id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
3907
_x000D_ తలను వ్రేలవేసి తాలిమి నిలుచుక _x000D_ మూసి తెఱచు గన్ను మూగి యగును _x000D_ జ్ఞాన మదియుఁగాదు కష్టము శేషంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2557
భవదీయస్థిరభక్తి లబ్ధియు భవద్భక్తైకగోష్ఠీమహో- త్సవలీలావిభవంబు నీ యనుదినధ్యానానుమోదంబులౌ- నివి నిత్యస్థితు లారయంగ విధిదేవేంద్రాది భూతాఖిలో- త్సవభోగస్థితులెల్ల మిథ్యలవి తత్త్వంబెన్న సర్వేశ్వరా!
4
mattebhamu
4598
కల్పితలింగ జంగమసుఖ స్ఫురణాయ నమోనమో, యసం కల్ప వికల్ప మార్గకథిత ప్రథితాయ నమోనమో, గుణా కల్ప వరాయతే" యనుచు గౌరవలీల నుతింతు నిన్ను న స్వల్పతర ప్రభావ బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
2212
అర్థులేమైన నిన్నడుగ వచ్చెద రంచు - క్షీరసాగరమందుఁ జేరినావు నీచుట్టు సేవకుల్‌ నిలువకుండుటకునై - భయద సర్పముమీఁదఁ బండినావు భక్తబృందము వెంటఁబడి చరించెద రంచు - నెగసి పోయెడి పక్షినెక్కినావు దాసులు నీ ద్వారమాసింపకుంటకు - మంచి యోధుల కావలుంచినావు
3
seesamu
1260
చెడుఁగులతో లంజెలతో గుడిసేటులతోడఁ బొత్తుఁ కూడదు మది నె ప్పుడు నిల నుత్తమ కాంతల యడుగులకు న్మడుగులొత్తు మమ్మ కుమారీ!
1
kandamu
3138
_x000D_ ఎక్కడయినయాశ లినుమడియుండఁగా _x000D_ తిక్కపట్టి నరుఁడు తిరుగుచుండు _x000D_ కుక్కవంటి యాశ కూర్చుండ నీయదు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3878
_x000D_ వాని గననివాఁడు వాఁడు కానేకాఁడు _x000D_ వానిలోనివాఁడు వాఁడు సుమ్మి _x000D_ వాని గన్నవాఁడు వాఁడెపో యోగిరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1311
కొనగోళ్ళ వ్రేలువెండ్రుక లను జాఱెడునీళ్ళు, కుండలన్‌ ముంతల వా డిన వెన్క మిగులునీళ్ళును జన దండ్రు దరిద్ర మొందు జగతిఁ గుమారీ!
1
kandamu
2185
నిలను నీకీర్తనలు పాడనేర్చినతఁడు - పరులకీర్తనఁ బాడునే యరసి చూడ? భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
3739
_x000D_ చన్నులు పరసతి కొప్పిన _x000D_ చన్నులపై పాప దృఢతఁ జన కటుయునుపే _x000D_ చన్నులు తగ దాఁగుడిచియు _x000D_ చన్నులపై తలఁపు వలదు సత్యము వేమా.
1
kandamu
4000
_x000D_ మనసులోనివాని మానుగాఁ దెలిసిన _x000D_ నుర్విజనులువాని యోగి యండ్రు _x000D_ నీవె నిన్నెఱుంగ నీవెపో శివుఁడవు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4330
చెఱఁగులు చూపి క్రొవ్విరులు చిందెడు తేనెలు నాల్గువంకల\న్‌ వఱదలువాఱె ఘర్మములు వాహినులై యలమేలుమంగతోఁ గఱఁగుచు నీవు కౌఁగిట సుఖస్థితిఁ గూడుచు బంధుసంగతి\న్‌ దెఱ దిగనేసి వేడుకలు తెప్పలఁ దేలఁగ వేంకటేశ్వరా!
5
champakamaala
3509
_x000D_ కల్లలాడువాని గ్రామకర్త యెఱుంగు _x000D_ సత్యమాడువాని స్వామి యెఱుంగు _x000D_ బెక్కుతిండిపోతుఁ బెండ్లా మెఱుంగురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
132
మంచినడవడి నడిచినా పెంచి చూడఁ-గీర్తి గల మూర్తివే యిట్టి వార్త లరయ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
1261
విసువకు పని తగిలినయెడఁ గసరకు సేవకుల మిగులఁ గాంతునితోడన్‌ రొసరొస పూనకు మాడకు మసత్యవచనంబు లెన్నఁ డైనఁ గుమారీ!
1
kandamu
3731
_x000D_ లంజ దానియొక్క లాలించిముద్దాడు _x000D_ మిండ డరయ లంజమీఁది ప్రేమ _x000D_ ఆడుదానివంక నందఱు చుట్టముల్‌ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2709
ఊరూరం జనులెల్ల భిక్షమిడరో యుండం గుహల్గల్గవో చీరానీకము వీథులందొరకదో శీతామృత స్వచ్ఛవాః పూరంబేఱులఁబాఱదో తపసులంబ్రోవంగ నీవోపవో చేరంబోవుదురేల రాజుల జనుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
2994
పసులగాపరియంచు బలుకులాడెదవేమి నా బిరుదెఱుగవా నాతి నీవుకలికిరో నా నాభికమలమందున బ్రహ్మ చాతుర్ముఖంబుతో జననమాయెపాలకడలిని బుట్టి పద్మాక్షి బెండ్లాడి మన్మథు గంటినే మగువ నాడుఆదికాలమునా డవతారమెత్తిన మత్స్యావతారము మహిమ వినవె
3
seesamu
1276
తా నమ్ముడు వడియైనం దీనుండగు ధవునియార్తిఁ దీర్చగ సతికిన్‌ మానము చంద్రమతీ జల జాననఁ దలపోయవలయు నాత్మఁ గుమారీ!
1
kandamu
4610
తిరువడి నెమ్మనంబునను నే హృదయేశ్వర కింపరీయ తాం బరి కరితంబు రాణి నిను బాహిరిఁ బోలుట శాసితాహ తా వరద నెగిల్లె యంచు నిను బ్రస్తుతిసేయుదుఁ బెక్కుభాషలన్‌ వరద వివేకశీల బసవా! బసవా! బసవా! వృషాధిపా!
5
champakamaala
4177
_x000D_ శూద్రు లనుచు భువిని శూద్రులఁ బోనాఁడు _x000D_ మాలకన్న చెడుగు మహినిలేఁడు _x000D_ నరకమునకు నేగు నష్టమైన వెనుక _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1499
గజనిమ్మపండ్లు నే నజరు చేసెద గాని । బటువుగుబ్బలు సుంత బట్టనియవె వెలలేని భూషణమ్ములు కానుకిత్తు నీ । చక్కెరకెమ్మోవి నొక్కనియవె పడతి నే నీ కాకుమడుపులందిత్తు నన్ । కదసి కౌగిట వేడ్క నదుముకొనవె తరలాక్షి నీదు పాదంబైన పట్టెద । విడెమైన రవ సమర్పింపగదవె
3
seesamu
1308
ఇద్దఱు గూడుక యొక చో నొద్దిక మాటాడుచుండ నొదిఁగి యొదిఁగి యా యొద్దకుఁ జనఁగూడదు తన పెద్దతనంబెల్ల నణఁగ బెట్టుఁ గుమారీ!
1
kandamu
1102
మదిఁ దలంపగఁ గటకటా ముదిమియంత | రోఁత లేదు గదా ధారుణీతలమున, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
4048
_x000D_ పాపపుణ్యములును పసిమిగా పెఱిగినా _x000D_ ధరను నరయ యోగి యెఱుగుఁగాక _x000D_ లోనిపొందికఁగని లోహముల్‌ గూర్పరో _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3365
_x000D_ తలఁచిన దత్వంబగునా _x000D_ తలఁపక తా నూరకున్నఁ దత్వంబగునా _x000D_ తలఁచుట తలఁపమి రెండును _x000D_ దలఁపక తానుండెనేని దత్వము వేమా.
1
kandamu
2550
ఘనవైరిప్రకరంబు ధాటి ననిలో ఖండించు కంటెన్ మృగేం- ద్రుని జేపట్టుటకంటె వారినిధిలోఁ దోగాడుకంటెన్ మహా- శనిఁ దా వ్రేయుటకంటె ఘోరభవదుశ్చారిత్ర వారించి రం- జనతోఁ జిత్తము శిక్షసేయుట మహాశౌర్యంబు సర్వేశ్వరా!
4
mattebhamu
3537
_x000D_ ఇంచుకంతబోన మీశ్వరార్పణ మన్న _x000D_ పుణ్యలోకమునకుఁ బోవు నతఁడు _x000D_ అన్నదానమునకు నధికదానము లేదు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
869
వలపుగల తేజి నెక్కియు నిలపై ధర్మంబు నిలుప హీనులఁ ద్రుంప\న్‌ కలియుగము తుదను వేడుక కలికివిగా నున్న లోకకర్తవు కృష్ణా.
1
kandamu
2964
బాగుగా శేషాహిపానుపుపై బవళించితినంచు గర్వింపదగునెపంతగించుట గొల్లభామలయిండ్లలో బొంచియుండుట దన కంచితంబెనాతిరో తనవంటి నాథుని నమ్మిన జింతతో బవళింపం జెల్లునటనెగొల్లవానికి రాజుకూతురునియ్య మా తల్లిదండ్రులకిది ధర్మమగునె
3
seesamu
2665
తనువెందాఁక ధరిత్రినుండు నను నందాఁక న్మహారోగదీ పన దుఃఖాదులఁ బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి యా వెనుక న్నీపదపద్మముల్దలఁచుచు న్విశ్వప్రపంచంబుఁ బా సిన చిత్తంబుననుండఁజేయ గదవే శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
656
జుఱ్ఱెద మీకథామృతము జుఱ్ఱెద మీపదకంజతోయమున్‌ జుఱ్ఱెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే జుఱ్ఱెద జుఱ్ఱజుఱ్ఱఁగ రుచుల్‌ గనువారిపదంబుఁ గూర్పవే తఱ్ఱులతోడి పొత్తిడక దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
4583
వరగుణదీప్ర! భక్తజనవప్ర! తృణీకృతవిప్ర! తాత్త్వికాం కుర పదపద్మ భక్తిరసగుంభ! నిరాకృతదంభ! సద్గుణ స్ఫురిత విశిష్ట! శాంతగుణపుష్ట! నిరస్త నికృష్ట! మన్మనో వరద! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
5
champakamaala
4248
నించిన పంచదారలును నేతుఁలు దేనెలు గమ్మ గాఁగఁ దా లించినకూరలున్‌ బరిమళించగ నయ్యలమేలుమంగ వ డ్డించిన నిర్మలాన్నములు డెంద మెలర్పఁగ నారగింతు నీ మించిన వేయుచేతులును మేలములాడుచు వేంకటేశ్వరా!
6
vutpalamaala
3080
ఎరుక మాలు వాఁడు యేమేమి చదివినఁ జదివినంత సేపె సద్గుణి యగు కదసి తామరందుఁ గప్ప గూర్చున్నట్లు విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3413
_x000D_ అందు నిందుననక యన్నిటఁ బరికించి _x000D_ విష్ణు వరయుచుండు విదితముగను _x000D_ చక్రి తిరుగు భూమిచక్రంబులోపల _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
749
అధివ్యాధిహరంబు జన్మమరణవ్యాపారదుష్కర్మ దు ర్బోధావ్యాప్తినివారణంబు సతతస్ఫూర్జ జ్జగద్రక్షణో న్మేధాయుక్తము భక్తవాంఛితఫలానీకప్రధానైక దీ క్షాధౌరేయము నీమహామహిమ కృష్ణా దేవకీనందనా.
7
saardulamu
4548
త్ర్యక్షసదృక్ష! సంచితదయాక్ష! శివాత్మక దీక్ష! సత్ప్రసా దాక్ష! ప్రతాప శిక్షిత మహాప్రతిపక్ష! మహోక్ష! భూరి క ర్మక్షయదక్ష! జంగమ సమక్షమ భక్తిపరోక్ష! లింగ త త్త్వక్షమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
1379
దండుకూచీ జేసి లెండని సరదార్ల । మదిలోన బల్కుషామతున జెంది ఖూబైన బాసు జిలీబుతేజీలు హ- । రోలుతయారి కతారాలు దిర్చి జల్తారు భారిపోషకు వేసి మందట । కటికెముల్ బహుపరాకనుచు బొగడ కేళికాగృహమువాకిట నిల్చి వూరికి । బోయొత్తు మనిన తాంబూలమొసగి
3
seesamu
2333
చదువు ల్దొంగిలి సోమకాసురుఁడు భాషాభర్త కూపెట్టఁగా నుదధుల్ సొచ్చినఁ బాఱిపట్టుటకు నుద్యోగించి మత్స్యంబవై యదరంటన్ రిపుఁ ద్రుంచి వేదములు దేవా దేవ! శాండిల్యనా రదకౌండిన్యనుత ప్రతాప! రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
2732
నిచ్చల్‌ నిన్ను భజింప చిన్మయమహా నిర్వాణ పీఠంబుపై రచ్చల్సేయక యార్జవంబు కుజనవ్రాతంబుచేఁగ్రాఁగి భూ భృచ్చండాలురఁ గొల్చి వారు దను గోపింపన్‌ బుధుండార్తుఁడై చిచ్చాఱం జమురెల్లఁ జల్లుకొనునో శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
3220
_x000D_ పర్వత వనవాసి పరిణామ వర్తన _x000D_ కూపవాసి కెట్టు గుఱుతుపడును _x000D_ బ్రహ్మవిష్ణువెంటఁ బ్రాకృతుఁ డరుగునా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4143
_x000D_ వ్రతము లెన్నియైన వట్టిచిక్కులె కాని _x000D_ యాత్మచిక్కుఁ గాన నలవిగాదు _x000D_ ఆత్మచిక్కుఁ బాపునతఁడెపో ఘనయోగి _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4064
_x000D_ తల్లిదండ్రులందు దారిద్ర్యయుతులందు _x000D_ నమ్మని నిరుపేద నరులయందు _x000D_ ప్రభువులందుఁ జూడ భయభక్తు లమరిన _x000D_ నిహముఫలము కల్గు నెసఁగు వేమ.
0
aataveladi
50
తలిరుబోఁ డుల యెదుటఁ దత్తరము గలుగ-నేవు పరరాజముఖమున నిలువ గలవె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
4523
చెఱువులో నీరు నిల్చిన బానయోగ్యమౌ- । నది యబ్ధి జేర బానార్హమగునె యుదక మల్పంబైన నుచ్చులో బడు చేప । చెఱువు నిండినవేళ చిక్కదట్లు చరణాయుధాండంబు చట్టెడౌనోర్చిన । నవయగ జేసిన నల్పభుక్తి వహ్ని యల్పంబైన వలన నేనునగూడ । దరియు ధాడింప మేడంత గాల్చు
3
seesamu
3964
_x000D_ గద్దె గణము నిద్ర కలలు కోరికలును _x000D_ ముద మొసంగ శకునములకుఁ జెలఁగు _x000D_ ప్రశ్నలు పదివేలు పరికించి చూడంగ _x000D_ నవును కాకపోవునగును వేమా.
0
aataveladi
1332
తగని మరులాయ మానసోద్భవుని మాయ । గెలువరాదాయ మనసేమొ నిలువదాయ క్షణము యుగమాయ నిపుడింత చలముసేయ- । వలెనటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
1360
విరహు లదరంగ తమ్ములవేడ్క గ్రుంగ । కలువలుప్పొంగ నింగి రిక్కలు చెలంగ క్రౌర్యము వెలుంగ మింట జక్కువలగొంగ । వచ్చె గదె రామరామ లావణ్యసీమ.
2
teytageethi
4213
_x000D_ కూడు చీరఁ బాసి గుళ్ళపంచలఁబడు _x000D_ నట్లువ్రాసె బ్రహ్మ యతులనుదుట _x000D_ తోయజాక్షు లుండ దోషంబు లంటునా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3924
_x000D_ ద్విజవరుండు చెడ్డ పిండంబు దినఁబోయె _x000D_ పేరటాలు మురువు పెండ్లిమొనసె _x000D_ కులము మొదలుఁ బోయెఁ గూలెఁబో మానంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
568
ఇరవుగ నెల్లలోకముల నేలెడు స్వామివి నీవు కూర్మితో దొరతనమెల్లఁ బో కడచి తుచ్ఛపుజాలరిపూపకన్నియన్ శిరమునఁ బెట్టుకొంటివఁట చిత్రములౌర భవద్విలాసముల్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
2144
నీ భక్తులను గనుల్‌ నిండఁ జూచియు రెండు - చేతుల జోహారు సేయువాఁడు నేర్పుతో నెవరైన నీకథల్‌ చెప్పంగ - వినయమందుచుఁ జాల వినెడువాఁడు తన గృహంబునకు నీదాసులు రాఁ జూచి - పీటపైఁ గూర్చుండఁ బెట్టువాఁడు నీ సేవకుల జాతినీతు లెన్నక చాల - దాసోహ మని చేరఁ దలఁచువాఁడు
3
seesamu
3157
_x000D_ గాలిలేని దీపకళిక చందంబున _x000D_ నలలుసుళ్లులేని జలధిరీతి _x000D_ నిశ్చలాత్మయున్న నిర్వికారంబున _x000D_ ముక్తియండ్రు దాని మొగిని వేమ.
0
aataveladi
1052
దహహ డెందంబులోపల నంతకంత | నధికమగు నాస యింత కేమి మనఁగవచ్చు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
1251
వేకువజామున మేల్కని పైకి వెడలి వచ్చి ప్రాచి పనిఁ దీర్పవలెన్‌ లేకున్నఁ దెల్లవాఱిన లోకులు నవ్వుదురు సభల లోనఁ గుమారీ!
1
kandamu
2799
నయమునఁ బాలుం ద్రావరు భయమున విషమ్మునైన భక్షింతురుగా నయమెంత దోసకారియొ భయమే చూపంగ వలయు బాగుగ సుమతీ!
1
kandamu
3561
_x000D_ చాకివాఁడు కోక చీకాకుపడఁ జేసి _x000D_ మయిలఁబుచ్చి మంచిమడుపుఁ జేయు _x000D_ బుద్ధిచెప్పువాఁడు గ్రుద్దిన నేమయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1366
పొలతి నన్నెంచనపుడు నే బుజ్జగించ । కౌను యసియాడ మన్మథకళలు వీడ రతమొనర్చిననాటి నీ వితమునెన్న । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
151
రాజకార్యపరుండు తేజోబలాధికుఁ- డాంజనేయుఁడు భృత్యుఁ డగుటఁ జేసి యమితశౌర్యుఁడు ప్లవంగమకులేశుఁ డినజుఁ- డఱ లేని స్నేహితుఁడగుటఁ జేసి విమతమర్మజ్ఞుండు విశ్వాసభరితాత్ముఁ- డల విభీషణుఁ డాప్తుఁ డగుటఁ జేసి సుమనస్కు లమనస్కు లమృతవాక్యంబులన్‌- బొసఁగ నాశీర్వదించుట జేసి
3
seesamu
427
ఈ జగమందు దా మనుజుఁడెంత మహాత్మకుఁడైన దైవమా తేజము తప్పఁ జూచు నెడఁ ద్రిమ్మరి కోల్పడు; నెట్లన న్మహా రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడఁ గాయలాకులున్‌ భోజనమై తగన్వనికిఁ బోయి చరింపఁడె మున్ను భాస్కరా!
6
vutpalamaala
724
శ్రీవైకుంఠనివాసగోత్రధర లక్ష్మీనాథ గోపాల లీ లావిర్భావ పతంగవాహ యదువంశాంభోధిచంద్రోదయా నీవే దిక్కని యున్నవాఁడను దయన్‌ వీక్షించి రక్షించవే నావిజ్ఞాపన మాలకించు మది కృష్ణా దేవకీనందనా.
7
saardulamu
2733
దంతంబుల్పడనప్పుడే తనువునన్‌ దార్ఢ్యంబు నున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే వింతల్మేనఁ జరించనప్పుడె కురుల్వెల్వెల్ల గానప్పుడే చింతింపన్‌వలె నీ పదాంబుజములన్‌ శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
1430
నేల పొమ్మన్న పురుషులకేల కఠిన- । మెందు గాననటంచు కన్నీరు నించి నతివ నను దూలపలుకు నా హౌసు దలప । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
3052
నాదు మేలెఱింగించి నా ప్రాణవల్లభుఁ గూర్చి రక్షింపరే కొమ్మలారననువొందగా వాని న్యాయంపుపూటల దయబుట్ట నాడరే తరుణులారకలికిపల్కుల వాని కాఠిన్యహృదయంబు గరుగంగ జేయరే కాంతలారదయగల చెలులైన తఱిదీపు పుట్టించి వేగమాతని దేరె వెలదులార
3
seesamu
763
రక్షింపం దగువీరుఁ డెవ్వఁ డననీరాజుల్‌ వృథాతేజులే మోక్షశ్రీయొసఁగు\న్‌ విభుండెవఁడు శ్రీమోహాకృతి న్దేవతల్‌ రక్షోజాక్ష శుభప్రధానగరిమ\న్‌ రాజిల్లురాజేంద్రుల\న్‌ సాక్షాద్బ్రహ్మము నీవె ధన్యులకుఁ గృష్ణా దేవకీనందనా.
7
saardulamu
4321
ఏచిన పాతకంబులకు నిన్నిటికి న్నిరవైనవాఁడ నేఁ గాచినకష్టవృత్తి కరిగాఁపనె యోయలమేలుమంగ నీ చూచుకృపానిరీక్షణమె చూచెద నంచును నీప్రియాంగన\న్‌ బూచిన వాక్ప్రసూనములఁ బూజలు సేసెద వేంకటేశ్వరా!
6
vutpalamaala
2777
కొఱగాని కొడుకు పుట్టినఁ గొఱగామియె కాదు తండ్రి గుణములఁ జెఱచున్‌ జెఱకు తుద వెన్ను పుట్టినఁ జెఱకునఁ దీపెల్లఁ జెఱచు సిద్ధము సుమతీ!
1
kandamu
3462
_x000D_ ముగ్గురి నెఱుఁగునట్టి మూలంబు నెఱిఁగియు _x000D_ ముగ్గురిమీఁద నొకటి మునుపు తెలిసి _x000D_ పరగఁజిహ్వచేతఁ బ్రస్తుతి చేయరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1614
భవదీయోరుతపఃప్రభావమును శశ్వత్సాధుభావంబు, యో గ్యవివేకంబును శాస్త్రపాండితియు నిష్కామత్వమున్‌ సంతతా ర్జవమున్‌ జూచి రఘుప్రవీరుఁడు భవిష్యద్బ్రహ్మవౌదంచు నీ కు వరం బర్థి నొసంగడే బృహదనుక్రోశంబునన్‌ మారుతీ!
4
mattebhamu
2619
వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని ర్వాణశ్రీఁ జెఱపట్టజూచిన విచారద్రోహమో నిత్యక ల్యాణక్రీడలఁబాసి దుర్దశలపాలై రాజలోకాధమ శ్రేణీద్వారము దూరఁజేసెదిపుడో శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
4524
నాక్రమింపగ దగినచో నరి వధింప । దగు ఫలాపేక్ష కొద్దియే రర్మమునకు వసుధ తత్త్వంబు పరికింపవలయు జూడ మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
4417
పరకాంతపయి నాసపడెడి మానవులకు । నగుబాటు మనమున తగని దిగులు నగుడు విరుద్ధంబు నాచారహీనత । చేసొమ్ముపోవుట సిగ్గుచెడుట యపకీర్తి బంధుజనాళి దూషించుట । నీతియుఁ దొలగుట నిద్రచెడుట పరలోకహాని లంపటనొంది మూల్గుట । పరువుదప్పుట దేహబలము చెడుట తన యాలి చేతిపోటునఁ గృశించుట దాని । పరుడు గన్గొనిన జీవంబు విడుట
3
seesamu
4593
అసదృశ విస్ఫురద్గుణ దృగంచల కల్పిత సృష్టిపాలన గ్రసనకళాకలాప ఘనకౌశల ఖేలన లింగమూర్తి మా నసకలనా వశీకరణ నైపుణతత్పరశీల జంగమ శ్వసన శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
5
champakamaala
2961
నతివ యావేళ రుక్మిణీపతిని గాంచి | విసికియున్నది రమ్మని వేగిరంబతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన.
2
teytageethi
3061
కరుణతోడుత మీరింక గపటముడిగి | నన్ను మన్నించి నా ప్రాణనాథు కడకుఁత్వరితముగ నెమ్మి యీవేళ తాడిమళ్ళ | రాజగోపాలు దోడ్తేరె రమణులార.
2
teytageethi
44
మమత నీలీల లటు సూచి బ్రమసి రేమె-తగుదువే యిట్టిఘనతకు దంభభూప చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
2222
దనుజసంహార! చక్రధర! నీకు దండంబు - లిందిరాధిప! నీకు వందనంబు పతితపావన! నీకు బహునమస్కారముల్‌ - నీరజాతదళాక్ష! నీకు శరణు వాసవార్చిత! మేఘవర్ణ! నీకు శుభంబు - మందరధర! నీకు మంగళంబు కంబుకంధర! శార్ఙ్గకర! నీకు భద్రంబు - దీనరక్షక! నీకు దిగ్విజయము
3
seesamu
3263
_x000D_ తిట్టికొట్టిరేని తిరిగి మాఱాడక _x000D_ యూరకున్నఁ జూడనుర్విమీద _x000D_ వాఁడగు పరమాత్మ వర్ణింప శక్యమా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3806
_x000D_ ఊరు ననుచునుండ నొగి సంతసింతురు _x000D_ అడవియనుచు నుండ నడలుచుందు _x000D_ రూరు నడవి రెండు నొకటిగాఁ జూచిన _x000D_ నారితేఱు యోగి యతఁడు వేమా.
0
aataveladi
3199
_x000D_ ఇచ్చెడి వారలసంపద _x000D_ హెచ్చునదేకాని లేమి యేలా కలుగున్‌ _x000D_ అచ్చెలమ నీళ్లుచల్లిన _x000D_ విచ్చలవిడి నూరుచుండు వినరా వేమా
1
kandamu
4438
అధమమిది భువి నరులకు నజునకైన । మఱచి యప్పని చేసిన మానహాని మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
4415
పతికి మోహములేని సతి జవ్వనంబేల । పరిమళింపని సుమప్రచయమేల పండితకవివర్యులుండని సభ యేల । శశి లేని నక్షత్రసమితి యేల పుత్రసంపద లేని పురుషుని కలిమేల । కలహంసములు లేని కొలనదేల శుకపికరవ మొకించుక లేని వనమేల । రాజు పాలింపని రాజ్యమేల
3
seesamu
1117
సతతముఁ బ్రాతఃకాలో చిత విధులను జరుపు మరసి శీఘ్రముగ నహః పతి పూర్వపర్వతాగ్రా గతుఁడగుటకు మున్నె వెరపు గల్గి కుమారా!
1
kandamu
1335
సుదతి నీ జిల్గుపయ్యెద జారనియ్యవే । బటుచనుంగవ గానబడును గాని హరిమధ్య నిలచి మాటాడవే యొకసారి । వీనులపండువై విందు గాని మృగనేత్రి ముద్దునెమ్మొగ మెత్తిచూడవే । మది చింత లొకకొంత మాను గాని వలరాజునగరి ముందలనైన నుంచవే । జీతమొల్లని కొల్వు సేతు గాని
3
seesamu
1193
పెక్కుజనులు నిద్రింపఁగ నొక్కండయ్యెడను నిద్ర నొందకయున్నన్‌ గ్రక్కున నుపద్రవం బగు నక్కర్మమునందుఁ జొరకు మయ్య! కుమారా!
1
kandamu
2859
తల లొకయింత యెత్తి నునుదళ్కులుపై వెదజల్లి గొంటుపోఁ కలవలెనుండి బంతులయి గట్టితనంబున కౌళ్లుగట్టి చెం- తల నెఱనిండె నాంతరసుధాకలశంబులఁ గేరు నీ కుచం- బులఁ బవళించి, నేఁ దనివి పొందుట యెన్నఁడొ సుందరీమణీ!
5
champakamaala
4193
_x000D_ తోలుకడుపులోన దొడ్డవాఁ డుండఁగ _x000D_ రాతిగుళ్ళలోన రాశిఁబోయ _x000D_ రాళ్లుదేవుఁడైన రాసుల మ్రింగవా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1529
స్థిరసత్త్వంబున శైలరాజము ధరిత్రిం గ్రుంగఁ బాదంబులూ ది, రహిన్‌ భూరిభుజోరు వేగమున ధాత్రీజాతముల్‌ పెల్లగి ల్లి రయంబారఁగఁ దోడ రా, గగనమున్‌ లీలాగతిన్‌ మ్రింగ సు స్థిరశక్తిం జనుమాడ్కి దాటితివి గాదే నింగికిన్‌ మారుతీ!
4
mattebhamu
3609
_x000D_ తనువు విడిచి తాను తరలిపోయెడివేళ _x000D_ తనదు భార్య సుతులు దగినవార _x000D_ లొక్కరైన నేగ రుసురు మాత్రమె కాని _x000D_ తనదుమంచి తోడు తనకు వేమ.
0
aataveladi
2348
నానాజీవమనోనివాస! త్రిజగన్నాథా! మురారీశ! గౌ రీనాథస్తుత! కైటభాసురవిదారీ! చక్రి! నారాయణా! యో నాళీకదళాయతాక్ష! కలుషవ్యూహాద్రి వజ్రాయుధా! ప్రాణాపానసమానరూప! రఘువీరా! జానకీనాయకా!
7
saardulamu
2267
మును నే నెన్నఁడు వేదశాస్త్రపఠనంబుల్ రిత్తతీర్థాటనం బును దానంబును జేయఁ బోను సతతంబున్ నిన్ను సేవించి కీ ర్తనఁ జేయన్ మతిలేదు దానమున కర్థం బల్ప మింకెట్లు బో రన నా దుష్కృతముల్ దొలంగు? రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
483
ప్రల్లదనంబుచే నెఱుక పాటొక యింతయులేక యెచ్చటన్‌ బల్లిదుఁడైన సత్ప్రభు నబద్ధములాడినఁ గ్రుంగిపోదు; రె ట్లల్ల సభాస్థలిం గుమతులై శిశుపాలుఁడు దంతవక్త్రుఁడుం గల్లలు గృష్ణునుం బలికి కాదె హతంబగుటెల్ల భాస్కరా!
6
vutpalamaala
3975
_x000D_ తిరిపెగాఁ డయినను దిరిపెమెత్తిన యట్టి _x000D_ తిరిపెమందుఁ దాను దిరిపె మిడినఁ _x000D_ దిరిపెము తిరిపమున దిగఁబడిపోవురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4271
చెఱఁ గిడఁగా నదల్చెదవు చేరినఁ దిట్టెదు కౌఁగిలించినన్‌ గొఱఁతలె యెన్నఁజూచెదవు కోపము న ద్దలమేలుమంగ నా వెఱ పిఁకనైనఁ దీర్పుమని వేడ్కల నీవు మనోజలీలలన్‌ దఱితఱి నింతిఁ గూడుటలుఁ దత్తఱపాటులు వేంకటేశ్వరా!
5
champakamaala
2107
జీవుని ప్రయాణకాలంబు సిద్ధమైన - నిలుచునా దేహ మిందొక్క నిమిషమైన? భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
3217
_x000D_ ఇంటిలోనిధనము నిదినాది యనుచును _x000D_ మంటిలోనఁదాచు మంకుజీవి _x000D_ కొంచఁబోడు వెంట గుల్లకాసును రాదు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1226
దబ్బరలాడకు కదిమిన బొబ్బలు పెట్టకుము మంచి బుద్ధిగలిగి యెం దెబ్బెఱికముఁ బూనక కడుఁ గొబ్బునఁ జిత్తమున వానిఁ గూర్పు కుమారీ!
1
kandamu
3765
_x000D_ ఆత్మ దేహమందు నతిసూక్ష్మముగఁ జూచి _x000D_ దేహమాత్మయందుఁ దేటపరచి _x000D_ యాత్మ నెందుఁ జూడ నతఁడెపో బ్రహ్మంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2025
అపరాధంబులు నిన్ను నమ్మి విను మే నాజన్మపర్యంతము\న్‌ విపరీతంబుగఁ జేసినాఁడ నిఁక నీవే దిక్కు నాలోనికి\న్‌ గపటం బింతయు లేక దండధరుకుం గట్టీక రక్షింపు మీ కృపకుం బాత్రుఁడ నయ్య ధర్మపురి లక్ష్మీనాథ నారాయణా!
4
mattebhamu