id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
96
వస్తునిర్దేశ మొనరింప వశము గాని-నిన్ను వర్ణింపరా దయా నిశ్చితముగ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
756
వివిధోగ్రస్థవన ప్రచండబలవిద్వేషావనీనాయకో త్సవభంజీకృతశాలి యర్జునుఁడు దోస్సత్వుండు మత్స్యావనీ ధవుగేహంబున నాట్యతాళధరియై తా నిల్వఁడే సన్ముని స్తవ నీసత్కృప గల్గునంతకును కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
1477
అతివ నీ చనుమొన లంటనిచ్చిన కోటి- । శివలింగపూజల సేయు ఫలము చాన నీ కెమ్మోవి నాననిచ్చిన చాలు । సోమపానము సేయుచున్న ఫలము చెలి నీదు కటిని నా చెయి సోకితే చాలు । నవనిప్రదక్షిణంబైన ఫలము కలకంఠి యొకసారి కలయనిచ్చిన చాలు । నతనుమంత్రము సిద్ధియగు ఫలము
3
seesamu
2515
క్షితిపై శ్వేతమునీంద్రుఁ జంప నలుకం గీనాశుఁ డేతెంచి నీ యతికోపోజ్జ్వలనాహుతి న్మడిసెఁ దథ్యం బేకనిష్ఠాసమ- న్వితులం జేకొని భక్తవత్సలుఁడవై నీవెప్పుడు న్గావఁగాఁ బ్రతిపక్షావలి కెట్లు వారి దెసఁ జేరన్వచ్చు సర్వేశ్వరా!
4
mattebhamu
279
విత్తంబొత్తుగఁ గూర్చి మానవుఁడు దుర్వృత్తిం బ్రవర్తించి యు- వ్వెత్తుం దేహమెఱుంగలేక తిరుగున్ హేలాగతిన్ బత్తిఁ దాఁ జిత్తాంబ్జంబున మిమ్ముఁ గొల్వఁ డెపు డిస్సీ యెంత పాపంబొకో మత్తారాతినిశాటసంహరణ! రామా! భక్తమందారమా!
7
saardulamu
155
వరరాజ్యకాంక్షలోఁ బట్టకుండెద వైన- సుగ్రీవునగరంబుఁ జూడరాదె? పరధనంబున కాస పడక యుండెద వైన- నాలంక నొకరాయి యంటరాదె? పరయోష పై నిచ్చఁబాయ కుండెద వైన- నల శూర్పణఖముక్కు నిలుపరాదె? పరదానవులఁ ద్రుంపఁ బంతగించెద వైన- మూల దైత్యులఁ దోలి పుచ్చరాదె?
3
seesamu
1905
పండువెన్నెలచిచ్చు పయినిండ బర్విన నిముసమైనను తాళ నేర్చునటరయళులు ఝుమ్మని మ్రోయ జిలుకలు రొదసేయ సతి కింపుగా వినగ నౌనటరముమ్మరమ్మై చల్వతెమ్మెర వీచిన నతివ నెమ్మెయి సారె కళుకదటరమరుడు కోపించి చిగురుపువ్వుటమ్ముల బదరి వ్రేసిన కొమ్మ బ్రతుకునటర
3
seesamu
2297
నియమంబొప్ప ననేకజన్మములనుండిన్ దాఁచుకొన్నట్టి సం చయదోషంబుల మాటమాత్రమున దోఁచంబోవు చోరత్వ మె న్ని యుపాయంబుల నభ్యసించినవియో నీ నామముల్ వేయు నా రయ నిన్ను న్వివరించుటెట్లు రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
1072
చిత్త మిగురొత్త నినుఁ బూజ సేయలేని | నరుని జన్మము మహిషజన్మము గదయ్య, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
580
గురుహరిణేక్షణామణినిఁ గూడిన దుష్కలుషాత్ముఁ జంద్రునిన్ శిరమునఁ బెట్టుకొంటివఁట చెప్పఁగ నబ్రమయారె మేలుమే- ల్గురుతరభక్తితోడ నినుఁ గొల్చినవారి కిఁకేటిపాపముల్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
3274
_x000D_ ఎన్నఁగ మనసే కారణ _x000D_ మన్నిటికిని జూడఁజూడ నాత్ముఁడు తానై _x000D_ యున్నంతకాలమెచ్చట _x000D_ నున్నను నిది నిజముఁ దెలియ నొప్పగు వేమా.
1
kandamu
258
నిను భక్తిన్ భజియించినన్ గురువుల న్నిత్యంబు సేవించినన్ ధనవంతుండయి గర్వదూరుఁడగుచున్ ధర్మంబు గావించినన్ జనతామోదకపద్ధతి న్మెలఁగినన్ జారుండు గాకుండినన్ మనుజుం డారయ దేవుఁ డిమ్మహిని రామా! భక్తమందారమా!
4
mattebhamu
1061
శతవత్సరంబులు జనులకుఁగా నాయు- | వంబుజాసనుఁడు మర్యాద చేసె- నందులో సగమేఁడు లరుగు నిద్రలచేత | శైశవక్రీడల జరుగుఁ గొన్ని తారుణ్యమున మహామారభూతము సోఁక | నంగనాసక్తిచే నరుగుఁ గొన్ని వార్ధకంబున బహువ్యాధిపీడలచేతఁ | గడమ యేఁడులు రిత్త గడచుచుండు
3
seesamu
1656
నెలపురు డీఁగుదాఁక బలునే ర్పలరారను మూలయింటిలో- పలఁ బరు లెవ్వరేని తన పట్టినిఁ జూచిన దృష్టి దాఁకు ని- మ్ముల నని దాఁచి గాలితెఱ ముంగలఁ దానొనరించి పెంపుటిం- తుల పయిఁగాఁపుగా నిడిన తొయ్యలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
2181
నే కులంబున వీరంద ఱెచ్చినారు? - నీ కృపాపాత్రులకు జాతినీతు లేల? భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
2784
తడవోర్వక యొడలోర్వక కడువేగం బడచిపడినఁ గార్యంబగునే తడవోర్చిన నొడలోర్చినఁ జెడిపోయిన కార్యమెల్లఁ జేకుఱు సుమతీ!
1
kandamu
3490
_x000D_ సూక్ష్మరూప మెఱిగి సుఖమొందగా లేక _x000D_ బహుళముగను జదువఁబడుచు నరుఁడు _x000D_ చావుచేటెఱుఁగని చదువేల చదువునో _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3985
_x000D_ అర్థవంతుల సొమ్ము నాసింతు రర్థులు _x000D_ యర్థికీయ సొమ్ము వ్యర్థమౌను _x000D_ వ్యర్థమైన సొమ్ము వ్యర్థులఁ జేరురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2970
చెలియ నన్నీలాగు నలయింపగా నీకు లేస్సగా దనిమందలింపుమపుడుఅతివరో నన్నిటులారడి సేయుట దగదనిచెప్పు మాతనికినీవుభయమేమి వానితో బరుషో కులకునై, ననిపుడేలరావని యెలమినడుగుమతనికి గరుణరా నర్మిలి మాట్లాడియీ వేళ తోడి తెమ్మింతినీవు
3
seesamu
622
అగణితసత్యభాష శరణాగతపోష దయాలసజ్ఝరీ విగతసమస్తదోష పృథివీసురతోష త్రిలోకపూతకృ ద్గగనధునీమరంద పదకంజవిశేష మణిప్రభా ధగ ద్ధగితవిభూష భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
1962
పరమంబై పరతత్వమై సకలసంపత్సారమై భవ్యమై సురసిద్ధోరగయక్ష పక్షిమునిరక్షో హృద్గుహాభ్యంతర స్థిరసుజ్ఞానసుదీపమై శ్రుతికళాసిద్ధాంతమై సిద్ధమై సరి లే కెప్పుడు నీదునామ మమరున్‌ సత్యంబు, నారాయణా!
4
mattebhamu
3282
_x000D_ కాదని యెవ్వరి తోడను _x000D_ వాదాడక దిరుగు వెఱ్ఱివాఁడును వలెనే _x000D_ భేదాభేదము లడచును _x000D_ వేదాంత రహస్య మెల్ల వేమన నేర్చు\న్‌.
1
kandamu
534
నరవతి కొక్కకావ్యమిడినన్ ధనధాన్యమణీచోళముల్ పురములు వాహనంబులు విభూషణగోవసుధాదికంబులుం గురుకృపనిచ్చి బ్రోచు నిదిగో మరి నీవిఁక నేమియిచ్చెదో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
2004
ఇల నెవ్వారి మనంబులో నెఱుక దా నెంతెంత గల్గుండు నా కొలదిం జెంది వెలుంగుచుందు కలయ న్గోవింద నీరూపుల\న్‌ అలర న్నంబు మితంబు లైసరసిలో నంభోరుహంబుల్‌ దగ\న్‌ నిల నొప్పారెడు చంద మొందె దెపుడు న్నీలాంగ నారాయణా!
4
mattebhamu
3134
_x000D_ తావసించుచోటఁ దగనల్గు డాయెనా _x000D_ సౌఖ్యభూమి కపుడు జరుగవలయు _x000D_ కొలఁకు లింకెనేని కొంగ లందుండునా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3906
_x000D_ శివుఁడు బ్రహ్మ మనుచు స్మృతులెల్లఁ బలుకంగ _x000D_ వేఱె దైవములను వేయిగొల్చి _x000D_ బ్రహ్మజనులు చూడ భ్రష్టులైపోయిరి _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1732
గాన వచ్చితి మీ పాదకమలసేవ | కల్గె నా భాగ్యమెట్టిదో కరుణగల్గిసుదతి నేలుట దగునయ్య సుందరాంగ | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
3855
_x000D_ నే నెఁవడను తలపెట్టఁగ _x000D_ మానసమునఁ దలపకున్న మనుజుని కకటా _x000D_ కానఁబడు పడకముందే _x000D_ మానుగఁ గనుగొనఁగవలయు మహిలో వేమా.
1
kandamu
969
బొగ్గులఁ దైలంబు బుట్టింపగా వచ్చు | ధట్టించి జలరాశి దాటవచ్చు జెలరేఁగి ఘనదవానలము మ్రింగఁగ వచ్చు | భుజగులఁ బేర్లుగాఁ బూనవచ్చు బెబ్బులి నఱచేతఁ బెనఁగి పట్టఁగ వచ్చు | దివిరి ఱాతిని నార దీయవచ్చు గొదమసింగమును నక్కునఁ జేర్పఁగా వచ్చు | గాలి పోగిడి మూట గట్టవచ్చు
3
seesamu
3484
_x000D_ ఆత్మయందు జ్యోతి యెఱుగుట లింగంబు _x000D_ తెలిసిచూడగాను తేటపడును _x000D_ అదియు గురువులేక యబ్బునా తెలియంగ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2710
దయ సేయుండని గొందఱాడుదురు నిత్యంబున్నినుంగొల్చుచున్‌ నియమంబెంతొ ఫలంబునంతియగదా నీవీయ పిండెంతొ యం తియకా యెప్పటికిం దళం బశనబుద్ధిం జూడనేలబ్బు స త్క్రియలన్నిన్ను భజింప కిష్టసుఖముల్‌ శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
2654
తనువే నిత్యముగానొనర్చు మది లేదా, చచ్చి జన్మింపకుం డ నుపాయంబు ఘటింపు, మీ గతుల రెంటన్నేర్పు లేకున్న లే దని నాకిప్పుడెచెప్పు; చేయఁగల కార్యంబున్న సంసేవఁజే సి నినుంగాంచెదఁగాక కాలముననో శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
4419
పరదళంబులఁ గాంచి భయముచే నురికిన । రాజుగాఁడతడు గోరాజు గాని ధర్మంబులకు విఘాతముసేయ మంత్రిశే- । ఖరుఁడు గాఁడతఁడు సంకరుఁడు గాని విద్యాప్రసంగము ల్విన రసజ్ఞత లేని । ప్రాజ్ఞుల సభగాదు రచ్చ గాని పతితోడ కలహించి పడుకొని యేడ్చెడి । దాలుగా దది యెఱ్ఱతేలు గాని
3
seesamu
2643
నీపేరున్‌ భవదంఘ్రితీర్థము భవన్నిష్ఠ్యూత తాంబూలముల్‌ నీ పళ్ళెంబు ప్రసాదముంగొనికదా నే బిడ్డఁడైనాఁడ న న్నీ పాటిం గరుణింపు మోపనిఁక నేనెవ్వారికిం బిడ్డఁగాన్‌ జేపట్టందగుఁ బట్టి మానఁదగదో శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
3240
_x000D_ మాయను చెఱసాల మనమను గొలుసును _x000D_ భేదమనెడుబొండ బెరసియుండు _x000D_ ఇట్టిబద్ధజీవి కెన్నడు మోక్షంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2763
కప్పకు నొరగాలైనను సర్పమునకు రోగమైన సతి తులువైనన్‌ ముప్పున దరిద్రుఁడైనను దప్పదు మఱి దుఃఖమగుట తథ్యము సుమతీ!
1
kandamu
1823
మాటల నొకకొంత పాటల నొకవింత గావించు బతి కింపుగాను కొమ్మరూపున నొకకొంత చూపున నొకవింత జూపించు విభునకు సుందరాంగితళుకున నొకకొంత బెళుకు నొకవింత గల్పించు ధవునకు గంబుకంఠిముద్దుల నొకకొంత మోవిమార్పుల వింత గావించు భర్తకు గమలపాణి
3
seesamu
1023
కొఱగాని పంచమకులునైన నడిగించుఁ | బరదేశములవెంటఁ దిరుగఁజేయుఁ గులములో వన్నె తక్కువయై మెలంగించు | మదిని హింసాంభోధిఁ గుదురుపఱచు సభ నాడుమాట హాస్యరసాస్పదము సేయు | తెలివి యొక్కపుడైనఁ గలుగనీదు తివిరి సాధులఁ బట్టి తెరవాట్లు కొట్టించు | గడలేని యిడుమలఁ గుడువఁజేయు
3
seesamu
944
నిగ్రహానుగ్రహప్రౌఢి నీకె కాక | కలదె తక్కిన చిఱుత వేల్పులకు నెల్ల, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
3349
_x000D_ ప్రణవ మెఱుఁగఁ బోఁడు భక్తుఁ డెప్పుడు గాఁడు _x000D_ జ్యోతియెఱుఁగఁ బోడు యోగిగాఁడు _x000D_ నిత్య మెఱుఁగ వాఁడు నిర్వాణిగాఁడయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
435
ఎడ్డె మనుష్యుఁడే మెఱుఁగు నిన్నె దినంబులు గూడి యుండినన్‌ దొడ్డ గుణాఢ్యునందుఁ గల తోరపు వర్తనలెల్ల బ్రజ్ఞఁ బే ర్వడ్డ వివేకి రీతి; రుచిపాకము నాలుకగా కెఱుంగునే? తెడ్డది కూరలోఁ గలయఁ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా!
6
vutpalamaala
1382
మా కచేరికి నజరు లీ మాడ్కి బనిచి । నమ్మినానని వ్రాసుకున్నట్టి జాబు నకలు జూచిన మరుని గాసికి సహింప । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
4053
_x000D_ మఱవవలె భావసంగతి _x000D_ మఱవంగావలెను దురము మఱి విశ్వములో _x000D_ మఱవవలెఁ బరులనేరము _x000D_ మఱవంగా వలదు మేలు మహిలో వేమా.
1
kandamu
1243
జీవములు భర్తపద రా జీవములని చిత్తమందు జింతించిన ల క్ష్మీవల్లభు చరణంబుల సేవ లతాంగులకు నెమ్మిఁ జేయుఁ గుమారీ!
1
kandamu
2117
దండ్రివై నీవు పరపీడ దగులఁజేయ - వాసిగల పేరు కపకీర్తి వచ్చునయ్య భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
2626
ఆలుంబిడ్డలు దలిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం బేలా నామెడఁగట్టినాఁడవిఁక నిన్నేవేళఁ జింతింతు ని ర్మూలంబైన మనంబులోనఁ గడుదుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి యీ సీలామాలపుఁజింత నెట్లుడిపెదో శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
3681
_x000D_ చదువువానికన్న చాకలి తా మేలు _x000D_ కులము వేల్పుకన్న కుక్క మేలు _x000D_ సర్వసురలకన్న సకలేశ్వరుఁడు మేలు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1904
గలిగి యా ఇంతిపై దాడి కదల మరుడు | చూచి వచ్చితినిక నెట్లు సుందరాంగగాన వేగమే రావయ్య కనకచేల | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
1109
శ్రీభామినీ మనోహర సౌభాగ్యు దయాస్వభావు సారసనాభున్‌ లో భావించెద నీకున్‌ వైభవము లొసంగుచుండ వసుధ కుమారా!
1
kandamu
2484
జ్ఞానజ్యోతి విజృంభమాణముగ నోజన్ విష్ణువిధ్యాది దే- వానీకాత్మదశావళిం దవిలి నీవారంగ వారిం గళా- జ్ఞానప్రౌఢులఁ జేయుటన్ వెలయఁగా సర్వజ్ఞశబ్దంబు దా నీ నామాంకముగా విధించు నిగమానీకంబు సర్వేశ్వరా!
7
saardulamu
2494
శ్రీవత్సాంకు రమావిశేషతయు వాక్ఛ్రీనాథు చాతుర్యమున్ దేవాధీశ్వరు వైభవోన్నతియు నా తిగ్మాంశు తేజంబు శ్రీ- దేవీనందను రూపవిభ్రమము చింతింపంగ నీ భక్తిస- ద్భావాత్ముండగు పుణ్యమూర్తికి దృణప్రాయంబు సర్వేశ్వరా!
7
saardulamu
3174
_x000D_ కాకిగూటిలోన కోకిల మున్నట్లు _x000D_ భ్రమర మగుచుపురుగు బ్రతికినట్లు _x000D_ గురుని గొల్చువెనుక గురువు తా నౌనయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3719
_x000D_ కాళ్ళ ముంద ఱేకు కడతేర నీదక _x000D_ ముగ్గురు ముగురాండ్ర మునిఁగినారు _x000D_ నరుఁడు నీఁదెదనుట నగుబాటు గాదయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3398
_x000D_ మూఁడులోకములను మొనసి యొక్కటిఁజేసి _x000D_ యారులోకములను నట్లగూర్చి _x000D_ స్థిరముగాను నుండు శివమూర్తి గురుఁడయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4451
వంకరపాగాలు వంపుముచ్చెల జోళ్ళు । చెవిసందుకలములు చేరుమాళ్ళు మీఁగాళ్ళపైఁ బింజె బాగైన దోవతుల్ । జిగితరంబైన పార్శీమొహర్లు చేఁపలవలె బుస్తిమీసముల్ కంఠదా। వలములు కడుపెద్ద వస్త్రములును సొగసుగా దొరయొద్దఁ దగినట్లు కూర్చుండి । రచ్చగాండ్లకు శిఫారసులు చేసి
3
seesamu
961
జారచోరులకు గంజాయికల్లులకును | దొత్తుల కగ్గికి దొమ్మరులకు కుంటెనకత్తెలకును వెలయాండ్రకు | నల్లమందునకు భూవల్లభునకు తప్పుదండుగలకు దబ్బరగాండ్లకు | నంజుటికిని గోడిపుంజులకును మందులవాండ్రకు మాలదాసర్లకు | నాటపాటలవాండ్ర కౌను గాని
3
seesamu
3988
_x000D_ ధర్మమునకుఁ గీడు తలఁచినవాఁడు తా _x000D_ దుష్టమార్గుఁ డవును ద్రోవ చెడును _x000D_ గురువుపత్నిగవయఁ గోరెడువాఁడు తా _x000D_ మొదలెచెడును ముప్పు మొనసి వేమ.
0
aataveladi
1043
దానవైఖరిని రాధాతనూభవుఁ బోలి | చిరభోగమున శచీవరుని బోలి కారుణ్యమున రఘుక్ష్మావరేణ్యుని బోలి | సత్యంబునను హరిశ్చంద్రుఁ బోలి న్యాయమ్మునందుఁ గౌంతేయాగ్రజుని బోలి | సాహసంబున సవ్యసాచిఁ బోలి భూరివిద్యాప్రౌఢి భోజరాజును బోలి | హరిభక్తినియతిఁ బ్రహ్లాదుఁ బోలి
3
seesamu
3028
శ్యామలవర్ణ నీకేమని యిచ్చునో జాంబవతిని నీకె జాగులేక నీ శాంతవంతంబు నీ గుణంబెఱుగక పడతిని నీవెంట బంపినాడుపేరిమి నిను తల్లి పెంచిన మొదలుగా నుగ్గుపాలు నెఱుంగ వొక్కనాడుతలిదండ్రులొకచోట తపియించుచుండగా పెఱిగిన వెఱుగవు వెఱపులేక
3
seesamu
892
భద్రార్చిత పదపద్మ సు భద్రాగ్రజ సర్వలోక పాలన హరి శ్రీ భద్రాధిప కేశవ బల భద్రానుజ నన్ను బ్రోవు భవహర కృష్ణా.
1
kandamu
2731
నీకుంగాని కవిత్వమెవ్వరికి నేనీనంచు మీఁదెత్తితిన్‌ జేకొంటిన్‌ బిరుదంబు కంకణము ముంజేగట్టితిం బట్టితిన్‌ లోకుల్‌ మెచ్చ వ్రతంబు నా తనువుకీలున్‌ నేర్పులుంగావు ఛీ ఛీ కాలంబుల రీతి దప్పెడు జుమీ శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
585
ధర శ్రుతిమంత్రకోటికిఁ ప్రధానము నాగమమాతయైన య- గ్గురుతరమంత్రరాజమునకుం బతి వీవని లోగణింపకే వెకవరి కొల్తురౌ ఖలులు వెంగళులై కుఱకుఱ్ఱవేల్పులన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
1256
పొంతఁ బని సేయ కెన్నఁడు పంతంబులు పలుకఁబోకు ప్రాఙ్ముఖముగ నీ దంతంబులు దోమకు మే కాంతంబులు బయలుపఱుప కమ్మ! కుమారీ!
1
kandamu
2092
భువనరక్షక! నిన్నుఁబొగడనేరని నోరు - ప్రజకు గోచరమైన పాడుబొంద సురవరార్చిత! నిన్నుఁజూడఁగోరని కనుల్‌ - జలము లోపల నెల్లిసరపుగుండ్లు శ్రీరమాధిప! నీకుసేవఁజేయని మేను - కూలి కమ్ముడువోని కొలిమితిత్తి వేడ్కతో నీ కథల్‌వినని కర్ణములైనఁ - గఠినశిలాదులఁగలుగు తొలలు
3
seesamu
448
కులమున నక్కడక్కడ నకుంఠిత ధార్మికుఁడొక్కఁడొక్కఁడే కలిగెడుఁగాక పెందఱుచు గల్గగ నేరరు; చెట్టు చెట్టునన్‌ గలుగఁగ నేర్చునే? గొడుగు కామలు చూడఁగ నాడనాడ నిం పలరఁగ నొక్కటొక్కటి నయంబునఁ జేకురుఁగాక భాస్కరా!
5
champakamaala
1224
పతి పాపపుఁ బనిఁజెప్పినఁ బతిమాలి మరల్పవలయుఁ బతి వినకున్నన్‌ హిత మనుచు నాచరింపుము మతిలోపల సంశయంబు మాని కుమారీ!
1
kandamu
3281
_x000D_ విషయములు తెరలపొలుపున _x000D_ విషయము లంటక మహాత్ము విధమున ధరలో _x000D_ విషసంసారము లన్నియు _x000D_ విషయము లన్నియును గెల్వ వేమన నేర్చు\న్‌.
1
kandamu
2288
మామా యంచును మామ యంచు నెపుడే మా యల్లుఁ డుద్యద్గతిన్ హేమాద్రిప్రతిమానమైన యొక విల్లేపార మో పెట్టఁగా సామర్థ్యంబున మేటి యీతఁడని నీ సత్త్వంబె వర్ణింతు నో రామా! రాఘవ! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా!
7
saardulamu
1292
దానములు ధర్మకార్యము లూనంగాఁ గలిగినంత యుక్తక్రియలన్‌ మానవతుల కిది ధర్మము గా నెఱిఁగి యొనర్పవలయుఁ గాదె కుమారీ!
1
kandamu
2937
కురులకుఁ గృష్ణభావమును గుబ్బల కచ్యుతరీతి కర్ణవై- ఖరికల శ్రీవరప్రతిభ కౌనునకున్ హరిమంగళాకృతుల్ కరముఁ జెలంగు నీకు; కలకాలము నిన్ను దలంచఁ బాయు దు- ష్కరపరితాపమెల్ల నవసారసలోచన సుందరీమణీ!
5
champakamaala
4028
_x000D_ ఇంగలంబుతోడ నిలనల్పుతోడను _x000D_ పరునియాలితోడ పతితుతోడ _x000D_ సరసమాడు టెల్లచావుకు మూలంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2041
పరమ సాత్త్వికులైన నీ భక్తవరుల - దాసులకు దాసుఁడను జుమీ ధాత్రిలోన భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
2516
కింకం దన్ను నదల్చి చక్రమునఁ దాఁ గృష్ణుండని న్వైచినం బొంకంబొప్పఁగ దానిఁ దుత్తుఱుముగాఁ బోఁదట్టి యుప్పొంగె ని- శ్శంకాత్ముండు దధీచి శాశ్వతులు నీ సద్భక్తు లూహింపఁగా సంకల్పప్రభవప్రతాపవనభాస్వద్దావ సర్వేశ్వరా!
7
saardulamu
2483
జలజాతప్రభవాండభాండములు దుశ్చారిత్రులం బాత్రులం జెలువై యుండ యథాప్రమాణములుగా శిక్షింప రక్షింప ని- శ్చలలీలం బ్రభవించు రాజు భవదాజ్ఞాశక్తిఁ గాకింత వ- ట్టెలమిం జేకొని నిర్వహింప మఱి రాజెవ్వండు సర్వేశ్వరా!
4
mattebhamu
3936
_x000D_ వెల్లకుక్కల యెంగిలి విశదమాయె _x000D_ పడుచువేశ్యల యెంగిలి ప్రాప్తమాయె _x000D_ చెడుగు నెంగిలి యెంతకు శ్రేష్ఠమాయె _x000D_ ఇష్టమగువారి యెంగిలి యెగ్గు వేమ.
2
teytageethi
105
అఖిలపోషకుఁడ వ న్నాఖ్య మాత్రమె కాని- కర్తవు నీవె భోక్తవును నీవె యక్షరుండ వను ప్రఖ్యాతి మాత్రమె కాని- చర్చింప వేఱొండు సాక్షి గలఁడె సుగుణాబ్ధి వని నిన్ను స్తుతి యొనర్చుటె కాని- నిర్గుణుం డెవ్వఁడు నీకు మించ విశ్వాత్ముఁడ వటంచు వినుతించుటయే కాని- చొచ్చి ని న్నెవ్వఁడు చూచినాఁడు
3
seesamu
1562
జనకక్ష్మాపతిపుత్రిచేఁ దగ ననుజ్ఞాతుండవై 'యూరకే జననేలా, దశకంఠదైత్యునకు మత్సామర్థ్య మొక్కింత జూ పనగుం గా' కని తండ్రివోలె నతిరంహం బర్మిలిం దాల్చి గ్ర ద్దన నద్దైత్యుని ప్రాణతుల్యవన ముత్పాటింపవే మారుతీ!
4
mattebhamu
1407
మొగమోటమెంచరు నగుబాటు గాంచరు । తరుచు వినయము ధూర్తతలు మెండు కలిమి వరింతురు చలము సాధింతురు । కంటికెంతటివారు గడన గారు హాని నెన్నగ జూడ రపకీర్తి కోడరు । ప్రాణము తృణవత్తు భక్తి వేదు వలపుల నొందింతు రలపు చెందింతురు । తాల్మి తక్కువ బేలతనము పెక్కు
3
seesamu
4098
_x000D_ బంగరుఁ బొడఁగన్న భామలఁ బొడఁగన్న _x000D_ చిత్తమునను చింత సేయఁడేని _x000D_ వాఁడె పరమయోగి వర్ణింప జంగమందు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
634
హరునకు నవ్విభీషణున కద్రిజకుం దిరుమంత్రరాజమై కరికి నహల్యకున్‌ ద్రుపదకన్యకు నార్తిహరించు చుట్టమై పరగినయట్టి నీ పతితపావననామము జిహ్వపై నిరం తరము నటింపజేయుమిఁక దాశరథీ! కరుణాపయోనిధీ!
5
champakamaala
136
నీవు సేసినపను లిట్టి నేరుపరివె-జగదుపద్రవ మెట్లు పోఁ జఱచినావొ? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
1655
పురుడు చనంగ జాతకపుఁ బొంక మెఱింగినయట్టి పెద్ద లా- దరమున దీర్ఘకాలము ముదంబున మీనవిలోచనాతివి- స్ఫురకరుణావిశేషమున శోభిలుచుం భవదాత్మజుండు బ- ల్వరలు నటన్న మాట విన వాంఛిలు తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
165
ఖరు నాజిలోఁ జొచ్చి శర ముచ్చి పో నేయ- వెనుకకు లంఘించి వెఱచె ననిరి యనిఁ బాఱునో కోఁతి యతి మ్రానిమాటున- నేయ వాలినిఁ బొంచి యేసె ననిరి గరుడధ్వజుం డన్న గురుతుఁ దెల్పుట కున్న- బలభీతి శస్త్రాహి బద్ధుఁ డనిరి బలినిఁ జంపఁగ రానివరమున యాచింప- వృత్తి నాతని భిక్ష మెత్తె ననిరి
3
seesamu
2078
నీమీఁది కీర్తనల్‌ నిత్యగానముఁ జేసి - రమ్యమొందింప నారదుఁడఁగాను సావధానముగ నీచరణ పంకజ సేవ - సలిపి మెప్పింపంగ శబరిఁగాను బాల్యమప్పటి నుండి భక్తి నీయందునఁ - గలుగను బ్రహ్లాదఘనుఁడఁగాను ఘనముగా నీమీఁద గ్రంథముల్‌ గల్పించి - వినుతిసేయను వ్యాసమునినిగాను
3
seesamu
595
తిరమున నీ నివేశమున దీప మొకానొకనాఁ డొకింత బం- ధురమతి నిడ్డ ధన్యుఁడు చతుర్ముఖముఖ్యనిలింపమాన్యుఁడై నిరుపమ తావకీన పద నిత్యసుఖోన్నతుల చెలంగుఁబో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
2418
వాదుల నడఁచెడిపెద్దలఁ గాదనఁ గా నేల వట్టికలహం బింతే ఖేదం బని చాలించిన సాదరమతి జాణఁ డన్న! సంపఁగిమన్నా!
1
kandamu
501
రాకొమరుల్‌ రసజ్ఞునిఁ దిరంబుగ మన్నన నుంచినట్లు భూ లోకమునందు మూఢుఁ దమ లోపలనుంపరు; నిక్కమే కదా! చేకొని ముద్దుగాఁ జదువు చిల్కను బెంతురుగాక పెంతురే కాకము నెవ్వరైన శుభకారణ సన్మునిసేవ్య భాస్కరా!
6
vutpalamaala
2062
తల్లిగర్భము నుండి ధనము తేఁ డెవ్వఁడు - వెళ్లిపోయెడినాఁడు వెంటరాదు లక్షాధికారైన లవణ మన్నమె కాని - మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు విత్త మార్జనఁ జేసి విఱ్ఱవీఁగుటె కాని - కూడఁబెట్టిన సొమ్ము తోడరాదు పొందుగా మఱుఁగైన భూమిలోపలఁ బెట్టి - దానధర్మము లేక దాఁచి దాఁచి
3
seesamu
1749
నెరులురా తుమ్మెదగరులురా నీలంపుసరులురా కొమ్మ ముంగురుల సౌరుమేలురా చెనకినపాలురా మించుటద్దాలురా ముదిత కపోలయుగమువాలురా బేడసమీలురా కల్వలనేలురా కలికి కన్గవల తీరుచెండ్లురా బంగారుగుండ్లురా గజనిమ్మపండ్లురా యతివ పాలిండ్ల తీరు
3
seesamu
3546
_x000D_ మాసిన తలతోడ మలినవస్త్రముతోడ _x000D_ నొడల జడ్డుతోడ నుండెనేని _x000D_ యగ్రజన్ముఁడయిన నట్టెపొమ్మందురు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4135
_x000D_ శివుఁడు గలఁడటంచు శిలలకు మ్రొక్కెడి _x000D_ వెఱ్ఱిజీవులార వెతల విడుడి _x000D_ జీవులందె కాక శిలల నేమున్నది _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2882
కోపము మానవే, నెనరుగూర్చిన చల్లనిచూపువెన్నెలల్ నాపయిఁ జల్లవే చలము నాయమె బిగ్గఱఁ గౌఁగిలింపవే యో పువుఁబోఁడి! యో రమణి! యో చెలి! నీ యధరామృతంబునం దాపము దీర్చవే యనుచుఁ దద్దయుఁ బల్కుదు సుందరీమణీ!
6
vutpalamaala
738
మౌళిం బింఛపుదండ యొప్పుగ నటింపంగౌను శృంగారపు\న్‌ శ్రీ లెంచంగను పిల్లఁగ్రోవి రవము\న్‌ జేకోలము\న్‌ జెక్కుచు\న్‌ గేల\న్‌ మెచ్చొనరింపఁ గోపకులతోఁ గ్రీడారసస్ఫూర్తి నీ వాలం గాచువిధంబు నేఁ దలఁతుఁ గృష్ణా దేవకీనందనా.
7
saardulamu
3379
_x000D_ బైలున బంధము గలపక _x000D_ వ్రాలెను పరమాత్మునకును వాంఛిత మొప్ప\న్‌ _x000D_ బైలున బంధము గలిపిన _x000D_ కైలాసముఁజేరి ముక్తి గాంచుర వేమా.
1
kandamu
3874
_x000D_ తివిరి లేమియుంట తిరిపెకాఁ డెఱుగునె _x000D_ మొఱ్ఱబెట్టి నెత్తి మొత్తుఁగాని _x000D_ పతిస ధర్మ మెన్నపడుచు కత్తెఱుఁగునా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
141
శౌర్య మెక్కించి విశ్వామిత్రుఁ డూరకఁ- దొడరింపఁ దాటకఁ దునిమినావు వైదేహి వాక్యనిర్భంధంబుఁ ద్రోయలే- కఱిముఱి మారీచు నఱికినావు వెనుకంజ వైచిన విడువక పైకి రా- నరుదుగా ఖరుతలఁ దరిగినావు మొఱ్ఱో యనుచు దేవమునులు వా రెన్నాళ్ళో- యనుసరింప దశాస్యుఁ దునిమినావు
3
seesamu
239
ఇనుఁ డద్దంబగు నగ్ని నీరగు భుజగేంద్రుండు పూదండయౌ వనధుల్ పల్వలపంక్తులే జలధరాధ్వం బిల్లెయౌ రాజయో- గనిరూఢస్థితిఁ దావకీన పదయుగ్మం బెల్లకాలంబు ప్రే- మ నెదం బూని భజించు ధన్యులకు రామా! భక్తమందారమా!
4
mattebhamu
4372
మధ్యవైష్ణవునకు నామములు పెద్ద । పెట్టనేరని విభుఁడు కోపించ పెద్ద మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
2139
దుష్టకార్యము లొనరించు దుర్జనులకు - ఘనతరంబైన నరకంబు గట్టిముల్లె భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
2282
నీ మంత్రంబు సదా సదాశివుఁడు పత్నీయుక్తుఁడై కాశిలో నేమం బొప్ప జపించె నంచు శ్రుతులన్ని న్నిన్నె వర్ణింపఁగా నేమా నిన్ను నుతించువార మయినన్ నిన్నెంతు నోరారఁగా రామా! రాఘవ! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా!
7
saardulamu