id stringlengths 1 4 | poem stringlengths 71 312 | label int64 0 7 | label_name stringclasses 8
values |
|---|---|---|---|
129 | తా వచ్చెద నటంచు ధైర్యలక్ష్మి మహీజ- వెంట రా నడవికి వెడలినావు
సుగ్రీవుఁ డున్నచో సొమ్ము దా నిడ సీత- యాజాడ నతనిపొం దతికినావు
ముందు జానకి లంక మూర్ఖించి చొచ్చి నిన్- దెచ్చినరిపుల సాధించినావు
వైదేహి భవదంకవసతిఁ గూర్చున్నచో- భువనసామ్రాజ్యముల్ పొందినావు | 3 | seesamu |
581 | దురితము లేమిసేయు గ్రహదోషపిశాచరుజామృగోరగో-
త్కరభయమేల కల్గు నృపతస్కరవహ్నిభయంబులే ప్రియం
బెరయు నరుం డొకప్డు నినుఁ బేర్కొని నెమ్మది సంస్మరించినన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
376 | దారిద్ర్యంబు దొలంగు మృత్యువెడలున్ దవ్వౌనఘవ్రాతము
ల్ఘోరవ్యాధులు గండదోషము లడంగున్ జారచోరవ్యథల్
దూరంబౌ నహితానలగ్రహగణార్తుల్ వీడు నిక్కంబు నీ
కారుణ్యం బొకయింత గల్గునెడ భర్గా! పార్వతీవల్లభా! | 7 | saardulamu |
4122 | _x000D_
సోమయాజి ననుచు సొంపుగా వేషంబు
_x000D_
గట్టి మాంసమెల్లఁ గాల్చితినును
_x000D_
ద్విజుఁడనంగ నేమితేజంబు తనవల్ల
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2020 | నీలగ్రీవుఁడు చేతిపున్క విడిచె న్నీయింతి భిక్షంబున\న్
నీలగ్రీవుఁడు యీశ్వరాఖ్యఁ దనరె న్నీనామజప్యంబునన్
నీలగ్రీవుఁడు మించి త్రుంచెఁ బురముల్ నీప్రాపు సేవించినన్
నీలగ్రీవ ముఖాబ్జభాస్కర కృపానిత్యాత్మ నారాయణా! | 7 | saardulamu |
4379 | ఎనుబోతు వానకు జంకునా యెంతైన । వెలహెచ్చుగల తేజి వెఱచుఁగాక
గుణహీనుఁడెంతైన గులముకు వెఱచునా । గుణవంతుఁ డెప్పుడు వెఱచుఁగాక
గడుసైన పెనుమొద్దు గాలికి వెఱచునా । విరుగఁగాచిన మ్రాను వెఱచుఁగాక
ఱంకుముండ బజారురచ్చకు వెఱచునా । వీరపతివ్రత వెఱచుఁగాక | 3 | seesamu |
693 | ఇరువదియొక్కమాఱు ధరణీశుల నెల్ల వధించి తత్కళే
బర రుధిర ప్రవాహమునఁ బైతృకతర్పణ మొప్పఁజేసి భూ
సురవరకోటికిన్ ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
ధరణినొసంగితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ! | 5 | champakamaala |
37 | తలను బించెపుదండ ధరియించవలె గాని- మణికిరీటము బెట్ట మనుజపతివె?
గళమున వనమాలికలు పూనవలెఁ గాని- హారము న్వేయ దేశాధిపతివె?
కరమున మురళి చక్కఁగఁ బూనవలెఁ గాని- శాతాసిఁ బూనంగ క్షత్రియుఁడవె?
తనువు గోక్షీరవాసన గుప్పవలెఁ గాని- చందనం బలఁద రాజవె తలంప? | 3 | seesamu |
1981 | లలితాకుంచితవేణియం దడవిమొల్లల్ జాఱ ఫాలస్థలి\న్
దిలకం బొయ్యన జాఱఁ గుండలరుచుల్ దీపింప లేఁజెక్కులన్
మొలకన్నవ్వుల చూపు లోరగిల మే న్మువ్వంకల\న్ బోవఁగా
నలి గైకొందువు గాదె నీవు మురళీనాట్యంబు, నారాయణా! | 4 | mattebhamu |
605 | కెరలెడు ఘోరపాపతతికి న్మదిఁ గంపిలి యేయుపాయమున్
దొరకక యొక్క పెన్వెరవు దోచిన నుబ్బుచు నిబ్బరంబుగా
హరహర యంచుఁ బల్కితి నహా! దురితంబులు వీడి పారెఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
1334 | వింత నీ చెంతలేని నివ్వెరగు కొంత । వేసటొక్కింత తమి యింత వెగటు కొంత
యీదినము నంతకంత నీమీది చింత । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
2664 | మును నేఁ బుట్టిన పుట్టులెన్నిగలవో మోహంబుచే నందుఁ జే
సిన కర్మంబుల ప్రోవులెన్నిగలవో చింతించినం గాన నీ
జననంబే యని యున్నవాఁడ నిదియే చాలింపవే నిన్నుఁగొ
ల్చినపుణ్యంబునకుం గృపారతుఁడవై శ్రీకాళహస్తీశ్వరా! | 4 | mattebhamu |
2638 | రాజై దుష్కృతిజెందెఁ జందురుఁడు రారాజై కుబేరుండు దృ
గ్రాజీవంబునఁగాంచె దుఃఖము కురుక్ష్మాపాలుఁడామాటనే
యాజింగూలె సమస్త బంధువులతో నా రాజశబ్దంబు చీ,
చీ జన్మాంతరమందు నొల్లనుజుమీ శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
706 | నీ మహనీయతత్త్వ రసనిర్ణయబోధకథామృతాబ్ధిలోఁ
దామును గ్రుంకులాడక వృథా తనుకష్టముజెంది మానవుం
డీ మహిలోకతీర్థములనెల్ల మునింగిన దుర్వికార హృ
త్తామసపంకముల్ విడునె దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
4388 | నిట్టివారలపైఁ బ్రేమ పెట్టుకొనక । కసరుబెట్టిన మనుజుండు గనఁడు కీర్తి
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
3866 | _x000D_
నూఱుపలుకవచ్చు నొకటి వ్రాయఁగరాదు
_x000D_
వ్రాఁతకన్న సాక్షి వలవ దెన్న
_x000D_
పరగవ్రాతలేని పక్షానికప్పుడు
_x000D_
సుద్దిసాక్షి తగనిబుద్ధి వేమా. | 0 | aataveladi |
2248 | కొడుకు ల్బ్రహ్మలు, కూఁతు రీశ్వరశిరఃకూటంబుపైఁ గాఁపురం,
బుడురాజుం దినరాజుఁ గన్ను, లహిరా జుయ్యాలమంచంబు, నీ
పడఁతుల్ శ్రీయు ధరిత్రియున్, సవతు చెప్పన్ లేరు నీకన్యు, లా
ఱడి మర్త్యు ల్గనలేరుగాక రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
3647 | _x000D_
ధర్మమన్న వినరు తము నమ్మి భూనరుల్
_x000D_
యమునివారు వచ్చి యడలు నించి
_x000D_
చొచ్చి కట్టఁదారు చొరఁబారఁ గలరొకో
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2202 | తిరుపతి స్థలమందుఁ దిన్నఁగా నే నున్న - వేంకటేశుఁడు మేఁతవేయలేఁడొ?
పురుషోత్తమమునకుఁ బోయినఁజాలు జ - గన్నాథుఁ డన్నంబుఁ గడపలేఁడొ?
శ్రీరంగమునకు నేఁ జేరఁబోయినఁ జాలు - స్వామి గ్రాసముఁ బెట్టి సాఁకలేఁడొ?
కాంచీపురములోనఁ గదిసి నేఁ గొలువున్నఁ - గరివరదుఁడు పొట్టఁ గడపలేఁడొ? | 3 | seesamu |
919 | శిరమున రత్నకిరీటము
కరయుగమున శంఖచక్ర ఘనభూషణముల్
ఉరమున వజ్రపుఁబతకము
సిరినాయక యమరవినుత శ్రీహరి కృష్ణా. | 1 | kandamu |
1159 | ధరణీజాతము లే యే
తరి నెట్లెట్లను ఫలించుఁ దగనటు పూర్వా
చరణ ఫలంబు ననుభవముఁ
గరమనుభవనీయ మగును గాదె? కుమారా! | 1 | kandamu |
3209 | _x000D_
ఎంతకష్ట ముండు నంత పాపపుఁజింత
_x000D_
చింతచేత మిగులఁ జివుకు మనసు
_x000D_
చింతలేకయున్న చెడనిసంపదఁజూచు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3683 | _x000D_
అడుగ దగువారి నడుగమి
_x000D_
నిడినయెడ\న్ కొసరు చుంట యీలేననఁగా
_x000D_
గడుసుపడి యాసచేఁదా
_x000D_
నడుగుట దుర్మార్గవృత్తు లగురా వేమా. | 1 | kandamu |
3638 | _x000D_
ఎట్టిస్త్రీలఁ గనిన నింతంత యనరాదు
_x000D_
కాలవహ్ని లక్క కరఁగినట్లు
_x000D_
ఇట్టిగాఢమోహ మెంతైనఁ జేయురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3984 | _x000D_
పరుల కుపకరింప పాపక్షయంబగు
_x000D_
పరుల కుపకరింపఁ బట్టుకొమ్మ
_x000D_
పరుల కుపకరింపఁ బరలోక సిద్ధియు
_x000D_
పరుల కుపకరింప బలిమి వేమ. | 0 | aataveladi |
2956 | సఖియరో నా పతి సంశయమ్ములు మాని రాడేమిసేయుదు రాజవదనకోమలి నా మీద గోపమింతేలనే దన సిగ్గు దానేల దాచడాయెనా యీడువారిలో నన్ను గుందించుట కూడదు తనకిది గుణముగాదుయేమి సేయుదును నేనేలాగు నోర్తునే విరహవేదనచేత విసికినాను | 3 | seesamu |
1266 | దీపము వెలిగిం చెడిచోఁ
జీపురుపుడ కుంచవలయుఁ జేతుల నేతం
బాపము పాలౌదువు మది
లోపల నిది తలఁపవలయు రూఢిం గుమారీ! | 1 | kandamu |
2668 | ఏలీలన్నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షా ధ్వనివ్యంగ్యశ
బ్దాలంకార విశేషభాషల కలభ్యంబైన నీరూపముం
జాలుంజాలుఁ గవిత్వమున్నిలుచునే సత్యంబు వర్ణించుచో,
చీ! లజ్జింపరుగాక మాదృశకవుల్ శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
4176 | _x000D_
ఊరులు పల్లెలు మానుక
_x000D_
వారక యడవిం జరించువాఁ డరుదెంచు\న్
_x000D_
పెరుగులు కూరలు మెసవెడు
_x000D_
వీఱిఁడికెట మోక్షపదవి వినరా వేమా. | 1 | kandamu |
2240 | ఆ గౌరీశ్వరకీర్తనీయుఁ డగు ని న్నర్చింపఁగా లేనివా
రోగు ల్గారొకొ చాల యోగ్యులయినన్ యోగానుసంధాను లీ
మాగుల్గాన యథార్థమాడితిని నీమంత్రంబె మంత్రంబురా!
రాగద్వేషవిదూర! ధీర! రఘువీరా! జానకీనాయకా! | 7 | saardulamu |
449 | క్రూర మనస్కులౌ పతులఁ గొల్చి వసించిన మంచివారికిన్
వారి గుణంబె పట్టి, చెడు వర్తన వాటిలు; మాధురీజలో
దారలు గౌతమీముఖమహానదు లంబుధిఁ గూడినంతనే
క్షారముఁ జెందవే మొదలి కట్టడ లన్నియుఁ దప్పి భాస్కరా! | 6 | vutpalamaala |
145 | నీపేరు వినుటకే యోపక చెవిఁ గంట- గట్టుకున్నాతనిఁ గావ నేమి?
కలన నీతోఁ గత్తిఁ గట్టుక పోరాడు- వాని సోదరుని బ్రోవఁగ బ నేమి?
బాధింపఁ దగు మహాపాత కుండటుచేరి నీవాఁడ నంటె మన్నింప నేమి?
మాయవేసముల నీ మర్మ మారయుచున్న- విమత ధూతల బట్టి విడువ నేమి? | 3 | seesamu |
3135 | _x000D_
భూమిలోనఁ బుణ్యపురుషులు లేకున్న
_x000D_
జగములేలనిల్చు సమయుఁగాక
_x000D_
నంత దఱచుదొరక రాడ నాడనెగాని
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
945 | పలుకుఁగ్రొన్ననఁబోఁడి కులుకు వీణియ మీట | వేయుఁగన్నులవేల్పు వేణువూదఁ
గలుములతొగకంటి చెలఁగి గానము సేయ | నలువ కైతాళ మింపలర వ్రేయ
మధుదైత్యమథనుండు మద్దెల వాయింప | సకలపారిషదు లెచ్చరికసేయ
నందిభృంగీశు లందంద సందడి దీర్ప | మొనసి దేవతలెల్ల మ్రొక్కి కొలువ | 3 | seesamu |
3032 | తండ్రిపంపున నీవు తగ వనంబున కేగి చేడెకైనను గల్లలాడదగునెవనితతో వనవాసమొనరింప నత్తఱి చుప్పనాతికి ముక్కుచక్కజేయనా చుప్పనాతియు నన్నతో బోరాడి మారీచు బంపెను మాయజేసిమారీచు మాయలు మది నెఱుంగక నీవు విల్లుచేతను బట్టి వెళ్ళినావు | 3 | seesamu |
1006 | నౌర వింతలు భూమిపై నాఁడుదాని | మనసు దెలియంగరాదు పద్మజునికైన,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
3269 | _x000D_
చెవులు గోరును మంచి జిలిబిలిపాటలఁ - దియ్యని మాటల తెఱఁగు వినఁగ
_x000D_
జన్మంబు గోఱును సరవితోడుత శీత - పృథుల సంస్పర్శ సంపదల నెపుడు
_x000D_
కన్నులు గోరును గమలయవర్ణంబు - లయినట్టి రూపంబు లనువుతోడ
_x000D_
నాలుక గోరును నయముతోడ తీపు - నొగరు కారమ్ము చేదుప్పు పులుసు | 3 | seesamu |
2834 | వీడెము సేయని నోరును
జేడెల యధరామృతంబుఁ జెందని నోరున్
బాడంగరాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ. | 1 | kandamu |
3283 | _x000D_
దాన మమరఁజేసి దరిఁజేరు నొకవంక
_x000D_
మనము నమ్మెనేని మాయ గల్గు
_x000D_
జ్ఞానకలిక నమ్మఁ జంపును వైరుల
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
984 | సీ యితనికంటె సాకలిసెల్లిగాఁడు | మేలనెడు మోటకొయ్యల నేల దెలుప,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
1060 | కాని నిన్నొక్కమాఱైనఁ గడఁగి తలఁప- | రాదె యెన్నరు గాక దుర్మతులు మదిని,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
654 | అవనిజ కన్నుదోయితొగలందు వెలింగెడు సోమ జానకీ
కువలయనేత్ర గబ్బిచనుఁగొండలనుండు ఘనంబ మైథిలీ
నవనవయౌవనంబను వనంబునకున్ మదదంతి వీవెకా
దవిలి భజింతు నెల్లపుడు దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
3570 | _x000D_
పట్టనేర్చు పాము పడగ నోరఁగఁజేయు
_x000D_
చెఱుపఁజూచువాఁడు చెలిమిఁజేయు
_x000D_
చంపఁ దలఁచురాజుచనువిచ్చు చూడరా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2505 | అనురాగంబున నిన్నుఁ జూచుఁ దలపోయన్ జొక్కుఁ గాంక్షించు వ-
ర్ణన సేయం దమకించు సిగ్గు విరియన్ బ్రార్థించు శోషించు నం-
త నెదన్ ధ్యానము దాల్చుఁ దన్ను మఱచుం దానీ దశావస్థలం
దనరంగా మది నిన్ను డక్కఁ గొను సద్భక్తుండు సర్వేశ్వరా! | 4 | mattebhamu |
4289 | కనకపుఁబీఠి నెక్కి రతికాంతశరాకృతి నీవు వీథులం
జనునెడ నీదు చెంగటఁ బ్రసన్నతతో నలమేలుమంగ కాం
చననవకింకిణీరవము సన్నపుఁదాళగతి\న్ రచింపఁగాఁ
గనుఁగవ మోడ్చి మోడ్చి రతిఁ గౌఁగిటఁ జేర్తువు వేంకటేశ్వరా! | 5 | champakamaala |
2828 | రాపొమ్మని పిలువని యా
భూపాలునిఁ గొల్వ భుక్తి ముక్తులు గలవే?
దీపంబు లేని యింటను
జేపుణికిళ్ళాడినట్లు సిద్ధము సుమతీ! | 1 | kandamu |
2634 | ఱాలన్ ఱువ్వఁగ జేతులాడవు కుమారా! రమ్మురమ్మంచునేఁ,
జాలన్ జంపఁగ నేత్రముల్దివియఁగా శక్తుండనేఁగాను, నా
శీలంబేమని చెప్పనున్నదిఁక నీ చిత్తంబు నాభాగ్యమో
శ్రీలక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
4334 | నీలనిభగాత్ర శ్రీరమణీకళత్ర । సద్గుణస్తోమ యదుకులసార్వభౌమ
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
1242 | మగని ప్రియ మబ్బె ననుచును
దెగ నీలిగి యింటివారి దిగఁద్రొక్కుచు దుం
డగురాలై తిరిగిన సరి
మగువలలో నిదియె తప్పు మాట కుమారీ! | 1 | kandamu |
3285 | _x000D_
దేవుఁడనఁగ వేఱు దేశమం దున్నాఁడె
_x000D_
దేహితోడ నెపుడు దేహమందె
_x000D_
వాహనముల నెక్కి వడిఁదోలు మన్నాఁడు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
302 | బలదేవుం డతినీచవృ త్తిని సురాపానంబు గావింపఁగా
జలజాతాస్త్రుఁడు మానినీపురుషలజ్జాత్యాగముల్ సేయఁగా
చలమారంగ నలక్ష్మి సజ్జనుల నిచ్చల పట్టి బాధింపఁగా
మలపం జాల విదే వివేక మిల? రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
3950 | _x000D_
తల్లిదండ్రులనెడి తత్వంబు నెఱుఁగరు
_x000D_
యోనిలింగములను నుద్భవించి
_x000D_
విష్ణువరయఁదల్లి వెలయరుద్రుఁడె తండ్రి
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
415 | శ్రీగల భాగ్యశాలి కడఁజేరఁగ వత్తురు తారు దారె దూ
రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను
ద్యోగము చేసి; రత్ననిలయుండని కాదె సమస్తవాహినుల్
సాగరుఁ జేరుటెల్ల ముని సన్నుత! మద్గురుమూర్తి! భాస్కరా! | 6 | vutpalamaala |
2807 | పరనారీసోదరుఁడై
పరధనముల కాసపడక పరులకు హితుఁడై
పరులు దనుఁ బొగడ నెగడియు
పరులలిగిన నలుగనతఁడు పరముఁడు సుమతీ! | 1 | kandamu |
1983 | ఒకకాంతామణి కొక్క డీవు మఱియు న్నొక్కర్తె కొక్కండ వై
సకలస్త్రీలకు సంతతం బలర రాసక్రీడ తన్మధ్య క
ల్పకమూలంబు సవేణునాదరస మొప్పంగా బదార్వేల గో
పికలం జెంది వినోద మొందునెడ నీ పెంపొప్పు నారాయణా! | 4 | mattebhamu |
4619 | కర్ణవతంసమీక పెనఁగన్ సతిచెక్కిలి వ్రేయుడున్ మహా
తూర్ణతఁజెంది జంగమము దో స్థలమెత్తి పసిండియాకు సం
పూర్ణ నికృష్టభక్తి మెయిఁబొల్పుగ నిచ్చిన నిష్ప్రపంచ! నీ
వర్ణము నేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
819 | కులిశానేక సహస్రకోటి నిశితక్రూరోరుధారాముఖా
కలితార్చి ప్రభవ ప్రభావ త్రిజగత్కల్యాణసంధాయియై
విలసిల్లు\న్ భవదీయచక్రమఖిలోర్వీభారనిర్వాపణో
జ్జ్వలనిర్వాహపరాక్రమక్రమణ కృష్ణా దేవకీనందనా. | 4 | mattebhamu |
1735 | బాలనే నే తాళజాలనే యీ రవ్వలేలనే వలచిన గోలననవెరమ్మనే మనవిచే కొమ్మ నే బిగికౌఁగిలిమ్మనే నమ్మిన కొమ్మననవెచల్లగా పన్నీరు చల్లగా విభునిపై చల్లగా మదికింపు సలుపుమనవెదక్కి నా వలలోన జిక్కి నా సామికి మ్రొక్కినానని చాల ముదితయనవె | 3 | seesamu |
1064 | లోనిచూపునఁ దగఁ దమలోనఁ గాంచి | సోఽహమనువారె సంతతోత్సాహమతులు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
3442 | _x000D_
శత్రువరుల నరసి సరగున ఖండించి
_x000D_
మిత్రవర్గమునకు మేలుచేసి
_x000D_
దండివెలుగుఁజూపి పిండమధ్యంబున
_x000D_
నర్థి నిలుచువాఁడు హరుఁడు వేమా. | 0 | aataveladi |
298 | మకరోగ్రక్రకచాగ్రజాగ్రదురుసమ్యక్ఛాతదంష్ట్రాక్షత
ప్రకటాంఘ్రిద్వయనిర్గళద్రుధిరధారాపూరఘోరవ్యధా-
చకితుండై మొఱసేయ నగ్గజపతిన్ సంప్రీతి రక్షింపవే
మకుటీభూతశశాంకచాపహర! రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
529 | మరలని భక్తితోడ మును మల్హణబిల్హణముఖ్యసత్కవీ-
శ్వరులు కవిత్వవైఖరిని సారెకు నిన్ బ్రణుతించి ధన్యులై
బరగిరటంచు నేను నినుఁ బద్యముఖంబుగ సంస్మరించెదన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
2488 | పలుజన్మంబులఁ గూడఁబడ్డ భవశుంభద్ఘోరదుష్కర్మరా-
సులు పైఁ గూలి సమస్తజీవులు వెసన్ శోషించుచు న్బెద్దదు-
ర్బలురై చిక్కిన దద్భవాపహరణార్థం బొప్పఁ బద్మోద్భవ-
ప్రళయం బొక్కొకమాటు సేయుదు తుదిన్ భావింప సర్వేశ్వరా! | 4 | mattebhamu |
873 | పరనారీ ముఖపద్మము
గుఱుతుగఁ గుచకుంభములను గొప్పును నడుము\న్
అరయంగనె మోహింతురు
నిరతిని నిను భక్తిఁ గొల్వ నేరరు కృష్ణా. | 1 | kandamu |
2706 | నిన్నం జూడరొ మొన్నఁజూడరో జనుల్ నిత్యంబుఁజావంగ నా
పన్నుల్గన్న నిధానమయ్యెడి ధనభ్రాంతి న్విసర్జింపలే
కున్నా రెన్నఁడు నిన్ను గందురిక మర్త్యుల్ గొల్వరేమో నిను
న్చిన్నంబుచ్చక ప్రోవకుండునెడలన్ శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
440 | ఒక్కఁడె చాలు నిశ్చల బలోన్నతుఁ డెంతటి కార్యమైనఁ దాఁ
జక్క నొనర్పఁ; గౌరవులసంఖ్యులు పట్టిన ధేనుకోటలం
జిక్కఁగనీక తత్ప్రబల సేన ననేక శిలీముఖంబులన్
మొక్కపడంగఁ జేసి తుదముట్టఁడె యొక్కకిరీటి భాస్కరా! | 6 | vutpalamaala |
3029 | ఆతతాయివి నీవిటు లవతరించి | పూతనాయంతకుడవగు పుణ్యమూర్తిదగవులున్నది మనమధ్య తాడిమళ్ళ | రాజగోపాల రావయ్య రమణి గూడ. | 2 | teytageethi |
224 | రఘువంశాంబుధిపూర్ణచంద్ర! విలసద్రాజన్యదేవేంద్ర! నా
యఘసంఘంబులఁ బాఱఁద్రోలి భవదీయామేయకారుణ్యదృ-
ష్టి ఘనప్రక్రియఁ జూచి యేలుకొనుమా! సేవింతు నత్యంతమున్
మఘవప్రస్తుతసద్గుణాభరణ! రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
2405 | వేసాలెల్లయు భువిలో
గ్రాసాలకెకాక ముక్తికాంక్షకు నేలా
వాసిగలుగుయోగి యథే
చ్ఛాసంచారుఁడుగదన్న ఘనసంపన్నా! | 1 | kandamu |
4618 | సంగయదేవుఁడర్థి నొక జంగమమై చనుదెంచి వేఁడ ను
ప్పొంగి లలాటలోచనము భోరున నద్దము వట్టి చూపుడున్
జెంగి యదృశ్యుఁడైన శివుఁ జేకొని యార్చిన యప్రతర్క్య! నీ
వంగడ మేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
204 | శేషపర్యంక! రాజ్యలక్ష్మీ సహాంక-ప్రధననిశ్శంక! యదుకులాంబుధిశశాంక!
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
2366 | వాలాయము గురుకృపచే
శ్రీలీలల రాజయోగ సిద్ధుఁడు గాఁగా
నేలా సంసారమునకు
జాలింబడ సుప్రసన్న! సంపఁగిమన్నా! | 1 | kandamu |
2420 | వాదము లనఁగా దాతృవి
వాదము మఱి యంత్రతంత్రవాదములును నీ
జూదము మేదిని మెత్తురె?
సాదరమతు లెన్నరన్న! సంపఁగిమన్నా! | 1 | kandamu |
3463 | _x000D_
విధికృతములందు రన్నియు
_x000D_
విధికిని విధి లెస్సయయ్యె విష్ణు జపింప\న్
_x000D_
విధియుభవురూప మందెను
_x000D_
విధి బ్రహ్మము సుమ్ముదలప వినరా వేమా. | 1 | kandamu |
3267 | _x000D_
అసలఁ దెగఁగోసి యనలంబుఁ జల్లార్చి
_x000D_
గోచి బిగియఁబెట్టి కోపమడఁచి
_x000D_
గుట్టు మీఱవాఁడు గురువుకు గురువురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2873 | సోయగ ముప్పతిల్ల ననుఁ జూచి కిసాలున నవ్వి లేచి, రా-
రా! యని కౌగిలింపుచుఁ బిరాలున శయ్యకు వ్రాలి గుబ్బలన్
నా యురమాని మోవి రదనంబున నొక్కుచుఁ జొక్కిచొక్కి యూ-
హూ! యని సైఁగ నన్ బలుకకుండ నదల్తువె సుందరీమణీ! | 6 | vutpalamaala |
15 | వరమిచ్చినట్టి శంకరుని కెగ్గు దలంచు- భస్మాసురుని పేరుఁ బాపినావు
తనయిల్లుఁ గాచు నుగ్రుని బోరుటకుఁ బిల్చు- బాణుచేతులు తెగఁ బఱికినావు
తొలుమిన్కు లజుని మ్రుచ్చిలి గొన్న సోమకుఁ- జంపి విద్యలు ధాత కంపినావు
బలిమి దైత్యులు సుధాకలశము న్గొన వారి- వంచించి సురలకుఁ బంచినావు | 3 | seesamu |
4051 | _x000D_
వినుకలి కనుకలి గోరము
_x000D_
కనుకలియాకాంతగూడి కవయగ గోరు\న్
_x000D_
గనుగొని ప్రేమన్బొరలును
_x000D_
ఘనతరమోహంబుచోటు గదరా వేమా. | 1 | kandamu |
1208 | ఋణ మధిక మొనర్చి సమ
ర్పణ జేసిన తండ్రి, విద్య రాని కొడుకు, ల
క్షణశాలి రాణి దుశ్చా
రిణి యగు జననియును దలప రిపులు కుమారా! | 1 | kandamu |
1782 | యనుచు దనలోనె తలపోసి యతివ నీదు | రాక గోరుచునున్నది రవ్వలేలగాననిక నేలుకొనవయ్య కరుణగల్గి | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
4077 | _x000D_
ఇట్టిపంచజనుని యేష్యము దెలిసిన
_x000D_
పెట్టి పుట్టి కట్టి పృథివి బ్రతికి
_x000D_
చచ్చి సిద్ధుఁడగుచు సర్వజ్ఞుఁడయినిల్చు
_x000D_
నెల్లమహిమ నీకు చెల్లు వేమ. | 0 | aataveladi |
4406 | సురభిబదనిక పాముకుఁ జూపినట్లు । దుష్టునకు నీతి వెగటుగాఁ దోఁచునయ్య
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
436 | ఎప్పుడదృష్టతా మహిమ యించుక పాటిలు నప్పుడింపు సొం
పొప్పుచు నుండుఁగాక యది యొప్పని రూపుమాయుఁగా
నిప్పున నంటియున్న యతి నిర్మలినాగ్ని గురుప్రకాశముల్
దప్పిన నట్టి బొగ్గునకు దా నలుపెంతయుఁ బుట్టు భాస్కరా! | 6 | vutpalamaala |
2771 | కాముకుఁడు దనిసి విడిచిన
కోమలిఁ బరవిటుఁడు గవయ గూడుటయెల్లన్
బ్రేమమునఁ జెఱకుపిప్పికి
జీమలు వెస మూఁగినట్లు సిద్ధము సుమతీ! | 1 | kandamu |
600 | తొరలెడు భక్తిఁ గప్పురపు ధూపము నీకు జనుం డొసంగుచో
గొరగొర వానిమేనఁ గల ఘోరతరాఘపిశాచసంఘముల్
బరువడి కూయి వెట్టుచును బారి చనుంగద తత్క్షణంబునన్
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
3202 | _x000D_
ఒకరి నోరుఁగొట్టి యొకరు భక్షింతురు
_x000D_
వారినోరు మిత్తి వరుసఁగొట్టు
_x000D_
చేఁపపిండు పిల్ల చేఁపలఁ జంపును
_x000D_
జనుఁడు చేఁపపిండుఁ జంపు వేమ | 0 | aataveladi |
328 | అభవున్ శాశ్వతు నాద్యు నక్షయుని నవ్యక్తుం బరేశు న్మహా-
ప్రభు నాద్యంతవిహీను భూతమయు సర్వజ్ఞున్ గుణాతీతుఁ బ-
ద్మభవాండోదరు నాత్మరూపభవు నద్వంద్వుం జిదానందునిన్
రభసంబొప్పఁ దలంతు నిన్నె్పుడు భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
1781 | దాడాయె మరుడిదే వేడాయె వెన్నెల వాడాయెనే విరుల్ వనితలారచెలువ తెమ్మెర డాయ నళులు జుమ్మని మ్రోయ జిలుకలు రొదసేయ జెలియలారవిరహమగ్గలమాయె వెఱపొందగానాయె సరసుడు రాడాయె సఖులారనను జేరవచ్చునా వనజాక్షి మెచ్చునా మనసిచ్చి కూడునా మగువలార | 3 | seesamu |
2639 | రాజర్థాతురుఁడైనచో నెచట ధర్మంబుండు నేరీతి నా
నాజాతి క్రియలేర్పడున్ సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు రూ
పాజీవాళికి నేది దిక్కు ధృతి నీభక్తుల్ భవత్పాదనీ
రేజంబుల్ భజియింతురే తెఱఁగునన్ శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
1747 | చల్లని పన్నీట జలకంబు గావించి జిలుగుబుటేదారిచీరె గట్టిబంగారుసరిగెమొగ్గల నిగ్గుగను పట్టురంగు మీరిన మేటిరవికె దొడిగిబన్నసరులు మేటిపతకంబు ముత్తియసరులు గుబ్బలమీద జారి యొరయనందిబందులు వజ్రసరులు కంకణములు కరములు నిగనిగ కాంతులెసగ | 3 | seesamu |
14 | నాబుడత వీవెరా యబ్బ! యబ్బురంపు-కతలమారివి నీ వెఱుంగనివి గలవె?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
1576 | "తరమే నీకిక నెందుఁ బోఁగలవు పాతాళంబులో డాఁగినన్
శరధిం జొచ్చిన మిన్నుఁ బ్రాకిన దశాస్యా! వజ్రి వజ్రాభ భీ
కరబాణంబుల నీ శిరంబులనిలో ఖండించి యా కాకుత్స్థుఁడా
వరవర్ణిన్ గొనిపోవు నిక్క" మనుచున్ వాదింపవే మారుతీ! | 4 | mattebhamu |
3577 | _x000D_
ఆత్మలోని శివుని ననువుగా శోధించి
_x000D_
నిశ్చలముగ భక్తి నిలిపెనేని
_x000D_
సర్వముక్తుడౌను సర్వంబుఁ దానౌను
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3650 | _x000D_
పెక్కుజనులఁ జంపి పేదల వధియించి
_x000D_
డొక్కకొరకు నూళ్లు దొంగలించి
_x000D_
యెక్కడికిని బోవ నెఱిఁగి యముఁడు చంపు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
931 | కౌశిక కౌండిన్య కపిల కశ్యప కణ్వ | కౌత్స కాత్యాయన కలశజులును
జహ్ను జరత్కార జాబాలి జమదగ్ని | జలజభవాత్మజ జైమినులును
మందపాల మతంగ మౌసల మౌద్గల్య | మాండవ్య మైత్రేయ మంకణులును
వల్మీకభవ వత్స వాలఖిల్య వశిష్ఠ | వరతంతు వామదేవ ప్రముఖులును | 3 | seesamu |
3396 | _x000D_
ఇహము విడువ ఫలము లింపుగఁ గలవని
_x000D_
మహిని బలుకువారి మాటకల్ల
_x000D_
యిహములోనఁ బరము నెరుఁగుట కానరో
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
4072 | _x000D_
చచ్చువార లెవరు చావనివా రేరి
_x000D_
చచ్చి బ్రతికియుండుజన్ము లెవరు
_x000D_
విచ్చలవిడిగాను వివరించి చూడరా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
879 | పురుషోత్తమ లక్ష్మీపతి
సరసిజగర్భాది మౌనిసన్నుతచరితా
మురభంజన సురరంజన
వరదుఁడ వగు నాకు భక్త వత్సల కృష్ణా. | 1 | kandamu |
2812 | పర్వముల సతులఁ గవయకు
ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో
గర్వింప నాలిఁ బెంచకు
నిర్వహణము లేనిచోట నిలువకు సుమతీ! | 1 | kandamu |
2820 | పెట్టిన దినములలోపల
నట్టడవులకైన వచ్చు నానార్థములున్
బెట్టని దినములఁ గనకపు
గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ! | 1 | kandamu |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.