id stringlengths 1 4 | poem stringlengths 71 312 | label int64 0 7 | label_name stringclasses 8
values |
|---|---|---|---|
547 | అరుదుగ నింద్రకీలగిరి నర్జునుఁ డుగ్రతపం బొనర్చుచో
నరిగి కిరాతరూపమునఁ జక్కఁగ నిల్చి కరంబు వానితో
దురమొనరించి మెచ్చి కృపతోడుతఁ బాశుపతాస్త్రమీయవే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
1443 | పసుపు నిగ్గైన దుప్పటితోడ కాటుక । మరకానుదస్తు రుమాలుతోడ
చెక్కిట కొనగోటిజీరలతోడ న- । వ్వెలదిచ్చు దొంతర విడెముతోడ
నతివ పల్మొనకాటు లారని మోవితో । వెన్నున కీల్‍జడవేటుతోడ
సొగసైన నిద్దురసొలుపుతో రతులను । బడలిన నెమ్మోము బాగుతోడ | 3 | seesamu |
3666 | _x000D_
గురువుఁగూడుఁజేసి గుణము వత్తిగఁజేసి
_x000D_
సరవిఁగర్మఁ జమితి సమురుఁ జేసి
_x000D_
మూల నొక్కజ్యోతి ముట్టించి చూడరా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2226 | కూర్మావతారమై కుధరంబు క్రిందను - గోర్కెతో నుండవా కొమరు మిగుల?
వరాహావతారమై వనభూములను జొచ్చి - శిక్షింపవా హిరణ్యాక్షు నపుడు?
నరసింహమూర్తివై నరభోజను హిరణ్య - కశిపునిఁ ద్రుంపవా కాంతి మీఱ?
వామనరూపమై వసుధలో బలిచక్ర - వర్తి నణంపవా వైర ముడిగి? | 3 | seesamu |
4111 | _x000D_
లంకపోవునాఁడు లంకాధిపతి రాజ్య
_x000D_
మంత కీశసేన లాక్రమించె
_x000D_
చేటుకాలమైనఁ జెఱుప నల్పుఁడె చాలు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1714 | తనయుఁడు పుత్రులం గనువిధంబు ఘటించుటకై రమేశు నీ-
శుని సిరి మీనలోచనను జొక్కము మీఱ భజించు నెన్నఁ డే
మనుమని నెత్తి ముద్దిడుదు మక్కువతోడ నటంచుఁ గోడలిం
గని ముదమందుచో మిగులఁ గాంక్షిలు తల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
2063 | తుదకు దొంగల కిత్తురో దొరల కవునో - తేనె జుంటీఁగ లియ్యవా తెరువరులకు?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! | 2 | teytageethi |
98 | ని న్నెఱిఁ గెఱింగి యందఱు నన్నుతింతు-రెవ్వరికి నీవు కావలె నెంచి చూడ?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
1419 | ధనువు చేబూని చివ్వున వంచి లాగి ప- । ట్టిన దోచు మొగ్గ వాలిన విధంబు
దండెంబులకు రొమ్ముతట్టి మ్రొగ్గగ దోచు । ధేనుకాబంధంబు పూను కరణి
బిరుదుజెట్టీలతో పెనగొను తరి దోచు । నురగబంధము సేయుచున్న పగిది
మేలౌ కడాని లోడీలు ద్రిప్పగ దోచు । పడతి నీ యుదుటు పెందొడల సొగసు | 3 | seesamu |
1181 | గరళముఁ బెట్టెడు వాని
న్బరుఁ జంపఁదలంచు వానిఁ జనులెల్ల బయ
ల్పఱచెడి వానిం జనధన
హరుని నృపతిం జంపి పుణ్యుఁ డగును గుమారా! | 1 | kandamu |
669 | పరుల ధనంబుఁజూచి పర భామల జూచి హరింపగోరు మ
ద్గురుతరమానసంబనెడు దొంగనుబట్టి నిరూఢదాస్య వి
స్ఫురితవివేక పాశములఁ జుట్టి భవచ్చరణంబనే మరు
త్తరువునఁ గట్టివేయఁగదె దాశరథీ! కరుణాపయోనిధీ! | 5 | champakamaala |
1053 | నిరతాన్నదానవైఖరిఁ జెలంగెడివారు | నెనరొప్ప దీనుల మనుచువారు
గోవిప్రబాంధవగురుభక్తి గలవారు | శివు విష్ణుఁ బూజలు సేయువారు
పరధన పరవధూపరతఁ జెందనివారు | పరహితాచరణులై పరఁగువారు
సుజ్ఞానసహితులై సొబగు మీఱెడివారు | సత్యవచోరూఢి సలుపువారు | 3 | seesamu |
4279 | గీసినగోళ్లచేఁ బసిఁడి కిన్నరకంపితముల్ కదల్చుచున్
రాసెడిగుబ్బచన్నులభరంబున నయ్యలమేలుమంగతో
మూసియు మూయ కక్షు లరమోడ్చుచు ఱెప్పలఁ దేలఁజే
యఁగా నాసల నీవు తన్మయము నందుట చిత్రము వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
2010 | వెలయన్ యౌవనకాలమందు మరుఁడున్ వృద్ధాప్యకాలంబునన్
బలురోగంబులు నంత్య మందు యముఁడుం బాధింప నట్టైన యీ
పలుజన్మంబులు చాల దూలితి ననుం బాలింపవే దేవ మీ
ఫలితానంద దయావలోకనము నాపైఁ జూపు నారాయణా! | 4 | mattebhamu |
1317 | జనకాత్మజాసుహృద్వనజాతసారంగ । సారంగధరకంఠసన్నిభాంగ
యంగజానేకసమంచితసుకుమార । సుకుమారజననిసంస్తుతపదాబ్జ
యబ్జబాంధవసత్కులాబ్ధిసంభవచంద్ర । చంద్రశోభితదివ్యచారుగంధ
గంధసింధురదశకంఠకంఠీరవ । రవగుణశ్రుతభయక్రాంతకాండ | 3 | seesamu |
195 | కైలాస మేరు సంకాశ నాగాశన- స్కంధంబుపై రథోత్సవము గల్గఁ
జందనమందార సంతానకల్పక- వనముల మృగయోత్సవమ్ము గల్గ
రంగత్పయఃపయోరాశి వీచికలపై- వర్ణింప డోలోత్సవంబు గల్గ
బహుఫణారత్న శుంభద్భుజంగమ భోగ- వసతిఁ బర్యంకోత్సవంబు గల్గ | 3 | seesamu |
4622 | తంగెటిజున్ను, ముంగటి నిధానము, పండిన కల్పవల్లి, ముం
గొంగున ముత్తియంబనఁగ, గూర్మి మనంబునఁ దొంగలింపగా
జంగమకోటికర్చనలు సల్పుచునున్న యగణ్యపుణ్య! నీ
వంగడమేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
1916 | స్వామి మీ దయ నేడు మా సఖియకోర్కె | దీరగా గల్గె నీ శుభదినమునందుభవ్యగుణజాల శుభలీల భక్తపాల | మదనగోపాల సత్యభామావిలోలా! | 2 | teytageethi |
1759 | మొలకదేనియలొల్కు కుల్కుపల్కుల విభు మది కరగించునే మంజువాణిక్షణమైన నిను బాయజాలర ప్రాణేశ యని కౌఁగిలించునే యబ్జపాణివీణె వాయింపుచు వెలది పైకమురీతి బాడగా నేర్చునే పద్మనయనయిద్దరమొనగూడి వొద్దిక నుండుట కెన్ని నోచితినను నెమ్మెలాడి | 3 | seesamu |
1880 | దానితో సరి యెవ్వరి గాన జగతి | నీకె దగినట్టి వగగల నేర్పులాడిచాన నేలుట తగునట్టి జాణవీవు | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
2492 | అమరేంద్రాబ్జభవాళి కెన్నఁ దుది నీ వాదిం బ్రసాదింప న-
ర్థము సిద్ధించుచునుండుఁగాని సురమాత్రుం గోరిన న్వీరి కా-
ర్యము సిద్ధింప దనేకమార్గములఁ బ్రారంభించిరే నిశ్చయా-
ర్థముగా నీవ సమస్తకర్త వగుటం దర్కింప సర్వేశ్వరా! | 4 | mattebhamu |
2584 | శివసాహిత్యుల సత్కరస్థలము కాశీక్షేత్రమా హస్తదే-
శవిశాలోన్నతశాఖ లారయఁగఁ బంచక్రోశమా పాణిసం-
భవశోభాన్వితచిత్రరేఖలు మహాభాగీరథీతీర్థముల్
శివలింగం బల విశ్వనాథుఁ డరయన్ సిద్ధంబు సర్వేశ్వరా! | 4 | mattebhamu |
2876 | మోహముమీఱఁ బంచశరుమోహర మొగ్గినవేళఁ గుల్కు నీ
సాహస మేమనన్ బయికిఁ జంగున దాఁటి చెలంగి కేళిలో
నీ హొనరెల్ల నేర్పఱుపు నేర్పరి వౌదువు విస్ఫురద్వరా-
రోహ యటన్న పేరు దగు రూఢిగ నీయెడ సుందరీమణీ! | 6 | vutpalamaala |
4579 | అంచిత భక్తియుక్త! యసహాయ విశృంఖల వీరపూర! ని
శ్చంచలశైవభావ! శ్రిత జంగమపాదకిరీట కూట! హృ
త్సంచిత సత్త్వ తత్త్వ! దురితవ్రజశైలకదంబశంబ! ని
ర్వంచక నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
314 | శ్రీకైలాస మహామహీధర శిరఃశృంగాటకాంచన్మణి-
ప్రాకారాంతర చంద్రకాంత రజతప్రాసాదశుద్ధాంత సిం-
హాకారోన్నతహేమపీఠమునఁ గొల్వైయుండు నిన్నెన్నెదన్
రాకాచంద్రనిభప్రభాకలిత! భర్గా! పార్వతీవల్లభా! | 7 | saardulamu |
582 | అరదము లందలంబులు హయంబులు రత్నవిభూషణంబు లం-
బరములు చామరంబులు ద్విపంబులు నాదిగఁ గల్గు ఠీవులు-
న్బొరసెడువారు మిమ్ము మునుఁ బూజయొనర్చినవారె కారయా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
4361 | అల్పునిఁ జేర్చిన నధికప్రసంగియౌ । ముద్దు చేసినఁ గుక్క మూతి నాకు
గోళ్ళ సాఁకినఁ బొంతకుండలో విష్ఠించుఁ । గొద్దితొత్తుల పొందు రద్ది కీడ్చు
గూబలు వ్రాలినఁ గొంప నాశముఁ జేయుఁ । జనవీయఁగ నాలు చంక కెక్కుఁ
బలువతో సరసంబు ప్రాణహాని యొనర్చు । దుష్టుడు మంత్రైన దొరను జెఱచుఁ | 3 | seesamu |
2984 | విరహతాపంబాయె విభుడిటు రాడాయె మది తాల్మి లేదాయె మందయానవెన్నెలాతపమాయె విరిసరుల్ వెగటాయె నిదుర లేదాయెనే నీలవేణి హ-ర్షంబు లేదాయె నాడికల్ ఘనమాయె నిద్దరి కెడమాయె నిందువదనకలికి పెట్టినమందు తలకెక్కి యిపుడైనచేడె నా యిలు తొంగిచూడడాయె | 3 | seesamu |
2741 | అధరము గదలియుఁ గదలక
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుఁడౌ
నధికార రోగపూరిత
బధిరాంధక శవముఁ జూడఁ బాపము సుమతీ! | 1 | kandamu |
3359 | _x000D_
బయలున బంధము గప్పను
_x000D_
బయలునఁ బరమాత్మునకును బంధము తొలఁగు\న్
_x000D_
బయలున బంధము లూడిన
_x000D_
నయవర్తన ముక్తిఁగాంచు నరుఁడటు వేమా. | 1 | kandamu |
3952 | _x000D_
మోహము తీఱక యుండిన
_x000D_
దాహంబై దేహమంత దల్లడపడ నీ
_x000D_
గేహములోఁ బోరాడక
_x000D_
దేహమునం దున్న శివునిఁ దెలియర వేమా. | 1 | kandamu |
1941 | భీమాకారవరాహమై భువనముల్ భీతిల్లి కంపింప ను
ద్దామోర్విం గొనిపోయి నీరనిధిలో డాఁగున్న గర్వాంధునిన్
హేమాక్షాసురు వీఁకఁ దాకిఁ జయలక్ష్మి\న్ గారవింపంగ నీ
భూమిం దక్షిణదంష్ట్ర నెత్తిన నినుం బూజింతు నారాయణా! | 7 | saardulamu |
3608 | _x000D_
ఎవ్వ రెఱుఁగకుండ నెప్పుడు పోవునో
_x000D_
పోవు జీవ మకట బొంది విడిచి
_x000D_
అంతమాత్రమునకు నపకీర్తి నెఱుఁగక
_x000D_
విరుగఁబడును నరుఁడు వెఱ్ఱి వేమ. | 0 | aataveladi |
1827 | దొండపండుకు జాల బొండుమల్లెలు గూర్చి యాట్లాడరా వేగ హవుసుకాడఅద్దంపు పైపద్మమంటించి ప్రియమున జూడరా యావింత సొగసుకాడబాలచంద్రుల దెచ్చి పూలచెండ్ల గదించి వేడుక చూడరా వింతకాడమకరధ్వజునిగూటి శుకము నోటికనంటిపండిచ్చి చూడరా బలిమికాడ | 3 | seesamu |
4445 | రాజులమంచు బొజ్జలు పెంచగా రాదు । అని మొనలో నఱుకాడవలయు
మంత్రులమని బొంకుమాటలాడిన గాదు । యిప్పింప నేర్చి తామియ్యవలయు
కవులమంచని వింతగా నల్లినను గాదు । చిత్రప్రబంధముల్ సేయవలయు
తపసులమని నిక్కి తలలు పెంచినఁ గాదు । నిర్వికల్పసమాధి నెఱుగవలయు | 3 | seesamu |
1976 | కేల\న్ గోలయు గూటిచిక్కము నొగిం గీలించి నెత్తంబునం
బీలీపించముఁ జుట్టి నెన్నడుమునం బింఛావళి\న్ గట్టి క
ర్ణాలంకార కదంబగుచ్ఛ మధుమత్తాలీస్వనం బొప్ప నీ
వాలన్ గాచినభావ మిట్టి దని నే వర్ణింతు, నారాయణా! | 7 | saardulamu |
1863 | చాన నీపై వలపు మానెద నేవేళ బూని చిలుకలతోడ బోరుచుండుబాల నీపై జాల బాళిచే దుమ్మెదరో దలకు దన మది రోయుచుండుకామిని నీయందు కాంక్షను గోర్వంక కలకలంబుల కెదఁ దలకుచుండుభామిని విరహార్తిబాధితయై నెమ్మి కేకలకును మది గనుకచెందు | 3 | seesamu |
3469 | _x000D_
ఇంత వగవ వెలసె నేకాంత బుద్ధితా
_x000D_
హరిహరాదులందు నాశ లుడిగి
_x000D_
శాంతబుద్ధి నుండ సమకూరును సుఖంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4423 | పాలనలేని భూపతియైన నతని ద- । గ్గెరనుండు మంత్రి ధగ్డీయునైన
చెవిటి రాయసమైన సేవకుఁడయినను । వారసుగాఁడు దివాను నయిన
వరుస బక్షీ చిత్తవైకల్యుండయినను । గడుదీర నత్తి వకాలతైన
కోశపాలకునకు గుందేటి తెవులైన । నుగ్రాణగాని కత్యుగ్రమైన | 3 | seesamu |
1598 | దైత్యానీకపయోధి మధ్యమున మందానాద్రిభంగి రయౌ
ద్ధత్యం బొప్పఁగ సంచరింపుచు బలౌదార్యం బెలర్పన్ బృహ
ద్వాత్యాచక్రము శుష్కపర్ణముల చందానన్ వడిం ద్రిప్పి, యా
దిత్యుల్ మెచ్చఁగ బట్టి గీటడఁచవే దేవాంతకున్ మారుతీ! | 7 | saardulamu |
3533 | _x000D_
మాటనిలుపలేని మనుజుండు చండాలుఁ
_x000D_
డాజ్ఞ లేనిరాజు ఆఁడుముండ
_x000D_
మహిమలేని వేల్పుమంటిఁ జేసినపులి
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2675 | శ్రుతులభ్యాసముచేసి శాస్త్రగరిమల్శోధించి తత్త్వంబులన్
మతినూహించి శరీరమస్థిరము బ్రహ్మంబెన్నసత్యంబు గాం
చితిమంచున్ సభలన్ వృథావచనముల్చెప్పంగనేకాని, ని
ర్జిత చిత్తస్థిరసౌఖ్యముల్ దెలియరో శ్రీకాళహస్తీశ్వరా! | 4 | mattebhamu |
1734 | నతివ సౌందర్య మెన్నుట కలవిగాదు | మగని కూరిమిగలిగిన మగువ నేల-దగును నీకైన దగు మంచితరుణి సుమ్ము | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
2326 | దోసంబు ల్కులపర్వతంబుల కొలందుల్ గల్గినం గల్గనీ
మీ సంకీర్తన శబ్దమాత్రమున భస్మీభూతమైపోవవా
త్రాసు ల్కోటిసహస్రముల్ గలిగి యెత్తన్ రాని కార్పాసపున్
రాసు ల్సోఁకిన నిప్పువోలె రఘువీరా! జానకీనాయకా! | 7 | saardulamu |
4522 | యాత్మశక్తి తొలగిన యవసరమునఁ । దనకు నెవ్వరు గానిది తథ్యమరయ
బలిమిచే నవయవములు పనికిరావు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
1381 | జాఫల్ రసంబు గుర్షాపూలు ద్రాక్షలు । గంగులుఖందు చొక్కపు జవాజి
జాఫరాయగరు పచ్చాకూదుబత్తీలు । పునుగుపన్నీరు గంబురు గులాబి
యత్తరు సీమరాయంచలు తెల్లాకు- । మడుపుల్ వళాగ్రముల్ మల్లెపూలు
కురువేరు నరగ జాల్ కొత్తకైరావళ్లు । దవనంపు చెండ్లు దంతంపు గుండ్లు | 3 | seesamu |
1970 | విందు ల్వచ్చిరి మీయశోదకడకు న్వేగంబె పొ మ్మయ్యయో
నందానందన! చందనాంకురమ! కృష్ణా! యింకఁబో వేమి మా
మందం జాతర సేయఁబోద మిదె రమ్మా యంచు మి మ్మెత్తుకో
చందం బబ్బిన నుబ్బకుండుదురె ఘోషస్త్రీలు, నారాయణా! | 7 | saardulamu |
3668 | _x000D_
శివుగుడిని దీప మిడినను
_x000D_
శివమందిర మెల్ల వెలుగు జేయుట యరుదా
_x000D_
శివయోగి జ్ఞానదీపము
_x000D_
భువనంబుల వెలుఁగఁ జేయు పొలుపుగ వేమా. | 1 | kandamu |
420 | అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండు కోరినన్
గదిసి పదార్థమిత్తురటు కానగ వేగమె కొట్టి తెండనన్
మొదటికి మోసమౌఁ; బొదుగు మూలముగోసినఁ బాలు గల్గునే
పిదికినఁ గాక భూమిఁ బశుబృందము నెవ్వరికైన భాస్కరా! | 5 | champakamaala |
864 | వడుగవునై మూఁడడుగుల
నడిగితివౌ భళిర భళిర యఖిలజగంబుల్
తొడిగితివి నీదు మేనునఁ
గడు చిత్రము నీ చరిత్ర ఘనుఁడవు కృష్ణా. | 1 | kandamu |
2618 | శ్రీవిద్యుత్కలితాజవంజవ మహాజీమూతపాపాంబు ధా
రావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్
దేవా! నీ కరుణా శరత్సమయమింతేఁ జాలు సద్భావనా
సేవం దామరతంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
4565 | కాయ గుణావిధేయ! జితకాయ! వినమ్ర జగన్నికాయ! యా
మ్నాయవచోప్రమేయ! యసమాన సమంచితగేయ! భక్తి ధౌ
రేయ! సదానపాయ! సుచరిత్రసహాయ! జితాంతకాయ! దే
వా యొడయండ వీవ బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
1340 | ముడి వదలినట్టి నీవి నిమ్ముగ బిగించి । సురతమున మైచెమర్చిన సురటి బూని
విసరుకొనుచున్నవేళ నీ వితమునెన్న । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
3888 | _x000D_
శైవవైష్ణవాది షణ్మతంబుల కెల్ల
_x000D_
దేవుఁ డొక్కఁ డనుచుఁ దెలియ లేరు
_x000D_
తమకు భేదమైన తత్వంబు భేదమా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1808 | యనుచు జెలులతొ నెప్పుడా యలరుబోడి | నిన్నె తలచుచునున్నది నీరజాక్షగాన రావయ్య వేగమె కమలనయన | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
573 | పరుసము సోకి లోహము శుభస్థితి బంగరమైన రీతి స-
ద్గురుకరుణానిరీక్షణ మకుంఠితలీల నొకింత సోకినన్
నరుఁడు మహాత్ముఁడై బుధజనస్తుతుఁడై నినుఁ జెందుఁబో తుదిన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
33 | చెల్లింపఁ దగునె వ్రేపల్లెలోఁ గల వెఱ్ఱి- గొల్లయిల్లాండ్రను గొల్లగొనఁగ?
మెక్కంగఁ దగునె ము న్పెక్కిండ్లలో నుట్ల- కెక్కి పాల్వెన్నలు డొక్క నిండ?
మ్రుచ్చిలఁ దగునె మళ్ళుచ్చి జలక మ్మాడు- మచ్చెకంటుల కోక లిచ్చకముగ?
మ్రొక్కంగఁ దగునె ముం దొక్కపువ్వునకుఁ దాఁ- గక్కసించినయాలి కక్కజముగ | 3 | seesamu |
3416 | _x000D_
తలఁపుచేతఁగల్గు తారక బ్రహ్మంబు
_x000D_
తలచిఁచూడఁదానె తత్వమగును
_x000D_
తలఁపులోనె తలఁపు తానె తానెఱిఁగిన
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1082 | నెట్లు పూజ్యములయ్యె నట్లెల్లవేల్పు- | గములయందును నీవె కా ఘనుఁడ వరయ,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
4371 | పెట్టనేరని రండ పెక్కునీతులఁ బెద్ద । గొడ్రాలిముండకు గొంతు పెద్ద
మంకుబుద్ధికిఁ దన మాట సాగుటె పెద్ద । రిక్తుని మదిని కోరికలు పెద్ద
అల్పవిద్వాంసుండు నాక్షేపణకుఁ బెద్ద । మూర్ఖచిత్తుఁడుఁ కోపమునకుఁ బెద్ద
గుడ్డిగుఱ్ఱము తట్టగుగ్గిళ్ళు తినఁ బెద్ద । వెలయ నాఁబోతుకండలను బెద్ద | 3 | seesamu |
2965 | పసులగాపరి కీలాగు పడతిజేసి | కూర్చె గద నన్ను దైవంబు కుటిలబుద్ధితరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. | 2 | teytageethi |
3090 | అనువు గాని చోట నధికుల మనరాదు
కొంచె ముండు టెల్ల కొదువ గాదు
కొండ యద్దమందుఁ గొంచమై యుండదా?
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2575 | శూలస్థాపితుఁడైన మానవునకున్ శూలంబు దుర్వారవా-
త్యాలిం గంపము నొందకుండుట సుఖంబై తోఁచు మాడ్కిన్ భవా-
భీలజ్వాలలఁ గ్రాఁగు మానవునకున్ బింబాధరల్ హారవ-
స్త్రాలంకారము లించుకించుక సుఖంబై తోఁచు సర్వేశ్వరా! | 7 | saardulamu |
357 | శ్రీశైలంబును గుంభఘోణమును గాంచీస్థాన కేదారముల్
కాశీ ద్వారవతీ ప్రయాగములు నీలక్ష్మాధరావంతికల్
లేశంబున్ ఫలమీవు నిన్నెపుడు హాళిం గొల్వలేకున్నచోఁ
గాశాకాశధునీఘనాభరణ! భర్గా! పార్వతీవల్లభా! | 7 | saardulamu |
3151 | _x000D_
కుండ పగిలెనేని క్రొత్తది కొనవచ్చు
_x000D_
భూతలంబునందు బొందుగాను
_x000D_
కూలబడిన నరుఁడు కుదురుట యరుదయా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
402 | తులువ ల్పెట్ట భుజింపలేక ధనమెంతో నెమ్మదిం గూర్చి మూ-
లల దట్టంబుగఁ బాఁతుకొన్న నృపతు ల్వాలెంబు నిర్మోహులై
పలుచందంబులఁ గట్టి కొట్టి మిగుల న్బాధించి రోధించుచుం
గల సొమ్మెల్ల హరించుచుండ్రు గద! భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
2567 | ఉదకం బింకిన లావు మాలి కడుమై యష్ణింపఁగా రొంపిలోఁ
గదలం జాలని మీను వాన గురియం గ్రమ్మెక్కి పెన్నీటిలోఁ
బొదలం గన్న విధంబునన్ భవముతోఁ బోరాడు మర్త్యుండు దా
హృదయాబ్జంబున నిన్నుఁ గొల్వఁగనునే యింపొంద సర్వేశ్వరా! | 4 | mattebhamu |
3932 | _x000D_
కసవు నేరి తినెడు పసరపు మైఁ దిన
_x000D_
మాలఁడండ్రు వాని మహిని నరులు
_x000D_
పట్టికోడిఁ దిన్న ప్రాజ్ఞులందురు జనుల్
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2247 | పటునిర్ఘాత కఠోరనాదము ఘనబ్రహ్మాండ భాండంబుఁ బి
క్కటిలం జేయుచు వచ్చునప్పు డితరుల్ గాండీవినామంబు లె
న్నుట మేలందురు; వైష్ణవుల్ తలఁప రన్యుం గోరి యెంతెంత దు
ర్ఘటముల్ వచ్చిన నిన్నెగాక రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
4123 | _x000D_
అంతరాత్మఁ గనక యల్పబుద్ధులతోడ
_x000D_
మెలఁగునట్టి ద్విజులు మేదినందు
_x000D_
యమునినరకములకు నరుగంగ నది సాక్షి
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4650 | బసవఁడు ప్రీతిఁ గైకొనియె భక్తిమెయిన్ రచియించినాఁడ నే
బసవపురాణమంచు మునుఁ బ్రస్తుతి సేయుదురట్లుగాన నీ
యసమదయాధురీణతకు నంకిలిపాటు ఘటిల్లకుండ నన్
వసిఁగొని బ్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 5 | champakamaala |
4578 | వినుత నవీనగాన గుణవిశ్రుత భక్తవిధేయకాయ! య
త్యనుపమగణ్యపుణ్య నయనాంచలదూర భవోపతాప! స
ద్వినయ వికాసభాస సముదీర్ణ శివైక సుఖైకపాక! దే
వ నను భరింపుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 5 | champakamaala |
3367 | _x000D_
సమమునైన దృష్టి సమముగా మదినిల్పి
_x000D_
బయలురుచులు మాని భద్రముగను
_x000D_
పరగఁజూడ బట్టబయలగు బ్రహ్మంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
223 | పలుమాఱున్ భవదీయకావ్యరచనాప్రాగల్భ్య మొప్పార ని-
న్గొలుతున్ మామక మానసాబ్జమున బొంకుల్ గావు నీ వెచ్చటం
గలలోనం బొడకట్ట విట్టి వగ బాగా! మేల్! బళా! శ్యామకో-
మలవిభ్రాజితమందరావయవ! రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
831 | నందుని ముద్దుల పట్టివి
మంధరగిరిధరుని హరిని మాధవు విష్ణున్
సుందర రూపుని మునిగణ
వందితు నినుఁ దలఁతు భక్త వత్సల కృష్ణా. | 1 | kandamu |
4170 | _x000D_
వాక్కుశుద్ధి లేనివాఁడు చండాలుండు
_x000D_
ప్రేమశుద్ధిలేని పెట్టులేల
_x000D_
నొసలు భక్తుఁడైన నోరు తోడేలయా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2669 | పాలుంబువ్వయుఁ బెట్టెదం గుడువరా పాపన్న రా! యన్న లే
లే లెమ్మన నరంటిపండ్లుఁగొని తేలేకున్న నే నొల్లనం
టే లాలింపరె తల్లిదండ్రులపుడట్లే తెచ్చి వాత్సల్య ల
క్ష్మీ లీలావచనంబులం గుడుపరా శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
1336 | దైవఘటనేమొ గాని నిన్ దలచినపుడు । ఝల్లుమని గుండెలదరె నీ జాలి మాని
మరుడు నన్నేచ నీమీద మరులు దాచ । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
3721 | _x000D_
తంత్రవాదు లెన్న తఱచుగా నుందురు
_x000D_
మంత్రవాదు లెన్న మహిని లేరు
_x000D_
జంత్రగాని బొమ్మ చందంబు లాయెరా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4498 | మద్యపానుల కనరాని మాటలేదు । గ్రామ్యునకు గల్గదెందు నాగరికముద్ర
తప్పెఱుంగక పోవఁ డుత్తమకులజుఁడు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
2474 | శ్రీకంఠుం బరమేశు నవ్యయు నిజశ్రీపాదదివ్యప్రభా-
నీకోత్సారితదేవతానిటలదుర్నీత్యక్షరధ్వాంతుఁ జి-
త్ప్రాకామ్యాంగు నపాంగమాత్రరచితబ్రహ్మాండసంఘాతు జం-
ద్రాకల్పుం బ్రణుతింతు నిన్ను మది నాహ్లాదింతు సర్వేశ్వరా! | 7 | saardulamu |
71 | నాఁగలి రోఁక లన్నకు నిచ్చి శంఖాది- పంచాయుధము లీవు పట్టినావు
తాఱిటెక్కెంబు కోల్తల పెద్ద కెత్తించి- గరుడధ్వజం బీవు గట్టినావు
వెలరాని కఱవోని వలువ జ్యేష్ఠున కిచ్చి- కనకాంబరం బీవు గట్టినావు
మద్య మగ్రజునకు మత్తిలఁ దావించి- జున్ను బాల్ పెరుఁ గీవు జుఱ్ఱినావు | 3 | seesamu |
1745 | వదనమా కాదది పదియారుకళలచే బెంపొంద వెలయు జాబిల్లి గానికన్నులా కావవి చెన్నుమీఱగజాల మెరసెడి బేడిసమీలు గానియధరమా కాదది మధురసభరితమై పరిపక్వమగు బింబఫలము గానికందరమా కాదు కరిమరేఖల దాల్చి కంధిలో బొదలు శంఖంబు గాని | 3 | seesamu |
4571 | మారమదాపహార! సుకుమార శరీర! గణప్రసాద వి
స్తార! వృషావతార సముదార విహార! సమద్దయాపరి
ష్కార! శుభప్రకార! యవికార! మహా జగదేకవీర! దు
ర్వార శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
2936 | కన్నియ యిప్పుడేల కడకట్ట ప్రయాణము దీర్చివచ్చి నిన్
గన్నులఁ జూచి సంతసిలఁగల్గెడు పోఁడిమి పట్టినంతలో
నెన్నిదినంబు లుంటివని యెంతయుఁ గోపముమాని బిగ్గఱన్
నన్నుఁ గవుంగలించుకొని నా వెత దీర్పవె సుందరీమణీ! | 6 | vutpalamaala |
1287 | వాణియు శర్వాణియు హరి
రాణియు వాక్కునను మైనురంబున నుంటల్
రాణఁ దిలకించి మదిలో
బాణిగ్రాహియెడ నిల్పు భక్తిఁ గుమారీ! | 1 | kandamu |
4236 | నీవును దాను గూడెఁ దరుణీమణి శ్రీయలమేలుమంగ నా
నావిధవైభవంబుల ననారతముం జెలువొందు నేఁడు నీ
వావలిమోము చేసి తన యప్పటినుండియుఁ బల్కవిట్టులా
దేవర చిత్తమెవ్వరికిఁ దేర్పఁగ శక్యమె వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
2991 | నీవు కోరిన కోర్కెలు నిత్యముగను | సఫలమాయెను బోగదే సత్యభామతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. | 2 | teytageethi |
1700 | కులమును రూపముం జెలువుఁ గోమలతం దలిదండ్రు లన్నద-
మ్ములుఁ గలదానిఁగా సుగుణము ల్గలదానినిఁగా దలంచి పై-
దలి నటు పెండ్లిచేసి యల దంపతులం గని మూఁడులోకముల్
చెలువుగ నేలినట్లు విలసిల్లెడు తల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
4191 | _x000D_
ఉర్వివారికెల్ల నొక్కకంచముఁబెట్టి
_x000D_
పొత్తుఁ గుడిపికులము పొలయఁ జేసి
_x000D_
తలను చేయిపెట్టి తగ నమ్మఁజెప్పరా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3769 | _x000D_
అధిక భుక్తిచేత మొదటి సొమ్ముకుహాని
_x000D_
కుదువసొమ్ము కొన్నఁ గొంత హాని
_x000D_
మొదటి పక్షమునను మూలకర్తకు హాని
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1008 | ప్రోది చేసినవానితోఁ బోరువాఁడు | చేరు దుర్గతి నిహపరదూరుఁడగుచు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
3625 | _x000D_
చిప్పలోనఁ బడ్డ చినుకు ముత్యం బాయె
_x000D_
నీళ్ళలోనఁగలిసి నీరె యాయె
_x000D_
ప్రాప్తము గలచోట ఫలమేల దప్పురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4502 | పరుల ధనసంపదల కసూయ పడగరాదు । తనదు లేమికి ఖేదమొందంగరాదు
సాధువర్తనలివి గాదు చర్చసేయ
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
576 | తరణిసుధామయూఖవసుధాయజమానసమీరణానలాం-
బరజలమూర్తివైన నిను భక్తిఁ దలంచినవారి కెందులన్
దిరుగఁగనేల యే శిలల నిచ్చలుఁ గోరి భజింపనేలయా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
2996 | మత్స్యావతారమై మడుగులో జొచ్చియు జేపవై పుట్టుట జన్మమేమికుటిలబుద్ధిని నీవు కూర్మావతారమై తాబేలవైనది తప్పుగాదెవరహావతారమై వాంఛ పడితివిగాని యతినీచమనుచు నెఱిగినావయావెన్క నారసింహావతారంబెత్తి మఱుగుజ్జువాడవై మల్లినావు | 3 | seesamu |
3196 | _x000D_
మన్నును దినమన్న మండేరు జనులార
_x000D_
మంటిలోనిమేలు మఱువనేల
_x000D_
నీళ్లలోనిమేలు నిఖిలమై యుండురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
771 | మీసామర్థ్యము గల్గునంతకును నెమ్మి\న్ బాండుసూనుండు నా
యాసం బొంద మహాద్భుతంబుగ విరాటాధీశుపట్ణంబులో
గ్రాసోపాయము లేక భిక్ష మడుగ\న్ గాషాయముంబూని స
న్యాసంబు\న్ ధరియింపఁడే యచటఁ గృష్ణా దేవకీనందనా. | 7 | saardulamu |
884 | గజరాజవరద కేశవ
త్రిజగత్కల్యాణమూర్తి దేవ మురారీ
భుజగేంద్రశయన మాధవ
విజయాప్తుఁడ నన్నుఁగావు వేగమె కృష్ణా. | 1 | kandamu |
1623 | నీ నామంబు పఠించినన్ నిను మదిం జింతించినన్ నీ కథా
గానం బుద్ధతి సల్పినం గరము వేడ్కన్ నిన్నుఁ బూజించినన్
నానావ్యాధులడంగు, వేలుపుల సన్మానంబు సంధిల్లు, వి
ద్యానైపుణ్యము గల్గు, చేకుఱును దీర్ఘాయుష్యమున్ మారుతీ! | 7 | saardulamu |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.