id stringlengths 1 4 | poem stringlengths 71 312 | label int64 0 7 | label_name stringclasses 8
values |
|---|---|---|---|
2846 | నినుఁ దొలునాఁటికూటమిని నేరుపుఁతో జెలులెల్ల మెల్లమె-
ల్లనె పడకింటిలోని కొకలాగునఁ దెచ్చిననాఁటి సిగ్గుతో
నెనసిన యోరచూపులిఁక నేమననాఁటను గల్వదండలో
యన వెలుఁగొందె నేఁటి కెదనంటిన ముల్కులు సుందరీమణీ! | 5 | champakamaala |
4473 | వేదశాస్త్రములు విన సొంపు లేదాయె । సంగీతవిద్య బల్ చౌకనాయె
కవితారసజ్ఞత కలలోను లేదాయె । బారమార్థికబుద్ధి భస్మమాయె
భూతలేంద్రులకు దుర్బుద్ధులు మెండాయె । నీచమహత్త్వంబు నెగడిపోయె
వర్ణాశ్రమాచారవర్ణన లేదాయె । హీనకులంబులు హెచ్చులాయె | 3 | seesamu |
1033 | మరుమరీచికలు తామరసపత్రాంతర- | సలిలబిందువులు చంచలలు హస్తి-
కర్ణాంతములు దీపకళికాశిఖలు బుద్బు- | దములు మంగలి చేతిదర్పణములు
మిణుఁగురుఁ బురువుల మెఱపు లభ్రచ్ఛాయ- | లైంద్రజాలికు నాట లంబురాశి-
వీచులు చలదళవృక్షపలాశముల్ | తృణహుతాశనముల తెఱఁగు లిట్టి | 3 | seesamu |
3313 | _x000D_
అగ్ని శిఖలయందు నమరంగ మమకార
_x000D_
మభవుమీఁద ధ్యాన మమర నునిచి
_x000D_
యాహుతి యగువెనుక హరున కర్పితమౌను
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1953 | వరనాభీధవళాంబుజోదరమున\న్ వాణీశుఁ గల్పించి య
ప్పురుషశ్రేష్ఠుని ఫాలమందు శివునిం బుట్టించి యామేటికిం
బరమోత్తంసముగా వియత్తలనదిం బాదంబులం గన్న మీ
సరి యెవ్వారలు మీరు దక్కఁగ రమాసాధ్వీశ, నారాయణా! | 4 | mattebhamu |
3017 | చెడ్డవాఁడవు నీచెంతఁ జేరరాదు | స్త్రీల నీలాగు సేయుట మేలుగాదుతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. | 2 | teytageethi |
3694 | _x000D_
కడక నఖిలమునకు నడినాళమం దున్న
_x000D_
వేఁగుచుక్కవంటి వెలుఁగు దిక్కు
_x000D_
వెలుఁగుకన్న దిక్కు వేఱెవ్వ రున్నారు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1701 | చెలువము మీఱుచున్న తన చిన్నికుమారునిఁ జూచి మంత్రవా-
దులు కలుషం బొనర్తురని తోడనె పెద్దల నాశ్రయించి ని-
ర్మలుఁ డగునట్లు చేయ హరిమంత్రములన్ బఠియింపఁ బూన్చి వా-
రల కుపయుక్తిఁ జేయ నలరారెడు తల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
556 | హరి నరసింహరూపధరుఁడై సమరాగ్రమహోగ్రభంగి న-
బ్బురమొదవన్ హిరణ్యకశిపు న్బరిమార్చి చెలంగుచున్నచో
సరగఁ దదుగ్రతం శరభసాళువదేహుఁడవై యడంపవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
24 | వివిధ పూజోత్సవములు నిర్విఘ్నములుగఁ-జేసికొనకున్న నీకుఁ బ్రసిద్ధి గలదె
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
1081 | నదులలో జాహ్నవి నరులలో విప్రుండు | గ్రహములలోనఁ బంకజహితుండు
తృణములలో దర్భ మృగముల సింగంబు | వ్రతముల ద్వాదశి లతల జాజి
దానమ్ములం దన్నదానమ్ము లోహజా- | తమ్ములలోనఁ గార్తస్వరంబు
గిరులలో మేరువు పురములలో కాశి | తరువుల రావి సంతతులఁ గృతియు | 3 | seesamu |
4506 | యర్కుఁ డుదయింపఁ జెడునె గుహాతిమిరము । తాళ మెత్తుకపోవ మందసములోని
విత్త మలవడకుండునే వెచ్చమునకు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
2069 | తోయజాతాక్ష! నీ పాదతులసిదళము - రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
3521 | _x000D_
ఆలివంకవార లాత్మబంధువు లైరి
_x000D_
తల్లివంకవారు తగినపాటి
_x000D_
తండ్రివంకవారు దాయాది తగవులౌ
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2502 | కని సద్భక్తుల కంత నంతఁ గడువేడ్కన్ హృత్ప్రణామంబు సే-
సినమాత్రం జెడు సర్వదోషములు తచ్ఛ్రీపాదము ల్ముట్టి మ్రొ-
క్కిన సర్వాంగసమగ్రశుద్ధియగు భక్తిన్ వారికిం బ్రీతిచే-
సినఁ ద్వద్దివ్యదయావలోకనఘనశ్రీ లొందు సర్వేశ్వరా! | 4 | mattebhamu |
1675 | వినవినఁ బాలు గాఱు నెఱవేడుక మీఱఁగ ముద్దుముద్దుగాఁ
దనయుఁడు పల్కుచున్న విని తాఁ గనకం బొడిఁ గట్టినట్లు నె-
మ్మనమున సంతసిల్లుచును మాటికిమాటికి దృష్టి దీయుచోఁ
జను గుడిపించి మై నివురు చక్కని తల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
1341 | సమబంధమొనరించు సమయమందున కర- । మ్ములు మధ్యమునకు లంకెలు దనర్చి
గుదికాళ్లు పిరుదుల నదిమి వాతెరల నొం- । డొండ పల్మొనలతొ నొరయుకొనుచు
రెక్కలన్ గూర్చి కన్‍రెప్పలల్లార్పుచు । కడుపక్కళించి వెన్కలకు దిరిగి
తను చివుక్కునను పైకొను వితంబిది గాదు । డింకిసేయుదము లెండి యని లేచి | 3 | seesamu |
3506 | _x000D_
ఓజమాలుపొలతి యోలిమాడలు చేటు
_x000D_
పోటికెడలుబంటు కూటి చేటు
_x000D_
పనికిమాలినతొత్తు బత్తెంబు చేటురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4275 | ఎక్కడి కేఁగి వచ్చితి రమేశ్వర నీతనుదివ్యగంధ మే
చక్కనియింతిమేని దని సారెకు నీయలమేలుమంగ నీ
చెక్కు గళంబు గోళ్లవడిఁ జేర్చుచు నీయలపార్చి వేఁడుటల్
మక్కువగల్గుకాంతలకు మర్మరహస్యము వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
313 | సరసప్రస్తుత కూచిమంచికులభాస్వద్వార్ధిరాకాసుధా-
కరుఁడన్ గంగనమంత్రినందనుఁడ! రంగత్తిమ్మభూమండలే-
శ్వరపర్యార్పిత “బేబదల్” బిరుదవిస్ఫాయజ్జగన్నాథనా
మ రసజ్ఞుండను బ్రోవు మెప్డు నను రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
1124 | ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నిందసేయఁ బోకుము కార్యా
లోచనము లొంటిజేయకు
మాచారము విడువఁబోకుమయ్య! కుమారా! | 1 | kandamu |
3495 | _x000D_
కొంకణంబు పోఁవగుక్క సింహము గాదు
_x000D_
కాశిబోవఁబంది గజము గాదు
_x000D_
వేఱె జాతివాఁడు విప్రుఁడు గాఁడయా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
305 | అకటా! తావక కావ్యభవ్యరచనావ్యాపారలీలావిలో-
లకసత్స్వాంతుఁడనైన నా పయిని నీ లక్ష్మీకటాక్షామృతం
బొకవేళం జనుదేర దేమి? దయలేదో యోగిహృత్పద్మస-
న్మకరందాసవపానకృద్భ్రమర! రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
3993 | _x000D_
లోక మరసినట్టి లోకోపకారులు
_x000D_
భోగభాగ్యములను బొంది తుదను
_x000D_
పూర్వవాసన విడిపురహరు తావున
_x000D_
మ్రోగుచుంద్రు తారు మొనసి వేమ. | 0 | aataveladi |
1841 | కెమ్మోవి రుచి చాల బ్రమ్మి ముంగర ముత్తియమ్ము చొక్కంపు కెంపనగ దోచుగనుసోగకాంతుల నెనయ బావిలి పచ్చపండు నీలపు జాయనుండి దనరుపసిమిచెక్కుల కాంతి నెసగు గమ్మల వజ్రకణములు గోమేధికంబులయ్యెతరుణిగుబ్బల రంగునొరసి పైటచెరంగు బంగారుచాయల బర్వి మెరయ | 3 | seesamu |
1535 | శరదశ్రేణుల దూరుచున్ వెడలుచుం జాబిల్లి చందానఁ బు
ష్కర మార్గంబున నేగు నిన్నుఁ గని నీ చాతుర్యమున్ మెచ్చి ని
ర్జరు లానంద మెలర్పఁ జల్లిన మరుత్సంతానపుష్పంబుల
ట్లరుదారన్ గననయ్యెఁ జుట్టును సముద్యత్తారకల్ మారుతీ! | 4 | mattebhamu |
1346 | వింతగొరువంకపోరుల గొంతసేపు । గునుపుతో ప్రక్కమార్పుల కొంతసేపు
క్రీడ సల్పిననాటి నీ రీతినెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
1666 | భావ మెలర్ప మూలికల భావన చేసినయట్టి బంగరుం
దీవెల నూకచిట్టుడుకు దీసి మరీచిఘృతోచితంబుగాఁ
ద్రావఁగఁ జేసి వేఁడి జలధారల మేను గడింగి నిద్దురం
బోవఁగ జోలఁ బాడుచును బొంగెడు తల్లినిఁ బోలరెవ్వరున్. | 6 | vutpalamaala |
2559 | ప్రారంభించి చకోరపోతము మహీయజ్యోత్స్నయం దుత్సవ-
శ్రీ రంజిల్లుచు వేడ్కనుండు గతి నా చిత్తంబు నీ దివ్యశృం-
గారధ్యానమునం దహర్నిశముఁ జొక్కంజేయవే దేవ శ్రీ-
గౌరీలోచననర్తకీనటనరంగస్థాన సర్వేశ్వరా! | 7 | saardulamu |
1058 | నిఖిలలోకైకభర్తకు నీకు నొక్క | బిల్వదళ మార్యవర్యు లర్పించుచుంద్రు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
2033 | నీమూర్తుల్ గన నీకథల్ వినఁ దుది\న్ నీ పాద నిర్మాల్యని
ష్ఠామోదంబు నెఱుంగ, నీచరణాతోయం బాడ, నైవేద్యముల్
నీమం బొప్ప భజింప నీజపము వర్ణింప\న్ గృపం జేయవే
శ్రీ మించ\న్ బహుజన్మ జన్మములకు\న్ శ్రీయాదినారాయణా! | 7 | saardulamu |
4083 | _x000D_
ఓగుబాగెఱుఁగని యుత్తమూఢజనంబు
_x000D_
లిలను ధీ జనముల నెంచుటెల్ల
_x000D_
కరినిజూచి కుక్క మొఱిగిన సామ్యమౌ
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1658 | తన పొరుగిండ్ల భామినులు తారసిలంగను దృష్టి తాఁకునో
యని మిహిరాదిక గ్రహచయాభిమతు ల్పచరించి మీనలో-
చనను దలంచి నందనుని సంగతిఁ బాయక ప్రోవవమ్మ యో
జనని యటంచు నంజలులు సల్పెడు తల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
489 | బల్లిదుఁడైన సత్ప్రభువు పాయక యుండినఁగాని రచ్చలోఁ
జిల్లరవారు నూఱుగురు సేరినఁ దేజము గల్గదెయ్యెడన్
జల్లని చందురుండెడసి సన్నపుఁ జుక్కలు కోటియున్న
జిల్లునె వెన్నెలల్ జగము జీఁకటులన్నియుఁ బాయ భాస్కరా! | 6 | vutpalamaala |
4055 | _x000D_
కడుపులోనిరోఁత కడు నోటియెంగిలి
_x000D_
కడుగ వశమె బ్రహ్మకొడుకుకైన
_x000D_
సత్యమున్న కొంత జగతిపై సిద్ధించు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
213 | శ్రీసాకేతపురీవరంబున సునాసీరోపలస్థాపిత-
ప్రాసాదాంతర చంద్రకాంతమణియుక్పర్యంకభాగంబునన్
శ్రీసీతాసతిఁ గూడ వేడ్కలలరం గ్రీడించు మిమ్మెప్పుడున్
మా సన్మానసవీథిఁ గొల్చెదము రామా! భక్తమందారమా! | 7 | saardulamu |
2034 | శ్రీ మనోహర! సురార్చిత సింధుగంభీర! - భక్తవత్సల! కోటిభానుతేజ!
కంజనేత్ర! హిరణ్యకశ్యపాంతక! శూర! - సాధురక్షణ! శంఖచక్ర హస్త!
ప్రహ్లాద వరద! పాపధ్వంస! సర్వేశ! - క్షీరసాగరశయన! కృష్ణవర్ణ!
పక్షివాహన! నీలభ్రమరకుంతలజాల! - పల్లవారుణపాదపద్మయుగళ | 3 | seesamu |
66 | గొప్పలో గొప్పవాఁడవు కొలదిలోనఁ-గొలదివాఁడవు ని న్నెట్లు గొలువ వచ్చు?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
3653 | _x000D_
కన్నపుత్రునాశ కనకంబుమీఁ దాస
_x000D_
స్త్రీలమీఁద నాశ చిత్తమెడలి
_x000D_
బ్రమలు విడువకున్న బ్రహ్మంబుఁ గానరొ
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2311 | కలకాలంబు వ్రతంబులుం దపములుం గావించి యన్యు ల్తుదిన్
గలకాలంబును బోలె నిర్జరపురీకాంతాకుచాలింగనం
బులఁ గొన్నాళ్లు సుఖించి క్రమ్మఱ నిలం బుట్టంగ నే మెచ్చ ని
ర్మలముక్తిన్ నినుఁ గొల్చి కాంతు రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
1678 | తనయుని కొంటెచేఁతలకుఁ దండ్రి యహో బెదరించుచున్న లే-
దనుచు నిజాత్మనాయకుని యాజ్ఞ దొలంగఁగ రాదటన్న వా-
గ్ధన మటు డించి నందనుని దండనపా ల్పడనీక యడ్డముం
జని కరుణింపఁజేయు నెఱజాణను దల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
3841 | _x000D_
విద్దెదానిపొందు విడువఁ జాలక తుల్వ
_x000D_
చచ్చుదాఁకమోయు చాపగుడిసె
_x000D_
భాగవతులపట్టు పట్టంగ నోపఁడు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1898 | చందురుడు వేగ మిన్నంది చెలియ నేఁచ | దలచినంతనె విరహంబు తాళ వశమెగాన రావయ్య నీవిక కరుణగల్గి | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
3699 | _x000D_
తుమ్మచెట్ల ముండ్లు తోడనెపుట్టును
_x000D_
విత్తులోననుండి వెడలినట్లు
_x000D_
మూర్ఖునకును బుద్ధి ముందుగాఁ బుట్టును
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3056 | కమలాక్ష నీతోడ రమియించుటకు వేగ ముదిత రమ్మనినీకు మ్రొక్కెనన్నవెలది నీ భ్రాంతిపై విస్తరించిన యింత విరహాగ్నిజ్వాలల విసికెనన్నమంచముపై బవళించి నిద్రింపక సుదతి నీ రాకను జూచునన్నతడవాయె నెడఁబాసి నేగుచున్నానని పనిబూని నన్నిటు బంపెనన్న | 3 | seesamu |
2774 | కూరిమిగల దినములలో
నేరము లెన్నఁడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ! | 1 | kandamu |
2283 | నీ మంత్రంబు జపించు మానవులకున్ నిశ్శ్రేయ మౌ నర్థముల్
హేమంబు ల్గొడుగుల్ తురంగములు మత్తేభంబు లాందోళికల్
గ్రామంబుల్ నగరంబులున్ విభవముల్ రాజ్యంబులున్ రత్నముల్
రామారత్నము లేమిలెక్క రఘువీరా! జానకీనాయకా! | 7 | saardulamu |
4399 | గజముపై చౌడోలు గాడిదకెత్తితే । మోయునా పడవేసి కూయుఁ గాక
చిలుక పంజరములోపల గూబ నుంచితే । పలుకునా భయపడి యులుకుఁ గాక
కుక్క నందలములోఁ గూర్చుండఁబెట్టితే । కూర్చుండునా తోళ్ళు కొఱుకుఁ గాక
ధర్మకార్యములలో దరిబేసి నుంచితే । యిచ్చునా తన్నుక చచ్చుఁ గాక | 3 | seesamu |
2073 | మరణమే నిశ్చయము బుద్ధిమంతుఁడైన - దేహమున్నంతలో మిమ్ముఁదెలియవలయు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
2447 | ఇద్దఱు నొకటైనను గడ
మిద్దఱుఁ దా మేకమగుచు నేకాంతముగా
నిద్దఱు నిద్దఱు నొకటై
సద్దేమియు సేయ రన్న! సంపఁగిమన్నా! | 1 | kandamu |
588 | హరహర! మేరుభూధరమునంత పదార్థము సంగ్రహించిన-
న్సురనగరాభిపత్యము త్రిశుద్ధిగ నబ్బిన రంభయంత సుం-
దరి నిజభార్యయైన మది దార్కొను తృష్ణ యడంగదేరికిన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
3187 | _x000D_
పురుషుఁడెన్నిగతులఁబుట్టువు మొదలుగఁ
_x000D_
బాపచింతఁజేయు జాపలమున
_x000D_
మహిని కుంటినక్క మాంసముదిన్నట్లు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4638 | చెన్నగు ప్రాణ లింగరతిచేగ ప్రసాదము పుట్టినిల్లు న
త్యున్నత భక్తిసీమ శివయోగ సమగ్రత కల్మియైన మా
యన్నకు నాది చెన్నబసవన్నకు సద్గురుఁడైన నిన్ను శ
శ్వన్నుతులన్ భజింతు బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
3893 | _x000D_
అఱుతలింగ ముంచి యదిగనఁజాలక
_x000D_
పర్వతమున కేగు పామరుండు
_x000D_
ముక్తిఁగాన నగునె మూఢాత్ముఁడగుఁగాక
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1930 | కడకుం బాయక వేయినోళ్ళు గల యా కాకోదరాధీశుఁడున్
గడముట్ట న్వినుతింప లేక నిగుడ\న్ గ్రాలంగ నొప్పారు మి
మ్మడర\న్ సన్నుతి సేయ నాదువశమే! యజ్ఞాని, లోభాత్ముఁడ\న్
జడుఁడ, న్నజ్ఞుఁడ, నైకజిహ్వుఁడ, జనస్తబ్ధుండ, నారాయణా! | 4 | mattebhamu |
528 | శరనిధి కర్ఘ్యమిచ్చు క్రియ సారసబంధున కారతిచ్చు వై-
ఖరి నిఖిలాబ్జజాండచయకర్తకు నీకు సమగ్రభక్తి శ్రీ-
కరముగఁ గోరి యొక్కశతకంబు సమర్పణ సేయఁబూనితిన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
4641 | కొఱటను లేఁత పత్తిరియ గొడ్డునఁ బాలును రేయి జంగమం
బఱిముఱివేఁడినన్ బడసి యా క్షణమాత్రన యిచ్చినట్టి యా
మొఱటదవంక దేవునకు ముద్దుతనూజుఁడవైన నిన్ను నే
వఱలఁగఁ బ్రస్తుతింతు బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 5 | champakamaala |
477 | పరహితమైన కార్య మతిభారము తోడిదియైనఁ బూను స
త్పురుషుఁడు లోకముల్పొగడఁ బూర్వమునందొక ఱాలవర్షమున్
గురియఁగ జొచ్చినన్ గదిసి గొబ్బున గోజనరక్షణార్థమై
గిరినొక కేల నెత్తెనట కృష్ణుఁడు ఛత్రము భాతి భాస్కరా! | 5 | champakamaala |
3377 | _x000D_
తాను నేననియెడు తత్వభేదంబును
_x000D_
మాని కడువివేక మహిమఁ దనరి
_x000D_
యూరకున్నవాఁడు నుత్తమోత్తముఁడురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3239 | _x000D_
మంటికుండవంటి మాయాశరీరంబు
_x000D_
చచ్చు నెన్నడయినఁ జావఁ డాత్మ
_x000D_
ఘటము లెన్నియైన గగనంబదేకమే
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1293 | శ్రమ యెంత సంభవించిన
క్షమ మఱువఁగ రాదు ధరణి చందంబున స
త్యమునఁ బ్రవర్తించిన యా
రమణియె లోకంబునందు రమణి కుమారీ! | 1 | kandamu |
2076 | ఇభరాజవరద! నిన్నెంతఁ బిల్చినఁగాని - మాఱు పల్కవదేమి మౌనితనమొ?
మునిజనార్చిత! నిన్నుమ్రొక్కి వేఁడినఁగాని - కనులఁ బడవదేమి గడుసుఁదనమొ?
చాల దైన్యమునొంది చాటు జొచ్చినఁగాని - భాగ్య మియ్యవదేమి ప్రౌఢతనమొ?
స్థిరముగా నీ పాదసేవఁ జేసెద నన్న - దొరకఁ జాలవదేమి ధూర్తతనమొ? | 3 | seesamu |
4342 | ఇట్టి నిన్ను సన్నుతింప నేనెంతవాఁడ । గించనుఁడ నన్ను బ్రోవుని కింకరునిగ
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
3848 | _x000D_
మతము లెన్నియైన సతముగా నుండవు
_x000D_
సతము కర్మముండు జగతి నొకటి
_x000D_
ఆమతముల విడిచి యా బ్రహ్మమరయుము
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3015 | రమ్యమైనట్టి ముల్లోకరక్షకుఁడగు | సుదతి దశరథరాజుకు సుతువుగాడెతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. | 2 | teytageethi |
2703 | నీపై గావ్యము చెప్పుచున్నయతఁడు న్నీపద్యముల్ వ్రాసియి
మ్మా పాఠంబొనరింతు నన్నయతఁడున్ మంజుప్రబంధంబు ని
ష్టాపూర్తింబఠియించుచున్న యతఁడున్ సద్బాంధవుల్‌గాక చీ
చీ పృశ్ఠాగత బాంధవంబు నిజమా శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
3793 | _x000D_
నోరెఱిఁగి తాము నేమియు
_x000D_
నేరజంతువులఁ జంపి నెమ్మదిఁ దినునా
_x000D_
క్రూరపు సంకర జాతుల
_x000D_
మారణ మేమందు నింక మహిలో వేమా. | 1 | kandamu |
3291 | _x000D_
ఏక బ్రహ్మము నిత్యము
_x000D_
వైకల్పితమైనయట్టి వస్తువులెల్ల\న్
_x000D_
నేకత్వంబని యెఱిగిన
_x000D_
శోకము లేనట్టిముక్తి సులభము వేమా. | 1 | kandamu |
3565 | _x000D_
తనదుభ్రాత లెల్ల దానంబు సేయంగ
_x000D_
తనకు ఫలమటంచుఁ దలఁచరాదు
_x000D_
తనదుకాలు కోయఁ దన తమ్ముఁడేడ్చునా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1931 | నే నీదాసుఁడ నీవు నాపతివి నిన్నే కాని యొండెవ్వరి\న్
ధ్యానింపం బ్రణుతింప నట్లగుటకు న్నా నేర్చు చందంబున\న్
నీ నామస్తుతు లాచరించు నెడల న్నే తప్పులుం గల్గిన\న్
వానిన్ లోఁగొనుమయ్య, తండ్రి, విహితవ్యాపార, నారాయణా! | 7 | saardulamu |
632 | తరణికులేశ నానుడులఁ దప్పులు గల్గిన నీదునామ స
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
బరుగుచువంకయైన మలినాకృతిఁబాఱినఁ దన్మహత్త్వముం
దరమె గణింపనెవ్వరికి దాశరథీ! కరుణాపయోనిధీ! | 5 | champakamaala |
12 | రమ్ము దర్శన మిమ్ము ఘోరములఁ జిమ్ము-మభయ మిమ్ము భవత్తత్త్వ మానతిమ్ము
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
1538 | అనఘా! భాస్కరుఁడొక్క మాఱుదయశైలాగ్రంబునందుండి య
స్తనగాగ్రంబున కేగునంతకు సముద్యచ్ఛక్తి వేమాఱు బె
ల్చన నక్కొండల రెండునుం దిరుగు తేజశ్శాలికిన్ నీకు చ
య్యన నూఱామడ దాటుటేమి విషయం బస్తోకమే మారుతీ! | 4 | mattebhamu |
655 | ఖరకరవంశజా విను మఖండిత భూతపిశాచ ఢాకినీ
జ్వరపరితాప సర్వభయవారకమైన భవత్పదాబ్జవి
స్ఫురదురువజ్రపంజరముఁ జొచ్చితి నీయెడ దీనమానవో
ద్ధరబిరుదాంక యేమఱకు దాశరథీ! కరుణాపయోనిధీ! | 5 | champakamaala |
1926 | యబ్జనేత్రుని బదముల కర్పణంబు | చేసి విఖ్యాతి మైనుండ జెలగి నాదువాంఛలెల్లను సమకూర్చి వరములొసగు | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
2081 | బంకజాతాక్ష! నే నతిపాతకుఁడను - దప్పులన్నియు క్షమియింపఁ దండ్రి వీవె!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
4081 | _x000D_
రోగియైనవాఁడు రోగి నెఱుంగును
_x000D_
రోగి నరసిచూచి రూఢిగాను
_x000D_
రోగి కిడినవానిరాగి బంగా రౌను
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4536 | ఘనము నీచం బెఱుంగక కలియుగమున । నవని నడుతురు మూఢులైనట్టి దొరలు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
1354 | ననుచు నేనుందు నేటికి యబ్బె సందు । కనికరము జెందు మనసుకీ కపటమెందు
కొరకు నీ పొందులేనిదే కొదువ యెందు । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
107 | ఒక గుణంబున నీవె సకల ప్రపంచంబుఁ- గల్పించితి వభూతకల్పనముగ
వేఱొకగుణముచే విశ్వవిశ్వప్రాణ- రక్షణం బొనరింతు వక్షయముగ
మఱి యొండు గుణముచే మండలంబులు గూడఁ- జెఱపివేయుదువు నిశ్శేషముగను
నిర్గుణంబున నీవె నిరవకాశంబుగాఁ- బట్టక యుందువు బయలు మెఱసి | 3 | seesamu |
798 | నానావేదపురాణశాస్త్రముల నానందింపఁగా నిత్య మిం
పౌనార్యు ల్వినుతింప ధార్మికరహస్యంబు ల్విన న్వచ్చునౌ
మీ నామాంకభవద్వివేకులకు మున్నాశ్చర్యమే సత్వరా
జ్ఞానాధిక్యము గానిముక్తిఁ గని కృష్ణా దేవకీనందనా. | 7 | saardulamu |
3059 | నెపుడు కనులార గనుగొందు నెపుడు వాని | జెలిమితో నాదు కౌగిటఁ జేర్చుకొందుతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. | 2 | teytageethi |
452 | ఘనుఁడగు నట్టివాఁడు నిజకార్య సముద్ధరణార్థమై మహిం
బనివడి యల్పమానవునిఁ బ్రార్థనఁ జేయుట తప్పుగాదుగా;
యనఘతఁ గృష్ణజన్మమున నా వసుదేవుఁడు మీఁద టెత్తుగాఁ
గనుఁగొని గాలిగాని కడ కాళ్ళకు మ్రొక్కఁడె నాఁడు భాస్కరా! | 5 | champakamaala |
3089 | ఆడు వారిఁ గన్న నర్థంబు పొడఁ గన్న
సారమైన రుచుల చవులు గన్న;
నయ్యగాండ్ర కైన నాశలు బుట్టవా?
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4189 | _x000D_
జాతివేఱు లేక జన్మక్రమంబున
_x000D_
నెమ్మదిని నభవుని నిల్పెనేని
_x000D_
అఖిలజనులకెల్ల నాతఁడె ఘనయోగి
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1996 | పరమజ్ఞాన వివేక పూరిత మహా భవ్యాంతరాళంబున\న్
పరగ న్నీ నిజనామమంత్ర మొనరన్ భక్తి న్ననుష్ఠింపుచుం
దురితాన్వేషణ కాలభూతము వెసన్ దూలంగ వాకట్టు వాఁ
డరుగున్ భవ్యపదంబు నొందుటకు నై యవ్యక్త నారాయణా! | 4 | mattebhamu |
965 | వేదశాస్త్రపురాణవిద్య లక్కఱగావు | పరిహాసవిద్యలు పనికివచ్చు
గద్యపద్యవిచిత్రకవితలు కొఱగావు | గొల్లసుద్దుల కతల్ పెల్లుమీఱు
దేవతాభాషల తీరు లేమియుఁ గావు | పారసీకోక్తులు ప్రణుతి కెక్కు
శైవవైష్ణవమతాచారంబు లొప్పవు | పాషండమతములు బాళి నలరు | 3 | seesamu |
3472 | _x000D_
అచరచరసమూహ మంగము లింగము
_x000D_
సరణి దెలియనట్టి శైవమేల
_x000D_
అష్టతనువు లమర హరుఁడౌట నెఱుఁగరో
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1019 | కాకిమూఁకలలోనఁ గోకిలం బున్నట్లు | కొంగలలో నంచ కూడినట్లు
సైరిభబులలోన సామజంబున్నట్లు | నక్కలలో జింక చిక్కినట్లు
ధుత్తూరములలోనఁ దులసిచెట్టున్నట్లు | ఱేఁచులలోఁ బులి రేఁచినట్లు
గ్రద్దలలో విహంగప్రభుఁడున్నట్లు | ఖరములలో వాజి దొరలినట్లు | 3 | seesamu |
1638 | సేతువులో మునుంగు నతిశేముషి దీనుల నన్నదానసం-
ప్రీతులఁ జేయు దేవతలఁ బేర్కొను నైదువరాండ్ర కెల్లన-
య్యే తనివారు వాయనములిచ్చుఁ బురాణము లాలకించుఁ దా-
నేతఱి నోమునోఁచుఁ దనయేచ్ఛను దల్లినిఁ బోలరెవ్వరున్. | 6 | vutpalamaala |
2368 | మాయాయోగతపంబుల
నాయాసముతోడఁ జేయ నబ్బును దత్త్వం
బాయెన్ని కేలపెట్టన్
జాయలనా సుప్రసన్న! సంపఁగిమన్నా! | 1 | kandamu |
2990 | చల్లగ వర్ధిల్లు సరససద్గుణమణి సౌభాగ్యమే నీకు సత్యభామయారోగ్యమే నీకు నతివ చక్కనిలేమ దీర్ఘాయువే నీకు తెరవ సుమతిమంగళమే నీకు మహనీయగుణవతి సాఫల్యమే నీకు సరసిజాక్షిశ్రీరస్తు నీకును శీతాంశుముఖమణి కల్యాణమే నీకు కంబుకంఠి | 3 | seesamu |
2507 | సికతాధామము నీకుఁ జేసి మదిలోఁ జెన్నొంది క్రీడించు బా-
లకు లింద్రాధికులన్న నీ గుడు లతిశ్లాఘ్యేష్టకాష్ఠాదులన్
సుకుమారంబుగ నెత్తి భూతలములో శోభిల్లు వంశప్రదీ-
పకు సౌభాగ్యము మాన మెవ్వరికిఁ జెప్పన్వచ్చు సర్వేశ్వరా! | 4 | mattebhamu |
3879 | _x000D_
కుక్క యేమెఱుంగు గురులింగ దేవుని
_x000D_
నక్క యేమెఱుంగు నొక్కప్రొద్దు
_x000D_
మూర్ఖుఁడే మెఱుంగు మోక్షంబుత్రోవను
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
760 | బక దైతేయమహాబలు\న్ సమరభూభాగంబున\న్ వాయుపు
త్రకుఁ డీల్గించిన నేకచక్రపురివారల్ మెచ్చి యింటింట వం
టకము ల్బెట్టిరిగాని భిక్షయనుమాట\న్ మాన్పలేరైరి యం
తకు వారల్ గొఱఁతేమి చాలుటకుఁ గృష్ణా దేవకీనందనా. | 4 | mattebhamu |
522 | హీనకులంబునందు జనియించినవారికి సద్గుణంబు లె
న్నేనియుఁ గల్గియున్న నొక నేరము చెందకపోదు; పద్మముల్
భూనుతిఁ గాంచియు\న్ బురదఁ బుట్టుట వల్ల సుధాకరోదయం
బైన నసహ్య మొందవె ప్రియంబునఁ జూడఁగ లేక భాస్కరా! | 6 | vutpalamaala |
2350 | వినుమా యాశ్రితు నిల్పువాఁడ ననుమా వేయేల నీ భక్తునిం
గనుమా యాశ్రితరక్షణంబు ఘనమా కారుణ్యవారాశి య
య్యు నతార్తావనుఁడైన నీకు జగతీవ్యోమస్ఫురత్కీర్తి కొ
య్యన లక్ష్మీకమనీయవక్ష! రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
2371 | మాయ యనఁగ వే ఱై యొక
తోయము లే దయ్య తన్నుఁ దోఁపనిచోటే
మాయ! తా రోసినను జూ
చాయం జెడిపోవు నన్న! సంపఁగిమన్నా! | 1 | kandamu |
1800 | నుండు గదరోరి యా యింతినొనర గూడ | దగుర యిక జాగుసేయుట దగదు నీకువెలది నను బంచె నిను బిల్వ వేగ రమ్మి | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
959 | బాపని కొక స్వయంపాకాన కియలేక | చుట్టాలకును గూడు పెట్టలేక
పిడికెఁడు బిచ్చ మెన్నఁడు నొసంగగ లేక | కడుపార నన్నంబు గుడువలేక
పైమీఁద నొకగట్టిబట్ట గప్పఁగలేక | నదనునఁ గాసైన వదలలేక
కడుగైనఁ దవుడైన విడిచివెట్టఁగలేక | మాడైన మక్కైన మానలేక | 3 | seesamu |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.