id stringlengths 1 4 | poem stringlengths 71 312 | label int64 0 7 | label_name stringclasses 8
values |
|---|---|---|---|
4017 | _x000D_
పరఁగ లేమిచేత బంధువుల్ పగవారు
_x000D_
పరఁగ లేమిచేతఁ బరము తప్పు
_x000D_
పరఁగ లేమిచేతఁ బరపతి దప్పురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4103 | _x000D_
దుండగీడు కొడుకు కొండీడు చెలికాఁడు
_x000D_
బండరాజునకును బడుగుమంత్రి
_x000D_
కొండముచ్చునకును గోఁతియు సరియౌను
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1831 | పంకజముఖి వేణి శంకరాభరణంబు చెలియ నగవు పూర్ణచంద్రిక యగుకలికి చూపులసొగసుగా వొప్పు సారంగ ననబోడి నాభి పున్నాగ యనగకాంత నెమ్మెయి తిరుకల్యాణి యనదగు బడతి జఘనంబు భూపాల యగునునింతి ప్రాణేశు లాలింపగా నాయకి విభు పరిచారియై విసర సురటి | 3 | seesamu |
2321 | త్రోవన్ మానవుఁ డొంటిఁబోవుతఱి నీస్తోత్రంబు వాక్రుచ్చినన్
నీవుం దమ్ముఁడుఁ దోడువత్తురటె నీ నెయ్యంబు తియ్యంబుగా
నీవంటాప్తుఁడు నిన్నుఁ బోలు హితుఁడున్ నీవంటి భక్తప్రియ
ప్రావీణ్యుండును లేఁడు చూడ రఘువీరా! జానకీనాయకా! | 7 | saardulamu |
3830 | _x000D_
పరఁగ ముందఱ తమ బ్రతుకుతె ర్వెఱుఁగక
_x000D_
సకల సంపదలును సతము లనుచు
_x000D_
జలముఁ బాయు చేఁపచంద మేర్పడి తుద
_x000D_
గతియువేఱెలేక గలుగు వేమా. | 0 | aataveladi |
1631 | చిఱుతతనంబునన్ జెలులఁ జేరి విహారము సల్పువేళ నా-
దరమునఁ గొయ్యబొమ్మను ముదంబునఁ బుత్రునిగాఁ దలంచి తాఁ
బరవశమొంది వేడుక నెపంబిడి లాలనఁ జేసి మిక్కిలిన్
మురిపముఁ గాంచి మోహమున నూల్కొను తల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
4032 | _x000D_
మాటలాడ నేర్చి మనసు కరుఁగఁజేసి
_x000D_
పరఁగ ప్రియముపుట్టఁ బలుకకున్న
_x000D_
నొకరిచేత సొమ్ము లూరకవచ్చునా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4091 | _x000D_
నరుఁడటు పరమాత్మ గురుని జేరునపుడు
_x000D_
హస్తమందె మోక్ష మపుడె చూపు
_x000D_
విఱివిసంపదలను విఱ్ఱవీగినజీవి
_x000D_
పర మెఱుఁగక యమునిపాలు వేమ. | 0 | aataveladi |
754 | చతురంభోధిపరీత భూవలయరాజానేకకోటీర రం
జితమాణిక్యవిరాజమానపద రాజీవుండు ధర్మాత్మజుం
డతికారుణ్యముచేత మత్స్యపతికొ ల్వాసింపఁడే నీదు శా
శ్వత కారుణ్యము గల్గునంతకును కృష్ణా దేవకీనందనా. | 4 | mattebhamu |
3354 | తత్వ మింద్రియముల దరిఁజూచి గెలుచును
దత్వవేత్తయైనఁ దానె మిగిలి
రాజయోగి యనుచుఁ దేజంబుచేతను
దెలిసియుండు జగతి వినర వేమ. | 2 | teytageethi |
3113 | _x000D_
భూపతి కృప నమ్మి భూమి జెఱుచు వాఁడు
_x000D_
ప్రజల యుసురు దాకి పడును పిదప
_x000D_
యెగర వేయ బంతి యెందాక నిల్చురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2900 | భావము పల్లవింపఁ బువుబానుపుపై వసియించి వేడుకన్
నీవును నేను ముచ్చటలు నేరుపుమీఱఁగ నాడుకొంచు నెం-
తో వగమీఱ మించుతమితో నెపుడుంటిమొ యా దినంబులిం-
కేవిధి వచ్చునో తెలియదే మది కిప్పుడు సుందరీమణీ! | 6 | vutpalamaala |
2726 | నిను నిందించిన దక్షుపైఁ దెగవో వాణీనాథు శాసింపవో
చనునా నీ పదపద్మ సేవకులఁ దుచ్ఛంబాడు దుర్మార్గునిం\న్
బెనుపన్నీకును నీదు భక్తతతికిన్ భేదంబు గానంగ వ
చ్చెనో లేకుండిన నూఱకుండఁగలవా శ్రీకాళహస్తీశ్వరా! | 4 | mattebhamu |
3412 | _x000D_
ఆది నొకటి దెలిసియాదిని మదినిల్పి
_x000D_
యాదిఁబాయకున్న నభవుఁ డవును
_x000D_
ఆదిఁ బాయువాఁడు నంధకు రీతిరా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
409 | రాలన్ దైలము తీయవచ్చు భుజగవ్రాతమ్ముల న్బేర్లఁగా
లీల న్బూనఁగవచ్చు నంబునిధి హాళిం దాఁటఁగావచ్చు డా-
కేల న్బెబ్బులిఁ బట్టవచ్చు విపినాగ్ని న్నిల్పఁగావచ్చు మూ-
ర్ఖాళిం దెల్పఁ దరంబె యేరికిని? భర్గా! పార్వతీవల్లభా! | 7 | saardulamu |
3758 | _x000D_
రూపులేని వనితరూఢి పతివ్రత
_x000D_
నీటు లేనివాఁడు బంటు కాఁడు
_x000D_
తెలుప వచ్చువాఁడు దేవరబంటురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1378 | తీరు నద్దాలబారు గుడారులోన । చదరు సేయంగ పదాలచాటునుండి
వేడ్క నను జూచునాటి నీ వితమునెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
2280 | తపముల్ చేసినఁ బోనిపాపములు మంత్రంబుల్ సమర్థంబుగా
జపముల్ చేసినఁ బోని దోషము నదీస్నానంబునం బోని ఘో
రపుఁ గర్మంబులు వాయు నొక్కమఱి శ్రీరామా యనే మాట క
ర్ణపుటం బించుక సోఁకెనేని రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
351 | ఏరీ నీ కెనయైన దైవతములీ యీరేడులోకంబులన్
గారామారమృకండుసూనుఁడు మహోగ్రక్రూరమృత్యువ్యథా
భీరుండై శరణన్న మిత్తి నపుడే పెంపార్చి రక్షించిత-
య్యారే! శాశ్వతజీవిగా నతని భర్గా! పార్వతీవల్లభా! | 7 | saardulamu |
3885 | _x000D_
ఏసూత్ర మరసిచూచిన
_x000D_
స్త్రీ సూత్రం బదియుఁ గాక సిద్ధము కాఁగా
_x000D_
నా సూత్రముఁ స్త్రీ సూత్రము
_x000D_
నాసూత్రముఁ దెలియువాఁడు సాధుఁడు వేమా. | 1 | kandamu |
3536 | _x000D_
లేని కాలమునకు లేమిమనము నొందు
_x000D_
నీనిన పులిరీతి నెఱుఁగకుండు
_x000D_
కఠినబుద్ధి కిట్లు కలిమేమి గల్గురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4085 | _x000D_
దిక్కులేనిరోఁత దీనతఁ బాపిన
_x000D_
పురుషుఁడిహమునందు పూజ్యుఁడగును
_x000D_
పరమునందు వాని భాగ్య మేమనవచ్చు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
133 | నన్ముని నధ్వరసాఫల్యుఁ గావింప- జానకీపరిణయోత్సవము గలిగె
రవినందనునిఁ గీశరాజ్యాధిపతిఁ జేయ- సేతుబంధనకీర్తిఁ జెందఁ గలిగె
బహుదేవతాస్త్రీల బందిగంబులఁ బాపఁ- జెఱ నున్న వైదేహిఁ జెందఁ గలిగె
నలవిభీషణుని లంకాధినాథునిఁ జేయ- నెలమి నయోధ్య నీ వేలఁ గలిగె | 3 | seesamu |
3535 | _x000D_
విడువ ముడువ లేక కుడువఁ గట్టఁగ లేక
_x000D_
వెఱపులేక విద్య నొరయలేక
_x000D_
వెడలలేనివాని నడపీనుఁ గందురో
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4273 | వెలయ వసంతవేళ వనవీథుల సంపగిపువ్వుటిండ్లలో
నలరుచుఁ బుష్పవృష్టి నలపార్చుచు నీ వలమేలుమంగతో
నలరఁగ నేఁగి వచ్చి యలపారఁగఁ గస్తురినీట మజ్జనం
బెలమి వహించి గంధతతు లన్నియుఁ గ్రమ్మఱ మజ్జనంబు పెం
పొలయఁగ నాడు తీర్థముల నుబ్బు పయోధులు వేంకటేశ్వరా! | 5 | champakamaala |
2338 | ఏతుల్ గాక మురాంతకుండు గలఁడా యెందైన నిందైన నీ
నీతు ల్మాను మటంచుఁ దండ్రి సుతునిన్ నిట్రాతిలోఁ జూపరా
చూతున్ నాఁగ నృసింహరూపమున నచ్చో నుండవా చెండవా
రాతిం బోలిన దైత్యు మేను రఘువీరా! జానకీనాయకా! | 7 | saardulamu |
679 | అంచితమైన నీదు కరుణామృతసారము నాదుపైని బ్రో
క్షించినఁ జాలు దాన నిరసించెద నా దురితంబులెల్లఁ దూ
లించెదఁ వైరివర్గ మెడలించెదఁ గోర్కుల నీదుబంటనై
దంచెదఁ గాలకింకరుల దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
3998 | _x000D_
పగలురేయి మఱచి భావంబు మఱచియుఁ
_x000D_
దాను నేననియెడు తలఁపు మఱచి
_x000D_
యుండువాని నెంచ నుత్తమయోగిరా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1836 | లుండునటు గాన రావయ్య యొనర నీకు | దండమిక జాగుసేయక తరుణి కడకువచ్చి చూడుము నే బల్కు వార్తలన్ని | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
443 | కట్టడ లేని కాలమున గాదు శుభం బొరులెంతవారు చే
పట్టిననైన మర్త్యునకు భాగ్యము రాదనుటెల్లఁ గల్లకా
దెట్టని పల్కినన్; దశరథేశ వసిష్ఠులు రామమూర్తికిన్
బట్టము కట్టఁ గోరి రది పాయక చేకుఱెనోటు భాస్కరా! | 6 | vutpalamaala |
1494 | నా యెడల మోవి మోవిని నాని నడుము । మెడల గదియించి హూ యని మీరినటుల-
నైన స్వప్నము వేడుకెంతనుచు దలప । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
4615 | వర్ణవిహీనుఁడంచు ద్విజవర్గము దా గళమెత్తి పల్కుడున్
వర్ణములెల్లఁజూడ శివనాగయగారి కరంబులందు స
ద్వర్ణుఁడితండనా నమృతధారలు చూపిన భక్తిరూఢ! నీ
వర్ణము నేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
4496 | యిష్టసంసిద్ధిగన దంతి నెక్కనేల । కవిత గల్గిన రాజ్యాధికారమేల
తగు వినయమున్న వశ్యౌషంబులేల
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
2053 | జలజదళనేత్ర నీ భక్తజనులతోడి - జగడమాడెడు పనికంటెఁ జావు మేలు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
2472 | ఆతురుఁ డై తను నడిగిన
యాతనికిం దెలుపవలయు నన్యులు వింటే
నా తలవంపులును సుహృ
జ్జాతులకే యోగ మెన్న సంపఁగిమన్నా! | 1 | kandamu |
4543 | శ్రీగురులింగమూర్తి! సువిశేష మహోజ్జ్వలకీర్తి! సత్క్రియో
ద్యోగ కళాప్రపూర్తి! యవధూత పునర్భవజార్తి! పాలితా
భ్యాగత సంశ్రితార్ధి కవిపండితగాయక చక్రవర్తి! దే
వా! గతి నీవె మాకు బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
3265 | _x000D_
నీటిలోన వ్రాఁత నిలువకయున్నట్లు
_x000D_
పాటిజగతిలేదు పరములేదు
_x000D_
మాటమాటకెల్ల మనసు కోరుచునుండు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3311 | _x000D_
సొమ్ములున్నచోటు శోధింపఁగలుగును
_x000D_
సొమ్ములేనిచోట శోధనేల
_x000D_
యంజనంబులేక యా సొమ్ము తెలియదు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1773 | ఆసించి తన పతి ననుకూలపరచిన భాసురాంగికి నిత్తు బన్నసరులుకూరిమి వరుని గూర్చగల్గినయట్టి ముద్దియకిత్తు నే ముత్తియములుపనిపూని విభుని నా భవనంబు జేర్చిన వనితకిత్తును మేటివజ్రతతులుకరుణించి తన భర్త గలయఁ జేసినయట్టి భామకిత్తును జౌలబావిలీలు | 3 | seesamu |
906 | పాలను వెన్నయును మ్రుచ్చిల
ఱోలను మీ తల్లి కట్ట రోషముతోడ\న్
లీలావినోది వైతివి
బాలుఁడవా బ్రహ్మకన్న ప్రభుఁడవు గృష్ణా. | 1 | kandamu |
1776 | యవుర శాబాసు నా సామి యనుచు బొగడి | మరలి రతిగూడి విభునకు మమత హెచ్చదమిని గల్పించినటువంటి తరుణి గదర | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
3053 | వేసరక మీరు నా మాట విన్నవించి | యబల తన నేమిజేసె నింకనుచు బలికివెలదు లెవ్వరైన ద్వారకానిలయుడైన | చిన్నికృష్ణుని దేరమ్మ చెలియలార. | 2 | teytageethi |
3188 | _x000D_
అంకి లెఱిఁగి మాట లాడనేర్చినపుడె
_x000D_
పిన్న పెద్దతనము లెన్నలేల
_x000D_
పిన్న చేతిదివ్వె పెద్దగా వెలుఁగదా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
736 | అనిరుద్ధాచ్యుత యీశకేశవ ముకుందాధోక్షజోపేంద్రవా
మన దామోదర చక్రపాణి హలి రామా శౌరి శార్ఙ్గీ జనా
ర్దన పీతాంబర భక్తవత్సల నమో దైత్యారి వైకుంఠవా
స నృసింహాంబుజనాభ ప్రోవు ననుఁ గృష్ణా దేవకీనందనా. | 4 | mattebhamu |
3443 | _x000D_
దేహ సంకటమును దెగితేరకాండ్రకు
_x000D_
మోహదృష్టి విడిచి మూల మెఱిఁగి
_x000D_
వ్యూహ మొక్కటిపన్ని యుల్లంబు సంధించి
_x000D_
స్నేహ మెఱుఁగ యోగ సిద్ధి వేమ. | 0 | aataveladi |
4066 | _x000D_
పరఁగఁదానొసఁగక పరులు చెప్పినదైన
_x000D_
నియ్యజాలకవిధి నెసఁగువాఁడు
_x000D_
పొట్టుఁదినెడులండి బువ్వలు పెట్టునా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
976 | యెంటఁబట్టిరి యబ్బబ్బ యేమి సేతు | బాపనపిసాసు లనుచోట్ల బలుకఁ దరమె,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
1548 | అమరారాతికిఁ బ్రీతిగా వివిధవాద్యధ్వానముల్ చేసి పా
నమదావేశము చేత మైమఱచి నానాచేలభూషాఢ్యలై
క్రమతన్ జాల్గొని సుప్తవాహినుల లీలం గూర్కు కాంతానికా
యముల న్గన్గొని ధర్మలోపభయముం బ్రాపించి నీ వాత్మలో
విమలప్రజ్ఞున కేల శంక? యని యన్వేషింపవే మారుతీ! | 4 | mattebhamu |
762 | వినుతానేకతురంగవారణ రథోర్వీనాథదీవ్యన్నికే
తన చక్రధ్వజచామరద్రఢిమతోఁ దథ్యాత్ముఁడౌ నాసుయో
ధనుఁ డేకాకియుఁ బాదచారియునునై దర్పంబువోనాడి పో
యెను మిమ్మెట్టుఁ దలంచి చూడకయ కృష్ణా దేవకీనందనా. | 4 | mattebhamu |
2518 | సతి వేడ్కం దన ప్రాణవల్లభునితో సంయోగ మర్థించుఁ గా-
కతనిం బ్రార్థనసేసి సొమ్ముగొనిపో నఱ్ఱాడునే భక్తుఁ డీ-
క్షితి నీ భక్తియ వేఁడుఁ గాక మఱి నీ శ్రీపాదము ల్గొల్చి కు-
త్సితకామ్యార్థము లొండు వేఁడుకొనునే చింతింప సర్వేశ్వరా! | 4 | mattebhamu |
390 | కోపం బెక్కువ, తాల్మి యిల్ల, పరుషోక్తుల్ పెల్లు, సత్యంబు తీల్,
కాపట్యంబు ఘనంబు, లోభము నహంకారంబు దట్టంబు, హృ-
చ్చాపల్యం బధికంబు, ద్రోహ మతివిస్తారంబు, ఛీ! యిట్టి దు-
ర్వ్యాపారప్రభు లేరిఁ బ్రోతు రిఁక? భర్గా! పార్వతీవల్లభా! | 7 | saardulamu |
3514 | _x000D_
కలిమి కలిగెనేని కాముగాఁజూతురు
_x000D_
లేమిచేతఁ జిక్క లేమ లధిపు
_x000D_
మదనువంటివాని మాలఁగాఁ జూతురు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3529 | _x000D_
పదుగు రాడుమాట పాటియై ధరఁజెల్లు
_x000D_
నొక్కఁడాడుమాట యెక్కదెందు
_x000D_
నూరకాడుకాని కూరెల్ల నోపదు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4541 | సుంకరులకు వర్ణసంకరులకుఁ దన । పొత్తొసంగెడి తొత్తుముండలకును
సారాయినీళ్ళకు జాతరగాండ్లకు । బంగుభాయీలకు బందెనకును
బడవాలకును లేని భడవాలకును ఱంకు- । రాట్నాలకును శుంఠరండలకును
కలిమిదండుగులకు గారడీవిద్యకుఁ । దోడఁబోతుల కాటదొమ్మరులకు | 3 | seesamu |
3808 | _x000D_
భోగంబుల కాశింపక
_x000D_
రాగ ద్వేషంబు లుడిగి రంగుగ భువిలో
_x000D_
వేగమె మోక్షము తనకును
_x000D_
రాఁగన్ననువాఁడు యోగిరాయఁడు వేమా. | 1 | kandamu |
3744 | _x000D_
మద్యమాంసరుచిని మాదిగె దైవాల
_x000D_
యెంగిలిదినువారి దెట్టికులము
_x000D_
భక్తిని హరిఁగొల్చి భవ్యులుగారైరి
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3816 | _x000D_
ప్రజ యొనర్చుచెడ్డ ప్రభువుకు వచ్చును
_x000D_
ప్రభువు మంచికొరత ప్రజలకు సగము
_x000D_
ప్రభు వొనర్చు చెడ్డ ప్రజల కేలరాదురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2891 | మంతనమంచు వచ్చి పలుమారు కపోలము చుంబనంబు గా-
వింతువె పువ్వుదండ మెడవేసెదనంచు నురంబునందు నా-
టింతువె చన్మొ... ... ... ... ... ... ... ... రదంబు మోవి సం-
ధింతువె నీ వినోదము నుతింపగ శక్యమే సుందరిమణీ! | 6 | vutpalamaala |
1235 | తలిదండ్రు లన్నదమ్ములు
తులఁ దూగఁగ నిమ్ము పసిడిఁ తోనైనను వా
రలయింట సతత ముండుట
వెలఁదికి మర్యాదగాదు వినవె కుమారీ! | 1 | kandamu |
3083 | ఎవ్వరి గుణములును యేమన్న మానవు
చక్కఁజేయ రాదు కుక్క తోఁక
గడుసురాలు మగని గంపఁ బెట్టమ్మురా
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1555 | వనముఙ్మండలిఁ జొచ్చు చంద్రుని గతిన్ బ్రచ్ఛన్నవేషంబుతో
వనముం జొచ్చి లతాగృహోత్కర తరువ్రాతంబులన్ దీర్ఘికల్
ఘనసౌధంబులు చూచుచున్ జని మరుత్కల్పుండవై శింశుపా
ఖ్య నగారోహణ మాచరించితివి గాదా నేర్పునన్ మారుతీ! | 4 | mattebhamu |
41 | భిల్లాంగనాదంతపీడిత ఫలభుక్తి- హేయంబు దోఁచలే దింత నీకు
సంక్రందనాత్మజ స్యందన సారథ్య- మెరుసుగాఁ దోఁచలే దింత నీకు
గోపాలకానేక గోవత్సపాలనం- బెగ్గుగాఁ దోఁచలే దింత నీకు
వ్రజబాలికా ముక్తవస్త్రాపహరణము- హీనమై తోఁచలే దింత నీకు | 3 | seesamu |
1139 | వగవకు గడిచిన దానికిఁ
బొగడకు దుర్మతుల నెపుడు, పొసగని పనికై
యొగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను గుమారా! | 1 | kandamu |
2556 | కాయంబన్నది వారిబుద్బుదసదృక్షం బందు రూపింప లేఁ-
బ్రాయంబన్నది శారదాంబుదతటిత్ప్రఖ్యంబగుం దత్సుఖ-
శ్రేయంబన్నది మాయ యిట్లెఱిఁగియు శీఘ్రంబ నీ ధ్యానసం-
స్థాయీభావనఁ బొందఁ డేమిటి కయో సంసారి సర్వేశ్వరా! | 7 | saardulamu |
1028 | నకట విద్యావిహీనత యంత కీడు | లేదు గద మర్త్యులకు ధాత్రిమీఁద నరయ,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
4140 | _x000D_
కట్టెపేరు లోలిగట్టి చెప్పఁగ రాదు
_x000D_
కానరాదు లోని కలిమితనము
_x000D_
జంగమయినపిదప జాతి నెంచరాదు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3208 | _x000D_
వెలఁది చక్కఁదనము వెరపైన యీడును
_x000D_
విభుని కరుణలేక వితగనుండు
_x000D_
నీదుకరుణలేక నేర్పులు కొఱగావు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4266 | పెడమర చూచి చూపు జళిపించిన నెట్లు ధరింతువో ప్రియం
బడరఁగఁ గౌనుదీగ నులియన్ ... ... ... ... ... నన్
సడివడి యెంతవేఁగుదువొ చక్కని శ్రీయలమేలుమంగ నీ
వెడవగు మోముఁజూచి నగి వెన్నెల చల్లిన వేంకటేశ్వరా! | 5 | champakamaala |
4258 | పాయని జాజిపువ్వులనె పట్టుక బాయు ... ... ...
... ... ... రాహుతుఁడవైనపు డాయల మేలుమంగ ని
శ్శ్రేయసలక్ష్మి నీశరము చెంగట నొప్పెఁ దురుష్క దేశబి
బ్బీయెలపువ్వు పయ్యెదనె ప్రేమపునవ్వున వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
2537 | లింగారాధన జంగమార్చనము లోలిన్ భక్తి కంగంబు ప్రా-
ణాంగవ్యాప్తియునై స్ఫురించు నిది తత్త్వార్థంబగుం గాన నా
యంగాభ్యర్చన జంగమాహితకరుండై చేసినం దా శవ-
శృంగారంబగు వాని భక్తి మదిఁ జర్చింపంగ సర్వేశ్వరా! | 7 | saardulamu |
3340 | _x000D_
సతులు సుతులు మాయ సంసారములు మాయ
_x000D_
ధనము ఘనము మాయ తనువు మాయ
_x000D_
మాయ గెల్చువాఁడు మర్మజ్ఞుఁడగు యోగి
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1673 | చిఱుతలతోడ నాటలకుఁ జేతులు జాచుచు సందుగొందులం
బరుగులు పారుచున్న పశుబాధ ఘటించునటంచు సాధ్వసా-
తురమున రాణివాస మటుద్రోసి బహిస్థలి కేఁగి యంత నా
బురుకనిఁ గేల నందికొనిపోయెడు తల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
2328 | పసులన్ గాచిన గొల్లవాఁడవనుచున్ భావింతు నిన్నున్ దుదిన్
ముసలిభ్రాత వటంచు నెంతు మదిలో మూర్తిత్రయాకార! నే
వసుధాధారుని నిన్ను నిక్క మెఱుఁగన్ వాంఛింతు నో సత్కృపా
రసపాథోనిధి! కావవయ్య రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
3705 | _x000D_
బ్రహ్మవేత్తల మని పౌరుష మాడేరు
_x000D_
బ్రహ్మ మనఁగ దాని భావమేమి
_x000D_
తెలుపొ నలుపొ యెఱుపొ తెలిసినఁ బలుకుఁడీ
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
333 | సతతానందితసర్గ! సర్వసుమనస్సంస్తుత్యసన్మార్గ! యూ-
ర్జితకారుణ్యనిసర్గ! రాజతధరిత్రీభృన్మహాదుర్గ! హృ-
త్కుతుకాలింగితదుర్గ! సంహృతసమిద్ఘోరద్విషద్వర్గ! సం-
యతనీరంధ్రసుఖాపవర్గ! జయ! భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
729 | అమరుల్మ్రొక్కులచే మునుల్ నుతులచే నార్యుల్మహానిష్ఠచే
సమరోత్సాహజనుల్ పునశ్చరణచే సాధుల్ దయాబోధచే
నమితోదారకళాఢ్యు లర్పణలచే నధ్యాత్ము లైక్యంబుచే
సమతం గాంచిరి మీపదాబ్జములు కృష్ణా దేవకీనందనా. | 4 | mattebhamu |
4183 | _x000D_
మాదిగయనవద్దు మఱిగుణ మొనసిన
_x000D_
మాదిగది వసిష్ఠుమగువ చేడె
_x000D_
మాదిగ గుణమున్న మఱి ద్విజుఁడగునయా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4648 | నా యొడయండ! నా విభుఁడ! నా హృదయేశ్వర! నా మనోరమా!
నా యిలవేల్ప! నా వరుఁడ! నా గురులింగమ! నాదు జంగమా!
నా యదినాథ! నా వరద! నన్నుఁ గృపామతిఁ బ్రోవుమయ్య దే
వా యమిబృందవంద్య! బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
4441 | రణభేరి తగవైన రాజు శ్వేతచ్ఛత్ర । మేనుఁగు నివి నాలు గేకరాశి
మారుండు కీరంబు మందసమీరుండు । రాకాసుధాకరుం డేకరాశి
వేదము ల్గోవులు విప్రోత్తములు దర్భ । లేర్పరింపఁగ నాలు గేకరాశి
మూఢాత్ముఁ డత్యంతమూర్ఖుఁడు గాడిద । కాకి వీరలు నాలు గేకరాశి | 3 | seesamu |
144 | స్వామి వై యేమి యెఱుఁగవు స్వల్పకార్య-కారణంబున నెన్నెన్ని కతలు పుట్టె
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
1980 | జడ యెంతేఁ దడ వయ్యె జెయ్యి యలసె\న్ శైలంబు మాచేతులం
దిడు మన్న\న్ జిరునవ్వుతో వదలిన\న్ హీనోక్తి గీపెట్ట నె
క్కుడు గోవుల్ బ్రియమంద నింద్రుఁ డడలం గోవర్ధనాద్రీంద్రమున్
గొడుగై యుండగఁ గేలఁ బూనితి గదా గోవింద, నారాయణా! | 4 | mattebhamu |
1040 | ధర్మమతి తొట్టు నీ యిట్టి దుర్మదాంధ- | నృపకులాధము లేరి కేమియ్యఁగలరు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
1775 | చల్లని పన్నీరుచల్లి నాథునితోడ సరసంబులాడుచు చాల మెచ్చియించుక నీ దయ యుంచరా నా సామి యంచు చక్కెరమోవి యాననిచ్చియెదయెద గదియించి వదలక బిగియించి ముదమున జెక్కిళ్ళు ముద్దుబెట్టిసమరతి యుపరతి చతురత వగలను సదయునితో నొక్కజాము పెనగి | 3 | seesamu |
457 | చాలఁ బవిత్రవంశమున సంజనితుండగునేని యెట్టి దు
శ్శీలునినైనఁ దత్కుల విశేషముచే నొక పుణ్యుఁడెంతయుం
దాలిమి నుద్ధరించును; సుధానిధిఁ బుట్టగఁగాదె శంభుఁడా
హాలాహలానలంబు గళమందు ధరించుట పూని భాస్కరా! | 6 | vutpalamaala |
1683 | అలసట వేసటల్ దలఁప కాఁకలిదప్పుల మీఁది యాశమై
తొలఁగుచు రాత్రులుం బగలు తోడిచెలు ల్మది మెచ్చఁ దత్తనూ-
విలసనకార్యకర్మపదవిం బడి “భర్తృవినోద మింతకుం,
గలదె” యటంచు సంతసిలు కామినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
1845 | నెలత ఠీవియు సొగసు నేత్రోత్సవము సేయు నింతిమాటలు చెవుల కింపుజేయుగలికి వగలను మనసు కరిగింపగా జేయు కొమ్మ తెల్వియు మది గోరజేయువనజాక్షి వింతలు వలపింపగా జేయు పడతి కనుసైగలు భ్రమయజేయునలివేణి చనులకు నౌసు వుట్టగజేయు వెలది కొసరులెంతొ వేడ్కసేయు | 3 | seesamu |
1958 | గగనాద్యంచితపంచభూతమయమై కంజాతజాండావలిన్
సగుణబ్రహ్మమయాఖ్యతం దనరుచున్ సంసారివై చిత్కళా
సుగుణంబై విలసిల్లు దీవు విపులస్థూలంబు సూక్ష్మంబునై
నిగమోత్తంస గుణావతంస సుమహానిత్యాత్మ, నారాయణా! | 4 | mattebhamu |
4086 | _x000D_
పలుగువాని కేల పరసమృద్ధి దలంప
_x000D_
పలుగువాని కేల భక్తిపదము
_x000D_
పలుగువాని కేల పరమార్థ తత్వంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2249 | వడి మీఱంగ నమోఘమై నిగుడు నీ వాలమ్ము వాలమ్ముఁ దాఁ
కెడు నంచున్ మెడ యొడ్డినన్ జమరిపైఁ గీల్కొన్న కారుణ్య మే
ర్పడ మున్నేసిన యమ్ము వేఱె యొక నారాచమ్మునం ద్రుంచి పే
ర్పడి తౌరా విలుకాండ్రలోన రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
862 | ఆదివరాహమ వయి నీ
వా దనుజు హిరణ్యనేత్రు హతుఁజేసి తగ\న్
మోదమున సురలు పొగడఁగ
మేదిని వడి గొడుగునెత్తి మెఱసితి గృష్ణా. | 1 | kandamu |
2914 | మాటలు తేనెజాలు చనుమట్టులు బంగరుబొంగరాలు కన్
తేటలు గండుమీలు నును నెమ్మెయి మించుల నేలు వాహవా
కూటమి నేలు మేలుగల కోపుల లీల దలంచుకొన్న హా
పూటకుఁ గోటివేలు పడిపోవుచునున్నవి సుందరీమణీ! | 6 | vutpalamaala |
1291 | పనిసేయునపుడు దాసీ
వనితవిధంబునను మేను పంపఁగవలయున్
ధనవంతుల సుత యైనను
ఘనత గలుగు దానివలనఁ గాదె కుమారీ! | 1 | kandamu |
47 | కెరలి కంసుఁడు నిన్ను నఱకఁ గాచినవాని- బారి సోదరిఁ ద్రోచి పాఱినావు
సరిపోర నరకు నొంచఁగ లేక చేతివి- ల్లాలిచే నిడి దండ నలరినావు
తెగడి బంధువు లాజిఁ దిట్టి కొట్టఁగ నోర్చి- వైదర్భిఁ జేపట్టి వచ్చినావు
దర్పకోద్ధతి కెంతొ తత్తరపడి నిజ- స్త్రీ పదాబ్జములఁ జే మోపినావు | 3 | seesamu |
4637 | దివ్యవిమానపంక్తి దివిఁ దేజరిలన్ రజతాద్రికిన్ జగ
త్సేవ్యముగాఁగ మున్ను దనచే మృతిబొందు మృగాళిఁ బుచ్చు సం
భావ్యుఁడు తెన్గు జొమ్మయకుఁ బ్రాణసఖుండగు నిన్నుఁ గొల్తు దే
వా వ్యసనాది దూర బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
1738 | గుందముల మించు రజనాళీ కొమ్మ నిన్ను | దలచి మరుబారిచేతను తాళలేకయున్న దా యింతి నెడబాయ యుచితమగునె | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
243 | సరసీజాతభవాభవామరుల్ చర్చింప మీ మాయ గా-
నరటంచున్ సతతంబు ప్రాఁజదువులు న్నానాపురాణంబులున్
సరసప్రక్రియఁ జాటుచుండఁగఁ బిశాచప్రాయు లెంతేని సో-
మరిపోతుల్ నరులెట్లు గాంచెదరు? రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
368 | తరుణీశుంభదురోజకుంభములపై ధమ్మిల్లబంధంబుపైఁ
గరమూలంబులపైఁ గపోలములపైఁ గందోయిపై మోముపై
నిరతంబున్ విహరించు చిత్త మెపుడున్ నీయందొకప్డేనిఁ జే-
ర్పరుగా మూఢు లదేమిదుష్కృతమొ? భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
3624 | _x000D_
మాల మాలగాఁడు మహిమీఁద నేప్రొద్దు
_x000D_
మాటతిరుగువాఁడు మాలగాక
_x000D_
వాని మాలయన్నవాఁడెపో పెనుమాల
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2650 | ఎన్నేళ్ళుండితి నేమిగంటినిఁక నే నెవ్వారి రక్షించెదన్
నిన్నే నిష్ఠ భజించెద న్నిరుపమోన్నిద్రప్రమోదంబు నా
కెన్నండబ్బెడు నెంతకాలమిఁక నేనిట్లున్న నేమయ్యెడిం
జిన్నంబుచ్చక నన్ను నేలుకొనవే శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
1489 | కన్నడదస్తురిగా సిగవేసి బా- । గున్నదా యని దువ్వు నొక్కవేళ
పాండ్యదేశస్త్రీల బాగుగ గొజ్జంగి- । రెక్కన జడనల్లు నొక్కవేళ
నల కళింగాంగనవలె గొప్పకీలుగం- । టొనరించి వగ చూపు నొక్కవేళ
చెలగి విదర్భకాంతలరీతి మెడలపై । నునుగొప్పు సవరించు నొక్కవేళ | 3 | seesamu |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.