id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
2553
జ్వరసంతాపవిశోషితాంగుఁడు సుధాసంకాశదివ్యాన్నపా- నరసశ్రేణి భుజింప రోయుగతి నున్మాదేంద్రియధ్వాంతదు- స్తరసంసారమదప్రమత్తుఁడు మహాసౌఖ్యోత్సవంబైన మీ చరణారాధనయందు బుద్ధిఁ జొనుపం జాలండు సర్వేశ్వరా!
4
mattebhamu
4442
ద్విపదకావ్యంబు ముదికాంత దిడ్డిగంత । యియ్యనేరని రండ నాల్గేక రాశి మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
330
ప్రతివారంబు శివోహమస్మి యనుచు న్భావింతు గంగాధర- స్తుతులెల్లప్పుడుఁ జేతు శంకరకథల్ సొంపార నాలింతు నా- యుతబుద్ధిన్ జగమెల్ల నీశ్వరమయం బంచు న్విచారింతు నే- గతి రక్షించెదొ కాని నీవు నను భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
2983
కొమ్మ నా బుద్ధి కేమనుకొందునమ్మ | వలపు ఘనమాయె యోర్వ నా వశముగాదుతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన.
2
teytageethi
499
మానిని చెప్పు నెట్లెఱుకమాలిన వాఁడటు చేసినన్‌ మహా హాని ఘటించు నే ఘనునికైన నసంశయ ముర్విపైఁ గృపా హీనతఁ బల్కినన్‌; దశరథేశ్వరుఁ డంగన మాటకై గుణాం భోనిధి రాముఁ బాసి చనిపోవఁడె శోకముతోడ భాస్కరా!
6
vutpalamaala
1221
మఱదండ్రు వదినె లత్తలు మఱఁదులు బావల కొమాళ్లు మఱి పెద్దలు రా నురవడిఁ బీటలు మంచము లరుఁగులు దిగుచుండవలయు నమ్మ కుమారీ!
1
kandamu
2624
దివిజక్ష్మారుహధేనురత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్న సా నువు నీ విల్లు, నిధీశ్వరుండు సఖుఁ, డర్ణోరాశి కన్యావిభుం డు విశేషార్చకుఁ డింక నీకెన ఘనుండుం గల్గునే నీవు చూ చి విచారింపవు లేమి నెవ్వఁడుడుపున్‌ శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
3648
_x000D_ దానమడుగువాఁడు ధరలోన నధముండు _x000D_ దానమడుగఁడేని దైవసముఁడు _x000D_ దానమీనివాఁడు ధన్యుండు కాఁడయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
57
సకలంబు నీవ యై మొకమఱ్ఱియాకుపై- నిచ్చఁ బరుండునాఁ డెంత గలవొ! తన బిడ్డఁ డని యశోదాదేవి పొత్తుల- నిడుక ముద్దాడునాఁ డెంత గలవొ! తక్కులమారత్త దక్కించుకొనఁగ ని- న్నెత్తుక పెంచునాఁ డెంత గలవొ! భయలేశ మెఱుఁగక బల్పాముపడగపై- గంతులు వైచునాఁ డెంత గలవొ!
3
seesamu
2718
చెడుగుల్‌ కొందఱు కూడి చేయఁగఁ బనుల్‌ చీకట్లు దూఱంగఁ బా ల్పడితింగాని చరింపరాని నిను నొల్లంజాలుఁ బొమ్మంచు ని ల్వెడలం ద్రోచినఁజూరువట్టుకొని నే వ్రేలాడుదుం గోర్కిఁగో రెడి యర్థంబులు నాకు వే గలుగవో శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
1265
సన్నెకలుం బొత్రమ్మును తన్నుకబోరాదు కాలఁ దగిలిన యెడలన్‌ గన్నుల నద్దుకొన న్వలెఁ గ్రన్నన సిరి యందు నిలుచుఁ గాదె కుమారీ!
1
kandamu
3305
_x000D_ సద్గురు కృపజ్ఞానంబున _x000D_ సద్గతి దీపించుచున్న చాలగు చదువుల్‌ _x000D_ సద్గతిఁ గలుగంజేసెడి _x000D_ సద్గురువే దైవమనుచుఁ జాటర వేమా.
1
kandamu
1157
సంపద గలవారిని మో దింపుచుఁ జుట్టుకొనియుందు రెల్లప్పుడు స త్సంపద తొలంగిన నుపే క్షింపుదు రవివేకజనులు క్షితిని గుమారా!
1
kandamu
4290
ఒఱపగుమీ విహారతతు లుప్పనబట్టెలు బిల్లటీపు ల చ్చెరువుగ బల్లకోటులు ప్రసిద్ధిగ నయ్యలమేలుమంగకున్‌ మెఱుపులు ముచ్చటల్‌ రతులమ్రొక్కులుఁ దక్కులు వచ్చి వచ్చి మీ చిఱునగవుం బ్రమోదములు చెక్కులనొక్కులు వేంకటేశ్వరా!
5
champakamaala
3388
_x000D_ అదిఁజూచుచుండ నన్నిటఁ దా నుండు _x000D_ నాదిఁ జూప నొకని కలవిగాదు _x000D_ ఆదిముక్తిఁ దెలుపు నాత్మనే యుండురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4382
అనుచు మూర్ఖాళి యీ రీతి ననుదినంబు । భూతలమునందు వచియింత్రు నీతిలేక మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
4262
ఏచతురత్వ మేమహిమ మేమి విలాస మదేమి విభ్రమం బీ చెలువంపు సంపదయు నిందుముఖుల్‌ జగదేకమోహినుల్‌ చూచి తలంట వేడ్కపడి చూతురు నీయలమేలుమంగ లీ లాచికురంపుఁ గ్రుమ్ముడి కెలంకుల నిగ్గులు వేంకటేశ్వరా!
6
vutpalamaala
2602
సంకీర్ణాకలితాక్షరత్రయము భాస్వన్నాదబిందుక్రమా- లంకారద్వితయంబుతోఁ గలిసి లీలన్ దివ్యయోగీంద్రహృ- త్పంకోద్భూతములందు రూఢమగుచుం బంచాక్షరీమంత్ర మ- య్యోంకారాత్మకమౌ లసన్మునిగణం బూహింప సర్వేశ్వరా!
7
saardulamu
2106
కాయ మెంత భయానఁ గాపాడిననుగాని - ధాత్రిలో నది చూడ దక్కఁబోదు ఏవేళ నేరోగమేమరించునొ? సత్త్వ - మొందఁగఁ జేయునే చందమునను ఔషధంబులు మంచివనుభవించినఁ గాని - కర్మక్షీణంబైనఁ గాని విడదు కోటివైద్యులు గుంపుగూడివచ్చినఁ గాని - మరణ మయ్యెడు వ్యాధిమాన్పలేరు
3
seesamu
3037
నేనెరుఁగుదు నీదు మహాత్మ్యమిపుడు | నవ్వరే నిన్ను విన్నవారెవ్వరయినదగవులున్నది మనమధ్య తాడిమళ్ళ | రాజగోపాల రావయ్య రమణి గూడ.
2
teytageethi
2679
సంతోషించితిఁ జాలుఁజాలు రతి రాజద్వార సౌఖ్యంబులన్‌ శాంతిం బొందితిఁ జాలుఁజాలు బహురాజద్వార సౌఖ్యంబులన్‌ శాంతిం బొందెదఁ జూపు బ్రహ్మపద రాజద్వార సౌఖ్యంబు ని శ్చింత న్శాంతుఁడనౌదు నీ కరుణచే శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
2026
చెల్లం జేసితి పాతకంబులు మది\న్‌ శ్రీనాథ మీనామముల్‌ పొల్లుల్‌ బోవని నమ్మి పద్యశతమున్‌ బూర్ణంబుగాఁ జెప్పితిన్‌ చెల్లంబో నను నమ్మె వీఁడని దయం జేపట్టి రక్షింపుమీ తల్లిం దండ్రియు నీవు గాక యొరులే తర్కింప నారాయణా!
7
saardulamu
1275
అధికారము లేనిపనుల కధికారము సేయఁబోకు మందునఁ గోపం బధికం బగు నీవారికి బుధు లది విని హర్ష మొందఁ బోరు కుమారీ!
1
kandamu
383
చెలుల న్బంధుల విప్రులన్ బ్రజల దాసీభృత్యమిత్రాదులం గల విత్తంబులు వృత్తులుం గొని కడున్ గారింతు రధ్యక్షతం దలపంజాల రదేమొ మీఁదటికథల్ దర్పాంధకారాంధులై కలనైనన్ మహిభృద్దురాత్మకులు భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
1272
వడి దనిపించుకొనుటకున్‌ గడి యైననుఁ బట్టకుండుఁ గాంతలలో నె క్కుడు గుణవతి యనిపించెడి నడవడి నేర్చుటయె కడు ఘనంబు కుమారీ!
1
kandamu
523
ఇంచుక నేర్పు చాలక విహీనతఁ జెందిన నా కవిత్వమున్‌ మించు వహించె నీకతన మిక్కిలి యెట్లనఁ దోలుబొమ్మలున్‌ మంచివివేకి వాని తెరమాటున నుండి ప్రశస్తరీతి నా డించిన నాడవే జనుల డెందము నింపవె ప్రీతి భాస్కరా!
6
vutpalamaala
3422
_x000D_ హంగుమీరఁ దాను యతులజన్మంబుల _x000D_ నరసి చెప్పునెంతవారికైన _x000D_ ఆడకాడ కనువు నతిశయమై వచ్చు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
921
కందర్పకోటి సుందర మందరధర భానుతేజ మంజులదేహా సుందర విగ్రహ మునిగణ వందిత మిము దలఁతు భక్తవత్సల కృష్ణా.
1
kandamu
332
వ్యాకీర్ణాచ్ఛజటాటవీతటనితాంతాలంబితోద్యత్తమి- స్రాకాంతప్రథితప్రభాసముదయాశ్రాంతప్రఫుల్లన్మహా- నాకద్వీపవతీవినిర్మిలజలాంతర్భాగభాగ్దివ్యరే- ఖాకాంతోత్పలకైరవప్రకర! భర్గా! పార్వతీవల్లభా!
7
saardulamu
2467
కూడదు గతి సంసారికి బూడిదలో గచ్చకాయ పొరలినభంగి\న్‌ వాఁడును వీఁడును దానై జాడ యెఱిఁగి నడువ రన్న! సంపఁగిమన్నా!
1
kandamu
4315
మణుల వెలుంగు దీపవనమాలికలై పొగడొందఁ గంకణ క్వణనము మేఖలావళులఘంటలు శ్రీయలమేలుమంగకు\న్‌ బ్రణయవినోద సంపదకుఁ బాయక నీ కొనరించుపూజకై ప్రణుతనుతప్రభావముల భాగ్యము లైనవి వేంకటేశ్వరా!
5
champakamaala
2989
జానకీనాథ రాఘవచక్రహస్త | రఘుకులోత్తమ దశరథరామచంద్ర................................. | రాజగోపాల రావయ్య రమణి గూడ.
2
teytageethi
1550
సరసాన్నంబులు పక్వమాంసచయముల్‌ సౌరభ్య సంవాసిత స్ఫురదుచ్చావచ మద్యపూరితఘటంబుల్‌, మాల్యముల్‌ నిద్రితా సురకాంతల్‌ గల పానశాల గని యచ్చో రాఘవ ప్రేయసిన్‌ సురకాంతాసదృశన్‌ విదేహతనయన్‌ శోధింపవే మారుతీ!
4
mattebhamu
3550
_x000D_ నిజములాడువాని నిందించు జగమెల్ల _x000D_ నిజము లాడరాదు నీచుతోడ _x000D_ నిజమహాత్ముఁగూడ నిజమాడవలయురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4649
నోరికి వచ్చినట్టు నిను నూఱువిధంబులఁ బ్రస్తుతింతు నే నేరుతు నేరఁ బొమ్మనక నీపయి నొచ్చెములేని మచ్చికన్‌ గారవమంద మత్ప్రణుతిఁ గైకొనఁగాఁ దగు గౌరవంబునన్‌ వారని కూర్మి పేర్మి బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
4057
_x000D_ గుణహీనజనుని గుణ మెంచగా నేల _x000D_ బుద్ధిలేనివాని పూజలేల _x000D_ మనసు లేనివాని మంత్రంబు లేలరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2273
అనిశంబున్ నినుఁ గొల్చు మానవులు ప్రాణాంతంబునన్ రోగబా ధ నిమిత్తంబున రామరామ యనుచున్ దల్పంగ లేకుండినన్ జననాథాగ్రణి! నీవు వారి రసనాస్థానంబున న్నిల్చి బో రన రామా! యనిపింతు వౌర! రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
1613
ప్రమదం బొప్పఁగ రాముఁడున్‌ భవదభిప్రాయంబు నూహించి, నీ సముదంచద్పదభక్తికిన్‌ విమలప్రజ్ఞాయుక్తికిన్‌ మెచ్చి, సం యములైనన్‌ బడయంగరాని మహనీయాధ్యాత్మ విద్యోపదే శముఁ గావింపఁడె నీకు మేదినిసుతాసంయుక్తుఁడై మారుతీ!
4
mattebhamu
4535
బడవాకుఁ బ్రతి యెన్న బహుమతు లేనూరు । దళవాయి కొక్క యూర ధర్మచేట పడుపుతొత్తుకు మేలుపౌజు కమ్మలు । తాటాకు దుద్దులు తల్లిచెవుల దండెదాసర్లకుఁ దాజీతవాజము । కవివరులకుఁ గన్నగాని మన్ను బైనీని సుద్దికి బారిశాలువజోడు । విద్వాంసులకు బేడ వెలితిగుడ్డ
3
seesamu
486
బంధుర సద్గుణాఖ్యుఁ డొక పట్టున లంపట నొందియైన దు స్సంధిఁ దలంపఁ డన్యులకుఁ జాల హితం బొనరించుఁ గాక, శ్రీ గంధపుఁ జెక్క రాగిలిచుఁ గాదె శరీరుల కుత్సవార్థమై గంధములాత్మఁ బుట్టఁ దఱుఁగంబడి యుండుటలెల్ల భాస్కరా!
6
vutpalamaala
3633
_x000D_ నోటి పుప్పి కెల్ల నొప్పిలేకుంటకు _x000D_ నాకు పోకసున్న మౌషధముగ _x000D_ పెట్ట కుండెనేని పెనురోఁత వేయురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
203
ఆగామి సంచిత ప్రారబ్ధము లటుండ- నిజజన్మమందు నే నెల్లవేళ నఘములే చేసితి నని యుష్మత్సుధా- సదృశ నిర్హేతుక జాయమాను కరుణాకటాక్ష వీక్షణ మెంచ కెప్పుడో- ప్రసరింపవలె నే నపారదురిత వారధిఁ దరియింపవలెఁ గాని గతి యితః- పర మెఱుంగను భక్తపాలనాంక!
3
seesamu
2315
చిలుకన్ ముద్దులు చిల్క బిల్చుతఱి రాజీవాక్షి యొక్కర్తు ని చ్చలు రామా రఘురామ రావె యనినన్ సాలోక్యసాయుజ్యమున్ కొలఁదు ల్మీఱఁగ నిచ్చినాఁడవఁట నిన్నున్ బిడ్డపే రిడ్డవా రల పుణ్యంబున కెద్దిమేర రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
2743
అప్పిచ్చు వాఁడు వైద్యుఁడు నెప్పుడు నెడతెగక పాఱు నేఱును ద్విజుఁడున్‌ జొప్పడిన యూర నుండుము చొప్పడ కున్నట్టి యూరుఁ జొరకుము సుమతీ!
1
kandamu
3983
_x000D_ వల్లవైపులేక వాగ్దత్త మటుచేసి _x000D_ యదిగొయిదిగొ యనుచు నాసఁబెట్టి _x000D_ గడువుఁ బెట్టి రేపు గడియ కానిమ్మని _x000D_ గడియలోనఁ బడియెఁ గదర వేమ.
0
aataveladi
2070
బ్రతికినన్నాళ్లు నీభజన తప్పను గాని - మరణకాలమునందు మఱతునేమొ యావేళ యమదూతలాగ్రహంబున వచ్చి - ప్రాణముల్‌ పెకలించి పట్టునపుడు కఫ వాత పైత్యముల్‌ గప్పఁగా భ్రమచేతఁ - గంప ముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణా యంచుఁ - బిలుతునో శ్రమచేతఁ బిలువలేనో
3
seesamu
348
విజయుం డుగ్రవిపక్షశిక్షణకళావృత్తి న్మిముం గోరి య- క్కజమొప్పన్ దప మింద్రకీలశిఖరిన్ గావించుచో బోయవై విజయఖ్యాతిగఁ బోరి పాశుపతమీవే వాని కిష్టంబుగా రజతక్షోణిధరాగ్రసద్భవన! భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
2793
తాననుభవింప నర్థము మానవపతిఁ జేరుఁ గొంత మఱి భూగతమౌఁ గానల నీఁగలు గూర్చిన తేనియ యొరుఁజేరునట్లు తిరముగ సుమతీ!
1
kandamu
3525
_x000D_ మంచిరుచులను గోరు మంచిస్త్రీలను గోరు _x000D_ మనుజుఁ డెంత చెడ్డమనసు చూడ _x000D_ నించుకైన నేలని విడువఁడు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
579
ధరణిసురు న్వధించిన మదంబున గోనిధనంబొనర్చినం గురుసతిఁ గూడినన్ మధువుఁ గ్రోలిన హేమము మ్రుచ్చలించినన్ దొరకొను పాతకంబు లొకతూరి శివా యనినన్ దొలంగుఁబో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
251
మొదలంజేసిన పుణ్యపాపములు సన్మోదాతిఖేదంబులై యదన న్వచ్చి భుజింపఁ బాలుపడు నాహా! యెవ్వరి న్వేఁడిన న్వదలంజాల వవెన్నిచందములఁ దా వారింపఁ జింతించినన్ మదనారాతికినైనఁ దథ్యమిది రామా! భక్తమందారమా!
4
mattebhamu
1387
జుంటితేనియపాలు జున్ను శర్కర మంచి- । రసదాడియమృతంబు కుసుమరసము ఖర్జూరములు పానకము ద్రాక్ష మాగిన । కమలాఫలము లిక్షుఖండములును నారికేళజలంబు నవనీతమన్కగు??? । పరమాన్నమును వేరుపనసతొనలు తియ్యమామిడిపండ్ల దీసిన సారంబు । నతిరసంబులు మనోహరచయంబు-
3
seesamu
4581
సరసవచస్క! నిర్మలయశస్క! శివైక్యమనస్క! భక్తహృ త్సరసిజగేహ! క్లుప్తభవదాహ! దయాపరివాహ! చిత్సుఖో త్తర నిజశిల్ప! భక్తపరతల్ప! మహావృషకల్ప! మన్మనో వరద! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
5
champakamaala
3512
_x000D_ జాణలనయట్టి చపలాయతాక్షుల _x000D_ వలపు లరసిచూచి బ్రమయకేల _x000D_ బయలిరూపులరసి పరికింపగా నేల _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3574
_x000D_ చక్కెర గలిపియు తినఁగా _x000D_ ముక్కిన తవుడైన లెస్స మోహము గలుగ\న్‌ _x000D_ వెక్కురు బానిసయైన\న్‌ _x000D_ మక్కువఁ గను దివ్యభామ మహిలో వేమా.
1
kandamu
2362
సన్న్యాసుల మని శాస్త్రో పన్యాసముసేయ నందు ఫలమేమి? మన స్సన్న్యాసము దొరకని యాసన్న్యాసము కూటికన్న సంపఁగిమన్నా!
1
kandamu
2688
రోసిందేఁటిది రోఁతలేఁటిది మనోరోగస్థుఁడై దేహి తాఁ బూసిందేఁటిది పూఁతలేఁటివి మదాపూతంబులీ దేహంబుల్‌ మూసిందేఁటిది మూఁతలేఁటివి సదా మూఢత్వమే కాని తాఁ జేసిందేఁటిది చేఁతలేఁటివి వృథా శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
3861
_x000D_ ఇహపరాదులకును నిది సాధనం బని _x000D_ వ్రాసి చదివి విన్నవారికైన _x000D_ మధ్యమకర్మములు మహిమతో నడచును _x000D_ బడుగుకైన ముక్తిపదము వేమ.
0
aataveladi
4389
కలకొద్దిలోపలఁ కడదెచ్చి మన్నించి । యిచ్చినవారి దీవించవలయు సిరిచేత మత్తుఁడై పరు నెఱుంగని లోభి । దేబెను పెళ్ళునఁ దిట్టవలయుఁ దిట్టిన యప్పుడేఁ దెలిసి ఖేదము నొంది । యింద్రుడైనను బిచ్చమెత్తవలయు దీవించినను యల దీర్ఘాయును బొంది । బీదైన నందలం బెక్కవలయు
3
seesamu
4410
గట్టిముచ్చెలతోఁ బడగొట్టి విఱుగ- । గట్టి పంపించవలయునుఁ గాలుపురికి మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
863
కెరలి యఱచేతఁ గంబము నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరుని\న్‌ ఉరమును జీరి వధించితి నరహరి రూపావతార నగధర కృష్ణా.
1
kandamu
878
హరి నీవె దిక్కు నాకును సిరితో నేతెంచి మకరి శిక్షించి దయ\న్‌ బరమేష్ఠి సురలు పొగడఁగ కరిఁ గాచిన రీతి నన్నుఁ గావుము కృష్ణా.
1
kandamu
2825
మంత్రిగలవాని రాజ్యము తంత్రము చెడకుండ నిలచుఁ దఱచుగ ధరలో మంత్రివిహీనుని రాజ్యము జంత్రపుఁ గీలూడినట్లు జరుగదు సుమతీ!
1
kandamu
4393
కోమటి యత్యంతక్షామము గోరును । ధారుణి క్షితిపతి ధనము గోరు ధరఁ గరణము గ్రామదండుగ గోరును । జంబుకంబేవేళ శవము గోరు కుజనుఁడౌ వైద్యుండు ప్రజల రోగము గోరు । సామాన్యవిప్రుండు చావు గోరు అతిశూరులగువారు ధృతిని గోరుచునుందు । రాఁబోతు వేదల యశము గోరుఁ
3
seesamu
198
రామమూర్తికి వాంఛేతర ప్రపంచ-మేమి గావరె లీలార్థ మింతె కాని చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
2684
ఒకరింజంపి పదస్థులై బ్రదుకఁ దామొక్కొక్కరూహింతురే లొకొ తామెన్నఁడు జావరో? తమకుఁ బోవో సంపదల్‌? పుత్త్రమి త్రకళత్రాదులతోడ నిత్యసుఖమందంగందురో? యున్నవా రికి లేదో మృతి యెన్నఁడుం గటకటా! శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
299
అగవిద్వేషణుఁ గూడి వేడుక నహల్యాదేవి గ్రీడింపఁగా భగవంతుండగు గౌతముండు గని కోపస్ఫూర్తి శాపింప నీ జగతిం ఱాపడి తాపమొందగ పదాబ్జప్రస్ఫురద్ధూళిచే మగువం జేసితి వెంత వింత యది రామా! భక్తమందారమా!
4
mattebhamu
4145
_x000D_ ప్రేతయన్న మనుచుఁ బ్రీతితోఁ బిలిపించి _x000D_ కాకులకును బెట్టు కర్ములార _x000D_ కాకులందు నేమి ఘనులకుఁ బెట్టుఁడీ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3673
_x000D_ రుద్రరూపుఁ దాల్చి రుద్రుని నిందించి _x000D_ భ్రష్టుత్రోవఁ దిరుగు భ్రష్టజనులు _x000D_ ఱంకులకునుదిరుగు రమణులవలె నుండు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2708
ద్వారద్వారములందుఁ గంచుకిజన వ్రాతంబు దండంబులన్‌ దోరంతస్స్థలి బగ్గనంబొడుచుచున్‌ దుర్భాషలాడన్మఱిన్‌ వారింబ్రార్థనచేసి రాజులకు సేవల్సేయగాఁ బోరు ల క్ష్మీ రాజ్యంబునుగోరి నీ పరిజనుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
977
మోట బొల్లెద్దుకు ముకుదాడు గట్టిన- | ట్టెద్దెరా మొగమెల్ల సుద్దపట్టె- లద్దించుకొని వచ్చి అయగారు యేంచేసె | తడియాకుఁ గావలె తయ్యడాడు బళ్ళంట ఆమీఁద పరపామదంట మం- | గలదాని బొందంట గనడమంట ముత్తి గలుగునంట ముద్రదానము గమ్మ- | టంట దాసరికొయ్య యెంటఁబట్టి
3
seesamu
4633
పసిగ మెయిన్‌ వృషాధిపుని ప్రాణము జంగమకోటి ప్రాణముల్‌ మసలక యెత్తుచున్‌ భువన మాన్యచరిత్రతఁ దేజరిల్లు న మ్ముసిఁడిగ చౌడరాయనికి మున్నిటి భృత్యుఁడ! నిన్భజింతు న న్వసిగొని ప్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
5
champakamaala
3343
_x000D_ సుప్తి జాగరముల సొలపులఁ దానుండి _x000D_ కప్పుకొన్న మాయఁ గానలేక _x000D_ దబ్బర నిజములను తానులెస్స గనక _x000D_ గొబ్బున చెడిపోవు గుణము వేమా.
0
aataveladi
2562
ఆనందంబును బొందునప్పుడును నత్యాశ్చర్యకార్యార్థభా- వానీకంబులు దోఁచునప్పుడును రోగాపాయదుఃఖాతుర- గ్లానిం బొంది చరించునప్పుడును సత్కార్యంబున న్నీవు నా ధ్యానంబం దుదయింపుమయ్య దివిజేంద్రస్తుత్య సర్వేశ్వరా!
7
saardulamu
928
నను గజాననుఁ డెపుడు నిన్ బొగడు కృతులఁ | జిరకృపాస్ఫూర్తి సంపూర్తి సేయుచుండు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
3953
_x000D_ లింగ మంగమునను లీలఁ దెలియువెన్క _x000D_ మనసు లింగమందు మరులుకొనును _x000D_ మనసు నిల్పనందె మఱిలింగ ముండురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2776
కొక్కోకమెల్లఁ జదివినఁ జక్కనివాఁడైన రాజ చంద్రుండైనన్‌ మిక్కిలి రొక్కంబీయక చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ!
1
kandamu
1249
బద్ధకము సంజనిద్దుర వద్దుసుమీ దద్దిరంబు వచ్చును దానన్‌ గద్దింతు రింటివారలు మొద్దందురు తోడివారు ముద్దు కుమారీ!
1
kandamu
4230
_x000D_ అవని వేమన్న చెప్పిన యాత్మబుద్ధిఁ _x000D_ దెలియలేనట్టి యజ్ఞాని తేజమెల్ల _x000D_ తలనుఁ బాసిన వెంట్రుకవలెను జూడ _x000D_ భుక్తి ముక్తులు హీనమైపోవు వేమ.
2
teytageethi
282
సిరులెంతేనియు నిక్కువంబనుచు దుశ్శీలన్ మదిన్ నమ్మి ని- ర్భరగర్వంబున మీఁదు చూతు రహహా! భావంబుతో నెంచినం గరికర్ణాంతము లంబుబుద్బుదతతుల్ ఖద్యోతకీటప్రభల్ మరుదగ్రార్పితదీపమాలికలు! రామా! భక్తమందారమా!
4
mattebhamu
4362
కనుక విని దెల్సి జాగ్రత్తగాను ప్రజలఁ । బాలనముఁ జేయు టది రాజపద్ధతి యగు మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
3447
_x000D_ అనలంబున జనియించియు _x000D_ ననలంబున సలిలమగును నాకాశమున\న్‌ _x000D_ గనిపించి పుట్టుఁదానే _x000D_ జనకుఁడు లేనట్టిదాయె చరితము వేమా.
1
kandamu
3361
_x000D_ మాట లుడుగకున్న మంత్రంబు దొరకదు _x000D_ మంత్ర ముడుగకున్న మనసు నిలదు _x000D_ మనసు నిలుపకున్న మఱి ముక్తి లేదయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
120
బక్షపాతివి గావె? యభక్తిఁ బడిరి-నమ్ముదురె యానిశాటు లెన్నటికి నిన్ను చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
4303
తగు నలమేలుమంగకును దన్మయమందెడునీకు మేనిలో బగటులు బచ్చిమాటలను బచ్చెనయెచ్చరికల్‌ వివేకముల్‌ మొగముల లేఁతనవ్వులను మోవులనాటులుతమ్మితూటులు\న్‌ జగడపుఁబొందులు\న్‌ రతులసంపదవిందులు వేంకటేశ్వరా!
5
champakamaala
1333
అల కుందముల యందముల నిందసేయు నీ । రదనాళి దలుప నెమ్మది చలించు జలజాతముల ఖ్యాతముల రాత నదలించు । చూపులెంచిన మోహమేపు మించు పగడాల జిగిడాల జగడాల గెల్చు కె- । మ్మోవి జూచిన బాళి ముమ్మరించు మగరాల వగతూలన గజాలునగు లీల । దలప నెమ్మేనేమొ పులుకరించు
3
seesamu
3144
_x000D_ ముందరి పోటుల మాన్పను _x000D_ మందెందును గలదుగాని మహిలోపల నే _x000D_ నిందల పోటులు మాన్పెడు _x000D_ మందెచ్చట నైనఁ గలదె మహిలో వేమా.
1
kandamu
497
మానవనాథుఁ డాత్మరిపు మర్మ మెఱింగినవాని నేలినం గాని జయింపలేఁ డరులఁ; గార్ముకదక్షుఁడు రామభద్రుఁ డా దానవనాయకున్‌ గెలువఁ దా నెటులోపుఁ దదీయ నాభికా పానసుధ న్విభీషణుఁడు తార్కొని చెప్పకయున్న భాస్కరా!
6
vutpalamaala
4475
మౌనంబు దాల్చుట మనసిచ్చగింపమి । గదిసివేయుట లోభకారణంబు దర్శనంబియ్యమి తప్పుసైపకయున్కి । పెడమోముపెట్టుట ప్రియములేమి గర్వంబు దెల్పుట కార్యాంతరాసక్తి । సమయంబుగాదంట జరుపునేర్పు నరయుదమన్న రంధ్రాన్వేషణాసక్తి । యతివినయంబు ధౌర్త్యంబు తెరువు
3
seesamu
4200
_x000D_ నేరనన్నవాఁడు నెరజాణ మహిలోన _x000D_ నేర్తునన్నవాఁడు వార్తకాఁడు _x000D_ ఊరకున్నవాఁడె యుత్తమోత్తముఁ డెందు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1806
వెలది నను చాల కొసరిన విభుని పొందు | మఱచి యెటులుండవచ్చునే మందయానయనుచు నను బంపె నీకడ కబ్జనాభ | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
3701
_x000D_ కుక్క గోవు గాదు కుందేలు పులికాదు _x000D_ దోమ గజము గాదు దొడ్డదైన _x000D_ లోభి దాత గాఁడు లోకంబు లోపల _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
949
ధననాయకుడు నితాంతము బ్రియమిత్రుండు | సిరులపైదలిగేస్తుఁ డరిదితూపు కలధౌతశైలంబు కాఁపురంబు బిడారు | కాంచనాహార్యంబు కార్ముకంబు రత్నాధివాసంబు రహి మించు తరకసం- | బల సర్వమంగళ యనుఁగురాణి పంటలపువుఁబోఁడి బాళి మీఱిన తేరు | కళలీను రాజు కీల్గంటిపువ్వు
3
seesamu
46
వడిగలతనంబులా యివి? గడన యేమి-కొద్దిపను లివి నీ కిది పెద్దతనమె? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
4047
_x000D_ జ్ఞానుల మని యెంచి చపలాత్ము లగువారు _x000D_ తెలివిలేక తమ్ముఁ దెలియలేరు _x000D_ కష్టగహనమందు కాడ్పడియున్నారు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1371
తాళి గట్టని చిన్నితనమున నొకనాడు । చేడియలను గూడి యాడుచుండి నను జూచి బావ వచ్చెనటంచు బాజుబం- । దుల క్రిందిచెండ్లంది దుముకులాడ పరగున నాదు పైబడి కౌగిలించిన । యెనలేని కడువేడ్కనెత్తి లేత- మొలకమెరుంగుచన్నులు నాభి చెక్కులు । గళమును పచ్చవిల్కానినగరు
3
seesamu
1057
అంభోధి కభిషేక మాచరించినయట్లు | గంగకుఁ బాద్య మొసంగినట్లు మేరువునకు నలంకారంబు లిడినట్టు- | లినునకు నారతు లెత్తినట్లు మలయాచలమునకుఁ గలప మిచ్చినయట్టు- | లిల వసంతునకుఁ బూలిడినయట్లు భూపముఖ్యునకుఁ దాంబూల మిచ్చినయట్లు | సోమున కద్దంబు సూపినట్లు
3
seesamu
2775
కొంచెపు నరు సంగతిచే నంచితముగఁ గీడు వచ్చు నది యెట్లన్నన్‌ గించిత్తు నల్లి కుట్టిన మంచమునకుఁ జేటువచ్చు మహిలో సుమతీ!
1
kandamu
3794
_x000D_ వంటవారియింట తిన్నవంటకమును _x000D_ వంట తినినయపుడె వెంటవచ్చు _x000D_ వచ్చు నట్లగాక వరఁకు నుభయులకు _x000D_ కంటకమగు వంటకమును వేమా.
0
aataveladi
2803
నీరే ప్రాణాధారము నోరే రసభరితమైన నుడువులకెల్లన్‌ నారియె నరులకు రత్నము చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ!
1
kandamu