id stringlengths 1 4 | poem stringlengths 71 312 | label int64 0 7 | label_name stringclasses 8
values |
|---|---|---|---|
1726 | ప్రసవము నొందునాఁడు పడు బాములు చూచినఁ బ్రాణహానియై
యెసఁగినఁగాని లోనఁ గసటెంతయు లేకయె పుత్రవాంఛ లో
మసలెడుఁ గాన నింకిట సమానదయారసపూర్ణు లెవ్వ రీ
వసుమతిలోన దివ్యగుణవార్ధినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
4283 | కానిక లిచ్చె నీవిభుఁడు కౌఁగిటఁ బాన్పునఁ గమ్మవల్పుపూఁ
దేనెల ఘర్మబిందువుల దేహమునం దలమేలుమంగ నీ
వానగుమోముతో విభుని కంచుఁదలిర్చినఁ గాని తన్మయం
బైనను బాయ దంచుఁ జెలు లందురు నీసతి వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
855 | గిరులందు మేరువౌదువు
సురలందున నింద్రుఁడౌదు చుక్కలలోన\న్
బరమాత్మ చంద్రుఁడౌదువు
నరులందున నృపతివౌదు నయముగఁ గృష్ణా. | 1 | kandamu |
3730 | _x000D_
దొమ్మరీనిలంజతోఁ గూడ దోషంబు
_x000D_
పాపియైన మనసుఁ బట్టరాదు
_x000D_
వీడు గదలిపోవ వెళ్లుదు రెటులనో
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3636 | _x000D_
హీనజాతివాని నిలుఁజేర నిచ్చెనా
_x000D_
హాని వచ్చు నెంతవాని కైన
_x000D_
ఈఁగ కడుపుఁ జొచ్చి యిట్టట్టు చేయదా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1278 | విఱుగఁబడి నడువఁ గూడదు
పరుల నడక లెన్ని తప్పు బట్టఁజనదు ని
ష్ఠురములు వచింపఁగూడదు
కఱపఁగవలె మేలు మేలు గలదు కుమారీ! | 1 | kandamu |
2098 | నరసింహ! నాకు దుర్ణయములే మెండాయె - సుగుణ మొక్కటి లేదు చూఁడ జనిన
నన్యకాంతల మీఁద యాశ మానఁగలేను - నొరుల క్షేమము చూచియోర్వలేను
ఇటువంటి దుర్బుద్ధులిన్ని నాకున్నవి - నేను జేసెడివన్ని నీచకృతులు
నావంటి పాపిష్ఠినరుని భూలోకాన - బుట్టఁ జేసితివేల భోగిశయన! | 3 | seesamu |
2523 | భవదాకారమె కాంచు నీ స్తవకదంబశ్రేష్ఠసద్వాక్యముల్
చెవులార న్విను నిన్నె చెప్పు మది దుశ్శీలేంద్రియాటోపదు-
ర్వ్యవసాయాత్ములఁ గాంచుచో వినెడిచో వర్ణించుచోఁ జీఁకునుం
జెవిటి న్మూగయునై చరించు మహి నీ శీలుండు సర్వేశ్వరా! | 4 | mattebhamu |
3148 | _x000D_
జీవభావ మెఱుగఁ జెడ దెన్నటికి మది
_x000D_
దైవమును నెఱుంగఁ దనరుబుద్ధి
_x000D_
తేజ ముదయమందఁ దిమిరంబు నిలువదు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2560 | తరులం బువ్వులు పిందెలై యొదవి తత్తజ్జాతితోఁ బండ్లగున్
హర మీ పాదపయోజపూజితములై యత్యద్భుతం బవ్విరుల్
కరులౌ నశ్వములౌ ననర్హమణులౌఁ గర్పూరమౌ హారమౌఁ
దరుణీరత్నములౌఁ బటీరతరులౌఁ దథ్యంబు సర్వేశ్వరా! | 4 | mattebhamu |
2871 | చెమ్మటనంటు ముంగురులు చిందిన కస్తురిబొట్టు నిద్దురం
గ్రమ్మెడు కన్నులున్ జెదరు కాటుకయున్ నెలవంకలున్ వినో-
దమ్మగు తళ్కుఁజెక్కులు రదక్షతలక్షితమైన మోవిచే
నిమ్మగు నీ మొగంబు గనుటెన్నఁడు ప్రొద్దున సుందరీమణీ! | 6 | vutpalamaala |
3027 | వనిత నామీద గట్టితే వట్టినింద | దెలిసి యావెన్క నామణి దెచ్చినానెమా యూరి పేర్విను తాడిమళ్ళ | రాజగోపాలుడందురే రమణి నన్ను. | 2 | teytageethi |
3760 | _x000D_
సతి యొనర్చు చెడ్డ పతి కవశ్యము వచ్చు
_x000D_
పతియొనర్చు మంచి సతికి సగము
_x000D_
పతి యొనర్చు చెడ్డ సతి కేల రాదురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
688 | వారిచరావతారమున వారధిలోఁ జొఱఁబాఱిఁ క్రోధ వి
స్తారగుడైన యా నిగమ తస్కరవీర నిశాచరేంద్రునిన్
జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికిన్ మహో
దారతనిచ్చితీవెగద దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
4006 | _x000D_
కలిగి ధర్మమీయఁ గాననివారును
_x000D_
కలిగి తినక చాలగ్రాఁగువారు
_x000D_
కలిమి నెచటఁ జూడఁ గానక చెడుదురు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4146 | _x000D_
పిండములను జేసి పితరులఁదలపోసి
_x000D_
కాకులకును బెట్టు గాడ్దెలార
_x000D_
పెంటఁదినెడు కాకి పితరుఁ డెట్లాయెనో
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
520 | సేనగ వాంఛితాన్నము భుజింపఁగలప్పుడు కాక లేనిచో
మేనులు డస్సియుంట నిజమేకద దేహుల కగ్నిహోత్రుఁడౌ
నే నిజభోజ్యముల్ గుడుచు నేనియుఁ బుష్టి వహించు లేనిఁనా
డూని విభూతిలోనడఁగి యుండఁడె తేజము తప్పి భాస్కరా! | 6 | vutpalamaala |
463 | తనకు నదృష్టరేఖ విశదంబుగఁ గల్గిన గాని లేనిచో
జనునకు నెయ్యెడన్ బరుల సంపదవల్ల ఫలంబు లేదుగా;
కనుగవ లెస్సఁగా దెలివి గల్గిన వారికి గాక గ్రుడ్డికిన్
కనఁబడు నెట్లు వెన్నెలలుఁ గాయగ నందొక రూపు భాస్కరా! | 5 | champakamaala |
821 | నక్రోదగ్రతఁ బ్రాణవాయువులు మేన న్నిల్వఁగా నోప వో
చక్రీ న\న్ దయ గావు మన్నకరుణ\న్ జాజ్జ్వల్యచక్రంబుచే
నక్రంబుం దెగఁ జూచి కాచితిగదా నాగంబు వేగంబున\న్
శక్రాద్యామరవందితాంఘ్రియుగ కృష్ణా దేవకీనందనా. | 7 | saardulamu |
3733 | _x000D_
మొలక చనులనాఁడు మూఁడు కోటులు చేయు
_x000D_
కులుకు చనులనాఁడు కోటిసేయు
_x000D_
తటుకుచనులనాఁడు దమ్మిడి చేయదో
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3640 | _x000D_
పప్పులేని కూడు పరుల కసహ్యమౌ
_x000D_
నప్పులేనివాఁడె యధిక బలుఁడు
_x000D_
ముప్పులేనివాఁడు మొదల సుజ్ఞానుఁడు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
88 | లోకమున నడ్డ మెవ్వరు లేకయునికి-హద్దు లే కిట్లు నడచితి వళుకు మాలి
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
1544 | సాహంకారత దానవుల్ సలుపు వీరాలాపముల్ గాంత లు
త్సాహంబొప్పఁగఁ జేయు గానములు మంత్రజ్ఞాసురప్రేరిత
స్వాహానాదము లాలకింపుచు నవాచ్యం బీపురీవైభవం
బాహా! చిత్రమటంచు మెచ్చుకొనవే స్వాంతంబునన్ మారుతీ! | 7 | saardulamu |
3735 | _x000D_
పండువలనఁ బుట్టె పరఁగ ప్రపంచంబు
_x000D_
పండువలనఁ బుట్టె పరము నిహము
_x000D_
పండు కాసపడిరి బ్రహ్మాది సురలెల్ల
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
971 | సల్లగా మాలదాసర సటారయగారి | తిర్నామములు సాన తేప వింటి
గొల్లమారన బోయ దెల్లఁగా సతికితే | బొల్లేవు పోట్లాటలెల్ల యింటి
జయన యెంకటబొట్లు సబ్బండుసారాలు | పూరాండములు సెప్పఁ గోరి యింటి
సరవయ్య బయలీదు జమిలికతోఁ బాడు | నంకమ్మపాట లెన్నైన యింటి | 3 | seesamu |
4080 | _x000D_
ఉన్న సరికి మనుజుఁ డుపకారి గాలేక
_x000D_
కన్నుగనక పల్కుగర్వములను
_x000D_
దీనులయినవారి దిగువారిగాఁజూచి
_x000D_
పరము గనకనూత బడును వేమ. | 0 | aataveladi |
3248 | _x000D_
గురుఁడనఁగా మొదలంతకు
_x000D_
గురుశిష్యు లనంగ నెల్లకొమ్మలుకాగా
_x000D_
గురువును గానగఁ జాలరు
_x000D_
ధరలోపల మనుజులెల్లఁ దలఁపరు వేమా. | 1 | kandamu |
2426 | సూతకము వచ్చె ననుచును
నాతలఁ బదినాళ్లు జరపినంతనె తెగునా?
సూతకమే కాదా తన
జాతకము నెఱింగికొన్న సంపఁగిమన్నా! | 1 | kandamu |
3501 | _x000D_
ఆలి వంచలేక యధమత్వముననుండి
_x000D_
వెనుక వంతుననుట వెఱ్ఱితనము
_x000D_
చెట్టుముదర నిచ్చి చిదిమినఁ బోవునా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1869 | కనకాంగి నీ బిగికౌఁగిట జేరను దలచదా మరుబారి తాళలేకకొమ్మ నీ యెద కుల్కుగుబ్బల గదియింప మది గోరదా తమి మానలేకముదిత నీ చెక్కులు ముద్దాడ దలవదా నిండిన మోహంబు నిలుపలేకకాంత నీతో రతి కలయగా నెంచదా విరహానలముచేత వేగలేక | 3 | seesamu |
100 | దత్త్వ మరసిన శుద్ధబుద్ధస్వరూప-మింత మధికార మెన్నటి దేమి చెపుమ
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
1689 | మఱి బడిఁ జేరఁబోవునెడ మార్గములోపల ముల్లు నాఁటునో
మెఱవడి గోవులేమయిన మీదికిఁ జేడ్వడి వచ్చునో యటం-
చఱిమురి కొందఱిం బనిచి యాదటఁ దానును బోవనెంచు వాం-
ఛ రహి చెలంగ నెల్లపుడుఁ జయ్యనఁ దల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
1277 | తనకంటెఁ బేదరాండ్రం
గని యంతకుఁ దనకు మేలు గా యనవలయున్
దనకంటె భాగ్యవంతులఁ
గని గుటకలు మ్రింగ మేలు గాదు కుమారీ! | 1 | kandamu |
1487 | గంధంబుపై మంచిగంధంబుపూతతో । బొట్టుపై కుంకుమబొట్టుతో
పూలపై దురిమిన పూలతో కమ్మని । విడెముపై కపురంపు విడెముతోడ
కాటుకపై మిన్కుకాటుకతో కాళ్ల- । పసపుపై నలచిన పసపుతోడ
వలపుపై గ్రమ్మినవలపుతో గ్రక్కున । సొలపుపై బూనిన సొలపుతోడ | 3 | seesamu |
149 | అడవిలోఁ దెరువర్ల నుడుగక తినుచున్న- యాఁడుదాని వధించు టర్హ మగునె?
చిక్కినవారికిఁ జేతు లెంతయుఁ జాఁచు- మొండివాని వధించ ముఖ్య మగునె?
యెక్క డెక్కడ నైన నేఱుక తినుకాకి- కన్ను బోఁ బొడుచుట ఘనగుణంబె?
కడు వ్రేటుఁ బడి గడ్డి కఱచినఁ మారీచుఁ- దఱిమి బాధించుట నెఱతనంబె? | 3 | seesamu |
180 | ననిశము చరాచరాది జీవావనైక-జాగరూకుఁడవా నీవు జాగు దెలిసె
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
2035 | చారుశ్రీచందనాగరుచర్చితాంగ! - కుందకుట్మలదంత! వైకుంఠధామ!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
2143 | సురవినుత! నేను నీచాటుఁ జొచ్చినాను - నా మొఱాలించి కడతేర్చు నాగశయన!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
1161 | విత్తముఁ గూర్చిన మనుజుం
డుత్తమ దానంబు భోగ మొందని యెడ భూ
భృత్తస్కర శిఖిగతము ని
వృత్తి కరంబగును నట్టి పదవి కుమారా! | 1 | kandamu |
1024 | ధరణిలోపల నకట పేదఱికమెంత | కాని దది వద్దు సుమ పగవానికైన,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
3804 | _x000D_
విటునిఁగన్నయంత విశదమై వలపుండు
_x000D_
బోటిఁజూడకట్టిపాటి గలదె
_x000D_
కంటిలోనిపాప కన నెంతవాఁడురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1511 | భాస్కరవంశదీపకయోగిబృందహృ- । త్కమలమార్తాండ మంగళము నీకు
సకలసురాసురసంసేవ్యపాదసా- । గరశాయి సహజమంగళము నీకు
కుజనగర్వవిఫాల నిజభక్తపాల । కరుణాపయోధి మంగళము నీకు
పార్థివేంద్రలలామఫలదాయకాభీష్ట । గజరాజవరద మంగళము నీకు | 3 | seesamu |
2814 | పాటెఱుగని పతికొలువును
గూటంబున కెఱుకపడని కోమలి రతియున్
బేఁటెత్తఁజేయు చెలిమియు
నేటికి నెదురీఁదినట్టు లెన్నర సుమతీ! | 1 | kandamu |
535 | హర పరమేశ శంకర పురాంతక భర్గ గిరీశ చంద్రశే-
ఖర మృడ కృత్తివాస శితికంధర శర్వ నగేంద్రజామనో-
హర శివ మృత్యుసంహర యటంచు నిను న్స్మరియింతు నెప్పుడున్,
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
488 | బలయుతుఁ డైన వేళ నిజ బంధుఁడు తోడ్పడుఁ గాని యాతఁడే
బలము తొలంగెనేని తన పాలిటి శత్రు; వదెట్లు పూర్ణుఁడై
జ్వలనుఁడు కానఁ గాల్చు తఱి సఖ్యముఁ జూపును వాయుదేవుఁడా
బలియుఁడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా! | 5 | champakamaala |
106 | వినుకలులె గాని నిన్ను నీవిశ్వములను-మొద లెఱుంగుదురే నిజంబునకుఁ బిల్వ
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
1929 | శ్రీరామామణి పాణిపంకజమృదుశ్రీతజ్ఞ పాదాబ్జ శృం
గారాకారశరీర, చారుకరుణాగంభీర, సద్భక్తమం
దారాంభోరుహపత్రలోచన కళాధారోరుసంపత్సుధా
పారావారవిహార, నా దురితముల్ భంజింపు నారాయణా! | 7 | saardulamu |
1229 | ఇరుగు పొరుగిండ్ల కైనను
వరుఁడో, కాక అత్తగారో, వదినెయొ, మామో
మఱఁదియో సెల విడకుండఁగఁ
దరుణి స్వతంత్రించి పోవఁ దగదు కుమారీ! | 1 | kandamu |
496 | మాటల కోర్వజాలఁ డభిమానసమగ్రుఁడు ప్రాణహానియౌ
చోటులనైనఁ దానెదురు చూచుచునుండుఁ; గొలంకు లోపల
న్నీట మునింగినప్పు డతి నీచము లాడిన రాజరాజు పో
రాట మొనర్చి నేలఁబడఁడాయెనె భీముని చేత భాస్కరా! | 6 | vutpalamaala |
2042 | ఐశ్వర్యములకు నిన్ననుసరింపఁగలేదు - ద్రవ్య మిమ్మని వెంటఁ దగులలేదు
కనక మిమ్మని చాలఁ గష్టపెట్టఁగలేదు - పల్ల కిమ్మని నోటఁ బలుకలేదు
సొమ్ము లిమ్మని నిన్నునమ్మి కొల్వఁగలేదు - భూము లిమ్మని పేరు పొగడలేదు
బలము లిమ్మని నిన్ను బ్రతిమాలఁగాలేదు - పసుల నిమ్మని పట్టుపట్టలేదు | 3 | seesamu |
3110 | _x000D_
తాను గుడువలేఁడు, తగ వేది యాప్తుల
_x000D_
జేర నివ్వఁడ ట్టి చెనటి గోవు
_x000D_
చేని లోన బొమ్మఁ జేసి కట్టిన యట్లు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1020 | ధరణిఁ బెక్కండ్రు నీచవర్తనులలోన | ఘనుఁ డొకఁడు చిక్కి యేమియుఁ గాక యుండు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
1988 | చల్ల ల్వేఱొకయూర నమ్ముకొను నాసం బోవుచోఁ ద్రోవ నీ
వుల్లాసంబున నడ్డ కట్టి మదనోద్యోగానులాపంబుల\న్
చల్లన్ జల్లనిచూపు జల్లు మని గోపస్త్రీలపైఁ జల్లు మీ
చల్లంబోరుతెఱంగు జిత్తమున నే జర్చింతు నారాయణా! | 7 | saardulamu |
769 | శ్రీలక్ష్మీధవ వాసుదేవ వరదా రాజీవపద్మాసనా
వ్యాళాధీశ్వర శర్వ షణ్ముఖ శుకాద్యస్తోత్ర సత్పాత్ర గో
పాలానీక ముఖాబ్జభాస్కర కృపాపాథోధి న\న్ గావు మూ
ర్ధాలంకార మయూర పింఛధర కృష్ణా దేవకీనందనా. | 7 | saardulamu |
4332 | అమ్మకుఁ దాళ్లపాకఘనుఁ డన్నఁడు పద్యశతంబుఁ జెప్పెఁగో
కొమ్మని వాక్ప్రసూనములఁ గూరిమితో నలమేలుమంగకు\న్
నెమ్మది నీవు చేకొని యనేకయుగంబులు బ్రహ్మకల్పముల్
సమ్మది మంది వర్ధిలను జవ్వన లీలల వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
4568 | ధన్య మహావదాన్య! గతదైన్య! విధూత జఘన్య! భక్తిచై
తన్య! గుణైక్యమాన్య! హతదర్పక సైన్య! నిరస్త మాతృకా
స్తన్య! జితారిఘోరభవజన్య! శరణ్యము చిత్సుఖాత్మ భా
వన్య! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
713 | జీవనమింకఁ బంకమునఁ జిక్కినమీను చలింపకెంతయున్
దావుననిల్చి జీవనమె దద్దయుఁ గోరువిధంబు చొప్పడం
దావలఁమైనగాని గుఱి దప్పనివాఁడు తరించువాఁడయా
తావకభక్తియోగమున దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
4044 | _x000D_
మొదట నతఁడు జ్ఞాన ముద్రాంకితుఁడు గాక
_x000D_
యావిధమును దెలియ సజ్ఞుఁ డగును
_x000D_
నడుమ జ్ఞాన మొదవ నగుఁబాటు గాదయా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3372 | _x000D_
ముక్కుతుదను దృష్టి ముదముతోడుత నిల్పి
_x000D_
హృదయమందుఁజూడ నొసగుముక్తి
_x000D_
పదవులెరుగకున్న పరమాత్మ యోగియౌ
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
881 | స్తంభమున వెడలి దానవ
డింభకు రక్షించినట్టి రీతిని వెలయ\న్
అంభోజనేత్ర జలనిధి
గంభీరుఁడ నన్నుఁ గావు కరుణను గృష్ణా. | 1 | kandamu |
82 | కోరి దాసులు ని న్నెంత దూరుచున్నఁ-బంత మున్నదె నీ కిసుమంత యైన?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
4364 | యశము గోరిన దొరకొడుకైనవాఁడు । ఇన్ని చెప్పులు కడఁ ద్రోసి యియ్యవలయు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
76 | సిద్ధ మాభీరుఁడవు నీవె బుద్ధి నెంచఁ-గలికి వై యేమి సేయఁ గలవొ కాని
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
4440 | చెలులతో రాజకార్యముల్ చెప్పరాదు । పలువ మంత్రైన దొరలకుఁ బరువులేదు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
3728 | _x000D_
లంజ లంజకానిలాగెల్లఁ గొనియాడు
_x000D_
లంజతల్లివాని లజ్జ గడుగు
_x000D_
తల్లి గలుగులంజఁ దగులుట దోషంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3440 | _x000D_
రూపు మాయ చూపు రూఢియై వెలుగొందుఁ
_x000D_
గాదుమాయమ్రానుఁ గల్పతరువు
_x000D_
చూపు గ్రుంగఁ జేసి చూచుట సుఖమురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1671 | తడఁబడునట్లు ముంగిటను దప్పుటడుం గిడువేళ నజ్ఞతన్
బడునను చింతయు న్నడువఁ బాల్పడెనన్న కుతూహలంబు చే-
డ్పడ నొకటైన మైమఱచి బాలునకున్ దన వ్రేలొసంగి నే-
ర్పడరఁగ ద్రిప్పుచో శుభముఁ బల్కెడు తల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
3287 | _x000D_
గురుచరణముఁ బట్టఁ గుక్కలు గఱచును
_x000D_
గురుచరణము విడువఁ గుక్క గఱచుఁ
_x000D_
గుక్కకున్న బుద్ధి గురునకు లేదురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2601 | అమితోద్యద్భవదీయతత్త్వము మహీయస్తోత్రవాణీవిలా-
సములై యొప్పు సమస్తవేదములు శాస్త్రశ్రేణియున్ దివ్యవి-
భ్రమనాదంబులు నెన్ని చూడ నివి నీ పంచాక్షరీమంత్రభా-
వములైయుండు సమస్తలక్షణముల న్వర్ణింప సర్వేశ్వరా! | 4 | mattebhamu |
938 | నీకు నతులు సమర్పించి నిష్ఠతోడఁ | గొల్చువారలె శమనుని గెల్చువారు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
3385 | _x000D_
బ్రహ్మ మనగవేఱె పరదేశమున లేదు
_x000D_
బ్రహ్మ మనగ దానె బట్టబయలు
_x000D_
తన్నుదా నెఱిఁగినఁ దానెపో బ్రహ్మంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1433 | భ్రమరఝంకారంబు పగిది నుపాంగంబు । కోపైన సుతిని ఘుంఘుమ్మురనగ
సిరిమించి మదిమించి చిరుతాళముల శబ్ద- । సంగతి ధిత్తతాఝమ్మనంగ
పరికింప వీనులపండువై పెద్దమ- । ద్దెళ నాదు తాహతోద్ధిమ్మనంగ
నెరనీటుపల్కు కిన్నెరమీటు గజ్జెలల్ । గోజారవంబు బల్‍మోజు దనర | 3 | seesamu |
4398 | జన్మమెత్తుట మొదలు నీ సరణిఁ గడచె । నెటుల గృపఁ జూచెదో గతం బెంచఁబోకు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
335 | అమరాహార్యము విల్లుగా ఫణికులాధ్యక్షుండు తన్మౌర్విగాఁ
గమలాధీశుఁడు తూపుగా, నిగమముల్ గంధర్వముల్ గాఁగ స-
ర్వమహీచక్రముఁ దేరుఁజేసి విధి సారథ్యంబు మీఱం బరా-
క్రమలీలన్ దిగప్రోళ్ళఁ గూల్చితివి భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
3687 | _x000D_
నిరుపేదల రక్షించెడు
_x000D_
సరసుఁడు నెఱవాతగాక సంపన్నులఁ దా
_x000D_
భరియించువాఁడు దాతయె
_x000D_
మెరమెచ్చులదాత యతఁడు మేదిని వేమా. | 1 | kandamu |
363 | అకలంకం బతులం బఖండ మమృతం బానందకందం బనూ-
నక మాద్యంతవిహీన మక్షర మనంతం బప్రమేయం బరూ-
పక మవ్యక్త మచింత్య మద్వయమునౌ బ్రహ్మంబు నీవంచుఁ గొం-
కక లోఁ గన్గొనువారు బల్లిదులు భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
2563 | నానాశాస్త్రసముచ్చయాగమపురాణప్రౌఢులై తత్త్వవి-
జ్ఞానధ్యానసమాధివిద్య లతివిస్పష్టంబుగా నేర్చి రే
దాన న్నేర్పరులెల్ల నేరరు భవత్సద్భక్తివిద్యాసమా-
ధానప్రస్ఫుటశక్తి నీ కరుణచేతం గాని సర్వేశ్వరా! | 7 | saardulamu |
3121 | _x000D_
అజ్ఞానమె శూద్రత్వము
_x000D_
సుజ్ఞానము బ్రహ్మమౌట శ్రుతులను వినరా
_x000D_
యజ్ఞాన ముడిగి వాల్మీకి
_x000D_
సుజ్ఞానపు బ్రహ్మమొందెఁ జూడర వేమా. | 1 | kandamu |
4075 | _x000D_
పుట్టువార లెవరు పుట్టకుందు రెవరు
_x000D_
పుట్టిగిట్టినట్టి పురుషు లెవరు
_x000D_
పుట్టిపుట్టనియట్లు బోధించి చూడరా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2821 | పొరుగునఁ బగవాఁడుండిన
నిరవొందఁగ వ్రాఁతగాఁడె యేలికయైన\న్
ధరఁ గాఁపు కొండెమాడినఁ
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ! | 1 | kandamu |
1131 | తనకును విద్యాభ్యాసం
బును జేసిన వానికన్న బొలుపుఁగ బదిరె
ట్లను దూఁగుఁ దండ్రి, వానికి
జననియుఁ బదిరెట్లు తూఁగు జగతి కుమారా! | 1 | kandamu |
2391 | కీడొసఁగెడు గురు డేలా
గాడిదవాలంబుఁ బట్టి ఘననదు లీఁద\న్
గూడునె గుండెలు పగులఁగ
జాడింపదె ఱొమ్ముఁ దన్ని సంపఁగిమన్నా! | 1 | kandamu |
2136 | కూటికోసము నేఁ గొఱగాని జనులచేఁ - బలు గద్దరింపులు పడఁగ వలసె
దార సుత భ్రమ దగిలి యుండఁగఁ గదా - దేశ దేశము లెల్లఁ దిరుగవలసెఁ?
బెను దరిద్రత పైని బెనఁగి యుండఁగఁ గదా - చేరి నీచుల సేవ చేయవలసె?
నభిమానములు మదినంటి యుండఁగఁ గదా - పరులఁ జూచిన భీతి పడఁగవలసె? | 3 | seesamu |
1523 | వనజాప్త ప్రియపుత్రుఁ డెంత ధిషణావంతుఁడొ, సర్వంసహా
తనయాన్వేషణ మాచరింప గపులం దా బంపుచో, గార్యసా
ధనమందీ వతి దక్షిణుండవని కాదా! నేర్పుతో దక్షిణం
బునకున్ నిన్నధికారిఁ జేసి పనిచెన్ మోదంబునన్ మారుతీ! | 4 | mattebhamu |
2800 | నరపతులు మేరఁ దప్పినఁ
దిర మొప్పగ విధవ యింటఁ దీర్పరియైనన్
గరణము వైదికుఁడయినను
మరణాంతకమౌను గాని మానదు సుమతీ! | 1 | kandamu |
3843 | _x000D_
అమలమైన పలుకు లభిషేకవారిధి
_x000D_
తనువు దేవళంబు తాల్మి నొంది
_x000D_
యాత్మ శివునిఁజేర్చు నాతఁడే శివయోగి
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
484 | ప్రేమను గూర్చి యల్పునకుఁ బెద్దతనంబును దొడ్డవానికిం
దా మతితుచ్ఛపుంబని నెదం బరికింపగ యీయరాదుగా
వామకరంబుతోడఁ గడువం గుడిచేత నపానమార్గముం
దోమఁగ వచ్చునే మిగులఁ దోఁచని చేఁతగు గాక భాస్కరా! | 6 | vutpalamaala |
1834 | యైన నేమాయె వారల కనుదినంబు విప్రవర్యుల రావించి వివిధగతులయొనర తచ్ఛాంతి గావింప నువిద దలచు | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
2302 | పరనారీ కుచకుంభపాలికలపైఁ బాదాబ్జయుగ్మంబుపైఁ
గరమూలంబులపైఁ గపోలతటిపైఁ గంఠంబుపైఁ గొప్పుపైఁ
బరువుల్ వాఱెడు నా తలంపులు మిమున్ భావింపఁగాఁ జేసి స
ర్వరసాధీశ్వర! నన్నుఁ బ్రోవు రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
139 | కులగురుద్వేషి నొజ్జలుగ పెన్కొని కాచి- నిష్ఠురమంత్రము ల్నేర్చినావు
పూర్వదేవతలు కాపుర మున్నపురియందు- వంచించి యగ్గిఁ బెట్టించినావు
తాతలతరమునఁ ద్రవ్వించినపయోధి- పేరుగాఁ గొంత పూడ్పించినావు
మోస మౌ టెఱుఁగక మోహించి వచ్చిన- యెలనాగముక్కుఁ గోయించినావు | 3 | seesamu |
1528 | బలి బంధించిన నాఁటి వామన తనుప్రాబల్యముం దాల్చి, యు
జ్జ్వల చంద్రోదయవేళఁ బొంగు తటినీశస్ఫూర్తి నుప్పొంగి, ఘో
ర లయాభ్రంబు తెఱంగునన్ భయద గర్జారావముం జేసి, త
జ్జలధిం దాటఁగఁ బూనితీవు పరమోత్సాహమ్మునన్ మారుతీ! | 4 | mattebhamu |
1258 | నవ్వంగ రాదు పలుమఱు
నవ్వినఁ జిఱునవ్వు గాని నగరా దెపుడున్
గవ్వలవలె దంతంబులు
జవ్వునఁ గానంగ బడెడి జాడఁ గుమారీ! | 1 | kandamu |
560 | దొరకొని చెప్పుగాల తలఁ ద్రొక్కి యొకించుక నంజు డెంగిటన్
బొరసిన దప్పనంబొసఁగి పుక్కిటనీ ర్మెయిఁ జిల్కు బోయకున్
సరగున మోక్షమిచ్చితఁట సజ్జనకోటుల కిచ్చు టబ్రమే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
770 | పతులున్నేవురునెన్నఁగాఁగలిగి భూపాలాంగనానీకముల్
సతతంబు\న్ గనుసన్నల\న్ మెలఁగుచైశ్వర్యంబుతోనుండి తా
నతిభక్తిం జని యాసుధేష్ణకును జేయం బూనదే ద్రౌపదీ
సతి యాశ్చర్యము నీవిలాసములు కృష్ణా దేవకీనందనా. | 4 | mattebhamu |
1141 | విను లోకంబున ధర్మం
బఁనగఁ గులాచార మట్ల నరసి నడువ! దాఁ
గను నాయుఃకీర్తుల నిహ
మునఁ బరమునఁ బొందు సౌఖ్యములను గుమారా! | 1 | kandamu |
1591 | నలుఁడా సేతువు గట్టునప్పుడు కపుల్ నానాప్రకారంబులన్
శిలలం జెట్టులు దెచ్చివైచునెడ నిస్సీమప్రభావంబునన్
జలమారం దగ నీవు రాఘవుఁడు మెచ్చం గొప్ప శైలంబులన్
బలువొప్పం గొని తెచ్చి వైచి జలధిం బంధింపవే మారుతీ! | 4 | mattebhamu |
2698 | కేదారాదిసమస్త తీర్థములు కోర్కింజూడఁ బోనేఁటికిం
గాదా ముంగిలి వారణాసి కడుపే కైలాసశైలంబు మీ
పాదధ్యానము సంభవించునపుడే భావింప నజ్ఞాన ల
క్ష్మీదారిద్ర్యులుగారె లోకు లకటా! శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
991 | పొడవైన కారెనుబోఁతుఁ గన్గొని తేంట్లు | మదగజేంద్రంబని పొదవునట్లు
దళమైన యెండమావులు సూచి నీళ్ళని | చెలఁగి జింకలు దాడిసేయునట్లు
వలయు దవాగ్నిధూమముఁ గాంచి మొగులని | చాతకంబులు డాయఁ జనినయట్లు
బూరుగచెట్టుపైఁ బూవులుండుట చూచి | చిలుకలు ఫలముకై చేరినట్లు | 3 | seesamu |
2827 | మానఘనుఁ డాత్మధృతిఁ జెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెఁడు జలములలోపల
నేనుఁగు మెయి దాఁచినట్టు లెఱుగుము సుమతీ! | 1 | kandamu |
1851 | మితిమీరి కాంక్షతో నతివేగ దన చేతి విరులవీవన చేత విసరి పతికినాకు మడ్పులొసంగి యతివ భర్తను బదులు విడెమిమ్మంచును వెలది ప్రాణ-నాథుని నీక్షించి నవ్వుచు బలుమారు నాశదీరగ మాటలాడుకొనుచునిను జూడకుండిన నిముషమేనియు తాళజాలరా నా ముద్దుసామి యనుచు | 3 | seesamu |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.