id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
3972
_x000D_ ఇరుగుపొరుగువారి కెనయుసంపదఁ జూచి _x000D_ తనకులే దటన్న ధర్మమేమి _x000D_ ధర్మమన్నఁ దొల్లి తన్నుక చచ్చిరి _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2325
రవిసూనుం బరిమార్చి యింద్రసుతునిన్ రక్షించినావందునో రవిసూనుం గృపనేలి యింద్రసుతుఁ బోరం ద్రుంచినావందునో యివి నీయందును రెండునుం గలవు; నీ కేదిష్ట మౌనో కదా రవివంశాగ్రణి! తెల్పవయ్య రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
1155
తిరుగకు దుర్మార్గులతో నరుగకు గహనాంతర స్థలాదుల కొంటిన్‌ జరుగకు శత్రులమ్రోల న్మరువకు మేల్‌ హితులయెడల మదిని గుమారా!
1
kandamu
2514
అవనిం బెన్నిధి భాగ్యహీనునకుఁ బ్రత్యక్షంబు గాకప్పు డొం- డవ భాండాకృతిఁ దాల్చి మాఁటువడి మాయావృత్తి నున్నట్లు దా భవదీయప్రతిబింబమూర్తియగు సద్భక్తుండు సంసారదు- ర్వ్యవయసాయాత్ముల కెల్లఁ గేవలనరుండై తోఁచు సర్వేశ్వరా!
4
mattebhamu
844
అండజవాహన విను బ్ర హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీ వా కొండల నెత్తితి వందురు కొండిక పనిగాక దొడ్డ కొండా కృష్ణా.
1
kandamu
408
అదిగో బాఁపనయల్లుభొట్లయకు ముందప్పయ్యతీర్తంబులో నదనం ‘గిద్దెఁడు కొఱ్ఱనూక లిడితిన్ అబ్బబ్బ! తిర్నామముల్ సదువం జాగిన మాలదాసర యలన్ సంతోసనాల్ సేసితిం గద’ యంచుం బలుమోటులాడుదురు భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
3039
ముదితరో యిట్టి యవతారమూర్తినైన | నన్ను దూషింప నిది నీకు న్యాయమటనెనా యూరి పేర్విను తాడిమళ్ల | రాజగోపాలుఁడందురే రమణి నన్ను.
2
teytageethi
2902
ఎన్నఁడు నిన్ను గన్గొనుదు నెన్నఁడు కౌగిటఁ జేర్చుకొందు నిం- కెన్నఁడు ముచ్చటాడి సుఖియించెద నెన్నఁడు వేడ్క మించెదన్ క్రొన్నలరారు మేకపయి క్రొన్ననవిల్తునికేళి దేల య- భ్యున్నతలీల నే తనివినొందుట యెన్నడు? సుందరీమణీ!
6
vutpalamaala
4325
చక్కదనంబు రాశి నునుసానల\న్‌ బట్టినపువ్వుటమ్ములోఁ జక్కెర నించి చేసిన రసస్థితి శ్రీయలమేలుమంగ నీ మక్కువఁ జిక్కి మాతలభ్రమం దగులై కలవంత నిట్ల నీ వక్కుఁనఁ జేర్పఁగా నలరె నన్నువ కౌఁగిట వేంకటేశ్వరా!
6
vutpalamaala
2
భాను సితభాను నేత్ర సౌభాగ్యగాత్ర-యోగిహృద్గేయ భవనైక భాగధేయ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
2786
తన యూరి తపసితనమును దన పుత్త్రుని విద్య పెంపుఁ దన సతి రూపున్‌ దన పెరటిచెట్టు మందును మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ!
1
kandamu
4391
కొండసిగల్ తలగుడ్డలు పాకోళ్ళు । చలువవస్త్రములు బొజ్జలు కఠార్లు కాసెకోకలు గంపెడేసి జందెములును । దలవార్లు జలతారు డాలువార్లు సన్నపు తిరుచూర్ణచిన్నెలు కుట్టాలు । జొల్లువీడెమ్ములు వల్లెవాట్లు దాడీలు వెదురాకు తరహా సొగసుకోర్లు । నంతకు దొరగార్లటంచుఁ బేర్లు
3
seesamu
3682
_x000D_ బూదిపూఁత లెన్న భుజముల పొంకాలు _x000D_ వ్రాలు లింగములును వరుసమతము _x000D_ తిక్కడగునుగాక యెక్కఁడ దగ దట్లు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1230
కూతురు చెడుగై యుండిన మాతది తప్పన్నమాట మది నెఱుగుదుగా నీతల్లిదండ్రులకు నప ఖ్యాతులు రానీయఁ గూడదమ్మ! కుమారీ!
1
kandamu
4608
హాడువె దామహార సదినంఘ్రియుగ భ్రమగొండు సద్గుణా మాడు వదర్చనంబిడె సమగ్రనుతిత్వయి సత్క్రియన్‌ దగన్‌ 'గూఢమణిప్రవాళము'నఁ గోరి నుతింతును సంచితార్థముల్‌ పాడిగ నివ్వటిల్ల బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
1809
తరువు బాసిన తీగె తెరగున విభు బాసి యెటు నిల్వనోపుదు నింతులారననుగైన మొగులు గానని నెమ్మి కైవడి ముచ్చట లేదాయె ముదితలారజలము బాసినయట్టి జలజంబువలె మది సొంపొకించుక లేదె సుదతులారకొమరైన ద్విజరాజు కూరిమి లేనట్టి కుముదంబువలెనాయె కొమ్మలార
3
seesamu
2841
మది నొకని వలచియుండఁగ మది చెడి యొక క్రూరవిటుఁడు మానక తిరుగున్‌ అది చిలుకఁ బిల్లిపట్టినఁ జదువునె యాపంజరమున జగతిని సుమతీ.
1
kandamu
3452
_x000D_ కర్మము జ్ఞానికి దవ్వగు _x000D_ గర్మమునకు జ్ఞాని దవ్వుకలియుగ మందున్‌ _x000D_ గర్మజ్ఞానము లుడిగిన _x000D_ నిర్మలునకుఁ గలుగు ముక్తి నిజముగ వేమా.
1
kandamu
4119
_x000D_ కల్లలాడుకంటె కష్టంబు మఱిలేదు _x000D_ కష్టమెపుడు కీడుఁ గలిగియుండు _x000D_ ద్విజుఁడననుట చూడఁ ద్రిమ్మరితన మది _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3708
_x000D_ శివ మతమునకైన వివరింపగా గుర్వు _x000D_ హరిమతమునకైన నరయ గుర్వు _x000D_ గురువు నెఱుఁగలేని గుణహీనుఁడేమెఱుఁగు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
403
చెనఁటు ల్గూర్చుధనంబు మ్రుచ్చులకు దాసీవారయోషాహు- తాశనదుష్టక్షితిపాలకప్రతతికిన్ సంరూఢిఁ జేకూరు గా- కనవద్యప్రతిభావిభాసితబుధేంద్రానీకముం జేరునే? కనదుద్దామపరాక్రమప్రథిత! భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
2792
తలమాసిన నొలుమాసిన వలువలు మాసినను బ్రాణవల్లభునైనన్‌ గులకాంతలైన రోఁతురు తిలకింపఁగ భూమిలోనఁ దిరముగ సుమతీ!
1
kandamu
1612
సరసాగ్రేసరుఁడైన రామవిభుఁ డంచద్రత్నసౌవర్ణపు ష్పరథంబెక్కి సుమిత్రపట్టి వెనుకన్‌ ఛత్రంబుఁ బట్టన్‌ మహా భిరతిన్‌ లక్ష్మణుఁ డవ్విభీషణుఁ డొగిన్‌ వింజామరల్‌ వీవ సుం దరసాకేతపథంబుఁ బట్టి చనుచోఁ దత్పాదుకల్‌ మౌళిపైఁ బరమప్రీతి ధరించి మ్రోలఁ జనవే వర్ణింపుచున్‌ మారుతీ!
4
mattebhamu
850
జయమును విజయున కియ్యవె హయముల ములుకోల మోపి యదలించి మహా రయమున రొప్పవె తేరును భయమున రిపుసేన విఱిగి పాఱఁగఁ గృష్ణా.
1
kandamu
544
ధరణి రథంబుగా శృతివితానము వాజులుగా రమామనో- హరుఁడు శరంబుగా మరుదహార్యము సింగిణిగా బిలేశయే- శ్వరుఁడు గుణంబుగా నలువ సారథిగాఁ దిగప్రోళ్లఁ గూల్చితౌ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
1267
సరకులయెడ జాగ్రత్తయుఁ జుఱుకు పనులయందు భక్తి సుజనులయందున్‌ గరుణ యనాథుల యెడలం దరుణికి జెలువారవలయు ధరణిఁ గుమారీ!
1
kandamu
59
కల్లరు ల్గాని వ్రేపల్లెవా రందఱు- హర్షింప నచట నీయాట సాగె మధురాపురీవరమనుజు లామోదించి- మన్నింప నచట నీయాట సాగె ద్వారకాపట్టణధన్యులు నినుఁ గోరి- కొల్వఁగా నచట నీకొల్వు సాగెఁ గరిపురధర్మజుం డురురాజసభ నిన్ను- భూషింప నచట నీముర్వు సాగె
3
seesamu
1501
స్త్రీలపై నతిబాళి జెందిన పురుషుల । కపకీర్తి దీనత నగుడు దిగులు పరువుతక్కువ మోక్షపదవికి దొలుగుట । నైష్టికహీనంబు నవ్వుపాటు చుట్టపక్కంబుల సుళ్లడగించుట గాసి । విబుధాళి గన్న భవిష్యహాని మానంబు విడి యవమానంబు నొందుట । ధనము గోల్పోవుట తనువు చెడుట
3
seesamu
514
సారవివేకవర్తనల సన్నుతికెక్కిన వారిలోపలం జేరినయంత మూఢులకుఁ జేపడ దానడ; యెట్టులన్నఁ గా సారములోన హంసముల సంగతి నుండెడి కొంగపిట్ట కే తీరునఁ గల్గ నేర్చును దదీయగతుల్‌ దలపోయ భాస్కరా!
6
vutpalamaala
2651
చావంకాలము చేరువౌటెఱిఁగియుం జాలింపఁగా లేక త న్నేవైద్యుండు చికిత్సఁబ్రోవగలఁడో? యేమందు రక్షించునో? యే వేల్పుల్‌కృపఁజూతురో?యనుచు నిన్నింతైనఁ జింతింపఁడా జీవచ్ఛ్రాద్ధముఁజేసికొన్న యతియున్‌ శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
2150
పంజరంబునఁ గాకిఁ బట్టి యుంచిన లెస్స - పలుకునే వింతైన చిలుక వలెను? గార్దభంబును దెచ్చి కళ్లెమింపుగ వేయఁ - దిరుగునే గుఱ్ఱంబు తీరుగాను? ఎనుపపోతును మావటీఁడు శిక్షించిన - నడచునే మదవారణంబు వలెను? పెద్దపిట్టను మేఁతఁబెట్టి పెంచినఁ గ్రొవ్వి - సాగునే వేఁటాడు డేఁగ వలెను?
3
seesamu
2084
అధిక విద్యావంతులప్రయోజకులైరి - పూర్ణశుంఠలు సభాపూజ్యులైరి సత్యవంతులమాట జనవిరోధంబాయె - వదరుఁబోతులమాట వాసికెక్కె ధర్మవాదనపరుల్‌ దారిద్ర్యమొందిరి - పరమలోభులు ధనప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి - దుష్టమానవులు వర్ధిష్ణులైరి
3
seesamu
1010
సప్తసంతానకర్త లీ సదమలాత్ము | లెపుడు నిహపరసుఖముల నెనయుచుండ్రు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
4333
కౌస్తుభవక్ష శ్రీకరపాదరాజీవ । దీనశరణ్య మహానుభావ కరిరాజవరద భాస్కరకోటిసంకాశ । పవనభుగ్వరశాయి పరమపురుష వేదవేద్యానంతవిభవ చతుర్దశ- । భువనశోభనకీర్తి పుణ్యమూర్తి వైకుంఠపట్టణవాస యోగానంద । విహగరాడ్వాహన విశ్వరూప
3
seesamu
2808
పరసతి కూటమిఁ గోరకు పరధనముల కాసపడకు పరునెంచకుమీ సరిగాని గోష్ఠి సేయకు సిరి చెడిఁ జుట్టంబుకడకుఁ జేరకు సుమతీ!
1
kandamu
2790
తలనుండు విషము ఫణికిని వెలయంగాఁ దోఁక నుండు వృశ్చికమునకున్‌ తల తోఁక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!
1
kandamu
4574
నందితభక్తబృంద! యవినాశిరదాంశు ముఖారవింద! సా నంద వినీతికంద! కరుణామకరంద! రసోపలాలిత స్కంద! యుదాత్త భక్తి తరుకంద! యశోజితకుంద! నాకరా డ్వందిత! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
1835
మందగామిని మోముచందంబు జాచిన బొందదే రతికాంక్ష బూని నీకుసోగకన్నుల దృష్టిసొగసు జూచినయంత నిలువనిచ్చునె మది నిముషమైనవనజాక్షి లేజిగివాతెర జూచిన పలుమొన లూరవే పరమపురుషపడతి సంతసమున బలువిచ్చి నవ్విన గనకాభిషేకంబు గాంచినట్టు
3
seesamu
166
యశ మదెంతొ ప్రయాస లభ్యంబె కాని-యెంతలో వచ్చు నపకీర్తి యెఱుఁగ వేమి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
2591
ఒనరం జిత్తము శుద్ధిలేని నరుఁ డుద్యోగంబునం గోరి చే- సిన పూజావిభవంబు సువ్రతములున్ శీలంబులు న్మంత్రసా- ధనముల్ తీర్థంబులుం దపంబులును మీఁదం జెట్టవాఁ డభ్యసిం- చిన శస్త్రాస్త్రకళానిభంబులగుఁ జర్చింపంగ సర్వేశ్వరా!
4
mattebhamu
3727
_x000D_ బూతులేని లంజ భూతంబు కూఁతురు _x000D_ ప్రీతిలేనిపాటు ధాత్రిచేటు _x000D_ దాతలేని యూరు దయ్యాల పేటరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3252
_x000D_ గతము చూతమన్న కలఁగన్న యర్థంబు _x000D_ నడుచు కార్యమేని నమ్మరాదు _x000D_ క్షణములోని బ్రతుకు సంసార విభ్రాంతి _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4551
తజ్ఞ! జితప్రతిజ్ఞ! యుచిత ప్రమథానుగతజ్ఞ! నమ్ర దై వజ్ఞ! కళావిధిజ్ఞ! బలవచ్ఛివభక్తి మనోజ్ఞ! ధూతశా స్త్రజ్ఞ! సువాదపూరిత రసజ్ఞ! తృణీకృత పంచయజ్ఞ! స ర్వజ్ఞ! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
4396
మంచిమాటల నెంత బోధించి చెప్ప । మడియ రండకుని గుణంబు విడువబోదు మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
4367
ఆలిని వంచుకోఁజాలక తగవర్ల । బ్రతిమాలుకొనువాని బ్రతుకు రోఁత నర్తనాంగనల వెన్కను జేరి తాళముల్ । వాయించువాని జీవనము రోఁత వ్యభిచరించెడి వారవనిత గర్భంబునఁ । బురుషత్వము వహించి పుట్ట రోఁత బంధుకోటికి సరిపడని దుర్వృత్తిని । బడియున్న మనుజుని నడత రోఁత
3
seesamu
1984
లలితం బైన భవత్తనూవిలసనన్‌ లావణ్యదివ్యామృతం బలుఁగు ల్వారఁగ నీకటాక్షమునఁ దా మందంద గోపాంగనల్‌ తలఁపు ల్పాదులు కట్టి కందళిత నూత్నశ్రీలు వాటింతు రా నెలతల్‌ తీవెలు చైత్రవిస్ఫురణమౌ నీ యొప్పు నారాయణా!
4
mattebhamu
2269
అనఘంబైన దశాశ్వమేధకృత పుణ్యస్ఫూర్తి నీకొక్క మా టు నమస్కారము సేయఁ గల్గునని విందున్; యాగధర్మంబులున్ గొనసాగున్; జననంబు లుక్కడఁగు నీకున్ మ్రొక్కెనేనిన్ బున ర్జననంబేది దలంచి చూడ రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
112
పెట్టుపేరు లనేకముల్‌ పుట్టుపేరు-గుఱు తెఱింగిన నీమూల మెఱుఁగవచ్చు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
395
జనసంస్తుత్యమహాప్రబంధఘటనాసామర్థ్యముల్ గల్గు స- జ్జను లత్యల్పుల దీనతం బొగడుదుర్ జాత్యంధతం జెంది కా- కనువొప్పం దమరెన్నఁడున్ ‘సుకవితా యద్యస్తి రాజ్యేన కి’ మ్మను వాక్యంబు వినంగలేదొ మును? భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
905
పరులను నడిగిన జనులకు కుఱుచ సుమీ యిది యటంచు గుఱుతుగ నీవు\న్‌ గురుచఁడవై వేఁడితి మును ధరఁ బాదత్రయము బలిని దద్దయుఁ గృష్ణా.
1
kandamu
943
రక్షించితివి కదా రవిసూను బడఁదన్ని | చిరకృపామయబుద్ధి శ్వేతకేతు భక్షించితివి కదా బ్రహ్మాండనివహకో- | లాహలభయద హాలాహలంబు శిక్షించితివి కదా శితఖడ్గధారాంచ- | లమున దక్షాంధకప్రముఖ ఖలుల వీక్షించితివి కదా వితతఫాలానల- | జ్వాలచే మరుని భస్మంబు గాఁగ
3
seesamu
1716
“అనయము కీర్తిహాని సుజనాదరణీయము గాదు సిగ్గుఁబా- టెనయఁగఁ జేయు లోకు లతిహీనతగా మతినెంతు రెందు దు- ర్జనసహవాస మేరికినిఁ జౌక ఘటించుఁ దలంచినన్ సుమా విను”మని బుద్ధిఁ జెప్పు ఘనవేణినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
1279
కోపమున నప్పు డాడ ని రూపించినమాటఁ గొన్ని రోజులు చనినం జూపెట్టుదు నని శాంతము లోపలఁ గొనవలయు ధర్మలోల! కుమారీ!
1
kandamu
1203
కడుమెల్లన నిడు నుత్తర మడఁచును గోపమును దీక్ష్ణమమరఁగ దా న ప్పుడు నుడివెడు నుత్తరముడి వడిఁ గోపముఁ బెంచు నరయ వసుధఁ గుమారా!
1
kandamu
245
వ్రతముల్ పట్టిన దేవభూసురగురువ్రాతంబులం గొల్చినం గ్రతుతంత్రంబులు దానధర్మము లపారంబౌనటుల్ చేసినన్ శతవర్షంబులు గంగలో మునిఁగినన్ సంధిల్లునే ముక్తి దు- ర్మతికిం దావక భక్తి గల్గమిని ? రామా! భక్తమందారమా!
4
mattebhamu
2762
కనకపు సింహాసనమున శునకముఁ గూర్చుండఁబెట్టి శుభ లగ్నమునం దొనరఁగఁ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!
1
kandamu
3749
_x000D_ మునిఁగి బ్రాహ్మణుండు ముందుఁగానకపోయె _x000D_ తిరిగి తిరిగి యతఁడు ద్రిమ్మ రాయె _x000D_ కూసికూసితుదకు కుక్కయై పోయెరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1636
పొరుగిరుగిండ్ల భామినులు పుత్రులు గల్గుట కాత్మతత్త్వసు- స్థిరమతిఁ జేయు సాధనముఁ జెప్పిన య ట్లుపవాసదేవతా- చరణయుగార్చనప్రభృతి సత్కృతులెల్లను దానొనర్చుచోఁ జిఱుతల మీఁది యాశ మదిఁ జేడ్పడు తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
1566
కడఁకన్‌ రావణప్రేరితుం డగుచు వీఁకన్‌ జంబుమాల్యాఖ్య దై త్యుఁడు సేనాయుతుఁడై రణంబునకుఁ దోడ్తో డాసినన్‌ వానిఁ బ ల్విడి భాస్వత్పరిఘాయుధంబున బలోపేతంబుగా నాజిలో గడిమిం జంపి యుగాంతమేఘముక్రియన్‌ గర్జింపవే మారుతీ!
4
mattebhamu
3434
_x000D_ ఇదినాకుఁ జాలఁదనుచును _x000D_ వదలక మదిలోననైన వస్తువు భ్రమతల్‌ _x000D_ కదిసి విడనాడ కుండిన _x000D_ నదియే సంసారబీజ మందుర వేమా.
1
kandamu
942
గూర్చి బారులు దీర్చి చిట్టార్చి పేర్చి | యోర్చి పురదానవులఁ దెగటార్చితీవు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
3502
_x000D_ ఎలుకతోక దెచ్చి యెందాక నుతికిన _x000D_ నలుపుగాక యేల తెలుపు గలుగు _x000D_ కొయ్యబొమ్మ తెచ్చి కొట్టిన గుణియౌనె _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
658
విన్నపమాలకించు రఘువీర! నహిప్రతిలోకమందు నా కన్నదురాత్ముఁడు బరమకారుణికోత్తమ! వేల్పులందు నీ కన్న మహాత్ముఁడుం బతిత కల్మషదూరుఁడు లేఁడునాకు వి ద్వన్నుత నీవె నాకు గతి దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
2040
ఆదినారాయణా! యనుచు నాలుకతోడఁ - బలుక నేర్చినవారి పాదములకు సాష్టాంగముగ నమస్కార మర్పణఁ జేసి - ప్రస్తుతించెదనయ్య బహువిధముల ధరణిలో నరులెంత దండివారైనను - నిన్నుఁ గాననివారి నే స్మరింప మేము శ్రేష్ఠులమంచు మిడుకుచుండెడివారి - చెంతఁ జేరఁగఁబోను శేషశయన!
3
seesamu
2259
క్షితిలో నల్పులమీఁదఁ జెప్పిన కృతుల్ ఛీఛీ నిరర్థంబులౌ నుతిపాత్రమ్ములు గావు మేఁక మెడ చన్నుల్ నేతిబీఱల్సుమా వితత ప్రౌఢిమ నీకుఁ జెప్పిన కృతుల్ వేదాలు శాస్త్రాలు భా రత రామాయణముల్ దలంప రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
1195
ధనవంతుఁడె కులవంతుఁడు ధనవంతుఁడె సుందరుండు, ధనవంతుండే ఘనవంతుఁడు బలవంతుఁడు ధనవంతుఁడె ధీరుఁడనుచుఁ దలఁపు కుమారా!
1
kandamu
671
పాతకులైన మీ కృపకుఁ బాత్రులు కారె తలంచి చూడ జ ట్రాతికిఁగల్గె భావన మరాతికి రాజ్యసుఖంబము గల్గె దు ర్జాతికిఁబుణ్యమబ్బె గపిజాతిమహత్త్వము నొందెఁగావునం దాతవ యెట్టివారలకు దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
2079
సాధుఁడను మూర్ఖమతి మనుష్యాధముఁడను - హీనుఁడను జుమ్మి నీవు నన్నేలుకొనుము భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
1858
వెలది యెట్లోర్తు శశిమంట వెలుగ గొమ్మ | పోయెదవె యిప్డు నా పతి బొగడగొమ్మప్రియముతోనని నను బంచె బిల్వగొమ్మ | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
1522
లేరా కీశులనేకులుం? ద్రిజగముల్‌ వీక్షించి రా నేర్పరుల్‌ గారా? రాముఁడు జానకిన్‌ వెదక వీఁకన్‌ గీశులం బంపుచో నారూఢిన్‌ భవదీయ దివ్యమహిమ వ్యాపారముల్‌ సూచి కా దా! రత్నాంగుళి భూషణం బిడియె నీ హస్తంబునన్‌ మారుతీ!
7
saardulamu
431
ఊరక వచ్చుఁ బాటు పడకుండిననైన ఫలం బదృష్ట మే పారఁగఁ గల్గువానికిఁ బ్రయాసము నొందిన దేవదానవుల్‌ వారలటుండఁగా నడుమ వచ్చిన శౌరికిఁ గల్గెఁ గాదె సృం గారపుఁ బ్రోవు లక్ష్మియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా!
6
vutpalamaala
2360
వినవలె సద్గురువులచేఁ గనవలె నరచేతియుసిరికాయయుఁబలెఁ దా మనవలె బ్రహ్మము దానై సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా!
1
kandamu
393
అకటా! జుత్తెఁడు పొట్టకై కృపణమర్త్యాధీశగేహాంగణా- వకరక్షోణిరజశ్ఛటావిరతసంవ్యాప్తాంగులై క్రుంగి నె- మ్మొకముల్ వెల్వెలఁబాఱ వ్రేలు దురదేమో యెందులం బోవనే- రక ధీమజ్జను లెంతబేలలొకొ! భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
3523
_x000D_ తొత్తుతోడిపొందు తొఱ్ఱిపెసలమూట _x000D_ ముచ్చుతోడిపొందు తెచ్చునింద _x000D_ తలవరింటిపొందు తలతోటిదీరురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3753
_x000D_ మొదలమ్రాను నగును తుద పక్షియును గాదు _x000D_ నోరు లేదు పండ్లు నాఱు గలుగు _x000D_ జీవమొకటిలేదు జీవులఁజంపురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2087
బుడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి - సజ్జనులఁ జేయలేఁడెంత చతురుఁడైన భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
4518
హుంకరించిన నెటువంటి మంకునైనఁ । దిట్టవలయును గవులకు దిట్టమదియె మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
1233
ధనహీనుఁడైనఁ గడు దు ర్జనుఁడైనఁ గురూపియైన జారుండైనన్‌ విను పాపియైన నెప్పుడుఁ దనపతియే తనకు దైవతంబు కుమారీ!
1
kandamu
2358
తత్త్వజ్ఞానానంద మ హత్త్వము రచియింతు నీదయన్‌భువిఁ గృతకృ త్యత్త్వము నిత్యత్వముగా సాత్త్వికపరయోగు లెన్న సంపఁగిమన్నా!
1
kandamu
776
ఏలావిద్యలు సొంపు రూపవిభవం బేలా కులీనత్వము\న్‌ శీలత్వంబును నేల యేటికి వచశ్శ్రీ యేల బాహాబలం బేలా చాతురి మీకృపాగరిమ నిక్షేపంబు లేకుండిన\న్‌ జాలిం బొందినఁ గల్గునే సిరులు కృష్ణా దేవకీనందనా.
7
saardulamu
1767
పగడంపుగోడల బంగారుపట్టెల చప్పరంబొప్పు మంచం బమర్చిక్రొత్త తాప్తా దూదిమెత్తపైన పరంజిజరి తలగడదిండ్లు చక్కబరచిపరిమళద్రవ్యముల్ పన్నీరుగంధంబు రత్నాలగిన్నెను జతను పరచియరవిరిబంతులు మరువంబు కురువేరు నపరంజితట్టల నమరజేర్చి
3
seesamu
175
ని న్నెదుర్కొన రాని నెపమునఁ గోపించి- గోపితహితు నూతుఁ గొట్టవలెనె? సంబంధినోటఁ గొంచెపుమాట రా వాని- కరిపురం బలుకఁ బెకల్పవలెనె? నిను జూచి వేడ్క నొందిన గర్వముగ నెంచి- నిండి పాఱెడు నీరు నిలుపవలెనె? చెలికానివలె నొద్దఁ చేరి యెత్తుకొనంగఁ- గినుకఁ ప్రలంబునిఁ దునుమవలెనె?
3
seesamu
3172
_x000D_ గంగగోవుపాలు గరిటెడైనను జాలు _x000D_ కడివెడైననేమి ఖరముపాలు _x000D_ భక్తిగలుగుకూడు పట్టెడైనను జాలు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1633
ఇలఁ గల దేవతాతతులనెల్ల మనంబున నెంచి నామముల్ పలుమఱు నోటఁ బల్కుచును బార్వతి గేహముఁ జొచ్చి శాంభవీ- లలితకుమారసంభవఫలప్రదమైన వివాహమింకఁ గా- వలెనని మ్రొక్కి వేఁడు సుతవాంఛకుఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
1923
అంత శ్రీకృష్ణుడా యలివేణితో గూడి మెరయ మిద్దెలయందు మేడలందుకేళివనములందును కృతాద్రులందును పొదరిండ్ల దగు సురపొన్నలందునిసుకదిన్నెలయందు శశికాంతశిలలందు మదనోత్సవములను మగువ గూడిసుఖలీల నెదుకులసోముడై చెన్నొంది పరగ భక్తుల బ్రోవ భవ్యమతిని
3
seesamu
1975
పెరుగుల్‌ ద్రచ్చుచు నొక్కగోపిక మిముం బ్రేమంబునం జూచి రా గ రసావేశత రిత్త ద్రచ్చ నిడ నాకవ్వంబు నీవు న్మనో హరలీలం గనుగొంచు ధేను వని యయ్యాబోతునుం బట్టి తీ వరవృత్తాంతము లేను పుణ్యకథగా వర్ణింతు, నారాయణా!
4
mattebhamu
2635
రాజుల్మత్తులు, వారిసేవ నరకప్రాయంబు, వారిచ్చు నం భోజాక్షీ చతురంతయాన తురగీ భూషాదు లాత్మవ్యథా బీజంబుల్‌, తదపేక్షచాలుఁ బరితృప్తింబొందితి\న్‌ జ్ఞానల క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
939
అభవు నక్షయు నాద్యు నవ్యక్తు నవ్యయు | ననఘు ననంతు నాద్యంతరహితు నప్రమేయు నజేయు నకలంకు నసమాను | నానందమయు నాఢ్యు నాత్మరూపు నచలు ననామయు నఖిలేశు నద్వయు | నార్తరక్షాచణు ననఘహృదయు నమలాత్ము నజుగురు ననవద్యు నభయదు | నసహాయు నతిపుణ్యు నగ్రగణ్యు
3
seesamu
3869
_x000D_ గుఱుతు తిథులవలనఁ గులమెల్లఁ జెడిపోయె _x000D_ స్త్రీల నడతవలన సిగ్గుపోయె _x000D_ ఏహ్యపల్వలముల నిలయెల్లఁ జెడిపోయె _x000D_ చాన్లవలన బ్రతుకు సమయు వేమా.
0
aataveladi
2059
మాట నిలుకడ సుంకరిమోటు కేల? - చెవిటివానికి సత్కథాశ్రవణ మేల? భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
1452
గోల భయమంది యిక తాళజాలదనుచు । హాయి మీరగ నుపరతి నడుగ వెరతు దాని సుగుణంబు రూపమింతని వచింప । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
3667
_x000D_ ఎన్నియెన్ని పూజలెచటఁ జేసిన నేమి _x000D_ భక్తిలేని పూజ ఫలములేదు _x000D_ భక్తి గల్గుపూజ బహుళ కారణమురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2091
పూని నిన్నుఁ గొల్చుటే సర్వభూషణంబు - లితర భూషణముల నిచ్చగింపనేల? భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
248
ఉదయార్కాంశువికస్వరాంబుజరమాయుక్తంబులై యొప్పు నీ పదముల్ ధ్యానము చేసి ముక్తియువతిం బ్రాపింపఁగా లేక దు- ర్మదవృత్తిన్ బశుమాంస మగ్ని దనరారన్ వేల్చుఁగా దేవతా మదిరాక్షీసురతేచ్ఛ, భూసురుఁడు రామా! భక్తమందారమా!
4
mattebhamu
4070
_x000D_ ధనములేమి కులము తక్కువపడవచ్చు _x000D_ ధనములేమి కీర్తి దలఁగిపోవు _x000D_ ధనములేమి శుచిని దగఁబుట్టనియ్యదు _x000D_ ధనములేమి ఘనత తప్పు వేమ.
0
aataveladi
1574
"బాలారత్నము సీత మ్రుచ్చిలిటు నీ పాలింటికిన్‌ మృత్యువం చాలోకింపక దెచ్చితింత కెపుడో యద్దేవి కోపానల జ్వాలాళిం బడి భస్మమై చనక సప్రాణుండవై యుండుటల్‌ చాలన్‌ చిత్రము భర్తచేఁ గలన నిన్‌ జంపింప నిందాక ని ట్లాలస్యం బొనరించె" నంచనవె దేవారాతితో మాఅరుతీ!
7
saardulamu
682
భూపలలామ రామ రఘుపుంగవరామ త్రిలోకరాజ్య సం స్థాపనరామ మోక్షఫలదాయకరామ మదీయపాపముల్‌ పాపఁగదయ్య రామ నినుఁ బ్రస్తుతిసేసెదనయ్య రామ సీ తాపతి రామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
1461
వనజాక్షి భువి రూపవతులెందు నిక లేరా । నవురుగా నొకవేళ నవ్వుకోరా యెదటి భావంబు గుర్తెరిగి మన్నించరో । యెంచి యంతట పల్కరించుకోరా యతినయోక్తుల క్షేమమడుగరో వలపించి । సతిపతులని యున్న జగములోన శుకవాణి చెర్లాటలకు కలహించరో । కలహించి పిమ్మట గలుసుకోరా
3
seesamu
3674
_x000D_ ఒడలు బడలఁజేసి యోగుల మనువారు _x000D_ మనసు కల్మషంబు మాన్పలేరు _x000D_ పుట్టమీదఁ గొట్ట భుజగంబు చచ్చునా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
185
మామయింటికిఁ బోవ మంచితీర్థము పుట్ట- దతఁ డంత కారువాఁడతఁడె సుమ్ము పునుక కంచము తోలుపుట్టంబు గలమిత్రుఁ- డెందు నన్నముఁ జెట్టు నేమి గప్పు మాటమాత్రం బైన మగువ నో రాపదు- కొడుకు పెట్తునె తలగొట్లమారి యన్నది మేషాండ మున్న దిచ్చే దొక్క- తొఱ్ఱిగొ డ్డది నీకుఁ దోలు నేమి
3
seesamu