id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
974
నౌర తమకన్న కూసుగాఁ డవల నింకఁ | గలఁడె యను మూర్ఖుఁ డిద్ధరఁ గామవైరి! భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
596
కరతలతాళవృంతములుఁ గ్రమ్మఁగ నెవ్వఁడు తావకాలయా- జిరమున నాఁడు నాతఁడు వసించు విరాజితరాజతావనీ- ధరశిఖరాగ్రరత్నసముదంచితకాంచనసౌధవీధులన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
4511
మందుమాకిడి గండమాల మాన్పఁగలేఁడు । చక్కఁజేయగలండె నక్కనోరు వ్రేలివంకర మీఁద వీద నొత్తఁగలేఁడు । కుదురుసేయగలండె గూనివీఁపు త్రోయఁజాలఁడు కుక్కతోక వంకరైన । నేటివంకలు దీర్ప నెట్టులోపు తనవారి యొచ్చెంబు తాను దీర్పఁగఁజాలఁ । డొరుల యొచ్చెము దీర్ప నోపునెట్లు
3
seesamu
2205
నీకు నావిద్య హర్షంబుగాక యున్న - తేపతేపకు వేషముల్‌ దేను సుమ్మి భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
524
సిరిమగఁడున్ బితామహుఁడుఁ జేరి భజింపఁగ వెండికొండపై సరస నవేందుకాంతమణిసౌధమునందుఁ బసిండిగద్దెపై గిరిసుతఁ గూడి వేడుకలఁ గేరెడు నిన్ను మదిన్ దలంచెదన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
4204
_x000D_ నాణెమైన చెడిప నయ మెఱింగి తిరుగు _x000D_ విటుని కుస్తరించు వివర మెఱుఁగు _x000D_ బానిసైనతొత్తు పాటింపరాదయా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1709
కలుపుఁదనంబుతోడఁ దనుఁ గన్న కుమారుఁడు సంతసిల్లి కో- డలికి నలంకరించుచు నొడంబడి బుద్ధులు చెప్పుచున్ దనూ- జులవలెఁ బ్రేమ మీఱ మఱి చూచుచు భూజనులాడు మంచిప- ల్కులకుఁ బ్రమోదమొందు సుమకోమలిఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
3034
లక్షశత్రులుగల లంకేశ్వరునితోడ జగడాని కెవ్వరు చాలగలరె నెలతరో మఱి యారునెలలకు లేచెడి కుంభకర్ణు నెవరు గూల్పగలరె మిన్నుననున్నట్టి యా మేఘనాథుని బట్టి యతివ యెవ్వరణచగలరెజలధిలోపలను శిల్వల నొప్ప దేలించి వారిధిఁ గట్టించువారు గలరె
3
seesamu
1634
చిలుకలు లేని పంజరము శీతమయూఖుఁడు లేని రాత్రి చెం- గలువలు లేని పెంగొలను గాదె పరేహసుఖప్రదానని- ర్మలగుణశాలి నాఁ దగు కుమారకునిం గనలేనిదాని మే- ల్చెలువమదేల యంచు మదిఁ జింతిలు తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
728
వేదోద్ధారకుఁగా సుధాప్రభువుఁగా విశ్వంభరావాహుఁగా వాదావిర్భవుఁగా త్రయీవటువుఁగా వర్ధిష్ణుతాయుష్యుఁగా కోదండాశుగపాణిఁగా బలునిఁగా ఘోరవ్రతచ్ఛేదిఁగా నాదిబ్రహ్మముఁగాఁ దలంతు మదిఁ గృష్ణా దేవకీనందనా.
7
saardulamu
2809
పరసతుల గోష్ఠినుండిన పురుషుడు గాంగేయుఁడైన భువి నిందబడున్‌ బరసతి సుశీలయైనను బరుసంగతి నున్న నిందపాలగు సుమతీ!73
1
kandamu
1495
లలన నీకుచదుర్గముల బలమ్మున గాని । వలరాజు కెదురించి నిలువలేను తరుణి నీ యధరామృతంబు గ్రోలక గాని । మదనదాహమ వేరె మట్టుపడదు వనిత నీ దయచూపు లను వృష్టిచే గాని । యంగజానలము చల్లారబోదు కలికి నీ నవ్వువెన్నెలలు గాయక గాని । స్మరతాప మొకకొంత శాంతి గాదు
3
seesamu
2080
అతిశయంబుగఁ గల్లలాడనేర్చితిఁగాని - పాటిగా సత్యముల్‌ పలుకనేర సత్కార్య విఘ్నముల్‌ సలుప నేర్చితిఁగాని - యిష్ట మొందఁగ నిర్వహింపనేర నొకరి సొమ్ముకు దోసిలొగ్గ నేర్చితిఁగాని - చెలువుగా ధర్మంబు సేయనేర ధనము లియ్యంగ వద్దనఁగ నేర్చితిఁ గాని - శీఘ్ర మిచ్చెడునట్లు చెప్పనేరఁ
3
seesamu
721
పట్టితి భట్టరార్యగురు పాదములిమ్మెయి నూర్ధ్వపుండ్రముల్‌ వెట్టితి మంత్రరాజ మొడబెట్టితి నయ్యమకింకరాళికిం గట్టితి బొమ్మ మీ చరణ కంజములందుఁ దలంపుపెట్టి బో దట్టితిఁ బాపపుంజముల దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
615
ఒరుల నుతింపఁజాలఁ గలుషౌఘమహాదహనాగ్నికీలయై బరగుచుఁ గామితార్థము లపారముగా నిడు నీదు నామసం- స్మరణ యహర్నిశంబును బ్రశస్తిగ నాకొనరించి బ్రోవవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
3428
_x000D_ బ్రహ్మమును దెలిసెడు భావమందున నిల్చి _x000D_ తనువు గుడిని జేసి తన్ను నిలిపి _x000D_ లోకమందు నిలిచి లోఁజూపు చూడరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1861
నీవు రావలెనంచు నెమ్మది దా గోరి గౌరీవ్రతము సేయు గంబుకంఠితోడ భాషింప నిజముగా మదిగోరి చెలి సరస్వతిపూజ సేయుచుండునీతోడ రతిగూడ నెలత దా నెదగోరి మదనుని బూజించు మందయాననీవు దయజూడంగ నిజభక్తి వరలక్ష్మినోము గావించు దా నుచితముగను
3
seesamu
2895
మదనుఁడు డాసెఁ బూవిలుతు మర్మములంటఁగ నేసె నక్కటా హృదయము దూసె దానిపయి నిందుఁడు వెన్నెలఁ గాసెఁ గోకిలల్ చెదరక కూసెఁ జిల్క రొఁద చేసె నళుల్ వడి మ్రోసె నెట్టులో- ర్చెద విధి నిన్ను నన్నెడలఁజేసె దురాత్మత సుందరీమణీ!
5
champakamaala
130
గట్టిగా మైథిలినిఁ జెట్టఁ బట్టినట్టి-పౌరుషము లబ్బె నేనాఁటి పూరుషుఁడవొ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
2653
ఆలంచున్మెడఁగట్టి దానికి నపత్యశ్రేణి గల్పించి త ద్బాల వ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబుగావించి యా మాలర్కంబున బాంధవంబనెడి ప్రేమం గొందఱం ద్రిప్పఁగా సీలన్సీల యమర్పినట్లొసంగితో శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
196
బరకృతోత్సవ మిచ్చట బ్రాఁతె నీకు-భక్త జనులకు నేత్రోత్సవంబె కాని చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
4021
_x000D_ కనుక గ్రామమునకుఁ గారణకర్తలి _x000D_ ట్లుండయగుచు నుభయులుండిరేని _x000D_ గండపక్షియుగళ ముండినరీతిని _x000D_ నుద్దిగూడి బ్రతుకుచుంద్రు వేమ.
0
aataveladi
630
శ్రీరఘువంశ తోయధికి శీతమయూఖుఁడవైన నీ పవి త్రోరుపదాబ్జముల్‌ వికసితోత్పల చంపకవృత్తమాధురీ పూరితవాక్ప్రసూనములఁ బూజలొనర్చెద జిత్తగింపుమీ తారకనామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
4138
_x000D_ ఎంబెరుమతమని యెసఁగ మాంసము తిని _x000D_ మారుపేరుఁ బెట్టి మధువు ద్రావి _x000D_ వావివరుస దప్పి పలికి పాడౌదురు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4151
_x000D_ హృదయము పదిలంబైనను _x000D_ గుదికొను సన్యాసమునకుఁ గొమ్మలు గలవా _x000D_ యిదియెఱుఁగరు చదువరులటు _x000D_ మది ముక్తికి నాస్పదంబు మహిలో వేమా.
1
kandamu
4220
_x000D_ దేశదేశములను దిరిగిగాసిలినొంద _x000D_ నాత్మయందు ధ్యాన మంటుకొనునె _x000D_ కాసులకును దిరుగఁ గలుగునా మోక్షంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
343
నీలాంభోధరమధ్యసంస్థితతటిన్నీకాశమై విస్ఫుర- ల్లీల న్నివ్వరిముంటి చందమున నెంతే సూక్ష్మమై పచ్చనై చాలన్భాసిలు తేజమీవ యనుచు న్స్వాంతంబునం దెన్నుదుర్ వాలెంబున్ ఘనులైన తాపసులు భర్గా! పార్వతీవల్లభా!
7
saardulamu
3347
_x000D_ మోదమునను గురుని ముఖ్యకరుణచేతఁ _x000D_ దొమ్మిదిస్థలముల దొడ్డు పాయ _x000D_ సర్వజీవుఁడాయె సర్వమ్ముఁ దానాయె _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
690
ధారుణి జాపజుట్టిన విధంబునగైకొని హేమనేత్రుఁడ వ్వారిధిలోన డాఁగినను వానివధించి వరాహమూర్తివై ధారుణిఁ దొంటి కైవడిని దక్షిణశృంగమునన్‌ ధరించి వి స్తార మొనర్చితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
2730
క్షితినాథోత్తమ! సత్కవీశ్వరుఁడు వచ్చెన్‌ మిమ్ములంజూడఁగా నతఁడే మేటి కవిత్వ వైఖరిని? సద్యఃకావ్యనిర్మాత త త్ప్రతిభ ల్మంచివి తిట్టుపద్యములు చెప్పండాతఁడైనన్‌ మముం గ్రితమే చూచెను బొమ్మటంచురథముల్‌ శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
2250
చెడుగన్, గష్టుఁడ, దుష్టచిత్తుఁడఁ, బరస్త్రీలోలుఁడన్, బాలుఁడన్ జడుఁడన్, మూఢుఁడఁ, గొండెకాఁడను, దురాచారి, న్నిషిద్ధాత్ముఁడన్ గడుసంగాకరిఁ గల్ల గుల్లఁ గపటిన్ గర్విన్ ననుం గావు మూ ఱడి యున్నాఁడను నీవె దిక్కు రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
2262
విందున్ వేదపురాణశాస్త్రముల గోవిందున్ ముకుందున్ హరిన్ విందున్ వేల్పులలోన భక్తసులభున్ విశ్వంభరున్ సచ్చిదా నందున్ నందుఁడు కన్న చిన్నశిశువున్ నాపాలి పాపాళిఁ బా ఱం దోలంగ నృసింహు నిన్ను రఘువీరా! జానకీనాయకా!
7
saardulamu
2953
ననుచు నీవేళ నామాటలడిగి రా- | దలంచి రమ్మని నిను బిలిపించితింతెతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన.
2
teytageethi
4499
మరణంబు మేలవమాన మొందుటకంటెఁ । గొంచమైనను బంచి కొడుచుటొప్పు తన విత్తహానియౌనని మది దలపక । హితవున్నచోట నప్పియ్యదగదు విత్తంబు చాలని విభవంబు కొఱగాదు । కుదువ బెట్టగరాదు కుందనంబు యాలస్యమొనరింప నమృతంబు విషమగు । డగవు దప్పిన మాట దలఁపరాదు
3
seesamu
1247
తనకెంత మేలు చేసిన మనమున కింపైన పనులుఁ మసలిన దాసీ వనితల కెన్నటికైనం జనవిచ్చి మెలంగరాదు జగతిఁ గుమారీ!
1
kandamu
4384
తో నరుగుదెంచి బలిని భూదాన మడిగి । తెచ్చి సురపతి కిచ్చితి విచ్చతోడ మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
1320
నొకరి కయితను గని హేళనోక్తులాడు । కుకవిశుంఠల మూతిపై గొట్టినటుల నేనొనర్చెద పద్యముల్ నీదు కరుణ । వచ్చునటుల రామరామ లావణ్యసీమ.
2
teytageethi
4171
_x000D_ పరఁగ బొమ్మగుడ్డు పరికించి చూచిన _x000D_ కులముల నిలయందుఁ గూడఁబెట్టు _x000D_ నందఱొకటఁ గలియ నన్నదమ్ములె కదా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
464
తాలిమితోడుతం దగవు దప్పక నేర్పరి యొప్పుదప్పులం బాలన సేయఁ గాకట నుపాయ విహీనుఁడు సేయనేర్చునే? పాలను నీరు వేఱు పరుపంగ మరాళ మెఱుంగుఁగాని మా ర్జాలమెఱుంగునే తదురు చారురసజ్ఞత బూన భాస్కరా!
6
vutpalamaala
1605
గీర్వాణాద్రివిభాగమున్‌ శిరముపై గీల్కొల్ప దుర్దాంతదో ర్గర్వం బొప్పఁగ వచ్చుచుండ గిరికిం గాపున్న పెక్కండ్రు గం ధర్వుల్‌ బోవఁగనీక నడ్డపడినన్‌ దర్పంబునన్‌ వారలన్‌ దుర్వారోద్ధతి వాలజానిలమునం దూలింపవే మారుతీ!
7
saardulamu
1160
పెను కోపము గర్వము ను బ్బును జలతయు దురభిమానమును వ్యాపారం బునఁ జొరక యునికియును న ల్పుని గుణము లటంచుఁ దెలివిఁ బొందు కుమారా!
1
kandamu
826
నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ దానవవైరీ క్షీరాబ్ధిశయన యదుకుల వీరా ననుగావు కరుణ వెలయగఁ గృష్ణా.
1
kandamu
3688
_x000D_ తన్నుఁజూచి యొరులు దగ మెచ్చవలెనని _x000D_ సొమ్ము లెలమిఁ బెట్టు నెమ్మిమీఱ _x000D_ నొరులకొఱకుఁ దాన యుబ్బుచు నుండును _x000D_ తన్ను దెలియ లేఁడు ధరణి వేమ.
0
aataveladi
2285
గోమాంసాశని, మద్యపాని, నగరిన్ గొండీఁడుఁ, చండాలుఁడున్ హేమస్తేయుఁడు, సోదరీరతుఁడు, గూ డేకాదశిన్ భుక్తిగొ న్నామూఢాత్ముఁడు లోనుగాఁ గలుగు దుష్టాచారుఁడైనం దుదిన్ రామా! యన్నను ముక్తిఁ గాంచు రఘువీరా! జానకీనాయకా!
7
saardulamu
2760
ఓడల బండ్లును వచ్చును ఓడలు నాబండ్లమీఁద నొప్పుగ వచ్చున్ ఓడలు బండ్లును వలెనే వాడంబడుఁ గలిమి లేమి వసుధను సుమతీ!
1
kandamu
1199
యోగ్యుల నరయఁగ లేక య యోగ్యులకున్‌ దాన మొసఁగు చుండుట యది స ద్భోగ్యసతిన్‌ షండునకున్‌ భాగ్యముఁగని పెండ్లిచేయు పగిదిఁ గుమారా!
1
kandamu
2568
భవదీయార్చన సేయుచోఁ బ్రథమపుష్పంబెన్న సత్యంబు రెం- డవ పుష్పంబు దయాగుణంబును విశిష్టం బేకనిష్ఠాసమో- త్సవసంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తిసంయుక్తియో- గవిధానం బవిలేని పూజలు మదిం గైకోవు సర్వేశ్వరా!
4
mattebhamu
2209
చారు నవరత్నకుండల శ్రవణయుగళ! - విబుధవందిత పాదాబ్జ! విశ్వరూప! భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
399
అవివేకక్షితినాయకాధమసభాభ్యాసప్రదేశంబులన్ బవళుల్రేలును జుట్టఁబెట్టుకొని దుష్పాండిత్యము ల్చూపుచుం గవిముఖ్యుం బొడగాంచి జాఱుదురు వేగంబుండ విల్గన్న కా కవులట్లే నిలఁబోక కాకవులు భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
3317
_x000D_ గురువు సెప్పువిద్య గురువునకును దెలియు _x000D_ గురువుసెప్పు విద్య గురునయెఱుఁగు _x000D_ గురువుమహిమ పరమగురునకుఁదెలియును _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3125
_x000D_ మేడిపండు చూడ మేలిమైయుండును _x000D_ బొట్టవిచ్చి చూడఁ బురుగులుండుఁ _x000D_ బెరుకువాని మదిని బింక మీలాగురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2236
ఆ కర్ణాటకమండలాధిపతిచే నాస్థానమధ్యంబులో నా కావ్యంబులు మెచ్చఁజేసితివి నానారాజులుం జూడఁగా నీకుం బద్యము లిచ్చుచో నిపుడు వాణీదేవి నా జిహ్వకున్ రాకుంటెట్లు? వసించుఁగాక రఘువీరా! జానకీ నాయకా!
7
saardulamu
2153
శీఘ్రముగఁ గోర్కె లీడేర్చి చింత దీర్చు - నిరతముగ నన్ను బోషించు నెనరు నుంచు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
813
అరయం జందనగంధిపై విదురుపై నక్రూరుపైఁ గుబ్జపై నరుపై ద్రౌపదిపైఁ గుచేలకునిపై నందవ్రజస్త్రీలపైఁ బరఁగంగల్గు భవత్కృపారసము నాపైఁ గొంతరానిమ్ము మీ చరణాబ్జంబుల నమ్మినాఁడ హరి కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
340
తరమే యేరికిఁ దావకీన ఘననిత్యశ్రీవిలాసక్రియల్ గరిమ న్దెల్పఁగ? దారుకావనిని లోకఖ్యాతిగా వర్ణివై పరమానందరసార్ద్రమానసుఁడవై పల్మారు గ్రీడించితౌ నరుదార న్మునిదారలం గలిసి భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
2383
బోధింపఁదగినగురువుల శోధించి తదంఘ్రిఁ జేరి సుస్థిరమతి యై యాధేయము నాధారము సాధించిన ముక్తుఁడౌను సంపఁగిమన్నా!
1
kandamu
1456
ప్రేమ నెటు దాతు మదికి మందేమి సేతు । నెపుడు నిను జూతు నింక నేనెటుల సైతు బిరుదు నిక తీతు మరునిదే పెద్ద భీతు । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
3599
_x000D_ మనసులోన నున్న మమత లన్నియుఁ గోసి _x000D_ దృఢముఁ జేసి మనసు తేటఁబఱచి _x000D_ ఘటము నిల్పువాఁడు ఘనతరయోగిరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
367
కేదారాదిక పుణ్యభూముల కశక్తిం బోవఁగారాదు; బల్ పేదర్కంబున దానధర్మవిధు లోలిం జేయఁగారాదు గా- కేదే నొక్కతఱిన్ సమస్తభువనాధీశున్ నినుం గొల్వఁగా రాదో? కానరుగాక దుర్మతులు భర్గా! పార్వతీవల్లభా!
7
saardulamu
1787
నిను జూచినది మొదల్ నిదుర కంటికి రాక మనమున దిగులొంది మరులు వరలవిరహ మగ్గలమాయె విభుడేల రాడాయె బిలువవే యని నన్ను బిలిచి పనిచెననబోడి మాటలు విని నేను గ్రక్కున నిను బిల్వ వచ్చితి నిలువకెందునిక జాగుసేయక శుకవాణికడ జేరి యకలంకముగ నేలు మంబుజాక్షి
3
seesamu
1409
కాలమృత్యువునైన కడకు ద్రోయగవచ్చు । పురవైరితోనైన బోరవచ్చు గరళంబు మెక్కి నిగ్రహశక్తి గనవచ్చు । నల దవానలము చేనంటవచ్చు మసకాడు తాచుల విసరి రాళ్లిడవచ్చు । కాలాంతకుని యాజ్ఞ గడవవచ్చు తనువు గోయగ మది తాళి యుండగవచ్చు । పైమాట లొకలక్ష బలుకవచ్చు
3
seesamu
2604
పరమార్థంబుగఁ దత్త్వము న్నెఱుఁగ నొప్పందీర్చి డెందంబు నీ కరుణాస్థానముఁ జేర్పలేక తన వంకం బోవఁగానిచ్చిరే నరకాబ్ధిం బడవైచుఁ దత్క్షణములోనం గానఁ దత్త్వక్షమం- బరయం జిత్తము శూకలాశ్వము విభంబై యుండు సర్వేశ్వరా!
4
mattebhamu
3520
_x000D_ కొమ్మదిమ్మరైనఁ ద్రిమ్మరులవలదు _x000D_ సరసవిటులనేల సమ్మతించు _x000D_ పేడతిన్న పురుగులెల్ల మేమెఱుఁగురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1703
కర మరుదార రాజహితకార్యములన్ సవరించి రా సభాం- తరమునఁ జేయు సత్క్రియలు దా విని తత్కమనీయకల్పనా- పరవశయై సదా “త్రిపురభంజన సేమ మొసంగు” మంచు మీ- సర మలరార దీవనలు సల్పెడు తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
3301
_x000D_ వాక్కునందు గురువు వాక్తత్వము గురువు _x000D_ చీఁకటింట గురువు చిక్కియుండు _x000D_ అఖిలమునకు గురువె యాధార మయియుండు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3805
_x000D_ ప్రభుని కిచ్చునట్లు పేదలకియ్యరు _x000D_ వనిత కిచ్చునట్లు వడుగు కీరు _x000D_ సురకు నిచ్చునట్లు సుమతుల కియ్యరు _x000D_ మనసు పదిలపడదు మహిని వేమా.
0
aataveladi
4643
భక్తుని మ్రింగఁ జంప మును భర్గునకున్‌ జిఱుతొండనంబికి\న్‌ యుక్తమెయంచు వారిపయి నొక్కట నుద్ధత ఘంట వ్రేసి యు ద్రిక్తత నొప్పఁగా నలరు దిట్ట హలాయుధు కట్టనుంగ! ప్ర వ్యక్తమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
379
శివుఁ జూడం దగదండ్రు గొందఱధముల్ చిత్రంబు తారెన్నఁడు న్రవిచంద్రాగ్నిగృహిక్షమాపవననీరవ్యోమముల్ నీ స్వరూ- పవిశేషంబు లటంచుఁ దెల్ప వినరో భావింప నమ్మూర్ఖపుం గవు లెల్లం దదధీనతన్ మనరొ భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
666
నేనొనరించు పాపము లనేకములైనను నాదుజిహ్వకుం బానకమయ్యె మీపరమ పావననామము దొంటి చిల్క "రా మా! ననుఁగావు"మన్న తుది మాటకు సద్గతిఁజెందెఁ గావునన్‌ దాని ధరింపఁగోరెదను దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
1846
గాన వగలాడికిని సాటిగలరె భువిని | చాన నీకైన దగు మంచిజాణ గదరమానకిక నేలుకొనవయ్య మదనజనక | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
3194
_x000D_ ఇట్టికనుల బ్రహ్మ మెట్లు చూడఁగవచ్చుఁ _x000D_ జూచుకనులువేఱు చూపువేఱు _x000D_ చూపులోనమరిచి చూడంగవలవదా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2217
నన్ని గలవాఁడ వఖిల లోకాధిపతివి! - నీకు సొమ్ములు పెట్ట నేనెంతవాఁడ! భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
3022
ఘనుడు సత్రాజిత్తుకన్య వేడుకతోను బెండ్లాడివచ్చిన బిరుదు వినవెనీలాపనిందలు నిశ్చయంబుగఁ గొంత నా మీదఁ బల్క నే నాతియుతుఁడగానఁ జంద్రుడు పాలలో గనపడినట్లు జాడ కొంచముగంటి జాములోనబడతి నేనొక భాద్రపదశుద్ధచౌతిని దనరంగ శశిబింబదర్శనంబు
3
seesamu
2367
శ్రీరాజయోగవిద్యా పారీణున కబ్బుఁ గాక పరమసుఖం బీ ధారణి హఠలయమంత్రవి చారుల కది దొరక దన్న! సంపఁగిమన్నా!
1
kandamu
150
యెవ్వ రేరాజు లొనరించి రిట్టిపనులు?-చేసితివి యింక నె ద్దేని సేయఁగలవు! చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
1912
యైన నీ తప్పు సైరించి యతివ కడకు | రమ్ము పదివేల జోతలు రమణ నీకుజేయ మది గోరియున్నది జాలమేల | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
1527
"ఏలా మీకు భయంబు నేఁ గలుగ, మీ రిందుండుఁ డేనొక్కఁడన్‌ వాలాయంబు పయోధి దాటి యనువొందన్‌ లంకలో జానకిం బోలం గన్గొని వత్తు, నిత్తు బరమామోదంబు మీ" కంచు ధై ర్యాలాపంబులు వల్కి తేర్చితివి గాదా కీశులన్‌ మారుతీ!
7
saardulamu
1497
వేదండయాన యీ పూదండ గైకొని । నీ దండ కరుణ నన్నేలుకొనవె కోపంబు మాని నీ రూపంబు నా స్మర- । తాపంబు దీరగా చూపరాదె వాదేల విరహంబుచే దూల నణగింప- । రాదా లతాంగి రారాపు లేలె యో యిందుముఖి నీవు నాయందు చలము ని- । ట్లైయుందువని దోచదాయె గదవె
3
seesamu
1504
తరణికిరణాశనము జేసి తపమొనర్చు । వారలకునైన నిది గెల్వ దీరదయ్యె యజుడు నిర్మించు మాయనేమంచు నెంచ- । వచ్చునే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
822
కరి నేలింది హుళక్కి ద్రౌపదికి కోకల్‌ మెచ్చి యిచ్చింది ద బ్బర కాకాసురునిం గటాక్షమునఁ జేపట్టిం దబద్ధం బహో శరణన్న బగవానితమ్మునికి రాజ్యం బిచ్చుట ల్కల్ల యి త్తఱి నన్నేలిన నిక్క మీకథలు కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
1125
పుట్టినది మొదలు పరసతి బఁట్టగ జూచుటయు నింద పద్ధతి యనుచు న్నట్టి పురుషుఁడు పుడమిం బుట్టిన జనతతులఁ గీర్తిఁ బొందుఁ గుమారా!
1
kandamu
3292
_x000D_ మహిని దధిని ఘృతము మ్రానులం దనలంబు _x000D_ సౌరుసుమములందు సౌరభంబు _x000D_ తిలలఁ దైలమట్ల తేజరిల్లుఁ జిదాత్మ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
479
పలుమఱు సజ్జనుండు ప్రియభాషలె పల్కుఁ గఠోరవాక్యముల్‌ బలుకఁడొకానొకప్పుడు నవి పల్కినన్‌ఁ గీడును గాదు నిక్కమే; చలువకు వచ్చి మేఘుఁడొక జాడను దా వడగండ్ల రాల్చినన్‌ శిలలగు నోటు వేగిరమె శీతలనీరము గాక భాస్కరా!
5
champakamaala
1107
అన్నంబు నాలుక కరుచియై కన్పట్టు | నిలిచినచో నిల్వ నలవికాదు మనుజేంద్రుతోనైన మాటాడ సైపదు | పనులయందేమియు మనసు లేదు నడుచుచో నడుగులు తడబాటు గైకొనుఁ | దగఁ బందువులనైన నగవు రాదు తెవులు పుట్టిన రీతి దేహంబు కృశియించుఁ | గలనైన నిద్దుర గలుగఁబోదు
3
seesamu
284
తనకుం బద్యము లల్లి సత్కవులు నిత్యంబుం బ్రసంగింపఁగా విని యొత్తుల్ దిను దాసరిం బలె బయల్వీక్షించుచుం గానియై- న నొసంగన్ మదిలోఁ దలంపని మదాంధక్షోణిపాలుం డిలన్ మను మార్గంబు గ్రహింపఁగాఁ గలడె రామా! భక్తమందారమా!
4
mattebhamu
1090
జగతిలోపలఁ గారణజన్ము లొక్క | కానియెడఁ బుట్టియుఁ బ్రసిద్ధిఁ గాంచుచుంద్రు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
4247
తలఁచుఁ గరంగు మైమఱచుఁ దన్మయ మందును జిత్తజాగ్ని ని న్నలయుచు దూరు నుస్సురను నర్మిలితో నలమేలుమంగ నీ వలిగిననంతనే కడుఁ బ్రియంబిఁక నేమని చెప్ప నేఁడువో కలిగినప్రేమ మింతయుఁ బ్రకాశము తోఁచెడు వేంకటేశ్వరా!
5
champakamaala
1101
నోరు చేఁదై కూడుగూరలు చవి దప్పు | గడగడ నొడలెల్ల వడకుచుండు జెవుడున నేమియుఁ జెవులకు వినరాదు | తెగులును జింతయుఁ దగులుకొనుచు కన్నులఁ బొర గప్పి కానరాదెద్దియు | సిగ్గొకించుకయైనఁ జేరఁబోదు బాలు రందఱుఁ గూడి గేలి గావింతురు | మగువలు పకపక నగుచునుంద్రు
3
seesamu
2157
ఆదిలక్ష్మీశ! నీ బంటు నయితినయ్య - యింక నెడబాపు జన్మంబులెత్త రోఁత భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
2
teytageethi
2558
తన యుక్తి న్భవదంఘ్రిసేవగల సద్భక్తుండు పాపంబు చే- సినఁ బుణ్యంబగు భక్తిహీనుఁడు శ్రుతు ల్చేపట్టి పుణ్యంబు చే- సినఁ బాపంబగు దీనికంతటికిఁ జర్చింపంగఁ జండేశ్వరుం డును దక్షుండును సాక్షులెన్న నగరాట్కోదండ సర్వేశ్వరా!
4
mattebhamu
3905
_x000D_ ఒడల భూతిఁ బూసి జడలు ధరించిన _x000D_ నొడయుఁడైన ముక్తిఁ బడయలేఁడు _x000D_ తడకబిఱ్ఱుపెట్టఁ దలపుతో సరియౌనె _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
4544
ప్రమథవిలోల! భక్తపరిపాల ధురంధరశీల! సంతతా స్తమిత సమస్తదేహ గుణజాల! సుఖప్రదలీల! లింగ జం గమ మహిమానుపాల! గతకాల సమంచిత నాదమూల! దే వ మము భరింపుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
5
champakamaala
3030
మా తండ్రి దశరథమహరాజుగారికి భార్యలు ముగ్గురు పడతి వినవెమువురిలో కైక యన్యాయమ్ముగ నను బరగ వనమునకును బంపదలచెరథమెక్కి దశరథరాజుతో నా కైక వనములో మును రెండువరములడిగెభరతుని సామాజ్యపట్టాభిషిక్తుగా నడవి శ్రీరాముల ననుపుటయును
3
seesamu
3995
_x000D_ సకలాకారుఁ డనంతుఁడు _x000D_ సకలాత్ములయందు సర్వసాక్షియుఁ దానే _x000D_ సకలమున నిర్వికారుం _x000D_ డకలంకస్థితిని బ్రహ్మ మగునుర వేమా.
1
kandamu
839
పాణితలంబున వెన్నయు వేణీమూలంబునందు వెలయఁగఁ బింఛం బాణీముత్యము ముక్కున నాణెముగాఁదాల్చు లోక నాథుఁడ కృష్ణా.
1
kandamu
3433
_x000D_ తా నగుట యెఱిఁగి సర్వముఁ _x000D_ దా నగుటయుఁ దెలిసి యెల్లతత్వముదానై _x000D_ తానెఱిఁగి పరిణమించిన _x000D_ మానవులకు శక్తిలేదు మహిలో వేమా.
1
kandamu
2146
పక్షివాహన! నేనుబ్రతికినన్ని దినాలు - కొండెగాండ్రను గూడి కుమతినైతి నన్నవస్త్రము లిచ్చి యాదరింపుము నన్నుఁ - గన్నతండ్రివి నీవె కమలనాభ! మరణ మయ్యెడినాఁడు మమతతో నీ యొద్ద - బంట్లఁ తోలుము ముందు బ్రహ్మజనక! ఇనజభటావళి యీడిచి కొనిపోక - కరుణతో నా యొద్దఁ గావలుంచు
3
seesamu
1816
నిలువనిచ్చునా యొకచోట నిముషమైన | తరుణి నయవినయములచే దగ బెనంగగోరియున్నది రావయ్య కోమలాంగ | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
758
ఇలఁ దద్వైరి నృపాల ఫాలఫలక ప్రత్యగ్ర రక్తచ్ఛటా కలితోదార గదావిజృంభణ భుజాగర్వుండు భీముండు కు క్కలకుం జాపఁడె యేకచక్రపురి భిక్షావేళ యుష్మత్సము జ్జ్వలకారుణ్యము గల్గునంతకును కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
593
నరుఁ డొకనాఁడు నీ నగరు నంగనఁ బట్టి విచిత్రఘంటికో- త్కరరవమాలకించిన నతండు వినం డెపుడున్ కృతాంతకా- సరగళఘంటికావ్రజవిశంకటసాంద్రఘణంఘణధ్వనుల్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala