపోకు సరసుఁడవైనన్
నంగడి వెచ్చము లాడకు
వెంగలితోఁ జెలిమి వలదు వినురా సుమతీ! | 1 | kandamu |
4621 | చిత్తజవైరి విక్రమముఁ జెప్పకు చెప్పకు త్రావనోడి తాఁ
గుత్తుక నిల్పెనంచుఁ గడు గ్రూరతరంబగు కాలకూటమున్
గుత్తుక బంటి గ్రోలిన యకుంఠితవిక్రమ చక్రవర్తి! భా
స్వత్తమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
1144 | సిరి చేర్చు బంధువుల నా
సిరియే శుభముల నొసంగు చెలువులఁ గూర్చున్
సిరియే గుణవంతుండని
ధరలోఁబొగడించునంచుఁ దలఁపు కుమారా! | 1 | kandamu |
324 | వ్రతముల్ దేవగురుద్విజార్యపదసేవల్ వైశ్వదేవాది స-
త్క్ర తుహోమాదులు దానధర్మములు వైరాగ్యప్రచారంబు లా-
శ్రితరక్షావిధు లించుకే నెఱుఁగ నీ చిత్తంబు నా భాగ్య మే-
గతి రక్షించెదొ కాని నన్నిఁకను భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
3150 | _x000D_
పరుస మినుముసోకి బంగారమైనట్లు
_x000D_
కప్పురంబు జ్యోతిఁ గలసినట్లు
_x000D_
పుష్పమందు దావి పొసఁగినట్లగు ముక్తి
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
833 | వేదంబులు గననేరని
ఆది పరబ్రహ్మమూర్తి వనఘ మురారీ
నాదిక్కుఁజూచి కావుము
నీ దిక్కే నమ్మినాఁడ నిజముగఁ గృష్ణా. | 1 | kandamu |
2788 | తన వారు లేని చోటను
జనువించుక లేని చోట జగడము చోటన్
అనుమానమైన చోటను
మనుజునకును నిలువఁదగదు మహిలో సుమతీ! | 1 | kandamu |
4505 | పొరుగూరి కేగినఁ బోవునే దుర్దశ । గాదె పెండిలి సన్నికల్లు దాఁచ
డొంకల డాఁగ బిడుగుపాటు దప్పునె । కాలడ్డ నిలుచునే గాంగఝురము
కుమతిచేఁ జెడునె యెక్కుడు మంత్రి యత్నంబు । లింకిపోవునె యనావృష్టి జలధి
ధవుడు పిన్నైన వైధవ్యంబు దప్పునే । మనదె దీర్ఘాయువు మందు లేక | 3 | seesamu |
2188 | జీమూతవర్ణ! నీ మోముతో సరిరాక - కమలారి యతికళంకమునుఁ బడసె
సొగసైన నీ నేత్రయుగముతో సరిరాక - నళినబృందము నీళ్లనడుమఁ జేరెఁ
గరిరాజవరద! నీగళముతో సరిరాక - పెద్దశంఖము బొబ్బపెట్టఁ దొడఁగె
శ్రీపతి! నీ దివ్యరూపుతో సరి రాక - పుష్పబాణుఁడు నీకుఁ బుత్రుఁ డయ్యె | 3 | seesamu |
1152 | పాపపుఁబని మదిఁ దలఁపకు,
చేపట్టినవారి విడువఁ జేయకు, కీడున్
లోపలఁ దలఁపకు, క్రూరుల
ప్రాపును మది నమ్మఁబోకు రహిని గుమారా! | 1 | kandamu |
3344 | _x000D_
మాయరూపు రూపు మాయ తాఁజేసియు
_x000D_
మాయరూపులఁ బెనుమాయఁజేసి
_x000D_
మాయలోని మాయమహిమ నెఱుంగురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2394 | వచ్చినవాసనవెంబడి
విచ్చలవిడి యోగివరుఁడు విహరించినవాఁ
డెచ్చట నేక్రియఁ జేసిన
సచ్చిన్మయు నంట దన్న సంపఁగిమన్నా! | 1 | kandamu |
2284 | గోమేధాధ్వర వాజిమేధశతముల్ గోదాన భూదానముల్
హేమాద్రుల్ తిలపర్వతంబులు సువర్ణేభాశ్వదానంబులున్
నీ మంత్రంబగు నక్షరద్వయముతో నే పుణ్యముల్ పోల వో
రామా! రాఘవ! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా! | 7 | saardulamu |
531 | శరశరదిందుకుందహరిచందనహారతుషారతారకా-
దరఘనసారవర్ణ వరదండశుకాంబుజపాణి వాణి యా-
దరమునఁ బ్రోచుచోఁ గవికదంబము నిన్బ్రణుతించు ధన్యమై
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
3757 | _x000D_
రమణి నవ్వుచుండు రమణుఁడు నేడ్చును
_x000D_
రమణ సేయుచుండు ఱంకుమీర
_x000D_
ఱంకు చూడఁగానె పరమైన తత్వంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1582 | నిను బంధించుట నీదువాలమున వహ్నిం గొల్పుటల్ రాక్షసుల్
వినిపింపన్ విని సీత యేను పతికిం బ్రేమాస్పదీభూత నౌ
ట నిజంబేని కృపీటజన్మ! కడువేడ్కన్ మత్ప్రియార్థంబు పా
వనికిన్ శీతుఁడవై వెలుంగు మనుచున్ బ్రార్థింపదే మారుతీ! | 4 | mattebhamu |
3860 | _x000D_
మర్మ మెఱుఁగలేక మతములఁ గల్పించి
_x000D_
యుర్విదుఃఖు లగుదు రొకరి కొకరు
_x000D_
గాజువంటిఁ గుక్క కళవళపడురీతి
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3450 | _x000D_
కర్మగుణము లన్ని కడఁబెట్టి నడువక
_x000D_
తత్వమేల దన్ను దగులుకొనును
_x000D_
నూనెలేక దివ్వె నువ్వులమండునా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
503 | లోను దృఢంబుగాని పెనులోభిని నమ్మి యసాధ్యకార్యముల్
కానక పూనునే నతఁడు గ్రక్కునఁ గూలును; నోటిపుట్టిపై
మానవుఁ డెక్కిపోవ నొకమాటు బుటుక్కున ముంపకుండునే
తానొకలోఁతునం గెడసి దానిఁ దరింపఁగ లేక భాస్కరా! | 6 | vutpalamaala |
1299 | కులమున విత్తంబున వి
ద్యలను మదం బుద్భవించు నాయా పెంపుల్
తలపోయ మరలు నిది హృ
జ్జలజంబునఁ దలఁపవలయు సతముఁ గుమారీ! | 1 | kandamu |
4613 | వేఁడిన మిండ జంగమము వెక్కసమందగఁ దత్సభాస్థలి
న్నాఁడట నారి వల్వొలువ నైజపుమానము దూలకుండఁగాఁ
బోఁడిమిఁ బట్టుపుట్టములు ప్రోవులు పెట్టిన పుణ్యమూర్తి నీ
వాఁడఁ జుమయ్య జియ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
466 | తెలియని కార్యమెల్లఁ గడతేర్చుట కొక్క వివేకిఁ జేకొనన్
వలయు నటైన దిద్దుకొనవచ్చు ప్రయోజన మాంద్య మేమియుం
గలగదు; ఫాలమందుఁ దిలకం బిడునప్పుడు చేత నద్దముం
గలిగినఁ జక్కఁ జేసికొనుఁ గాదె నరుండది చూచి భాస్కరా! | 5 | champakamaala |
625 | ఆర్యులకెల్ల మ్రొక్కి వినతాంగుఁడనై రఘునాథభట్టరా
చార్యుల కంజలెత్తి కవిసత్తములన్ వినుతించి కార్యసౌ
కర్యమెలర్పనొక్క శతకంబొనఁగూర్చి రచింతునేఁడు తా
త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
1503 | ప్రణవమాలింప నీ మణితంబుగా నయ్యె । ధ్యానంబు నీ పదధ్యాన మయ్యె
లక్ష్యంబు నీ పట్టువక్షోజములు నయ్యె । యోగంబు నీదు సంయోగ మయ్యె
సుసమాధి మదనతంత్రసమాధిగా నయ్యె । జపము నీ సద్గుణచయము నయ్యె
బింబదృశ్యము నోష్ఠబింబదృశ్యము నయ్యె । స్మరణ యేవేళ నీ శరణ యయ్యె | 3 | seesamu |
2395 | విత్తమదమత్తు లాయత
చిత్తభ్రమ లెఱుఁగలేరు చిత్పురుషుని దా
నుత్తముఁడితఁడని సన్ముని
సత్తముఁడై యెఱుఁగు నన్న! సంపఁగిమన్నా! | 1 | kandamu |
2066 | తనువులోఁ బ్రాణముల్ తర్లిపొయ్యెడి వేళ - నీ స్వరూపమును ధ్యానించునతఁడు
నిమిషమాత్రములోన నిన్నుఁ జేరును గాని - యమునిచేతికిఁ జిక్కి శ్రమలఁ బడఁడు
పరమసంతోషాన భజనఁ జేసెడివారి - పుణ్య మేమనవచ్చు భోగిశయన
మోక్షము నీ దాసముఖ్యుల కగుఁ గాని - నరక మెక్కడిదయ్య నళిననేత్ర | 3 | seesamu |
3999 | _x000D_
మంటలోహమందు మ్రాకులు శిలలందు
_x000D_
పటము గోడలందుఁ బ్రతిమలందు
_x000D_
తన్నుఁ దెలియుకొఱకు తగులదా పరమాత్మ
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1022 | ఘనున కొక నేరమించుక కలిగెనేని | గొఱఁతగాఁ జూచి యెగ్గెన్నుకొనరు బుధులు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
558 | ఇరవుగ దారుకావనమునీంద్రవధూతిలకంబుల న్మనో-
హరవటుకాకృతిం బొలిచి యబ్జశరాహవలీలలం గడున్
గరచిన నీ విలాసరతికౌశలముల్ గణుతింప శక్యమే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
803 | ఉర్విం బాఱుమహానదీజలము లాయూరూరునందెల్లఁ గూ
డురుఘోషంబున వంకలై కలియఁగా యోగ్యంబు లైనట్లు మీ
స్మరణ\న్ నానుడువు\న్ సదాశుభములై సంపూజ్యము\న్ గా భవ
చ్చరణంబుల్ మది నిల్పి కొల్చెదను కృష్ణా దేవకీనందనా. | 4 | mattebhamu |
4141 | _x000D_
వేదవిద్యలెల్ల వేశ్యలవంటివి
_x000D_
భ్రమలపెట్టి తేటపడగ నీవు
_x000D_
గుప్తవిద్య యొకటె కులకాంతవంటిది
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3024 | జగడ మన్యాయమై జాంబవంతుని గెల్చె కానుక దెచ్చిచ్చిగాదు బిరుదుఎంతమాత్రంబైన నీ యతిశయముచే మిక్కిలి మఱియేమి మేలులేదుబాల్యమందున రామభద్రుండవై యుండి వెలయ వనమునకు వెళ్ళినావుపదునాలుగేడులు పరగ దమ్ముడు నీవు నెలమి సీతతోఁ జరియించినావు | 3 | seesamu |
3933 | _x000D_
ఊరిబావిలోని యుదకమ్ము నిందించి
_x000D_
పాదతీర్థమునకు భ్రమయువారు
_x000D_
పాదతీర్థములను ఫలమేమి కందురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
565 | విరసముతోడ నిన్ శిలల వ్రేసియు రోకటఁ గ్రుమ్మియున్ గృహాం-
తరమునఁ గాపువెట్టియును సిద్ధముగా వెలివెట్టు కుంటిన-
ల్దిరగఁగఁ జేసినట్టి ఘనులే తగుభక్తవరేణ్యులైరి మేల్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
1395 | కారంజిలో నీతకాయల మోపాని । తేలెడు పచ్చని తెప్పపల్క
పైకెంపు రాకోళ్లపట్టెమంచము దోమ- । తెరచుట్టు దివ్వెకందీలబారు
తొడిమ తీసిన రెక్క విడిమల్లెపూపాన్పు । పచ్చాకుదిండ్లు కోపైన లోడు
దనరు కుంకుమపువ్వు తక్కెంబు కీలుబొ- । మ్మలు వేయు పంఖాల చలువగాడ్పు- | 3 | seesamu |
1034 | సిరులు నిలుకడలని నమ్మి చెనఁటు లురక | చెడుదు రెన్నడు ధర్మంబు సేయలేక,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
1893 | బంధూక సహకార పాటల కురువక ఫలపూర జంబీర పనస తరులుచందన ఖర్జూర చంపక బదరిక మాలూర మన్మథ మహిరుహములుభల్లాతకామ్లాత భద్ర కేతకి నింబ పారిజాతాశోక పాదపములుమాతులుంగ లవంగ మందారములు గల్గి జాతిప్రముఖ లతాసముదయముల | 3 | seesamu |
946 | సంతసము మీఱఁ గేరి సాయంతనమునఁ | దాండవం బాడు నీ హొయల్ దలఁప వశమె
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
1817 | పసిడిబుటేదారి పట్టువల్వ ధరించి రాణించు పైఠాణిరవికె దొడిగిబాలచందురువంటి ఫాలభాగంబున దిలకంబు కొనగోర దిద్ది వేగవరుని మృదూక్తుల వలపించి జిగిబిగికౌఁగిట జేర్పును కంబుకంఠిపద్మంబు తావి మై బరగు పద్మినిజాతి కాంతయౌ నది గాన కమలనాభ | 3 | seesamu |
2173 | గోపగాఁడను నీవు నా గుణము తెలిసి - యిప్పుడే నన్ను రక్షించి యేలుకొమ్ము
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
3898 | _x000D_
యోగి ననుచుఁ గొంత యోగము గూర్చుక
_x000D_
జగములోనివానిఁ జంపితినుచు
_x000D_
ధనము కొఱకు మిగుల తగవాడుచుండిన
_x000D_
యోగిగాఁడు వాఁడె యోగు వేమా. | 0 | aataveladi |
1884 | పదర నిను కోరియున్నది బాళిమీర | మదవతిని గూడి లాలింప ముదముతోడజాగుసేయక రావయ్య జలరుహాక్ష | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
31 | తిరునాళ్ళతఱి వచ్చెఁ బరిపరివిధముల- నెలమి సామగ్రిఁ జేయింప వేమి?
సేవకు లందందు సేవింప భావింప- తిరువీథుల రథంబుఁ ద్రిప్పవేమి?
వృజిన మెల్లఁ దొలంగు నిజ మంచుఁ బ్రజ లెంచు- పరమప్రసాదంబుఁ బంచవేమి?
దివ్య దేశం బిది తీర్థంబు సార్థంబు- చక్రతీర్థము కృప సలుప వేమి? | 3 | seesamu |
3069 | అని ప్రణామము లొనరించి యతని మదిని | గనికరము దోచునట్టుల గారవించితరుణ మిదియని తెలిపి శ్రీ తాడిమళ్ళ | రాజగోపాలుఁ దోడ్తేరె రమణులార. | 2 | teytageethi |
2170 | నరసింహ! నీవంటిదొరను సంపాదించి - సుమతి మానవుల నేఁ గొల్వఁజాల
నెక్కు వైశ్వర్యంబు లియ్యలేకున్నను - బొట్టకు మాత్రము పోయరాదె?
ఘనము గాదిది నీకు కరవునఁ బోషింపఁ - గష్ట మెంతటి స్వల్పకార్యమయ్య?
పెట్టఁ జాలక యేల భిక్షమెత్తించెదవు - నన్ను బీదను జేసినా వదేమి? | 3 | seesamu |
2159 | క్రూరజనులకు నీమీఁద గోరి కేల? - ద్రోహి పాపాత్మునకు దయాదుఃఖ మేల?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
1448 | యనుచు నేనెంత వేడిన కనరు మాన- । రైరి వీరలు నామీది వైరమునను
సుంత దయచేసి కన్నుల చూడ వింత । వాదటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
718 | బొంకనివాఁడె యోగ్యుఁ డరిబృందము లెత్తినచోటఁ జివ్వకుం
జంకనివాఁడె జోదు రభసంబున నర్థికరంబు సాఁచినం
గొంకనివాఁడె దాత మిముఁ గొల్చి భజించినవాఁడె పో నిరా
తంకమనస్కుఁడెన్నగను దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.