id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
4556
దేహజవైరివాహ! శివదీపితదేహ! సుఖప్రవాహ! ని ర్మోహ! వినమ్ర సంయమిసమూహ! లసద్గుణగేహ! సంతతో త్సాహ! నిరీహ! జంగమ వితానదయావిహితావగాహ! ని ర్వాహమ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
2899
మారెడు బంటసోయగము మారెను నీ చనుగుబ్బదోయిపై గోరెడు బంటనొక్కి మదిఁ గోరెడు నీ నునుమోవి గ్రోల నో- రూరెడు నేమిసేతు మరుఁ డూరట జెందకయుండు; మీఁది మ- న్నారెడు పూవు మోదినను నారెడు బెట్టెదు సుందరీమణీ!
6
vutpalamaala
4540
కీర్తి యపకీర్తి దక్కఁ దక్కినవి నిల్వఁ- । బోవు శాశ్వతమౌనట్లు పుడమిమీద మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
2915
హారములొత్తునంచుఁ బరిహార మొనర్చి కవుంగిలించి వ్యా- హారముదంబునన్ రతివిహారము సల్పి మనోజబాధ సం- హారము చేసి, నాదు వ్యవహారము నిల్వకయున్న నిద్ర వ్యా- హారము గాంతునే నను మహారముఁడందురె సుందరీమణీ!
6
vutpalamaala
4216
_x000D_ పరఁగ జలకమాడి పట్టెనామముదీర్చి _x000D_ నీరుకావిపంచె నెగడఁగట్టి _x000D_ వారకాంతఁజూచి వ్రతమెల్ల మఱచురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1993
తనువుం జీవుఁడు నేక మైనపిదపన్‌ ధర్మక్రియారంభుఁ డై యనయంబు న్మది దన్నెఱుంగక తుది న్నామాయచే మగ్నుఁ డై తనుతత్త్వాదివియోగమైన పిదపం దా నేర్చునే నీదు ద ర్శన మింపారఁగ భక్తివైభవ మహాసంకాశ నారాయణా!
4
mattebhamu
4584
లింగనిరూఢ! సంచితవిలీఢ! పరాక్రమగూఢ! మానసా సంగి వృషాంక! నిర్గళితశంక! నిరస్తకళంక! సంతతా భంగురపుణ్య! శీలముఖమణ్య త్రిలోకవరేణ్య! దేవ నీ వంగడమేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
3492
_x000D_ తనువ దెవరిసొమ్ము తనదని పోషింప _x000D_ ధనమదెవరిసొమ్ము దాచుకొనఁగ _x000D_ ప్రాణ మెవరిసొమ్ము పాయకుండఁగ నిల్ప _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1179
మనుజుల తమసౌఖ్యము కొఱ కును సంరక్షణము నవనిఁ గోరుదు, రొగి నే జనపాలుఁడు సంరక్షిం పను దగియును బ్రోవఁ డతఁడె పాపి కుమారా!
1
kandamu
2681
అకలంకస్థితి నిల్పి నాదమను ఘంటారావమున్‌ బిందు దీ పకళా శ్రేణి వివేక సాధనములొప్పన్బూని యానందతా రక దుర్గాటవిలో మనోమృగము గర్వస్ఫూర్తి వారించు వా రికిఁగా వీడు భవోగ్రబంధలతికల్‌ శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
1977
కాళిందీతటభూమి నాలకదుపుల్‌ కాలూఁది మేయ\న్‌ సము త్తాలోల తమాలపాదప శిఖాంతస్థుండవై వేణురం ధ్రాలిన్‌ రాగరసంబు నిండ విలసద్రాగంబు సంధించి గో పాలవ్రాతము గండుగోయిలలుగా వర్ణింతు, నారాయణా!
7
saardulamu
1248
కులదేవతలకుఁ బెట్టిన పొలుపునఁ దనయింటయాఁడు బొట్టెల కెల్లం గలమాత్ర మొసఁగకుండినఁ గలఁత పొడము దాన మేలు గాదు కుమారీ!
1
kandamu
533
గురుతరలీలఁ బీఠపురి కుక్కుటలింగమహాప్రభుండవై బరగెడు నిన్ను నేనిపుడు భక్తి దలర్పఁగ నాశ్రయింతు నీ వరకరుణానిరీక్షణము వాలెము నాపయి నిల్పి ప్రోవవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
3402
_x000D_ దానములలో నన్నదానము దొడ్డది _x000D_ గానములను సామగాన మెచ్చు _x000D_ ధ్యానములను శివునిధ్యానము శ్రేష్ఠము _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2373
నిండికొను నిట్టిమాయ ప్ర చండగతిం గప్పుకొన్న సజ్జనుల బుధుల్‌ ఖండింప నేల మదపా షండులవాక్యములు విన్న సంపఁగిమన్నా!
1
kandamu
508
వానికి విద్యచేత సిరివచ్చె నటంచును విద్య నేర్వఁగాఁ బూనినఁ బూనుఁగాక తన పుణ్యము చాలక భాగ్యరేఖకుం బూనఁగ నెవ్వఁడోపు; సరిపో చెవి పెంచును గాకదృష్టతా హీనుఁడు కర్ణభూషణము లెట్లు గడింపఁగనోపు? భాస్కరా!
6
vutpalamaala
39
కన్నవారల మున్ను గారాగృహంబున- విడిచి పాఱితివి నీ కడిమి యేమి? పగవాఁడు పురిటిలోఁ బట్టి నెత్తుకపోవఁ- దమకించుచున్న నీ ధైర్య మేమి? ముద్దుమన్మని గోప్యముగ నొండు బంధింపఁ- దెలియన ట్లున్న నీ తెగువ యేమి? వైరిధాటికి నోడి వనధి మధ్యమునందు- నిలు గట్టుకొన్న నీ బలిమి యేమి?
3
seesamu
4291
చక్కెర బొమ్మ చెక్కులనె సానలు పట్టిన పువ్వుటమ్ములో గ్రుక్కినజవ్వనంబు పెనుగుబ్బలో శ్రీయలమేలుమంగ నీ వక్కునఁ జేర్చి పట్ట సకలాధిప సౌఖ్యము నీకు నబ్బెఁగా కెక్కువ లంటు కందువల యింపుల సొంపుల వేంకటేశ్వరా!
6
vutpalamaala
3048
పాముమీఁదను జేరి సాము జేసినవాఁడవగుట సద్గుణమెట్లు వచ్చు నీకుపాలీయవచ్చిన పడతి జంపినవాఁడ చెలులపై నెనరేల గలుగు నీకుమేనమామను గంసు మీఱి త్రుంచినవాడ నెనరుమాటల నేమి నీకు ఘనతపసులగాపరివాండ్ర పలుకులు వినువాడ భావజు రతి నేమి భ్రాంతి నీకు
3
seesamu
2119
నళినదళనేత్ర! నిన్ను నే నమ్మినాను - జేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
1686
చదివితివేని నీ కిపుడు జామఫలంబులు దెచ్చి యిత్తు స- మ్మదమున మంచిదోవతులు మాడలొసంగుదునంచుఁ బల్కి మే- ల్పొదలఁగ బుజ్జగించుచును బొంకముగా బడిఁ జేరఁ బంపి తాఁ బదపడి త్రోవలో నిలుచుఁ బల్మఱు తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
3771
_x000D_ పృథివి కుదక మేగె పృథివిపై మొలకెత్తె _x000D_ మగుడ పృథివి కేగె మగఁడె సుతుఁడు _x000D_ ధరణి జనులకెల్ల తల్లియ పెండ్లాము _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4596
ఖ్యాతయశఃప్రపూరిత జగత్త్రియాయ నమోనమో, మహా పాతక సూతకఘ్న పదపద్మ యుగాయ నమోనమో, సము ద్ద్యోత వృషాయతే" యనుచు నుత్సుకతన్‌ బ్రణుతింతు సంయమి వ్రాత శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
4294
తొలఁకెడుకొప్పులో నెరులొ తుమ్మెదదాటులొ చూపువంపులో గులుకులొ మంచివెన్నెలల గుంపులొ శ్రీయలమేలుమంగకున్‌ బలుకులు పచ్చకప్పురపుఁ బల్కులు తావులె దివ్యగంధముల్‌ పలుచనినవ్వులే విరులపాన్పులు నీకును వేంకటేశ్వరా!
5
champakamaala
2449
నాలుగుత్రోవలనడుమను శ్రీలీలను వ్రేలుచున్న చిహ్నంబులఁ దా నాలోచించినబుద్ధివి శాలుండౌ ముక్తుఁడన్న! సంపఁగిమన్నా!
1
kandamu
4494
నీ యభావవిరక్తుల కేమి ఫలము । తినక చవిచూడకయె లోఁతు తెలియబడునె యెంతవానికినైన మహీస్థలమున మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
92
దోఁచుచున్నది సంఫుల్లతోయజాక్ష!-మేల్‌ బళా! యింత జా గేమి మేలుకొనవె! చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
1602
ఘనశాండిల్య మునీంద్రుశాపంబున నుగ్రగ్రాహియై ధాన్యమా లిని కాసారములోన నుండి జలముల్‌ నీ వర్ధిఁ గ్రోలన్‌ వడిన్‌ నిను మ్రింగం జనుదేరఁగాఁ గడిమి వానిన్‌ వ్రేల్మిడిం జంపి గ్ర క్కున దచ్ఛాపము దీర్చి పుచ్చవొకొ శక్రుం గొల్వగా మారుతీ!
4
mattebhamu
2090
కర్ణయుగ్మమున నీకథలు సోఁకినఁజాలు - పెద్ద పోగుల జోళ్లుపెట్టినట్లు చేతు లెత్తుచుఁ బూజసేయఁగల్గినఁజాలు - తోరంపు కడియాలు దొడిగినట్లు మొనసి మస్తకముతోమ్రొక్కఁ గల్గినఁ జాలు - చెలువమైన తురాయిచెక్కినట్లు గళము నొవ్వఁగ నిన్నుఁబలుకఁ గల్గినఁ జాలు - వింతగాఁ గంఠీలువేసినట్లు
3
seesamu
1037
ఘూకంబు తెఱఁగున గొందుల నిరుకుచు | భుజగంబు చాడ్పున బుస్సుమనుచు బెబ్బులి కరణిఁ గంపిల డాక సేయుచు | భేకంబు గతి మేనిబెంపు గనుచు భల్లూకమట్లు చొప్పడ విఱ్ఱవీఁగుచు | నాఁబోతు కైవడి నాముకొనుచు గోమాయువట్ల యెన్నోమాయ లూనుచుఁ | గ్రోడంబువలెఁ గొరకొర నెగపుచు
3
seesamu
1225
తిట్టిన దిట్టక, కొట్టిన గొట్టక, కోపించెనేనిఁ గోపింపక, నీ పుట్టినయింటికిఁ, బాదము పెట్టినయింటికిని వన్నె పెట్టు కుమారీ!
1
kandamu
2436
కనరా దన్నను శూన్యము కనవచ్చు నటన్న జడము గా దది వెలిగా ననుభవవేద్యము బ్రహ్మము సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా!
1
kandamu
2993
యింత చక్కనితనము నీ సంతసమున | గనెనె మీ తల్లి తన వరగర్భముననుతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన.
2
teytageethi
78
యల్పునిగ నెంచినారె లోకైకనాథ-నాథునిఁగ నెంచినారె ము న్దరణిఁ? జెపుమ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
2586
పరమార్థంబగు తత్త్వమార్గమున నీ పాదాబబ్జసద్భక్తుఁ డొ- క్కరుఁడుం దక్క సరోజజాద్యమరసంఘాతంబులోనెల్లఁ దా నెరయం గాచికొనంగఁ జాలరు మహానిర్భీతుఁడున్ లేఁ డతి- స్ఫురణం గాలుఁడు దన్ను వేచి వడిఁ గొంపోనుండ సర్వేశ్వరా!
4
mattebhamu
4635
అసురవృత్తిఁ జూపఱు భయంపడి మ్రొక్కఁ బ్రసాద వహ్నిచే భూసురులిండు లన్నియును బొగ్గుల ప్రోఁకలుఁ సేయు ధూత సం త్రాసుల బిబ్బబాచయల దాసియనన్‌ విలసిల్లు సద్గుణా వాస! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
1595
వదనంబు బ్రళయార్కబింబము క్రియన్‌ భాసిల్ల, లాంగూల మా త్రిదశేంద్రాయుధవైఖరిన్‌ మిగుల నుద్దీపింప బంచాననో ద్యదహీంద్రంబును బోని దక్షిణకరం బాసక్తితో నెత్తి, వా రిదనాదంబున ధాత్రి గ్రక్కదలఁ బేరెంబెత్తుచున్‌ వచ్చి త ద్ద దశాస్యుండు సగంబుఁ జావ నఱచేతన్‌ వ్రేయవే మారుతీ!
4
mattebhamu
1182
గృహదాహకునిం బరదా రహరుం బంధుహితకార్య రహితుని దుష్టో త్సహపరుని జంపి నరపతి యిహపరములయందు గీర్తి నెనయుఁ గుమారా!
1
kandamu
3606
_x000D_ తుంటవింటివాని తూపుల ఘాతకు _x000D_ మింటి మంట నడుమ మిడుకఁ దరమె _x000D_ యింటియాలి విడిచి యెట్లుండవచ్చురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2093
పద్మలోచన! నీ మీఁద భక్తిలేని - మానవుఁడు రెండుపాదాల మహిషమయ్య భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
603
దిరమున స్నానసంధ్యలును దేవ సపర్యలు సువ్రతంబులు- న్గురుభజనాదికంబులు నకుంఠితభక్తి నొనర్పనేర నీ చరణము లాశ్రయించితి నిజంబుగ నన్నిక నెట్లు బ్రోచెదో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
2830
లావు గలవాని కంటెను భావింపఁగ నీతిపరుఁడు బలవంతుఁడౌ గ్రావంబంత గజంబును మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!
1
kandamu
2603
అమలజ్ఞానవిభాసభాసురత నయ్యష్టాంగపూజావిధి క్రమయోగంబుల నిన్ను నెల్లపుడు జోకం గొల్వగానేల ని- క్కము నీ భక్తులగోష్ఠి చాలుఁ గడువీఁకన్ ఘోరసంసారదుః- ఖములెల్లం బెడవాప నిన్ను వెలయంగాఁ జూప సర్వేశ్వరా!
4
mattebhamu
493
భూరి బాలాఢ్యుఁడైనఁ దలపోయక విక్రమశక్తిచే నహం కారము నొందుటల్‌ తగవు గాదతఁడొక్కెడ మోసపోవుఁ గా వీరవరేణ్యుఁ డర్జునుఁడు వింటికి నే నధికుండ నంచుఁ దా నూరక వింటినెక్కిడఁగ నోపడు కృష్ణుఁడు లేమి భాస్కరా!
6
vutpalamaala
1353
హాయిగా విన విన ఠాయిగా నీచేత । నెలనాగ వీణె నేనెపుడు విందు సొంపుగా మై జులాయింపుగా నీనోట । రమణి నేనెపుడు పద్యములు విందు కుల్కుగా తేనియ జిల్కగా నెపుడు నే । లలన నీ ముద్దుపల్కులను విందు మెల్లగా నెమ్మది చల్లగా నెపుడు నే । కాంత నీ గాత్రరాగంబు విందు-
3
seesamu
1165
జ్ఞానుల చరితము వీనుల నానుచు సత్పురుషగోష్ఠి ననఘం బనుచున్‌ బూనుము, ధర్మపథంబును దానెఱిఁగిన యంత మఱవఁ దగదు కుమారా!
1
kandamu
3560
_x000D_ ఆలు రంభయైన నతిశీలయైన _x000D_ జారపురుషుఁడేల జాడ మాను _x000D_ మాలవాడ కుక్క మరగినచందంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3226
_x000D_ కడగివట్టియాస కడతేఱనీయదు _x000D_ ఇడుములందుఁ బెట్టి యీడ్చుఁగాని _x000D_ పుడమి జనులభక్తిఁ బొడమంగ నియ్యదు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2138
సాధు సజ్జనులతో జగడమాడినఁ గీడు - కవులతో వైరంబుఁ గాంచఁ గీడు పరమ దీనులఁ జిక్కఁబట్టి కొట్టినఁ గీడు - భిక్షగాండ్రను దుఃఖపెట్టఁ గీడు నిరుపేదలను జూచి నిందఁ జేసినఁ గీడు - పుణ్యవంతులఁ దిట్ట బొసఁగుఁ గీడు సద్భక్తులను దిరస్కారమాడినఁ గీడు - గురుని ద్రవ్యము దోఁచుకొనినఁ గీడు
3
seesamu
4531
తల్లి ఱంకునఁ దండ్రి ధనము పోయినయట్లు । మూలనిక్షేపంబు మునిఁగినట్లు కూఁతురి ముడుపెల్లఁ గొల్లవోయినయట్లు । కాణాచివల్లెలు కాలినట్లు తన యాలి గడనెల్ల దండుగ కైనట్లు । దండ్రి తద్దినమేమొ తప్పినట్లు చెల్లెపైఁ బడి దొంగ చెఱచిపోయినయట్లు । కొడుకు నప్పుడు తలగొట్టినట్లు
3
seesamu
4468
వేదబాహ్యుల విద్యలు వినగ రోత । క్రూరుఁడైయున్న హరిభక్తుఁ గూడ రోత మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
1038
దనరు క్రూరనృపాలకాధముల నమ్మి | సిరుల కాసించువాఁ డొక్క చెనఁటికాఁడె భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
3720
_x000D_ జీవి జీవిఁ జంపి జీవికి వేయఁగా _x000D_ జీవి వలన నేమి చిక్కియుండె _x000D_ జీవ హింసలకుఁ జిక్కునె మోక్షంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
775
గంభీరంబుగ రాయభారగరిమ\న్‌ గౌంతేయుకార్యార్థమై శుంభల్లీలల ధార్తరాష్ట్రుసభఁ దామూహించి తద్వాక్యము ల్సంభాషింపఁగ వా రవజ్ఞ దలఁప\న్‌ సర్వంబు నీవైనచో శంభుండేయెఱుఁగు\న్‌ భవన్మహిమ కృష్ణా దేవకీనందనా.
7
saardulamu
3390
_x000D_ తానును సమస్తభువనము _x000D_ లోనసువుల యంగఁదెలిసి లోనను వెలయు\న్‌ _x000D_ దానై వెలుఁగఁగ నేర్చిన _x000D_ మానవునకు ముక్తి గలుగు మహిలో వేమా.
1
kandamu
170
నెంచరాని గుణాఢ్యుఁడ వీవె యనుచుఁ-దెలిసి మ్రొక్కెద నితర మౌ దిక్కు లేక చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
3832
_x000D_ పిడుగును నరచేతఁ బిగఁబట్టి యందులోఁ _x000D_ గల్మషంబునెల్ల కడకఁదీసి _x000D_ కడమచేతి చేత కలియుగమును బ్రోచు _x000D_ కర్మ కర్మ నెఱుగఁ గదర వేమా.
0
aataveladi
2495
ఇల సద్భక్తుల పాదధూళిపటలం బేమర్త్యుఫాలంబునం జిలుకు న్వాఁ డపవర్గనాథుఁ డనినన్ సిద్ధంబుగా వారి ని- ర్మలహస్తార్పితభూతిఁ బ్రీతి నొసలారం బూయు విశ్వాసికిన్ ఫలమూహించి విధించి యెవ్వరికిఁ జెప్పన్వచ్చు సర్వేశ్వరా!
4
mattebhamu
3685
_x000D_ ఆఁకటికి దొలంగు నాచార విధు లెల్ల _x000D_ చీఁకటికి దొలంగు చిత్తశుద్ధి _x000D_ వేఁకటికిఁ దొలఁగు వెనుకటి బిగువెల్ల _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1218
పరపురుషు లన్న దమ్ములు, వరుఁడే దైవంబు, తోడి పడుచులు వదినల్‌ మఱదండ్రు నత్తమామలు ధరఁ దల్లియుఁ దండ్రి యనియుఁ దలఁపు కుమారీ!
1
kandamu
827
హరి యను రెండక్షరములు హరియించును పాతకముల నంబుజనాభా హరి నీ నామమహత్త్వము హరి హరి పొగడంగ వశమె హరి శ్రీ కృష్ణా.
1
kandamu
701
హరిపదభక్తి నింద్రియజయాన్వితుఁ డుత్తముఁడింద్రియంబులన్‌ మరుగక నిల్పనూదినను మధ్యముఁడింద్రియపారవశ్యుఁడై పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతినైన నన్ను నా దరమున నెట్లుకాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
2621
నీనా సందొడబాటు మాట వినుమా! నీచేత జీతంబునేఁ గానింబట్టక సంతతంబు మదివేడ్కన్గొల్తు నంతస్సప త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలుఁదే జీనొల్లం గరినొల్ల నొల్లసిరులన్‌ శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
1769
నాథునికడ జేరి నాతి వాక్చాతురి బల్కగా విభు డతిపరవశమునమొనసి చక్కెరమోవి మునిపంట నొక్కిన నసురుసురను లేచి యలరుబోడియెవరైన జూచెద రిదివేళ గాదని తలుపుచాటున జేరి తమకముననుజులుము సేయక నీకు జోహారు జేసెద దాళరా యిక కొంత దడవటంచు
3
seesamu
1122
ధరణీనాయకు రాణియు గురురాణియు నన్నరాణి కులకాంతను గ న్నరమణి దను గన్నదియును ధర నేవురు తల్లులనుచుఁ దలఁపుఁ గుమారా!
1
kandamu
1440
నలువ నిర్మించె నీలాగు నాతి బాగు । నెన్నతరమౌనె కన్య నా కన్నులాన దాని మది దల్చి నెమ్మోహతాప మాన । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
3742
_x000D_ తవిటి కరయఁ బోఁవ దండులంబుల గంప _x000D_ శ్వానమాశ్రయించు సామ్యమునకు _x000D_ కోమటింటి సొమ్ము క్రూరులపా లౌను _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
673
దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ దాసుని దాసుడా గుహుడు తావక దాస్య మొసంగినావు నే జేసినపాపమో వినుతి చేసిన గావవు గావుమయ్య నీ దాసులలోన నేనొకఁడ దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
1723
కలిమి బలంబు భోగము సుఖంబు జయంబు యశస్సమృద్ధియుం గలుగఁగఁ గోరుచుం దనదు కాయము డస్సిన శక్తి లేమిడిన్ బలము దొలంగియుండినను బాయని కూర్మి తురంగలింప ని- ర్మలమతిఁ బుత్రవత్సలత రంజిలు తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
3223
_x000D_ గురువులేక విద్య గుఱుతుగా దొరకదు _x000D_ నృపతిలేక భూమి తృప్తిగాదు _x000D_ గురువు విద్యలేక గురుతర ద్విజుఁడౌనె _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2448
మిక్కిలి సంసారయినను నెక్కడియోగము రుచించు నెక్కుడుశైత్యం బెక్కిననోటికిఁ జేఁదగు జక్కెరపొడిఁ దిన్న నెన్న సంపఁగిమన్నా!
1
kandamu
1608
అనఘా! యెంతని చెప్పవచ్చు భవదీయావార్యదోస్సత్త్వమున్‌ కనకోర్వీధరసన్నిభౌషధగిరిన్‌ వాలంబునం జుట్టి గ్రం దున లంకాపురినుండి సత్వరమునం దొల్లింటిచోటం బడన్‌ వినువీథిన్‌ వడి ద్రిప్పివైవవె జగద్విశ్రాంతిగా మారుతీ!
4
mattebhamu
4027
_x000D_ వావివర్తనలును వరుసలు మర్యాద _x000D_ దప్పి నడచెనేని తగులుఁ గీడు _x000D_ వదల దపుడు తాకు నది దప్పినం దుది _x000D_ ముసలిముప్పునైన మునుగు వేమా.
0
aataveladi
675
నీలఘనాభమూర్తివగు నిన్నుఁగనుంగొనఁగోరి వేడినన్‌ జాలముసేసి డాగెదవు సంస్తుతికెక్కిన రామనామ మే మూలను దాచుకోఁగలవు ముక్తికి బ్రాపది పాపమూలకు ద్దాలముగాదె మాయెడల దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
257
ఉద్యానాదిక సప్తసంతతుల బాగొప్పార నిల్పన్ వలెన్ సద్యోదానమునన్ బుధాళి కెపుడున్ సంప్రీతి సల్పన్ వలెన్ ప్రోద్యద్విద్యలు సంగ్రహింపవలె నిత్యోత్సాహియై మర్త్యుఁ డో మాద్యద్దానవకాననజ్వలన! రామా! భక్తమందారమా!
7
saardulamu
1232
తన బావల పిల్లల యెడఁ దన మఱఁదుల పిల్లలందుఁ దనపిల్లల కం టెను మక్కువ యుండవలెన్‌ వనితల కటులైన వన్నె వచ్చుఁ గుమారీ!
1
kandamu
3824
_x000D_ పరగ నీవఱకును పడినపా ట్లెఱుగక _x000D_ ఘనుఁడుగాగ మనుజుఁ డనఁగఁ బుట్టి _x000D_ కీడు మే లెఱుఁగక క్రిందాయెఁ జూడరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2885
పలుచనిమేనితోఁ జిలుకపల్కులతోఁ జిఱునవ్వుమోముతో కులుకుకడానిడాల్‍పొగరుగుబ్బలతో నసియాడుకౌనుతో బలువుపిఱుందుతోఁ దరుణపల్లవజిచ్చరణద్వయంబుతో తమము చెంత నిల్చి పరితాపము దీర్పవె సుందరీమణీ!
5
champakamaala
3179
_x000D_ బ్రహ్మమును నెఱుఁగవు భావమందుండిన _x000D_ తనువు గుడిగఁ జేసి తన్ను నిలిపి _x000D_ లోకబుద్ధివిడిచి లోఁజూపు చూడరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3085
ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండుఁ జూడఁ జూడ రుచుల జాడ వేఱు పురుషులందు పుణ్య పురుషులు వేఱయా విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1531
లోకాలోకగుహాముఖంబులు బదుల్‌ మ్రోయంగ నుద్వృత్తి న స్తోకధ్వానమొనర్చి, వజ్రనిభ వక్షోఘట్టనస్ఫూర్తి మై నాకంబున్‌ సుడిబెట్టి దాని పిదపన్‌ మన్నించి కేలూది ప్ర త్యేకం బా బలవైరిచేత నభయంబిప్పింపవే మారుతీ!
7
saardulamu
774
అక్రూరాత్మకు లైన పాండవుల బాహశక్తియు\న్‌ ధాత్రి ని ర్వక్రంబయ్యెడునట్లు జేతు ననుచు\న్‌ వాత్సల్య మింపొంద నా శక్రాత్మోద్భవు తేరిపై దురమున\న్‌ సారథ్యముం జేసితౌ చక్రీ నీమునికోలకు\న్‌ జయము కృష్ణా దేవకీనందనా.
7
saardulamu
423
అవనివిభుండు నేరుపరియై చరియించినఁ గొల్చువార లె ట్లవగుణు లైననేమి? పనులన్నియుఁ జేకుఱు వారిచేతనే; ప్రవిమలనీతిశాలి యగు రాముని కార్యము మర్కటంబులే తవిలి యొనర్పవే జలధి దాఁటి సురారులఁ ద్రుంచి భాస్కరా!
5
champakamaala
539
శరధిశయాంబకాయ రవిచంద్రకృపీటభవాంబకాయ గో- పరివృఢకేతనాయ సితపర్వతకూటనికేతనాయ సు- స్థిరకరుణామతే భగవతే శివ తే నమ యంచు మొక్కెదన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
1967
హరుని న్నద్రిజ నాంజనేయుని గుహు న్నయ్యంబరీషున్‌ ధ్రువుం గరిఁ బ్రహ్లాదు విభీషణాఖ్యుని బలిన్‌ ఘంటాశ్రవు న్నారదు\న్‌ గర మొప్ప న్విదురున్‌ బరాశరసుతున్‌ గాంగేయుని\న్‌ ద్రౌపదిన్‌ నరు నక్రూరునిఁ బాయకుండును భవన్నామంబు, నారాయణా!
4
mattebhamu
745
శ్రీలక్ష్మీధవ రుక్మిణిం గలసి కూర్మి\న్‌ మిత్రవందా సుదం తాలోలాక్షులఁ గూడి జాంబవతి సత్యాలక్ష్మణాభద్రల\న్‌ కాళింది\న్‌ మరుకేళిఁ దేల్చితివి శృంగారాంగగోపాంగనా జాలంబు\న్‌ దనియింతు నౌర తుదఁ గృష్ణా దేవకీనందనా.
7
saardulamu
2851
పదకటకంబు ఘళ్లురనఁ బైకిఁ జివాలున వ్రాలి గుబ్బలుం గదుములు కట్ట ఱొమ్మదిమి గంటుగవాతెఱ నొక్కి మైగగు- ర్పొదవఁగఁ బయ్యెఁదం జెమటలొత్తుచుఁ గేరుచుఁ గ్రిందుమీదుగాఁ బొదువుచు నీవె నన్ గవయు పోడుములెన్నఁడు సుందరీమణీ!
5
champakamaala
2768
కసుగాయఁ గఱచి చూచిన మసలక దనయొగరు గాక మధురంబగునా? పసగలుగు యువతు లుండగఁ బసిబాలలఁ బొందువాఁడు పసరము సుమతీ!
1
kandamu
2995
యుగయుగంబుల పలువిధముగ జనించు- | వాడనని నీవెఱుంగవె వనిత పోవేతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన.
2
teytageethi
3161
_x000D_ స్థూలము కనుగ్రుడ్డు సూక్ష్మంబు కన్పాప _x000D_ కంటిపాప నుండు కారణంబు _x000D_ కారణమున బ్రహ్మకళ నెఱుంగఁగవలె _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2740
అడియాస కొలువుఁ గొలువకు గుడిమణియము సేయఁబోకు, కుజనులతోడన్‌ విడువక కూరిమి సేయకు మడవినిఁ దోడరయ కొంటి నరుగకు సుమతీ!
1
kandamu
4071
_x000D_ ధనములేమి సుతులు తప్పుల నిడుదురు _x000D_ ధనములేమి పత్నిఁ దాకరాదు _x000D_ ధనములే మెవరికి తాళిక యుండదు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2469
సాధనచతుష్టయంబున సాధారణలీలఁ దనరి సర్వేంద్రియముల్‌ శోధించి నిజసమాధిని సాధించినముక్తుఁ డన్న సంపఁగిమన్నా!
1
kandamu
2339
సమరక్షోణులఁ బాఱఁ బాఱఁగ జరాసంధాదులం ద్రుంచి చం డమదాభీలుని ధేనుకాసురుని చట్ట ల్చీరి ముష్టిప్రహా రములన్ ముష్టికు నా ప్రలంబదనుజున్ మ్రందించి తౌ రేవతీ రమణాకారముఁ దాల్చి యౌర! రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
4412
ముదముతో సంతతము నీదు వదినెగారు । విడిది చేసియు వీరిని విడువకుండు మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
4411
నత్తు లేకుండిన ముత్తైదు ముక్కందు । మూలలందును ఋతుస్త్రీలయందు మధ్యపక్వస్థలమందుఁ గిన్నెరమీటు । నతనిచేఁ గుమ్మరి యావమందుఁ కాటుకపొగయందుఁ గాళ్ళచప్పుడు లందు । దొమ్మరి వాయించు డోలునందు దీపము లేనట్టి దివ్వెకంబమునందు । మార్జాలముఖమందు మాంసమందు
3
seesamu
548
సురలును దైత్యులుం గదసి స్రుక్కక వార్ధి మధింపుచున్నచో నురుగతినందు హాలహల ముద్భవమై జగముల్ హరింప న- గ్గరళము కంఠసీమనిడి కావవె లోకములెల్ల నాఁదటన్ జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
241
ఖండించున్ బహుజన్మసంచితచలద్గాఢోగ్రదోషావలిం జండప్రక్రియ శైలజావినుతభాస్వచ్చారుదివ్యన్మహో- ద్దండశ్రీ భవదీయనామ మిలమీఁదన్ భూతభేతాళకూ- ష్మాండవ్రాతఘనాఘనశ్వనన రామా! భక్తమందారమా!
7
saardulamu
895
తురగాధ్వరంబుఁ జేసిన పురుషులకును వేఱెపదవి పుట్టుట యేమో హరి మిముఁ దలఁచిన వారికి నరుదా కైవల్యపదవి యచ్యుత కృష్ణా.
1
kandamu
227
మిహికాంశూపమసుందరాననముతో మేలీను కందోయితో నహిజిద్రత్నవినీలవిగ్రహముతో నంచత్కిరీటంబుతో విహగాధీశ్వరు నెక్కి నా యెదుటికిన్ విచ్చేయవే యో పితా- మహసుత్రామముఖామరప్రణుత! రామా! భక్తమందారమా!
4
mattebhamu