id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
3271
_x000D_ శ్రీకరశివతత్వశీలుఁడౌ వేమన _x000D_ ప్రాకటముగ వేయు పద్యములను _x000D_ లోకమందుఁ జదివెలోవెతఁ బాయరో _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4453
వలపు రూపెఱుగదు వసుధ మర్త్యులకు సూ- । కరమైన మనిసిగాఁ గానుపించు నాకలిలో నాల్క యరుచి యెఱుంగదు । యంబలైనను సుధయనుచుఁ గ్రోలు గోపం బెదుటి గొప్పకొద్ది యెఱుంగదు । ప్రాణబంధువునైనఁ బగతుఁ జేయు నిదుర సుఖంబెఱుంగదు వచ్చినప్పుడు । కసవైన విరిశయ్యగా గానుపించు గామంబు నిర్ణయకాలం బెఱుంగదు । హెచ్చు చెందినవేళ నెనయగోఁరు
3
seesamu
1577
దశకంఠాసుర! పుణ్యసాధ్వియగు సీతం గానలో దొంగవై పశుబుద్ధిం గొనితెచ్చి నందుకిపుడే బంధించి ముష్టిన్‌ త్వదు గ్రశిరంబుల్‌ వెస వ్రక్కలింపనగు నా రామాజ్ఞ లేకున్కి దు ర్దశ నొందింపక యోర్చియుంటి' ననుచుం దర్జింపవే మారుతీ!
4
mattebhamu
2068
నీలమేఘశ్యామ! నీవె తండ్రివి మాకు - కమలవాసిని మమ్ముఁగన్న తల్లి నీ భక్త వరులంత నిజమైన బాంధవుల్‌ - నీ కటాక్షము మా కనేక ధనము నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు - నీ సహాయము మాకు నిత్యసుఖము నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య - నీ పద ధ్యానంబు నిత్యజపము
3
seesamu
406
చదువు ల్వేదపురాండము ల్గయితలు న్సబ్బండువిద్దెల్ గతల్ మొదలెన్నేనిగ విద్దుమాంసువు లదేమో తెల్పఁగా వింటిఁగా నదిగో చౌలకు మాలదాసరి శటాలైగారి జ్ఞానమ్మలెన్ గదియం జాలవటండ్రు ముష్కరులు భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
4011
_x000D_ ప్రభువు కోఁతియైనఁ బ్రగ్గడ పందియౌ _x000D_ సైనికుండు పక్కి సేన పసులు _x000D_ ఏనుఁగు లశ్వము లెలుకలు పిల్లులు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3871
_x000D_ రాజయోగి మహిమ రాజయోగికి గాక _x000D_ ఇతర జనులకెల్ల నేమిదెలియు _x000D_ తాను దేవుఁడైన దైవముఁ గొలుచునా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2276
జనకుం డెవ్వఁడు నీకు? నీ కడుపులో సర్వంబు నుండంగ నీ యునికి స్థానము దుగ్ధవార్ధి నడుమన్ యోగీంద్రహృద్గేహ! యే మని వర్ణింపుదు నీ మహత్త్వములు సర్వాశ్చర్యముల్ పుణ్య వ ర్తన రాజన్యయశోవిహార రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
2130
పుండరీకాక్ష! నారెండు కన్నుల నిండ - నిన్నుఁ జూచెడి భాగ్యమెన్నఁడయ్య వాసిగా నా మనోవాంఛ దీరెడునట్లు - సొగసుగా నీ రూపు చూపవయ్య పాపకర్ముని కంటఁ బడకబోవుదమంచుఁ - బరుషమైన ప్రతిజ్ఞఁ బట్టినావె? వసుధలోఁ బతిత పావనుఁడ వీ వంచు నేఁ - బుణ్యవంతుల నోటఁ బొగడ వింటి
3
seesamu
4605
"అనయముఁ జేతులందు భవదంఘ్రి సరోజయుగం నమామి నె మ్మనమున సంస్మరామి యను మాటల నిన్‌ వరివస్క రోమ్య హ" మ్మనుచు 'మణిప్రవాళము'న నంకన సేయుదు భక్తలోక హృ ద్వనజ విహారలోల బసవా! బసవా! బసవా! వృషాధిపా!
5
champakamaala
1563
అసురాధీశ్వరుఁడవ్విధంబు విని కట్టల్కన్‌ రణార్థం బశీ తిసహస్రంబులఁ గింకరాఖ్యుల మహాతేజః ప్రభావాఢ్యులన్‌ వెసఁబంపన్‌ విలయాంబుదంబు కరణిన్‌ మిన్నంది గర్జించి దీ మస మొప్పం దగ వారినెల్లఁ గడిమిన్‌ మర్దింపవే మారుతీ!
4
mattebhamu
2884
ఇంచుక నొక్కనాఁడు పడకింట సమున్నతదర్పణాప్తి నై- జాంచితమూర్తిఁ గన్గొని పరాంగనలౌ యని యల్గిపోవ వా- రించుచు నీడఁజూచి బెదరేవని నవ్వుచు మోము ద్రిప్పి నీ- క్షించుమనన్ గ్రహించి దయ సేతువుగా నను సుందరీమణీ!
6
vutpalamaala
3077
కల్ల గురుఁడు గట్టు, నెల్ల కర్మంబుల మధ్య గురుఁడు గట్టు మంత్ర చయము నుత్తముండు కట్టు, యోగ సామ్రాజ్యంబు విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3140
_x000D_ గుణవతి యగు యువతి గృహము చక్కగనుండు _x000D_ చీకటింట దివ్వె చెలఁగురీతి _x000D_ దేవియున్న యిల్లు దేవార్చన గృహంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
611
మురువుగ నక్షమాలయును మోదికఁ బూనితి భూతి దాల్చితిన్ స్మరణగ నైదువర్ణముల మంత్రము వేమరు నుచ్చరించితిన్ దురితపిశాచముల్ దొరగి దూరముగా జనకుండుటెట్లికన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
4206
_x000D_ తిరుమలకును బోవఁ దుఱక దాసరి గాఁడు _x000D_ కాశిబోవ లంజ గరిత గాదు _x000D_ గుక్క సింహ మగునె గోదావరికిఁ బోవ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1778
మగువ యీ రీతి విరహాబ్ధిమగ్న యగుచు | తలిరువిలుకాని బారికి తాళలేకనిన్నె దలచుచునున్నది నీరజాక్షి | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
994
తస్కరుని చందమునఁ బదార్థములు మ్రుచ్చి- | లించుచుఁ జరించు కుకవుల నెంచనేల? భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
1032
కాని దుర్మతులయి ప్రజఁ గలంచి ధనముఁ | గూర్పఁజూతురు బేలలై కూళదొరలు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
806
అన్నంబైనను దక్రమైనఁ దగుతోయంబైన నభ్యాగతుల్‌ దన్నాశించిన నేమియు న్నిడక యేధర్మంబునుం జేయ కే మన్న న్నూరకయుండు జీవశరమర్త్యశ్రేణి జేయ కే చన్న న్నేమగు నేమగు\న్‌ గలుగఁ గృష్ణా దేవకీనందనా.
7
saardulamu
1502
వసుధలోపల నెటువంటివారికైన । తగని వలపిట్లు గారాదు తరుణి నీదు కృపను గాంచక మన్మథచపల మణప । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
2204
తార్క్ష్యవాహన! నీవు దండిదాత వటంచుఁ - గోరి వేడుక నిన్నుఁ గొల్వవచ్చి యర్థిమార్గమును నేననుసరించితినయ్య - లావైనఁ బదునాల్గులక్ష లైన వేషముల్‌ వేసి నావిద్యాప్రగల్భతఁ - జూపసాగితి నీకు సుందరాంగ! యానందమైన నేనడుగ వచ్చిన దెచ్చి - వాంఛఁ దీర్పుము నీలవర్ణ! వేగ
3
seesamu
987
యెద్దుమందను గూర్చి యెగసాయమిడితేను | తుది నది యధికారి దోసుకొనియె దాపుదప్పులకంట దర్మకర్చులకంట | కాసువీసము లాగె కరణపయ్య సల్లమ్మి పవకమ్మి సిల్లర దాసితే | కోమటి నాబంటుకొడుకు దొబ్బె కళ్ళము కంకులు గాలిఁ బట్టగఁ బోతె | బట్టుబాపనవోళ్ళు బతగనీయ-
3
seesamu
1957
సర్వంబున్‌ వసియించు నీతనువునన్‌ సర్వంబునం దుండగా సర్వాత్మా! వసియించు దీవని మదిన్‌ సార్థంబుగాఁ జూచి యా గీర్వాణాదులు వాసుదేవుఁ డనుచున్‌ గీర్తింతు రేప్రొద్దు నా శీర్వాదంబు భవన్మహామహిమ లక్ష్మీనాథ, నారాయణా!
4
mattebhamu
3181
_x000D_ గాలి గాలి గలసె గగనంబు గగనంబు _x000D_ మన్ను మన్ను గలసె మంట మంట _x000D_ నీరు నీటఁ గలసె నిర్మలంబయి యుండె _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3358
_x000D_ మ్రానుఁ గాలవేసి మహిమీఁద నొకజాణ _x000D_ పూని తిరుగుచుండుఁ బొందుగాను _x000D_ కాలవేయు మ్రాను కడురమ్యమైయుండు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
289
కాయస్థు ల్గణికాజనంబులు తురుష్కశ్రేణులున్ దుష్టదా- సేయుల్ వైద్యులునుం బురోహితులు దాసీభూతముల్ గాయకుల్ బోయల్ గొందఱు లోభిభూవరు ధనంబున్ సంతతంబున్ మహా- మాయాజాలము పన్ని లాగుదురు రామా! భక్తమందారమా!
7
saardulamu
3934
_x000D_ మొనసి యింద్రియముల మొదట నిల్పఁగలేక _x000D_ సమసిపోవు వేళ సన్యసించు _x000D_ ఆత్మశుద్ధిలేక యంటునా మోక్షంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1974
చన్నుల్‌ మీదిఁకి చౌకళింప నడుముం జవ్వాడ కందర్పసం పన్నాఖ్యంబు నటించు మాడ్కి కబరీభారంబు లూటాడఁగా విన్నాణంబు నటింప గోపజన గోబృందంబుతో వచ్చు మీ వన్నెల్‌ కన్నుల ముంచి గ్రోలుటలు నే వర్ణింతు, నారాయణా!
7
saardulamu
1793
విభుడు పైకొనువేళ వెలది సంతసమంది గబ్బిగుబ్బలచేత గదియనిచ్చిదురుసుగా మరుకేళి దొడరిన నాథుని దప్పక వీక్షించి తరుణి తనదుచెలువుని మోమున చెమట గ్రమ్మిన జూచి విరులవీవన చేత విసరి వేడ్కనేడు మంచిదినంబు నెనరున ననుగూడి హాయి వుట్టించితి వంబుజాక్ష
3
seesamu
3925
_x000D_ చీరగట్టి రాత్రి సిగ్గును నెఱిఁగుండు _x000D_ పగలు చీరవిడుచు పను లదేల _x000D_ చేడె గాదుర యిది చేవాడికత్తెర _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
859
అగణితవైభవ కేశవ నగధర వనమాలి యాది నారాయణ యో భగవంతుఁడ శ్రీమంతుఁడ జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణా.
1
kandamu
3066
ఏలరా నే తాళజాలరా యిక జాలు చాలురా పంతంబు జలజనయనయిందు రావైతి నేమందురా యే నాతిమందు తలకెక్కెనొ మదనజనకయేమిరా యిటు వేరుసేతురా మరుబారి ద్రోతురా యెందైన దోయజాక్షవీడరా కపటంబు గూడరా నను దయ జూడరా యీవేళ సుందరాంగ
3
seesamu
1644
ఎఱుకులసానిగద్దె విననెంచు మనోరథ ముప్పతిల్లఁగాఁ, గరగతలేఖ లూర్జితముగాఁ గని పెద్దలు నీకుఁ బుత్రులే- వురు గలరన్న మాత్రమున నూరట దోఁప సుతేచ్ఛ లోన ము- ప్పిరిగొన సంతసిల్లి మది బేర్చెడు తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
1084
నిన్ను సేవింతు భావింతు సన్నుతింతుఁ | బ్రేమ యేపార సాక్షాత్కరింపుమయ్య, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
723
శ్రీకైవల్యరమాధినాథ నిను నర్థిం గీర్తనల్‌జేసి కా దా కంజాతభవేంద్ర నారద శుకవ్యాసాంబరీషార్జునుల్‌ నీకారుణ్యముఁ గాంచుటల్‌ ననుమతి\న్‌ నేనెంతధన్యుండనో నాకుఁ జేకురె నట్టిభాగ్యములు కృష్ణా దేవకీనందనా.
7
saardulamu
2554
కలయం గాష్ఠయుగంబుఁ గూర్చి తరువంగా బుట్టి తత్సాధనం- బుల రెంటిన్ దహియించు వహ్నిగతిఁ దాఁ బొల్పొందఁ గాయంబు సం- ధిల సత్కర్మముతో మథింపఁగ భవచ్చిద్భక్తి సద్వహ్ని యు- జ్జ్వలమై కాయముఁ గర్మముం జెఱుచుఁ దత్త్వంబెన్న సర్వేశ్వరా!
4
mattebhamu
2782
చుట్టములు గాని వారలు చుట్టములము నీ కటంచు సొంపు దలిర్పన్‌ నెట్టుకొని యాశ్రయింతురు గట్టిగ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ!
1
kandamu
3873
_x000D_ గంపెడంత తవుడు గంపలోఁ బెట్టక _x000D_ చన్నుఁ బట్టనీదు కొన్నబఱ్ఱె _x000D_ వారకాంత లేల వలతురు నూరక _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2475
ఒకమా టీసకలంబు నీ మయముగా నూహించుచు న్వెండి యొ- క్కొకమాటింతయు నీవు గావనుచు నేయుక్తిం బ్రశంసింపనే- రక వేదంబులు చిక్కుపడ్డవనినం బ్రవ్యక్తమై యుండు భా- వకుఁడై నీ నిజరూప మిట్టిదన నెవ్వండోపు సర్వేశ్వరా!
4
mattebhamu
2335
దనుజాధీశులు నిర్జరాధిపతులున్ దామందఱున్ మందరున్ ఘనసత్త్వంబున నెత్తి వార్థి నహిపుం గవ్వంబుగాఁ ద్రచ్చుచో మునుఁగం బాఱకయుండఁ గచ్ఛపమవై మున్నీటిలోనుండు వ ర్తన మే నాత్మఁ దలంచుచుందు రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
1990
స్నానంబుల్‌ నదులందు జేయుట గజస్నానంబు చందంబగు\న్‌ మౌనం బొప్ప జపించువేద మటవీ మధ్యంబులోనే డ్పగున్‌ నానాహోమము లెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యై చను న్నీనామోక్తియు నీపదాబ్జరతియున్‌ లేకున్న నారాయణా!
7
saardulamu
1003
జగడాలచీలి వేసాలవెల్లి బిసాళి | తిండిపోతు గయాళి మొండికట్టె హేయభాజనము పల్మాయలపుట్టిల్లు | కంతులరాకాసి పంతగత్తె యవలక్షణముల తా వవివేకములప్రోవు | చెరపనచేట మాసికలమూట నిక్కులబండి బందెలమారి కల్లల- | పాతర సోమరిపో తనంగ
3
seesamu
2962
కలికిరో నా పతి కరుణించి యీవేళ వచ్చి నా కౌగిట జొచ్చునేమొఊహించి నీచేత నుత్తరంబంపిన ప్రేమతో రమ్మని పిలుచునేమొ యేనుజేసిన పూజ యిత్తరి ఒకవేళ దరుణి నాపయి భ్రాంతి గలుగునేమొసుదతి నా పల్కులు చోద్యమై తోచిన వడివడి నొకవేళ వచ్చునేమొ
3
seesamu
670
సలలిత రామనామ జప సారమెఱుంగను గాశికాపురీ నిలయుఁడఁగాను మీచరణ నీరజరేణు మహాప్రభావముం దెలియ నహల్యఁగాను జగతీవర! నీదగు సత్యవాక్యముం దలఁపఁగ రావణాసురుని తమ్ముఁడగాను భవద్విలాసముల్‌ తలఁచి నుతింప నాతరమె దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
1372
ముద్దుబెట్టుక నవ్వుచు ముదిత నీవు । నెవరి పెండ్లాడెదవటంచు నేను బలుక నిన్నె యని మీసములు మీటు నీటు దలప । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
1789
ఇంతిరో విభుడు నా చెంత జేరినయంత నునుచెక్కులను గోట నులుమనటవెకాంతరో నా భర్త కౌఁగిలించిన యెంత చక్కని కెమ్మోవి నొక్కనటవెమందయానరో నాథుడంది చన్గవ నంట కొసరి నా జడతోడ గొట్టనటవెకొమ్మరో పతిరతి గూడ నా గుబ్బల ఱొమ్మున గసిదీర గ్రుమ్మనటవె
3
seesamu
4156
_x000D_ పలుగురాళ్ళఁ దెచ్చి పరఁగగుడులు కట్టి _x000D_ చెలఁగిశిలలసేవఁ జేయనేల _x000D_ శిలలసేవఁ జేయ ఫలమేమి గల్గురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
832
ఓ కారుణ్యపయోనిధి నా కాధారంబ వగుచు నయముగఁ బ్రోవ\న్‌ నాకేల యితర చింతలు నాకాధిపవినుత లోక నాయక కృష్ణా.
1
kandamu
3152
_x000D_ సతము బాహ్యపూజ చాలఁ జేసినపిదప _x000D_ కపటము విడలేక కష్టనరులు _x000D_ ముక్తి నొందలేక మునిగిరి తమమున _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
764
కొలిచేది\న్‌ వగలేకనే నడిగితే కోపించు టీలేకనే చెలువం బెచ్చుటకోటనేవిభవముల్‌ చేకూరుటల్‌ రూకనే బలవంతుం డగుమూకనే సతిచెడు\న్‌ ప్రాణేశుపైఁ గోపనే జలదశ్యామల శంఖచక్రధర కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
3943
_x000D_ మాలవాని నేల మఱిమఱి నిందింప _x000D_ నొడల రక్తమాంస మొకటెగాదె _x000D_ వానిలోన మెలఁగువాని కులంబేది _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1961
కలుషాగాథవినాశకారి యగుచుం గైవల్యసంధాయియై నలి నొప్పారెడు మంత్రరాజమగు నీనామంబు ప్రేమంబుతో నలర న్నెవ్వని వాక్కునం బొరయదే నన్నీచు ఘోరాత్మయు\న్‌ వెలయన్‌ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ, నారాయణా!
4
mattebhamu
3515
_x000D_ కలిగిన మనుజుండు కాముఁడుసోముఁడై _x000D_ మిగులఁ దేజమునను మెఱయుచుండు _x000D_ విత్తహీనుఁడైన రిత్తయై పోవును _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
817
మొఱయాలింపవొ మానమున్నిలుపవో ముల్లోకమేలింపవో మఱదీయంచును వెంటనేతిరుగవో మన్నింపవో యందుమో కరినో ద్రౌపదినో సురాధిపతినో గాండీవినో యెవ్వఁడ\న్‌ ధర ని\న్‌ గొల్చినవారిలో నొకఁడ కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
1966
వరుసన్‌ గర్మపిపీలికాకృత తనూవల్మీకనాళంబులోఁ బరుషాకారముతో వసించిన మహా పాపోరగశ్రేణికిం బరమోచ్చాటనమై రహస్యమహిమం బాటింపుచు న్నుండు మీ తిరుమంత్రం బగు మంత్రరాజ మమరుం దివ్యాత్మ, నారాయణా!
4
mattebhamu
3642
_x000D_ ధార్మికునకుఁ గాని ధర్మంబుఁ గనరాదు _x000D_ కష్టజీవి కెట్లు కానఁబడును _x000D_ నీరుచొరకలోతు నిజముగాఁ దెలియదు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
592
సురచిరభక్తితోడ మనుజుం డొక బిల్వదళం బొకప్డు నీ శిరమున నుంచెనేని యది సింధురసైంధవచామరధ్వజాం- బరమణిభూషణాది విభవస్ఫురణ న్గనుపట్టి యుండుఁబో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
2998
అర్జునుకోసమై యవతారమెత్తిన కృష్ణావతారంబు గుణము వినుమువాయుపుత్రునితోడ వాదించి యర్జును డంపశయనము గట్టినట్టినప్పు-డా విల్లుజెడకున్న నా క్షణంబునను దా గేరుచు హనుమంతు గూల్చినాడుపదునొకండక్షోహిణి బలముల జంపించి యర్జును గాచితి నతివ నాడు
3
seesamu
2147
కొసకు నీ సన్నిధికిఁ బిల్చుకొనియు నీకు - సేవకునిఁ జేసికొనవయ్య శేషశయన! భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
2780
చింతింపకు గడచినపని కింతులు వలతురని నమ్మ కెంతయు మదిలో నంతఃపురకాంతలతో మంతనములుమాను మిదియె మతముర సుమతీ!
1
kandamu
2842
పుత్త్రోత్సాహము తండ్రికి బుత్త్రుఁడు జన్మించినపుడే పుట్టదు జను లా పుత్త్రునిఁ గనుఁగొని పొగడఁగఁ బుత్త్రోత్సాహంబు నాఁడు పొందుర సుమతీ.
1
kandamu
2750
ఉత్తమ గుణములు నీచున కెత్తెఱఁగున గలుగ నేర్చు నెయ్యెడలం దా నెత్తిచ్చి కఱఁగి పోసిన నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ!
1
kandamu
2406
ఊరెఱిఁగిన బాపనికి వారక జన్నిదముఁ జూపవలెనా తద్‌జ్ఞుం డేరీతి నున్న నిస్సం సారిని ఘను లెంతు రన్న సంపఁగిమన్నా!
1
kandamu
4429
పయిమాట లొకలక్ష పలికిననే సరా య । హంకారవర్తన నడఁపవలయు నడఁపజాలక కానలందుఁబోయిన సరా । యెఱుక దెల్పెడి మూర్తి దొరకవలయు దొరికినాఁడని వేడ్క నరసిననే సరా । గురుపదంబుల భక్తి కుదరవలయు కుదిరెనంచని యూరకుండిననే సరా । పాయ కాత్మను బాటి సేయవలయు
3
seesamu
2517
ఘటదుగ్ధంబులు పేరుఁగాక వెలయంగా నెంత తోడంటి న- న్నట దుర్గాంబుధి పేరునే జగములో నల్పుండు దుస్సంగతిం జటులాత్ముండగుఁ గాక యెయ్యెడల నీ సద్భక్తుఁ డేకార్య ము- త్కటమై తాఁకిన నన్యచిత్తుఁడగునే తర్కింప సర్వేశ్వరా!
4
mattebhamu
300
అమరేంద్రాది సమస్తదేవభయదాహంకారహుంకార దు- ర్దదబాహాబలసింహనాద పటుకోదండోగ్రబాణచ్ఛటా- సమజాగ్రత్ఖరదూషణాసురుల భాస్వద్దండకారణ్యసీ- మ మును ల్మలని మెచ్చఁ ద్రుంచితివి రామా! భక్తమందారమా!
4
mattebhamu
852
శక్రసుతుఁ గాచుకొఱకై చక్రము చేపట్టి భీష్ముఁ జంపఁగ చను నీ విక్రమ మేమని పొగడుదు నక్రాగ్రహ సర్వలోక నాయక కృష్ణా.
1
kandamu
847
అంగన పనుపున దోవతి కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన యా సంగతి విని దయనొసఁగితి రంగుగ సంపదలు లోక రక్షక కృష్ణా.
1
kandamu
184
పుడమి నీ దగు కొంచెపునడత లెంచ-కభినుతింతునె లోకైక విభుఁడ వనుచు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
902
ఆ దండకావనంబున కోదండముఁదాల్చినట్టి కోమలమూర్తీ నాదండ గావ రమ్మీ వేదండము కాచినట్టి వేల్పువు కృష్ణా.
1
kandamu
1390
నవ్వుకుంచును కార్వేటినగరమునను । వీధినెదురైన సిగ్గున వీపుగప్పి త్రోవ దొలగిననాటి నీ భావమెన్న । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
1065
వాయుభక్షణ చేసి వనటఁ గుందదె పాము | గుహలలో దూఱదే గూబపులుఁగు వృక్షశాఖలమీఁద వ్రేలుచుండదె పక్షి | కానలఁ దిరుగదే వానరంబు చెలరేఁగి కూయదే ఝిల్లికాకూటంబు | గహ్వరి దిరుగదే గంగిరెద్దు నీట మునుంగదే మాటిమాటికిఁ గప్ప | యాకులు మెసవదే మేఁకపిల్ల
3
seesamu
1609
అల మైరావణుఁ డొక్కనాఁటి నిశి నిద్రాసక్తులై యున్న భూ పలలామేంద్రుల మ్రుచ్చిలించియు వెసన్‌ పాతాళలంకాపురిన్‌ ఖలుఁడై చొచ్చిన వాని వెంటఁ జని యాకష్టాత్మునిం ద్రుంచి శో భిలుచున్‌ నీవటు రామలక్ష్మణుల దేవే క్రమ్మఱన్‌ మారుతీ!
4
mattebhamu
4436
లంచగాండ్లను దగవుల నుంచరాదు । మాతృపితరుల యెడ భక్తి మఱువరాదు మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
3922
_x000D_ పుట్టుశక్తు లైదు పుడమి నటింపగ _x000D_ విప్రులెల్ల వేదవేత్తలండ్రు _x000D_ శక్తిపుత్రుకులము జగతిలో నెఱుగరో _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1231
అమ్మకు రెం డబ్బకు రెం డిమ్మహిఁ దిట్టించు కూఁతురెందుకు ధర నా ద్రిమ్మరి పుట్టక పోయిన నిమ్మళమని యండ్రు జనులు నిజము కుమారీ!
1
kandamu
260
చెఱువున్ సూనుఁడుఁ దోటయుం గృతియు నిక్షేపంబునుం దేవమం- దిరమున్ విప్రవివాహమున్ జగతి నెంతే వేడ్క గావించుచున్ నిరతంబున్ భవదీయపాదవిలసన్నీరేరుహద్వంద్వ సం- స్మరణం బూనెడువాఁడు ముక్తుఁడగు రామా! భక్తమందారమా!
4
mattebhamu
814
అనుకూలాన్వితయైన భార్యయును ధర్మార్థంబునైనట్టి నం దనులు\న్‌ సజ్జనులైన సోదరులు యెన్నంగల్గు సంపత్క్రియా ఘనుఁడైనట్టి మహానుభావుఁడె భవత్కారుణ్యదృగ్జాలభా జనుఁ డప్పుణ్యుని జూచిన\న్‌ శుభము కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
516
సిరిగలవాని కెయ్యెడలఁ జేసిన మేలది నిష్ఫలం బగున్‌ నెఱిగుఱి గాదు పేదలకు నేర్పునఁ జేసిన సత్ఫలంబగున్‌ వఱపున వచ్చి మేఘుఁడొక వర్షము వాడిన చేలమీఁదటం గురిసినఁగాక యంబుధులఁ గుర్వఁగ నేమి ఫలంబు భాస్కరా!
5
champakamaala
860
మగమీనమవై జలనిధిని బగతుని సోమకునిఁ జంపి పద్మభవునకు\న్‌ నిగమముల దెచ్చి యిచ్చితి సుగుణాకర మమ్ముఁ గరుణ జూడుము కృష్ణా.
1
kandamu
657
ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్‌ దరిద్రతా కారపిశాచసంహరణకార్యవినోది వికుంఠమందిర ద్వార కవాటభేది నిజదాసజనావళికెల్ల ప్రొద్దు నీ తారకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
3785
_x000D_ పతికి మాఱుపల్కు పడతియే శునకంబు _x000D_ మీఱుసతిని గవయ మిగులు వగలు _x000D_ పంది పంది కూడి పడదొకో రొంపిలో _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1908
గాననిక జాగు సేయక కరుణగల్గి | యింతికడ కేగుదెమ్ము నీ వింపుమీరతామసించిన మరు బాళి తాళదింక | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
1693
వెడవెడ నింక భోజనపువేళ గతించిన బిడ్డఁడేమొకో బడి విడి రాఁడు నేఁ డనుచుఁ బాతరలాడుచు నుండునంతలోఁ గడఁ జనుదేర నెత్తుకొని కౌఁగిటఁ జేరిచి చుంచు దువ్వి మై- బడలిక దీఱ సంతసిలు భామినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
3602
_x000D_ శత్రువులను ద్రుంచి శాంతంబు వహియించి _x000D_ కృత్యములను నడుపు నిత్యు నెఱిగి _x000D_ సత్యము చెడకుండ సాధించినటువంటి _x000D_ పురుషుఁ డౌను పుణ్యపరుండు వేమ.
0
aataveladi
3345
_x000D_ ముఱికికొంపలోన నిఱికించి జీవుని _x000D_ కర్మపాశములను గట్టివేసి _x000D_ నిట్టికర్మజీవి కెట్లొకో మోక్షంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2623
స్వామిద్రోహముఁజేసి యేనొకని గొల్వంబోతినో కాక నే నీమాటన్విన నొల్లకుండితినో నిన్నేదిక్కుగాఁ జూడనో యేమీ యిట్టి వృథాపరాధినగు నన్నీ దుఃఖవారాశి వీ చీమధ్యంబున ముంచియుంపఁదగునా శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
1158
కాయమున నాటు శరము లు పాయంబునఁ దీయవచ్చు బహు నిష్ఠురతన్‌ గూయ మది నాటుమాటలు పాయవుగా యెపుడు వెగడు పరచుఁ గుమారా!
1
kandamu
3232
_x000D_ నిత్యంబు కానియొడలికి _x000D_ నిత్యము దుఃఖమునఁబడును నిరతము ధరలో _x000D_ నిత్యానందపు పదవికి _x000D_ నిత్యంబును దుఃఖపడఁగ నేరదు వేమా.
1
kandamu
4137
_x000D_ జంగమాఖ్య భక్తి సంధివేఱుగలేదు _x000D_ సగుణభావ మదియ శాస్త్ర విధియు _x000D_ నిర్గుణంబు వీడు నెఱినేదియెఱుఁగఁడు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3745
_x000D_ ప్రళయకాలమందు ప్రమధులచేతను _x000D_ నష్టమైరిగాదె నాటిజనులు _x000D_ తెలియనేరరైరి దేవుని ద్విజులెల్ల _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3378
_x000D_ తా నొకటి దెలియునన్నది _x000D_ తానట్టిది లేక యెల్లతావులు దానై _x000D_ తానేగి పరిణమించిన _x000D_ మానవునకు ముక్తి గలదు మహిలో వేమా.
1
kandamu
567
ఉరగము లెమ్ములుం బునుక లుగ్రపిశాచములుం గళాసముల్ గరళము కంఠమూలమున గట్టిగ నెప్పుడు గల్గియుండియున్ బరమశివాకృతిం బొలుచు భద్రములిచ్చెద వబ్బురం బహా చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
2470
ఉద్యోగంబునఁ బురుషుఁడు సద్యోగముఁ జలుపవలయు సవిశేషముగా విద్యానిధి యగునతఁడే సద్యోముక్తుఁడు గదన్న సంపఁగిమన్నా!
1
kandamu
2182
వసుధాస్థలంబున వర్ణహీనుఁడు గాని - బహుళ దురాచారపరుఁడు గాని తడసి కాసియ్యని ధర్మశూన్యుఁడు గాని - చదువనేరని మూఢజనుఁడు గాని సకలమానవులు మెచ్చని కృతఘ్నుఁడు గాని - చూడ సొంపును లేని శుంఠ గాని అప్రతిష్ఠలకు లోనైన దీనుఁడు గాని - మొదటికే మెఱుఁగని మోటుగాని
3
seesamu
825
నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగఁ గృష్ణా.
1
kandamu
2541
కనకంబందు ఘనీభవించిన కళంకంబెల్ల సువ్యక్తిగా ననలాస్యంబునఁ దెఁగిపోవు గతి జీవాత్మం బ్రవేశించి చే- కొని వర్తించిన దుర్మలత్రయపరిక్షోభంబు నీ భక్తిచే- తను బాపంబడుఁ గాని యొండొకటి చేతం బోదు సర్వేశ్వరా!
4
mattebhamu
1471
కలపంబు నెమ్మేన నలది యొద్దిక జేరి । వినుతించి కప్పురవిడె మొసంగి యరవిరి సంపెందవిరులు సొంపుగ జుట్టి । కడుమోదమున బిగ్గ గౌగలించి పెదవితేనియలిచ్చి మదనదాహము దీర్చి । కెమ్మోవిపై పలుగెంపులుంచి పావురగతి కేరి పలికి చెక్కిలి జీరి । ముద్దిచ్చి లాలించి మోహరించి
3
seesamu
346
త్రిజగద్రక్షణశక్తిఁ గోరి కమలాధీశుడు నిన్వేయిపం- కజపత్త్రంబులఁ బూజసేయునెడ నొక్కండందులేకుండినన్ నిజనేత్రాబ్జ మతండొసంగినఁ గృప న్వీక్షించితౌఁ జక్ర మ- క్కజ మొప్పారఁగ నిచ్చి యేలుకొని భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu