id stringlengths 1 4 | poem stringlengths 71 312 | label int64 0 7 | label_name stringclasses 8
values |
|---|---|---|---|
2564 | ప్రకటింపంగ మదీయచిత్త మది దాఁ బంచేంద్రియోద్వృత్తమై
ప్రకటప్రాప్తిని సోలుఁగాని మఱి నీ పాదాబ్జసంసేవనం-
బొకవేళ భజియింప నొల్లదు నిజం బూహింపఁగా నట్ల యీఁ-
గకు దుర్గంధము గాక సహ్యమగునే కస్తూరి సర్వేశ్వరా! | 4 | mattebhamu |
225 | గణుతింతున్ భవదీయ సద్గుణకథల్ కౌతూహలం బొప్పఁగాఁ
బ్రణుతింతున్ సచరాచరాదిక మహాబ్రహ్మాండభాండచ్ఛటా-
గణితప్రాణిజనాంతరాత్మవని వేడ్కన్ సంతతంబున్ నభో-
మణివంశాంబుధిశీతభాను! రఘురామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
3629 | _x000D_
ఎఱుక లేనిదొరల నెన్నాళ్ళు కొలిచిన
_x000D_
బ్రతుకులేదు వట్టి భ్రాంతి గాని
_x000D_
గొడ్డుటావు పాలుగోరిన చేపునా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
358 | కావేరీ సరయూ మహేంద్రతనయా గంగా కళిందాత్మజా
రేవా వేత్రవతీ సరస్వతుల కర్థిం బోవఁగానేల నీ
సేవాసంస్మరణార్చనాదు లెపుడున్ సిద్ధించు మర్త్యాళికిన్
గ్రైవీభూతభుజంగమప్రవర! భర్గా! పార్వతీవల్లభా! | 7 | saardulamu |
2864 | సొలయక నీవు పౌరుషముఁ జూపుచుఁ గంతురణం బొనర్ప నే-
నలకలు గోళదువ్వి, తెలనాకుల చుట్టలొసంగి, తాని పు-
వ్వుల సురటీల వీవ, నునుపుంగవు నల్లన బిగ్గఁబట్టి, నీవు యిం-
పులఁ బరిచర్య సేఁత దలపోయుదొ లేదొకొ సుందరీమణీ! | 5 | champakamaala |
2246 | నేఁటం దీఱె ననేకజన్మములనుండి న్నన్ను వెంటాడుచున్
వాటంబై చనుదెంచు పాపములు; శ్రీవత్సాంక! యీవంక నీ
పాటల్ పాఠము సేయువారికి మఱిం బాపంబులం బాపుఁ గ
ర్ణాటాధీశ్వర! యొంటిమిట్ట రఘువీరా! జానకీనాయకా! | 7 | saardulamu |
3303 | _x000D_
ఈషణత్రయంబు నెడపంగ నేరక
_x000D_
మోహనరాశిలోన మునిఁగియుండు
_x000D_
జనుల కెట్టు మోక్షసౌఖ్యంబు గల్గును
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1445 | శుకమును ముద్దాడుచో మోవి నొక్క నా । గంటి నే గని నినెరుంగక నిదేమొ
నినుజూడ వేరె భావన దోచునన మోము । చిన్నజేసుక శివా శివ యటంచు
తలవంచి బొటవ్రేల నిల గీరుకొంచు నే- । త్రముల నశ్రులు కుచాగ్రముల రాల
చిలచిల నెమ్మేను చెమ్మర గడగడ । వడకుచు నార్తారవమున నొక్క | 3 | seesamu |
4108 | _x000D_
పరధనమ్ములకును బారుగా చెయిపట్టి
_x000D_
సత్యమింతలేక చారుఁడయ్యె
_x000D_
ద్విజుఁ డనుకొనుఁదాదు తేజమింతయు లేక
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2641 | నిన్ను న్నమ్మినరీతినమ్మనొరులన్, నీకన్న నాకెన్నలే
రన్నల్దమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు నా
యన్నా! యెన్నడు నన్ను సంస్కృతి విషాదాంభోధి దాఁటించి య
చ్ఛిన్నానంద సుఖాబ్ధిఁ దేల్చెదొ కదే శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
3132 | _x000D_
తన గుణము తనకు నుండఁగ
_x000D_
నెనయంగా నొరునిగుణము నెంచును మదిలో
_x000D_
తన గుణముఁదాను దెలియక
_x000D_
పనరి యొరుని ననెడువాఁడు భ్రష్టుఁడు వేమా. | 1 | kandamu |
1520 | తనపత్నిం దిలకింపుచున్ నిబిడకాంతారోర్వి వర్తించు రా
మ నరేంద్రోత్తము పాలి కర్కజుఁడు పంపం భిక్షువేషంబునన్
జని, సుగ్రీవుని చందముం దెలిపి యా క్ష్మానాథు దోడ్తెచ్చి, మె
ల్లన నయ్యిద్దఱకుం ధనంజయుని మ్రోలన్ సఖ్యసంబంధమున్
వినయం బొప్ప ఘటింపఁ జేసినది నీవే కాదొకో మారుతీ! | 4 | mattebhamu |
1190 | ధరనే వస్తువులైనన్
దరుగుటకై వృద్ధినొందుఁ దగఁ బొడ వెదుగున్
విరుగుటకై, పాయుటకై
దరిఁ జేరును, వీని మదిని దలఁపు కుమార! | 1 | kandamu |
1085 | సాలెపుర్వునకుఁ కుంజరమున కహికిని | ముక్తి యొసంగిన భక్తసులభ!
జముని దక్షుని పరాశరతనూజుని గర్వ- | దూరులఁ జేసిన భూరిశౌర్య!
హరి విరించన పురందరుల కఖండవై- | భవము లొసంగిన భువనజనక!
నంది భృంగీశ బాణ దశాననుల మహా- | ప్రమథులఁ జేసిన విమలచరిత! | 3 | seesamu |
2013 | పరిపంధిక్రియ నొత్తి వెంటఁ బడునప్పాపంబుఁ దూలించి మీ
చరణాబ్జస్థితి పంజరంబు శరణేచ్ఛం జొచ్చితిం గావుమీ
బిరుదుం జూడుము మీరు సూడఁగ భవద్భృత్యుండు దుఃఖంబులం
బొరయ న్నీ కపకీర్తి గాదె శరదంభోజాక్ష నారాయణా! | 4 | mattebhamu |
2340 | నిను నారాయణమూర్తిగాఁ దలఁచుచున్ నీ దండ నా దండకా
వన వాచంయము లెల్లఁ జేరి కొలువన్ వారిం గృపం జూచుటల్
వనధిం గట్టుట రావణుం దునుముటల్ వర్ణింతు రామావతా
ర నిరూఢాకృతి నిన్ను నౌర! రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
1046 | కాక తన పొట్టకై ప్రజఁ గలఁచు దురిత- | రతుఁడు వాఁ డొక రాజా తరాజు గాక,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
2403 | పిప్పలర నాత్మసుఖముల
తెప్పం దేలేటియోగిఁ దెలియక తమలో
నప్పురుషుం గని కర్ములు
చప్పనఁగాఁ జూతు రన్న సంపఁగిమన్నా! | 1 | kandamu |
3881 | _x000D_
వెదకి కానలేరు వేదాంత వేద్యుని
_x000D_
నుత్తముండు గాంచు నుర్విమీఁదఁ
_x000D_
గలిగెనేని వానిఁ గానంగ లేరయా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3247 | _x000D_
గురువు చిల్లగింజ కుంభ మీదేహంబు
_x000D_
ఆత్మ కలుషవంక మడుగుఁబట్టఁ
_x000D_
దెలిసి నిలిచెనేని దివ్యామృతంబురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4116 | _x000D_
శూద్రులందుఁబుట్టి శూద్రుల దూషించి
_x000D_
ద్విజుఁడ ననెడిపేరు నిజముఁజేసి
_x000D_
మనసు నిల్పకున్న మఱిశూద్ర నీచుండు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2456 | చిత్తమునం దమ్మెఱుఁగక
తెత్తురు తమచేటు నత్త తిత్తు న్మత్తున్
మొత్తముగ నూడిపోయిన
సత్తులవా? సుప్రసన్న!సంపఁగిమన్నా! | 1 | kandamu |
561 | ఇరుసతలోకము ల్మహిమ నేలెడు స్వామివి నిన్ను వాకిటన్
దరలకయుండ గాపునిచి ధన్యతఁ జెందిన బాణదైత్యుఁ డే
కరణిని నిన్ను మున్నెరవు గ్రాలఁగఁ బూజ యొనర్చెనో కదా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
610 | మురిపెముతోడ నక్షుసరము ల్భసితంబు ధరించినాఁడ మ-
ద్గురువరదత్తమై సకలదోషములన్ దొలఁగించు ద్వాదశా-
క్షరి జపియించినాఁడ కలుషంబులు నాకిఁకఁ గల్గుటెట్లయా
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
444 | కానగ చేరఁ బోలఁ డతికర్ముఁడు నమ్మిక లెన్ని చేసినం
దానది నమ్మి వానికడ డాయఁగ బోయిన హాని వచ్చు న
చ్చో నది యెట్లనం; గొఱఁకు చూపుచు నొడ్డిన బోను మేలుగా
బోనని కానకాసపడి పోవుచుఁ గూలదెఁ గొక్కు భాస్కరా! | 6 | vutpalamaala |
2587 | తన చారిత్రమె సన్నుతించు గురుభక్తశ్రేణి వర్ణింపఁగాఁ
దన చిత్తంబు భవత్పదస్మరణచేత న్నిన్ను మెప్పింపఁగా
ననుకూలస్ఫుటనిశ్చలత్వమున రా నభ్యంతరాంగస్థితి-
న్వినుతిం బొందిన తజ్ఞుఁ డీజగములో నీ మెచ్చు సర్వేశ్వరా! | 4 | mattebhamu |
2458 | నేరనిజనులను బట్టుక
పోరాడఁగ నేల పల్కపోతారాటం
బేరీతిఁ దెల్ప గతికి వి
చారము మదిఁ బుట్టదన్న! సంపఁగిమన్నా! | 1 | kandamu |
1429 | ఒకవేళ కోపగించుక పవ్వళించుచో । వచ్చి పై ముసుకెత్తి యెచ్చరించు-
నా తరి చూచి మాటాడకుండిన నొద్ద । వీణె హాయిగ మీటి వినికిసేయు-
నవలిమోమై యున్న నది నిల్పి చందన ।కలపంబు నెమ్మేన నలదవచ్చు-
నిది పర్వదినము నేడిటు గూడదన నవ్వి । మదనశాస్త్రము జూడుమనుచు దెచ్చు- | 3 | seesamu |
4430 | చేసినను కాదు పాచిని ద్రోసి శుద్ధ- । గంగ యెత్తినయటు ముక్తి గాంచవలయు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
174 | జగతి నిటు సంతతోత్సాహచరణమునకు-యుక్తి సేయుదు వోహొ నీ శక్తి దెలిసె
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
2887 | కొదమమిటారిచన్నుఁగవ గొప్పపిఱుందు మెఱుంగుఁజెక్కు లొ-
ప్పిదమగు కన్ను లబ్బురపుఁ బెన్నెఱు లొప్ప వయఃప్రపూర్ణమై
మదనునిదంతిలాగు నను మక్కువ దక్కఁ బెనంగుచుండు నిన్
వదలఁకయున్న నబ్బు వహవా సహవాసము సుందరీమణీ! | 5 | champakamaala |
2646 | గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కల్యాణనామంబు ప్ర
త్యహముంబేర్కొను నుత్తమోత్తముల బాధంబెట్టగానోపునే
దహనుం గప్పఁగఁజాలునే శలభసంతానంబు నీ సేవఁజే
సి హతక్లేశులుగారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వరా! | 4 | mattebhamu |
1401 | కుటిలాత్మక నన్ను కౌగిట జేర్చవా యన । కుటిలత నీదు ముంగురుల గాదె
కఠినమానస నీదు కలిమెంతరా యన । కఠినత నీదు చన్గవల గాదె
చపలచిత్త యిదేటి నెపమురా యన చప- । లత నీదు వాల్చూపులందు గాదె
మందస్వభావ యేమందుర యిక నన । మందత నీ యానమందు గాదె | 3 | seesamu |
1635 | సుతులను గన్నయట్టి నెఱసుందరులం గని భాగ్యభోగసం-
గతమతులార నందనులు గల్గుటకున్ దిటమార నేమి నోఁ-
చితిరొ తపంబు లేమి మఱి చేసితిరో యని పుత్రవాంఛలోఁ
గుతుక మెలర్పఁగా నడుగు కోమలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
1175 | అవయవహీనుని సౌంద
ర్యవిహీను దరిద్రు విద్య రాని యతని సం
స్తవనీయు దేవు శ్రుతులన్
భువి నిందింపఁ దగదండ్రు బుధులు కుమారా! | 1 | kandamu |
795 | అదనం బొద్దులనీడచందమున నిచ్చల్ సృక్కి దుష్టాత్ముసం
పద పెంపై ధరనిల్వదించుకయు సౌభాగ్యప్రభాభాసియై
పొదలు\న్ మాపటినీడకైవడి భవత్పూజావిధేయజ్ఞుఁడై
సదయుం డైనను లేమి జేకురునె కృష్ణా దేవకీనందనా. | 4 | mattebhamu |
3111 | _x000D_
పూర్వ జన్మమందుఁ బుణ్యంబు సేయని
_x000D_
పాపి ధనము కాశ పడుట యెల్ల
_x000D_
విత్త మఱచి కోయ వెదకిన చందంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3563 | _x000D_
పాలు పంచదార పాపరపండ్లలో
_x000D_
చాలఁబోసి పండ్లఁ జవికిరావు
_x000D_
కుటిలమానవులకు గుణ మేల కలుగురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1581 | జనకక్ష్మాపతిపుత్రి యున్న నగరాజంబున్, నయజ్ఞుండు స
జ్జనమాన్యుండగు నవ్విభీషణుని వేశ్మశ్రేష్ఠముం దక్క త
క్కిన లంకాపురమెల్ల వాలకలితాగ్నిం గ్రాగి క్రుద్దేశనే
త్రనటత్పావక దగ్ధలోకసమతం బ్రాపించెఁగా మారుతీ! | 4 | mattebhamu |
2272 | నిను సేవించెద నంచుఁ గోరుకొనియున్నేన్ వానికిం బూర్వక
ర్మనిమిత్తంబులు కష్టముల్ గలుఁగఁగా మన్నించి నీవడ్డ మౌ
దని చెప్పంబడు, ద్రౌపదిం గరినిఁ బ్రహ్లాదున్ ధ్రువున్ మున్ను బో
రన రక్షించుట కల్దొ లేదొ రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
2461 | సంకల్ప ముడిఁగి తా ని
స్సంకల్పుం డైనఁ జాలు సద్గతి తడవా
సంకల్పమె బంధము ని
స్సంకల్పమె మోక్ష మెన్న సంపఁగిమన్నా! | 1 | kandamu |
2132 | పచ్చి చర్మపుఁదిత్తి పసలేదు దేహంబు - లోపల నంతట రోయ రోఁత
నరములు శల్యముల్ నవరంధ్రములు రక్త - మాంసంబు కండలు మైల తిత్తి
బలువైన యెండ వానల కోర్వ దింతైనఁ - దాళలే దాఁకలి దాహములకు
సకల రోగములకు సంస్థానమై యుండు - నిలువ దస్థిరమైన నీటి బుగ్గ | 3 | seesamu |
87 | అనఘ మౌ విప్రసత్రాన్న మెంగిలిఁ జేసి- తీవె మున్ క్రతుభోక్త నేనే యనుచు
సవతికొమాళ్ళ సమయించి తందఱిఁ- దరుగని రాక్షసాంతకుఁడ ననుచు
బంధువు లన్యోన్య వైరానుహతులుగా- నడచితి భూభారహారి ననుచు
బలిమి నన్య స్త్రీలఁ బట్టితి వెందఱి- నస్ఖలద్బ్రహ్మచర్యమతి ననుచు | 3 | seesamu |
3562 | _x000D_
కలిమినాఁడు మగని కామిని చూచును
_x000D_
లేమిఁజిక్కునాఁడు లేవకుండు
_x000D_
మనినమగనినైన మడియంగఁ జూచును
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1652 | పురిటిలు సొచ్చి యున్నతఱిఁ బుత్రునకున్ వివిధోపచారముల్
మెఱవడి చేయువారలను మిక్కిలి ప్రార్థన చేసి దేవతా-
తరుణులయట్లు చూచు నెఱ తాలిమి మీఱగ నిట్టు లర్భకా-
తురమున నేమి చెప్పవలెఁ దొయ్యలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
4013 | _x000D_
కోపమునను ఘనత కొంచెమై పోవును
_x000D_
కోపమునను మిగుల గోడుఁజెందుఁ
_x000D_
గోపమడచెనేని గోరిక లీడేరు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
212 | భవదనుగ్రహ కవితచేఁ బ్రబలువాఁడ-నవని గాసుల పురుషోత్త మాఖ్యవాఁడ
చిత్రజిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హతవిమతజీవ శ్రీ కాకుళాంధ్ర దేవ! | 2 | teytageethi |
3876 | _x000D_
చినుఁగు బట్ట కాదు చీనాంబరము గాని
_x000D_
ముఱికియొడలు గాదు ముక్తి గాని
_x000D_
పరమయోగిమహిమఁ బరికింప నరుదురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1737 | నెఱికురుల్ నీలాల నిరసించు మోముతో సరియౌనె పున్నమచందమామనిద్దంపు నునుజెక్కుటద్దంబులను గెల్చు ముద్దియయోష్టంబు మొనయ కెంపుకన్నుల సోగలు కల్వరేకుల మీఱు జన్నుగుబ్బలు సరి జక్కవలకుతిలపుష్పముల గేరు తెరవ నాశిక తీరు చెలి హస్తమబాళి జెనకజూచు | 3 | seesamu |
2520 | అమరశ్రేణులకు న్సుధామయకళౌఘాత్మీయసారంబు ర-
గ్యముగాఁ గ్రోలఁగ నిచ్చి తానొక కళామాత్రాంగుఁడై యున్న చం-
ద్రమునిం జూచి జగమ్ము మ్రొక్కుగతినారన్ భక్తపూజానిధి-
క్రమభారాకృశుఁ జూచి మ్రొక్కుదురు లోకంబెల్ల సర్వేశ్వరా! | 4 | mattebhamu |
3566 | _x000D_
పంకజాక్షిఁ గన్న బంగరు పొడగన్న
_x000D_
దిమ్ముబట్టియుండు తెలివి కెల్ల
_x000D_
మనుజులకును తత్వమహి మెట్టు గల్గురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1194 | మధురంబులఁ గొననొల్లఁడు
బుధజనుఁ డేకతమ దారిఁ బోనొల్లఁడు నీ
విధ మెఱిఁగి నీవును మనో
రథ సిద్ధుఁడవగుచు మెలఁగ రాదె! కుమారా! | 1 | kandamu |
1998 | పరుషాలాపము లాడ నోడి మది నీపాపార్జనారంభుఁ డై
నిరసిం చేరికిఁ గీడు సేయక మది న్నిర్ముక్తకర్ముండు నై
పరమానందనిషేధముల్ సమముగా భావించి వీక్షించు నా
పరమజ్ఞాని భవత్కృపం బొరయు నో పద్మాక్ష నారాయణా! | 4 | mattebhamu |
495 | మదిఁ దను నాసపడ్డయెడ మంచిగుణోన్నతుఁడెట్టి హీనునిన్
వదలఁడు మేలుపట్టున నవశ్యము మున్నుగ నాదరించుఁగా;
త్రిదశ విమానమధ్యమునఁ దెచ్చి కృపామతి సారమేయమున్
మొదల నిడండె ధర్మజుఁడు మూఁగి సురావళి చూడ భాస్కరా! | 5 | champakamaala |
1210 | సారమతి నిటుల తిరిగెడి
పూరుషరత్నంబు కీర్తిఁ బొందుచు ధరపై
గోరినకోర్కె ఫలము శ్రీ
మీఱ ననుభవించుచుండు మిగులఁ గుమారా! | 1 | kandamu |
1534 | పవనాభస్యద మొప్ప నీవు కడిమిం బథోనిధిం దాటుచో
భవదీయోరు భుజోరువేగ జనితాభంగోర్మికాజాలముల్
దివితో రాయ ఘుమంఘుమార్భటులు దిగ్దేశంబులం బర్వఁ బ
త్రవహేంద్రుండని భీతిలెన్ ఫణులు పాతాళంబునన్ మారుతీ! | 4 | mattebhamu |
2712 | నీ భక్తుల్పదివేల భంగుల నినున్సేవింపుచున్ వేఁడఁగా
లోభంబేఁటికి వారి కోర్కులు కృపాళుత్వంబుఁనం దీర్పరా
దా భవ్యంబు దలంచిచూడు పరమార్థంబిచ్చి పొమ్మన్న నీ
శ్రీ భాండారములోఁ గొఱంతపడునా శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
3266 | _x000D_
దొంగతెలివిచేత దొరకునా మోక్షంబు
_x000D_
చేతఁగానిపనులఁ జేయరాదు
_x000D_
గ్రుడ్డనంగ వలదు గుణహీనుఁడనవలె
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2479 | ఏపారంగ నజాండభాండనికరం బేరూపులో బుట్టి యు-
ద్దీపించు న్మఱి రూపులెల్ల సమసుప్తిం బొంది యేరూపులో
లోపించుం గలయంగ నంతటికిఁ దా లోనై విజృంభించి యే
రూపం బవ్యయమై వెలుంగు నది నీ రూపంబు సర్వేశ్వరా! | 7 | saardulamu |
1955 | పటుగర్భాంతరగోళభాగమున నీ బ్రహ్మాండభాండంబు ప్రా
కట దివ్యాద్భుతలీలఁ దాల్చి మహిమం గల్పాంత మంభోధిపై
వటపత్రాగ్రముఁ జెంది యొప్పిన మిము న్వర్ణింపఁగా శక్యమే
నిటలాక్షాంబురుహాసనాదికులకు న్నిర్వాణ, నారాయణా! | 4 | mattebhamu |
2605 | భవదంఘ్రిద్వితయార్చనంబును బవత్ప్రఖ్యాతసద్భక్తపుం-
గవగోష్ఠీవిభవంబులు న్విమలసూక్ష్మధ్యానయోగంబు నా
నివి సంపూర్ణసుఖంబులెన్న మఱి దేవేంద్రాది భోగంబు లు-
త్సవసంబంధములెల్ల దుఃస్థితులు తథ్యంబెన్న సర్వేశ్వరా! | 4 | mattebhamu |
1920 | విభుని ముందటనిడి వేగ వెలది విరుల | సురటి వీవంగ భుజియింప సుదతి విభునిజూచి నను బాయకిక నేలు సుందరాంగ | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
838 | హరిచందనంబు మేనునఁ
గరమొప్పెడు హస్తములను గంకణ రవముల్
ఉరమున రత్నము మెఱయఁగఁ
బరఁగితివౌ నీవు బాల ప్రాయము కృష్ణా. | 1 | kandamu |
2976 | కమలాక్షి యడవిలో గాయు వెన్నెలరీతి నాతడు సరసము లాడడాయెగూరిమి నాయొద్ద గూర్చున్నయపుడైన నింతి నాకొక్క ముద్దియ్యడాయెబడతి నే రమ్మని బతిమాలినపుడైన నగరుగంధమ్ము మేనలదడాయెనో రాధికా యని యూహించి యెపుడైన బ్రీతితో నన్ను తా బిల్వడాయె | 3 | seesamu |
1866 | గాన నా యింతి నేలుము గారవమున | చాన నిను వలచియున్నది జాగువలదుపూని యిక వేగ రావయ్య పొలతి కడకు | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
1506 | నెటుల సైరింతు నిన్ను నేనెపుడు గాంతు । నేది యుపమెంతు నీ జాలినెటు లడంతు
మగువ దయయుంచునని చాల మది దలంతు । వరుసనిటు రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
336 | కోటీరాంగదమేఖలాఘనతులాకోటీ కవాటీనట-
ద్ఘోటీ హాటకపేటికాభటవధూకోటీ నటాందోళికా-
వీటీ నాటకచేటికాంబరతతుల్ వే చేకుఱు న్నిన్నిరా-
ఘాటప్రౌఢి భజించు ధన్యులకు భర్గా! పార్వతీవల్లభా! | 7 | saardulamu |
1938 | ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై
పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై
సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై
వరుస న్నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు, నారాయణా! | 4 | mattebhamu |
4320 | పచ్చల సందిదండలును బాహుపురుల్ మణినూపురంబులు\న్
మచ్చరికంబులుం బసిఁడిమట్టెలమ్రోతలుఁ బెల్లు మ్రోయఁగా
నెచ్చెలు లోలిఁ గొల్వఁ దరుణీమణి శ్రీయలమేలుమంగ నీ
ముచ్చట దీర్చు నొక్కపరి ముందఱ నిల్చిన వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
1826 | కొద్దియద్దాల రవికెయు ముద్దుగుల్క | తోరమగు గబ్బిగుబ్బల దొడగి కొమ్మవెడలు తరి జూడగావలె వేయుకనుల | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
4408 | గనుక నివియెల్ల నొరులచేఁ గాని భువిని । తమదు శక్తికి మంత్రతంత్రములు లేవు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
4259 | ఓచెలి! యోలతాప్రతిమ! యోమృగలోచ! యోచకోరిరో!
యోచదురాల! యోచిలుక! యో ... ... ... యలమేలుమంగ నీ
చూచినచూపులే విభుఁడు చూచినచూపు లటంచు నీసతిన్
ఖేచరసిద్ధకామినులు కీర్తనసేతురు వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
1087 | ఆరకూటమ్ము బంగారమై యొప్పునే | తగర ముజ్జ్వలకలధౌత మగునె
గాజుపూస యనర్ఘగారుత్మత మ్మౌనె | జిల్లేడు దేవతాక్షితిజ మగునె
కాసరం బతిదర్పకంఠీరవ మ్మౌనె | కాకంబు వరమానసౌక మగునె
మతకరి జోరీఁగ మదపుటేనుఁగ యౌనె | ఘనబిడాలము చిత్రకాయ మగునె | 3 | seesamu |
2695 | మొదలంజేసిన వారి ధర్మములు నిర్మూలంబుగాఁ జేసి దు
ర్మదులై యిప్పుడు వారధర్మములొనర్పం దమ్ము దైవంబు న
వ్వదె? రానున్న దురాత్ములెల్ల దమ త్రోవంబోవరే యేలచే
సెదరో మీఁదు దలంచి చూడకధముల్ శ్రీకాళహస్తీశ్వరా! | 4 | mattebhamu |
1375 | కలహంసలకు జీతముల లెక్కజూచి లో- । బాకి చెల్ల గని జాపాలొసంగి
జాతైన మంచిపచ్చలరంగు గల చిల్క- । పంజులెల్లను బరాబరులు జేసి
గండుకోకిలమూక కైజీతములవారి- । కందమౌ ననలతో విందొనర్చి
గొరువంక యెలగోలు నిరువంకలను గూడి । రమ్మంచు తేంట్లచే కమ్మలిచ్చి | 3 | seesamu |
3171 | _x000D_
హృదయమందు నున్నయీశుని దెలియక
_x000D_
శిలలనెల్ల మ్రొక్కుజీవులార
_x000D_
శిలల నేమియుండు జీవులందే కాక
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4400 | చెడి బ్రతికినట్టి శుంఠను జేర్చుకొనిన । వాఁడు చెడు నుంచుకొన్నట్టివాఁడు జెడును
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
3136 | _x000D_
చిత్తశుద్ధిగల్గి చేసినపుణ్యంబు
_x000D_
కొంచెమయిన నదియు గొదువ కాదు
_x000D_
విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1500 | స్నేహమౌచోట నింత నిర్మోహమౌట । తగవటే లేమ యీలాగు సుగుణధామ
తలచితే భామ నీమీద తగని ప్రేమ । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
3755 | _x000D_
వాఁత నాకు మేను వలపట మెడవాఁడు
_x000D_
ఒంటికాలువాఁడు నొప్పుచుండు
_x000D_
రాజసభలయందె రంజిల్ల మాట్లాడు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3429 | _x000D_
జీవసంజ్ఞ గలుగు జీవుని తత్వంబ
_x000D_
జీవపరుని గురుని జెందఁజేసి
_x000D_
తన్ను నిల్పువాఁడు తానె తత్వజ్ఞుఁడౌ
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2493 | అమరంగా స్ఫుటభక్తినాటకము భాషాంగక్రియాంగాభిర-
మ్యముగాఁ జూపిన మెచ్చి మీరిల బలే యన్నంతకున్ యోనిగే-
హములన్ రూపులు వన్నుకొంచును నటుండై వచ్చి సంసారరం-
గములోనం బహురూపమాడు వెలయంగా జీవి సర్వేశ్వరా! | 4 | mattebhamu |
283 | ఇటు రా రమ్మని పిల్చి గౌరవముగా హేమాంబరాందోళికా-
కటకప్రాకటభూషణాదు లిడి వేడ్కన్ ఱేఁడు ప్రార్థింప వి-
స్ఫుటభంగిం దగు కావ్యకన్య నిడనొప్పున్ గానిచో నుర్వి కో-
మటి మేనర్కమె బల్మిఁ గట్టఁగను? రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
3583 | _x000D_
చదువులందు రాజపదవులందును పాడి
_x000D_
మొదవులందు స్త్రీల పెదవులందు
_x000D_
నాశ లుడుగునట్టి యయ్యలు ముక్తులు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1756 | మరునిచేచిల్క యనదగు మందగమన | కలికి నెమ్మోము చందురుకాంతినెసగునట్టివగలాడి నెడబారునలవి గాదు | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
1391 | పసమించు నెమ్మేన పసమాని మెత్తని । పాదంబులకు జొత్తు పట్టెలుంచి
తళ్కుచెక్కిళ్ల చేతుల మంచిగంధమ్ము । బూసి కుంకుమ నడ్డబొట్టు వెట్టి
జాజిపువ్వుల మంచిజారుకొప్పమరించి । సొగసుకాటుక కనుసోగ దీర్చి
చెరగు మాసె నికేమి సేతు నంచని భర్త- । బొంకి నను ప్రేమతో నుపవని | 3 | seesamu |
294 | అతికష్టం బొనరించి భూమిజనుఁ డత్యాసక్తి విత్తంబు వి-
స్తృతభంగిం గడియింపఁగా నెఱిఁగి ధాత్రీకాంతు లుద్దండప-
ద్ధతి వానిం గొనిపోయి కొట్టి మిగులం దండించి యా సొమ్ము స-
మ్మతిఁ గైకొండ్రు మఱెంత నిర్దయులొ రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
1790 | యనుచు బంతంబులాడుచు నలిరుబోడి | మరునికేళిని నిముషమేమరక కలిసినిన్నె మెప్పించనున్నది నీలవేణి | మదనగోపాల సత్యభామావిలోలా! | 2 | teytageethi |
4058 | _x000D_
కూడుఁగుడిచియు శతకోటిపడిగ లెత్తి
_x000D_
మాటిమాటికిఁ దినియును మంటఁగలిపి
_x000D_
కాటికేగువేళను రిత్తకూటి కగును
_x000D_
దాటిపోదురు నిజముగ దరికి వేమ. | 2 | teytageethi |
4386 | గలుగు మంత్రిని జేర్చుకొన్నట్టి దొరకుఁ । గీర్తి సౌఖ్యము సకల దిగ్విజయము సిరి
గలుగుచుండును దోషము ల్దొలగిపోవు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
1000 | మెలఁగుచుండెడి యిల్లాలు కలుగవలయు | మహితభాగ్యాన్వితుండైన మానవునకు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
3256 | _x000D_
జననమరణములకు సరి స్వతంత్రుఁడు గాఁడు
_x000D_
మొదట కర్తగాఁడు తుదను గాఁడు
_x000D_
నడుమకర్త ననుటనగుబాటు కాదొకో
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3868 | _x000D_
నీతి వైరాగ్యభక్తిని నీచులకును
_x000D_
ఘాతకులు కాని జ్ఞానసంకలితులకును
_x000D_
వ్రాల కందని పద్యముల్ వేల సంఖ్య
_x000D_
చేత నందుగ భువినిదాఁ జెప్పె వేమ. | 1 | kandamu |
3614 | _x000D_
పరులదత్త మిట్లు పాలనఁ జేసిన
_x000D_
నిల స్వదత్తమునకు నినుమడియగు
_x000D_
నవని పరులదత్త మపహరించిన స్వద
_x000D_
త్తంబు నిష్ఫలంబు ధరణి వేమ. | 0 | aataveladi |
590 | ఒరుల భజింపఁబోడుగద యొక్కపుడు న్నినుఁగొల్చు మేటి భా-
స్వరసరసామ్రభూరుహలసత్కిసలానుభవానుమోదియౌ
పరభృతరాజమెందు నొకపట్టున వేములఁ జేరనేర్చునే
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
359 | అరిషడ్వర్గముఁ దోలి సర్వహితులై యష్టాంగయోగక్రియా-
పరులై గాడ్పుజయించి ముద్రవెలయన్ బ్రహ్మంబునీక్షించి వా-
విరి సోహమ్మని యెంచుచుండెడి మహావేదాంతులౌ యోగిశే-
ఖరులెల్లన్ మిముఁ గాంచుచుండ్రు గద! భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
2160 | నాతండ్రి! నాదాత! నాయిష్టదైవమా! - నన్ను మన్నన సేయు నారసింహ!
దయయుంచు నామీఁద దప్పులన్ని క్షమించు - నిగమగోచర! నాకు నీవె దిక్కు
నే దురాత్ముఁడ నంచు నీ మనంబునఁ గోప - గింపఁ బోకుము స్వామి! యెంతకైన
ముక్తిదాయక నీకు మ్రొక్కినందుకు నన్నుఁ - గరుణించి రక్షించు కమలనాభ! | 3 | seesamu |
2431 | తనమనసే తా నాయెను
తనమనసే తన్నుఁ దెలియ దత్త్వం బయ్యెన్
మనసునకు సాక్షి మనసే
సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా! | 1 | kandamu |
4500 | వదలవలయును నుపద్రవంపు వృత్తి । విడువవలయును భయద పృథ్వీతలేంద్రు
త్రోయవలయును కపటవృత్తులను భువిని
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
2781 | చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుఁడు దగన్
హేమంబుఁ గూడఁ బెట్టిన
భూమీశుల పాలఁ జేరు భువిలో సుమతీ! | 1 | kandamu |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.