id stringlengths 1 4 | poem stringlengths 71 312 | label int64 0 7 | label_name stringclasses 8
values |
|---|---|---|---|
3458 | _x000D_
అన్నమునకు నంటునైన నాత్మకునంటు
_x000D_
ఆత్మను పెనగొన్న నన్నమంటు
_x000D_
ఆత్మశుద్ధియన్న మన్న శుద్ధియునాత్మ
_x000D_
మిన్నుమన్నుమాడ్కి మెఱయు వేమా. | 0 | aataveladi |
4174 | _x000D_
జాతులందు నెట్టిజాతి ముఖ్యముచూడు
_x000D_
మెఱుఁగలేక దిరుగ నేమిగలదు
_x000D_
యెఱుక గలుగు మనుజుఁ డేజాతి గలవాఁడు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3909 | _x000D_
తన్నుఁ దెలియకున్న తగ వేదములు వెఱ్ఱి
_x000D_
సర్వ సంపదకు ముసాబు వెఱ్ఱి
_x000D_
యాఱు శాస్త్రములును నా పురాణములును
_x000D_
జబ్బు లనుచు జగతిఁ జాటు వేమా. | 0 | aataveladi |
1651 | చిఱుత జనించునంతఁ దన చిత్తము సార్థకమై చెలంగిన-
ట్లురుతరభాగ్య మబ్బినటు లుర్వి సమస్తము నేలినట్లు పెం-
దురమున గెల్చుచో విజయతూణము లెల్లెడ నాఁటినట్టు ల-
బ్బురముగ సంతసిల్లు విరిబోఁడిని దల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
3178 | _x000D_
మదినెఱిఁగినవాని మహిఁగాన నెందును
_x000D_
మది నెఱుంగువాఁడు మహిని నరుఁడు
_x000D_
వెదకి తనువులోన వేడ్కతో నినుఁజూచు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
68 | నృపులు కొందఱు వెఱచిరే నీకు మున్ను-ప్రాణముల కాసపడరేని భండమున
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
3242 | _x000D_
కనియుండి కానలేరట
_x000D_
వినియుండియు వినగలేరు విస్మయమేమో
_x000D_
కనుగ్రుడ్డియు వినుచెవుడుం
_x000D_
చనునది నిజమయ్యె జగమునందున వేమా. | 1 | kandamu |
1512 | ఘనసుగుణధామ ఘోరసంగ్రామభీమ । బుధజనస్తోమ నవ్యసంపూర్ణకామ
పతితపావనకృతినామ భవవిరామ । వరచరిత రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
3185 | _x000D_
శాంతమున సకలకార్యము
_x000D_
సంతోషంబునను బొందు సత్యము జయమౌ
_x000D_
పంతము చెల్లును ధర్మజుఁ
_x000D_
డెంతేసి ప్రయాసముల జయించెను వేమా. | 1 | kandamu |
1162 | సద్గోష్ఠి సిరియు నొసఁగును
సద్గోష్ఠియె కీర్తిఁబెంచు సంతుష్ఠిని నా
సద్గోష్ఠియె యొనఁగూర్చును
సద్గోష్ఠియె పాపములను జంపుఁ గుమారా! | 1 | kandamu |
3296 | _x000D_
మ్రానులోన నగ్ని మఱియుండఁగా వచ్చు
_x000D_
నగ్ని నుండ మ్రాను కలవిగాదు
_x000D_
మ్రానులోనియగ్ని మర్యాద సంసారి
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4167 | _x000D_
బొమ్మలాటవాఁడు బొమ్మల నాడించు
_x000D_
భువిని జనులుచూఁడ బొలుపుమీఱ
_x000D_
తానుమఱిగియుండి దైవ మాడించురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4069 | _x000D_
ధర్మసత్యములను దప్పకచేయని
_x000D_
కర్మజీవి మేలుఁ గానఁలేఁడు
_x000D_
నిర్మలహృదయుండు నీరూపమున నుండు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
288 | బలరాజన్యుఁడు ధూర్తకాకవిఁ గనం గంపించి విత్తంబు దా-
నలఘుప్రక్రియ నిచ్చు సత్కవివరున్ హాస్యంబు గావించు నౌ
నిల బర్బూరము గాలివానఁ బడుఁగా కింతైనఁ గంపించునే
మలయోర్వీధరమారుతంబునకు రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
4504 | గాని వస్తువుఁ బెట్టుకోఁ గాంక్షచేత । బెనఁగుమాత్రంబె కాని లభింపదేమి
దాని కొడఁబడఁ డింగితజ్ఞానశాలి
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
2922 | నను నల నవ్వుటాలకయినన్ బొలయల్కల జేసియైననున్
నను గలలోననై నను క్షణం బెడబాయకజాలవంచు నో
వనజదళాక్షి నీకొఱకె వంతలనొందెద వెట్టులోర్తువే
నునుచలిగాలి వేడికి మనోజుని దాఁడికి సుందరీమణీ! | 5 | champakamaala |
1610 | దశకంఠుం బరిమార్చి, యాత్మజయముం ధాత్రీజకుం జెప్పి, త
త్కుశలం బారసి రమ్మటంచు వెస గాకుత్స్థుండు పంపం బురం
బు శశిప్రక్రియఁ జొచ్చి, రావణువధంబుం దెల్పి, సీతాసతిన్
విశదానందరసాబ్ధిఁ దేల్చినది నీవే కావొకో మారుతీ! | 4 | mattebhamu |
614 | నర పశు పక్ష్మి వేఁట మృగ నాగ ఝషాదిక జంతుయోనుల-
న్బొరిఁబొరి నెన్నిమార్లు మును పుట్టితినో యెఱుఁగ న్మహాఘనుల్
హరు నినుఁ గొల్చు భాగ్య మిపుఁ డబ్బెనికే క్రియఁ బ్రోచెదో సుమీ
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
695 | అనుపమ యాదవాన్వయసుధాబ్ధిసుధానిధి కృష్ణమూర్తి నీ
కనుజుఁడుగా జనించి కుజనావళి నెల్ల నడంచి రోహిణీ
తనయుఁడనంగ బాహుబల దర్పమునన్ బలరామమూర్తివై
తనరిన వేల్పవీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ! | 5 | champakamaala |
3055 | మదనశతకోటిలావణ్యమహితుడైన | చిన్నికృష్ణుని దేరమ్మ చెలియలారమన్మథుని గన్న శ్రీతాడిమళ్ళవాస | రాజగోపాల రావన్న రమణి గూడ. | 2 | teytageethi |
1547 | నలువొప్పం గమనీయ పుష్పకవిమానంబుం దగం జూచి యు
జ్జ్వల నానావిధధూపవాసనలు దివ్యస్రక్సుగంధంబు లిం
పలరారం బ్రియబంధునిం బలె సముద్యత్ప్రీతి రమ్మంచు నిం
జెలిమిం బిల్వఁగ నేగుదెంచినక్రియన్ జెంతం గుబాళింప ద
ద్విలసద్దివ్యగృహంబు జేరితివి కాదే మెల్లనన్ మారుతీ! | 4 | mattebhamu |
3475 | _x000D_
ఎసఁగువేత్త యనుచు నెఱుగరే యీనరుల్
_x000D_
వేయిమార్గములను వేలు పజుఁడు
_x000D_
అవని సృష్టికర్త యంతకు గురుఁ డెన్న
_x000D_
నతనికి తలయేది యరయ వేమా. | 0 | aataveladi |
2627 | నిప్పై పాతకతూల శైలమడఁచు న్నీనామమున్మానవుల్
తప్పన్ దవ్వులవిన్న నంతకభుజాదర్పోద్ధత క్లేశముల్
తప్పుందారును ముక్తులౌదురని శాస్త్రంబుల్మహాపండితుల్
చెప్పంగాఁ దమకింక శంకవలెనా శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
1871 | నీటుమీరగ దళ్కు నిడువాలుగన్నుల గాటపు వగ గుల్క కాటుకలదియందమౌ మోమున పొందుగా కస్తూరితిలకంబు కొనగోట దిద్ది వేగనెరివేణి పొదవున విరిసరంబులు దాల్చి నరరత్నభూషణావళులు మెరయరంగుబుటేదారి రవికె యొప్పుగ దొడగి చెంగావిసరిగంచు చీర గట్టి | 3 | seesamu |
3448 | _x000D_
తమ తలంపులలోనఁ దత్వ శిఖామణిఁ, దలఁచిన వారెల్లఁ దత్వ విదులు
_x000D_
ఘనమైన నిబిఢాంధ కారంబునను జ్యోతి ననువునఁ జూచిన యతఁడె యోగి
_x000D_
శివునిలో జీవుని జీవునిలో శివు నొనరఁ దెలిసినవాఁడు యోగదృక్కు
_x000D_
సౌఖ్య యోగంబున సర్వంబు శివుఁడని నిశ్చయించినవాఁడు నిర్మలుండు | 3 | seesamu |
3654 | _x000D_
చెట్టుచేనుగొట్టి చుట్టుగోడలఁబెట్టి
_x000D_
యిట్టునట్టుఁ బెద్దయిల్లు గట్టి
_x000D_
మిట్టిపడును నరుఁడు మీఁదిచే టెఱుంగక
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3886 | _x000D_
బందెత్రాళ్ళఁ దెచ్చి బంధించి కట్టంగ
_x000D_
లింగఁడేమి దొంగిలించినాఁడొ
_x000D_
యాత్మలింగ మేల యర్చింపఁజూడరో
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4212 | _x000D_
నీళ్ళ మునుఁగనేల నిధుల మెట్టఁగనేల
_x000D_
మొనసి వేల్పులకును మ్రొక్కనేల
_x000D_
కపటకల్మషములు కడుపులో నుండఁగా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
841 | బృందావనమున బ్రహ్మా
నందార్భకమూర్తి వేణు నాదము నీ వా
మందార మూలమున గో
విందా పూరింతువౌర వేడుకఁ గృష్ణా. | 1 | kandamu |
1269 | ఎంగిలి పరులకుఁ బెట్టకు
క్రంగున మ్రోయంగనీకు కాల్మెట్టియలన్
బంగారు లాభ ముండిన
దొంగతనము సేయుబుద్ధి దొలఁచు కుమారీ! | 1 | kandamu |
3945 | _x000D_
సతులు జపతపములు సలుపంగ సాగిన
_x000D_
పురుషు లేలయికను పుడమిలోన
_x000D_
పాప మెంచవద్దు పట్టి శిక్షింపుడీ
_x000D_
పుణ్యపురుషు లెల్ల భువిని వేమా. | 0 | aataveladi |
1473 | ఏలనే యింత జాగేలనే తమి నిల్ప- । జాలనే కరుణ నన్నేలుకొనవె
మానవే చల మెంతదానవే కెమ్మోవి- । నానవే కౌగిట బూని వేడ్క
నేరమా పల్కు బంగారమా నాచోట । క్రూరమా మరి కానివారమటవె
యెంచవే రతుల దేలించవే చాల మ- । న్నించవే వగలు చాలించి యిపుడు | 3 | seesamu |
1792 | మాటిమాటికి దన మేను మరచిమరచి తమక మిగురొత్త రతికేలి తగ పెనంగువనిత నేలుట తగునయ్య వనరుహాక్ష | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
1872 | వెడలి యారామమెల్లను వెతకి నిన్ను | గాన కిటు నన్ను బంపెను గమలనాభకరుణగల్గియు నా ఇంతికడకు రమ్ము | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
2392 | అంగం బెఱుఁగరు ముక్తి తె
ఱంగెఱుఁగరు కపటధూర్తరావణవేషుల్
దొంగలగురువులవారల
సంగతి దుర్బోధ లెన్న సంపఁగిమన్నా! | 1 | kandamu |
4001 | _x000D_
మాటలోనివాని మహిమఁ దాఁ దెలియక
_x000D_
మాటబయలె లేక మమతఁ జిక్కె
_x000D_
మాట దెలిసెనేని మఱియాత్మ యోగిరా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1586 | చిరకాలంబునుండి పెంచిన మధుస్ఫీతోరుకాంతారముం
గరమర్థిన్ వడిఁ జొచ్చి విచ్చలవిడిన్ సంతుష్టియౌ నట్లుగా
వరుసన్ దేనెలుఁ ద్రావనిచ్చి ఫలముల్ భక్షింపఁగాఁ జేసి వా
నరులం దృప్తులఁ జేయవే సమధికానందముతో మారుతీ! | 4 | mattebhamu |
1380 | మొగము వంచుక నరతల్పు సగము మూసి । నిలిచి యేమందునని వ్రేల నేలగీరు-
కొనుచు నను బోయిరమ్మని నెనరు దలుప । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
3670 | _x000D_
లలితశివ తత్వపదమునఁ
_x000D_
గలసిన శివయోగియేల కలియును జనుల\న్
_x000D_
జలబిందువు ముత్తియమై
_x000D_
కలియునె తొల్లింటి నీటఁగనరా వేమా. | 1 | kandamu |
4319 | బూతలబండ్లనే వలపుఁబుక్కిట నించితి వాఁడిగోళ్లనే
ఘాతలు గాఁగఁ జించితివి కాయముపై నలమేలుమంగ నీ
చేతిదె యంచు నీతరుణి చెంతలఁ దట్టపునుంగుఁ గస్తురి\న్
జాతుదు రోలి నీదు పరిచారిక కాంతలు వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
4093 | _x000D_
ఉచితవంతుఁడైన నుద్యోగపరుఁడైన
_x000D_
సాగుబాటునున్న సమయమునను
_x000D_
పరుల కుపకరించి పరఁగ రక్షించును
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3579 | _x000D_
చేటు వచ్చెనేని చెడనాడు దైవంబు
_x000D_
మేలు వచ్చెనేని మెచ్చుఁ దన్ను
_x000D_
చేటు మేలుతలఁపుఁ జేసినకర్మముల్
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4575 | లౌల్యపరాయణాత్మ గుణలౌల్య! యమూల్య సదోపయుక్త ని
ర్మాల్య! వినీతికల్య! యసమానదయా రసకుల్య! నిత్యనై
ర్మల్య! యమూల్య! దుష్టజనమానసశల్య! పదాబ్జలబ్ధ కై
వల్య! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
48 | నీ పరాక్రమ మిట్టిది నిఖిలజగము-లాజ్ఞ మీఱక నిల్చుట యద్భుతంబు
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
1274 | ఎంతటి యాఁకలి కలిగిన
బంతిని గూర్చుండి ముందు భక్షింపకు సా
మంతులు బంధువులును నిసు
మంతైనను జెల్ల దందు రమ్మ కుమారీ! | 1 | kandamu |
1236 | కడుపారఁ గూడుఁ గూరలు
దొడవులు వస్త్రములు మిగుల దొరకవనుచుం దా
వడితనమునఁ బెనిమిటితో
నెడఁ బాసి చరింపఁ గూడదెపుడు కుమారీ! | 1 | kandamu |
3481 | _x000D_
సూక్ష్మమధ్యమునను సొరిది జీవుం డుండు
_x000D_
స్థూలమధ్యమందు సూర్యుఁ డుండు
_x000D_
నాదబిందుకళల నాబ్రహ్మ ముండురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2545 | సమదోత్సాహసుఖాభిలాషలును నీ సంసారమాయావినో-
దములు న్స్వర్గఫలాపవర్గఫలచిత్తభ్రాంతులుం బూజ్యరా-
జ్యమహాకాంక్షలు నెన్ని చూడ నివి నీ సద్భక్తి కత్యంతరా-
యములై మాటికిమాటి కడ్డుపడుఁ గార్యశ్రేణి సర్వేశ్వరా! | 4 | mattebhamu |
3798 | _x000D_
ఎవ్వరేమెఱుంగు నింపయిన వస్తువు
_x000D_
దేహ మే మెఱుంగు దివ్యబోధ
_x000D_
విధముఁ దెలిసి మీరు వేదాంత మెఱుగుఁడీ
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3485 | _x000D_
ఘంటారావము మదిలో
_x000D_
వింటిన్నే కంటఁగంటి విమలపుకాంతి\న్
_x000D_
వెంటాడక బ్రహ్మంబును
_x000D_
గంటిని వగ కాదు నన్నుఁ గనుగొన వేమా. | 1 | kandamu |
2791 | తలపొడవు ధనముఁ బోసిన
వెలయాలికి నిజములేదు వివరింపఁగాఁ
దల దడవి బాసఁజేసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ! | 1 | kandamu |
1239 | పోకిళ్ళు పోక పొందిక
నాకులలోఁ బిందెరీతి నడఁకువగా నెం
తో కలిసిమెలసి యుండిన
లోకములోపలను దా వెలుంగుఁ గుమారీ! | 1 | kandamu |
2950 | కృష్ణ నీతోడను గ్రీడింప మది గోరి పడతి రాధిక నన్ను బంపెనయ్యజోడుగా నినుగూడి జూదమాడుటకు సోలుచు బ్రతిజాము చొక్కునయ్యచందురుకాకకు సఖియ తాళగలేక యస్సురుస్సురు మనుచుండునయ్యమదనుండు శరములు మానక వేయగ మగువ నీపై చింత మానదయ్య | 3 | seesamu |
186 | ఎవ్వరింటికిఁ బోయిన నేమి ఫలము-ఉన్నచో నుండి సిరులఁ బెంపొందు మయ్య
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
2491 | జగతీచక్రము పాదఘట్టనసదృశ్యంబై ప్రవర్తింపఁగా
గగనంబంతయు బాహుమండలసమగ్రవ్యాప్తులం దద్భుతం-
బుగ ఘూర్ణిల్ల నజాంత్యవేళల సముద్భూతాంగహారావళుల్
నిగుడం బొంగి నటింతు తాండవమహానృత్యంబు సర్వేశ్వరా! | 4 | mattebhamu |
920 | అందెలు పాదములందును
సుందరముగ నుంచినావు సొంపలరంగా
మందరధర మునిసన్నుత
నందుని వరపుత్ర నిన్ను నమ్మితిఁ గృష్ణా. | 1 | kandamu |
599 | కరయుగమెత్తి నీకుఁ గుతుకంబున మొక్కునతండు శేషభూ-
వరమకుటాగ్రరత్నసమవాయసమగ్రవిభాసముల్లస-
చ్చరణసరోజుఁడై వివిధసంపదలం గొదలేక యుండుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
200 | జగము లన్నియు నీకు వశ్యము లటంటి-వీవు నిజదాసవశ్యుఁడ వెంత ఘనత?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
3691 | _x000D_
సతికి పతికినైన సంపద సంపదే
_x000D_
పుత్రసంపదలును భువిని మేలు
_x000D_
సరిగముదిసి బ్రతుకు సంపదే సంపద
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1042 | దొరతనంబున కివి గావు వరుస లరయ | సాహసౌదార్యఘనపౌరుషములు గాని,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
2190 | హరిదాసులను నిందలాడకుండినఁ జాలు - సకలగ్రంథంబులు చదివినట్లు
భిక్ష మియ్యంగఁ దప్పింపకుండినఁ జాలుఁ - జేముట్టి దానంబు చేసినట్లు
మించి సజ్జనుల వంచించకుండినఁ జాలు - నింపుగా బహుమానమిచ్చినట్లు
దేవాగ్రహారముల్ దీయకుండినఁ జాలు - గనకకంబపు గుళ్లుగట్టినట్లు | 3 | seesamu |
394 | అతిలోభిన్ రవిసూనుఁడంచుఁ గపటస్వాంతున్ హరిశ్చంద్రభూ-
పతియంచున్ మిగులం గురూపిని నవప్రద్యుమ్నుఁడంచు న్మహా-
పతితున్ ధర్మజుఁడంచు సాధ్వసమతిం బార్థుడటంచు న్బుధుల్
ప్రతివేళన్ వినుతింతు రక్కఱను భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
2305 | స్మరసంహారుఁడు కోరి పొత్తున భుజింపన్ బిల్వ నే రాను, శ్రీ
హరినామంబులు వేయునెన్నవలె నిత్యంబైన నోమన్న నో
యరవిందానన! వేయునేటికిని రామా యన్నఁ జాలన్న మం
త్రరహస్యంబుఁ దలంతు నేను రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
4414 | నట్టి దేబెకు సిరి గల్గెనేని వాఁడు । కవివరుల దూఱు బంధువర్గముల గేరు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
1882 | యతివ సౌందర్య మెన్నుట కలవిగాదు | వనిత వగలెన్న నెవ్వరి వశముగాదుఇంతి ప్రాయము పదియురెండేండ్లు గదర | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
3697 | _x000D_
కన్నుఁగవరీతి సంపద
_x000D_
కొన్నాళ్ళకు వ్రేగుఁజూపి గొబ్బున వ్రాలు\న్
_x000D_
వెన్నెల చీఁకటి సరి యగు
_x000D_
నన్నా శివంగమాయ లన్నియు వేమా. | 1 | kandamu |
4120 | _x000D_
విప్రవరుల మనుచు వేదంబుఁ జదువక
_x000D_
ప్రాకృతులను జూచి పరిహసించు
_x000D_
ధరణిసురులకన్న దాసరిమత మెచ్చు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1583 | ఘనవాలాగ్ని శిఖాళిఁ గాల్చితిని లంకన్ సీత యేమయ్యెనో
యని శంకించి కృశానుచేఁ గమల కాహా! నేఁడు వైదేహనం
దిని సేమంబున నున్న దంచు వినువీథి న్మ్రోయు దేవోక్తులన్
విని మోదంబున భూమిపుత్రి మరలన్ వీక్షింపవే మారుతీ! | 4 | mattebhamu |
1803 | తొలుత ప్రాణేశుని తొడలపై బవళంచి యాసదీరగ ముద్దులాడుకొంచుబ్రాణేశ నిను బాసి ప్రాణముల్ నిలుచునా యని తన కెమ్మోవి యాననిచ్చినలినాక్షి నిను బాయనని బాసలిమ్మని పలుమారు కొసరుచు బడతి విభునిమక్కువతోడను మరుకేళి దేలించి యక్కరతోడ నయ్యలరుబోడి | 3 | seesamu |
4640 | జంగమమారగింపక విషంబును మీకు ననర్హమంచుఁ దా
ముంగల నారగించిన సముద్ధతభక్తియుతుండు సత్ప్రసా
దాంగుఁడు శృంగిబొప్పయకు నగ్గలమైన మహానుభావ నీ
వంగడమేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
3802 | _x000D_
ఆలుబిడ్డ లనుచు నతిమోహమున నున్న
_x000D_
ధనముమీద వాంఛ తగిలియున్న
_x000D_
నట్టివానిముక్తి యవనిలో లేదయా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1223 | పతి పరకాంతలతో సం
గతిఁ జేసిన నాదుపుణ్యగతి యిట్లనుచున్
మతిఁ దలఁపవలయు లేదా
బతిమాలఁగవలయుఁ గలహ పడక కుమారీ! | 1 | kandamu |
1615 | మునిశాపంబున నీప్రభావమహిమంబున్, శక్తియున్ నీవెఱుం
గని బీజంబున శైలసుప్తవిలసత్కంఠీరవేంద్రంబు లా
గున నట్లుంటివి గాక నిక్కము మదిన్ గోపించినన్ సర్వలో
కనికాయంబుల నొక్క పెట్ట నుఱుముం గావింపవే మారుతీ! | 4 | mattebhamu |
1549 | కమనీయోన్నత పుష్పతల్పము పయిం గన్మూసి గుర్వెట్టు పం
క్తిముఖున్ నీలఘనాభదేహు గని తత్తేజంబునన్ రత్న దీ
పములం దద్గృహమెల్ల వెల్గుచునికిన్ భావంబునన్ మెచ్చుచున్
సముదంచద్గతి నచ్చటన్ వెదకవే క్ష్మాపుత్రికన్ మారుతీ! | 4 | mattebhamu |
2032 | రమణీయంబుగ నాదిమంబు నవతారంబు\న్ భవద్దివ్యరూ
పము నామామృతము\న్ దలంప దశకప్రా ప్తయ్యెఁ గృష్ణావతా
రము సుజ్ఞానము మోక్షము\న్ ద్వివిధసంప్రాప్తి\న్ శతాంధ్రాఖ్య కా
వ్యము నర్పించితి మీపదాబ్జములకు\న్ వైకుంఠ నారాయణా! | 4 | mattebhamu |
2819 | పులిపాలు తెచ్చి యిచ్చిన
నలవడఁగ గుండెగోసి యఱచే నిడినన్
దల పొడుగు ధనముఁ బోసిన
వెలయాలికిఁ గూర్మి లేదు వినురా సుమతీ! | 1 | kandamu |
3551 | _x000D_
వెఱవవలెఁ బామునకు నిల
_x000D_
వెఱవఁగవలె మరణమునకు విశ్వములోన\న్
_x000D_
మఱవగవలె సంగమముల
_x000D_
మఱి మఱువగ వలదు మేలు మహిలో వేమా. | 1 | kandamu |
4397 | ఖేదమోదంబుల భేదంబు తెలియక । గోలనై కడిపితిఁ గొన్నినాళ్ళు
పరకామినుల కాసపడి పాపమెఱుఁగక । కొమరుప్రాయంబునఁ గొన్నినాళ్ళు
ఉదరపోషణమున కుర్వీశులను వేడి । కొదవచేఁ గుందుచుఁ గొన్నినాళ్ళు
ఘోరమైనట్టి సంసారసాగర మీఁదు- । కొనుచుఁ బామరముచేఁ గొన్నినాళ్ళు | 3 | seesamu |
4286 | చాఁగు బళా జగత్పతికి జాఁగు బళా జగదేకమాతకున్
చాఁగు బళా రమేశునకుఁ జాఁగు బళా యలమేలుమంగకు\న్
జాఁగు బళా యటంచుఁ గడుఁ జక్కని కాంతను వీథివీథిమీ
రేఁగఁగ నిత్తు రారతు లనేకవిధంబుల వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
3818 | _x000D_
అన్యులకును వచ్చునాపదఁ దనదిగా
_x000D_
నెన్నువాఁడు భువిని నున్నవాఁడు
_x000D_
ఎన్నువారిలోన నిహపరంబులు లెస్స
_x000D_
కన్నవాఁడు మిగుల ఘనుఁడు వేమా. | 0 | aataveladi |
2044 | మందుఁడనని నన్ను నిందఁ జేసిననేమి? - నా దీనతను జూచి నవ్వనేమి?
దూరభావములేక తూలనాడిన నేమి? - ప్రీతిసేయక వంకఁ బెట్టనేమి?
కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి? - తీవ్రకోపముచేతఁ దిట్టనేమి?
హెచ్చుమాటల చేత నెమ్మెలాడిన నేమి? - చేరి దాపట గేలిచేయనేమి? | 3 | seesamu |
3884 | _x000D_
వాతగుణము చేత వలపున మగవాఁడు
_x000D_
లొట్టకనులదాని లోలతకును
_x000D_
పుట్టి జగతి నిలుచు పునరుద్భవంబగు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2427 | ముట్టున దొలఁగుదురేమో
ముట్టుననే తనువుగాఁక మునుఁగుదు రేమో
ముట్టుకు వెలియైతే యొక
చట్టా మఱిదేహ మెల్ల సంపఁగిమన్నా! | 1 | kandamu |
3880 | _x000D_
వెయ్యారుగతుల జలనిధి
_x000D_
తియ్యగ ననిశంబు గలయ దిప్పుట యరుదౌ
_x000D_
కొయ్యకుఁదా సుజ్ఞానము
_x000D_
వెయ్యి విధంబులను జెప్ప వృథరా వేమా. | 1 | kandamu |
1828 | యనుచు దెరచాటి మాటల నతివ నీదు మనసు రంజిల్లగా జేయు మదనతంత్రజాలముల పుట్ట యా దిట్ట సరసిజాక్ష | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
4110 | _x000D_
మెలత నడవినుంచి మృగమువెంటనె పోయె
_x000D_
రామచంద్రుకన్న రసికుఁడేడి
_x000D_
చేటుకాలమునకు చెడుబుద్ధి పుట్టును
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
830 | అక్రూరవరద మాధవ
చక్రాయుధ ఖడ్గపాణి శౌరి ముకుందా
శక్రాది దివిజసన్నుత
శుక్రార్చిత నన్నుఁ గరుణ జూడుము కృష్ణా. | 1 | kandamu |
3813 | _x000D_
ఒరులకొఱకు భూమి నొరసెటివారును
_x000D_
అవనిపతికి వశ్యులయినవారు
_x000D_
పాలవంటివారు పన్ను పెట్టెడువారు
_x000D_
వాకెఱుంగరు శాఖవారు వేమా. | 0 | aataveladi |
1192 | ఎటువంటి వరకులంబునఁ
బటుతరముగఁ బుట్టెనేని పరఁగఁగ మును గ
న్నటువంటి కర్మఫలములఁ
గటగట! భోగింపవలయుఁ గాదె? కుమారా! | 1 | kandamu |
3929 | _x000D_
తనువునందు నగ్ని దఱికొని కాల్పంగ
_x000D_
కాల్చుకొనుట యేమి కర్మమునకు
_x000D_
కాల్చుకొన్న యంత ఘనుఁడు తానాయెనా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3410 | _x000D_
భూమిలోనఁ బుట్టు భూభార మెల్లను
_x000D_
తనువులోనఁ బుట్టు దత్వమెల్ల
_x000D_
శ్రమములోనఁ బుట్టు సర్వంబుఁ దానౌను
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3718 | _x000D_
ద్వార బంధమునను తనయులు సంపద
_x000D_
బంధువర్గ మెల్ల ప్రహరిగోడ
_x000D_
మూఢులైన నరులు మొక్కలి కాండ్రయా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2304 | పురసంహారుని చాపమున్ జివుకువంబున్ ద్రుంచి పోఁజూచినన్
బరశూదగ్రభుజుండు పోవిడుచునే భంజించుఁగాకంచు ని
ష్ఠురముల్ పల్కిన భార్గవున్ భుజబలాటోపంబు వారించి ని
ర్భరశాంతంబునఁ గాచితౌర రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
4328 | దర్పక రాజ్యసంపదలు తన్మయకోటులు రాగిలోకసం
తర్పణముల్ లతాధరసుధాపరిధానము లాననవ్రతుల్
కర్పురగంధసౌఖ్యములు గ్రక్కున శ్రీయలమేలుమంగకు\న్
మార్పడు దేహసంగతుల మర్మిపుఁజేతలు వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
1717 | “ధన మొనగూర్చు సద్గుణవితాన మొనర్చు ధరిత్రిలోపలన్
ఘనత ఘటించు రాజగురుకార్యసమున్నతిఁ జేయుఁ గీర్తికాం-
తను గొనితెచ్చు ముక్తిపథతత్త్వములెల్ల నెఱుంగఁజేయు స-
జ్జనసహవాస” మంచు నుడి సల్పెడు తల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
2481 | భవదున్మేషవిజృంభణంబు పరికింపంగా సరోజాతసం-
భవు జన్మంబు భవన్నిమేష మమితబ్రహ్మాండకల్పాంత భై-
రవసంక్షోభిత మన్నఁ దక్కిన భవత్ప్రారంభభూరిక్రియా-
నివహం బెవ్వరు నేర్తు రిట్టిదని వర్ణింపంగ సర్వేశ్వరా! | 4 | mattebhamu |
3272 | _x000D_
వేయుపద్యముల వివేకియై భక్తితోఁ
_x000D_
బఠనఁ జేసినట్టి భక్తులకును
_x000D_
బాయకుండు మోక్షపద మరచేతిదై
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
964 | ధరణిఁ బరమనికృష్టుని దండనున్న | ధనము వృథయగు నేరికిఁ బనికిరాక,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
3382 | _x000D_
కొంపలోన నున్న కోర్కెలు ఛేదించి
_x000D_
పరగ హృదయ మట్టె పదిలపఱచి
_x000D_
గృహము నిల్పువాఁడు బహుతత్త్వవేదిరా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4172 | _x000D_
కూడ దేమిచేసె గులమేమి చేసెను
_x000D_
భూమి యేమిచేసె బొందికట్టె
_x000D_
నరుఁడు పడెడుపాట్లు నగుబాట్లు చూడరా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.