id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
2482
పవనుండై హిమధాముఁడై యనలుఁడై పానీయమై యాత్మయై రవియై యంబరమై మహీవలయమై రమ్యాష్టమూర్తిక్రియన్ భువనాండంబులు లక్షణాంగములుగాఁ బుట్టించు నత్యద్భుతో- త్సవలీలావిభవంబుతోడ భవదాజ్ఞాశక్తి సర్వేశ్వరా!
4
mattebhamu
2749
ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁ బాము పదినూఱేండ్లున్‌ మడువునఁ గొక్కెర యుండదె కడు నిలఁ బురుషార్థపరుఁడు గావలె సుమతీ!
1
kandamu
4079
_x000D_ చిత్తముగలయోగి శివునివలనే యుండు _x000D_ మిథ్యయోగి యుండు మిడుతవలెనె _x000D_ నిత్యుఁడైన యోగి నీవలె నుండురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
472
నుడువుల నేర్పు చాలని మనుష్యుఁడెఱుంగక తప్పనాడినం గడుఁ గృపతోఁ జెలంగుదురు కాని యదల్పరు తజ్ఞులెల్లఁ; ద ప్పటడుగులు వెట్టుచు న్నడుచునప్పుడు బాలుని ముద్దు చేయఁగా దొడుగుదు రింతెకాని పడఁద్రోయుదురే యెవరైన భాస్కరా!
5
champakamaala
2049
వసుధలోనెల్ల వ్యర్థుండువాఁడె యగును - మఱియుఁ జెడుఁగాక యెప్పుడు మమతనొంది భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
1498
కనరు మాటలు చెవినాని కరుణమాని । మనసుమోడిని కొదవ నీ మాడ్కి బూని యతివ నేడేమొ కాని యీ యలవిగాని । వలపుగదె రామరామ లావణ్యసీమ.
2
teytageethi
1589
ఆ లంకాపురి గుప్తికర్మము, నిశాటాళిప్రలాపంబులున్‌ వాలాయంబు దశాస్యుగర్వమును సర్వంబున్‌ నివేదించి కీ శాళిం దోడ్కొని ఘోరజన్యమునకున్‌ యానంబు గావింపు, మిం కాలస్యంబది యేలటంచు విభునిం బ్రార్థింపవే మారుతీ!
7
saardulamu
3623
_x000D_ స్త్రీలు కల్గుచోట చెల్లాటములుకల్గు _x000D_ స్త్రీలులేని చోటఁ జిన్నఁబోవు _x000D_ స్త్రీలచేత నరులు చిక్కుచున్నారయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
267
కలికాలంబున వైద్యలక్షణపరీక్షాశూన్యమూఢావనీ- తలనాథుల్ బలుమోటకాఁపుదొరలున్ దట్టంబుగా బిల్చి మం- దుల వేయింప భుజించి క్రొవ్వి కడువైద్యుల్ గారె సిగ్గేది? త- మ్మళులన్ నంబులు క్షౌరకాంత్యజులు రామా! భక్తమందారమా!
4
mattebhamu
4039
_x000D_ తనదుమనసుచేతఁ దర్శించి జ్యోతిష _x000D_ మెంతచేసెననుచు నెంచిచూడఁ _x000D_ దనయదృష్ట మెల్ల దైవమ్ము తెలియురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2424
మునిఁగితి మందురు మునుఁగుట మనసో పంచేంద్రియములో మఱి జీవుండో మునుఁగుట యెవరో తెలియదు సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా!
1
kandamu
2265
ఘనసారంబును లోనికిం గొనిన శ్రీగంధంబుఁ బైఁ బూసినన్ దినమున్ మర్దనఁ జేసినం గడిగినన్ దిష్టంబులోనం దొలం గని దుర్గంధము నైజ మీముఱికి డొక్కల్ నమ్మి ని న్గొల్వనే రని మూఢాత్ముల నేమి చెప్ప రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
229
తళుకుం బంగరుకామ గుబ్బగొడు గందంబొప్ప శత్రుఘ్నుఁడ- ర్మలి బట్టన్ భరతుండు చామరము గూర్మి న్వీవఁగా లక్ష్మణుం- డలదుం దూపుల విల్లు డాల్పఁ గపిసేనాధీశ్వరుల్ గొల్వ ని- ర్మలలీలం గొలువుండు నిన్ దలఁతు రామా! భక్తమందారమా!
4
mattebhamu
4084
_x000D_ నేరనిజనులకును నేర్పు నేరము లెల్లఁ _x000D_ జక్కఁజేయరిల నసాధుజనము _x000D_ లొప్పుదుర్జనులను తప్పుగనెంతురు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1668
చిఱుతను జంకఁ బెట్టుకొని చిత్రముఁ జూపుచు వెండిగిన్నెలో మెఱయుచునున్న బువ్వఁ దినుమీ తినకున్నను బూచివాని వే- గిర మిదె పిల్తునంచు నళికించుచుఁ గాకికి వేతునంచుఁ దా బిరబిర చేతిముద్దఁ దినిపించెడు తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
417
అక్కరపాటు వచ్చు సమయంబునఁ జుట్టము లొక్కరొక్కరి న్మక్కువ నుద్ధరించుటలు మైత్రికిఁ జూడఁగ యుక్తమే సుమీ యొక్కట; నీటిలో మెరక నోడల బండ్లును బండ్లనోడలున్‌ దక్కక వచ్చుచుండుట నిదానము గాదె తలంప భాస్కరా!
6
vutpalamaala
2969
నీవు రాకున్న నిక నొక్కనిమిషమైన | నెలత యుసురులు తనువున నిల్వదనవెతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన.
2
teytageethi
515
స్థానముఁ దప్పివచ్చునెడఁ దానెటువంటి బలాఢ్యుఁడున్‌ నిజ స్థానికుఁడైన యల్పుని కతంబున నైనను మోసపోవుఁగా; కానల లోపలన్‌ వెడలి గంధగజం బొకనాఁడు నీటిలోఁ గానక చొచ్చినన్‌ మొసలి కాటుకు లోఁబడదటోటు భాస్కరా!
6
vutpalamaala
4082
_x000D_ ఎదుటితనబలంబు లెంచుకోనేరక _x000D_ డీకొని చలమున నెదిర్చెనేని _x000D_ యెలుగు పందిసేత కేర్పడు చందంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1246
పుట్టింటివారి నీచతఁ బెట్టకు మత్తింటివారు పెట్టెడి బాధల్‌ పుట్టింటఁ దెలియనీకు రట్టడి చెలియందు రదియె రవ్వ కుమారీ!
1
kandamu
3486
_x000D_ మొదలు చూచిచూచి తుదిఁ జూడకుండెనా _x000D_ చూపు తప్పినపుడె సొరగవలెను _x000D_ సొరగకున్నవానిఁ జులకగాఁ జూతురు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3815
_x000D_ కోమటికిక యాశ కొండలు వాములు _x000D_ చందనంబు శోభ చంద్రకళలు _x000D_ తనకు మితిలేదు నక్కడ గతిలేదు _x000D_ వదన శుద్ధిలేనివాఁడు వేమా.
0
aataveladi
867
ఘనులగు ధేనుకముష్టిక దనుజులఁ జెండాడితౌర తగ భుజశక్తిన్‌ అనఘాత్మ రేవతీపతి యనఁగా బలరామమూర్తి వైతివి కృష్ణా.
1
kandamu
4418
ముజ్జగము లేలు నా విరాణ్మూర్తికయినఁ । గాని దుర్వృత్తి దగదెంతవానికైన మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
3527
_x000D_ తేనె పంచదార తియ్యమామిడిపండు _x000D_ తిన్నఁగాని తీపు తెలియగరాదు _x000D_ కన్న నింపు పుట్టుఁ గామినియధరంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
757
బలభేది న్నలయించి ఖాండవవని\న్‌ భస్మంబు గావించి ము న్నెలమి\న్‌ దైత్యులఁద్రుంచి యొక్కటి శివున్నిర్జించి కౌరవ్యుల\న్‌ బలి గావించి కిరీటి బోయలకు గోపస్త్రీల నొప్పింపఁడే యల నీతేజము నీవు గైకొనినఁ గృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
3464
_x000D_ కుండఁగుంభ మండ్రు కొండఁ బర్వతమండ్రు _x000D_ ఉప్పు లవణ మండ్రు నొకటి గాదె _x000D_ భాషలింతెవేఱు పరతత్వ మొక్కటి _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1206
విత్తంబు విద్య కుల ము న్మత్తులకు మదం బొసంగు మాన్యులకున్‌ స ద్వృత్తి నొసంగున్‌, వీనిం జిత్తంబున నిడి మెలగఁ జెలఁగు కుమారా!
1
kandamu
1833
పక్క బాయకయుండు ప్రాణేశ్వరుడు నన్ను నెడబాయుటకు నేడు హేతువేమిరవిశశిభౌములు రాహుకేతువులును బుధశుక్రశనిగురుల్ పొలతి నాకుచాలరో గాన గోచారంబు రీతిని యడుగరే విప్రుల నమ్మలారకాకున్న నా భర్త కరుణ యింతయు లేక యిందు రాకుండునా రామలార
3
seesamu
1878
నిన్ని సరిగాకనే కదా యెలమి క్షీణమొందె నొక్కటి వేసవి గందె నొకటిజలధి బడె నొండు నీటిలో జారె నొండు | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
594
దురదుర జాగి మర్త్యుఁ డొకతూరె సమంచిత తావకీన మం- దిరమునకుం బ్రదక్షిణ మతిప్రమదంబునఁ జేసెనేని య- ప్పురుషుఁడు శేషభూభువనపోషణధూర్వహుడై విరాజిలున్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
2789
తమలము సేయని నోరును విమతులతోఁ జెలిమిసేసి వెతఁబడు తెలివిన్‌ (రమణుల చనుమొనలమీఁద రాయని మేనున్‌) గమలములు లేనికొలఁకును హిమధాముఁడు లేని రాత్రి హీనము సుమతీ!
1
kandamu
1318
కాండవాసిష్ఠశుకశౌనకాదివినుత । వినతసుతవాహనారూఢవిమలకరుణ కరుణ నీ కృతినాథు దీర్ఘాయు జేయ- । వలయు శ్రీరామరామ లావణ్యసీమ.
2
teytageethi
2694
పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్వింటి సాంఖ్యాది యో గరహస్యంబులు వేదశాస్త్రములు వక్కాణించితిన్‌ శంకవో దరయం గుమ్మడికాయలోను యవగింజంతైన నమ్మించి సు స్థిరవిజ్ఞానము త్రోవఁ జూపగదవే శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
1404
యనుచు సతతము చతురత నెనసి కినిసి । పెనగి జెట్టీల లాగు సొంపొనర దనరు సరణి దలచిన మనసు విస్మయము దలప । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
3279
_x000D_ పిలిచినఁ బల్కకుండు మరి పిల్చిన నేమనకూరకుండుఁ ద\న్‌ _x000D_ దలఁచిన నెవ్వ రేమనినఁ దన్నునుగాదని నవ్వుచుండు నా _x000D_ త్మలఁ దలపోయుచుండు నెఱ తత్వము నిత్యము దానయై సదా _x000D_ తెలిసినయోగి వేమనగతి\న్‌ శివరూపుఁడు నెల్లతావుల\న్‌.
5
champakamaala
2926
నీ జటపై జవాదిపస నిద్దపు నెమ్మెయిఁ గుల్క దావకో- రోజమృగీమదాంకితపు ఱొమ్ముదుడై తగ నీదు కన్నులన్ రాజిలు కాటుకంటు నధరంబు వెలింగెడు నన్నుఁ జూచి యా- లీజనులెల్ల నవ్వ, దరిలేని ముదంబగు సుందరీమణీ!
6
vutpalamaala
3592
_x000D_ తొత్తుతోడి పొందు దోషంబు దోషంబు _x000D_ లంజతోడిపొందు లజ్జ చెడును _x000D_ జారతోటిపొందు చావుకుమూలమౌ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
683
నీ సహజంబు సాత్త్వికము నీ విడిపట్టు సుధాపయోధి ప ద్మాసనుఁడాత్మజుండు గమలాలయ నీ ప్రియురాలు నీకు సిం హాసనమిద్ధరిత్రి గొడుగాకస మక్షులు చంద్రభాస్కరుల్‌ నీ సుమతల్పమాదిఫణి నీవె సమస్తముఁ గొల్చునట్టి నీ దాసుల భాగ్యమెట్టిదయ దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
1657
కారము నూరిపోయు నెడ గాసిలనీయదు బోరుబెట్టినన్ గూరిమితోడ నెత్తుకొని గుబ్బల పాలిడు జోలఁ బాడు స- త్కారము మీఱుచోఁ గసురు దాఁకె నటం చని కుందుఁ బుత్రలీ- లారతి నాఁటనాఁట నిటుల న్మదిఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
6
vutpalamaala
2477
అమితాంభోజభవాండభాండనిలయంబైయుండు నీ యంతరం- గము పట్టెంతయొ దానికింక బహిరంగం బెట్టిదో సూక్ష్మత- త్త్వము దానంతకుమీఁద నేమివిధమో తానిట్టి నీ పెంపుమా- ర్గము నీకైన నచింత్య మెట్లొరుఁ డెఱుంగం జాలు సర్వేశ్వరా!
4
mattebhamu
2691
మాయాజాండ కరండకోటిఁ బొడిగా మర్దించిరో విక్రమా జేయుం గాయజుఁ జంపిరో కపటలక్ష్మీమోహముం బాసిరో యాయుర్దాయ భుజంగమృత్యువు ననాయాసంబునన్‌ గెల్చిరో శ్రేయోదాయకులౌదు రెట్టులితరుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
618
అరయఁగ నే నహర్నిశము నాఁడెడు వాక్యములెల్లఁ దావక స్ఫురణగఁ జిత్తగించి కలుషప్రకరంబులఁ బారఁదోలి నీ చరణసరోజభక్తి కొనసాగఁగఁజేపీ సముద్ధరింపవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
2631
కాయల్గాచె వధూనఖాగ్రములచేఁ గాయంబు వక్షోజముల్‌ రాయన్‌ రాపడెఱొమ్ము మన్మథ విహారక్లేశ విభ్రాంతిచే బ్రాయంబాయెను బట్టగట్టెఁ దల చెప్ప\న్‌రోఁత సంసారమేఁ జేయంజాల విరక్తుఁ జేయఁగదవే శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
3552
_x000D_ ఇచ్చకము భువిని వశ్యము _x000D_ కుచ్చిత మీలోకనింద కోవిదునకు నీ _x000D_ తుచ్చమున హాని వచ్చును _x000D_ మచ్చరమే తన్నుఁ జెఱచు మహిలో వేమా.
1
kandamu
1818
నిన్నె మది గోరియున్నది నీలజాక్షి | తామసించక రావయ్య తరుణికడకుభవ్యగుణశీల యీవేళ భక్తపాల | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
1413
హరిహరి పగవారికైన నావలెను మి- । క్కటమైన మోహంబు గలుగరాదు కలిగెబో బహుసలక్షణరూపవతులైన । చెలులతో నతిచెల్మి సేయరాదు చేసెబో నొకవేళ చెంగట లేకున్న- । నందుమీదట జాళి జెందరాదు జెందెబో మరుని గాసిక ధైర్యమున క్రింద- । బడి తాళలేనంచు బల్కరాదు
3
seesamu
4630
మేదురభక్తి నీశ్వరుఁడు మెచ్చగ జిహ్వయె పళ్ళెరంబు గా నాదటఁబ్రాచి యంబలి సమర్పణ చేసి పొగడ్తకెక్కు నా మాదర చెన్నలింగము కుమారుఁడ! నిన్ను భజింతు సంతతా స్వాదిత సుప్రసాద! బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
1807
ప్రేమతో నా విభు పిలువనంపిన నిందు రాడాయెనేమొకో రామలారసవతులు నాపైన చాడి గావించిరో కానరాకున్నాడు కాంతలారయతివలు నా మనోహరుని రావద్దని యడ్డగించిరొ కదే యమ్మలారమనసిచ్చి యెవతెను మరగియున్నాడకో తెలియదు గదవే యో తెరవలార
3
seesamu
1143
ఒరు లెవ్వరేని దనతోఁ బరిభాషించినను మేలు పలుకవలయు సా దరము గల చోటఁ గీడు న్గరము నొనర్పంగరాదు గదర! కుమారా!
1
kandamu
3679
_x000D_ కులమువలనఁ గొంత బలిమివలనఁ గొంత _x000D_ కలిమివలనఁ గొంత గర్వమునకు _x000D_ ఱంకు చదువు చదివి ఱంకునఁ బడుదురు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2692
చవిగాఁజూడ వినంగ మూర్కొనఁ దనూసంఘర్షణాస్వాద మొం ద వినిర్మించెదవేల జంతువుల నేతత్క్రీడలే పాతక వ్యవహారంబులు సేయనేమిటికి మాయావిద్యచేఁ బ్రొద్దుపు చ్చి వినోదింపగఁ దీన నేమిఫలమో శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
4285
కులుకకుమమ్మ చిమ్మజిలుకుం గొనచూపుల బిత్తరంబుగా నులుచకుమమ్మ బొమ్మముడి నూల్కొనఁగోపము లేఁతనవ్వు గా సొలయకుమమ్మ కలి నునుసోఁగల నోయలమేలుమంగ నీ చెలువున నంచు నెచ్చెలులు చేర్తురు నీసతి వేంకటేశ్వరా!
5
champakamaala
1399
సిగ దువ్వి సన్నసంపెగలు జుట్టెద తాళు- । డను నయోక్తుల నాదు వెనుకజేరి కూర్చుండి వెన్నున గుబ్బచన్మొనలాన । తెలసి నెమ్మోము నే తిరిగి చూడ నదియేమి యూరక యటుల జూచెదరన । యెరుకలేవనుకొంటివేమొ యనిన కిలకిల నవ్వి చెక్కిలి దువ్వి మిము బోల । ననుమానపరులు లేరనుచు కురులు
3
seesamu
1684
సరసవివేకము ల్దనరుజాడ గలుంగను బిడ్డ నొక్కస- ద్గురునకు నొప్పగింపుమని కోరిక మీఱ నిజేశుతో మనో- హరగతి మీఱఁ బల్కి “తనయా విను నీ వెపుడో పురాణవై- ఖరు లెఱిఁగింతు” వంచుఁ గుతుకంపడు తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
290
శ్రీలక్ష్మీ మదయుక్తుఁడై నృపుఁడు వాసిం బేర్చు భూదేవునిం గేలింబెట్టి తదీయకోపమహిమన్ గీడొంచు నెట్లన్న ది- క్ఖేలత్కీర్తి త్రిశంకుం డల్క నలశక్తిం బల్కి తద్వాగ్గతిన్ మాలండై చెడిపోవడోట మును, రామా! భక్తమందారమా!
7
saardulamu
1492
జతను నే గూడి కోరమీసంబు తీటు । పంతముల నాటి వేడ్క నా భామతోటి నెనయకుండిన దిగులు నెంతని వచింప । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
4226
_x000D_ చదువు చదువ నేల సన్యాసి గానేల _x000D_ షణ్మతములఁజిక్కి చావ నేల _x000D_ అతని భజనఁజేసి యాత్మలోఁ దెలియుఁడీ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1204
మిత్రుండు దనకు విశ్వా మిత్రముఁ జేసినను గాని మే లనవచ్చున్‌, శాత్రవుఁడు ముద్దు గొన్నను, ధాత్రిం దన కదియె కీడు తలపఁ గుమారా!
1
kandamu
3449
ఇట్టిజాడఁగాన నెందఱయిన నేమి పుట్టఁ గాలశివుని పట్టఁగలరె పొట్టనీవు పాసిపోగఁ దా నుబ్బురా విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3453
_x000D_ కర్మమయుఁడుగాక ధర్మంబు దెలియఁడు _x000D_ కర్మజీవి మేలు గానలేఁడు _x000D_ నీరుచొరక లోతు నికరము దెలియదు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4600
చూర్ణిత మన్మథాయ! పరిశోభితభస్మవిలేపనాయ! సం పూర్ణమనోరథాయ! గతపూర్వ భవాశ్రిత వర్తనాయ! తే వర్ణ నిరాసకాయ! సశివాయ నమో" యని సంతతంబు ని న్వర్ణన సేయువాడ బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
4101
_x000D_ కండకావరమునఁ గానఁడు మరణంబు _x000D_ మదముచేతఁ దత్వమహిమఁ గనఁడు _x000D_ భోగవాంఛచేతఁ బుణ్యంబుఁ గానఁడు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2598
ఆడంబోయినచోట బాలురు వినోదార్థంబు పాషాణముల్ గూడంబెట్టి శివాలయంబనుచుఁ బేర్కొన్నంతటం జేసి వా- రాడంబోయి సురాంగనాకలితదివ్యారామచింతామణి క్రీడాశైలవిహారులౌదురు మిముం గీర్తింప సర్వేశ్వరా!
7
saardulamu
3366
_x000D_ ఆఱుమతములందు నధికమైన మతము _x000D_ లింగమతముకన్న లేదు జగతి _x000D_ లింగధారికన్న దొంగలు లేరురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
665
అగణితజన్మకర్మదురితాంబుధిలోఁ బహుదుఃఖవీచికల్‌ దెగిపడ నీఁదలేక జగతీధవ నీ పదభక్తినావచేఁ దగిలి తరింపగోరితిఁ బదంపడి నాదు భయంబుమాన్పవే తగదని చిత్తమందిడక దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
3865
_x000D_ అల్లుఁడైన నేమి యన్యుఁడైన నేమి _x000D_ చెప్పఁదగిన రీతిఁ జెప్పినాము _x000D_ హరునియెఱుక లేక యాకులల్లాడునా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3737
_x000D_ కాంతమేనుఁజూచి కళవళపడుదురు _x000D_ కడుపులోని రోతఁ గాన లేరు _x000D_ యింతరోఁత బ్రతుకు కీ దేహ మేలరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1449
తలిదండ్రినైన తూపుల నేయజూచు । మరుడు నన్నేరీతి కరుణ జూచు గురుకాంత నిసుమంత కొదువలేక రమించు । జాబిల్లి యెటుల దోసము దలంచు పాములు మ్రింగినప్పటికైన చావని । చలువతెమ్మెరకెట్లు జాలి బుట్టు చిగురాకు దిని కండ్ల పొగరెక్కినది గండు- । కోయిల రొద యేల సేయకుండు
3
seesamu
240
ముదమొప్పార నిరంతరంబు బలవన్మోక్షప్రదామేయభా- స్వదుదలచ్ఛవదంఘ్రితామరససేవాసక్తచిత్తంబు దు- ర్మదులం జేరునే పారిజాతసుమనోమత్తద్విరేఫంబు దా మదనోర్వీజము చెంతకుం జనునె రామా! భక్తమందారమా!
4
mattebhamu
3669
_x000D_ ఆపగాళివెంట నడవులవెంటను _x000D_ కొండరాళ్ళవెంట గొడవయేల _x000D_ నుల్లమందె శివుఁడటుండుటఁ దెలియరు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
498
మానవుఁ డాత్మకిష్టమగు మంచిప్రయోజన మాచరించుచోఁ గానక యల్పుఁడొక్కఁ డది గాదని పల్కిన వాని పల్కుకై మానగఁజూడఁడా పని సమంచిత భోజనవేళ నీఁగ కా లూనిన వంటకంబు దినకుండఁగ నేర్పగునోటు భాస్కరా!
6
vutpalamaala
1189
ఘన బీజము సాయము లే కను భూములు నిష్ప్రయోజకంబైన విధం బున దైవము తోడిలఁగా కనె పౌరుష కర్మఫలము గలదె కుమారా?
1
kandamu
3206
_x000D_ తత్వము తిరమైన తావుల వెదకుచుఁ _x000D_ దాను తత్వమగును తత్త్వయోగి _x000D_ తలఁపులన్ని యుడుగఁ దానెపో తత్వంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
559
సరభసలీల మున్ముసలిజంగమువై చిరితొండనంబి మం- దిరమున కేఁగి తత్తనయునిం బొలకై వధియింపఁజేసి చె- చ్చెర నిజమూర్తి చూపి కృప చిప్పిల వానిఁ గృతార్థుఁ జేయవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
4422
యాప్తజనముల దూఱుట నసురుతిండి । మానవేంద్రుల పదవికి హానులివియ మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
2052
అర్థివాండ్రకునీక హానిఁ జేయుటకంటెఁ - దెంపుతో వసనాభిఁ దినుట మేలు ఆఁడుబిడ్డల సొమ్ములపహరించుటకంటె - బండఁ గట్టుక నూతఁ బడుట మేలు పరులకాంతలఁ బట్టి బల్మిఁ గూడుటకంటె - బడబాగ్ని కీలలఁ బడుట మేలు బ్రతుకఁ జాలక దొంగపనులు చేయుటకంటెఁ - గొంగుతో ముష్టెత్తుకొనుట మేలు
3
seesamu
1625
విమలంబై, వినఁ జిత్రమై, వితతమై, విద్యోతమై, వేద్యమై, యమృతంబై, యఘహారమై, యమితమై, యానందమై యాద్యమై సుమనస్సమ్మతమై, సుధీవినుతమై, సుజ్ఞానమై, సూచ్యమై, సముదంచద్గతి నొప్పు నీ మహిమ కీశగ్రామణీ, మారుతీ!
4
mattebhamu
697
సంకరదుర్గమై దురిత సంకులమైన జగంబుజూచి స ర్వంకషలీల నుత్తమ తురంగమునెక్కి కరాసిఁబూని వీ రాంక విలాసమొప్ప గలికాకృతి సజ్జనకోటికిన్‌ నిరా తంక మొనర్చితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
4196
_x000D_ మంచిశకునము లని యెంచి పెండ్లియాడు _x000D_ వార లొకరు లేరు వసుధలోన _x000D_ జనులకర్మములను శకునము ల్నిల్చునా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
434
ఎడపక దుర్జనుండొరుల కెంతయుఁ గీడొనరించుఁ గాని యే యెడలను మేలు సేయఁడొక యించుకయైనను; జీడపుర్వు దాఁ జెడఁ దిను నెంతెకాక పుడుసెండు జలంబిడి పెంప నేర్చునే పొడవగుచున్న పుష్పఫల భూరుహ మొక్కటినైన భాస్కరా!
5
champakamaala
4604
"దేవ పరీ తుహేచి గురుదేవ మణూను తరీ తుమ్హీచ గో సావి తరీ తుహేచి తుమచాచ ప్రసాదయమీ కృపా కరా హే వరదా" యటంచు నుతియించెద నిన్నును 'నారెభాష' దే వా వినుతార్య లీల బసవా! బసవా! బసవా! వృషాధిపా!
5
champakamaala
791
వరభోగాధ్వరదానధర్మగుణముల్‌ వర్జించి తృష్ణారతి\న్‌ నరులత్యంతము మూఢలోభమతులై నారీరతిం గూర్పఁగాఁ దరముం గాని ధనంబు తస్కరవరు\న్‌ ధాత్రీశులుం జేకొన\న్‌ సరఘవ్రాతము జేర్చుతేనెక్రియఁ గృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
1507
నెమ్మేన కళలు ఘూర్ణిలగ గౌ నళికి ఘం- । టల తాబు కొల్కి పఠాలురనగ రంగైన తాపితా రయిక చన్ పొగరున । బిగిసి పక్కున కుట్లు పిక్కటిల్ల రత్నభూషణము లలంకరించంగ యీ । విరహాగ్ని వేడిమి వెళ్లనురక గమగమలాడు గంధపుపూత లొక్కొక- । చోట పై రవరవ పేటులెత్త
3
seesamu
1624
నీపేరెంచిన శత్రువర్గము వెసన్‌ నిర్మూలమైపోవు సం తాపంబుల్‌ దొలఁగున్‌, సమస్తదురితాంతం బౌను, కూశ్మాండ మా రీ, పైశాచిక యక్ష రాక్షసగ్రహ, ప్రేతోగ్ర భూతాదినా నాపీడల్‌ నశియించు, భద్రమొదవున్‌ సత్యంబుగా మారుతీ!
7
saardulamu
2434
సత్తనఁ బరఁగును బురుషుఁడు సత్తనఁగాఁ బ్రకృతి తోఁచి సమసెడు కతనన్‌ సత్తునకే నిత్యత్వ మ సత్తున కదిగూడ దన్న సంపఁగిమన్నా!
1
kandamu
3436
_x000D_ దేహగుణము లెల్ల దెలిసిన శివయోగి _x000D_ మోహమందుఁ జిక్కి మోసపోఁడు _x000D_ ఇంద్రజాలకుండు నెందుకుఁ జిక్కురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4469
పసచెడి యత్తింటఁ బడి యుండుటది రోత । పరువు దప్పినయెడ బ్రతుకు రోత ఋణపడి సౌఖ్యంబు లనుభవించుట రోత । పరుల కల్మికి దుఃఖపడుట రోత తన కులాచారంబుఁ దప్పి నడచుట రోత । ధరణీశునకు పిర్కితనము రోత పిలువని పెత్తనంబులకుఁ బోవుట రోత । యల్పుతో సరసంబులాడ రోత
3
seesamu
3417
_x000D_ కమలభవాండం బెల్లను _x000D_ విమలపుసుజ్ఞానులెల్ల నీక్షింతురయా _x000D_ విమలంబౌ మనముదగ\న్‌ _x000D_ సుమహిత పిండాండ మెపుడు చూడర వేమా.
1
kandamu
121
ఉక్కునఁ బసిఁడికన్‌ రక్కసుఁ డొకఁడు ప- ల్దిక్కు లోరిచి బొల్లిపక్కి మావు నెక్కు రౌ తెక్కడఁ జిక్కెడు నంచు నీ- యిక్కువ లరయంగఁ గిక్కురించి నక్కితి విలక్రిందఁ జొక్కపుఁ బంది వై- కొక్కరింపుచు నాతఁ డక్కడికిని మొక్కరింపఁగఁ జొరఁ బొక్కతే కట వాని- డొక్కగఱుక్కునఁ జెక్కిపట్టి
3
seesamu
1640
ఇలఁ బెఱవారినందనుల నెత్తుచు ముద్దిడుచోఁ బెనంగి య- న్నులఁ గని బిడ్డలెన్నటికినో కననోఁతు నటంచు బల్కి లే- మొలకమెఱుంగునవ్వులకు మోదముఁ జెందుచు నిష్టదైవమున్ దలఁచుచు బుత్రవాంఛ మతిఁ దాఁకిన తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
789
కరితో దోమ మృగేంద్రుతో నరుఁడు బంగారంబుతోఁ గంచు భా స్కరుతో మిణ్గురుబుర్వు కల్పకముతోఁ గానుంగు రత్నాకరే శ్వరుతో నూషరపల్వలంబు నురుశేషస్వామితో మిడ్తయు\న్‌ సరియైన\న్‌ సరి మీకు దైవములు కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
3128
_x000D_ తలను పాగ పైని తగుపచ్చడము బొజ్జ _x000D_ చెవులపోగు లరసి చేరు నర్థి _x000D_ శుద్ధపశువు లౌట బుద్ధిలో నెఱుగురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4554
లింగమయాంతరంగ! గురులింగ పదాంబుజ భృంగ! సత్ప్రసా దాంగ! కృపాపరిస్ఫురదపాంగ! విముక్త భుజంగ! జంగమో త్తుంగ! జితాభిషంగ! గతదుష్కృత భంగ! మదీయలింగ! నీ వంగడ మేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
3610
_x000D_ పూర్వ వాసనగల పుణ్యాత్ము లెప్పుడు _x000D_ నూటచెలమరీతి నూరునెప్పు _x000D_ డెందఱికి నొసంగ నెప్పటి యట్లుండు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1590
మతిమంతుండు విభీషణుండు, రఘురామా, నన్ను రక్షింపు మం చతిదైన్యంబున నేగుదెంచిన దదీయాకార వాగింగితా తతశీలంబుల చేత వాని పరిశుద్ధత్వంబు బోధించి, స మ్మతి నిప్పింపవె వాని కట్లభయమున్‌ క్ష్మానాథుచే మారుతీ!
4
mattebhamu
4352
లక్ష్యభావంబుఁ జూడ సలక్షణముగ । బండువెన్నెల గతిఁ గానబడును ముక్తి మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
4491
ఆశకు ముదిమియు నర్థికి సౌఖ్యంబు । ధనపరాయణునకు ధర్మచింత కఠినమానసునకుఁ గరుణాపరత్వము । వెఱ్ఱిమానిసికి వివేకగరిమ యల్పవిదునకు నహంకారదూరత । జారకామినికి లజ్జాభరంబు బహుజనద్వేషికిఁ బరమాయురభివృద్ధి । గ్రామపాచకునకుఁ గౌరవంబు
3
seesamu
1542
లంకానామనిశాటి నాకరణిఁ దూలం బుచ్చి యాప్రోలిఁకన్‌ గంకోలూక వశంబు గాగలదు నిక్కంబంచు వామాంఘ్రి ని శ్శంకన్‌ ముందుగ బెట్టుచున్‌ సురభిళాంచద్రాజమార్గంబునన్‌ లంకాకాననవహ్నివై చనవె ధీరత్వంబునన్‌ మారుతీ!
7
saardulamu
816
ప్రలయాభీల కరాళదావదహన ప్రజ్జ్వాల మబ్జోదరా జ్వలనాకారముదాల్పఁ దానియెదుట\న్‌ సంతప్త సంతాప వాం ఛలు దివ్యుల్మునులుం గృశాస్యులగుచుం జల్లార్పఁగాలేక ని చ్చలు నీపాదములే భజించెదరు కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu